Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Śraddhā and Faith Win God's Grace
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Śraddhā and Faith Win God's Grace
21 June 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
నేటి
విద్యలు
తెలివితేటలనె
పెంచె
కొంచమైన
బుద్ధి
కలుగబోదు
కోటి
విద్యలుండి
బుద్ధి
లేకున్నచో
ఫలమదేమి
వాని
విలువదేమి?
ప్రేమస్వరూపులారా!
ప్రాకృతమైన
జగత్తునందు
తెలివితేటలను
బుద్ధిని
సమానముగా
పాటించి
నిత్య
జీవితములో
బుద్ధి
అనగా
తెలివితేటలు
అని
అర్థము
కల్పిస్తూ
వస్తున్నారు.
కాని
ఇది
సరియైన
అర్థము
కాదు.
బుద్ధి
అనగా
తెలివితేటలు
అని
అర్థము
చెప్పటము
విరుద్ధము.
ఈ
విషయమై
అనేక
పరిశోధనలు
సల్పి
విక్రమాదిత్యుడు
బుద్ధికి
మేథాశక్తికి
ఉన్న
వ్యత్యాసము
ఏమిటని
పెద్ద
conference
జరుపుతూ
వచ్చాడు.
అనేకమంది
కవులు,
పండితులు,
విద్యావంతులు,
మేథాశక్తి
గలవారు
ఇందులో
పాల్గొన్నారు.
‘మహోన్నతమైన
విద్యావంతులారా!
బుద్ధి
శక్తికిని,
మేథాశక్తికి
ఉన్న
వ్యత్యాసము
ఏమిటో
తెలిపి
నను
ఆనందపరచవలసిందని’
ప్రార్థించాడు.
‘ఈ
రెండింటియందు
ఏది
ఉత్తమమైనది,
ఏది
ఘనమైనది.
ఏది
సరియైనది
వెల్లడి
చేయ’మన్నాడు.
ప్రవేశించిన
పండితులందరు
మేథాశక్తి
కంటె
బుద్ధి
సర్వోత్కృష్టమైనదని
చెప్పారు.
బుద్ధియొక్క
సౌజన్యము,
సౌభ్రాతృత్వము
మేథాశక్తికి
లేదని
వారు
నిరూపించారు.
విక్రమాదిత్యునికి
ఆశ్చర్యం
వేసింది.
మేథాశక్తికి,
బుద్ధికి
ఎట్టి
భేదము
లేదని
పూర్వము
తాను
విశ్వసించాడు
బుద్ధి
ఐదు
అంశములతో
కూడినది.
చాలా
విలువైనది.
దీనికి
తెలివితేటలనే
పదము
సార్థకము
కాదని
వివరించారు.
ఒకటి
శ్రద్ధ.
రెండవది
ఋతము,
మూడవది
సత్యము
నాల్గవది
యోగము,
ఐదవది
మహత్తరమైన
శక్తి.
ఈ
ఐదు
శక్తులతో
కూడినది
బుద్ధి.
కేవలము
లౌకికమైన,
భౌతికమైన,
ప్రాకృతమైన,
లోకసంబంధమైన
తెలివితేటలను
పెంచేది
మేథాశక్తి.
మేథాశక్తి
గలవానికి
అన్నీ
సందేహములే.
ఒక్క
క్షణమైనా
విశ్వాసముతో
జీవించలేడు.
ఈ
మేథాశక్తితో
జీవించేవానికి
అమితమైన
అహంకారము
ఉంటుంది.
అహంకారము
ఎక్కడుందో
అక్కడ
ఆత్మతత్త్వము
మరుగున
పడిపోతుంది.
2
▾
Meaning
Keep
తద్వారా
బుద్ధిని
శక్తి
హీనము
గావిస్తుంది.
కనుక
తెలివితేటలు
గొప్ప
విద్యావంతుల
లక్షణము
కాదు.
కాని
దురదృష్టవశాత్తు
ఈనాటి
యుగములో
మేథాశక్తి
గలవాడు
గొప్పవాడని
భావిస్తున్నారు.
అతను
గొప్ప
మేథాశక్తి
గలవాడని
గౌరవిస్తున్నారు.
కాని
ప్రాచీన
కాలమందు
మేథాశక్తి
గలవారిని
ఎవరు
కూడా
చేర్చుకునేవారు
కాదు.
కేవలము
బుద్ధి
గలవారినే
గౌరవించేవారు.
మొట్టమొదటిది
శ్రద్ధ.
శ్రద్ధ
అనే
దానికి
రెండర్థములుంటున్నాయి.
ఆసక్తి,
స్థిరత్వము.
ఈ
రెండు
కూడినదే
శ్రద్ధ.
కేవలము
ఆసక్తి
ఉండినంత
మాత్రమున
చాలదు.
నీ
ఆసక్తిపైన
సక్రమమైన
విశ్వాసముండాలి.
ఆసక్తి,
స్థిరత్వము
రెండు
ఉండినదే
బుద్ధి.
బుద్ధి
యొక్క
ప్రభావమే
ఋతము.
దీనియొక్క
ప్రభావము
ఏమిటి?
త్రికాలములందు
దానిని
విచారణ
సల్పి
సరైన
విశ్వాసమా
కాదా
అనే
నిర్ణయము
చేసుకోటం,
త్రికరణ
శుద్ధికే
ఋతమని
పేరు.
