Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · God's descent is only to make Prema grow
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
God's descent is only to make Prema grow
15 September 1988, Gaṇeśa Caturthī, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
భగవంతుడు
అద్వితీయుడు,
అప్రమేయుడు.
అతనిని
వర్ణించుటకు
ఒక
ప్రమాణము
అక్కరలేదు.
సర్వత్ర
వున్నది
ఒక్క
సర్వేశ్వరుడే.
రెండవ
పదార్థము
వుండినప్పుడే
పోలిక
అనేది
జరుగుతుంది.
రెండవ
పదార్థమే
లేదు.
ఏకమేవ
అద్వితీయం
బ్రహ్మ.
ఇట్టి
భగవత్
తత్వాన్ని
గుర్తింప
చేసే
నిమిత్తమై
‘ఏకోహం
బహుస్యాం’
అని
తనకు
తాను
సంకల్పించుకున్నాడు.
దేవుడు
తానే
తన
సంకల్పము
చేత
సర్వమూ
తన
రూపములో
వచ్చాడు.
అన్ని
మతములు
కూడా
యీ
సత్యాన్ని
ఒప్పుకున్నవి.
బైబులునందు
కూడా
God
created
man
in
His
own
image
అని
వున్నది.
ఈ
ఏకత్వము
నుండే
అనేకత్వమన్నది
ఆవిర్భవించింది.
దేవుడు
ఒక్క
మానవునకు
మాత్రమే
ప్రకృతిని
వశము
చేసుకొనే
శక్తి
సామర్థ్యము
లందించాడు.
ఇట్టి
విజ్ఞానము
మానవునియందు
వికసిస్తూ
పోగా
మానవునందు
పశుత్వము
క్షీణించి
సభ్యతా
సంస్కృతి
కూడా
అభివృద్ధి
అవుతూ
వచ్చింది.
భగవంతుడు
మానుష
రూపుడు.
దైవం
మానుష
రూపేణా.
కనుక
మానవుడనగా
ప్రాకృతికమైన
యింద్రియముల
చేతను,
ప్రాణముల
చేతను,
సంస్కృతి
చేతను
అభివృద్ధి
పడిన
వాడని
మాత్రము
మనము
భావించరాదు.
దైవం
మానవ
రూపుడు
…
వారి
భావములు
కూడా
వేరు
వేరుగా
వుండవచ్చును.
ఐతే
భారతీయ
సంస్కృతి
ఏ
విధమైన
మార్పులు
లేక,
నిత్య
సత్యమై
రాణించేటువంటిది.
కాలముచే
మారక
ప్రళయముచే
నశించక
సృష్టికి
తరగక
యే
సత్యమైతే
వున్నదో
ఆ
సత్యమునకు
రూపకల్పనే
భారతీయ
సంస్కృతి.
ఇట్టి
సంస్కృతికి
అంతర్వాహినియై
ప్రవహించునదే
సనాతన
ధర్మము.
భారతీయ
సంస్కృతి
భక్తి
ప్రధానమైనదిగా,
ప్రమాణమైనదిగా
నిరూపించినది.
దేవాలయములకు
వెళ్లటము,
నమస్కరించటము,
తీర్థ
యాత్రలు
గావించటము
యిత్యాది
కర్మల
ద్వారానే
భక్తిని
సాధించటానికి
వీలుకాదు.
ఇవన్నీ
భక్తికి
సంబంధించిన
కొన్ని
చర్యలు
మాత్రమే.
కాని
అన్నింటికి
ఆధారమై,
అన్నింటిని
పోషించి,
అన్నింటిని
ప్రసరించి
అన్నింటినీ
ప్రభవించే
శక్తి
ఒకటి
వున్నది.
అదే
పరిపూర్ణమైన
ప్రేమ.
ఈ
ప్రేమ
యెట్టి
కారణములకు
సంబంధించనటువంటిది.
నది
సముద్రమును
చేరుటకు
యేవిధమైన
సహజ
వృత్తిని
అనుభవించుచున్నదో,
లత
స్వతసిద్ధముగా
వృక్షమును
అల్లుకొనుటకు
ప్రయత్నించునో
అదే
విధముగా
ప్రేమ
అనేది
భగవంతుని
పొందే
నిమిత్తము
ప్రయాణమయ్యేదేగాని
ప్రాకృతమైన
వాంఛలతో
కూడినది
కాదు.
2
▾
Meaning
Keep
ఇట్టి
పవిత్రమైన
ప్రేమతత్వాన్నే
భాగవతము
ఆనాటి
ప్రపంచమునకు
చాటినది
పరమాత్ముని
సన్నిధి
అనే
పెన్నిధిని
అనుభవించే
నిమిత్తమే.
ప్రేమ
నిస్వార్థమైన
ప్రేమగా
ప్రవహిస్తుంది.
భగవంతుడు
తప్ప
నాకు
కావలసినది
అన్యము
లేదని
విశ్వసిస్తుంది.
సర్వత్రా
వున్న
భగవత్
తత్వము
ఏకత్వమని
భావిస్తుంది.
ఏకోహం
బహుస్యాం
అనే
సత్యాన్ని
ఆదరిస్తుంది.
సర్వపదార్థములు
కూడా
భగవంతుని
నిర్ణయములే.
నామ
రూపములన్నీ
భగవంతుని
ప్రభావములే.
