Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · Samyak sādhana
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Samyak sādhana
5 February 1998, Chinese New Year, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
శివమేవసదా
జీవో
జీవమేవ
సదాశివః
వేత్త్యైక్య
మనయోర్యస్తు
స
ఆత్మజ్ఞానచేతసః
ప్రేమస్వరూపులారా!
దృష్టి
యెట్టిదో
సృష్టి
అట్టిది
ఈనాటి
మానవుడు
ఎన్నో
జ్ఞానములను
ఆర్జిస్తున్నాడు.
మానవుడైపుట్టి
మృగములవలె
జీవించటము,
మృగముల
వలె
సంచరించటము
యిత్యాది
విద్యలన్నీ
యీనాడు
నేర్చుకున్నాడు
మానవుడు.
ఇది
జ్ఞానమా.
జ్ఞానమనగా
ఏమిటి?
బహుళ
గ్రంథపరిచయము
కాదు
జ్ఞానము.
చరాచర
ప్రపంచములందు
గల
సమస్త
విషయములు
గుర్తించుటయు
జ్ఞానము
కాదు.
నిజమైన
జ్ఞానమనగా
వ్యక్తియందు,
సమిష్టియందు
ఉండిన
ఏకత్వము
గుర్తించటమే
నిజమైన
జ్ఞానము.
ఈనాటి
మానవుడు
తనయందున్న
మానవత్వమునే
గుర్తించుటకు
ప్రయత్నించటం
లేదు.
అట్టి
మానవుడు
తనయందున్న
దైవత్వమును
ఏరీతిగా
గుర్తించగలడు.
మొదట
మానవుని
యందున్న
మానవత్వాన్ని
గుర్తించినప్పుడే
దైవత్వము
గుర్తించుటకు
అర్హుడౌతాడు.
అట్టి
మానవత్వమును
గుర్తించుటకు
మార్గము
ఏమిటి?
దీనినే
బుద్ధుడు
అనేక
సాధనలు
సల్పి
కడపటికి
మానవత్వమునందున్న
దైవత్వము
గుర్తించుటకు
మానవునియొక్క
పంచేంద్రియములే
మూలకారణమన్నాడు.
తన
యింద్రియము
లను
సక్రమమైన
మార్గమునందు
ప్రవేశపెట్టి
దివ్యమైన
భావములను
అనుభవించి
తన
దివ్యత్వమును
తాను
వెలువర్చుకోవాలి.
కనుక
బుద్ధుడు
మొదట
“సమ్యక్
దర్శనం”
అన్నాడు.
అనగా
కన్నులనిచ్చినందుకు
మానవుడు
ఈ
కన్నులతో
పవిత్రమైన
దృశ్యములను
చూడాలి.
పవిత్రమైన
వ్యక్తులను
చూడాలి.
అట్టు
కాకుండా
కన్నులున్నవి
కదాయని
దేనిని
పడితే
దానిని
చూడటం
ఎవరిని
పడితేవారిని
చూడటం
యీవిధంగా
అపవిత్రము
గావించుకోటంచేత
ఆ
దృశ్యము
లన్నీయు
మానవుని
హృదయములో
చిత్రింపబడి
దుష్టమైన
భావములు,
దుష్టమైన
సంకల్పములు
చేత
మానవుడు
దుఃఖితుడౌతున్నాడు.
2
▾
Meaning
Keep
ఎట్టి
దృశ్యమో
అట్టి
హృదయమై
పోతున్నది.
ఎట్టి
హృదయమో
అట్టి
సంకల్పములు
ఆవిర్భవిస్తున్నాయి.
ఎట్టి
సంకల్పములో
అట్టి
వాక్కు
అనుభవిస్తున్నాడు.
ఎట్టి
వాక్కో
అట్టి
జీవితమును
పొందుతున్నాడు.
కనుక
మంచి
జీవితము
అనుభవించవలెనన్న
మొట్టమొదట
పవిత్రమైన,
దివ్యమైన,
భవ్యమైన
దృష్టిని
మానవుడు
అనుభవించాలి.
అపవిత్రము,
అసహ్యము,
ఘోరము
యిత్యాది
దృశ్యములు
చూడటం
చేత
మానవుడు
కేవలం
మృగము
వలె
జీవిస్తున్నాడు.
మానవుడు
పవిత్రమైన
దృశ్యములు
చూడాలి.
ఏది
పవిత్రము,
ఏది
దివ్యమైనది,
ఏది
చూడతగినది
అనే
విచారణ
మొట్టమొదట
మానవుడు
చేయాలి.
ఏ
దృశ్యములు
మానవుడు
చూచునో,
ఆ
దృశ్యములన్నీ
మానవుని
హృదయముపై
చిత్రింపబడుతున్నాయి.
ఇట్టి
రహస్యము
మానవుడు
గుర్తించుటకు
ప్రయత్నించుట
లేదు.
ఈనాటి
మానవుడు
అనేక
దుఃఖములచేత,
విచారముల
చేత,
కష్టంబులచేత,
అశాంతి
చేత
జీవితము
గడుపుతున్నాడు.
కారణం
ఏమిటి.
తాను
చూసిన
దృశ్యములు
అట్టి
అపవిత్రమైనవి,
అట్టి
అసహ్యమైనవి,
అట్టి
ఘోరమైనవిగా
కావటం
చేత
తన
హృదయమునుండి
అట్టి
ఫలితములు
ఆవిర్భవిస్తున్నాయి.
కనుక
మానవ
జీవితములో
దృష్టియే
మొట్టమొదటిది.
దృష్టి
ఎట్టిదో
సృష్టి
అట్టిది.
కనుక
మన
శాస్త్రజ్ఞానమంతా
నేత్రములపై
ఆధారపడి
ఉంటున్నది.
నేత్రమే
శాస్త్రము
దృష్టియే
సృష్టి.
శాస్త్రజ్ఞానము
పొందాలనుకుంటే
దృష్టిని
పవిత్రముగా
చేసుకోవాలి.
మొట్టమొదట
మానవుడు
దృష్టిని
పవిత్రముగావించుకోవాలి.
చూడదగని
దానిని
చూచుటకు
ప్రయత్నించకూడదు.
ఏది
మంచిదో,
వేచి
పవిత్రముగా
విచారణ
సల్పి
దానిని
మాత్రమే
చూడటానికి
ప్రయత్నించాలి.
అట్టి
పవిత్రమైన
దృష్టియే
మానవుని
హృదయములో
సృష్టింపబడుతున్నది.
అప్పుడు
మానవునియందు
చెడ్డ
భావములు
గానీ
చెడ్డ
సంకల్పములు
గానీ
చెడ్డ
వాక్యములు
కానీ
రావటానికి
అవకాశమే
ఉండదు.
కనుక
మొట్ట
మొదట
దృష్టిని
పవిత్రముగా
ఉంచుకోవాలి.
ఇదే
బుద్ధుడు
చెప్పిన
ప్రధమ
వాక్యము.
తాను
ఆత్మశాంతిని,
ఆనందము
పొందాలని
ప్రపంచము
అంతయు
సంచరించాడు.
తనదేహమునకు
25
సం॥లు
వచ్చేవరకు
ఈ
ఆత్మజ్ఞాన
నిమిత్తమై
అనేక
విధములుగా
ఆరాటపడ్డాడు.
పండితుల
చేత
ఏర్పడే
జ్ఞానము
కాదు.
3
▾
Meaning
Keep
లేక
పఠనము
చేత
పొందేది
కాదు.
మొట్ట
మొదట
భగవంతుడు
ప్రసాదించిన
పంచేంద్రియములను
పవిత్రము
గావించుకున్నప్పుడే
తాను
పవిత్రుడను
అనే
సత్యసంకల్పమును
గుర్తించాడు.
అందుకే
“సమ్యక్
భావం”
అన్నాడు.
నిత్యజీవితంలో
అనుభవించే
ఇంద్రియములనే
పవిత్రము
గావించుకోలేని
మానవుడు
యింక
యింద్రియాతీతమైన
సత్యము
ఏరీతిగ
ఏర్పరచుకోవాలి.
అప్పుడే
“సమ్యక్
వచనం”
అన్నాడు.
అనగా
మంచి
భావాలు
ఆవిర్భవిస్తాయి.
మంచి
భావములు
ఆవిర్భవించినప్పుడే
మంచి
వాక్యములు
బయలుదేరుతాయి.
నాలుక
ఉన్నది
కదా
అని
యిష్టము
వచ్చినట్లు
మాట్లాడకూడదు.
భగవంతుడు
నాలుక
యిచ్చినది
దేని
నిమిత్తమై,
పవిత్రమైన
వాక్యములు
మాట్లాడేనిమిత్తము,
సత్యమైన
విషయములు
పలికే
నిమిత్తము,
పవిత్రమైన
దృశ్యములు
చూచి
వాటిని
వల్లించే
నిమిత్తము
యీ
నాలుక
నందించాడు.
కేవలము
రుచికరమైన
పదార్థములు
భుజించే
నిమిత్తమై
నాలుక
నందించలేదు.
