Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · The Paramātma Is Prema, Prema Is the Paramātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Paramātma Is Prema, Prema Is the Paramātma
20 June 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
His poems 288
Also in his talks
(1)
24 August 1989
Those Who Recognised the Paramātma Are the Gopīs
ప్రేమ
లేనట్టి
మనసది
ప్రేత
భూమి
అనగ
నొప్పారు
నిజముగ
అవనియందు
శ్వాస
నిశ్వాసములు
రెండు
జరుగుచుండు
కొలిమితిత్తికి
ప్రాణమని
నుడువదగున!
ప్రేమస్వరూపులారా!
ప్రేమ
యొక్క
లక్ష్యము
త్యాగము.
ప్రేమ
దేనిని
కోరదు.
ప్రేమ
ఎవరిని
దూషించదు.
ప్రేమ
ఎవరిని
బాధించదు.
ప్రేమ
నిస్వార్థము,
నిర్మలము.
ఇట్టి
ప్రేమ
తత్వము
మానవుడు
గుర్తించుకొనలేక
అనేక
విధములుగా
ప్రేమకై
పరితపిస్తున్నాడు.
ప్రేమ
అనగా
నిస్వార్థము
త్యాగముతో
కూడిన
తత్వమని
మనము
విశ్వసించాలి.
ఈ
విశాల
ప్రపంచమందు
తల్లి
బిడ్డలప్రేమగాని
భార్య
భర్తల
ప్రేమగాని,
అన్నదమ్ముల
ప్రేమగాని
మిత్రుల
ప్రేమగాని
అన్ని
ప్రేమలయందు
అంతో
ఇంతో
స్వార్థము
స్వప్రయోజనము
ఉంటున్నాది.
ఎట్టి
స్వార్థ
స్వప్రయోజనములు
లేని
ప్రేమ
దైవప్రేమ.
ఈ
ప్రేమ
అత్యంత
దూరముగా
నున్న
వారిని
కూడా
సన్నిహితము
గావిస్తుంది.
వియోగులను
సంయోగులు
గావిస్తుంది.
పశు
ప్రవర్తనలో
మునిగిన
మానవుని
పశుపతిగా
మారుస్తుంది.
లౌకిక,
భౌతిక,
లోక
సంబంధమైన
ప్రేమలను
క్రమక్రమేణా
దివ్యమైన
ప్రేమగా
మారుస్తుంది.
ఈ
ప్రేమ
తత్వమును
తెలుసుకోగోరు
వ్యక్తులు
స్వార్థ
స్వప్రయోజనాన్ని
త్యాగము
చేయాలి.
కనుక
భగవత్ప్రేమ
గుర్తించగోరేవారు
దివ్యమైన
తత్వమును
అభివృద్ధి
పరచుకోవాలి.
నిశ్చలత్వము,
నిర్మలత్వము
అభివృద్ధి
గావించుకోవాలి.
ఎన్ని
కష్టములు
అడ్డు
తగిలినా
ఎన్ని
విధములైన
బాధలు
మనము
అనుభవించినప్పటికి
లెక్కచేయక
దైవ
ప్రేమను
మాత్రమే
దృష్టి
యందుంచుకొని
జీవించుటకు
ప్రయత్నించాలి.
విశ్వమానవ
భ్రాతృత్వము
కూడా
ఏకత్వము
కానేరదు.
brother
hood
of
man.
ఇందులో
కూడా
స్వార్థముంది.
ఇందులో
కూడా
స్వప్రయోజనము
ఉంటున్నది.
కనుక
విశ్వమానవ
సౌభ్రాతృత్వము
అభివృద్ధి
పరచుకొనే
వారు
ఏకాత్మ
తత్వము
విశ్వసించాలి.
అన్నదమ్ములందు
అనేక
భేదాభిప్రాయములు
అభివృద్ధియై
అనేక
కలతలలో
కల్లోలములలో
మునిగి
అనేక
చిక్కులకు
గురౌతువచ్చారు.
కనుక
ఈ
భ్రాతృత్వము
నిజమైన
ప్రేమ
కానేరదు.
నాయందు
నీయందు
వారియందు
వీరియందు
ఉన్న
ఆత్మ
ఒక్కటే
యని
ఏకాత్మ
తత్వాన్ని
పొందటమే
ప్రేమ
యొక్క
స్వరూపము.
2
▾
Meaning
Keep
His poems 157
Also in his talks
(24)
6 October 1986
Serve the Lord of all in the form of society!
25 December 1986
Prema is God, God is Prema
4 January 1987
The Bhagavad Gītā is a book to be practised
19 October 1988
The Chief Goal of Man Is Bhakti for God Itself!
17 February 1990
Prema itself is God
1 June 1990
Practice and Precept
21 November 1990
Seva that sanctifies
23 May 1991
Thath Twam Asi - That Thou Art
21 August 1996
The Five Elements Are the Very Forms of the Paramātma
30 August 1996
The Body Must Be Set on the Sacred Path!
7 September 1996
Advaita Is the Principle of the One Ātma
18 April 1998
The universe is the form of Viṣṇu
16 July 2000
Prema Is God, God Is Prema
25 December 2002
Cast Off Bad Qualities and Foster Prema
20 October 2004
The Whole World Is Full of Brahman
14 January 2006
He alone is truly educated who knows the Ātma within
26 February 2006
All is full of Brahman
9 August 2006
The Ati Rudra, supremely powerful
11 August 2006
Divinity is attained only through Prema for God
21 January 2007
All parties must become one for the good of the country
16 February 2007
Follow Sai, walk the path of Satya!
22 November 2007
Only one who recognises that all are one is truly educated
1 January 2008
Satya alone triumphs
31 May 2008
Oneness is divinity
వ్యక్తులు
వేరు
కావచ్చు,
రూపనామములు
వేరుకావచ్చు
కానీ
అందరియందున్న
ఆత్మ
తత్వము
ఒక్కటే.
ప్రతి
విషయమందు
ఏకాత్మ
తత్వమును
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
శృంగారములు
వేరు
బంగారమొక్కటే
పశుల
వన్నెలు
వేరు
పాలు
ఒకటె
జీవజంతులు
వేరు
జీవుండు
ఒక్కడే
పూలజాతులు
వేరు
పూజ
ఒకటె
అన్నింటియందు
మనము
ఏకత్వము
భావించాలి.
ఈ
ఏకత్వము
మనము
గుర్తించినప్పుడు
పరిపూర్ణ
ప్రేమ
తత్వము
మనము
గుర్తించటానికి
వీలవుతుంది.
మన
హృదయము
నిండుకు
ప్రేమయే
నింపుకోవాలి.
కేవలము
హృదయమందు
కల్మష
భావములు
నింపుకొని
పైపైన
ప్రేమగా
నటించటము
మనకు
మనమే
ద్రోహము
చేసుకొన్నవారమవుతాము.