కాని
దీనిని
మానవుడు
వేరువేరుగా
భావించి
విభజించటము
చేత
బాధలకు
గురౌతున్నాడు
దీనికి
కారణము
అహంభావమే.
అహం
కలిగిన
భగవంతుడు
కానరాడు.
అహము
చచ్చెనేని
పరమాత్మ
వచ్చు
ఈ
అహము
ఆత్మలో
కూడిన
అదియె
ముక్తి.
అనగా
ఆత్మనుండి
అహము
వుద్భవిస్తున్నది.
అహమునుండి
తలంపు
ప్రారంభమవుతుంది.
ఈ
తలంపు
నుండి
వాక్కు
బయలుదేరుతుంది
ఇవన్నీ
ఆత్మనుండి
ఆవిర్భవించినవే.
ఆత్మకు
అహమునకు
యెట్టి
సంబంధమూ
లేదు
…ం
వుండినంత
వరకు
ఆత్మ
కనుపించదు.
అహము
లేకుండా
ఆత్మ
వుండవచ్చునుగాని
ఆత్మలేక
అహము
వుండుటకు
వీలు
లేదు.
అహము
నిర్మూలమైనప్పుడే
ఆత్మతత్వము
అర్థమవుతుంది.
అహం
అనేది
కేవలము
భ్రమ
మాత్రమే.
ఈ
భ్రమే
మానవుని
కట్టి
వేస్తున్నది.
ఈ
సమస్త
ప్రపంచము
ఆత్మనుండే
ఆవిర్భవించింది.
ఆత్మయందే
జీవించుచున్నది.
ఆత్మయందే
లయమగుచున్నది.
బ్రహ్మ
సూత్రమునందు
తత్
జలాన్
అని
సూత్రము
వుంది.
‘తత్’
అనగా
దాని
నుండి
‘జ’
అనగా
పుట్టటము.
ల
అనగా
లయము
కావటము.
అన్
అనగా
పోషించటము.
కనుక
తత్
జలాన్
అనగా
దానినుండే
పుట్టి
దానినుండే
పెరిగి
దానినుండే
పెరిగి
దానిలోనే
లయమొందుచున్నది.
కనుక
మానవుడు
కూడా
బ్రహ్మయందే
పుట్టి,
బ్రహ్మలోనే
పెరిగి,
బ్రహ్మలోనే
లయమగుచున్నాడు.
ఈ
విధముగా
ఏకత్వాన్ని
ప్రపంచమునకు
చాటే
నిమిత్తమై
కర్మ,
ఉపాసన,
జ్ఞానము
అనే
మార్గములను
కనిపెట్టి
భగవత్
సృష్టి
రహస్యాన్ని
ప్రపంచమునకు
తెలియచేయటానికి
పూనుకోటమే
ఆధ్యాత్మికము
యొక్క
ధ్యేయం.
అనేకత్వము
నుండి
ఏకత్వాన్ని
నిర్ణయించి
యీ
ఏకత్వము
లోపల
ఆత్మ
తత్వాన్ని
దర్శించి
ఆనందము
అనుభవించటమే
మానవుని
ప్రధాన
కర్తవ్యము.
భజనలు
చేయటమే
భక్తి
కాదు.
ధ్యానము
భజనలు,
యోగము,
తపస్సు
యివన్నీ
భక్తికి
ఉపాంగములే
కాని
యివి
ప్రధానమైన
భక్తి
కాదు.
రెండవ
పదార్థమును
ఆశించనిదే
భక్తి.
తాను
తానై
బ్రతికేటువంటిదే
భక్తి.
అనేకత్వముగా
గోచరించుచున్నప్పటికిని
దీనికన్నింటికి
ఆధారమైన
మూలము
ఒక్కటి
వున్నది.
ఒక
విత్తనం
నాటినప్పుడు
అది
మొక్కగా
బయలుదేరి
తదుపరి
పెద్ద
వృక్షముగా
వస్తుంది.
ఆ
వృక్షమునందే
అనేకమైన
కొమ్మలు,
రెమ్మలు
ఆకులు
పువ్వులు
యేర్పడుతుంటాయి.
3
▾
Meaning
Keep
His poems 169
Also in his talks
(10)
10 December 1986
Faith in the Ātma alone gives all strength
17 June 1996
He Who Reaches God's Presence Is Honoured Everywhere
21 June 1996
Śraddhā and Faith Win God's Grace
10 July 1996
Follow the Religion of Love
23 November 1996
We Must Make Human Life a Life Full of Prema
29 March 1998
God fills every place
12 November 2003
Grow Prema for God and pity for the helpless
21 July 2005
No power is greater than Bhakti for God
7 October 2005
Surrender to God
22 August 2007
Foster faith in God and love of country!
ఇవి
బీజము
లోపలే
అణుమాత్రముగా
నిలిచివున్నాయి.
దీనిని
పురస్కరించుకొనే
గీతయందు
బీజం
మాం
సర్వభూతానాం
అని
చెప్పబడివున్నది.
ఒక
విత్తనము
నాటినప్పుడు
అది
వృక్షముగా
అభివృద్ధి
పొందుతుంది.
ఆ
వృక్షములో
ఆకులు,
పువ్వులు,
కాయలు
అనేకముగా
కాస్తుంటాయి.
