Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Develop the Principle of Prema
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Develop the Principle of Prema
25 June 1989, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
అన్ని
మతములు
తననె
చూపును
-
అన్ని
మూర్తులు
తనవె
రూపులు
అన్ని
చెంతల
తానెయుండగ
-
అదియె
గదరా
బ్రహ్మపదము
కన్ను
విప్పి
చూడరోరన్నా!
ఈ
సాయిదేవుని
ఎన్నగా
ఎందైన
కలడన్నా
మున్ను
షిరిడి
నేడు
పర్తి
ఉన్నవాడని
పేరెగాని
తన్ను
భావన
చేయు
భక్తుల
కన్నులందే
మెలగునన్నా
కన్ను
విప్పి
చూడరోనన్నా!
విద్యార్థులారా!
మానవుడు
దేనిని
సాధించగోరినప్పటికిని
ప్రకృతిని
ఆశ్రయించవలసి
వస్తుంది.
ప్రకృతి
ఎవరి
సొత్తు
కాదు.
ఇది
పరమాత్మ
సొత్తు.
పరమాత్ముని
అనుమతి
లేకుండా
ఈ
ప్రకృతిని
ఎవ్వరూ
కూడను
అనుభవించుటకు
వీలుకాదు.
ఈ
సత్యాన్ని
గుర్తించుకొనలేని
వ్యక్తులు
దీనిని
నేను
సాధించగలననే
ధీమాతో
అహంకారము
చేత
ప్రకృతిలో
కొన్ని
కార్యములను
ప్రారంభిస్తారు.
ఇది
కేవలము
శుద్ధ
పొరపాటు.
దైవాజ్ఞ
లేక
దైవ
సమ్మతి
లేక
మానవుడు
జగత్తులో
ఎట్టి
కార్యమును
సాధించలేడు.
దీనికి
రామాయణము
చక్కని
ఉదాహరణము.
రావణుడు
గొప్ప
తపశక్తి
కలవాడు.
సమస్త
విద్యలు
నేర్చినవాడు.
ఇతను
పరమభక్తుడు.
అయినప్పటికిని
ప్రకృతిని
ఆరాధన
చేస్తూ
పరమాత్మయైన
శ్రీ
రామచంద్రుని
విస్మరిస్తూ
వచ్చాడు.
ప్రకృతి
స్వరూపమైన
సీతను
మాత్రమే
ఆశించి
సీతాపతియైన
రాముని
మాత్రము
ఆశించలేకపోయాడు.
ఆమెను
సాధించే
నిమిత్తమై
అనేక
రకములైన
ప్రయత్నములు
చేశాడు.
కడపటికి
ఏ
గతిపట్టాడు?
పరమాత్మను
విస్మరించి
ప్రకృతిని
ఆశించి
మానవ
శక్తిపైన
ఆధారపడి
తన
ధీశక్తిని
పురస్కరించుకొని
ప్రకృతిని
సాధించ
పూనుకున్న
రావణుని
గతి
యేమైనది?
తాను
పతనమై
పోవటమే
కాకుండా
తన
వంశమును
తన
రాజ్యమును
పతనము
గావించుకున్నాడు.
ఇక్కడ
మన
దేహమే
ప్రకృతి
ప్రాణమే
పరమాత్మ.
ప్రాణమును
విస్మరించి
దేహమును
ప్రధానమని
భావించే
వెఱ్ఱివాడు
యీలోకమునందెవరైనా
కలరా?
ప్రాణము
లేకపోతే
ఈ
దేహమును
ఎవరు
గౌరవించగలరు?
ఎవరు
ప్రేమించగలరు?
ఎవరు
అనుభవించగలరు?
పోనీ
యీ
దేహమునందున్న
సమస్త
శక్తులే
నా
ప్రధానమైన
ఆధారములు
అని
విశ్వసించి
తన
దేహము
నందు
యే
అంగము
చెడినప్పటికిని
ఆ
అంగమును
సరిచేసుకోగలుగుతున్నాడా?
ఈ
ప్రకృతి
అనే
దేహమే
తన
స్వాధీనము
నందుండినట్లైన
యీ
అంగములను
తాను
సరిదిద్దుకొనగలుగుతున్నాడా?
లేదు
లేదు.
ఇది
అసాధ్యము.
అన్నింటికిని
భగవంతుడే
ఆధారము.
2
▾
Meaning
Keep
జగత్తునందు
మనము
అనుభవించే
ఫలితములుగాని,
అనుభవించే
కష్టసుఖములుగాని,
ఆనందించే
సుఖసంతోషములుగాని
భగవదనుగ్రహ
వరప్రసాదముచే
అందుకొన్నవేగాని
తాను
సాధించినవి
కాదు.
కానీ
మానవుడు
తాను
సాధిస్తున్నానని
తాను
జయిస్తున్నానని,
తాను
యిన్ని
విధములుగా
పోషించుచున్నానని
గర్వపడుతున్నాడు.
ఈ
గర్వమే
అపజయమునకు
మూలకారణము.
ఈ
గర్వమే
అశాంతికి
మూలకారణము.
ఈ
గర్వము
నిరాశ
నిస్పృహలకు
మూలకారణము.
కనుక
ఒకటి
ఆధారమై
వున్నదని
దానిపైన
ఈ
జగత్తంత
కూడను
సంచరించుచున్నదనే
విషయాన్ని
గుర్తించి
వర్తించటం
అత్యవసరం.
మీకందరికి
తెలిసిన
విషయమే.
సినిమాలయందు
సత్యమైన,
నిత్యమైన
తెర
అనే
భగవంతుడుంటాడు.
ఈ
తెరపైన
అనేక
బొమ్మలు
వస్తుంటాయి,
పోతుంటాయి.
ప్రతి
మానవుడు
వచ్చిపోయే
బొమ్మలను
మాత్రం
గుర్తిస్తున్నాడు.
బొమ్మల
అనుభూతిని
మాత్రమే
అనుభవిస్తున్నాడు.
కాని
ఆ
తెరను
యేమాత్రము
విశ్వసించటం
లేదు.
తెరను
యేమాత్రం
గుర్తించటం
లేదు.
ఈ
వచ్చేపోయే
బొమ్మలన్నీ
తెరను
ఆధారం
చేసుకొనియే
కనుపిస్తున్నాయి.
కాని
తెరలేకపోతే
మనకు
కనుపించవు.
ఈ
బొమ్మలను
మాత్రమే
విశ్వసిస్తూ
పోయినప్పుడు
తనకు
యే
విధమైన
అర్థం
గోచరిస్తుంది.
అదేవిధముగనే
యీనాడు
మానవుడు
భగవంతుని
విస్మరించి
ప్రకృతినే
విశ్వసించి
తన
జీవితమును
గడుపుకోటానికి
ప్రయత్నిస్తున్నాడు.
ఇది
చాలా
పొరపాటు.
ఆధారమైన
దైవత్వమును
మనము
ఆశ్రయించే
ఆధేయమైన
ప్రకృతిని
అనుభవించాలి.
మానవుడు
యీనాడు
విశ్వసించవలసినది
భగవంతుని
తప్ప
అన్యము
కాదు.
భక్తి.
భక్తి.
భక్తి
అనునది
ఒక
విధమైన
డ్రెస్సు
కాదు.
లేక
యిది
ఒక
విధమైన
వేషము
కాదు.
ఈ
వేషములు
యీ
విధమైన
డ్రెస్సులు
ప్రాకృతమైనవి.
