Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Your Heart Alone Is My Home
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Your Heart Alone Is My Home
22 August 1989
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
మానవసమాజములో
ప్రధానముగా
వుండవలసినది
మానవత్వము.
ఎన్ని
విద్యలు
నేర్చినా,
ఎంతటి
పదవులు
యేలినా,
ఎంతటి
ధన
కనక
వస్తు
వాహనాదులు
ఆర్జించినప్పటికిని
మానవతాగుణము
లేకున్న
యివన్నీ
నిరుపయోగమే.
మానవత్వమనేది
మనము
అర్థము
చేసుకోటమే
ప్రథమ
కర్తవ్యము.
ఈనాటి
మానవుడు
ఆకార
మానవుని
వలె
గోచరిస్తున్నాడేగాని
ఆచార
విచారములు
శూన్యమైనవి.
ఆకార
మానవునివల్ల
లోకానికి
యేమాత్రము
ప్రయోజనము
వుండదు.
ఆచార
విచారములు
అత్యవసరమే.
ఇట్టి
మానవతనే
కోల్పోయిన
సమాజము
దేశము
కూడను
అనేక
సంస్కారములు
పాడు
చేసుకోవలసి
వస్తుంది.
జంతూనాం
నరజన్మ
దుర్లభమ్.
ఇట్టి
పవిత్రమైన
మానవ
జన్మ
మనకు
ప్రాప్తించియు
దీనిని
సరియైన
రీతిగా
వినియోగించుకొనలేకపోయిన,
దీనిని
సరిగా
అర్థము
చేసుకోలేకపోయిన
మన
మానవత్వమే
వ్యర్థమై
పోతుంది.
కనుక
మానవునిగా
జీవించి,
మానవునిగా
జన్మించి,
మానవునిగా
ప్రవర్తించటము
మన
ప్రధాన
కర్తవ్యము.
పశువు
పశువుగా
జన్మించి
పశువుగా
ప్రవర్తించటము
అది
దాని
సహజము.
కాని
మానవునిగా
జన్మించి
పశువుగా
ప్రవర్తించటము
దీనికి
విరుద్ధమైన
మార్గము.
కనుక
మానవునిగా
జన్మించినవాడు
మానవునిగా
ప్రవర్తించి
మానవునిగా
దివ్యత్వాన్ని
అనుభవించి
దైవత్వములో
అంకితము
కావటం
ప్రధాన
కర్తవ్యము.
ఇదియే
లక్ష్యము.
ఐతే
యీనాటి
మానవుడు
యింతవరకు
యోచించటానికి
ప్రయత్నించటం
లేదు.
మానవుడంటే
యేమిటో
కూడను
అర్థము
చేసుకోటం
లేదు.
మానవతా
గుణములంటే
యేమిటో
విచారించటం
లేదు.
కారణము
యీ
భౌతికమైన,
లౌకికమైన,
తాత్కాలికమైన
క్షణభంగురమైన
విషయములకు
లోబడి
దివ్యమైన
పవిత్రమైన
నవ్యత్వమైన
ఆత్మతత్వమును
కేవలము
విమర్శిస్తూ
వుంటాడు.
ఇవన్నీ
భౌతికమైన
సుఖసంతోషములు
తాత్కాలికములు.
యివి
అశాశ్వతములు.
మానవసమాజములో
ప్రేమ
బీజములు
పెంచి
సహనప్రసూనములు
వికసింపజేసి
శాంతిఫలములు
సమాజమున
కందించుటయే
మానవునియొక్క
ప్రధాన
లక్ష్యము.
కనుక
యీనాడు
మానవసమాజములో
శాంతిభద్రతలు
క్షీణించిపోయినవి.
శాంతి
అంటే
యేమిటో
కూడను
తెలుసుకోలేని
జీవితము
అయిపోతున్నది.
కనుక
శాంతి
అనేది
బయటప్రపంచములో
లేదు.
శాంతి
అనేది
మన
హృదయములోనే
వుంటున్నది.
ఈ
హృదయములో
వుండిన
శాంతిని
మనము
అనుభవములో
అందించుకోటానికి
కొన్ని
మానవతా
గుణములు
అలవరచుకోవాలి.
2
▾
Meaning
Keep
మానవతా
గుణములు
లేకపోతే
మానవత్వము
అనేది
కేవలము
విలువలేనిదిగా
మారిపోతుంది.
ప్రేమస్వరూపులారా!
సమాజమునకు
మనకు
వుండిన
సంబంధము
ఏమిటి?
సమాజము
నిమిత్తమై
మనము
ఎందుకు
పాటుపడాలి.
సమాజముయొక్క
క్షేమము
కోసము
ఎందుకు
ప్రార్థించాలి
అని
విచారణ
చేస్తే
మనము
పుట్టునది
పెరుగునది
జీవించునది
కడపటికి
అంత్యమొందునది
సమాజమునందే.
సమాజము
లేక
క్షణమైనా
మనము
జీవించటానికి
వీలుకాదు.
అన్న
సమాజముతో
మనకు
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
పెంచుకొని
సమాజక్షేమాన్ని,
సమాజము
యొక్క
అభివృద్ధిని
మనము
కోరటం
మన
కర్తవ్యము.
కేవలము
నేను
నేను
అని
స్వార్థము
స్వప్రయోజన
నిమిత్తమై
జీవితమును
అంకితము
చేయరాదు.
స్వార్థ
స్వప్రయోజనములకు
అతీతమైన
వున్నతస్థాయి
కూడా
వున్నది.
అదియే
సమాజము.
నేను
అనే
వ్యక్తిత్వమునుండి
సమాజములో
ప్రవేశించాలి.
సమాజమనే
స్థానమునుండి
దేశమనే
దాంట్లో
వ్యాప్తి
గావించాలి.