కాని
ప్రతి
ఫలమునందు
ఒక
విత్తనము
యేర్పడుతుంది.
అదే
విధముగనే
భగవంతుడు
అనే
ఒక
విత్తనమునుండి
ప్రకృతి
అనే
విశాలమైన
వృక్షము
అభివృద్ధి
పొందింది.
ఈ
వృక్షము
లోపల
సంబంధ
బాంధవ్యములు
కొమ్మలు
రెమ్మలుగా
అయిపోయినవి.
ఇందులో
మన
భావములు
పుష్పములుగా
యేర్పడుతున్నాయి.
మన
జీవితము
ఒక
ఫలముగా
రూపొందుతుంది.
అయితే
ప్రతి
జీవుడూ
ఫలమునందు
విత్తనముగా
చేరి
వుంటాడు.
అదే
సంకల్పము
వలన
సర్వము
కూడా
అతని
ఆకారముగా
రూపొందుతూ
వచ్చాయి.
ప్రాకృతముగా
అనేకరూపములు
వుండినప్పటికి
భావరీతిలో
మనము
ఏకత్వము
అనుభవించటానికి
ప్రయత్నించాలి.
భగవంతుడా!
నీకంటె
అన్యముగా
జీవించుటకు
వీలుకాదు.
నేను
నీతోనే
కూడి
వుండాలి.
నీతోనే
ఆడాలి.
నీతోనే
జీవితాన్ని
అంతము
చేసుకోవాలి.
ఇది
పరమభక్తికి
చెందిన
గుర్తులు.
ఇలాంటి
పరమ
భక్తికి
సంబంధించిన
సాధకులను
మనము
అభివృద్ధి
చేయుటకు
ప్రయత్నము
చెయ్యాలి.
సుఖమునందు
భగవంతుని
వర్ణించటము
కష్టమునందు
భగవంతుని
దూషించటము
యీ
విధమైన
భేదభావములను
మనము
ప్రదర్శించరాదు
భాగవతము
నందు
గోపికలకు,
పాండవాగ్రజుడైన
ధర్మజునకు
మాత్రమే
యిట్టి
భక్తి
అభివృద్ధి
చెందుతూ
వచ్చింది.
ఎన్ని
కష్టములు
వచ్చినప్పటికి,
ఎన్ని
అవమానములు
అనుభవించినప్పటికి,
కృష్ణుని
విషయములో
తాను
యేమాత్రమూ
సందేహ
పడలేదు.
అడవులందున్నా,
పట్టణములందున్నా,
ఎక్కడున్నా
నీవే
నాకు
దిక్కు
అన్న
ఆశయాన్ని
ఆధారం
చేసుకున్నాడు.
అడవులందున్న
ఆకసమున
నున్న
పట్టణమున
నున్న
పల్లెనున్న
గుట్టమీదనున్న
నట్టేటనేవున్న
దిక్కునీవె
కృష్ణా
ఇట్టి
ఏకైక
ప్రేమతో
కూడినవాడు
కనుకనే
అతడు
ఆదర్శమైన
జీవితాన్ని
యితరులకు
అందించగలిగాడు
ఐతే
భగవదవతారములు
కొన్ని
కారణములు
పురస్కరించుకొని
వస్తాయి.
మానవుని
జన్మకు
కర్మ
కారణము.
ఈ
కర్మకు
ఆధారమైన
జన్మయే
మనకు
లభిస్తుంది.
అయితే
ఎవరి
కర్మను
వారు
పురస్కరించుకొని
ఆయా
రూపములను
ధరించవచ్చు.
కర్మను
బంధని
మనుష్యలోకే
అని
అన్నారు.
ఐతే
భగవంతుడు
మానవాకారమును
ధరించుటకు
చేసిన
కర్మ
ఏమిటి?
అని
కొంతవరకు
సందేహించవచ్చు.
4
▾
Meaning
Keep
భగవంతుని
అవతరణకు
కర్మలు
కాదు
ఆధారము.
అయితే
దుష్టులు
చేసిన
పాపములు,
సజ్జనులు
చేసిన
పుణ్యములే
దీనికి
మూలకారణము.
ప్రహ్లాదుడు
పొందిన
భక్తి
ప్రపత్తులకు,
హిరణ్యకశిపుడు
అనుభవించిన
దుర్గుణములకు
కారణముగా
నరసింహావతారము
వచ్చింది.
భగవదవతారమునకు
ప్రాకృతముగా
జీవించే
భావములే
కారణములుగాని
కర్మలు
కారణము
కాదు
సస్యములు
నీటి
నిమిత్తమై
యనేక
విధములుగా
కాచుకొని
వుంటాయి.
అయితే
మేఘముల
వరకు
యీ
మొక్కలు
అభివృద్ధి
కావు.
నిరంతరము
నీటి
చింతనే
చేస్తూ,
నీటినే
ఆశ్రయించే
భావముతో
వుండటము
చేత
మేఘములే
క్రిందకు
దిగి
సస్యములను
పోషిస్తూ
వుంటాయి.
అదే
విధముగా
భక్తులను
పోషించి
రక్షించి,
ధర్మాన్ని
స్థాపించే
నిమిత్తమై
భగవంతుడు
క్రిందకు
దిగి
వస్తాడు.
దానిని
అవతరణ
అన్నారు.
