Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · The Ātma in All Is One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Ātma in All Is One
7 November 1989
1
▾
Meaning
Keep
His poems 55
Also in his talks
(9)
5 December 1976
The fortune of health
26 February 1987
There is no sādhana greater than remembering the Name
28 September 1987
The in-breath and out-breath of the Supreme Person are the Veda
20 July 1988
All learning without practice is useless
15 October 1988
All Things and All Beings in the World Are Forms of the Paramātma!
3 April 1990
Rama, the Indweller
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
9 September 1996
Satyaṁ Jñānam Anantaṁ Brahma
21 February 2001
‘I’ itself is God
మానవుడు
ఎన్ని
భౌతిక
విద్యలు
నేర్చినప్పటికి
చిత్తశుద్ధి
ఒక్కటి
లేకుండిన
ఆత్మతత్వాన్ని
అర్థం
చేసుకోలేడు.
మానవుడు
ఎన్ని
డిగ్రీలు
సంపాదించినా,
టైటిల్సు
పొందినా
చిత్తశుద్ధి
లేకుండిన
తనను
తాను
గుర్తించుకోలేడు.
వేదవేదాంగములు
వల్లెవేసియున్న
గద్య
పద్యంబులను
గూర్పగలిగియున్న
చిత్తశుద్ధియె
లేకున్న
చెడునువాడు.
కనుక
వేదవేదాంగ
విద్యలు
నేర్చటంగాని,
శాస్త్రములు
వల్లె
వేయటంగాని,
పద్య
గద్యములను
కూర్పకలిగినా
చిత్తశుద్ధి
లేనివాడు
కేవలం
ఒక
గ్రామఫోను
వంటివాడు.
కన్నులున్నవాడు
కనులు
తెరుస్తే
జగత్తులోనున్న
కొన్ని
వస్తువులనైనా
చూడగలడు.
ఎంత
గొప్ప
పండితుడైనా
కనులే
లేకుండిన
దగ్గరనున్న
వస్తువును
కూడా
తాను
చూడలేడు.
గాఢనిద్రలో
వున్నవాడు
మహాఘనుడైనప్పటికిని
ఏవస్తువును
కూడ
జాగ్రదవస్థలోనున్న
జగత్తును
చూడలేడు.
ఏ
విద్యలు
తెలియని
అమాయకుడు
మేలుకున్నప్పటికి
జగత్తును
చూడగలడు.
అదేవిధంగా
మానవుడెన్నియో
సాధనలు
చేస్తున్నాడు.
అధ్యాత్మికంగా
ఎన్నియో
పరిశోధనలు
సలుపుతున్నాడు.
జపతపాది
యాగములను
ఆచరిస్తున్నారు.
ఎన్ని
చేసినప్పటికిని
లోపల
చిత్తశుద్ధి
మాత్రం
అత్యవసరం.
అది
లేకుండిన
అధ్యాత్మికము
లోపల
ఏమాత్రం
ముందంజవేయలేడు.
ఆత్మతత్వము
తానే
అయివున్నాడు.
తనను
తాను
గుర్తించుకోలేకపోవటానికి
కారణం
ఏమిటి?
చిత్తశుద్ధి
లేకపోవటమే.
నివురుగప్పిన
నిప్పువలె
ఆత్మ
వికారమనే
నివురుతో
నిండివుంది.
పైన
కప్పబడిన
నివురును
తీసివేసినప్పుడు
నిప్పు
సహజంగానే
కనుపిస్తుంది.
అదే
విధంగా
అహంకారము,
మమకారము
రెండు
కప్పబడటం
చేత
మానవత్వంలోవున్న
ఆ
దివ్యత్వమనే
ఆత్మతత్వాన్ని
గుర్తించుకోలేక
పోతున్నాడు.
ఈ
అహంకార
అభిమానములను
నిర్మూలం
గావించినప్పుడే
యీ
ఆత్మను
తాను
తానుగా
గుర్తిస్తాడు.
మానవునకు
అహంకారము
మహా
ప్రమాదము.
ఏది
లేకపోయినా
కొంతవరకు
జీవించవచ్చునుగాని
అహంకారము
చేత
మానవత్వాన్ని
కొంతవరకు
నిర్మూలం
గావించుకుంటున్నాడు.
ఈ
అహంకారమునకు
మూలకారణమేమిటి?
ధనమా
లేక
విద్యనా
లేక
బలమా?
ఏదీకాదు.
ఇవన్నీ
క్షణభంగురములు.
ఐతే
యీ
అనిత్యము,
అశాశ్వతము
అయిన
దానిని
ఆధారం
చేసుకొని
నిత్యసత్యమైన
దివ్యత్వాన్ని
విస్మరిస్తున్నాడు
మానవుడు.
మానవునకు,
పశువునకు
యేమాత్రం
వ్యత్యాసము
లేదు.
పశువుకు
భార్య
బిడ్డలుంటున్నారు.
2
▾
Meaning
Keep
మనిషికి
భార్య
బిడ్డలుంటున్నారు.
పశువు
త్రాగుతోంది,
తింటున్నది.
మనిషి
త్రాగుతున్నాడు,
తింటున్నాడు.
పశువు
నిద్రిస్తుంది
ఆకలి
అనుభవిస్తోంది.