తలంపు,
మాట,
క్రియ
ఈ
మూడు
పరిశుద్ధమైనవిగా
ఉండినప్పుడు
దీనికి
ఋతమనే
పేరు
సార్థకమవుతుంది.
ఋతము
యొక్క
తత్త్వము
చక్కగా
గుర్తించి
వాక్కు
రూపమున
వెల్లడి
చేసేదే
సత్యము.
త్రికరణ
శుద్ధి
పరిపూర్ణముగా
విశ్వసించి
పలికే
పలుకునకే
సత్యమని
పేరు.
చూచింది
చూచినట్లుగా
విన్నది
విన్నట్లుగా,
చేసినది
చేసినట్లుగా
చెప్పటం
సత్యము
కాదు.
దీనిని
నిజము
అని
చెప్పవచ్చును.
కాని
సత్యమునకు,
నిజమునకు
చాలా
వ్యత్యాసము
ఉన్నది.
ఋతము
యొక్క
తత్త్వము
వాక్కురూపములో
వెల్లడి
చేసేదే
సత్యము.
నాల్గవది
యోగము.
యోగమనగా
ఏమిటి?
అనేక
రకములైన
యోగములుంటున్నాయి
లోకములో.
కాని
పతంజలి
యోగ
సూత్రములు
పురస్కరించుకొని
‘యోగః
చిత్తవృత్తి
నిరోధకః’
అనగా
సమస్త
ఇంద్రియములను
స్వాధీన
పరచుకోటమే
యోగము.
మానవుని
యొక్క
సర్వశక్తులు
తన
ఆధీనము
నందుంచుకోటమే
యోగము.
దృష్టిని
అదుపులో
పెట్టుకోటమే
యోగము.
శ్రవణమును
అదుపులో
పెట్టుకోటమే
యోగము.
వాంఛలను
అదుపులో
పెట్టుకోటమే
యోగము.
వాక్కును
అదుపులో
పెట్టుకోటమే
యోగము,
thoughtsను
అదుపులో
పెట్టుకోటమే
యోగము.
ఐదు
ఇంద్రియముల
తత్త్వము
అదుపులో
పెట్టుకోటమే
యోగము
అన్నారు.
అయితే
మాట్లాడాలి.
మాటలను
వదరకూడదు.
త్రికరణ
శుద్ధి
అయిన
సత్యము
ద్వారా
మాట్లాడాలి.
అసత్యమైన
దానిపై
మనము
వాదోపవాదములు
వేయకూడదు.
తెలియని
దానిపై
వాదోపవాదములు
వేయటము
కేవలము
అజ్ఞానము.
3
▾
Meaning
Keep
ఈ
వాదోపవాదముల
వల్ల
ద్వేషము
పెరుగుతుంది
గాని
ఐక్యత
పెరగదు.
వాదించుకుంటూ
పోయినప్పుడు
అది
వైరముగా
మారిపోతుంది.
కనుక
విద్యార్థులు
ఇంద్రియ
నిగ్రహమును
అత్యవసరంగా
విశ్వసించాలి.
ఈ
వయస్సు
చాలా
పవిత్రమైన
వయస్సు.
దివ్య
వయస్సు.
భవిష్యత్తుకు
రాజమార్గము.
రాజమార్గము
నిర్మించే
వయస్సు.
నేటి
యువకులే
భవిష్యత్తులో
భారత
ఉద్ధారకులు.
విద్యార్థులకు
ఇంద్రియ
నిగ్రహము
మొదటి
పాఠము.
శ్రద్ధతో
ఋతముతో
సత్యముతో
యోగముతో
సమ్మిళితమైన
స్వరూపమే
మహత్తరమైన
శక్తి.
భగవత్స్వరూపమే
మహత్తరమైన
శక్తి.
అట్టి
మహత్తర
శక్తియందే
త్రికరణ
శుద్ధి
ఉంటుంది.
ఆ
దివ్యత్వము
పైనే
సత్యము
ప్రకాశిస్తుంది.
కనుకనే
సత్యమే
దైవము
అన్నారు.
ఇంతే
కాదు
శ్రద్ధ
కూడా
దైవ
స్వరూపమే.
ఎందుకనగా
‘శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం’
దాని
వలనే
జ్ఞానం
లభిస్తుంది.
జ్ఞానము
ఎవరు?
దైవ
స్వరూపమే.
సత్యం
జ్ఞాన
మనంతం
బ్రహ్మ
అన్నారు.
కనుక
సత్యం
భగవత్స్వరూపమే,
ఋతము
భగవత్స్వరూపమే.
శ్రద్ధ
భగవత్స్వరూపమే.
మహత్తరమైన
యోగశక్తి
భగవత్స్వరూపమే.
ఈ
ఐదింటికి
బుద్ధి
ప్రధాన
నిలయము.
దీనిని
పురస్కరించుకొనియే
వేదమునందు
బుద్ధి
గ్రాహ్య
మతీంద్రియమ్
అన్నారు.
బుద్ధి
ఇంద్రియాతీతమైనది.
ఇంద్రియాతీతమైన
బుద్ధిని
మేథాశక్తితో
పోల్చుటము
సరియైనది
కాదు.
బుద్ధికి
మేథాశక్తికి
ఉన్న
వ్యత్యాసము
విద్యార్థులు
గుర్తించాలి.
