Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Expand Your Love and Experience Eternal Bliss
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Expand Your Love and Experience Eternal Bliss
21 July 1996, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
పుణ్యకర్మలచేత
భువిని
త్యాగముచేత
ప్రేమ
తత్వములను
పెంచవలయు
దానవత్వమణచి
దైవతత్వము
పెంచి
నిత్యజీవితమును
నెఱపు
నరుడ!
విశాలమైన
ఈ
విశ్వమందు
మానవుని
మనస్సు
సంకుచితముగా
ఉండటము
చాలా
అవమానకరంగా
ఉంటుంది.
విశ్వస్వరూపుడు
దైవము.
అలాంటి
దైవము
ప్రతి
వ్యక్తియందు
ఉండటం
చేత
ప్రతి
మానవుని
హృదయము
అత్యంత
విశాలమైనదిగా
ఉండాలి.
ఈనాడు
మానవుడు
దైవమును
విస్మరించి
భౌతికమును
లౌకికమునే
విశ్వసించి
కాలము
గడుపుటచే
మనస్సు
సంకుచితముగా
మారిపోతున్నది.
విశాలత్వమైన
విష్ణుత్వమును
చింతించిన
తన
మనస్సు
విశాలంగా
మారుతుంది.
కనుక
మొట్టమొదట
మానవుడు
తన
హృదయాన్ని
విశాలము
గావించుకోవాలి.
పవిత్రమైన
ఆదర్శములను
ఈనాడు
మానవుడు
సమాజములో
చాటక
సంకుచితమైన
అల్పమైన
ఆదర్శములను
అందిస్తున్నాడు.
మానవుని
ప్రతి
ఆదర్శము
అత్యంత
అద్భుతమైనదిగను
పరిశుద్ధమైనదిగను
విశాలమైనదిగను
ఉండాలి.
కనుకనే
Life
x
infinity
=
GOD.
Body
x
infinity
=
విరాటు
స్వరూపము.
Mind
x
infinity
=
హిరణ్యగర్భుడు.
మానవుడు
తన
అనంతమైన
శక్తిని
తాను
గుర్తించలేక
పోతున్నాడు.
నిరంతరము
తాను
అనంతముగా
భావించుకుంటూ
తన
జీవితము
గడుపుతూ
పోయినప్పుడు
తన
జీవితము
అనంతమైన
ఆదర్శమును
సమాజమునకందిస్తుంది.
ఈ
అనంతశక్తి
అన్నింటియందు
ఉంటున్నది.
దీనికి
మూడు
రకములైన
ఉపమానములు.
ఒకటి
పారమార్థికము.
రెండవది
వ్యావహారికము.
మూడవది
ప్రాతిభాసికము.
పారమార్థికము,
వ్యావహారికము,
ప్రాతిభాసికము
ఈ
మూడు
ప్రత్యేకమైనవి
కాదు.
ఈ
మూడింటియందున్న
దివ్యత్వము
ఒక్కటే.
జలములేక
అలలు
లేవు.
అలలు
లేక
నురుగు
పుట్టదు.
ఈ
నురుగు
అలలను
ఆధారం
చేసుకుంటుంది.
జలము,
అలలు,
నురుగు
ఈ
మూడింటియందున్న
జలము
ఒక్కటే.
దీనినే
త్రికూట
స్వరూపము
అన్నారు
భగవంతుని.
అనగా
మూడింటియందు
ఏకత్వము
దైవత్వమే.
పారమార్థికమే
వ్యావహారికమందుండాలి.
కాని
ఈనాటి
మానవుడు
వ్యావహారికమునకు
పారమార్థికమునకు
ఎట్టి
సంబంధము
లేదని
భావిస్తాడు.
2
▾
Meaning
Keep
ఆధ్యాత్మికమునకు
లౌకికమునకు
ఎట్టి
సంబంధము
లేదంటారు.
ఇది
చాలా
పొరపాటు.
ఆధ్యాత్మికము
యొక్క
ఆదర్శము,
ఆధారము
లేకుండా
లౌకికము,
వ్యావహారికము
ఏమాత్రము
ఉండుటకు
వీలు
లేదు.
వ్యావహారికమందు
కూడా
పారమార్థికము
అంతర్భూతమై
ఉంటున్నది.
