Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2008 · Divine Message
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Divine Message
18 June 2008, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(4)
18 June 1996
No Sādhana Surpasses Prema for God
19 October 1998
Dīpāvali: Its Inner Meaning
24 July 2002
The Paramāṇu Itself Is the Paramātma
18 September 2004
Parents Are the Visible Embodiments of God
ప్రదోషే
దీపక
శ్చంద్రః
ప్రభాతే
దీపకో
రవిః
త్రైలోక్యే
దీపకో
ధర్మః
సుపుత్రః
కులదీపకః.
రాత్రివేళయందు
వెలుగును
అందించేటువంటివాడు
చంద్రుడు.
పగటి
వేళయందు
వెలుగును
అందించేటువంటివాడు
సూర్యుడు.
ముల్లోకములకు
వెలుగును,
కాంతిని
చేకూర్చేటువంటిది
ధర్మము.
సుపుత్రుడు
కులమును
ప్రకాశింపజేస్తాడు.
అమావస్యకు,
పూర్ణిమకు
మధ్య
ఉన్నటువంటి
వ్యత్యాసం
మీకు
తెలుసు.
అమావాశ్య
కాళరాత్రి,
కటిక
చీకటిగా
ఉండేటువంటిది.
చీకటి
భయంకరమైనది.
భయమును
మాత్రమే
కాదు.
అనేక
దురాలోచనలను
అభివృద్ధిపరుస్తుంది.
దుష్కర్మలలో
ప్రవేశింపజేస్తుంది.
దొంగలకు,
దుర్మార్గులకు
చీకటి
ఎంతో
సహాయకారిగా
ఉంటుంది.
కనుక,
ఈ
చీకటిని
దుష్టులు,
దుర్మార్గులు
మాత్రమే
ఆశింతురుగాని,
సుహృదయులు
ఏమాత్రం
ఆశించరు.
సత్సంకల్పులు,
సత్క్రియాపరులు,
సదాచార
సంపన్నులు
వెలుగును
మాత్రమే
ఆశిస్తుంటారు.
పున్నమి
వెన్నెలను
చూచినప్పుడు
మానవుని
హృదయంలో
చల్లని,
శాంతమైన
భావములు,
సత్సంకల్పాలు
అభివృద్ధి
అవుతాయి.
చిన్న
పిల్లలు
కూడను
వెన్నెలను
చూచి
ఎంతో
ఆనందిస్తారు.
కవులు
వెన్నెలను
చూచినప్పుడు
తమలో
ఆవిర్భవించే
సద్భావములను
కవిత్వంగా
అల్లుతుంటారు.
పూర్ణిమ
దినమునాడు
మానవునియొక్క
హృదయం
కూడా
పూర్ణత్వంతోకూడి
ఉంటుంది.
మానవుని
మనస్సుకు,
చంద్రునకు
ఉండినటువంటి
సన్నిహిత
సంబంధబాంధవ్యాన్ని
గురించి
మనము
చక్కగా
విచారించాలి.
‘చంద్రమా
మనసో
జాతః
చక్షో
సూర్యో
అజాయత’.
చంద్రునియొక్క
ప్రతిబింబమే
మనస్సు.
కనుక,
చంద్రుని
వెన్నెలలో
మానవుని
మనస్సుకూడను
చల్లగా
సద్భావములతో,
సత్సంకల్పములతో
అభివృద్ధి
అవుతుంది.
కనుక,
పూర్ణిమ
అనేది
చీకటిని
పోగొట్టి,
భయమును
దూరంచేసి,
శాంతిని,
భద్రతను,
ఆనందాన్ని,
సత్సంకల్పాలను
అభివృద్ధిపరుస్తుంది.
ఇంక,
‘ప్రభాతే
దీపకో
రవిః’
అన్నారు.
పగటివేళయందు
సూర్యుడు
అందరికీ
వెలుగునందిస్తాడు.
సూర్యుడే
లేకపోతే
సృష్టియే
లేదు.
పంటలు
లేవు.
వృక్షములు
లేవు.
గాలి
లేదు.
తిండి
లేదు.
జీవరాసులు
బ్రతకలేవు.
సూర్యునియొక్క
వెలుగు
వల్లనే
పంటలు
పండుతున్నాయి.
నదులు
ప్రవహిస్తున్నాయి.
జగత్తు
ఆనందంగా,
సుక్షేమంగా,
సుభిక్షంగా
అభివృద్ధినొందుతున్నాయి.
సూర్యునియొక్క
ప్రభావముచేతనే
మానవుని
హృదయముకూడను
పవిత్రమౌతున్నది.
సూర్యునియందున్న
హైడ్రోజన్,
హీలియమ్
ఈ
జగత్తునకు
అనేకవిధములుగా
తోడ్పడుతున్నవి.
కనుక,
సూర్యుడే
ఈ
భూలోకమునకు
ప్రత్యక్ష
దైవము.
‘త్రైలోక్యే
దీపకో
ధర్మః’.
ఈ
మూడు
లోకములకు
వెలుగునందించేది
ధర్మము.
ధర్మమంటే
ఏమిటి?
‘ధృయతే
ఇతి
ధర్మః’
అనగా
పట్టి
ఉంచేటువంటిది.
that
which
upholds
is
dharma.
ధర్మము
అన్నింటినీ
పట్టి
ఉంచుతుంది.
ధర్మమే
లేకపోతే
జగత్తే
నిలువలేదు.
సమస్త
కర్మలకు
ధర్మమే
ప్రాణము
వంటిది.
ప్రాణసమానమైన
ధర్మమే
లేకపోతే
జీవితమే
లేదు.
‘ధారయతీతి
ధర్మః’
ధరించినటువంటిదే
ధర్మము.
ఒక్కొక్క
వస్తువుకు
ఒక్కొక్క
ధర్మము
ఉంటున్నది.
ఉదాహరణకు,
దహనశక్తి
అగ్నియొక్క
ధర్మము.
దహనశక్తి
కోల్పోతే
అది
అగ్ని
కాదు.
బొగ్గు
అవుతుంది.
ఐసుగడ్డకు
చల్లదనమే
ధర్మము.
చల్లదనమును
కోల్పోతే
అది
ఐసు
కాదు.
అదేవిధముగా,
మానవునియొక్క
ధర్మమేమిటి?