తెలివి
తేటల
చేత
మంచి
‘O’
grade
తేవచ్చు.
తెలివితేటల
చేత
వాదోపవాదములు
జరపవచ్చు.
తెలివితేటల
చేత
మంచి
ప్రసంగములు
చేయవచ్చు.
ఇవన్నీ
లోక
సంబంధమైనవి.
ప్రాకృతమైన
విద్యలే.
ప్రవృత్తి
మార్గములే.
కాని
బుద్ధి
నివృత్తి
తత్త్వము.
బుద్ధికి
ఉండిన
సమీపత్వము
మీరు
చక్కగా
గుర్తించాలి.
అడుగు
భాగమున
ఉన్నది
దేహము.
దేహమునకు
పైభాగమున
ఉన్నది
senses.
ఈ
sensesకు
పై
భాగములో
నున్నది
mind.
mind
పై
భాగములో
నున్నది
బుద్ధి.
బుద్ధికి
పై
భాగములో
నున్నది
ఆత్మ.
ఆత్మకు
అత్యంత
సమీపములో
నున్నది
బుద్ధి.
బుద్ధితత్త్వము
ఆత్మ
ద్వారానే
ప్రకాశిస్తున్నాది.
ఆత్మయొక్క
ప్రతిబింబమే
బుద్ధి.
అట్టి
పవిత్రమైన
బుద్ధిని
పవిత్రమైన
కృత్రిమమైన
మేథాశక్తితో
పోల్చటం
తప్పు.
ఈ
తెలివితేటలు
ఇంద్రియములకతీతమైనవి
కాదు.
ఇంద్రియములతో
కూడినవి.
కాని
బుద్ధి
ఇంద్రియాతీతమైనది.
ప్రాకృతమైన
ఉపాధికి
మాత్రమే
తెలివితేటలు
పనికి
వస్తాయి.
ఈ
ఉపాధి
భేదముండినంత
వరకు
ఏకత్వమనే
ఆత్మతత్త్వము
మనకు
అర్థము
కాదు.
4
▾
Meaning
Keep
ఒక
శ్రీమంతుడు
ఒక
గొప్ప
భవనము
కట్టాడు.
ఆ
భవనములో
bedroom,
drawing
room,
kitchen,
dining
hall,
bathroom
అన్నీ
పెట్టారు.
మధ్యలో
గోడలు
ఉండటంచేత
ఈ
గదులన్నీ
విడి
రూములుగా
తయారయ్యాయి.
dining
roomకి
drawing
roomకి
wall
ఉంది.
ఈ
wall
తీసివేసిన
హాలుగా
ఉంటుంది.
అదే
విధముగా
అన్ని
గోడలు
తీసివేసిన
ఒకే
హాలుగా
తయారవుతుంది.
అదే
ఏకాత్మ
తత్త్వమైన
విశాలమైన
ఆనందము.
మనము
ఉపాధులందు
అనేక
భేదములు
కల్పించుకుంటున్నాము.
ఒక
ఇంటి
యజమాని
ఉన్నాడు.
కుమారుడు
నాన్నా
అని
పిలుస్తాడు.
భార్య
వచ్చి
my
dear
husband
అంటుంది.
grand
son
వచ్చి
my
dear
grand
father
అంటాడు.
daughter-in-law
వచ్చి
my
dear
father
in
law
అంటుంది.
అనేక
మంది
అనేక
సంబంధములు
పెట్టుకుంటున్నారు.
కాని
యజమాని
ఒక్కడే.
అదే
విధముగా
ఈ
సంబంధ
బాంధవ్యములు
దేహ
ఉపాధులచే
కలిగినవేగాని
ఆత్మతత్త్వమునకు
సంబంధించినవి
కాదు.
ఏకాత్మ
తత్త్వాన్ని
మనం
విశ్వసించినప్పుడు
ఈ
భేదములన్నీ
అంతర్థానమై
పోతాయి.
కనుక
మనము
ఈ
దేహాభిమానము
వదలుకోటానికి
ప్రత్యేకమైన
సాధనలు
చేయనక్కరలేదు.
దేహము
ఒక
గోడవంటిది.
ఇది
కేవలము
నెగిటివ్
లోపల
పాజిటివ్
అనే
వైబ్రేషన్సు
చేరి
అనేక
రకములుగా
దీనిని
ఆడిస్తున్నాది.
ఒక
గడియారము
మాదిరి
ఉంటున్నాది.
కీ
ఇస్తే
ముల్లులు
తిరుగుతాయి.
కీ
ఇవ్వకపోతే
ముల్లులు
తిరగవు.
ముల్లులు
తిరగక
మనం
టైము
చెప్పలేము.
అదే
రీతిగా
దేహమనే
గడియారమునకు
life
అనే
కీ
ఇవ్వటం
వలనే
చేతులు,
కళ్ళు,
ముక్కు
తమ
తమ
పనులు
చేస్తున్నాయి.
మొన్న
చెప్పాను
గాయత్రీ
మంత్రములో
భూర్భువస్సువః.
భూః
అనగా
దేహసంబంధము
materialisation.
అది
నెగిటివ్.
ఇది
పదార్థములతో
ఏకమైనదే.
ఈ
దేహము
ఎట్లా
ప్రారంభించింది.
iron,
soap,
సున్నము,
ఫాస్ఫరస్,
water
అన్నీ
చేరి
దేహము
తయారైంది.
