Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2004 · Satisfying his mother is a son's first duty
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Satisfying his mother is a son's first duty
6 May 2004, Easwaramma Day, Brindavan
1
▾
Meaning
Keep
His poems 324
Also in his talks
(12)
14 January 1988
Strive to recognise the oneness within the many!
31 October 1989
Do Your Duty as an Offering to God
24 May 1990
Hold the Reins
27 May 1991
Prasnopanishad - Answers To The Second And Third Students
5 October 1997
“Śarīramādyaṁ khalu dharmasādhanaṁ”
1 January 2000
Virtue is the adornment of man
12 April 2000
The Subtleties of Dharma in the Rāmāyaṇa
2 April 2003
Leave the delusion of the body; think of God
6 May 2003
Easwaramma, the ideal mother
6 May 2005
Only a son worthy of his mother's love can win God's grace
6 May 2006
If you love your parents, the whole world will love you
18 August 2006
Cast off the delusion of the body and foster attachment to God
జనని
గర్భమునుండి
జన్మించినప్పుడు
కంఠమాలలవేవి
కానరావు
మంచి
ముత్యపు
సరుల్
మచ్చునకును
లేవు
మేల్మి
బంగరు
దండ
మెడకు
లేదు
రత్నాల
హారముల్
రంజిల్లగా
లేవు
పచ్చలు
కెంపులు
పొదగలేదు
వజ్రాలహారముల్
వర్థిల్లగా
లేవు
గోమేధికంబులు
తోడ
లేవు
కలదు
కలదొక్క
మాల
మీ
కంఠమందు
ఎన్ని
చేసిన
అవియన్ని
ఎంచి
ఎంచి
మంచిదైనను
చెడుగైన
త్రుంచకుండ
బ్రహ్మ
మీకిచ్చి
పంపును
బరువుమాల
కర్మలన్నియు
చేర్చిన
కంఠమాల
!
ప్రేమస్వరూపులారా!
ఈ
జగత్తునందు
ప్రతి
మానవునకు
నలుగురు
గురువు
లున్నారు.
“మాతృదేవోభవ,
పితృదేవోభవ,
ఆచార్యదేవోభవ,
అతిథిదేవోభవ”
అని
వేదము
బోధించుచున్నది.
కాబట్టి,
తల్లియే
ప్రథమ
గురువు.
తల్లి
బోధనలలో
ఎన్నియో
అంతరార్థములున్నవి.
తల్లి
మాటలను
జవదాటకుండా
నడుచుకునేవాడే
నిజమైన
తనయుడు.
బాహ్యదృష్టికి
తల్లి
కేవలం
ఒక
సామాన్యమైన
వ్యక్తిగా
మనకు
గోచరిస్తుంది.
అయితే,
ఆధ్యాత్మికమార్గమును
అనుసరించని
వ్యక్తులకు
ఇదంతా
హాస్యాస్పదముగా
కనిపించవచ్చు.
2
▾
Meaning
Keep
ఒక
పర్యాయం
ఈశ్వరమ్మ
చిత్రావతికి
వెళ్ళి
నీళ్ళు
తీసికొని
వస్తున్నది.
ఆమె
ప్రక్కన
ఒక
వృద్దురాలు
తన
నీటిబిందెను
మోయలేక
మోస్తూ
నడుస్తున్నది.
“ఏమమ్మా!
బిందెను
మోయడం
కష్టంగా
ఉన్నదా?”
అని
ప్రశ్నించింది
ఈశ్వరమ్మ.
“నేను
మోయలేకపోతున్నాను
తల్లీ!
నా
ఇంట్లో
ఎవ్వరూ
బిడ్డలు
లేరు.
కాబట్టి,
ప్రతి
రోజూ
నేనే
నీళ్ళు
మోసుకొని
తెచ్చుకోవాలి”
అంటూ
ఆయాసంతో
వగర్చుకుంటూ
చెప్పింది.
ఆ
వృద్ధురాలి
మాటలు
ఈశ్వరమ్మ
మనస్సులో
నిల్చిపోయాయి.
మరికొంతదూరం
వచ్చేటప్పటికి
ఈశ్వరమ్మకు
ఒక
చిన్నపిల్లవాడు
పలక,
బలపం
చేత
పట్టుకొని,
ఒక
బరువైన
బ్యాగును
మెడకు
తగిలించుకొని
నడవలేక
నడవలేక
నడుస్తూ
కనిపించాడు.
“నాయనా!
ఇంత
బరువైన
బ్యాగును
మోసుకొని
ఎక్కడికి
వెళుతున్నావు?”
అని
అడిగింది
ఈశ్వరమ్మ.
“అమ్మా!
నేను
బుక్కపట్టణం
స్కూలుకి
వెళుతున్నాను.
టీచర్లు
చెప్పినవన్నీ
నేను
వీటిలో
వ్రాసుకొని
నేర్చుకోవాలి”
అన్నాడు.
దీనిని
కూడా
మనస్సులో
ఉంచుకున్నది
ఈశ్వరమ్మ.
ఇంకా
కొంతదూరం
వచ్చేటప్పటికి
ఒక
తల్లి
తన
బిడ్డను
ఎత్తుకొని
బుక్కపట్టణంవైపు
నడుచుకుంటూ
వెళుతున్నది.
ఆమె
చాలా
బలహీనంగా
ఉన్నది.
ఆమెను
చూసి
ఈశ్వరమ్మ
“ఎందుకమ్మా
ఇంత
బలహీనంగా
ఉన్నావు?
ఈ
బిడ్డను
ఎత్తుకొని
బుక్కపట్టణం
వరకు
నడవటం
కష్టం
కదా?”
అని
అడిగింది.
“ఏం
చేయను
తల్లీ!
మన
గ్రామంలో
ఇంత
మందిచ్చే
డాక్టరు
లేడు.
నాబిడ్డకు
జ్వరం
వచ్చింది.
