Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2000 · Prema and Service Are Like Wings That Carry Us to the Heights
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Prema and Service Are Like Wings That Carry Us to the Heights
20 November 2000, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమ,
సేవలు
రెండు
రెక్కలు
మనకు
పక్ష
బలమున
పక్షులు
ఎగురునట్లు
ఈ
విహంగమార్గమును
అనుసరించి
చేరవలయు
గమ్యంబు
శీఘ్రముగను
ప్రేమస్వరూపులారా!
సేవ
అనగా
ఏమిటో
మీరు
తెలుసుకోవటం
లేదు.
మానవుడు
నిస్వార్థ
సేవ
చేయుటకే
జన్మించాడుగాని,
స్వార్థంతో
జీవితాన్ని
గడపటానికి
కాదు.
నిస్వార్థసేవయే
మానవ
ఏకత్వాన్ని
నిరూపిస్తుంది.
ఏకత్వాన్ని
గుర్తించడంద్వారానే
మానవత్వం
దివ్యత్వాన్ని
పొందుతుంది.
ఎవరికో
దిక్కులేనివారికి,
శక్తిలేనివారికి,
బలహీనులకు
సహాయపడుటయే
సేవ
అని
మీరు
భావిస్తున్నారు.
అయితే,
అచట
ఎవరో
పరాయివారికి
మీరు
సేవ
చేస్తున్నట్లు
భావించటం
పెద్ద
పొరపాటు.
ఎవరికి
సేవ
చేసినా
మీకు
మీరు
చేసుకున్నట్లే!
ఎందుకంటే,
అందరియందున్నది
ఒకే
ఆత్మ,
ఒకే
ప్రేమ.
భావములందే
భేదములు
గోచరిస్తున్నాయిగాని,
వ్యక్తులయందు
ఏమాత్రమూ
భేదము
లేదు.
కనుక,
అందరియందున్న
దైవత్వం
ఒక్కటే
అన్న
సత్యాన్ని
గుర్తించి
సేవలు
సల్పాలి.
మీరు
సమాజానికి
సేవ
చేయకపోతే
నష్టం
మీకేగాని,
సమాజానికి
కాదు.
మీరు
చేయకపోతే
మరొకరు
చేస్తారు.
కొంతమంది
తామేదో
గొప్ప
సేవలు
చేస్తున్నామని
అహంకారపడుతుంటారు.
అహంకారంతో
చేసేది
సేవ
అనిపించుకోదు.
సేవ
మొట్టమొదట
అహంకారాన్ని
అణగద్రొక్కుతుంది.
అహంకారానికి
కారణం
ఏమిటి?
అమితమైన
దేహాభిమానంతో
కూడినవాడే
అహంకారాన్ని
పెంచుకుంటాడు.
దేహాభిమానాన్ని
నిర్మూలించుకున్నప్పుడు
అహంకారం
దగ్గరకి
రావటానికికూడా
అవకాశం
ఉండదు.
అహంకారం
నిర్మూలమైనప్పుడే
ఏకాత్మభావం
అంకురిస్తుంది.
2
▾
Meaning
Keep
ఏకాత్మభావంతో
చేసే
సేవయే
నిజమైన
సేవ
మీరు
ఎవరికి
సేవ
చేసినా
ఆత్మస్వరూపుడైన
భగవంతుడినే
సేవిస్తున్నామనే
భావమును
కల్గియుండాలి.
దేహంలోని
అంగములు
వేరువేరుగా
ఉన్నాయి.
చేతులు,
కన్నులు,
ముక్కు,
నోరు-ఇవన్నీ
దేహముయొక్క
అంగములు.
దేహం
సమాజానికి
అంగము.
సమాజం
మానవత్వానికి
అంగము.
మానవత్వం
ప్రకృతికి
అంగము.
ప్రకృతి
పరమాత్మకు
అంగము.
కనుక,
ఈ
విశాలమైన
ప్రకృతిని
చూసి
ఇది
భగవంతునికంటే
వేరని
భావించకూడదు.
‘అన్నిటి
యందున్నది
దివ్యత్వమొక్కటే’
అన్న
సత్యాన్ని
తెలుసుకోవాలి.
బల్బులు,
వాటి
రంగులు,
వాటేజీలు
వేరువేరుగా
ఉండవచ్చును
గాని,
వాటియందున్న
కరెంటు
ఒక్కటే
కదా!
అదేరీతిగా,
వ్యక్తులయొక్క
రూపనామములు,
భావములు
వేరువేరుగా
ఉండవచ్చునుగాని,
అందరియందున్న
ఆత్మతత్త్వం
ఒక్కటే.
ఇట్టి
ఏకాత్మభావంతో
సమాజసేవలో
పాల్గొనాలి.
అప్పుడే
అది
నిజమైన
సేవగా
రూపొందుతుంది.
సేవచేసేవారు
వేరు,
చేయించుకునేవారు
వేరు
అనే
భేదభావాన్ని
పెట్టుకోకూడదు.
ఇలాంటి
భేదభావం
వల్లనే
ద్వేషము,
అసూయ
మొదలైన
దుర్గుణాలు
పెరిగిపోతున్నాయి.
కామక్రోధాది
అరిషడ్వర్గములు
తలనుండి
ఆవిర్భవిస్తాయి;
దయ,
ప్రేమ,
సహనము
ఇత్యాది
సద్గుణములు
హృదయమునుండి
ఆవిర్భవిస్తాయి.