విశాలమైన
హృదయము
వ్యాప్తి
గావించుకునే
తత్వము
మానవునికి
అత్యవసరము.
ప్రేమ,
దయ,
సహనము
సానుభూతి,
త్యాగము
యివియే
మానవతా
గుణములు.
మానవునికి
రెండు
ప్రధానమైన
అంగములుంటున్నవి.
ఒకటి
శిరస్సు.
రెండవది
హృదయము.
శిరస్సు
బాహ్యమైన
లౌకికమైన,
ప్రాకృతమైనటువంటిది.
విషయములందు
అభిరుచిని
అభివృద్ధి
పరచుకుంటుంది.
పదవులు
కావాలి.
విద్యలు
కావాలి.
భోగములు
కావాలి.
సిరిసంపదలు
కావాలి.
వీటినన్నింటిని
ఆశిస్తుంటే
తల.
ఇవన్నియు
ప్రాకృత
సంబంధమైనవి.
ఇవన్నీ
కదలిపోయే
మేఘముల
వంటివి.
ఏ
విధముగా
మనకు
ప్రాప్తిస్తున్నాయో
అదేవిధముగా
తిరిగి
అంత్యమైపోతున్నాయి.
ఈ
జగత్తులో
శాశ్వతమైన
దేశముగాని,
శాశ్వతమైన
విషయముగాని,
శాశ్వతమైన
పదార్థముగాని
మనకు
కానరాదు.
ఎప్పుడు
మార్పు
చెందుతూనే
వుంటున్నది.
పుట్టిన
బిడ్డను
పసిబిడ్డ
అంటాము.
పది
సంవత్సరముల
తరువాత
పిల్లవాడు
అంటాము.
అదే
ముప్పై
సంవత్సరములైతే
ఒక
మనిషి
అంటాము.
అదే
డెబ్బై
సంవత్సరములైతే
తాతగారు
అంటాము.
కనుక
యివన్నీ
ఎంత
మార్పులు
చెందుతున్నవి.
కాలక్రమేణా
దేశ
కాల
పరిస్థితుల
ప్రభావము
చేత
మానవత్వము
యెన్నియో
మార్పులు
చెందుతుంది.
ఈ
మార్పు
చెందే
దానికి,
కూర్పు
చెందే
దానికి
ప్రాకులాడనక్కరలేదు.
కనుకనే
యీ
ప్రాకృతమైన
దానిని
ఆశించటమే
తలయొక్క
ప్రధాన
కర్తవ్యము.
కాని
హృదయము
అట్టిది
కాదు.
తల
ప్రవృత్తిని
ఆశిస్తే
హృదయము
నివృత్తిని
ఆశిస్తుంది.
ఈ
నివృత్తియొక్క
తత్వమే
ప్రేమ,
దయ,
త్యాగము,
సహనము,
సానుభూతి
యిలాంటి
పవిత్రమైన
గుణములు
హృదయమునుండి
ఆవిర్భవిస్తాయి.
హృదయమునుండి
ఆవిర్భవించినప్పుడే
మనలో
ప్రేమ
అభివృద్ధి
నొందుతుంది.
ఎక్కడ
ప్రేమ
అభివృద్ధి
నొందునో
అక్కడే
మనకు
భయము
వుండదు.
ఎక్కడ
మనకు
భయము
వుండదో
అక్కడే
మనకు
శాంతి
లభిస్తుంది.
కనుకనే
మనకు
విశ్వాసము
అత్యవసరము.
మానవునకు
శ్వాసము
ఎంత
ప్రధానమో
జీవితమునకు
ఆత్మవిశ్వాసము
అంత
అవసరము.
3
▾
Meaning
Keep
His poems 8
Also in his talks
(4)
21 May 1991
The Vedic Heritage Of India
1 June 1991
Spiritual Discipline (sadhana)
1 July 1996
Learning Without Practice Is Futile
15 July 1996
Dharma Is Our Real And Permanent Property
ఆత్మవిశ్వాసము
లేకపోవటం
చేతనే
భయము
మనలను
తరుముకు
వస్తున్నాది.
భయమనేది
మనకు
పోవాలంటే
అభయము
మనకు
కావాలి.
అభయము
వుండినప్పుడు
భయము
మనలను
యేమాత్రము
బాధించదు.
ఈనాడు
ప్రతి
విషయమునందు
లోకములో
భయము
భయము.
ఈ
భయమనేది
ఆత్మవిశ్వాసము
లేకపోవటం
చేతనే
మనలను
బాధిస్తున్నాది.
ఆత్మవిశ్వాసము
కావాలి.
అదే
self
confidence.
మనకు
ఆత్మవిశ్వాసము
వుండినప్పుడే
మనకు
ప్రేమ
సహజముగా
ఆవిర్భవిస్తుంది.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఈమె
నా
తల్లి
అనే
విశ్వాసము
వుండినప్పుడే
ఆ
తల్లిని
నీవు
ప్రేమిస్తావు.
ఈమె
నా
భార్య
అనే
విశ్వాసము
వుండినప్పుడే
నీవు
ఆ
భార్యను
ప్రేమిస్తావు.
వీడు
నా
కుమారుడు
అనే
విశ్వాసము
వుండినప్పుడే
నీవు
ఆ
కుమారుని
ప్రేమిస్తావు.
నిజముగా
విశ్వాసమే
లేకపోతే
నీవు
ప్రేమించవు.
కనుక
మొట్టమొదట
విశ్వాసమనేది
అభివృద్ధి
గావించినప్పుడే
ప్రేమ
నీలో
ఆవిర్భవిస్తుంది.
ప్రేమ
ఎప్పుడు
ఆవిర్భవించునో
అప్పుడే
మనకు
శాంతి
చేకూరుతుంది.
శాంతి
చేకూరినప్పుడే
సత్యము
మనకు
అర్థమవుతుంది.
