Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Foster Prema and Share It
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Foster Prema and Share It
24 June 1989, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 29
కనులకగుపించు
దృశ్యంబుకాంచి
మీరు
సత్యమని
ఎంచబోకుడి
సంబరంబున
తెరను
దాగిన
సత్యంబు
తెలిసికొనగ
విశ్రమింపక
నాతోడ
వెడలిరండు.
విద్యార్థులారా!
ఈ
ప్రపంచములో
మానవుడు
తలచునది
ఒకటి
ఫలించునది
మరొకటి.
మానవుడు
తన
జీవిత
సైకతంపైన
నిర్మించుకునే
స్వప్నాల
పిచ్చుక
గూళ్ళను
నేల
రాల్పే
పెనుగాలులు
వుండకపోవు.
రేకలను
విప్పిన
లేతమొగ్గలను
నేలరాల్పు
గాలులు
రాక
మానవు.
మానవ
జీవితము
ఒక
విధమైన
మాలవంటిది.
ఈ
మాలకు
ఒకవైపున
జననము
మరొకవైపున
మరణము.
ఈ
రెండింటి
మధ్య
అనేక
కలలు,
కలతలు,
కల్లోలములు,
నిశ్శాంతి
యీ
విధమైన
పూలచేత
కూర్చబడి
వుంటుంటాది.
కాని
యీ
అన్నింటికి
ఆధారమై
వున్న
దారమును
ఏ
మానవుడు
గుర్తించటం
లేదు.
దారము
లేక
హారము
కాదు.
ఈ
దారమును
గుర్తించిన
వ్యక్తి
మాత్రమే
మానవుడుగా
రూపొందుతాడు.
దానినే
సూత్రమన్నారు.
దానినే
బ్రహ్మ
సూత్రమన్నారు.
కనుక
సర్వమానవులయందు
సమత్వమై
ఒక
విధమైన
శక్తి
సామర్థ్యములనందించే
ప్రధానమైన
దారము
దివ్యత్వమైన
ఆత్మతత్వము.
ఆధ్యాత్మిక
ఖనిజ
సంపత్తికి
ఆలవాలమైన
భారతదేశమందు
అశాంతి
అసత్యము
స్వార్థము
స్వప్రయోజనము
అధర్మము
యిత్యాది
పైశాచిక
ప్రవృత్తులు
విజృంభించి
ప్రళయతాండవము
సలుపుతున్నాయి.
ఇట్టి
తరుణమున
సమాజములో
శాంతి
భద్రతలు
నెలకొల్పుటకు
విద్యార్థులే
సమర్థులని
విశ్వసించి
విద్యాలయములు
స్థాపించాము.
విద్యార్థులారా!
ఎవరిని
మీరు
పౌరులని,
పెద్దలని,
గౌరవనీయులని,
అధికారులని
భావించుచున్నారో
వారందరు
పూర్వము
విద్యార్థులే
అనే
సత్యాన్ని
మీరు
మరువరాదు.
ఈనాటి
విద్యార్థులే
భవిష్యత్తులో
పెద్దలు,
పౌరులు,
అధికారులు,
గౌరవనీయులుగా
రూపొందుతారు.
కనుక
భవిష్యత్తును
దృష్టి
యందుంచుకొని
యీనాటి
వర్తమానము
లోపల
పెద్దల
స్థితిగతులను
ఏ
రీతిగా
మీరు
వర్ణిస్తూ,
నిందిస్తూ
వున్నారో
దీనిని
లక్ష్యమునందు
వుంచుకొని
భవిష్యత్తులో
మీరు
కూడను
మీ
జీవితములను
తీర్చిదిద్దుకొనుటకు
తగిన
కృషి
చేయాలి.
విద్యార్థియొక్క
జీవితము
చాలా
విలువైనది.
జాతి
పౌరసత్వమనే
సౌధమునకు
పునాదుల
వంటిది.
జీవిత
సౌధమనే
దీని
లోపల
సరియైన
స్థితిగతులను
విచారించటానికి
తగిన
అవకాశమిచ్చేది
ఈ
విద్యార్థి
దశ.
మానవుని
సంస్కరింపజేసే
సమాధానమైన
తత్వాన్ని
యీనాడు
విచారించవలసిన
విషయము.
జీవితము
యొక్క
స్థితిగతులను
చక్కగా
విచారించి
దానికి
తగిన
వివేక
విజ్ఞానములను
సంపాదించుకొని
తద్వారా
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అందించవలసినది
విద్యార్థి
జీవితమే
సమాజమును
చక్కబరచవలెనన్న
(సమాజమంటే
మట్టికాదు,
భూమికాదు.
మానవుల
సమూహమే)
మానవకోటి
మధ్య
ప్రేమ
బీజములు
నాటి
సహన
ప్రసూనములు
వికసింపజేసి
శాంతి
పుష్పములు
సమాజమునకందింప
జేసే
స్థితియే
విద్యార్థి
గతి.
2
▾
Meaning
Keep
సంస్కారమనగా
యేదో
ఒక
పరిశ్రమ
కానేరదు.
మానవుని
యందున్న
దుర్బుద్ధులను
వేరుచేసి
సద్భావములను,
సదాచారములను
అభివృద్ధి
పరచుకోటమే.
దురదృష్టవశాత్తూ
యీనాడు
ప్రజలను
సంస్కరింప
జేసే
అధికారము
ప్రభుత్వమునకు
గాని
లేక
ప్రభుత్వమును
సంస్కరింప
జేసే
శక్తిసామర్థ్యములు
ప్రజలకుగాని
లేకపోవటం
చేత
యిన్ని
దురవస్థలకు
గురికావలసి
వచ్చింది.
దీనికి
కారణమేమిటి?
బాల్యమునందే
మన
భవిష్యత్తునకు
అనుగుణమైన
జీవితాన్ని
సరైన
రీతిగా
మార్చుకోలేక
పోవటమే.
లేత
వయస్సునందు
మన
భవిష్యత్తు
జీవితమునకు
తగిన
భద్రతలను
మనము
యీనాడు
పురికొల్పవలసి
వస్తుంది.
భావి
పౌరులుగా
కావలసిన
విద్యార్థులు
యీనాడు
తగిన
వినయ
విధేయతలను
పెంచుకోవలసి
వస్తుంది.
మానవత్వమంటే
యేమిటో
యీనాటి
విద్యార్థులకు
అర్థం
కావటం
లేదు.
డిగ్రీల
నిమిత్తమై
ఎంత
శ్రమపడి
కష్టపడి
సాధించటానికి
ప్రయత్నిస్తున్నామో
దీనికంటె
ఎన్నోయింతలు
మీరు
నీతి
నియమాలను
పోషించుకొని
శ్రమ
పడవలసి
వస్తుంది.
నీతి,
నిజాయతీ
లేకుండా
మానవత్వము
రాణించదు.
దీనికి
నైతిక
ఆధ్యాత్మికములు
అత్యవసరమైనవి.
విద్యార్థులారా!