తల
భిన్నత్వాన్ని
చూపుతుంది,
హృదయం
ఏకత్వాన్ని
నిరూపిస్తుంది.
కనుక
తల
ప్రవృత్తికి,
హృదయం
నివృత్తికి
సంబంధించినవి.
“నేను
మానవుడను”
అని
మీరు
భావిస్తున్నారు
కదా!
‘మానవ’
అనే
పదముయొక్క
సరియైన
అర్థాన్ని
గుర్తించండి.
అప్పుడింక
భేదములకు
ఏమాత్రమూ
అవకాశముండదు.
మానవుడనగా
ఎవరు?
శరీరము
కాదు;
ఆకాశాది
పంచభూతములకు
మాస్టర్
అయినటువంటి
ఆత్మకే
‘మానవ’
అని
పేరు.
ప్రాచీన
ఋషులు
పంచభూతములను
తమ
అధీనంలో
ఉంచుకొని
శాంతిభద్రతలను
అనుభవించారు.
పంచభూతములను
ఆధీనం
గావించుకున్నప్పుడే
మానవుడు
ఆత్మస్వరూపుడుగా
వెలుగొందగలడు.
మానవత్వంలో
నాల్గు
స్థాయిలు
మానవత్వంలో
నాల్గు
విధములైన
స్థాయిలున్నాయి.
మొదటిది
Super
mind
(సూపర్
మైండ్),
రెండవది
Higher
Mind
హైయ్యర్
మైండ్.
మూడవది
Illumination
Mind
(ఇల్యుమినేషన్
మైండ్),
నాల్గవది
Over
Mind
(వోవర్మైండ్).
ఈ
ఓవర్మైండ్
స్థాయికి
చేరుకున్నప్పుడే
మానవత్వం
పరిపూర్ణస్థితిని
పొందుతుంది.
3
▾
Meaning
Keep
ఓవర్మైండ్కి
ముందుండేది
హైయర్మైండ్.
ఇది
పంచభూతములకు
అతీతమైన
స్థితి.
ఇల్యుమినేషన్
మైండ్
జ్ఞానశక్తికి
సంబంధించినది.
దేహము
స్థూలము.
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము
ఇవన్నీ
చేరినది
సూక్ష్మదేహము.
కష్టసుఖములను
అనుభవించేది
ఈ
సూక్ష్మదేహమే.
ఇల్యుమినేషన్
మైండ్
అనేది
కారణదేహము.
ఈ
కారణదేహమునందు
ఏ
రూపముగాని,
ఏ
నామముగాని,
ఏ
అవస్థలుగాని
మనకు
తెలియవు.
ఇందులో
కామక్రోధాది
అరిషడ్వర్గములే
మాత్రం
ఉండవు.
ప్రాకృతమైన
ఆలోచనలను
అరికట్టుకున్నప్పుడే
మానవుడు
ఇల్యుమినేషన్
మైండ్‌లో
ప్రవేశించుటకు
వీలవుతుంది.
ఈ
ఆలోచనలను
అరికట్టు
కోవాలనుకుంటే
మొదట
సూపర్
మైండ్‌లో
ప్రవేశించాలి.
సూపర్‌మైండ్
అంటే
ఏమిటి?
అదే
Superior
Mind
(సుపీరియర్
మైండ్)
అనగా
ప్రాకృతమైన
మనస్సుకు
అతీతమైనది.
సూపర్
మైండ్‌లో
ప్రవేశించాలంటే,
Superior
Love
ను
పెంచుకోవాలి.
అనగా
వాంఛారహితమైన
ప్రేమను
పెంచుకోవాలి.
కనుకనే
Love
is
God
Live
in
love
(ప్రేమయే
దైవం.
ప్రేమలో
జీవించండి)
అన్నాను.
మీ
దినచర్యను
ప్రేమతో
ప్రారంభించండి,
ప్రేమతో
నింపండి,
ప్రేమతో
అంత్యం
గావించండి.
ఇదే
దైవసన్నిధికి
రాజమార్గం.
ఇల్యుమినేషన్
మైండ్
ప్రభావం
ఇల్యుమినేషన్
మైండ్
స్థాయికి
చేరుకున్నవారి
హృదయం
పవిత్రమైన
భావాలతో
నిండియుంటుంది.
వారు
ఏది
తలచినా,
ఏది
మాట్లాడినా,
ఏది
చేసినా
అంతా
భగవన్మయంగా
ఉంటుంది.
అది
చాలా
శక్తివంతమైన
కరెంటుగా
రూపొందుతుంది.
అలాంటివారికి
గోర్లయందు,
తల
వెంట్రుకలయందుకూడా
కరెంటు
ప్రసరిస్తూ
ఉంటుంది.
ప్రాకృతమైన
భావంతో
జీవితాన్ని
గడిపేవారికి
గోర్లను
కత్తిరించినప్పుడు
ఏమీబాధ
కలుగదు
కాని,
ఇల్యూమినేషన్
మైండ్
స్థాయికి
చేరుకున్న
వారికి
గోర్లను
కత్తిరిస్తే
‘షాక్’
కొడుతుంది.
కనుకనే
ప్రాచీన
ఋషులు
గోర్లను
బాగా
పెంచుకునేవారు.
