Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2007 · The Lakṣmī of the Home
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Lakṣmī of the Home
27 February 2007
1
▾
Meaning
Keep
His poems 300
Also in his talks
(8)
22 May 1978
The Great Task of the Guru
22 November 1989
Conduct Yourselves with Humility and Obedience
19 October 1996
When the Home Is Set Right, the World Is Set Right
19 November 1996
No Prema in the World Surpasses the Prema of God
19 April 1998
The holy power of woman is the very safeguard of Bhārata
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
19 November 2002
Setting the Home in Order: The Housewife's First Duty
21 July 2008
Parents and teachers must give children an exemplary life
ఉద్యోగములు
చేయనువిదలందరు
పోవ
గృహ
కృత్యములుదీర్చు
గృహిణులెవరు?
ఆలుమగలిరువురు
ఆఫీసులకుబోవ
ఇంటి
పనులుజేయు
ఇంతులెవరు?
పర
బాలురకు
నేర్ప
పాఠశాలలకేగ
తమ
బాలురకు
నేర్పు
తల్లులెవరు?
పుస్తకాల్
చేబట్టి
పురుషుల
వలెబోవ
వంటయింటిని
దిద్దు
వనితలెవరు?
డబ్బు
వలన
కలుగు
యిబ్బంది
తీరిన
ఇంటిలోని
కొరతలెంతయుండు
సుఖము
చూడబోవ
సున్నయేయుద్యోగ
పదవియందున్న
పడతికెపుడు.
తల్లి,
తండ్రి,
గురువు,
దైవము
సర్వమూ
మీరే
అని
మీరు
పాడారు.
తల్లి,
తండ్రి,
గురువు,
దైవముయొక్క
ఆజ్ఞ
శిరసావహించాలి.
ఇంతవరకు
మీరు
విద్యార్థులు.
కొంత
కాలము
తరువాత
మీరు
గృహస్థులౌతారు.
గృహిణిగా
ఏవిధంగా
మెలగాలి?
మీరు
పూర్తి
చిన్నపిల్లలుగా
వున్నారు.
అర్థం
కాదు.
భర్త
ఆఫీసుకు
పోతాడు.
భార్య
ఉద్యోగము
చేయటానికి
వెడుతుంది.
ఇంటి
పనులు
చూచేది
ఎవరు?
అది
కూడా
మీరు
యోచన
చేయాలి.
కుటుంబములో
చాలా
ఖర్చులు
వుంటాయి.
కనుక,
నేనుకూడా
ఉద్యోగము
చేస్తాను
అంటారు.
ఉద్యోగము
చేయు
ఉవిదకు
సుఖమన్నది
సున్న.
ఎందుకంటే,
ఇంటిలో
పనిమనుష్యులు
వుంటుంటారు.
వారు
ఏ
సామానైనా
తీసుకుపోవచ్చు.
గృహలక్ష్మి
అని
పేరు
పెట్టినందుకు
గృహమునకు
మాష్టరుగానే
వుండాలి.
కనుక,
స్త్రీలు
ఎంత
చదువుకున్నప్పటికీ
వారికి
సుఖము
లేదు.
మీరు
చదువుకోండి.
మీరు
చదివి
మీ
పిల్లలకు
బోధించాలి.
నీ
ఇంటిని
నీవు
సరిదిద్దుకోవాలి.
మీరు
చదివిన
చదువు
మీ
పిల్లలకు
చక్కగా
నేర్పించాలి.
‘పర
బాలలకు
నేర్ప
పాఠశాలలకేగ
తమ
బాలురకు
నేర్పుతల్లులెవరు?’
కనుక,
తమ
పిల్లలకు
తాము
చెప్పుకోవాలి.
మనము
చదివే
చదువంతా
మన
కుటుంబ
క్షేమానికి
వినియోగించుకోవాలి.
కనుక,
స్త్రీలందరూ
కూడా
సరియైన
రీతిలో
తమ
పిల్లలను
తాము
పోషించుకోటానికి
తగిన
ప్రయత్నము
చేయాలి.
మన
దేశము
పేరేమి?
భరతమాత.
భరతమాత
పేరు
పిల్లలు,
మీ
పిల్లలు
చక్కగా
కాపాడుకోవాలి.
మదర్ల్యాండ్
అంటారు.
ఫాదర్ల్యాండ్
అనరు.
తల్లి
పిల్లలకు
బాగా
నేర్పించాలి.