విద్యావిషయమునందుగాని,
వైజ్ఞానిక
విషయమునందుగాని
మీరు
వెనుక
బడినప్పుడు
మీ
తల్లితండ్రులు
ఎంత
బాధకు
గురౌతారో
దానికంటె
వేయింతలు
నైతిక
ఆధ్యాత్మిక
విషయములందు
వెనుకబడిన
పిల్లలను
చూచి
సాయి
మాత
అంత
బాధపడుతుంది.
మానవ
జీవితమునకు
నైతిక,
ఆధ్యాత్మికములే
నేత్రములుగా
మీరు
భావించాలి.
ఈనాడు
లౌకిక
విద్యలుగాని,
భౌతిక
విద్యలుగాని
మితిమీరి
పెరుగుతున్నవి.
అవి
కూడను
అవసరమే.
కానీ
మానవ
జీవితము
లోపల
వుండవలసిన
ప్రధాన
గుణములు
యీనాడు
మనం
విచారించటం
లేదు.
భౌతికంగా
లౌకికంగా
యీనాడు
మానవ
జాతి
యెంతయో
అభివృద్ధి
పొందినప్పటికి
నైతికంగా
కాని,
నీతినిజాయతీలను
గాని
అభివృద్ధి
గావించుకునేదానికి
తగిన
కృషి
చేయలేకపోతున్నది.
దీనికి
కారణమేమిటి?
తర
తరముల
నుండి
మానవుని
యందు
పాతుకొని
పోయిన
స్వార్థము,
స్వప్రయోజనమే
దీనికి
కారణము.
ఏది
చదివినా,
ఏది
చెప్పినా,
ఏది
విన్నా,
ఏది
చేసినా,
ఏది
చూచినా
ఆ
అన్నింటికి
వెనుక
స్వార్థము,
స్వప్రయోజనము
కదలుతూనే
వున్నది.
స్వార్థము
లేక
మానవుడు
ఒక
అడుగైనా
ముందుకు
నడవటానికి
ప్రయత్నించటం
లేదు.
కేవలము
స్వార్థము
స్వార్థము.
స్వార్థనిమిత్తమే
మనము
జీవిస్తున్నామంటే
సమాజము
యొక్క
గతి
ఏమిటి?
సమాజము
లేక
నీవెక్కడున్నావు?
నీవు
సమాజములో
ఒక
వ్యక్తి.
ఈ
వ్యక్తిత్వమనే
దాని
యొక్క
శక్తిని
సమాజమునకు
పంచవలసిన
బాధ్యత
నీకున్నది.
3
▾
Meaning
Keep
నీ
సుఖము,
నీ
శాంతి,
నీ
అనుకూలము,
నీ
ఆనందము
సంఘము
ద్వారానే
నీవందుకోగలుగుతున్నావు.
నీవీనాడు
పుచ్చుకొనుటకు
సిద్ధముగా
వున్నావుగానీ
నీ
సేవను
యిచ్చుకొనుటకు
యేమాత్రము
సిద్ధముగా
లేకపోతున్నావు.
మానవ
జీవితము
యిచ్చుకోటం
పుచ్చుకోటం
సంబంధ
బాంధవ్యములలో
కూడిన
తత్వమనే
దాన్ని
మీరు
గుర్తించాలి.
ఏ
తల్లితండ్రుల
ద్వారా
నీవింతటి
అభివృద్ధికి
గురైతివో
ఏ
బంధుమిత్రుల
ద్వారా
ఈ
సమాజములో
ఏ
విధమైన
ఆనందమును
నీవు
అందుకోగలిగితివో,
ఏ
గురువులచేత
యీస్థాయికి
నిల్వగలిగితివో
వీటన్నిటిని
మనసునందుంచుకొని
తగిన
కృతజ్ఞతను
అందించటమే
నీ
ప్రధానమైన
కర్తవ్యము.
కానీ
యీనాటి
విద్యార్థులకు
కృతజ్ఞత
అంటే
యేమిటో
తెలియక
పోతున్నది.
మానవుని
ఆనందానందములను
కూడను
యీనాటి
విద్యార్థులు
గుర్తించుకోలేకపోతున్నారు.
ఆనందమనేది
అందమైన
పదార్థముల
యందు
మాత్రం
గుర్తించెదము.
పదార్థములయందు
ఆనందము
యిమిడి
వుండదు.
బయటి
ప్రపంచములో
ఆనందమనేది
మనకు
లభ్యము
కాదు.
ఆనందము
నీయందే
యిమిడివున్నది.
ఆనందము
నీయందే
కూడి
వుంటున్నది.
ఇది
నీ
భావోద్రేకముల
చేత
కలిగే
ప్రతిబింబములే.
ఒక
మెత్తని
పత్తివలె
కనుపించే
పక్షిని
చూచి
కవి
దానిని
అనేక
రకములుగా
వర్ణిస్తాడు.
కాని
అదే
పక్షిని
చూచి
హంతకుడు
దాని
మాంసపు
రుచిని
మాత్రమే
వర్ణిస్తాడు.
మానవుల
అభిరుచులు
వేరువేరుగా
వుండటము
చేతనే
అందము
కూడను
వేరువేరుగా
వుంటుంటాది.
పతికి
దూరమైన
సీతాసతి
అశోకవనములో
ఏకాంతముగా
వుంటున్నది.
అశోక
వనములో
యనేక
విధములైన
ఆకర్షణీయమైన
అందమైన
వస్తువులంతా
రావణుడు
నిర్మించాడు.
ఆ
అశోకవనములోని
వస్తువులు
ప్రపంచములో
ఎక్కడా
లేవని
చెప్పవచ్చును.
అంతటి
ఆకర్షణీయమైన
అందమైన
విచిత్రమైన
వస్తువులుండినప్పటికిని
సీతకు
ఆనందాన్ని
అందించ
లేకపోయినవి.
కనుక
పదార్థముల
ద్వారా
మనకు
ఆనందము
లభ్యమవుతున్నదా?
యిది
కేవలము
కల్ల.
కొంతసేపటికి
అశోకవృక్షము
పైకి
ఆకుల
మరుగున
కూర్చున్న
ఒక
కోతిగానమును
ప్రారంభించినది.
ఆ
గానం
వినబడిన
తక్షణమే
ఏనాడు
తలెత్తి
చూడని
సీతాదేవి
ఆ
వృక్షముపైన
చూచింది.
ఈ
కోతి
ఆమెకు
చాలా
అందంగా
కనుపించింది.
అశోకవనములో
అందమైన
వస్తువులు
యెన్నియో
వుండగా
ఆనందించక
ఆ
కోతిలో
ఆనందించటములో
వున్న
అంతరార్థమేమిటి?
ఆమెకు
ఆనందము
నందించే
రామకథను
పాడటంచేతనే
ఆమెకు
అందంగా
కనుపించింది.
తిరిగి
సీతకొక
సందేహం
ప్రారంభమైంది.
దుష్టుడు,
దుర్మార్గుడైన
రావణుడు
యీవేషములో
వచ్చి
నన్నాకర్షించటానికి
పూనుకుంటున్నాడో
యేమో
అనే
సందేహం
కలిగింది.
