Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · As the Karmas Are, So Are the Results
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
As the Karmas Are, So Are the Results
30 June 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
His poems 30
Also in his talks
(2)
18 April 1998
The universe is the form of Viṣṇu
7 March 2008
Do the deeds that please God
చెడ్డపని
చేసి
మంచిని
చెందబోరు
మంచి
పని
చేసి
కీడును
గాంచబోరు
నిమ్మమును
నాటి
చూతఫలంబు
గనున
నిమ్మఫలంబును
గనున
చూతఫలంబునాటి.
విద్యార్థులారా!
మనము
భూమిలో
ఏ
విత్తనము
నాటిన
అదే
మొక్కగా
మారి
అదే
వృక్షముగా
మారి
ఆ
ఫలములనే
మనకందిస్తుంది.
ఇది
ప్రకృతి
యొక్క
స్వభావము.
సృష్టి
యొక్క
రహస్యము.
ఇది
ఎవరు
కాదన్నను,
అవునన్నను
ఈ
సత్యము
మారదు.
కనుకనే
మానవుడు
చేసే
ప్రతి
కర్మను
ఫలితము
ఉంది.
ఎట్టి
కర్మయో
అట్టి
ఫలితము.
ఎట్టి
విత్తనమో
అట్టి
మొక్క.
విత్తనము
ఒకటి
అయితే
మొక్క
మరొకటి
మొలవదు.
కనుకనే
మానవుడు
ఎట్టి
కర్మలాచరించునో
అట్టి
ఫలములు
అందుకో
గలుగుతాడు.
ప్రతి
మానవుడు
కూడ
మంచి
పనులు
చేసి
మంచి
ఫలితము
పొందటానికి
ప్రయత్నించాలి.
కాని
ఈనాటి
మానవుడు
పుణ్యఫలము
కావాలని
అమితంగా
ఆశిస్తున్నాడు.
కాని
పుణ్యకర్మలాచరించటానికి
ముందంజ
వేయటం
లేదు.
పాప
ఫలము
విస్మరిస్తున్నాడు.
కాని
పాప
కర్మలు
చేయుటకు
ముందంజ
వేస్తున్నాడు.
ఇది
మానవునకున్న
అజ్ఞానము.
ఇది
కేవలం
ఒక
మానవప్రభావమే
కాదు.
ప్రకృతి
యొక్క
ప్రభావం.
కూడా
ఇందులో
పాల్గొని
తద్వారా
మానవుని
అనేక
విధములుగా
నడిపిస్తోంది.
అనుభవించే
బాధలను
కష్టములను,
దుఃఖములను
పంచుకొనలేక
ఓ
భగవంతుడా!
ఎందుకు
నన్నిలా
పరిశీలిస్తున్నావు,
పరిశోధిస్తున్నావు.
అని
భగవంతుని
మొరపెట్టుకుంటారు.
భగవంతుడు
సుఖమును
గాని
దుఃఖమునుగాని
అందించటం
లేదు.
నీవు
అనుభవించే
సుఖ
దుఃఖములు
నీ
కర్మల
యొక్క
ఫలితములేగాని
భగవంతుని
ప్రసాదములు
కావు.
భగవంతుడు
సాక్షీభూతుడు.
భగవంతుడు
కేవలం
ఒక
పోస్టుమేన్
వంటివాడు.
నీకు
ఏ
కవరు
వస్తే
ఆ
కవరు
నీకందిస్తాడు.
ఏ
కార్డు
వస్తే
అది
అందిస్తాడు.
మనియార్డరు
వస్తే
అందిస్తాడు.
కాని
ఆ
కవరు
చించుకొని
అందులో
ఉండే
సుఖదుఃఖాలు
పొందేది
నీవే
కాని
postman
కాదు.
అదే
విధముగా
నీవాచరించిన
మంచి
చెడ్డల
ఫలితములు
నీవు
అనుభవిస్తున్నావు
గాని
భగవంతుడు
అనుభవింపచేసేవి,
భగవంతుడు
అందించేవి
కాదు.
2
▾
Meaning
Keep
అయితే
ఇక్కడ
ఒక
special
grace
అనేది
ఉంది.
నీవు
హృదయపూర్వకంగా,
పవిత్రమైన
భావముతో,
నిర్మలమైన
హృదయముతో,
నిస్వార్థమైన
క్రియలతో
భగవంతుని
స్మరించినప్పుడు
భగవంతుడు
ప్రత్యేకముగా
ఇందులో
పాల్గొని
నీకు
తగిన
సహాయము
చేస్తుంటాడు.
అయితే
మానవుని
సుఖ
దుఃఖములకు
కొంత
మూలాధారం
ఉంది.
ఏ
జన్మలోకాని,
ఏ
పరిస్థితిలో
గాని
భక్తులాచరించిన
మంచి
చెడ్డల
ఫలితమును
దృష్టియందుంచుకొని
భగవంతుడు
దానికి
తగిన
ఫలితము
ప్రసాదిస్తూ
ఉంటాడు.