పిల్లలకు
జబ్బు
చేస్తే,
భర్త
ఆఫీసుకు
వెడతాడు,
తల్లి
దగ్గరుండి
పిల్లను
చూచుకోవాలి.
ఈమెకూడా
పుస్తకాలు
పట్టుకొని
స్కూలుకు
పోతే
పిల్లలను
చూచేవారెవరు?
కొంతమంది,
పిల్లలు
లేనివారు
ఆఫీసులకు
పోవచ్చు.
తమ
పిల్లల
కంటె
గొప్ప
విద్యార్థులు
మరొకరు
లేరు.
మీ
పిల్లలకు
మీరు
సరైన
బుద్ధులు
నేర్పించాలి.
సరైన
చదువులు
నేర్పించాలి.
సత్ప్రవర్తన,
సద్బుద్ధులు
మొట్టమొదట
పిల్లలకు
నేర్పించాలి.
మీకు
క్రమశిక్షణ
చక్కగా
లేకపోతే,
మీ
అమ్మ
చెంపమీద
కొట్టినట్లుగా,
మీ
పిల్లలు
సరిలేనప్పుడు
చక్కని
బుద్ధి
చెప్పాలి.
తల్లికి
యిచ్చిన
విలువ
మరెవ్వరికీ
యివ్వలేదు.
ఇతర
దేశాలలో
చెప్పిననూ
మనవారు
అట్లా
చెప్పరు.
భరత
దేశమును
మదర్ల్యాండ్
అంటారు.
జర్మనీ,
జపాన్,
ఇంగ్లాండ్
ఈ
దేశములకు
తల్లి
పేరు
ముందు
రాదు.
ఫాదర్ల్యాండ్
అంటారు.
భారతదేశమునే
మాతృభూమి
అంటారు.
తల్లి
అయినప్పుడు
అన్ని
దేశములకు
చక్కని
గుణము
నేర్పాలి.
HINDU.
H-humanity,
నేను
మానవుడను,
నేను
డాగ్
కాదు,
పిగ్
కాదు,
జంతువు
కాదు.
I-
individual,
N-nationality,
individual
నుండి
nationality
కి
పోవాలి.
D-divinity,
U-unity.
సరైన
రీతిలో
ఐకమత్యముండాలి.
మొట్టమొదట
యూనిటీ
వుండే
డివినిటీ
ఏర్పడిపోతుంది.
డివినిటీ
వుంటే
నేషన్
అంతా
ఒక్కటిగా
అయిపోతుంది.
డివైన్‌ను
చూడాలంటే
ఐకమత్యము
కావాలి.
కనుక,
మీరందరూ
ఐకమత్యముతో
వుండాలి.
అయితే
మగ,
ఆడ
కాదు.
మగవారు
మగవారు,
ఆడవారు
ఆడవారు.
వివాహమైన
తరువాత
ఇద్దరూ
ఏకం
కావాలి.
ఇద్దరూ
ఏకమైపోయి
పిల్లలను
పోషించాలి.
2
▾
Meaning
Keep
పిల్లలనుకూడ
ఎట్లా
పోషించాలి?
సత్ప్రవర్తన,
కర్తవ్యపాలన.
అప్పుడు
ఆపిల్లలు
చక్కగా
తయారౌతారు.
ఆదర్శ
బాలురుగా,
ఆదర్శ
బాలికలుగా
మీరందరూ
తయారు
కావాలి.
కేవలము
పరీక్షలకు
పోయి
ఫస్ట్
క్లాసు
మార్కులు
వచ్చాయి
అని
చెప్పినంత
మాత్రమున
ప్రయోజనము
లేదు.
పుస్తకాలు
చదువుతారు.
చదివినదంతా
అక్కడికిపోయి
వ్రాస్తారు.
మొట్టమొదట
ఈ
పుస్తకము
లోపల
వ్రాసుకున్నదంతా
మస్తకములో
చేర్చాలి.
మైండ్
నుండి
హ్యాండ్‌కు
రావాలి.
హ్యాండ్
నుండి
క్రియలో
చేరాలి.
కనుక,
మొట్టమొదట
చదివిన
చదువును
సరైన
రీతిలో
హృదయములో
నిల్పుకోవాలి.
దేనికోసం?
భవిష్యత్తు
కోసం.
past
is
past,
will
not
come
back.
future
is
not
sure.
రేపటికి
వుంటామని
మనకు
ఎట్లా
తెలుస్తుంది?
present
is
not
ordinary
present,
it
is
omni
present.