హృదయము,
వాక్కు,
క్రియ-
ఈ
త్రిపుటియొక్క
ఏకత్వమూ,
పవిత్రతా,
పరిశుద్ధతా,
నిర్మలత్వములే
మానవ
ధర్మము.
కనుకనే,
the
proper
study
of
mankind
is
man
అన్నారు.
మానవుడు
చేసే
కర్మలన్నీ
పవిత్రంగా
ఉండాలి.
తన
కాన్షియన్స్కు
తృప్తికరంగా
ఉండాలి.
తాను
పలికే
పలుకులన్నీ
పరిశుద్ధంగా
ఉండాలి.
కనుకనే,
‘జిహ్వే
రసజ్ఞే
మధుర
ప్రియే
సత్యం
హితం
త్వాం
పరమం
వదామి’
‘
ఓ
పవిత్రమైన
నాలుకా!
రసమెరిగిన
నాలుకా!
స్వార్థమెరుగని
నాలుకా!
నీవెంతగొప్పదానివే!’
అని
వర్ణించాడు
భక్తజయదేవుడు.
అటువంటి
పరిశుద్ధమైన
నాలుకను
ఈనాడు
అసత్యముచేత
మాలిన్యపరచుకుంటున్నాము.
సత్యమునే
పలకాలి.
ఆ
సత్యము
కూడను
ఎట్లా
పలకాలి?
‘అనుద్వేగకరం
వాక్యం
సత్యం
ప్రియం
హితంచ
యత్’.
మనము
పలికే
పలుకులు
ఉద్వేగకరంగా
ఉండకూడదు.
సత్యముకదాయని
నొప్పించే
పలుకులు
పలకకూడదు.
అది
ప్రియంగా
ఉండాలి.
హితంగా
ఉండాలి.
అతిగా
మాట్లాడకూడదు.
మృదువుగా
మాట్లాడాలి.
దానినే
‘సత్యము
’
అన్నారు.
‘త్రికాలబాధ్యం
సత్యం’.
మూడు
కాలములయందు
ఉండేటువంటిది
సత్యం.
ఇంక
నిజం
అనేది
ఒకటుంది.
ఈ
ప్రపంచములో
సామాన్యంగా
సత్యమును,
నిజమును
ఒకటిగా
చూచుకుంటారు.
కాని,
సత్యము
వేరు,
నిజము
వేరు.
అప్పటికప్పుడు
మాత్రమే
కనిపించేది
నిజము.
ఎల్లప్పుడూ
కనిపించేది
సత్యము.
ఉదాహరణకు,
ఇప్పుడు
నీవొక
శాలువ
కప్పుకొని
ఉండవచ్చును.
రేపటి
దినం
దానిని
కప్పుకొనకపోవచ్చును.
కాబట్టి,
నీవు
శాలువ
కప్పుకొన్నావన్నది
నిజమేగాని,
సత్యము
కాదు.
త్రికాలములలోను
మార్పులు,
చేర్పులు
లేనటువంటిది,
కదలనటువంటిది,
మెదలనటువంటిది
ఏదైతే
ఉన్నదో
అదే
సత్యము.
మధ్యమధ్య
మారుతూ
ఉండేది
సత్యము
కాదు.
వేదాంతములో
ఈ
సత్యమును
‘ఋతం’
అన్నారు.
జ్ఞానము,
వివేకము
-
ఈ
రెండింటితో
కూడినప్పుడు
అది
‘ఋతం’
అనే
రూపాన్ని
ధరిస్తుంది.
మానవత్వంలో
మన
ధర్మమేమిటి?
సత్యాన్ని
పలకాలి.
ధర్మాన్ని
ఆచరించాలి.
అదియే
మానవునియొక్క
ప్రధానమైన
విలువ.
2
▾
Meaning
Keep
హృదయమనేది
మనకు
కనిపించదు.
కాని,
మాటలు,
చేతలు
-
ఈ
రెండింటి
ద్వారా
ఎవరి
హృదయము
ఎటువంటిదో
మనం
గుర్తించటానికి
వీలవుతుంది.
ఎందుకంటే,
ఈ
రెండూ
అంతర్భావముయొక్క
ప్రతిబింబములే.
మానవత్వముయొక్క
దివ్యమైన
విలువలను
‘ప్రీతి,
భీతి,
నీతి’
అనే
మూడు
పదములతో
చెప్పవచ్చు.
ప్రీతి-
దైవప్రీతి
ఉన్నప్పుడు
సత్యము,
ధర్మము
రెండూ
మనలో
ఆవిర్భవిస్తాయి.
భీతి-
పాపభీతి
ఉన్నప్పుడు
ప్రేమ,
శాంతము
రెండూ
వస్తాయి.
ఇక,
నీతి-
సంఘనీతి
ఉన్నప్పుడు
అహింస
అనేది
మనలో
ఆవిర్భవిస్తుంది.
దైవప్రీతిని
మనం
పోషించుకున్నామంటే
సత్యము,
ధర్మము,
శాంతము,
అహింస
అన్నీ
దానిని
అనుసరిస్తాయి.
ప్రీతి
కలవాడు
హింసకు
పాల్పడడు.
అధర్మంలో
ప్రవేశించడు.
ఎల్లప్పుడూ
శాంతంగానే
ఉంటాడు.
కనుక,
ప్రీతియే
అన్నింటియందు
ప్రాణసమానం.
మానవతా
విలువలన్నీ
ఒక్క
ప్రీతిలోనే
ఇమిడి
ఉన్నాయి.
ప్రేమ
అనేది
దిక్సూచి
యంత్రము
వంటిది.
ఎక్కడ
పెట్టినా
దాని
ముల్లు
ఉత్తరదిశనే
చూపిస్తూ
ఉంటుంది.
అదేవిధముగా,
ప్రేమ
అనేది
ఎట్టి
పరిస్థితియందైనా
దైవమువైపుకే
మలుతుంది.
కాబట్టి,
ప్రధానమైన
మానవతా
విలువ
దైవప్రీతియే.
ఆ
ప్రేమయే
ప్రతి
మానవునియందూ
ఉంటున్నది.
ఇది
మానవునికి
భగవంతుడు
అందించిన
‘స్పెషల్
గ్రేస్’.
దైవము
సర్వభూతములందు
ఉంటున్నాడనే
తత్త్వాన్ని
వేదము
ఘోషించింది.
‘ఈశ్వరస్సర్వభూతానమ్’
ఎవరు
ఈశ్వరుడు?
