Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Bhakti Is Never Parted from God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Bhakti Is Never Parted from God
26 June 1989, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 276
Also in his talks
(1)
27 June 1989
Prema Is the Form of God
ప్రాణికోటికి
ప్రీతి
యెవ్వాని
యందు?
సత్యమణకువ
మధుర
భాషాభియుతుని
అంధుడగువాడు
ఎవ్వడీ
యవనియందు?
చదువు
కల్గియు
చెడు
క్రియల్
సలుపువాడు.
విద్యార్థులారా!
పరమ
భక్తుడు,
కవి,
జ్ఞాని,
ఆధ్యాత్మిక
మార్గమున
ఆదర్శమూర్తి
భర్తృహరి.
అట్టి
భర్తృహరి
ఒకానొక
సమయమున
తన
దోషములను
గుర్తించి
విచారిస్తున్నాడు.
ఏమని?
అల్పజ్ఞుడైన
సమయమున
నన్ను
మించినవారు
యీ
లోకములో
లేరని
మదగజమువలె
కన్ను
మిన్ను
కానక
ప్రవర్తించాను.
కాని
మహర్షుల
సందర్శనము
చేతను
సద్బోధల
చేతను
సత్యాన్ని
గుర్తించుకోగలిగాను.
ఔషధముచేత
రోగము
నివారణ
అయినట్లు
పెద్దల
దర్శనము
చేతను,
బోధల
చేతను,
మదగజంబు
వంటి
మనస్సు
అదుపులోకి
రావటం
సంభవిస్తుంది
అనుకున్నాడు.
అనంత
విశ్వమునందు
నీ
రూపమెట్టిది?
నీ
దేహమెట్టిది?
నీవెట్టివాడవు?
అనంతమైన
ఆకాశమునందు
సూర్యుడెంతటి
వాడు?
ఈ
సూర్యతత్త్వమునందు
నలుసువంటి
యీ
భూమి
ఎంతటిది?
ఈ
భూమియందు
ఆసియా
దేశము
మరెంత
చిన్నది.
ఈ
ఆసియా
లోపల
భారతదేశము
మరెంత
చిన్నది?
ఈ
భారతదేశములో
ఆంధ్రప్రదేశ్
మరెంత
చిన్నది?
ఈ
ఆంధ్రప్రదేశ్
లోపల
అనంతపురం
జిల్లా
మరెంత
చిన్నది?
ఈ
అనంతపురం
జిల్లాలో
ప్రశాంతినిలయం
మరెంత
చిన్నది?
ఈ
ప్రశాంతి
నిలయములో
నీవున్న
గది
ఎంత
చిన్నది!
నీ
గదిలో
నీవెంతటి
వాడవు?
నీ
అహంకారమునకు
స్థానమెక్కడిది!
ఇది
కేవలము
అజ్ఞానము
యొక్క
మోహము.
మానవత్వాన్ని
లోతుగా
విచారించినప్పుడు
సత్యమైన
నిత్యమైన
తత్త్వములు
ఎన్నియో
మనకు
అర్థమవుతున్నవి.
రైలు
గంటకు
50
మైళ్ల
వేగంతో
పోతుంది;
ప్లేను
500
మైళ్ల
పోతుంది;
కాంతి
5
కోట్ల
మైళ్ల
పోతుంది
మనమున్న
ప్రదేశమునకు
నక్షత్రములకు
23
లక్షల
కోట్ల
దూరముంటుండాది.
మనకు
కనుపించే
సూర్యుడమితంగా
ప్రకాశిస్తున్నాడు.
కారణము?
సూర్యుడు
మనకు
సమీపములో
వుండటంచేత.
ఆ
సూర్యుడు
కూడను
ఒక
నక్షత్రమే.
ఇంతటి
విశాలమైన
యీ
విశ్వమునందు
మానవత్వము
దివ్యత్వముగా
విశ్వసించటానికి
గాని
లేక
దివ్యత్వంగా
రూపొందించటానికిగాని
కారణం
ఏమిటి?
విద్యార్థులారా!
సత్యాన్ని
గుర్తించటానికి
జ్ఞానము
అత్యవసరము.
ఈనాటి
పరిస్థితి
యందు
జ్ఞానమును
మూడు
విధములుగా
విశ్వసిస్తున్నారు.
సామాన్యమైన
స్థితియందు
సత్యమును
సత్యముగా,
అసత్యమును
అసత్యముగా
విశ్వసించటము
ప్రాకృతమైన
జ్ఞానమనుకుంటారు.
2
▾
Meaning
Keep
మాధ్యమికమైన
జ్ఞానముతో
అసత్యాన్ని
సత్యముగను,
సత్యమును
అసత్యముగను
విశ్వసించటమే
సత్యమని
భావించి
యిదే
జ్ఞానంగా
భావిస్తుంటారు.
అనగా
దృశ్యకల్పితమైన
యీ
జగత్తంతయును
మన
అనుభూతిలో
వుండినప్పటికి
యిది
అసత్యమని
భావిస్తున్నారు.
అనగా
దివ్యత్వాన్ని
లేదనియు,
ప్రకృతి
తత్త్వాన్ని
కలదనియు
విశ్వసించటము
యిది
మాధ్యమికమైన
జ్ఞానము.
అది
యిది
అనే
భేదములే
లేవు.
అంతా
ఒక్కటే.
‘సర్వం
విష్ణుమయం
జగత్
సర్వం
బ్రహ్మమయం
జగత్’
అనే
ధోరణి
ఆధ్యాత్మిక
జ్ఞానమని
విశ్వసిస్తూ
వచ్చారు.
అట్టి
జ్ఞానమునకు
ప్రాకృత
జ్ఞానము
అత్యవసరమైనట్టిది.
దానిని
మనము
దాటుకున్న
తరువాతనే
నిత్య
సత్యమైన
జ్ఞానాన్ని
పొందుటకు
అర్హులౌతాము.
