Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · Mastery of the Senses
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Mastery of the Senses
22 May 1990, Summer Course 1990, Brindavan
1
▾
Meaning
Keep
Also in his talks
(12)
7 February 1980
Be human
30 July 1987
To nurture sacred feelings in the heart is education
6 March 1989
God is the embodiment of Prema
8 October 1989
Be Pure in Thought, Word and Deed
20 May 1991
The End Of Education Is Character
26 June 1996
Forbearance Is a Safe Armour for Man
20 October 1996
When the Heart Is Turned to Prema, the World Turns to Brahman
25 April 1998
Every Person Longs for Śānti
26 September 1998
God Is the Very Foundation of the World
22 November 2001
True education brings the wealth of character
19 January 2002
Hospitals must not become business centres
28 October 2003
Loving the Ātma principle is spirituality itself
సకల
విద్యలు
నేర్చి
సభ
జయించగ
వచ్చు
శూరుడై
రణమందు
పోరవచ్చు
రాజ
రాజై
పుట్టి
రాజ్యమేలగ
వచ్చు
హేమ
గోదానము
లీయవచ్చు
గగన
మందున్న
చుక్కల
లెక్కగొనవచ్చు
జీవ
రాసుల
పేర్లు
చెప్పవచ్చు
అష్టాంగ
విద్యల
నభ్యసింపగ
వచ్చు
చంద్రమండలమైన
చేరవచ్చు
కాని
దేహేంద్రియములరికట్టి
ఎప్పుడు
మనసు
నిల్పి
యంతర్ముఖముగను
చేసి
నిశ్చల
సమాధి
చిత్తుడై
నిలువ
లేడు.
విద్యార్థులారా!
శరీరమునకు
యింద్రియములపైన
ప్రభావము
వున్నది.
ఇంద్రియములకు
శరీరముపైన
మరింత
ప్రభావము
వున్నది.
శరీరమును
వదలి
యింద్రియములు,
యింద్రియములు
వదలి
శరీరము
వుండుటకు
వీలుకాదు.
ఇవి
రెండును
అవినాభావ
సంబంధము,
అన్యోన్య
ఆశ్రయము.
Negative
లేక
positive,
positive
లేక
negative
వుండి
యే
విధముగా
నిష్ప్రయోజనమో
అదేవిధముగా
దేహము
లేక
యింద్రియములు,
యింద్రియములు
లేక
దేహము
వుండుట
నిష్ప్రయోజనమే.
కనుక
శరీరమును
సరియైన
విధముగా
పోషించుకోటము
ప్రతి
వ్యక్తి
కర్తవ్యము.
ఇక్కడ
యింద్రియముల
యొక్క
తత్వము
అత్యంత
అద్భుతము.
దైవత్వమనేది
మహా
చిత్రవిచిత్రమైనప్పటికి
యింద్రియముల
తత్వము,
యింద్రియముల
యొక్క
అనుభూతి
యింద్రియముల
యొక్క
చేష్టలు
అంతకంటె
అద్భుతముగా
వుంటున్నాయి.
చిత్రంబులు
త్రైలోక్యవి
చిత్రంబులు
భవలతాలవిత్రంబులు
స
న్మిత్రంబులు
బుధజనవన
చైత్రంబులు
యింద్రియముల
చారిత్రంబుల్.
2
▾
Meaning
Keep
ఈ
యింద్రియములు
దేహముకంటె
సూక్ష్మమైనవి.
శరీరమునందు
శబ్దస్పర్శరూపరసగంధాదులుండినప్పటికిని,
వాతపిత్తశ్లేష్మాదులు
వుండినప్పటికిని
యింద్రియముల
యొక్క
తత్వము
అన్నింటి
యొక్క
సమత్వముగా
భావించుకొని
తమ
ప్రభావమును
దేహముపైన
చలాయిస్తూ
వుంటుంది.
ఇంద్రియములు
విషయములను
స్పర్శించినప్పుడే
సుఖదుఃఖములు,
శీతోష్ణములు
సంభవిస్తున్నాయి.
విషయములు
లేక
యింద్రియములు
క్షణమైనా
నిలువవు.
విషయ
సంబంధమే
యింద్రియముల
యొక్క
ప్రధాన
కర్తవ్యము.
ఇంద్రియములను
కేవలము
యేకముగా
భావించి,
దివ్యముగా
వరించి,
భవ్యముగా
క్షణింప
చేయుటము
విషయమునకు
సాధ్యముకాదు.
ఇంద్రియములకు
ఒక
చక్కని
పేరు
గలదు.
మాత్రాః
అని
దీనికొక
పేరు.
మిత్రతే
యితి
మాత్రః
అని.
అనగా
ఒక
విధమైన
కొలతలను
నిర్ణయము
గావించునదియే
యీ
యింద్రియముల
ప్రభావము.
ఈ
కొలతలు
యే
విధముగా
గావించుచున్నవి
యీ
యింద్రియములు.
ఈ
ఫలము
తీయగా
వున్నది
లేక
పుల్లగా
వున్నది
అని
నిర్ణయించే
అధికారము
దీనికి
వున్నది.
దీనిని
కొలత
వేసే
యింద్రియములు
యేమిటి?
అదియే
నాలుక.
ఈ
నాలుక
పదార్థముల
మంచిచెడ్డలను
కొలత
వేసి
ప్రమాణపూర్వకముగా
జగత్తునకు
అందించుచున్నది.
ఈ
చిత్రము
విచిత్రముగా
వున్నది.
వికారముగా
వున్నదని
చిత్రము
యొక్క
విచిత్రములను
నిర్ణయించే
కొలత
దీనికి
వున్నది.
ఈ
కొలత
బద్ధ
కన్ను
మాత్రమే.
ఇంక
యిదే
విధముగనే
అన్ని
యింద్రియములు
కూడను.
ఇది
దుర్గంధము
యిది
సుగంధము
అని
నిర్ణయించే
కొలత
బద్ధ
ముక్కు.
ఇది
సుస్వరము
యిది
దుస్వరము
అని
నిర్ణయించే
కొలత
బద్ధ
కర్ణము.
కనుకనే
యీ
యింద్రియములకు
నిర్ణయించే
అధికారము
వున్నది
కనుకనే
దీనికి
మాత్రాః
అని
ఒక
పేరు.
కఠోపనిషత్తు
యందు
శరీరమనే
రథమునకు
యింద్రియములు
అశ్వముల
వంటివని
నిర్ణయించారు.
ఈ
యింద్రియములకు
అశ్వములు
అని
పేరు
పెట్టుటకు
కారణము
ఏమిటి?
అశ్వమనగా
నిరంతరము
చలించే
స్వభావము
గలదే
అశ్వము.
అందరకు
తెలిసిన
విషయమే.
గుఱ్ఱము
నిద్రించుచుండిన,
మేల్కొనుచుండిన,
నిల్చుని
వుండిన
తన
దేహమునందు
యేదో
ఒక
అంగము
కదలిస్తూనే
వుంటుంది.
తోక
తప్పుతే
కాలో,
కాలు
తప్పుతే
చెయ్యో
ముక్కో
ముక్కు
తప్పుతే
నోరో
యేదో
ఒకటి
కదలిస్తూ
వుంటుంది.
చలన
స్వభావము
గలది
కనుకనే
దీనికి
అశ్వమని
పేరు
వచ్చింది.
అదే
విధముగానే
మనము
రావి
వృక్షము
చూస్తున్నాము.
ఐతే
అది
గాలి
లేకపోయినా
దాని
ఆకులు
ఎప్పుడూ
ఆడుతూనే
వుంటుంటాయి.
3
▾
Meaning
Keep
కనుకనే
దానికి
అశ్వత్థ
వృక్షమని
పేరుపెట్టారు.