‘ప్రేమ్
ఈశ్వరహై,
ఈశ్వర్
ప్రేమ్హై’.
ప్రేమే
ఈశ్వరుడు,
ఈశ్వరుడే
ప్రేమ.
దీనిని
పురస్కరించుకొనియే,
‘love
is
god,
god
is
love’
అన్నారు.
ఒకానొక
సమయంలో
జీసస్
తల్లియొక్క
అనుమతి
తీసుకొని
ఎడారిలో
ఒక
పర్వతంపై
42
దినములు
తపస్సు
చేసాడు.
తదుపరి
తనయొక్క
స్వస్వరూపాన్ని
తాను
దర్శించుకున్నాడు.
‘ఓ
ఫాదర్!
నేను
మూడు
వరములు
కోరుతున్నాను.
నాకు
అనుగ్రహించు’
అని
భగవంతుని
ప్రార్థించాడు.
ఏమిటవి?
‘నీవు
నాకు
ఈ
జీవితాన్ని
అందించినందుకు
నేను
ఎవ్వరికీ
ఏ
బాధలూ
కలిగించకుండా
అందరికీ
సేవలు
చేసేవిధంగా
నన్ను
అనుగ్రహించు.
ఇతరుల
తప్పును
క్షమించటానికి
నేను
ఎల్లప్పుడూ
సిద్ధమేగాని,
అసత్యాన్ని
మాత్రం
ఒప్పుకోను.
కాబట్టి,
సత్యమార్గంలో
నన్ను
ప్రవేశింపజేయి.
ఇది
నా
మొట్టమొదటి
కోరిక’
అన్నాడు.
రెండవది
ఏమిటి?
‘అసూయాపరులు
నన్ను
ఎన్నివిధములుగా
హింసించినప్పటికిని,
దూషించినప్పటికిని,
పరిహసించినప్పటికిని,
బాధించినప్పటికిని
ఓపికగా
ఉండే
హృదయాన్ని,
శాంతంగా
ఉండే
చిత్తాన్ని
నాకు
అనుగ్రహించు’
అని
కోరాడు.
మంచిని
చూచి
లోకులు
అసూయపడుతుంటారు.
అభివృద్ధికి
వచ్చే
వారిని,
సుఖంగా
ఉన్నవారిని
చూచి
కుళ్ళిపోతుంటారు.
ఇవి
అల్పబుద్ధియొక్క
లక్షణాలు.
నిజంగా
పశువులుకూడను
ఆవిధంగా
అసూయపడవు.
కాని,
ఈనాటి
మానవునియందు
స్వార్థమనేది
అధికం
కావటంచేత
దానితోబాటు
అసూయ
పెరుగుతూ
వచ్చింది.
ఇక,
జీసస్
కోరిన
మూడవ
కోరిక
ఏమిటి?
‘ఓ
భగవంతుడా!
నీ
ఆనందమే
నా
ఆనందము.
నీవూ
ప్రేమస్వరూపుడవే.
నేనూ
ప్రేమస్వరూపుడనే.
పూర్ణము
పూర్ణములోనే
ఏకమైపోవాలి.
కాబట్టి,
నా
పరిపూర్ణమైన
ప్రేమను
నీ
పాదాలకే
అంకితం
చేస్తాను.
నీ
సేవకే
నా
జీవితం
అర్పితం
కావాలి’
అన్నాడు.
భగవంతుడు
పరిపూర్ణుడు.
ఆ
పరిపూర్ణునికే
మనయొక్క
పరిపూర్ణమైన
ప్రేమను
అర్పించాలి.
జీసస్
జన్మించినప్పుడు
ముగ్గురు
అరేబియన్
రాజులు
అక్కడికి
వచ్చారు.
మొదటి
రాజు,
‘
ఇతను
దైవాన్ని
ప్రేమించే
బిడ్డగా
కనిపిస్తున్నాడు’
అన్నాడు.
రెండవ
రాజు,
‘దైవం
ప్రేమించే
బిడ్డగా
ఇతను
తయారౌతాడు’
అన్నాడు.
మూడవ
రాజు,
‘ఇతనే
దైవము’
అన్నాడు.
దేవుని
ప్రేమించేవాడు
మెసెంజర్
ఆఫ్
గాడ్.
దేవునిచే
ప్రేమింపబడేవాడు
‘సన్
ఆఫ్
గాడ్’.
కనుకనే,
జీసస్
మొట్టమొదట
‘i
am
the
messenger
of
god’
అన్నాడు.
తరువాత
'i
am
the
son
of
god'
అన్నాడు.
చివరికి
'i
and
my
father
are
one'
అన్నాడు.
మానవునికి
మూడు
స్వరూపాలున్నాయి.
1.
భౌతిక
స్వరూపము.
2.
మానసిక
స్వరూపము.
3.
ఆత్మస్వరూపము.
మొదటిది
the
one
you
think
you
are.
రెండవది
the
one
others
you
are.
మూడవది
the
one
you
really
are.
‘ఆత్మరీతిగా
నేనూ
నా
తండ్రి
ఒక్కటే’
అన్నాడు
జీసస్.
దీనినే
హనుమంతుడు
శ్రీరామునికి
చెప్పాడు,
‘రామా!
దేహబుద్ధిచే
నేను
నీ
సేవకుడను.
జీవబుద్ధిచే
నీ
అంశమును.
ఆత్మబుద్ధిచే
నేనూ
నీవూ
ఒక్కటే’
అనే
భావముతో
ప్రతి
మానవుడు
మొట్టమొదట
భగవంతునియొక్క
దూతగా
కర్మ
మార్గంలో
ప్రవేశించి
హృదయపూర్వకంగా
సత్కర్మలాచరించాలి.
రెండవది
భక్తిమార్గం.
అనగా
దైవాన్ని
పూజించటము,
సేవించటం,
భజించటం,
జపించటం,
దైవం
కొరకు
తపించటం.
ఇంక,
మూడవది
జ్ఞానమార్గం.
‘వర్క్,
వర్షిప్,
విజ్డమ్’
అనగా
మానవుడు
కర్మతో
ప్రారంభించి
జ్ఞానంతో
అంత్యం
కావాలి.
భగవంతుడు
సర్వాంతర్యామి
అన్నది
అమాయకులకు
కూడా
అర్థమయ్యే
విషయమే.