వీడిని
బుక్కపట్టణంలోని
ఆసుపత్రికి
తీసుకువెళుతున్నాను”
అని
చెప్పింది.
ఈ
సన్నివేశంకూడా
ఈశ్వరమ్మ
మనస్సులో
నిల్చిపోయింది.
ఆదర్శమాత
:
ఆదర్శపుత్రుడు
కలకత్తాకు
సమీపంలోని
ఒక
కుగ్రామంలో
ఒక
బీదరాలైన
తల్లి,
కుమారుడు
నివసించేవారు.
కొడుకు
పుట్టిన
కొద్దిరోజులకే
తండ్రి
మరణించాడు.
తల్లి
తన
బిడ్డను
ఏదో
విధంగా
కష్టపడి
పోషిస్తూ
వచ్చింది.
ఇంట్లో
దీపం
కూడా
లేకపోవటంచేత
ఆ
పిల్లవాడు
వీధిదీపాల
క్రింద
కూర్చొని
చదువుకునేవాడు.
ఆవిధంగా
కష్టపడి
చదువుకొని
ఆ
పిల్లవాడు
పెద్ద
డిగ్రీ
పుచ్చుకున్నాడు.
అతనే
ఈశ్వరచంద్ర
విద్యాసాగర్.
3
▾
Meaning
Keep
ఒకసారి
కలకత్తాలో
ఒక
తిరునాళ్ళు
జరిగింది.
విద్యాసాగర్
తల్లి
అందరితోపాటు
తానుకూడా
తిరునాళ్ళకు
బయల్దేరింది.
అందరూ
మంచి
ఖరీదైన
దుస్తులు
ధరించి
వెళుతుంటే
తన
తల్లి
మాత్రం
ఒక
పాతచీర
కట్టుకొని
వెళ్లటం
చూసి
విద్యాసాగర్
చాలా
బాధపడ్డాడు.
“అమ్మా!
ఇంత
పాతచీర
కట్టుకొని
వెళుతున్నావేమిటి?”
అని
అడిగాడు.
తల్లి
“నాయనా!
నాకున్నదాంట్లో
నేను
తృప్తి
పడుతున్నాను.
ఈవిషయం
గురించి
నీవేమీ
బాధపడకు.
నీవు
మంచిగా
చదువుకో,
అదే
నాకు
కావలసింది”
అని
చెప్పింది.
కొంతకాలానికి
విద్యాసాగర్‌కు
మంచి
ఉద్యోగం
లభించింది.
తన
మొట్టమొదటి
జీతంతో
తల్లికి
మంచి
ఖరీదైన
చీరలు
కొని
తెచ్చాడు.
అప్పుడా
తల్లి
“నాయనా!
నీవు
గొప్ప
విద్యావంతుడివై
ఉన్నతస్థితికి
వచ్చి
మన
పల్లెలోని
బీదప్రజలకు
సహాయపడితే..
నాకంతే
చాలు.
ఈ
ఖరీదైన
చీరలతో
నాకు
ఆనందం
కలుగదు.
నాకు
మూడు
కోరికలున్నాయి.
అవి
నెరవేరినప్పుడే
నాకు
ఆనందం
కల్గుతుంది”
అని
చెప్పింది.
అప్పుడు
విద్యాసాగర్
తన
తల్లి
పాదాలపై
పడి
“అమ్మా!
నీకోరికలను
తీర్చే
బాధ్యత
నాది.
ఎంత
కష్టానికైనా
ఓర్చుకొని
తల్లిని
సంతోషపెట్టటం
కుమారుని
కర్తవ్యం.
కాబట్టి,
నీకున్న
కోరికలేమిటో
నాకు
తెలుపవలసింది”
అని
ప్రార్థించాడు.
“నాయనా!
మన
పల్లెలో
చాలామంది
బలహీనులూ
విద్యాహీనులూ
బీదవారూ
ఉన్నారు.
వారి
బాధలను
తీర్చేవారెవరు?
నీవు
వారికి
తగిన
సహాయం
చేసినప్పుడే
నాకు
సంతోషం
కలుగుతుంది.
మన
గ్రామంలోని
పిల్లలు
చదువు
నిమిత్తం
ఎంతో
దూరం
నడిచి
ప్రక్కగ్రామానికి
వెళ్ళవలసివస్తోంది.
ఆ
పిల్లలను
చూస్తే
నాకెంతో
జాలి
కలుగుతోంది.
చదువుకునే
నిమిత్తం
వాళ్ళు
ఇన్ని
కష్టాలు
పడవలెనా?
కాబట్టి,
ఈ
గ్రామంలోనే
ఒక
చిన్న
స్కూలు
కట్టించి
పిల్లలకు
తగిన
సహాయం
చేయవలసింది”
అని
కోరింది.
తల్లి
కోరిక
మేరకు
విద్యాసాగర్
ఒక
చిన్న
పాఠశాల
కట్టించాడు.
ఆ
తల్లి
ఎంతో
ఆనందించింది.
మరొక
రోజున
తల్లి
చాలా
విచారంగా
ఉండటం
గమనించి
విద్యాసాగర్
కారణ
మడిగాడు.
అప్పుడామె
“నాయనా!
మన
గ్రామప్రజలు
సరియైన
నీటి
సౌకర్యం
లేక
ఎంతో
బాధపడుతున్నారు.
ఊర్లో
ఉన్న
బావిలో
నీరెండిపోయి
ఒక్క
చుక్కైనా
చిక్కటం
లేదు.
ఎంతో
దూరంనుండి
నీళ్ళు
మోసుకొని
రావలసివస్తోంది.
నావంటి
వృద్ధురాళ్ళు
అంత
దూరంనుండి
నీరెలా
తెచ్చుకోగలరు?
కాబట్టి
నీవు
మన
గ్రామంలో
ఒక
బావిని
త్రవ్విస్తే
గ్రామస్థులకు
గొప్ప
ఉపకారం
చేసినవాడవవుతావు.
4
▾
Meaning
Keep
ఇదే
నా
రెండవ
కోరిక”
అన్నది.
