Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · Road to Divinity
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Road to Divinity
23 May 1990, Summer Course 1990, Brindavan
1
▾
Meaning
Keep
Also in his talks
(1)
24 October 1992
To root out the Ahaṅkāra within humanness, offer pure Prema to God
చిత్తశుద్ధి
లేని
రిత్త
మానవులందు
క్రోధమత్సరంబు
కూడియుండు
చీకటింటి
లోనె
చేరును
గబ్బిలాలు
మరువ
లోకుడిట్టి
మంచి
మాట
చెవులకెవ్వండు
వినుశక్తి
చేర్చెనోయి
కనులకెవ్వండు
యిచ్చెను
కాంతిరేఖ
అట్టి
దానిని
వెతికెడి
వాడె
నరుడు.
ప్రేమస్వరూపులారా!
ఇంద్రియనిగ్రహమే
విద్యార్థుల
యొక్క
ప్రధమ
ఆదర్శము.
విషయ
సంబంధమైన
భోగ
భాగ్యములు
శాశ్వతములు
కావు.
ఇవి
అల్ప
సుఖము,
అనంత
దుఃఖమును
అందించును.
ఇంద్రియములకంటె
యింద్రియార్థములు
బలమైనవి.
అవియు
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధాదులు.
ఈ
యింద్రియములన్నింటికి
మూలమైనది
వాక్కు.
వాక్కును
జయించిన
అన్ని
యింద్రియములను
జయించినట్లే
అవుతుంది.
తినుట,
మాట్లాడుట
యీరెండు
నోటితో
జరిగే
పనులే.
వీటినే
ఆహార
వ్యవహారములని
కూడను
పిలుస్తూ
వుంటారు.
ఈ
రెండింటిని
యే
మానవుడు
జయించునో
అట్టి
మానవుని
యొక్క
తత్వము
దివ్యత్వమైన
తత్వమునందు
లీనమవుతుంది.
అప్పటి
నుండి
మాటలు
స్థంభించి
మనసు
మాటాడుటకు
ప్రయత్నిస్తుంది.
మనసు
యొక్క
నోరు
మూయించే
నిమిత్తమై
బుద్ధిని
మేల్కొల్పవలసి
వస్తుంది.
క్రమముగా
బుద్ధికి
బుద్ధి
చెప్పి
ఆ
బుద్ధిని
ఆత్మవైపు
మరల్చుటకు
తగిన
కృషి
చెయ్యాలి.
వాక్కు
మనస్సునందు,
మనస్సు
బుద్ధియందు,
బుద్ధి
ఆత్మసన్నిధిని
చేరే
వుపాయమే
సాధన.
ఇట్టి
సక్రమమైన
రాజబాట
వుండి
కూడను
మానవుడు
భౌతికమైన
భోగ
భాగ్యములకు
లోబడి
యీ
పవిత్రమైన
మార్గమును
విస్మరించి
కేవలము
దుఃఖ
హేతువైన
యింద్రియ
మార్గమునే
అనుసరిస్తూ
వస్తున్నాడు.
ఈ
యింద్రియములకు
ఆధారమేమిటని
యే
వ్యక్తి
కూడను
విచారించటము
లేదు.
ఈ
సర్వ
భోగములను
అనుభవించునది
యేది
అనే
సత్యాన్ని
కూడను
గుర్తించుటకు
ప్రయత్నించటము
లేదు.
బాహ్యప్రపంచమునకు
అంతర
జగత్తుకు
అవినాభావ
సంబంధమున్నదని
విద్యార్థులు
గుర్తించాలి.
2
▾
Meaning
Keep
Also in his talks
(8)
2 October 1988
Brahman Itself Is the Root Power of the World!
19 January 1989
The whole universe is filled with Hari
29 June 1989
Everything Is God's Gracious Gift
25 May 1991
Kenopanishad
29 June 1996
Karma, Bhakti and Jñāna: The Aim of All Three Is One
7 July 1996
Faith Alone Is Man's Eyes
22 February 2001
God's grace comes only through the right use of the senses
5 July 2001
The right use of the senses is the true sādhana
ఆహారాన్ని
చూచి
ఆనందించేది,
అందాన్ని
చూచి
ఆహ్లాదించేది,
పరిమళాన్ని
చూచి
పరవశించేది
యింద్రియములా,
దేహమా
లేక
ఆత్మనా?
ఇది
శరీరము
కాదు
యింద్రియములు
అంతకంటె
కాదు.
అన్నింటిని
ఆలించి,
పాలించి,
లాలించే
జగత్తును
పరిపాలించే
మూల
తత్వమే
ఆత్మ
తత్వము.
ఇది
బాహ్య
జగత్తుకు
మూలము.
అంతర
జగత్తుకు
ఆది.
ఇట్టి
ఆత్మ
తత్వమును
మనము
లక్ష్యమునందుంచుకున్నప్పుడే
యిట్టి
అనిత్యము
అశాశ్వతము,
అసత్యము
అయిన
దేహేంద్రియముల
యొక్క
ప్రభావము
మనపై
యేవిధముగాను
చలాయించవు.
అన్నింటికంటె
ప్రధానమైన
యింద్రియము
నాలుక.
ఈ
ఒక్క
దానిని
మనము
వశము
చేసుకుంటె
సర్వేంద్రియములు
కూడను
మనకు
సులభముగా
వశమవుతాయి.
ఈ
యింద్రియములను
అశ్వములతో
పోల్చుకున్నారు
కఠోపనిషత్తులో.
ఇక్కడ
అశ్వము
యొక్క
విషయాన్ని
ఆదర్శముగా
తీసుకుంటె
జిహ్వకు
అశ్వానికి
వున్న
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
మనకు
అర్థమవుతుంది.
చక్కగా,
పుష్టిగా,
వేగముగా
పరుగెత్తే
అశ్వము
వుండవచ్చు.
కాని
అట్టి
వేగముతో
పరుగెత్తే
అశ్వము
వుండినప్పటికి
ఒక
చిన్న
యినుపముక్కను
దాని
నోటి
యందు
చేర్చి
కళ్లెముగావించి
దానిని
బిగపట్టినప్పుడు
యావత్
శరీరము
కూడను
మనవశమై
పోతుంది.
ఈ
చిన్న
కళ్లెమే
బాగా
బలమైన
వేగముగా
పరుగెత్తే
అశ్వాన్ని
ఎలా
అరికట్టగలుగుతుంది.
అశ్వమునకు
నోరే
ప్రధానము.
దానిని
అరికట్టినప్పుడు
అశ్వమంతా
వశమై
పోతుంది.
పంచేంద్రియములనే
యీ
అశ్వమునకు
నోరే
ప్రధానము.
ఒక
చిన్న
చుక్కాని
వల్ల
ఎంత
పెద్ద
తుఫాను
వచ్చినప్పటికి
మనము
పడవను
సంరక్షించుకోవచ్చు.
ఒక
చిన్న
అగ్ని
కణము
చేత
యెంత
అగ్నినైనా
మనము
అభివృద్ధి
చేసుకోవచ్చు.
వాక్కు
అనేది
అగ్ని
కణము
వంటిదే.
ఈ
కణమును
మనము
యెన్ని
విధములైనను
వశము
చేసుకోటానికి
తగిన
కృషి
చేయవచ్చు.
వాక్కును
మనము
వశము
చేసుకుంటె
జగత్తునే
మనము
వశము
చేసుకున్న
వారమవుతాము.
ఈ
వాక్కు
చేత
ఎంతటి
ఘనకార్యములైనను
చేయవచ్చు.
ఎంతటి
హీనకార్యములైనను
చేయవచ్చు.
ఈ
వాక్కే
ఆశీర్వాదమును
అందిస్తుంది.
దూషణను
చేకూరుస్తుంది.
కనుక
యీ
జిహ్వను
జయదేవుడు
వర్ణిస్తూ
వచ్చాడు.
జిహ్వే
రసజ్ఞే
మధురప్రియత్వం
సత్యం
హితం
త్వాం
పరమం
వదామి
ఆవరణమే
కా
మధురాక్షరాణి
గోవింద
దామోదర
మాధవేతి.
ఓ
రసమెరిగిన
నాలుకా!
ఓ
పవిత్రమైన
నాలుకా!
సున్నితమైన
మధుర
భాషణలాడే
నాలుకా!