కాని,
ఈనాడు
మేధావులైనటువంటివారికి
మాత్రం
అన్నీ
సందేహాలే!
‘భగవంతుడు
సర్వత్రా
ఉంటే
మా
కంటికి
కనిపించటం
లేదే’
అని
వాదిస్తారు.
ఈ
కాలంలో
మేధావులకంటే
ఏ
చదువూ
లేనివారే
ఎంతో
మేలు.
పాలలో
వెన్న
ఎక్కడుంది?
ప్రతి
చుక్కలోనూ,
ప్రతి
కణములోనూ
ఉంది.
కాని,
కనిపించటం
లేదు.
అయితే,
ఎప్పుడు
మనకు
ప్రత్యక్షమవుతుంది?
దానిని
పెరుగుగా
మార్చి,
కవ్వంతో
చిలికినప్పుడు
వెన్న
పైభాగానికి
వచ్చేస్తుంది.
భగవంతుడు
పాలలో
వెన్నవలె
సర్వత్రా
ఉంటున్నాడు.
అయితే,
ఎప్పుడు
కనిపిస్తాడు?
నీ
హృదయమనే
పాత్రలో
ఉన్న
ప్రేమ
అనే
పాలను
భగవంతునికి
అర్పితం
చేయి.
నీ
ప్రేమను
భగవంతునికి
అర్పితంచేయటమే
నీవు
చేయవలసిన
సాధన.
3
▾
Meaning
Keep
Also in his talks
(4)
6 May 1987
To seek out the road is the noble intellect
19 July 1997
Guard your character as dearly as life
23 November 1998
Sarvaṁ Khalvidaṁ Brahma
19 November 2001
Only when parents are ideal do children become virtuous
అప్పుడే
నీకు
సాక్షాత్కారం
కలుగుతుంది.
అయితే,
భగవంతుని
దృష్టి
ఎవరిపై
ఉంటుంది
అని
మీకు
సందేహము
కలగవచ్చు.
ఉదాహరణకు,
వెలుగుతున్న
ఒక
బల్బును
తీసుకోండి.
ఆ
వెలుగు
ఎక్కడ
చూస్తున్నదంటే,
అన్నివైపులా
చూస్తున్నది.
అదేరీతిగా,
భగవంతుడు
ఎవరిని
చూస్తున్నాడంటే,
అందరినీ
చూస్తున్నాడు.
ఈ
సభలో
నిద్రపోయే
వారినీ
చూస్తున్నాడు,
చెబుతున్నది
వినకుండా
ఏదో
చింతచేసేవారిని
చూస్తున్నాడు.
రామకృష్ణ
పరమహంస
ఒకానొక
సాయంకాలంవేళలో
భగవద్విషయాన్ని
చక్కగా
బోధిస్తున్నాడు.
ఆ
సమావేశములో
రాణి
రాసమణికూడా
వచ్చి
కూర్చుంది.
రామకృష్ణుడు
చెబుతున్న
విషయాన్ని
వింటున్నట్లుగానే
ఆమె
తల
ఊపుతున్నది.
కాని,
అసలు
విషయం
రామకృష్ణునికి
తెలుసు.
ఆయన
ఉన్నట్లుండి
కుర్చీనుండి
లేచి
రాసమణి
దగ్గరకు
వెళ్ళి
ఆమె
చెంపమీద
కొట్టాడు.
అందరికీ
ఆశ్చర్యం
వేసింది.
‘ఏమిటి
పిచ్చివాడు.
ఆమె
కట్టించిన
దేవాలయములోనే
సేవ
చేస్తున్నాడు.
కాని,
ఇంతమంది
మధ్యలో
ఆమెను
ఈవిధంగా
అవమానించాడేమిటి?’
అని
అనుకున్నారు.
అప్పుడు
రామకృష్ణుడు
రాసమణిని,
‘నీవు
దేనికోసం
ఈ
సభకు
వచ్చావు?
ఇక్కడ
బోధించే
విషయాలను
శ్రద్ధగా
విని
ఆచరణలో
పెట్టాలి.
కాని,
నీవు
వచ్చి
ఈ
సభలో
కూర్చొని
రేపటి
కోర్టుకేసు
విషయంగూర్చి
ఆలోచిస్తున్నావు.
ఇంట్లో
కూర్చొని
ఆలోచించుకో!
ఇక్కడికెందుకు
రావాలి’
అని
మందలించాడు.
అనేకమంది
సభల్లో
పాల్గొంటున్నారు.
కాని,
అక్కడ
కూర్చొని
దేనిగురించో
యోచన
చేస్తుంటారు.
సభలో
ఏమి
చెప్పారో
ఏమిటో
వారికి
తెలియదు.
అటువంటివారు
ఇట్టి
సమావేశాల్లో
పాల్గొనకూడదు.
సమావేశాల్లో
పాల్గొంటిరా,
అక్కడ
చెప్పిన
విషయాలను
శ్రద్ధగా
విని,
తు.చ.
తప్పక
పాటించటానికి
ప్రయత్నం
చేయాలి.
ఈ
సత్యాన్ని
ఆనాడు
రామకృష్ణ
పరమహంస
చక్కగా
బోధించాడు.
ధర్మమనేది
కేవలం
ఒక్క
భూలోకమునకు
మాత్రమే
కాదు,
ముల్లోకములకు
కూడను
వెలుగు
నందిస్తుంది.
ఏమిటీ
ముల్లోకములు?
వీటినే
గాయత్రీ
మంత్రమందు
‘భూర్బువస్సువః’
అన్నారు.
అనగా,
దేహంతో
చేసే
కర్మలయందు,
మానసికంగా
తలచే
తలపులందు,
ఆత్మరీతిగా
ఆనందించే
విషయములయందు
ధర్మము
వెలుగునందిస్తుంది.
‘సుపుత్రః
కులదీపకః’
మంచి
పుత్రుడు
కులమునకే
వెలుగునందిస్తాడు.
ఎవరు
ఈ
good
son?
good
son
means
god
son.
‘బ్రహ్మ
సత్యం
జగన్మిథ్య’
అన్నారు.
మిథ్యమనగా
జీరో.
కాబట్టి,
గుడ్
అనే
పదంలో
ఒక
జీరో
తీసేస్తే
అది
గాడ్
అవుతుంది.
god
son
is
good
son.
అనగా
నిరంతరం
దైవభావములు,
దైవచింతనలు
కలిగి
దైవకర్మలు
ఆచరించేవాడే
సుపుత్రుడు.