ప్రాచీన
రాజులందరు
అశ్వమేధ
యాగమని
ఒక
ప్రత్యేక
యాగము
సలిపేవారు.
అశ్వమేధ
యీ
రెండు
పదముల
అంతరార్థము
గుర్తించుకొన్నప్పుడు
అశ్వమేధమనేది
యేమిటో
మనకు
సుస్పష్టముగా
అర్థమవుతుంది.
మేధ
అనగా
బుద్ధి.
అశ్వమనగా
చలించేది.
అశ్వమేధమనగా
చలించే
బుద్ధి.
ఈ
చలించే
బుద్ధికి
ప్రతిబింబమే
అశ్వము.
ఈ
అశ్వమేధ
యాగమునందు
యీ
అశ్వమును
యెవరు
పట్టగలరో
వారే
ధీమంతులని
పేరు.
ఎవరు
దీనిని
పట్టేవారు?
ఎవరు
దీనిని
అణగ
ద్రొక్కేవారు?
ఎవరు
దీనిని
కొంతవరకు
నిగ్రహించేవారు
వారే
నిజమైన
ధీరులు
అన్నారు.
కనుక
మన
యింద్రియములను
అరికట్టి
యింద్రియములను
స్వాధీనము
చేసుకున్న
వ్యక్తియే
ధీమంతుడు.
అనే
విషయము
లోపల
బాహ్యార్థముగా
యీ
భౌతికమైన
జగత్తునందు
యీ
అశ్వమును
యెవరు
పట్టగలరో
వాడే
ధీమంతుడు
అని
అతనితోనే
యుద్ధము
చేసే
అధికారము
వున్నది
అనేది
ప్రాచీన
రాజులు
ప్రభావమును
నిరూపిస్తూ
వచ్చారు.
ఇక్కడ
అంతరార్థ
బాహ్యార్థముల
యొక్క
సమన్వయమే
నిజమైన
యదార్థము.
కనుక
యీనాడు
ప్రతి
మానవుడు
కూడను
యీ
అశ్వమును
పట్టి
కట్టాలి.
అప్పుడే
ధీరులౌతారు.
ఎన్ని
యాగములు,
ఎన్ని
యజ్ఞములు,
ఎన్ని
క్రతువులు,
ఎన్ని
గ్రంథములు
పారాయణము
సల్పినప్పటికిని
దీని
నిగ్రహించలేని
వ్యక్తులు
యివన్నిటిని
వ్యర్థము
గావించినవాడే.
ఈ
మాత్రః
అనే
దానికి
మరొక
అర్థము
కూడను
వుంటున్నది.
అనగా
పరిమితమును
నిర్ణయించేవి
యింద్రియములు.
ఒక్కొక్క
యింద్రియమునకు
ఒక్కొక్క
పరిమితిని
మాత్రమే
నియమించినాడు
భగవంతుడు.
కన్ను
చూడగలదే
కాని
వినలేదు.
నోరు
మాటాడగలదే
గాని
చూడలేదు.
ఇట్లా
ఒక్కొక్క
యింద్రియమునకు
ఒక్కొక్క
విధమైన
నిర్ణీతమైన
నిబంధనలు
సలిపాడు.
దీనికి
నియమించిన
నియమములను
ఎవరు
సక్రమముగా
నడచుకొందురో
వారే
భగవదాజ్ఞను
పరిపాలించినవారౌతారు.
ఎవరు
యీ
నియమములను
వుల్లంఘింతురో
వారు
దీని
యొక్క
శిక్షకు
గురౌతారు.
ఒక్కొక
యింద్రియమును
దాని
నిర్ణయానుసారముగా
వుపయోగించుకొని
దానిని
రక్షించుకోటానికి
ప్రయత్నించాలి.
ముక్కుకు
ఒక
నిర్ణయాన్ని
యిచ్చాడు.
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
తీసుకొని
ఆరోగ్యమును
కాపాడుకోటం.
సుగంధ
దుర్గంధములను
నిర్ణయించి
కేవలము
సుగంధమును
మాత్రమే
స్వీకరించటము
యీ
రకమైన
నిర్ణీతమైన
కర్మలు
ఆచరించటమే
యీ
నాసిక
యొక్క
పని.
కానీ
దురదృష్టవశాత్తు
యీ
నిర్ణయమును
వుల్లంఘించి
దీనితో
పాటు
యీ
ముక్కుతో
నశ్యము
పీల్చటము,
దుర్గంధమును
పీల్చుకోటము
యీ
రకమైన
విరుద్ధమైన
కర్మలు
ఆచరింప
చేయుటము
చేత
యీ
విధించిన
నిబంధనలను
తాను
వుల్లంఘించిన
వాడౌతాడు.
4
▾
Meaning
Keep
భగవదాజ్ఞను
వుల్లంఘించిన
దోషము
ఒకటి
ఆరోగ్యమును
పెడమార్గమును
పట్టించటము
మరొకటి
యీ
రెండు
దోషములకు
గురికావటం
చేతనే
మానవుడు
అనారోగ్యము
చేత
పీడింపబడుతున్నారు.
అదేవిధముగనే
నాలుక.
ఇది
కేవలము
ఆహారమును
స్వీకరించి
ఆరోగ్యమును
పోషించి
ఆనందమైన
వార్తల
చేత
వుల్లాస
పరచి
మృదుమధురమైన
సంభాషణ
చేత
సంతోష
పరచి,
తనలో
వుండిన
స్వభావములను
రహస్యములను
వెలువరచుటానికి
తగిన
అవకాశము
నందించి
గాఢమైన
భావములను
యితరులకు
వుచ్చరింప
చేసే
నిమిత్తమే
అందించినది
యీ
జిహ్వా.
ఈ
రకమైన
సన్మార్గమును
అనుభవించి
సత్కీర్తిని
పొందే
నిమిత్తమై
అందించిన
యీ
జిహ్వను
యీనాడు
మనము
దుర్వినియోగ
పరచుకుంటున్నాము.
మత్తు
పదార్థములు
స్వీకరించటము,
మాంసమును
భక్షించటము,
సిగరెట్లు
బీడీలు
చుట్టలు
కాల్చటము
పరదూషణ
చేయుటము
పరనిందలు
చేయుటము
కఠినమైన
మాటల
చేత
యితరులను
బాధించటము
యీ
రకమైన
విరుద్ధమైన
చర్యల
చేత
భగవదాజ్ఞను
వుల్లంఘించటము
నిర్ణయమును
ధిక్కరించటము
యీ
కారణముల
చేత
అనేక
రకములైన
బాధలు
మానవుడు
అనుభవించవలసి
వస్తుంది.
ఇదే
విధముగనే
ప్రతి
అంగము
కూడను
తమ
నిర్ణయానుసారముగా
సక్రమముగా
అనుభవించటం
చేతనే
మానవుడు
అత్యున్నత
స్థాయిని
అందుకోగలడు.
ఇంద్రియములున్నవి
కదా
యని
యిష్టానుసారము
వుపయోగించకూడదు.
ఇవి
అశ్వములు.
ఈ
అశ్వములతో
యే
విధమైన
రథము
నడపటానికి
తగిన
వుపాయములు,
తగిన
సాధనలు
మనము
అనుభవించాలో
దానికి
తగిన
రీతిగా
మనము
ఆచరించాలి.
బండి
వెనక
గుఱ్ఱము
ముందు
వుంటుండాలి.
కానీ
యీనాడు
అశ్వము
వెనుక
బండి
ముందు
పెడుతున్నారు.
దీనివల్ల
యనేక
విధములైన
ప్రమాదములు
సంభవిస్తున్నాయి.
అట్లుకాక
యింద్రియములను
గౌరవించాలని,
యింద్రియములను
ప్రేమించాలని
యింద్రియములను
అనేక
రకములైన
సత్కార్యములు
సల్పాలని
ఆశించి
బండి
లోపల
యింద్రియ
గుఱ్ఱములను
కూర్చొబెడితే
బండి
యే
రీతిగా
కదులగలదు.