నీవు
అనవసరమైన
మాటలతో
ప్రవేశించక,
మధురమైన
అతి
గాఢమైన
ఆనందమునందించే
నామస్మరణ
చేయమని
వర్ణిస్తూ
వచ్చాడు.
3
▾
Meaning
Keep
‘కాలు
జారుతే
కలుగదు
నష్టము,
నాలుక
జారితే
నరకమురా’
అన్నారు.
ఈ
నాలుకను
దుర్వినియోగము
చేసినప్పుడు
హృదయాన్ని
యెంతైనా
గాయపరుస్తుంది.
ఈ
గాయమును
మాన్పే
డాక్టర్లు
యీ
జగత్తునందు
కానరారు.
ఈ
యింద్రియములు
విషయములతో
చేరినప్పుడు
అనంతమైన
ఆనందమును,
అనంతమైన
దుఃఖాన్ని
కూడను
అందిస్తుంది.
నీ
యింద్రియములు
యిక్కడ
వుంటున్నాయి.
నిన్నెవరో
బయట
దూషిస్తున్నారు.
ఈ
దూషణ
బయట
వుంటున్నాది.
నీ
యింద్రియములు
యిక్కడ
వుంటున్నాయి.
కాని
ఆ
దూషణ
అనే
విషయము
నీ
యింద్రియములలో
చేరేంతవరకు
నీవు
యే
విధమైన
వికారము
పొందవు.
ఆవేశమునకు
అవకాశము
నందించవు.
ఉద్రేకపడవు.
కాని
ఆ
విషయమే
నీయొక్క
చెవులకు
చేరినప్పుడు
నీవు
యెంతైనా
క్రోధముతోనూ
ఆవేశముతోనూ,
వుద్రేకముతోనూ
నిండిపోతావు.
ఆవేశమునకు,
యీ
వుద్రేకమునకు
కారణము
యేమిటి?
విషయములు
యింద్రియములలో
వుండినంత
వరకు
ఎట్టి
ఆవేశము
రాదు.
విషయము
యింద్రియములతో
చేరినప్పుడే
యీ
ఆవేశము
బయలుదేరుతుంది.
అదే
మనము
మరొక
మార్గములో
విచారణ
చేసినప్పుడు
నిన్ను
యెవరో
బయట
వర్ణిస్తున్నారు.
నీవు
చాలా
మంచివాడు,
గుణవంతుడని
స్తోత్రము
చేస్తున్నారు.
అది
విననంతవరకు
అతనిపైన
నీకెట్టి
ప్రేమగాని,
ఆనందముగాని
ఆవిర్భవింపదు.
ఆ
విషయమే
నీ
యింద్రియములకు
సోకినప్పుడు
ఆనందముతో
అతనిని
నీవు
యెంతైనా
ప్రేమిస్తావు.
ఈ
ప్రేమకు,
ద్వేషమునకు
కారణమేమిటి?
జిహ్వేంద్రియముల
యొక్క
సంబంధమే
దీనికి
మూలకారణము
కనుక
విషయములను
కొంతవరకు
దూరముగా
పెట్టినప్పుడే
యింద్రియములు
ప్రశాంత
జీవితాన్ని
పొందగలుగుతాయి.
లేక
విషయేంద్రియములు
రెండు
కూడినప్పుడు,
నీవు
సమన్వయ
భావాన్ని
అభివృద్ధి
గావించుకున్నప్పుడు
ఎట్టి
వికారాన్ని
నీవు
పొందవు.
కనుక
యింద్రియములు
అరికట్టుటమంటే
అంత
సులభమైన
మార్గము
కాదు.
సమన్వయ
పరచుకోటం
అతి
సులభ
మార్గము.
ఈ
వుద్రేకమునకు,
వుల్లాసమునకు
పొంగక
కృంగక
సమత్వము
భావించే
విచారణ
చేయాలి.
నీవు
యింద్రియములు
కాదు.
దేహము
కాదు.
నిరంతర
ఆనంద
స్వరూపమైన
ఆత్మనే
అనే
విశ్వాసమును
మనము
బలపరచుకున్నప్పుడే
యీ
యింద్రియముల
యొక్క
బాధలు
మనకు
దూరము
కాగలవు.
ఈ
నిరంతరమైన
విశ్వాసముతోనే
మానవత్వాన్ని
పవిత్రమైన
మార్గములో
ప్రవేశ
పెట్టి
దివ్యమైన
పెన్నిధిని,
సన్నిధిని
మనము
పొందవచ్చు.
4
▾
Meaning
Keep
మీకందరికి
తెలుసు
గొప్ప
తత్వవేత్త
కిల్ఫసిడ్ని
అనే
వాడు
చిన్న
బాలుడుగా
వుండినప్పుడు
విద్యార్థిగా
వేరొక
గ్రామములో
చదువుతూ
వుండే
వాడు.
అతనికి
తండ్రి
చక్కని
ఉత్తరము
వ్రాసాడు.
నాయనా!
నీవు
హృదయ
పూర్వకముగా
నిత్యము
భగవంతుని
ప్రార్థించు.
నీ
మనస్సును
దివ్యమైన
భగవంతుని
సన్నిధికి
చేర్చటానికి
తగిన
కృషిచేయి.
తోటి
విద్యార్థులతో
కాని
అధ్యాపకులతోగాని
నీవు
వినయ
విధేయతలతో
మెలుగుతూ
వుండు.
నీవు
క్రోధముకు
గాని,
నిరాశకుగాని,
నిస్పృహకుగాని
అవకాశము
నందించకు.
నిన్నెవరైనా
దూషించిన
కృంగిపోవద్దు.
నిన్నెవరైనా
వర్ణించిన
పొంగిపోవద్దు.
నీవు
యితరులను
దూషించవద్దు.
కాని
కట్టకడపటికి
ఒక్క
వాక్యము
వ్రాసాడు.
నీవు
వాగ్దానము
చేయవలెనంటె
ఒక్క
భగవంతునికి
తప్ప
వేరెవరికి
నీవు
వాగ్దానము
చేయవద్దు.
వాక్కు
భగవంతుని
యొక్క
శబ్దము
ఒక్క
భగవంతునికి
తప్ప
అన్యులకు
నీవు
వాగ్దానము
చేయవద్దు.
చేసే
అధికారము
కూడను
నీకు
లేదు.
నీ
వాక్కును
దుర్వినియోగ
పరచుకున్న
వాడవౌతావు.
అప్పుడే
నీ
తేజస్సు
ప్రకాశిస్తుంది.
విచక్షణా
భావము
అభివృద్ధి
అవుతుంది.
నీవు
సమాజములో
ఆదర్శవంతమైన
విద్యార్థిగా
తయారౌతావు.
కనుక
నీ
నాలుకను
వశము
నందుంచుకో.
ఎట్టి
సమయమునందు
కూడను
దీనిని
నీవు
విచ్చలవిడిగా
విడువవద్దు.
ఆ
ఆజ్ఞను
శిరసావహించిన
సిడ్నీ
గొప్ప
తత్వవేత్తగా
రూపొందాడు.
విద్యార్థులకు
అధిక
భాష
మతి
హాని
సలుపుతుంది.
విద్యార్థులు
కేవలము
విద్యావిషయములందు
తప్ప
అన్యవిషయములందు
యే
మాత్రము
ప్రవేశించరాదు.
విద్యార్థిగా
నీవు
ప్రవేశించావే
గాని
విషయార్థిగా
నీవు
ప్రవేశించలేదు.
పరిపూర్ణ
విద్యను
నీవు
పొందిన
తరువాత,
విషయములో
నీవు
ప్రవేశించవచ్చు.
అప్పుడు
కూడను
మితమైనటువంటి
రీతిలో
నీవు
మెలగవచ్చు.
కనుక
అతి
భాష
యందు
యీ
నాలుకను
ప్రవేశింప
చేయరాదు.
నాలుక
నాలుగు
విధములైన
పాపములు
చేస్తూ
వస్తున్నాది.
1.
అసత్యమాడటము
2.
చాడీలు
చెప్పటము.
3.
పరదూషణ
చేయటము.
4.
అతిభాష
మాట్లాడటము.
ఈ
నాలిగింటి
వలనే
మానవత్వమునందు
అశాంతి
అభివృద్ధి
అవుతున్నాది.
అనారోగ్యమును
కూడను
సంభవిస్తున్నాది.
కనుక
మానవత్వము
లోపల
‘సత్యం
వద
ధర్మం
చర’
యీ
సత్యమును
మాత్రమే
పలకటానికి
ప్రయత్నించాలి.