తల్లిదండ్రుల
ఆజ్ఞను
శిరసావహించి,
వారి
ప్రేమను
అందుకొని,
వారిని
ఆనందపరచి,
తనను
పెంచి
పెద్దచేసినందుకు
వారికి
కృతజ్ఞతనందించి
వారిని
సంతృప్తి
పరచేవాడు
సుపుత్రుడు.
అంతేకాదు,
సమాజంలో
మంచిపేరు
తెచ్చుకొనేవాడు
సుపుత్రుడు.
కులములో
ఒకండు
గుణవంతుడుండెనా
కులము
వెలయు
వాని
గుణము
వెలయు
వెలయు
వనములోన
మలయజంబున్నట్లు...
అడవియందు
ఒక
చందన
వృక్షము
ఉంటే,
అది
అడవి
అంతటికీ
చక్కని
సుగంధమునందిస్తుంది.
అదేరీతిగా,
కులములో
ఒక
సుపుత్రుడుంటే,
అతను
ఆ
జాతి
అంతటికీ
గొప్ప
కీర్తి
తెస్తాడు.
ఈనాడు
కొడుకు
పుట్టిన
తక్షణమే
తండ్రి
మిఠాయి
పంచుతుంటాడు.
కొడుకు
పుట్టాడని
గొప్పగా
చెప్పుకోనక్కరలేదు.
ఆ
పుట్టిన
కొడుకు
ఏనాడు
సమాజంలో
మంచిపేరు
తెచ్చుకుంటాడో
ఆనాడే
తండ్రి
పండుగ
చేసుకోవాలి.
పుత్రోత్సాహము
తండ్రికి
పుత్రుడు
జన్మించినపుడె
పుట్టదు
జనులా
పుత్రుని
కనుగొని
పొగడగ
పుత్రోత్సాహము
నాడు
పొందును
సుమతీ!
‘ఆహా!
ఆ
పిల్లవాడు
చాలా
మంచివాడు’
అని
పదిమంది
అన్నప్పుడే
తండ్రికి
పుత్రోత్సాహము
కలుగుతుంది.
అదియే
తండ్రికి
గొప్ప
విలువనందిస్తుంది.
అదియే
దైవానికి
ఆనందము.
నీవు
గొప్పచదువులు
చదివినంతమాత్రమున,
గొప్ప
బిరుదులు
తెచ్చుకున్నంత
మాత్రమున
సుపుత్రుడవనిపించుకోవు.
నీ
నడతలో
మంచితనం
ఉండాలి.
మంచి
ప్రవర్తన,
గౌరవమర్యాదలు,
క్రమశిక్షణ,
భక్తి
ఇవన్నీ
నీలో
ఉండాలి.
భక్తి
చాలా
ప్రధానమైనది.
అది
ఉంటే
చాలు.
నీలో
అన్నీ
మంచి
గుణాలే
చేరుతూవస్తాయి.
ఇంటిలో
వేసిన
బల్బు
ఒక
గదికి
మాత్రమే
వెలుగునందిస్తుంది.
రాత్రివేళ
చంద్రుడు
సర్వత్రా
వెలుగునందిస్తాడుగాని,
ఆ
వెలుగు
డిమ్‌గా
ఉంటుంది.
కాబట్టి,
ఇంటిలో
వెలిగే
బల్బు;
స్వార్థము;
చంద్రునినుండి
వచ్చే
వెలుగు
-
పరార్థము;
సూర్యకాంతి
-
యథార్థము.
అదే
సత్యము.
సత్యమే
దైవము.
సర్వత్రా
వెలుగునందించే
సూర్యుడే
మనకు
ప్రత్యక్షదైవము.
కనుకనే,
ప్రాచీనకాలమునుండి
భారతీయులు
సూర్యోపాసన,
సూర్య
నమస్కారాలు
చేస్తూవచ్చారు.
ఈనాడు
లోకంలో
ద్వైత,
అద్వైత,
విశిష్టాద్వైతములనే
మూడు
స్థాయిలు
ఉంటున్నాయి.
అయితే,
విశిష్టాద్వైత
అద్వైతముల
మధ్య
ఎక్కువగా
వ్యత్యాసం
లేదు.
4
▾
Meaning
Keep
ఉదాహరణకు,
షుగర్‌కేన్
తీసుకోండి.
అది
ఎన్నెన్నో
కనుపులతోగూడి
ఉంటుందిగాని,
దానిలోపల
జ్యూస్,
దాని
టేస్టూ
ఒకటిగానే
ఉంటుంది.
ఈ
షుగర్కేన్లో
ఎక్కడైనా
జ్యూస్
తియ్యి,
తీపియే
వస్తుందిగాని
వేరు
రుచి
ఉండదు.
కనుక,
షుగర్‌కేన్
జ్యూస్
అద్వైతమన్నాడు.
అయితే,
ఈ
షుగర్కేన్జ్యూస్
ఎంతకాలమో
ఉండటానికి
వీలుకాదు.
కాబట్టి,
దానిని
షుగర్‌గా
మార్చుకోవాలి.
అది
ఎప్పటికీ
ఉంటుంది.
దానిని
ఎప్పుడైనా
ఎక్కడైనా
దేంట్లోనైనా
ఉపయోగించుకోవచ్చు.
కాబట్టి,
షుగర్కేన్జ్యూస్
అనేది
అద్వైతమైతే,
షుగర్
అనేది
విశిష్టాద్వైతము.
అది
విశిష్టమైన
అద్వైతము.
దీనిని
ప్రతిపాదించినవారు
రామానుజులవారు.
ద్వైతము
-
మధ్వాచార్యులవారు.
అద్వైతము
-
శంకరాచార్యులవారు.
ద్వైతములో
జీవుడు
వేరు,
దేవుడు
వేరు.
మధ్వాచార్యులు
ఏమని
చెప్పారు?
‘భగవంతుడా!
షుగర్కేన్జ్యూస్
నాకక్కరలేదు.
షుగర్‌ను
కూడా
కానక్కరలేదు.
ఎందుకంటే,
షుగర్‌కు
తన
టేస్టు
తెలియదు.
కాబట్టి,
నేను
షుగర్‌ను
తినే
చీమగా
ఉండాలి.
నీవు
ప్రేమస్వరూపునిగా
ఉన్నావు.