ఆ
కాలంలో
‘నెయిల్
కట్టర్లు’
(గోర్లను
కత్తిరించే
పరికరాలు)
లేకపోవటమే
దీనికి
కారణమని
ఆధునిక
యువకులు
పెడర్థం
కల్పించవచ్చు.
‘నెయిల్
కట్టర్’
లేకపోయినా
ఒక
గోరుతో
మరొక
గోరును
తీసివేయవచ్చు
కదా?
కాని,
ఇల్యుమినేషన్
మైండ్
స్థాయిలో
ఉన్నవారికి
గోర్లను,
తలవెంట్రుకలను
కత్తిరిస్తే
‘షాక్’
కొడుతుంది.
4
▾
Meaning
Keep
సామాన్యమైన
మానవుల
దేహంలోకూడా
కరెంటు
ప్రసరిస్తూనే
ఉంటున్నది.
గుండె
పంపుకొడుతూ
ఉండటంచేత
ఈ
కరెంటు
దేహంలో
సర్వత్రా
ప్రాకుతూ
ఉంటుంది.
మన
దేహంలో
చిన్న,
పెద్ద
నరాలను
ఒకదానికొకటి
కలుపుకుంటూ
పోతే
అంతా
కలిపి
12
వేల
మైళ్ళ
దూరమౌతుంది.
కనుక,
గుండె
ఒక్కతూరి
రక్తాన్ని
పంపుకొట్టినప్పుడు
అది
దేహంలో
12
వేల
మైళ్ళ
దూరం
ప్రయాణం
చేస్తుందన్నమాట.
దేహంలోని
ఏ
భాగమునకైనా
మనం
విశ్రాంతి
ఇవ్వవచ్చును
గాని
గుండెకు
విశ్రాంతి
ఇవ్వగలమా?
గుండెకు
విశ్రాంతి
లేదు.
మనం
నడుస్తున్నా,
నిద్రపోతున్నా
అది
తనపని
తాను
చేస్తూనే
ఉంటుంది.
ఏ
డాక్టరుకూ
ఏ
సైంటిస్టుకూ,
ఏ
ఇంజనీరుకూ
ఇది
అర్థం
కాదు.
ఇంతేకాదు,
మన
కన్ను
చూడటానికి
చిన్నగా
ఉందిగాని,
ఇందులో
1.3
లక్షల
కాంతి
కిరణాలుంటున్నాయి.
వీటిని
కంటిలో
ఎవరు
చేర్చారు?
ఇదంతా
భగవంతుని
సృష్టియే!
సృష్టిలో
ఇలాంటి
చిత్రవిచిత్రమైనవి
ఎన్నో
ఉన్నాయి.
దివ్యత్వం
అంతర్దృష్టికే
గోచరమవుతుంది
సర్వమూ
మానవునియందే
ఇమిడియున్నది.
కన్నులు
తెరిచినప్పుడు
ఇన్ని
వేలమంది
కనిపిస్తారు
గాని,
దృష్టిని
అంతర్ముఖం
చేసుకున్నప్పుడు
అంతా
శూన్యమైపోతుంది.
కన్ను
నిచ్చినది
అంతర్దృష్టిని
అభివృద్ధిపరచుకోవటానికే
గాని,
బహిర్దృష్టిని
పెంచుకోవటానికి
కాదు.
మీరు
దేవుణ్ణి
దర్శించాలని
దేవాలయమునకు
వెళుతున్నారు.
కాని,
దేవుని
విగ్రహం
ఎదురుగా
నిలబడి
కన్నులు
మూసుకుంటున్నారు.
దీని
అంతరార్థమేమిటి?
దైవాన్ని
చూడవలసింది
చర్మచక్షువులతో
కాదు,
జ్ఞానచక్షువుతో
చూడాలి.
దృష్టిని
అంతర్ముఖం
చేసుకున్నప్పుడే
జ్ఞానచక్షువు
తెరుచుకుంటుంది.
బయటి
దృశ్యమంతా
అంతర్భావముయొక్క
ప్రతిబింబమే!
కాని,
మీరు
ప్రతిబింబమునే
ఆశిస్తున్నారు;
బింబమును
చూడటం
లేదు.
భగవత్ప్రేమను
పెంచుకున్నప్పుడే
బంధవిముక్తి
తెల్లవారి
లేచిన
తక్షణమే
మీ
పనులనుకూడా
చింతించకుండా
నిర్మలమైన
ప్రేమతో
లేవాలి.
కాని,
ఈనాటి
పిల్లలలో
ఇట్టి
పవిత్రమైన
భావం
కరువైంది.
దీనికి
కారణం
వారి
తల్లిదండ్రులే!
తల్లిదండ్రులు
తిట్టుకుంటూ
లేస్తే
పిల్లలు
కొట్టుకుంటూ
లేస్తారు.
కాబట్టి
మొట్టమొదట
తల్లిదండ్రులు
పిల్లలకు
సరియైన
ఆదర్శాన్ని
అందించాలి.
తల్లి
గర్భమునుండి
పుట్టినప్పుడు
మానవునికి
ఎట్టి
తలంపులూ,
ఎట్టి
వాంఛలూ
ఉండవు.
కాని,
వయస్సు
వచ్చే
కొలది
కోరికలు
అభివృద్ధి
అవుతాయి.