ఈనాడు
పెద్దలను
దర్శించవలెనన్న,
దేవాలయమునకు
పోవలెనన్న,
యింక
గురువులొస్తున్నారు
వారిని
స్వాగతించవలెనన్న
నూతనమైన
డ్రెస్సును
ధరిస్తారు.
ఏనాడు
లేని
పట్టు
వస్త్రములు
ధరించటము,
రుద్రాక్షలు
వేసుకోటము,
విభూతులు
పెట్టుకోటము,
పెద్దలనాహ్వానించటం
కోసమని
బజారుకు
రావటము,
దేవాలయమునకు
పోతున్నామంటే
చొక్కాలు
వదలటము,
అంగవస్త్రాన్ని
చుట్టటము
అదొక
ప్రత్యేకమైన
పనిగా
తాము
భావిస్తూ
వుంటారు.
ఈనాటి
సాధకులందరు
ఇది
భగవంతుని
పని,
యిది
నా
పని
అనేరీతిగానే
విభాగములు
చేస్తున్నారు.
తన
యింటి
పనులు
తన
బిడ్డల
పనులు,
తన
ఆఫీసు
పనులు,
తన
వ్యాపార
పనులు
యివన్నీ
నావి.
జపము
ధ్యానము,
పూజ
యివన్నీ
భగవంతునివి.
ఈ
విధముగా
భక్తులు
విభజిస్తూ
పోతున్నారు.
ఇది
సరియైన
పద్ధతి
అనిపించుకోదు.
ఈ
వేషమనేది
కేవలం
భగవంతుని
మోసము
చేసే
వృత్తులు.
‘సర్వతః
పాణి
పాదం’
అన్నింటియందు
వుండినట్టి
దైవత్వానికి
యిది
నాది
అది
నీది
అనే
భేదానికి
అవకాశమెక్కడుంది?
ఇదే
విధముగనే
యిదొక
డ్యూటీ
కింద
చేరుతున్నాది
కాని
బాధ్యతగా
కాని,
కర్తవ్యముగా
కాని
చేరటం
లేదు.
duty
అంటే
యేమిటని
కొంత
విచారించాలి.
3
▾
Meaning
Keep
ఒక
పోలీసు
వుంటాడు.
అతను
తన
dutyలో
పోయేటప్పుడుగాని,
అధికారి
వచ్చినప్పుడుగాని
గవర్నమెంటు
నిర్ణయించిన
డ్రెస్సు
వేసుకుంటాడు.
తన
డ్యూటీ
అయిపోయి
ఆఫీసు
నుండి
ఇంటికి
పోయి
ఆ
డ్రస్సు
తీసి
ఒక
గూటానికి
తగిలించి
తన
బుష్కోటు,
ఫాంటు
ధరిస్తాడు.
అది
ప్రభుత్వము
డ్రస్సు.
ఇది
నా
డ్రస్సు
అని
విభజించుకుంటాడు.
ఇది
ప్రాకృతమైన
ధర్మమునకు
సరిగా
తోస్తుంది.
కాని
భగవంతునికి
యీ
విధమైన
మార్పులు
కూర్పులు
యేమాత్రము
చెల్లవు.
భగవంతుని
దగ్గర
సతతం
యోగినః
నిరంతరము
భగవంతుని
కర్మనే
ఆచరించాలి.
నీవు
ఆఫీసుకు
పోయి
నీ
పనులు
చూసుకో.
యివి
కూడను
భగవంతుని
పనులుగానే
భావించాలి.
నీవేదైనా
ఒక
వ్యాపారమునందు
ప్రవేశించు.
ఇది
కూడను
భగవంతుడనుగ్రహించిన
పనియే
అని
భావించు.
ఇదే
భావాద్వైతము.
దేహములు
ఎన్నైనా
వుండవచ్చును.
ఎన్ని
నామములు,
ఎన్ని
రూపములు,
ఎన్ని
స్థితిగతులు
అనుభవించినప్పటికిని
అన్నింటియందు
వుండినది
శబ్ద
స్పర్శ
రూప
రస
గంధమే.
అందరియందు
వుండిన
పంచభూతములు
ఒక్కటే.
ఈ
పంచభూతములే
పరమాత్మ
అంశములు.
ఈ
అంశములయందు
ఎందుకు
యీ
విభాగములు
చేయటము?
కనుకనే
యీ
భావాద్వైతమునందు
మనము
చక్కగా
క్రియాద్వైతాన్ని
కూడను
విశ్వసించాలి.
క్రియాద్వైతమనగా
ఏమిటి?
మనము
ఏ
పనులు
చేసినప్పటికిని
భగవత్ప్రీత్యర్థంగా
అర్పితం
గావించటం
వలన
చేసిన
కర్మలన్నీ
భావక్రియలే
అయిపోతాయి.
అద్వైతక్రియే
అవుతుంది.
వస్త్వద్వైతం.
పదార్థాద్వైతం
అనేది
మూడవది
వుంది.
పదార్థాద్వైతమనగా
ఏమిటి?
పదార్థములు
చక్కగా
విచారించినప్పుడు
అన్నింటియందు
వున్నది
ఒక్కటే
అని
మనకు
తేలిపోతుంది.
ఇది
ఏమిటి?
బట్ట.
ఈ
బట్ట
దేని
వలన
తయారైంది?
దారం
వలన
తయారైంది.
దారం
దేనివలన
తయారైంది?
ప్రత్తి
వలన
తయారైంది.
కాబట్టి
ప్రత్తి
లేక
దారం
లేదు.
దారం
లేక
వస్త్రం
లేదు.
ఈ
మూడు
ఒక్కటే.
ఇది
పదార్థాద్వైతం.
దారం
వేరు,
ప్రత్తి
వేరు,
వస్త్రం
వేరు
అని
విభజించటం
చేతనే
మన
మనస్సు
తబ్బిబ్బై
పోతుండాది.
సత్యాన్ని
గుర్తించుకో
లేకుండా
పోతుండాది.
మనము
యీ
భావాద్వైతము,
పదార్థాద్వైతము,
క్రియాద్వైతాన్ని
చక్కగా
గుర్తించుకున్నప్పుడు
మనకు
సత్యము
గోచరిస్తుంది.
ఒక
తండ్రికి
అనేక
మంది
పిల్లలుంటారు.
ఈ
పిల్లలకు
పెండ్లిండ్లు
చేసేటప్పటికి
కోడండ్లు,
అల్లుండ్లు
వస్తుంటారు.
వీరందరు
వేరు
వేరుగా
భావిస్తారు.
ఈ
భావనలయందు
భేదములు
మాత్రమే
వుంటుండాయి
కాని
యజమానుడు
ఒక్కడే
అనే
సత్యాన్ని
మనం
గుర్తించుకోక
తప్పదు.
భార్య
వచ్చి
my
dear
husband
అంటుంది.
కుమారుడు
వస్తాడు
father
అంటాడు.
grand
child
వస్తాడు
grand
father
అంటాడు.
Son
in
law
వస్తాడు
father
in
law
అంటాడు.
ఒక్కొక్కరు
ఒక్కొక్క
పేరుతో,
ఒక్కొక్కరు
ఒక్కొక్క
సంబంధముతో
వుచ్ఛరించినప్పటికి
వ్యక్తి
ఒకడే
కదా!
అదేవిధముగనే
భావాద్వైతమనే
దాన్ని
మనం
ఊహించినప్పుడు
ఈ
దైవత్వమనేది
సర్వత్ర
వున్నదనే
సత్యము
మనకర్థమవుతుంది.
4
▾
Meaning
Keep
రామాయణ
తత్త్వమంతా
అద్వైత
తత్త్వంగా
నిరూపిస్తూ
వచ్చింది.