కొన్ని
సమయములందు
సత్యము
చెప్పటము
కొంచెము
ప్రమాదమవుతుంది.
అట్టి
సమయములందు
సత్యమూ
వద్దు
అసత్యమూ
వద్దు.
ఈ
విధమైన
మార్గమును
నీవు
అనుసరించినప్పుడే
సమాజమునందు
మానవత్వమును
చక్కగా
పోషించుకున్న
వాడవవుతావు.
ఈ
యింద్రియములు
మహాశక్తివంతమైనవి.
సమస్త
సుఖ
దుఃఖములకు
యీ
యింద్రియములే
ముఖ్య
కారణము.
5
▾
Meaning
Keep
కనుక
యీ
యింద్రియముల
యొక్క
సత్యాన్ని
గుర్తించి
దీని
రూపనామములు
చక్కగా
అనుభవించి
తదుపరి
దీనిని
సరియైన
మార్గములో
ప్రవేశపెట్టుటానికి
తగిన
కృషి
చేయాలి.
ఒక
గొప్పకవి
ఒక
గొప్ప
గానముగా
పాడుతూ
వచ్చాడు
యింద్రియముల
గురించి.
దుర్బుద్ధులు
గల
తలవున్నా
దూరులు
చెప్పే
నోరున్నా
పొంచి
చూచు
కనులున్నా
పంచల
విను
చెవులున్నా
వంచన
గుణ
చిత్రమున్నా
వంచించే
మనసున్నా
ఈ
రీతులు
చూడగనే
న్యాయము
యిక
బ్రతుకదన్నా.
సత్యాన్వేషణ
సలిపి,
న్యాయమును
విచారించి
పవిత్రమైన
బ్రహ్మమార్గమును
ప్రవేశింప
చేసేదే
యీ
మానవత్వము.
మానవుడు
సత్యవ్రతుడు.
ధర్మపరాయణుడు.
న్యాయమే
యితనికి
ఆటపట్టుగా
భావించిన
మానవత్వానికి
సరియైన
సార్థక
నామము
నిలబెట్టాలి.
మానవుని
యందున్న
యీ
పంచేంద్రియములు
యనేక
రకములైన
యిక్కట్లకు
గురి
చేస్తుంటాయి.
ఒక్కొక్క
శబ్దము
ఒక్కొక్క
జీవిని
మాత్రమే
బాధిస్తూ
వచ్చాయి.
కురంగ
తరంగ
మాతంగ
విహంగ
నలబృందములు
ఒక్కొక్క
దానికి
శబ్ద
స్పర్శ
రూప
రస
గంధాదులుకు
వశమవుతూ
వచ్చాయి.
వీటిలో
శబ్దమునకు
వశమయ్యేది
జింక.
స్పర్శకు
వశమై
బానిసగా
మారేది
ఏనుగు.
ఏనుగు
యొక్క
బలము
యిట్టిది
అట్టిది
అని
ఎవరు
చెప్పలేరు.
అంత
బలమైన
ఏనుగు
కూడను
స్పర్శ
చేత
బంధింపబడుతూ
వుంటుంది.
మిడుత
అగ్నిస్వరూపాన్ని
చూచి
తన
ప్రాణము
విడువటానికి
కూడను
సిద్ధమై
పోయి
అగ్నిలో
వచ్చిపడి
పోతుంది.
చేప
మాంసము
యొక్క
రసాన్ని
గ్రోలుతూ
తన
ప్రాణమును
కూడను
లెక్క
చేయక
అందులో
పట్టుబడిపోతుంది.
తుమ్మెద
పుష్పములోని
మకరందాన్ని
ఆశించి
తన
ప్రాణమును
కోల్పోతుంది.
ఈ
విధముగా
శబ్ద,
స్పర్శ,
రూప
రస
గంధములకు
ఒక్కొక్క
ప్రాణి
వశమై
పోతుంది.
కాని
మానవునకు
యీ
ఐదు
వున్నప్పుడు
యే
విధముగా
వశము
కాకుండా
వుంటాడు.
ఇక
యితని
విషయము
చెప్పనక్కరలేదు.
అన్నింటికి
వశమై
పోతున్నారు.
మహా
బలహీనుడై
పోతున్నాడు.
ఒకానొక
సమయము
లోపల
రాక్షస
చక్రవర్తి
హిరణ్యకశిపుని
కుమారుడైన
ప్రహ్లాదుని
దగ్గరకు
పిలచి
విద్యాభ్యాసము
చేసే
నిమిత్తమై
చండామార్కులదగ్గరకు
పంపాడు.
తండ్రికి
విరుద్ధమైన
హరినామాన్ని
నిరంతరము
స్మరిస్తూ
వచ్చారు.
తండ్రి
భరించుకోలేక
పోయాడు.
ఈ
చండామార్కులను
పిలచి
యీ
హరినామమును
మాన్పించే
మార్గమును
భౌతికమైన,
సంసారికమైన
మార్గములో
ప్రవేశపెట్టుటానికి
తగిన
కృషి
మీరు
చేయాలి
అన్నాడు.
6
▾
Meaning
Keep
His poems 323
ఈ
బంధహేతువైన
విషయాన్ని
అతనికి
బోధించమన్నాడు.
అనగా
లోక
సంబంధమైన
ఆకర్షణ
అంతయు
యితనికి
అప్పచెప్పాలి
అన్నాడు.
సంసార
విషయమైన
రహస్యాన్ని
యితనికి
బోధించమన్నాడు.
అప్పుడు
యీ
పారమార్థికము
వదలి
ప్రాకృతమైన
యీ
సంసార
బంధమైన
మార్గమును
ప్రవేశిస్తాడని
అతని
వుద్దేశ్యము.
రాజాజ్ఞప్రకారము
యీ
చండామార్కులు
యెన్నో
విధముల
బోధిస్తూ
వచ్చారు.
కాని
ప్రహ్లాదునికి
యే
విధమైన
చలనము
కలగలేదు.
ఎట్టి
మార్పు
సంభవించలేదు.
అతను
పట్టిన
పట్టును
సడలకుండా
ఒకే
విధమైన
ఆత్మ
భావములో
నిలిచాడు.
అదే
ప్రహ్లాదుని
యొక్క
ప్రతిజ్ఞ.
పట్టిన
దేదియో
పట్టనే
పట్టెను
పట్టునెగ్గెడు
దాక
పోవకుండె
అడిగిన
దేదియో
అడగనే
అడిగెను
అడిగిన
దిడు
దాక
విడువకుండె
తలచిన
దేదియో
తలచనే
తలిచెను
తలపు
తీరెడు
దాక
తరలకుండె
కోరిన
దేదియో
కోరనే
కోరెను
కోర్కె
చెల్లెడు
దాక
కొలిచియుండె
పోరు
పడ
లేక
తానైన
బ్రోవ
వలయు
వడలు
తెలియక
నేనైన
అరుగవలయు
తిరిగి
పోవుట
భక్తుని
దీక్షకాదు.
ఈనాటి
విద్యార్థుల
వలె,
యీనాటి
భక్తుల
వలె
క్షణక్షణము
కూడను
చలించే
హృదయము
కాదు
ప్రహ్లాదునిది.
చలించని
దృష్టి
చలించని
మనస్సు
ప్రహ్లాదునిది.
ఎట్టి
కష్టములకైనా
నష్టములకైనా
దుఃఖములకైనా
తాను
లెక్క
చేయక
హరినామమును
వదలక
నిరంతరము
ఆనందముతో
భగవచ్చింతన
సలుపుతూ
వుండేవాడు.
ఈ
దృశ్యము
చండామార్కులకే
ఆశ్చర్యమును
వేసింది.
చక్రవర్తి
దగ్గరకు
వచ్చారు.
తన్ను
నిశాచరులు
పొడవ
దైత్యకుమారుడు
మాటిమాటికి
పన్నగశాయి!
యో
దనుజభంజన!
యో
జగదీశ!
యో
మహా
పన్న
శరణ్యా!
యో
నిఖిల
పావన!
యంచు
నుతించె
గాని
తా
గన్నుల
నీరు
తేడు
భయకంపసమేతుడు
గాడు
భూవరా!
7
▾
Meaning
Keep
పాములతో
కరపించినా,
పర్వతములపైనుంచి
నూకినా,
ఎన్ని
విధములైన
ఆయుధములతో
హింసించినా
యే
మాత్రమూ
చలించడు.