5
▾
Meaning
Keep
Also in his talks
(9)
21 June 1989
Live as an Ideal
23 May 1990
Road to Divinity
24 May 1990
Hold the Reins
25 May 1990
Vagaries of the Mind
27 February 1995
Every atom is the form of God
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
15 April 2003
Ancient traditions are the steps to rising higher
15 January 2008
Revere your mother as God, your father as God
18 June 2008
Divine Message
కోరికలు
పెరిగేకొలది
బంధనలో
పడిపోతాడు.
తాను
బంధవిముక్తుడు
కావాలంటే
మనస్సును
భగవత్ప్రేమతో
నింపుకోవాలి.
అన్ని
చింతలనూ
మరచిపోయి
భగవచ్చింతన
చేయాలి.
దీనికి
అభ్యాసం
అవసరం.
శ్రేయోహి
జ్ఞాన
మభ్యాసాత్
జ్ఞానాద్ధ్యానం
విశిష్యతే
ధ్యానా
త్కర్మఫలత్యాగ
స్త్యాగా
చ్ఛాన్తి
రనన్తరమ్
నడవటం,
మాట్లాడటం,
తినటం,
చదవటం,
వ్రాయటం
మొదలైనవన్నీ
మీరు
అభ్యాసంవల్లనే
నేర్చుకోగల్గుతున్నారుకదా!
అదేవిధంగా,
మీరు
ఆధ్యాత్మికమును
కూడా
ప్రేమతో
అభ్యసించాలి.
ఇల్యుమినేషన్
మైండ్
అనగా
సమాధి
స్థితి
దినదినమునకూ
మీరు
ప్రేమను
పెంచుకుంటూ
పోవాలి.
ఈ
దినము
మీ
ప్రేమను
పదిమందికి
పంచినారంటే,
రేపు
ఇరవైమందికి
పంచండి.
ఈవిధంగా
అభ్యాసం
చేసినప్పుడే
ఏకాత్మభావం
ఏర్పడుతుంది;
విశ్వమంతా
ఒక
కుటుంబంగా
మారుతుంది.
కనుక
ప్రేమను
పెంచుకొని,
బహిర్ముఖమైన
ఆలోచనలను
అరికట్టుకొని,
క్రమక్రమేణ
ఇల్యుమినేషన్
మైండ్లోకి
ప్రవేశించాలి.
కరెంటు
ఇనుమునుకూడా
కరిగిస్తుంది.
అదేరీతిగా
ఇల్యుమినేషన్
మైండ్
మంచిచెడ్డలనే
ద్వంద్వభావమును
భస్మం
చేస్తుంది.
దీనిని
ఆధ్యాత్మిక
పరిభాషలో
‘సమాధిస్థితి’
అన్నారు.
సమాధి
అనగా
‘సమ
-
ధి’
(సమబుద్ధి).
ఇది
మంచి
చెడ్డలకు
అతీతమైన
ఏకాత్మభావాన్ని
అభివృద్ధిగావిస్తుంది.
కనుక,
మీరిప్పుడుచేయవలసిందేమిటంటే,
ప్రేమతో
అందరికీ
సేవ
చేయండి.
ఎవరిని
సేవించినా
భగవంతుణ్ణి
సేవించినట్లు
భావించండి.
“నేను
పెద్దవాడను,
వాడు
చిన్నవాడు,
నేను
శ్రీమంతుడను,
వాడు
బీదవాడు.
వానికి
నేనెట్లా
సేవ
చేసేది?”
అనే
భేదభావమునకు
చోటివ్వకండి.
ఎవడు
శ్రీమంతుడు?
ఎవడు
బీదవాడు?
తృప్తి
గలవాడే
శ్రీమంతుడు;
మితిమీరిన
వాంఛలు
గలవాడే
బీదవాడు.
కాబట్టి
కోరికలనే
లగేజిని
ఎంత
తగ్గించుకుంటే
అంత
సుఖాన్ని
అనుభవిస్తారు.
కోరికలు
ఎంత
తగ్గుతాయో
మనోశక్తి
అంత
అభివృద్ధి
అవుతుంది.
ఓవర్మైండ్
అనగా
అమనస్క
స్థితి
అన్నింటికీ
చావుందిగాని,
మనస్సుకు
చావు
లేదు.
అదే
అన్నింటికీ
మూలం.
కాబట్టి
మనస్సులో
ఉత్తమమైన,
పవిత్రమైన,
నిర్మలమైన,
నిస్వార్థమైన
భావాలను
పెంచుకోండి.
6
▾
Meaning
Keep
అప్పుడే
మీరు
ఇల్యుమినేషన్
మైండ్
స్థాయికి
చేరుకొని,
క్రమ
క్రమేణ
ఓవర్
మైండ్‌లో
ప్రవేశిస్తారు.
దీనికే
వేదాంత
పరిభాషలో
‘అమనస్కము’
అని
పేరు
పెట్టారు.
అమనస్కము
అనగా
మనస్సు
లేని
స్థితి.
ఇలాంటి
స్థితికి
మనం
చేరుకోవాలి.
మనస్సు
లేని
స్థితిలో
ఒక్క
ఆత్మ
మాత్రమే
మనకు
కనిపిస్తుంది.
ఆత్మ
అనగా
ఏమిటి?
అదే
‘సూపర్
కాన్షియస్నెస్’.