మనలో
యింద్రియములను
క్రమక్రమముగా
బలపరచుకుంటూ
అంతర్ముఖముగా
దానిని
అణగ
ద్రొక్కటానికి
ప్రయత్నం
చేయటం
లేదు.
గుఱ్ఱములకు
తగిన
పని
యివ్వక
వాటికి
అమితముగా
మేత
పెట్టి
బలపరచటం
చేత
అది
కూడను
కొంత
ప్రమాదము
కలుగుతుంది.
ఈనాడు
గుఱ్ఱములకు
తగిన
పని
పెట్టటం
లేదు.
5
▾
Meaning
Keep
ఈ
గుఱ్ఱములకు
యిష్టానుసారముగా
దాణా
పెట్టి
దానిని
బలిపెట్టి
దానిని
మదమెక్కే
రీతిగా
మనము
పెంచుతున్నాము.
కనుకనే
యీ
గుఱ్ఱములు
మదమెక్కి
పెడమార్గము
పట్టి
యజమానినే
ప్రమాదములో
ముంచుచున్నాది.
కనుక
మన
యింద్రియములను
భగవంతుడిచ్చిన
నిర్ణయానుసారముగా
అనుభవించాలి.
ఈ
విధముగా
సరియైన
మార్గములో
వినియోగించకుండా
వుంటే
యిది
అనేక
రకములైన
అశాంతికి
గురౌతున్నాది.
అనేకమందికి
తెలుసు.
ఒకరికి
ఒక
భార్య
వుంటేనే
ఆ
సంసారము
చికాకుగా
వుంటుంది.
ఇద్దరు
భార్యలు
వుంటుంటే
యింక
చెప్పనక్కర
లేదు.
ఉత్తానపాదునకు
యిద్దరు
భార్యలు.
కనుకనే
యిక్కడ
యనేక
రకములైన
భిన్నాభిప్రాయములు
ఆవిర్భవించి
కన్నకొడుకు
ధ్రువుని
కారడవులకు
పంపవలసి
వచ్చింది.
దశరథునకు
ముగ్గురు
భార్యలు.
యితను
కూడను
యీ
భిన్నాభిప్రాయముల
చేత
వారిని
సరియైన
స్థితిలో
వుంచటానికి
సాధ్యము
కాకపోవటం
చేత
భార్యను
సంతోష
పెట్టాలని
వుద్దేశ్యము
చేత
కన్న
కుమారుడైన
శ్రీరాముని
అడవికి
పంపి
కాయమును
కోల్పోయాడు.
ఒకరిద్దరు
భార్యలకే
యిన్ని
విధములైన
ప్రమాదములు
సంభవిస్తుంటే
పదిమంది
భార్యలున్నవారు
ఎంత
ప్రమాదమునకు
గురౌతారు
యోచన
చేయండి.
ఈ
మనస్సనే
మహాపురుషునకు
పదిమంది
భార్యలు
అవే
దశేంద్రియములు.
ఒక్కొక్క
యింద్రియము
ఒక్కొక్క
దానిని
ఆశిస్తూ
వుంటుంది.
ఒక
యింద్రియము
మసాలా
వాసన
వస్తున్నాది
మసాలా
దోశ
కావాలంటుంది
ముక్కు.
నేను
సుస్వరాన్ని
వినాలి
రేడియో
పెట్టుమని
చెవులు
అంటున్నాయి.
ఏదో
కొత్తగా
వచ్చిందట
సినిమా
దానిని
చూడాలని
కన్నులు
ఆశిస్తాయి.
ఈ
విధముగా
ఒక్కొక్క
యింద్రియము
ఒక్కొక్క
దానిని
కోరుతూ
పోతున్నాయి.
అన్నీ
ఒకే
పర్యాయము
ఒక్కొక్క
యింద్రియము
ఆశించినప్పుడు
యీ
యజమానుడు
ఆ
ఆశను
యే
రీతిగా
తీర్చగలడు.
ఈ
విధముగా
ఆ
యింద్రియముల
యొక్క
ఆశ
తీర్చలేక
మనస్సు
యనేక
రకములైన
రీతిగా
కూలిపోతున్నాది.
ఇంతమంది
పత్నులు
కలిగిన
యీ
మనస్సనే
యజమానికి
శాంతి
ఎక్కడనుండి
వస్తుంది.
శాంతి
అత్యంత
దూరముగా
వుంటుంది.
కారణము
యీ
యింద్రియముల
వాంఛలను
తీర్చటము
చాలా
కష్టము.
కనుక
యీ
యింద్రియముల
యొక్క
తత్వాన్ని
మనము
సరైన
రీతిలో
అదుపులో
పెట్టినప్పుడే
తాను
తన
పరిసరముల
వారు
కూడను
ఆనందమును
అనుభవించగలరు.
ఐతే
యింద్రియములను
సమన్వయ
పరచే
మార్గము
కూడను
ఒకటి
వున్నది.
6
▾
Meaning
Keep
మంచి
చెడ్డలు
రెండును
సమత్వముగా
భావించి
ఆనందముగా
కాలము
గడిపే
వ్యక్తులు
కూడను
అనేక
మంది
వుంటున్నారు.
ఇది
యే
విధముగా
అంటే
తుకారాం
వుండేవాడు.
అతను
పరమ
భక్తుడు.
కానీ
అతను
గృహస్థు.
అతని
భార్య
మహాగయ్యాళి.
అయినప్పటికిని
ఆమె
మనస్సును
సరియైన
రీతిలో
సమన్వయ
పరచుకొని
తాను
ప్రవర్తించటానికి
తాను
కృషి
చేసేవాడు.
మాటకు
మాటకు,
వేటుకు
వేటు
జరిగినప్పుడే
అది
ఒక
పెద్ద
ప్రమాదముగా
ఏర్పడుతుంది.
అన్నింటిని
కూడను
సమర్థించుకొని
ప్రశాంతముగా
కాలము
గడిపేవాడు
యీ
తుకారాం.
ఏవిధముగా
అంటే
అతనికి
ఒక
అర్ధ
ఎకరా
భూమి
వుంది.
ఏదో
కుటుంబ
పోషణ
నిమిత్తమై
దానిని
సాగు
చేస్తూ
వుండేవాడు.
ఇరుగు
పొరుగు
వారి
ప్రోద్బలము
చేత
తన
అర్ధ
ఎకరా
పొలములో
చెఱకు
పండించటానికి
ప్రయత్నించాడు.
ఏదో
రీతిగా
పండించాడు
పాపం.
తుకారాం
బలహీనత
అందరు
గుర్తించినవారు
కనుక
అది
పూర్తి
పరిపక్వస్థితికి
వచ్చేటప్పటికి
అటు
పోయేవాడు
ఒక
చెఱకుని
కొట్టుకు
తినటం,
యిటు
పోయేవాడు
ఒక
చెఱకును
కొట్టుకు
తినటం
బాటసారులకు
ఆ
చెఱకు
ఆహారమైంది.
కడపటికి
యేదో
వున్న
దానిని
యింటికి
తీసుకురావాలని
ఒక
బండి
కట్టుకొని
ఆ
చెఱకు
తోటకు
వెళ్లాడు.
మోపు
కట్టుకున్నాడు
చెఱకును.
ఇంటికి
వస్తున్నాడు
బండిలో
దారిలో
అడ్డము
వచ్చిన
పిల్లలందరు
కూడను
తాను
నాకొక
చెఱకు
అని
అందరు
అడుగుతూ
వచ్చారు.
త్యాగము
తుకారాంకు
స్వభావము.
అటువంటి
త్యాగభావము
కలిగి
వుండటం
చేత
అడిగిన
వారికి
అందరికి
యిచ్చాడు.