మనిషి
కూడా
నిద్రిస్తున్నాడు,
ఆకలి
దప్పులను
అనుభవిస్తున్నాడు.
పశువుకూ
కొన్ని
ఆశలుంటున్నాయి.
ఇంక
చతుష్పాద
పశువుకు,
ద్విపాద
పశువుకు
యేమిటి
వ్యత్యాసము?
జంతూనాం
నరజన్మ
దుర్లభమ్.
నరుడు
కూడా
ఒక
జంతువులో
చేరినటువంటివాడే.
ఐతే
యీ
జంతువులో
వున్న
భావాలు
ఉన్నతమైన
స్థాయికి
చేరినప్పుడే
మానవుడౌతాడు.
ఈనాటి
మానవునిలో
స్వార్థము
స్వప్రయోజనము
యీరెండు
పెద్ద
పిశాచాలవలె
చేరివుంటున్నాయి.
తద్వారా
జగత్తునే
మరచిపోతున్నాడు.
మానవుడు
జగత్తులో
జన్మించినపుడు
ఆదర్శప్రాయుడైన
మానవునిగా
రూపొందాలి.
అందుకు
తగిన
సద్గుణములు,
సదాలోచనలు,
సత్ప్రవర్తనలు
అభివృద్ధిగావించుకోవాలి.
ఇతరులకు
చెడు
జరిగే
విధంగా
మనం
పాల్గొనరాదు.
వారిని
lead
చేయకూడదు.
ఈనాటి
మంచికులములో
పుట్టినవారు
కొందరు
దురభ్యాసముల
చేత,
స్వార్థము
చేతను
bad
lead
చేస్తున్నారు.
ఇలాంటి
వారు
పశువులకన్నా
హీనమైనవారు.
వీరంతా
కేవలం
మనసును
మాత్రమే
అనుభవిస్తున్నారు.
మనసుననుభవించేవాడు
పశువుతో
సమానము.
బుద్ధిని
అనుభవించేవాడు
పశుపతితో
సమానము.
ప్రతిదానికి
కూడా
ఒక
discrimination
వుంటుంది.
Is
it
right
or
wrong?
Is
it
good
or
bad
అనే
discrimination
చెయ్యాలి.
మానవుడు
discriminationలో
పూర్తి
fail
అయిపోతున్నాడు.
కేవలం
చిన్నచిన్నవాటికి
లోబడిపోతున్నాడు.
మానవుడు
master
కావాలిగాని
slave
కాకూడదు.
ఈనాడు
senses
కంతా
slave
అయిపోతున్నాడు.
mindకి
slave
అయిపోతున్నాడు.
ఇంక
వాడు
master
ఎలా
కాగలడు?
Master
అనగా
మన
senses
కు
మనం
master
గా
వుండాలి.
మన
controlలో
పెట్టుకోవాలి
sensesను.
అప్పుడే
నీవు
master
కాగలవు.
నీవు
master
కాకుండా
బానిసైపోతే
ప్రపంచానికే
దుర్మార్గమును
అందించినవాడవవుతావు.
కైక
మహారాణి.
ఆమె
master.
కాని
మంధర
ఆమె
servant.
Servantకు
దాసురాలైపోయింది.
చూశారా?
కైక
తన
servantను
తన
controlలో
పెట్టుకోవాలి.
కాని
servant
controlలో
master
పోయినప్పుడు
ప్రపంచములో
చెడ్డపేరును
పొందింది.
కనుకనే
మానవత్వంలో
దుర్భావములు,
దుశ్చింతలు
ప్రవేశించరాదు.
చెడ్డ
మాటలు
చెప్పకూడదు.
చెడ్డమాటలు
వినకూడదు.
చెడ్డమాటలు
తలవ
కూడదు.
చెడ్డ
పనులు
చేయకూడదు.
దీనికి
నలుగురు
ఆదర్శములు.
మంధర
చెడ్డమాటలు
చెప్పుతూ
వచ్చింది
కైకకు.
అనగా
శ్రీమన్నారాయణుడైన
రామచంద్రమూర్తిని
అరణ్యానికి
పంపటానికి
తగిన
దుర్బోధలు
చేసింది.
రామునిలో
లేని
దుర్గుణాలను
అభివృద్ధిగావించింది.
కైకకు
బోధించింది.
రాముడు
మహాసద్గుణవంతుడు.
అలాంటి
సద్గుణవంతుడైన
రాముని
యందుకూడా
దోషములను
నిర్మించింది.
అలాంటి
మాటలను
కైక
వినింది.
చెప్పినటువంటి
మంధరను
ఎవరూ
గౌరవించటం
లేదు
యీనాడు
లోకంలో.
3
▾
Meaning
Keep
His poems 241
Also in his talks
(6)
23 May 1973
The Wheel of Birth and Death, and Vimukti
5 June 1973
Name and Form Belong to the Body, Not to the Ātma
10 April 1986
The welfare of the world comes first
22 June 1987
Human birth finds its meaning only when the principle of the Ātma is recognised
17 July 1988
Only when man changes will the world change
3 November 1989
Ānanda Itself Is the Goal
విన్నటువంటి
కైకను
కూడా
ఎవ్వరూ
గౌరవించటం
లేదు.