మానవ
జీవితంలో
సాధించవలసినది
ఏమిటి?
విసర్జించవలసినది
ఏమిటి
అనే
సత్యాన్ని
రామాయణం
చక్కగా
ప్రబోధిస్తూ
వచ్చింది.
స్త్రీ
పురుషుల
ఉపాధి
భేదములే
తప్ప
మానసిక
సంబంధమైన
పరిస్థితులు
యిరువురకు
సమానమే.
దుఃఖమొస్తే
వీరు
బాధపడతారు,
వారు
బాధపడతారు.
క్రోధము
చేత
వీరు
ఉగ్రులౌతారు
వారు
ఉగ్రులౌతారు.
ఆకలివేస్తే
వీరు
తింటారు
వారు
తింటారు.
బాధలు
వస్తే
వీరు
బాధపడతారు,
వారు
బాధపడతారు.
ఇందులో
యే
విధమైన
వ్యత్యాసమున్నది?
ఒకరు
నిగ్రహించుకోవచ్చు
ఒకరు
నిగ్రహించుకోలేకపోవచ్చు.
నిగ్రహానుగ్రహములు
రెండు
మనస్సు
ప్రతిబింబములే
కాని
అన్యము
కాదు.
కనుక
దివ్యత్వాన్ని
సమత్వంగా
భావించుకోటమే
ఆధ్యాత్మికము.
వ్యక్తిత్వాన్ని
ఆధారం
చేసుకొని
మానవులు
అహంకారంతో
మిడిసిపడుతూ
వుంటారు.
ఇది
సరికాదు.
ఒకానొక
సమయములో
పురుషులము
అధికారులమని
పురుషులకున్న
శక్తి
స్త్రీలకు
లేదని,
పురుషులు
అన్నింటియందు
ముందంజ
వేసే
వీరులని,
ధీరులని,
గంభీరులని
భావిస్తుంటారు.
స్త్రీలు
బలహీనులని
వారికి
అధికారము
లేదని,
వారు
దీనిని
సాధించలేరని
వారి
శక్తి
సామర్థ్యములు
చాలవని
వూహిస్తూ
వుంటాము.
ఇది
కూడ
వారి
భావములలో
భేదము
తప్ప
అన్యము
కాదు.
ఒక
యింటికి
కొత్తగా
అల్లుడు
వచ్చాడు.
ఆ
యింటిలో
చక్కగా
విందును
ఆరగించి
తాంబూలము
వేసుకోటానికి
కూర్చున్నారు.
అతను
మహా
తేజోవంతుడని
గొప్ప
తెలివితేటలు
కలవాడని,
మహాత్యాగి
యని
అనేకరకములుగా
వర్ణించుకుంటూ
పోతున్నాడు.
ఇంతటి
మేధాశక్తిగల్లిన
అల్లుడు
తనకు
లభించాడని
మామ
కూడను
వెఱ్ఱివాడై
విఱ్ఱవీగుతూ
వచ్చాడు.
ఈ
మేధాశక్తియందు
కవిత్వము
కూడను
తెలుసునని
ప్రకటించాడు.
తాంబూలమునకు
తగిన
పదార్థములన్ని
తట్టలోనే
వున్నాయి.
తాంబూలమునకు
కావలసినవి
ఏమిటి?
వక్క,
ఆకు,
సున్నము
యీ
మూడు
కావాలి.
ఇవన్నీ
వుండినప్పటికిని
తన
శక్తిసామర్థ్యముల
అహంకారముచేత
ఏదో
ఒకటి
ప్రశ్నించాలని
మరదలిని
అగౌరవ
పరచాలని
సంకల్పించుకొన్నాడు.
పర్వత
శ్రేష్ఠ
పుత్రిక
పతి
విరోధి
అన్న
పెండ్లాము
అత్తను
గన్న
తండ్రి
ప్రేమ
మీరంగ
నాతని
పెద్ద
బిడ్డ
సున్న
మిప్పుడు
తేగదె
సన్నుతాంగి
అన్నాడట.
దీని
అర్థమేమనగా
పర్వత
శ్రేష్ఠ
పుత్రి-పార్వతి.
పతి
విరోధి
అన్న
పెండ్లాము
అత్తను
గన్న
తండ్రి.
పతి
ఎవరు?
ఈశ్వరుడు.
ఈశ్వరునికి
విరోధి-
మన్మథుడు.
అతని
అన్న
బ్రహ్మ
ఆయన
పెండ్లాము
అత్తను
గన్న
తండ్రి.
5
▾
Meaning
Keep
ఆయన
పెండ్లాము
సరస్వతి.
ఆ
సరస్వతి
అత్త
లక్ష్మి
ప్రేమ
మీరంగ
అతని
పెద్ద
బిడ్డ.
ఆమె
తండ్రి
పేరు
సముద్రుడు.
ఆయన
పెద్ద
బిడ్డ
పేరు
దరిద్ర
దేవత.
కనుక
ఓ
దరిద్రదేవతా!
సున్నము
తీసుకొనిరా
అన్నాడు.
కవిత్వములో
ఆమె
ఆయనకంటె
గొప్ప
తెలివితేటలు
కల్గిన
స్త్రీ.
ఆమె
లోపలికి
పోయి
సున్నం
తీసుకొని
వచ్చింది.
చేతిలో
పట్టుకుంది
బావగారికందించలేదు.
శత
పత్రంబుల
మిత్రుని
సుతు
జంపినవాని
బావ
సూనుని
మామన్
సతతము
దాల్చెడు
అతని
సుతు
వాహన
వైరి
వైరి
సున్నంబిదిగో.
అనిందట
ఆయమ్మ.
శతపత్రంబుల
మిత్రుని.
శత
పత్రమనగా
కమలము.
ఈ
కమలము
మిత్రుడు
సూర్యుడు.
సూర్యుని
చూస్తే
కమలము
విచ్చుతుంది.
సుతుడెవ్వరు?
కర్ణుడు.
కర్ణుని
చంపినదెవరు?
అర్జునుడు.
అతని
యొక్క
బావ
కృష్ణుడు.
అతని
కుమారుడు
మన్మథుడు.
అతని
మామ
చంద్రుడు.
చంద్రుని
ఎప్పుడూ
తలపై
పెట్టుకునేవాడు
ఈశ్వరుడు
అతని
కుమారుడెవరు?
గణపతి.
అతని
వాహనమేమిటి?
ఎలుక.
ఆ
ఎలుకకు
వైరి
ఎవరు
పిల్లి.
పిల్లికి
వైరి
ఎవరు?
కుక్క.
ఓ
కుక్కా
యిదుగో
సున్నం
అనింది.
చూశారా.
మగవారి
అహంకారం
యెంతట్లో
అణగిపోయింది.
పురుషుడు
శక్తి
సామర్థ్యములు
గల్లిన
వ్యక్తిగా
మనము
అనుభవిస్తున్నాము
గాని
అంతకంటె
శక్తిసామర్థ్యములు
కలిగిన
స్త్రీలు
లేకపోలేదు.
ఉపాధి
భేదముల
చేత
జగత్తునందు
స్త్రీ
పురుష
భేదములు
భావించవచ్చునే
గాని
దైవ
తత్త్వమునందు
సర్వులు
ఒక్కటే.
దరిద్రదేవత
అని
చెప్పనక్కరలేము
చెప్పకుండా
వుంటే
కుక్కా
అనిపించుకోనక్కర
లేదు.