ఇంటికి
చేరేటప్పటికి
ఒక్క
చెఱకు
మాత్రమే
మిగిలింది.
బండి
వచ్చింది.
చూచింది
భార్య.
ఏమిటిది
ఒక్క
చెఱకును
తీసుకువచ్చావా
సంసారము
యే
రీతిగా
పోషించాలని
యోచిస్తున్నావు!
ఆలుబిడ్డలను
పోషించలేని
యోగ్యత
లేనప్పుడు
నీవు
ఎందుకు
పెండ్లాడాలి.
ఈ
విధముగా
సర్వము
పరులకు
త్యాగము
చేస్తుంటే
స్వవిషయము
ఏమైపోతుంది?"
అని
కోపములో
నానా
మాటలు
మాట్లాడి
ఆ
బండిలో
వుండిన
చెఱకును
తీసుకొని
కొట్టింది
భర్తను.
ఆ
చెఱకు
రెండు
ముక్కలై
క్రిందపడి
ఒక
ముక్క
భార్య
చేతిలో
నిల్చింది.
తుకారాం
చాలా
ఆనందించాడు.
'బండిలోనుంచి
నేను
వచ్చేంతవరకు
కూడను
చాలా
సమస్యలతో
వచ్చాను.
ఇప్పుడు
నా
సమస్య
తీరిపోయింది.
ఏమిటి
నా
సమస్య
అంటే
ఒక
చెఱకుని
తీసుకొని
పోతున్నాను.
ఇద్దరు
బిడ్డలున్నారు.
ఒక
భార్యవుంది.
దీనిని
యే
రీతిగా
పంచాలి
అని
యోచిస్తూ
వచ్చాను.
నాయొక్క
సమస్య
నీవే
పరిహారము
చేశావన్నాడు.
ఏమంటే
క్రింద
పడిపోయిన
రెండు
ఒకటి
ఒక
బిడ్డకు
రెండవది
రెండవ
బిడ్డకు
చేతిలో
వున్నది
భార్యకు
సరిపోయింది.
నా
సమస్య
తీరి
పోయింది.
అన్నాడు.
ఈ
విధముగా
యింద్రియముల
ప్రభావము
తనపైన
ఎంత
బలవంత
పరచినప్పటికి
సమన్వయము
గావించుకొనే
చిత్తము
కొంతమంది
మహనీయులకు
మాత్రమే
వుంటుంది.
7
▾
Meaning
Keep
ఇది
కేవలము
భక్తి
శ్రద్ధలతో
మాత్రమే
లభ్యమవుతుంది.
కనుక
యింద్రియములు
నిగ్రహించుకోటం
ఎవరి
చేత
కాదని
నిరుత్సాహ
పడనక్కర
లేదు.
పవిత్రమైన
భక్తి
ప్రపత్తుల
చేత
యింద్రియములను
స్వాధీన
పరచుకోవచ్చును.
తుకారాం
ఆవిధముగా
చేసినప్పుడు
కబీరు
యింకొక
రకముగా
చేస్తూ
వచ్చాడు.
అతని
భార్య
అతని
అడుగుజాడలలో
నడిచేది
పాపం.
మహాసాధ్వీమణి.
భర్త
అభీష్టమే
తన
అభీష్టము.
తనకు
ప్రత్యేకమైన
వాంఛ
లేదు.
ఏ
ఆజ్ఞను
నియమించినా
దానిని
శిరసావహించి
ఆచరించేది.
ఒకనాడు
కబీరు
నేస్తూ
వుండగా
రామ్
రామ్
అని
రామనామ
స్మరణ
చేస్తూ
పట్టపగలు
పన్నెండు
గంటలు,
ఏమే
లోపల
వున్నావా
అని
పిల్చాడు.
పరుగెత్తి
వచ్చింది.
ఇక్కడ
నూలుపోగు
తెగింది
దీపం
అంటించుకొని
రా
అన్నాడు.
వెళ్లింది.
దీపం
అంటించుకు
వచ్చింది.
దగ్గరకు
వచ్చిన
తరువాత
అక్కరలేదు
తీసుకుపో
అన్నాడు.
తీసుకు
వెళ్లిపోయింది.
ఏ
ఒక్క
జవాబు
తాను
చెప్పలేదు.
ఏమిటి
పట్టపగలే
కండ్లు
కనుపించలేదా?
దారము
తెగింది
అని
చెప్పి
దీపము
తెచ్చిన
తరువాత
తిరిగి
దీపం
తీసుకుపొమ్మని
చెప్పటమా
ఏమి
పనిలేదా
మీకు
అని
భార్య
భర్తతో
యేమాత్రము
వాదించలేదు.
కనుక
యీ
విధమైన
భర్తకు
సహకారముగా
వుండే
భార్యవల్ల
తాను
భగవద్భక్తిని
పెంచుకుంటూ
భగవంతునికి
thanks
చెప్పాడు
పాపం.
ఒక
వైపున
తుకారాం
విరుద్ధమైన
భార్యతో
పవిత్రమైన
మార్గమును
అందుకున్నాడు.
కబీరు
అనుకూలవతియైన
భార్యతో
పవిత్రమైన
స్థితిని
పొందాడు.
కనుక
మన
వాతావరణము
యేమాత్రము
అడ్డు
రాదు.
మనలో
వుండిన
భావము
పరిశుద్ధముగా
వుండాలి.
కనుక
బయటి
వాతావరణమును
యేమాత్రము
పాటించరాదు.
నీయొక్క
భావచిత్తము
నీయొక్క
పవిత్రమైన
భావము
పరిశుద్ధమైన
సమన్వయ
భావము
గావించుకోవాలి.
మీకు
తెలిసినవాడే
Einstein.
యితను
మహావిజ్ఞాని.
కానీ
అతనికి
మూర్ఖురాలైన
భార్యవుంది.
ఆమె
విద్యావంతురాలు
కాదు.
కాకుండా
పోయినంత
మాత్రమున
యేమీ
బాధలేదుగాని
మొరటు
మనిషి.
ఈ
Einstein
నిరంతరము
యేదో
ఒక
యోచనలో
మునిగి
వుండేవాడు.
విచారణ
experimental
దీంట్లోనే
తన
కాలమును
గడిపేవాడు
సకాలమునకు
భోజనమునకు
వెళ్లేవాడు
కాదు.
టీ,
కాఫీకి
కూడను
భార్య
అనేక
పర్యాయములు
వచ్చి
పిలచిన
తరువాతనే
లోపలకు
వెళ్లేవాడు.
ఈ
విధముగా
చేస్తున్నంతవరకు
కూడను
భార్యకు
విసుగెత్తింది.
సకాలమునకు
యింటికి
రాడు.
సకాలమునకు
భోజనము
చేయడు
సకాలమునకు
టీ
త్రాగడు.
అతని
కోసము
నేను
కాచుకోవాలి
యేమిటి
యీ
అవస్థ
అని
అనేక
రకములుగా
తాను
నిరంతరము
బుర్
బర్
అని
కోపం
చేస్తూ
వుండేది.
8
▾
Meaning
Keep
ఒకనాడు
పాపం
ఆమెకు
చాలా
ఆకలివేసింది.
ప్లేటులోపల
వంట
వడ్డించింది.
టేబులు
దగ్గర
కూర్చుంది.
రండి
రండి
అని
పిలిచింది.
పాపం
అనేక
పర్యాయములు.
కాని
అతను
వినిపించుకోలేదు.
ఆ
టేబుల్
పైన
water
jug
వుంటున్నాది.
కోపంతో
పరుగెత్తింది.
ఆ
water
jug
తో
అతని
తలపైన
నీరు
పోసింది.
అప్పుడు
యీ
Einstein
నవ్వుతూ
'ఆహా!
నిత్యము
వురుములు,
మెరుపులు
మాత్రమే
వుండేటువంటివి.