ద్రౌపదిని
దుర్యోధనుడు
అనేక
అవస్థలకు
గురిచేసి
నిండుసభలో
అవమానించటానికి
పూనుకున్నాడు.
అప్పుడు
ద్రౌపదికి
ఏమి
సహాయము
చేయాలి!
కేశవా
మాధవా
మధుసూధనా
అని
ప్రార్థన
చేసింది.
ఈ
కేశవుడెవరు?
క-అ-ఈశ.
కేశవ.
క-బ్రహ్మ.
అ-విష్ణు.
ఈశ-
ఈశ్వరుడు.
ఈ
బ్రహ్మ
విష్ణు
మహేశ్వర
స్వరూపాన్ని
ఎవరైతే
తనయందుంచుకున్నాడో
అతనే
కేశవుడు.
త్రిమూర్తి
స్వరూపుడైన
ఓ
కేశవా.
పరాశరుడు
దీనిని
మరొక
రీతిలో
వర్ణిస్తూ
వచ్చాడు.
కేశవ
అనగా
ఉంగరములతో
చుట్టుకొనిన
దట్టమైన
ముంగురులు
కల్గినవాడు.
ఇతనెవరు?
ఇతనే
బ్రహ్మ
విష్ణు
మహేశ్వర
స్వరూపుడు.
ప్రార్థించింది.
కృష్ణుడు
విన్నాడు.
ఈ
ప్రార్థన
నేను
ఏ
రీతిగా
స్వీకరించాలి?
ఈ
ప్రార్థనకు
సంబంధించిన
క్రియలేమైనా
పూర్వము
ద్రౌపది
చేసిందా
అని
ద్రౌపది
హిస్టరీ
అంతా
వెనుకకు
తిరిగి
చూచాడు.
ఒక
సంక్రాంతి
దినము.
ఆనాడు
అందరు
చెరకు
నములుతూ
ఉంటారు.
ఆనాడు
కృష్ణునితో
చేరి
ఆనందానుభూతులు
పొందుతున్నారు.
గోపికలు
సత్యభామ,
రుక్మిణి
జాంబవతి
ద్రౌపది.
వీరినందరిని
పరీక్షింపదలచి
కృష్ణుడు
కావాలని
ఆ
చెరకు
తీస్తూ
వేలును
కోసుకుంటాడు.
భగవంతుడు
భక్తులను
పరీక్షించటం
అతని
స్వభావము.
కాని
ఆ
పరీక్షలో
ఉత్తీర్ణులైన
వారిని
తాను
అనుగ్రహిస్తూ
ఉంటాడు.
చిన్నక్లాసులో
ప్రైమరీ
స్కూలులో
1st
standardలో
పోవాలంటే
test
పెడతారు.
ఇది
అవునా
కాదా
అని
test
పెడతారు.
ఇది
ఏవిధమైన
ద్వేషముతోగాని,
వినోదముతో
గాని,
అయిష్టముతో
గాని
చేసే
టెస్టులు
కావు.
భగవంతుడు
అమితప్రేమచేత,
దయానుగ్రహము
చేత,
కరుణచేత
వారిని
అనుగ్రహింపగోరి
వారికి
test
ఇస్తుంటాడు.
తన
వేలు
నుండి
రక్తము
వచ్చింది.
సత్యభామ
చూచింది.
రుక్మిణి
చూచింది.
జాంబవతి
చూచింది.
ద్రౌపది
చూచింది.
వీరందరు
ఎంతో
near
and
dearగా
ఉండేవారు.
దాసీలంతా
దూరముగా
ఉన్నారు.
సత్యభామ
చూచింది
దాసీని
పిలిచి
బట్ట
తీసుకురా
చుట్టటానికని
అంది.
రుక్మిణి
స్వయంగానే
పరుగెత్తి
వెళ్లింది
లోపలకు.
3
▾
Meaning
Keep
His poems 436
Also in his talks
(6)
31 May 1973
Vairāgya towards the Things of the World Is Possible for All!
17 October 1988
To Attain God, the Embodiment of Prema, We Must Make Prema Itself Our Support
22 July 1994
The fullness of Prema
27 August 1996
When the Anātma Is Removed, the Ātma Is Seen Everywhere
23 November 1996
We Must Make Human Life a Life Full of Prema
8 December 1996
Only When Selfishness and Self-Interest Are Given Up Will the World Be in Plenty
ద్రౌపది
చూచింది.
తాను
కట్టుకున్న
చీరకొంగు
తీసి
చించింది.
కట్టు
కట్టింది.
కుడి
చేతి
వేలు
తెగింది.
దీనికి
చుట్టినది
ద్రౌపది.
ఇది
చూచిన
తక్షణమే
సత్యభామ,
రుక్మిణి
ఒకరికొకరు
ముఖం
చూచుకున్నారు.