“అమ్మా!
నీ
కోరికను
తప్పకుండా
నెరవేరుస్తాను.
మన
గ్రామంలో
నీటి
సమస్యను
తీర్చటానికి
ప్రయత్నిస్తాను”
అని
మాటిచ్చాడు
విద్యాసాగర్.
మొదట
కొన్ని
బోర్‌వెల్స్
వేయించాడు.
కాని,
కొంతకాలానికి
వాటిలోకూడా
నీరింకిపోయింది.
“నాయనా!
నీవు
వేయించిన
బోర్‌వెల్స్
వలన
ఏమాత్రం
ఉపయోగం
లేకుండాపోయింది.
వర్షాకాలంలో
మాత్రమే
నీళ్ళు
లభిస్తున్నాయి.
ఎండాకాలం
వచ్చేసరికి
ఒక్క
చుక్కైనా
లేకుండా
వట్టిపోతున్నాయి.
కాబట్టి
నీటిసమస్య
నివారణకు
ఏదైనా
శాశ్వతపరిష్కారం
చూడు”
అని
చెప్పింది
తల్లి.
అప్పుడు
విద్యాసాగర్
గ్రామంలో
ఒక
పెద్ద
బావిని
త్రవ్వించి
నీటిసమస్యను
పూర్తిగా
నివారించాడు.
తల్లి
చాలా
సంతోషించింది.
మరికొంతకాలానికి
విద్యాసాగర్‌కు
ఉద్యోగంలో
ప్రమోషన్
లభించింది.
జీతంకూడా
బాగా
పెరిగింది.
అతను
తల్లివద్దకు
వచ్చి,
“అమ్మా!
నీ
మూడవ
కోరిక
ఏమిటి?”
అని
అడిగాడు.
“నాయనా!
నీవు
స్కూలు
కట్టించావు,
నీటిసదుపాయం
కల్పించావు.
అయితే,
ఈ
గ్రామంలో
సరియైన
వైద్యసౌకర్యం
లేక
ప్రజలు
బాధపడుతున్నారు.
వైద్యసహాయంకోసం
తల్లులు
తమ
పిల్లలనెత్తుకొని
పొరుగు
గ్రామానికి
పోవలసివస్తోంది.
వాళ్ళ
కష్టాలను
నేను
చూడలేకపోతున్నాను.
కాబట్టి,
నీవు
మన
గ్రామంలో
ఒక
చిన్న
ఆసుపత్రినికూడా
కట్టిస్తే
సంతోషిస్తాను”
అని
చెప్పింది.
తల్లి
కోరిక
మేరకు
విద్యాసాగర్
ఒక
ఆసుపత్రిని
కూడా
కట్టించాడు.
ఈవిధంగా
తల్లి
కోరికలన్నింటినీ
నెరవేర్చి
ఆమెకు
ఎంతో
ఆనందం
కలిగించాడు.
విద్యకు
వినయమే
భూషణము
విద్యాసాగర్
తన
మంచిప్రవర్తనచేత
క్రమక్రమేణా
ఉద్యోగంలో
చాలా
ఉన్నతస్థితికి
వచ్చాడు.
దానితోపాటు
అతని
సంపాదనకూడా
బాగా
పెరిగింది.
అయినప్పటికీ
ఎంతో
వినయవిధేయతలతో
మెలగుతూ
మంచిపేరు
తెచ్చుకున్నాడు.
ఒకనాడు
తల్లి
“నాయనా!
నీకు
గొప్ప
పదవి
వచ్చినందుకు
నేను
చాలా
సంతోషిస్తున్నాను.
కాని,
సంపాదన
పెరిగిందని
అహంకారాన్ని
మాత్రం
పెంచుకోకు”
అని
హితబోధ
చేసింది.
“ధనమెచ్చిన
మదమెచ్చును,
మదమెచ్చిన
దుర్గుణంబు
మానక
హెచ్చున్..”
అన్నట్లు,
కొందరికి
ధనం
పెరిగేకొలదీ
దుర్గుణాలుకూడా
పెరిగిపోతుంటాయి.
విద్యాసాగర్
మాత్రం
తన
తల్లి
బోధించినట్లుగా
విద్యతోపాటు
వినయాన్ని
అభివృద్ధిపరచుకున్నాడు.
5
▾
Meaning
Keep
విద్యాసాగర్
ఒక
గొప్ప
పండితునిగా,
వక్తగా
పేరు
గడించాడు.
అతని
ఉపన్యాసాలను
వినటానికి
అనేకమంది
విద్యావంతులు
తరలి
వచ్చేవారు.
ఒక
పర్యాయం
ప్రక్కఊరిలో
ఒక
సభనుద్దేశించి
ప్రసంగించవలసి
ఉండటంచేత
విద్యాసాగర్
రైలులో
ఆ
ఊరికి
బయలుదేరాడు.
అతనెక్కిన
కంపార్టుమెంటులోనే
ఒక
ఐ.సి.ఎస్.
ఆఫీసరుకూడా
ప్రయాణిస్తున్నాడు.
అతను
విద్యాసాగర్
పేరు
మాత్రం
విన్నాడుగాని
అతనిని
చూసి
ఎరుగడు.
అందుచేత
విద్యాసాగర్
తనతోపాటే
ప్రయాణిస్తున్న
సంగతి
అతనికి
తెలియదు.
స్టేషన్లో
దిగుతూనే
అతను
కూలీకోసం
వెతకటం
ప్రారంభించాడు.
అతను
‘కూలీ,
కూలీ’
అని
అరవటం
గమనించి
విద్యాసాగర్
అతనివద్దకు
వెళ్ళి
“అయ్యా!
మీవద్ద
ఎంత
సామాను
ఉంది?”
అని
అడిగాడు.
“ఈ
సూట్‌కేసు
మాత్రమే
ఉంది”
అన్నాడా
ఆఫీసరు.