జ్ఞానము
తల్లివంటిది.
ఈ
జ్ఞానమునుండియే
సర్వము
ఆవిర్భవించినది.
నాస్తి
మాతృ
సమో
గురుః
తల్లికంటె
మించిన
గురువు
మరొకరు
లేరు.
అట్టి
తల్లి
తత్త్వాన్ని
జ్ఞానరూపకంగా
మనము
అనుభవించటానికి
తగిన
కృషి
చేయటం
లేదు.
ఈనాటి
బాల
బాలికలు
కాని
స్త్రీ
పురుషులుకాని
యిట్టి
దివ్యతత్త్వాన్ని
అర్థం
చేసుకొనుటకు
ప్రయత్నించటం
లేదు.
దీనికి
మూలకారణము
విద్యా
ప్రభావమే.
ఆధునిక
విద్యలచేత
మనసుకు
సూటైన
మార్గాన్ని
అనుసరిస్తున్నారుగాని
మనసుకు
హితమైన,
మితమైన
మార్గాన్ని
అనుసరించటం
లేదు.
ఆధునిక
విద్యలచేత
మృదు
మధురమైన
హృదయం
కఠినంగా
మార్చుకోగల్గుతున్నారు.
ఇంతేకాక
అతిసూక్ష్మమైన
సూటియైన
బుద్ధిని
మొద్దుబుద్ధిగా
మార్చుకోగలుగుతున్నారు.
ఒకానొక
సమయంలో
గాంధీజిని
మీరెప్పుడూ
విచారంగా
వుంటారెందుకు
దీనికి
కారణం
ఏమిటి
అని
నెహ్రూ
ప్రశ్నించాడు.
ఈనాటి
విద్యార్థుల
హృదయము
కఠినంగా
మారిపోతుండాది.
ఈ
కఠిన
హృదయంబైన
విద్యార్థులు
లోకానికి,
యేమి
చేయగలరు?
అనే
విచారమే
నా
విచారమన్నాడు
గాంధీ.
ఈనాటి
యువతులు
కేవలము
ఉత్తమ
పత్నులుగా
వుండాలని
ప్రయత్నిస్తున్నారుగాని
ఉత్తమ
మాతలుగా
రూపొందాలనే
యోచనలు
వారిలో
కలగటం
లేదు.
ఈనాటి
విద్యార్థులు
కేవలము
ఆదర్శవంతమైన
భర్తలుగా
తయారు
కావాలని
కోరటం
లేదు.
ఆకర్షణీయమైన
భర్తలుగా
వుండాలని
ఆశిస్తున్నారు.
ఆదర్శవంతమైన
తండ్రులుగా
రూపొందాలనే
విషయాన్ని
విస్మరిస్తున్నారు.
దీనికి
తగినట్టుగా
తల్లితండ్రులు
కూడను
విద్యావిధానము
లోపల
వీటికి
మాత్రమే
వుత్సాహ
ప్రోత్సాహములందిస్తున్నారు.
నా
కుమారుడు
గొప్ప
గుణవంతుడు
కావాలని
ఆశించే
తండ్రులు
చాలా
తక్కువ.
గొప్ప
విద్యావంతుడు
కావాలని
ఆశించే
తండ్రులు
ఎక్కువ.
గుణవంతులు
కావాలని
కోరే
తండ్రులే
ఉత్తమ
తండ్రులు.
విద్యయే
జీవితము
యొక్క
పరమావధి
కాదు.
జీవితంలో
విద్య
ఒక
భాగము
మాత్రమే.
కానీ
గుణములు
జీవితమునకు
ప్రధానమైన
వెన్నెముక.
కనుకనే
Education
should
be
for
life
not
for
living.
ఈ
అన్నింటికిని
ఆధ్యాత్మిక
భావము,
ఆధ్యాత్మిక
మార్గము,
ఆధ్యాత్మిక
చిత్తము
అత్యవసరము.
3
▾
Meaning
Keep
భక్తి,
భక్తి,
భక్తి
భగవంతునితో
ఎడబాటు
కలగనిదే
భక్తి.
భగవంతునితో
విభక్తము
కానిదే
భక్తి.
భక్తినే
గంగ
అని
పిలిచారు.
భారతీయులు
గంగ
అనగా
పవిత్రమైనది,
నిర్మలమైనది,
సార్థకమైనది,
విశ్వవ్యాప్తిని,
పవిత్రకీర్తిని
అర్జించినదే
గంగ
కనుక
భక్తి
స్వచ్ఛమై,
నిర్మలమై
నిస్వార్థమైన
రీతిగా
వుండాలి.
భక్తికి
అనుగుణంగా
కర్మ
ఇదే
యమున.
భగవత్ప్రీత్యర్థం
గావించిన
కర్మలన్నీ
యమునతో
సమానము.
కనుక
భగవత్ప్రీత్యర్థం
గావించిన
కర్మలన్నీ
పుణ్యతీర్థమైన
యమునానది
స్వరూపమే.
స్వార్థమైన
కర్మలు,
స్వప్రయోజన
కర్మలు
యమునితో
సంబంధించిన
కర్మలే.
ఇది
యమున
అది
యముడు.
ఐతే
లోకంలో
భక్తికర్మలు
రెండు
కనిపిస్తున్నాయిగాని
అంతర్వాహినియైన
సరస్వతి
మనకు
కనుపించటం
లేదు.
సరస్వతి
గుప్తమై
గూఢముగా
వుండినటువంటిది.
అవ్యక్తమైనది.
అట్టి
అంతర్వాహినియైన
జ్ఞానము
మనకు
కనుపించదు.
ఇట్టి
జ్ఞానమే
నిజమైన
జ్ఞానము.
అట్టి
జ్ఞానము
యింద్రియ
నిగ్రహమునకు
సహాయకారిగా
వుంటుంది.
పోయినతూరి
చెప్పాను.