కనుక
మనయందు
ఎంతటి
ఉన్నతస్థాయికైనా
చేరుకునే
శక్తి
ఉన్నది.
“సాధనమున
పనులు
సమకూరు
ధరలోన.”
సాధన
చేస్తే
దేనినైనా
సాధించవచ్చు.
నడుస్తూ
ఉంటే
చిన్న
చీమ
అయినా
ఎంతో
దూరం
ప్రయాణం
చేయగలదు.
కాని,
ప్రయత్నం
చేయకపోతే
పెద్ద
రెక్కలు
కల్గిన
గరుడపక్షి
కూడా
ఒక్క
ఇంచైనా
ముందుకు
పోలేదు.
ప్రేమ,
సేవ
అనే
రెండు
రెక్కలను
మనం
ఆధారం
చేసుకుంటే
మనం
ఎంతదూరమైనా,
ఎంత
ఉన్నతస్థాయికైనా
పోవచ్చును.
ప్రాచీన
కాలమునుండి
ఎంతోమంది
మహనీయులు
నిర్మలమైన,
నిస్వార్థమైన
ప్రేమతో,
నిరహంకారంగా
సేవలు
చేసి
ఉన్నతస్థితిని
పొందారు.
సత్యాన్ని
గుర్తించుకుంటే
సాధనలతో
పనిలేదు
ప్రాచీన
ఋషులు
ధ్యానంలో
కూర్చున్నారంటే
వారి
దేహం
ఎన్ని
దినములైనా
కదిలేది
కాదు.
కాని,
ఈనాటి
మానవుడు
కొన్ని
నిమిషములైనా
స్థిరంగా
కూర్చోలేకపోతున్నాడు.
రక్తప్రసరణవల్లనే
దేహం
కదులుతున్నదనీ,
రక్తప్రసరణ
ఆగిపోతే
దేహం
నిర్జీవమౌతుందని
మీరు
భావిస్తున్నారు.
అయితే
ఇల్యుమినేషన్
మైండ్
స్థాయిలో
రక్తప్రసరణ
ఆగిపోయి
‘సూపర్‌బ్లడ్’
అనేది
దేహాన్ని
కదిలిస్తుంది.
దీనినే
ఉపనిషత్తులు
‘రసోవైసః’
అన్నాయి.
అదియే
దివ్యశక్తి.
పానకంలో
పంచదారవలె
అది
దేహంలో
సర్వత్ర
ఉన్నది.
దివ్యశక్తి
తనయందే
ఉన్నప్పటికీ
తెలుసుకోలేక
మానవుడు
తాను
బలహీనుడనని
భావిస్తున్నాడు.
భూమిలో
ఏఏ
శక్తులైతే
ఉన్నాయో
అవన్నీ
మానవునియందే
ఉన్నాయి.
సర్వమూ
తనయందే
ఉన్నదనే
సత్యాన్ని
గుర్తించిన
వ్యక్తి
ఎంతైనా
ఆనందాన్ని
అనుభవిస్తాడు.
ఆధ్యాత్మిక
మార్గంలో
ఇలాంటి
సూక్ష్మమైన
రహస్యాలు
ఎన్నో
ఉన్నాయి.
వాటిని
తెలుసుకోకుండా
మానవుడు
ఏవేవో
సాధనలు
చేస్తున్నాడు.
సత్యాన్ని
గుర్తించుకుంటే
ఏ
సాధనలూ
చేయనక్కర్లేదు.
తపస్సువలనగాని,
తీర్థయాత్రల
వలనగాని,
సంసార
సాగరాన్ని
తరించుటకు
సాధ్యం
కాదు.
సజ్జనుల
సేవ
ఒక్కటే
తరుణోపాయం.
7
▾
Meaning
Keep
ఒక్క
ప్రేమద్వారానే
మనస్సును
అరికట్టవచ్చు
కొంతమంది
“స్వామీ!
నేను
ధ్యానం
చేయలేకపోతున్నాను”
అంటుంటారు.
మనస్సు
నిల్పటానికి
ధ్యానంకాదు,
కావలసింది.
ధ్యానం
పేరుతో
దేహాన్ని
కట్టివేస్తున్నారుగాని,
మనస్సును
కట్టివేస్తున్నారా?
మొట్టమొదట
మనస్సును
కంట్రోలు
చేయాలి.
ఎట్లా
కంట్రోలౌతుంది?
ఒక్క
ప్రేమద్వారానే
కంట్రోలౌతుంది.
ప్రేమ
ఉన్నప్పుడు
మీలో
క్రోధం
రాదు,
ద్వేషం
రాదు,
ఎలాంటి
అనుమానాలు
రావు;
మిమ్మల్ని
ద్వేషించేవారినికూడా
మీరు
ప్రేమిస్తారు.
అప్పుడు
ప్రేమ,
ద్వేషము
అనేవి
ఉండవు.
అది
ద్వంద్వాతీతమైన
స్థితి.
అదియే
ఆనందమయ
జీవితం
(Blissful
Life)
అన్నారు.
మానవునిలో
అన్నమయ,
ప్రాణమయ,
మనోమయ,
విజ్ఞానమయ,
ఆనందమయ
కోశములనే
పంచకోశములున్నవి.
ఈనాటి
మానవుడు
అన్నమయ
కోశమునుండి
మనోమయ
కోశమువరకే
ప్రయాణం
చేస్తున్నాడు.