ఆ
స్త్రీల
యొక్క
పేర్లను
ఎవరూ
పెట్టుకోటం
లేదు.
ఎవరైనా
స్త్రీలలో
కైక
అని
వుంటున్నారా?
ఎవరైనా
స్త్రీలలో
మంధర
అని
వుంటున్నారా?
ఆ
చెడ్డ
పేర్లు
కూడా
మాకక్కరలేదని
ఆ
పేరును
కూడా
దూరం
చేసుకున్నారు.
కనుక
యీనాడు
చెడ్డ
మాటలు
చెప్పేవారు
మంధరతో
సమానము.
ఈ
చెడ్డ
మాటలు
వినేవారు
కైకతో
సమానము.
ఇంతే
కాకుండా
నిరంతరము
మంచివారిపైన
చెడు
సంకల్పాలు
అభివృద్ధి
పరచుకుంటూ
ఆ
చెడ్డ
చేత
ధర్మమూర్తులైన
వారిని
కూడా
దుర్మార్గులుగా,
అధర్మ
మూర్తులుగా
భావిస్తూ
వచ్చారు.
దుర్మార్గులైన
కౌరవులు
నిరంతరము
ధర్మ
మూర్తులైన
పాండవుల
చెడును
తలుస్తూ
వచ్చారు.
ఎప్పుడు
పాండవులు
హీనమైపోతారా,
ఎప్పుడు
పాండవులు
నశించిపోతారా
ఎప్పుడు
పాండవుల
రూపనామం
లేకుండా
పోతుందా
అని
చెడ్డనే
చింతిస్తూ
వచ్చారు.
అతనే
దుర్యోధనుడు.
పురుషులలో
ఎవరైనా
దుర్యోధనుడు
అని
పేరుపెట్టుకున్నారా?
ఎందుకంటె
చెడు
తలంపులు
వుండటం
చేత
వారు
దుర్యోధనునితో
సమానము.
ఆ
దుర్యోధనుడు
నిరంతరము
దుఃఖమునకే
గురైపోతాడు.
ఇంక
చెడ్డకార్యములు
చేయటము.
మహాశక్తి
సంపన్నుడు
రావణుడు.
అతడు
ఎంతో
భక్తిశ్రద్ధలతో
తపస్సు
గావించినవాడు.
ఎన్నివుండి
యేమి
ప్రయోజనము.
పరస్త్రీ
అపహరణ
మహాపాపము.
ఇంతకంటె
దుర్మార్గుడు
మరొకడు
లేడు.
ఇలాంటి
వారిని
shoot
చెయ్యాలి.
అందువల్లనే
భగవంతుడు
రామావతారము
ఎత్తి
ఆ
రావణుని
సంహరించాడు.
ఎంత
భక్తి
వుండి
యేమి
ప్రయోజనము?
ఎన్ని
సద్గుణములుండి
యేమి
ప్రయోజనము.
పరస్త్రీని
అపహరించటము
మహాపాపము.
అంతకంటె
మహాపాపము
యింకొకటి
లేదు.
మానవాకారం
వుండవచ్చునుగాని
వారు
మహారాక్షసులే.
ఆ
రాక్షసత్వాన్ని
హతమార్చే
నిమిత్తమై
రాముడు
అవతరించాడు.
అలాంటి
రావణ
అనే
పేరు
మగవారెవరన్నా
పెట్టుకుంటున్నారా?
అలాంటి
దుర్మార్గుల
ముఖము
కూడా
చూడరు.
అందువలనే
వారి
పేరు
ఎవరూ
పెట్టుకోరు.
మానవాకారం
వుండవచ్చును.
కాని
మానవుడౌతాడా?
కానేకాడు.
కనుక
ఆకారం
మానవత్వానికి
గుర్తు
కాదు.
ఆచారం
మానవత్వానికి
గుర్తు.
జగతిని
జీవించువాడు
మనుజుడు
కావలె
మొదట
దనుజులందు
దుష్టత్వము
పొగడువాడు
చవట
బ్రహ్మ
విద్యనేర్చి
యిచట
అధ్యాత్మను
గనుగొనుట
రాజయోగమునకు
బాట
యిదియే
శృతులు
చెప్పుమాట.
కనుకనే
యీ
వేదప్రమాణమనేది
ఎంతయో
పవిత్రమైన
మార్గాన్ని
అనుసరింప
చేసింది.
కనుక
మానవుడు
ఆత్మస్వరూపుడే.
ఈ
అహంకార
మమకారముల
చేత
కప్పబడి
తాను
మానవునిగా
భావిస్తున్నాడు.
ఈ
అహంకార
మమకారములను
నిర్మూలం
గావించినవాడు
సాక్షాత్తు
ఆత్మ
స్వరూపుడుగానే
వుంటాడు.
ఒక
చిన్న
ఉదాహరణ.
4
▾
Meaning
Keep
ఘటములోపల
సూర్యుని
యొక్క
ప్రతిబింబము
కనుపిస్తోంది.
ఘటము
వుండినా
లేక
పోయినా,
జలము
వుండినా
లేకపోయినా,
జలము
స్థిరముగా
వుండినా
లేకపోయినా
సూర్యుని
యొక్క
ప్రతిబింబమునకు
యేమాత్రం
లోటు
వుండదు.