రాముడు
34
విద్యలు
చదివినవాడు.
రావణుడు
64
విద్యలు
చదివినవాడు.
రామునికంటె
ఎక్కువ
విద్యలు
చదివిన
వాడైనప్పటికి
రావణో
నామ
మూర్ఖోసౌ
రావణుడు
మూర్ఖుడు
అన్నాడు.
కారణమేమిటి?
ఇన్ని
చదువులు
చదివినప్పటికిని
యింద్రియ
నిగ్రహము
లేక
యింద్రియములకు
దాసుడైపోవటం
చేతనే
రావణుడు
మూర్ఖుడయ్యాడు.
రాముడు
తన
యింద్రియములను
స్వాధీనము
నందుంచుకున్నాడు.
కనుక
చదువుకున్న
వారందరు
జ్ఞానులు
కాదు.
వారు
విద్యావంతులు
కావచ్చును.
చదువు
కల్గియు
యింద్రియ
నిగ్రహము
సాధించినవాడు
నిజమైన
జ్ఞాని.
ఇట్టి
అంతరార్థమును
గుర్తించి
వర్తించే
వ్యక్తిత్వములను
చక్కగా
భక్తిరూపంలో
వర్ణిస్తూ
వచ్చారు.
భక్తుడనేవాడు
ఎలాంటి
పరిస్థితులలో
విసుగు
కల్పించుకొనరాదు.
విన్న
విషయాలే
విన్నప్పటికిని,
తిన్న
పదార్థములే
తిన్నప్పటికిని
వాటిపైన
విసుగు
రాకూడదు.
స్వామి
చెప్పిన
విషయాలే
చెప్తూ
రావచ్చు.
మీకు
వినిపించిన
విషయాలే
వినిపించవచ్చు.
కారణమేమిటి?
తిన్న
కడుపుకే
తింటున్నాము.
కడిగిన
ముఖాన్నే
కడుగుతున్నాము.
కారణమేమి?
తిన్న
అన్నము
జీర్ణమైపోతుంది.
తదుపరి
తిరిగి
తినవలసి
వస్తుంది.
విన్న
విషయాలు
మరచిపోవచ్చును.
మరచిపోయిన
దానిని
జ్ఞప్తికి
చేయటానికి
విన్న
విషయాలే
వినాలి.
దానికి
మీరు
విసుగొంద
రాదు.
ఒక
చిన్న
ఉదాహరణము.
మీరు
15
సంవత్సరములు
20
సంవత్సరములు
కాఫీనో
టీనో
త్రాగటం
ప్రారంభించారు.
ఇన్ని
సంవత్సరముల
నుంచి
త్రాగిన
కాఫీ
టీనే
కదా
త్రాగుతున్నాం.
4
▾
Meaning
Keep
అని
దానిపైన
విసుగు
రావటం
లేదు.
ఎప్పటికప్పటికి
ఆ
కాఫీ
నూతనమైన
ఉద్రేకాన్ని,
ఉల్లాసాన్ని
అందిస్తుంది.
ఆ
కాఫీకి
రెండు
నిముషాలు
ఆలస్యమైతే
తలపోటు
ఎక్కుతుంది.
ఇష్టమైన
కాఫీ,
టీ
నిత్యము
త్రాగుతుండినప్పటికిని
ఒక
పర్యాయము
కాదు
నాలుగు
పర్యాయములు
ఎనిమిది
పర్యాయములు
త్రాగినప్పటికిని
విసుగు
రావటం
లేదు.
కానీ
దురదృష్టవశాత్తూ
ఆధ్యాత్మిక
విషయమునందు
మాత్రమే
విన్న
విషయాలను,
అనుభవించిన
విషయాలను,
ఆదర్శాలను
వినటానికి
మనకు
విసుగు
వస్తుంటాది.
ఆధ్యాత్మిక
ప్రసంగాల్లో
ప్రవేశించినప్పుడు
నిద్రైనా
వస్తుంటుంది.
లేక
తలనొప్పైనా
ప్రారంభ
మవుతుంది.
రెండూ
లేకపోతే
క్షుద్రమైన
విషయాలు
జ్ఞప్తికైనా
తెచ్చుకుంటుంటారు.
ఇలాంటి
దురదృష్టవంతులు
ఎన్ని
విధములైన
ఆధ్యాత్మిక
ప్రబోధలు
విన్నప్పటికిని
ప్రయోజనము
లేదు.
విన్న
విషయములైనప్పటికి
మరొక
తూరి
నెమరువేసి
దానిని
తిరిగి
జ్ఞప్తికి
వుంచుకోటం
అత్యవసరము
కనుకనే
విన్న
విషయాలే
వినాలి.
భక్తి
విషయములో
యేమాత్రము
విసుగు,
విరామము
లేకుండా
ఆనందమైన,
దివ్యమైన
భావముతో
అనుభవించాలి.
ఒక్క
క్షణమైన
దీనిపై
విసుగు
రాకూడదు.
వెన్నెలకు
చకోర
పక్షులు
తిరిగి
తిరిగి
వాటికైనా
కొంత
విసుగు
పుట్టవచ్చు.
కోకిలగానమైనా
పాడుతూ
పాడుతూ
విసుగు
కలిగించవచ్చు.
అమృతమైనా
త్రాగగా
త్రాగగా
విసుగు
పుట్టవచ్చు.
కాని
దైవ
విషయమునందు
యేమాత్రము
విసుగు
రాకూడదు.
ఇదియే
నిజమైన
భక్తి
యొక్క
తత్త్వము.
చిహ్నము.
అట్టి
పవిత్రమైన
దివ్యభావములు
విద్యార్థుల
హృదయాల
లోపల
వ్యాప్తి
కావాలి.
కారణమేమనగా
విద్యార్థులయందు
యింద్రియ
నిగ్రహము
చాలా
తక్కువ.