కన్నుల
నీరు
తేడు.
భయకంపసమేతుడు
కాడు
ఏమిటి
యీ
విచిత్రము
మా
చేత
కాకున్నది
అన్నారు.
అతి
చిన్న
బాలుడైనప్పటికిని
భార్యాభర్తల
సంబంధమైన
విషయాలను
కూడను
అతనికి
ప్రబోధించమని
చెప్పాడు
యీ
చక్రవర్తి.
దీనిని
గుర్తించి
తోటి
విద్యార్థులను
చేర్చుకొని
చక్కని
కథలు
చెప్తుతూ
వచ్చాడు
ప్రహ్లాదుడు.
పిల్లలారా!
నారదుడు
నాకు
బోధించిన
కథలన్నింటిలో
ఒక
కథ
నాకు
గుర్తు
వస్తున్నాది
అని
చెప్పాడు.
ఒక
రాజుకు
అనేకమంది
భార్యలుండేవారు.
ఆ
సవతుల
పోరును
భరించలేక
నిరంతరము
చింతిస్తూ
వచ్చాడు.
ఈ
లోకములో
భార్యవలన
చింతలేని
వ్యక్తి
వున్నాడా
అని
ఒక
సందేహము
వచ్చింది.
ఒకనాడు
తన
రాజ్యములోపల
అట్టివారిని
పరీక్షించాలని
రెండు
పెద్ద
పెండాల్సు
వేయించాడు.
ప్రతి
వ్యక్తికి
దీనిని
తర్కించి
చెప్పటకు
అసాధ్యమని
గుర్తించి
ఒక
పెండాల్
పైన
భార్యకు
లోబడిన
వారెవరో
యిక్కడ
కూర్చోవాలి,
భార్యను
లోబరచుకొన్న
వారెవరో
యీ
పెండాల్
లో
కూర్చోవాలి
అని
రెండు
బోర్డులు
కట్టించాడు.
ఈ
వార్తను
విన్నారు.
మహారాజు
వద్ద
మనము
అసత్యముగా
ప్రవర్తిస్తే
శిక్షిస్తారని
అందరు
భార్యకు
లోబడిన
వారి
పెండాల్
లో
కూర్చుంటూ
వచ్చారు.
వీరి
సంఖ్య
క్షణము
క్షణమునకు
పెరిగిపోతూ
వచ్చింది.
ఒక్కరు
కూడను
రెండవ
పెండాలు
లోనికి
రావటం
లేదు.
ఈ
విధముగా
చూస్తూవుంటె
ఒక
వ్యక్తి
వచ్చి
ఆ
భార్యను
వశపరచుకున్న
పెండాలు
లో
కూర్చున్నాడు.
ఈ
మహారాజు
చాలా
సంతోషించాడు.
ఒక్కడైనా
తనరాజ్యములో
వుంటున్నాడని.
అతని
దగ్గరకు
వెళ్లి,
చాలా
గౌరవముగా
‘అయ్యా!
మీరు
భార్యను
వశమైనవారా
లేక
భార్యను
వశపర్చుకున్నవారా
సత్యమును
పలకమని’
అడిగాడు.
‘మహారాజా!
నేను
అసత్యమును
ఎప్పుడూ
చెప్పను.
నేను
సత్యమునే
పలుకుతున్నాను
నేను
భార్యకు
లోబడినవాడనే’
అన్నాడు.
‘మరి
యెందుకు
యీ
పెండాల్
లోనికి
వచ్చావు.
ఆ
పెండాల్
లోనికి
పోవచ్చుకదా’
అన్నాడు.
‘మీరు
యేమి
ఆజ్ఞయిచ్చినా
నేను
యిక్కడనుండి
కదలను’
అన్నాడు.
ఏమిటి
యింత
మూర్ఖముగా
ప్రవర్తిస్తున్నావని
మహారాజు
కొంచెము
కోపముగా
మాట్లాడాడు.
అప్పుడు
ఆవ్యక్తి
చెప్పాడు
‘నేను
యింటినుండి
బయలుదేరే
సమయములో
నాభార్య
ఒక
ఆజ్ఞయిచ్చింది.
అందరూ
వుండిన
పెండాలులో
నీవు
వుండకూడదు.
ఎవరు
లేని
పెండాలులో
నీవు
వెళ్లి
నిలుచుకో
అని
చెప్పింది.
అందుకై
మీ
ఆజ్ఞనైనను
నేను
ధిక్కరించి
నా
ప్రాణమైనను
నేను
యిస్తాను
గాని
నా
భార్య
ఆజ్ఞను
నేను
ధిక్కరించలేను’
అన్నాడు.
అనగా
మనస్సనే
యజమానునకు
యింద్రియములనే
భార్యలు
అధికముగా
వుండటం
చేత
యీ
యింద్రియములనే
భార్యలకు
మనస్సు
వశమై
పోయింది
అని
దీని
అర్థము.
8
▾
Meaning
Keep
Also in his talks
(9)
21 June 1989
Live as an Ideal
24 May 1990
Hold the Reins
25 May 1990
Vagaries of the Mind
27 February 1995
Every atom is the form of God
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
20 November 2000
Prema and Service Are Like Wings That Carry Us to the Heights
15 April 2003
Ancient traditions are the steps to rising higher
15 January 2008
Revere your mother as God, your father as God
18 June 2008
Divine Message
కనుక
యింద్రియములు
మనస్సు
యొక్క
స్వాధీనమై
పోయి
కేవలము
మనస్సు
మార్గమే
పాటిస్తూ
వుంటుందిగాని
బుద్ధికి
యే
మాత్రము
వశము
కావటం
లేదు.
దేహముకంటె
అతి
సూక్ష్మమైనవి
యింద్రియములు.
ఇంద్రియములకంటె
అతి
సూక్ష్మమైనది
మనస్సు.
మనస్సుకంటె
అతి
సూక్ష్మమైనది
బుద్ధి.
బుద్ధికంటె
అతి
సూక్ష్మమైనది
ఆత్మ.
సర్వము
కూడను
ఆత్మవశము
కావలసిందే
తప్పదు.
కనుక
మానవత్వములో
యింద్రియములు
మహాబలవత్తరమైనటువంటివి.
ఈ
యింద్రియములను
మనము
మొట్టమొదట
అరికట్టినప్పుడే
యీ
జీవితము
ఆకర్షవంతమైన
జీవితముగా
రూపొందుతుంది.
ఈనాడు
యింద్రియములను
అరికట్టలేక
పోవుట
చేతనే
వారియొక్క
నడతలుగాని,
వారి
యొక్క
నిలకడగాని,
వారి
యొక్క
కూర్చోటంగాని
అన్నీ
విరుద్ధమైన
మార్గమును
అవలంబిస్తున్నాయి.
క్లాసు
రూములో
కదలక
మెదలక
సరియైన
రీతిలో
కూర్చునే
విద్యార్థి
కనుపించటం
లేదు.
ఏ
విధముగా
నడచాలి,
యే
విధముగా
కూర్చోవాలి
ఏ
విధముగా
నిద్రించాలి,
ఏ
విధముగా
మాట్లాడాలి,
పెద్దలలో
వుండేటప్పుడు
యే
విధముగా
ప్రవర్తించాలి
అనే
విషయములు
వారికి
యే
మాత్రము
తెలియదు.
ఒక
మిత్రునితో
మాట్లాడుతున్నప్పుడు
ఆ
మిత్రునిపై
దృష్టి
వుండాలిగాని
అటు
యిటు,
యిటు
అటు
చూచుకుంటూ
మాట్లాడకూడదు.
దృష్టిని
యే
విధముగా
కూడను
ప్రసరింప
చేయకూడదు.
ఇది
యువకులకు
చాలా
ప్రధానమైనది.
తన
దృష్టి
సరియైన
దృష్టిగా
తాను
నిలుపుకోటానికి
చూచుకోవాలి.
ఎవరితోనైనా
మాట్లాడుతూ
వుండినప్పుడు
అనేక
రకములుగా
అన్ని
అంగములు
కదలిస్తూ
వుంటారు.
కొంతమంది
మాట్లాడుతూ
వుంటె,
వుపన్యాసమిస్తుంటె
పెద్ద
dance
ఆడినట్లుగా
వుంటుంది.