అనగా
క్రిందకు
రావటము.
తన
వున్నతమైన
స్థితిని
విడిచి
పెట్టి
మానవులను
రక్షించే
నిమిత్తమై
వారిని
సంతోషపెట్టే
నిమిత్తమై
తాను
క్రిందకు
దిగుతూ
వుంటాడు.
ఇలాంటి
పవిత్రమైన
రహస్యములను
గుర్తించుటకు
మానవులు
ప్రయత్నించటం
లేదు
భక్తికి
మించినది
యీ
జగత్తున
లేదు.
ఒకానొక
సమయములో
నారదుడు
తన
శిష్యులకు
వుపదేశమిస్తూ,
భక్తికి
మించినది
మరొకటి
లేదని
అన్నాడు.
అందులో
ఒక
విద్యార్థి
లేచి
‘గురువుగారూ!
పంచభూతమైన
జగత్తునందు
భూమి
చాలా
పెద్దది
కదా!
ఈ
భూమికంటె
భక్తి
పెద్దదా?’
అన్నాడు.
‘నిజమే!
యింత
పెద్దదైన
భూమిని
జలము
మూడు
భాగములు
మ్రింగివేసింది.
ఇప్పుడు
భూమి
పెద్దదా
జలము
పెద్దదా?’
అని
నారదుడు
అడిగాడు.
శిష్యుడు
జలము
పెద్దదని
అన్నాడు.
ఐతే
యీ
జలమును
అగస్త్యముని
ఒక
గుటకలో
త్రాగినాడు!
అగస్త్యుడే
గొప్పవాడని
శిష్యుడన్నాడు.
‘ఇంత
గొప్పవాడైనా
అగస్త్యుడు
ఆకాశములో
చిన్న
చుక్కమాదిరి
వున్నాడు’
అన్నాడు
నారదుడు.
‘ఆకాశమే
గొప్పది
స్వామీ’
అన్నాడు
శిష్యుడు.
‘అయితే
వామనావతారములో
వచ్చినప్పుడు
మూడు
అడుగుల
భూమిని
వామనుడు
కోరాడు.
ఒక్క
అడుగులో
భూమిని
ఆక్రమించాడు,
రెండవ
పాదములో
ఆకాశమును
ఆక్రమించాడు.
ఒక్క
పాదములోనే
ఆకాశమును
ఆక్రమించినప్పుడు
భగవంతుని
పాదము
గొప్పదా
ఆకాశము
గొప్పదా?’
అని
నారదుడు
ప్రశ్నించాడు.
భగవంతుని
పాదమే
యింత
గొప్పదిగా
వుండినప్పుడు
భగవంతుడే
గొప్పవాడని
అన్నాడు.
‘ఇంత
గొప్పవాడైన
భగవంతుని
భక్తుడు
తన
హృదయములో
కట్టివేస్తాడు.
కనుక
భగవంతుడు
గొప్పవాడా
భక్తుని
హృదయము
గొప్పదా?’
అని
ప్రశ్నించాడు.
భక్తి
గొప్పదని
చెప్పాడు
బాలుడు.
భక్తికంటె
మించిన
పరమ
ఔషధము
మరొకటి
లేదు.
ఈ
జగత్
సంబంధమైన
సర్వరోగములు
నివారణ
చేసేటువంటిది
భక్తి.
ఈ
భక్తికంటె
మించిన
వేదశాస్త్రములు
లేవు.
5
▾
Meaning
Keep
భగవంతుని
చేరే
నిమిత్తమై
సర్వము
త్యాగము
చేయవలసి
వస్తుంది.
ఇలాంటి
అనంతమైన
భక్తి
తత్వాన్ని
ప్రపంచానికి
నారదుడు
చాటాడు.
పవిత్ర
భారతీయుల
పర్వదినములన్నీ
కూడా
అంతరార్థములతో
కూడిన
ఆధ్యాత్మిక
ఆచరణాలే.
ప్రతి
పర్వదినము
కూడా
భగన్మయమైనదిగా
భావిస్తూ
వచ్చారు.
ఆనాడు
వంటిని,
యింటిని
కూడా
పరిశుభ్ర
పరచుకొని,
ప్రత్యేకమైన
పూజలను
సలిపి,
కొబ్బరి
కాయలను
కొట్టి
యనేక
రకములైన
దైవ
కార్యముల
చేత
ఆ
దినమును
సద్వినియోగము
చేస్తుంటారు.
ఈనాటి
పర్వదినము
యొక్క
రహస్యాన్ని
అనేకులు
అనేక
విధములుగా
వర్ణిస్తూ
వుంటారు.
మానవుని
తలకు
ఏనుగు
తల
పెట్టటానికి
వీలవుతుందా?
దానికి
అంతరార్థము
వుంటున్నాది.
మహా
తెలివిగలవాడు
కనుక
గణపతికి
ఏనుగు
శిరస్సును
పెట్టారు.
గజ
తెలివి
అనే
పదము
మనము
ఉపయోగ
పెడతాము.
అందుకోసమే
గణపతిని
బుద్ధి
వినాయక,
సిద్ధి
వినాయక
అని
అంటున్నాము.
వినాయకుడనగా
ఆశ్చర్యకరములైన
పనులు
చేయించే
నాయకుడు.