ద్రౌపదికున్న
జాగ్రత్త
మనకు
లేకపోయిందికదా!
ద్రౌపది
యొక్క
ప్రేమ
మనలో
లేకపోయింది
కదా!
మనం
కేవలం
శరీరమును
మాత్రమే
కోరుతున్నాము.
అతని
పరిస్థితి
ప్రభావాలేమాత్రం
మనం
ఆశించటం
లేదు.
ఇది
ద్రౌపది
యొక్క
భక్తి
ప్రపత్తుల
ప్రభావము.
అని
వారిలో
వారు
సిగ్గుపడ్డారు.
ఇదంతా
చూశాడు
కృష్ణుడు.
ఆనాడు
ద్రౌపది
ఈ
విధంగా
నాకు
సేవ
చేసింది
కనుక
దీనికి
నేను
ప్రతిఫలంగా
అందించాలి
అనుకున్నాడు.
ఎప్పుడైనా
ఈ
ప్రాకృతమైన
జగత్తులో
ఏదైనా
వస్తువును
మనం
పొందాలనుకున్నప్పుడు
ఒక
వస్తువు
నందించి
మరొక
వస్తువునందుకోవాలి.
ఒక
షాపుకి
వెళ్ళి
ఒక
చేతిరుమాలు
కావాలంటే
పదిరూపాయలు
అతని
కందిస్తే
ఒక
రుమాలు
నీకిస్తాడు.
అదే
పద్ధతి
భక్తునికి
భగవంతునికి
మధ్యనున్న
సంబంధ
బాంధవ్యము.
నీవు
కించిత్తైనా
భగవంతునికి
అర్పిస్తే
అనంతమైన
ఫలితాన్ని
భగవంతుడు
నీకు
అందిస్తాడు.
కుచేలుడు
పిడికెడు
అటుకులు
అందించగనే
బహుళ
భాగ్యాన్ని
అందించాడు.
సత్యభామ
కృష్ణుని
అమ్మిన
సమయంలో
రుక్మిణి
ఒక
తులసిదళము
తెచ్చింది.
ప్రార్థిస్తూ
పత్రమో
పుష్పమో
ఫలమో
తోయమో
భక్తి
కలిగిన
వానికి
వశుడవగుట
సత్యమేని
నీవు
ఈ
తులసిదళమునకు
తూగుదువుగాక.
పత్రమో!
ఏమిటి
ఈ
పత్రము?
త్రిగుణములతో
కూడిన
పత్రము
మారేడు
పత్రము
ఈ
దేహము.
సత్వరజ
తమోగుణములతో
కూడిన
దేహమే
ఒక
పత్రము.
పుష్పము.
హృదయ
పుష్పము.
నిర్మలమైన
హృదయ
పుష్పము.
పవిత్రమైన
సుగంధముతో
కూడిన
హృదయ
పుష్పము.
ఫలమో.
మానసిక
ఫలము.
ఈ
మానసిక
ఫలమందు
మధురమైన
రసముంటుంది.
కాని
మధుర
రసతత్వము
మనస్సు
ఎరుగదు.
ఫలములోని
రసము
చెట్టు
ఎరుగదు.
పూవులోని
మకరందము
తీగలు
అనుభవించవు.
పవిత్రమైన
గ్రంధములలోని
మధుర
రసము
ఈ
ప్రాకృతమైన
మానవులనుభవించలేరు
కనుకనే
రుక్మిణి
ఆ
పత్రమర్పితము
చేసింది.
ఈ
తులసి
దళము
అర్పితము
చేయటంచేత
బ్రహ్మాండ
నాయకుడైన
భగవంతుడు
తూగగలిగాడు.
ఎట్టి
అపేక్షలు
లేక
నిరపేక్షాభావముతో
రుక్మిణి
కృష్ణుని
చూస్తూ
వచ్చింది.
అదే
విధంగా
ద్రౌపది
ఎటువంటి
అపేక్ష
లేక
నిరపేక్షతో
కృష్ణుని
కీవిధమైన
త్యాగం
చేసింది.
4
▾
Meaning
Keep
His poems 437
Also in his talks
(1)
23 July 1987
Māyā, Brahman and the jīva, the three are one
కేశవా
మాధవా
దేవా
మధుసూధనా!
అని
ప్రార్థించింది
కన్నులు
మూసుకొని.
గొప్ప
బలవంతులైన
పతులు
దగ్గరనే
ఉంటున్నారు.
మహావీరులు
శూరులు.
ఎవరు
ఈమెను
రక్షించలేపోయారు.
ఒక్క
కృష్ణుడు
తప్ప
మరొకరు
నాకు
దిక్కులేరు
అని
ప్రార్థించింది.
తాను
చేసిన
పూర్వత్యాగమును
తన
వేలును
చుట్టాడు.
ఆ
వేలుకు
కట్టిన
చిన్న
గుడ్డ
అక్షయంగా
మారిపోయింది.
