Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1987 · The in-breath and out-breath of the Supreme Person are the Veda
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The in-breath and out-breath of the Supreme Person are the Veda
28 September 1987
1
▾
Meaning
Keep
His poems 139
సకల
వేదాంత
గ్రంధాల
సారమెల్ల
ఒక్క
వాక్యాన
చెప్పుదునొక్కసారి.
సర్వజీవులయందున్న
ఆత్మ
నేనును
ఒక్కటే
యని
మనమున
యెంచరయ్యా
దివ్యాత్మ
స్వరూపులారా!
మంత్ర
ద్రష్టలైన
మహర్షులచే
ఆవిష్కరింపబడిన
సత్యవాక్యసమూహమే
వేదము.
భూతభవిష్యత్
వర్తమానమునందు
తిరుగులేని
సత్యాన్ని
ఆవిష్కరింపచేసినదే
వేదము.
త్రిలోకములకు
యోగక్షేమమునందించి
సమాజములో
అవసరమైన
విజ్ఞానము,
శాంతిని
నెలకొల్పునదే
వేదము.
పరమ
పురుషుని
ఉచ్ఛ్వాసనిశ్వాసములే
వేదము.
ఇది
విత్
అనే
ధాతువునుండి
వుద్భవించినది.
విత్
అనగా
జ్ఞానము.
జ్ఞానమయమైనదే
వేదము.
అనంతమైనది
వేదము
అనంతో
వై
వేదాః
అని.
జ్ఞానముకూడను
అనంతమైనది.
ఇట్టి
అనంతమైన
వేదమును
సామాన్యమానవులు
అధ్యయనము
చేసి
దానిని
పూర్తిగా
అభ్యసించటము
కష్టతరమైన
విషయము.
ఇంత
పెద్ద
వేదమును
అధ్యయనము
చేయుటకు
కాలముకూడను
అధికముగా
పడుతుంది.
అందువలన
సామాన్యమైన
మానవుడు
వేదాధ్యయనము
చేయుటకు
యేమాత్రము
పూనుకొనడు.
ఇట్టి
సత్యాన్ని
గుర్తించిన
వ్యాసమహర్షి
యీ
వేదమును
నాలుగు
భాగములుగా
విభజించి
ఋక్కులన్నియు
వేరు
చేసి
ఋక్
సంహిత
అని
పేరు
పెట్టాడు.
ఈ
అనంతమైన
వేదమునుండి
యజుస్సునంత
వేరుజేసి
యజుసంహిత
అని
పేరు
పెట్టాడు.
సామమునంత
వేరుచేసి
దీనిని
సామ
సంహిత
అని
పేరు
పెట్టాడు.
అధర్వణ
మంత్రములను
వేరుచేసి
దీనికి
అధర్వణ
వేదమని
పేరు
పెట్టాడు.
అయితే
యీ
అన్నింటియొక్క
మూలాధార
తత్వాన్ని
జగత్తునకు
వ్యాపింపజేయుటకై
చాటుటకే
అనేకరకములుగా
యీ
మాదిరి
విభజిస్తూ
వచ్చాడు.
ఒక్కొక్క
సంహితను
మూడు
భాగములుగా
విభజిస్తూ
వచ్చాడు.
దీనిని
బ్రాహ్మణమని,
ఆరణ్యకములని,
ఉపనిషత్తులని.
ఈ
బ్రాహ్మణములనగా
మంత్ర
స్వరూపములు
మంత్ర
స్వభావములు
జగత్తునకందించి
యిందులో
వుండిన
యజ్ఞయాగాది
క్రతువులకు
తగిన
మంత్రములు
నిరూపిస్తూ
వచ్చాడు.
ఇందులో
వితరేయబ్రాహ్మణం,
కౌశీతకి
బ్రాహ్మణం,
శతపథ
బ్రాహ్మణం,
గోపథబ్రాహ్మణం
అని
నాలుగు
రీతులుగా
విభజించాడు.
ఇది
కేవలము
యజ్ఞ
యాగాదిక్రతువులయందు
వుచ్ఛరించే
మంత్రస్వరూపములు.
2
▾
Meaning
Keep
రెండవదైన
ఆరణ్యకము
గద్య
పద్య
సహితమైనది.
ఇందులో
కర్మభాగము
యెక్కువగా
వుంటుంది.
మానవుడు
గృహస్థాశ్రమము
త్యజించి
వానప్రస్థములో
ప్రవేశించి,
వానప్రస్థుడు
అరణ్యములో
ప్రవేశించి
అధ్యయనం
చేయటంచేత
దీనికి
ఆరణ్యకమని
పేరు
వచ్చింది.
ఇందులోనే
చివరి
భాగమునకు
బ్రాహ్మణమని
పేరు
పెట్టారు.
ఇది
కేవలం
ధర్మమార్గమును
అధికముగా
ప్రబోధిస్తూ
యజ్ఞయాగాది
స్వరూపాన్ని
నిరూపిస్తూ
వచ్చింది.
