Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · No Sādhana Surpasses Prema for God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
No Sādhana Surpasses Prema for God
18 June 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
Also in his talks
(4)
19 October 1998
Dīpāvali: Its Inner Meaning
24 July 2002
The Paramāṇu Itself Is the Paramātma
18 September 2004
Parents Are the Visible Embodiments of God
18 June 2008
Divine Message
ప్రదోషే
దీపకశ్చంద్రః
ప్రభాతే
దీపకో
రవిః.
త్రైలోక్యే
దీపకో
ధర్మః
సుపుత్ర
కులదీపకః.
విద్యార్థులారా!
రాత్రివేళల
యందు
వెలుగునందించేవాడు
చంద్రుడు.
పగటి
వేళల
యందు
వెలుగును,
కాంతిని
చేకూర్చేవాడు,
అందించేవాడు
సూర్యుడు.
ముల్లోకములందు
వెలుగును
కాంతిని
చేకూర్చేది
ధర్మము.
సుపుత్రుడు
కులమునకు
దీపము
వెలిగిస్తాడు.
అమావాస్యకు
పూర్ణిమకు
ఉండిన
వ్యత్యాసము
మీకు
తెలుసు.
అమావాస్య
కాళరాత్రి
కటిక
చీకటిగా
ఉంటుంది.
సహృదయులు
ఈ
చీకటిని
ఏమాత్రము
కోరరు.
చీకటి
భయంకరమైనది.
భయమును
మాత్రమే
కాదు.
దురాలోచనలను
అభివృద్ధి
పరుస్తుంది.
దురాలోచనలను
మాత్రమే
కాదు
దుష్కర్మలలో
ప్రవేశింపచేస్తుంది.
చీకటి
అనేక
దుష్టసంకల్పముల
చేత
దురాలోచనల
చేత
దుర్భావముల
చేత,
దుష్కర్మల
చేత
మానవుని
అనేక
విధములుగా
పీడిస్తుంది.
ఈ
చీకటిని
దుష్టులు
దుర్మార్గులు,
దురహంకారులు
మాత్రమే
ఆశింతురుగానీ
సహృదయులు
ఎవరు
దీనిని
ఆశించరు.
దొంగలకు,
దుష్టులకు,
దుర్మార్గులకు
చీకటి
ఎంతో
సహాయముగా
ఉంటుంది.
వారు
ఈ
చీకటినే
ఆశిస్తుంటారు.
వారు
సంకల్పించుకున్న
కర్మలు
ఆచరించే
నిమిత్తము
ఈ
చీకటి
ఎంతైనా
సహాయము
చేస్తుంది.
కనుక
చీకటిని
కేవలము
దుస్సంకల్పులు
మాత్రమే
ఆశిస్తుంటారు.
సత్సంకల్పులు,
సదాచార
సంపన్నులు,
సత్క్రియావంతులు
వెలుగును
మాత్రమే
ఆశిస్తుంటారు.
వెన్నెల
చూచినప్పుడు
మానవుని
హృదయము
చల్లగా
శాంతమైన
భావములో
సక్రమమైన
మార్గములో
సత్సంకల్పములను
అభివృద్ధి
పరుస్తుంది.
చిన్న
పిల్లలు
కూడ
వెన్నెలను
చూచి
ఎంతయో
ఆనందిస్తారు.
కవులు
ఈ
చల్లని
వెన్నెల
లోపల
హృదయమునుండి
ఆవిర్భవించే
సద్భావములను
కవిత్వముగా
అల్లుతుంటారు.
పూర్ణిమ
దినము
మానవుని
హృదయము
పూర్ణముగా
ఉంటుంది.
మానవుని
మనస్సుకు
పూర్ణచంద్రునకు
ఉండిన
సంబంధ
బాంధవ్యము
కూడ
మనము
చక్కగా
విచారించాలి.
చంద్రుడు
మనస్సు
యొక్క
ప్రతిబింబమే.
చంద్రుని
వెన్నెలలోపల
మానవుని
మనస్సు
చల్లగా
సద్భావములతో,
సత్సంకల్పములతో
అభివృద్ధి
పొందుతుంది.
పూర్ణిమ
చీకటిని
పోగొట్టి
అజ్ఞానము
దూరము
చేసి,
భయమును
కూడా
దూరము
చేసి
శాంతిని
భద్రతను,
ఆనందమును,
సత్సంకల్పములను
అభివృద్ధి
పరుస్తుంది.
2
▾
Meaning
Keep
పగటి
వేళయందు
సూర్యుడు
అందరికి
వెలుగు
నందిస్తాడు.
ఈ
సూర్యుడే
లేక
జగత్తు
లేదు.
