Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1997 · The greatness of nāmasmaraṇa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The greatness of nāmasmaraṇa
11 April 1997, Madras visit, Madras
1
▾
Meaning
Keep
Also in his talks
(1)
27 August 1986
The jīvātma is nothing but a portion of God
“తరువ
తరువ
పుట్టు
తరువున
అనలంబు
తరువ
తరువ
పుట్టు
దధిని
ఘృతము
తరువ
తరువ
పుట్టు
తనువున
తత్వంబు
వినుడు
భారతీయ
వీరసుతుడ!”
కఱ్ఱకు,
కఱ్ఱకు
మధ్య
రాపిడి
జరిగినప్పుడు
అగ్ని
ఆవిర్భవిస్తుంది.
పెరుగును
బాగా
చిలికినప్పుడు
అందులో
వెన్న
పుడుతుంది.
అదేవిధంగా
మన
హృదయంలో
రూపము,
నామము
ఒకదానితోనొకటి
రాచుకున్నప్పుడే
దివ్యత్వము
సాక్షాత్కరిస్తుంది.
దైవము
సర్వత్ర
ఉన్నాడు.
సూర్యుడు
లేక
సూర్యకిరణములు
ఏవిధంగా
ఉండవో
అదేవిధంగా
దైవము
లేక
ఈ
జగత్తే
లేదు.
ఈ
ప్రపంచము
శాశ్వతమని,
ఇదే
ప్రధానమని
ఈనాటి
యువకుల
విశ్వాసము.
ఇది
చాల
పొరపాటు.
“అనిత్యం
అసుఖం
లోకమిమం
ప్రాప్య
భజస్వ
మాం”
అన్నాడు
గీతాచార్యుడు.
మార్పులు,
కూర్పులు
చెందనటువంటిది,
సత్యనిత్యమైనటువంటిది
ఒక్క
దివ్యత్వము
మాత్రమే.
ఇలాంటి
దివ్యత్వాన్ని
విస్మరించి,
లౌకికవిషయాలలో
ఆనందంకోసం
ఈనాటి
యువకుడు
అనేక
విధములుగా
ప్రాకులాడుతున్నాడు.
మొట్టమొదట
చదువులో
ఆనందమున్నదని
చదువుతున్నాడు.
తరువాత
ఉద్యోగమువల్ల
ఆనందము
కల్గుతుందని
ఉద్యోగము
చేస్తున్నాడు.
తరువాత
పెండ్లి
చేసుకుంటే
ఆనందము
కల్గుతుందని
వివాహమాడుతున్నాడు.
తరువాత
కొడుకులు
పుడితే
ఆనందము
లభిస్తుందని
భావిస్తున్నాడు.
కాని
చివరికి
ఎందులోను
ఆనందము
పొందలేకపోతున్నాడు.
అన్నింటియందు
అశాంతే!
అశాంతే!
అశాంతే!
ఈ
అశాంతికి
కారణమేమిటి?
కోరికలే!
హృదయపరిశుద్ధత
లోపించడంవల్ల
ఈనాడు
మానవునికి
అనేక
రోగములు
ప్రాప్తిస్తున్నాయి.
ఎన్ని
సాధనలు
చేసినప్పటికీ,
ఎన్ని
పుణ్యక్షేత్రములు
తిరిగినప్పటికీ,
ఎన్ని
పూజలు
సల్పినప్పటికీ
చిత్తశుద్ధి
లేకపోతే
ప్రయోజనం
లేదు.
ఇవన్నీ
కేవలం
మానసిక
తృప్తి
కోసం
చేస్తున్నాము.
అయితే
మనస్సును
తృప్తి
పర్చడం
ఎవరి
తరమూ
కాదు.
“చంచలం
హి
మనః
కృష్ణా
ప్రమాది
బలవద్దృఢం”
అన్నాడు
అర్జునుడు.
మనస్సు
మహాచంచలమైనది.
ఇట్టి
మనస్సును
ఎవరు
తృప్తి
పర్చగలరు?
ఎవరు
అరికట్టగలరు?
మనస్సు
యొక్క
ప్రభావముచేతనే
మానవునికి
సంసారమనేది
చేకూరుతున్నది.