హనుమంతుని
నోటి
నుండి
పవిత్రమైన
మాటలు
వెలువడుతూ
వచ్చాయి.
4
▾
Meaning
Keep
శ్రీమద్రవికులమందు
జనించి
సీతాదేవిని
ప్రీతి
వరించి
ప్రేమ
నహల్యా
శాపము
దీర్చి
ప్రియభక్తుల
రక్షించిన
శ్రీరఘు
రామ
రామ
రామ
సీతా,
రామ
రామ
రామ
సీత
ఖర
దూషణులను
దనుజుల
ద్రుంచి
కరుణ
జటాయువు
గతి
సవరించి
శరభంగాది
మునీంద్రుల
బ్రోచి
శబరీ
ఫలములు
ప్రేమ
భుజించిన
రామ
రామ
రామ
సీతా
రామ
రామ
రామ
సీత
ముందుగ
హనుమంతుని
దీవించి,
ముదమలరగ
రవిసుతు
పాలించి
చెండిన
కినుకతో
వాలిని
ద్రుంచి,
చేరిన
వానర
వీరుల
బ్రోచిన
రామ
రామ
రామ
సీత
రామ
రామ
రామ
సీత.
పూర్వము
యీ
హనుమంతుడెవరో
యీ
సీతకు
తెలియదు.
సీత
అశోకవనమునకు
వెళ్లాకనే
రామునికి
హనుమంతునితో
స్నేహం
ప్రారంభమైంది.
కనుకనే
రామునకు
హనుమంతునకు
కలిగిన
సంబంధ
బాంధవ్యముల
గురించి
చక్కగా
గానం
చేస్తూ
వచ్చాడు
యీ
హనుమంతుడు.
అనగా
తానెవరో
తనకు
రామునకు
వుండిన
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమేమిటో
అనే
విషయాన్ని
చక్కగా
ఒక
విజిటింగ్
కార్డు
మాదిరి
సీతకందిస్తూ
వచ్చాడు.
ఈ
విషయమునంతా
విన్న
సీతకు
ఎక్కడలేని
ఆనందము
వుట్టి
పడింది.
దీనిని
బట్టి
మానవునికి
ఆనందమనేది
అందమైన
పదార్థములయందు
కాని
అందమైన
విషయములందుగాని
అందమైన
వ్యక్తులయందుగాని
లభించదని
తేలింది.
మానవుని
యిష్టమునందే
ఆనందం
ఆవిర్భవిస్తుంది.
కానీ
యిష్టము
లేని
దానిపైన
ఆనందము
యేమాత్రము
ఆవిర్భవించదు.
అందము
ఆనందము
నందిస్తుంది.
కనుకనే
అందమె
ఆనందం
ఆనందమె
జీవిత
మకరందం.
అన్నారు.
ఈనాడు
ఆనందము
కోరే
మానవునికి
కావలసినది
యేమిటి?
అందములు
కావు
ఆనందమనేది
తనయందే
యిమిడి
వుంటున్నది.
తనయందున్న
ఆనందాన్ని
ఆవిర్భవింపజేసుకోటానికి
అంతర్దృష్టిని
అభివృద్ధి
పరచుకోవాలి.
విద్యార్థులారా!
నిరంతరము
మనం
బహిర్దృష్టిని
మాత్రమే
బలపరచుకుంటూ
పోతున్నాము.
ఏ
ఆనందముగాని
సుఖముగాని,
సంతోషముగాని
మన
నుండియే
వెలువడుతున్నది
కాని
బయటునుండి
మనలో
ప్రవేశించటం
లేదు.
మనము
చూచుచున్న
ప్రతి
దృశ్యము
మనలోనున్న
ప్రతిబింబములే.
Reflection
of
inner
being.
దీని
తత్వాన్ని
గుర్తించుకోటానికి
మనలోపల
పవిత్ర
భావాలను
అభివృద్ధి
పరచుకోవాలి.
పశ్యతీతి
పశుః
అన్నారు.
బయటి
దృష్టి
కలిగినది
పశువు.
మనం
అంతర్దృష్టిని
అభివృద్ధి
గావించుకోవాలి.
మానవుని
యందు
ఒక
విధమైన
దివ్యశక్తి
యిమిడివుంది.
ఆ
యిమిడి
వున్న
దివ్యశక్తిని
మనము
వెలుపలకు
తీసుకోవాలి.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఈనాడు
బి.ఎ.,
ఎం.ఎ.,
బి.కామ్.,
ఎం.కామ్.
చదివి
యింత
వున్నత
స్థితికి
వచ్చారు.
ఇవన్నీ
కూడను
గ్రంథమూలకముగా
పరిచయమైనవేగాని
అన్ని
మనయందే
వుంటున్నవి.
5
▾
Meaning
Keep
తనయందు
ఆ
దివ్యశక్తియే
లేకపోయినప్పుడు
ఈ
గ్రంథములను
యేరీతిగా
మనం
పఠించగలం?
ఆ
దివ్యశక్తియే
ఈ
గ్రంథములను
పఠింపచేస్తూ
వచ్చింది.
ఆ
దివ్యశక్తిని
మనం
యీనాడు
పోషించుకోవాలి.
స్వార్థపరులు
దీనిని
తమ
నిమిత్తము
తమ
కుటుంబ
నిమిత్తము
తమ
స్వప్రయోజన
నిమిత్తము
ఉపయోగపెట్టుకొని
అనర్థం
గావిస్తున్నారు.
లోక
కళ్యాణము
నిమిత్తమై
మీరు
దీన్ని
అనుభవించాలి.
‘సర్వలోక
హితే
రతః’.
లోక
హితాన్ని
మాత్రము
కోరి
యీ
శక్తిని
మనము
వినియోగపెట్టాలి.
సర్వజ్ఞానోప
సంపన్నః’
ఈ
విధమైన
జ్ఞానమును
సర్వమును
అనుభవించి
జగత్తుకే
వినిపించి
తద్వారా
వినియోగ
పరచుకోవాలి.
‘సద్గుణములు
పోషించుకునే
నిమిత్తమై
మనము
యీ
శక్తిని
అభివృద్ధి
చేసుకోవాలి.
సద్గుణములే
లేకపోతే
యీ
చదువులన్నీ
వ్యర్థము.
సద్గుణములే
యీ
చదువునకు
ప్రధానము.
ఈ
గుణములు
పోషించుకొనే
నిమిత్తమై
సంస్కారములు
అత్యవసరము.
ఈ
సంస్కారము
నిమిత్తమే
ఆధ్యాత్మికంలో
ప్రవేశించాలి.
నైతిక
విలువలు
పెంచుకోవాలి.
నైతిక
విలువయే
లేకపోతే
పశు
జీవితాన్ని
గడిపిన
వారమవుతాము.
ఎంత
ధనము
వుండి
యేమి
ప్రయోజనము?
ఎంత
ధనమున్న,
ఎంత
బలమున్న
ఏమి
ప్రయోజనము?