దాని
తరువాత
విజ్ఞానమయ,
ఆనందమయ
కోశములకు
ఎలా
ప్రయాణించాలో
తనకు
తెలియటం
లేదు.
విజ్ఞానమనగా
ఈనాటి
సైన్సు
కాదు.
సైన్సుకు,
విజ్ఞానమునకు
చాలా
తేడా
ఉన్నది.
సైన్సు
మనోశక్తిచేత,
యంత్రశక్తిచేత
అభివృద్ధి
అవుతున్నది.
కాని,
విజ్ఞానము
వీటికి
అతీతమైనది.
అది
కేవలం
ఆత్మశక్తినుండి
ఆవిర్భవిస్తుంది.
కృష్ణపరమాత్ముని
ఆదర్శం
పాండవులు
రాజసూయ
యాగమును
ప్రారంభించేముందు
కృష్ణుడు
ధర్మజుని
వద్దకు
వెళ్ళి
“ఏమి
బావా!
అన్ని
ఏర్పాట్లూ
పూర్తి
అయినవా?”
అని
ప్రశ్నించాడు.
ధర్మజుడు
“కృష్ణా!
అన్ని
ఏర్పాట్లూ
పూర్తి
అయినవి.
ఎవరెవరు
ఏఏ
పని
చేయాలో
నిర్ణయించాను”
అన్నాడు.
“అయితే
నాకు
ఏ
సేవ
ఇస్తావు?”
అని
అడిగాడు
కృష్ణుడు.
ఇక్కడ
‘సేవ’
అనే
పదాన్ని
ఉపయోగించాడేగాని,
బాధ్యత
(డ్యూటీ)
అనే
పదాన్ని
ఉపయోగించలేదు.
ఎందుకంటే,
సేవ
అనేది
ఏకాత్మ
భావంతో
కూడినది;
‘డ్యూటీ’
(బాధ్యత)
అనేది
‘డ్యుయాలిటీ’
(ద్వైతస్థితి)
కి
సంబంధించినది.
ధర్మజుడు
చెప్పాడు
-
“స్వామీ!
మీరు
మాకు
సేవ
చేయటమేమిటి?
మీరు
కూర్చొని
మా
సేవలను
అందుకోండి”.
అప్పుడు
కృష్ణుడు
తాను
సేవ
చేసేవాడినే
గాని,
చేయించుకునేవాడిని
కానని
అన్నాడు.
ఈ
సత్యాన్ని
మీరుకూడా
గుర్తించండి.
నేను
మీ
సేవకుడినేగాని,
మాస్టర్ని
కాను.
8
▾
Meaning
Keep
Also in his talks
(15)
16 August 1987
To show men the ideal, God displays many Līlās
22 June 1989
Win the Grace of God
12 February 1990
There is no place where God is not
17 February 1990
Prema itself is God
25 May 1990
Vagaries of the Mind
14 August 1990
Role of the Avatars
21 May 1991
The Vedic Heritage Of India
25 May 1991
Kenopanishad
1 August 1996
The vyāvahārika lies merged in the pāramārthika
22 August 1996
You Yourself Are God
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
12 October 2002
The So'ham principle itself is the principle of the Trimūrti
23 November 2002
Satya Is the Paramātma Made Manifest
14 April 2003
Remember the Name with Prema
18 September 2004
Parents Are the Visible Embodiments of God
ప్రతిదినమూ
మీరు
కూర్చొన్నచోటికి
నేనే
నడచి
వస్తున్నాను
గాని,
నా
దగ్గరకు
మీరే
రావాలని
ఆదేశించటం
లేదు.
కాబట్టి
నేను
మీ
సేవకుడినే
కదా!
భక్తుడు
ఏమి
అడిగినా
తక్షణమే
అందించడానికి
భగవంతుడు
భక్తునియొక్క
పూజాగది
ద్వారం
వద్దనే
నిలబడి
ఉంటాడు.
భక్తునియొక్క
అభీష్టమును
నెరవేర్చే
నిమిత్తం
భగవంతుడు
ఎల్లప్పుడు
అతని
ఇంటనే,
వెంటనే,
జంటనే
ఉంటాడు.
దైవం
ఎప్పుడూ
సేవ
చేయాలనే
ఆశిస్తాడు;
సేవ
చేయటానికే
అవతరిస్తాడు.
“నేను
చేస్తున్నాను
చూడండి.
నావలె
మీరుకూడా
చేయండి”
అని
మీకు
బోధించి,
మీతో
సేవలు
చేయించాలన్నది
భగవంతుని
ఉద్దేశ్యం.
అదేరీతిగా,
కృష్ణుడు
తనకేదైనా
సేవనివ్వమని
ధర్మజుని
కోరినప్పుడు
“నీకు
ఏమి
సేవ
కావాలి
కృష్ణా!”
అని
అడిగాడు.
కృష్ణుడు
“ధర్మజా!
అందరూ
భుజించి
లేచిన
తరువాత
ఎంగిలి
ఆకులు
ఎత్తివేసే
సేవ
నాకివ్వండి”
అన్నాడు.
లేతవయస్సునందే
ఇంద్రియాలను
దైవార్పితం
చేయాలి
యౌవనంలో
మానవుని
దేహము
లేత
అరిటాకు
వంటిది.
