Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · For Every Kind of Sādhana, Prema Is Life Itself
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
For Every Kind of Sādhana, Prema Is Life Itself
5 July 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
His poems 440
సాధనలు
చేసి
ఫలమేమి
శమములేక
యోగమును
పూని
ఫలమేమి
ఓర్పులేక
జపము
చేసియు
ఫలమేమి
శాంతి
లేక
చవిటి
భూమిని
దున్నిన
చాయకాదె.
విద్యార్థులారా!
‘సాధనమున
పనులు
సమకూరు
ధరలోన’
ప్రపంచములో
ఏరంగము
నందైనా
విజయమును
సాధించవలెనన్న
దానికి
సంబంధించిన
కొన్ని
సాధనలు
సల్పియే
తీరాలి.
చీమైనా
నడచుటకు
ప్రయత్నించిన
కొన్ని
మైళ్ల
ప్రయాణము
చేయగలదు.
ఎగురుటకై
ఇష్టము
లేకుండిన
గరుడ
కూడా
రెండడుగులు
ముందుకు
నడవలేదు.
ప్రతిమానవుడు
సంకల్పము
లేక,
సంకల్పమునకు
తగిన
సాధన
లేక
ఏ
చిన్నకార్యము
సాధించలేడు.
ధ్రువుడు
లేతవయస్సునందే
దైవమును
సాక్షాత్కరింప
చేసుకోవాలని
సత్సంకల్పము
కలిగిన
తక్షణమే
ఎట్టి
బాధలకు
ఎట్టి
కష్టములకు,
ఎట్టి
విచారములకు
ఏమాత్రము
వెరువక
సాధనలు
సల్పి
ధైర్యముతో
సాహసముతో
విజయాన్ని
సాధించాడు.
ఆ
సత్సంకల్పము
యొక్క
పటుత్వముచే
తాను
ధ్రువతారగా
మారాడు.
అదే
విధముగా
ప్రతి
మానవుడు
వయస్సుగానీ
శక్తి
సామర్థ్యములుగాని
ఏమాత్రము
విచారించక
ధృఢ
విశ్వాసముతో
సాధన
సల్పిన
ఆ
కార్యము
సఫలీకృతము
కాగలదు.
ఎంతమంది
చరిత్రలో
మీరు
విని
ఉంటారు.
గొప్పగొప్ప
మహనీయులు
కూడా
అనేక
తపస్సులాచరించి
కడపటికి
ఆ
తపస్సు
యొక్క
శక్తిని
కోల్పోయి
నిరాశకు
గురియై
నిస్పృహకు
గురౌతూ
వచ్చారు.
విశ్వామిత్రుడు
అనేక
పర్యాయములు
తపస్సాచరించి
కడపటికి
ఓరిమి
లేకపోవటంచేత,
శమము
లేకపోవటంచేత
తన
తపఃశక్తి
కోల్పోయి
తిరిగి
తపస్సుకు
వెళ్లటానికి
ప్రయత్నిస్తు
వచ్చాడు.
ప్రతి
రంగమున
సాధన
అత్యవసరము.
అనగనగ
రాగమతిశయిల్లుచునుండు
తినగ
తినగ
వేము
తీయనుండు.
2
▾
Meaning
Keep
Also in his talks
(9)
7 February 1980
Be human
10 February 1980
Education in the Sai era
26 June 1996
Forbearance Is a Safe Armour for Man
19 August 1996
The Mind Itself Is the Root Cause of Bondage and Mokṣa
16 July 1997
Love for God, fear of sin, morality in society
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
4 September 1998
Remembering the Name of God Removes All Sorrow
6 May 2001
The sweetness of a mother's Prema is beyond words
22 August 2001
Vināyaka is the embodiment of all the gods
ఈ
భజనలు
పాడే
విద్యార్థులు
ఎంతో
ప్రయత్నము
చేసి,
ఎన్నో
విధముల
సాధనల
చేత
ఈనాడు
సుస్వరముతో
పాడగలుగుతున్నారు.
దూర్వాసుడు
మహాశక్తి
సంపన్నుడు.