మూడవది
ఉపనిషత్తు.
ఇది
నిత్యజీవితములో
ప్రతిమానవుడు
ధర్మార్థకామమోక్షముల
నిమిత్తమై
ఆచరించ
తగినవిగా
దీనికి
కొన్ని
మార్గములు
నియమిస్తూ
వచ్చారు.
అయితే
దీనిని
విద్యావివేకములద్వారానే
ఒక
ఉపనిషత్తును
పొందటానికి
సాధ్యమవుతుంది.
ఈ
విద్యలయందు
రెండురకములైన
విద్యలు
కలవు.
ఒకటి
పర
విద్య.
రెండవది
అపరవిద్య.
వేదములన్నియు
కేవలం
అపరవిద్యలను
మాత్రమే
బోధిస్తూ
వచ్చాయి.
ధర్మార్థకామములను
మాత్రమే
వివరించాయి.
తదుపరి
మోక్షమునకు
సరైన
మార్గము
తన
స్వప్రయత్నమే
అనేది
గుర్తించటానికి
ప్రయత్నించారు.
వేదములు
నకర్మణా
నప్రజయా
త్యాగేనైకే
అమృతత్వమానసుః.
ఈ
త్యాగముచేతనే
యీ
అమృతత్వమనే
మోక్షము
ప్రాప్తిస్తుందని,
త్యాగము
లేకుండా
యీ
విధమైన
స్థానము
పొందలేరని
నిరూపిస్తూవచ్చింది.
కనుక
వేదములు
పురుషార్థములైన
మూడింటిని
మాత్రమే
చక్కగా
ప్రబోధిస్తూ
వచ్చింది.
నాల్గవదైన
మోక్షం
మానవుడు
దైవానుగ్రహంచేతను,
మానవునియొక్క
సాధనలచేతను
యిది
లభ్యమౌతుంది.
ఈ
జగమునకు
ఐహికము,
ఆధ్యాత్మికము
రెండింటియొక్క
తత్వము
అత్యవసరము.
'ఇహమును
సుఖింప
హేమతారక
విద్య,
పరమును
సుఖింప
బ్రహ్మ
విద్య
అన్నారు.
జీవనోపాధి
ఒకటి.
జీవిత
పరమావధి
మరొకటి.
జీవనోపాధి
నిమిత్తమై
యేర్పడిన
తత్వములు
ప్రబోధిస్తూ
వచ్చాయి
వేదములు.
ఇష్టమును
నెరవేర్చుకొనుటకు,
అయిష్టమును
దూరము
గావించుకొనుటకు
తగిన
ఉపాయములు
ప్రబోధిస్తూ
వస్తున్నవి
వేదములు.
ఇది
ప్రాచీనకాలమునుండి
గురు
శిష్య
పరంపరగా
అభివృద్ధి
గాంచుతూ
వచ్చింది.
వేదమునకు
తొమ్మిది
పేర్లు
కలవు.
శృతి,
అనుశృతి,
త్రయి,
ఆమ్నాయం,
సమామ్నాయం,
ఛందస్సు,
స్వాధ్యాయం,
ఆగమం,
నిగమం.
వీటి
లక్షణాన్ని
చక్కగా
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
శృతి.
గురువు
వుచ్ఛరించే
పదములను
శ్రద్ధాభక్తులతో
తాను
ఉచ్ఛరించి
గురువు
యేవిధమైన
శబ్దములను
వుచ్ఛరించాడో
అదేవిధముగా
తాను
శ్రవణించేసి
వుచ్ఛరించే
స్థితికి
శృతి
అని
పేరు
పెట్టారు.
అనగా
వినికిడిచేత
తాను
గురువు
వుచ్ఛరించినట్లే
తానుకూడను
వుచ్ఛరించి
ఆ
వేదమును
అధ్యయనం
చేయటంచేతనే
యిది
శృతి,
అనుశృతి
అని
పేరు.
వేదము
అనంతమై
ఒక్కటిగానే
వుండేది.
తదుపరి
మూడుగా
మాత్రము
విభజిస్తూ
వచ్చారు.
అదే
ఋగ్వేదము,
యజుర్వేదము,
సామవేదము.
ఈ
మూడు
మాత్రమే
జగత్తులో
వ్యాపిస్తూ
వచ్చాయి.
కనుకనే
త్రయి
అని
మూడు
వేదములయొక్క
స్వరూపమనే
రీతిగా
సరైన
పేరు
వచ్చింది.
మ్న
అనే
ధాతువుకు
అభ్యాసము
అని
ఒక
అర్థము.
3
▾
Meaning
Keep
ఆమ్నాయమనగా
అభ్యాసముచేత
అధ్యయనం
గావించుటచేత
దీనికి
ఆమ్నాయమని
పేరు
వచ్చింది.
సామవేదము
ఛందోబద్ధమైనందున
దీనికి
ఛందస్సు
అని
మరో
పేరు
వచ్చింది.