రసరహితమైన
మాటలు
మాట్లాడేటందుకు
నాలుక
నందించలేదు.
పరులను
బాధించే
వచనములు
పలికే
నిమిత్తమై
నాలుక
నందించలేదు.
అసత్యమును
పలికే
నిమిత్తమై
నాలుక
నందించలేదు.
సత్యవాక్కు
చేత,
పరులను
ఆనంద
పరిచే
వాక్యములచేత,
దివ్యమైన
భావములు
పలికేటందుకు,
దివ్యమైన
భగవంతుని
వర్ణించే
నిమిత్తమై,
నాలుక
నందించాడు,
కానీ
ఈనాటి
మానవుడు
ప్రపంచములో
ఉండిన
సమస్త
పుస్తకములు
చదవటానికి
ప్రయత్నిస్తున్నాడు.
ఇంతకంటే
పెద్ద
అజ్ఞానము
మరొకటి
లేదు.
చచ్చేంతవరకు
చదువుతూనే
ఉంటే
ఆచరణ
పెట్టేదెప్పుడు?
నీవు
విశ్వసించిన
దానిని
నీవు
ఆచరణలో
పెట్టడానికి
ప్రయత్నిస్తున్నావా?
ప్రయత్నించని
కాలములో
యిన్ని
పుస్తకములు
చదివి
ప్రయోజనం
ఏమిటి?
ఇదంతా
స్టంటు
మాత్రమే.
ఇలాంటి
పఠనము
చాలా
అపవిత్రమైనది.
బుద్ధుడు
యీ
విధమైన
ప్రయోగములు
చేస్తూ
వచ్చాడు.
అనేక
గ్రంథములు
చదివాడు.
అనేక
మంది
మహనీయులను
దర్శించాడు.
అనేక
విషయములు
శ్రవణము
చేశాడు.
కానీ
మనస్సుకు
తృప్తి
కలగలేదు.
ఇది
సరైన
జ్ఞానము
కాదనుకున్నాడు.
అంతఃకరణ
తృప్తి
కలిగిననే
పరిపూర్ణ
జ్ఞానము
అన్నాడు.
అంతఃకరణ
పరిపూర్ణతృప్తి
పొందటానికి
ఆచరణే
మూలకారణము
అన్నాడు.
కనుక
మాటలు
అత్యంత
ప్రధానంగా
భావిస్తు
వచ్చాడు
బుద్ధుడు.
అడ్డము
తగిలినవారితో
యిష్టమువచ్చినట్లు
మాట్లాడుటకు
కాదు
నాలుక
యిచ్చినది.
4
▾
Meaning
Keep
ఎవరితో
అంటే
వారితో
మాట్లాడుటకు
మానవుడు
ప్రయత్నించకూడదు.
నీ
భావములకు
సహాయముకలిగే
భావములు
ఎవరు
కలిగి
ఉంటారో
అటువంటి
వ్యక్తితో
నీవు
మాట్లాడాలి.
అధిక
భాషలచేతను,
అసంతృప్తి
అయిన
దృష్టి
చేతను
హృదయము
అపవిత్రమైపోతున్నాది.
కనుక
తాను
ఏమాత్రము
శాంతిని
పొంద
లేకపోతున్నాడు.
ఇది
శాంతి
సంవత్సరము.
శాంతిని
పొందాలంటే
ఏమి
చెయ్యాలి.
మొట్టమొదట
దృష్టిని
పవిత్రమైన
రీతిగా
మార్చుకోవాలి.
తదుపరి
పవిత్రమైన
భావములు
మనలో
ఆవిర్భవించాలి.
ఆ
భావములచేత
పవిత్రమైన
వాక్యములు
మనలో
రావాలి.
ఈ
మూడింటి
ఏకత్వము
చేతనే
మానవత్వము
సార్థకమవుతుంది.
దీనినే
the
proper
study
of
mankind
is
man
అన్నారు.
దృష్టి,
భావము,
వాక్యము
మూడింటి
ఏకత్వము
కలగాలి.
ఇప్పుడు
వ్యష్టికి,
సమిష్టికి
మధ్య
ఉండిన
ఏకత్వమును
మనం
గుర్తించాలి.
సమాజమంటే
ఏమిటి?
ఏకత్వమే.
అనేకమంది
చేరిన
గుంపుకు
సమాజము
అంటున్నారు.
వ్యక్తి
అంటే
ఎవరు?
ప్రత్యేకించి
జీవించే
ఒక
వ్యక్తిని
వ్యక్తి
అంటున్నారు.
ఇది
ఒక
జీవితము,
ఇలాంటి
జీవితములు
అనేకంగా
చేరినప్పుడే
సమాజము.
ఈ
సమాజమునకు,
వ్యక్తికి
ఉండిన
సంబంధము
ఏమిటి?
రెండింటి
ఏకత్వము
మనము
గుర్తించినప్పుడు
వ్యక్తియే
సమాజము.
ఇలాంటి
వ్యక్తులు
పదిమంది
చేరినప్పుడే
సమాజముగా
ఏర్పడుతుంది.
తాను
ఏకాకిగా
ఉండినప్పుడు
సమాజము
అని
చెప్పటానికి
వీలు
కాదు.
సమాజము
అనుకున్నప్పుడు
గానీ,
విశ్వమనుకున్నప్పుడు
గానీ
మానవ
ఏకత్వమే
విశ్వవ్యాప్తి.
కనుక
మొట్టమొదట
వ్యక్తి
చక్కబడినప్పుడే
సమాజము
కూడా
చక్కబడుతుంది.
వ్యక్తి
మంచివాడైనప్పుడే
సమాజము
మంచిదౌతుంది.
వ్యక్తి
మంచివాడు
కావటానికి
కారణం
ఏమిటి?
పవిత్రమైన
దృష్టి,
పవిత్రమైన
భావములు,
పవిత్రమైన
వాక్యము
యీ
మూడింటి
ఏకత్వము
మనలో
ఆవిర్భవించాలి.
మానవత్వములో
తనయందున్న
దివ్యత్వము
గుర్తించవలెనంటే
మొట్టమొదట
దృష్టిని
సరైన
రీతిలో
పెట్టుకోవాలి.
ఈ
దృష్టివలనే
మానవునియందు
అపవిత్రమైన
భావములు
అనేకంగా
చెలరేగి
మాలిన్య
పరుస్తున్నాయి.
మానవుని
యందు
యిలాంటి
భావములు
రావటానికి
కారణం
ఏమిటి?
నిజముగా
మానవుని
యందు
చెడ్డ
భావములు
రావటానికి
కారణం
ఏమీ
లేదు.
తన
దృష్టియొక్క
reaction
తన
భావములకు
మూలకారణము.
5
▾
Meaning
Keep
చిత్తస్యశుద్ధయేకర్మః
-
మనము
చేసే
కర్మల
వల్ల
చిత్తశుద్ధి
ఏర్పడాలి.
ఈనాటి
మానవుని
యందు
అపారమైన
వాంఛలు
మితిమీరిపోతున్నాయి.
తను
ఆచరణ
పెట్టని
విషయములు
చదువుతున్నాడు.
తను
ఆచరణ
పెట్టలేని
దృశ్యమునంతా
చూస్తున్నాడు.
తాను
ఆచరణలో
పెట్టని
వాక్యములు
పలుకుతున్నాడు.
ప్రయోజనం
ఏమిటి?
తను
ఆచరణలో
పెట్టే
ఒక్క
విషయాన్నైనా
తాను
చదివి,
తాను
చూచి,
తాను
అనుభవించినప్పుడు
తాను
సార్థకత
పొందుతాడు.
బ్రహ్మవిద్యలెన్నో
ప్రచారములు
చేసి
చెప్పువారు
కలరు
చాలా
మంది
కానీ
(ఒక్కటైనా)
ప్రాక్టీసు
చేయు
ఘనుండొక్కడులేడు.
చెప్పేవారు
చాలామంది
ఉంటున్నారు.
కానీ
ఆచరణలో
పెట్టే
ఘనుడు
ఒక్కడు
కనిపించటం
లేదు.
కనుకనే
దేశము
యింతటి
అశాంతికి
గురౌతున్నది.
తలచు
భావములు,
చెప్పే
వాక్యము,
చేసే
పనులు
మూడింటి
ఏకత్వము
కుదిరేలా
చూడాలి.
దుర్భావములు
దూరము
చేయుటే
నిజమైన
సాధన
చూచిన
దానిని
తలచి,
తలచిన
దానిని
చెప్పి,
చెప్పిన
దాన్ని
చేయటం.
దీనినే
సమ్యక్
కర్మ
అన్నారు.
కర్మ
అనగా
ఏమిటి?
చేసే
పని.
ఎట్టిపని
చేయాలి.
చూచినదానిని
తలచినప్పుడు,
తలచిన
దానిని
చెప్పినప్పుడు
మూడింటి
ఏకత్వము
సంబంధించిన
కర్మ
చేయాలి.
ఈ
మూడింటికి
విరుద్ధమైన
కర్మలాచరించటం
చేతను
మరింత
అపవిత్రుడైపోతున్నాడు.