సత్యమును
అర్థము
చేసుకున్నప్పుడే
ఆనందము
లభిస్తుంది.
ఆనందము
చేతనే
దైవత్వము
మనకు
ప్రాప్తిస్తుంది.
కనుక
నిత్యానందం
పరమసుఖదం
అని
ఆనందమును
ప్రధానముగా
పెట్టారు.
మానవుని
లోపల
ఐదు
కోశములుంటున్నవి.
అన్నమయకోశము,
ప్రాణమయకోశము,
మనోమయకోశము,
విజ్ఞానమయకోశము,
ఆనందమయకోశము.
కాని
యీనాటి
మానవుడు
అన్నమయకోశము
వరకు
మాత్రమే
ప్రయాణము
చేస్తున్నాడు.
నా
దేహము
నాది
నాది
అంతా
నాది
నాది.
ఈ
దేహమును
ఆధారము
చేసుకొని
ప్రతి
విషయమునందు
కూడను
తాను
ప్రవేశిస్తున్నాడు.
దేహము
కేవలము
నీటి
బుడగ
వంటిది.
ఎప్పుడిది
క్షీణించునో,
ఎప్పుడిది
అంత్యమొందునో,
ఎప్పుడిది
రాలిపోవునో,
ఎప్పుడిది
కూలిపోవునో,
ఎప్పుడిది
కాలిపోవునో
ఎవ్వరు
కూడ
చెప్పలేరు.
శతవర్షములదాక
మితము
చెప్పిరిగాని
నమ్మరాదామాట
నెమ్మనంబున
బాల్యమందో
మంచి
ప్రాయమందో
లేక
ముదిమియందో
లేక
ముసలియందో
ఊరనో
అడవినో
ఉదక
మధ్యంబునో
ఎక్కడో
విడిచేది
ఎరుక
లేదు.
అలాంటి
నీటిబుడగవంటి
యీ
దేహమును
మనము
ఆధారము
చేసుకొని
తద్వారా
నిత్యసత్య
నిర్మలమైన
ఆత్మతత్వమును
మనము
విస్మరించటము
మనకు
కర్తవ్యము
కాదు.
ప్రేమస్వరూపులారా!
ముఖ్యముగా
మానవత్వమునందు
యిలాంటి
పవిత్రమైన
అవతారములు
వచ్చినప్పుడు
మనము
సరియైన
మార్గమును
అనుసరించి
ఆచరించి
ఆనందించి
పదిమందికి
పంచుటకు
తగిన
కృషి
చెయ్యాలి.
4
▾
Meaning
Keep
ప్రేమ
ప్రధానమైనది.
ప్రేమ
లేక
ప్రాణమే
లేదు.
ప్రతి
మానవునియందు
ప్రేమ
వున్నది.
కాని
ఆ
ప్రేమను
అనేక
మార్గములలో
ప్రసరింప
చేసుకుంటున్నాడు.
భార్యభర్తల
ప్రేమను
మోహము
అంటారు.
తల్లిబిడ్డల
ప్రేమను
వాత్సల్యమంటారు.
మిత్ర
బంధువుల
ప్రేమను
అనురాగమంటారు.
పదార్థముల
ప్రేమను
యిచ్ఛ
అంటారు.
పరమాత్మ
ప్రేమనే
భక్తి
అంటారు.
ప్రేమ
ఒక్కటే
కదా!.
కనుక
యీ
ఒక్కప్రేమను
అనేక
మార్గములుగా
పోతున్నది.
మనము
నీరును
అక్కడ
పెట్టినప్పుడు
హిందీ
వారు
వచ్చి
పానీ
అంటారు.
ఇంగ్లీషు
వారు
వచ్చి
వాటర్
అంటారు.
తమిళనాడు
వారు
వచ్చి
తన్ని
అంటారు.
తెలుగు
వారు
వచ్చి
నీరు
అంటారు.
కాని
పదార్థము
మారలేదు
కదా.
ఉన్నది
ఒక్కటే
యీ
అనేక
రకముల
భాషలవలన
అనేక
పేర్లుగా
మనము
పిల్చుకుంటున్నాము.
కనుక
ప్రేమ
ఒక్కటే.
ఆ
ప్రేమయే
దైవం.
ఈ
దైవమంటే
ప్రత్యేకముగా
మనము
వెతకనక్కరలేదు.
మనదేహములో
ఆత్మతత్వమనేది
ప్రేమనుండి
ఆవిర్భవించినది.
ఆ
ప్రేమ
ఒక్కటి
మనలో
వున్నదంటే
దైవ
మందిరముగా
మారిపోతుంది
దేహము.
ఎంతవరకు
భగవన్నామము
మనము
వుచ్చరిస్తామో
అంతవరకు.
దేహో
దేవాలయ
ప్రోక్త.
ఈ
దేహము
దేవాలయము.
దేవాలయమని
ఎందుకంటున్నాము.
అక్కడ
ఏదైనా
దేవుడుంటేనే
కదా
దేవాలయమంటాము.
అదే
రీతిగా
మన
దేహము
లోపల
ఆత్మ
అనే
దేవుడున్నాడు.
ఈ
ఆత్మనుండి
ఆవిర్భవించినదే
ప్రేమ.
అదే
పరిశుద్ధమైన
ప్రేమ.
అదే
పవిత్రమైన
ప్రేమ.
దీనిని
వేదాంతమునందు
నిర్గుణం
నిరంజనం
సనాతనం
నికేతనం
నిత్యశుద్ధ
బుద్ధ
ముక్త
నిర్మల
స్వరూపిణం.
ఇన్ని
వర్ణనలు
చేశారు.
ఇట్టి
పవిత్రమైన
ప్రేమతత్వాన్ని
ప్రతి
మానవునియందు
అభివృద్ధి
చేసుకోవాలి.