ఎప్పుడూ
ఆ
యొక్క
reflection
వుంటుంది.
జలము
వుండినప్పుడు
కనుపిస్తుంది.
జలము
లేకుంటే
కన్పించదు.
ఆత్మ
అనేది
సర్వత్ర
వుంటున్నది.
చిత్తశుద్ధి
కలవాని
యందు
అది
చక్కగా
ప్రతిబింబిస్తుంది.
ఇక
చంచలత్వానికి
మూలకారణం
ఏమిటి?
ఇప్పుడు
జలములో
సూర్య
ప్రతిబింబము
కనుపిస్తోంది.
ఐతే
ఆ
జలము
స్టెడిగా
వున్నప్పుడు
ఆ
సూర్యబింబం
కూడా
స్టెడిగా
వుంటుంది.
ఐతే
water
కొంచెం
కదలుతే
ఆ
reflection
కూడా
కదులుతుంది.
కాని
real
sun
కదలటంలేదు.
ఆ
reflection
వున్న
జలము
కదలటం
చేత
సూర్యుడు
కూడా
కదలుతున్నాడని
మనం
భావిస్తున్నాము.
కాని
భగవంతుడు
కదలే
వాడు
కాదు.
నిర్గుణం,
నిరంజనం,
సనాతనం,
నికేతనం,
నిత్యశుద్ధ
బుద్ధ
నిర్మల
స్వరూపిణం.
తాను
ఎప్పుడూ
కూడా
అచలంగానే
వుండేవాడు.
భారతీయ
సంస్కృతి
యందు
ఈశ్వరుడు
కైలాసవాసి
అన్నారు.
ఈ
కైలాసము
ఎక్కడ
వున్నది
అంటే
హిమాచలములో
అన్నారు.
హిమాచలమంటే
ఏమిటి?
హిమమనగా
చల్లదనము.
అచలమనగా
కదలనటువంటిది.
హిమమనగా
మన
హృదయంలో
శాంతి.
ఆ
శాంతి
అనేదే
చల్లదనము.
అది
కదలనిదిగా
వున్నప్పుడు
అదే
అచలము.
కాబట్టి
హిమాచలమనగా
మహా
పవిత్రమైన,
పరిశుద్ధమైన,
నిశ్చలమైన
మన
హృదయమే
హిమాచలము.
అక్కడే
వున్నాడు
ఈశ్వరుడు.
కాబట్టి
ఏ
ఋషికేశ్కో
మనం
పోనక్కరలేదు.
హిమం
పవిత్రం
చల్లదనము,
అచలం
చలించనిది.
చలించని
మనస్సు
భ్రమించని
దృష్టి.
స్థిరమైన
భావము
అదే
మన
హృదయము.
అక్కడే
వుంటున్నాడు
భగవంతుడు.
కనుక
భగవంతుడెక్కడో
లేడు.
మన
మనస్సు
చలించటం
చేతనే
యీ
యొక్క
ప్రతిబింబాలు
చలించినట్టుగా
కనుపిస్తున్నాయి.
విద్యార్థులు
చక్కగా
గుర్తించవలసిన
విషయం.
పుట్టినవాడు
బాలుడైనా
కాని
నేను
అనే
పదం
అక్కడే
వుంది.
వృద్ధుడైనా
నేను
అనేది
వుంది.
బాల్యము
నుండి
వృద్ధత్వం
వరకు
శరీరం
మారిపోతున్నది
గాని
యీ
నేను
అనేది
మారటం
లేదు.
ఆ
మారనటువంటి
‘నేను’
నీవు.
ఈ
బాల్యము,
యవ్వనము,
వార్థక్యము
మారుతున్నాయి.
కాని
నేను
అనే
పదమునకు
బాల్యము,
యవ్వనము,
వార్థక్యమునకు
యేమాత్రం
సంబంధము
లేదు.
ఈ
నేను
అనేది
అందరిలోనూ
వుంటుంది.
కాబట్టి
అందరియందు
వున్న
ఆ
నేను
అనేదే
ఆత్మ.
కనుక
వారి
రూపనామములు
వేరువేరుగా
వుండవచ్చు.
చూడండి
జాగ్రత్
స్వప్న
సుషుప్తి.
ఈ
జాగ్రత్
స్వప్న
సుషుప్తి
మారుతున్నాయి.
జాగ్రత్తలో
వున్నవాడూ
నేనే.
స్వప్నములో
వున్నవాడూ
నేనే.
సుషుప్తిలో
వున్నవాడూ
నేనే.
జాగ్రత్
స్వప్న
సుషుప్తులు
మారినాయి
గాని
‘నేను’
అనేది
మారలేదు.
కనుక
యేది
మారనిదో
అదే
నీవు.
5
▾
Meaning
Keep
మారనటువంటిదే
ఆత్మతత్వము.
కనుక
అట్టి
ఆత్మతత్వాన్ని
గుర్తించటానికి
మానవత్వములో
వున్న
యీ
కోతి
బుద్ధులను
దూరం
చేసుకోవాలి.
ఈ
కోతి
బుద్ధులకు
మూలకారణం
ఏమిటి?
పూర్వజన్మలో
వాడు
కోతై
పుట్టాడన్న
మాట.