ఇది
పరంపరగా
అనగా
తండ్రీ
బిడ్డల
పరంపర,
వంశపరంపరగా
దీనిని
అధ్యయనము
చేసుకుంటూ
రావటంచేత
అధ్యాయమని
పేరు
వచ్చింది.
ఈ
ఆగమ,
నిగమములనేవి
భగవంతుని
వుచ్ఛ్వాసనిశ్వాసములుగా
వుండుటచేతనే
దీనికి
ఆగమనిగమములని
మరో
పేరు
వచ్చింది.
దేశకాలపరిస్థితుల
ప్రభావముననుసరించి,
యీయొక్క
అధ్యయనము
ననుసరించి
దాని
మర్మములను
సక్రమమైన
మార్గములో
అనుసరించటమే
యీ
వేదములకు
యీ
విధమైన
పేర్లు
లభిస్తూ
వచ్చాయి.
ఇట్టి
పవిత్రమైన
వేదములు
అనాది
కాలమునుండి
భారతదేశమును
సంరక్షిస్తూ
వస్తున్నాయి.
ఇదికేవలం
పారాయణము
చేయవలసినటువంటివి
మాత్రమేకాదు.
అర్థమును
గుర్తించి
దానిని
ఆచరించి,
అనుష్ఠానమునందించి
ఆనందించవలసినది
వేదము.
అప్పుడే
అధ్యాయము
చేసిన
వానికి
తగిన
ఆనందం
ప్రాప్తిస్తుంది.
అర్థము
తెలియక
పారాయణ
చేయటంచేత
కొంతవరకు
ఆనందం
లభ్యం
కావచ్చు.
కాలమును
పవిత్రము
చేసినవాడు
కావచ్చు.
అర్థము
తెలిసి
పారాయణ
చేసినవాని
జీవితం
సార్థకమవుతుంది.
కానీ
దురదృష్టవశాత్తు
యీనాడు
భారతదేశంలో
యీ
పవిత్రమైన,
దైవస్వరూపమైన
వేదములకు
అర్థము
తెల్సినటువంటి
వ్యక్తులు
కరువై
పోయారు.
వేదములందుండే
శబ్దములకు
యనేక
అర్థములుంటున్నాయి.
అయితే
యెవరికి
తగిన
అర్థములు
వారు
స్వీకరించి
వారి
వారి
అనుగుణ్యంగా
దీనిని
బోధిస్తూ
వస్తున్నారు.
అందుకోసమే
నారదుడు
సనత్కుమారుని
ప్రార్థించినప్పుడు
నాయనా
యిది
ఒకవిధమైన,
భయంకరమైన
అరణ్యము
యీ
వేదశాస్త్రములు.
ఏదో
దారి
తప్పి
నడచిన
చాలా
ప్రమాదము
సంభవిస్తుంది.
వేదమంత్రములకు
అనేక
అర్థములుంటున్నవి.
ఒక్కొక్క
శబ్దమునకు
యనేక
అర్థములు
వుంటున్నవి.
నీవు
యెట్టి
అర్థమును
స్వీకరింతువో
కనుక
యిది
చాలా
దుర్లభమైనది.
చాలా
కష్టమైనది.
ఈ
విధమైన
బాధలకు
నీవు
గురికాక
భగవత్భక్తిని
అభివృద్ధి
గావించుకొని
అందులోనే
తన్మయాత్ముడై,
ఉన్మత్తుడై,
ముక్తుడై,
తాదాత్మ్యభావమును
పొందమని
బోధించాడు.
అప్పుడే
నారదుడు
ఒక
భక్తిసూత్రమును
ప్రారంభించాడు.
దీనికే
నారదభక్తిసూత్రములని
పేరు
వచ్చింది.
సనత్కుమారుని
ప్రబోధలచేత
నారదుడు
నూతనమైన
భావమును
గ్రహించాడు.
పురుషార్థములు
నాలుగే.
కాని
దైవప్రేమ
అనేది
తాను
ఐదవదిగా
బోధిస్తూ
వచ్చాడు.
ధర్మార్థకామమోక్షములేకాక
పరమపురుషార్థమనేది
మోక్షముకంటె
అధికమైనదని
తాను
విశ్వసిస్తూ
వచ్చాడు.
మోక్షమనగా
కేవలము
మోహమును
క్షయము
గావించుకోటం.
ఇంతమాత్రం
చేత
మోక్షమనేదానిలో
ఆనందం
మనకు
కనుపించదు.
నిరంతరం
భగవంతునితోనే
కూడి
ఆడి
ఆనందంగా
తాదాత్మ్యభావాన్ని
పొందటమే
పరమ
ప్రీతిగా
భావిస్తూ
వచ్చాడు
నారదుడు.
ఈ
పరమ
ప్రేమకూడను
వేదసారముగానే
భావిస్తూ
వచ్చాడు.
కనుక
వేదములయొక్క
విషయము
చెప్పుటకుగాని,
అధ్యయనం
చేయుట
కాని
చాల
కష్టము.