ప్రేమ
కలిగిన
వ్యక్తి
ఎట్టి
ప్రదేశమునందైనా
ఎట్టి
పరిస్థితి
యందైనా,
ఎట్టి
కర్మలందైనా
ఈ
ప్రేమ
తత్వము
ఏమాత్రము
విడువడు.
అనేకమంది
విద్యార్థులు
హాస్టలులో
నున్నంతవరకు
ఇన్స్టిట్యూట్లో
చదివేంతవరకు
చాలా
నిర్మలంగా,
పరిశుద్ధమైన
ప్రేమతో
ఉంటుంటారు.
బయట
ప్రపంచములో
పోయి
ప్రవేశించేటప్పటికి
సహవాస
దోషము
చేత,
పరివారము
చేత,
కొన్ని
సంఘటనల
చేత
అనేక
విధములుగా
మనసు
మారుతున్నాదని
చెప్పుకుంటూ
ఉంటారు.
ఇది
సరైన
జవాబు
కాదు.
నిజముగా
నీ
హృదయమందు
నిర్మలమైన,
నిశ్చలమైన,
నిస్వార్థమైన
ప్రేమయే
ఉండినప్పుడు
ఎక్కడకు
వెళ్ళినా
ఇది
మార్పు
చెందుటకు
వీలు
లేదు.
ఎట్టి
సంఘము
కూడా
నిన్ను
మార్చుటకు
వీలుకాదు.
దీనికి
చక్కని
దృష్టాంతము.
ఒక
పేపరుంటున్నాది.
పేపరుపైన
పూల
తీగ
వ్రాసాము.
ఆ
పూల
తీగలోపల
అనేక
పుష్పములుండినట్లుగా
గుర్తింపచేస్తున్నాము.
కాని
బయట
గాలి
ఎంత
వీచినా
కాగితము
ఆడుతుందిగాని
ఆ
వ్రాసిన
పూల
తీగ
ఏమాత్రము
అల్లాడదు.
అదే
విధముగా
నీ
మనస్సు
సంఘ
దోషముచే
అటుఇటు
కొంచెము
కదలినప్పటికి
హృదయము
మాత్రము
స్థిరముగా
ఉంటుంది.
నీ
హృదయములో
నున్న
ప్రేమ
తత్వమును
ఎవరు
మార్చుటకు
వీలుకాదు.
ప్రేమ
మనస్సులో
కాదు
నింపుకోవలసింది.
హృదయములో
నింపుకోవాలి.
మనస్సు
కేవలము
సంకల్పములతో
సమ్మిళితమైన
స్వరూపమే.
3
▾
Meaning
Keep
ఈ
సంకల్పముల
చేత
వచ్చినది
సంకల్పముల
చేతనే
పోతుంది.
కనుక
హృదయములోపల
పవిత్రమైన
భావములను
ప్రేమ
తత్వమును
భద్రపరచుకోవాలి.
ఈ
ప్రేమ
త్రికోణ
స్వరూపకంగా
ఉంటుంది.
ఒక
కోణము
తాను
ఎవ్వరికి
భయపడదు.
ప్రేమకు
భయమే
లేదు.
ప్రేమ
మరొకరిని
beg
చేయదు.
ప్రేమ
ప్రేమ
నిమిత్తమై
ప్రేమిస్తుందిగానీ
మరొక
పదార్థ
నిమిత్తమై
కాదు.
ప్రేమ
నిర్భయముగా
ఉంటుంది.
ప్రేమ
పరులను
beg
చేయదు.
ఈ
మూడు
గుణములు
ప్రేమకు
ప్రధానమైన
ప్రాణము.
ఇట్టి
పవిత్రమైన
ప్రేమ
తత్వమే
నిజమైన
ప్రేమ.
ఒకానొక
సమయంలో
ఒక
రాజు
వేటకై
అడవికి
వెళ్ళాడు.
వేటాడి
అలసిపోయాడు.
దాహము
వేసింది.
కొంత
దూరంలో
చిన్న
కుటీరం
కనిపించింది.
అక్కడ
ఎవరైనా
ఉంటారని
అక్కడ
తాను
ప్రవేశించాడు.
అక్కడ
ఒక
మహనీయుడు
ధ్యానములో
నిమగ్నమైనాడు.
రాజు
అతని
సాధనను
భంగపరచలేదు.
అక్కడనే
కూర్చున్నాడు
రాజు.
ఆ
మహనీయుడు
ధ్యానము
నుండి
లేచి
‘ఎవరండి
మీరు
ఎందుకు
వచ్చారని’
క్షేమ
సమాచారములు
అడిగాడు.
‘నేను
ఒక
దేశపు
రాజును.
వేటాడే
నిమిత్తమై
అరణ్యములో
ప్రవేశించాను.
అలసిపోయాను.
ఈ
కుటీరము
చూచి
ఇందులో
కొంత
విశ్రాంతి
తీసుకోవాలని
వచ్చాను.’
అనేటప్పటికి
ఆ
మహర్షి
మహదానందములో
తాను
తెచ్చి
పెట్టుకున్న
కందమూలాదులు,
చల్లటి
నీరు
రాజునకందించాడు.
దానిని
చక్కగా
అనుభవించి
మహారాజు
సంతోషించాడు.
తిరిగి
వెళ్ళే
సమయములో
మహనీయుని
ప్రార్థించాడు
మహారాజు.
స్వామి!
అతి
సమీపములోనే
మా
రాజ్యము
ఉంటున్నాది.
తాము
ఇంత
ఉపకారము
చేసినందుకు
నావెంట
వచ్చి
ఆతిథ్యము
తీసుకోమన్నాడు.
కాని
సర్వసంగ
పరిత్యాగియైన
ఈ
మహనీయుడు
దీనికి
ఏమాత్రము
అంగీకరించలేదు.
కాని
రాజు
చాలా
బలవంత
పరిచాడు.
రాజుని
సంతృప్తి
పరచాలనే
ఉద్దేశ్యముతో
రాజు
వెంట
వచ్చాడు.
వచ్చిన
తక్షణమే
ఇరువురు
స్నానము
చేశారు.
రాజు
గృహములో
పూజకై
వెళ్ళాడు.
అతని
వెంటనే
ఈ
మహనీయుడు
కూడా
పూజ
గదిలోకి
వెళ్ళాడు.
రాజు
ప్రార్థన
చేస్తున్నాడు.
దేవాధి
దేవా!
ఈనాటికి
అదృష్టవశాత్తు
రాజునయ్యాను.
కాని
ఈ
చిన్న
రాజ్యము
నాకు
చాలదు.
నా
రాజ్యము
ఇంకను
వ్యాపింపచేసుకోవాలి.