ఈనాడు
కుంభవర్షము
కురిసింది
నా
తలపైన'
అన్నాడు.
ఎంత
సమన్వయము
గావించుకున్నాడో
చూడండి.
భార్య
జగ్గుతో
తలపైన
నీరుపోస్తే
జగ్గును
తీసుకొని
కొట్టేవారు
యీ
కాలము
పురుషులు
కానీ
తాను
దానికి
పూనుకోలేదు.
అదే
యింద్రియ
నిగ్రహము.
ఇది
ఒక
తపస్సుగా
భావించుకుంటూ
వచ్చారు
మన
పూర్వీకులు.
థామస్
అని
ఒక
క్రిష్టియన్
మతప్రబోధకుడు
వుంటుండేవాడు.
అతను
ప్రతి
పల్లెకు
వెళ్లి
ఆ
మతమును
ప్రబోధము
సలుపుతూ
వుండేవాడు.
ఒకనాడు
గుఱ్ఱపు
బండి
ఎక్కి
ఒక
పల్లెకు
వెడుతున్నాడు.
మధ్యమార్గములో
ఒక
level
crossing
అడ్డము
వచ్చింది.
ఆ
గుఱ్ఱము
చక్కగా
పరుగెత్తుతున్నాది.
కానీ
ఆ
level
crossing
దగ్గరకు
వచ్చేటప్పటికి
యీ
గుఱ్ఱపు
యజమాని
దానిని
అధికముగా
కొడుతూ
వచ్చాడు.
మతప్రబోధకుడు
కనుక
జీసస్
యొక్క
ప్రభావము
కరుణయే
అతని
యొక్క
ప్రధాన
ప్రచారమని
విశ్వసించినవాడు
కనుక
'అయ్యా!
చక్కగా
నడుస్తున్న
గుఱ్ఱమును
ఎందుకింత
బాధపెడుతున్నావు?"
అప్పుడు
జట్కావాడు
చెబుతున్నాడు,
'సార్!
యీ
level
crossing
ప్రక్కలోపల
తెల్లగా
కొన్ని
రాళ్లు
పాతిపెట్టారు.
ఈ
తెల్లరాళ్లు
చూచేటప్పటికి
యిది
భయపడుతున్నాది.
ఆ
భయము
కంటె
ఎక్కువ
భయము
నాయొక్క
కొరడా
దెబ్బలు.
కనుక
ఆ
భయము
వదలి
యీ
భయములో
తాను
ప్రవేశిస్తుంది.
ఆ
భయము
తప్పించే
నిమిత్తమై
యీ
భయము
నేను
ప్రాక్టీసు
చేస్తున్నాను'
అన్నాడు.
అప్పుడు
థామస్
యోచన
చేశాడు.
ఆహా!
మనస్సును
యే
విధముగా
మరల్చాలి
అనేది
ఒక
జట్కావాని
వల్ల
తెలుసుకున్నానన్నాడు.
ఒక
యింద్రియము
ఒక
విషయముపైన
పరుగెత్తుతున్నప్పుడు
ఆ
విషయమునుండి
తప్పించి
యింకొక
విషయముపై
మరలించటానికి
తగిన
శిక్షణ
యివ్వాలి.
ఇది
అనేక
పిచ్చి
మార్గములలో
ప్రవేశిస్తున్నాది.
దానికి
విరుద్ధమైన
దానికంటె
యింకా
అధికమైన
దానిని
నిరూపింప
చేసినప్పుడు
దాని
మార్గము
వదలి
సరియైన
మార్గములో
ప్రవేశిస్తుంది.
దొంగపశువు
వుందనుకోండి.
అది
యెదో
పంటలో
పడి
మేయటానికి
పోతుంది.
అంతకంటె
మంచి
పచ్చగడ్డిని
మనము
యింటిలో
వేస్తే
ఆ
పంటకే
పోదు
అది.
ఇంటి
దగ్గరనే
వుండి
మేస్తుంది.
తాను
ఆశించిన
దానికంటె
వుత్తమమైన
దానిని
మనము
ప్రవేశపెట్టినప్పుడు
ఆ
ఆశను
నిరాశగా
చేసుకొని
వుత్తమమైన
మార్గములో
ప్రవేశిస్తుంది.
9
▾
Meaning
Keep
ఇంద్రియములను
పశువులని
కూడను
చెప్పారు.
ఎందుకోసమని
పశువని
చెప్పారు.
పశ్యతి
యితి
పశుః
అని
అంతరార్థము.
బయట
దృష్టి
కలిగినది
పశువు.
లోదృష్టి
కలిగినది
పశుపతి
అని.
మానవుడు
పశుపతి
కావాలిగాని
పశువు
కాకూడదు.
నీవు
master
కావాలిగాని
slave
కాకూడదు.
నీవు
యింద్రియాలకు
బానిసై
పోయినప్పుడు
నీవు
slave
అయిపోతావు.
ఇంద్రియాలకు
నీవు
master
కావాలి.
మాస్టరే
మానవుడు.
కనుక
యిట్టి
మాస్టరైన
మానవుడు
కేవలము
యింద్రియములకు
వశమైపోయి
బానిసగా
జీవిస్తూ
వున్నారు.
ఈ
యింద్రియములు
సక్రమమైన
మార్గములో
పెట్టుకోటానికి
అనేక
రకములైన
మార్గములుంటున్నాయి.
దానికి
యిష్టము
వచ్చినవి
అందించటానికి
ప్రయత్నించకూడదు.
ఈ
యింద్రియముల
యొక్క
భోగము
ఎక్కడనుండి
పుట్టిందని
చక్కని
విచారణ
చెయ్యాలి.
ఇవి
దుఃఖము
నుంచే
పుట్టాయి.
దీనికి
పుట్టుక
స్థానము
ఎట్టిదో
దీని
ప్రభావము
కూడను
అట్టివిగానే
వుంటాయి.
కనుకనే
యివి
అందించేవి
అంతా
తాత్కాలికముగా
భోగములు,
భాగ్యములు,
ఆనందములు
అనుకుంటాముగాని
యిది
పూర్తి
దుఃఖాన్ని
యిస్తుంది.
ఈ
వాంఛలు
క్షణములో
పుడతాయి.
క్షణములో
అణగుతాయి.
ఆద్యంతములు
రెండు
కూడను
క్షణములోనే
ఆవరిస్తాయి.
ఈనాడు
నేను
లడ్డు
తినాలని
ఆశపుట్టింది.
ఆ
పుట్టిన
తక్షణమే
రెండు
లడ్లు
తిన్నావు.
రెండు
లడ్లు
తినేటప్పటికి
విసుగు
పుట్టింది.
ఆశ
ఎంతసేపు
నిరాశ
ఎంతసేపు.
ఇష్టమెంతసేపు
అయిష్టమెంతసేపు.
ఒక
ఒక్క
క్షణములోనే
యిష్టాయిష్టములు
రెండు
జరిగిపోయాయి.
క్షణభంగురమైనవి
కదా.
కనుక
దీనిని
సరియైన
రీతిలో
విచారణ
సలిపి
యింద్రియములకు
తగిన
పనిని
మనము
పెట్టాలి.
ఈ
యింద్రియములకు
మనము
పని
యివ్వకుండా
పోవటం
చేతనే
మనము
అనేక
రకములుగా
బానిసలు
కావలసి
వస్తుంది.
దేహము
యొక్క
వాంఛలు
మనము
సత్యమైనవిగా
భావించరాదు.
నేను
యిక్కడ
లేకుండా
పోయినప్పటికిని
ఒక్కొక్కరు
ఒక్కొక్క
విధముగా
వారి
వారి
భావాలను
వుచ్చరించేవన్నీ
కూడను
గుర్తిస్తూ
వుంటుంటాను.