ఇది
గౌరవనీయమని
లోకము
భావించవచ్చునే
తప్ప
ఎవ్వరూ
నిన్ను
ప్రేమించలేరు.
మనలను
అందరు
ప్రేమించు
రీతిగా
సద్గుణాలను
పోషించుకోవాలి.
గౌరవము
కంటె
ప్రేమ
చాలా
ప్రధానమైనది.
గౌరవం
లోక
సంబంధమైన
మర్యాద.
ప్రేమ
హృదయ
సంబంధమైనది.
విద్యార్థులారా!
మీరు
పేరు
ప్రతిష్ఠలకై
ప్రాకులాడకుండా
ప్రజల
ప్రేమను
మాత్రమే
అందుకొనే
నిమిత్తమై
జీవితాన్ని
గడపండి.
ఈ
గౌరవములన్నీ
కృత్రిమములైనవే.
ముందు
వచ్చినపుడు
నమస్కారమనవచ్చును.
వెనుకకు
పోయి
వానిని
దూషించవచ్చు.
ఇది
కాదు
మనము
సంపాదించవలసినది.
సత్ప్రవర్తనము
చేతనే
ప్రేమ
మనకు
ప్రాప్తించుతుంది.
మంచి
నడతలు
అభివృద్ధి
పరచుకోవాలి.
నడతల్లో
లేనిది
మనకు
గ్రంథములలో
లభించదు.
వినయ
విధేయతలు
విద్యకు
అత్యవసరమైనవి.
గొప్ప
చదువు
చదివితినని
గర్వించుకుంటే
నీ
గర్వము
అధఃపతనము
గావిస్తుంది.
ఏ
వైద్యమునకు
నయముగాని
రోగము
మానవుని
యందు
అహంకారమే.
ఈ
అహంకారమనే
రోగము
మనలో
ప్రవేశిస్తే
యేమాత్రము
అభివృద్ధికి
రాలేము.
విద్యార్థులారా!
అన్నియు
తెలిసినప్పటికిని
తెలియనివానివలె
మనం
నటించాలి.
అనేక
పర్యాయములు
చెప్పాను.
భగవత్తత్వమునకును
మానవత్వమునకును
వుండిన
వ్యత్యాసమిదియే.
సర్వము
తెలిసినప్పటికిని
భగవంతుడు
ఏమి
తెలియనివాడుగా
వుంటాడు.
ఏమి
తెలియకపోయినా
మానవుడు
అన్నీ
తెలిసిన
వాడుగా
విఱ్ఱవీగుతాడు.
అన్నీ
వుండియు
ఏమి
లేనివానివలె
కనుపిస్తాడు
భగవంతుడు.
ఏమీ
లేనప్పటికిని
అన్నీ
వున్న
వానివలె
నటిస్తాడు
యీ
మానవుడు.
ఈ
ఆడంబరమునకు
అలవాటు
పడటం
చేతనే
మానవత్వము
దిన
దినమునకు
దిగజారి
పోతుండాది.
6
▾
Meaning
Keep
His poems 68
Also in his talks
(16)
7 February 1980
Be human
19 February 1987
When the jīva is joined with God, he becomes the very form of akṣara
20 March 1988
Bhārat is the home of Satya and Dharma
17 February 1990
Prema itself is God
21 May 1990
The Moving Temple
14 August 1990
Role of the Avatars
12 February 1991
Goodness is the principle of God
29 May 1991
Prasnopanishad - Answers To The Sixth Student
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
22 June 1996
Service to Society Is the Mark of True Humanness
11 July 1996
Lack of Values is the Cause of Violence in the World
22 April 1998
The Puṣṭi, Samiṣṭi and Pravāha Jīvas
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
8 October 1998
Good Resolves Are Themselves the Human Values
1 January 2000
Virtue is the adornment of man
ఈ
ఆడంబరము
మనకు
పనికిరాదు.
మనకు
ఆచరణ
అత్యవసరము.
ఆకార
మానవుని
చేత
లోకానికి
యేమాత్రము
ఫలము
లభించదు.
ఆచార
విచారములు
కలిగి
వుంటుండాలి.
ప్రతి
ఒక్క
విషయమును
మనము
ఆచరణలో
పెట్టాలి.
అప్పుడే
మన
మానవత్వము
దివ్యత్వంగా
మారిపోతుంది.
దేవుడనగ
వేరు
దేశమందున
లేడు
దేవుడలరు
తనదు
దేహమందె
పాపమనగ
వేరు
పరదేశమున
లేదు
తాను
చేయు
పనుల
తగిలియుండు.
కనుక
పాపము
పుణ్యము
పరదేశము
నుంచి
మనకు
సప్లైకావు.
లేక
మన
friends
gift
యివ్వరు.
మరే
షాపులోను
కొనుక్కోటానికి
సాధ్యంకాదు.
మంచిగాని
చెడ్డగాని,
దుఃఖముగాని,
ఆనందముగాని
మనం
చేసే
పనుల
నుండే
ఆవిర్భవిస్తున్నాయి.
కనుకనే
నీవు
మంచిని
చేసి
మంచిని
చూచి
మంచిగా
వుండి
మంచిగా
జీవించు.
ఈ
ఆనందమనేది
మనకు
మంచిపనుల
ద్వారానే
లభ్యమౌతుంది.
ఇదియే
భగవంతుని
దగ్గరకు
సరియైన
మార్గము,
రాజబాట.
జనసేవ
చెయ్యాలి.
నీకు
నీవు
ప్రశ్న
వేసుకోవచ్చు
What
is
the
way
to
God.
అనే
ప్రశ్న
వేసుకుంటే
The
best
way
to
Love
God
is
to
serve
all.
యిదే
జవాబు.
కానీ
యీనాడు
యింత
విశాలమైన
ప్రేమగాని
యింత
విశాలమైన
సేవకాని
ఏ
మానవునియందు
కానరావటం
లేదు.
మన
సంస్థ
విద్యార్థులైనా
దీనికి
కొంతవరకు
తోడ్పడి
చేదోడు
వాదోడుగా
పూనుకుంటారని
ఆశ
చేతనే
యీ
Institute
స్థాపించాము.
విద్యార్థులారా!
విద్యావిషయములో
మీకెంత
శ్రద్ధాభక్తులు
కలవో
అంతకంటె
అధికముగా
దైవవిషయమునందు
శ్రద్ధా
భక్తులు
పోషించుకోండి.
ఈనాడు
ప్రపంచములో
ఎంత
మంది
విద్యావంతులుంటున్నారు.
ఎంతోమంది
మేధావులుంటున్నారు.
తెలివితేటలు
గలిగిన
వారెందరో
వుంటున్నారు.
కానీ
దేశమునకు
శాంతి
భద్రతలు
యివ్వలేక
పోతున్నారు.
కారణమేమిటి?