కాన
పారమార్థికము,
వ్యావహారికము,
ప్రాతిభాసికము
ఈ
మూడింటియందున్న
దివ్యత్వము
ఒక్కటే
అనే
సత్యాన్ని
నిరూపిస్తూ
వచ్చింది
వేదము.
తరతరముల
నుండి
భారతదేశము
అన్ని
దేశములకు
ఆధ్యాత్మిక
సంపత్తి
చేత
సుస్థిరమైన
శాంతి
భద్రతలను
అందిస్తూ
వస్తున్నది.
కనుకనే
నేటికిని
‘లోకాస్సమస్తా
సుఖినో
భవంతు’
అనే
విశాలమైన
భావము
భారతదేశము
చాటుతూ
వచ్చింది.
ఈ
ఆదర్శము
సుస్థిరము
చేసే
నిమిత్తమై
ఆనాటి
రాజులు,
ఆనాటి
ఋషులు,
ఆనాటి
మునులు,
ఆనాటి
పతివ్రతామతల్లులు
వీరందరు
ఎంతో
త్యాగము
చేస్తూ
వచ్చారు.
ఇలాంటి
ఆదర్శవంతమైన
దానికి
ఆనాడు
అందరు
ఏకమై
అభివృద్ధికి
తగిన
ఏర్పాటు
చేసేవారు.
ఈనాడు
ఏ
ఒక్క
విషయములో
ప్రవేశించినా
ఎవరికి
వారే
యమునా
తీరే.
ఐకమత్యమే
కనిపించదు.
ఈ
ఐకమత్యము
హృదయములో
లేనప్పుడు
అక్కడ
enmity
ప్రారంభమవుతుంది.
ఈ
enmity
ని
హృదయములో
ప్రవేశించకుండా
చూచుకోవాలి.
ఈనాడు
unity
లేదు.
Divinity
లేదు.
అంతా
కృత్రిమమైన
మతముగా
భావిస్తున్నారు.
ఈ
community
అనే
దాంట్లో
జీవితము
వ్యర్థము
గావిస్తున్నారు.
ప్రాచీన
కాలమునుండి
భారతదేశమందు
ఇలాంటి
సుసూక్తులు
ప్రచార
ప్రబోధలు
సల్పి
ఋషులు,
మునులు,
రాజులు
ఈ
విధముగా
ఆధ్యాత్మిక
శక్తిని
కాపాడుతూ
వచ్చారు.
భారతదేశమందు
ఆధ్యాత్మికమే
నశిస్తే
యావత్ప్రపంచమే
నశిస్తుంది.
అన్ని
దేశములకు
ఆధ్యాత్మికము
మూలముగా
ఉంటున్నది.
ఎట్టి
మానవుడైనా
పారమార్థికమునందు
ప్రవేశించే
తీరాలి.
ఏ
మానవునకైనా
దాహము
లేకుండా
ఉండదు.
ఈ
కోరికలే
మానవుని
దాహము.
దాహము
తీరాలంటే
కోరికలు
తీరినా
అతని
దాహము
తీరదు.
మానవుని
యొక్క
పారమార్థిక
కోరిక
తీరాలంటే
దైవచింత
అత్యవసరము.
పారమార్థిక
జలమే
దాహమును
చల్లారుస్తుంది.
ఈనాడు
సమాజములో
పారమార్థికము
లేదు.
నైతికము
లేదు.
ధార్మికము
లేదు.
కాని
పదవులు,
ధనము
ఈ
రెండే
వారి
లక్ష్యము.
ధనము
సంపాయించవచ్చును.
ఈ
ధనము
వారు
ఏవిధముగా
ఉపయోగించాలి.
ఈ
ధనము
సద్వినియోగము
చేయాలి.
సద్వినియోగము
చేయక
పోవటం
వలన
సమాజములో
అనేక
అల్లకల్లోలములు
ప్రారంభమవుతున్నాయి.
3
▾
Meaning
Keep
ప్రతి
మానవుడు
తన
దివ్యత్వము
తాను
గుర్తించి
పవిత్రమైన
కర్మలలో
పాల్గొనాలి.
ఈనాడు
దేనికి
విలువ
తగ్గిపోతున్నాది?
బెండకాయ
బీరకాయ
విలువ
ఎక్కిపోయింది.
fire
wood
కి
విలువ
ఎక్కిపోయింది.
అన్నింటికి
విలువ
అధికమైపోయింది.