ఇంకా
అనేక
చిన్న
చిన్న
రాజ్యములను
ప్రవేశపెట్టుకోవాలి.
కటాక్షించి
సరైన
అనుగ్రహమును
ప్రసాదించమన్నాడు.
ఈ
మాటలు
వింటున్న
మహనీయుడు
మహారాజుకు
చెప్పకుండా
లేచి
వెళ్ళిపోతున్నాడు.
‘స్వామి!
భుజించక
పూర్వమే
వెడుతున్నారా!
కొంత
సేపాగండి’
అన్నాడు
మహారాజు.
‘అయ్యా
నేను
బిక్షగాని
దగ్గర
బిక్షము
ఎత్తటానికి
రాలేదు.
నీవు
ఒక
బిక్షగానిగా
ఉంటున్నావు.
4
▾
Meaning
Keep
His songs 50
Also in his talks
(1)
22 February 2001
God's grace comes only through the right use of the senses
నీవు
ఏమేమో
కావాలని
భగవంతుని
ప్రార్థిస్తున్నావు.
భగవంతుని
దగ్గర
విశాలమైన
రాజ్యము
కావాలని
ఆశిస్తున్నావు.
నీవు
ఏ
భగవంతుని
కోరుతున్నావో
ఆ
భగవంతునే
నేను
కోరుకుంటాను.
నీ
దగ్గర
నాకు
ఏ
ఆహారము
అక్కరలేదు’
అన్నాడు.
అనగా
నిజమైన
ప్రేమ
భగవంతునిపై
గలవాడు
beg
చేయడు.
భగవంతుని
ఏదీ
అడగనక్కరలేదు.
సకాలమునకు
ఏది
కావాలో
అన్నీ
అందిస్తుంటాడు.
రామాయణమునందు
అడుగకువే
ఓ
మనసా
అడుగకువే
ఓ
మనసా
అడుగుకొలది
అది
అడుగున
పడునని
అడగకున్న
పని
వడిగా
నగునని
॥
అడు
॥
అడుగని
శబరిని
ఆదరించడే
అడుగక
తనకై
మడుగు
జటాయువు
కడకు
నేగి
సద్గతి
కలిగించడే
॥
అడు
॥
శబరి
అడిగిందా!
జటాయువు
కోరిందా!
హృదయంలో
నిర్మలంగా
నిశ్చలంగా
పరిపూర్ణ
ప్రేమతో
పిలచినప్పుడు
తానే
పరుగెత్తి
వస్తుంటాడు.
ఏదీ
మనము
నోరు
తెరచి
అడగనక్కరలేదు.
ఇది
భగవంతుని
యొక్క
ప్రేమకు
గుర్తు.
భగవంతుని
ప్రేమ
యొక్క
విలువ.
ఇట్టి
భగవత్తత్వము
మనము
విస్మరించి
లోకతత్వాన్ని
అనుసరించటంచేత
ఇన్ని
విధములైన
అశాంతికి
గురైపోతున్నాము.
అడుక్కోటం,
ప్రార్థించటము
ఇవన్నీ
ప్రాకృత
ధర్మములు.
ఇవి
ప్రవృత్తి
ధర్మములు.
ఈ
పవిత్రమైన
ప్రేమ
తత్వము
నివృత్తి
ధర్మము.
నివృత్తి
తత్వమునకు
మనం
పూనుకున్నప్పుడు
ప్రవృత్తులన్నీ
పారిపోతాయి.
భగవంతుని
ఖజానాలోపల
ఎంత
విలువైనవి
ఉంటున్నాయో
ఎవరికి
తెలియదు.
ఏదో
నీవు
గాజు
ముక్కకై
ప్రార్థిస్తే
మాణిక్యమునే
అందిస్తాడు.
భగవంతుడు
ఎంత
విలువైన
దానిని
ఇవ్వాలనుకున్నాడో
మీకు
తెలియదు.
అల్పమైన
దానిని
నీవు
అడుగుతున్నావు.
అధికమైన
దానిని
ఇవ్వటానికి
సంకల్పించుకున్నాడు.
అన్నింటిని
భగవత్సంకల్పముపై
మనము
వదలాలి.
అప్పుడే
అవసరమైనవి
తాను
అందిస్తాడు.
ఏది
నీకు
అవసరమో,
ఏది
నీకు
అనవసరమో,
ఏది
నీకు
మంచిదో
ఏది
నీకు
చెడ్డదో
నీకు
తెలియదు.
నీకు
మంచి
అయినదానిని,
నీకు
అనుకూలమైన
దానిని,
ఆదర్శవంతమైన
దానిని
తానే
అందిస్తాడు.
ఏ
నిముషములో
ఎప్పుడు
ఎక్కడ
ఏవిధముగా
అందిస్తాడో
అది
అతని
సంకల్పమే.
అన్నింటిని
భగవంతునికి
అర్పితము
గావించి
భగవత్ప్రీత్యర్థమని
భావించి
నిశ్చల
మనస్సుతో
నుండినప్పుడు
సర్వము
తానే
ఆచరించుకుంటాడు.
5
▾
Meaning
Keep
కాని
అంతటి
విశ్వాసము
ఈనాటి
మానవులందు
లేదు.
ఈ
విశ్వాసము
లేకపోవటంచేత
ఎన్ని
విధములైన
సంకల్పములనో
తాను
భంగపరచుకుంటున్నాడు.
అన్నింటికి
విశ్వాసము
చాలా
ప్రధానము.
భక్తి
విశ్వాసము
మనము
పోల్చుకుంటూ
వచ్చాము.
భక్తి
అనగా
ప్రేమ
విశ్వాసమనగా
నమ్మకము.
ప్రేమపై
నమ్మకము
ఉండాలి.
ఈనాడు
మన
ప్రేమపై
మనకే
నమ్మకము
లేదు.
ఇంక
దైవముపై
ప్రేమ
ఎట్లా
వస్తుంది.
నీ
ప్రేమ
ప్రాకృతమైనది.
కాని
భగవంతుని
ప్రేమ
నిర్మలమైనది.
ప్రాకృతమున
కతీతమైనది.
అది
ఒక
పరిమితము
లేని
ప్రేమ.
ఇంతటి
ప్రేమ
తత్వము
రావాలంటే
ఈ
లౌకికమైన
ప్రేమ
క్రమక్రమేణా
తగ్గించుకుంటూ
రావాలి.
పిల్లలున్నారు.
పరీక్షలు
ప్రారంభమవుతే
ప్రార్థనలు
అధికమైపోతాయి.
ప్రార్థనలంతా
దేని
నిమిత్తమై?
పరీక్షల
కోసమని.
కాదు.
కాదు.
అది
సరైన
ప్రార్థన
కాదు.
అది
beg
చేసినట్లవుతుంది.