ఆకాశాన్ని
ముక్కలు
చేయవచ్చును,
గాలిని
మూట
కట్టవచ్చును,
సముద్రాన్ని
ఒక్క
గ్రుక్కలో
త్రాగవచ్చును.
కానీ
మనస్సును
మాత్రం
స్థిరంగా
నిల్పుటకు
వీలుకాదు.
చంచలత్వము
మనస్సుకు
సహజం.
ఇది
ప్రకృతి
నియమం.
కనుక
మనస్సును
అరికట్టడానికి
ప్రయత్నించడంవల్ల
ప్రయోజనం
లేదు.
మనస్సును
భగవంతునివైపు
మరల్చాలి.
దీనినే
భక్తి
అన్నారు.
2
▾
Meaning
Keep
రామనామ
దివ్యమహిమ
ఒకానొక
సమయంలో
కౌసల్య
వద్దకు
ఒక
స్త్రీ
వచ్చింది.
“అమ్మా!
నీవెవరు?”
అని
కౌసల్య
ప్రశ్నించింది.
ఆమె,
“నేనెవరో
నీకు
తెలియదా?
పెద్దసముద్రాన్ని
ఒక్క
అంగలో
దాటిన
హనుమంతుని
తల్లిని
నేను”
అన్నది.
వీరిద్దరూ
సంభాషణ
జరుపుతున్న
సమయంలో
మరొక
స్త్రీ
వచ్చింది.
ఆమెను
చూసి
కౌసల్య,
“ఎవరమ్మా
నీవు?”
అని
ప్రశ్నించగా,
“హనుమంతుడు
దాటిన
సముద్రాన్ని
ఒక్క
గ్రుక్కలో
త్రాగివేసిన
అగస్త్యుని
తల్లిని
నేను”
అన్నది.
అప్పుడు
కౌసల్య
ఫక్కున
నవ్వి,
“నీ
కుమారుడైన
హనుమంతుడు
సముద్రాన్ని
దాటడానికిగాని,
నీ
కుమారుడైన
అగస్త్యుడు
సముద్రాన్ని
త్రాగడానికిగాని
నా
కుమారుడైన
శ్రీరామచంద్రుని
నామమే
ఆధారం”
అన్నది.
ఈవిధంగా
ముగ్గురు
ఆడవాళ్ళూ
చేరి
తమలో
తాము
నేను
గొప్ప
అంటే
నేనే
గొప్ప
అని
వాదించుకోసాగారు.
“మువురాడవారు
చేరిన
సుగుణాకర!
పట్టపగలు
చుక్కలు
రాలున్.”
ముగ్గురు
ఆడవాళ్ళు
ఒకచోట
చేరారంటే
పగటిపూట
కూడా
నక్షత్రాలు
క్రిందికి
రాలుతాయట!
ఆ
సమయంలో
అక్కడికి
రాముడు
వచ్చాడు.
“అమ్మా!
దేని
గురించి
మీరు
వాదులాడుతున్నారు?”
అని
అడిగాడు.
అప్పుడు
కౌసల్య,
“నాయనా!
ఈమె
హనుమంతుని
తల్లి,
ఈమె
అగస్త్యుని
తల్లి.
వీరిరువురూ
తమ
కుమారులు
చేసిన
ఘనకార్యముల
గురించి
గొప్పగా
చెప్పుకుంటున్నారు.
కాని,
నీ
నామమును
స్మరించడం
వల్లనే
కదా
హనుమంతుడు
సముద్రాన్ని
దాటగల్గాడు.
నీ
నామమును
తల్చుకోవడంవల్లనే
కదా
అగస్త్యుడు
సముద్రాన్ని
త్రాగగల్గాడు.
ఇదంతా
నీ
అనుగ్రహ
ప్రభావమే.
కనుక
నీలాంటి
కుమారుని
కన్న
నేనెంత
అదృష్టవంతురాలిని!”
అన్నది.
అప్పుడు
రాముడు,
“అమ్మా!
ఇది
నా
అనుగ్రహం
కాదు.
‘రామ’
అనేది
ఈ
దేహమునకు
పెట్టిన
పేరు.