వర్తమానములో
మనము
మంచిగా
వున్నప్పుడే
భవిష్యత్తులో
మంచిగా
వుంటాము.
మనము
ఏవిధముగా
వుంటే
బాగుంటుందో
ఆవిధముగా
మనము
పేరును
సంపాయించాలి.
పురుషుడు
అనుకున్నప్పుడు
పురుషుడుగా
ప్రవర్తించాలి.
స్త్రీలనుకున్నప్పుడు
స్త్రీలాగే
మనము
ప్రవర్తించాలి.
చదువుకున్నది
చక్కగా
ప్రజలకు,
సమాజమునకు
అందించాలి.
సమాజము
బాగుపడితే
దేశము
బాగుపడుతుంది.
దేశము
బాగుపడితే
ప్రపంచము
బాగుపడుతుంది.
కనుక,
మొట్టమొదట
మనము
సమాజమును
మార్చాలి.
సమాజమును
మార్చే
పూర్వము
నీకు
నీవు
మారాలి.
first
self,
next
help.
నీకు
నీవు
మంచిగా
వుంటుండి.
మంచి
పిల్లవాడు,
మంచి
గుణవంతుడు,
మంచి
ప్రవర్తన
కలవాడు,
మంచి
ఆదర్శము
నిరూపించేవాడు
అనే
నమ్మకము
నీలో
రావాలి.
అంతేగాని
better
కాకూడదని
back
కి
పోతే
bad.
చెడ్డగా
వుండకూడదు.
మంచిగా
వుండాలి.
చెడ్డ
చూపుగా
వుండకూడదు.
చెడ్డ
చెప్పకూడదు.
చెడ్డ
వినకూడదు.
చెడ్డను
తలచకూడదు.
మంచియే
తలచాలి.
తలంపు
హృదయములోనే
వుండాలి
అని
పాడారు.
హృదయములోనున్న
భగవంతుడు
హృదయములోనుండి
ప్రతిబింబించాలి.
భగవంతునికి
రామ,
కృష్ణ,
గోవింద,
నారాయణ
అని
పేర్లు
పెట్టారు.
అందుకోసమే
తల్లితండ్రులు
గుర్తుకోసమని
పేర్లు
పెట్టుకుంటారు.
కానీ,
నిజంగా
చూస్తే
ఏ
పేరూ
లేదు.
ఏమంటారు?
ఆత్మ.
అందుకనే
ఏ
పేర్లూ
పెట్టకుండా
ఆత్మస్వరూపుడు
అంటారు
భగవంతుని.
జీవాత్మ,
పరమాత్మ
ఏకత్వము
వుండాలి.
ఆత్మగా
భావించాలి.
ఏ
పేర్లూ
పెట్టకూడదు.
ఇప్పుడు
ఒక
అమ్మాయి
వుంది.
ఆమె
పేరు
లక్ష్మి.
కొంతకాలమైన
తరువాత
నారాయణ
అనే
వానిని
పెండ్లి
చేసుకుంటుంది.
ఆమె
స్నేహితురాలికి
జాబు
వ్రాస్తూ
లక్ష్మీనారాయణ
అని
సంతకం
చేస్తుంది.
భర్త
నారాయణ
పేరు
తరువాత
రావాలి.
స్నేహితురాలి
భర్త
చూచాడు
ఈ
జాబు.
చదువుకున్నప్పుడు
యిలా
వుండేవారము,
అలా
వుండేవారము
అని
వ్రాసింది.
మనమంతా
ఒకే
తట్టలో
భోజనం
చేశాం.
ఒకే
మంచముపై
పడుకున్నాం.
ఒకే
మాటపైన
నిలిచాం
అని
వ్రాస్తూ
పోయింది.
భర్తకు
డౌట్సు
వస్తున్నాయి.
ఎవరీ
నారాయణ?
ఒకే
తట్టలో
తిన్నారు.
భర్త
అంతా
చదివాడు.
భార్యను
బాగా
కొట్టాడు.
‘ఈ
నారాయణ
ఎవరు?
నువ్వు
బయటకు
పో’
అన్నాడు.
ఆమె
చాలా
బాధపడింది.
నేను
ఏ
పాపము
ఎరుగను.
నేను
ఏ
తప్పూ
చేయలేదే.
ఎవరూ
నాకు
స్నేహితులు
లేరే.
అలాంటి
సమయంలో
నన్ను
యింత
బాధపెట్టమెందుకు?