సంయమము
అంటే
యేమిటో
విద్యార్థులకర్థం
కావటం
లేదు.
స్వేచ్ఛా
విహారం
సల్పటమే
వారి
ప్రధాన
లక్ష్యంగా
భావిస్తున్నారు
విద్యార్థులు.
స్వేచ్ఛ
అనగా
ఏమిటని
దాన్ని
కూడను
అర్థం
చేసుకోవాలి.
తన
యిష్టము
వచ్చినట్లు
సంచరించటము,
యిష్టము
వచ్చినట్లు
జీవించటము,
యిష్టము
వచ్చినట్లు
ప్రవర్తించటము
స్వేచ్ఛ
అనుకుంటారు.
ఆ
విధమైన
స్వేచ్ఛా
విహారాదులు
పశుపక్షి
మృగాలు
అనుభవిస్తున్నాయి
కదా!
కుక్కలకు,
కోతులకు
ఎవ్వరు
ఏ
విధమైన
నియమాన్ని
పెట్టటం
లేదు.
ఇష్టము
వచ్చినట్టు
సంచరిస్తున్నాయి.
మన
జీవితములో
ప్రత్యేకమైనదేమిటి?
మానవుడైనవాడు,
విద్యావంతుడైనవాడు,
విద్యార్థి
అయినవాడు
గుర్తించవలసింది
ఒక్కటే.
స్వేచ్ఛ
అనే
పదమునకు
అర్థమేమిటి?
స్వ+ఇచ్ఛ-
స్వేచ్ఛ.
స్వ
అనగా
ఆత్మ.
ఆత్మ
భావాన్ని
అనుసరించటమే
స్వేచ్ఛ.
దేహ
భావాన్ని
అనుసరించటం
కాదు
స్వేచ్ఛ.
దేహమును
అదుపులో
నుంచుకొని
మనసు
నుంచి
ఆవిర్భవించే
ప్రతి
విషయమును
Is
it
right
or
wrong.
Is
it
good
or
bad
అని
discrimination
powerను
వుపయోగించి
తన
ఆత్మతృప్తియైన
అదే
నిజమైన
స్వేచ్ఛ.
అదే
self
confidence.
ఈ
రకంగా
నమ్మకం
రావాలి.
ఈ
నమ్మకమనేది
వుండినప్పుడే
స్వ
అనేదాని
అర్థాన్ని
గుర్తించటానికి
వీలౌతుంది.
కాన్షన్సు
అనేది
ఆత్మ
తత్త్వమునకు
సంబంధించినది.
విద్యార్థులారా!
5
▾
Meaning
Keep
విద్యకంటె
ముఖ్యముగా
సద్గుణములు
మరింత
పోషించు
కోటానికి
తగిన
కృషి
చెయ్యాలి.
అల్ప
స్వల్పమైన
విషయాలలో
ఏ
మాత్రం
ఉద్రేకాన్ని
అభివృద్ధి
పరచుకోరాదు.
ఈ
దివ్యతత్త్వాన్ని
గుర్తించుకోటానికి
భగవద్భక్తి
అత్యవసరము.
ఆ
విశ్వాసము
గాఢముగా
వుండినప్పుడే
ఎలాంటి
నష్టకష్టములకైనా,
ఎలాంటి
అపజయములకైనా,
ఎలాంటి
నిందలు
నిష్ఠూరములైనను
సాధించుకునే
దివ్యమైన
శక్తిని
మనం
సంపాయించుకోవచ్చును.
ఇలాంటి
పూర్ణ
విశ్వాసము
లేనప్పుడే
మానవునికి
అనేక
రకములైన
ఒడిదుడుకులంతా
హింసింప
చేస్తాయి.
కనుక
మొట్టమొదట
యీ
నమ్మకం
అభివృద్ధి
పరచుకోవాలి.
ఇక్కడ
ఒక
చిన్న
ఉదాహరణము.
పంచ
పాండవులలో
ప్రధానమైనవారు
ముగ్గురు.
ధర్మజ,
భీమ,
అర్జునులు.
వీరి
జీవితము
యొక్క
సారంలో
సత్యం
వద,
ధర్మంచర
ఈ
రెండింటిని
సాధించారు.
సత్యము
పలుకవలసిందే
కాని
చేయవలసింది
కాదు.
ధర్మము
చేయవలసిందేగాని
చెప్పవలసింది
కాదు.
ఐతే
ధర్మజుడు
సత్యమును
చెప్పటము,
ధర్మమును
ఆచరించటము
రెండింటియందు
ఆదర్శప్రాయుడుగా
నిలిచాడు.
ఈ
రెండింటియందు
ఆదర్శమూర్తిగా
నిలిచిన
ధర్మజుడు
మూడోదాన్ని
కూడను
లక్ష్యమునందుంచుకున్నాడు.
అతని
విశ్వాసము
భగవంతుడు
సత్యము
పలుకుతాడని
కాదు.
భగవంతుడు
ఏమి
పలికినా
అది
సత్యమే
అని
అతని
విశ్వాసం.
భగవంతుడు
ఏమి
మాట్లాడినా
సత్యమే.
దీనికిని
భగవంతుడు
సత్యము
పలుకుతాడు
అనేదానికి
ఎంతో
భేదము
వుంటున్నాది.
కనుకనే
‘అశ్వత్థామః
హతః
కుంజరః’
అని
భగవంతుడు
ఏది
చెప్పినా
సత్యమే
అని
వుచ్ఛరించాడు.
ఇది
అతని
యొక్క
విశ్వాసం.
పరమభక్తుడైన
ధర్మజుడు
తన
శక్తిని
యే
విధంగా
నిలుపుకోగలిగాడు?
కుడివైపున
భీముడు,
ఎడమవైపున
అర్జునుడు.
ధర్మరాజు
సెంటర్లో
వుండటం
భారతీయులైన
వారు
దీని
అంతరార్థమును
చక్కగా
గుర్తించాలి.