ప్రేమ
వుండినప్పుడు
దేశమంతను
ఒక్కరీతిగా
మారిపోతుంది.
కనుకనే
మానవత్వము
లోపల
తనను
తాను
నిగ్రహించుకో
కలిగినవాడే
యితరులను
నిగ్రహించగల
శక్తి
తనయందు
ఆవిర్భవిస్తుంది.
కనుకనే
దీనిని
సంస్కృతమునందు
దమము
అన్నారు.
ఇంద్రియ
నిగ్రహము
అత్యవసరము.
ఈ
దమమును
మనము
సాధించినప్పుడు
మనము
ఎంతైనా
సాధించవచ్చు.
కనుక
వీనినే
దాంతుడు
అన్నారు.
ఎవడు
యింద్రియములను
నిగ్రహించినవాడో
వాడు
దాంతుడు.
మనము
వేదాంతులు
కానక్కరలేదు
దాంతులైతే
చాలు.
అలాంటి
పవిత్రమైన
భావాల్ని
ప్రేమ
ద్వారానే
పెంచుకోవాలి.
ప్రేమ
ద్వారానే
ప్రవర్తించాలి.
ప్రేమ
ద్వారానే
మన
జీవితమును
అంత్యము
గావించుకోవాలి.
ఇదే
నిజమైన
భక్తి.
భక్తి
భక్తి
అని
అంటే
కేవలము
పూజలు
చేయటము,
జపములు
చేయటము,
ధ్యానములు
చేయటము,
యోగములు
చేయటము,
క్రతువులు
చేయటము
యివి
కాదు.
ఇవి
సత్కర్మలని
చెప్పవచ్చును.
నిజముగా
ప్రేమనే
మనకు
లేకపోతే
యివన్నీ
చేసి
యేమి
ప్రయోజనం
చెప్పండి.
5
▾
Meaning
Keep
ఇవన్నీ
నిరుపయోగము.
కుంభవర్షము
కురుస్తున్నప్పుడు
కుండలు
బోర్లవేసిపెడితే
ఒక్క
చుక్కైనా
అందులో
చేరదు.
కాని
దాని
మూతిని
వర్షమువైపు
తిప్పినప్పుడు
కొంత
జలమైనా
అందులో
చేరుతుంది.
అదే
రీతిగా
ప్రేమ
అనేది
మన
హృదయమున
చేర్చినప్పుడు
యెంతైనా
మనము
ఆనందించవచ్చు.
మన
జన్మ
సార్థకము
చేసుకోవచ్చు.
జన్మ
సార్థకమంటే
ప్రత్యేకమైన
పరిశ్రమ
కాదు.
ప్రేమతత్వము
పెంచుకోటం.
ప్రేమతో
మనము
యెంతైనా
సాధించవచ్చు.
జ్ఞానము
జ్ఞానమంటారు
ఏమిటి
జ్ఞానము.
ఐదురకాల
జ్ఞానములుంటున్నాయి.
ఒకటి
గ్రంథపరిచయము.
పుస్తకాలు
చదువుతాము.
పుస్తకాలలో
వున్న
విషయాలన్నింటిని
మస్తకములోనికి
చేర్చుకుంటాం.
మస్తకము
పుస్తకము
రెండూ
ఒకటే
అయిపోతుంది.
ప్రయోజనం
ఏమిటి?
ఆ
పుస్తకములో
చదివిన
విషయమును
మాటలలో
మనము
చెప్పవచ్చు.
చెప్పినంత
మాత్రమున
ప్రయోజనము
యేమిటి?
మాటలలో
యేమాత్రము
మనసు
మారదు.
ఐతే
దానిని
ఆచరణలో
పెట్టాలి.
అంతో
యింతో
అమృతమైనా
నోట్లో
పోసుకుంటే
పవిత్రత
వస్తుందిగాని
అట్లు
కాకుండా
ఎక్కడో
కడవలు
కడవలు
అమృతమంతా
పెట్టివుంటే
మనకు
తీరేది
యేమిటి?
దాహము
తీరదు.
దాహము
తీరాలంటే
మన
వాంఛలు
నెరవేరాలంటే
భగవత్ప్రేమను
పెంచుకోవాలి
బంగారు.
ద్వేషముతో
యేమాత్రము
మనము
సాధించరాదు.
ఈ
ద్వేషమనేది
భగవంతుని
నుండి
దూరము
చేస్తుంది.
ద్వేషము,
అసూయ,
ఆడంబరము,
అహంకారము
యివన్నీ
ఆత్మతత్వానికి
విరుద్ధమైన
శక్తులు.
ఇవి
మనలో
వుండరాదు.
ఇవన్నీ
పశుత్వమునకు
లక్షణాలు.
నిజముగా
మానవునికి
ప్రేమ,
దయ,
సహనము,
సానుభూతి
యిలాంటివి
వుండాలి.
సత్యంనాస్తి
పరోధర్మః.
ధర్మమునకు
మించినది
మరొకటి
లేదు.
ధర్మమంటే
ఏమిటి?
కేవలము
నీయిష్టము
వచ్చినట్టు
చేయటం
ధర్మంకాదు.
త్రికరణ
శుద్ధి
అదే
ధర్మం.
మనసులో
నీవు
తలచినది
మాటలో
చెప్పు.
మాటలో
చెప్పిన
దానిని
క్రియలో
ఆచరించు.
ఈ
మూడింటి
ఏకత్వమే
నిజమైన
ధర్మము.
మనసులో
ఒకటి
తలచటము,
మాటలో
మరొకటి
చెప్పటము,
క్రియలో
మరొకటి
ఆచరించటము
ధర్మము
కాదు.
మనస్యేకం,
వచస్యేకం,
కర్మణ్యేకం
మహాత్మనం.
మహాత్ముల
యొక్క
తత్వము
యీ
మూడింటి
ఏకత్వము.