నీవు
beggar
కాకూడదు.
నీవు
bigger.
భక్తుడు
ఈవిధమైన
దానిలో
ప్రవేశించకూడదు.
ఏవిధమైన
వాంఛలు
లేక
భగవంతునే
వాంఛించినప్పుడు
అన్నీ
తానే
అనుగ్రహిస్తాడు.
అయితే
అంతటి
ఉన్నతస్థాయి
లేకపోవటంచేత
ప్రారంభస్థితిలో
మనము
కొన్ని
కొన్ని
కోరక
తప్పదు.
అడుగక
అమ్మ
అయినా
బువ్వ
పెట్టదట.
కాని
అమ్మ
ప్రాకృతమైన
సంబంధము.
Divine
mother
ప్రాకృత
సంబంధము
కాదు.
నివృత్తి
సంబంధమైన
mother.
ప్రవృత్తికి
అడుక్కోటము,
తీసుకోటము,
అనుభవించటము
ఇవన్నీ
సహజము.
నివృత్తి
సంబంధమైన
ఆనందములో
అనుభవించటమే
తప్ప
అడుక్కోటమే
లేదు.
ఏది
చేసినా
అందుకో.
ఏది
ఇచ్చినా
అందుకో.
మంచా
చెడ్డా
అనే
discrimination
చేయవద్దు.
నీ
దృష్టిలో
చెడ్డగా
కనిపించవచ్చు.
కాని
రిజల్టు
మంచిగా
ఉండవచ్చు.
మలేరియా
జ్వరము
వచ్చిన
వానికి
డాక్టరు
క్వినైన్
మిక్చరు
ఇస్తాడు.
ఈ
క్వినైన్
చేదుగా
ఉంటుంది.
మందు
చేదుగ
ఉంటున్నాది
గాని
మందు
మహాత్మ్యము
గొప్పగా
ఉంటున్నాది.
అది
నీకు
సంభవించిన
రోగమును
నివారణ
గావిస్తుంది.
ప్రారంభములో
భక్తి
కష్టముగా
ఉంటుంది.
కాని
ఈ
కష్టమునకు
మనము
ఏమాత్రము
వెఱవకూడదు.
ఈ
కష్టమునకు
మనము
ఏమాత్రము
వదలకూడదు.
అనేక
మంది
మహనీయులు
అనేక
కష్టములకు,
శ్రమలకు
ఓర్చి
ఆ
దివ్యమైన
తత్వాన్ని
పొందే
నిమిత్తమై
చాలా
దీర్ఘమైన
తపస్సులాచరించారు.
రెండు
బాధల
మధ్యలోనే
సుఖము
ఉంటున్నాది.
బాధలు
లేక
సుఖము
ప్రాప్తించదు.
ఈ
బాధలవలనే
మనకు
సుఖము
ప్రాప్తిస్తుంది.
‘పిలచి
అడుగ
పెట్టునా
బెల్లంబు
పిప్పిగొట్టి
రసము
పీల్చకున్న’.
ఒక
వజ్రమును
అనేక
కోతలు
కోసినప్పుడే
దానికి
సరైన
విలువ
లభిస్తుంది.
ఆ
cuttings
చేయకపోయిన
సరైన
విలువ
రాదు.
6
▾
Meaning
Keep
బంగారును
నిప్పులో
వేసి
కాల్చి
సుత్తితో
కొడితే,
అప్పుడే
సుందరమైన
నగగా
తయారౌతుంది.
మానవత్వములో
మనము
కొన్ని
కష్టములకోర్చుకొని,
బాధలను
సహించి,
నిందలకు
నిష్ఠూరములకు
ఏమాత్రము
లెక్క
చేయక
దివ్యమైన
ప్రేమ
అభివృద్ధి
పరచుకున్నామంటే
దానిలోనే
దివ్యానందము
మనకు
ప్రాప్తిస్తుంది.
భగవత్ప్రేమ
చులకనగా
మనం
భావించరాదు.
అది
చాలా
పవిత్రమైనది.
చూచేందుకు
చాలా
చిన్నదిగా
ఉండవచ్చు.
అనుభవించుటకు
లోక
సంబంధమైనదిగా
ఉండవచ్చు.
కాని
అది
లోకాతీతమైన
తత్వము.
అలాంటి
ప్రేమ
తత్వము
ప్రతి
మానవుడు
పొందాలి.
నిన్న
చెప్పాను.
ఆత్మకు
పుట్టినది
అహం.
అహంకు
పుట్టినది
మనస్సు.
మనస్సుకు
పుట్టినది
వాక్కు.
కాబట్టి
వాక్కు
మనస్సు
బిడ్డ.
మనసు
అహం
బిడ్డ.
అహం
ఆత్మ
బిడ్డ.
కాబట్టి
ఆత్మకు
అహం
son.
వాక్కు
grandson.
Father,
son,
grandson,
great
grand
son
ఈ
నల్గురు
ఆత్మ
సంబంధమే.
అందరియందు
ఆత్మ
ఉంది
కనుక
అదే
నిజమైన
ప్రేమ
తత్వము.
ఏమిలేని
వ్యక్తి
ఉండవచ్చుగాని
ఆత్మ
లేని
వ్యక్తి
లేడు.
సర్వులయందు
ఉన్న
ఏకత్వము
ఏమిటి?
అదే
సత్
చిత్
ఆనందము.
అదే
మనము
conscience
అన్నాము.
మన
చుట్టూ
ఉన్న
గాలినే
మనము
చూడలేకపోతున్నాము.
మనచుట్టూ
ఉన్న
గాలినే
మనం
పట్టలేకపోతున్నాము.
అయితే
చూడలేకుండా
పోయినంత
మాత్రమున
గాలి
లేదా?
నీవు
పట్టలేకుండా
పోయినంత
మాత్రమున
గాలి
లేదా?
ఉన్నది.
అదే
విధముగా
నీవు
చూడలేకుండా
ఉన్నంతమాత్రమున
ఈ
చైతన్యము
లేకపోలేదు.
నీవు
అనుభవించలేకపోయినంత
మాత్రమున
చైతన్యము
లేకపోలేదు.
ఉన్నది.
దీనినే
being
అన్నారు.
ఈ
being
నే
సత్
అన్నారు.
అనగా
ఎప్పటికి
ఉండేదే.
వచ్చిపోయేది
కాదు.
రాకపోకలు
లేని
దివ్యత్వము
ఈ
సత్.
ఇట్టి
తత్వము
ఎక్కడినుంచో
వచ్చింది
ఎక్కడికో
వెళ్ళింది
అని
అనుకోటం
చాలా
పొరపాటు.
నేను
ధ్యానములో
ఉంటే
భగవంతుడు
వచ్చి
దర్శనమిచ్చాడు
అనుకుంటారు.