నేను
నీ
ప్రేమను
అనుభవించేవానిగా
ఉండాలి.
నీవు
దేవుడవు.
నేను
జీవుడను.
మనం
వేరుగానే
ఉండాలి.
జీవుడు
వేరుగా
ఉన్నప్పుడే
దైవత్వాన్ని
అనుభవించటానికి
వీలవుతుంది’
అన్నాడు.
ఇదే
దైవత్వము.
ఈ
జీవుడు
దేవుడనే
షుగర్‌ను
బాగా
తిని,
జీర్ణించుకొని
దేవునియొక్క
తత్త్వాన్ని
అర్థంచేసుకున్న
తరువాత
తానే
దేవుడైపోతాడు.
‘బ్రహ్మ
విద్
బ్రహ్మైవ
భవతి’.
ఈనాడు
ద్వైత,
విశిష్టాద్వైత,
అద్వైతములను
గురించి
లేనిపోని
వాదోపవాదములలో
మునిగి
కాలాన్ని
వ్యర్థంచేస్తున్నారు.
ఈ
మూడూ
చేరి
ఒక్కటే.
మైసూర్‌పాక్,
గులాబ్‌జామ్,
బర్ఫీ,
పాలకోవ
వీటన్నింటిలోనూ
ఉన్న
చక్కెర
ఒక్కటే
కదా!
అదేరీతిగా,
ఈ
జగత్తునందు
రూపనామములు
వేరువేరుగా
ఉన్నాయి.
కాని,
అందరియందు,
అన్నింటియందు
ఉన్నది
ఒక్కటే,
‘ఏకాత్మా
సర్వభూతాంతరాత్మా’.
చూడండి,
బల్బులు
ఎన్నో
ఉన్నాయి.
కాని,
కరెంటు
ఒక్కటే.
అయితే,
వ్యత్యాసం
ఎక్కడ
ఉంటున్నాది?
ఒకటి
ఒకటి
ఎరుపుగా
ఉంది,
ఒకటి
నీలముగా
ఉంది,
ఒకటి
తెలుపుగా
ఉంది,
ఒకటి
ఎక్కువ
కాంతిగా
ఉంది.
ఒకటి
తక్కువ
కాంతిగా
ఉంది.
ఇదంతా
కరెంటు
దోషము
కాదు;
బల్బులలోను,
వాటి
వాటేజ్లోను
వ్యత్యాసముంది.
అదేవిధముగా,
దివ్యశక్తి
అనే
కరెంటు
నీయందు,
నాయందు,
అందరియందు
ఉంటున్నది.
అయితే,
ఒక్కొక్కరి
హృదయముయొక్క
కెపాసిటీనిబట్టి
ఒకరిది
డిమ్‌గా
ఉంటున్నది.
ఒకరిది
బ్రైట్‌గా
ఉంటున్నది.
దీనికి
కారణం
వాటేజ్లోనున్న
వ్యత్యాసమే.
నీవు
సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
హరిచింతనం
చేసినప్పుడు
ఈ
వాటేజ్
కావలసినంత
వచ్చేస్తుంది.
కాబట్టి,
నీవు
బల్బును
మార్చుకో.
వాటేజ్ని
మార్చుకో.
అంతేగాని,
కరెంటును
మార్చనక్కరలేదు.
డిమ్‌గా
ఉన్న
హృదయం
బ్రైట్‌గా
మారాలంటే
ప్రేమను
పెంచుకో.
ప్రేమ
పెరిగేకొలదీ
నీ
హృదయం
లైట్‌గా,
బ్రైట్‌గా
మారిపోతుంది.
చూడండి,
ఇది
ఒక
కఱ్ఱ.
దీనిని
నిప్పులో
వేస్తే
ఇది
బొగ్గుగా
మారిపోతుంది.
కఱ్ఱను
ముట్టుకుంటే
మనకేమీ
మాలిన్యమంటదుగాని,
బొగ్గును
ముట్టుకుంటే
మాత్రం
మాలిన్యం
అంటుతుంది.
ఈ
బొగ్గును
తిరిగి
తెల్లగా
చేయాలంటే
ఏమి
చేయాలి?
అమాయకులు,
అజ్ఞానులు
సబ్బు
వేసి
కడుగుతారు.
బొగ్గుపైన
సబ్బువేసి
రుద్దుతే
సబ్బుకూడా
నల్లగా
అయిపోతుందిగాని
బొగ్గు
తెల్లగా
కాదు.
బొగ్గును
పాలలో
వేసి
కడిగినా
పాలుకూడా
నల్లగా
అయిపోతాయిగాని
బొగ్గు
తెల్లబడదు.
ఇక్కడ
మనము
తెలుసుకొనవలసినది
ఏమిటి?
ఇది
ఎందువలన
బొగ్గు
అయింది?
ఏవిధంగా
బొగ్గు
అయింది?
అగ్నియొక్క
సంపర్కముచేత
బొగ్గు
అయింది.
దానిని
తిరిగి
అగ్నిలోనే
వేయి;
అది
కాలి,
కాలి,
కాలి
కడపటికి
తెల్లని
భస్మముగా
మారిపోతుంది.
సగం
కాలటంచేత
అది
బొగ్గు
అయింది.
పూర్తిగా
కాలినప్పుడు
అది
తెల్లగా,
తేలికగా
తయారౌతుంది.
అదేవిధముగా,
పార్ట్‌టైమ్
డివోషన్
ఉన్నప్పుడు
మనస్సు
బొగ్గుమాదిరి
ఉంటుంది.
ఫుల్‌టైమ్
డివోషన్
ఉన్నప్పుడు
అది
లైట్‌గా,
బ్రైట్‌గా
ఉంటుంది.
కనుక,
దానిని
ప్రేమ
అనే
అగ్నిలో
వేయి.
అది
కాలి
కాలి
చక్కని
భస్మముగా
మారిపోతుంది.
ఉఫ్
అంటే
ఎగిరిపోతుంది.
చూడండి,
ఈ
కఱ్ఱను
అక్కడ
విడిచితే
క్రింద
పడిపోతుంది.
కాని,
దానినే
బాగా
కాల్చి,
భస్మంగా
చేస్తే
ఉఫ్
అంటే
పైకి
పోతుంది.
కాబట్టి,
మనసు
ఎంత
లైట్
అయితే
అంత
హైట్‌కి
పోతుంది.