దాని
వేషము
లింకా
వీనిలో
నిలిచివున్నాయి.
ఎందుకంటే
చేతిపైన
ఒక
కురుపు
లేచింది
ఆ
కురుపు
మానిపోయినా
దాని
మచ్చ
అక్కడ
వుంటుంది.
అదే
విధముగా
నీవు
జన్మ
మారినప్పటికి
వాని
బుద్ధులింకా
నీలో
వుంటున్నాయి.
కాబట్టి
నేను
క్రిందటి
జన్మలో
కోతిని.
ఇకపైనైనా
కోతిని
కాకూడదు
అని
విచారణ
చేసి
నేను
మనిషిని
మనిషిని
అనే
భావాన్ని
పెంచుకోవాలి.
అదే
మొట్టమొదట
మనం
realise
చేయాలి.
I
am
man
not
animal.
I
am
man
half
truth.
I
am
an
animal
half
truth.
ఈ
రెండు
half
truthలు
చేరి
full
truth
అవుతుంది.
అప్పుడే
నీలో
animal
thoughts
రాకుండా
వుంటాయి.
I
am
man
not
an
animal.
Man
అని
చెప్పుకుంటున్నావు
గానీ
animalగా
ప్రవర్తిస్తున్నావు.
ఈ
animal
qualityని
మనం
control
చేయటానికి
I
am
not
an
animal.
ఈ
రోజుల్లో
animal
better.
animalకు
ఒక
సీజన్,
ఒక
రీజను
వుంటుంది.
మనిషికి
no
season,
no
reason.
worse
than
an
animal.
కనుక
అలాంటి
వానిని
మానవునిగా
భావించరాదు.
కనుక
మనం
మానవునిగా
వుంటుండాలి.
మానవ.
మ
అనగా
అజ్ఞానము.
న
అనగా
లేకుండా.
వ
అనగా
వర్తించటము
అజ్ఞానం
లేకుండా
వర్తించేవాడే
మానవుడు.
మా
అనగా
కాదు.
నవ
అనగా
క్రొత్త.
నేను
కొత్తవాడిని
కాదు.
అనేక
జన్మలనుండి
వస్తున్నాడు
పాతవాడనే
నేను.
మానవ.
నవ
క్రొత్త,
మ.
కాదు.
నేను
క్రొత్త
వాడను
కాదు.
ఇక్కడ
యింకొకటి.
మానవ.
ఈ
మానవత్వమనగా
నవత్వముతో
కూడినది.
నవ
అనగా
ఆత్మ.
ఈ
ఆత్మయే
పంచభూతములకు
స్థానము.
శబ్దస్పర్శ
రూపరస
గంధాదులు
ఆత్మనుండే
ఆవిర్భవించినటువంటివే.
ఆత్మనుండి
ఆకాశము,
ఆకాశము
నుండి
వాయువు,
వాయువు
నుండి
అగ్ని,
అగ్ని
నుండి
జలము,
జలమునుండి
భూమి.
భూమినుండి
మానవుడు.
కడపటిదైన
మానవునకు,
మొదటిదైన
ఆత్మకు
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
వుంటుంది.
ఈ
హారము
కుడుతూ
కుడుతూ
పోయినాము.
కట్టకడపటికి
నిల్పివేశాము.
ఈ
కడపటిది,
మొదటిది
రెండూ
చేర్చినప్పుడే
ఈ
హారము
తయారౌతుంది.
కాబట్టి
beginning,
end
రెండూ
చేరాలి.
Beginning
ఆత్మ
end
మానవ.
ఈ
మానవత్వం
ఆత్మతత్వంలో
చేరుతే
జీవితమనే
garlend
తయారౌతుంది.
కనుక
మనం
యీ
garlend
గా
తయారు
కావాలి.
ఈ
garlend
లో
రెండు
రకాలున్నాయి.
పుష్పములు
అనేకముగా
కనుపిస్తున్నాయి.
కాని
దారం
ఒక్కటే.
అన్ని
పూలలో
ఒకే
దారం
చేరిపోయింది.
ఈ
flowers
లో
మార్పులుంటున్నాయి.
yesterday
మొగ్గ.
ఈనాడు
విచ్చింది.
రేపు
వాడిపోతుంది.
ఈ
flowersలో
యీ
మార్పు
వుంటుంది.
కాని
yesterday
దారమే.
Today
దారమే.
Tomorrow
దారమే.
దారంలో
మార్పురాదు.
అనేకత్వమైన
జీవరాసులందు
ఏకత్వమైన
దారమనేది
బ్రహ్మసూత్రంగా
బయలు
దేరింది.
6
▾
Meaning
Keep
కాబట్టి
అందరియందు
వున్న
సూత్రం
ఒక్కటే.
ఆ
సూత్రమును
సూత్రప్రాయముగా
గుర్తించినప్పుడు
మానవత్వము
చక్కగా
అర్థమవుతుంది.
దీనినే
బ్రహ్మసూత్రము
అన్నారు.
భాగవతము,
భారతము,
భగవద్గీత,
ఉపనిషత్తులు,
బ్రహ్మ
సూత్రములు
ఇక్కడ
భారతము
యొక్క
essence
గీత.
గీత
యొక్క
essence
బ్రహ్మసూత్రము.