4
▾
Meaning
Keep
భగవత్భావములను
వర్ణించటం
అనేది
చాలా
దుర్లభము.
దీని
స్థాయికి,
ఆ
వేదములయొక్క
స్థాయికి
సన్నిహితసంబంధబాంధవ్యం
చాలా
కష్టం.
కనుకనే
ప్రాచీనకాలమునుండి
యీ
వేదాధ్యయనం
క్రమక్రమేణా
సన్నగిల్లిపోవటం
చేతనే
యీనాడు
వుండవలసిన
స్వరూపాన్ని
మనం
వుంచుకోలేకపోతున్నాము.
ఆ
వేదమునకు
అనేక
శాఖలు
వుండేవి.
ఋగ్వేదమునకు
ప్రధానమైన
శాఖలు21.
ఇంక
వుపశాఖలు
అనేకంగా
వుంటున్నాయి.
కానీ
యీనాడు
మనము
మన
భారతదేశములో
చూస్తే
యీ
ఋగ్వేదములో
రెండు
శాఖలు
మాత్రమే
మిగిలి
వుంటున్నాయి.
19
శాఖలు
యెక్కడా
కన్పించటంలేదు.
కాలగర్భములో
కలిసిపోయాయి.
యజుర్వేదములో
ప్రధానమైన
శాఖలు
86
వుండేవి.
ఈనాడు
4
శాఖలు
మాత్రమే
వుంటున్నాయి.
సామవేదంలో
1000
శాఖలుండేవి
ప్రధానమైనవి.
కాని
సామవేదములోకూడను
యీనాడు
మూడు
మాత్రమే
నిలచి
వున్నవి.
అదే
విధముగా
అధర్వణవేదములోకూడను
9
ప్రధానమైన
శాఖలుండేవి.
కానీ
రెండు
మాత్రమే
నిలచినవి.
ఈవిధముగా
అల్ప
సంఖ్యలో
వున్న
వేదములే
అనంతమైన
అర్థాన్ని
బోధిస్తుండగా
యింక
అనంతమైన
వేదముల
అన్ని
శాఖలు
వుండివుంటే
యెంత
పవిత్రమైనది
దానిని
బోధించివుండేవో.
కాని
యీనాడు
వుండిన
రెండు,
మూడు,
నాల్గు
శాఖలుకూడను
యెంతకాలము
మనము
నిల్పుకుంటామో
చెప్పటానికి
వీలుకాదు.
ఈనాడు
వేదాధ్యయనము
చేసే
వ్యక్తులు
చాలా
అరుదైపోయినారు.
ఈనాడు
వేదాధ్యయనంకూడను
ఒక
వ్యాపారరంగముగా
తయారైనది.
కనుకనే
క్రమక్రమేణా
వున్నశాఖలుకూడను
కోల్పోవలసివస్తుంది.
వేదములు
జగత్తునకు
ప్రాణములు
అనే
సత్యాన్ని
వీరు
విస్మరిస్తూ
పోతున్నారు.
సమస్త
వేదములకు
మాతయైన
గాయత్రి
తత్వాన్ని
విస్మరిస్తూ
వస్తున్నారు.
గాయత్రిని
ఛంధసోమాతః
అన్నారు.
అనగా
ఛందస్సునకంతా
తల్లివంటిది.
ఈనాడు
వేదాధ్యయనము
గావించిన
వ్యక్తులు
తాము
తమ
సంతతికికాని,
తోటి
మానవులకుకాని
బోధించటానికి
వెనుకంజ
వేస్తున్నారు.
ఈ
విధముగా
వంశపరంపరగా
వస్తున్న
వేదములు
యీనాడు
వ్యాప్తి
కాకుండా
నిలచిపోటంచేతనే
వేదము
క్షీణిస్తూ
వస్తున్నది.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఘండికోట
సుబ్రహ్మణ్యశాస్త్రిగారని
పరమభక్తుడు.
వేదపురుషుడనే
చెప్పవచ్చును.
వేదార్థములనేవి
అతనికి
త్రాగునీరువలె
సులభముగా
వుండేవి.
గుర్తించేవాడు
వాని
ప్రకారము
వర్తించేవాడు.
కానీ
అతను
గతించిన
తక్షణమే
యీ
వేదమంతా
అంతర్ధానమైపోయింది.
తన
యింటిలో
వేదము
వుచ్ఛరించే
వ్యక్తే
లేకపోతున్నాడు.
తన
సంతతి
అంతయు
ఆంగ్ల
విద్యా
దాసత్వము
పొందటంచేత
యీ
వేదమును
క్రమక్రమేణా
మరచిపోతూ
వస్తున్నారు.
ధనార్జనే
ప్రధానమైన
లక్ష్యముగా
వుంచుకోటంచేత
యీ
పవిత్రమైన
వేదధనాన్ని
మనము
కోల్పోతున్నాము.
తాను
యెంత
గొప్ప
వేదపండితులైనప్పటికిని
తనకుమారులలో
ఒక్కరైనను
కూడను
వేదము
నభ్యసించినవారు
లేరు.