అతడు
గొప్ప
తెలివి
తేటలు
కల్గినటువంటివాడు.
అతడు
అన్ని
గణములకు
నాయకుడు.
రుద్రగణములకు,
భద్రగణములకు
యింకా
అనేక
గణములకు
యితడు
నాయకుడుగా
నిల్చాడు.
అందువలన
యితన్ని
గణనాయకుడని,
గణపతి
అని
అన్నారు.
గణపతి
కేవలము
తెలివికి
సుస్వరూపుడని
అర్థము.
మహాభారతము
వ్రాయుటకు
పూర్వము
వ్యాసుడు
గణపతిని
ప్రార్థించాడు.
అప్పుడు
గణపతి
‘నీవు
చెప్పినది
నేను
వ్రాస్తాను.
కానీ
నీవు
మధ్యలో
కాలమును
వ్యర్థము
చేస్తివా
నేను
దీనిని
వదలిపెడతాను’
అన్నాడు.
వ్యాసుడు
చెబుతూ
వస్తున్నాడు.
గణపతి
ఒక్క
క్షణములో
వాటిని
వ్రాస్తున్నాడు.
యితన్ని
తృప్తిపరచే
నిమిత్తమై
అనేక
విధములైన
శ్లోకములను
చేకూరుస్తూ
వచ్చాడు.
గణపతికి
విరామము
చేయాలని
వుద్దేశ్యముతో
వ్యాసుడు,
వ్యాసునకు
చెప్పకుండా
చేయాలని
గణపతి
పట్టుపట్టారు.
ఈ
భారతము
100
కోట్ల
శ్లోకాలుగా
వ్రాసాడు.
అది
పూర్తయిన
తరువాత
దానిని
చూస్తే,
అది
సామాన్యమైనది
కాదని
తెలుసుకున్నారు.
అది
పంచమ
వేదము.
అద్భుతమైన
అగమ్యమైన
విషయాలను
దానిలో
చేర్చారు.
ఇట్టి
పవిత్రమైన
భారతాన్ని
మానవులు,
దేవతలు,
దానవులు
అనుభవించాలని
ప్రార్థించారు.
ఈ
100
కోట్ల
శ్లోకాలను
అందరికి
సమానముగా
పంచేసరికి
ఒక్క
శ్లోకం
మిగిలింది.
ఈ
శ్లోకములో
32
అక్షరాలు
వుంటున్నాయి.
ఒక్కొక్కరికి
10
అక్షరాలు
యిచ్చాడు.
ఇంకా
రెండు
అక్షరాలు
మిగిలాయి.
ఈ
రెండు
అక్షరాలే
హరి,
హర,
రామ,
కృష్ణ,
సాయి
అని
గణపతి
చెప్పాడు.
మిగిలిన
రెండు
అక్షరాలే
దైవనామముగా
మిగిలాయి
ఇటువంటి
పవిత్ర
గణపతి
తత్వాన్ని
మనము
ఎందుకు
పూజించాలి?
మానవునకు
అనేక
విఘ్నములు
ఎదురౌతూ
వుంటాయి.
అట్టి
బాధలను
ఆటంకములను
దూరము
చేసి
నిర్విఘ్నముగా
కాపాడమని
గణపతిని
ప్రార్థిస్తూ
వుంటారు.
మొట్టమొదటి
పూజ
గణపతిది.
6
▾
Meaning
Keep
ఎందుకీ
గణపతికి
ప్రథమ
స్థానమిచ్చారు?
ఒకానొక
సమయములో
పార్వతి
ఈశ్వరుడు
గణపతి
గొప్పవాడా,
సుబ్రహ్మణ్యం
గొప్పవాడా
నిర్ణయించటానికి
యుక్తి
పన్నారు.
వారిద్దరిని
కూర్చోబెట్టి
‘నాయనలారా!
మీకు
ఒక
కార్యము
నిస్తున్నాను.
దానిని
పూర్తి
చేసుకురండి.
మీరు
పెరుగుతూ
పెరుగుతూ
వస్తున్నారు.
పెరిగే
పిల్లలకు
బాధ్యత
నివ్వాలి.
లేకపోతే
తమోగుణము
పెరిగిపోతుంది.
ఈ
ప్రకృతిని
ఎవరైతే
చుట్టుకొని
వస్తారో
వారికి
ఒక
ఆధిపత్యాన్ని
యిస్తున్నాను’
అన్నాడు.
ఈ
మాట
విన్న
తక్షణమే
సుబ్రహ్మణ్యం
నెమలినెక్కాడు.
లోకాన్నంతా
చుట్టాలని
నిర్ణయించాడు.
కాని
గణపతి
ఒక్కడుగైనా
ముందుకు
వెయ్యలేదు.
పార్వతీ
పరమేశ్వరులు
ఆశ్చర్యపోయారు.
‘ఏమిటి!
వీడు
యిక్కడే
వున్నాడు.
సుబ్రహ్మణ్యానికే
బహుమతి
వస్తుంది
గణపతికి
రాదని’
అనుకున్నారు.
చాలా
అలసిపోయి
సుబ్రహ్మణ్యం
ప్రకృతిని
చుట్టి
దూరములో
వస్తుండగా
చూచి
అమ్మానాన్నను
చుట్టి
అక్కడే
కూర్చున్నాడు
గణపతి.