ఈ
నామమహాత్మ్యమే
ఇన్ని
ఘనకార్యములు
చేయగల్గింది.
ఈ
నామమును
ఈ
దేహానికి
పెట్టడంచేతనే
నేను
కూడా
మహావీరుడైన
రావణుని
జయించగల్గాను”
అన్నాడు.
సర్వులను
సంరక్షించేది
భగవన్నామమే
అన్నింటికీ
నామమే
ప్రధానము.
భగవన్నామస్మరణచేతనే
సర్వశక్తులూ
మనయందు
ఆవిర్భవిస్తాయి.
ద్రౌపది
మీకు
తెలుసు.
ఆమె
భర్తలు
చాల
గొప్పవారు,
ధర్మమూర్తులు.
కాని
నిండుసభలో
దుర్యోధనుడు
ఆమెను
పరాభవించడానికి
పూనుకున్నప్పుడు
అర్జునుడుకాని,
భీముడుకాని
ఎవ్వరూ
ఆమెకు
సహాయం
చేయలేదు.
కట్టకడపటికి
ఆమె,
“కృష్ణా!
ఆపద్బాంధవా!”
అని
స్మరించేసరికి
కృష్ణుడే
వచ్చి
ఆమెను
ఆదుకున్నాడు.
సర్వులను
సంరక్షించేది
భగవన్నామమే.
కనుక
దీనిని
మనం
అలక్ష్యం
చేయరాదు.
నామమనేది
చాల
చిన్న
పదము.
కాని,
ఈ
రెండక్షరాలలోనే
యావత్ప్రపంచము
ఇమిడియున్నది.
నామస్మరణే
తరణోపాయం.
నామమే
మనలను
సంసారసాగరాన్ని
దాటించే
నావ.
వాతావరణపవిత్రతకు
నామస్మరణ
అత్యవసరం
మనం
చేసే
శబ్దములన్నీ
గాలిలోని
విద్యుత్
తరంగములతో
చేరి
ప్రపంచమంతా
వ్యాపించిపోతున్నాయి.
ఢిల్లీ
రేడియో
స్టేషన్లో
ఎవరో
మాట్లాడితే
ఆ
శబ్దతరంగములు
ప్రపంచమంతా
ప్రాకిపోతున్నాయి
కదా!
3
▾
Meaning
Keep
ఈనాటి
ప్రపంచము
అశాంతితో
నిండియున్నది.
అనేక
దుశ్శబ్దములు
వాతావరణంలో
చేరడంచేత
అందరికీ
దుర్బుద్ధులే
పుడుతున్నాయి.
మానవునిలో
సద్భావములు
రావాలంటే
వాతావరణము
పవిత్రమైనదిగా
ఉండాలి.
మంట
ఎటువంటిదో
పొగ
అటువంటిది.
పొగ
ఎటువంటిదో
మేఘము
అటువంటిది.
మేఘము
ఎటువంటిదో
వర్షము
అటువంటిది.
వర్షము
ఎటువంటిదో
పంట
అటువంటిది.
పంట
ఎటువంటిదో
వంట
అటువంటిది.
వంట
ఎటువంటిదో
బుద్ధులు
అటువంటివి.
కనుక
మన
బుద్ధులకు
మూలకారణం
మనం
భుజించే
ఆహారమే.
ఈ
ఆహారము
వాతావరణముపై
ఆధారపడియున్నది.
ఈ
వాతావరణము
మానవుని
ప్రవర్తనపై
ఆధారపడియున్నది.
“మేడిపండు
చూడ
మేలిమైయుండును,
పొట్ట
విప్పి
చూడ
పురుగులుండు.”
చూడటానికి
అందరూ
భక్తులుగానే
కనిపిస్తారు.
కాని
హృదయం
విప్పి
చూస్తే
అన్నీ
పురుగులే!
కనుక
మొట్టమొదట
హృదయవాతావరణమును
పవిత్రమైనదిగా
మార్చుకోవాలి.
దీని
నిమిత్తమై
నామస్మరణ
అత్యవసరం.
నామ
మనేది
చాల
విలువైనది,
ఘనమైనది,
పవిత్రమైనది.