చేతులు,
కాళ్లు
అంతా
ఆడిస్తూ
వికారమైన
చేష్టలుగా
వుంటుంటాయి.
అంగములు
ఆడించకుండా
మాట్లాడాలి.
ఈ
విధమైన
ప్రయత్నములు
మనము
చేస్తూ
వుండటం
చేత
యింద్రియములన్నియు
అభ్యాసము
చేత
సరియైన
మార్గములో
ప్రవేశిస్తాయి.
కనుకనే
శ్రేయోహి
జ్ఞానమభ్యాసాత్
జ్ఞానాద్ధ్యానం
విశిష్యతే
ధ్యానాత్కర్మ
ఫలత్యాగ
స్త్యాగాచ్ఛాన్తి
రనన్తరమ్.
అన్నారు.
ప్రతి
ఒక్క
దానికి
మనము
అభ్యాసము
చెయ్యాలి.
అభ్యాసము
లేకుండా
దేనిని
మనము
సాధించలేము.
9
▾
Meaning
Keep
పుట్టినప్పటినుండి
కూర్చోటం
అభ్యాసము
చెయ్యాలి.
నడవటం
అభ్యాసము
చెయ్యాలి.
పరుగెత్తటం
చేయాలి.
మాట్లాడటం
చేయాలి.
అన్నము
తినటం
అభ్యాసము
చేయాలి.
ఇవన్నీ
అభ్యాసము
చేత
యేర్పడినవే.
ఈనాటి
విద్యార్థులకు
నలభై
అడుగుల
రోడ్డయినను
నడచటానికి
స్థలము
వుండదు
వాళ్లకు.
ఇదంతా
ప్రహ్లాదుడు
యవ్వనము
యొక్క
సన్నిపాత
లక్షణమని
అన్నాడు.
తమ
అడుగులు
తాము
చూచుకుంటూ
నడచాలి.
అది
సరియైన
నడక.
నడక
ఎక్కడో
జరుగుతూ
వుంటుంది.
చూపులెక్కడో
పోతుంటాయి.
దీనివల్ల
ప్రమాదము
జరుగుతుంది.
తద్వారా
అనేక
రకములైన
బాధలకు
గురౌతూ
వుంటారు.
కనుక
యీ
విధమైన
అభ్యాసము
చేత
యింద్రియములను
మనము
కొంత
వరకు
సమన్వయము
గావించుకోవచ్చు.
కొంతమంది
నిద్రించే
సమయము
లోపల
మరింత
వికారముగా
వుంటారు.
చాకలివాడు
ఒక
పెద్ద
మూట
కట్టుకొని
పోతాడే
ఆ
మూటవలె
తయారై
పోతారు.
వంగి
చాలా
కిక్కిరిసి
పండుకుంటారు.
తద్వారా
అనేక
రోగములకు
కూడను
గురౌతారు.
కూర్చునే
సమయము
లోపల
యీ
డబ్బై
యేండ్లో
ఎనభై
యేండ్లో
వారివలె
వంగి
కూర్చుంటారు.
ఇది
మంచిది
కాదు.
spinal
column
bend
కావటం
చేత
అతి
త్వరలోనే
వృద్ధాప్యము
సమకూరుతుంది.
నడచే
సమయములో
చక్కగా
కట్టవలె
నడచాలి.
కూర్చున్నప్పుడు
కూడను
కట్టవలె
కూర్చోవాలి.
వంగి
కూర్చోకూడదు.
మనము
అభ్యాసము
చేసినప్పుడే
యింద్రియములు
కూడను
క్రమక్రమేణా
వశమవుతాయి.
అనవసర
విషయాలలో
మనము
ప్రవేశించకూడదు.
ఈనాటి
మానవత్వములో
వున్న
బలహీనత.
అది
కన్నులు
కనుపించక,
చెవులు
వినిపించక
వున్న
వ్యక్తి
కూడను
యిద్దరు
మాట్లాడుతుంటె
ఏమిటి
మాట్లాడుతున్నారని
ప్రశ్న
వేస్తుంటారు.
వారు
ఏమి
మాట్లాడితే
నీకెందుకు.
ఇందులో
నీవెందుకు
ప్రవేశించాలి.
ఊరకే
అందరి
దగ్గరకు
వెళ్లి
మాట్లాడుతూ
వుంటారు
కొంతమంది.
ఇది
కేవలము
ఒక
దురభ్యాసముగా
వుంటుంటాది.
ఇతరుల
విషయాన్ని
కూడను
ప్రశ్నిస్తూ
వుంటారు.
అతనేమి
చెప్పాడు.
ఇతనేమి
చెప్పాడు
అని.
ఇతనికేమి
పని
యివన్నీ.
ఈ
విధమైన
దుశ్చర్యల
వలనే
యింద్రియములు
మరింత
బాధలకు
గురిచేస్తున్నాయి.
ఎవరి
విషయమునందు
కూడను
మనము
ప్రవేశించరాదు.
నీకు
ఎంత
అవసరమో
అంతవరకే
నీవు
తీసుకో.
చిక్కినవారి
దగ్గరంతా
మాట్లాడటం
చేత
అది
ఒక
గౌరవ
హీనమై
పోతుంది.
ఎవ్వరు
కూడను
నిన్ను
గౌరవించరు.
నీవు
వస్తున్నావంటె
వస్తున్నాడురా
వీడు
అని
ప్రక్కకు
తప్పుకొని
పోతారు.
ఏమైనా
నీకు
అవసరముంటె
good
morning
అంటె
good
morning,
How
are
you,
How
are
you.
10
▾
Meaning
Keep
అంతే
చాలు.
యింకేమి
వద్దు.
ఇల్లు
బజారులో
నిల్చుకొని
మాట్లాడటమనే
దురభ్యాసము
మహా
చెడ్డది.
నీకు
యేదైనా
అవసరముంటె
హాస్టలుకు
వెళ్లిన
తరువాత,
రూముకు
వెళ్లిన
తరువాత
చర్చించుకోవచ్చు.
ఇల్లు
బజారులో
పోయే
సమయములో
యువకులెవ్వరును
మాట్లాడకూడదు.
నీ
చూపును
అదుపులో
పెట్టుకోవాలి.
మనము
మనుష్యులము.
కాకులము
కాదు.
కాకులైతే
అటు
యిటు
ఒక్క
నిముషమైనను
స్థిరముగా
వుండవు.
కనుక
యీ
విధమైన
క్రమశిక్షణను
మనము
పాటించినప్పుడే
మనము
నిజమైన
మానవత్వాన్ని
పొందిన
వారమవుతాము.
విద్యార్థులకు
యిది
అత్యవసరము.
చదివే
సమయములో
సరియైన
స్థితిలో
మనము
కూర్చొని
చదువుకోవాలి.
ఎందుకనగా
యీ
దేహమునకు
ఒక
ప్రత్యేకమైన
విశిష్టత
వుంటున్నాది.
పశువులకు,
మృగములకు
spinal
column
వంగి
వుంటుంది.
మనిషికి
spinal
column
చక్కగా
వుంటుంది.
మూలాధారమునుండి
సహస్రారము
వరకు
పోయే
మార్గము
సరియైనదిగా
వుంటుండాలి.
ఇది
సరియైన
స్థితిలో
వుంటె
సరియైన
ఆలోచనలు
సలుపుతూ
వుంటుంది.
అట్లు
కాకుండా
వంగిపోతే
యిది
సక్రమమైన
మార్గమును
అవలంబించదు.
ప్రతి
మానవుని
యందు
కూడను
101
నాడులు
వుంటుంటాయి.
అందులో
ఒక్క
నాడి
మాత్రమే
ప్రత్యేకముగా
వుంటుంది.
అది
కేవలము
సహస్రారములో
సంబంధమై
వుంటుంది.
ఇది
ఆధ్యాత్మిక
మార్గములో
ధ్యాననిష్ఠలో
నుండిన
వారికి
యిది
సహాయకారిగా
వుంటుంది.
దీనినే
సుషుమ్న
నాడి
అన్నారు.
ఇడ,
పింగళ,
సుషుమ్న
నాడి
తత్వము
లోపల
భ్రూమధ్యమునుండి
చేరినప్పుడే
యీ
సుషుమ్న
నాడి
ఒక
ప్రత్యేకమైన
ఏకాగ్రతను
అందజేస్తుంది.
spinal
column
లోపల
మొత్తము
33
rings
వున్నాయి.