కనుక
కించిత్తైనా
మనము
భగవంతునికి
చేసినప్పుడే
అనంతముగా
మనం
భగవంతుని
దగ్గర
నుండి
అందుకోటానికి
వీలవుతుంది.
కర్మఫలము
మనకు
తప్పునదికాదు.
అయితే
దైవానుగ్రహము
చేత
ఎలాంటి
కర్మఫలమునైనా
తప్పించుకోవచ్చు.
అయితే
దైవశాసనములో
తప్పించుకొనుటకు
వీలు
కాదని
మాత్రమే
ఉంది.
ఎట్టి
కర్మయో
అట్టి
ఫలితము
నీవు
అనుభవించాలి.
కర్మదాట
వశమా
నరుడా
కర్మదాట
వశమా.
।
కర్మ
।
ఘనపాఠంబులు
చదివినగాని
కుల
దేవతలను
కొలచినగాని
కారడవులకే
పోయినగాని
కఠిన
తపస్సులే
చేసినగాని
।
కర్మ
।
చిన్న
చెలిమిలో
ముంచినగాని
ఎన్ని
సముద్రములో
ముంచినగాని
పాత్రెంతోరా
నీరంతేరా
కావాలన్నను
ఎక్కువ
రాదుర.
।
కర్మ
।
ఎంత
పాత్రయో
అంత
నీరే
చిక్కుతుంది.
అయితే
ఈ
పాత్ర
అధికము
చేయటమనేది
భగవంతుని
Special
grace.
అది
లేక
ఏమాత్రము
ఫలితము
పొందలేము.
భుజబలంబు
మరియు
బుద్ధిబలంబుండి
దైవబలములేక
దీనుడయ్యె
కర్ణుడంతటి
వాడు
కడపటికేమయ్యె
మరువబోకుడిట్టి
మంచి
మాట.
భుజబలముంది.
బుద్ధి
బలముంది.
అస్త్రశస్త్ర
బలములంతా
ఉంటున్నాయి.
కర్ణునకు.
కానీ
దైవబలము
లేదు.
5
▾
Meaning
Keep
కారణము
ఏమిటి?
దుస్సంగము
చేత
దుర్భావములు
పెంచుకొని
దుష్ట
చతుష్టయములో
ఒకడుగా
మారిపోయాడు
కర్ణుడు.
దుర్యోధన,
దుశ్శాసన,
శకుని
వీరితో
కూడటం
చేత
కర్ణుడు
దుష్టుడుగా
మారిపోయాడు.
కనుక
మనము
చెడ్డ
సంఘములో
చేరరాదు.
చెడ్డ
సంఘములో
చేరినప్పుడు
చెడ్డ
భావములే
మనలో
ఆవిర్భవిస్తాయి.
చెడ్డ
భావములు
ఆవిర్భవించినప్పుడు
చెడ్డ
పనులలో
మనం
ప్రవేశిస్తాము.
కనుక
కంపెనీ
చాలా
ప్రధానమైనది.
కర్ణుడు
చాలా
ధర్మపరుడు.
కర్ణుని
స్వభావము
మరింత
విచారించాలి.
కర్ణుడు
యుద్ధభూమిలో
కూలిపోయాడు.
కర్ణుని
ప్రభావము
అర్జునునకు
బోధించాలని
కృష్ణుడు
సంకల్పించుకున్నాడు.
కారణం
ఏమిటి?
అర్జునుడు
అహంకారములో
ఉంటున్నాడు.
నాకంటె
గొప్ప
అస్త్రశస్త్ర
విద్యలు
నేర్చినవారు
ఈ
జగత్తులో
లేడనుకున్నాడు.
కృష్ణుడు
నా
ప్రియమిత్రుడు,
నా
బావమరిది.
నా
ఇష్టము
నెరవేర్చేవాడు
అని
గర్వము
పెంచుకున్నాడు.
ఆ
గర్వము
తీయని
మార్గములో
అణగదొక్కే
నిమిత్తమై
కృష్ణుడు
అర్జునుని
వెంటబెట్టుకున్నాడు.
కృష్ణుడు
బ్రాహ్మణ
వేషము
ధరించాడు.
కర్ణుడు
క్రిందపడి
చాలా
అవస్థలకు
గురౌతున్నాడు.
దగ్గరకు
వెళ్లి
కర్ణా!
నీవు
దానకర్ణుడవు.
నా
ఇంటిలో
ఒక
కార్యము
సంకల్పించుకున్నాను.
ఈ
పరిస్థితిలో
నిన్ను
అడగటం
న్యాయం
కాదు.
కాని
ధర్మాన్ని
కోరి
వచ్చాను.
అప్పుడు
కూడా
క్రిందపడిన
కర్ణుడు
ఏమి
కావాలో
కోరుకోమన్నాడు.
నాకు
కించిత్
బంగారము
కావాలన్నాడు.
‘బ్రాహ్మణా!