ఎంత
పవిత్రమైన
భావముతో
మనం
నామము
నుచ్చరిస్తామో
వాతావరణం
అంత
పవిత్రమైనదిగా
మారుతుంది.
మనం
చేసే
భజనలు
వాతావరణాన్ని
పవిత్రం
చేయాలి.
బయటి
వాతావరణాన్ని
పవిత్రం
చేయడానికి
ముందు
మన
హృదయాన్ని
పవిత్రం
గావించుకోవాలి.
భగవంతుడు
గానప్రియుడు,
గానలోలుడు.
అందువల్లనే
తుంబురనారదులు
నిరంతరము
నారాయణునివద్ద
గానం
చేస్తుంటారట.
లోకంలో
ఎంతోమంది
కవులు
పద్యాలు
అల్లుతుంటారు,
కావ్యాలు
వ్రాస్తుంటారు.
కాని
భగవంతుడు
గానములో
లీనమైనట్లుగా
మరొక
దానిలో
లీనం
కాడు.
కనుక
మీరు
హృదయాన్ని
ఆకర్షించేటట్లుగా
భజనలు
చేయాలి.
మిమ్మల్ని
మీరు
మరచిపోయి
గానం
చేసినప్పుడే
అది
హృదయాన్ని
ఆకర్షిస్తుంది.
కనుక
భజనలు
చేసేవారు
మొట్టమొదట
హృదయంలో
ప్రేమను
నింపుకోవాలి.
పవిత్రమైన
హృదయంతో
భజనలు
చేసినప్పుడు
ప్రపంచమంతా
పవిత్రమైపోతుంది.
భజనంటే
ఎలా
ఉండాలి?
సంకీర్తన
మనగా
ఏమిటి?
“సమ్యక్
కీర్తనం
ఇతి
సంకీర్తనం.”
హృదయాన్ని
కరిగించాలి,
కదిలించాలి.
అప్పుడే
అందరూ
ఆనందాన్ని
అందుకోగలరు.
కనుక
మీరు
భజనలో
కేవలం
శ్రుతిలయరాగములను
మాత్రమే
చూసుకుంటే
ప్రయోజనం
లేదు.
హృదయాన్ని
విప్పి
పాడాలి.
భజన
లీడ్
చేసేవాళ్ళు
ఇంకొక
విషయాన్ని
కూడా
గుర్తించాలి.
మీరు
భజన
చేస్తుంటే
ఎన్నో
వేలమంది
వింటున్నారు.
కనుక
అందరూ
సులభంగా
ఫాలో
చేయగల
పాటలను
మీరు
పాడాలి.
మీ
చుట్టూ
ఎన్నో
వేలమంది
ఉన్నారనే
విషయాన్ని
మీరు
మరువకూడదు.
మీరు
ఏవో
పెద్దపెద్ద
కీర్తనలు
పాడితే
ఎవ్వరూ
ఫాలో
చేయలేరు.
ఫాలో
చేయలేక
పోవడంవల్ల
వాళ్ళలో
నిరుత్సాహం
బయలుదేరుతుంది.
చివరికి
భజనలంటేనే
విసుగు
పుడుతుంది.
కనుక
మీరు
రామా,
కృష్ణా,
గోవిందా,
అల్లా,
ఏసు
మొదలైన
చిన్నచిన్న
నామములతో
కూడిన
పాటలు
పాడాలి.
అప్పుడు
అందరూ
సులభంగా
ఫాలో
చేయగల్గుతారు.
భజనలో
పెద్దపెద్ద
చేన్తాళ్ళవంటి
పదములను
ఉపయోగపెట్టవద్దు.
మీ
ఇంట్లో
ఒంటరిగా
ఉన్నప్పుడు
మీరేమైనా
పాడుకోండి.
కాని
పదిమంది
చేరినప్పుడు
మాత్రం
మీరు
పాడే
పాట
అందరికీ
అర్థమయ్యే
రీతిగా
ఉండాలి.