భూః
అనగా
పదార్థముల
చేరిక.
అదే
భూలోకము.
భువః
భూలోకమును
నడిపించే
శక్తి
life
force
vibration.
ఈ
రెండింటిని
సరైన
మార్గములో
నడిపింప
చేసేదే
radiation
ప్రజ్ఞానం.
దీనినే
వేదము
ప్రజ్ఞానం
బ్రహ్మ
అని
ఉచ్చరించింది.
ఈ
ప్రజ్ఞానమనే
radiation
ఉండటంచేత,
life
అనే
vibration
materialisation
దేహము
పనిచేస్తున్నాది.
భూలోకము,
భువర్లోకము,
సువర్లోకము
అంటే
ఎక్కడో
మనకు
కనిపించనివి
కాదు.
సర్వము
మనయందే
ఉంటున్నాయి.
ధర్మము
మనయందే
ఉంటున్నది.
5
▾
Meaning
Keep
జగత్తంతా
మనయందే
ఉంటున్నాది.
దైవత్వము
మనయందే
ఉంటున్నాది.
దానవత్వము
మన
యందే
ఉంటున్నాది.
మానవత్వము
మనయందే
ఉంటున్నాది.
పశుత్వము
కూడా
మనయందే
ఉంటున్నాది.
అన్నింటికిని
మూలాధారము
మన
సంకల్పములే.
కనుక
సత్సంకల్పములు
మనము
అభివృద్ధి
పరచుకోవాలి.
సత్సంకల్పములు
ఎక్కడ
నుంచి
వస్తాయి.
బుద్ధి
ద్వారా
మనకు
లభ్యమవుతాయి
మంచి
సంకల్పములు.
లేకుండా
మాట్లాడితే
బుద్ధిహీనుడంటారు.
బుద్ధి
లేనివాడు
పశువు
అని.
బుద్ధి
గలవాడు
త్రికరణ
శుద్ధి
గలవాడు.
అతను
మేధావి
అని
చెప్పకూడదు.
అవన్నీ
ప్రాకృతమైన
పదములు.
జగత్
వ్యాపారమునకు
సంబంధించిన
పదములు.
ఈ
అన్నింటికిని
అతీతమైనది,
భగవంతుని
నియమము
లోపల
తు.చ.
తమ
కర్తవ్యము
తాము
నిర్వర్తిస్తుంటాయి.
అన్నింటికి
ఏకాత్మ
తత్త్వము
ఒక్కటే
ఆదర్శము.
దేహమే
సరైన
ఉదాహరణము.
ఎట్లా?
మనసు
సంకల్పించుకొంది.
అక్కడకు
వెళ్ళాలని.
ఈ
సంకల్పము
పురస్కరించుకొని
పాదములు
కదిలి
అక్కడికి
వెడుతున్నాయి,
సంకల్పములచేత
పాదములు
కదలుతున్నాయి.
తరువాత
ఆ
పని
చేయాలని
సంకల్పించుకున్నంత
మాత్రమున
చేతులు
అందులో
ఐక్యమై
పని
చేస్తున్నాయి.
నేను
ఫలానావానిని
చూడాలని
సంకల్పించుకొన్న
తక్షణమే
కన్నులు
అతనిని
చూస్తున్నాయి.
టేపురికార్డు
వినాలని
సంకల్పించిన
తక్షణమే
చెవి
టేపు
రికార్డు
వింటుంది.
భోజనము
చేయాలని
సంకల్పించుకున్నప్పుడు
తక్షణమే
భోజనము
చేస్తున్నది
నోరు.
చేతులు,
కాళ్ళు,
కళ్ళు
నోరు
అన్నీ
సంకల్పములననుసరించే
ఆశ్రయించి
పోతున్నాయి.
తమ
తమ
కర్తవ్యములు
తాము
నిర్వర్తిస్తున్నాయి.
వినే
చెవి
పలుకుటకు
ప్రయత్నించదు.
పలికే
నోరు
వినటానికి
ఏ
మాత్రము
ప్రయత్నించదు.
పలికే
నోరు
పలికే
పనే
చేస్తుంది.
చెవులు
కేవలం
వినటం
మాత్రమే
చేస్తుంది.
తమ
తమ
కర్తవ్యములు
నిర్వర్తించుకోకుండా
దారి
తప్పినప్పుడు
జీవితమే
వ్యర్థమైపోతుంది.
ఒకానొకప్పుడు
మిగితా
ఇంద్రియములన్నీ
విరుద్ధముగా
నడవటానికి
ప్రయత్నించాయి.
ఎన్నో
శ్రమలు
పడి
మేము
మధురమైన
పదార్థములు
సంపాయిస్తుంటే
నోరు
ఒక్కటి
మాత్రమే
తింటున్నాది.
మాకు
ఎందుకివ్వటం
లేదు.
సంపాయించేది
మేము
భుజించేది
నోరా!
సొమ్ములు
ఒకరివి
సోకు
ఇంకొకరిది.
అన్నాదిట.
ఇవన్నీ
తమ
తమ
పనులు
స్తంభింప
చేశాయి.
ఏమైపోయింది?
దేహమే
కృశించిపోయింది.