ఈ
మేధాశక్తులు,
ఈ
విద్యాశక్తులు
ఈ
తెలివితేటలు
తమకుతాము
అభివృద్ధి
గావించుకొనుటకై
వుపయోగపెడుతున్నారే
గాని
‘లోకాస్సమస్తా
సుఖినో
భవంతు’
అనే
విశాల
హృదయం
లేకపోవటమే
కారణం.
తన
శరీర
మానసిక
బుద్ధి
శక్తులు
తన
నిమిత్తమై
యేవిధంగా
వుపయోగపెడుతున్నాడో
సమాజ
నిమిత్తము
కూడను
ఈ
శరీర
మనో
బుద్ధి
శక్తులను
ఉపయోగపెట్టాలి.
భారతదేశమందే
కాక
యితర
దేశములయందు
కూడను
గొప్ప
గొప్ప
విద్యావంతులున్నారు.
కానీ
వారంతా
కేవలము
విద్యావంతులుగా
రూపొందుతున్నారేగాని
జ్ఞానులని
చెప్పటానికి
సాధ్యము
కాదు.
జ్ఞానికి
విద్యావంతునికి
వున్న
వ్యత్యాసమేమిటో
మీకు
చెప్పాను.
7
▾
Meaning
Keep
His poems 48
Also in his talks
(10)
21 June 1973
The Closing Message of the Summer Classes
11 October 1986
God belongs to all
28 December 1986
The students are the nation's wealth and riches
3 October 1989
Honour the Vedas
3 September 1990
Devotion and self-sacrifice
30 May 1991
Taittireya Upanishad
22 November 1996
Along with Study, Saṁskāra Too Is Very Necessary
14 January 1998
Satya is heaven
22 November 2000
That Which Makes Oneness Known Is True Education
2 June 2003
That is education which liberates
రాముడు
34
విద్యలు
చదువుకున్నాడు.
రావణుడు
64
విద్యలు
చదివాడు.
కాని
రావణుడు
మూర్ఖుడు
అన్నాడు
వాల్మీకి.
‘రావణో
నామ
మూర్ఖోఽసౌ
అన్నాడు.
రావణుడు
మూర్ఖుడు.
రాముడు
జ్ఞాని.
అన్నాడు.
అతను
జ్ఞాని
కావటానికి
యితను
మూర్ఖుడు
కావటానికి
ఏం
చదువులో
తక్కువనా.
ఇన్ని
చదువులు
చదివిన
రావణాసురుడు
ఇంద్రియాలకు
వశమైపోయాడు.
కనుకనే
మూర్ఖుడై
పోయాడు.
రాముడు
యింద్రియాలను
నిగ్రహించాడు.
అందువల్లనే
జ్ఞాని
అయ్యాడు.
కేవలము
మేధాశక్తి
కలిగినవాడు
కాదు
జ్ఞాని.
ఇంద్రియ
నిగ్రహము
కలిగినవాడే
జ్ఞాని.
హిరణ్యకశిపుడు
ఎన్ని
రకములుగానో
విద్యార్థియైన
ప్రహ్లాదునికి
బోధించాడు
హిరణ్యకశిపుడు
చదివినంత
చదువు
అతనికి
వున్న
శక్తి
సామర్థ్యములు
మరొకనికి
లేవు.
ఈనాడు
సైంటిస్టులంతా
ఏయే
పరిశోధనలు
చేశారో
దానికంటె
నూరింతలు
అధికంగానే
పరిశోధనలు
చేసినవాడు
హిరణ్యకశిపుడు.
జలములో
ప్రవేశించి
పరిశోధనలు
చేశాడు.
సమస్త
శక్తులు
హస్తగతం
గావించుకున్నాడు.
పంచభూతములను
తన
హస్తములో
పెట్టుకొని
ఆటలాడుకున్నాడు.
ఇన్ని
తెలిసిన
హిరణ్యకశిపుడు
తన
యింద్రియాలకు
లోబడిపోయాడు.
బైట
శక్తులు
ఎన్ని
సాధించి
ప్రయోజనమేమిటి?
చంద్ర
మండలము,
సూర్య
మండలము,
మిల్కీవే
అవి
యివి
ఎన్నో
వేస్
మీరు
చూస్తున్నారు.
తనయందున్న
మూర్ఖత్వాన్ని
తాను
పోగొట్టుకో
లేకపోతున్నాడు.
తనయందున్న
బలహీనతను
తాను
సాధించ
లేకపోతున్నాడు.
ఎన్ని
విద్యలు
నేర్చి
ఏమి
ఫలము
తన
నొసటి
వ్రాత
తప్పించ
నెవరి
తరము
చెడ్డ
భావము
తన
తల
చేరెనేని
ఎండ
బారును
బుద్ధులు
బెండు
బారు.
మన
తలలోపల
చెడ్డ
భావములు
రాకుండా
చూచుకోవాలి.
అవి
మనలో
వచ్చినప్పుడు
ఎంత
చదువు
చదివికూడను
వాడు
వ్యర్థమైన
వాడే.
Knowledge
అనునది
మనలో
వుండినప్పుడు
మనము
ఆచరణలో
పెట్టాలి.
knowledge
without
action
is
useless.
అన్నారు.
Action
without
Knowledge
is
foolish
అన్నారు.
మనమీనాడు
foolish
అయిపోతున్నాము.
knowledge
వుంటుండాది.
కాని
action
లేదు.
action
వుంటుండాది
knowledge
లేదు.
ఈ
రెండిటికి
పొత్తు
కుదరాలి.
అందువల్లనే
చిన్న
పిల్లవాడైన
ప్రహ్లాదుడు
తండ్రికి
బుద్ధి
చెబుతూ
‘లోకములన్నియున్
గడియలోన
జయించినవాడవు
తండ్రి,
యింద్రియానీకము
చిత్తమున్
గెలువ
నేరవు’
అన్నాడు.
ఏమిటి
నీవు
సాధించింది?
ప్రపంచాన్నంతా
సాధించానని
అనుకుంటున్నావు.
నీలో
వుండిన
యింద్రియాలనే
నీవు
సాధించలేకపోతున్నావు.
ఇది
కాదు.
లోకాన్ని
సాధిస్తే
నీవు
రాజువు
కావచ్చు.
నీ
ఇంద్రియాలను
నీవు
సాధిస్తే
మహారాజు
కావచ్చు.
రాజులకు
రాజు
మహారాజ
రాజా
నీ
యింద్రియములే
నీ
శతృవులు.
8
▾
Meaning
Keep
Also in his talks
(8)
6 November 1989
Faith in Yourself Is Faith in God
1 March 1990
To seek out the path is the noble wisdom
1 June 1991
Spiritual Discipline (sadhana)
1 April 1995
Make God your true friend
25 June 1996
Man's Own Conduct Is the Cause of His Joys and Sorrows
16 August 1996
‘Love all, worship all’
1 September 1996
Human Life, Which Begins with Food, Must End in Ānanda
22 August 2001
Vināyaka is the embodiment of all the gods
‘లోని
శతృవులకు
లొంగిపోయినవాడు,
బయటరిపుల
నెట్లు
పట్టగలడు’.
మనము
లోని
శతృవులకే
లొంగిపోతున్నాము.