ఒక్కదానియందు
మాత్రమే
విలువ
తగ్గిపోయింది.
మానవుని
విలువ
తగ్గిపోయింది.
కారణము
ఏమిటి?
ఈ
మానవతా
విలువలు
తనయందు
లేక
పోవటం
చేత
విలువ
తగ్గిపోయింది.
ఈ
జగత్తులో
పశుపక్షిమృగా
క్రిములు,
క్రిమి
కీటకాదులు,
ప్రతి
పదార్థములు
తమ
తమ
కర్తవ్యములను
తాము
నిర్వర్తిస్తూ
తమ
విలువలు
తాము
కాపాడుకుంటూ
వస్తున్నాయి.
కాని
ఈనాడు
తన
విలువను
తాను
పాడు
చేసుకోటం
ఒక్క
మానవుడు
మాత్రమే.
తన
విలువ
ఏమిటో
తాను
గుర్తించుకోలేకుండా
ఉన్నాడు.
మానవతా
విలువలు
అంటే
ఏమిటి
అని
ప్రశ్నిస్తారు.
మానవుని
పుట్టుకతోనే
ఈ
విలువలు
పుట్టాయి.
అలాంటి
దాన్ని
మరచిపోయి
కృత్రిమమైన
నీడను
పట్టుకున్నాడు.
ఈనాడు
మానవతా
విలువలు
అభివృద్ధి
చేసుకున్న
తరువాతనే
తన
విలువ
గొప్పదిగా
మారుతుంది.
సృష్టి
అనగా
ఏమిటి?
ఈశ్వరేచ్ఛకు
ఒక
విధమైన
ప్రతిరూపము
ఈ
సృష్టి.
దీనినే
ప్రకృతి
అన్నారు.
ఈ
ప్రకృతి
యొక్క
దివ్యత్వము
రక్షించే
నిమిత్తమై
మానవుడు
ఉద్భవించాడు.
తాను
శరీర,
మానసిక,
ఆధ్యాత్మిక
శక్తులనన్నింటిని
ఈ
విలువలలో
పంచి
తద్వారా
తాను
తరించాలని
మానవత్వములో
ప్రవేశించాడు.
మొట్టమొదట
మానవుడు
తన
విలువలు
తాను
రక్షించుకోటానికి
ప్రయత్నించాలి.
మానవునకు
ప్రేమ
చాలా
ప్రధానమైనది.
మానవునకు
కరుణ
చాలా
ప్రధానమైనది.
కరుణ
లేక
మానవుడే
కాదు.
ప్రేమ
లేక
మానవుడే
కాదు.
సత్యము
లేక
మానవునికి
ప్రాణము
లేదు.
ధర్మము
లేక
స్వరూపమే
కాదు.
కనుక
అనాది
కాలమునుండి
వేదము
సత్యం
వద
ధర్మం
చర
అని
ప్రబోధిస్తూ
వచ్చింది.
ఈనాడు
అశోక్
సింఘాల్
చెప్పాడు.
అందరు
శుద్ధమైన
బ్రహ్మచారులని.
ప్రశాంతి
నిలయమంతయు
పరిశుద్ధమైన
రీతిగా
విలువైన
రీతిగా
ఉన్నదని.
ఈ
బ్రహ్మచర్యమంటే
ఏమిటి?
వివాహము
చేసుకోకుండా
ఉండటమా
బ్రహ్మచర్యము.
కాదు.
కాదు.
నిరంతరము
బ్రహ్మలో
చరించే
మనసే
బ్రహ్మచర్యమని.
నిరంతరము
సర్వకాల
సర్వావస్థలయందు
బ్రహ్మములో
చరించాలి.
మనసు
బ్రహ్మములో
చరించేవాడే
బ్రహ్మచారి.
ఇది
పారమార్థిక
సత్యము.
అయితే
వ్యావహారిక
సత్యమందు
కూడా
దీనిని
మనం
అనుసరించాలి.
మన
నడతలు
సక్రమమైనవిగా
ఉండాలి.
మన
manners
చాలా
పవిత్రమైనదిగా
ఉండాలి.
మన
మాటలు
చాలా
విలువైనవిగా
ఉండాలి.
ఈ
విధమైన
సద్గుణములను
పోషించుకున్నప్పుడే
ఇతను
వ్యావహారికమైన
బ్రహ్మచారి
కాగలడు.