తన
మనుమలు
తెలుగు
రానటువంటివారుగా
వుంటున్నారు.
అదే
విధముగనే
వేదములు
గంటవలె
మ్రోగుతూ
వుంటాయి
కామావధాని
నోటిలో.
5
▾
Meaning
Keep
Also in his talks
(9)
5 December 1976
The fortune of health
26 February 1987
There is no sādhana greater than remembering the Name
20 July 1988
All learning without practice is useless
15 October 1988
All Things and All Beings in the World Are Forms of the Paramātma!
7 November 1989
The Ātma in All Is One
3 April 1990
Rama, the Indweller
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
9 September 1996
Satyaṁ Jñānam Anantaṁ Brahma
21 February 2001
‘I’ itself is God
వేదాన్ని
అభ్యసించి,
అధ్యయనం
చేసిన
కామావధాని
యింటిలో
ఒక్క
కుమారుడైనా
వేదాన్ని
పఠించేవాడుంట
లేడు.
ఈ
విధముగా
తమ
పుత్రులకే
తాము
బోధించకుండా
వుండటంచేత
పబ్లిక్లోపల
ఒక
విధమైన
అవిశ్వాసము
బయలుదేరుతూ
వచ్చింది.
వేదమే
యింత
మహత్తరమైనట్లైతే
తమ
పుత్రులకు
తాము
యెందుకు
బోధించకూడదు.
కనుక
యేదో
యిది
వ్యాపారరంగముగా
వుపయోగపెట్టటంచేత
యే
విధమైన
మహత్మ్యము
లేదని
ప్రపంచములో
అభివృద్ధి
గాంచుతూ
వస్తున్నది.
ఈనాడు
యిట్టి
అపోహలను
మనము
ఖండించి
వేదము
మహత్తరమైనది,
వేదమే
సర్వము,
వేదమే
పరమాత్మస్వరూపము
అనే
సత్యాన్ని
మనము
చాటుతూ
రావాలి.
భారతీయులయొక్క
ప్రతికర్మ
వేదములకు
సంబంధించినవే.
వేదసంబంధమైన
కర్మలు
ఆచరించినప్పుడే
వారిలో
వున్న
వేదన
దూరమై
ఆనందమును
అనుభవించగలము.
వేదాన్ని
గురించి
వర్ణిస్తూ
బోధిస్తూ
దాని
ఘనతను,
దాని
మహిమను
అనేక
రీతులుగా
చాటుతున్నారు
వారికే
అవిశ్వాసము
లేకపోతున్నది.
ఈ
వేదము
చిత్తశుద్ధి
గావించుకొనే
నిమిత్తమై
యేర్పడిన
పవిత్రమైన
కృత్యములుగా
మనము
విశ్వసించాలి.
వేదవేదాంగములు
వల్లెవేసియున్న
పద్యగద్యములుకూడ
పలికియున్న
అంతశుద్ధియె
లేకున్న
చెడునువాడు.
యీ
విధముగా
అంతశుద్ధి
లేకుండా
యెన్ని
వేదములు
వల్లిస్తే
లాభమేమిటి?
వేదములు
పవిత్రమైనప్పటికి
వుచ్ఛరించటంచేత
మనకు
సంప్రాప్తి
కలుగదు.
పంచభక్ష్యపరమాన్నములైనప్పటికి
తట్టయందు
వుంచుకొని
పంచభక్ష్యపరమాన్నమని
స్మరించినంతమాత్రమున
మన
పొట్ట
నిండదు.
ఎంత
విలువైన
ఔషధములైనా
మనము
వల్లించుకుంటూ
కూర్చున్నంత
మాత్రమున
మన
రోగము
నివారణ
కాదు.
ఎంతో
ప్రకాశవంతమైన
జ్యోతిని
మనము
చింతించుకుంటూ
కూర్చున్న
అంధకారం
మనకు
దూరం
కాదు.
మనం
అంతో
యింతో
అయినా
ఆచరణలో
పెట్టి,
దానిని
అనుభవించి,
ఆనందించి
అన్యులకు
అందించాలి.
ఇంకా
యితర
దేశాలకు
అందించటానికి
ప్రయత్నించాలి.
ఈ
వేదము
కొందరి
సొత్తుగా
భావించి
మనము
దానిని
యితరులు
వల్లించటానికి
అధికారము
లేదని
చెప్పి
యీవిధమైన
ప్రబోధలు
సల్పటంచేత
వేదము
క్రమక్రమముగా
ప్రతిష్ఠపోతున్నది.
కనుక
వేదమనే
దానిని
వుచ్ఛరించక
పోయినప్పటికి
వేదముయొక్క
అంతరార్థమును,
వేదముయొక్క
విశిష్టతను
ప్రపంచమునకు
చాటటానికి
ప్రతి
విప్రుడుకూడను
సంసిద్ధముగా
వుంటుండాలి.