నా
ఇంటికి
వెళ్లి
నా
భార్యను
నేను
చెప్పినట్లు
చెప్పు.
నా
భార్య
ఇస్తుంది
బంగారు’
అన్నాడు.
‘నేనే
వ్యాపార
నిమిత్తమై
రాలేదు.
నేరుగా
నిన్ను
అడిగే
నిమిత్తమే
వచ్చాను.
నీవు
ఇస్తే
ఇవ్వు
అంతేగాని
నీ
భార్యను
అత్తను
మామను
అడగమని
చెప్పవద్దు’
అన్నాడు.
కన్నులు
మూసుకున్నాడు
కర్ణుడు.
యుద్ధభూమిలో
తన
దగ్గర
బంగారు
ఎక్కడుంది
రెండు
పండ్లకు
బంగారు
తొడుగు
వేసుకున్నాడు.
పూర్వకాలములో
ఇది
సహజమే.
పండ్లకు
రంధ్రము
పడినప్పుడు
పండ్లను
బంగారుతో
మూసివేస్తారు.
కర్ణుడు
‘బ్రాహ్మణా
ఈ
రెండు
పండ్లు
తీసుకుపో’
అన్నాడు.
ఏమిటి
ఇది.
నీ
పండ్లు
నేను
తీయాలంటే
సాధ్యమవుతుందా!
నిన్ను
హింసించి
నేను
పండ్లు
తీసుకోవాలి.
ఇది
దానము
ఎట్లా
అవుతుంది?
దానము
కాదు.
నేను
నీ
పండ్లను
ముట్టను’
అన్నాడు.
‘అయితే
రెండు
రాళ్ళు
తీసుకు
రమ్మన్నాడు.
రెండు
రాళ్ళు
తీసుకువచ్చి
ఇస్తే
రాళ్ళతో
రెండు
పండ్లు
కొట్టి
తీసి
ఇచ్చాడు.
‘రక్తమయమైన
సువర్ణము
నేనెట్లా
ముట్టేది?’
ఇంకా
పరీక్షలు
చేస్తున్నాడు.
‘నీవు
క్షత్రియుడవు.
నీ
ఎంగిలి
నేను
ఏవిధంగా
ముట్టాలి.
ఇది
నా
ఆచారమునకు
విరుద్ధము’
అన్నాడు.
తక్షణమే
అంబును
తీసుకొని
భూమిలో
గట్టిగా
వేశాడు.
ఆ
గంగ
పైకి
ఉబికి
వచ్చింది.
6
▾
Meaning
Keep
తక్షణమే
ఆ
పండ్లను
గంగలో
కడిగి
కుడి
చేత్తో
ఇచ్చాడు.
కృష్ణుడు
అర్జునునివైపు
చూచాడు.
అర్జునుడు
శిరస్సు
వంచుకున్నాడు.
ఈ
విధమైన
త్యాగము,
ఈ
విధమైన
దైవభక్తి
ఈ
విధమైన
స్వభావము
నేను
ఎక్కడా
చూడలేదు.
ఇట్టి
భక్తి
ప్రపత్తులు
నాలో
ఏమూలను
కనిపించవు
కృష్ణా
నన్ను
క్షమించు’
అన్నాడు.
అప్పుడు
చెప్పాడు
కృష్ణుడు
ఈ
కర్ణుడు
ఎవరో
తెలుసునా.
నీ
పెద్దన్న
ధర్మరాజు
కంటె
ముందు
పుట్టాడు
కర్ణుడు.
చాలా
బాధపడ్డాడు.
ఈ
మాట
ముందుగా
ఎందుకు
చెప్పలేదు.
నా
స్వంత
అన్నను
అనేక
విధములుగా
బాధించాను.
ధర్మజుని
కంటె
గొప్పవాడు
కర్ణుడు.
ఈ
విధముగా
భగవంతునికి
ఏదైనా
ఇవ్వటానికి
సంసిద్ధముగా
ఉండే
పరిస్థితి
ఆనాటి
ధర్మము.
ప్రతి
కర్మను
ఒక
ఫలితముంటుంది.
ప్రతి
కర్మ
ఒక
విత్తనమే.
ప్రతి
విత్తనము
ఒక
చెట్టే.
ప్రతి
చెట్టునందు
ఫలములు
వస్తాయి.
అట్టి
ఫలములనే
వృక్షము
అందిస్తుంది.
కనుక
మనము
పవిత్రమైన
కర్మలాచరించటానికి
పూనుకోవాలి.
కర్మలు
ఎట్టివో
ఫలితములు
అట్టివిగా
ఉంటాయి.
కాని
చేసే
సమయంలో
ఆనందముగా
చేస్తుంటాము.
కాని
అనుభవించేటప్పుడు
కంటి
ధారలతో
అనుభవిస్తాము.