సూర్యుడే
భూలోకమునకు
ప్రత్యక్ష
దైవము.
సూర్యుడు
లేక
సృష్టి
లేదు.
పంటలు
లేవు.
వృక్షములు
లేవు.
గాలి
లేదు.
తిండి
లేదు.
జీవరాసులు
బ్రతకలేవు.
సూర్యుని
వెలుగు
వలనే
జీవులు
బ్రతుకుతున్నాయి,
పంటలు
పండుతున్నాయి,
నదులు
ప్రవహిస్తున్నాయి,
ఆనందముగా
సుక్షేమంగా
సుభిక్షముగా
దేశము
అభివృద్ధి
పొందుతున్నాది.
సూర్యుని
ప్రభావము
చేత
మానవుని
హృదయము
పవిత్ర
మవుతున్నది.
కనుక
సూర్యుడు
భూలోకమునకు
ప్రత్యక్ష
దైవము.
సూర్యుని
యందున్న
ప్రకాశ
శక్తి,
హైడ్రోజను
శక్తి
జగత్తుకు
తోడ్పడుతున్నాది.
కొంత
భాగము
మాత్రము
హీలియం
వాయువు
ఉంటున్నాది.
హీలియం
వాయువు
ఉండటంచేత
ఆక్సిజను
క్షీణించక
అభివృద్ధి
గాంచక
దినదినము
తనయొక్క
స్థాయిలో
తాను
వెలుగుతున్నాది.
సూర్యుని
యందు
అనేక
రంధ్రములుంటున్నాయి.
సూర్యునిలో
నున్న
రంధ్రములు
ఎంత
పెద్దవని
విచారణ
చేస్తే
ఈ
భూమినంతా
కట్టకట్టి
ఒక్కొక్క
రంధ్రములో
ముంచవచ్చు.
అంత
పెద్ద
పెద్ద
రంధ్రములుంటున్నాయి
సూర్యునిలో.
కేవలం
ఒకటికాదు
రెండు
కాదు
వేలను
ఉంటున్నాయి.
ఈ
రంధ్రములుండటంచేత
హీలియం
వలన
ఆక్సిజను
హైడ్రోజను
క్రమక్రమేణా
అభివృద్ధి
గాంచుతూ
ఉంటుంది.
ఇది
సైంటిస్టులకు
తెలుసు.
సూర్యుడు
జగత్తుకు
ప్రత్యక్ష
దైవము.
మూడవ
నేత్రము.
వెలుగునందించేవాడు
సూర్యుడు.
ఈ
మూడు
లోకములకు
వెలుగు
నందించేది
ధర్మము.
ఈ
ధర్మమంటే
ఏమిటి?
ధృయతే
ఇతి
ధర్మః.
కట్టి
ఉంచేది.
అన్నింటిని
పట్టి
ఉంచుతుంది.
ఈ
ధర్మము
లేక
జగత్తు
లేదు.
సమస్త
కర్మలకు
ధర్మము
ప్రాణము
వంటిది.
ఆ
ప్రాణ
సమానమైన
ధర్మము
లేక
జీవితము
లేదు.
ఒక్కొక్క
వస్తువుకు
ఒక్కొక్క
ధర్మము
ఉంటున్నాది.
అగ్ని
ఉంది.
అగ్నికి
ఏది
ధర్మము?
దహన
శక్తియే
అగ్నికి
ధర్మము.
ఈ
దహన
శక్తి
కోల్పోతే
ఇది
అగ్ని
కాదు.
అది
బొగ్గ.
మంచు
గడ్డ
ఉంటున్నాది.
చల్లదనమే
దీని
ధర్మము.
చల్లదనమనే
ధర్మమే
కోల్పోతే
మంచు
కాదు.
ధారయతీతి
ధర్మః.
ధరించినది
ధర్మము.
ఏది
మానవుని
ధరించి
ఉండేది.
హృదయము,
వాక్కు,
కాయము
ఈ
మూడింటి
సమ్మిళితమైన
స్వరూపమే
మానవ
ధర్మము.
ఈ
త్రిపుటి
యొక్క
ఏకత్వము,
ఈ
త్రిపుటి
యొక్క
పవిత్రము
ఈ
త్రిపుటి
యొక్క
నిర్మలత్వము,
ఈ
త్రిపుటి
యొక్క
శుద్ధము
ఈ
మూడింటి
పరిశుద్ధమైన
తత్త్వమే
మానవ
ధర్మము.
3
▾
Meaning
Keep
చేసే
కర్మలన్నీ
పవిత్రమైనవిగా
ఉండాలి.
నీ
ఆత్మతృప్తిగా
ఉండాలి.
పలికే
పలుకులు
పరిశుద్ధమైనవిగా
ఉండాలి.