తాను
చెప్ప
తలపు
పుట్టదు
కాని
ఒరుల
చెప్పుట
చూచి
ఓర్వలేరు.
తాను
చెప్పరు.
ఒరులను
చెప్పనివ్వరు.
ఇంక
స్వాధ్యాయనము
చూస్తామా
అంటే
యింక
అనేక
రకములైన
వ్యాఖ్యానములు
అవలంబిస్తారు.
ఇది
సరైన
మార్గము
కాదు.
ఇది
సత్యమార్గము
కాదు.
6
▾
Meaning
Keep
His poems 25
Also in his talks
(4)
19 November 1987
Selfless service is the key to karma-yoga
13 August 1989
Good Resolves Are Everlasting
3 November 1989
Ānanda Itself Is the Goal
6 November 1989
Faith in Yourself Is Faith in God
సత్యస్వరూపమైనది
వేదము.
వేదమే
లేకపోతే
ధర్మము
యెక్కడనుండి
వస్తుంది.
సత్యంనాస్తి
పరోధర్మః.
ధర్మమనేది
సత్యముపైన
ఆధారపడి
వుంటుంది.
నిత్యసత్యనిర్మలమైనది
యీ
వేదము.
అన్ని
జీవులయందున్న
ఆత్మ
నేను
ఒక్కటే
యని
మది
యెరుగరయ్యా
అనగా
అందరియందు
వున్న
ఆత్మ
నేను
ఒక్కటే.
నేను
అనేదే
ఆత్మ.
ఆత్మ
నేను
రెండు
ఒక్కటే
అనే
సత్యాన్ని
గుర్తించాలి.
ఆత్మకు
ఒక్కదానికి
మాత్రమే
నేను,
నేను
అని
చెప్పటానికి
అధికారముంటున్నాది.
అది
అనంతమైనది.
ఇలాంటి
వేదమును
యీనాడు
యేదో
ఒక
సంకుచితమైన
భావముతో
దానిని
వుపయోగపెట్టుకుంటున్నాము.
ఈ
సంకుచితమైన
భావాన్ని
మనము
ప్రక్కకు
నెట్టాలి.
విశాలమైన
భావములు
మనము
పెంచుకోవాలి.
ఈ
విశాలమైన
జగత్తులోపల
యీ
వివేకవంతమైన
వేదమును
మనము
పంచాలి.
ప్రతి
మానవుడు
వేదమును
గౌరవించాలి.
నీయొక్క
జీవితానికి
ఆధారమే
ఆ
వేదము.
నీ
నిత్యజీవితములో
చేసే
సర్వకర్మలు
వేదమునుండి
ఆవిర్భవించినవే.
మీకు
తెలిసినా
తెలియకపోయినా
సర్వము
వేదమయమే.
ఆ
వేదమయుడైన
నారాయణుడే
యజ్ఞమునందు
సాక్షాత్కరిస్తున్నాడు.
కనుకనే
నారాయణుడు
యజ్ఞస్వరూపుడు.
యజ్ఞమనగా
త్యాగమే.
దేనిని
త్యాగము
చెయ్యాలి.
దుర్గుణములు
త్యాగము
చెయ్యాలి.
అహంకారమును
త్యాగము
చెయ్యాలి.
దుశ్చింతలు
త్యాగము
చెయ్యాలి.
దుర్మార్గమును
త్యాగము
చెయ్యాలి.
అప్పుడే
దైవత్వమనేది
మనకు
సాక్షాత్కరిస్తుంది.
ఏమిలేని
బుఱ్ఱలోన
యేమైనను
చేర్చవచ్చు
ఏమేమో
నిండివున్న
తలబుఱ్ఱది
ఖాళి
యగునా
తలబుఱ్ఱది
ఖాళికాక
ఇల
సుకృతంబు
నింపనగునా.
మనము
అనేక
విధములైన
భావములచేత
హృదయాన్ని
నింపుకున్నాము.
ఇక
యీ
వేదసారమనే
భావాన్ని
నింపుకోవాలంటే
స్థానములేదు.
కనుక
యీ
దుర్భావములను
మనము
దూరము
చేసి,
హృదయమును
ఖాళీ
చేసి
దానితో
యీ
వేదసారమనే
దైవత్వాన్ని
మనము
నింపుకోవాలి.
ఇదియే
దైవము
అవతరించటానికి
దుష్టశిక్షణ,
శిష్టరక్షణ
అన్నారు.
అనగా
దుర్మార్గులను
చంపటము
కాదు.
దుర్మార్గమనగా
మన
భావములే.
మన
తలంపులే
వీటిని
చంపాలి.
చావులేని
దైవమే
ధర్మము.
కనుకనే
సద్భావములు
పోషించి,
దుర్భావములు
దూరము
చేసి
సరియైన
జీవతత్వాన్ని
మానవత్వముగా
వికసింప
చేయటమే
వేదముయొక్క
విశిష్టత.