కుడివైపున
భీముడు
కేవలం
పశుబలుడు
కాదు.
ధర్మబలుడు.
అన్నయైన
ధర్మరాజు
వాక్యమును
శిరసావహించి
నడచుకునేవాడేగాని
అందులో
తన
పశుబలమును
దుర్వినియోగం
చేసుకునేవాడు
కాదు.
ఎడమవైపు
వున్న
అర్జునుడు
పవిత్రుడు.
అర్జునుడనగా
ప్యూరిటీ.
ఈ
నిర్మలత్వమే
కాకుండా
శక్తి
సామర్థ్యములు
కలిగినవాడు.
కనుకనే
యింద్రుని
చేతను,
సర్వుల
చేతను
అనేక
రకములైన
బిరుదులు
పొందినవాడు.
ఈనాటి
భారతీయులవలె
పద్మశ్రీ,
పద్మవిభూషణ
పొందినవాడు
కాదు.
అర్జునః,
ఫల్గుణః,
పార్థః,
కిరీటి,
శ్వేతవాహనః,
భీభత్సః,
సవ్యసాచిః,
విజయ
కృష్ణ,
ధనుంజయః
ఇలాంటి
గొప్ప
గొప్ప
బిరుదులంతా
అందుకున్నాడు.
ఇలాంటి
బిరుదులందుకున్న
వాడెలాంటి
వాడంటే
నిత్యశుద్ధుడు.
ఒకవైపున
బలము
ఒకవైపున
పరిశుద్ధము
రెండు
వుండటం
వలననే
ధర్మము
రాణిస్తూ
వచ్చింది.
ప్రతి
భక్తునకు
ఒక
వైపున
దృఢ
విశ్వాసము,
దృఢ
నమ్మకము
రావాలి.
రెండోవైపున
పరిశుద్ధము,
నిర్మలత్వము
అనే
అర్జునుడు
వుంటుండాలి.
ఈ
రెండు
వుండినప్పుడే
ధర్మజుని
కీర్తి
జగద్వ్యాప్తి
గాంచినది.
ధర్మజుడు
ఒక్కడే
వుండి
వుంటే
యింత
కీర్తిని
పొంది
వుండేవాడు
కాదు.
ధర్మరాజు
కీర్తి
ప్రతిష్ఠలకంతా
భీమార్జునులు
తోడునీడగా
వుండేవారు.
6
▾
Meaning
Keep
Also in his talks
(5)
1 June 1973
God's Grace Can Turn a Fool into a Jñāni
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
4 September 1998
Remembering the Name of God Removes All Sorrow
18 November 1998
Samyak Dṛṣṭi
భగవద్భక్తులైన
వారికి
దృఢ
విశ్వాసము,
నిర్మలత్వము
యీ
రెండింటి
యొక్క
తోడు
వుండాలి.
విశ్వాసము
దృఢముగా
లేకపోతే,
నిర్మలత్వమే
లేకపోతే
సందిగ్ధావస్థ
లోపల
పడి
డౌటింగ్
థామస్‌గా
మారిపోతాడు.
ఇలాంటి
జీవితములో
మనకు
భక్తి
యేమి
ఫలితాన్ని
అందించగలదు.
అడుగడునకు
మనకు
డౌట్సే.
ఇలాంటివాడు
యే
కించిత్తైనా
విజయాన్ని
సాధించలేడు.
దృఢమైన
విశ్వాసమంటే
భీముని
శరీర
బలమే
కాదు,
గజబలము
కాదు,
బుద్ధిబలము
కలిగినవాడుగా
వుండాలి.
అది
దృఢ
విశ్వాసము.
భగవంతుని
పాదాలపైన
క్షణకాలమైనా
నిర్మలమైన
ప్రేమను
పెట్టినప్పుడే
వస్తుంది.
యాచింతా
భువి
పుత్రమిత్ర
భరణౌ
వ్యాపార
సంభాషణే
యాచింతా
ధనధాన్యభోగయశసే
లాభే
సదా
జాయతే
సాచింతా
భువి
నంద
నందన
పదద్వందారవిందేక్షణే
కాచింతా
యమరాజభీమ
సదనద్వార
ప్రయాణే
ప్రభో.
పుత్ర,
మిత్ర,
భరణ
వ్యాపార
నిమిత్తమై
ఏ
చింతన
నీవు
ఎంతకాలం
చేస్తున్నావో,
దేని
నిమిత్తమై
నీవు
ధన
ధాన్య
భోగ
యశస్సుల
నిమిత్తమై,
లాభాల
నిమిత్తమై,
ఎంతకాలాన్ని
నీవు
వినియోగం
చేస్తున్నావో
కృష్ణుని
రెండు
పాదములపై
రెండు
నిముషాలు
నీవు
ఆ
మనస్సు
లగ్నం
చేస్తే
చాలు.
రెండు
క్షణాలు
భగవంతుని
చింతన
చేస్తే
చాలు.
భయంకరమైన,
మహాబలమైన
యమ
ద్వారము
తనకు
తాను
తెరచుకొని
స్వాగతమందిస్తారు.
ఈనాడు
నిరుపయోగమైన,
క్షణ
భంగురమైన,
అశాశ్వతమైన
లోక
సంబంధమైన
దానికి
కావలసినంత
కాలాన్ని
మనం
వినియోగించుకొంటున్నాము.
ఆ
కాలములో
క్షణకాలమైనా
భగవంతునికే
మాత్రమైనా
వినియోగం
చేస్తున్నామా?
ఒక్క
క్షణకాలము
ఆ
రెండు
పాదములపైన
మనసు
నిలిపితే
చాలు.
కాని
నిలపటం
లేదు.
ఒక
చిన్న
శివలింగాన్ని
దీసి
యిచ్చి,
నాయనా!
దీనికి
అభిషేకం
చేయండి
అంటే
దానికి
చేయటం
కష్టమైపోతుంది.