మహాత్ముల
యొక్క
తత్వము
ఎవ్వరు
అర్థము
చేసుకోలేరు.
బంగారూ
దైవము
యొక్క
తత్వాన్ని
కించిత్తైనా
మనము
అర్థము
చేసుకుంటే
ఎంతైనా
జన్మసార్థకమవుతుంది.
ఎన్నో
మనము
చేయనక్కరలేదు.
ఎన్నో
మనము
చూడనక్కరలేదు.
సేవాభావముతో
అందరిని
మనము
ప్రేమించినప్పుడు
అంతకంటె
వేరే
మంచి
మార్గము
లేదు.
భగవంతుని
సమీపమునకు
చేరటానికి
సరియైన
రాజబాట
ఒక్కటే.
Love
all
Serve
all.
అందరిని
ప్రేమించు.
అందరి
సేవలు
చేయి.
దాంతోనే
మనకు
సుఖము
వుంటున్నది.
సేవద్వారా
యెంతైనా
మనము
సార్థకము
గావచ్చును.
అందువలననే
సేవ
చాలా
ప్రధానమైనది.
సమాజసేవలో
మనము
పాల్గొనాలి.
ప్రతి
మానవునియందు
భగవంతుడు
వున్నాడు.
ఎవరికి
సేవచేసినా
భగవంతునికి
సేవ
చేసినట్లే.
సర్వజీవ
నమస్కారం
కేశవం
ప్రతిగచ్ఛతి.
6
▾
Meaning
Keep
ఎవరికి
నమస్కారము
చేసినా
భగవంతునికే
చేరుతుంది.
అదే
విధముగనే
సర్వజీవ
తిరస్కారం
కేశవం
ప్రతిగచ్ఛతి.
ఎవరిని
మనము
తిట్టినా
మనము
భగవంతుని
తిట్టినట్టే.
ఈ
రెండింటిని
మనము
పెట్టుకోవాలి.
కనుకనే
భగవద్గీతయందు
ప్రధానమైన
తత్వము
రెండే
రెండు
వాక్యములలో
చెప్పవచ్చు.
ఏమిటది.
సంశయాత్మా
వినశ్యతే.
సంశయమును
మనము
దూరము
చేసుకోవాలి.
ఇది
అష్టాక్షరి
మంత్రము.
సం-శ-యా-త్మా-వి-న-శ్యతే.
అష్టఅక్షరములు.
ఇది
ఒకవైపున
గట్టుగా
పెట్టుకోవాలి.
ఇంకొక
వైపున
శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం.
ఇది
అష్టాక్షరములే.
శ్ర-ద్ధా-వా-న్-లభ-తే-జ్ఞా-నమ్.
ఒకవైపున
శ్రద్ధ
ఒకవైపున
నిస్సంశయము
యీ
రెండింటిని
గట్టుగా
పెట్టుకున్నప్పుడు
మన
జీవితమనే
ప్రవాహము
నేరుగా
పోయి
అనుగ్రహమనే
సాగరములో
చేరిపోతుంది.
ఏమీ
సందేహించనక్కరలేదు.
ఇలాంటి
దివ్యమైన,
నవ్యమైన
భావము
మన
చెంతనే,
మన
యింటనే,
మనకంటనే
వుండి
కూడను.
మనము
అర్థం
చేసుకోలేక
పోతున్నాము.
నిజముగా
మానవత్వమనేది
యెంతో
పవిత్రమైనది.
దాని
విలువ
మీరు
తెలుసుకోటానికి
ప్రయత్నించండి.
ఈ
విధమైన
దానిని
కేవలము
మాణిక్యము
వంటి
మానవత్వమును
మసిబొగ్గులకు
అమ్ముకోటం
మానవత్వానికి
సార్థకం
కాదు.
బంగారు!
ప్రేమతో
మన
జీవితాన్ని
సాధించాలి.
అందరియందు
మనము
సహన
భావము
పెంచుకోవాలి.
సోదర
భావమును
పెంచుకోవాలి.
ఎవరికి
ఏ
చిక్కులు
కలిగినా
మనము
సాధ్యమైనంత
వరకు
సేవలు
చేయటానికి
కంకణం
కట్టుకోవాలి.
ఇదే
స్వామి
యొక్క
ప్రధానమైన
గుర్తు.
నేను
ప్రేమిస్తాను.
అందరిని
ప్రేమించమని
చెబుతాను.
అదే
నా
ప్రోపరిటీ.
నాకు
యింకయే
ప్రోపరిటీ
లేదు.
నాకు
ప్రేమనే
పెద్ద
ప్రోపరిటీ.
నా
దగ్గరనున్న
పెద్ద
శక్తి
ప్రేమనే.
ఎటువంటి
ప్రేమ.
నిస్వార్థమైన
ప్రేమ.
నేను
యింతవరకు,
64
సంవత్సరములైంది
యింతవరకు
ఒక్కరిని
ఏవిధముగా
నేను
అడగలేదు.
నా
చేయి
యిట్లా
పోలేదు.
నా
చేయి
ఎప్పుడు
యిట్లానే
పోతుంది.
నేను
అడిగేది
ఒక్కటే.
ప్రేమ.
ప్రేమ.
నాకు
కావలసింది
ఒక్కటి.
ఆ
ప్రేమ
ఒక్కటి
వుంటే
ప్రపంచమంతా
హస్తగతమవుతుంది.
ప్రేమ
చేతనే
సర్వత్వాన్ని
చేరిపోతున్నాము.
ప్రేమ
లేకపోతే
యింటిలో
వుండినవారు
విరోధులైపోతారు.
కనుక
ప్రేమ
వుంటుంటే
అన్ని
దేశాలు
కూడ
ఐక్యమైపోతాయి.