“ఇంత
చిన్న
సూట్‌కేసు
మోయటానికి
కూలీ
ఎందుకు?
నేను
తీసికొని
వస్తాను.
మీరెక్కడికి
వెళ్ళాలో
చెప్పండి”
అన్నాడు
విద్యాసాగర్.
“ఇక్కడ
ఈశ్వరచంద్ర
విద్యాసాగర్
అనే
ఒకగొప్ప
పండితుడు
ఉపన్యాసం
ఇస్తాడట.
నేనాయన
ఉపన్యాసం
వినటానికి
వెళ్ళాలి”
అని
ఆ
ఆఫీసరు
చెప్పగా,
విద్యాసాగర్
సూట్‌కేసును
పట్టుకొని
అతనివెంట
నడిచారు.
సభ
జరిగే
చోటికి
చేరుకున్న
తరువాత
విద్యాసాగర్
ఆఫీసరు
చేతికి
సూట్‌కేసును
అందించాడు.
వెంటనే
అతను
పర్సుతీసి
“కూలీ
ఎంత
ఇవ్వాలి?”
అని
అడిగాడు.
“మీరు
నాకు
సేవ
చేసే
అవకాశం
ఇచ్చారు.
నాకదే
చాలు”
అన్నాడు
విద్యాసాగర్.
ఇతనెవరో
పిచ్చివానివలె
ఉన్నాడనుకొని
ఆ
ఆఫీసరు
తన
సూట్కేసుని
పట్టుకొని
వెళ్ళి
సభలో
కూర్చున్నాడు.
ఆ
తరువాత
వేదికమీద
కనిపించిన
దృశ్యం
చూసి
అతను
చాలా
ఆశ్చర్యపోయాడు.
రైల్వేస్టేషనునుండి
తన
సూట్‌కేసును
మోసుకొని
వచ్చిన
వ్యక్తికి
అందరూ
పూలమాలలు
వేసి
స్వాగతం
పలుకుతున్నారు!
ఆయనే
విద్యాసాగర్
అని
గుర్తించి,
అంతటి
గొప్ప
వ్యక్తిచేత
తన
సూట్‌కేసును
మోయించినందుకు
అతను
చాలా
సిగ్గుపడ్డాడు.
విద్యాసాగర్‌కి
మనస్సులో
నమస్కరించాడు.
ఆరోజు
విద్యాసాగర్
తన
ప్రసంగంలో
విద్యావంతునికి
ఉండవలసిన
లక్షణాలను
వివరిస్తూ,
విద్యకు
వినయమే
భూషణమని
నొక్కిచెప్పాడు.
కార్యక్రమం
ముగిసిన
తరువాత
ఆ
ఐ.సి.ఎస్.
ఆఫీసరు
విద్యాసాగర్‌ని
కలుసుకొని
“సార్!
మీప్రసంగం
నాకళ్ళు
తెరిపించింది.
6
▾
Meaning
Keep
నేను
గొప్ప
విద్యావంతుడనన్న
అహంకారంచేత
ఆవిధంగా
ప్రవర్తించాను.
నన్ను
క్షమించండి”
అని
కోరాడు.
విద్యాసాగర్
పేరుప్రఖ్యాతులు
దినదినాభివృద్ధి
గాంచాయి.
అతను
ప్రజలకు
ఎంతో
మేలు
చేస్తూ
వచ్చాడు.
బీద
విద్యార్థులకు
చదువు
చెప్పించాడు.
తన
కుమారుడు
చేస్తున్న
సేవాకార్యక్రమాలను
చూసి
తల్లి
ఎంతగానో
ఆనందించింది.
ప్రతి
తల్లికి
అటువంటి
సుపుత్రులు
జన్మించాలని
ఆమె
భగవంతుణ్ణి
హృదయపూర్వకంగా
ప్రార్థించింది.
నాటి
విత్తనమే
నేడు
మహావృక్షమైనట్లు
ఆవిధముగనే,
సత్యసాయి
పుట్టపర్తిలో
బీదలకి
ఇళ్ళు
కట్టించటం,
వాళ్ళ
పిల్లల
చదువుకోసం
స్కూలు
కట్టించటం,
గ్రామానికి
నీటికొరత
తీర్చటం
...
ఈరకంగా
అనేక
సేవలు
చూస్తూ
వస్తున్నాడు.
ఆనాడు
తల్లి
ఈశ్వరమ్మ
చెప్పినవి
చాలా
చిన్న
వాక్యములే!
ఆవాక్యములే
ఈనాడు
మహాచరిత్రగా
పెరిగిపోయినవి.
పుట్టపర్తి
గ్రామస్థులకు
స్వామి
చేసిన
మేలును
చూసి
తల్లి
చాలా
ఆనందించింది.
స్వామీ!
నీవు
బీదలకు
ఇళ్ళు
కట్టించావు.
గ్రామానికి
నీటికొరత
తీర్చావు.
చీకటిలో
జీవిస్తున్న
ప్రజలకు
వెలుగును
ప్రసాదించావు.
అంతేగాక
స్కూలు,
ఆసుపత్రులను
కూడా
కట్టించి
నాకోరికలన్నింటినీ
నెరవేర్చావు”
అని
చెబుతుండేది.
ఆమె
కోరిన
కోరికలు
చాలా
చిన్నవైనప్పటికీ
అవి
అనంతమైన
ఫలితాలనిచ్చే
బృహత్తరమైనసేవాపథకాలుగా
రూపుదాల్చాయి.
తల్లి
మాటలను
అనుసరించే
కుమారులు
ఈనాడు
అత్యవసరం.
తల్లి
చేసే
సద్బోధలనే
పునాదులపైననే
గొప్ప
ఆనందసదనాలు
నిర్మితమవుతాయి.
ఆనాడు
ఈశ్వరమ్మ
కోరిన
కోరికలు
చాలా
చిన్నవే!
పుట్టపర్తి
పల్లెకు
నీళ్లు
కావాలని
అడిగింది.