మొదటే
మనము
గుర్తించి
ఏ
కర్మలు
మంచివి
ఏ
కర్మలు
చెడ్డవి
అని
నిర్ణయము
చేసికొని
మంచి
కర్మలలో
మనం
ప్రవేశించాలి.
ఈనాడు
ప్రకృతి
ప్రభావము
ముందు
వెనుకలు
యోచించకుండా
కర్మలాచరిస్తాము.
ముందు
వెనుక
విచారించక
మాటలు
చెబుతాము.
కడపటికి
ఫలితము
వచ్చేటప్పటికి
కృంగిపోతాము.
ప్రపంచములో
ప్రతి
చర్య
ప్రాకృతమైన
చర్యయే.
వర్షము
కురిసింది.
ఒకనికోసం
కురిసిందా?
కాదు.
ప్రకృతిలోని
ప్రతి
మానవునికోసం
వర్షం
కురిసింది.
అందరికి
చల్లదనము
నందిస్తుంది.
అందరికి
దాహము
తీరుస్తుంది.
మలయ
మారుతము
వీస్తుంది.
ఇది
ఒక్క
మానవునికోసం
కాదు.
అన్ని
ప్రాణులకు.
పంచభూతములు
ప్రాకృత
జీవులను
రక్షించే
కోసము
వచ్చినవే.
ఏ
ఒక్కరి
కోసము
వచ్చినది
కాదు.
అదే
విధముగా
దైవము
కూడా
ఒక
జాతికోసము,
ఒక
దేశము
కోసము,
ఒక
వ్యక్తి
కోసము
వచ్చినది
కాదు.
విశ్వమును
ఉద్ధరించటము
కోసము
వచ్చినది.
ఎవరు
ఎట్టి
కర్మలాచరింతురో
అట్టి
ఫలితము
నందిస్తాడు.
మనము
కర్మలాచరించుటకు
పూర్వము
కొంత
కాలము
తీసుకొని
విచారించి
మంచి
కార్యములు
చేయాలి.
ఈ
కర్మల
వల్ల
ఎవరికి
ఏవిధమైన
కష్టము,
నష్టము
కలగకుండా
చూచుకోవాలి.
అయితే
జగత్తునందు
ఇది
అసాధ్యము.
మానవత్వమనే
అభిమానము
పుచ్చుకొని
తదుపరి
కర్మలాచరించాలంటే
ఏనాటికి
సాధ్యము
కాదు.
దేహాభిమానము
మరచిన
వ్యక్తిమాత్రమే
ఈ
కార్యము
చేయగలడు.
7
▾
Meaning
Keep
ప్రకృతిని
బట్టే
మనకు
దుఃఖము
ప్రాప్తిస్తున్నది.
ఈ
ప్రకృతి
మన
దృష్టిని
బట్టే
వస్తుంది.
దేహాభిమానము
ఉండినంతవరకు
ప్రకృతి
ఉంటుంది.
ప్రకృతి
భావము
ఉండినంతవరకు
దుఃఖము
వెంటాడుతుంది.
ఎప్పుడు
దేహాభిమానము
పోతుందో
అప్పుడు
ప్రకృతి
కూడా
పోతుంది.
ఎప్పుడు
ప్రకృతి
పోతుందో
అప్పుడు
దుఃఖము
కూడా
ఉండదు.
జాగ్రదవస్థలో
దేహాభిమానముంది.
ప్రకృతి
కనిపిస్తున్నాది.
సుఖ
సంతోషములు
మనము
అనుభవిస్తున్నాము.
సుషుప్తి
గాఢనిద్రయందు
మన
దేహమే
మనకు
లేదు.
మన
దేహమే
మనకు
లేనప్పుడు
ప్రకృతి
మనకు
కనిపించదు.
ప్రకృతి
లేనప్పుడు
మనకు
దుఃఖమే
లేదు.
ఒక్క
నిద్రావస్థయందే
సుఖదుఃఖములు
లేవు.
అదే
విధముగా
దైవచింతన
చేత
దేహాభిమానమును
క్రమముగా
తగ్గించుకుంటూ
రావాలి.
అప్పుడే
ప్రాకృతమైన
భావములు
క్రమక్రమేణా
తగ్గిపోతాయి.
ప్రాకృతమైన
భావములు
ఎప్పుడు
లేకుండా
పోతాయో
అప్పుడే
మనకు
దుఃఖము
నివారణ
అవుతుంది.
దుఃఖములు,
సుఖములు
మనము
పిలుస్తే
వచ్చేవి
కావు.
‘కాననంబున
కార్చిచ్చు
వేములను
గాల్చి
మామిళ్ళను
విడచి
చనున’
అన్నింటిని
కాల్చి
వేస్తుంది.
మనము
దేహాభిమానము
ఏనాడు
తగ్గించుకుంటామో
అప్పుడు
సుఖము,
దుఃఖము
రెండూ
ఉండవు.
‘కలలో
చూచిన
మేడలు
మిద్దెలు
కన్నులు
విప్పిన
లేవుకదా’.