‘జిహ్వే
రసజ్ఞే
మధురప్రియేత్వం
సత్యం
హితం
త్వాం
పరమం
వదామి’
ఓ
నాలుకా!
రసమెరిగిన
నాలుకా,
శుద్ధమైన
నాలుకా,
స్వార్థరహితమైన
నాలుకా!
నీవు
ఎంత
గొప్పదానివే
అని
వర్ణించాడు
మహర్షి.
ఎంత
స్వార్థ
రహితమైనది
నాలుక.
అట్టి
పరిశుద్ధమైన
నాలుకను
ఈనాడు
మాలిన్య
పరచుకుంటున్నాడు.
అసత్యము
చేత.
‘అనుద్వేగకరం
వాక్యం
సత్యం
ప్రీతి
హితంచయత్’
మనం
పలికే
పలుకులు
ఉద్వేగంగా
ఉండకూడదు.
సత్యము
కదా
యని
ఘోరమైన
శబ్దముతో
పలుక
కూడదు.
ప్రీతిగా
ఉండాలి
పలుకు.
హితముగా
ఉండాలి
పలుకు.
అతిగా
మాట్లాడకూడదు.
కేవలం
కఠినంగా
ఉండకూడదు
మృదువుగా
ఉండాలి.
ఇదియే
సత్యము
అన్నారు.
త్రికాలబాధ్యం
సత్యం.
మూడు
కాలముల
యందు
ఉండేది
సత్యం.
నిజము
అని
ఒకటి
ఉంది.
కానీ
సామాన్యముగా
ప్రపంచములో
సత్యమును,
నిజమును
ఒకటిగానే
చూసుకుంటారు.
నిజం
వేరు.
సత్యం
వేరు.
రెండు
ఒక్కటికాదు.
చూచినప్పుడు
ఏది
కనిపిస్తున్నదో
అది
నిజము.
ఇప్పుడు
నీవు
ఒక
శాలువా
కప్పుకొని
ఉండవచ్చు.
రేపటి
దినము
ఈ
శాలువా
లేకపోవచ్చును.
కానీ
నీవు
శాలువ
కప్పుకున్నావు
అనేది
నేటికి
మాత్రమే,
ఇప్పటికి
మాత్రమే
అది
నిజము.
రేపటి
దినము
నిజము
కాదు.
రేపటికి
కూడా
అది
ఉంటే,
మరుసటి
దినము
కూడా
అది
ఉంటే,
త్రికాలములందు
అది
ఉంటే
అది
సత్యం.
కనుకనే
త్రికాలములందు
మారనిది,
కదలనిది,
మెదలనిది,
చావనిది,
కూలనిది
అదే
సత్యం.
మధ్యమధ్య
మారుతూ
ఉండేది,
కదులుతూ
ఉండేది,
కొంతవరకు
మాలిన్య
మయ్యేది
సత్యం
కాదు.
అది
నిజము.
అప్పటికప్పుడు
కన్పించేది
నిజము.
ఎప్పుడూ
కన్పించేది
సత్యము.
వేదాంతములో
ఈ
సత్యమును
‘ఋతము’
అన్నారు.
ఈ
ఋతమంటే
ఏమిటి?
కేవలము
వస్తువు
మాత్రమే
కాకుండా
దానికి
జ్ఞానం
కూడా
వుంటుంది.
కనుక
ఈ
రెండింటి
యొక్క
ఏకత్వం
చేత
అది
ఋతము
అనే
రూపం
ధరిస్తోంది.
కనుక
మానవత్వంలో
మన
ధర్మం
సత్యాన్ని
పలకటమే.
అదియే
నిజమైన
మానవ
ధర్మము.
అదే
మానవత్వం.
అదియే
మానవుని
ప్రధానమైన
విలువ.
అయితే
హృదయ
మనేది
కన్పించదు.
ఈ
రెండింటి
యొక్క
సంబంధము
చేతనే
హృదయము
ఎటువంటిది
అని
గుర్తించటానికి
వీలవుతుంది.
మాటలు,
చేతలు
రెండు
reflection
of
the
innerbeing.
ఈ
రెండు
reflection,
reaction,
resound.
అదే
ఋతం.
మానవత్వము
యొక్క
విలువలు
ఏవి?
4
▾
Meaning
Keep
దీనిని
మూడు
పదములతో
చెబుతూ
వచ్చాము.
ప్రీతి,
భీతి,
నీతి.
ప్రీతి
-
దైవప్రీతి.
ఈ
దైవప్రీతి
ఉన్నప్పుడు
శాంతము,
సత్యము
రెండు
మనలో
ఆవిర్భవిస్తాయి.
భీతి
-
పాపభీతి.