అని
ఏడ్చుకుంటూ
కూర్చున్నాది.
ఈలోగా
ఆమె
స్నేహితురాలు
వచ్చింది.
అక్కడ
శ్రీమతి
లక్ష్మీనారాయణ
అని
వ్రాయలేదు.
లక్ష్మీనారాయణ
అని
వ్రాసావు.
దీనితో
డౌట్సు
వచ్చాయి.
ఆయన
పేరు
నారాయణ.
తన
పేరు
లక్ష్మి.
కనుక,
లక్ష్మీనారాయణ
అని
పేరు
పెట్టుకొన్నాను.
అప్పుడు
ఆయన
చాలా
బాధ
పడ్డాడు.
నిష్కారణంగా
భార్యను
హింసించానని
బాధపడ్డాడు.
ఈవిధంగా
వివాహమైన
తరువాత
కొంతమంది
పేర్లు
మార్చుకుంటారు.
వివాహము
కానప్పుడు
పేరుకు
ముందు
కుమారి
అని
పెట్టుకోవాలి.
వివాహమైన
తరువాత
శ్రీమతి
అని
పెట్టుకోవాలి.
అప్పుడు
వివాహమైందని
తెలుస్తుంది.
పేర్లుకూడా
చాలా
జాగ్రత్తగా
వుపయోగించాలి.
విద్యార్థులు
మంచి
మాటలతో,
పాటలతో
పరీక్షలలో
మంచి
మార్కులు
తెచ్చుకోవాలి.
పంచభూతములను
సరైన
రీతిలో
పెట్టుకోవాలి.
మంచిని
చూడాలి.
మంచిని
చూడరు
పిల్లలెప్పుడూ
చెడ్డనే
చూస్తుంటారు.
పదిమంది
మాట్లాడుతుంటే
ఏమిటని
వింటారు.
ఈవిధంగా
చెడ్డ
మాటలు
వినకూడదు.
చెడ్డ
చూపు
చూడకూడదు.
చెడ్డ
సంగము
చేరకూడదు.
కంపెనీ
ఎటువంటిదో
వ్యక్తి
అలాంటివాడైపోతాడు.
కనుక,
ఆవిధంగా
కాకూడదు.
నీ
కంపెనీ
భగవంతుడే.
పేరు
గాని,
చూపులుగానీ,
మాటలుగానీ
చక్కగా
వుండాలి.
అప్పుడే
husband
'good
wife'
అంటాడు.
లేకపోతే
ఇరవైనాలుగు
గంటలూ
లడాయి.
వైవాహిక
జీవితము
ఆనందంగా
వుండాలనుకుంటే
ఇద్దరూ
కలసిమెలసి
వుండాలి.
ఇద్దరూ
మంచిని
చూడాలి.
మంచిని
వినాలి.
భర్తగా
నీవు
సత్యం
చెప్పు.
ఆమెకూడా
వింటుంది.
‘కాలేజీ
వదిలిపెడితే
ఎక్కడికి
వెళ్లావు?
ఏమి
చేశావు?
ఎవరిని
చూచావు?
ఎవరింటికి
వెళ్లావు?’
అని
అన్ని
డౌట్సు
వస్తుంటాయి.
ఆమెకు
రానివ్వకూడదు.
నీకూ
డౌట్సు
రాకూడదు.
ఒకసారి
డౌటు
వస్తే
ఫైటింగ్
వచ్చేస్తుంది.
భార్యాభర్తలు
డౌట్సుకు
అవకాశము
యేమాత్రమూ
యివ్వకూడదు.
3
▾
Meaning
Keep
చదివిన
చదువును
చక్కగా
వినియోగించాలి.
మంచి
రాయల్రోడ్డులో
నడవాలి.
జరిగింది
జరిగినట్లుగా
చెప్పాలి.
అప్పుడు
నమ్మకము
యేర్పడుతుంది
భార్యకు.
ఎందుకు
ఆలస్యమైందంటే,
‘అక్కడకు
పోయాను,
ఇక్కడకు
పోయాను’
అని
చెబుతే
ఆమెకు
డౌట్
వస్తుంది.
సినీమాకు
పోయానంటావు.
‘ఎవరితో
పోయుంటిరి?
నీవెంట
ఎవరు
వచ్చారు?’
అనే
ప్రశ్నలు
వస్తాయి.
నిజం
చెప్పు.