ఈ
సమ్యక్
కర్మయే
సమ్యక్
సాధన
అన్నాడు
బుద్ధుడు.
అదియే
నిజమైన
సాధన,
ధ్యానము
చేయటం,
జపం
చేయటం,
పూజలు
చేయటం,
యివన్నీ
కాదు
సాధనలు.
ఇవన్నీ
మంచి
కర్మలే
కానీ
నిజమైన
సాధన
అంటే
ఏమిటి?
చూచిన
దానిని
తలచటము,
తలచిన
దానిని
చెప్పటం,
చెప్పిన
దానిని
చేయటం
అన్నాడు.
ఇదే
పంచేంద్రియముల
తత్వము.
సమ్యక్
దృష్టి,
సమ్యక్
భావము,
సమ్యక్
వాక్కు,
సమ్యక్
కర్మ,
సమ్యక్
శ్రవణం.
వీటి
కలయికే
సమ్యక్
జీవనం
-
మంచి
జీవనం,
పొందాలనుకుంటే
మంచి
తలవాలి.
మంచిపనులు
చేయాలి.
ఈ
సాధనలో
మానవుడు
గుర్తించవలసినది
ప్రధానమైనది
ఒకటి
ఉంది.
6
▾
Meaning
Keep
సాధన
అంటే
ఏమిటి?
మానవుని
యందున్న
దుర్భావములు
దూరము
చేయాలి,
సద్భావములు
ప్రవేశపెట్టాలి.
అదియే
నిజమైన
సాధన.
సత్సంకల్పములు
అభివృద్ధిపరచుకోవాలి.
సత్సంకల్పములను
అభివృద్ధిపరచుకొని
సత్కర్మలలో
ప్రవేశపెట్టాలి.
కట్టకడపటికి
ప్రాణములు
విడిచే
సమయంలో
ఒక్క
మాట
చెప్పాడు
బుద్ధుడు.
మానవుడు
సుఖపడాలని
అనేక
విద్యలు
నేరుస్తున్నాడు.
మానవుడు
సుఖపడాలని
అనేక
ఉద్యోగాలు
చేస్తున్నాడు.
మానవుడు
సుఖపడాలని
వివాహమాడుతున్నాడు.
మానవుడు
సుఖపడాలని
బిడ్డలను
కంటున్నాడు.
మానవుడు
సుఖపడాలని
భవనములు
కడుతున్నాడు.
కానీ
కట్టకడపటికి
సుఖపడుతున్నాడా?
సుఖము
యిందులో
లేదు.
కట్టకడపటికి
తన
పినతల్లి
కుమారుడైన
ఆనంద్‌ను
పిల్చాడు
గౌతమకుమారుడు.
ఆనందుడు
అతనిని
పిలిచి
తలపై
చేయి
పెట్టి
నాయనా!
నేను
సత్యమును
బోధించే
నిమిత్తమై
వచ్చాను.
భగవంతుడు
ఎక్కడ
చూచినా
ఉన్నాడు.
Truth
is
God
అన్నాడు.
సత్యము
పలుకు,
పరుల
యొక్క
బాధలకోసము
కానీ,
పరులవత్తిడి
కోసమని
గానీ
నీవు
బాధపడవద్దు.
ప్రపంచములో
వత్తిడి
చేసేవారేగానీ
సహాయపడేవారు
లేరు.
సత్యము
దైవము,
సత్యము
నీవు
పలుకు,
రెండవది
“అహింసా
పరమోధర్మః”
అన్నాడు.
ధర్మము
అంటే
ఏమిటి?
బ్రహ్మచర్య
ధర్మమా?
గృహస్తు
ధర్మమా?
లేక
వానప్రస్థధర్మమా?
లేక
సన్యాస
ధర్మమా
లేక
శాస్త్రధర్మమా
ఏది
ధర్మము?
ఇవన్నీ
ధర్మములే
కాదు.
ఇవన్నీ
అనిత్యములు,
మానవజీవితముండినంతవరకు
నిత్య
కృత్యము
కొరకు
అనుభవించవలసిన
ధర్మములు.
నిజమైన
ధర్మము
అహింసాపరమోధర్మః
అన్నాడు.
దీనినే
వేదమందు
“సత్యం
బ్రూయాత్,
ప్రియం
బ్రూయాత్”
అన్నారు.
ప్రియమైనదే
ధర్మము,
ధర్మమునకు
రెండవ
పదము
ప్రియము
అని
బోధిస్తుంది
వేదము.
కానీ
నేను
గృహస్తుడు
కాకుండా
బయటకు
పోతానని,
నా
తల్లి
తండ్రులకు
ఎవరో
చెప్పారు.
ఆ
కారణముచేత
నన్ను
ఏదో
విధంగా
బంధనలోఉంచే
ప్రయత్నము
చేశారు
నా
తల్లిదండ్రులు,
నా
బంధుమిత్రులు,
సమస్త
ప్రజలు.
నన్ను
ఈ
సంసారములో
ముంచి
పెట్టారు.
అదియే
నాకు
ప్రధానమైన
అవరోధముగా
కనిపించింది.
ఆ
అవరోధమే
నన్ను
యీవిధంగా
సాధనలో
ప్రవేశపెట్టింది.
లేకపోతే
నేను
ఈ
కర్మలు
ఆచరించేవాడను
కాను.
కనుక
the
pleasure
is
an
interval
between
two
pains
అన్నారు.
7
▾
Meaning
Keep
Also in his talks
(6)
22 May 1973
The Deluded Mind and the Liberated Mind
3 June 1973
Youth and the Tapas of Speech
22 July 1994
The fullness of Prema
16 July 1996
Develop Virtues and Contemplate on God
5 September 1996
Saccidānanda Is Man's Very Nature!
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
రెండు
బాధల
మధ్యలోనే
మనకు
శాంతి
చిక్కుతుంది.
బాధలు
అనుభవించకుండా
శాంతిని
పొందుటకు
వీలుకాదు.
ఈనాడు
నేను
సత్యమును
గుర్తించాను
అన్నాడు
బుద్ధుడు.
ఏమిటి
ఈ
సత్యము.
మానవుని
యందున్న
పంచేంద్రియములను
పవిత్రము
చేసుకోవటమే
సత్యము.
ఈ
పంచేంద్రియములు
మాలిన్యపరుచుకొని
ఎన్ని
సాధనలు
చేసిన
ప్రయోజనం
ఏమిటి?
ట్యాంకు
నిండుగా
మాలిన్యమైన
జలము
పెట్టుకొని
ట్యాప్
తిప్పితే
మాలిన్య
జలమే
వస్తుంది.
గానీ
పరిశుద్ధ
జలము
రాదు.
నీ
హృదయమే
ట్యాంకు.
ఇంద్రియములు
ట్యాపులు.
హృదయమనే
ట్యాంకు
అపవిత్రమైన
భావములతో
నింపుకొన్నపుడు,
నీ
చూపులు,
నీ
తలంపులు,
నీ
వాక్కులు
అపవిత్రమవుతాయి.
హృదయమనే
ఈ
ట్యాంకును
పరిశుద్ధపరచి
పవిత్రమైన
దృష్టిని
నింపి
పవిత్రమైన
భావములు
నింపి,
పవిత్రమైన
వాక్యములు
నింపి,
పవిత్రమైన
సాధన
సల్పినప్పుడే
పవిత్రమైన
ట్యాంకుగా
తయారౌతుంది.
కనుక
జయదేవుడు.
జిహ్వే
రసజ్ఞే
మధుర
ప్రియేత్వం
సత్యం
హితం
త్వాం
పరమం
వదామి
ఆవర్ణయేథా
మధురాక్షరాణి
గోవింద
దామోదర
మాధవేతి
ఓ
జిహ్వా!
మేలుకో.
నిన్ను
ఎందుకోసం
భగవంతుడు
నాకందించాడు.
ఇంటిలో
వండిన
రుచికరమైన
పదార్థములు
భుజించే
కోసమా!
కాదు
కాదు.
దేహరక్షణ
కోసం
ఏదో
ఒకటి
భుజించాలి.
రుచి
నిమిత్తమై
ఏర్పడినది
కాదు.
నీకు
రుచిఏమిటి?
దివ్యమైన
వాక్యములే
నీకు
రుచి.
భగవంతుని
నామమే
రుచి
ఏ
నామమైనా
నీవు
తలచుకో.
భగవంతుడు
ఒక్కడే.
ఆ
నామము
భుజించాలంటే
సత్యం
బ్రూయాత్,
ప్రియం
బ్రూయాత్
అనగా
సత్యము,
ధర్మము
రెండింటిని
నీవు
భుజించు.
ఏది
పలికినా
నీవు
సత్యమునే
పలుకు.
ఏది
చేసినా
అహింసకు
సంబంధించిన
ధర్మముగా
నీవు
ఆచరించు.
ఎవరి
హృదయమును
బాధించకు.
దేహంబునకు
బాధలు
కలుగుతే
మందులు
వేసి,
కట్టుకట్టి
చక్క
చేసుకోవచ్చు.