అందులో
పంచేంద్రియాలనే
పంచభక్ష్య
పరమాన్నములను
వడ్డించుకున్నాడు.
కాని
వాటిని
మొట్టమొదట
భగవంతునికి
అర్పించే
బదులు
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
మద,
మాత్సర్యములనే
రాక్షసులకు
అర్పిస్తున్నాడు.
ఆ
రాక్షసులు
భుజించగా
మిగిలిన
‘ఎంగిలికూడు’
ను
పాడైపోయిన
‘ఆకు’
లో
పెట్టి
భగవంతునికి
అర్పితం
గావిస్తున్నాడు.
ఇదే
పెద్ద
పొరపాటు.
లేతవయస్సునందే
మానవుడు
తన
ఇంద్రియాలను
దైవార్పితం
చేయాలి.
ఆ
దైవం
ఎక్కడున్నాడు?
తనయందే
ఉన్నాడు.
కనుకనే
మీరు
భోజనం
చేసే
ముందు
“బ్రహ్మార్పణం..”
అనే
మంత్రాన్ని
పఠించినప్పుడు
“అహం
వైశ్వానరో
భూత్వా
ప్రాణినాం
దేహమాశ్రితః
ప్రాణాపానసమాయుక్తః
పచామ్యన్నం
చతుర్విధం”
అని
భగవంతుడు
జవాబిస్తున్నాడు.
అనగా
“ఒరే
పిచ్చివాడా!
నేను
వైశ్వానర
రూపంలో
నీయందే
ఉంటున్నాను”
అంటున్నాడు.
కాని
ఈ
జవాబును
మీరు
వినిపించుకోవటం
లేదు.
కనిపించని
దేవుడు
కనిపించే
జీవునిలో
ఉన్నాడు
ప్రేమకు
ఒక్క
నామము
మాత్రమే
ఉన్నదిగాని,
రూపం
లేదు.
బంగారానికి
ఒక
రూపం
లేదు.
దానిని
కరగబెట్టి
ఒక
రింగుగానో,
చైన్గానో
చేయించుకుంటున్నాము.
అనగా
మనమే
దానికి
ఒక
రూపమును
కల్పిస్తున్నామన్నమాట.
9
▾
Meaning
Keep
అదే
రీతిగా
దైవానికి
ఒక
రూపం
లేదు.
అలాంటి
రూపరహితతత్త్వానికి
మీరే
ఒక
రూపం
కల్పించుకొని,
దాని
గురించి
అనేక
విధములుగా
ఊహిస్తున్నారు.
దివ్యత్వానికి
ఎట్టి
భావమూ
లేదు,
ఎట్టి
రూపము
లేదు.
అందువల్లనే
దివ్యత్వాన్ని
“నిర్గుణం,
నిరంజనం,
సనాతనం,
నికేతనం,
నిత్య,
శుద్ధ,
బుద్ధ,
ముక్త,
నిర్మలస్వరూపిణం”
అని
వర్ణించారు.
కాని
మీ
తృప్తి
నిమిత్తమై
దివ్యత్వానికి
ఒక
ఆకారం
కావాలి.
కనుకనే
దివ్యత్వం
అప్పుడప్పుడు
అవతారం
దాల్చుతుంది.
ఎవరికి
సేవ
చేసినా
అది
భగవత్సేవగా
భావించండి.
ఎందుకంటే
“ఈశ్వర
స్సర్వ
భూతానాం”
భగవంతుడు
అన్ని
భూతములయందున్నాడు.
కనిపించని
దేవుడే
కనిపించే
జీవునిగా
ఎదురు
వస్తాడు.
అది
పరోక్షము,
ఇది
ప్రత్యక్షము.
అదిబింబము,
ఇది
ప్రతిబింబము.
కనుక,
ఉన్నది
ఒక్కటే;
రెండు
లేనే
లేవు.
కాని,
కనిపించేది
అట్లా
కనిపిస్తుంది.
సినిమా
తెరపై
భూకంపం
వచ్చినట్లుగా
కనిపిస్తుంది.
కాని,
ఆ
తెర
ఏమైనా
కంపిస్తుందా?
లేదు.
ఆ
తెరపైనే
నదులు
ఉప్పొంగినట్లుగా
కనిపిస్తుంది.
కాని,
ఆ
తెరను
తాకి
చూస్తే
అది
ఏమైనా
తడిగా
ఉంటుందా?
లేదు.
అదేవిధంగా
బాహ్యదృష్టికి
అన్నీ
కనిపిస్తున్నాయిగాని,
ఇల్యుమినేషన్
మైండ్‌కు
ఇవేవీ
కనిపించవు.
ఆ
స్థాయిని
చేరుకోవాలంటే
అందరినీ
ప్రేమించాలి.
అప్పుడు
ఏకత్వంలో
అనేకత్వం,
అనేకత్వంలో
ఏకత్వం
కనిపిస్తుంది.
సమస్త
సాధనల
గమ్యం
-
ఓవర్మైండ్
ప్రేమస్వరూపులారా!
అందరియందు
ప్రేమ
ఉన్నది.
ఆ
ప్రేమయే
భగవంతుడు.
కనుకనే,
కృష్ణుడు
“అందరూ
నా
అంశములే”
అన్నాడు.
దేహాలు
వేరుగా
ఉండటంచేత
భేదం
కనిపిస్తున్నది
గాని,
అందరూ
ఒక్కటే.