ఈనాడు
జిల్లా
అంతటికీ
నీరందించాడు
స్వామి.
ఆరోజున
ఒక
చిన్న
స్కూలు
కట్టించమని
అడిగింది.
ఈనాడు
సత్యసాయి
గొప్ప
విద్యాసంస్థలను,
భవనాలను
కట్టించాడు.
ఆరోజుల్లో
సరియైన
వైద్యసౌకర్యం
లేక
పల్లెప్రజలు
ఎంతో
బాధపడటం
చూసి
ఈశ్వరమ్మ
ఒక
చిన్న
ఆసుపత్రిని
కట్టించమని
కోరింది.
ఈనాడు
గొప్ప
వైద్యాలయాలను,
సూపర్
స్పెషాలిటీ
ఆసుపత్రులను
కట్టించాడు
స్వామి.
ఈవిధంగా
ఆనాడు
తల్లి
కోరిన
చిన్నకోరికలే
ఈనాడు
గొప్ప
ఫలితాలను
అందించాయి.
ప్రేమస్వరూపులారా!
మీరు
ఎవ్వరినీ
ఆశ్రయించనక్కర్లేదు.
తల్లి
మనస్సును
సంతృప్తిపరచే
కార్యాలలో
పాల్గొనండి.
తల్లి
మనస్సును
సంతృప్తిపరచితే
చాలు.
అందులోనే
ఎంతో
గొప్ప
ఫలితముంటుంది.
7
▾
Meaning
Keep
తల్లి
ఏమి
చెప్పినా
‘అవును,
అవును’
అని
అంగీకరించి
మీరామె
ఆజ్ఞను
శిరసావహించాలి.
తల్లి
ఆజ్ఞను
శిరసావహించి,
తల్లిప్రేమకు
మీరు
పాత్రులైనప్పుడు
ఈ
జగత్తంతా
సుక్షేమంగా
అభివృద్ధి
అవుతుంది.
ఇంకే
పుణ్యకార్యములూ
మీరు
చేయనక్కర్లేదు.
తల్లిని
సంతృప్తి
పరచటానికి
మీ
జీవితాన్ని
ధారపోయండి.
తల్లి
కోరికలు
తీర్చి,
ఆమెను
సంతృప్తిపరచినందువల్లనే
ఈనాడు
సత్యసాయి
కీర్తి
జగద్వ్యాప్తి
గాంచింది.
ఇంతకంటే
గొప్ప
సేవ
మరొకటి
లేదు
ఈనాడు
గొప్పగా
అడ్వర్టైజ్
చేసుకొని,
బీదల
దగ్గర
బాగా
డబ్బులు
గుంజే
డాక్టర్ల
సంఖ్య
పెరిగిపోతున్నది.
ఇలాంటి
పరిస్థితిలో
సత్యసాయి
గొప్పగొప్ప
సూపర్
స్పెషాలిటి
ఆసుపత్రులు
కట్టించి,
బీదవారు
మొదలుకొని
షావుకార్లవరకు
అందరికీ
ఖరీదైన
వైద్యసౌకర్యం
ఉచితంగా
అందిస్తున్నాడు.
వైద్యసేవలో
ఈ
ఆసుపత్రులను
మించినవి
ఎక్కడా
లేవు.
ఈ
ఆసుపత్రులలో
పేషంట్లకు
మందులు,
ఆపరేషన్లు,
భోజనాలు
అన్నీ
ఉచితమే!
ఈవిధంగా
అన్నీ
ఉచితంగా
ఇవ్వటం
ఎలా
సాధ్యమవుతున్నదో
ఎవ్వరికీ
అర్థం
కావటం
లేదు.
ఇంత
గొప్ప
పనులు
చేస్తున్న
ఆసుపత్రుల
విలువను
చాలామంది
గుర్తించలేకపోతున్నారు.
మనం
బీదలకు
ఉచితంగా
భోజనం
పెట్టాలి,
ఉచితంగా
చదువు
చెప్పాలి,
ఉచితంగా
నీరందించాలి.
ఇంతకంటే
గొప్పసేవ
మరొకటి
లేదు.
ఇక్కడ
చదువుతున్న
విద్యార్థులందరూ
ఇలాంటి
సేవలలో
పాల్గొనాలని
నేను
ఆశిస్తున్నాను.
మా
విద్యాసంస్థలలో
ఒక్క
పిల్లవాని
దగ్గరనుంచి
కూడా
మేము
ఒక్క
నయాపైసా
తీసుకోవటం
లేదు.
ఉచితంగా
ఉన్నతవిద్యను
అందిస్తున్నాము.
బయట
ఇటువంటి
ఉన్నతవిద్యను
అభ్యసించాలంటే
ఎంతో
డబ్బు
అవసరమవుతుంది.
కాని,
ఇక్కడ
ఎలాంటి
ఖర్చు
లేదు.
ప్రేమతో
ఇక్కడికి
వచ్చేవారికి
నేను
ప్రేమతోనే
విద్యను
ఉచితంగా
అందిస్తున్నాను.
ఇంతకుముందు
ప్రసంగించిన
సిక్కు
విద్యార్థి
ఉన్నతవిద్యనభ్యసించాలని
ఎంతో
ప్రయత్నం
చేశాడు.
కాని,
అందుకు
తగినంత
ధనం
తనవద్ద
లేకపోవటంచేత
ఏదో
ఒక
చిన్న
ఉద్యోగంలో
చేరాడు.
ఆ
తరువాత
మా
కాలేజీలో
సీటు
సంపాదించి
ఎలాంటి
ఖర్చూ
లేకుండా
ఎమ్.బి.ఎ.
డిగ్రీ
తీసుకున్నాడు.
స్వామి
సన్నిధే
తన
పెన్నిధిగా
భావించి
అతను
ఇక్కడే
ఉండిపోయి
హాస్టల్లో
ఎంతో
సేవ
చేస్తున్నాడు.