మహా
తపసంపన్నుడు
కాని
అతనియందు
శమము
దుర్భిణీ
పెట్టి
చూచినా
కనిపించదు.
అతనికి
అతి
కోపము.
శాంతి
అతనిలో
కానరాదు.
కనుక
అతని
పేరుకు
ఏమాత్రము
కీర్తిప్రతిష్ఠలు
లేకపోయినవి.
కారణము
శాంతి
లేకపోవటమే.
ఎంత
తపస్సు
చేసినా,
ఎంత
శక్తి
సంపాయించినా
శాంతి
లేక
సర్వము
తాను
కోల్పోతాడు.
శాంతితోబాటు
క్షమ
అత్యవసరము.
క్షమ
సత్యము
క్షమ
ధర్మము
క్షమ
వేదము!
క్షమ
అహింస
క్షమ
సంతోషము
క్షమ
దయ
క్షమ
సర్వస్వము
సర్వలోకములందు.
క్షమ
ప్రతి
మానవునకు
ప్రధాన
నేత్రము.
సర్వవిధములైన
సాధనలకు
ప్రేమ
ప్రధానమైన
ప్రాణము.
ఈ
ప్రేమలేక
జీవితమే
లేదు.
ఈ
ప్రేమ
తత్వాన్ని
చక్కగా
గుర్తించి
వర్తించటానికి
ప్రయత్నించాలి.
Life
is
a
dream,
realise
it.
ఏది
dream.
Life
అంతా
dream.
పగటి
వేళయందు
మీరందరు
కూర్చొని
స్వామి
సందేశము
శ్రవణము
చేస్తున్నారు.
ఇది
dream
కాదా!
కన్నులతో
చూస్తున్నారు.
చెవులతో
వింటున్నారు.
హృదయము
కదలింప
చేసుకుంటున్నారు.
ఈ
మార్పులు
కూర్పులు
ప్రత్యక్ష
ప్రమాణములే
యని
మీరు
భావిస్తున్నారు.
ఎంతవరకు
ఇది
ప్రత్యక్ష
ప్రమాణము,
రాత్రి
పండుకున్న
తరువాత
ప్రత్యక్షమంతా
పరోక్షమై
పోతుంది.
ఆ
స్వప్నములో
ఆనందము
దుఃఖము
రెండు
సంభవిస్తూ
ఉంటాయి.
కానీ
దుఃఖములు
ఆనందములు
ఎంతవరకు
ఉంటాయి.
కల
ఉన్నంతవరకే.
తిరిగి
జాగ్రదవస్థకు
వచ్చిన
తక్షణమే
అంతా
అసత్యముగా
రూపొందుతుంది.
కనుక
పగటి
వేళ
రాత్రి
కలలు
లేవు.
రాత్రి
నిద్రయందు
ఈ
పగటి
అనుభూతులు
ఏమాత్రము
స్మరణకు
రావు.
కాబట్టి
ఇది
పగటి
కల
అది
రాత్రి
కల.
ఈ
పగటి
కలలో
రాత్రి
కల
లేదు.
రాత్రి
కలలో
పగటి
కల
లేదు.
కాని
పగటి
కలలోనూ,
రాత్రి
కలలోను
నీవు
ఉన్నావు.
కనుక
నీవు
omnipresent.
రాత్రింబవలు
రెండు
కలలైనప్పుడు
life
is
a
dream.
కనుక
realise
చేయాలి.
అదే
religion.
religion
అనగా
realisation.
ఏది
సత్యమని
గుర్తించటమే
religion.
అన్నింటికి
ప్రేమయే
ప్రధానము.
కఠినమైన
అడవులందు,
క్రూరమైన
మృగములు
సంచరించే
కారడవులందు
అనేకమంది
ఋషులంతా
తపస్సు
చేస్తూ
కాలము
గడుపుతూ
వచ్చారు.
అనేక
విధములైన
క్రూర
మృగములు
సంచరిస్తున్నాయి.
కాని
ఋషుల
దగ్గర
తుపాకులుగాని
కత్తులుగానీ
మరి
యితర
ఆయుధములు
లేవు.