సాయంకాలము
అనంతపురం
Principal
హేమలత
ప్రహ్లాదుని
చరిత్రను
చక్కగా
సరియైన
తెలుగు
పదముల
చేత
పద్యముల
చేత
గానము
చేత
అందరిని
శ్రవణానంద
పరచింది.
ఐతే
అందులో
ఒకటి
ప్రధానమైన
రీతిలో
బోధిస్తూ
వచ్చింది
శిశుపాల
దంతవక్త్రాదులు
పరమాత్ముడైన
కృష్ణుని
నిరంతరము
దూషిస్తూ
వినరాని
మాటల
చేత
నొప్పించేవారు.
ఐతే
ఒకానొక
సమయము
లోపల
సభ
జరుగుతున్నాది.
10
▾
Meaning
Keep
His poems 420
Also in his talks
(3)
9 September 1992
Recognising the principle of the Ātma is itself spirituality
22 February 2001
God's grace comes only through the right use of the senses
19 August 2003
The heart alone is Kṛṣṇa's birthplace
అగ్రతాంబూలము
ఎవరికి
యివ్వాలని
చేతియందుంచుకున్నాడు.
ఎంతమందో
మహర్షులు
వుంటున్నారు
సభలో
ఆచార్యశ్రేష్ఠులైన
ద్రోణాచార్యులు,
కృపాచార్యులు
భీష్మాచార్యులు
అందరూ
వుంటున్నారు.
ఐతే
అందరికంటె
ఉత్తముడు
భీష్ముడు.
అతనికి
యివ్వవచ్చు
కదా
అగ్రతాంబూలము.
కాదు.
కాదు.
తమ
ప్రియతమమైన
ఆ
మహాకృష్ణునికి
మాత్రమే
అందించాలని
ఆశ.
జీవితాధారము
కృష్ణుడే.
మా
పరమావధి
కృష్ణుడే.
మా
ప్రాణము
కృష్ణుడే.
అతను
తప్ప
అన్యులు
యీ
జగత్తులో
కనుపించరు.
అని
కృష్ణుని
పిలచి
పాదములు
కడిగి
అగ్రతాంబూలము
యిచ్చాడు.
దుర్మార్గులు,
దుష్టులు
అంత
జ్ఞానములు
యోచించరు.
బాహ్యదృష్టి,
బాహ్యభావములనే
వారు
అనుసరిస్తూ
వుంటారు.
వ్యక్తిగతమైన
ద్వేషములను
అసూయలను
వారు
ప్రకటిస్తూ
వుంటారు.
సమిష్టి
భావము
వారిలో
శూన్యము.
నాకు
యిష్టము
లేనంత
మాత్రమున
యితరులకు
యిష్టము
వుండదా
అనే
విశాల
భావము
వుండదు.
ఇలాంటి
సంకుచితమైన
చిత్తములు
వుంటుంటాయి.
ఇంత
పెద్ద
సభలోపల
లేచాడు
శిశుపాలుడు.
ఏదో
అక్కడో
ఎక్కడో
మొరగటం
కాకుండా
ప్రత్యక్షముగా
పాండవులంతా
వుంటున్నారు.
మహాసభ
జరుగుతూ
వున్నాది.
ఇంతమంది
ఋషుల
లోపల
కృష్ణుని
యిష్టము
వచ్చినట్లు
దూషించాడు.
ఎందుకు
తాంబూలము
యివ్వటము
కృష్ణునకు?
స్నానంబు
చేయు
ఆ
జవరాండ్ర
చీరలు
కాజేసి
నందుకా
పూజ
నీకు
గొల్ల
పూబోండ్లతో
జల్లులాడిన
నాడు
హర్షించి
నందుకా
అర్ఘ్యమిడుట
చాలునిక
కట్టిపెట్టు
పంచాంగమింక
పొగడుకొన
బోకు
చాలించు
మూయి
నోరు.
shut
up
అన్నాడు.
దీనితో
ధర్మజుని
యొక్క
మనస్సు
చాలా
బాధపడి
పోయింది.
నా
ప్రేమమూర్తి
నా
ప్రాణ
సమానమైన
భగవంతుని
సభలోపల
యిన్నివిధములైన
పరాభవములుగా
మాటలాడటమా
అని
తనలో
తాను
చాలా
బాధపడిపోతున్నాడు.
దీనికి
తగినట్లుగా
అగ్రతాంబూలమిచ్చిన
ఆ
తట్ట
చేతనే
శిశుపాలుని
పైన
విసిరాడు
కృష్ణుడు.
ఏదో
సుదర్శన
చక్రమంటారు.
చక్రము
కాదు.
తాంబూలమిచ్చిన
తట్టనే.
ఆ
తట్టనే
చక్రముగా
వెళ్లి
శిశుపాలుని
కంఠము
ఖండించింది.
కంఠము
ఖండించినంత
మాత్రమున
ఆనందమే
గాని
ధర్మజునకు
తక్షణమే
ఆ
కంఠమునుండి
రక్తము
అంతా
ఎగిరి
ఆ
కృష్ణుని
పాదముల
పైన
పడటము
శిశుపాలుని
ప్రాణస్వరూపమైన
జ్యోతి
కృష్ణునిలో
కలసి
పోయింది.
11
▾
Meaning
Keep
ధర్మజుని
మనసు
అయోమయమై
పోయింది.
అల్లకల్లోలమై
పోయింది.
ఆంధ్రాలో
వచ్చిన
తుఫాను
వలె
అయిపోయింది.
ఈ
దుర్మార్గుని
కంఠము
ఖండించటము
సరియైనదే
కాని
అతని
పాపజ్యోతి
యీ
పరమాత్మునిలో
లీనము
కావటము
ఏమిటిది
ఆశ్చర్యము.
పరమ
పాపి.
ఇతను
మహాదురాత్ముడు.
దైవద్రోహి.
ఇలాంటివాని
జీవనజ్యోతి
పరమాత్మునిలో
చేరటమంటే
ఏమిటిది
ఆశ్చర్యము.
ఇలాంటి
వానికా
పరమాత్ముడు
అవకాశము
యిచ్చేది.
ఇలాంటి
వారినేనా
తాను
స్వీకరించేది
అని
అనేక
రకములుగా
తాను
యోచన
చేస్తూ
వచ్చాడు.
ఈ
సమస్యను
నారదుని
దగ్గర
ప్రశ్నించాడు.
ఎంతమందో
భక్తులుంటున్నారు.
ఎంతమందో
శరణాగతి
పొందినవారున్నారు.
వారెవరికి
లేకుండా
భగవంతుని
దూషించిన
వారికేనా
యిటువంటి
పవిత్రమైన
స్థానమునందించటము.
నారదుడు
చెప్పాడు.
అయ్యా
దూషణ,
భూషణ,
తిరస్కార
పురస్కారములన్నీ
దేహమునకు
గానీ
ఆత్మకు
కాదు.
అందరియందు
వుండినది
ఒక్క
పరమాత్ముడే.
దూషించేవారెవరు?
అందుకొనే
వారెవరు?
ఎవరు
ద్వేషి
ఎవరు
ప్రీతి?
అందరూ
సమానులే.
ఏ
రక్తము
నిరంతరము
భగవంతుని
చింత
చేస్తుండో
ఆ
రక్తము
భగవంతునికి
అర్పితమై
పోతుంది.
ద్వేషము
చేతనో,
ప్రేమ
చేతనో,
కామము
చేతనో,
అసూయ
చేతనో
లేక
అహంకారము
చేతనో
లేక
ఏ
రీతిగానైనా
సరే
ఆ
భగవంతుని
నామము
స్మరిస్తే
చాలు
భక్తులు
స్మరించే
స్మరణ
కంటె
శిశుపాలుడు
అధికముగా
స్మరించాడు.