ఇలాంటి
ఉత్తమమైన
పనులు
చేస్తున్న
విద్యార్థులు
ఇంకా
ఎంతోమంది
ఉన్నారు.
8
▾
Meaning
Keep
మా
పిల్లలు
విశాల
హృదయులు
ఆ
తరువాత
మాట్లాడిన
అబ్బాయి
ఢిల్లీకి
చెందినవాడు.
అతనుకూడా
ఎంతో
చదవాలని
ఆశపెట్టుకున్నాడు.
కాని,
తనవద్ద
తగినంత
డబ్బులేకపోవడంచేత
అది
సాధ్యం
కాలేదు.
ఈ
తరువాత
మా
కాలేజీలో
సీటు
లభించటంతో
ఎమ్.బి.ఎ.
డిగ్రీని
ఉచితంగా
పొందగల్గాడు.
ఫస్టుక్లాసులో
పాసయ్యాడు.
అప్పటినుండి
ఎక్కడికీ
వెళ్ళకుండా
స్వామిసేవలో
నిమగ్నుడయ్యాడు.
పిల్లల్ని
ఆదర్శప్రాయంగా
తీర్చిదిద్దే
ఈ
సంస్థయందే
తన
జీవితాన్ని
గడపాలని
నిశ్చయించుకున్నాడు.
ఈరీతిగా,
ఇక్కడ
చేరిన
విద్యార్థులందరూ
తమ
హృదయాల్ని
విశాలం
గావించుకుంటూ
వస్తున్నారు.
మా
పిల్లలందరూ
ప్రేమను
పెంచుకుంటూ,
ఒకరిపట్ల
ఒకరు
సోదరభావంతో
మెలగుతూ
వస్తున్నారు.
మా
సంస్థలలో
చదివే
పిల్లలు
శాంతంగా,
సంతోషంగా
పరులకు
సహాయం
చేయాలని
నేను
ఆశిస్తున్నాను.
మా
పిల్లలు
గొప్ప
విద్యావంతులైనప్పటికీ
నిరహంకారులు.
అలాంటివారే
మా
సంస్థల
టీచర్లుగా
పనిచేస్తున్నారు.
ఇలాంటి
ఆదర్శప్రాయులైన
పిల్లలను
తయారుచేయాలన్నదే
నా
దృఢసంకల్పం.
మా
సంస్థలో
చదివిన
పిల్లలను
ఢిల్లీ,
ఆగ్రా
మొదలైన
పెద్దపెద్ద
పట్టణాల్లో
గొప్పగొప్ప
ఉద్యోగాలు
వరించాయి.
అక్కడ
కూడా
మా
పిల్లలు
త్యాగభావంతో
బీదలకు
చదువులు
చెబుతూ
సేవలు
చేస్తున్నారు.
ఎక్కడ
చూసినా
మా
పిల్లలు
విశాలమైన
హృదయంతో
సేవలలో
పాల్గొంటున్నారు.
విద్య
అంటే
కేవలం
గ్రంథ
పరిచయం
కాదు.
మనస్సును
విశాల
పరచుకోవటం,
త్యాగభావాన్ని
పెంపొందించుకోవటం,
తనతోపాటు
పదిమందికి
పెట్టటం,
అందరికీ
ఆనందాన్నివ్వటం...ఇవే
నిజమైన
విద్యావంతుని
లక్షణాలు.
ఇటువంటి
ఆనందహృదయులైన
విద్యార్థులు
మాదగ్గర
ఎంతో
మంది
ఉంటున్నారు.
ఇలాంటి
పిల్లలను
తయారుచేయటమే
నా
ప్రధాన
కర్తవ్యం.
వారికేమి
కావలసినా
నేను
చేస్తున్నాను.
అలాంటి
పిల్లలను
విదేశాలకు
కూడా
పంపించి
పెద్ద
చదువులు
చదివిస్తున్నాను.
ఇక్కడ
ఏడుమంది
పిల్లలుంటున్నారు.
వీరందరూ
డబుల్
పోస్టుగ్రాడ్యుయేషన్
పూర్తి
చేశారు.
స్వామివద్దనే
ఉండాలని
ఆశిస్తున్నారు.
నేనే
వాళ్ళని
చూసుకుంటున్నాను.
“నాయనలారా!
మీరింకా
పైచదువులు
చదవాలి.
మీరు
డబ్బుకోసం
తల్లిదండ్రులపై
ఆధారపడనక్కర్లేదు.
9
▾
Meaning
Keep
అన్నీ
నేను
చూసుకుంటాను.
మీరు
బాగా
చదువుకొని
మంచి
ఆదర్శాన్ని
చూపించండి”
అని
చెప్పి
వారినందరినీ
నాదగ్గరనే
పెట్టుకొని
వారి
ఉన్నత
విద్యకు
అవసరమైన
ఏర్పాట్లు
చేస్తున్నాను.
ఈ
విధంగా
నేను
ఎప్పుడూ
పరులకు
సహాయం
చేస్తూనే
ఉన్నాను.
ఎవ్వరికీ
ఏమాత్రం
ఇబ్బంది
కలిగించను.
ఇక్కడే
కూర్చున్న
డా
॥
పద్మనాభన్
మీకందరికీ
తెలిసే
ఉండవచ్చు.
అతను
చిన్నవయస్సులోనే
డాక్టర్
డిగ్రీ
పాస్
చేసి,
బెంగుళూరులో
ఒక
చిన్న
క్లినిక్
పెట్టుకోవాలనుకున్నాడు.
నేనతనిని
పిలిచి
“డాక్టర్!
నీవింకా
గొప్ప
డిగ్రీలు
తీసుకోవాలి.
ఇంతమాత్రంతో
నీవు
చదువును
మానుకోకూడదు.
కుటుంబ
పరిస్థితులు
నీకు
అనుకూలించకపోవచ్చును.
కాని,
నీకు
అండగా
నేనున్నాను”
అని
చెప్పాను.