దేహానికి
తగిలిన
గాయాన్ని
మాన్పటానికి
అవకాశముంటున్నది.
మాటలవలన
హృదయానికి
తగిలిన
గాయము
మానదు.
8
▾
Meaning
Keep
పరులను
బాధించని
పలుకులు
పలకాలి.
You
cannot
always
oblige,
but
you
can
speak
always
obligingly.
నీవు
పవిత్రమైన
వాక్యమును
ఉపయోగపెట్టు,
స్వార్థము,
స్వప్రయోజనము
కోసమని
నీ
జీవితము
నాశనము
చేసుకోవద్దు.
నీ
వాంఛలు
తీరాలని
స్వార్థములో
మునిగిపోవద్దు.
జీవితము
ముందు
ముందు
ఎన్ని
విధములైన
బాధలకు
గురౌతుందో?
ఇందులో
ఏ
మాత్రము
సుఖము
లేదు.
చదివిన
చదువులో
సుఖము
లేదు.
చేసే
ఉద్యోగములో
సుఖము
లేదు.
సంపాయించిన
ధనములో
సుఖములేదు.
అభివృద్ధి
గావించిన
భవనములలో
శాంతి
లేదు.
ఎక్కడ
నీకు
శాంతి
ఉంది?
నీ
హృదయమునందే
శాంతి
ఉంది.
You
are
the
embodiment
of
Peace,
You
are
the
embodiment
of
truth,
you
are
the
embodiment
of
God.
నీవే
దైవము.
నీవే
దైవముగా
గాఢంగా
విశ్వసించు.
నీలోని
మానవత్వమును
పవిత్రము
గావించుకో.
మానవత్వము
నీవు
గుర్తించినప్పుడే
దైవత్వమును
గుర్తించుటకు
అధికారి
అవుతావు.
నీలో
ఉన్న
సహజమైన
మానవత్వమునే
గుర్తించుకోలేకపోతే
దైవత్వమును
గుర్తించుకోటానికి
ఏరీతిగా
గుర్తించగలవు?
మొట్టమొదట
నీలోనున్న
మానవత్వాన్ని
గుర్తించుకో.
ఈ
మానవత్వాన్ని
సార్థకముగావించుకో.
సహజంగా
దివ్యత్వంలో
ప్రవేశిస్తుంది.
ఎంతకాలమైనా
ఈ
భౌతిక
సుఖములకోసమని,
భౌతిక
ఆనందము
కోసమని
భౌతిక
సౌభాగ్యములకోసమని
జీవితము
అంకితము
చేస్తున్నారు.
గానీ
ఆధ్యాత్మిక
ఆనందము
కోసమని,
జ్ఞానానంద
నిమిత్తమై
మానవుడు
ప్రయత్నం
చేయటంలేదు.
ఆ
నిజమైన
ఆత్మానందము
నీవు
అనుభవిస్తే
సర్వానందములు
లభ్యమైపోతాయి.
నీవు
తెలుసుకున్న
మంచిని
ఒక్కదానినైనా
నీవు
ఆచరణలో
పెట్టు.
జీవితమంతా
చదువుతూ,
చదువుతూ
పోతుంటే
యింక
ఆచరణలో
పెట్టేది
ఎప్పుడు.
ఆచరణలో
పెట్టని
చదువువలన
ప్రయోజనం
ఏమిటి?
ఇదంతా
కాలమును
వ్యర్థము
చేసుకోటమే.
నీ
energy
ని
వ్యర్థము
చేసుకోవటమే.
కట్టకడపటికి
చదివినవన్నీ
నీ
హృదయములో
నిల్చిపోతున్నాయి.
వాటితోనే
నీవు
ప్రాణాన్ని
వదులుతున్నావు.
యిక
దైవత్వమును
చింతించుటకు
ఏమాత్రము
అవకాశము
లేదు.
భౌతికమైన,
ప్రాకృతమైన,
లౌకికమైన
విషయములే
నీ
హృదయములో
నిండిపోతున్నాయి.
“అనిత్యం
అసుఖం
లోకం
యిమం
ప్రాప్య
భజస్వమాం”
యిదే
భగవద్గీత
అందించిన
ప్రధాన
ఆదేశము.
9
▾
Meaning
Keep
అనిత్యం,
అసుఖం.
ఈ
విషయము
చాలా
మందికి
కష్టం
కల్గించవచ్చును.
ప్రాకృతజీవితములో
ఉండినప్పుడు
ఇవన్నీ
అనుభవించాలి
కదా!
స్వామి
యిట్లా
చెబుతున్నాడే
పిల్లల
కంతా
వారి
గతి
ఏమవుతుంది?
అయితే
పిన్న
వయసులోనే,
యువకులుగా
ఉన్నపుడే
మంచి
భావములు
లోపల
ప్రవేశపెట్టాలి.
Start
early,
drive
slowly,
reach
safely.
ఈ
వయస్సు
లోపలే
మంచి
భావాలు
వారికి
అందించాలి.
వారు
కష్టపడతారని
మంచి
భావాలు
అందించకుండా
వెనుకంజ
వేస్తే
వారు
పాడైపోతారు.
తరువాత
ఏడ్చి
ఏమి
ప్రయోజనం?
మొట్టమొదటే
మనం
చాలా
జాగ్రత్త
వహించాలి.
మానవత్వము
నకున్న
పవిత్రత
మరిదేనికీ
లేదు.
చూడండి
సింహంలా
వేషము
వేసుకొని
ఆడినారు.
ఆకారమంతా
సింహమే,
కానీ
లోపల
ఆడినవాడు
మానవుడే
కనుక
మానవత్వము
ప్రధానం
గానీ,
ఆకారము
ప్రధానము
కాదు.
అదే
విధముగా
మన
దేహము
మానవాకారంగా
ఉంటున్నది.
ఆకారము
ప్రధానము
కాదు.
ఆచరణ
ప్రధానము.
అదే
human
quality.
Human
గా
ఉండి
human
quality
లేకపోతే
ప్రయోజనం
ఏమిటి?
మానవతావిలువలు
పెంచుకోవాలి.
ఏమిటీ
మానవతా
విలువలు?
మంచి
దృష్టి,
మంచి
వాక్కు,
మంచి
thought,
మంచి
కర్మలు,
మంచి
జీవితము
యిదే
మానవజీవితము.
అప్పుడే
నీవు
పూర్ణ
మానవుడుగా
తయారౌతావు.
ఎప్పుడు
చూచినా
ఏదో
భగవత్
చింతన
చేస్తుంటే
దానివల్ల
కూడా
ప్రయోజనం
లేదు.
చింతన
చేస్తున్నావు.
చింతన
చేసి
ప్రయోజనం
ఏమిటి?
దానికి
తగిన
ఆచరణలో
పెడుతున్నావా?
లేదే.
లేనప్పుడు
ఎన్ని
చింతలు
చేసి
ప్రయోజనం
ఏమిటి?
కేవలం
రాం
రాం,
సాయి
సాయి
అని
చింతన
చేస్తే
టేపురికార్డు
కూడా
సాయి
సాయి
అని
చింతన
చేస్తుంది.
ఏమైనా
ప్రయోజనం
ఉన్నదా.
చెప్పిన
నామము
హృదయములో
నాటుకొని
పోవాలి.
అప్పుడు
హృదయము
నుండి
మంచి
భావాలు
ఆవిర్భవిస్తాయి.
అవే
వృక్షములుగా
మారతాయి.
అవే
ఫలములుగా
మనకందిస్తాయి.
వృక్షము
లేక
ఫలము
లేదు.
మంచి
భావములే
మన
హృదయములో
వుండే
వృక్షములు.
మంచి
భావములు
ఒక
హృదయములో
మాత్రమే
పుట్టాలిగానీ,
మరొక
ప్రదేశములో
పుట్టడానికి
వీలులేదు.
దానికి
విత్తనం
ఉండాలి.
ఎవరైనా
వృక్షాలు
ఎక్కడ
పుడుతున్నాయని
అడిగినప్పుడు
భూమిలో
పుడుతున్నాయి
అంటారు.
ఇది
సత్యము
కాదు.
ఇది
అసత్యము-
ఇది
అజ్ఞానముతో
చెప్పే
పదము.
10
▾
Meaning
Keep
కానీ
విత్తనాలు
లేకుండా
ఏమీ
పుట్టవు.
విత్తనముల
నుండే
వృక్షాలు
పుడుతున్నాయి.
మన
హృదయమనే
భూమిలో
సద్భావములు,
సచ్చింతనలు,
సత్ప్రవర్తన
అనే
విత్తనములుండినప్పుడే
అందులో
వృక్షములుగా
పుడుతుంటాయి.
మనలో
మంచి
ఆలోచనలు
రావడానికి
ఏది
కారణము.
మంచి
భావములు
పాతాలి
మనం.
ఆ
seeds
ఎక్కడ
ఉంటున్నాయి?
సమ్యక్
దర్శనం,
మంచి
చూపుతో
వస్తున్నాయి.
అప్పుడే
సమ్యక్
భావములు
మనలో
పుడుతున్నాయి.