దున్నపోతును
మాత్రం
కడిగి
కడిగి
శుభ్రం
చేస్తారు.
దున్నపోతును
కడిగి
స్నానం
చేయించటానికి
టైము
వుంటుందిగాని
శివలింగానికి
ఒక
స్పూను
నీరు
వేసి
స్నానం
చేయించటానికి
టైము
వుండదు.
వాళ్లకు.
కాలము
లేక
కాదు.
లేక
కర్మ
చాలా
కఠినమైనది
కాదు.
శ్రద్ధ
తక్కువ.
ప్రాకృతమైన
దీని
లోపల
శ్రద్ధ
ఎక్కువ.
పవిత్రమైన
దానియందు
శ్రద్ధ
తక్కువ.
ఈ
శ్రద్ధ
లేకపోవటం
చేతనే
మనలో
విచారణా
జ్ఞానం
లేకపోతున్నది.
‘శ్రద్ధావాన్
లభతే
జ్ఞానమ్’
శ్రద్ధ
చేతనే
జ్ఞానం
లభిస్తుంది.
కనుకనే
ఆధ్యాత్మిక
విషయమునందు
మనం
శ్రద్ధను
అభివృద్ధి
పరచుకోవాలి.
విద్యార్థులారా!
మీరు
చదువుతోబాటు
ఆధ్యాత్మిక
భావాన్ని
జంట
కలిపి
వెంటగా
మీరు
ప్రయాణం
చేసినప్పుడే
మీ
జీవితము
గమ్యము
చేరుతుంది.
మానవులకు
కేవలం
విద్య
మాత్రమే
శాంతి
సుఖములను
అందించటం
లేదు.
ఆధ్యాత్మిక
భావము
మాత్రమే
మానవునికి
శాశ్వత
సుఖశాంతులనందిస్తుంటుండాది.
ఆధ్యాత్మికము
స్వార్థపరమైనది
కాదు.
‘లోకాస్సమస్తా
సుఖినో
భవంతు’
అని
ఆనాటినుండి
యీనాటి
వరకు
మన
హైందవ
సాంప్రదాయాన్ని
మనము
అనుభవిస్తూనే
వుంటున్నాము.
7
▾
Meaning
Keep
Also in his talks
(6)
18 July 1989
The Ātma in All Is One
13 April 2002
Follow the path of Sai and win a good name
2 April 2003
Leave the delusion of the body; think of God
23 October 2004
Foster the Spirit of Sacrifice
16 March 2005
Jñāna is won through purity of feeling
23 November 2008
Foster the feeling of the one Ātma, and unity!
వేదములు
యీ
ఐకమత్యమును
చక్కగా
గుర్తింపచేయటానికి
అనేక
రకములైన
మంత్రములు
ప్రబోధిస్తూ
వచ్చాయి.
అందరు
ఐకమత్యముతో
వుంటుండాలి.
కలసి
మెలసి
పెరుగుదాం-
కలసి
మెలసి
తిరుగుదాం
కలసి
మెలసి
తెలుసుకొన్న
తెలివిని
రాణింపచేద్దాం
అందరు
కలసి
మెలసి
వుండాలన్నదే
వేదము
యొక్క
ప్రమాణము.
కానీ
యీనాడు
అట్టి
ఐక్యత
కనుపించటం
లేదు.
కేవలం
హలో
హలో
How
are
you
Good
bye
Good
bye.
ఇంతటితోనే
మనం
సంబంధ
బాంధవ్యాలు
తెంపుకుంటున్నాము.
దాని
నిమిత్తమై
ఆధ్యాత్మిక
మార్గములో
కృతజ్ఞతను
ప్రధానమైన
లక్ష్యముగా
అందించుతూ
వచ్చారు.
నీవు
పొందిన
ఏ
చిన్న
వుపకారమునకైనను
జీవితమంతా
కృతజ్ఞతగా
వుంటుండాలి.
ఇదియే
విద్యార్థులు
నేర్చుకోవలసిన
ప్రధానమైన
కర్తవ్యము.
కేవలం
చదువుకోటం,
డిగ్రీలు
తీసుకోటం,
పెద్ద
ఉద్యోగములో
చేరిపోవటం,
ధనము
ఎక్కువగా
సంపాయించటము,
యింత
మాత్రమే
కాదు.
పూర్వీకులు
కూడను
ధనమును
సంపాయిస్తూ
వచ్చారు.
కాని
ఆ
ధనమంతా
ధర్మ
నిమిత్తమై
ఉపయోగ
పెట్టారు.
సత్రాలు
కట్టించారు.
బావులు
తవ్వించేవారు.
విద్యాసంస్థలు
నెలకొల్పేవారు.
ఆరోగ్య
కేంద్రములు
నెలకొల్పేవారు.
ధనమును
యీ
విధమైన
ధర్మ
నిమిత్తమై
వుపయోగపెడుతూ
వచ్చారు.
ఈనాడు
ధనము
ఎక్కువై
పోయినకొద్దీ
మేడలు
కట్టడము,
స్వార్థం
నిమిత్తమే
కార్లు
కొనటం,
క్లబ్బుల్లో
కూర్చోటం,
పేకాటలాడటము
దుర్వినియోగం
చేయటం.
యథా
రాజా
తథా
ప్రజా
ఏ
మార్గములో
వచ్చిందో
ధనము
ఆ
మార్గములో
దుర్వినియోగం
చెయ్యటము.
శ్రమించి
సంపాయించిన
ధనము
కనుకనే
వాళ్ళు
సక్రమమైన
రీతిలో
ధర్మమార్గములో
వినియోగపెడుతూ
వచ్చారు.
విద్యార్థులారా!
ధనమును
సంపాయించుకోండి.
తప్పు
కాదు.
ధర్మ
మార్గములో
వినియోగ
పెట్టుకోటానికి
కృషి
చెయ్యండి.