ఈ
దేహములో
ఒక్కొక్క
అంగమునకు
ఒక్కొక్క
ప్రక్రియ
బోధించి
తద్వారా
తుచ
తమ
తమ
కర్తవ్యములను
తాము
నిర్వర్తించాలని
శాసించాడు
భగవంతుడు.
ఈనాడు
లోకములో
దేహములోని
ఇంద్రియములు
తమ
తమ
కర్తవ్యములు
పాటిస్తున్నాయి
కాని
మానవుని
మనస్సు
తన
కర్తవ్యము
తాను
పాటించటం
లేదు.
6
▾
Meaning
Keep
ఒకవైపున
మంచిది
కాదని
చెబుతున్నాది
మనసు,
దానినే
చేయిస్తున్నాది
మనసు.
చెడ్డని
చెప్పటము
దానినే
తిరిగి
చేయించటము
ఇది
సరైన
లక్షణమా?
కనుక
మనస్సు
లక్షణము
పిచ్చికోతి
వంటిదన్నారు.
body
is
like
water
bubble.
ఎప్పుడు
పగులుతుందో.
mind
అనేది
mad
monkey.
కనుక
don't
follow
the
body,
don't
follow
the
mind
follow
conscience
నీ
ఆత్మతత్త్వమునే
అనుసరించు.
అప్పుడే
నీవు
సక్రమమైన
దానిని
నీవు
అనుభవిస్తావు.
ఈనాటి
మానవులు
తమ
తమ
కర్తవ్యములను
తాము
నిర్వర్తించక
పెడమార్గములో
ప్రవేశించటంచేత
అనేక
అశాంతులకు
గురైపోతున్నారు.
తాము
అశాంతి
పొందటమే
కాక
జగత్తుకు
అశాంతి
నందిస్తున్నారు.
ప్రతి
వ్యక్తి
తమతమ
కర్తవ్యములను
తాము
నిర్వర్తించాలి.
దీనినే
work
is
worship.
ప్రతి
పని
భగవత్సేవగా
భావించాలి.
కాని
తాము
ఆవిధంగా
భావించటము
లేదు.
చెప్పటం
ఒకటి
చేయటం
మరొకటి.
మనస్యేకం,
వచస్యేకం,
కర్మణ్యేకం
మహాత్మనం.
బుద్ధికి
ఉన్న
ఐదు
అంశములలో
చివరిది
మహత్తరము.
ఆ
మహత్తర
శక్తి
ఎట్లా
వస్తుంది?
మూడింటి
ఏకత్వము
చేతనే
మహత్తరమైన
శక్తి
వస్తుంది.
మనస్
అన్యత్,
కర్మణ్
అన్యత్,
వచస్
అన్యత్
దురాత్మనం.
శ్రద్ధ,
ఋతము,
సత్యము,
యోగము,
మహత్తరము
ఈ
ఐదు
అంశములతో
కూడినది
పవిత్రమైన
బుద్ధి.
ఈ
బుద్ధియే
గాయత్రీమంత్రమందు
ధియోయోనః
ప్రచోదయాత్.
సూర్యప్రకాశము
చేత
ఈ
జగత్తు
నావరించిన
చీకటి
ఏవిధముగా
అంతర్థానమైపోతుందో
అదే
విధముగా
బుద్ధియొక్క
ప్రకాశము
వికసించినంత
మాత్రమున
మన
అజ్ఞానము
దూరమైపోతుంది.
బుద్ధియొక్క
ప్రకాశమునకు
ఏది
ఆధారము?
ఆత్మ
విశ్వాసమే.
ఈ
ఆత్మవిశ్వాసము
అభివృద్ధి
పరచుకోవాలి.
అది
లేక
ఏ
చిన్నదానిని
మనము
సాధించలేము.
తనను
కూడా
తాను
నమ్మలేడు
ఆత్మవిశ్వాసము
లేకపోతే.
జీవితమే
అయోమయంగా
మారిపోతుంది.
అస్తవ్యస్తంగా
మారిపోతుంది.
నేను
మానవుడను
అనే
దివ్యత్వము
తాను
విశ్వసించాలి.
ఉపనిషత్తులందు
మానవుడు
నమ్మకము
కలవాడని
చెప్పాయి.
ఈనాడు
వ్యక్తి
అంటే
నమ్మకము
లేకుండా
పోతున్నాది.
పశువులకు
యజమానిపై
నమ్మకము
ఉంటున్నాది.
కుక్క
యజమానిని
ఆప్యాయంగా
చూస్తుంది.
కాని
ఈనాటి
మానవునే
నమ్మలేక
పోతున్నాడు.
నాలుగు
దినములు
మానవునే
నమ్మలేని
మానవుడు
నారాయణుని
ఏవిధముగా
నమ్మగలడు.
మానవుని
నమ్మినప్పుడు
మాధవుని
నమ్మటానికి
వీలవుతుంది.
7
▾
Meaning
Keep
నాలుగు
దినములు
బ్రతికినా
నారాయణునిపై
విశ్వాసముతో
బ్రతకాలి.
ఆ
విశ్వాసమును
పెంచుకోటానికి
తగిన
శ్రద్ధ
తీసుకోవాలి.
శ్రద్ధ
రెండు
పదములతో
కూడినది.
ఆసక్తి,
స్థిరత్వము
రెండు
చేరినప్పుడే
శ్రద్ధ
మనకు
బయలుదేరుతుంది.