కాని
ఈ
ఋషులు,
ఆ
మృగములు
సమముగానే
జీవిస్తూ
వచ్చాయి
అడవిలో.
3
▾
Meaning
Keep
Also in his talks
(1)
23 November 1987
Forget the mind, and what is there is the Ātma itself!
క్రూర
మృగములను
జూచి
ఋషులు
భయపడలేదు.
ఋషులను
జూచి
మృగములు
భయపడలేదు.
కారణము
ఏమిటి?
ఋషులందు
పరిపూర్ణప్రేమ
ఉండటంచేతనే
ప్రేమప్రభావము
క్రూర
మృగములందు
సంచరించి
క్రూరమృగములందు
కూడా
ప్రేమ
స్వరూపము
ధరించాయి.
కాబట్టి
ఎట్టి
సంగమో
అట్టి
ప్రభావము
ఆవిర్భవిస్తుంది.
మనము
మంచివారితో
సహవాసము
చేసినప్పుడు
మన
గుణములు
కూడా
మంచివిగానే
ఉంటాయి.
అన్నింటికి
ప్రేమయే
ప్రధానము.
ప్రేమయే
పరమాత్మ
స్వరూపము.
ఈ
ప్రేమ
యందే
మనం
జీవించాలి.
ఇటలీలో
గొప్ప
వయొలినిస్టు
ఆంథోని
ఉండేవాడు.
ఈ
ఆంథోని
వయొలిన్
అంటే
గొప్ప
పేరు.
వయొలిన్
చేయుటకు
ఒక
సంవత్సరము
తీసుకొనేవాడు.
అతని
స్నేహితుడు
వచ్చి
‘ఆంథానీ!
నీవు
కుటుంబీకుడవు.
ఒక
సంవత్సరమునకు
ఒక
వయొలిన్
తయారు
చేస్తే
దానివలన
వచ్చే
ఆదాయము
ఏమిటి?
నీ
కుటుంబమును
ఏరీతిగా
సంరక్షించుకోగలవు?
కాలము
ఏరీతిగా
శాంతిగా
జీవించగలవు?’
అప్పుడు
ఆంథోని
చెప్పాడు.
‘ఓ
స్నేహితుడా
పరమాత్ముడు
పూర్ణ
స్వరూపుడు.
పరిపూర్ణ
స్వరూపుడు
కనుక
మానవుడు
చేసే
చిన్న
కార్యము
కూడా
పరిపూర్ణముగానే
ఉంటుండాలి.
అప్పుడే
పరిపూర్ణ
పరమాత్మకు
సంతృప్తి
కలుగుతుంది.
నా
కుటుంబ
సంక్షేమము
కోసం
నేను
ఈ
వయొలిన్
చేయుటంలేదు
నా
జీవిత
ఆనంద
నిమిత్తమై
ఈ
వయొలిన్
చేయటం
లేదు.
పరిపూర్ణుడైన
పరమాత్మ
తృప్తికై
నేను
ఈ
వయొలిన్
చేస్తున్నాను’
అన్నాడు.
ఏ
మానవుడు
ఏపని
చేసినా
భగవంతుని
సంతృప్తి
కోసం
చేయాలి.
దీనిని
పురస్కరించుకొనియే
వేదము
సర్వకర్మ
భగవత్ప్రీత్యర్థము
అనింది.
మనము
శాంతి
లేక
ఎన్ని
సాధనలు
చేసినా
నిరుపయోగమై
పోతుంది.
ఓర్పులేక
మనము
ఎన్ని
యోగములు
చేసినా
శరీర
శ్రమలకు
గురౌతాము
గాని
ఆత్మశాంతి
ఏమాత్రము
అందుకోలేము.
సంతృప్తిలేక
శాంతి
లేక
ఎంత
జపము
చేసినా
కృత్రిమమైన
జపముగా
రూపొందుతుంది
గానీ
దైవప్రీతిగా
రూపొందదు.
మనము
చేసేవన్ని
భగవత్ప్రీత్యర్థము
చేయాలి.