అందు
తొమ్మిదినుండి
పన్నెండు
వరకు
వుండిన
దానియందే
సుషుమ్ననాడి
చక్కగా
వెలుగుతూ
వుంటుంది.
నల్లటి
మేఘముల
మధ్య
ఒక్కతూరి
మెరుపు
మెరిచినప్పుడు
ఎంత
ప్రకాశముగా
వుండునో
మన
spinal
column
లోపల
అదేవిధముగా
విద్యుల్లేఖ
ఒక్కతూరి
మించుతూ
వుంటుందట.
అదే
మన
యొక్క
ప్రాణాధారము.
కుండలినీ
యోగము
చేసేవారికి
యిది
సరిగా
అర్థమవుతుంది.
ఏ
యోగమైనా
చేయి
యోగము
చేయనప్పటికి
నీవు
సరియైన
స్థితిలోనే
దేహాన్ని
వుంచుకోవాలి.
పండుకుంటారు
బోర్లా.
దిండుపైన
books
పెట్టుకుంటారు.
ఇంక
వాళ్లను
వంచుతారు.
ఇలాంటి
వారికి
ఎన్ని
గంటలు
చదివినప్పటికి
వారికేమి
తలకెక్కదు.
11
▾
Meaning
Keep
దేహము
చక్కగా
వుంటుండాలి
కాని
యిక్కడ
ఎత్తితే
అక్కడా
ఎత్తితే
అమ్ములు
పొదిగినట్లుగా
వుంటుంటాది.
ఇలాంటి
వికారమైన
చేష్టల
వలనే
విద్యార్థులకు
సరియైన
జ్ఞాపకశక్తి
లేకుండా
పోతున్నాది.
సరైన
జ్ఞాపకశక్తి
మనకు
కుదరాలంటె
చక్కగా
కూర్చొని
చదవాలి.
చదవాలని
లేకుంటె
నీవు
book
మూసి
నిద్రపో.
సంతోషము.
తప్పులేదు.
అనవసరంగా
నిర్బంధ
మాఘస్నానమెందుకు.
నీవు
అలసటగా
వుంటున్నప్పుడు
చదవకూడదు.
ఏదో
చదవాలి
చదవాలని
టీ
ప్రక్కన
పెట్టుకొని
త్రాగుతూ
పోతూ
చదువుతూ
వుంటె
యిలాంటి
అవస్థలలో
యేమాత్రము
చదివి
ప్రయోజనము
లేదు.
ఈ
జ్ఞాపకశక్తి
పోవటమే
కాకుండా
ముందు
ముందుకు
నీకు
భయంకరమైన
వ్యాధులు
కూడా
సంభవిస్తాయి.
చేతులు,
కాళ్లు
అదురుతాయి.
కనుకనే
మానవుడు
విద్యార్థి
దశయందుండినప్పుడు
సరియైన
స్థితిలో
యీ
దేహాన్ని
మనము
పోషించుకోవాలి.
ఏ
ఘనకార్యము
సాధించవలెనన్నను
దేహముతోనే
సాధించాలి.
దైవానుగ్రహము
పొందవలెనన్నను
దేహము
ఒక
పనిముట్టు.
ధర్మార్థకామమోక్షములందు
ప్రవేశించవలెనన్నను
యీ
దేహము
ఒక
ఆధారము.
దేహము
అశాశ్వతమైనప్పటికి
మన
కార్యార్థమై
దీనిని
సరియైన
స్థితిలో
వుంచుకోవాలి.
మనము
పాదములకు
రక్షలు
వేసుకొని
బయలుదేరుతాము.
ఏదైనా
ఒక
నది
వచ్చిందంటె
ఆ
పాదరక్షలు
చేతిలో
పట్టుకొని
నడుస్తాము.
ఇదేమి
పాదుకాపట్టాభిషేకమా?
కాదు.
కాదు.
ఎందుకు
నీవు
పాదుకలంతా
చేత
బట్టాలి.
నీ
పాదాలను
రక్షించుకొనే
నిమిత్తమై
నీవు
దీనిని
చేతిలో
పట్టుకోవాలి.
అదే
విధముగనే
చెప్పులు
చాలా
విలువలేనివి
అయినప్పటికిని
దానిని
మనకు
అవసరమైన
విధముగా
వుపయోగించుకునేటప్పుడు
దానికి
యివ్వవలసిన
గౌరవమును
కూడను
యివ్వాలి.
దీని
వలన
కొన్ని
ప్రమాదములు
కూడను
తప్పిపోతాయి.
యుద్ధ
సమయమునందు
తొమ్మిదవ
దినము
భీష్ముడు
ప్రతిజ్ఞ
చేశాడు.
పాండవులను
హతమారుస్తాను
రేపటి
దినములోపల
అని
ప్రతిజ్ఞ
చేశాడు.
ఈ
వార్త
ద్రౌపతి
చెవిలో
పడింది.
ఆమె
కన్నీరు
మున్నీరుగా
ఏడుస్తూ
వస్తుండాది.
కృష్ణా!
యిన్నాళ్లు
రక్షించిన
నీవు
యీనాడు
నా
సుమంగళత్వమును
రక్షించలేక
పోతున్నావా?
కృష్ణా
భీష్ముని
యొక్క
ప్రతిజ్ఞ
తప్పదు.
అతను
సత్యవాక్సంపన్నుడు.
అతని
మాటకు
యేనాడు
కూడను
విరుద్ధము
జరుగదు.
కనుక
నా
పతి
యొక్క
మరణము
సమీపిస్తూ
వస్తుండాది.
ఈ
జగత్తునందు
నీవు
తప్ప
నాకు
పతిబిక్ష
పెట్టువారు
మరొకరు
లేరు
అని
పాదములు
గట్టిగా
పట్టింది.
కృష్ణుడు
చెప్పాడు.
‘అమ్మా!
ఏ
ఒక్క
దానికైనను
కొన్ని
ఉపాయములు
అత్యవసరము.
ఈ
ప్రాకృతమైన
లోకమునందు,
ఈ
లౌకికమైన
జగత్తునందు
కొన్ని
రకములైన
యుక్తులు
కూడను
అత్యవసరముగా
వుపయోగపెట్టాలి.
12
▾
Meaning
Keep
కార్యము
సాధించవలెననుకున్నప్పుడు
చేయరాని
పనులను
కూడ
మనము
చేయక
తప్పదు.
ఇలాంటి
సమయములందు
నేను
అల్పుడను,
అధికుడను
అనే
భేదభావము
పెట్టుకొనరాదు.
కనుక
నేను
చెప్పినట్లు
చేయి’
అన్నాడు.
అప్పుడు
ద్రౌపతి
చెప్పింది
కృష్ణా!
నీ
మాటను
నేనెప్పుడైనా
వుల్లంఘించానా?
నా
ప్రాణమునైనను
నేను
సులభముగా
వదులుతానుగాని
మీ
ఆజ్ఞను
నేను
వదలను.
మీ
ఆజ్ఞను
నేను
పాటిస్తాను
అన్నది.
కాలము
రాత్రి
పదిగంటలైంది.
పాండవులు
పాండవుల
యొక్క
గుడారాల్లో
వుంటున్నారు.
కౌరవులు
కౌరవుల
గుడారాల్లో
వుంటున్నారు.
కాని
ప్రత్యేకించి
వుంటున్నాడు
భీష్మాచార్యుడు
ఒక
గుడారములో.
ఏదో
ఆవేశములో
ఆ
యొక్క
పరిస్థితి
యందు
ఆ
మాట
అన్నాడేగాని
తిరిగి
తనలో
తాను
బాధపడుతున్నాడు.
సత్యధర్మ
స్వరూపులే
యీ
పాండవులు.
సత్యవ్రతులే
యీ
పాండవులు.
వీరిని
యే
రీతిగా
నేను
సంహరించాలి.
ఇది
న్యాయము
కాదే.
ఏదో
చేయరాని
పనిని
నేను
చేస్తున్నానే
అని
తనలో
తాను
బాధపడుతున్నాడు.
ఏ
మాత్రము
ఆహారము
తీసుకోలేదు.
కేవలము
అటూ
యిటూ,
అటు
యిటూ
తిరుగుతున్నాడు.
ఏ
రీతిగా
దీనిని
చెయ్యాలి.
నా
మాటను
యే
రీతిగా
దక్కించుకోవాలి.
ఏ
రీతిగా
నేను
నిలబెట్టుకోవాలి.