ఈనాడు
మనము
స్వాతంత్ర్యమును
సాధించామేగాని
ఐక్యతను
సాధించలేదు.
ఐకమత్యము
లేక
ప్రయోజనమేమిటి?
ఐకమత్యమే
జీవితమునకు
పునాది.
ఐకమత్యము
లేకుండా
పోవటం
చేతనే
జీవితము
ఛిన్నాభిన్నమైపోతుంది.
రాజ్యము
కూడను
ఛిన్నాభిన్నమైపోతుంది.
సమాజమునకు
ప్రాణము
లేకుండా
పోతున్నది.
ఈనాడు
సమాజమును
పోషించి
సమాజమును
నిలబెట్టి
సమాజములో
వ్యక్తిత్వమనేది
దివ్యత్వమును
సార్థకము
చేసుకోవాలి.
నిజముగా
సద్గుణములకు
ప్రధానమైనది
నీతి.
నీతి.
నీతి.
అదే
దీనికి
పునాది.
నీతిలేక
ప్రయోజనము
లేదు.
నీతి
లేని
జాతిగా
వుండకూడదు.
మానవత్వము
నీతిపైన
ఆధారపడి
వుంటుంది.
7
▾
Meaning
Keep
ఈ
జాతి
నీతి
రెండింటియొక్క
ఏకత్వమును
మనము
చక్కగా
అర్థము
చేసుకోవాలి.
అప్పుడే
సరియైన
మానవత్వము
గుర్తించటానికి
వీలవుతుంది.
మానవ,
మానవ
పేరుపెట్టుకొని
పోతున్నాము.
నేను
మానవుడనంటే
పూర్ణత్వము
కాదిది.
చక్కగా
గుర్తించుకోండి.
నేను
మానవుడనుకోటం
అర్థము
సత్యమే.
ఇంకొక
అర్థసత్యమేమిటి?
నేను
పశువు
కాదు.
నేను
మానవుడు
పశువుకాదు
రెండు
చేరినప్పుడే
నిజంగా
మానవుడైపోతావు.
నేను
మానవుడు
మానవుడనుకొని
పశువుగా
ప్రవర్తించవచ్చు.
కాబట్టి
ప్రక్కనే
నేను
పశువు
కాదు.
ఈ
రెండింటిని
తీసుకున్నప్పుడే
పూర్ణమానవుడౌతాడు.
ప్రతివాడు
నేను
మానవుడనుకోటం
అర్థసత్యము.
నేను
మానవుడు.
నేను
పశువు
కాదు
యీ
రెండింటిని
చేర్చినప్పుడే
ఏకత్వము.
నెగిటివ్
పోజిటివ్
రెండు
చేరితే
కరెంటు
ఏ
విధముగా
వుపయోగపడుతుందో
అదేవిధముగా
యీ
రెండింటిని
ఏకము
చెయ్యాలి.
ఈనాడు
అందరు
నేను
మానవుడు,
నేను
మానవుడు
అని
చెప్పుకొని
పోతున్నారేగాని
పశువుగా
ప్రవర్తిస్తున్నారు.
అది
మంచిది
కాదు.
పశువు
పశువుగా
ప్రవర్తించటము
సహజము.
మానవుడు
పశువుగా
ప్రవర్తించకూడదు.
ఇది
మనము
నేర్చుకోవలసినది.
మా-న-వ
మూడక్షరములు.
మా
అనగా
అజ్ఞానము.
న
అనగా
లేకుండా
వ
అంటే
వర్తించటము.
ఇది
నిజమైన
మానవత్వము.
మా
నవ
మా
అంటే
కాదు.
నవ
అంటే
క్రొత్త.
నేను
కొత్తవాడిని
కాదు.
నేను
ఎప్పుడు
పాతవాడినే.
ఎట్లా
భగవంతునికి
సన్నిహిత
సంబంధుడను
పాతవాడినే.
చాలా
పాతవాణ్ణి.
మనం
పాతవాడినని
చెప్పుకుంటూ
రోతవారుగా
తయారైపోతున్నాం.
అది
సరియైనది
కాదు.
పాతవారము.
భగవంతుని
సన్నిహిత
సంబంధ
బాంధవ్యముతో
కూడిన
వారము.
ఇలాంటి
భావమును
పెంచుకుంటే
ఈర్ష్య
అసూయ
డంబము
యిలాంటి
గుణములు
వస్తాయి.
వచ్చిన
కూడను
దానిని
అరికట్టుకోటానికి
తగిన
కృషి
చెయ్యాలి.
కారు
యెంతో
స్పీడుగా
పోతుంటాది.
అవసరమైన
చోట
బ్రేకు
వెయ్యాలి.
బ్రేకు
వెయ్యక
పోతే
ప్రమాదము
జరుగుతుంది.
అదే
రీతిగానే
కోపం
వస్తుంది.
ద్వేషము
వస్తుంది.
అసూయ
వస్తుంది.
కాని
దానిని
నిగ్రహించుకోవాలి.
అదే
మానవత్వానికి
తగినది.
మనసు
కలవాడు
మానవుడు.
చూశారా!
పశువుకు
మనసు
లేదు.
మనసు
నుంచి
వచ్చిందే
మనిషి.
మనస్సు
లేక
మనిషి
లేడు.
కనుక
మనిషి
అంటే
ఏమి?
మనసే.
మనసంటే
ఏమి?
మనిషే.
మనస్సంటే
సంకల్ప
వికల్పములే.
సంకల్పముల
యొక్క
ఫలితమే
చర్యలు.
చర్యల
యొక్క
మంచి
చెడ్డలే
మన
జీవితము
యొక్క
సుఖదుఃఖములు.
చూశారా!
కాబట్టి
మన
కష్టసుఖములన్ని
దేనినుంచి
వస్తున్నాయి.
మన
చర్యల
నుంచి.