ఏ
చిన్నది
చేసినా
చాలు.
భగవంతుడు
ఎప్పుడూ
క్వాలిటీ
చూస్తాడుగాని
క్వాంటిటీ
చూడడు.
గంగిగోవు
పాలు
గరిటెడైనను
చాలు
కడివెడైన
ఏమి
ఖరముపాలు
ఎంతో
గొప్ప
సాధన
చేస్తున్నాము.
ఒక
గంట
సాధన
ధ్యానము
చేశాము.
గంటసేపు
కూర్చున్నావే
గానీ
ఎంతసేపు
మనసు
నిల్చింది.
ఒక్కక్షణమైనా
మనసు
నిల్వలేదు.
ఈ
విధంగా
గంటలు
వ్యర్థము
చేస్తున్నావు.
నీవు
చేసే
ప్రతి
కార్యము
భగవత్కార్యముగా
భావించు.
ఇదే
సరైన,
సులభమైన,
సున్నితమైన
మార్గము.
4
▾
Meaning
Keep
ఈ
మార్గము
వదలి
ఎందులకీ
శ్రమలకంతా
గురికావాలి.
నీ
ఇంటి
పనులు
కూడా
భగవత్కర్మలుగా
భావించు.
భగవంతుడు
నీహృదయవాసి.
దేహముతో
ఏకార్యములు
చేసినా
తన
ద్వారానే
జరుగుతున్నాది.
చూచే
కన్నులు
తన
ద్వారానే
చూడగలుగుతున్నవి.
చెవులు
కేవలం
లౌడ్స్పీకర్లు
మాదిరి
కనిపిస్తున్నాయిగానీ
ఆ
చెవులలోనున్న
శక్తి
దైవము
యొక్క
శక్తియే.
మన
ఇంద్రియములన్ని
దైవసంబంధమైన
కర్మేంద్రియములే.
ఏ
ఇంద్రియములతో
చేసినా
భగవత్ప్రీత్యర్థము
చేసినట్లుగా
భావించాలి.
ఎవరి
తృప్తికోసం
నీవు
చేస్తున్నావని
విచారణ
చేస్తే
ఇది
తన
తృప్తి
కోసమే.
తాను
అంటే
ఎవరు?
దేహమా
తాను
దేహమే
తానైతే
నాదేహము
అని
ఎందుకనాలి.
నీవే
మనస్సు
అయితే
నామనస్సు
అని
ఎందుకనాలి?
ఈ
‘నా’
ఎవరు?
you
are
not
the
body.
you
are
not
the
mind.
you
are
the
master.
mind,
body,
senses
instruments.
ఈ
పనిముట్లచే
చైతన్య
స్వరూపుడైన
భగవంతుడే
చేయిస్తున్నాడు.
అందరియందు
ఈ
చైతన్య
స్వరూపమే
ఇమిడిఉంది.
ఈ
చైతన్యము
లేక
ఏప్రాణి
కూడా
ఏవ్యక్తి
కూడా
జగత్తులో
ఉండటానికి
వీలుకాదు.
సర్వులయందు
చైతన్య
స్వరూపుడైన
ఈశ్వరుడున్నాడు.
జగత్తంతా
దైవస్వరూపమే.
భగవంతుడు
అందరియందు
ఉంటున్నాడు.
అయితే
ఎందుకు
కనిపించకూడదు?
పిల్లలు
మీకందరికి
తెలుసు.
అనేక
రకములైన
జపమాలలుంటున్నాయి
తులసిమాల,
రుద్రాక్షమాల,
lotus
seeds
మాల,
స్ఫటిక
జపమాల
లుంటాయి.
అన్నింటియందు
ఒకే
దారము
ఉంటున్నాది.
రుద్రాక్షమాలలోని
దారము
మనకు
కనిపించదు.
lotus
seeds
మాలలోని
దారము
మనకు
కనిపించదు.
తులసిమాలలోని
దారము
మనకు
కనిపించదు.
కాని
స్ఫటిక
మాలలోని
దారమే
మనకు
కనిపిస్తుంది.
అందరు
మానవాకారులే.