ఇది
ప్రాకృత
భావము.
ఎక్కడనుంచి
వచ్చాడు
దర్శన
మీయటానికి.
ఎక్కడనుంచో
రాలేదు.
దర్శనమిచ్చి
తిరిగి
ఎక్కడికో
పోలేదు.
అక్కడే
ఉన్నాడు.
నీ
హృదయము
పవిత్రమైనప్పుడు
కనిపించాడు.
తిరిగి
మాలిన్యమైనప్పుడు
కనిపించకుండా
పోయాడు.
అంతేగాని
రావటం
పోవటం
లేదు.
మీకందరికి
తెలుసు.
ధ్రువుడు
ఐదు
సంవత్సరముల
బాలుడు.
అతనికి
ఏమాత్రము
ప్రపంచ
జ్ఞానము
లేదు.
లౌకిక
జ్ఞానము
లేదు.
అలాంటివాడు
విశ్వాసము
చేత,
నారదుని
ప్రోద్బలముచేత
కారడవులలో
ప్రవేశించి
కఠినముగా
కూర్చొని
భగవంతుని
చింతించాడు.
పెద్దల
మాటలు
మనం
విశ్వసించాలి.
7
▾
Meaning
Keep
బ్రహ్మమానస
పుత్రుడు
నారదుని
మాటలు
చక్కగా
విశ్వసించాడు
హృదయ
పూర్వకంగా
ధ్రువుడు.
ఆ
విశ్వాసమే
అక్కడ
సాక్షాత్కారంగా
వచ్చింది.
కాని
బాలుడు
లౌకికము
తెలియని
వాడు.
విష్ణువు
వచ్చి
‘నాయనా!
నీకేమి
కావాలి?’
అని
ప్రశ్నించాడు.
బాలుడైన
ధ్రువుడు
నేను
ఎక్కడ
ఉన్నానో
ఏ
విధంగా
ఉన్నానో
అనేది
తెలుసుకున్న
మీరు
ఇంత
కారడవిలోపల
నేను
కూర్చున్న
స్థానమునకే
మీరు
వచ్చారు.
నేను
ఎక్కడ
చింతిస్తున్నాను
అనేది
మీకు
తెలుసు.
ఏమి
కావాలో
తెలియదా
మీకు.
భగవంతునికి
మాత్రం
అంత
తెలివి
లేకుండా
పోలేదు.
మన
అందరికంటె
గొప్పగా
చదువుకున్నవాడు
భగవంతుడు.
నాయనా!
నీవు
ఎక్కడున్నావో
నాకు
తెలుసు.
నీ
కోరిక
ఏమిటో
నాకు
తెలుసు
కాని
నా
పద్ధతి
ఒకటి
ఉంటున్నాది.
thought,
word,
action
మూడు
ఒక్కటి
కావాలి.
అప్పుడే
నేను
నీ
అభీష్టము
నెరవేర్చటానికి
సిద్ధముగా
ఉన్నాను.
నీవు
ఇంటి
దగ్గర
భగవంతుని
ప్రార్థించి
తండ్రి
తొడపైన
కూర్చునే
వరము
కోరతానని
చెప్పావు.
చెప్పినట్టుగా
తపస్సు
చేశావు.
తలచినట్టుగా
తపస్సు
చేశావు.
ఆ
సంకల్పమునకు
తపస్సుకు
తగిన
మాటలున్నాయా
లేదా
పరీక్షించాలి!
ధ్రువుడు
చెప్పాడు:
నేను
గాజు
ముక్కకోసం
వెతుకుతూ
వచ్చాను
ఈ
ప్రాపంచిక
విషయ
వాసనలో.
నేను
తండ్రి
తొడపై
కూర్చోవాలనేది
విలువలేని
గాజు
ముక్క.
కాని
నీ
దర్శనం
మాణిక్యముగా
కనిపిస్తున్నాది.
గాజు
ముక్కకై
వచ్చిన
నాకు
ఇంత
పెద్ద
మాణిక్యము
దొరకటం
ఎంత
అదృష్టము.
నాకు
ఇంక
గాజు
ముక్క
అక్కరలేదన్నాడు.
చక్కగా
పట్టాడు
భగవంతుడు
అక్కడ
నాయనా!
సంకల్పించటము,
ఆచరించటము
రెండు
ఒకటైనాయిగాని
కోరటం
మరొకటి
కోరుతున్నావు.
ఈ
మూడింటిలో
రెండు
ఒకటిగా
చేరాయి.
ఒకటి
వేరైంది.
రెండున్నదే
మెజారిటి.
కాబట్టి
తిరిగి
రాజ్యము
ఏలుకోమని
పంపించాడు.
ప్రతి
భావమునకు
భగవంతుడు
త్రికరణ
శుద్ధి
కోరుతుంటాడు.
thoughts,
words,
action
ఒకటి
కావాలి.
అడగటం
ఒకటి
చేయటం
మరొకటి
ఉండి
సరికాదు.
ఇంత
గొప్ప
సంకల్పము
పొంది
ఇంత
తపస్సు
చేసి
కట్టకడపటికి
సాక్షాత్
నారాయణమూర్తి
ప్రత్యక్షమైనా
పొందలేకపోయాడు.
కారణం
ఏమిటి?
వాక్
దోషం
చేతనే.
కనుక
వాక్కును
మీరు
చాలా
పవిత్రంగా
ఉపయోగపెట్టుకోవాలి.
వాక్కు
మనస్సు
యొక్క
బిడ్డ.
మనస్సు
సంకల్ప
వికల్పములతో
మాలిన్యం
పొందింది.
తల్లి
భావములే
బిడ్డకు
లభించాయి.
న్యాయంగా
చూస్తే
మనస్సుకు
బ్రహ్మభావం
రావాలి.
రాలేదు.
తండ్రి
ఒకడైనప్పుడు
కుమారుడు
మరొకడు
కావచ్చు.
సంబంధము
తండ్రి
కుమారుడు.
ప్రహ్లాదుడు
గొప్ప
భక్తుడు.
హిరణ్యకశిపుడు
మహా
దుర్మార్గుడు.
అలాంటి
దుర్మార్గుని
గర్భములో
మంచి
మాణిక్యము
వంటి
కుమారుడు
పుట్టాడు.
నారాయణ
ప్రియుడు
ప్రహ్లాదుడు.
8
▾
Meaning
Keep
నారాయణ
ద్వేషి
హిరణ్యకశిపుడు.
రూపనామములు
నమ్ముకున్నవాడు
హిరణ్యకశిపుడు.
నామ
రూపముల
చేత
మభ్యపడని
వాడు
ప్రహ్లాదుడు.
నామ
రూపములుండినప్పటికి
వాటిని
పరిత్యాగము
చేయాలి.
ఏనాటికైనా
దేహము
త్యజించవలసినదే.