నాకు
భగవంతుడు
కావాలని
ఆసక్తి
ఉంటుంది.
ఆసక్తికి
తగిన
స్థిరత్వము
కావాలి.
అప్పుడే
ఈ
విధమైన
దివ్యత్వము
ప్రాప్తిస్తుంది.
విద్యార్థులారా!
మీకు
తెలియని
విషయములు
ఎన్నో
ఉంటున్నాయి.
నేర్చుకోవలసినవి
ఎన్నియో
ఉంటున్నాయి.
ఈనాడు
బుద్ధికి,
మేధాశక్తికి
ఉన్న
వ్యత్యాసము
మీరు
గుర్తించండి.
అదే
విధముగా,
మనస్సుకు,
సంకల్పములకు
ఎంతో
వ్యత్యాసము
ఉంటున్నది.
మనస్సు
తెల్లని
వస్త్రము
వంటిది.
మనస్సు
చాలా
పవిత్రమైనది
కాని
దుస్సంకల్పముల
చేత
మనస్సు
అపవిత్రమై
పోతున్నాది.
తెలుపు
సహజ
స్వరూపము.
దీనిని
అనేక
విధములుగా
ఉపయోగపెట్టుకోటం
చేత
నల్లగా
మారిపోతున్నాది.
నల్లగా
మారిన
వస్త్రమును
మనము
చాకలికి
వేస్తున్నాము.
చాకలి
మాలిన్యము
తీసి
తిరిగి
తెచ్చాడు.
మనము
ఏమంటున్నాము.
చాకలి
దీనిని
తెల్లగా
చేశాడు
అంటున్నాము.
దీని
తెలుపుచేసే
శక్తి
వానికి
లేదు.
తెలుపు
దీని
స్వభావము.
స్వస్వరూపమే.
ఉన్న
మాలిన్యమును
తీసి
తీసుకువచ్చాడు.
అట్లే
మన
మనస్సు
శుద్ధమైన
తెలుపు.
విషయ
వాసనల
చేత
మనమే
మాలిన్యము
చేసుకుంటున్నాము.
దైవచింతన
అనే
రాతికి
వేసి
కొట్టినప్పుడు
మలినం
వీడిపోతుంది.
అదే
శ్రద్ధ.
ఆ
విధమైన
శ్రద్ధను
విశ్వాసమును
మనం
పెంచుకోవాలి.
శ్రద్ధ
విశ్వాసము
రెండు
ఉండినప్పుడు
సాధించనిదే
ఉండదు
లోకములో.
దేనినైనా
సాధించవచ్చు.
చంద్రమండలమైనా
చేరవచ్చు.
సూర్య
మండలమునైనా
చేరవచ్చు.
ఏమిటి
ఆ
సూర్యమండలము?
హైడ్రోజను
అందించి
లోకమునకు
ఉపకారము
చేసే
ఆ
సూర్యుడు
కాదు.
‘చంద్రమా
మనసో
జాత
చక్షో
సూర్యో
అజాయత!’
మన
దృష్టియే
సూర్యుడు.
ఈ
దృష్టిని
మనము
చేరవచ్చు
అదే
పవిత్రమైన
దృష్టి.
సుదర్శనమనే
పేరు
పెట్టారు
దీనికి.
అనగా
మంచి
దర్శనము.
మకరి
అనేక
రకములుగా
చిక్కిన
గజమును
హింసిస్తుంటే
గజము
ప్రార్థిస్తున్నాది
నారాయణుని
‘ఠావుల్
దప్పెను,
మూర్ఛవచ్చె,
తనువున్
డస్సెన్
శ్రమంబయ్యెడిన్,
రావే
ఈశ్వర
కావవె
వరద
సంరక్షించు
భద్రాత్మకా!’
అన్నాడు.
హృదయపూర్వకంగా
ప్రార్థించాడు
గజరాజు.
గజరాజు
ఎవరు?
ఏనుగు
కాదు.
మన
మదమే
గజము.
మదగజము
శక్తిని
కోల్పోయి
దైవమువైపు
మరల్చింది.
భగవంతుడు
అటువైపు
చూచాడు.
ఆ
చూపే
సుదర్శన
చక్రంగా
మారిపోయింది.
సూర్యుని
తేజస్సు
మన
నేత్ర
స్వరూపము.
8
▾
Meaning
Keep
ఈ
ప్రకాశము
నేత్రములో
లేదు.
ఈ
నేత్రములో
రెండు
చేరినాయి.
లోపల
వెలుపల
రెండింటి
ప్రకాశమే
మన
దృష్టి.
సూర్యుడు
చక్కగా
ప్రకాశిస్తున్నాడు.
ప్రకాశించు
సూర్యుని
లోపల
కన్నులు
మూసుకో
ఏమీ
కనిపించదు.
సూర్యప్రకాశములో
కన్నులు
మూసుకుంటే
కన్నులు
కనిపించాలి
కదా.
కనిపించదే!
కారణం
ఏమిటి?
నీయందున్న
సూర్యుడు
ఆ
సూర్యునితో
ఏకం
కావాలి.
లేకపోతే
ఇది
ఏకత్వం
కాదు.
కాని
చీకటి
గదిలోకి
పోయి
కన్నులు
తెరచి
చూడు
ఏ
పదార్థములు
కనిపించవు.
కారణం
ఏమిటి?