ఈ
వేదముల
యొక్క
సారమే
ఉపనిషత్తులు.
ఈ
ఉపనిషత్తుల
యొక్క
సారమే
గీత.
కనుకనే
నేను
సర్వోపనిషత్
సారస్వరూపుడను.
ఉపనిషత్తులన్నీ
గోవులు.
ఈ
cow
నుండి
మనం
పాలు
పితకాలి.
పాలు
పితకాలంటే
దానికొక
దూడ
వుండాలి.
దూడను
చూస్తే
కాని
గోవు
పాలివ్వదు.
కనుక
ఉపనిషత్తులనే
గోవుల
దగ్గర
పవిత్ర
హృదయుడైన
మానవుడు
బిడ్డవలె
చూపించాడు.
మానవులకంతా
ప్రతినిధి
అర్జునుడు.
అర్జునుడనే
దూడను
చూపించి,
కృష్ణుడనే
cowboy
పాలు
పితికాడు.
ఆ
పాలే
ఉపనిషత్
సారము.
ఆ
పాలు
ఎవరికోసం?
గోవు
తన
పాలు
తాను
త్రాగదు.
ఇక
దూడ
బాగా
త్రాగి
గంతులు
వేస్తుంది.
దానికింక
అవసరము
లేదు.
ఇక
పితికే
వాడు
నిత్య
తృప్తుడు.
కాబట్టి
యీ
పాలు
ఎవరికి?
సుధీజనులకు
అన్నారు.
ఎవరు
మంచి
గుణవంతులుగా
వున్నారో
వారికి
దీనిని
నేను
అందిస్తాను
అన్నాడు.
మనము
గుణములను
పెంచుకోవాలంటే
మన
ధర్మాన్ని
అనుసరించాలి.
దేహమనేది
ధర్మానుబంధం.
ధర్మం
కోసం
వచ్చింది
దేహం.
దేహధర్మమనే
దానిని
మనం
ఆచరణ
ధర్మంలో
ప్రవేశించి
తద్వారా
ఆత్మ
ధర్మంగా
రూపొందాలి.
శరీరమాద్యం
ఖలు
ధర్మసాధకం.
కాలు
దగ్గరనుండి
తలదగ్గర
వరకు
ధర్మాన్ని
ఆచరించాలి.
కాలు
కూడా
సరియైన
మార్గంలో
పోవాలి.
కన్ను
కూడా
సరియైన
రీతిలో
పోవాలి.
అదే
నిజమైన
మార్గము
అన్నారు.
అదే
పిల్లలకు
నేను
అప్పుడప్పుడు
చెబుతూ
వుంటాను.
See
no
evil.
See
what
is
good.
Hear
no
evil.
Hear
what
is
good.
Talk
no
evil.
Talk
what
is
good.
Think
no
evil.
Think
what
is
good.
Do
no
evil
do
what
is
good.
That
is
the
way
to
God.
Always
bad
look,
bad
talk,
bad
hear,
bad
job
అది
animal.
మానవత్వంలో
భగవద్గీత
చెప్పింది
ఒక్కటే
ఒక్కటి.
చాలా
మంది
భగవద్గీత
యోగాన్ని
గురించి
చెప్పింది,
భగవద్గీత
భక్తిని
గురించి
చెప్పింది,
భగవద్గీత
జ్ఞానాన్ని
గురించి
చెప్పింది
అని
ఎన్నో
చెప్తూ
వుంటారు.
కాని
దేనిని
గురించి
చెప్పలేదు.
First
శ్లోకము
‘ధర్మక్షేత్రే...
తో
1st
word
ధర్మ.
Last
శ్లోకములో
యత్ర
యోగీశ్వర...
మమ
Last
శ్లోకములో
last
word
మమ.
మొదటిది
ధర్మ.
చివరది
మమ.
మమధర్మ.
మానవుని
ధర్మము
మమధర్మము.
మమ
ధర్మము.
నా
ధర్మము.
First
head
last
feet.
middle
నాభి.
అదే.
ధర్మ
సంస్థాపనార్థాయ
సంభవామి
యుగే
యుగే
‘నేను
వచ్చింది
ధర్మ
సంస్థాపనార్థము.
ఆ
ధర్మం
కూడా
నాభివలె
మధ్యలో
వుంది.
సర్వధర్మాన్
పరిత్యజ్య...
నన్ను
నీవు
శరణు
జొచ్చు.
సర్వధర్మములు
నాకు
వదలిపెట్టు.
నేను
అన్ని
చూసుకుంటాను.
అంతేగాని
ఒకటి
నాది,
ఒకటి
నీది
అని
divide
చేయకూడదు.
ఈ
partnership
business
అనేది
భగవంతుడు
ఒప్పుకోడు.
7
▾
Meaning
Keep
నీదొక
అర్థము
షేరు
నాదొక
అర్థము
షేరు
అంటే
జరగదు.
full
share
తీసుకోవాలి.
అదే
శరణాగతి.
ఏది
చేసినా,
ఏది
చూచినా
అంతా
నీ
అర్పితము
అనుకోవాలి.
ఏకర్మ
చేసినా
సర్వకర్మ
భగవత్ప్రీత్యర్థం.