వేదశాస్త్రములు
నియమించిన
మార్గములు
మనము
నడచుకొన్నప్పుడు
దానిని
మనస్సు
రీతిగా
ప్రమాణపూర్వకముగా
ఆచరించినప్పుడు,
మానవునకు
బాధలే
వుండవు.
కానీ
యీ
బాధలకంతా
మూలకారణము
దానిని
విస్మరించటము.
భూమికి
ఆకర్షణ
శక్తి
ఆనాటినుండి
వుంటున్నాది.
కాని
న్యూటన్
అనేవాడు
దీనికి
అనేక
పరిశీలనలు
చేసి,
పరిశోధనలు
చేసి
భూమికి
ఆకర్షణ
శక్తి
వున్నదని
గుర్తించాడు
కాని
దీనికి
పూర్వముకూడను
యీ
ఆకర్షణశక్తి
భూమికి
లేకపోలేదు.
7
▾
Meaning
Keep
అదే
రీతిగా
భారతదేశమందు
భారతీయులు
యీ
వేదప్రమాణాన్ని,
వేద
మహత్మ్యమును
పరిశోధనలద్వారా
దానిని
పరిశీలన
చేశారు.
పరిశోధించి
పరిశీలనచేసినవారు
భారతీయులు.
భారతీయులు
పరిశోధించి,
పరిశీలన
చేయుటమువలన
యీ
వేదము
ప్రపంచమంతా
వేదము
అని
చెప్పటానికి
వీలుకాదు.
ప్రపంచమంతా
నిండి
నిబిడీకృతమై
వున్నది
వేదము.
ఇతర
దేశములలో
లేకపోవచ్చును.
ఈ
విధమైన
పేర్లు
లేకపోవచ్చును.
అదే
రీతిగా
న్యూటన్
యే
దేశమువాడో
భూమికి
ఆకర్షణశక్తి
వున్నదన్నప్పుడు
భారతీయులు
దీనిని
లేదని
చెప్పటానికి
వీలులేదే.
అట్లే
భారతీయులు
పరిశోధించిపెట్టిన
యీ
వేదమును
యితరులు
లేదని
చెప్పటానికి
లేదు.
ఇతర
దేశస్థులుకూడను
యీ
వేదమును
యెంతగానో
గౌరవిస్తున్నారు.
Max
Muller
అనేవాడు
యీ
వేదమునకు
అనేక
వ్యాఖ్యానములు
వ్రాసి
దీని
పుట్టు
పూర్వోత్తరములు
యెక్కడని
అనేక
విధములుగా
పరిశీలన
చేశాడు.
రాత్రింబవలు
అనేక
విధములుగా
అభ్యసిస్తూ
వచ్చాడు.
అధ్యయనము
చేస్తూ
వచ్చాడు.
సరైన
అర్థమును
తాను
గుర్తించటానికి
ప్రయత్నిస్తూ
వచ్చాడు.
తన
జీవితమంతా
వేదమునకే
ధారపోశాడు.
కనుకనే
మేక్స్
ముల్లర్
పేరు
పోయి
మోక్ష
ముల్లర్
అనే
పేరు
వచ్చింది.
విదేశీయులకు
వుండిన
విశ్వాసము
భారతీయులకు
లేకపోతున్నాది.
ఇదే
యీనాడు
ప్రవేశించిన
దురదృష్టము.
ఈ
దురదృష్టము
యేనాడు
భారతదేశములో
ప్రవేశించిందో
ఆనాటినుంచే
నిత్యకళ్యాణ
పచ్చతోరణముతో
కళకళలాడుతున్న
భారతదేశము,
అన్నపూర్ణస్వరూపమైన
భారతదేశము
అన్నమో
రామచంద్రా
అని
అల్లాడవలసి
వచ్చింది.
దీని
బాధ్యత
అంతయు
బ్రాహ్మణులదే.
వారు
సరైన
పోషణ
చేసివుంటే
యీ
దుర్గతి
వచ్చివుండేటువంటిది
కాదు.
ఈనాటికైనా
వారు
కన్ను
తెరచి
దీనిని
సరైన
రీతిలో
పోషించటానికి
ప్రయత్నము
చెయ్యాలి.
మా
పాఠశాలల్లో
ప్రైమరీస్కూలునుండి
కాలేజీవరకు
అందరు
పిల్లలు
వేదమునభ్యసిస్తున్నారు.
ఈనాడు
ఉత్సాహప్రోత్సాహములందించేవారు
లేకపోతున్నారు.
దీనికి
కారణము
వేదాన్ని
ఒక
గురువర్గము
చేతిలో
పెట్టటముచేతనే
యిట్టి
దురవస్థలపాలైపోతున్నాది.
చెప్పటం
ఒకటి
చేయటం
మరొకటి.
కనుకనే
యీ
వేదవిజ్ఞానము
ప్రజలలో
సన్నగిల్లిపోతున్నది.
చెప్పినట్లుగా
వారు
చేయటంలేదు.