లేకపోతే
ఆ
ధనం
మన
కుటుంబాన్ని
అనేక
రకములైన
హింసలపాలు
చేస్తుంది.
ఈనాడు
సిరి
భక్తులు
అధికమవుతున్నారు.
కానీ
హరి
భక్తులు
ఎక్కడా
కనుపించటం
లేదు.
లక్ష్మి
ఆరాధకులు
కనుపిస్తున్నారు.
కానీ
శ్రీమన్నారాయణ
ఆరాధకులు
ఎక్కడ
కనుపించటం
లేదు.
ఇది
యీనాటి
భక్తి
ప్రపత్తులు.
సిరి
యీనాడు
వస్తుంది.
రేపటి
దినం
పోతుంది.
నూరు
రూపాయలు
చేతిలో
పెట్టుకొని
ఆహా!
ఇది
నా
నూరు
రూపాయలనుకుంటే
అది
నీ
ముఖాన్ని
చూచి
నవ్వుతుంది.
ఒరే
పిచ్చివాడా!
ఇట్లాంటి
ముఖాలు
నేనెన్ని
చూచివచ్చానో.
తిరిగి
నేనింకొకరి
ముఖం
దగ్గరికి
పోతున్నానంటుంది.
ఈ
ధనమంతా
మనది
కాదు.
ఆధ్యాత్మిక
ధనమే
నిజమైన
ధనము.
ఈ
ధనము
ఎవ్వరికీ
లొంగేదికాదు.
అగ్నికి
కాలదు.
చోరుల
వశము
కాదు.
నీళ్ల
నానదు.
సోదరులచేత
పంచుకొనబడదు.
8
▾
Meaning
Keep
His poems 92
Also in his talks
(9)
1 March 1990
To seek out the path is the noble wisdom
19 March 1990
Hero becomes zero if he forgets God
22 July 1994
The fullness of Prema
5 February 1998
Samyak sādhana
18 April 1998
The universe is the form of Viṣṇu
8 October 1998
Good Resolves Are Themselves the Human Values
27 May 2006
Service itself is the foremost duty of man
16 August 2006
The one who dwells in the body is the God of gods
15 January 2008
Revere your mother as God, your father as God
బ్రదర్సు
లోపల
ప్రోపర్టీ
షేర్సులో
యిది
యేమాత్రము
రాదు.
ఎవరిది
తాను?
తన
ప్రాణసమానముగా
చూచుకొనే
ఆధ్యాత్మిక
ధనము.
కనుకనే
నిన్ను
వదలనిది,
నీ
దగ్గర
నుంచి
కదలనిది
నిన్ను
అన్ని
విధముల
సన్మార్గములో
ప్రవేశపెట్టేది
ఆధ్యాత్మిక
ధనము.
ఈ
ధనాన్ని
సంపాదించుకునే
దానికి
తగిన
కృషి
చేయండి.
అప్పుడే
తిరిగి
మన
భారతదేశము
అన్ని
దేశములకు
నాయకత్వాన్ని
వహించేదిగా
వుంటుంది.
అంతేగాని
మీకంటె
చదువుకున్న
వాళ్లెంతమందో
పోయినారు.
ఎంతటి
శ్రీమంతులు
కూడను
లోకాన్ని
వదలి
పెట్టి
పోయినారు.
ఎంత
సత్య
మార్గమును
అనుసరించిన
వారును
లోకాన్ని
వదలిపెట్టి
పోయారు.
నీవెంత
మాత్రము?
ఉన్నంత
లోపలనే
సత్కీర్తిని
సాధించుకోవాలి.
నిరత
సత్య
ప్రౌఢి
ధరణి
నేలిన
హరిశ్చంద్రుడీ
ధరబాసి
చనగలేదె.
ఎల్ల
లోకము
లేలె
ఎసగ
శ్రీనల
రాజు
తనవెంట
భూమిని
కొనుచు
చనెనె.
కృత
యుగంబును
నలంకృతి
సేయు
మాంధాత
సిరిమూట
కట్టుక
యరిగినాడె
జలధి
సేతువుకట్టి
అలనాడు
శ్రీరాముడుర్విపై
నిపుడు
తానున్న
వాడె
ఎందరెందరు
రాజులు
ఏగినారొ
ఒక్కడును
వెంటగొని
పోవరుర్వితలము
మీరు
మాత్రము
మీదు
రాజ్యంబునెల్ల
తలనుగట్టుక
పోదురా
విద్యార్థులార!
కాదు.
కాదు.
మనం
వున్నంతలోపల
కీర్తిని
సంపాయించాలి.
శాంతిని
సంపాయించాలి.
శాంతి
నిమిత్తమై
నీవు
చదవాలి.
ఆ
శాంతి
ఒక్క
దైవప్రార్థన
చేతనే
మనకు
లభ్యమౌతుంది.
శాంతియే
లేకపోతే
సౌఖ్యమే
లేదన్నాడు
త్యాగరాజు.
మనం
అసంతృప్తికి
యేమాత్రము
గురికాకూడదు.
అసంతుష్టో
ద్విజో
నష్టః
అసంతృప్తి
కలిగిన
వానికి
రెండు
నష్టాలట.
ఏమిటా
నష్టములంటే
శాంతి
వుండదు.
సుఖము
వుండదు.
ఈ
అసంతృప్తి
ఎప్పుడు
కలుగుతుంది
విద్యార్థుల్లో:
ఈ
పొరపాటును
మీరు
చక్కదిద్దుకోవాలి.
ఎప్పుడు
మీకు
అసంతృప్తి
కలుగుతుండాదంటే
మీకంటె
అధికంగా
మార్కులు
తెచ్చుకున్న
వానిని
చూస్తే
మీకు
అశాంతి
వస్తుంది.
మీకంటె
ఉత్తమమైన
స్థితిలో
వున్నవారిని
చూస్తే
మీకు
అసంతృప్తి
కలుగుతుంది.