4
▾
Meaning
Keep
భగవంతుడు
ఒక్కడే
తండ్రి.
ఈ
జగత్తునందున్న
స్త్రీ
పురుషులు
అతని
బిడ్డలే.
కనుక
ఈ
విధమైన
పవిత్రమైన
భావము
ఉండినప్పుడే
ఇది
వ్యావహారిక
సత్యముగా
రూపొందుతుంది.
ప్రాతిభాసిక
సత్యము
ఎట్లా
ఉంటుంది?
పారమార్థికమందు,
వ్యావహారికమందు,
ప్రాతిభాసికమునందు
జలము,
చల్లదనము,
తియతనము
యీ
మూడింటియందు
ఉంటున్నవి.
కనుక
మానవుడు
పారమార్థికమునందుగాని,
వ్యావహారికమునందుగాని,
ప్రాతిభాసికమునందుగాని
తన
గుణములను
దైవత్వంగా
మార్చుకోటానికి
ప్రయత్నించాలి.
మనస్సునందు,
చిత్తమందు,
బుద్ధియందు,
అహమునందు
దివ్యమైన
ఆత్మతత్వము
ఉండినప్పుడే
నిజమైన
ప్రాకృతమైన
మానవత్వము.
ఈనాటి
మానవునకు
దయాదాక్షిణ్యమంటే
ఏమిటో
అర్థము
కాదు.
ఎదుటి
వ్యక్తిని
ఎంతైనా
బాధపెట్టుటకు
సిద్ధమవుతాడు
గాని
ఆ
బాధను
జూచి
జాలి
లేకుండా
ఉంటున్నాది
ఈ
కఠిన
హృదయమునకు.
బాధపడుతున్న
వ్యక్తిని
చూచి
హృదయము
కరగాలి.
అదే
నిజమైన
కరుణ.
అప్పుడే
మానవుడని
అనవచ్చు.
mankind
అన్నారు.
kindness
లేక
mankind
ఎట్లా
అవుతుంది.
మన
హృదయమందు
సర్వత్ర
సర్వవేళలందు
దయ
నిండి
ఉండాలి.
అనాది
కాలమునుండి
భారతదేశములో
ఇట్టి
పవిత్ర
సూక్తులను
ప్రచార
ప్రబోధలు
సల్పుతూ
వచ్చింది.
అయితే
ఇక్కడ
దోషము
ఏమిటి?
ప్రచార
ప్రబోధలు
సల్పుతూ
వచ్చారుగాని
ఆచారమునందు
లేకుండా
పోయింది.
ఆచరణలో
వచ్చినప్పుడే
ఆనందము
ఆవిర్భవిస్తుంది.
ఏ
మానవుడు
ఆచరణయందు
ప్రవేశపెట్టటం
లేదు.
ప్రతి
మానవుడు
తాను
చదివిన
గ్రంథములుగాని
లేక
విన్న
పవిత్ర
విషయములుగాని
తాను
అనుభవించిన
పవిత్ర
విషయములుగాని
ఆచరణలో
పెట్టి
దానిని
పదిమందికి
పంచటానికి
పూనుకోవాలి.
అన్ని
లేకపోయినా
ఏ
ఒకటి
రెండైనా
ఆచరణలో
పెట్టాలి.
ఒక
చిన్న
ఉదాహరణము.
విదేశములలో
ఒక
పడవ
నడిపే
వ్యక్తి
తాను
స్టీరింగు
ముందర
కూర్చున్నాడు.
ఏదో
అవసరం
వచ్చి
చిన్న
కుమారుని
పిలిచి
‘హలో
నాయనా
నీవు
ఇక్కడ
కూర్చో
నేను
త్వరలో
పోయి
వస్తాను’
అన్నాడు.
ఆ
అబ్బాయి
పుట్టినప్పటి
నుండి
ఆ
భాషలోనున్న
రామాయణము
చదువుకుంటూ
వచ్చాడు.
ఈ
సత్యమును
ఆ
పిల్లవాడు
గుర్తించుకున్నాడు.
ఈ
స్టీరింగు
దగ్గర
కూర్చున్నాడు.
కర్మవశాత్తు
పడవలో
నిప్పు
ప్రారంభమైంది.