ఇదే
విధముగనే
మానవుడు
ప్రాకృతమైన
భావములను
అభివృద్ధి
పరచుకొని
ప్రాకృత
చర్యలందే
తన
జీవితాన్ని
వ్యర్థము
గావించుకుంటున్నాడు.
విద్యార్థులారా!
మనం
చదవవచ్చు.
గొప్ప
గొప్ప
డిగ్రీలు
సంపాయించవచ్చు.
గొప్ప
పదవుల
నేలవచ్చు.
అధిక
ధనమును
ప్రోగు
చేసుకోవచ్చును.
ప్రోగు
చేసిన
ధనమును
మనం
ఏ
రీతిగా
దుర్వినియోగం
చేస్తున్నాం.
దీనిలో
దోషమును
తప్పించుకోటానికి
లేక
ప్రమాదములను
తప్పించుకోటానికి
లేక
కొన్ని
రకములైన
యుక్తులు
అత్యవసరం.
ఆ
యుక్తియే
యోగము.
అవతారములు
రాకపూర్వము
యోగమును
ముందు
పంపి
తరువాతనే
శక్తి
ప్రారంభమవుతుంది.
దేవకీదేవికి
ఏడవ
గర్భము
లోపల
యోగశక్తిగా
బలరాముడు
పుట్టాడు.
యోగముకంటె
పూర్వమే
మాయాశక్తి
పుట్టింది.
మాయ
ముందు
ప్రయాణ
మవుతుంది.
తదుపరి
యోగశక్తి
వస్తుంది.
మాయాశక్తి
ప్రపంచమును
భగవంతుని
మరపించే
నిమిత్తము
ముందు
ప్రవేశిస్తుంది.
యోగశక్తి
దివ్యశక్తికి
సహాయకారిగా
నిలుస్తుంది.
తదుపరి
అష్టమ
గర్భము
నందు
కృష్ణుడు
జన్మించాడు.
కనుకనే
యుక్తి
కూడను
ఒక
యోగమే
అన్నారు.
6
▾
Meaning
Keep
ఆ
యోగమును
అర్థము
చేసుకునే
శక్తి
సామర్థ్యములు
వ్యక్తికి
వుండాలి.
ఈనాటి
మానవులు
యీ
శక్తి
సామర్థ్యములంతా
కేవలము
ఒక
విధమైన
డాంబికముగా
ఒక
ప్రదర్శనగా
పాటిస్తూ
వస్తున్నారు.
ఆడంబరముతో
మనము
యుక్తిని
ప్రవేశపెట్ట
కూడదు.
సమయ
సందర్భానుసారంగా
యుక్తిని
ప్రవేశపెట్టాలి.
దేశకాల
పరిస్థితుల
ప్రభావాన్ని
పురస్కరించుకొనియే
యుక్తిని
ప్రవేశపెట్టాలి.
లేకపోతే
యీ
యుక్తి
హాస్యాస్పదంగా
రూపొందుతుంది.
గురునానక్
ఒకానొక
సమయము
లోపల
హృషీకేశ్కి
పోయాడు.
అక్కడ
నుంచి
అందరూ
బదరీ
వెడుతుంటే
తానుకూడా
వెళ్ళాడు.
మన
భారతీయులలో
వుండిన
బలహీనత
ఒక్కటే.
బదరీలో
తల్లితండ్రులకుగాని
పెద్దలకుగాని
పిండం
పెడితే
యింక
వారికి
జన్మ
వుండదని
విశ్వాసం.
అక్కడ
పండాలందరు
పీక్కుతింటారు.
వాళ్లే
పెద్ద
పీనుగులుగా
వుంటారు.
వెళ్లిన
వారినందరిని
డబ్బు
డబ్బు
అని
పీడిస్తూ
వుంటారు.
ఒక
బండ
మీద
కూర్చొని
అందరికి
పిండాలు
పెట్టిస్తున్నారు
పండాలు.
ఇక్కడ
పెట్టిన
పిండము
స్వర్గములోనో
నరకములోనో
వుండినవారికందరికి
చేరుతుందని
వారి
బాధలు.
నది
ప్రక్కనే
పిండాలు
పెడుతుంటే
ఈ
గురునానక్
అక్కడ
నీళ్లలో
పోయి
దిగాడు.
తూర్పువైపున
తిరిగాడు.
నీరు
వూరికే
జల్లుతున్నాడు.
ఈ
పండాలంతా
చూచారు.
ఏమిటి
యీ
పిచ్చివాడు.
నదిలో
వున్న
నీరంతా
గట్టుకు
చల్లేస్తున్నాడే.
అని
అందరు
నవ్వుతున్నారు.
హాస్యాస్పదంగా
చూస్తున్నారు.
వీరు
హాస్యం
చేసే
కొలది
అతను
మరింత
వేగంగా
నీళ్లు
చల్లుతూ
వచ్చారు.
వాళ్లపై
కూడా
చల్లాడు.
ఆ
పండాలంతా
వచ్చి
కోపంతో
పిచ్చివాడా!
ఎక్కడికి
నీళ్లు
చల్లుతున్నావన్నారు.
మా
పంజాబు
లోపల
మోగ
అనే
గ్రామములో
మరొక
మామిడితోట
వుంటుంటాది.
ఆ
మామిడి
తోటకు
నీళ్లు
చల్లుతున్నానన్నాడు.
పిచ్చివాడా!
ఉండేది
బదరీ
లోపల.
అలకనది
నీళ్లు
యిక్కడ
వుంటున్నాయి.
అక్కడ
మోగ
పంజాబులో
వుండే
తోటకు
నీళ్ళెట్లా
చేరతాయి.
అన్నారు.
ఎక్కడో
ఏ
లోకములో
వున్న
తల్లితండ్రులకు
యిక్కడ
పెట్టిన
పిండాలు
చేరుతుంటే
నేనిక్కడ
చల్లిన
నీరు
మోగాకు
ఎందుకు
చేరకూడదు?
అన్నాడు.
ఇది
వాళ్ల
బుద్ధిని
కదిలించే
యుక్తులు
అవి.
రామకృష్ణుడు
కూడను
అంతే
చేశాడు.
అనగా
తెనాలి
రామకృష్ణుడు
పరమహంస
రామకృష్ణుడు
కాదు.
పరమహంస
రామకృష్ణుడు
అమాయకుడు
పాపం.
ఒట్టి
ప్రేమ
తప్ప
ఏమి
లేదు.
కృష్ణా
కృష్ణా
కృష్ణా
ఈ
కృష్ణుడు
యేరీతిగా
నాకు
చిక్కుతాడు.
ఏరీతిగా
పట్టుబడతాడు.
అనే
యిది
తప్ప
యింక
యే
కుయుక్తులు
అతనికి
తెలియవు
పాపం.
ఈ
యుక్తులు
కుయుక్తులు
విద్యావంతులకే
బాగా
తెలుసు.
అతనికి
ఏ
విద్యలు
రావు.
ఒకానొక
సమయంలో
విద్యావంతుడైన
వివేకానందునితో
నేనింటికి
పోవాలన్నాడు.
ఈ
పొద్దు
పెన్సిల్
తీసుకొనే
దినము
అన్నాడు.
ఏమిటి?
పెన్సిల్
తీసుకునే
దినమేమిటి!
అన్నాడు
వివేకానంద.
నేను
ఉద్యోగము
చేసిందానికి
రిటైరైన
తరువాత
కొంచెం
యిస్తుంటారట
అన్నాడు.
7
▾
Meaning
Keep
అప్పుడు
వివేకానంద
చెప్పాడు
పెన్సిల్
కాదు
స్వామి
పెన్షన్
అన్నాడు.