ఆ
చీకటి
రూములో
సూర్యరశ్మి
లేదు.
సూర్యరశ్మి
లేక
కన్ను
దృష్టి
లేదు.
కన్ను
దృష్టి
సూర్యుని
వెలుగు
రెండు
చేరినప్పుడే
పదార్థము
చూడగలుగుతున్నాము.
కన్నులు
తెరవాలి.
సూర్యకాంతి
ఉండాలి.
రెండింటి
యొక్క
ఏకత్వము
కావాలి.
అప్పుడే
పవిత్రమైన
బుద్ధిగా
రూపొందుతుంది.
ఈ
పవిత్రమైన
బుద్ధి
ప్రకాశము
చేత
చూడగలము.
దృష్టి
కన్నులలో
లేదు.
శ్రవణము
చెవులలో
లేదు.
వాక్
నాలుకపై
లేదు.
అన్నింటి
వెనుక
ఒక
దివ్యశక్తి
ఆధారంగా
ఉంటున్నాది.
ఒక
మనిషి
మరణించాడు.
మరణించిన
దేహములో
కన్నులున్నాయి.
కాని
చూడగలుగుతున్నాడా?
మరణించిన
వానికి
చెవులు
కూడా
ఉంటున్నాయి
వినగలుగుతున్నాడా?
లేదు.
కారణం
ఏమిటి?
ఇంద్రియములున్నాయి
గాని
లోపల
దివ్యశక్తి
లేకుండా
పోయింది.
కన్నులుండి
చూడలేక
పోతున్నారు.
చెవులుండి
వినలేక
పోతున్నారు.
కారణం
ఏమిటి?
మనస్సు
యొక్క
తత్త్వము
మాలిన్యమైపోయింది.
ఒకానొక
సమయంలో
సూరదాసు
దగ్గరకు
కృష్ణుడు
వచ్చి
‘సూరదాసు!
నీకు
నన్ను
చూడాలని
ఉందా?
నీకు
దృష్టి
అనుగ్రహిస్తాను’
అన్నాడు.
సూరదాస్
చెప్పాడు
‘కన్నులున్న
వారందరు
నిన్ను
చూడగలుగుతున్నారా?’
కన్నులుండియు
గుడ్డులై
కళ్యాణకరమైన
నీ
మూర్తి
దర్శింపనేరరైరి.
చెవులుండి
చెవుటులై
అతిమనోహరమైన
నీ
గాన
మాలింపనేరరైరి.
ఎందుకు
చెవులు
చేటలవలె
ఉంటున్నాయి.
కాని
నీ
మురళీగానము
వినగలుగుతున్నారా?
కన్నులున్నాయి.
కేవలము
పత్తికాయలవలె
ఉన్నాయి.
అందరు
నిన్ను
చూడగలుగుతున్నారా?
నిన్ను
చూడగలిగే
కన్నులు
కావాలి.
నీ
వేణుగానము
వినే
చెవులు
కావాలి.
అంతేగాని
చర్మ
చక్షువులు
అక్కరలేదు.
అదే
నిజమైన
జ్ఞానము.
అదే
నిజమైన
వైరాగ్యము.
కనుక
దివ్యమైన
భావము
మనం
పొందాలనుకుంటే
మొట్టమొదట
బుద్ధియొక్క
తత్త్వము
మనం
గుర్తించాలి.
9
▾
Meaning
Keep
ఈ
బుద్ధియందే
సర్వము
ఉంటున్నది.
Divine
will,
free
will,
అనేది
ఒక్క
దైవమునకే
ఉంటున్నాది.
మరొకరికి
లేదు.
self
అంటే
ఎవరు?
దైవమే.
ఆ
దైవశక్తియే.
సర్వుల
యందు
దైవశక్తి
ఉంటున్నాది.
కాని
అది
వారు
దైవశక్తిగా
విశ్వసించటం
లేదు.
తమ
శక్తిగా
భావిస్తున్నారు.
అదే
అజ్ఞానము.
అదే
మూర్ఖత్వము.
సర్వశక్తులందు
దైవశక్తి
ఒకటి
ఇమిడి
ఉంటున్నాది.
అట్టి
దివ్యశక్తి
తెలుసుకోవాలంటే
ఆసక్తి,
స్థిరత్వము
ఈ
రెండు
మొట్టమొదట
ఉండాలి.
దైవముపైన
ఆప్యాయత
ప్రేమ
మనకు
పెరగాలి.
ఆ
ప్రేమ
ఎట్లా
ఉండాలి?
గాలికి
ఆడినట్లుగా
ఉండకూడదు.
గడియారం
పెండ్యులము
మాదిరి
ఉండకూడదు.
స్థిరమైనదిగా
ఉండాలి.
అప్పుడే
ఆ
అనుగ్రహమునకు
పాత్రుడు
కాగలడు.
కాన
విద్యార్థులు
తెలుసుకొనవలసిన
చిన్న
చిన్న
విషయాలెన్నో
ఉంటున్నాయి.
చాలామంది
అనుకుంటారు.
స్వామి
చెప్పినవే
చెప్పుతున్నారు
అని.
చెప్పినవే
చెప్పాలి
మరి.
మీరు
నేర్చుకునేంత
వరకు
చెప్పినవే
చెప్పాలి.
దినము
తిన్న
కడుపుకే
మీరు
తినటం
లేదా?