కారణమడిగినప్పుడు
‘ప్రకృతి
అంతా
భగవంతుని
స్వరూపము.
విశ్వం
విష్ణు
స్వరూపం.
ఎప్పుడు
నా
తల్లితండ్రులకు
ప్రదక్షిణ
చేశానో
ప్రకృతి
అంతా
ప్రదక్షిణ
చేసిన
వాడనౌతాను’
అన్నాడు
గణపతి.
ఈశ్వరుని
అడిగాడు
‘మీరు
లేని
స్థానమేదో
నాకు
చూపించండి.’
ఇతని
తెలివితేటలను
చూచి
‘నాయనా!
నీవు
ప్రథమ
పూజనందుకొందువు’
అని
గణాలకు
నాయకుడుగా
అతన్ని
నియమించారు.
అందువలన
ప్రతిదానికి
అంతరార్థములున్నాయి.
ఈ
ఏనుగు
తల
ఎందుకు
పెట్టారు.
ఏనుగుతల
మనిషికి
పెడితే
ఎంత
వికారముగా
వుంటుంది.
కాని
గణపతి
వికారముగా
కనుపించడు.
చాలా
అందముగా
కనుపిస్తాడు.
ఇట్టి
తెలివి
తేటలు
గల
తత్వమునకే,
యిట్టి
మేధా
శక్తికే
యిట్టి
స్థానము
నందించారు.
బాహ్య
జీవితానికి,
ప్రాకృతిక
జీవితానికి
యీ
మేధస్సును
నిరూపించే
నిమిత్తమై
ఏనుగుతల
గణపతికి
యిచ్చారు.
రావణునికి
పది
తలలు
అన్నారు.
పది
తలలు
ఎవరికైనా
వుంటాయా.
వుంటే
హాస్యాస్పదముగా
వుంటుంది.
కామ
క్రోధ
లోభ
మద
మాత్సర్యములు,
మనస్సు
బుద్ధి
చిత్తం
అహంకారము.
ఇవి
పది
ఈ
గుణములు
కల్గినవాడు
రావణుడు
అన్నారు
కనుక
పది
తలలు
గలవారు
ఎవరంటే
యిక్కడ
అందరు
రావణులే.
మానవుడు
యీనాడు
తనలోని
దోషములను
తీసివేయుటకు
ప్రయత్నించక
పరుల
దోషములను
వెతకటానికి
ప్రయత్నిస్తున్నాడు.
ముఖ్యముగా
ఆధ్యాత్మికములో
అహంకారమును
దూరము
చేసుకోవాలి.
ఈ
అహంకారము
పెరుగుతున్నకొలది
ఆశలు
కూడా
పెరుగుతుంటాయి.
ఈ
ఆశలకు
అంతే
లేదు.
ఇట్టి
ఆశలు
పశు
పక్షి
మృగాదులకు
లేవు.
స్వార్థముగాని,
ఆశగాని
ఒక్క
మానవునియందు
మాత్రమే
వృద్ధిపొందుతున్నది
సిద్ధి
వినాయకుడు,
బుద్ధి
వినాయకుడు
అని
మనము
అంటుంటాము.
ఈ
సిద్ధి
వినాయకుడు
ఎక్కడ
వుంటున్నాడు.
మన
బుద్ధియందే
వుంటున్నాడు.
మన
బుద్ధి
పెడమార్గము
పట్టినప్పుడు
యిది
మనకు
ఆపత్తును
కలిగిస్తుంది.
సక్రమ
మార్గములను
అనుసరించినప్పుడు
సంతోషాన్ని
యిస్తుంది.
ఏ
పని
చేసినా
నేను
మానవుడను,
నేను
మానవుడను
అన్న
విషయాన్ని
గుర్తించుకొని
చెయ్యాలి.
7
▾
Meaning
Keep
ఏదో
కొన్ని
పండుగలను
మనము
చేసుకుంటూ
వస్తున్నాము
Sunday
ను
holidayగా
అనుభవిస్తూ
వున్నాము.
మనము
హోలీడేగా
అనుభవించాలి.
భగవంతుని
తత్వాన్ని
మనము
అర్థము
చేసుకోలేము.
అతని
లీలలు
అవాఙ్మనస
గోచరములు.
చిక్కిన
దానిని
దక్కించుకొని
దానిని
అనుభవించటానికి
ప్రయత్నించటం
మంచిది.
అనవసరముగా
మనము
లేని
పోని
వాదోపవాదములకు
దిగి
వున్న
వివేకమును
గూడ
మనము
కోల్పోరాదు.
అన్నింటికి
ప్రధానమైనది
ప్రేమయే.
ఈ
ప్రేమ
చేతనే
ప్రపంచమును
ఒక్కటిగా
చేయవచ్చు.
ప్రేమ
లేకపోవటం
చేతనే
ద్వేషము
వస్తున్నది.
ఈ
ద్వేషము
మానవత్వాన్ని
నాశనం
చేస్తుంది.
ద్వేషాన్ని
పెంచుకోటం
చాలా
కష్టము.
ప్రేమను
పెంచుకోటం
చాలా
సులభము.
అతి
సులభమైన
దానిని
విడిచిపెట్టి
అతి
కష్టమైన
దానిని
సాధించటానికి
ప్రయత్నిస్తున్నాము.
