The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 239

Poem 239

యం.యేలు బియ్యేలు ప్యాసయి వచ్చియుపేరుగాంచిన పెద్దవారలైనసంపదలుండియు సద్దాన పరులయిపుడమి కీర్తి గనిన పుణ్యులైనఆయురారోగ్యంబు లనవరతమునుండిపరిపూర్ణ బలులగు వారలైనసతతంబు తపములు జపములు సేయుచువేదంబులను నేర్పు విప్రులైనసాటిరారు భక్తులకు నేనాటికైనదైవమును కొల్వనిదె రాదు భక్తిదైవ భక్తులు కానిదే రాదు ముక్తిఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

In plain words

Though they have passed as M.A.s and B.A.s and come out, though they be great men who have won a name, though they have wealth and are given to good charity, though they be men of merit who have won fame on earth, though they have long life and health without end and be men of perfect strength, though, ever doing tapas and japa, they be brahmins who teach the Vedas, they are never, at any time, the equals of the devotees. Without worshipping God, Bhakti does not come; without being devotees of God, Mukti does not come. What more than this shall I make known, O members of this assembly, counted among the good and the virtuous!

Also read

ఎమ్మేలు బియ్యేలు ఏర్పడ చదివియు పేరుగాంచిన పెద్దవారలైన సంపదలుండియు సద్దానపరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యంబు లనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారలైన సతతంబు జపములు చాలంగ చేయుచు వేదములను నేర్పు విప్రులైన సాటిరారు భక్తులకు ఏనాటికైన దైవమును కొల్వనిదె రాదు భక్తి యింతకన్నను వేరెద్ది ఎఱుకపరతు సాధు సద్గుణగణ్యులౌ విద్యార్థులార.

యం.యేలు బియ్యేలు ప్యాసయి వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైన సంపదలుండియు సద్దానపరులౌచు పుడమి కీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యము లనవరతంబుండి పరిపూర్ణబలులగు వారలైన జపములు తపములు సతతంబు సేయుచు వేదంబులను నేర్పు విప్రులైన సాటిరారు భక్తులకు నేనాటికైన దైవమును గొల్వనిదె రాదు భక్తి దైవ భక్తులు కానిదే రాదు ముక్తి ఇంతకన్నను వేరెద్ది యెరుకపరతు సాధుసద్గుణగణ్యులౌ విద్యార్థులారా!