బయటు
శతృవులను
యేమాత్రం
పట్టలేము.
మొట్టమొదలు
లోని
శతృవులను
మనం
నెట్టి
వేయాలి.
దీనికి
తగిన
మార్గము
ఆధ్యాత్మిక
మార్గమొక్కటే.
ఆధ్యాత్మిక
మార్గములో
మనము
సులభముగా
యింద్రియాలను
జయించవచ్చు.
ఇంద్రియములను
సాధించలేని
విద్యలు
ప్రయోజనం
లేని
విద్యలే.
కేవలము
పొట్టకూటి
నిమిత్తమై
మనము
పాటుపడుతున్నాము.
కృషి
కూటి
కోసం.
విద్య
విజ్ఞానం
కోసం.
విద్య
కూటి
కోసం
కారాదు.
కానీ
యీనాటి
education
అంతా
పొట్టకూటి
కోసమే.
జానెడు
పొట్ట
నింపుకొన
చిక్కుల
నొందుచు
కోటి
విద్యలన్
పూనిక
మీద
నేర్చి
పరిపూర్ణ
సుఖంబుల
పొందలేక
యీ
మానవ
జాతి
దుఃఖముల
మ్రగ్గగ
నేటికి
శ్రీపరాత్పరున్
ధ్యానము
చేయు
భక్తులకు
దారిని
చూపక
యున్నె
మానవా.
పుస్తకముల్
పఠించితిని,
పూర్తిగ
జూచితి
సర్వ
శాస్త్రముల్
నిస్తులమైన
విద్యలను
నేర్చితి
నంచును
గర్వమేల
నీ
హస్త
యుగంబు
మోడ్చి
పరమాత్ముని
భక్తి
భజింపవేని
యీ
ప్రస్తుత
విద్యలన్నియును
భ్రాంతి
నిరర్థకముల్
గద
ధాత్రి
మానవా
నిద్దుర
నుండి
లేచి
మరి
నిద్దుర
పోయెడుదాక
పొట్టకై
హద్దును
పద్దును
లేక
వ్యయమందగ
జేయుచు
జీవితంబు
నీ
విద్దెల
ధారపోసి
యరవింద
దళాక్షుని
విస్మరించి
యే
పెద్ద
సుఖంబు
నొందితివో
ప్రీతిగ
యోచన
చేయు
మానవా!
తెల్లవారి
మొదలు
రాత్రి
పరుండునంతవరకు
మధ్య
మధ్య
పానీయం
సమర్పయామి.
పొట్ట
నిమిత్తమై
ఎంతనో
మనం
ప్రాకులాడుతున్నాము.
కాని
మనము
సాధించినది
ఏమిటి?
మనము
ఏ
పొట్ట
నిమిత్తమై
ప్రాకులాడుతున్నామో
పశు,
పక్షి
మృగాదులు
కూడను
అదేవిధముగానే
ప్రాకులాడుతున్నాయి.
అవే
యింకా
మేలు.
ఇంక
ప్రత్యేకంగా
విద్య
నేర్చి
ప్రయోజనమేమిటి?
ఆ
మృగములు
యే
యూనివర్సిటీకి
పోయినాయి?
ఏ
డిగ్రీలు
తీసుకున్నాయి?
ఏ
విదేశాలకు
వెళ్లుతున్నాయి.
ఇవన్నీ
యేమి
చేయటం
లేదు.
కాని
మానవుడనే
వానికి
ప్రత్యేకమైన
విజ్ఞాన
ప్రజ్ఞాన
సుజ్ఞానములను
పోషించుకునే
నిమిత్తమై
విద్య
అవసరమే.
ఇవన్నియూ
నేర్చి
విచక్షణా
జ్ఞానాన్ని
పూనాలి.
ఈ
discrimination
లోపల
కూడను
సక్రమమైన
వివేకముతో
discrimination
కావాలి.
ఈనాడు
discrimination
power
చాలా
ఎక్కువగానే
వుంటున్నది.
ఈ
విజ్ఞానము
బాగా
పెరిగి
పోతుండాది.
కాని
వివేకము
శూన్యమైపోతూ
వస్తుండాది.
విజ్ఞానమునకు
తగిన
వివేకము
కూడా
వుండినప్పుడే
విజ్ఞానాన్ని
సద్వినియోగము
చేయవచ్చు.
9
▾
Meaning
Keep
వివేకమే
లేకపోతే
విజ్ఞానము
నిరర్థకము.
ఇది
యేరీతిగా
వుపయోగపెట్టాలి.
అనేక
రకములుగా
వుపయోగపెడుతూ
గొప్ప
గొప్ప
బాంబులన్నీ
తయారు
చేస్తున్నారు.
ఆటంబాంబులని,
న్యూక్లియర్
బాంబులని
యింకా
ఏమేమో
తయారు
చేస్తున్నారు.
ఇవన్నీ
తయారుచేసి
మనము
ఏమి
చేయగలుగుతున్నాము?
ఒక్క
క్షణము
లోపల
దేశములంతా
భస్మము
గావిస్తున్నాము.
ఇది
వివేకము
లేని
విజ్ఞానము.
అదే
వివేకముతో
యీ
విజ్ఞానాన్ని
పోషించుకున్నప్పుడు
ఆ
అణుశక్తినంత
కూడను
అభివృద్ధి
పరచి
దేశము
లోపల
అనేక
విధములైన
ఉత్పత్తులను
అభివృద్ధి
గావించవచ్చు.
తిండి
కావాలి.
పదార్థాలు
కావాలి.
ప్రజలకు
వుపయోగపడే
అనుకూలములు
ఎన్నో
మనం
చేసుకోవచ్చు
కదా!
కీడు
కీటకమైనా
చేస్తుంది
మేలు
మహేశుడైనా
చేయలేడు.
బాంబులు
వేసి
చంపటమా
గొప్పతనము?
ఒక్క
మనిషినైనా
బ్రతికించటానికి
ప్రయత్నం
చేయి
ఇది
వివేకముతో
కూడిన
విజ్ఞానము.
విద్యార్థులారా!
మీ
సైన్సు,
మీ
విజ్ఞానము
ఎంతవరకైనా
అభివృద్ధి
చేసుకోవచ్చు.
తప్పుకాదు.
అన్నింటిని
తెలుసుకో.
అదే
ఎవేర్నెస్
యీజ్
లైఫ్.
తెలుసుకోటంలో
తప్పు
లేదు.
కాని
తెలుసుకున్న
దానిని
యేది
నిత్యము
యేది
అనిత్యము
ఏది
సత్యము
ఏది
అసత్యము
అని
విచారణ
చేసి
సత్యాన్ని
నీవు
ఆచరించు.
ఒక
చిన్న
ఉదాహరణము.
చూడండి.
ఈ
విద్యవల్ల
యేర్పడిన
సంకుచితత్వము.
ఈనాటి
విద్యార్థులు
సంకుచితమైన
స్థితిలో
అభివృద్ధి
గాంచుతున్నారు.