ఒకనాడతనిని
పుట్టపర్తికి
పిలిపించి,
చక్కగా
డిన్నర్
చేయించి,
వియన్నాకు
పంపించాను.
అతను
విదేశాలకు
వెళ్ళి
చక్కగా
చదువుకొని
వచ్చి
ఇప్పుడు
మా
బృందావనంలో
బాగా
సేవ
చేస్తున్నాడు.
బీదవారందరికీ
సేవ
చేస్తున్నాడు.
డబ్బు
సంపాదించాలనే
భావమే
అతనికి
లేదు.
మంచి
పేరే
అతని
సంపాదన.
సత్కీర్తిని
మించిన
సంపాదన
మరొకటుందా?
అతనికి
హార్ట్
ఆపరేషన్
జరిగింది.
అయినప్పటికీ
తాను
ఉత్సాహంగా
సేవలు
చేస్తూనే
ఉన్నాడు.
స్వామి
అతని
హృదయాన్ని
పవిత్రంగా,
మృదుమధురంగా
రూపొందించి
సేవలు
చేయిస్తున్నారు.
నన్ను
ఎలాంటి
జబ్బులూ
వెంటాడవు
ఈ
దేహానికి
అప్పుడప్పుడు
ఏవో
చిన్నచిన్న
బాధలు
వస్తుంటాయి.
అవి
సహజంగా
జరిగేటటువంటివేగాని,
జబ్బులు
కావు.
క్రిందటి
సంవత్సరం
ఒకరోజున
ఒక
పిల్లవాడు
ఇనుపస్టూలును
వేసుకొని
తలుపుకి
తోరణం
కడుతున్నాడు.
అదే
సమయంలో
నేను
లోపలినుండి
వచ్చాను.
ఆ
పిల్లవాడు
నన్ను
చూసిన
తక్షణమే
భయపడి
క్రిందపడిపోయాడు
క్రిందపడేటప్పుడు
ఆస్టూలు
నా
మీద
పడింది.
అప్పుడే
నాకు
తుంటిఎముక
విరిగిపోయింది.
అది
ఆవిధంగా
జరిగినటువంటిదేగాని,
కర్మరీతిగా
నన్ను
వెంటాడినటువంటిది
కాదు.
నేను
దానిని
లెక్కచేయకుండా
ఆ
పిల్లవానిని
సమాధానపరచి
పంపించాను.
నిన్నటి
దినము
నేను
చక్కగా
నడుస్తూ
వస్తున్నాను.
రూమ్‌కి
వచ్చిన
తరువాత
అక్కడున్న
ఒక
పెల్ల
(Brick)
ను
పట్టుకున్నాను.
అది
జారి
పడిపోవటంతో
పెద్ద
ప్రమాదం
జరిగింది.
10
▾
Meaning
Keep
ఆ
శబ్దం
విని
అందరూ
చాలా
భయపడిపోయారు.
“స్వామికి
ఇదేమిటి?
నిన్న
మొన్నటివరకు
కాలు
బాగాలేదు.
ఇప్పుడు
చేయికూడా
దెబ్బతిన్నదే”
అని
బాధపడ్డారు.
ఏమీ
ఫరవాలేదని
నేను
వారిని
సమాధానపరచాను.
కర్మవలన
కొన్ని
ప్రమాదాలు
జరుగుతుంటాయి.
కాని,
ఇది
కర్మవల్ల
జరిగింది
కాదు.
ఈవిధమైన
కొన్నికొన్ని
అభ్యంతరాలు
ఈరకంగా
జరుగుతూ
వచ్చాయిగాని,
నన్ను
ఎలాంటి
జబ్బులూ
వెంటాడవు.
దేనినీ
నేను
లెక్కచేయకుండా
పోతుంటాను.
ఏమైనా
జరగనీ,
నా
కర్తవ్యం
నేను
చేయాలి.
నాకై
నాకు
ఏ
జబ్బూవచ్చినటువంటిది
కానే
కాదు.
ఏవో
కొన్ని
ప్రమాదవశాత్తు
జరుగుతుంటాయి.
వాటిని
నేను
లెక్కచేయకుండా,
ఏమాత్రం
గమనించుకోకుండా
నాకర్తవ్యాన్ని
నేను
నిర్వర్తిస్తుంటాను.
ఈ
పొద్దు
భక్తులు
ఇక్కడ
మీటింగు
ఏర్పాటు
చేసుకున్నారు.
ఈ
దేహానికి
ఎటువంటి
బాధ
కలిగినా
నా
కర్తవ్యాన్ని
విడిచిపెట్టటం
నాకిష్టముండదు.
అందుచేత,
నేను
వద్దామని
డ్రస్సు
వేసుకున్నాను.
పిల్లలు
నా
సౌకర్యంకోసం
ఒక
శాలువను
తెచ్చి,
నేను
ధరించిన
గౌనుపై
చక్కగా
అమరేటట్లుగా
దానిని
కుట్టికప్పారు.
నేను
చేయిని
ఏమాత్రం
కదిలించ
కూడదని
డాక్టర్లు
చెప్పారు.
వాళ్ళు
చెప్పవలసింది
చెప్పారు.
కాని
అవన్నీ
లెక్కచేయకుండా
నేను
ఇద్దరు
పిల్లలను
పట్టుకొని
మెట్లు
దిగి
క్రిందికి
వచ్చాను.
అంత
ప్రేమగా
నేను
పిల్లలను
చూడటం
చేతనే
వాళ్ళుకూడా
అంత
ప్రేమతో
నన్ను
చూస్తున్నారు.
ఈవిధమైన
సేవ
ఎంతో
గొప్ప
స్థితిని
చేకూర్చుతుంది.
చూడటానికి
ఇది
చిన్నసేవనే!
కాని,
విచారణ
చేస్తే,
ఇంత
గొప్ప
సేవ
చేసే
అవకాశం
ఎవ్వరికీ
లభించదు.