కనుకనే
ప్రజలలోపల
యీ
అవిశ్వాసము
యీ
రీతిగా
బలపడుతుంది.
ప్రేమస్వరూపులారా!
ప్రతి
వ్యక్తికూడను
యీ
వేదాన్ని
సరైన
రీతిలో
పోషించటానికి
కంకణం
కట్టుకోవాలి.
దేశక్షేమము,
లోకకళ్యాణము
వేదముపైననే
ఆధారపడి
వుంటున్నాది.
కనుకనే
ఎంత
మాత్రమున
యెవ్వరు
తలచిన
అంతమాత్రమే
తాను
అన్నారు.
కలడనే
విశ్వాసము
కలవారికి
కలడు.
లేడనే
విశ్వాసమువారికి
లేడు.
కలడు
లేడనేది
మన
కంఠానికేగాని
దైవానికి
లేదు.
కనుక
వేదమును
క్రమక్రమేణా
క్షీణింపచేయటానికి
యీ
బ్రాహ్మణులే
కారణము.
ఎన్నైనా
చెప్పవచ్చును.
కానీ
చేసి
చూపించాలి.
ఈ
వ్యక్తులంతా
కంకణం
కట్టి
దీని
అభివృద్ధిని
పోషించటానికి
తగిన
కృషి
చేయాలి.
ఇంకా
ఒక
పది
సంవత్సరములో,
ఇరువది
సంవత్సరములో
జరిగితే
వారుకూడను
దీనిని
నిలపటానికి
సాధ్యంకాదు.
8
▾
Meaning
Keep
ఇప్పుడే
యీ
వేదములకు
కొంత
అంటుకట్టినట్లుగా
కొంత
సమూహము
గావించి
దీనికి
సరైన
పోషణాశక్తిని
ఆర్జించి
దీనికి
సరైన
ఉత్సాహప్రోత్సాహములందించాలి.
చెప్పవచ్చు
కోటి
చెయ్యరు
ఒకటి
చెప్పుట
సులభంబు
చేయుట
కష్టంబు.
ఇలాంటి
పరిస్థితిలో
వున్నప్పుడు
యీ
వేదము
మహత్తరమని
యెంత
చెప్పి
యేమి
ప్రయోజనము.
ఈ
వేదము
సర్వస్వతంత్రమైనది.
ఇది
భగవంతునికి
నీకు
సన్నిహితసంబంధబాంధవ్యాన్ని
అభివృద్ధిగావించేది.
ప్రజలను
నీకు
సన్నిహితబాంధవ్యాన్ని
అందించేది
కాదు.
కనుకనే
వేదము
తెలిసిన
వ్యక్తులందరు
కొంతవరకు
త్యాగముగావించి,
తమ
జీవితాన్ని
వేదానికి
అర్పితము
గావించాలి
అప్పుడే
మన
ప్రాచీన
భారతదేశము
తిరిగి
పునరుద్ధరింపచేసినవారమవుతాము.
వేదహితమైన
కర్మలను
విసర్జిస్తున్నారు.
ముట్టకు,
ముట్టకు
అనే
మూఢాచారంలో
మునిగిపోతున్నారు.
వేదము
చెప్పినది
యేమాత్రం
అనుసరిస్తున్నారు
ప్రాణము
పోయిననూ
సరే
వేదము
ననుసరించాలి.
అలాంటి
కంకణము
కట్టుకున్నప్పుడే
యీ
వేదాన్ని
మనము
ప్రచారము
చేయటానికి
అర్హులమవుతాము.
కేవలంగా
…గినంత
మాత్రమున
అభివృద్ధి
కాదు.
దీనిని
నిర్భయముగా,
నిస్సందేహముగా
ప్రచారం
సల్పటానికి
పూనుకోవాలి.
సత్యానికి
భయమెందుకు?
అసత్యానికే
భయము.
వారిలో
అసత్యము
వుండటంచేతనే
భయపడుతున్నారు.
భయము
ఎందుకు.
ప్రాణం
తీస్తారా.
తీయనీ
వేదాలకోసం
నీ
ప్రాణాన్ని
అర్పితం
చేశావనేది,
అదికూడను
గొప్ప
ఘనతగానే
వుంటుంది.
ఈ
విధమైన
దృఢవిశ్వాసముచేత
వేదాన్ని
పునరుద్ధరింపచేయటానికి
ప్రయత్నం
చేయాలి.
వేదము
బోధించిన
దానిని
ఆచరణలో
పెడుతూ
రావాలి.
ఆచరణలో
పెట్టినదానిని
అన్యుల
కందించాలి.
అప్పుడే
యిది
క్రమక్రమేణా
పెరుగుతూ
వస్తుంది.
ఈ
విధమైన
మార్గాన్ని
ప్రతివ్యక్తికూడను
బాధ్యతగా
భావించి
దీనిని
పునరుద్ధరింపచేయటానికి
ప్రయత్నం
చేయాలని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Sādhanas without Prema are fruits without juice!
Next
The Veda is what shows the oneness in the many
→