మీకంటె
మంచి
చొక్కాలు
వేసుకున్న
వానిని
చూస్తే
అసంతృప్తి
కలుగుతుంది.
మీకంటె
అందమైనవానిని
చూస్తే
అసంతృప్తి
కలుగుతుంది.
కనుక
నీకంటె
వున్నతమైన
వారిని
చూడొద్దు.
ఈ
విషయాలలో
నీకంటె
తక్కువ
వున్న
స్థాయి
వాళ్లను
చూడు.
అప్పుడు
తృప్తి
కలుగుతుంది.
ఇది
చక్కగా
గుర్తించాలి.
నీకు
60
మార్కులు
వచ్చాయి.
40
మార్కులు
వచ్చిన
వానిని
చూచి
ఓహో
వానికంటె
నేనే
మేలు
అనుకుంటావు.
అప్పుడు
తృప్తి
కలుగుతుంది.
తృప్తి
అభివృద్ధి
పరచుకోవాలనుకున్నప్పుడు
నీకంటె
చిన్నవారిని
చూచి
నీవు
తృప్తి
పడాలి.
దుర్గుణములు
పెంచుకోవాలంటే
నీకంటె
పెద్దవారిని
చూడాలి.
అప్పుడు
అహంకారం
నీలో
ప్రవేశిస్తుంది.
దీనులను
చూచి
జాలిపడి
తద్వారా
నీవు
తృప్తి
పడటానికి
ప్రయత్నించు.
జాలి
భావాన్ని
మనలో
అభివృద్ధి
పరచుకోవాలి.
ఈ
విధంగా
నిత్య
జీవితములో
జరగవలసినవన్నీ
మనం
యీ
మార్గములో
డెవలప్
చేసుకోవాలి.
కేవలం
వేదాంతమనేది
బోధించుకుంటూపోతే
యేమాత్రం
అర్థం
కాదు.
9
▾
Meaning
Keep
చిన్న
పిల్లవాడు
6వ
తరగతి,
11
సంవత్సరములవాడు
చెప్పాడు.
కర్మయోగము,
భక్తియోగము,
జ్ఞానయోగము,
రాజయోగము
అన్నింటి
గురించి
చెప్పాడు.
అతని
హృదయము
అంత
స్వచ్ఛముగా
వుంటుండాది.
తన
అనుభవము
లేకపోయినాసరే,
ఆ
చెప్పటంలో
ఒక
విధమైన
ఆనందము
కలుగుతుంది.
చెయ్యకపోయినా
ఫరవాలేదు.
ఆత్మతృప్తిగా
వుంటున్నాడు
ఆ
అబ్బాయి.
దాని
నిమిత్తమై
అనేక
రకములుగా
తాను
చదివి
వుండవచ్చును.
ఇలాంటి
భావాలు
మన
నిత్య
జీవితము
లోపల
కొంచెం
కొంచెం
తృప్తి
పడటానికి
తగిన
ప్రయత్నాలు
మనము
చూచుకోవాలి.
ఎప్పుడూ
అసంతృప్తి
అసంతృప్తి.
ఈ
అసంతృప్తి
అనేది
మీకు
ఏమి
చిక్కినా
సాధ్యం
కాదు.
నీరు
గతుకు
కుక్కీ
ఏరెంత
పారినా
ప్రీతి
కలుగబోదు
పిసినిగొట్టు
అన్నారు.
కుక్క
చక్కగా
జుఱ్ఱుకొని
త్రాగలేదు.
నీరు
ఎక్కువగా
వుండినా
కొన్ని
నీళ్లున్నా
ఎప్పుడు
నాలుకతోనే
తాగుతుంది
పాపం.
ఎప్పుడు
చూచినా
ఏదో
ఒక
విధంగా
చిన్న
చిన్న
దాంట్లో
మనం
పోతుంటే
మన
జీవితానికి
తృప్తి
అనేది
సంభవించదు.
తృప్తికి
తగినట్లుగా
దేనికది
యిది
నాది,
యిది
భగవంతుని
ప్రసాదము,
ఈ
కష్టము
కూడా
భగవంతుని
యొక్క
ప్రసాదమే
అని
దానికి
తృప్తి
పడుతూ
రావాలి.
నేను
రెండు
పూటలు
భోజనం
చేస్తున్నాను
ఆ
షావుకారు
నాలుగుతూర్లు
భోజనం
చేస్తున్నాడు
అని
పెద్దవానితో
పోల్చుకుంటే
వానిపైన
చాలా
ద్వేషము
వస్తుంది.
అట్ల
కాకుండా
అయ్యో
పాపం
ఆ
పిచ్చివాడు
ఒక
పూట
తింటున్నాడు
వానికంటె
నేనే
మేలు
కదా!
భగవంతుడు
నన్నీ
స్థితి
యందుంచాడు
అని
తృప్తి
పడుతూ
రావాలి.
కనుక
చిన్న
చిన్న
దానియందు
కూడను
మనము
తృప్తిని
అభివృద్ధి
పరచుకోటానికి
ప్రయత్నించాలి.
అప్పుడే
మానవత్వము
లోనించి
దివ్యత్వమనేది
ఆవిర్భవిస్తుంది.
తృప్తి
అనేది
మానవతా
గుణములలో
ప్రధానమైనది.
తృప్తి
దైవభక్తిలో
తప్ప
అన్యమార్గములో
మనకు
లభ్యం
కాదు.
కనుక
భగవన్నామస్మరణ
చేసుకుంటూ
భగవంతుని
ప్రేమించుకుంటూ,
భగవంతుని
ప్రేమను
పొందే
నిమిత్తమై
మీరు
జీవితాన్నైనా
సరే
అంకితం
గావించటానికి
తగిన
కృషి
చేయండి.
Previous
←
Develop the Principle of Prema
Next
Prema Is the Form of God
→