వెయిట్
ఎంత
ఎక్కువైతే
అంత
క్రిందకు
దిగజారిపోతుంది.
కాబట్టి
ఉన్నతస్థాయికి
పోవాలంటే
కోరికలనే
వెయిట్‌ను
తగ్గించుకుంటూ
పోవాలి.
less
luggage
more
comfort
make
travel
a
pleasure.
కోరికలను
తగ్గించుకునే
కొలదీ
మనసు
తేలిక
అవుతుంది.
కోరికలు
తగ్గినంత
మాత్రమున
చాలదు;
రాగద్వేషఅసూయలనే
దుర్గుణములు
ముఖ్యంగా
తగ్గాలి.
ఈ
మూడే
మానవునికి
ప్రధానమైన
శత్రువులు.
ఇవి
కర్మ,
ఉపాసన,
జ్ఞానములనే
మూడింటినీ
నాశనం
చేస్తాయి.
కామము
భక్తిని
నాశనం
చేస్తుంది.
క్రోధము
జ్ఞానాన్ని
నాశనం
చేస్తుంది.
లోభము
కర్మను
నాశనం
చేస్తుంది.
క్రోధము
వచ్చినప్పుడు
ఎప్పుడు
ఎక్కడ
ఏవిధంగా
మాట్లాడాలనే
విచక్షణా
జ్ఞానమే
శూన్యమవుతుంది.
అది
శత్రుత్వాన్ని
పెంచుతుంది.
కనుక,
క్రోధమునకు
అవకాశమివ్వకూడదు.
లోభము
అసలే
ఉండకూడదు.
కేన్సర్
జబ్బయినా
నయమవుతుందిగాని
ఈ
మూడూ
నయం
కావు.
అయితే,
ఎప్పుడు
నయమవుతాయి?
దైవప్రేమాగ్నిలో
వేసినప్పుడు
ఇవి
భస్మమైపోతాయి.
కఠినమైన
ఇనుమును
అగ్నిలో
వేసినప్పుడు
అది
చక్కగా
కాలిపోయి
కరగిపోతుంది.
చూచారా!
అగ్నిలో
కఠినమైన
ఇనుమే
ఆవిధంగా
కరగిపోయినప్పుడు
దైవప్రేమాగ్నిలో
మన
దుర్గుణాలు
కరిగిపోవా!
కనుక,
మనం
దుర్గుణాలను
మొట్టమొదట
నాశనం
చేసుకోవాలి.
వీటిని
నాశనం
చేసుకోవటానికి
జపమో,
ధ్యానమో,
ఇంకే
సాధనో
చేస్తే
ప్రయోజనం
లేదు.
5
▾
Meaning
Keep
Also in his talks
(9)
21 June 1989
Live as an Ideal
23 May 1990
Road to Divinity
24 May 1990
Hold the Reins
25 May 1990
Vagaries of the Mind
27 February 1995
Every atom is the form of God
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
20 November 2000
Prema and Service Are Like Wings That Carry Us to the Heights
15 April 2003
Ancient traditions are the steps to rising higher
15 January 2008
Revere your mother as God, your father as God
మెడిటేషన్
చేస్తున్నారు
చాలామంది.
ఏమి
మెడిటేషన్
అది?
ఆడంబర
మెడిటేషన్.
ఫొటోకి
పోజిస్తున్నట్లు
కూర్చుంటారు.
ఆ
కూర్చోవటం
కాదు
మెడిటేషన్.
దేహముతో
చేసే
సర్వ
కర్మలుకూడను
మిథ్యములేగాని
సత్యములు
కావు.
మనస్సులో
ప్రేమను
నింపుకొని
చేసే
సాధనలే
సత్యమవుతాయి.
శ్రేయోహి
జ్ఞానమభ్యాసాత్
జ్ఞానాద్ధ్యానం
విశిష్యతే|
ధ్యానాత్కర్మ
ఫలత్యాగః
త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్
॥
ప్రతి
విషయానికి
అభ్యాసము
అవసరము.
ఈ
ప్రాక్టీసు
మన
నిత్యజీవితంలో
జరగవలసింది.
వాకింగ్,
టాకింగ్,
రీడింగ్,
రైటింగ్
అన్నీ
నీవు
ప్రాక్టీసుతోనే
చేయగలుగుతున్నావు
కదా!
అయితే,
సక్రమమైనవి,
సత్యమైనవి
ప్రాక్టీసు
చేయాలి.
చెడ్డవి
ప్రాక్టీసు
చేయకూడదు.
అసలు
చెడ్డవాటికి
ప్రాక్టీసే
అవసరం
లేదు.
కొండపైనున్న
గుండును
కాలితో
నెట్టితే
అది
క్రిందకు
వచ్చి
పడిపోతుంది.
కాని,
క్రింద
ఉన్న
రాయిని
పైకి
గొనిపోయి
పెట్టాలంటే
చాలా
కష్టమవుతుంది.
మీకందరికీ
తెలుసు-
పెద్ద
లోడ్‌తో
ఉన్న
లారీగాని,
బస్సుగాని
మిట్ట
ఎక్కాలంటే,
గీ
గీ
గీ
అని
ఏడుస్తాయి,
పాపం!
పైకి
ఎక్కాలంటే
చాలా
కష్టమవుతుందిగాని,
డౌన్‌కి
వెళ్లాలంటే
చాలా
సులభం.
ఐతే,
సులభంగా
ఉండేదానికోసం
మనం
ప్రయత్నం
చేయకూడదు.
ఎంత
కష్టమైనా
సరే
ఉన్నత
లక్ష్యాన్ని
పెట్టుకోవాలి.
always
look
up,
low
aim
is
crime.
ఉన్నత
దృష్టిని
మనము
పోషించుకోవాలి.
అదియే
నిజమైన
సాధన.
‘ఇతను
దేవుడా
కాదా?
దేవుడంటే
ఎట్లా
ఉంటాడు?
ఎక్కడ
ఉంటాడు?’
అనే
సందేహాలకు
ఏమాత్రమూ
అవకాశమివ్వకూడదు.
ఈ
సందేహాలన్నీ
పరమ
మూర్ఖులకు
మాత్రమే
వస్తుంటాయి.
దేవుడు
సర్వత్రా
ఉంటున్నాడు.
కాని,
నీలో
దుర్గుణాలను
పెట్టుకోవటం
చేతనే
నీకు
కనిపించటం
లేదు.