ఇక్కడ
రెండు
రకములైన
కుటుంబాలుంటున్నాయి.
న్యూక్లియస్
కుటుంబమని
ఒకటి
సమూహమనే
కుటుంబము
ఒకటి
వుంటున్నాది.
ఈ
న్యూక్లియస్
కుటుంబములో
అమ్మ
నాన్న
బిడ్డ
కొడుకు
అంతే.
ఈ
న్యూక్లియస్
కుటుంబము
చాలా
narrow.
సామూహిక
కుటుంబము
తల్లి,
తండ్రి,
బిడ్డ,
కొడుకు,
తాత,
అవ్వ,
ముత్తాత
వీరందరు
చేరినటువంటిది.
ఈనాడు
ఏమైపోయింది
న్యూక్లియస్
కుటుంబము
లోపల
అమ్మనాన్నలు
ఆఫీసుకు
పోతారు.
బిడ్డలను
ఆయా
దగ్గరనో,
డ్రైవరు
దగ్గరనో,
ప్యూన్
దగ్గరనో
విడిచిపెడతారు.
ఈ
పిల్లలకంతా
ఆయా
బుద్ధులు,
డ్రైవరు
బుద్ధులు,
ప్యూన్
బుద్ధులు
వస్తుంటాయి.
వీళ్లు
దమ్మిడీకి
పనికి
రాకుండా
పోతున్నారు.
ఏదో
డబ్బులిచ్చేసి
చదివిస్తుంటారు.
వీడు
ఏంచేస్తున్నాడు
ఎక్కడకు
పోతున్నాడు
ఎట్లా
పెరుగుతున్నాడు
అనే
విచారం
తల్లితండ్రులకే
మాత్రం
పట్టటం
లేదు.
ఈ
సామూహిక
కుటుంబము
లోపల
ఎట్లా
వుంటాదంటే
అమ్మానాన్నలు
ఆఫీసుకు
పోయినాగాని
అవ్వాతాతలు
యింటిలో
వుంటారు.
ఈ
తాతలు,
అవ్వలు
వాళ్లకు
మంచినంతా
బోధిస్తూ
యేవో
కథలు
చెప్పుకుంటూ
సరైన
అభివృద్ధికి
తగిన
ఉపదేశాలు
చేస్తూ
వుంటారు.
ఒకవేళ
అమ్మనాన్నలు
పోట్లాడితే
న్యూక్లియస్
కుటుంబములో
వారికి
దిక్కులేదు.
ఎవరు
చెప్పేవారు
కూడ
వుండరు.
ఈ
సామూహిక
కుటుంబములో
ఏమౌతుంది?
వాళ్ల
అత్తమామలు
వుంటారు.
లేక
తల్లితండ్రులుంటారు.
వాళ్లొస్తారు.
ఏమిట్రా
నాయనా
యిట్లా
చేస్తున్నావు
యిది
మంచిది
కాదు
యిట్లా
చేయకూడదని
బుద్ధులు
చెప్తుంటారు.
ఈనాడు
joint
family
పతనమై
పోయింది.
తమ
familyనే
పతనం
చేసుకుంటున్న
వాళ్లు
యింక
ప్రపంచము
యొక్క
విశాలమైన
బుద్ధి
వారికెక్కడ
నుండి
వస్తుంది.
10
▾
Meaning
Keep
Also in his talks
(18)
10 July 1988
To be happy here, hematāraka vidyā; to be happy hereafter, Brahma vidyā
3 October 1989
Honour the Vedas
20 February 1992
Man, thinking he is the body, is drifting away from Ānanda
12 July 1996
Namasmarana is the Greatest Sadhana in the Kali Yuga
19 October 1996
When the Home Is Set Right, the World Is Set Right
21 October 1996
In God's Creation Everything Is Pure!
14 January 2000
Give up attachment to the body and serve the country!
4 March 2000
The Ātma: The Five Kośas
10 September 2000
God is within you
4 July 2001
Study the learning that knows no death
9 October 2001
God in human form
22 November 2001
True education brings the wealth of character
12 March 2002
The worship of God protects the nation
6 May 2002
He Who Makes His Parents Happy Is the True Son
1 January 2003
Only service done with the feeling of the one Ātma is true service
12 November 2003
Grow Prema for God and pity for the helpless
30 March 2004
If you remember the name of Rāma, neither attachment nor disease will cling to you
13 August 2006
For the young, mastery of the senses comes first
తల్లితండ్రులనే
లెక్క
చేయటం
లేదు.
ఇంక
లోకాస్సమస్తా
సుఖినో
భవంతు
కేవలం
గాలి
వార్తలు.
మొట్టమొదట
మనం
న్యూక్లియస్
కుటుంబమును
విశాలం
చేయాలి.
జాయింటు
ఫ్యామిలీగా
వుండాలి.
ఈ
జాయింటు
ఫ్యామిలీ
లోపల
యెంతనో
మనకు
అభివృద్ధి
వుంటుండాది.
ఎంతనో
ఉత్తమమైన
మార్గాలున్నాయి.
ఎంతనో
వుత్తమమైన
బుద్ధులు
అభివృద్ధి
అవుతాయి.
ఈ
joint
family
గౌరవ
మర్యాదలకు
పాటుపడుతూ
వచ్చింది
ఆనాడు.
ఈనాటి
న్యూక్లియర్
family
యేమి
ప్రయోజనం
లేదు.
కేవలం
ఆడంబరాలు
Twinkle
Twinkle
little
star
how
I
wonder
what
you
are
యిది
మనం
చూపిస్తుండేది.
ఈ
వేషాలచేత
జగత్తునంతా
మోసం
చేస్తున్నారు.
ఇది
కాదు
మనం
నేర్చవలసినది.
మన
సమాజమును
మనం
చక్కబరచుకోవాలి.
మన
దేశాన్ని
మనం
చక్కబరచుకోవాలి.
మన
కుటుంబాన్ని
మనం
చక్కబరచుకోవాలి.
ఎవరికి
వారు
వారి
వారి
కుటుంబాలను
సమాజాన్ని
చక్కబరచుకుంటే
దేశమెంత
సులభంగా
చక్కబడుతుంది.
ఈనాడు
కుటుంబ
విషయమై
వీరికే
మాత్రము
బాధ్యత
లేదు.
విద్యార్థులారా!
మొట్టమొదట
మీరు
మీ
కుటుంబాన్ని
పోషించుకోండి.
మీ
కుటుంబాన్ని
మీరు
గౌరవంగా
నిలబెట్టుకోండి.
మొట్టమొదట
మీ
తల్లితండ్రులను
సంతృప్తి
పరచండి.
ఆ
శక్తియే
మీలో
లేనప్పుడు
ఎన్ని
విద్యలు
చదివి
యేమి
ప్రయోజనం?
చదువులన్ని
చదివి
చాల
వివేకియై
మగిడి
తన్నెరుగడు
మందమతుడు
ఎంత
చదువు
చదివి
ఏ
రీతి
వున్నను
హీనుడవ
గుణంబు
మానలేడు.