నాలో
వున్నది
భగవంతుడే.
అతనే
యీ
పని
చేస్తున్నాడు.
ఆ
విధమైన
భావంతో
వుండాలి.
నీవు
ఏపని
చేసినా
ఎవరి
తృప్తి
కోసం
చేస్తున్నావు?
ఎవరో
బయట
వారి
తృప్తి
కోసం
కాదు.
నీవు
అన్నం
తింటున్నావు.
ఎవరి
తృప్తి
కోసం?
నీ
తృప్తి
కోసమే.
నీవు
నిద్రపోతున్నావు.
ఎవరి
తృప్తి
కోసం?
నీ
తృప్తి
కోసమే.
నీవు
షర్టు
వేసుకుంటున్నావు.
ఎవరి
తృప్తికోసం?
నీ
తృప్తి
కోసమే.
Self
అనేది
అందరియందు
వుంటున్నది.
అదే
selflessness.
కాని
దేహరీతిగా
కాదు.
ఆత్మరీతిగా.
I
am
ఆత్మ.
I
am
ఆత్మ
అనే
భావాన్ని
పెట్టుకోవాలి.
కనుక
అందరియందు
వుండినటువంటిది
నేను.
నేను.
అది
మారనటువంటిది.
అదే
అహం
అన్నారు.
అహం
దేహాస్మి
కాదు.
నేను
దేహము
కాదు.
అహం
జీవాస్మి
కాదు.
అహం
బ్రహ్మా
కాదు.
అహం
బ్రహ్మాస్మి
అంటే
there
are
two.
I
am
with
dual
mind
is
half
blind.
అహం
-
నేను.
ఈ
రకమైన
స్థితికి
నీవూ
నేను
ఒక్కటే.
You
and
I
are
one.
is
wrong.
You
and
I
are
we.
we
and
we
are
one.
అక్కడా
మనమిద్దరు
ఇక్కడా
మనమిద్దరు.
ఇక్కడ
నేను
అక్కడ
నీవు
రెండు
కలిసినటువంటిదే
we.
అందరూ
ఒక్కటే
అదే
ఏకాత్మ
భావము.
ఏకోవసి
సర్వభూతాంతరాత్మ.
ఏకం
సత్
విప్రాబహుధావదంతి.
ఓమిత్యేకాక్షరం
బ్రహ్మ.
అన్ని
ఒక్కటే.
ఆ
ఒక్కటిని
మాత్రం
మనం
వదలకూడదు.
నీవు
ఎన్నో
పెట్టుకొని
లక్షలకు
కోట్లకు
పోతుండావు.
ఆ
లక్షలు
కోట్లంతా
ఒకటి
నుండి
వచ్చినవే.
Here
is
one.
Here
is
thousand.
Thousand
గొప్పదని
అనుకుంటున్నావు.
కాని
one
గొప్పది.
1+1+...
thousand
అయిపోతుంది.
ఒకటి
లేకపోతే
there
is
no
thousand.
I
is
hero
world
is
zero.
One
is
hero
God.
Hero
is
I.
ఈ
one
లేకుండా
ఎన్ని
జీరోలు
పెట్టినా
జీరోస్.
కనుక
భగవంతుని
ప్రక్కన
పెట్టుకొని
ఎన్ని
పనులైనా
చేసుకో.
అన్ని
పవిత్రమే
అయిపోతాయి.
భగవంతుని
దూరంగా
పెట్టుకొని
ఎన్ని
పనులు
చేసినా
అవన్నీ
నీవు
లోకరీతిగా
జయించవచ్చు.
కాని
conscious
నీవు
తృప్తి
పడవు.
Hero
becomes
zero
if
he
forgets
God.
ఎవడు
భగవంతుని
మరుస్తాడో
వాడు
zero.
కనుక
భగవంతుని
పెట్టుకుని
ఎంతైనా
నీవు
చేసుకో.
పాండవులకు
కౌరవులకు
వున్న
సన్నిహిత
సంబంధ
బాంధవ్యములను
యోచించండి.
పాండవులు
ఎలాంటి
కష్ట
సమయములోనైనా
కృష్ణా
కృష్ణా.
భార్యకు
పరాభవము
జరిగింది.
కృష్ణా
కృష్ణా
అడవిలో
ఆకులలములు
మేస్తున్నారు.
అప్పుడు
కూడా
కృష్ణా
కృష్ణా.
మనవాళ్లకు
కొంచెం
కష్టాలొస్తే
భగవంతుడు
నాకు
కష్టాలిచ్చాడు
ఆ
కృష్ణుడే
నాకు
వద్దు.
సుఖాలు
కనుక
వస్తే
యింక
యింటినిండా
ఫోటోలు
పెట్టేస్తారు.
దుఃఖము
వస్తే
ఫోటోలు
తీసేస్తారు.
ఇది
కేవలం
బలహీనత.
ఇది
నిజమైన
భక్తి
కాదు.
కష్ట
సమయంలో
గాని
నష్టసమయములో
గాని,
దుఃఖ
సమయములో
గాని
faith
is
faith.
8
▾
Meaning
Keep
ఎలాంటి
పరిస్థితులలోనైనా
కృష్ణుని
ముందు
పెట్టుకున్నారు.
First
God,
next
world.
last
I.