భక్తులు
యేదో
పూజ
రూముకు
పోయినప్పుడే
పరమాత్మ
అని
రెండు
దండాలు
పెడతాడు.
పటాలు
చూచినప్పుడు
రెండు
దండాలు
పెడతాడు.
గుళ్లగోపురాలకు
పోయినప్పుడు
రెండు
దండాలు
పెడతాడు.
కాని
శిశుపాలుడు
అట్లు
కాదు.
సర్వకాల
సర్వావస్థల
యందు
కృష్ణా
కృష్ణా
అని
కృష్ణునే
దూషించటము.
నిద్రలో
కూడను
కృష్ణా
కృష్ణా
ఆ
చింతన
యొక్క
ప్రభావమే
యీ
యొక్క
అర్పణకు
సరైన
ఆధారమన్నాడు.
ఐతే
లోకులు
బాహ్యసంబంధమైన,
లౌకిక
సంబంధమైన
విషయములను,
చర్యలను
మాత్రమే
గుర్తిస్తూ
వుంటారు.
భగవంతుడు
దానిని
చూడడు.
భగవంతునికి
ద్వేషము
గాని,
అసూయగాని
లేక
యిష్టముగాని
యే
ఒక్కటి
అతనికి
లేదు.
ఇవి
అన్నీ
మీలోనుండి
ప్రతిబింబించే
ప్రతిబింబాలే.
భగవంతుడు
నిర్మలమైన
అద్దము
వంటివాడు.
ఆ
అద్దము
ముందు
నిల్చుకొని
నీవు
యే
విధముగా
act
చేస్తే
ఆ
అద్దములోని
ప్రతిబింబము
ఆ
విధముగా
act
చేస్తుంది.
అద్దము
ముందు
నిల్చుకొని
దానిని
దండిస్తూ
యిట్లా
రా
అదికూడా
నిన్ను
దండిస్తూ
వస్తుంది.
ఆ
అద్దములో
నున్న
ప్రతిబింబమునకు
నమస్కారము
పెట్టు
అది
అందిస్తుంది.
12
▾
Meaning
Keep
అది
నీవు
చేసిన
దానికి
reactionగా
వస్తుంది
గాని
భగవంతునికి
action
reaction
రెండూ
లేవు.
అట్టి
భగవంతునికి
ఒకటి
యిష్టము
యింకొకటి
అయిష్టము
అనేటువంటిది
లేదు.
శిక్ష,
రక్ష
అనేది
లేదు.
ఈ
శిక్ష
రక్షలన్నియు
మన
ప్రవర్తనల
యొక్క
ప్రభావములే.
కనుక
భగవంతునికి
యీ
విధముగా
చేస్తున్నాడే,
యీ
విధముగా
చూస్తున్నాడే,
యీ
విధముగా
వారిని
మాత్రము
దగ్గరకు
చేర్చాడే
వీరిని
మాత్రము
దగ్గరకు
చేర్చలేదే
యీ
విధమైన
నిర్ణయము
చేసే
అధికారము
ఎవ్వరికి
లేదు.
దేవుడంటే
యెట్లా
వుండాలి
అట్లా
వుండాలి
అని
ఎవరు
శాసించటానికి
అధికారము
వుంది.
అందరిలో
వున్న
దైవత్వము
అన్నిరకములగను
ప్రవర్తించవచ్చు.
ఐతే
స్వార్థ
రహితమైనది
కనుక
దీనిలో
యే
దోషము
వుండదు.
పరిపూర్ణమైన
ప్రేమ
కనుక
యే
విధమైన
మార్పు
వుండదు.
కనుకనే
భగవంతునికి
అనేక
రకమైన
బిరుదులు
వుంటున్నాయి.
నిర్గుణం
నిరంజనం
సనాతనం
నికేతనం
నిత్యశుద్ధ
బుద్ధ
ముక్త
నిర్మల
స్వరూపిణం.
భగవంతుడు
అన్ని
రకముల
పవిత్రములైన
దానిలో
వుండినవాడే.
ఇది
అపవిత్రము
యిది
పవిత్రము
అని
నిర్ణయము
చేసేది
నీ
దృష్టిలో
వుంటున్నాదిగాని
భగవంతునిలో
లేదు.
యద్భావం
తద్భవతి.
నీవు
యే
రంగు
అద్దములు
వేసుకున్నావో
ప్రపంచమంతా
అదే
రంగుగానే
కనుపిస్తుంది.
సృష్టి
యొక్క
దోషము
కాదు
నీ
దృష్టి
యొక్క
దోషము.
ఇంద్రియములు
యేదో
దోషము
గావిస్తున్నాయి
అని
మనము
అనుకోటము
మన
భావముల
యొక్క
దోషమే.
సరియైన
భావములు
అభివృద్ధి
పరచుకుంటే
యింద్రియములు
సరైన
అర్థము
నిస్తాయి.
తుకారాం
చూడండి.
తనలో
మంచి
భావము
పెట్టుకొని
భార్య
చేసిన
తప్పు
పని
కూడను
మంచిదిగానే
భావించాడు.
కబీరు
నిరంతరము
భగవచ్చింతన
చేత
కాలము
గడుపుతూ
వచ్చాడు
కనుకనే
భార్య
చేసింది
మంచిగానే
భావించాడు.
Einstein
సమభావము
కలిగి
పవిత్రమైన
హృదయముతో
సాధనను
సలుపుతూ
వచ్చాడు
కనుక
యితను
కూడను
తన
భార్య
చేసిన
పనిని
సమన్వయము
చేసుకుంటూ
వచ్చాడు.
కనుక
మనలో
మనము
సమన్వయము
గావించుకొనే
సాధనలు
సలపాలి.
ఐతే
భగవంతుడు
మన
యింద్రియములనంతా
బయటకే
యిచ్చాడు
కనుక
అతనిదే
తప్పు
గాని
మాదికాదు
అంటుంటారు
కొంతమంది
మొండివారు.
భగవంతుడు
కన్నులనిచ్చాడు
కాని
బయటకే
దాని
తలుపులు
పెట్టాడు
లోపలకు
పెట్టలేదే.
భగవంతుడు
చెవులిచ్చారు
ప్రపంచము
వైపున
పెట్టాడుగాని
లోపల
వైపు
పెట్టలేదే.
ముక్కు
యిచ్చాడు
బయట
శ్వాసమునే
తీసుకోమన్నాడు
గాని
లోపల
శ్వాసము
కాదన్నాడే.
కాబట్టి
సృష్టిలోనే
దోషము
వుంది.
ఇది
మా
దోషము
కాదని
ఆ
రకముగా
సమన్వయము
చేసుకుంటారు.
13
▾
Meaning
Keep
His poems 432
Also in his talks
(3)
20 July 1988
All learning without practice is useless
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
27 January 1992
Increase the thought of God! Reduce worldly desires!
అదే
తప్పు.
అనేక
దోషములు
చేయటము
ఎంత
పొరపాటు.
ఎంత
పాపము.
I
am
a
human
కాబట్టి
తప్పులు
చేయటము
నా
స్వభావము.
అని
సమర్థించుకుంటున్నాడు.
చాలా
తప్పు
అది
పిల్లల
లోపల.
నీవు
మానవుడైనందుకు
తప్పులు
చేయకూడదు.
పశువైతే
తప్పులు
చేసినా
పరవాలేదు.
అది
పశువు
కనుక
తన
యొక్క
ప్రవర్తన
తాను
చేస్తుంది.
నీవు
మనిషివైపోయి
తప్పులు
చేయకూడదు.
అలాంటి
తప్పులు
చేసి
మానవుడు
యిది
సహజమే
యని
అనుకోటము
యిది
సమర్థించుకోటం.
పశువుగా
పుట్టి
పశువుగా
ప్రవర్తిస్తున్నాది
అది.