దేహ
భావము
త్యజించవలసినదే.
ఆలు
బిడ్డలను
వదలటం
కాదు.
ఆస్తి
పాస్తులను
వదలటం
కాదు.
దేన్ని
త్యాగం
చేయాలి?
మానవుని
ఆవరించిన
ద్వేష
అసూయాదులను
త్యాగము
చేయాలి.
ఈ
మూడింటిని
ఆవరించినది
మానవత్వము.
ఆవరించిన
దానిని
దూరము
చేసుకుంటే
ఆనందము
ప్రాప్తిస్తుంది.
కన్నుకు
పొర
వచ్చింది.
పొర
తీస్తే
చాలు
దృష్టి
వస్తుంది.
నీవు
దృష్టిని
ప్రత్యేకంగా
సంపాదించుకోనక్కరలేదు.
అదే
రీతిగా
హృదయంలో
రాగ
ద్వేష
అసూయాదులు
ఆవరించి
ఉన్నాయి.
వాటిని
క్రమక్రమేణా
వేరు
చేయటము
అదే
త్యాగము.
త్యాగమంటే
ఆస్తిపాస్తులు
త్యాగం
చేయటంకాదు.
దుర్గుణములను
త్యాగం
చేయాలి.
దుర్గుణములు
త్యాగము
చేసుకున్నప్పుడు
మనయందు
ఆత్మ
తత్వము
సులభంగా
ఆవిర్భవిస్తుంది.
అది
నీరైటు.
మానవత్వము
మాధవుని
నుంచి
పుట్టినది.
దైవము
నుంచే
వచ్చింది.
దైవమునుండి
వచ్చినప్పటికి
దైవమునే
మనము
మరచిపోతున్నాము.
మేఘములంతా
సూర్యుని
నుండే
పుట్టాయి.
ఆ
మేఘములు
తిరిగి
సూర్యునే
కప్పివేస్తున్నాయి.
కాని
సూర్యుడు
ఏమాత్రము
వాటిపై
ద్వేషము
పూనలేదే.
ఇవన్నీ
కదలిపోయే
మేఘములు.
కొద్దిలో
కదలిపోయే
వాటిపై
మనకెందుకు
ద్వేషము.
అదే
విధముగా
కొన్ని
సమయములలో
దుర్గుణములు
దుర్భావములు
ఆవిర్భవిస్తుంటాయి.
ఆవిర్భవించి
ప్రకాశించే
ప్రేమ
తత్వాన్ని
కొంత
మరుగు
చేస్తూ
ఉంటాయి.
అప్పుడు
శాంతి
వహించాలి.
శాంతిగా
ఉంటే
ఆవరించిన
మేఘములు
కదలిపోతాయి.
ఏ
గాలి
ద్వారా
మేఘములు
ఇక్కడకు
వచ్చినాయో
ఆ
గాలి
ద్వారానే
మేఘములు
ఇక్కడనుంచి
కదలిపోతాయి.
మేఘములు
ఇక్కడకు
రావటానికి,
ఇక్కడనుండి
కదలిపోవటానికి
పెనుగాలియే
ప్రధానము.
ఆ
పెనుగాలియే
మన
ప్రేమ
తత్వము.
ఆ
ప్రేమ
అనే
గాలి
వీచినప్పుడు
ఈ
మేఘములు
పరుగెత్తుతాయి.
ఆవరించిన
మేఘములు
కదలిపోతాయి.
ప్రేమకు
అసాధ్యమైన
కార్యము
ఈ
జగత్తులో
లేనేలేదు.
దేని
చేత
సాధించ
లేకపోవచ్చు
కాని
ప్రేమ
చేత
సాధించలేనిది
ప్రకృతిలో
లేదు.
సర్వము
ప్రేమ
చేత
సాధించవచ్చు.
ప్రేమ
ఈశ్వర్
హై
ఈశ్వర్
ప్రేమహై.
పరమాత్మయే
ప్రేమ,
ప్రేమయే
పరమాత్ముడు.
ఈ
రెండింటి
ఏకత్వము
మనము
జాగ్రత్తగా
గుర్తించాలి.
ఈ
ప్రేమ
తత్వాన్ని
మనము
పెంచుకోవాలి.
నీ
బాధలు
నీకు
ఎంత
ఇదో
అదే
విధముగా
ఇతరుల
బాధలని
విశ్వసించాలి.
నీపైన
నీకు
ఎంత
ప్రేమయో
వారిపైన
కూడా
వారికి
అంత
ప్రేమ
ఉంటుందనే
సత్యాన్ని
గుర్తించాలి.
9
▾
Meaning
Keep
ప్రతి
ఒక్కదానికి
నీకు
నీవు
పోల్చుకోవాలి.
అదే
self-enquiry.
తనకు
ఎన్ని
కాళ్ళున్నాయి
ఎన్ని
చేతులున్నాయని
చూచుకోటం
కాదు.
తన
భావము
ఎట్టిదో
పరుల
భావము
కూడా
అట్టిదే.
నా
బాధలు
ఎట్టివో
పరుల
బాధలు
అట్టివే.
నా
విచారము
ఎట్టిదో
పరుల
విచారము
అట్టిదే.
నా
ప్రేమ
ఎంత
పరిశుద్ధమో
పరుల
ప్రేమ
అంత
పరిశుద్ధమే.
అని
అన్నింటిని
పవిత్రమైన
ప్రేమతో
పోల్చుకుంటూ
రావాలి.
అప్పుడు
ద్వేషమునకు
అవకాశమే
లేదు.
ఇంక
అసూయకు
అసలే
స్థానము
లేదు.
ఈ
రాగద్వేష
అసూయాదులు
దూరము
గావించుకోవాలంటే
నిర్మలమైన
ప్రేమను,
నిస్వార్థ
ప్రేమను,
నిరహంకారమైన
ప్రేమను
మనం
అభివృద్ధి
పరచుకోవాలి.
ఇదే
నిజమైన
భక్తి.
అంతగాని
పూజలు
చేయటము,
జపములు
చేయటము,
ధ్యానము
చేయటము
ఇవన్నీ
కేవలము
మనస్సు
యొక్క
చంచలత్వమును
అణగింపచేసే
సోపానములు.
ఒక
మిద్దెను
ఎక్కాలంటే
నిచ్చెన
వేస్తాము.
నిచ్చెనకు
భూమి
ఆధారము.
పైన
మిద్దెకు
ఆని
ఉండాలి.
అప్పుడే
మధ్యనున్న
మెట్లను
మనం
వాడుకోవచ్చు.
క్రిందనున్న
ఆధారమే
విశ్వాసము.
ఆ
విశ్వాసముపై
ఈ
నిచ్చెన
ఆధారము
చేసుకోవాలి.