ఎలాంటి
రంగు
అద్దాలను
నీవు
ధరిస్తావో
అలాంటి
దృశ్యమే
నీకు
కనిపిస్తుంది.
దైవము
సర్వత్రా
ఉంటున్నాడు.
నీవే
దైవము.
కాని,
నీలో
దైవం
నీకు
కనిపించటం
లేదు.
కారణం
ఏమిటి?
స్వార్థంలో
మునిగిపోయావు.
సద్గుణాలను
పోషించుకోవాలంటే
సరియైన
ఆహారవిహారాలు
కూడా
అత్యవసరం.
మన
అలవాట్లు
ఎలా
ఉండాలి?
పెద్దల
పట్ల
వినయవిధేయతలు
చూపాలి.
గురువులను
గౌరవించాలి.
తల్లిదండ్రులను
పూజించాలి.
వారి
ఆజ్ఞను
శిరసావహించాలి.
తల్లిదండ్రుల
ఆజ్ఞను
శిరసావహించాడు
కనుకనే
రాముడు
దేవుడైనాడు;
అంతేకాదు,
అందరికీ
సన్మిత్రుడుగా
ఉన్నాడు.
అతని
సోదర
ప్రేమకూడా
చాలా
గొప్పది.
ప్రజాక్షేమమే
తన
క్షేమంగా
భావించాడు.
ఈనాడు
మనము
చేస్తున్నాము
ప్రార్థన,
‘సమస్త
లోకాః
సుఖినో
భవంతు’
అని,
ప్రార్థనైతే
చేస్తున్నాముగాని,
‘మిగిలినవారు
ఎట్లా
పోతే
నాకేమి,
నేను
మాత్రం
బాగుండాలి’
అని
భావిస్తున్నాము.
ఇది
మంచిది
కాదు.
సర్వులుకూడను
బాగుండాలని
హృదయపూర్వకంగా
ప్రార్థించాలి.
ఎందుకోసం?
ఈ
సమాజంలో
నీవుకూడా
ఒక
సభ్యుడవు.
ఈ
సమాజం
బాగుంటేనే
కదా
నీవు
బాగుంటావు.
‘అందరూ
బాగుండాలి,
నేనుకూడా
బాగుండాలి’
అని
కోరుకో.
అంతేగాని,
‘ఎవరు
ఎట్లాపోతే
నాకేమి!
నేను
మాత్రం
బాగుండాలి’
అనుకుంటే
అది
వీలుకాదు.
ఇది
పరమ
స్వార్థము.
మహాపాపము.
స్వార్థము
కొంతవరకు
ఉండవచ్చుగాని
మితిమీరిన
స్వార్థము
ఉండకూడదు.
దైవముపైన
ప్రేమ
పెంచుకోవాలి.
దైవప్రేమకంటే
మించిన
సాధన
మరొకటి
లేదు.
నీవు
ఏది
చేసినా
చేయకపోయినా
దైవాన్ని
హృదయపూర్వకంగా
ప్రేమిస్తే
అంతకంటే
గొప్పది
మరొకటి
లేదు.
మీరా
చెప్పింది,
‘
పాయోజి
మైనే
నామరతన్
ధన
పాయో,
వస్తు
అమౌలిక్
దీ
మేరే
సద్గురు’.
ఆమె
నామరత్నమే
తన
ధనంగా
భావించింది.
ఈ
వస్తువు
ఎవరిచ్చారు?
సద్గురువు.
ఎవరు
సత్?
శాశ్వతుడు,
అతనే
దైవము.
తన
భర్త
తన
మందిరం
వదలి
వెళ్ళిపొమ్మన్నప్పుడు
మీరా,
‘అయ్యో!
నా
కృష్ణుని
వదలి
నేనెట్లా
పోయేది?’
అని
చాలా
బాధపడింది.
తక్షణమే
తన
మనస్సును
సమాధానపరచుకుంది.
‘మానవులు
నిర్మించిన
ఈ
మందిరం
శాశ్వతం
కాదు.
దైవం
నిర్మించిన
మందిరం
నా
హృదయం.
అందులోనున్న
కృష్ణుని
నానుండి
ఎవ్వరూ
దూరం
చేయలేరు’.
అప్పుడు
తన
మనస్సుకు
చెప్పింది-
‘చలొరే
మన్
గంగాయమునా
తీర్’
గంగా
యమునా
తీరమంటే
భ్రూమధ్యస్థానము.
అదే
సుషుమ్న
నాడి.
‘అక్కడకు
వెళ్ళు
ఓ
మనసా!
ఇంకెక్కడికి
వెళ్ళినా
నీకు
శాంతి
లభించదు’.
ఈ
గంగా
యమునలు
ఏరీతిగా
ఉన్నాయి?
‘గంగా
యమునా
నిర్మల్
పానీ,
శీతల్
హోత
శరీర్.
చలొరే
మన్
గంగా
యమునా
తీర్’.
అక్కడికి
వెళ్ళాలంటే
మనము
టిక్కట్టు
తీసుకోనక్కరలేదు.
మన
కుడి
ఎడమ
శ్వాసలే
గంగా
యమునలు.
సో..హమ్.
ఒకవైపున
గంగ,
ఒకవైపున
యమున.
ఈ
రెండింటినీ
కలిపే
భ్రూమధ్యస్థానమే
సుషుమ్న
నాడి.
యోగాభ్యాసములో
పూరకము,
రేచకము,
కుంభకము
అనే
మూడు
ప్రక్రియలున్నాయి.
గాలిని
పీల్చుకోవటమే
పూరకము.
పీల్చుకొన్న
గాలిని
వదలటమే
రేచకము.
ఈ
రెంటింటినీ
స్తంభింపచేయటం
కుంభకము.
ఇది
దేహముతో
చేసేటువంటిది.
దీని
ద్వారా
మనస్సును
కొంతవరకు
అరికట్టవచ్చును.
కాని,
దైవసన్నిధికి
ఇది
తగినటువంటి
మార్గం
కాదు.
భగవంతునియొక్క
పరిపూర్ణప్రేమను
పొందాలంటే
ప్రేమయే
చాలు.
కనుక,
ప్రేమతత్త్వాన్ని
పెంచుకోండి.
ప్రేమచేతనే
దైవాన్ని
పొందండి.
Previous
←
Oneness is divinity
Next
Thinking of Rāma removes every worry
→