అవే
సమ్యక్
వచనం,
మంచి
పదములుగా
మారుతున్నాయి.
అదే
సమ్యక్
కర్మలుగా
మారుతున్నాయి.
అవే
సమ్యక్
సాధనలుగా
రూపొందుతున్నాయి.
అదే
సమ్యక్
జీవనంగా
రూపొందుతుంది.
ప్రతి
మానవుడు
ఈనాడు
సాధించవలసినది
సమ్యక్
జీవనం.
సమ్యక్
జీవనానికి
సమ్యక్
దృష్టి
చాలా
అవసరము.
కనుక
మనం
ఏదంటే
అది
చూడడానికి
ప్రయత్నం
చేయకూడదు.
చిక్కినవారినందరినీ
చూడటానికి
ప్రయత్నం
చేస్తారు
కొంతమంది.
ఇది
వారి
ఖర్మ
అని
చెప్పవచ్చు.
ఎవరిని
చూడాలో
వారినే
చూడాలి,
ఎవరితో
మాట్లాడాలో
వారితో
మాత్రమే
మాట్లాడాలి.
అనవసరంగా
అందరితో
మాట్లాడినప్పుడు
ఆ
భావములు
మీలో
ప్రవేశిస్తాయి.
యద్భావం
తద్భవతి
-
అవే
నీలో
రూపొందుతాయి.
మనము
ఎవరినంటే
వారిని
చూడకూడదు.
ఎవరితో
అంటే
వారితో
మాట్లాడకూడదు.
ఆ
భావము
సరిగా
దృష్టిలో
పెట్టుకున్నప్పుడు
సమ్యక్
జీవనం
అవుతుంది.
కట్టకడపటికి
నిర్వాణం
పొందే
సమయంలో
బుద్ధుడు
ఒకదాన్ని
గుర్తించాడు.
ఈ
విధమైన
ప్రపంచములో
చదివిన
చదువులు
విన్న
బోధలు
వీటివల్ల
జ్ఞానము
కలగదు.
ఇదంతా
bookish
knowledge
గ్రంథ
పరిచయంతో
వచ్చిన
తెలివితేటలే
గాని
నిజముగా
మన
హృదయము
నుండి
ఆవిర్భవించినవికావు.
బుద్ధగయకు
వెళ్లాడు,
అక్కడ
ఒక
మఱ్ఱి
వృక్షము
క్రింద
కూర్చున్నాడు.
తన
దృష్టిని
పవిత్రంగా
మార్చుకున్నాడు.
దానివల్ల
అతనిలోపల
నుంచి
మంచి
భావాలు
వస్తూ
వచ్చాయి.
ఆ
మంచి
భావాలు
రావటం
చేత
మంచి
పలుకులు
పలుకుతూ
వచ్చాడు.
ఆ
మంచి
పలుకులచేతనే
సర్వులను
ఆకట్టుకున్నాడు.
యువకులందరూ
ఆ
బుద్ధుని
వెంట
బయలుదేరారు.
కారణం
ఏమిటి?
మంచి
వాక్కులు,
మంచి
భావములు,
మంచి
దృష్టి
ఉంటున్నది.
ఒకానొక
సమయంలో
తనవెంట
వస్తున్న
ఒక
విద్యార్థిని
చూచాడు,
గంగానది
నుండి
ఇద్దరు
స్త్రీలు
నీరు
తీసుకువెళుతున్నారు.
11
▾
Meaning
Keep
అందరు
పిల్లలు
క్రింద
చూస్తూ
నడుస్తూ
వచ్చారు.
ఎందుకు
క్రిందకు
చూడాలి?
నీవు
నడచేది
రోడ్డుపై,
రోడ్డును
చూడు.
నీకు
ప్రమాదం
సంభవించదు.
రోడ్డుపైనడుస్తూ
అటు
ఇటు
చూస్తుంటే
ప్రమాదం
సంభవించవచ్చు.
ఈనాటి
పిల్లలందరు
అదేరీతిగా
ఉంటున్నారు.
సైకిలుపై
రోడ్డులో
పోతుంటారు.
సినిమా
wall
posters
చూస్తూ
పోతుంటారు.
వాటిని
చూసుకుంటూ
వీడు
పోతుంటే
వెనుక
కారు
వచ్చి
కొట్టేస్తుంది.
ప్రమాదం
జరుగుతుంది.
ఈ
ప్రమాదమునకు
కారణం
ఏమిటి?
నీ
దృష్టియే.
నీవు
రోడ్డులో
నడుస్తున్నావు,
రోడ్డును
చూస్తూపో.
నీవు
అటు
యిటు
చూడటానికి
కారణం
లేదే.
ఇదే
చెడ్డ
దృష్టి.
ఇది
సమ్యక్
దృష్టి
కానేకాదు.
అప్పుడా
పిల్లవానిని
పిలిచి
boy
భగవంతుడు
నీకు
రెండు
నేత్రములు
ఎందుకిచ్చాడు?
ఈ
తుచ్ఛమైన
దృశ్యములు
చూడటానికా
యిచ్చాడు.
దీనివల్ల
నీలో
ఎంత
అపవిత్ర
భావములు
రూపొందుతాయి.
నీవు
రోడ్డుపైనడిచేటప్పుడు
రోడ్డు
చూడు.
ఈ
పిల్లలంతా
నడుస్తున్నారు.
నీవు
ఎందుకు
వారిని
చూడటము?
ఈ
దృష్టి
చూచేవాడునూ
సమాజములో
ఉండకూడదని
బయటకు
పంపించాడు.
ఈవిధమైన
కఠినమైన
శిక్షణ
యిస్తూ
సాధనలో
సక్రమమైన
వారిగా
తయారు
చేస్తూ
వచ్చాడు
బుద్ధుడు.
ఆవిధమైన
సమ్యక్
దృష్టిచేత,
సమ్యక్
జీవితముచేత
తన
జీవితము
సార్థకత
పొంది
పోయింది.
అదియే
సమ్యక్
నిర్వాణము.
పవిత్రమైన
నిర్వాణము
జరిగింది.
ఎట్టి
వాంఛలు
లేవు.
ఎట్టి
సంకల్పములు
లేవు.
ఎట్టి
కర్మలు
చేయలేదు.
అదే
సమ్యక్
నిర్వాణము
జరుగుతుంది.
మనము
దృష్టి
చక్క
చేసుకుంటే
end
సమ్యక్
నిర్వాణము
జరుగుతుంది.
మానవతా
విలువలు
కాపాడుటయే
భారతీయుల
లక్ష్యము
విదేశీయులారా!
స్వదేశీయులారా!
మొట్టమొదట
ఎవరైనా
సరే
మానవాకారం
ధరించినప్పుడు
అందరూ
మానవులే.
ఈ
మానవత్వము
ధరించినప్పుడు
human
thoughts
రావాలి.
ఈ
మానవతావిలువలు
పెంచుకోటానికి
కారణం
ఏమిటి?
సత్యసాయి
సంస్థలలో
మానవతా
విలువలు
చాలా
ప్రధానమైనవిగా
పెట్టుకున్నాం.
ఈ
మానవతా
విలువలు
మనం
పెంచుకున్నప్పుడే
divine
values
బయలుదేరుతాయి.
కన్నులున్నాయని
ఇష్టము
వచ్చినట్టు
మనం
చూడకూడదు.
అలాంటి
కన్నులుండే
కంటే
గుడ్డివాడు
అవటం
మంచిది.
ఉండి
ప్రయోజనం
ఏమిటి?
12
▾
Meaning
Keep
సూరదాసు
చెప్పాడు.
“కన్నులుండి
గుడ్డులై
కళ్యాణకరమైన
నీమూర్తి
దర్శింప
నేరరైరి”
అని.
కన్నులుంటున్నాయి
ప్రతి
మానవునికి.
కానీ
అందరు
భగవంతుని
చూడటం
లేదు.
అలాంటి
వారు
గుడ్డివారుగా
పుట్టుట
మంచిది
అన్నాడు.
చెవులుండి
చెవుటులై
అతిమనోహరమైన
నీగానమాలింప
నేరరైరి
పాణి
పంకజమందు
పరమాత్మ
ఉండియు
పాడు
సంసారంబు
కోరిరైరి.
ఏమిటి
ఈ
జీవితము?
ఈ
తుచ్చమైన
ఇంద్రియములు
అనుభవించటం
కోసమా!
ఇంద్రియములు
అనుభవించుటంకూడా
సక్రమమైన
మార్గంలో
అనుభవించాలి.
సరైన
దివ్యత్వముతో
అనుభవించాలి.
ఈ
కుక్కలు,
నక్కలు
అనుభవించినట్లుగా
అనుభవిస్తే
మానవుడైనందుకు
ఏమి
ప్రయోజనము.
ఇట్టి
మానవుడు
ఎన్ని
చదువులు
చదివి
ప్రయోజనం
ఏమిటి?
కేవలం
ధనము
నార్జించే
నిమిత్తమై
చదివే
చదువులు.
దీనివల్ల
మనకు
జ్ఞానము
ఏనాటికీ
లభ్యము
గాదు.