పడవలో
నున్నవారు
Life
boats
వేసుకొని
అటు
ఇటు
తిరుగుతున్నారు.
ఎంతమందో
వచ్చి
ఆ
పిల్లవానిని
బ్రతిమాలారు.
నాయనా
నీవు
కూడా
ప్రాణము
రక్షించుకోమన్నారు.
‘నా
ప్రాణము
వదలుతానుగాని
నా
తండ్రి
ఆజ్ఞ
వదలను’
అన్నాడు.
5
▾
Meaning
Keep
నా
తండ్రి
ఇక్కడ
కూర్చోమన్నాడు.
కాబట్టి
దానిని
నేను
అనుసరిస్తున్నాను
అన్నాడు.
అట్లానే
ఉన్నాడు.
కాలిపోయింది.
అతనే
క్యాసాబియాంకా.
ఆ
పిల్లవాని
పేరు
సార్థకమై
నిల్చిపోయింది.
ప్రతి
మానవుడు
అంతో
ఇంతో
ఆచరణలో
పెట్టినప్పుడు
కదా
మానవత్వము
విలువ
కొంతవరకు
పెరుగుతుంది.
ఇది
మంచిదని
తెలిసినా
వారు
ఏమాత్రము
ఆచరణలో
పెట్టరు.
పదిమందికి
చెబుతారు
ఇది
చాలా
మంచిదని.
కాని
మంచిదని
చెప్పినప్పుడు
ఎందుకు
ఆచరించకూడదు.
చెప్పటం
కేవలం
కృత్రిమమైన
మాటలే.
హృదయములో
లేనప్పుడు
మాటలలో
ఎందుకు
వస్తుంది.
హృదయములో
లేనిది
మాటలలో
చెప్పించుకోటం
అసత్యమైనది.
మానవత్వమునకు
విరుద్ధమైనది.
కనుక
చెప్పినది
చేయాలి.
చేసినది
చెప్పాలి.
తలచినది
చేయాలి.
ఆవిధమైన
పరిస్థితి
లేకపోవటం
చేత
ఈనాటి
ప్రజలందు,
ఆధ్యాత్మిక
సంస్థలు
ఎంత
అభివృద్ధి
అవుతున్నప్పటికి,
అశాంతి
ఏమాత్రము
పోవటం
లేదు.
శాంతి
ఎక్కడనుండి
వస్తుంది
మనకు?
శాంతి
తనయందున్నది
గాని
బయటయందు
కాదు.
నీవు
సక్రమమైన
మార్గములో
నడచినప్పుడు
ఆ
శాంతి
నీకు
కనిపిస్తుంది.
నీవు
సత్యమైన
మార్గము
అవలంబించినప్పుడే
నీకు
శాంతి
లభిస్తుంది.
నీయందు
భగవంతుని
విశ్వాసము
ఉంటే
ఆ
శాంతి
నీయందు
ప్రతిబింబిస్తుంది.
కాని
విశ్వాసము
ఉండినట్లుగా
నటిస్తున్నారు.
అశాంతి
ఉండటానికి
కారణం
ఏమిటి?
విశ్వాసము
లేకపోవటమే.
ప్రతి
ఒక్కరు
మానవతా
విలువలంటే
సత్యధర్మశాంతిప్రేమలని
చిలుకపలుకుల
వలె
పలుకుతున్నారు.
ఒక్కటైనా
ఆచరణలో
పెడుతున్నారా?
ఏ
ఒక్కటైనా
ఆచరణలో
పెడుతున్నారా?
ఇంక
ఇలాంటి
వారికి
ప్రచార
ప్రబోధలు
చేసి
ప్రయోజనం
ఏమిటి?
దీని
వల్ల
కేవలము
సాయికి
అపకీర్తి
తెచ్చిన
వారౌతారు.
ఏ
ఒక్కటైనా
ఆచరణలో
పెడితే
సాయికి
ఆనందము.
ఇది
కష్టమైనది
కాదు.
సత్యము
చెప్పటం
సులభం.
ఉన్నది
ఉన్నట్లు
చెప్పటం
ఎంత
సులభము.
నా
చేతిలో
handkerchief
ఉందని
సులభముగా
చెప్పవచ్చు.
ఈ
hand
kerchief
చూపుతూ
నా
చేతిలో
పుష్పమాల
ఉన్నదంటే
ఎంత
అసత్యమవుతుంది.