అందులకే
ఉపనిషత్తులు
ఉత్తిష్ఠత
జాగ్రత
ప్రాప్యవరాన్నిబోధత
అన్నారు.
‘ఓ
మానవుడా
నీ
అజ్ఞానమనే
నిద్రనుంచి
మేలుకో.
నీ
సత్యము
నీవు
గుర్తించు.
కేవలము
నీవే
సత్యస్వరూపుడవై
ఉండి
కూడను
ఈ
సత్యాన్ని
గుర్తించుకోలేక
తిరిగి
సత్యము
ఎక్కడో
ఉంటున్నదని
అన్వేషణ
ప్రారంభిస్తున్నావు.
ఇది
ఎక్కడో
బయట
లేదు.
ఆ
సచ్చిదానందము
నీవే.
ఒక
King
ఉంటాడు.
ఒక
ప్రెసిడెంటు
ఉంటాడు.
ప్రైమినిష్టరుంటాడు.
నిద్రావస్థలో
నేను
Kingను,
నేను
ప్రెసిడెంటును,
నేను
ప్రైమినిష్టరును
అనే
భావములేవీ
ఉండవు.
కాని
మేలుకొన్న
తరువాత
నేను
Kingను,
నేను
ప్రెసిడెంటును,
నేను
ప్రైమినిష్టరును
అని
చెప్పగలుగుతున్నాడు.
ఈ
అజ్ఞానమనే
ప్రాకృతమైన
భావమనే
నిద్రలో
నుండిన
వానికి
నేను
సచ్చిదానంద
స్వరూపుడను
అని
తెలియకుండా
ఉంటుంది.
నీవు
మేలుకో.
జ్ఞానమార్గములో
నీవు
మేలుకో.
అప్పుడు
సచ్చిదానంద
స్వరూపుడవని
గుర్తించుకోటానికి
వీలవుతుంది.
నిద్రలో
ఉండినంతవరకూ
నీవు
ఎవరో
నీకే
తెలియదు.
మేలుకున్న
తరువాతనే
నీ
పేరు
నీ
రూపము
నీ
హోదా
అన్ని
గుర్తించటానికి
వీలవుతుంది.
ఈనాడు
ఎలా
ఉంటున్నాము.
ప్రాకృతమైన
నిద్రలో
ఉంటున్నాము.
8
▾
Meaning
Keep
భౌతికమైన
నిద్రలో
ఉంటున్నాము.
లౌకికమైన
నిద్రలో
ఉంటున్నాము.
అజ్ఞానమనే
నిద్రలో
ఉంటున్నాము.
కనుకనే
మన
సచ్చిదానంద
స్వరూపమును
గుర్తించుకోలేక
పోతున్నాము.
నిద్రలో
నీకు
పాము
కరచింది.
నిద్రలో
కరచిన
పాముకోసం
అరుస్తున్నావు.
నిద్రలో
కరచిన
పామును
ప్రత్యక్షముగా
పోయి
మందు
వేస్తే
నివారణ
అవుతుందా.
నిద్రనుండి
లేపుతే
పాము
కరచిన
బాధ
తగ్గిపోతుంది.
నిద్రలో
నుండినంత
వరకు
పాము
భయము
బాధిస్తుంది.
నిద్ర
లేపుతే
పాము
భయము
ఉండదు.
కరచిన
గుర్తులుండవు.
ఈనాడు
అజ్ఞానమనే
నిద్రలో
ఉంటున్నాము.
దేహాభిమానమనే
నిద్రలో
ఉంటున్నాము.
లోకాభిమానమనే
నిద్రలో
ఉంటున్నాము.
అనిత్యం
అసుఖం
లోకం.
ఇది
ఒక
నిద్రవంటిది.
నిద్రలో
బాధలు
అనుభవిస్తున్నాము.
దీనికి
ఔషధము
ఏమిటి?
పరిహారము
ఏమిటి?
అజ్ఞానమనే
నిద్రనుండి
మేలుకోటమే.
ఇవన్నీ
దేహాభిమానముతో
కలసి
వస్తున్నాయి.
క్రమక్రమేణా
దేహాభిమానమును
తగ్గించుకుంటూ
రావాలి.
అప్పుడే
మనకానందము
పెరుగుతూ
వస్తుంది.
ఎంత
అభిమానము
తగ్గించుకొందుమో
అంత
ఆనందము
లభ్యమవుతుంది.
ఆనందమును
అనుభవించగోరే
ప్రతివ్యక్తి
ఈ
అభిమానమును
తగ్గించుకుంటూ
రావాలి.
అభిమానమునకు
తోడుగా
అహంకారము
ప్రారంభమవుతుంది.
పదవులచేతనో
లేక
ధనముచేతనో
లేక
భుజబలముచేతనో,
జన
బలముచేతనో
ఏదో
ఒక
విధంగా
అహంకారము
మనలో
ఆవిర్భవిస్తుంది.