కాని
అందులో
ఎవరు
పరిశుద్ధమైన
స్ఫటికముగా
ఉంటున్నారో
వారి
హృదయమందు
మాత్రమే
బ్రహ్మ
అనే
సూత్రము
కనిపిస్తుంది.
సర్వులలో
ఉండినది
బ్రహ్మసూత్రమే.
సూత్రమనగా
దారము.
ఆ
బ్రహ్మ
అనే
దారము
సర్వులయందు
చేరి
ఉంటున్నాది.
మనము
చూడాలనుకున్నప్పుడు
మన
హృదయమును
స్ఫటికముగా
పెట్టుకోవాలి.
పరిశుద్ధమైన
స్ఫటికముగా
ఉండినప్పుడే
బ్రహ్మతత్వము
గుర్తింపచేయటానికి
వీలవుతుంది.
ఈనాటి
మానవుడు
జపములు
చేస్తున్నాడు.
ధ్యానములు
చేస్తున్నాడు.
యోగమునకు
కూర్చుంటున్నాడు.
ఆసనములు
వేస్తున్నాడు.
ఎన్ని
చేసి
ప్రయోజనము
ఏమిటి?
మనయందున్న
దురాలోచనలు,
దుర్బుద్ధులు
పోవాలి.
మానవునకు
ప్రధాన
సూత్రము
నందించేది
రామాయణము
భాగవతము,
భారతము.
రామాయణము,
భాగవతము,
భారతములను
పండితులు
ఏమని
పిలుస్తూ
వచ్చారు?
5
▾
Meaning
Keep
కామ,
క్రోధ,
లోభములని
పిలుస్తూ
వచ్చారు.
రామాయణము
కామము.
ఎమిటి
ఇంత
పవిత్రమైన
చరిత్రను
కామమని
చెబుతున్నారని
విచారించవచ్చు.
విచిత్రమని
అనిపించవచ్చు.
రామాయణమునకు
మూలకారణము
రావణుని
కామమే.
రామాయణమంతా
రావణుని
దుర్గుణమే.
కామము
రామాయణములోని
రావణుడే.
సర్వశక్తులు
ఉండిన
రావణుడు
స్వల్పమైన
అభీష్టమునకు
గురై
తన
రాజ్యమును
తన
బంధువులను,
తన
సర్వస్వమును
కోల్పోయాడు.
క్రోధమనగా
భాగవతము.
హిరణ్యకశిపునకు,
హిరణ్యాక్షునకు
భగవంతునిపై
కోపము.
భగవంతునిపై
క్రోధము
పూనినాడు
కనుక
హిరణ్యకశిపుడు
ఏమాత్రము
ముందువెనుక
విచక్షణా
జ్ఞానము
లేక
సర్వము
కోల్పోయాడు.
భాగవతము
హిరణ్యకశిపుని
చరిత్ర.
హిరణ్యకశిపుడు
హరి
అనగా
మండి
పోయేవాడు.
కన్నకుమారుని
దయా
దాక్షిణ్యములు
లేక
హింసలు
పెడుతూ
వచ్చాడు.
క్రోధము
విచక్షణా
జ్ఞానమును
కోల్పోతుంది.
కట్టకడపటికి
ఏమైపోయాడు.
అన్ని
విధముల
అపకీర్తులపాలై
పోయి
భ్రష్టుడైపోయాడు.
పంచభూతములను
హస్తగతము
గావించుకున్నవాడు
హిరణ్యకశిపుడు.
ఎన్ని
సంపాయించి
ఏమి
ప్రయోజనం?
ఏమాత్రము
విజయాన్ని
సాధించలేకపోయాడు.
ఇంక
లోభము.
దురాశతో
నిండిన
దుర్యోధనుడు
అన్ని
విధముల
అపజయము
పొంది
తన
నూర్గురు
సోదరులను
కోల్పోయాడు.
ధర్మమూర్తులైన
పాండవులపైన,
కృష్ణునిపై
ద్వేషము
పూనుతూ
వచ్చారు.
కృష్ణునిపై
విశ్వాసముండినట్లు
నటించాడు
గాని
విశ్వాసము
లేదు.