పైన
మిద్దెను
ఆనుకొన్నదే
ప్రేమ.
ప్రేమ
విశ్వాసములు
రెండు
ఉండినప్పుడు
మనం
ఎంత
పైకైనా
వెళ్ళిపోవచ్చు.
ఈ
రెండు
లేక
మనము
నిచ్చెన
ఎక్కలేము.
ఒక
వేళ
ఆవిధంగా
నిచ్చెన
ఎక్కాలనుకుంటే
అది
అసాధ్యము.
ఆధారము,
ఆధేయము
రెండు
ఉండాలి.
గాఢవిశ్వాసము
ఉండాలి.
పవిత్రమైన
ప్రేమ
ఉండాలి.
ఈ
రెండింటిని
మనం
సంపాయించుకుంటే
ఏ
జప
ధ్యానములు
మనం
చేయనక్కరలేదు.
ఈ
జపధ్యానములు
దేనికోసమని
ఆ
రెంటిని
పొందే
కోసమే.
ఆ
రెండు
ప్రాప్తించిన
ఇంక
జపధ్యానములు
మనకెందుకు.
దేనిని
వెతకాలని
పోతున్నావో
అదే
నీ
కాలికి
తగిలినప్పుడు
ఇంక
వెతకనక్కరలేదే.
చాలామంది
దైవాన్వేషణ
అనుకుంటూ
ఉంటారు.
ఎక్కడ
చూచినా
ఉండే
భగవంతుని
వెతికేది
ఎందుకు.
మొట్టమొదట
నిన్ను
నీవు
వెతుకుతున్నావా
ఎక్కడైనా?
నిన్ను
నీవు
ఎక్కడా
వెతకనక్కరలేదు.
నిన్ను
నీవు
వెతుకుతున్నావంటే
నీవు
పిచ్చివాడవే.
అదే
రీతిగా
భగవంతుని
వెతకటమంటే
నిన్ను
నీవు
వెతుక్కోటమే.
భగవంతుడు
నీవెంటనే,
నీ
ఇంటనే,
నీ
జంటనే,
నీ
కంటనే
ఉంటున్నాడు.
నీవే
భగవంతుడు.
కేవలము
దేహాభిమానము
పురస్కరించుకొని,
ఈ
ఉపాధులను
పురస్కరించుకొని
నేను
ఫలానా
వాడినని
చెప్పుకుంటున్నావు.
అది
కాదు.
అనేక
మంది
మహర్షులు
అనేక
వేదశాస్త్ర
ఇతిహాస
పురాణములలో
అన్ని
ప్రశ్నలలో
నేను
ఎవరు
అనే
ప్రశ్న
చాలా
పెద్దది.
తెలుసుకోటానికి
ఈ
జగత్తులో
ఎన్ని
పదములుంటున్నాయి.
కాని
అన్నీ
వదలి
‘నేను
ఎవరు’
అని
తెలుసుకోమనటంలో
ఏమి
అర్థముంటున్నాది.
10
▾
Meaning
Keep
ఎవరైనా
వచ్చినారంటే
ఎవరండి
మీరు
ఎక్కడ
నుండి
వచ్చారు
అని
మనము
ప్రశ్నిస్తాము.
అందరిని
ప్రశ్నిస్తున్నావు
గాని
నీవు
నేనెవరు,
నేను
ఎక్కడ
నుండి
వచ్చాను
అని
నిన్ను
నీవు
ప్రశ్నించుకోటం
లేదు.
నిన్ను
నీవు
ప్రశ్నించుకుంటే
ఇతరులంటే
ఎవరో
నీకు
సులభంగా
తెలిసిపోతుంది.
దీనికి
ఏమి
కావాలి?
మొట్టమొదట
confidence
కావాలి.
confidence
వలనే
satisfaction
వస్తుంది.
ఈ
satisfaction
వలనే
sacrifice
చేస్తావు.
ఈ
sacrifice
వలనే
realisation
చేస్తావు.
మొట్టమొదట
self
confidence
foundation,
self
satisfaction-wall,
self
sacrifice-roof,
self
realisation-life.
పునాది
లేక
గోడ
కట్టటానికి
వీలు
లేదు.
గోడ
లేక
roof
వేయటానికి
వీలుకాదు.
roof
లేక
మనము
నివసించలేము.
self
confidence
ఏమాత్రం
చలించకుండా
చూచుకోవాలి.
ఎలాంటి
పరిస్థితిలోనైనా
ప్రాణము
పోయే
పరిస్థితి
అయినా
చలించకుండా
ఉండాలి.
అంత
గాఢమైన
విశ్వాసము
పెంచుకోవాలి.
ఆ
విశ్వాసము
పెంచుకున్నప్పుడే
మనకు
తెలియకుండా
ఆనందము
ఆవిర్భవిస్తుంది.
ఈ
ఆనందము
ఆవిర్భవించిందా
సర్వము
త్యాగము
చేస్తావు.
ఆనందములో
నాది
నీది
అని
ఏమాత్రము
భేదము
ఉండదు.
అప్పుడే
అన్నింటిని
త్యాగము
చేస్తావు.
త్యాగము
ఎంత
ఆనందము
నిస్తుంది!
కాని
మనం
చేయలేకపోతున్నాం.
కారణం
ఏమిటి?
అభిమాన
మమకారములు
రెండు
కట్టివేశాయి.
ఈ
రెండే
మనలను
నరకమునకు
తీసుకుపోతున్నాయి.
అందుకోసమే
ఎవరో
చెప్పారు.
ప్రతి
వ్యక్తిని
యమధర్మరాజు
పాశము
వేసి
తీసుకుపోతున్నాడని.
భగవంతుడు
ఇన్ని
విధములుగా
సృష్టించినప్పుడు
యమధర్మరాజు
పాశంవేసి
తీసుకువెళ్ళిపోతున్నాడే.
ఇన్ని
ప్రాణములు
తీసుకుపోవటానికి
యమధర్మరాజు
rope
factory
ఎక్కడ
పెట్టాడు.
ఈ
rope
factory
ఎక్కడా
లేదు.
ఎక్కడనుండి
తీసుకురానక్కరలేదు
ఈ
పాశములు.
అభిమానము
ఒకటి
మమకారము
ఒకటి
ఈ
రెండింటిలో
బిగకట్టి
వేస్తున్నాడు.
ఈ
అభిమాన
మమకారములే
మన
గొంతునకు
ఒక
పాశముగా
తయారౌతున్నాయి.
అదే
కాలము
నంత్యము
గావిస్తుంది.
మనము
దైవము
ఎక్కడనుండో
కష్టము
లందిస్తున్నాడని,
సుఖములు
ఇస్తున్నాడని
భావించరాదు.
సుఖదుఃఖములు
మన
సంకల్పములే
మూలకారణము.