“పిల్లలే
నా
ప్రాపర్టీ”
(స్వామి
ఆదేశంమేరకు
ఆ
పిల్లలు
లేచి
నిలబడ్డారు)
వీళ్లంతా
ఢిల్లీ,
ఆగ్రా
ఇంకా
అనేక
ఇతర
పట్టణాల
నుండి
వచ్చి
పుట్టపర్తిలోనూ,
బృందావనంలోనూ
చదువుకున్నారు.
వీళ్లంతా
కలిసి
నాకిప్పుడు
ఎంతో
సేవచేస్తున్నారు.
మందులతో
తగ్గిపోయేటటువంటిది
కాదిది.
వారి
ప్రేమయే
పెద్దమందుగా
పనిచేస్తున్నది.
అదే
నాకు
నయం
చేస్తున్నది.
(ఒక
పిల్లవానిని
చూపిస్తూ...)
ఈ
అబ్బాయి
పి.హెచ్.డి.
చేశాడు.
వీళ్ళందరూ
గొప్పగొప్ప
డిగ్రీలు
పూర్తిచేశారు.
అయినప్పటికీ
ఇక్కడే
ఉండి
స్వామికి
సేవచేయాలని
ఆశిస్తున్నారు.
వీళ్ళ
ప్రేమనే
నన్ను
అన్నివిధాలుగా
కాపాడుతూ
వస్తున్నది.
ఇంకా
సత్యజిత్,
మరికొందరు
పిల్లలు
లోపలున్నారు.
11
▾
Meaning
Keep
వీళ్ళు
నీడవలె
నిరంతరం
నావెంట
ఉంటూ
నన్ను
చూసుకొంటున్నారు.
ఇటువంటి
పిల్లలే
నా
ప్రాపర్టీ.
“స్వామీ!
మీ
ప్రాపర్టీ
ఎంత
ఉంది,
ఎక్కడుంది?”
అని
అనేకమంది
అడుగుతుంటారు.
“నాయనా!
నా
ప్రాపర్టీ
ఇంత,
అంత
అని
చెప్పటానికి
వీలుకాదు.
నా
పిల్లలే
నా
ప్రాపర్టీ”
అని
నేను
చెబుతుంటాను.
వాళ్ళలో
ఉండే
ప్రేమ
తత్త్వాన్ని
ఎంత
వర్ణించినా
చాలదు.
దానికి
విలువకట్టడానికి
వీలుకాదు.
ఈవిధమైన
ప్రాపర్టీ
లేకుండా
నేనుండలేను.
ఇంత
ప్రేమతో
చూసుకునే
స్వామిని
వదలి
వాళ్ళుకూడా
ఏవిధంగా
ఉండగలరు?
వాళ్ళు
నన్ను,
నేను
వాళ్ళని
వదలటానికి
వీలుకాదు.
మా
పిల్లలు
సేవద్వారా
ప్రపంచానికి
గొప్ప
ఆదర్శాన్ని
నిరూపిస్తున్నారు.
చదువుకున్న
వాళ్ళకి
గొప్ప
విలువ
వచ్చేది
ఏమిటంటే
సేవనే!
మా
పిల్లలయొక్క
ప్రేమతత్త్వాన్ని
గుర్తించటానికి
ఎవ్వరికీ
సాధ్యంకాదు,
వారి
హృదయాలు
ఎంత
విశాలమైనవో
ఎవ్వరికీ
అర్థంకాదు,
చూడటానికి
చిన్నపిల్లల
మాదిరి
కనబడతారు.
కాని,
ఒక్కొక్కరికి
డబుల్
పోస్టు
గ్రాడ్యుయేషన్
డిగ్రీలున్నాయి.
ఇలాంటి
పిల్లలు
లోకానికి
ఎంతైనా
సహాయం
చేయగలరు.
వాళ్ళే
నాకు
అన్నివిధాలుగా
సేవ
చేస్తున్నారు.
“శ్రవణం
కీర్తనం
విష్ణోః
స్మరణం
పాదసేవనం
వందనం
అర్చనం
దాస్యం
స్నేహమాత్మనివేదనం”
-
ఈ
నవవిధమార్గములలో
వారు
స్వామిపట్ల
తమకు
గల
ప్రేమను
పరిపూర్ణంగా
వ్యక్తం
చేస్తున్నారు.
నిద్రాహారములను
కూడా
త్యజించి
స్వామికి
ఎంతో
జాగ్రత్తగా
సేవచేస్తున్నారు.
వాళ్ళు
చేసిన
సేవవల్లనే
ఈనాడు
నేను
శ్రమలేకుండా
క్రిందికి
దిగి
వచ్చాను.
లేకపోతే
ఈ
పరిస్థితిలో
నేను
దిగి
రావటం
అంత
సులభమవుతుందా?
వాళ్ళ
ప్రేమనే
నన్ను
తీసుకువచ్చింది.
వాళ్ళకి
చదువుతోపాటు
గొప్ప
సంస్కారమున్నది.
ఇక్కడగాని,
పుట్టపర్తిలోగాని,
ప్రైమరీ
స్కూలులోగాని
పిల్లలు
చేసే
సేవ
ఇట్టిది,
అట్టిది
అని
చెప్పటానికి
వీలుకాదు.
చిన్నచిన్న
పిల్లలు
కూడా
ఎంతో
జాగ్రత్తగా
మెలగుతుంటారు.
ఈరోజున
మా
పిల్లలయొక్క
సద్గుణాలను
మీకు
బోధించే
నిమిత్తమై
నేనిక్కడ
నిలుచున్నానేగాని,
నా
ఉపన్యాసంకోసం
నిల్చోలేదు.
ఈ
పిల్లలవలెనే
క్రొత్తగా
చేరిన
పిల్లలుకూడా
గుణవంతులై,
ఆరోగ్యవంతులై,
ఆనందహృదయులై,
అహంకారరహితులై
అందరికీ
సేవలు
చేయాలని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
The principle of Prema is Divinity itself
Next
If you call ‘Sai!’ with Prema, I answer ‘Here I am!’
→