కారణమేమిటి?
పాండవుల
పక్షం
ఉంటున్నాడని.
కృష్ణునిపై
ద్వేషము
పూనుతూ
వచ్చాడు
దుర్యోధనుడు.
ముగ్గురు
దైవ
ద్వేషులే.
కామ,
క్రోధ,
లోభములు
మూడు
దైవమునకు
ద్వేషులే.
పవిత్రమైన
పరతత్వమునకు
ద్వారములు
నిరంతరము
మూయబడి
ఉంటాయి.
మోక్షమునకు
పరమ
శతృవులు
ఈ
మూడే.
ఏమిటి
ఈ
మోక్షము.
మోక్షమనగా
మోహక్షయమే.
మన
మోహమును
మనం
తగ్గించుకుంటే
అదే
మనకు
మోక్షం.
ఒకానొక
సమయంలో
నారదుడు
విష్ణువును
ప్రశ్నించాడు.
స్వామీ!
నేను
నిరంతరము
మీదర్శన
నిమిత్తమై
ఎక్కడుంటే
అక్కడకు
వస్తున్నాను.
ఒక్కొక్క
సమయంలో
చాలా
అవసరమైన
పని
ఏర్పడుతుంది.
మిమ్మల్ని
దర్శించాలనుకుంటే
మీ
హెడ్డాఫీసు
ఎక్కడ
అని
అడిగాడు.
వైకుంఠమా,
కైలాసమా,
స్వర్గమా
అని
అడిగాడు.
అప్పుడు
విష్ణువు
‘నారదా!
ఎడ్రసు
వ్రాసుకో.
మద్భక్తః
యత్ర
గాయన్తి
తత్ర
తిష్ఠామి
నారద.
వైకుంఠము
కైలాసము
స్వర్గము
బ్రాంచి
ఆఫీసులు.
నా
హెడ్డాఫీసు
నా
ప్రియమైన
భక్తుడు
ఎక్కడ
నన్ను
స్మరిస్తూ
ఉంటాడో
అక్కడ
నేను
ప్రతిష్ఠ
అయి
ఉంటాను.
మిగిలిన
స్థానములలో
నేను
ఉత్సవవిగ్రహమును!
తిష్ఠామి
అన్నాడు
వసామి
అనలేదు.
6
▾
Meaning
Keep
ప్రతి
హృదయము
భగవంతుని
నివాసమే.
ప్రతి
మానవుడు
నేను
మానవుడను
అని
భ్రమించకండి.
అందరు
దైవ
స్వరూపులే.
పాంచభౌతికమైన
దేహమును
అనుసరించటం
చేత,
ఉపాధి
భేదములచే
మనము
మానవులుగా
భావిస్తున్నాము.
ఈ
ఉపాధి
భేదములు
విస్మరించండి.
ఉన్న
సత్యము
గమనించండి.
నిత్యసత్యమైన
దైవమును
స్మరించండి.
కేవలము
జీవితమంతా
లౌకికమైన,
భౌతికమైన
ప్రాకృతమైన
దీనియందే
కాలము
గడపకండి.
భగవంతుడు
ఎప్పుడూ
ప్రేమ
స్వరూపుడు.
అంతా
తన
యొక్క
ప్రేమయే.
స్వరూపము
ఉంటే
స్వభావము
రావచ్చును.
స్వరూపము
లేదు.
స్వభావము
లేదు.
ప్రేమయే
తాను
తానే
ప్రేమ.
ప్రేమకు
రూపమే
లేదు.
ప్రేమ
ప్రేమయే.
కనుక
ప్రేమకు
పరిమితము
లేదు.
సముద్రమునకు
పరిమితమున్నది.
ఆకాశమునకైనా
పరిమితమున్నది
కాని
ప్రేమకు
పరిమితము
లేదు.
కర్ణాటక
దేశములో
మల్లమ్మ
అనే
పరమ
భక్తురాలుండేది.
ఓ
పరమాత్మా!
ఒక
కొలనుకు
తామరయే
సుందరము.