చర్యల
నుంచి
వచ్చిన
ఫలితమే.
మన
నడత
మంచిగా
వుండాలి.
నడత
మంచిగా
వుండినప్పుడే
మన
జీవితము
మంచిగా
వుంటుంది.
ఈ
నడతను
సరైన
రీతిలో
వుంచుకోటానికి
నీతి
కావాలి.
నత
యితి
నీతిః
అన్నారు.
నత
అనగా
మానవత్వము
నుండి
సంప్రాప్తమైనది
నీతి.
ఈ
నీతి
లేని
జాతి
కాకూడదు
మనము.
మానవజాతిని
సరియైన
రీతిలో
పోషించుకోవాలి.
8
▾
Meaning
Keep
His poems 66
Also in his talks
(2)
17 January 1986
Learning that wins gold, for happiness here; the learning of Brahman, for happiness hereafter
21 May 1990
The Moving Temple
ఏమతము
ఎవరిదైనప్పటికిని
మనమంతా
ఒకటిగానే
భావించుకోవాలి.
అన్నిమతములు
ఒక్కటే.
మతములన్నియుచేరి
మంచినే
బోధించె
తెలిసి
మెలగవలయు
తెలివితోడ
మతులు
మంచివైన
మతమేది
చెడ్డది.
ఏమతము
చెడ్డది
కాదు.
మన
మతులే
చెడ్డవైపోతున్నాయి.
క్రిష్టియన్
మతమనుకోండి,
ముస్లిమ్
మతమనుకోండి
వారు
ఏవిధంగానైనా
పోనీ
మనమతమును
మనము
గౌరవించుకోవాలి.
ఇంకొకరితో
ద్వేషము
మనకక్కరలేదు.
మనదాన్ని
మనం
చూసుకుపోతుంటే
బయటవారితో
మనకెందుకు.
అట్లు
కాకుండా
తనదాన్ని
తాను
వదలిపెట్టి
బయట
దానిపైన
సవారు
చేస్తే
యిది
ఎవ్వరు
కూడను
ఒప్పుకోరు.
కనుక
మొట్టమొదట
మన
హృదయాన్ని
చూసుకోవాలి.
నీ
ఆకలికి
నీవు
తిను.
ఎవరి
ఆకలికో
నీవు
తింటే
నీ
ఆకలి
తీరదు.
నీ
బాధలకు
యింకొకరు
మందు
తింటే
నీ
బాధ
నివారణ
కాదు.
అదే
self
realisation
అన్నారు.
తనను
తాను
తెలుసుకోవాలి.
నేను
ఎవరు?
ఒక
చిన్న
ఉదాహరణము.
ఇది
నా
దేహము,
నా
మనస్సు,
నా
బుద్ధి,
నా
చిత్తము,
నా
యింద్రియము,
నా
అంతఃకరణ
అంటున్నావు
నేను
ఎవరు?
ఎవరైనా
యోచిస్తున్నారా?
నా
దేహము
అంటున్నారే
గాని
దేహమే
నేను
అనటంలేదే.
ఇది
నా
దేహము
అనుకుంటే
నేను
వేరు
దేహము
వేరు.
ఇది
నా
కర్ఛిఫ్.
కర్ఛిఫ్
వేరు
నేను
వేరు.
ఇది
నా
ఛైర్.
ఛైర్
వేరు
నేను
వేరు.
అదే
రీతిగా
నా
దేహమనుకుంటే
దేహము
వేరు
నేను
వేరు.
నేనెవరు?
ఈ
నేనెవ్వరనేది
ఎవరూ
విచారించటం
లేదు.
కాబట్టి
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అంతఃకరణ
యివన్నీ
పనిముట్లు.
కరణములన్నింటికిని
అధికారి
నీవు.
నీవు
అధికారి
కావాలి.
నీవు
అధికారి
కావాలిగాని
బానిస
కాకూడదు.
నీవు
master
కావాలి.
మనసును
అనుసరించినప్పుడు
నీవు
చెడిపోతున్నావు.
బుద్ధిని
అనుసరించినప్పుడే
మనము
బాగుపడతాం.
బుద్ధికి
విచారణా
శక్తి
వుంది.
మంచి
చెడ్డ
విచారణ
చేసి
మనము
అందులో
ప్రవేశిస్తే
మనము
మానవత్వమును
అర్థము
చేసుకోవచ్చు.
దివ్యాత్మస్వరూపులారా!
ప్రేమతత్వాన్ని
పెంచుకోవాలి.
ప్రేమ
మనకు
పెరగాలంటే
సమాజములో
ప్రవేశించాలి.
సేవలు
చెయ్యాలి.
ఒక
గుడికి
పోయి
దేవుని
ప్రార్థించటం
కాదు.
లేక
పెద్దలకు
నమస్కారము
చేసి
దర్శించి
స్పర్శించి
వచ్చినంత
మాత్రమున
కాదు.
అందరియందు
దైవమున్నాడు.
దేహమే
దేవాలయము.
మీరందరూ
దేవుళ్లే.
అందరి
హృదయాలు
దేవుని
మందిరాలే.
ఆ
భావము
పెట్టుకోవాలి.
ఆ
విధముగా
వున్నప్పుడు
నీవే
విధములైన
చెడ్డపనులందు
యేమాత్రము
ప్రవేశించవు.
ఆ
విశ్వాసము
పెంచుకోవాలి
బంగారు.
భగవంతుడనగా
వేరేమి
లేదు.
ఎక్కడో
దూరము
లేదు.
9
▾
Meaning
Keep
His poems 68
Also in his talks
(8)
20 May 1982
The triple purity
20 June 1988
You yourselves are embodiments of God!
29 July 1988
Creation is nothing but the expression of Īśvara's will!