మనకు
జ్ఞానం
కావాలంటే
ఇంద్రియములను
పవిత్రము
గావించుకోవాలి.
అన్ని
ఇంద్రియములలో
కన్నులు
చాలా
ప్రధానమైనది.
పవిత్రమైన
దివ్యత్వమును
చూడాలి.
పోనీ
ఆ
దివ్యత్వము
లేకపోతే
కన్నులు
మూసుకొని
నీలో
మంచి
భావములు
చిత్రించుకో.
ఆవిధమైన
భావములు
పెంచుకుంటూ
పోవాలి.
ధనము
ఎంతైనా
సంపాయించుకోవచ్చును.
కానీ
అది
ఏనాటికీ
వెంటరాదు.
కౌరవులు
కావలసినంత
ధనముతో
ఖజానా
నింపుకున్నారు.
పాండవుల
చేతిలో
ఒక్క
కాసైనా
లేదు.
అడవిలో
పోయి
సంచరిస్తూ
ఆకులలములు
తింటూ
వచ్చారు.
కట్టకడపటికి
ఏమైంది.
పాండవులకు
కృష్ణుడు
ప్రాప్తించాడు.
కౌరవులకు
పాపమే
ఫలించింది.
ఎంత
ధనముండి
ఏమి
ప్రయోజనము?
కానీ
ధనముపై
పండుకున్నప్పటికీ
ధృతరాష్ట్రునకు
అగ్నిపై
పవళించినట్లుగా
ఉంది.
పరున్నది
హంసతూలికా
పాన్పుపై
కానీ
అదియే
అగ్ని
పర్వతంగా
మారిపోయింది.
పాండవులు
అరణ్యములో
జీవిస్తూ
వచ్చారు.
హాయిగా
జీవితమును
గడుపుతూ
వచ్చారు.
ఏమిటి
హాయి
జీవితము?
కృష్ణనామమే
హాయి
జీవితము.
కనుక
కౌరవులకు,
పాండవులకు
ఉన్న
వ్యత్యాసము
మీరు
గుర్తించాలి.
పాండవులు
first
God,
next
world,
last
I.
స్వార్థ
స్వప్రయోజనములు
చివరికి
పెట్టారు
పాండవులు.
కౌరవులు
అట్లా
కాదు
first
నేను,
next
world,
last
God.
అందువల్లనే
వారు
సర్వ
విధములా
నాశనమునకు
గురైపోయారు.
13
▾
Meaning
Keep
మొట్టమొదట
మనకు
దైవము
కావాలి.
దైవము
లేక
ఎన్ని
ఉండి
ప్రయోజనం
ఏమిటి?
Money
comes
and
goes,
but
morality
comes
and
grows.
ఆ
morality
లేనప్పుడు
మనీ
ఉండి
ప్రయోజనం
ఏమిటి?
దేహము
ఉండి
ప్రయోజనము
ఏమిటి.
మలమూత్ర
దుర్గంధ
మాంస
రక్తమె
గాని
పునుగుజవ్వాదీలు
పుట్టబోవు
నిముష
నిముషమునకు
నీచులూరునెగానీ
పునుగు
జవ్వాదీలు
పుట్టబోవు
ఏమిటి
ఈ
దేహము
మల
మూత్ర
దుర్గంధ
మాంసరక్తముతో
కూడినది.
మాంసరక్తముతో
కూడిన
దానికి
యింకొక
మాంసరక్తము
ఎందుకు?
దీనిని
నీవు
సార్థకము
చేసుకో.
దీనిని
నీవు
పవిత్రము
చేసుకో.
సరియైన
జన్మ
అనుభవించు.
అంతేగానీ
ఏదో
ఒక
విధమైన
మార్గములో
ప్రవేశించి
జీవితాన్ని
ఆనంద
పరచుకుంటాననుకోవటం
చాలా
వెఱ్ఱితనం.
అప్పడిదప్పుడే
ఆనంద్‌ను
పిల్చి
ఎందుకోసం
ఏడుస్తున్నావు
నాయనా
అని
అడిగాడు
బుద్ధుడు
పిన
తల్లి
కుమారుని.
అన్నా!
మీరు
దేహాన్ని
వదలేపరిస్థితి
వచ్చింది.
దీనిని
నేను
దూరము
చేసుకుంటున్నానే
అని
ఏడుస్తున్నాను
అన్నాడు.
పిచ్చివాడా!
body
is
like
a
water
bubble.
Mind
is
like
a
mad
monkey.
Don't
follow
the
body
don't
follow
the
mind.
Follow
the
conscience
అన్నాడు.
నీ
హృదయాన్ని
అనుసరించు
తుచ్చమైన
దేహాన్ని
ఎందుకు
అనుసరిస్తావు?
కోతి
వంటిమనసును
ఎందుకు
విచారిస్తావు?
నీవు
హృదయాన్ని
పవిత్రముగా
చేసుకోమన్నాడు.
చెప్పాడు
కన్నులు
మూసాడు.
ఈవిధముగా
ఉత్తములైనవారు,
ఆచరణ
వంతులైనవారు,
ఆనందమును
అనుభవించినవారు
ఎన్నియో
పవిత్రమైన
మార్గాలు
చూపిస్తూ
వచ్చారు.
అలాంటి
పవిత్రమైన
మహానీయులను
గన్న
భూమి
పవిత్రమైన
భారత
భూమి,
ఇలాంటి
భరతభూమియందున్న
పవిత్రత
మరే
భూమియందు
కన్పించటంలేదు.
కనుక
“ఎన్న
భారతే
తన్న
భారత”
అనగా
భారతదేశములో
లేనిది
మరోక
దేశములో
లేదు.
స్త్రీలు
కానీ
పురుషులు
కానీ
పవిత్రమైన
కర్మలాచరించి,
పవిత్రమైన
మార్గమును
శోధిస్తూ
వచ్చారు.
అటువంటి
పవిత్రమైన
మహానీయులు
పుట్టిన
భూమి
భరత
భూమి.
14
▾
Meaning
Keep
Also in his talks
(9)
26 June 1989
Bhakti Is Never Parted from God
1 March 1990
To seek out the path is the noble wisdom
19 March 1990
Hero becomes zero if he forgets God
22 July 1994
The fullness of Prema
18 April 1998
The universe is the form of Viṣṇu
8 October 1998
Good Resolves Are Themselves the Human Values
27 May 2006
Service itself is the foremost duty of man
16 August 2006
The one who dwells in the body is the God of gods
15 January 2008
Revere your mother as God, your father as God
నిరత
సత్యప్రౌఢి
ధరణినేలిన
హరిశ్చంద్రుడీ
ధరబాసి
చనగలేదే
సత్యముకోసమని
భార్యను
కూడా
అమ్ముకున్నాడు.
సత్యము
కోసము
కుమారుని
చంపుకున్నాడు.
కట్టకడపటికి
తనే
కాటికాపరిగా
నిల్చాడు.
రాజ్యము
నాకు
అక్కర
లేదు,
భార్య
నాకు
అక్కర
లేదు,
కుమారుడు
నాకు
అక్కర
లేదు,
నాకు
కావలసినది
సత్యము,
సత్యమే
భగవంతుడు
అన్నాడు
హరిశ్చంద్రుడు.
ఎల్లలోకమునేలు
ఎసగు
శ్రీ
నలరాజు
తన
వెంట
భూమి
కొనుచు
చనెనా!
కృతయుగంబునకు
అలంకృతి
చేయు
మాంధాత
సిరిమూటకట్టుక
నరుగజనెనా
అలనాటి
శ్రీరాముడు
ఆకులలములు
మేసి
తన
వెంట
ధర్మమును
గొనుచుచనెనా
ధర్మాన్ని
ప్రజలకే
బోధిస్తూ
వచ్చాడు
రాముడు.
కనుక
“రామోవిగ్రహవాన్
ధర్మః”
అన్నారు.
అట్టి
ధర్మ
స్వరూపులైన
మహానీయులు
ధర్మమునే
బోధిస్తూ
వచ్చారు.
సత్య
స్వరూపులైన
మానవులు
సత్యమునే
బోధిస్తూ
వచ్చారు.
ఈనాడు
సత్యము,
ధర్మ,
ప్రేమ
శాంతి,
అహింస
అన్నింటిని
బోధిస్తూ
వస్తున్నారు.
సమ్యక్
దృష్టితోనే
శాంతిస్థాపన
సాధ్యము.
ప్రేమ
స్వరూపులారా!
ఈనాడు
New
Years
Day.
ఏమిటి
ఈ
new
year
అందరికి
క్రొత్త
సంవత్సరము
ఉంటుంది.
కొత్త
సంవత్సరము.
Year
ను
సంస్కృతములో
సంవత్సరము
అంటారు.
భగవంతునికి
సంవత్సరుడని
పేరు.
కొత్త
సంవత్సరము
కాదు,
భగవత్స్వరూపముగా
భావించుకోవాలి.
New
divinity.
ఆ
divinity
ని
మనం
వదలి
ఈ
కొత్త
సంవత్సరమనుకొని
ఎన్ని
అలంకారాలు,
ఎన్ని
పిండివంటలు
ఎన్ని
చేసినా
యిది
new
year
కాదు.