సత్యము
చెప్పటం
చాలా
సులభము.
అసత్యము
చెప్పాలంటే
చాలా
ప్లానులు
వెయ్యాలి.
చాలా
శ్రమపడాలి.
ఏదో
బుద్ధి
తప్పి
అసత్యము
చెప్పితే
దానిని
కప్పిపుచ్చటానికి
పది
అసత్యాలు
చెప్పాలి.
సత్యము
చాలా
సుఖమైనటువంటిది.
‘సత్యం
బ్రూయాత్
ప్రియం
బ్రూయాత్’
యిలాంటి
సత్యస్వరూపమే
దైవము.
జగత్తునకంతా
సత్యమే
ఆధారము.
ఈ
సత్యము
అవాఙ్మనస
గోచరమైనది.
దేశకాల
పరిస్థితుల
ప్రభావాలకు
మించినటువంటిది.
దీనినే
ఋతం
అని
వేదాంతము
చెప్పింది.
దీనినే
transcendental
truth
అన్నారు.
మూడు
కాలములందు
మారనటువంటిదే
సత్యము.
అట్టి
సత్యాన్ని
మనము
ఆశ్రయించాలి.
భగవంతుడు
ఎక్కడ
వుంటున్నాడంటే
భగవంతుడు
సర్వత్రా
వుంటున్నాడు.
పశ్యతీతి
పశుః
అని
వేదాంతము
చెప్పింది
అనగా
అర్థమేమిటి?
నీవు
చూచే
ప్రతీదీ
భగవంతుడే.
నీవు
ఆనందించేది
ప్రతీదీ
భగవంతుడ్నే.
నీవు
…ముల
పాలయ్యేది
భగవంతుని
వల్లనే.
భగవంతుని
వల్ల
కానటువంటిది
ప్రపంచములో
మరొకటి
లేదు.
కనుపించే
దృశ్యములన్నీ
భగవంతునివే.
అట్టి
శక్తివంతమైన
భావాన్ని
మనము
అభివృద్ధి
పరచుకున్నప్పుడే
ఆత్మతత్వము
మనకు
అర్థమవుతుంది.
మొట్టమొదట
దైవ
విశ్వాసమును
పెంచుకోవాలి.
ఈ
జగత్తునందు
నామములు
వేరుగా
వుండవచ్చును.
ఒకరు
రామ
అనవచ్చు,
కృష్ణ
అనవచ్చు.
పేర్లు
వేరుగా
వుండవచ్చు
కానీ
దైవత్వము
ఒక్కటే.
ప్రతి
మానవుడు
దైవస్వరూపుడే.
‘ఈశావాస్యమిదం
సర్వం,
వాసుదేవ
సర్వమిదం’
అప్పుడే
మానవునకు
మానవునకు
మధ్యనున్న
సంబంధ
బాంధవ్యములు
అభివృద్ధి
చెందుతాయి.
దైవమును
విశ్వసించాలి.
ధర్మాన్ని
నడుచుకోవాలి.
సత్యాన్ని
పాటించాలి.
అప్పుడే
మన
జీవితము
సార్థకమవుతుంది.
కనుక
మొట్టమొదట
నామ
తత్వము
అనేదానిని
నీవు
ఆధారము
చేసుకోవద్దు.
ఇది
దైవత్వమున్న
విశ్వాసాన్ని
మనము
పెంచుకోవాలి.
దీనికి
చిన్న
ఉదాహరణము.
నేను
వెలుగులో
వున్నాను,
నేనే
వెలుగు.
వెలుగు
నాలో
వున్నది.
వెలుగు
నేనే
ఈ
భావము
మనకు
రావాలి.
నాలోన
వెలుగు
వున్నది.
నేను
వెలుగులో
వున్నాను
కనుక
వెలుగు
నేను
ఒక్కటే.
8
▾
Meaning
Keep
నేను
అనేది
Love
వెలుగు
అనేది
Light.
Love
and
Light
యీ
రెండింటి
తత్వమే
ప్రధానమైన
తత్వము.
ఈ
లైటే
జ్ఞానము.
ప్రేమయే
ఉపాసన.
జ్ఞానము
కంటె
భక్తి
చాలా
వుత్తమమైనది.
భక్తిని
మనము
సులభముగా
అనుభవించవచ్చు.
భగవంతుడు
సులభప్రియుడు.
భక్తికి
మాత్రమే
లొంగుతాడు.
అది
ప్రేమ.
ప్రేమ
అది
లోపలనుండి
వూరాలి.
బయటనుండి
కూరకూడదు.
ఏ
కారణమునకు
సంబంధించని
ప్రేమను
మనము
అభివృద్ధి
పరచుకోవాలి.
భగవంతుడు
ఎక్కడ
వున్నాడని
ప్రశ్నించినప్పుడు
నా
హృదయములో
వున్నాడని
అంటారు
చాలామంది.
చాలా
తప్పు
అది.
భగవంతుడు
నీలో
వుంటే
నీవు
పెద్దవాడు
భగవంతుడు
చిన్నవాడు
అయిపోతాడు.
ఈ
వస్తువు
నా
చేతిలో
వున్నదంటే
యీ
చెయ్యి
పెద్దది.
ఈ
వస్తువు
చిన్నది.
భగవంతుడు
నీలో
వున్నాడంటే
నీవు
పెద్దవాడవు.