నీ
భాష
నీవు
పెట్టుకో
నా
భాష
నాదే
నాకు
పెన్సిలే.
నీ
భాష
నేను
అనుసరించనక్కరలేదు.
నాకొక
హృదయముంది.
నాకొక
మనసుంది.
నాకొక
నోరుంది.
నాకొక
భావముంది.
నా
భావాన్ని
నేను
అనుసరిస్తాను
నీకిష్టమైతే
అనుసరించు
లేకుంటే
వెళ్లు
నా
యొక్క
యిది
పెన్సిలే.
అలాంటి
అమాయకుడు
పాపం.
కానీ
భగవంతుని
చేరాలనే
వివేకం
అతనిలో
చాలా
వెల్లువగా
పోతోంది.
తెల్లవారి
లేచినది
మొదలు
రాత్రి
కన్ను
మూసేంత
వరకు
కూడా
ఎక్కడ
కనబడతాడో
కృష్ణుని
ఆ
యొక్క
కృష్ణుని
దర్శనం
కోసం
కాచుకొని
వుండేవాడు.
వేచి
వుండేవాడు.
రాత్రి
భుజించి
పడుకునేందుకు
ముందుగా
ఒక్క
నిముషం
అన్ని
వేపులా
అటూ
యిటూ
చూసేవాడు.
ఛీ!
యీనాడు
కూడా
వ్యర్థం
అయిపోయింది.
ఈ
దినమంతా
వ్యర్థమై
పోయింది.
కృష్ణుడు
కన్పించలేదు.
అని
నిరాశగా
పవళించేవాడు.
ఎన్ని
రకములుగానో
తాను
కృష్ణుని
పొందాలనే
నిమిత్తమై
అనేక
రకములైన
ప్రయత్నములు
చేసేవాడు
పాపం.
ఇది
కేవలం
విచక్షణా
జ్ఞానం
లేకుండా
శూన్యత్వంలోకి
ప్రవేశిస్తున్నాడని
అందరు
మధురనాధుడు
కూడా
దూషించాడు.
ఒకనాడు
కృష్ణుడు
రాధకు
సమీపంగా
వుంటాడుట
కనుక
నేనే
రాధనౌతానని
మెత్తగా
మధురనాధుని
యింటికి
వెళ్లాడు.
నాకు
కొన్ని
గాజులు,
ఒక
చీరకావాలి
అన్నాడు.
మధురనాధుడు
దేవికి
కట్టటానికేమోనని
మంచి
చీర
యిచ్చి
పంపాడు.
తీసుకువెళ్లాడు.
మధురానాధుడు
రామకృష్ణునితో
పదిగంటలకు
ప్రసాదానికి
వస్తానని
చెప్పాడు.
తాను
పోయి
చీరకట్టుకున్నాడు.
గాజులు
వేసుకున్నాడు.
ఆ
కాంపౌండులో
వున్న
పూలమొక్కల
నుంచి
పూవులంతా
కోసుకున్నాడు.
మధురానాధుడు
పదిగంటలకు
ప్రవేశించాడు.
చూచాడు
ఎవరో
స్త్రీలుంటున్నారని
వెనుకకు
వెళ్లాడు.
రామకృష్ణుడు
లోపలికి
వెళ్లాడు.
ఆ
పూవులంతా
కృష్ణునికి
అలంకారం
చేశాడు.
ఆ
విగ్రహాన్ని
కృష్ణా
అని
ఆలింగనం
చేసుకొని
పాదాలపైన
పడ్డాడు
మైమరచి
పోయాడు.
నేను
రాధను
నీవు
కృష్ణుడవు.
రాధాకృష్ణ
రాధాకృష్ణ
అతను
పిచ్చివాడు
పాపం.
ఒక
చేతిలో
మట్టి
ఒక
చేతిలో
బంగారం
తీసుకొని
మట్టి
బంగారు,
మట్టి
బంగారు
రెండూ
ఒక్కటే
అనుకునేవాడు.
అదేరీతిగా
రాధాకృష్ణ
రాధాకృష్ణ
రెండూ
ఒక్కటే
అనే
భావంతో
తాను
లీనమైపోయాడు.
అది
యీనాటి
విద్యావంతులకు
పిచ్చితనంగా
వుంటుంది.
హిస్టీరియాగా
భావిస్తారు.
వీరు
ఏ
భావం
పొందినప్పటికి
రామకృష్ణుడు
ఆనందాన్ని
అనుభవించాడు.
మనకు
కావలసింది
అదే.
ఎవరేమనుకుంటే
యేమి?
చావడైతేనేమి
సత్రమైతేనేమి
నిద్రవస్తే
చాలురా
అన్నారట.
ఆ
దివ్యత్వాన్ని
పొందటమే
మనకు
కావాలి.
అక్కడ
విచక్షణా
జ్ఞానం
అక్కరలేదు.
అక్కడ
పని
చెయ్యదు.
తరువాత
11
గంటలకు
మధురానాధుడు
వచ్చారు.
రామకృష్ణుడన్నీ
విప్పివేసి
ఆ
ఆనందాన్ని
అనుభవించి
తిరిగి
ముందుకు
వెళ్లాడు.
మధురానాధా!
పది
గంటలకు
వస్తానని
ఎందుకు
రాలేదు
అని
రామకృష్ణుడు
అడిగాడు.
పది
గంటలకు
వచ్చాను
రామకృష్ణా
కాంపౌండు
లోపల
ఎవరో
ఆడవారున్నారు.
నేను
వెళ్ళినా
అన్నాడు.
8
▾
Meaning
Keep
ఆనందించాడు.
ఆడవారనుకున్నావా
నీవు
నిజంగా
ఆడవారుగానే
చూచావా
అన్నాడు.
పిచ్చి
పట్టిందా
రామకృష్ణా!
ఆడవారు
ఆడవారుగానే
వుంటారు.
ఆడవారనుకోక
మగవారనుకుంటామా
అన్నాడు.
ఆహా!
ఆడవారనుకున్నారా!
నేను
రాధ,
రాధ
అని
అదేరీతిగా
తన్మయత్వంలో
మరచిపోయాడు.
ఇలాంటి
అమాయకత్వం
లోపల
దైవత్వమును
పొందినవాడు
రామకృష్ణుడు.
కాని
తెనాలి
రామకృష్ణుడు
అలాంటివాడు
కాదు.
అవసరాని
బట్టి
యుక్తిని
ప్రవేశపెట్టాడు.
ఒకనాడు
ఆస్థానం
లోపల
రామకృష్ణునకు
గొప్ప
బహుమతినందించాడు
కృష్ణదేవరాయలు.
ఆనాడు
యీ
రూపాయినోట్లు,
ఐదు
రూపాయినోట్లు
పదిరూపాయినోట్లు
యివన్నీ
లేవు.
అంతా
వెండి
రూపాయలు.
మూడు
నాలుగు
మూటలంతా
కట్టి
బ్యాగులకు
వేసి
సిపాయిలతో
రామకృష్ణుని
వెంట
పంపాడు.
రూపాయలు
ఆనాడు
కొలత
వేసేది
ఎట్లా?
ఒక
పది
పది
రూపాయలు
ఒక
దానిపైన
ఒకటి
పెట్టేది.
ఒక్కటి
మాత్రమే
పెట్టేది.
ఆ
ఎత్తుకు
అన్నీ
సమకూర్చేది.
ఒకవేళ
ఎత్తుగా
వుంటే
స్కేలు
తీసుకొని
కొట్టేస్తే
అన్నీ
సమానంగా
వచ్చేవి.