కేవలం
తినుటకు
నూతన
సంవత్సరము
రాలేదు.
15
▾
Meaning
Keep
New
ideal
తీసుకొని
రావాలి.
లోకములో
ఎంత
మంది
ఎన్ని
సాధనలు
చేశారు.
వారంతా
ఏమి
శాంతిని
పొందారు.
మనము
యీనాడు
శాంతిని
పొందటానికి
ప్రయత్నము
చేయాలి.
శాంతి
మనలో
లేనప్పుడు
ఎన్ని
ప్రయత్నములు
చేసినా
ఏమి
ప్రయోజనం?
కాబట్టి
శాంతి
మనకు
చక్కని
దృష్టితో
వస్తుంది.
అదియే
సమ్యక్
దృష్టి,
ఆ
దృష్టిలో
నున్న
పవిత్రత
మరిదేనిలోను
ప్రాప్తించదు.
ప్రేమ
స్వరూపులారా!
మానవుడు
చేసే
పనులు
5
రకములుగా
ఉంటాయి,
మొట్టమొదట
తను
చేసే
పనులు
ఆచరించి
చేస్తాడు.
ఇది
ఉత్తమము.
రెండవది
తన
చేతులతో
చేస్తాడు.
వీడు
మధ్యముడు,
మూడవవాడు
భుజబలముతో
చేస్తాడు.
భుజబలముతో
చేసే
పనులు
నీచమైనవి
అని
అన్నారు.
అహంకార
బలముతో
పనులు
చేస్తాడు
ఇంకొకడు
,
ఇవి
నీచాతి
నీచమైన
పనులు
అని
అన్నారు.
పైకి
ఆడంబరం
కోసం
చేస్తారు.
అది
మరింత
నీచమైనదని
అన్నారు.
చేసే
ప్రతి
పని
హృదయంతో
చేయాలి.
ఈ
హృదయంతో
చేసే
పనులే
సత్యమైనవి,
నిత్యమైనవి.
ఏ
ఆలోచనైనా
హృదయముతో
చేయి
-
అది
పవిత్రమైనదిగా
రూపొందుతుంది.
హృదయము
ఎప్పుడూ
పవిత్రమైనదే.
మధ్యలో
మేఘములు
ఎన్నో
కదులుతున్నాయి.
మేఘములు
ఆకాశమును
కరుచుకోలేదు.
ఆకాశము
మేఘముల
కన్నా
అతీతమై
వుంటున్నది.
మేఘములు
కదిలేవి,
శబ్దమునిచ్చేవి.
అన్నింటికంటే
ఉన్నతస్థాయిలో
నున్న
ఆకాశము
నిశ్శబ్దముగా
వుంది.
అందుకే
“ఆకాశం
గగనం
శూన్యం”
అన్నారు.
దానిలో
కూడా
కొంత
శబ్దము
ఉంటున్నది.
శబ్దము
ఉంది
కాబట్టి
అది
కూడా
దైవం
కాదన్నారు.
ఏది
దైవం.
ఈ
శబ్దమునకు
అతీతమైనది
దైవం
అన్నారు.
ఆకాశములో
కొంత
శబ్దము
ఉంది
కాబట్టి
పరమాత్ముడు
కాదు.
దీనికి
కూడా
అతీతమైపోవాలి.
మీరు
యిష్టము
వచ్చినట్లు
మాట్లాడకుండా,
మీలోనున్న
vibration
వ్యర్థము
చేసుకోకుండా,
మీలోనున్న
వాక్
శబ్దము
అపవిత్రము
గావించుకోకుండా
ఎప్పుడు
అంతర్ముఖంగా
భగవంతుడు
తెలియపరుస్తూంటాడు.
అందుకే
ఎవరితోను
ఎక్కువగా
మాట్లాడనక్కరలేదు.
అవసరము
వచ్చినవి
మాత్రమే
మాట్లాడాలి.
మీరందరూ
గమనిస్తున్నారో,
లేదో
నేను
ఇట్లాంటివి
చెప్పే
నిమిత్తమై
నేను
ఆచరించి
చేయాలని
జనవరి
1st
నుండి
నేను
ఎక్కువ
మాట్లాడటం
లేదు.
16
▾
Meaning
Keep
అవసరము
వచ్చినవి
మాట్లాడుతున్నాను.
కోరికల
రూములోకి
పిల్చినపుడు
వారికి
అవసరమైన
విషయాలు
మాత్రమే
చెబుతున్నాను.
ఊరికే
ఇష్టం
వచ్చినదంతా
మాట్లాడటానికి
ప్రయత్నించడం
లేదు.
ఎందుకోసం
నేను
చెప్పినది
ఆచరించినప్పుడే
మీరు
ఆచరణకొరకు
యోగ్యులౌతారు.
నేను
మీకు
చెప్పినప్పుడు
నేను
చేసి
చూపించాలి.
My
life
is
my
message.
నా
జీవితమే
నా
సందేశం.
నేను
చేసి
చూపించాలి.
కానీ
చాలామంది
అర్థము
చేసుకోలేరు.
అర్థం
చేసుకోలేకపోతే
నోరుమూసుకుని
కూర్చోవచ్చు.
కాని
అపార్థం
చేసుకోకూడదు.
అదే
పెద్ద
పాపం.
మీరు
ఈనాటి
నుండి
నేర్చుకోవలసింది
దృష్టిని
అదుపులో
పెట్టుకోవాలి.
మంచిని
మాత్రమే
చూడండి.
దుర్బినీ
యంత్రాలు
పెట్టుకొని
దూరంగా
వుండే
వాటిని
చూడకూడదు.
ఎందుకు
బైనక్యులర్స్
-
దూరంగా
వుండే
అనవసరమైన
వాటిని
చూడాలని
-
ఎందుకు
దానిని
చూడాలి?
ప్రయోజనం
ఏమిటి?
నీకు
అవసరమై
దగ్గరకు
వచ్చినవానిని
చూడు,
ఇదంతా
మూర్ఖమైన
విశ్వాసములుగా
ఉంటున్నాయి.
యిది
పెద్ద
అజ్ఞానము.
ఈవిధమైన
మార్గములో
మనం
ప్రవేశించకూడదు.
కన్నులు
పోయినవి,
కనిపించడంలేదు.
ఇది
కూడా
నా
మంచికోసమే
అనుకోవాలి.
It
is
good
for
me.
చెవుడు
వచ్చింది
అనుకోండి.
నాకేమీ
వినబడటం
లేదే
అని
విచారించనక్కరలేదు.
ఈ
ప్రపంచములో
వినదగినవి
ఏమి
వున్నాయి.
వారిని
వీరు,
వీరిని
వారు
తిట్టుకొనటమా
వినడం.
ఇవన్నీ
నాకు
వినిపించడం
లేదు.
It
is
good
for
me.
ఏమి
జరిగినా
అన్నీ
భగవంతుని
వరప్రసాదములుగా
భావించాలి.
అది
మన
జీవితానికి
మంచివిగానే
విశ్వసించాలి.
మలేషియా,
సింగపూర్,
హాంకాంగ్,
చైనావారు
అక్కడ
నుండి
యిక్కడకు
వచ్చారు.
చేయవలసింది
ఏమిటి?
ఇక్కడకు
వచ్చారు
వీరు
ఎంతో
భారంగా,
ఎన్నో
యోచనలతో,
ఎన్నో
బాధలతో,
ఎన్నో
చింతలతో
వచ్చారు.
ఇవన్నీ
ఇక్కడ
వదిలి
ఆనందమును
హృదయములో
నింపుకొని
పొండి.
పూర్వము
ఉండిన
దుర్భావములు,
దుశ్చింతలు
ఇక్కడ
ప్రశాంతి
నిలయంలో
వదిలిపెట్టండి.
ఈ
ప్రశాంతి
మీ
హృదయములో
నింపుకొని
పొండి.
అశాంతితో
వచ్చి
తిరిగి
అశాంతితో
వెళ్లి
పోకూడదు.
మానవునికి
ప్రశాంతి
చాలా
ప్రధానమైన
ప్రాణము.
కానీ
ఈనాడు
లోకములో
ప్రశాంతి
ఎక్కడా
చిక్కటం
లేదు.
ప్రపంచమంతా
వీధి
వీధి
వెతికి
చూడండి.
ఎక్కడకు
పోయినా
peace
లేదు
ఎక్కడకు
వెళ్లినా
pieces,
pieces.
17
▾
Meaning
Keep
ఈ
peace
ఇక్కడ
మాత్రమే
ఉన్నది.
దాన్ని
మీరు
అందుకొని
పొండి.
ఎందుకనగా
అనేకమంది
ఉత్తమ
భక్తులందరూ
ప్రవేశించి
జీవించిన
ప్రదేశమిది.
వారు
దివ్యమైన
భావములతో
జీవించిన
ప్రదేశమిది.
ఉత్తమ
జీవులు
జీవించిన
ప్రదేశమిది.