భగవంతుని
యిముడ్చుకున్నవాడవు.
అది
సరియైన
ఆన్సరు
కాదు.
నీవు
నేను
వారు
అందరూ
భగవంతునిలోనే
వున్నాము,
అందరూ
భగవంతునిలో
వున్నారు
గాని,
భగవంతుడు
మీలో
లేడు.
ఈ
రహస్యాన్ని
మనము
అర్థం
చేసుకోవాలి
కనుక
భగవంతుని
తత్వము
అణోరణీయాన్
మహతోమహీయాన్
అణువులో
అణువుగా
వున్నాడు.
మహత్తులో
మహత్తుగా
వున్నారు.
అందువలన
దైవాన్ని
‘దూరాత్
దూరే
అంతికే
చ’
అని
వేదము
చెప్పింది.
నీ
మనస్సు
భగవంతునకు
ఎంత
దూరముగా
వున్నదో
భగవంతుడు
కూడా
నీకు
అంత
దూరముగా
వుంటాడు.
నీ
ప్రేమను
అతి
పవిత్రముగా
మార్చుకొన్ననాడు
భగవంతుడు
నీకు
అతి
సన్నిహితుడై
పోతాడు.
తల్లికంటె
అతి
సమీపము
భగవంతుడు.
మన
తల్లియైనా
దూరము
కావచ్చుగాని
భగవంతుడు
దూరము
కాడు.
భగవంతుడు
నిన్ను
నిరంతరము
చూస్తున్నాడని
భావించరాదు.
నేనే
భగవంతునిలో
వున్నాననే
సద్భావమును
అభివృద్ధి
పరచుకోవాలి.
ఆ
విధమైన
ఏకత్వాన్ని
అభివృద్ధి
పరచుకొని
ప్రేమ
తత్వాన్ని
పెంచుకున్నప్పుడే
దైవత్వము
మనకు
అర్థమవుతుంది.
పరమాత్ముని
దినమంతా
చింతించి,
ఆదినమంతా
పరమాత్మ
భావంలో
అంకితము
చేయటమే
పర్వదినముల
లక్ష్యము.
ప్రేమస్వరూపులారా!
మీరంతా
ప్రేమను
అభివృద్ధి
పరచుకోవాలి.
ప్రేమ
లేకపోతే
పశువుకంటె
హీనమై
పోతాము.
పశువుకైనా
ప్రేమ
వున్నది
గాని
మానవునకు
స్వార్థమైన
ప్రేమ
తప్ప
విశాలమైన
ప్రేమ
కనుపించటం
లేదు.
ఈనాడు
స్వార్థమనే
దానిని
విసర్జించి,
పరార్థమును
పెంచుకొని,
యథార్థముగా
జీవించి,
జీవితమును
సార్థకము
చేసుకోవాలి.
ఎంతకాలము
వుండినప్పటికి
మన
జీవితము
యేదో
అనవసరమైన
విషయాలలో
ప్రవేశించటం
మంచిది
కాదు.
నీ
కర్తవ్యములను
నీవు
నిర్వర్తించు.
తప్పక
దైవమును
చేరుతావు.
కనుక
భగవంతుడు
అవతరించటము
కేవలము
కష్టములు,
దుఃఖములు,
విచారములు
వీటిని
తీర్చే
నిమిత్తముగాదు.
అవన్నీ
నీ
ప్రార్థనలే
తీరుస్తాయి.
భగవంతుడు
వచ్చేది
ప్రేమను
అభివృద్ధి
పరచే
నిమిత్తమే.
ప్రేమను
పంచే
నిమిత్తమై.
కనుక
ప్రేమమయుడైన
భగవంతుడు
ప్రేమను
అందించటం
కోసం
వచ్చాడు.
ఈ
సత్యాన్ని
మనము
హృదయములో
భద్రము
చేసుకొని
ప్రేమగా
బ్రతికి
అందరిలో
సన్నిహిత
సంబంధ
బాంధవ్యాలను
పెంచుకొని
అందరిని
ఆప్యాయముతో
ఆదరించటానికి
పూనుకోవాలి.
9
▾
Meaning
Keep
ఇది
మానవుని
ప్రధానమైన
కర్తవ్యము.
కనుక
ఎవరి
మనసును
మనము
నొప్పించరాదు.
కారణమేమనగా
ఆ
నొప్పి
మనము
పదింతలుగా
అనుభవించవలసి
వస్తుంది.
మంచి
చెడ్డలు
యీ
జగత్తులో
వుంటున్నాయి.
ఎట్టి
భావమో
అట్టి
ఫలితము.
కనుక
మనము
మన
భావాలను
మొట్టమొదట
పరిశుద్ధము
చేసుకున్నప్పుడు
మన
జీవితము
మారిపోతుంది.
కనుక
ప్రేమమయులు
కండి.
భగవత్ప్రేమ
చాలా
పవిత్రమైనది.
ఆ
ఒక్క
ప్రేమను
మనము
అణు
మాత్రము
సంపాదించినా
అఖండమైన
ఆనందాన్ని
అనుభవిస్తాము.
మీ
హృదయములో
ప్రేమను
అభివృద్ధి
పరచుకోండి.
Previous
←
The body itself is a temple!
Next
Brahman Itself Is the Root Power of the World!
→