మనము
మనిషిగా
పుట్టి
పశువుగా
ప్రవర్తించటము
ఎంత
విరుద్ధము.
కనుక
నీవు
మనిషిగా
ప్రవర్తించు.
ఇంకా
కొంతమంది
గొప్ప
తెలివి
తేటలు
కలిగిన
విద్యార్థులు
అనేక
రకములుగా
సమర్థించుకుంటూ
వుంటారు.
పక్షులు
స్వేచ్ఛావిహారము
చేస్తున్నాయి.
ఎక్కడి
కంటె
అక్కడకు
పోతున్నాయి.
ఏ
విధమైన
పక్షితోనైనా
స్నేహము
చేస్తున్నాది.
కాబట్టి
దానికి
పూర్తి
స్వేచ్ఛ
వుంటుండాది.
పశువులు,
పక్షులు
తమ
తమ
స్వేచ్ఛను
అనుభవిస్తున్నాయి.
పశువులు,
పక్షులు
స్వేచ్ఛను
అనుభవిస్తుంటే
మానవుడు
స్వేచ్ఛను
అనుభవించనక్కర
లేదా.
నిజమే
నీవు
కూడను
స్వేచ్ఛను
అనుభవించు.
ఐతే
పశువులు
యే
స్వేచ్ఛను
అనుభవిస్తున్నాయి?
పశుస్వేచ్ఛను
అనుభవిస్తున్నాయి.
మృగములు
యే
స్వేచ్ఛను
అనుభవిస్తున్నాయి.
మృగస్వేచ్ఛను
అనుభవిస్తున్నాయి.
నీవు
మనిషి
మనిషిస్వేచ్ఛను
అనుభవించు.
నీవు
మనిషివై
మృగస్వేచ్ఛను
అనుభవిస్తే
దోషము
కాదా?
కనుక
యీ
freedom
freedom
అనే
దానిని
మనము
పెడర్థములతో
నానార్థములతో
దీనిని
అభివృద్ధి
పరచుకొని
యదార్థమును
మరచిపోతున్నాము.
కనుక
యిది
కాదు
నిజమైన
freedom.
freedom
అంటే
యేమిటి
స్వేచ్ఛగా
విహరించటమేనా
freedom.
ఇంద్రియములను
విచ్చలవిడిగా
వదలిపెట్టటమా
freedom.
కాదు.
కాదు.
ఆత్మజ్ఞానము.
ఆత్మానందము.
ఆత్మనిగ్రహము
యిది
freedom.
పొద్దున్న
చబ్బర్
రెండు
maps
వేసి
ఒకవైపున
knowledge
మరొకవైపున
character
అని
పెట్టాడు.
కనుక
మన
balance
యేమిటంటె
ఒకవైపున
knowledge
ఒకవైపున
character
యీ
రెండు
సమన్వయముగా
వుండినప్పుడే
సక్రమమైన
balance
వుంటుంది.
నేటి
విద్యలు
తెలివి
తేటలనె
పెంచు
కొంచమైన
గుణము
పెంచబోదు
కోటి
విద్యలుండి
గుణము
లేకున్నచో
ఫలమదేమి
వాని
విలువదేమి?
ఎంత
తెలివి
తేటలు
వుండి
యేమి
ప్రయోజనము.
14
▾
Meaning
Keep
దానిని
వుంచే
గుణము
కూడను
మరొకవైపున
వుండాలి.
అప్పుడే
యిది
సరియైన
balanceగా
వుంటుంది.
ఈనాడు
మానవునకు
యీనాటి
విద్యావంతునకు
balance
పూర్తి
తప్పిపోయింది.
మనము
తొక్కే
సైకిలు
balance
తప్పిపోయిందంటె
accident
అయిపోతుంది.
క్రిందపడిపోతాడు.
మానవ
జీవితము
పవిత్రమైన
జీవితము.
దీనిలో
balance
లేకపోతే
యెంత
ప్రమాదము.
కనుక
యింద్రియములు
ఒకవైపున
గుణము
మరొకవైపున
యీ
రెండింటిని
అభివృద్ధి
గావించుకోటమే
విద్యావంతుని
ప్రధాన
కర్తవ్యము.
విద్యార్థులారా!
మన
యింద్రియములు
సరియైన
రీతిగా
అదుపులో
పెట్టుకోటమే
కాదు.
దీనిని
సమన్వయ
పరచుకోవాలి.
పతంజలి
చెప్పాడు
యోగః
చిత్తవృత్తి
నిరోధకః.
యీ
చిత్తవృత్తిని
నిరోధించటము
మహాకష్టము.
అసాధ్యము.
సమన్వయము
గావించుకోటము
సరియైన
సులభ
మార్గము.
మంచిని
స్వీకరించు.
చెడ్డ
తనంత
తానే
దూరమైపోతుంది.
కేవలము
మానవుని
బలహీనతలే
దీనికి
కారణమైపోతుంది.
విదేశీయుడైన
కార్లైన్
వుండేవాడు.
అతను
చాలా
తెలివి
తేటలు
గలవాడే.
గొప్ప
విద్యావంతుడే.
కానీ
యింద్రియ
నిగ్రహము
లేకపోవటం
చేత
మహాబలహీనుడైపోయాడు.
ఒక
imagination
వుంది
అతనిలో.
రాత్రి
పండుకొనే
సమయములో
నిద్రపట్టేది
కాదు.
ఈ
విధముగా
ఒక
నెల
గడిచేటుప్పటికి
అతనికి
అనారోగ్యము
ప్రారంభమైంది.
ప్రక్క
యింటివారిని
పిలిచారు.
'సార్!
నాకు
అనారోగ్యము
తెప్పించావు
దీనికి
నీవే
కారణము.
నీ
యింటిలో
కోడి
వుంటున్నాది.
ఆ
కోడి
రాత్రంతా
అరుస్తూ
వున్నాది.
ఆ
అరుపువలన
నాకు
నిద్ర
రావటం
లేదు.
కనుక
కోడిని
నీవు
తగిన
భద్రత
చేసుకో.
నాకు
ఆరోగ్య
బిక్ష
పెట్టమన్నాడు.
ఆ
పక్కింటి
యజమానుడు
చెప్పాడు.
మేము
అదే
యింటిలో
పడుకుంటున్నాము.
నా
కోడి
రాత్రంతా
కూసే
స్వభావము
కాదు.
ఏ
కోడైనా
రాత్రంతా
కూయదు.
రాత్రి
ఒక
పర్యాయమో
రెండు
పర్యాయములో
కూస్తుంది.
అప్పుడు
కార్లైన
చెప్పాడు
'ఒక
తూరో
రెండు
తూర్లో
కూస్తుంది.
అయితే
నాకు
పండుకొన్నప్పటినుంచి
ఎప్పుడు
కూస్తుందో
అని
ఆ
చింతనే
నాకు
నిద్ర
రాకుండా
చేస్తుంది.'
అన్నాడు.
ఇది
కోడికూత
వలన
వచ్చిన
అనారోగ్యము
కాదు.
తనలో
బలహీనత
వల్ల
వచ్చిన
అనారోగ్యము.
ఇట్లే
ప్రతి
వ్యక్తియందు
కూడను
మన
యింద్రియముల
చేత
ప్రమాదము
కంటె
భ్రమల
చేత
కలిగే
ప్రమాదములు
అధికముగా
వుంటున్నాయి.
కనుక
మానవుని
యందు
యీ
imagination
పూర్తి
పోవాలి.
ఈ
imagination
మానవుని
కృంగ
తీస్తుంది.
ఇంక
యింద్రియముల
యొక్క
ప్రభావము,
యింద్రియములు
యే
విధమైన
రీతిలో
కొంతవరకు
సమన్వయము
చేసుకోవచ్చు
అనేది
మున్ముందు
విచారిస్తాము.
Previous
←
The Moving Temple
Next
Road to Divinity
→