4
▾
Meaning
Keep
Also in his talks
(11)
22 June 1989
Win the Grace of God
1 April 1995
Make God your true friend
18 February 1996
The Name is the great boat for life
3 October 1996
Man's Aim and Goal Is the Vision of His Own Svarūpa
26 September 1998
God Is the Very Foundation of the World
25 December 2001
Though faiths differ, Mādhava is one
24 February 2002
God loves the inner feeling
26 February 2002
Sai's message is the message of Prema
14 April 2002
Sumitrā and Ūrmilā, Given to Sacrifice
14 April 2003
Remember the Name with Prema
30 March 2004
If you remember the name of Rāma, neither attachment nor disease will cling to you
అందరూ
పలకడానికి
వీలయ్యేటటువంటి
పాటలను
మాత్రమే
పాడాలి.
మీరు
చేసే
భజనలు
పదిమందికి
ఆనందాన్ని
పంచిపెట్టేవిగా
ఉండాలి.
“నా
ఇష్టం
వచ్చిన
పాట
పాడుతాను.
ఇతరులు
ఫాలో
చేస్తే
చేయనీ,
పోతే
పోనీ”
అనే
స్వార్థచింతన
ఉండకూడదు.
“నేను
పాడే
పాట
అందరూ
ఫాలో
చేయగలరా?
లేదా?”
అని
విచారణ
చేయాలి.
భజనలో
పాల్గొనే
వారిలో
అనేకమంది
విదేశీయులు
కూడా
ఉంటారు.
వారికి
నామస్మరణంటే
చాల
ఇష్టం.
కనుక
మీరు
పాడే
పాటలు
వారికి
కూడా
అర్థమయ్యే
రీతిగా
ఉండాలి.
“హరేర్నామ
హరేర్నామ
హరేర్నామైవ
కేవలం
కలౌ
నాస్త్యేవ
నాస్త్యేవ
నాస్త్యేవ
గతి
రన్యథా”
కలియుగంలో
నామస్మరణను
మించినది
లేదు.
“సాయిబాబా
భక్తులంటే
ఊరికే
భజనలు
చేస్తుంటారంతే!
ఏ
సాధనా
లేదు”
అని
కొంతమంది
మూర్ఖులు
విమర్శిస్తుంటారు.
నామస్మరణలో
ఎంత
మాధుర్యమున్నదో
వారికేమి
తెలుసు?
అందువల్లనే
‘ఏకాత్మా
సర్వభూతాంతరాత్మ’
అని
అద్వైత
సిద్ధాంతాన్ని
ప్రబోధించిన
శంకరాచార్యులవారు
కూడా
కట్టకడపటికి,
‘భజగోవిందం
...’
అంటూ
ద్వైతంలోకి
దిగాడు.
సర్వమత
సమానత్వం
ఏ
మతాన్నీ
మీరు
ద్వేషించకూడదు.
ఏ
వ్యక్తినీ
మీరు
కష్టపెట్టకూడదు.
అందరిలోను
సమత్వాన్ని,
ఏకత్వాన్ని
దర్శించాలి.
హృదయంలో
అసూయాద్వేషాలను
నింపుకొని
మీరు
ఎంత
భజన
చేసినా
ప్రయోజనం
లేదు.
అన్ని
మతముల
సారమొక్కటే.
అన్ని
నామముల
గమ్యమొక్కటే.
ఈ
ఏకత్వాన్ని
మీరు
మొట్టమొదట
విశ్వసించాలి.
అల్లాను
ప్రార్థించేవారు
మహమ్మదీయులని,
ఏసును
ప్రార్థించేవారు
క్రైస్తవులని
ఈవిధమైన
భేదభావములను
మీరు
పెట్టుకోకూడదు.
అందరూ
భగవంతుని
బిడ్డలే.
అయితే
ఎవరి
స్థితిగతులకు
తగిన
మార్గాన్ని
వారు
అనుసరిస్తూ
వస్తున్నారు.
నీటిని
ఇంగ్లీషువారు
‘వాటర్’
అని,
తమిళంవారు
‘తన్నీ’
అని,
హిందీవారు
‘పానీ’
అని
ఈవిధంగా
వేర్వేరు
పేర్లతో
పిలుస్తారుకాని,
నీటిని
ఎవ్వరూ
మార్చలేరు
కదా!
అదేవిధంగా
భగవంతునికి
ఎవరికి
తోచిన
రూపనామములను
వారు
పెట్టుకొని
ఆరాధిస్తున్నారు
కాని,
భగవంతుడు
ఒక్కడే,
ఒక్కడే,
ఒక్కడే.