ఇన్ని
నూర్లు
అనుకునే
వాళ్లు
ఎంచటానికి
చాలా
కష్టమవుతుంది.
బియ్యము
వడ్లు
మాదిరి
రూపాయలు
సంచులలో
వేసి
కట్టేవాళ్లు.
ఈ
మూటలు
మూడింటిని
తీసుకొని
పోయేది
దొంగలు
చూచారు.
ఇది
చూచినవారు
సరిగా
అర్ధరాత్రి
సమయము
లోపల
నిద్రపోతుంటే
దొంగలు
వచ్చి
పడ్డారు.
ఇంటిలో
భార్యభర్తలు
యిద్దరే
వుంటుండేది.
ముగ్గురు
నలుగురు
దొంగలొచ్చారు.
ఎందుకంటె
యిన్ని
మూటలున్నాయి
కదా!
మోసుకుపోటానికి.
ఒక్కడు
వాళ్లను
యేరీతిగా
పట్టగలడు.
వారిని
పట్టే
విధానం
యేమిటి?
డబ్బు
పోకుండా
చూచుకొనే
యుక్తి
యేమిటి
యోచించాడు.
దొంగలు
దొంగలని
అరిస్తే
వారు
మనమీద
పడవచ్చు.
మనలను
బాధించవచ్చు.
రామకృష్ణుడు
దొంగలను
చూచాడు.
భార్యను
లేపాడు.
ఏమిటో
నాకు
వాంతి
వచ్చేటట్టుగా
వుంది.
తక్షణం
నీరు
తీసుకురా
అన్నాడు.
దొంగలు
వినాలని
గట్టిగా
చెప్పాడు.
దొంగలను
పట్టటానికి
లేచాడనే
భావము
రాకూడదు.
అతనికేదో
కడుపులో
తిప్పుతూవుంది
అందుకే
లేచాడనుకొని
వాళ్లు
అతను
లేచేటప్పటికి
దొడ్డిలో
బావిదగ్గర
ఒక
కాకరచెట్టు
వుండేది.
కాకర
చెట్టు
బాగా
దట్టంగా
అల్లుకొని
వున్నది.
చాలా
బాధగా
వాంతి
చేసుకునేటట్టుగా
బావి
దగ్గరకొచ్చాడు.
దొంగలు
యితను
వచ్చేది
చూచారు.
కాకర
పొదలోపల
దూరుకున్నారు.
వాళ్లు
ఎక్కడ
చేరినారో
అది
కూడా
గమనిస్తూనే
వున్నాడు.
నోట్లో
నీరు
పోసుకోవటము
వాంతికొచ్చినట్టు
…
వుందని
పొదలలో
వుండే
వారిపైన
ముఖాలంతా
వుమ్మివేయటం,
ఈ
విధంగా
భార్య
బావిలోంచి
నీరు
చేదటం,
చేదిన
నీరంతా
నోట్లో
పోసుకోటం
వారి
ముఖాలపైన
కొట్టటం.
ఈ
విధంగా
అర్ధగంటసేపు
కొట్టాడు
భార్యకు
కోపం
వచ్చింది.
వాంతి
కొస్తే
యిన్ని
నీళ్లతో
కడుక్కుంటారా!
ఎందుకింత
శ్రమ
పెడుతున్నారు
అని
అన్నది.
ఏమిటే
నీకింత
శ్రమ.
కట్టుకున్న
భార్యకే
యింత
శ్రమైతే
కొత్తవారు
వాళ్లు
యింత
జల్లుతుంటే
ఎంత
ఓపిగ్గా
వున్నారు
అన్నాడు.
9
▾
Meaning
Keep
వారికి
వుండిన
ఓపిక
నీకు
లేకపోయిందే
అన్నాడు.
కనుక్కున్నాడనుకొని
వాళ్లు
పరుగెత్తిపోయారు.
ఈ
విధంగా
యుక్తి
చేత
యిలాంటి
పరిస్థితులు
సాధించుకోటానికి
యోచించుకోవాలి.
నిజమైన
యుక్తి
కూడను
తప్పించుకోటానికి
ఒక
యోగమే.
యోగమనేది
మనకు
ఆధ్యాత్మిక
మార్గమందే
అభివృద్ధి
అవుతుంది.
ఆధ్యాత్మికము
అత్యవసరము.
భగవద్విశ్వాసమనేది
లేనిచో
మనము
ఏ
కార్యాన్ని
కూడ
సాధించలేము.
కనుక
భగవంతుని
విసర్జించి
కేవలము
ప్రకృతిని
మాత్రమే
ఆశ్రయించటం
వలన
రావణుడు
ఏ
పరిస్థితి
పొందాడో
అదేవిధంగా
భగవంతుని
విస్మరించిన
వారికిదే
ఫలితమవుతుంది.
రాములనే
పాదాలు
పట్టుకొని
ప్రార్థించి
వుంటే
యింక
ఎన్ని
విధాలుగా
తాను
అభివృద్ధిలోకి
వచ్చేవాడో.
ఇదే
మాట
చెప్పాడు
విభీషణుడు.
అన్నా
ఏదో
జరిగినది
జరిగిపోయింది.
ఇప్పటికైనా
సీతను
అప్పజెప్పి
నీ
యొక్క
ప్రాణములు,
యీ
లంకను
దక్కించుకోమని
చెప్పాడు.
హనుమంతునికి
కూడను
సీత
చక్కని
ప్రబోధ
చేసింది.
ప్రకృతిని
మాత్రమే
నీవు
కదలించి
మెదలించి
తీసుకొని
పోవటానికి
ప్రయత్నించవద్దు.
అశోక
వనములో
హనుమంతుడు
ప్రవేశించి
ఆ
సీత
విలపించే
బాధనంతా
కనులార
చూచి
చాలా
బాధపడ్డాడు.
చెట్టు
నుంచి
ఆమె
పాదాల
దగ్గర
దూకాడు.
తల్లీ
నీవింక
విలపించనక్కర
లేదు.
నేను
చాలా
శక్తివంతుడను.
నా
వీపుపైన
కూర్చుంటే
శ్రీరామచంద్రుని
దగ్గరకు
మిమ్ముల
చేరుస్తాను.
అన్నాడు.
అప్పుడామె
యోచించింది.
హనుమంతుడు
రామ
భక్తుడు.
ఇంతటి
భక్తుడుగా
తాను
నిరూపిస్తున్నాడు.
కానీ
యింకా
పూర్తి
రామతత్త్వాన్ని
అర్థం
చేసుకోలేదనుకుంది.
నేను
ప్రకృతి
స్వరూపిణిని.
సీత
భూజాత.
హనుమంతా!
నీవు
యీ
విధంగా
నన్ను
తీసుకొనిపోయి
ప్రపంచములో
అపకీర్తి
పాలుచేసే
దానికంటె
ఆ
రామలక్ష్మణులనే
కూర్చోపెట్టుకొని
తీసుకుని
రాకూడదా.
రాముని
తీసుకొని
ప్రకృతి
దగ్గరకి
రావాలిగాని
ప్రకృతిని
తీసుకుని
రాముని
దగ్గరకు
పోవటమేమిటి?
అన్నది.
కనుకనే
మనము
పరమాత్ముని
ప్రకృతి
స్థాయికి
లాగాలి.
ప్రకృతి
భావాలు
పెట్టుకొని
మనము
పరమాత్ముని
దగ్గరకు
పోవటానికి
వీలుకాదు.
ఈనాడు
ప్రకృతి
నుంచి
పరమాత్మలోకి
ప్రవేశిస్తున్నాము.