మంచి
చెడ్డలకు
మన
సంకల్పములే
మూల
కారణము.
ఎవరో
మనకు
కారణము
కాదు.
వారి
వల్ల
మనకు
ఈ
కష్టములు
లభించాయి,
వీరి
వల్ల
మనకు
కష్టములు
లభించాయి
అనుకోటం
పొరపాటు.
మంచి
చెడ్డలకు
మనమే
కారణము.
సుఖదుఃఖములకు
మనమే
కారణము.
నిందాస్తుతులకు
మనమే
కారణము.
అన్నింటికి
మనమే
కారణము.
11
▾
Meaning
Keep
మనమే
కారణమనుకున్నప్పుడు
దేనికీ
భయము
ఉండదు.
ఎవరితోనో
మనకు
సుఖము
కష్టము
లభిస్తుందంటే
భయము
ఉండాలి.
నిర్భయం
ఎప్పుడు
వస్తుంది.
పరిపూర్ణ
ప్రేమ
ఉన్నప్పుడు
నిర్భయము
వస్తుంది.
దోషములుండినప్పుడే
భయము
ఆవరిస్తుంది.
మనలో
దోషములకు
ఏమాత్రము
అవకాశము
ఇవ్వకూడదు.
సాధ్యమైనంత
వరకు
ఏ
చిన్నపని
చేసినా
Is
it
good
or
bad
అని
discrimination
చేయి.
టైము
తీసుకో
తొందర
పడవద్దు.
haste
makes
waste
waste
makes
worry.
so
do
not
be
in
a
hurry.
ఏది
వచ్చినా
శాంతముగా
ఉండు.
దైవము
స్మరించు.
దైవ
ప్రేమ
పెంచుకో.
ఆ
ప్రేమయే
నీకు
అమృతంగా
మారిపోతుంది.
దుఃఖమును
దూరము
చేస్తుంది.
ఆనందము
చేకూరుస్తుంది.
ఇదియే
మనం
నిజంగా
నేర్చుకోవలసిన
చదువులు.
లౌకిక
చదువులు
చదవవచ్చు.
ఇవి
ప్రాకృత
విద్యలే.
ప్రవృత్తి
మార్గములో
మనము
జీవించటానికి
ఆధారములే.
‘ఇహమును
సుఖింప
హేమతారక
విద్య,
పరమున
సుఖింప
బ్రహ్మ
విద్య’.
ఈ
రెండు
విద్యలు
ఉండాలి.
ఇవి
నెగిటివ్,
పోజిటివ్
వంటివి.
ప్రాకృత
విద్యలన్నీ
నెగిటివ్.
మన
హృదయము
నిండుకు
నెగిటివ్
విద్యలు
నింపుకున్నాము.
కాని
ఆశించేది
పోజిటివ్.
అసాధ్యము.
కారణం
ఏమిటి?
నెగిటివ్
నింపుకుంటున్నాము
మనము.
పోజిటివ్ను
ఎట్లా
కోరటానికి
వీలవుతుంది.
నీకు
అధికారమే
లేదు.
నీవు
మొట్టమొదట
హృదయములో
పోజిటివ్
నింపుకో
అప్పుడు
అన్నీ
లభిస్తాయి.
ఈ
ప్రకృతి
విద్యలు
ప్రకృతికి
సంబంధించినవి.
పరతత్వమునకు
సంబంధించినదే
బ్రహ్మవిద్య.
దానికి
ఎట్టి
అభ్యంతరములు
లేవు.
ఈ
రెండింటికి
మధ్యలోనే
మన
జీవితము
ప్రవేశించాలి.
విద్యార్థులారా!
మీరు
చాలా
మంది
football
ఆడుతుంటారు.
దీనికి
ఒక
system
ఉంటున్నాది.
అటువైపు
ఆరుమంది
ఇటువైపు
ఆరుమంది
ఉంటారు.
చివర
రెండు
గోల్సుపెట్టుకుంటారు.
ఇక్కడ
ఒక
పరిమితము
అక్కడ
ఒక
పరిమితము
పెట్టుకుంటారు.
ఈ
రెండింటికి
మధ్యలో
పోయినప్పుడు
గోల్
అవుతుంది.
కామ
క్రోధ
లోభ
మద
మాత్సర్యములు
ఆరుమంది
ఒక
వైపు
ఉంటున్నారు.
సత్య
ధర్మ
శాంతి
ప్రేమ
అహింస
ఒక
తట్టు
ఉంటున్నారు.
వారు
వీరు
life
అనే
బాలును
కొడుతున్నారు.
ఇహవిద్య,
పరవిద్య
ఇవే
limits.
ఈ
రెండింటి
మధ్యలో
life
అనే
బాల్
కొడితే
గోల్
అయిపోతుంది.
అటువైపుగాని
ఇటువైపుగాని
పోతే
అవుటవుతుందిగాని
గోల్
కాదు.
ప్రాకృత
విద్యలు
చదవండి.
దానిలో
కూడా
ఉన్నత
స్థితి
పొందండి.
కాని
దీనిని
ఆధారము
చేసుకొని
దివ్యమైన
విద్యకూడను
మీరు
నేర్చుకోవాలి.
ఆధ్యాత్మ
విద్యా
విద్యానాం.
లౌకిక
విద్యలన్నీ
చిన్న
చిన్న
నదులవంటివి,
కాలువల
వంటివి.
12
▾
Meaning
Keep
అన్నీ
చేరేది
సాగరము.
ఆధ్యాత్మ
విద్య
సముద్రము
వంటిది.
నదులన్నిటికి
సాగరమే
గతి.
మీరు
ఎన్ని
విద్యలు
నేర్చినా
కట్టకడపటికి
అనుగ్రహమన్న
సాగరములో
చేరక
తప్పదు.
ఆ
విశ్వాసము
చేత,
ఆవిధమైన
ప్రయత్నము
చేత
ఈ
ప్రేమ
తత్వాన్ని
పెంచుకోండి.
ప్రకృతిని
మనము
ఏమాత్రము
విమర్శించకూడదు.
ప్రకృతిని
మనము
ఏమాత్రము
వదలుటకు
వీలుకాదు.
ఇది
కూడా
భగవత్స్వరూపమే.
ఈ
ప్రకృతి
కార్యస్వరూపము.
పరమాత్మ
కారణము.
కారణ-
కార్య
సంబంధమే
ప్రపంచము.
అందులో
కూడా
దైవత్వము
మీరు
చూడాలి.
అణువణువునందు
దైవత్వమును
మీరు
పరికించవచ్చు.
కాన
కేవలము
లౌకిక
విద్యలతో
మన
జీవితాన్ని
అంత్యము
గావించకూడదు.
Previous
←
There Is No Good Without a Rule
Next
Śraddhā and Faith Win God's Grace
→