బంధవిమోచనకు
మార్గములు
రెండు
మానవుడు
ప్రాపంచిక
విషయములనే
త్రాళ్ళచేత
కట్టుబడ్డాడు.
ఈ
బంధనల
నుండి
విముక్తి
కావాలంటే
మానవుడు
ఏమి
చేయాలి?
దీనికి
రెండు
మార్గములు
మాత్రమే
ఉన్నాయి.
ఒకటి
సేవామార్గము,
రెండవది
జ్ఞానమార్గము.
సేవామార్గంలో
భక్తుడు,
“దాసోహం,
దాసోహం”
అనే
భావనతో
అహంకారాన్ని
తగ్గించుకొంటూ
రావాలి.
అప్పుడు
‘త్రాళ్ళు’
వదులైపోతాయి.
ఇంక
జ్ఞానమార్గంలో
“శివోహం,
శివోహం”
(నేనేదైవం)
అనే
భావనతో
అనంతమైన
ఆత్మతత్త్వంగా
పెరుగుతూ
పోవాలి.
అప్పుడు
‘త్రాళ్ళు’
ఒక్కసారిగా
తెగిపోతాయి.
కనుక
బంధవిమోచన
కావాలంటే
జ్ఞానమార్గంలోనైనా
పోవాలి,
లేక
సేవా
మార్గంలోనైనా
పోవాలి.
ఎట్టి
పరిస్థితిలోను
అహంకారమునకు
అవకాశమివ్వకూడదు.
ఏవో
రెండు
మిరపకాయలు
తింటేనే
నాలుకకు
ఎంతో
కారంగా
ఉంటుంది.
ఇంక
అహం‘కారము’
సంగతి
ప్రత్యేకంగా
చెప్పనక్కర
లేదు.
అసలు
దేనిని
చూసి
నీకు
అహంకారము?
5
▾
Meaning
Keep
ఒక
చిన్న
ఉదాహరణ:
ఈ
ప్రపంచమ్యాపులో
ఇండియా
చాల
చిన్నది.
ఇండియాలో
మద్రాసు
స్టేట్
మరింత
చిన్నది.
ఈ
మద్రాసుస్టేట్లో
మీ
ఇల్లు
ఎంతో
చిన్నది.
ఇంక
మీ
ఇంట్లో
నీవెంత!
ఇంత
చిన్నవాడవైన
నీవు
విశాలమైన
ప్రపంచంపై
అహంకారపడటం
ఎంత
పిచ్చితనం!
ఈ
ప్రపంచంలో
నీ
స్థానమును
నీవు
గుర్తిస్తే
అహంకారమునకు
అవకాశమే
లేదు.
ఈనాడు
ఎవరి
స్వార్థంకోసం
వారు
పాటుపడటంవల్ల
దేశం
ఎన్ని
కష్టనష్టములకు
గురియగుచున్నదో
మీకు
తెలుసు.
రాజకీయ
రంగంలో
అశాంతి
మితిమీరిపోతున్నది.
కారణ
మేమిటి?
స్వార్థం,
స్వార్థం,
స్వార్థం!
ప్రతి
ఒక్కరు
సీటుకోసం
పాటుపడుతున్నారేకాని,
ప్రజలకోసం
ఎవ్వరూ
పాటుపడటం
లేదు.
‘నా
పవర్,
నా
చైర్’
అని
పదవిని
పట్టుకొని
వ్రేళ్ళాడుతున్నారేగాని
ప్రజల
సంగతి
ఎవ్వరూ
పట్టించుకోవడం
లేదు.
చైర్
ఎంతకాలం
ఉంటుంది?
దేహమే
కూలిపోతుంటే
చైర్
మాత్రం
స్థిరమా?
కనుక
స్వార్థాన్ని
త్యజించి
విశాలమైన
భావాలను
పెంచుకోండి,
భగవన్నామాన్ని
స్మరించండి,
పవిత్రమైన
జీవితాన్ని
గడపండి.
Previous
←
The Saints of Thamilnadu
Next
“Rāmo vigrahavān dharmaḥ”
→