సత్యము
చెప్పటం
ఎంత
సులభము.
అసత్యము
చెప్పాలంటేనే
కష్టము.
ఇంత
సులభమైన
మార్గమును
మానవుడు
ఈనాడు
మరచిపోతున్నాడు.
కష్టమైనదానినే
ప్రేమించి
అనుసరిస్తున్నాడు.
ఈనాటి
మానవత్వములో
ఇంత
దైవత్వము
ఉంటుండి
కూడను
ఇంత
విశాలత్వము
ఉంటుండి
కూడను
ఇంత
సంకుచిత
మార్గములో
జీవించటము
చాలా
ఆశ్చర్యము.
హృదయమంటే
ఈ
పాంచభౌతికమైన
గుండె
కాదు.
హృదయము
సర్వత్రా
ఉంటున్నది.
మన
దేహమును
అనంతముతో
హెచ్చవేసినప్పుడు
విరాటుస్వరూపుడై
పోతాడు.
6
▾
Meaning
Keep
మైండును
అనంతముతో
హెచ్చవేసినప్పుడు
భగవత్స్వరూపకముగా
మారిపోతుంది.
అతనినే
హిరణ్యగర్భుడన్నారు.
ఆత్మను
అనంతములో
హెచ్చవేసినప్పుడు
బ్రహ్మ.
బృహత్
సంబంధమైనది
బ్రహ్మ.
సర్వత్ర
వ్యాపించినది.
మనము
Love
ను
expand
చేయాలి.
expansion
of
love
is
life.
contraction
of
love
is
death.
మనం
expansion
love
పెట్టుకోవాలి.
ఎందుకంటె
దివ్యత్వమైన
ప్రేమ
ఉంటున్నాది.
అది
ఎప్పుడు
వ్యాపించిపోతు
ఉంటుంది.
వ్యాపించిపోయే
దివ్యమైన
భావాలు
మనలో
ఆవిర్భవించాలి.
కాని
ఈనాటి
మానవునకు
ఇట్టి
విశాల
భావములు
లేవు.
అంతా
సంకుచిత
భావాలే.
ఈ
సంకుచితము
పెట్టుకొని
విశాలత్వము
ఏవిధముగా
అర్థమవుతుంది.
మన
యొక్క
దివ్యత్వము
అనంతమైనదిగా
ఉంటున్నది.
అందుకోసమే
భగవంతుని
అనంతరూపాయనమః
అన్నారు.
అనంతమైన
జగత్తునందు
అనంతరూపుడై
ఉంటున్నాడు.
జడచైతన్యములందు
తానే
ఉంటున్నాడు.
సర్వత్రా
ఉండుటంచేత
సర్వవ్యాపకుడై
పోయాడు.
సర్వవ్యాపకత్వమునకే
బ్రహ్మ
అని
పేరు.
అది
కనిపించక
పోవచ్చును.
కనిపించవచ్చు.
అది
మన
అదృష్టముపై
ఆధారపడి
ఉంటుంది.
మీ
విశ్వాసములపై
ఆధారపడి
ఉంటుంది.
నిజముగా
మీరు
ఆ
విశ్వాసము
దృఢముగా
పెట్టుకుంటే
తప్పక
క్షణములోనే
కనిపిస్తాడు.
భగవంతుడు
ఎక్కడనుండో
దిగి
రావటం
లేదు.
ఇక్కడనుండి
ఎక్కడికో
వెళ్లిపోవటమనేది
లేదు.
భగవంతునిది
రాకపోకలు
లేని
స్థితి.
తాను
రాడు
తాను
ఎక్కడికి
పోడు.
సర్వత్రా
ఉంటున్నాడు.
అయితే
కొంతమందికి
ఆ
దివ్యత్వము
నుండి
ఆవిర్భవించిన
శక్తి
వల్ల
దివ్యత్వమునే
మరపింప
చేస్తుంది.
సూర్యుని
వలన
అనేక
మేఘములుద్భవిస్తాయి.
ఈ
మేఘములకు
మూలకారణము
సూర్యుడే.
కాని
సూర్యుని
నుండి
ఆవిర్భవించిన
మేఘములు
సూర్యునే
మరుగు
పరుస్తున్నాయి.
ఇంత
మాత్రము
చేత
సూర్యుడు
కోపగిస్తాడా?