అని
విచారణ
చేస్తూ
తిరుగుతున్నాడు.
లీలానాటక
సూత్రధారియైన
భగవంతుడు
యెన్ని
యుక్తులచేతనైనను
కష్టములను
తప్పించవచ్చు.
ద్రౌపతికి
చెప్పాడు.
అమ్మా!
ఈ
పరిస్థితుల
యందు
నేను
నీవు
కలసి
పోతుంటె
లోకులు
కాకులు.
నీవు
కొంచెము
ముందుగా
బయలుదేరి
వెళ్లు.
అదిగో
అదే
భీష్మాచార్యుని
యొక్క
టెంటు.
నేను
వెనుక
వస్తానన్నాడు.
ఈమె
ఆ
కాలములోపల
రాజకుమార్తెల
యొక్క
చెప్పులు
చాలా
శబ్దముతో
వుంటుండేవి.
ఈమె
వేసుకొనే
చెప్పులు
చాలా
శబ్దముతో
వుంటుండేవి.
నిలిపాడు.
ద్రౌపతీ!
యీ
సమయములోపల
నీవు
యిటువంటి
చెప్పులు
వేసుకొని
పోవటానికి
వీలులేదు.
నీ
చెప్పులు
నాకివ్వు
అని
ఆ
చెప్పులు
పుచ్చుకున్నాడు.
అంగవస్త్రములో
చుట్టుకున్నాడు.
భీష్ముడు
తలవంచుకొని
తిరుగుతున్నాడు
యోచిస్తూ.
నీవు
సత్వరున
వెళ్లి
అతని
పాదములపై
పడు.
కేవలము
పడిపోవటం
వలన
వుపయోగము
వుండదు.
నీ
గాజుల
శబ్దమును
వినిపించు
అన్నాడు.
పరుగెత్తి
పోయింది.
అటు
యిటు
తిరుగుతున్న
భీష్ముని
పాదములపై
పడింది.
గాజుల
శబ్దము
చేసింది.
వెంటనే
యోచనలో
వున్న
భీష్ముడు
యీమె
ఎవరో
సుమంగళి
అనుకొని
‘దీర్ఘ
సుమంగళీ
భవ’
అని
ఆశీర్వదించాడు.
తక్షణమే
యీమె
ఆనందించింది.
‘పితామహా!
నేను
దానిని
కోరే
వచ్చాను’
అన్నది.
ఈ
విధముగా
వారు
సంభాషణ
సలుపుతున్నప్పుడు
యీ
యుక్తి
ఎవరు
పన్నారు?
నిన్ను
ఎవరు
తీసుకొని
వచ్చారు?
13
▾
Meaning
Keep
ఎవరు
నీకు
యీ
మార్గాన్ని
చూపించారు’
అని
ప్రశ్నిస్తూ
వస్తున్నాడు
భీష్ముడు.
భీష్ముని
యొక్క
వాక్కు
తప్పదు.
అతను
గాంగేయుడుగా
వుండి
యీ
విధమైన
ప్రతిజ్ఞలోపల
సరియైన
సత్యస్వరూపుడుగా
వుండటం
చేత
అతని
ప్రతిజ్ఞలన్నీ
నెరవేరుతూ
వుంటాయి.
కొంతసేపయ్యేటప్పటికి
కృష్ణుడు
ప్రవేశించాడు.
కృష్ణా!
నీవు
నేర్పినదే
యిదంతా.
యీ
ప్లాను
బాగానే
వుంది’
అని
హెచ్చరించాడు.
ఇది
సంతోషమే.
ఈ
పాండవులను
రక్షించటానికి
యిదొక
మార్గమైపోయిందని
ఆనందించాడు.
అప్పుడతనికి
ఆకలి
కొంతవరకు
గుర్తొచ్చింది.
చింత
వుండినంతవరకు
మనకు
ఆకలి
యే
మాత్రము
తెలియదు.
చింతలతో
వుండినవాడు
విందును
ఆరగించడు.
ఈ
దుఃఖము
నివారణ
అయ్యేటప్పటికి
ఆకలి
అతనికి
గుర్తువచ్చింది.
‘కృష్ణా!
ఏమిటి
నీ
చంకలో
వున్నవి’
అని
అడిగాడు.
ఆ
స్లిప్పర్స్
క్రింద
వేశాడు.
ఇవి
ద్రౌపతివని.
ఇది
భీష్ముని
యొక్క
కంటి
ధారలు
వేగముగా
కారుతూ
వచ్చాయి.
‘కృష్ణా!
భక్తరక్షణకై
నీవు
ఎన్ని
రకములైన
బాధలు
పడతావు.
ఇది
కూడను
నీ
లీలలలో
ఒకటి.
ఇది
చేయతగినదా,
చేయతగనిదా
అనే
విచారణ
కూడ
నీకు
వుండదు.
కనుక
యీ
విధమైన
సమయములో
నీవు
చేసే
దాంట్లో
యింద్రియనిగ్రహము
లోపల
హెచ్చుపల్లములను
మనము
యేనాడు
పాటించరాదు.
పరులకు
ఉపకారము
చేసే
విషయము
లోపల
కాని
పరులను
సరియైన
మార్గములో
పెట్టే
నిమిత్తము
కాని
మనము
దేనినైనా
త్యాగము
చేయుటలోపల
సిద్ధముగా
వుంటుండాలి
గాని
ఆ
త్యాగము
లోపల
కూడను
సక్రమమైన
మార్గమును
అవలంబించాలి.
ఏదో
విరుద్ధముగా,
మొరటుగా
మనము
ప్రవర్తించరాదు.
సక్రమమైన
మార్గము
లోపలే
యీ
యొక్క
సంస్కృతి
మనకు
అలవడుతుంది.
ఈ
విధముగా
ప్రాచీనకాలమునుండి
భారతదేశములో
వున్న
వేద
శాస్త్ర
యితిహాస
పురాణముల
లోని
ప్రమాణములు
విద్యార్థులు
గుర్తించినప్పుడు
సరియైన
మార్గమును
మీరు
తప్పక
అనుసరించుతారు.
ఈనాటి
విద్యార్థులకు
శాస్త్రమంటె
యేమిటో,
పారాయణమంటె
యేమిటో,
రామాయణమంటె
యేమిటో
యేమీ
తెలియదు.
భారతీయ
మహర్షులందరు
కూడను
యిటువంటి
పవిత్ర
మార్గమును
అనుసరించుట
చేత
వారికి
దేదీప్యమానమైన
తేజస్సు
వారు
చిరంజీవులుగా
గౌరవ
మర్యాదలు
నిలుపుకోగలిగారు.
అట్టి
మహర్షుల
యొక్క
సాంప్రదాయముగా
యీ
విద్యార్థులు
రూపొందాలి.
అప్పుడే
మన
భారత
దేశము
యొక్క
ప్రాచీన
సంస్కృతిని
మనము
పునరుద్ధరించిన
వారమవుతాము.
భౌతిక
విద్యలతో
బాటు
ప్రాచీన
సంస్కృతిని
కూడను
మనము
సరియైన
మార్గములో
అనుభవించాలి.
నా
యొక్క
వుద్దేశ్యము
spirituality
యొక్క
essence
culture.
అంతేగాని
యీ
culture
వేరు
spiritual
వేరు
అని
విభాగము
చేయరాదు.
14
▾
Meaning
Keep
ఇది
ఆధ్యాత్మిక
ఆనందము
యొక్క
స్వరూపమే
మన
యొక్క
సంస్కృతి.
ఈ
సంస్కృతి
సంస్కృతము
నుండి
వచ్చినదే.
ఈ
సంస్కృతమనేది
కేవలము
సంస్కారముతో
యేర్పడినదే.
ఈ
సంస్కారమే
ఆధ్యాత్మికము.
ఈ
ఆధ్యాత్మికము
చేతనే
అన్ని
సంస్కృతులు
కూడను
ఆవిర్భవిస్తూ
వచ్చాయి.
అన్నింటి
యందు
వున్నది
ఒకటిలే
ఒక్కటే
ఒక్కటే.
అదే
ఏకం
సత్.
అన్ని
దేశముల
యొక్క
సంస్కృతి
కూడను
యీ
ఆధ్యాత్మిక
మార్గములోనే
అణగి
వుంటున్నాయి.