మనం
ఎంత
పెరుగుతూ
పోతే
అంత
అభిమానము,
అహంకారము
అంత
తరుగుతూ
రావాలి.
మేఘములలో
నీరు
నిండినప్పుడు
మేఘములు
భారమై
క్రిందికి
దిగుతాయి.
ఒక
చెట్టుకు
అమితంగా
కాయలు
కాచినప్పుడు
కొమ్మలంతా
వంగిపోతాయి.
అయితే
ఈనాటి
మానవుడు
దేనిపై
ఆధారపడి
ఉన్నాడు.
చక్కగా
విచారించి
చూస్తే
చిన్న
పక్షి
కొమ్మపై
వాలి
ఉంది.
కొమ్మ
అటూ
ఇటూ
ఆడినా
పక్షి
ఏమాత్రము
భయపడదు.
కారణం
ఏమిటి?
‘నేను
నా
రెక్కలనాశ్రయించాను
కొమ్మ
ఊగనీ,
కాలనీ,
కూలనీ
నా
రెక్కలు
భద్రంగా
ఉంటున్నాయని
రెక్కలపై
విశ్వాసము
చేత
కొమ్మపైన
కూర్చోగలుగుచున్నది.
కాని
ఈనాడు
పక్షికున్న
విశ్వాసము
మానవునికి
లేదు.
సంసారమనే
వృక్షముపై
బాధలు
కష్టములు
కలిగినప్పటికి
తాను
భయపడిపోతున్నాడు.
కారణం
ఏమిటి?
ఆత్మవిశ్వాసము
కోల్పోవటం.
తనపై
తనకు
విశ్వాసము
లేకపోవటమే.
పక్షికి
తన
రెక్కలపై
తనకు
విశ్వాసముందిగాని
మానవునకు
ఆత్మవిశ్వాసము
లేకుండా
పోతున్నాది.
ఏ
కించిత్
కష్టమునకైనా
కృంగిపోతున్నాడు
మానవుడు.
కించిత్
బాధలకు
కృంగి
పోతున్నాడు
మానవుడు.
9
▾
Meaning
Keep
దేనిని
భరించుకోలేక
పోతున్నాడు.
సహించుకోలేక
పోతున్నాడు.
కనుక
పక్షులు
మృగములు
సహజమైన
జీవితము
అనుభవించటం
చేత
అవి
ధైర్యముగా
సాహసంగా
కార్యాలు
సాధిస్తూ
పోతున్నాయి.
ఈనాటి
మానవుడు
తన
బుద్ధి
బలముపైన
భుజబలముపైన,
ధన
బలముపైన
తాను
ఆధారపడి
ఉంటున్నాడు.
ఆత్మబలము
నాశ్రయించుకోలేదు.
ఆత్మ
విశ్వాసము
ఒక్కటి
ఉంటే
సర్వము
సాధించవచ్చు.
ఈ
ధనబలము
వస్తుంది
పోతుంది.
జనబలము.
జనబలము
ఎంతవరకు.
నీవు
అధికారముతో
సిరిసంపదలతో
తులతూగుతున్నంత
వరకు
బంధువులంతా
వెంట
ఉంటారు.
తదుపరి
జగత్తు
ఎట్లా
గౌరవిస్తుంది.
ఆత్మబలము
ఒక్కటి
ఉంటే
సర్వబలములు
చేకూరుతాయి.
ఈనాడు
ఆత్మబలము
చేత,
దైవబలము
చేత
జీవించుటకు
పూనుకోవాలి.
ఆత్మను
విశ్వసించి
మంచికర్మలు
ఆచరించటానికి
ప్రయత్నించాలి.
కర్మలు
ఎట్టివో
ఫలితములట్టివి.
తిండి
ఎట్టిదో
త్రేపు
అట్టిది.
పిండి
ఎట్టిదో
రొట్టె
అట్టిది.
ప్రతి
మానవుడు
సత్కర్మలలో
ప్రవేశించి
సదానందమును
అనుభవించాలి.
సత్
లోకములో
చేరాలి.
ఇదే
మానవుని
ప్రధాన
గమ్యము.
ఇదే
మానవుని
ప్రధాన
లక్ష్యము.
కేవలం
చెడ్డపని
చేసి
మంచి
రావాలంటే
ఇది
రావటానికి
వీలు
కాదు.
మంచి
చేయండి.
దైవత్వమునకు
అత్యంత
సమీపముగా
పోవటానికి
కృషి
చేయాలి.
ఒక్కొక్క
అడుగు
దైవమునకు
సన్నిహితంగా
ఉండాలి.
మనము
వేసే
ప్రతి
అడుగు
దైవమునకు
సమీపముగా
పోవాలి.
అప్పుడే
మనము
విజయమును
సాధించగలము.
Previous
←
Karma, Bhakti and Jñāna: The Aim of All Three Is One
Next
Learning Without Practice Is Futile
→