కొంతసేపు
ఓపిక
పడితే
మేఘములు
కదలిపోతాయి.
సూర్యుడు
యథారీతిగా
ప్రకాశిస్తాడు.
ప్రతి
ఒక్కటి
దైవమునుండి
పుడుతున్నాయి.
పుట్టటము,
పెరగటము,
లయము
కావటము
మూడింటికి
దైవమే
మూలకారణము.
ప్రతి
పదార్థమునందు
దైవసంబంధము
ఏర్పడి
ఉంది.
ప్రతి
విషయములో
మనం
దైవత్వం
చింతించాలి.
దైవము
కోరేది
రెండే
రెండు
సత్యము,
ధర్మము.
ఈ
రెండింటియందే
ఎంతైనా
ఉంటున్నాది.
కరుణ,
దయ,
దాక్షిణ్యము
అందులోనే
చేరి
ఉంటున్నవి.
7
▾
Meaning
Keep
ముఖ్యమైనవి
రెండే
మిగిలినవి
ఇందులోని
అంగములే.
మనం
దయలో
ఉండాలి.
ప్రేమకు
పర్యాయపదమే
దయ.
ప్రేమను
దయ
అంటారు.
ప్రేమ
మనలో
ఉన్నప్పుడు
ఏ
ద్వేషము
రాదు.
అసలు
మానవుని
హింసిస్తున్నవి
మూడే.
కామ,
క్రోధ
లోభములే.
కామము
మనము
చేసే
కర్మమార్గమును
భస్మము
చేస్తున్నది.
లోభము
మన
భక్తిని
నశింపచేస్తున్నది.
క్రోధము
పూర్తి
నశింపచేస్తున్నది.
మానవునియందు
ఈ
కామ
క్రోధ
లోభములు
ఉండటంచేత
కర్మ
ఉపాసన
జ్ఞానము
పూరిమంట
కలిపి
వేస్తున్నాయి.
మానవునికి
మంచి
భావములు
రాకుండా
పోవటానికి
ఇదే
మూలకారణము.
ఎందుకంటె
కామ
క్రోధ
లోభములు
మూడు
ఉండటంచేత
మంచి
కర్మలు
చేయలేకపోతున్నాం.
దైవోపాసనలో
పాల్గొనలేకపోతున్నాం.
జ్ఞానమును
సంరక్షించుకోలేకపోతున్నాం.
అట్టి
వాటిని
మనం
ఎందుకు
ప్రవేశపెట్టుకోవాలి.
మనకు
ద్రోహము
చేసే
వాటిని
ఎందుకు
పెంచుకోవాలి?
మొట్టమొదట
మానవుడు
ఈ
మూడింటిని
దూరము
చెయ్యాలి.
ప్రతి
మానవునికి
కొన్ని
ఆశలుండాలి.
మితిమీరి
పోకూడదు.
మనము
దుర్గుణములు
దూరము
చేసుకోటానికి
దైవచింతన
ఎక్కువ
చేయాలి.
ఈ
విశాల
ప్రపంచమందు
విశాల
హృదయులుగా
ఉండాలి.
సముద్రమంత
హృదయముండాలి.
విశ్వానికి
సముద్రమే
హృదయము.
అందరియందు
ఉన్నది
మానససరోవరము.
అది
కూడా
గొప్ప
విశాలమైనదిగా
ఉండాలి.
విశాల
హృదయము
లేనివాడు
మానవుడే
కాదు.
సంకుచిత
భావములకు
ఏమాత్రము
అవకాశము
ఇవ్వకూడదు.
ఒకవేళ
దోషములు
కలుగవచ్చు.
దీనిని
మనం
లెక్క
చేయకూడదు.
ప్రేమను
మాత్రం
వదలుకోకూడదు.
ప్రేమను
ప్రధానంగా
జీవితములో
ఉంచుకున్నప్పుడు
దేనినైనా
మనం
సాధించవచ్చు.
మానవుడు
విశాల
హృదయుడు
కావాలి.
మానవునియందు
ఉద్భవించే
సంకల్పము
కూడా
గొప్ప
ఆదర్శవంతమైన
సంకల్పముగా
ఉంటుండాలి.
అల్ప
సంకల్పములను
మనము
ఏమాత్రము
అభివృద్ధి
చేసుకోకూడదు.