5 November 1989
Ānanda Is Within You Alone
23 November 1989
God Is the Embodiment of the Ātma
20 November 1990
The Devotee dear to the Lord
27 May 1991
Prasnopanishad - Answers To The Second And Third Students
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
పాపమన
వేరు
పరదేశమున
లేదు
తాను
చేయు
పనుల
దగిలియుండు
దేవుడనగ
వేరు
దేశమందున
లేడు
తాను
చేయు
పనుల
దగిలియుండు
దేవుడుగాని,
పాపముగాని,
పుణ్యముగాని
అన్నీ
మనలోనే
వున్నాయి.
ఎవరో
ఎక్కడనుంచో
యిచ్చేది
కాదు.
ఇచ్చి
పుచ్చుకొనే
వ్యాపారము
కాదు.
ఎవరికి
వారే
ఆనందము
తెలుసుకోవాలి.
ఈ
ఆనందము
వలనే
మన
జీవితము
నిత్యానందముగా
మారిపోతుంది
బంగారు.
ప్రేమను
పెంచుకోండి.
ఏ
ఒక్క
విషయములో
కూడను
తెలుసుకొని
తద్వారా
దానిలో
ప్రవేశించండి.
కేవలము
తెలియక
పూర్వమే
అనవసరమైన
మాటలందు
మనము
ప్రవేశించకూడదు
ఎందుకంటే
‘కాలుజారుతే
కలుగదు
నష్టము
నోరుజారితే
నరకమురా’.
కాలుజారి
పడితే
దెబ్బతగిలిందని
డాక్టరుకు
చూపించి
బ్యాండేజి
కట్టించుకోవచ్చు.
మందు
వేసుకొని
నయం
చేసుకోవచ్చు.
కానీ
నాలుక
జారి
హృదయానికి
గాయమైతే
ఏ
డాక్టరు
నయం
చేయగలడు.
ఎవరు
నయం
చేయలేరు.
ఎక్కడ
దెబ్బతగిలింది
ఎవరికి
తెలియదు.
కనుక
మనం
మాటలు
మాత్రం
చాలా
శాంతముగా,
ప్రేమతో
సహనంగా
మాట్లాడటం
నేర్చుకోవాలి.
కఠినమైన
మాటలతో
హృదయాన్ని
మనం
బాధించరాదు.
అది
నా
ప్రధానమైన
ప్రేమతత్వము.
ఈ
ప్రేమను
అందరు
పెంచుకోవాలి.
ఆయన
చెప్పాడు
స్వామియొక్క
పవిత్రమైన
గుణాలు
మా
అందరికి
అందించాలని.
మీలో
వున్నాయి.
అందించేవి
కాదిది.
మీరు
అందుకునేది
కాదు.
కాని
దానిని
వుపయోగించుకోటం
లేదు.
మన
స్టోరులో
బియ్యం
వున్నాయి.
పప్పు
వుంది.
చింతపండు
వుంది.
అన్నీ
వుంటున్నాయి.
కానీ
వంట
చేసేది
మనకు
తెలియదు.
కనుక
వంటవానిపైన
ఆధారపడుతున్నాము.
చూశారా!
పదార్థములంతా
మనవే.
అదే
విధముగా
అన్నీ
మనలో
వుంటున్నాయి.
ఉపయోగించుకునే
విధానము
తెలియదు
కనుకనే
మనము
యితరులపైన
ఆధారపడిపోతున్నాము.
కనుక
అట్లు
చేయకూడదు.
మనం
తెలుసుకోవాలి.
తెలిసి
రామచింతన
చేయవే
అన్నాడు
త్యాగరాజు.
మనం
తెలుసుకొని
చెయ్యాలి.
మనలోనే
వున్నాయి
సద్గుణములు.
సర్వసద్గుణములు
మీలోనే
వుంటున్నాయి.
లేకుండా
పోలేదు
బంగారు.
ఆ
సద్గుణములను
సద్గుణములుగానే
వుంచుకోండి.
ఎంతైనా
శాంతిసుఖములు
ఆనందమును
అనుభవిస్తారు.
ఎంతో
శ్రమలకోర్చి,
ఎంతదూరమునుండో,
యెంతో
ప్రేమతో
మీరు
రావటం
చేతనే
నా
ప్రేమ
మీరు
అందుకోటానికి
అవకాశము
వచ్చింది.
ఇలాంటి
సన్నిహిత
సంబంధ
బాంధవ్యములు
కలగాలి.
ఒక
కఱ్ఱకు
ఒక
కఱ్ఱకు
కొంచెం
ఒక
దినము
కొంచెం
రాపిడి
జరుగుతే
ఆ
కఱ్ఱముక్కలైపోతుంది.
కానీ
బాగా
రాసుకుంటే
దానిలో
అగ్ని
పుడుతుంది.
చూశారా!
కఱ్ఱకఱ్ఱ
రాపిడి
వల్ల
అగ్ని
పుడుతుంది.
అదే
జ్ఞానాగ్ని.
రావాలి
అప్పుడప్పుడు.
పెట్రోమాక్సులైటుకు
అప్పుడప్పుడు
పంపుకొట్టాలి
కదా.
10
▾
Meaning
Keep
మీరు
అప్పుడప్పుడు
వస్తుంటే
యీ
పంపు
పిన్నులతో
bright.
బుద్ధి
వికాసము
చెందుతుంది.
ప్రకాశమును
పొందుతుంది.
ఇది
మీ
యిల్లు
నా
యిల్లు
కాదు.
మీ
హృదయమే
నా
యిల్లు.
మీ
ప్రేమయే
నా
సంపద.
దాన్ని
మాత్రం
ప్రధానంగా
పెట్టుకొని
చక్కగా
అర్థం
చేసుకొని
మీరందరు
వర్తించుతారని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Good Resolves Are Everlasting
Next
Those Who Recognised the Paramātma Are the Gopīs
→