ఇదే
ముక్తి
మార్గమని
బోధించటం
పొరపాటు.
పరమాత్మ
నుంచి
ప్రకృతిలోకి
వచ్చాననే
భావాన్ని
నీవు
అభివృద్ధి
చేసుకో.
పరమాత్మ
భావమే
నీకు
లభ్యమౌతుంది.
కనుకనే
నేను
అనేక
పర్యాయములు
చెప్తుంటాను.
You
may
worship
a
picture
as
God
but
not
God
as
a
picture.
విద్యార్థులారా!
కొంతమంది
వుంటారు.
ఈ
కర్చీఫ్
భగవంతుడే
అని
పైకి
పంపించు.
ఈ
మైక్
భగవంతుడే
దీన్నికూడా
పైకి
పంపించు.
ఈ
ఛైర్
కూడా
భగవంతుడే
దీన్నికూడ
పైకి
పంపించు.
ఇది
సరియైన
పద్ధతిగాని
భగవంతుడే
యీ
కర్చీఫ్
భగవంతుడే
యీ
మైకు,
భగవంతుడే
యీ
ఛైర్
అని
మాత్రం
క్రిందకు
లాగవద్దు.
10
▾
Meaning
Keep
His poems 15
Also in his talks
(5)
1 June 1973
God's Grace Can Turn a Fool into a Jñāni
4 January 1987
The Bhagavad Gītā is a book to be practised
14 January 1996
There is no wealth greater than Prema
29 March 1998
God fills every place
29 April 1998
God Alone Is the Ground of Ānanda
క్రింద
వున్నదాన్ని
పైకి
పంపించు.
జీవతత్త్వములో
వుండినదాన్ని
పరమాత్మతత్త్వంలోనికి
ప్రవేశపెట్టు.
ఇదే
ఉత్తమమైన
తత్త్వము.
కానీ
యీ
సత్యాన్ని
గుర్తించుకోలేక
పోతున్నారు.
మానవులు
క్షణికమైన,
అస్థిరమైన,
అపవిత్రమైన
ప్రకృతి
తత్త్వంలో
మునిగి
మరింత
మాలిన్యాన్ని
పూసుకుంటున్నారు.
ఇదీ
సత్యమే
అదీ
సత్యమే.
untruth
to
truth
travel
చేస్తున్నాము
అనే
భావము
పెట్టుకోకూడదు.
lesser
truth
to
higher
truth.
రెండు
truthలే.
Truth
is
truth.
సత్యము
సత్యమే.
సత్యమేవ
జయతే.
సత్యమే
జయిస్తుంది.
ఈ
సత్యాన్ని
చేపట్టిన
వ్యక్తులు
దివ్యత్వాన్ని
చక్కగా
అర్థం
చేసుకోగలరుగాని
బాహ్యమైన
దీనిలో
అర్థం
చేసుకోటానికి
సాధ్యం
కాదు.
ఆకారములు
కొంచెం
చిన్నవిగా
పెద్దవిగా
వుండవచ్చు.
కాని
భావతత్త్వము
ఒక్కటే
అనే
సత్యాన్ని
గుర్తించండి.
ఒక
చిన్న
zero
వుండాది.
ఇంకొకటి
పెద్ద
zero
వుంటుండాది.
దానికంటె
పెద్ద
zero
వుంటుండాది.
ఇంకా
యీ
బిల్డింగు
అంత
zero
వుంటుండాది.
ఈ
జీరోల్లోపల
దాని
ఆకారములు
చిన్నవి
పెద్దవేగాని
దాని
వెల
అంతా
ఒక్కటే.
zero
is
zero.
కానీ
దీనికంతా
విలువనిచ్చేవాడు
ఒకడు.
అతడే
హీరో
అతడే
గాడ్.
హీరోను
వదలిపెట్టి
జీరోకు
యిస్తుంటే
మన
జీవితం
జీరో
అయిపోతుంది.
ప్రాకృతమైనదాన్ని
జీరోగానే
మనకు
బోధిస్తున్నాయి.
భూమి
ఎట్లా
వుంది.
జీరోగా
వుంది.
గుండుగా
వుంది.
సూర్యుడెట్లా
వున్నాడు.
జీరోగా
వున్నాడు.
గుండుగా
వున్నాడు.
moon
ఎట్లా
వుంది?
అదికూడను
జీరోగా
వుంటుండాది.
అన్నీ
జీరోగా
వుంటున్నప్పుడు
మన
జీవితం
జీరో
కాదా!
కనుక
యీ
ప్రకృతి
అంతా
కూడను
జీరో.
నాస్తి
నాస్తి
అని
బోధిస్తుంటుండాది.
ఆస్తి
ఒక్కటే.
అదే
దైవత్వం.
దైవమే
మన
ఆస్తిగా
భావించుకుంటే
యింక
నాస్తి
అనేది
ఏనాడూ
మన
చెంత
చేరదు.
విద్యార్థులారా!
విద్యా
ప్రపత్తులచేత
దైవత్వాన్ని
వశం
చేసుకోటానికి
ప్రయత్నించకండి.
ప్రేమ
ఒక్కటి
చేత
మాత్రమే
దైవత్వాన్ని
వశం
చేసుకోటానికి
వీలౌతుంది.
దీనికి
ఒక
చిన్న
కథ
వుంటుండాది.
ఒకానొక
సమయంలో
యమునా
తీరంపైన
విహరిస్తూ
గోపికల
ఆనందమును,
గోపికల
భావములను,
గోపికల
వుత్సాహమును
గుర్తించి
కృష్ణుడు
తనలో
తాను
నవ్వుకుంటూ
పోతున్నాడట.
ఎంత
చిత్తశుద్ధి
కలిగినవారు
గోపికలు.
ఏ
మాత్రం
ఎవ్వరిని
లెక్క
చేయరు.
వాళ్ల
హృదయాలంతా
నా
చిత్తముపైనే
హత్తుకుని
పోయినాయి.
అత్తలు
మొత్తుకున్న
మరి
భర్తలు
కత్తులు
నూరుచున్న
నో
రెత్తరు
కోపగించరు
రచ్చకీడ్చరు
భీతిల
బోరు
గోపికల్
పొత్తములందు
చిత్తరువు
బొమ్మల
రీతిగ
నుండినారు
అన్నాడు
కృష్ణుడు.
పుస్తకంలో
కాగితముపైన
ప్రింటు
వేస్తే
ఆ
ప్రింటు,
కాగితం
రెండూ
ఒక్కటి
ఎట్లైపోతుందో
అదే
విధంగానే
గోపికల
చిత్తము
భగవంతుని
రూపము
రెండూ
ఒక్కటిగానే
అయిపోయినాయి.
11
▾
Meaning
Keep
ఇలాంటి
పరమభక్తులైన
గోపికలు
జగత్తులో
ఎక్కడ
కూడను
కానరారు.
వీరి
ఆనందాన్ని
తలుచుకుంటూ
తలుచుకుంటూ
తనలోని
ఆనందం
బయట
పడిపోయిందట.
ఆనందానికి
ఒక
రూపమున్నది.
కృష్ణుడు
ఎక్కడో
రాధ
అక్కడ.
రాధాకృష్ణులు
ప్రకృతి
పరమాత్మ
స్వరూపులు.
రాధ
ప్రకృతి
స్వరూపిణియే.
రాధ
ధార.
ధరనే
రాధ.
కనుకనే
ఆ
ప్రకృతి
తత్త్వమైన
రాధ
కృష్ణునికి
సమీపములోనే
వున్నది.