అనంతమైన
ఆదర్శములను
తీసుకోవాలి.
ఇట్టి
ఆదర్శములు
ఆవ్యక్తి
పోయినా
ఆదర్శము
నిల్చి
ఉంటుంది.
మంచి
ఆదర్శమునే
చిరంజీవి
అన్నారు.
ఎప్పటికి
నశించేది
కాదు.
దేహము
నశించినా
గుణము
నశించేది
కాదు.
అట్టి
పవిత్రమైన
గుణములు
మనము
అభివృద్ధిగావించుకొనుటకు
ప్రయత్నించాలి.
ప్రేమస్వరూపులారా!
మీ
అందరియందు
ప్రేమ
ఉన్నది.
ఆ
ప్రేమను
పరిమితములో
పెట్టుకుంటున్నారు.
కాదు
కాదు.
విశాలము
చేయాలి.
ఆ
ప్రేమను
ఎంత
విశాలము
చేసుకుంటావో
ఎంత
పవిత్రముగా
ఉంచుకుంటావో
అంత
నీ
జీవితము
ఆదర్శముగా
ఉంటుంది.
8
▾
Meaning
Keep
His poems 277
Also in his talks
(10)
29 May 1979
Cross the Ocean of Saṁsāra in the Boat of Jñāna
27 June 1989
Prema Is the Form of God
16 August 1996
‘Love all, worship all’
16 July 2000
Prema Is God, God Is Prema
16 July 2001
Immortality is attained through Prema alone
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
22 November 2003
True Prema stands only when selfishness is given up
21 March 2004
I am you, you are I
13 April 2005
Those who believe in difference cannot attain divinity
14 January 2006
He alone is truly educated who knows the Ātma within
దైవప్రేమ
అన్నింటికంటె
ముఖ్యమైన
ప్రేమ.
ప్రపంచములో
శారీరకముగా
వచ్చాము
కనుక
శారీరక
ప్రేమలుంటాయి.
తల్లి
తండ్రి
సోదరుడు,
సోదరి
అన్న
శరీరముతో
ఉద్భవించినవి.
ఇవన్నీ
మధ్యలో
వచ్చి
మధ్యలోనే
పోతుంటాయి.
ఇవన్నీ
కదలిపోయే
మేఘములు.
దైవము
నుండి
వచ్చినది
పెర్మనెంటు.
ఆ
ప్రేమను
ఎంత
అభివృద్ధిగావించుకుంటామో
అంత
అభివృద్ధి
అవుతుంది.
ప్రేమను
అభివృద్ధిగావించుకోటం
వలన
మనకు
లభించేది
ఏమిటి?
అదే
ఆనందము.
ప్రేమను
ఎంత
అభివృద్ధి
చేస్తావో
ఆనందము
కూడా
అంత
అభివృద్ధి
అవుతుంది.
ప్రేమ
ఎంత
సంకుచితమవుతుందో
నీ
ఆనందము
కూడా
అంత
సంకుచితముగా
ఉంటుంది.
నిరంతరము
మనము
ఆనందము
అనుభవించాలనుకుంటే
ప్రేమను
పెంచుకోవాలి.
ప్రేమ
రూపము
బ్రహ్మంబు
ప్రేమమయము
ప్రేమ
ప్రేమతో
సంధింప
నీమమగును
కాన
ప్రేమను
గట్టిగా
కలిగియున్న
అద్వితీయము
సాధింప
అర్హుడగును.
అదే
అద్వితీయము.
ప్రేమను
పెంచుకుంటే
ఏకాత్మభావమును
విశ్వసించినవారౌతావు.
అదే
సర్వత్రా
ఉండినది.
దీనిని
మనం
సాధించాలి.
లోకసంబంధమైన
విద్యలు
నేర్చుకోవచ్చు.
ఇవన్నీ
అప్పటికప్పుడు
లోకములో
ఉపయోగించుకొనేవి.
వ్యావహారిక
విద్యలు
ఇవి.
పారమార్థిక
విద్యలో
ప్రేమ
ప్రధానమైన
ప్రాణము.
ప్రేమను
పెంచుకోండి.
మనలో
దయాప్రేమలు
అభివృద్ధిగావించుకున్నప్పుడే
మనము
పురుషోత్తములుగా
మారతాము.
Previous
←
Develop Your Faith With Love For God
Next
Become Deserving of God's Love
→