మనయొక్క
ప్రవర్తన
సరైన
రీతిలో
అందరికీ
ఆదర్శముగా
వుండాలి.
ఇంటికి
ఎవరైనా
బంధువులు
వచ్చారంటే
వారితో
ఎంతవరకో
అంతవరకే
మాట్లాడాలి.
అప్పుడే
good
boys,
good
girls
గా
తయారౌతారు.
ఎం.ఎ,
ఎం.కాం,
పి.హెడి,
డిగ్రీలు
పెట్టుకొని
ఏమి
ప్రయోజనం?
ఈ
డిగ్రీలు
కాదు
ముఖ్యము.
ఆత్మగౌరవాన్ని
కాపాడుకొనే
డిగ్రీ
సంపాదించాలి.
అది
నిజమైన
డిగ్రీ.
12వ
తరగతి
అయిపోతున్నాది.
డిగ్రీ
క్లాసులకు
పోతారు.
అక్కడ
ఏదో
నోట్సు
చెబుతారు.
నీవు
వ్రాసుకోలేదు.
క్లాసుమీట్
దగ్గర
తీసుకొని
యింటికి
తీసుకు
వస్తావు.
భర్త
నోటుపుస్తకము
చూస్తాడు.
దానిపై
బాయ్
పేరుంటుంది.
ఎవరితను
అని
డౌట్సు
వస్తాయి.
ఈవిధముగా
డౌట్సు
పెరిగి
జీవితము
నాశనమౌతుంది.
స్వామి
చెప్పిన
మాటలు
విని
చక్కగా
సత్యము
చెప్పండి.
బయట
ఏవిధంగా
ప్రవర్తించావో
అదే
ప్రవర్తన
యింటిదగ్గర
చెప్పు.
అప్పుడే
నీ
హృదయము
శుద్ధి
అవుతుంది.
మనస్సుకు
శాంతి
కల్గుతుంది.
అట్లుకాకుండా
ఒకటి
జరుగుతే
యింకొకటి
చెబుతే
చాలా
డౌట్సు
వస్తాయి.
డౌట్సుకు
మూలకారణమిదే.
ఈ
కల్పనల
వల్ల
వస్తాయి.
ఎట్టి
సంబంధములూ
కలపకూడదు.
Tell
me
your
company,
I
shall
tell
you
what
you
are.
నీ
company
ఎలాంటిదో
నీవు
చెప్పు,
నీవు
ఎలాంటి
వాడవో
నేను
చెబుతాను.
మనం
చెడ్డ
కంపెనీలో
వుంటే,
త్రాగుబోతుతో
వుంటే
మనకు
అదే
అలవాటైపోతుంది.
ముందు
ఇంటికి
పోతూనే
వేళ్లు
చూస్తుంది.
నీవు
స్మోక్
చేశావేమోనని.
కనుక,
పరిశుద్ధంగా
పోవాలి.
అప్పుడు
ఇరువురికీ
ఏవిధమైన
అభిప్రాయబేధాలూ
రావు.
అభిప్రాయబేధం
వస్తే
ఆమె
వారింటికి
వెళ్లిపోతుంది.
కనుక,
ఈవిధమైనవి
రాకుండా
చూచుకోండి.
చదువుకంటే
గుణము
ప్రధానము.
చదువు
కంటె
మొరాలిటీ
చాలా
గొప్పది.
మొరాలిటీని
కాపాడుకోటానికి
మనం
తగిన
ప్రయత్నం
చేయాలి.
ఇవన్నీ
మీరు
మనస్సులో
పెట్టుకొని
నడచుకుంటూ
రండి.
ఆవిధంగా
నడచుకుంటే
ఇరువురే
కాదు,
దేశముకూడా
బాగుపడుతుంది.
సమాజము
బాగుపడుతుంది.
సమాజము
బాగుపడితే
దేశము
బాగుపడుతుంది.
దేశము
బాగుపడితే
ప్రపంచము
బాగుపడుతుంది.
కనుక,
మొట్టమొదట
సమాజమునకు
తగిన
ఆదర్శమును
చూపించాలి.
పరీక్షలు
బాగా
వ్రాసి
మంచి
క్లాసులు
తెచ్చుకోండి.
అదే
స్వామికి
ఆనందము.
జీవితమంతా
స్వామి
వెంటనే,
ఇంటనే,
కంటనే
వుంటాడు.
Previous
←
See the divinity of Īśvara in all
Next
Strive for the progress of the villages!
→