కొలనులో
తామర
పుష్పము
లేక
కొలనుకు
శృంగారమే
లేదు.
గ్రామానికి
ఇండ్లే
శృంగారము.
ఆకాశమునకు
చంద్రుడే
శృంగారము.
సముద్రమునకు
అలలే
శృంగారము.
స్వామి
భక్తుల
తలవ్రాతకు
ప్రేమయే
శృంగారము.
నీ
ప్రేమకంటె
శృంగారము
మరొకటి
లేదు.
అలలు
లేని
సముద్రము
చంద్రుడు
లేని
ఆకాశము
కమలము
లేని
కొలను
ఏవిధంగా
శృంగార
రహితమైనవో
ఆవిధంగా
ప్రేమలేక
జీవితమునకు
శృంగారము
లేదు.
ప్రేమయే
మనకు
పెద్ద
శృంగారము.
ప్రేమయే
దైవము.
అందరిని
ప్రేమించు.
ప్రేమ
ఎదుటివానిలో
లేనప్పుడు
నీ
ప్రేమ
వానికి
పంచు.
చెప్పాను.
ప్రేమ
దిక్సూచివంటిదని.
అది
ఎక్కడ
పెట్టినా
ఉత్తరదిక్కునే
సూచిస్తుంది.
అదేరీతిగా
మనము
ఏమి
చేసినా,
ఏమి
చింతించినా
ఏమి
కోరినా
ఏమి
ఆలోచించినా
అదంతా
దైవమువైపునే
పోవాలి.
మనము
వ్యాపారము
చేసి,
ఉద్యోగము
చేసి
ఏవిధముగా
ధనము
సంపాయిస్తున్నామో
అదే
విధముగా
మన
నిత్య
జీవితములో
చేసే
ప్రతి
కర్మయందు
ప్రేమను
సంపాయించాలి.
ఈ
ప్రేమ
ఏ
విధముగాను
తరిగేది
కాదు.
తరిగేది
కాదు.
ఎప్పుడు
సమత్వంగానే
ఉంటుంది.
‘పూర్ణప్రేమయందె
పుట్టును
దైవంబు’
పూర్ణప్రేమ
ఎక్కడుంటుందో
అక్కడే
పుడతాడు
భగవంతుడు.
దైవమనగా
ఎంత
సులభమో
మీకు
తెలియదు.
అంత
సులభము.
పుష్పము
రేకు
నలపటానికి
కష్టమవుతుంది.
కాని
భగవంతుని
పొందటము
అంతకంటె
సులభము.
వెన్నను
నలపటం
కొంచెం
కష్టం
కాని
భగవంతుని
చూడటం
అంతకంటె
సులభం.
ఇంత
సులభమైన
మార్గమును
మనం
ఎందుకు
చూడటానికి
ప్రయత్నించటం
లేదు.
కారణము
మన
భావములే
-
భగవంతుడు
ఎక్కడో
ఉంటున్నాడు.
పొందటము
చాలా
కష్టము.
తపస్సు
చేయవలెనో
ఏమిటో
ఈ
భావములే
మనలను
భ్రమింప
చేస్తున్నాయి.
7
▾
Meaning
Keep
భగవంతుడు
ఎక్కడో
లేడు.
ఎక్కడ
చూచినా
ఉన్నాడు.
ఎక్కడ
చూచినా
ఉన్నవానిని
వెతకటము
ఎందుకు?
వెతకనక్కర
లేదు.
చూచేదంతా
చర్మచక్షువులే.
చర్మ
చక్షువులంతా
బాహ్య
ప్రపంచమునే
చూస్తున్నాయి.
ఈ
బాహ్యప్రపంచము
భగవత్స్వరూపమే.
చూస్తున్నదంతా
భగవత్స్వరూపమే.
ఈ
శిరస్సులన్ని
విరాట
స్వరూపమే.
మీరు
దృశ్య
కల్పితమైన
రూపనామములు
పెట్టుకొని
మనుష్యులుగా
కనిపిస్తున్నారేగాని
నిజముగా
ఈ
సృష్టిని
దైవముగా
భావించండి.