తరచి
చదువు
చదవ
తర్కవాదమె
గాని
పూర్ణ
జ్ఞానమెపుడు
పొందలేడు
చదువు
చదువు
చదివి
చావంగనేటికి
చావు
లేని
చదువు
చదవ
వలయు.
ఎంఏలు
బియేలు
ఏర్పడ
జదివియు
పేరుగాంచిన
పెద్ద
వారలైన
సంపదలుండియు
సద్దాన
పరులైన
పుడమి
కీర్తినిగన్న
పుణ్యులైన
ఆయురారోగ్యంబు
లనవరతముండి
పరిపూర్ణబలులగు
వారలైన
సతతమ్ము
జపములు
తపములు
చేయుచు
వేదమ్ములన్నట్టి
విప్రులైన
సాటి
రారు
భక్తులకు
ఏనాటికైన.
11
▾
Meaning
Keep
దైవభక్తియే
లేకపోతే
యివన్నీ
నిష్ప్రయోజనం.
పిల్లవాడు
అన్నిట
అందంగానే
వున్నాడు.
కనులు
చూస్తే
చుక్కలవలె
వుంటున్నాయి.
ముక్కు
చూస్తే
రత్నంగా
కనుపిస్తున్నాది.
కాళ్లు
చేతులు
చూస్తుంటే
చక్కగా
వుంటున్నాయి.
అన్ని
అంగాలకు
తగిన
కొలతలంతా
వున్నాయి.
కేవలము
ప్రాణమొకటి
లేదు.
అలాంటివే
మన
యీనాటి
చదువులు.
అన్నీ
వుంటున్నాయి.
ఎమ్ఎలు
పాస్
చేశాము.
ఎంబిఎలు
పాస్
చేశాము.
పి.హెచ్
డిలు
పాస్
చేశాము.
అంతా
పాస్
చేశాము.
గుణం
లేకపోతే
ఏమి
ప్రయోజనం.
గుణములు
మనం
పోషించుకోవాలి.
ఆ
గుణములే
లేకపోతే
ఏమీ
ప్రయోజనం
లేదు.
చెవిటి
వానికి
సంగీత
శాస్త్రమేల?
చెవిటివానికి
ఎంత
సంగీతం
చెప్పి
ఏమి
ప్రయోజనం?
ఆ
విధంగానే
మన
శాస్త్రములు,
మన
ఉపనిషత్తులు
గుణములేనప్పుడు
ఎన్ని
చదివినప్పటికి
గొప్ప
పండితుడని
పేరు
పెట్టుకున్నప్పటికిని
ప్రయోజనం
లేదు.
విద్యార్థులారా.
ఎన్ని
చదువులైనా
చదువుకోండి.
భగవద్విశ్వాసము
మాత్రం
పెట్టుకోండి.
ఆ
విశ్వాసం
లేక
మనిషే
కాదు.
Truth
అనేదే
God.
Love
అనేదే
God.
కనుక
యీ
truthను
మీరు
సరైన
మార్గములో
అనుసరించండి.
మీ
చదువులయందు
ఎంత
వుత్తీర్ణులైనప్పటికి
ఎంత
గొప్ప
గొప్ప
పేరు
ప్రతిష్ఠలు
సంపాయించుకున్నప్పటికి
హృదయ
సంబంధమైన
నైతిక
విలువలు
మాత్రం
పోగొట్టుకోకూడదు.
కనుక
భగవన్నామస్మరణ
చేత
సాధ్యమైనంత
వరకు
పరోపకార
సంబంధమైన
సేవలలో
పాల్గొనాలి.
ఏదో
ఒక
విధమైన
విద్యా
విషయము
లోపల
మనసునంతా
వ్యర్థం
చేయకూడదు.
ఈనాడు
విద్యలు
పెరుగుతూ
పెరుగుతూ
పోయే
కొద్దీ
మనలో
వుండిన
సహజమైన
శక్తి
సామర్థ్యములు
కోల్పోతున్నాము.
పూర్వకాలము
వీథి
బడులలో
కూర్చుంటే
రెండు
ఒకట్ల
రెండు,
రెండు
రెళ్లు
నాలుగు
యీలా
చదువుతుంటే
బజారులో
పోయేవారూ
నేర్చుకునేవారు.
ఇప్పుడు
ఆడవారు
కాని
మగవారు
కాని
ఒక
షాపుకు
పోయి
ఒక
చీర,
బనీను,
పంచి,
షర్టు
కొనుక్కుని
వెల
ఎంతంటే
Calculater
నొక్కుతూ
కూర్చుంటారు.
వీరి
బుద్ధి
ఎక్కడకు
పోయింది.
భగవంతుడిచ్చిన
తెలివితేటలు
నాశనము
చేసుకుంటున్నారు.
ఈ
Science
లో
develop
అయిన
కృత్రిమమైన
యంత్రాలంతా
వుపయోగపెడుతున్నారు.
నాలుగు
వత్తవలసిన
చోట
మూడు
వత్తితే
మొత్తము
తప్పిపోతుంది.
కనుక
మొట్టమొదట
నీ
స్వశక్తిని
నీవు
పోషించుకో.
నీ
తలలో
వుండిన
శక్తిని
నీవు
చక్కగా
జ్ఞాపకము
వుంచుకో.
నీ
calculaterపైన,
నీ
computerపైన
depend
యై
వుండవద్దు.
ఇది
మనం
adjust
చేసినట్లుగా
నడుస్తూ
పోతుందిగాని
దానికి
ప్రాణము
వుండదు.
దానికి
ప్రాణం
యిస్తున్నావుగానీ
నీ
ప్రాణం
నీవు
తీసుకుంటున్నావు.
ఇదే
యీనాటి
చదువులలో
వచ్చిన
గొప్ప
శక్తి.
మన
శక్తిపైన
మనం
ఆధారపడాలి.
మన
కాళ్లపైన
మనం
ఆధారపడాలి.
ఈ
calculater
పైన
యీ
computer
పైన
మనం
ఆధారపడకూడదు.
ఏదో
అవసరం
వచ్చినప్పుడు
use
చేసుకోవచ్చు.
కానీ
మొట్టమొదట
తనపైన
తాను
నిలబడాలి.
అదే
self
confidence.
ఈ
Self
confidence
లేనివానికి
computer
confidence
ఎక్కడ
నుండి
వస్తుంది.
12
▾
Meaning
Keep
అది
కేవలము
computer
satisfaction
వస్తుంది
కాని
self
satisfaction
రాదు.
computer
sacrifice
చేస్తుంది
గాని
self
sacrifice
చేయటం
లేదు
self
realisation
కాదు
computer
realisation
జరుగుతున్నది.
దీనివలన
ప్రయోజనం
లేదు.
అన్నీ
ఆత్మవిశ్వాసముపైన
ఆధారపడాలి.
కనుక
ఆత్మవిశ్వాసము
మానవునకు
అత్యవసరమైనది.
Previous
←
The Essence of the Vedas Is the Sound of the Flute
Next
Develop the Principle of Prema
→