మనము
ఎన్ని
రకములైన
స్వీట్సు
చేసుకున్నప్పటికి
గోధుమ
హల్వా,
బాదం
ఖీరు,
గులాబ్
జామ్,
జిలేబి
అన్నింటిలో
వున్నది
చక్కెర
ఒక్కటే.
అని
యే
విధముగా
మనము
గుర్తించగలమో
అదే
విధముగా
యే
దేశము
యొక్క
సంస్కృతి
యైనను
ఆధ్యాత్మికము
నుండి
ఆవిర్భవించినదే.
culture,
spirituality
అని
రెండు
divide
చేయటం
మంచిది
కాదు.
ఒక్క
spirituality
వుంటుంటె
అందులోనే
culture
వుంటుండాది.
శరీరమంటె
యేమిటి?
కన్ను,
ముక్కు,
చెవి,
కాలు,
నోరు,
కడుపు,
తల
అన్నీ
చేరినదే
యీ
యొక్క
దేహము.
కాని
ఒక్కొక్క
అంగము
ప్రత్యేకించి
ఒక్కొక్క
శరీరము
కానేరదు.
కనుక
అన్ని
అంగములతో
కూడిన
మన
శరీరమే
విశ్వం.
ఈ
విశ్వము
విష్ణుస్వరూపము.
కనుక
సర్వము
మనయందే
వుంటుండాది.
దీనిని
విభాగము
చేయుటము
మంచిది
కాదు.
ఇది
లౌకికము
యిది
ఆధ్యాత్మికము
అని
యే
మాత్రము
విభాగము
చేయకూడదు.
ఈ
రెండింటి
యొక్క
ఏకత్వమే
దివ్యసృష్టికి
మూలకారణము.
ఒక
విత్తనము
వుంటుండాది.
ఆ
విత్తనములో
రెండు
బద్దలు
వుంటున్నాయి.
ఆ
రెండు
బద్దలు
చేరినప్పుడే
అది
మొక్కగా
వృక్షముగా
అభివృద్ధి
అవుతుంది.
రెండూ
రెండు
బద్దలుగా
చీల్చి
వేస్తే
యిక
సృష్టే
వుండదు.
ఈ
రెండు
బద్దలపైన
చర్మము
husk
వుంటుండాది.
దీనినే
సంస్కృతి
అన్నారు.
అయితే
దీనిని
అది,
అది
దీనిని
వదులుటానికి
వీలులేదు.
కనుక
రెండింటి
యొక్క
ఏకత్వమే
భారతీయ
సంస్కృతిగాని,
విదేశీయుల
సంస్కృతిగాని
సర్వసంస్కృతులుగాని
యీ
ఏకత్వముతో
కూడినవే.
ఇలాంటి
విశాల
భావము
లేనివారు
కనుకనే
ఒక్కొక్కరు
మాదొక
సంస్కృతి,
మాదొక
సంస్కృతి
అని
యీ
విధముగా
విభజిస్తూ
వచ్చారు.
నాది
హిందూ
మతము.
నాది
క్రిష్టియన్
మతము.
నాది
యిస్లాం
మతము.
నాది
బౌద్ధమతము.
అని
యీ
విధముగా
విభజించటము
లోపల
యిది
సంకుచితమే
గాని
విశాలము
కాదు.
Religion
అంటె
ప్రత్యేకము
కాదు.
Religion
అంటె
to
realise
అని
అర్థము.
అంతేగాని
నాదొక
religion
నీదొక
religion
కాదు.
అంతా
realise
చేసినవారంతా
ఒకే
religion.
కనుక
సరియైన
సమన్వయాన్ని
మనము
కొంతవరకు
అభివృద్ధి
పరచుకోవాలి.
15
▾
Meaning
Keep
ఈనాడు
శరీరము
యింద్రియములకు
కొంత
సన్నిహిత
సంబంధమున్నది.
ఇంద్రియములు
లేని
శరీరము,
శరీరము
లేని
యింద్రియములు
వుండుటకు
వీలుకాదు.
అదేవిధముగనే
బుద్ధి,
మనస్సు,
యింద్రియములు,
దేహములకు
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
వుంటున్నాది.
ఒక
చిన్న
ఉదాహరణము.
కృష్ణుడు
ధృతరాష్ట్రుని
వద్దకు
రాయబారానికి
వెళ్లాడు.
ధృతరాష్ట్రుడు
ప్రశ్నించాడు
“పాండవులు,
కౌరవులు
అన్నదమ్ముల
బిడ్డలే.
యీ
పాండవులపైనే
యింత
ప్రీతి
యెందుకు
కౌరవులపైన
ఎందుకు
చూపటంలేదు?
భగవంతునికే
యింత
భేదము
వుండవచ్చునా?”
‘ధృతరాష్ట్రా!
నీవు
భౌతికమైన
అంధుడవే
కాదు.
జ్ఞానాంధుడవు
కూడా’
అన్నాడు.
‘ఇక్కడ
పాండవులకు
నాకు
వున్నటువంటి
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
నేను
చెప్పుతున్నాను.
ఎవరు
నన్ను
ఆశ్రయిస్తారో,
ఎవరు
నన్ను
సరియైన
మార్గములో
ఎన్నుకుంటారో,
ఎవరు
నాకు
శరణాగతి
అవుతారో
వారినే
నేను
ఆదరించక
తప్పదు’.
అందువలనే
ఒకానొక
సమయములో
నారదుడు
కూడను
అడిగాడు.
‘నారాయణా!
నీవు
ఎక్కడ
వుంటావో
తెలియదు.
నీకు
బ్రాంచి
ఆఫీసులు
చాలా
వుంటున్నాయి.
కాని
సరియైన
ఎడ్రసు
నాకు
యివ్వమన్నాడు’.
ఇది
నా
అడ్రసు
అన్నాడు
కృష్ణుడు
‘మద్భక్తాః
యత్ర
గాయన్తి
తత్ర
తిష్ఠామి
నారద’
ఎవరు
వారి
హృదయములందు
నన్ను
పరిపూర్ణమైన
ప్రేమతో
చింతిస్తుంటారో
అక్కడే
నేను
శాశ్వతంగా
వుంటాను.
ఇది
బ్రాంచి
ఆఫీసు
కాదు
కేవలము
హెడ్డాఫీసు’.
అన్నాడు.
‘పాండవులకు
నాకు
వున్న
సంబంధము
నీకు
చెపుతున్నాను
వినమన్నాడు.
ఇది
దేహము.
రెండు
కాళ్లు
వున్నాయి.
కడుపు
ఒకటి
వుంటున్నది.
భుజములు
రెండు
వుంటున్నాయి.
తల
ఒకటి
వుంటుండాది.
ఇవన్నీ
కలిపి
చేరితే
ఒక
దేహము.
ధర్మజుడు
శిరస్సు
వంటివాడు.
అర్జునుడు
భుజముల
వంటివాడు.
భీముడు
కడుపు
వంటివాడు.
నకుల
సహదేవులు
కాళ్ల
వంటివారు.
ఈ
దేహములో
కృష్ణుడే
గుండె.
ఈ
గుండె
లేకపోతే
దేహము
లేదు.
దేహము
లేకపోతే
గుండె
మనకు
కనుపించదు.
కనుక
పాండవులకు
నాకు
వున్న
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమని’
అన్నాడు.
అదేవిధముగనే
దేహము,
ఇంద్రియములు,
మనస్సు,
బుద్ధి
యీ
అన్నిటితో
బాటు
చేరుకున్నదే
ఆత్మ.
ఇవన్నీ
కలసినదే
ఒకే
రూపము.
ఏకం
సత్
వున్నది
ఒక్కటే.
ఏకదేహములో
అనేక
అణువులు
వున్నట్లుగా
అనేక
రూపములు
ధరిస్తూ
వుండాది.
కనుక
మనము
యింద్రియ
విషయాలను,
దేహసంబంధమైన
విషయాలను
కేవలము
కొంతవరకు
మాత్రమే
గుర్తించుకున్నాము.
ఇక
మీదట,
మనస్సు
యింద్రియములకు,
మనస్సుకు
బుద్ధికి
యింద్రియములకు
యే
విధమైన
సంబంధము
వున్నది.
అన్నింటియందు
ఆత్మతత్వమే
ఏకధారగా
అంతర్వాహినిగా
యే
విధముగా
ప్రవహిస్తుందనేది
మున్ముందు
తెలుసుకుందాము.
Previous
←
Mastery of the Senses
Next
Hold the Reins
→