I
అనే
దాని
last
లో
పెట్టారు.
కాని
కౌరవులేమి
చేశారు?
First
I,
next
world
last
God.
పాండవులంతా
కృష్ణుని
ముందుపెట్టుకొని
యుద్ధంలో
ప్రవేశించారు.
అందువల్లనే
వారికి
విజయం
కలిగింది.
కౌరవులు
కృష్ణుని
వెనుక
పెట్టారు.
అంతా
అపజయమే.
కౌరవులు
నూరుమంది
అన్నదమ్ములు.
ఒక్క
తల
అయినా
నిల్చలేదు.
పాండవులు
ఐదుగురే.
అందరూ
క్షేమంగా
వున్నారు.
కారణం
ఏమిటి?
భగవంతుని
ముందు
పెట్టుకు
వెళ్లారు.
కనుక
భగవంతుడు
ముందుకు
lead
చేస్తాడు.
అందువల్ల
వారు
చక్కని
ఆనందమును
అనుభవించారు.
విజయం
సాధించారు.
భగవంతుని
ముందు
పెట్టుకొని
మీ
విద్యను,
మీ
పనులను,
మీ
కర్తవ్యములను,
మీ
కర్మను
మీరు
ఆచరిస్తూ
పొండి.
కాని
వెనుక
మాత్రం
పెట్టుకొని
మీరు
పోకండి.
మీ
వెంటనే,
జంటనే,
యింటనే,
కంటనే.
అది
యీనాటి
పిల్లలకు
అత్యవసరం.
ఈనాటి
యువకులే
రేపటి
పౌరులు.
రేపటి
పౌరులే
యీదేశ
మంచి
చెడ్డలకు
ఆధారము.
దేశ
సౌభాగ్యమును
కాపాడాలంటే
విద్యార్థులకే
తగిన
సామర్థ్యము
వుంది.
కనుక
విద్యార్థులు
మంచిగుణములు
కలిగి,
పవిత్ర
నడతలు
కలిగి,
తల్లిదండ్రులకు
తగిన
సంతోషాన్ని
అందించేవారుగా
తయారుకావాలి.
ఎందుకోసం
యీనాడు
మీ
తల్లిదండ్రులకు
సంతోషాన్ని
యివ్వాలి?
భవిష్యత్తులో
నీవు
సంతోషాన్ని
అనుభవించటం
కోసం.
యద్భావం
తద్భవతి.
ఈనాడు
తల్లిదండ్రులను
బాధించినవాడు
రేపు
తన
బిడ్డలచేత
తాను
బాధింపబడతాడు.
రేపటి
దినం
నీకొడుకు
నిన్ను
కాళ్లతో
తంతాడు.
కనుక
మనమీనాడు
తల్లిదండ్రులను
గౌరవిస్తే
రేపు
మన
పిల్లలు
మనలను
గౌరవిస్తారు.
ఏ
విత్తనం
నాటామో
అలాంటి
చెట్టే
మొలుస్తుంది.
కనుక
ముందు
మనం
బాగుపడాలంటే
యీనాడు
మనం
సరియైన
గౌరవాన్ని
అందించాలి.
ఎందుకోసం
గౌరవించాలి?
నీ
blood,
నీ
food,
head,
దుడ్డు
నీ
parents
gift.
అంతా
పేరెంట్సుదే.
అలాంటి
parentsని
మనం
గౌరవించకుండా
పోతే
రాక్షసులం
అలాంటివాడు
చచ్చినవానితో
సమానం.
Living
death.
వాడు
వుండినా
చచ్చినవానితో
సమానం.
కాబట్టి
యీనాడు
కాకుంటే
రేపైనా
ఆ
ఫలితం
తాను
అనుభవిస్తాడు.
పిల్లలు
బాగా
మనసులో
పెట్టుకోండి.
ఈ
విధంగా
వుండి
తల్లిదండ్రులకు
తగిన
సంతోషాన్ని
యివ్వండి.
అదే
స్వామి
కోరేది.
స్వామిని
మీరేమాత్రం
చూడనక్కరలేదు.
తల్లిదండ్రులను
సంతోషపెడితే
నన్ను
సంతోషపెట్టినట్లే.
మాతృదేవోభవ,
పితృదేవో
భవ,
ఆచార్య
దేవోభవ,
అతిథి
దేవోభవ.
తల్లిదండ్రులను
సంతోషపెడితే
జగత్తునంతా
సంతోషపెట్టిన
వారమవుతాము.
రాముడు
ఎందుకు
అరణ్యానికి
వెళ్లాడు.
పితృవాక్య
పరిపాలన
కోసం
వెళ్లాడు.
చూశారా!
తండ్రి
ఆజ్ఞ
శిరసావహించాడు.
తలలేని
మనిషి
వాడు
ఘటోత్కచుడు.
తిండికోసం
బ్రతికిన
వాడు.
కనుక
live
for
not
living.
పశుపక్ష్యాదులు
కూడా
జీవిస్తున్నాయి.
Education
should
be
for
life
not
for
living.
ఆ
విధమైన
లక్ష్యమును
మీరు
పెట్టుకోవాలి.
Previous
←
Faith in Yourself Is Faith in God
Next
Conduct Yourselves with Humility and Obedience
→