అదే
దైవముగా
మారిపోతుంది.
నీ
దృష్టి
దోషమే
గాని
సృష్టి
దోషము
ఏమాత్రము
లేదు.
దృష్టిలో
ఉంది
దోషము.
ఎలాంటి
కలరు
అద్దమో
అలాంటి
కలరులుగా
కనిపిస్తుంది.
ద్వేషముతో
చూడు
ద్వేషముగానే
కనిపిస్తుంది.
ప్రేమతో
చూడు
ప్రేమగానే
కనిపిస్తుంది.
యద్భావం
తద్భవతి.
మన
భావములే
మనకా
విధంగా
కనిపిస్తాయి.
అందరు
భగవత్స్వరూపులే.
ఆ
విధమైన
ఏకాత్మ
భావము
పెంచుకోవాలి.
ఈ
ప్రేమయందున్న
శక్తి
దేనియందు
లేదు.
ఒక్క
ప్రేమచేత
ఎంతైనా
సాధించవచ్చు.
ఇంతమంది
ఇక్కడ
ప్రవేశించారు.
దీనికి
ఏమి
కారణము?
ఒక్క
ప్రేమయే
మూలకారణము.
మీ
అందరికి
స్వామిపైనున్న
ప్రేమ,
స్వామికి
మీపైనున్న
ప్రేమయే.
ఇంతమంది
ఇక్కడ
ప్రవేశపెట్టింది.
లేకపోతే
మీకు
ఎవరు
invitation
పంపారు.
లేదు.
ఈ
ప్రేమయే
అన్నింటిని
కట్టి
వేస్తున్నాది.
ప్రేమను
పెంచుకోండి.
ప్రేమతో
సంభాషించండి.
ప్రేమతో
పనులు
చేయండి.
ప్రేమనే
చింతించండి.
ప్రేమతోనే
సర్వకర్మలు
ఆచరించండి.
ఇంతకంటె
సులభమైన
మార్గము
మరొకటి
లేదు.
జపమాల
పట్టుక
తిప్పుతుంటె
జపము
చేస్తున్నాను
అని
అనుకుంటావు.
చేతిలో
జపమాల
మదిలో
చాకలి
ఇల్లు
మంగలి
ఇల్లు
పోతుంది.
ధ్యానములో
కూర్చుంటె
వంటఇంట్లో
మాడిన
కూరల
వాసన
వస్తుంది.
బుద్ధి
బయటకు
పోతుంది.
ఇదో
మనము
చేసే
ధ్యానము.
ఇదా
మనము
చేసే
జపము.
కాదు.
జపము
ఏమిటి?
భగవంతుడు
నాలో
ఉంటున్నాడు.
నేనే
భగవంతుడను.
ఇదే
నిజమైన
జపము.
ధ్యానము
ఏమిటి?
అహం
బ్రహ్మాస్మి.
ఇంతకంటె
సులభమైన
మార్గము
ఏ
వేదము
బోధించలేదే.
అన్ని
వేదములు
అహం
బ్రహ్మాస్మి,
తత్వమసి,
ప్రజ్ఞానం
బ్రహ్మ
నేను
నీవే
నీవు
నేనే
అంటున్నాయి
సర్వము.
ఆ
పదములలోనే
కన్పిస్తున్నాది
మనకు
సత్యము.
కాని
ఈ
పదములను
పండితులు
అటు
తిప్పి
ఇటు
తిప్పి
మనకు
ఉన్న
విశ్వాసము
పోగొడుతున్నారు.
confusionకి
మీరు
చోటు
ఇవ్వకండి.
కసరత్తుచేత
మీదేహమును,
మీ
మనసును
పాడు
చేసుకోకండి.
సులభమైన
మార్గమును,
సున్నితమైన
మార్గమును,
అతి
మధురమైన
మార్గము,
అతి
ఆనందమయమైన
మార్గము
ప్రేమ
ఒక్కటే
ఒక్కటే
ఒక్కటే.
Previous
←
Spiritual Sādhana in Everyday Life
Next
Śānti Rises from Within Us
→