పొద్దున్న
తిన్నారు
కదా
సాయంకాలం
ఎందుకు
అనుకోకూడదు.
నిన్న
తిన్నాను
కదా
యీపొద్దు
ఎందుకు
అనుకోకూడదు.
ఎందుకనగా
తిన్నది
జీర్ణించుకొని
పోతున్నది.
తిన్న
కడుపుకే
తింటున్నాము.
కడిగిన
ముఖమునే
కడుగుతున్నాము.
విన్న
విషయము
తిరిగి
ఎందుకు
వినకూడదు.
దాన్ని
ఆచరణలో
పెట్టి
ఆనందమును
అనుభవిస్తే
విన్న
విషయము
మీకు
అక్కరలేదు.
ఆచరణలో
పెట్టేంతవరకు
చెప్పిందే
చెప్పాలి.
ఒక
చిన్న
విషయము.
చాలామంది
చిన్నపిల్లలకు
A,
B,
C,
Dలు
నేర్పిస్తుంటారు.
1st
standardలో
కొన్ని
spellings
నేర్పిస్తారు.
MILK
అని
చెప్పాలంటే
MILK
అని
అనేక
పర్యాయములు
చెప్పాలి.
ఆ
విధంగా
అనేక
పర్యాయములు
ఉచ్చరించినప్పుడే
milk
spelling
అర్థమవుతుంది.
మీకు
spelling,
meaning
తెలిసేంతవరకు,
అర్థమయ్యేంత
వరకు
చెప్పేతీరాలి.
చెప్పినవి
చెప్పినా
నిత్యనూతనంగా
ఉంటాయి.
ఆ
సత్యమును
మీరు
చక్కగా
గుర్తించటం
లేదు.
గాయత్రీ
మంత్రము
ఎన్నో
పర్యాయములు
చెప్పాను.
ఒక
పర్యాయము
చెప్పినది
మరొక
పర్యాయము
వ్యత్యాసముగా
ఉంటుంది.
అదే
సాయి
యొక్క
గొప్పతనము.
నిత్యనూతనమైన
పదములు.
ఎప్పటికప్పుడు
నూతనముగా
ఉంటుంది.
మాటలు
మాత్రమే
కాదు
నేను
కూడా
నిత్యనూతనంగా
ఉంటాను.
అదే
దైవత్వము.
నిత్యనూతనమే
దైవత్వము.
మీరుకూడా
నిత్యనూతనంగా
ఉండాలి.
పాతవి
రోతవి
మీరు
హృదయములో
చేర్చుకోరాదు.
ఎప్పుడు
ఆనందములో
ఉండాలి.
అదే
దైవత్వముతో
ఉండినందుకు
ఫలితము.
where
is
happiness.
10
▾
Meaning
Keep
His poems 169
Also in his talks
(10)
10 December 1986
Faith in the Ātma alone gives all strength
15 September 1988
God's descent is only to make Prema grow
17 June 1996
He Who Reaches God's Presence Is Honoured Everywhere
10 July 1996
Follow the Religion of Love
23 November 1996
We Must Make Human Life a Life Full of Prema
29 March 1998
God fills every place
12 November 2003
Grow Prema for God and pity for the helpless
21 July 2005
No power is greater than Bhakti for God
7 October 2005
Surrender to God
22 August 2007
Foster faith in God and love of country!
happiness
is
union
with
god.
రెండు
చేరినప్పుడే
happiness
వస్తుంది.
నిజముగా
దైవచింతన
లేని
ముఖములు
చూడండి.
కృత్రిమంగా
సినిమాలో
నవ్వినట్లు
నవ్వవచ్చునేగాని
వారి
ముఖము
castor
oil
ముఖంలా
ఉంటుంది.
దైవానుగ్రహమునకు
పాత్రులైన
వారి
ముఖము
చక్కగా
కళకళలాడుతూ
ఉంటుంది.
దైవత్వముతో
కూడిన
వానికి
దైవకళ
ఉట్టిపడుతుంది.
అదే
దైవత్వమునకు
గుర్తు.
ఆ
అంశము
దానిపై
పడింది.
ఆ
కిరణము
దానిపై
పడింది.
కనుకనే
ప్రకాశిస్తూ
ఉంటుంది.
దైవానుగ్రహమునకు
పాత్రులు
కావాలంటే
శ్రద్ధ
విశ్వాసము
కావాలి.
ఒక
ladderకు
విశ్వాసము
క్రింద,
పైన
ప్రేమ.
పైన
క్రింద
ఆధారము
లేకపోతే
ఆ
ladderను
మనం
ఎక్కలేము.
మొట్టమొదట
విశ్వాసము,
ప్రేమ
రెండు
ఉంటే
మనం
దేనినైనా
సాధించవచ్చు.
ఎక్కడికైనా
వెళ్ళు.
అడవులందున్న
ఆకసమున
నున్న
పట్టణమున
నున్న
పల్లెనున్న
గుట్టమీద
నున్న
నట్టేట
బడియున్న
ఎక్కడ
ఉన్నా
నీ
వెంటనే
జంటనే
కంటనే
ఉంటున్నాడు.
అట్టి
దివ్యమైన
భావమును
మీరు
అభివృద్ధి
పరచుకోవాలి.
Previous
←
The Paramātma Is Prema, Prema Is the Paramātma
Next
Service to Society Is the Mark of True Humanness
→