కనుక
ఆ
ఉత్తమ
భావాలంతా
మీ
హృదయాలలో
నింపుకోవాలి.
ఎవరేమైనా
అనుకోనీ.
మనం
లక్ష్యము
చేయనక్కరలేదు.
ఎవరో
అనుకుంటున్నారని
మనం
కేర్
చేస్తే
మనగతి
ఏమవుతుంది.
మన
గమ్యము
మనం
సాధించాలి.
మొట్టమొదట
self
confidence
develop
చేసుకోవాలి.
ఆ
self
confidence
ఉన్నప్పుడు
నీలో
ఆనందము
ప్రాప్తిస్తుంది.
కష్టములు
వస్తుంటాయి.
పోతుంటాయి.
అన్నీ
కదిలిపోయే
మేఘాల
లాంటివి.
దేనికి
బాధపడకూడదు.
భగవంతుని
స్మరిస్తూ
ఉండాలి.
అదే
జీవితమునకు
ప్రధానమైనది.
దానికి
మించినది
జగత్తులో
మరొకటి
లేనేలేదు.
శాంతికి
మించినది
లేదు.
ఆ
శాంతి
లేనివానికి
ఏముండి
ప్రయోజనం
ఏమిటి?
ఇవన్నీ
భౌతికమైన,
ప్రాకృతికమైన
లక్ష్యాలు.
అనిత్యం,
అసుఖమైనవి
కాక
నిత్య
సత్యమైన
దైవత్వమును
చింతించుతూ
రావాలి.
దైవ
ప్రేమను
పొందాలి.
దైవ
ప్రేమ
కంటె
మించినది
మరొకటి
లేదు.
Love
is
God.
Live
in
love.
అదే
నీ
జీవితము.
The
best
way
to
love
god
is
to
Love
all
and
serve
all.
అందరూ
దైవస్వరూపులే,
అందరినీ
ప్రేమించండి.
వారు
నిన్ను
ప్రేమించినా
ప్రేమించక
పోయినా
నీవు
మాత్రం
వారిని
ప్రేమించు.
కారణం
ఏమిటి?
అతనిలో
కూడా
దైవత్వం
ఉన్నది.
దైవము
లేని
ప్రదేశము
లేదు.
దైవము
లేని
దేహమే
లేదు.
దైవము
లేని
ప్రాణము
లేదు.
“సర్వతః
పాణి
పాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం”
కనుక
దైవమును
ప్రేమిస్తుంటే
పర్వతములవలె
వచ్చిన
బాధలు
కూడా
మంచు
వలె
మాయమైపోతాయి.
మీరందరు
చెడ్డ
దృష్టిని
దూరం
చేసుకొని,
చెడ్డ
వాక్కును
దూరం
చేసుకొని
చెడ్డ
సంకల్పములను
దూరం
చేసుకొని,
చెడ్డ
కర్మలు
దూరం
చేసుకొని
మంచి
జీవితం
పొందటానికి
తగిన
కృషి
చేయాలి.
మంచి
జీవితాన్ని
అనుభవిస్తున్నానని
అనుకుంటారు
కొంతమంది.
ఏమిటి
జీవితము
కావలసినంత
ధనముంది,
భవనములున్నాయి.
వంటవారున్నారు.
వడ్డించే
సర్వర్సు
ఉన్నారు.
నాకే
కష్టము
లేదు.
సుఖంగా
ఉన్నాను
అనుకుంటారు.
ఇదా
సుఖము?
భౌతిక
సుఖము.
Happiness
is
union
with
God.
18
▾
Meaning
Keep
దైవముతో
కూడిన
జీవితమే
నిజమైన
ఆనందము,
గానీ
సౌఖ్యములతో,
సుఖములతో
కూడినది
కాదు
నిజమైన
ఆనందము.
ఈ
worldly
pressures
ఎంత
పెరుగుతున్నాయో
అంత
అశాంతులు
కూడా
పెరుగుతున్నాయి.
అది
నీవు
గుర్తించటం
లేదు
కానీ
వెనుక
పెనుభూతముల
వలె
వెంటాడుతున్నాది
అశాంతి.
ప్రేమను
పెంచుకోండి.
సత్యమును
వచించండి.
ధర్మాన్ని
ఆచరించండి.
శాంతిని
పొందండి.
ఇదియే
స్వామి
ప్రత్యేక
ఆశీర్వాదము
యీనాడు.
మీరు
ఎక్కడకిపోయినా
శాంతముగా
మాట్లాడాలి.
Peacefully
and
sweetly.
శాంతంగా,
మధురంగా
మాట్లాడినపుడు
మీలో
మంచిభావాలు
అభివృద్ధి
అవుతుంటాయి.
అపుడు
సమాజమే
నిన్ను
మంచివాడుగా
భావిస్తుంది.
ఆ
విధమైన
మంచి
పేరు
పొందండి.
ఇదే
నిజమైన,
విలువైన,
ప్రధానమైన
నూతన
సంవత్సర
కానుక.
మీరందరూ
ఈ
టైగర్
మ్యాప్
ఇచ్చి,
నాకేదో
కానుక
ఇచ్చినట్టుగా
భావిస్తున్నారు.
అది
కాదు
కానుక.
నీలో
టైగర్
గుణములు
నాకివ్వండి.
అది
క్రూరమృగము.
దాని
qualities
నాకిచ్చి
వేయండి.
పవిత్రమైన
గోవు
జీవితము
మీరు
పొందండి.
గోవు
సాత్వికమైనది.
ఎట్లా,
మనం
వేసే
గడ్డిని
తిని
పవిత్ర
క్షీరమును
మనకందిస్తున్నాది.
దీనికంటే
సాత్వికము
మరొకటుందా?
చెత్తను
తిని
మంచినందించేదే
గోవు
లక్షణము.
అట్టి
మహత్తరమైన
గోవు
పేరు
భూమికి
పెట్టారు
భూమాత
అన్నను,
గోమాత
అన్నను
గోవే.
ఇలాంటి
పవిత్ర
భావాలు
మీరు
తీసుకుపోవాలి.
ప్రేమ
స్వరూపులారా!
మీరు
ఎంతో
దూరము
నుండి,
ఎన్నో
శ్రమలకోర్చి,
ఎన్నో
బాధలకోర్చి
యిక్కడ
చేరారు.
యిక్కడ
నుండి
మీరు
ఆనందమయమైన
హృదయాన్ని
తీసుకొని
పోయి,
తిరిగి
మీ
మీ
గ్రామములలో
ప్రచారము
చేసి
సర్వులకు
పంచుతూ
రావాలి.
మీరు
అనుభవించిన
ఆనందము
మీరు
మాత్రమే
అనుభవించకూడదు.
అది
స్వార్థమైపోతుంది.
పదిమందికి
పంచినప్పుడే
అది
నిస్వార్థమైపోతుంది.
నేను
విన్నాను
కదాయని
ఆనందమును
స్వార్థంతో
అనుభవించకూడదు.
నేను
అప్పుడప్పుడు
చెబుతాను
Fish
is
better
than
selfish
అని.
Fish
ఎట్లా
better.
Fish
నీటిలోపోయి
నీటిలోనున్న
మాలిన్యము
తినేస్తుంది.
నీటిని
పరిశుద్ధపరుస్తుంది.
కానీ
యీనాటి
మానవుడు
సమాజములో
ప్రవేశిస్తున్నాడు.
తన
చెడునంతా
సమాజమునకందిస్తున్నాడు.
19
▾
Meaning
Keep
సమాజమును
కూడా
మాలిన్యము
చేస్తున్నాడు.
అది
చేయకూడదు.
నిస్వార్థమైన
ప్రేమతో
మీరు
అభివృద్ధి
పొందాలి.
ఈనాడు
మనం
నేర్చుకోవలసింది
selfless
love.
Selfish
love
కాదు.
ఈ
selfless
love
తో
జీవితాన్ని
గడుపుకున్నప్పుడు
అదే
నిర్వాణమైన
పవిత్ర
స్థితి
పొందుతుంది.
నిరంతరం
మీరు
భజనలు
చేశారు.
ఆ
భజనలు
వింటుంటే
ఎంతో
హృదయానికి
ఆనందమవుతుంది.
ఆ
భజనలో
నున్న
ఆనందము
మరొకదానిలో
ప్రాప్తించదు.
ఇది
సమిష్టి
భజన.
అనేకమంది
ఏకమై
పాడే
భజన.
ఇందులో
స్వార్థం
అనేది
లేదు.
ఈ
ఆనందముతో
వచ్చిన
వైబ్రేషను
జగత్తునంతా
పరిశుద్ధపరుస్తుంది.
కొంత
మంది
భజనలో
కూర్చుంటారు.
కానీ
నోరుకూడా
కదపరు.
నోరిచ్చినందుకు
భగవన్నామాన్ని
చెప్పండి.
నీవు
చెప్పటానికి
వీలుకాకపోతే
ఎవరో
చెబుతుంటే
నీవు
వంత
పలుకు,
అదియే
నిజమైన
భజన.
Previous
←
Satya is heaven
Next
Tārakaṃ and mārakaṃ
→