కనుక
దేహభావాన్ని
వీడి
అందరినీ
సమానంగా
చూడండి.
“అందరూ
నా
ప్రతిబింబములే”
అని
భావించండి.
అప్పుడే
మీరు
ఇల్యుమినేషన్
మైండ్
చేరుకుంటారు.
సూపర్
మైండ్‌లో
‘నేను
వేరు,
ఇతను
వేరు’
అనే
ద్వైతభావం
ఉంటుంది.
క్రమక్రమేణా
ఇల్యుమినేషన్
మైండ్‌లో
ప్రవేశిస్తారు.
అక్కడ
పూర్తి
ఏకత్వాన్ని
గుర్తించిన
తరువాత
ఓవర్
మైండ్
చేరుకుంటారు.
అదియే
మీ
గమ్యం.
దానిని
చేరుకోవటానికే
ఈ
సాధనలన్నీ.
అయితే
దేహంతో
చేసే
సాధనలు
కసరత్తు
క్రిందికే
వస్తాయిగాని,
నిజమైన
సాధనలు
కానేరవు.
కసరత్తు
దేహదారుఢ్యాన్ని
పెంచుతుందిగాని,
మానసిక
పవిత్రతను
చేకూర్చదు.
మనకు
కావలసింది,
మానసిక
పవిత్రత.
10
▾
Meaning
Keep
అందునిమిత్తం
సేవలు
చేయాలి.
సేవకోసం
ఎక్కడికి
వెళ్ళినా
స్వామి
చెప్పిన
మాటలు
తలుచుకుంటూ
వెళ్ళండి.
సేవ
చేయించుకునేవానిలోనూ
ఉన్నది
భగవంతుడే
అని
గుర్తించండి.
సేవ
అంటే
చేతులతోనే
చేయనక్కర్లేదు.
మృదుమధురంగా
మాట్లాడండి.
అదీ
సేవయే.
ఆకలిగొన్నవారిని
ఆదరించి
అన్నం
పెట్టండి.
అదీ
సేవయే.
కొంతమంది
శ్రీమంతులు
“మాకు
స్వయంగా
సమాజంలోకి
వెళ్ళి
సేవ
చేసే
అవకాశం
లేదే”
అని
బాధపడుతుంటారు.
అలాంటివారు
తమకున్నదాంట్లో
కొంత
త్యాగం
చేసి
బీదవారిని
ఉద్ధరించవచ్చు.
అదీ
సేవయే.
సేవ
అంటే
సమాజంలో
ప్రవేశించి
వీథులను
ఊడ్చటం
కాదు.
అయితే,
అది
చేసే
అవకాశం
ఉన్నవారు
చేయవచ్చు.
ఎవరికి
చేతనైనంత
సేవ
వారు
చేసుకోవచ్చు.
మొన్న
అనంతపురం
కాలేజీ
విద్యార్థినులు
“స్వామీ!
మగపిల్లలు
పల్లెపల్లెకూ
వెళ్ళి
ఇంటింటికి
అన్నం
అందిస్తున్నారు.
మేము
ఆహారపు
పొట్లాలను
కడుతున్నాము.
ఆ
తరువాత
మాకేమీ
పనిలేదు.
కాబట్టి
మేము
కూడా
పల్లెలకు
వెళ్ళి
సేవ
చేస్తాము”
అన్నారు.
“వెళ్ళండి
పల్లెల్లో
ఉన్న
ప్రాచీన
దేవాలయాలను
శుభ్రపరచండి.
వాటికి
సున్నం
వేయండి.
దేహంకూడా
దేవుని
మందిరమే!
కాబట్టి,
దేవాలయానికి
సున్నం
వేసేటప్పుడు
మీ
దేహాలకు
ప్రేమ
అనే
పెయింట్‌ను
పూస్తున్నామనుకోండి”
అని
చెప్పాను.
సేవ
అనేది
చేతులతో
చేయవచ్చును.
మనస్సుతో
చేయవచ్చును,
మాటలతో
చేయవచ్చును.
ఇక్కడకు
ఎంతోమంది
తల్లులు
చిన్న
చిన్న
బిడ్డలను
ఎత్తుకొని
వస్తుంటారు.
ఆ
బిడ్డలు
ఏడుస్తుంటే
వారిని
తీసుకొని
జోకొట్టండి.
మీ
దగ్గర
చాక్లెటుంటే
ఆ
పిల్లలకు
ఇచ్చివేయండి.
అదీ
గొప్ప
సేవయే.
అది
పరిమాణంలో
చిన్నదిగా
కనిపించవచ్చునుగాని,
ప్రమాణంలో
చాలా
గొప్పది.
కఠినమైన
మాటలతో
ఎదుటివారి
హృదయాన్ని
గాయపరచకండి.
ప్రేమను
పెంచుకోండి.
మీరీనాడు
ప్రాకృతమైన
ప్రేమను
పెంచుకుంటున్నారు.
కాని
అది
నిజమైన
ప్రేమ
కాదు.
ప్రాకృతమైన
ప్రేమను
దివ్యమైన
ప్రేమగా
మార్చుకోవాలి.
అప్పుడు
మీరే
దైవంగా
మారిపోతారు.
Previous
←
Noble Sons Are Born Only When There Are Noble Resolves
Next
That Which Makes Oneness Known Is True Education
→