ఆ
కృష్ణుని
ఆనందమనే
ప్రేమను
తాను
లోపల
చేర్చుకుందట.
అప్పటినుండి
కృష్ణునికి
ఆనందమే
లేదట.
నా
ఆనందమంతా
రాధలో
చేరిపోయిందని
అప్పటినుండి
యిప్పటివరకు
రాధ
వెంటనే
తిరుగుతున్నాడట,
నా
ఆనందాన్ని
నాకిచ్చెయ్యి
అని.
కనుకనే
భగవంతుని
ప్రేమతత్త్వాన్ని
మనం
ఆరగిస్తే
భగవంతుడు
నీవెంట
వస్తాడు.
నీవు
భగవంతునివెంట
పోనక్కర
లేదు.
అది
సరియైన
భక్తి.
భగవంతుడు
మనవెంట
వచ్చేట్టు
వుండాలి.
తల్లి
కౌగిటికయ్య
తారాడి
తారాడి
ఎలుగెత్తి
పసికూన
ఏడ్చినట్లు
మందలో
మరిగిన
మాతకై
లేదూడ
అంబా
అంబా
అని
అరచినట్లు
విభుని
బాసిన
కాంత
విరహవేదన
సొక్కి
మూలమూలల
దాగి
మూల్గినట్లు
ఈ
విధంగా
భగవంతుని
వియోగానికి
తాళలేక
భగవంతునిపై
అన్ని
విధాల
అర్పితము
చేసి
జీవించాలి.
ఉద్ధవుడు
యిదే
భక్తి
అని
ప్రబోధించాడు.
ఇట్టి
భక్తి
లోకములో
ఎట్టివారియందును
నేను
చూడలేదు,
అనుభవించలేదు
అంటున్నాడు.
విద్యార్థులారా!
భక్తి
ప్రపత్తులంటే
కేవలం
భజన
చేయటము
పూజ
చేయటము
కాదు.
ఇవన్నీ
సత్కర్మల
క్రింద
చేరుతాయి
కాని
భక్తి
క్రింద
చేరదు.
భగవంతుని
ప్రేమ
నిమిత్తమై
మనము
ప్రాకులాడాలి.
ఆ
విధంగానే
మనము
మన
కర్తవ్యాలను
నిర్వర్తించుకుంటూ
మన
చదువులనంతా
కొనసాగించుకుంటూ
మనం
చక్కని
స్థాయిలో
ఉత్తీర్ణులౌతూ
యివన్నీ
కూడను
ప్రాప్తమైన
మార్గములు
అయినప్పటికి
ఈ
మార్గములన్ని
తిరిగి
చేరే
గమ్యం
ఒక్కటే.
‘నదీనాం
సాగరో
గతిః’
అన్ని
నదులు
సాగరంలో
చేరిపోయినట్లుగా
అన్ని
మార్గములు,
అన్ని
విద్యలు
చేరి
ఆధ్యాత్మిక
విద్యలో
లీనం
కావటం.
అందువల్లనే
భగవద్గీతయందు
ఆధ్యాత్మ
విద్యా
విద్యానాం
అన్నారు.
అదే
నిజమైన
విద్య.
విద్యార్థులారా!
ప్రతిదినము
యీ
విధంగా
ప్రబోధించటం
చేత
మీకు
శ్రమ
కలిగిస్తున్నానేమో!
కనుక
రేపటి
నుంచి
యీ
ప్రసంగాలు
మానివేస్తాం.
అందరూ
అంగీకరించినట్టే.
Institute
విద్యార్థులంతా
చక్కగా
గమనించవలసింది.
హయ్యర్
సెకండరీ
స్కూలు
బాయిస్,
ప్రైమరీ
స్కూలు
బాయిస్
హృదయపూర్వకంగా
వారి
ఆశయాలు,
వారి
భావాలు,
వారి
వుద్రేకాలు,
వారి
భక్తి
ప్రపత్తులు
ఎంత
చక్కగా
ఆనందిస్తున్నారో
మీరు
చక్కగా
యోచన
చేసుకోండి.
చిన్న
పిల్లల
హృదయం
నుంచి
చక్కగా
మధురమైన
రీతిగా
నిర్మల
నిశ్చల
భావములతో
పలుకులు
వస్తున్నాయి.
12
▾
Meaning
Keep
దానికి
దీనికి
వ్యత్యాసం
కనబడుతూ
వుంటున్నాది.
అది
art
యిది
heart.
వీరి
heart
నుండి
వస్తుండాది.
ఆ
శ్రీకాంత్
ఆ
చిన్న
పిల్లవాడు
మనసును
కరగించి,
హృదయాన్ని
మురిపించి
ప్రేమను
కరగింపజేశాడు.
భక్తి
ప్రపత్తులు
కూడా
అంతే.
అతను
పాటపాడుతున్నప్పుడు
ఎవరినీ
చూడలేదు.
నేత్రములు
మూసి
హృదయపూర్వకంగా
పాడినాడు.
సంగీత
శాస్త్రములో
ప్రవీణుడనేది
నిరూపిస్తూ
వచ్చాడు.
కర్ణాటక
మ్యూజిక్
తెలుసు.
హిందూస్థానీ
మ్యూజిక్
తెలుసు,
తమిళ్
పాటలు
తెలుసు.
అన్నీ
తెలిసిన
పిల్లవాడు.
చిన్న
పిల్లలుగా
దినమునకొక్క
తూరైనా
మనం
తయారైతే
ఎంతో
అదృష్టవంతులమని
జీసస్
పూర్వం
చెప్పేవాడు.
చిన్న
పిల్లలకు
యేమాత్రము
అది
యిది
భేదభావములుండవు.
వాళ్లకు
నిర్మలమైన
నిశ్చలమైన
భావము
వుంటుంది.
ఏ
రాగద్వేషాలుగాని,
ఏ
మంచిచెడ్డలైనాగాని
తారతమ్యమే
వారికి
తెలియదు.
అలాంటివాడే
రామకృష్ణ
పరమహంస.
ప్రాకృతమైన
విషయాలలో
మన
తెలివితేటలెక్కువున్నాయి.
ప్రతి
దానికి
enquiry.
Is
it
right
or
wrong
is
it
good
or
bad.
దీనిలో
కూర్చుంటాము.
ఇది
కేవలం
ప్రాకృతమైన
గుణము.
ఈ
ప్రాకృతానికి
రజోగుణమే
ప్రధానమైనది.
రజోగుణానికి
సందేహం
అత్యవసరం.
సందేహాలనే
రజోగుణమంటారు.
కాని
నిత్య
సత్యమైన
భగవత్తత్త్వాన్ని
గుర్తించుకోవాలనుకుంటె
నిస్సందేహము
నిర్మల
భావము,
నిస్వార్థ
ప్రేమ
వుండాలి.
అలాంటి
పిల్లలతో
యీ
విధమైన
పవిత్రమైన
వూహలనంతా
అందించుకుంటే
మన
హృదయాలు
కూడను
చక్కగా
చేరిపోతాయి.
విద్యార్థులారా!
క్రమక్రమేణా
మీ
హృదయాలలో
కట్టుకున్న
కరుడును
తీసివేసి
ప్రేమతత్త్వాన్ని
పెంచుకోండి.
అనవసరంగా
దేశదేశముల
వార్తలంతా
తలలో
చేర్చుకునే
బదులు
మీ
హృదయములలో
ప్రేమతత్త్వాన్ని
పెంచుకోండి.
Previous
←
Foster Prema and Share It
Next
Bhakti Is Never Parted from God
→