ఈ
పాపభీతి
ఉన్నప్పుడు
ప్రేమ
వస్తుంది.
ప్రేమ
రావటమే
కాకుండా
శాంతముగా
ఉంటుంది.
నీతి
-
సంఘనీతి.
ఈ
సంఘనీతిలో
అహింస
ఆవిర్భవిస్తుంది.
ప్రీతి
అనే
ఒక్కదానిని
మనం
పోషించుకున్నామంటే
శాంతము,
ధర్మము,
అహింస
ఈ
మూడు
దానిని
అనుసరిస్తాయి.
ప్రీతి
కలవాడు
హింసలో
పాల్గొనడు.
భీతి
కలవాడు
అధర్మములో
ప్రవేశించడు.
నీతి
గలవాడు
శాంతముగా
ఉంటాడు.
కాబట్టి
ప్రీతి
అన్నింటి
యందు
సమానము.
ప్రాణసమానము.
మానవుని
యొక్క
విలువలు
సత్య
ధర్మ
శాంతి
ప్రేమలు
అని
అనుకుంటున్నాము.
ఈ
అన్నీ
ఒక్క
ప్రీతిలోనే
ఇమిడి
ఉంటున్నాయి.
ఈ
ప్రేమ
భగవంతుని
వైపుకే
మరలుతూ
ఉంటుంది.
ప్రేమ
దిక్సూచి
యంత్రము
వంటిది.
దిక్సూచి
ఎక్కడ
పెట్టినా
ఉత్తర
దిక్కునే
చూపిస్తుంది.
అదే
రీతిగా
ప్రీతి
ఎక్కడనుండి
వచ్చినా
దైవం
వైపే
పోతుంది.
ప్రీతి
అనే
దిక్సూచి
మానవునికి
అందించిన
special
grace.
మొట్టమొదటి
మానవతా
విలువ
ప్రీతియే.
ఆ
ప్రేమయే
ప్రతి
మానవునియందు
ఉండాలి.
దైవము
సర్వభూతములందు
ఉన్నాడనే
తత్త్వము
వేదము
బోధించింది.
ఈశ్వర
స్సర్వభూతానాం.
ఎవరు
ఈశ్వరుడు?
ప్రేమయే
ఈశ్వరుడు.
ఈశ్వరుడే
ప్రేమ.
భగవంతుడు
సర్వులయందు
ఉంటున్నాడు.
దీనిని
పురస్కరించుకొనియే
LOVE
IS
GOD.
LIVE
IN
LOVE.
జీసస్
జన్మించిన
సమయములో
ముగ్గురు
అరేబియన్
రాజులు
చేరారు.
మొదటి
రాజు
చూచాడు
ఈ
బిడ్డను.
‘ఇతను
దైవము
బిడ్డలా
కనిపిస్తున్నాడు.’
అన్నాడు.
రెండవ
అతను
చూచాడు..
కాదు.
కాదు.
‘ఇతను
దైవాన్ని
ప్రేమించే
వాడుగా
తయారౌతాడు’
అన్నాడు.
మూడవ
రాజు
‘ఇతను
దైవము
బిడ్డ
కాదు,
ప్రేమించటమూ
కాదు
దైవమే
ఇతను’
అన్నాడు.
The
one
you
think
you
are.
అదే
మొదట
చెప్పినది.
దైవములో
మూడు
రకములైన
తత్త్వములున్నవి.
నేను
భగవంతుని
messenger
ని.
I
am
the
messenger
of
God
అన్నాడు.
తరువాత
I
am
the
son
of
God.
తరువాత
I
and
My
father
are
one
అన్నాడు.
అదియే
The
one
you
think
you
are.
That
is
physical.
దేహాన్ని
పురస్కరించుకొని
నేను
ఫలానా
మెసెంజరును
అని
భావిస్తున్నాడు.
The
one
others
think
you
are.
అనగా
నీ
మనస్సు
యొక్క
తత్త్వము.
Third,
The
one
you
really
are.
అనగా
ఆత్మ
స్వరూపము.
5
▾
Meaning
Keep
From
the Bṛhadāraṇyaka Upaniṣad, 5.1.1
Also in his talks
(22)
15 January 1987
Only when mind and body are healthy can good resolves grow
8 February 1987
The principle of the Ātma alone is eternal
6 May 1988
Recognise the One in the many!
8 July 1988
All creation is nothing but an assembly of atoms!
18 July 1989
The Ātma in All Is One
3 October 1989
Honour the Vedas
27 April 1990
Give up selfishness: Cultivate unity
24 May 1991
Isaavaasya Upanishad - Renunciation And Pleasure
27 January 1992
Increase the thought of God! Reduce worldly desires!
14 July 1992
God alone is the true Guru
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
22 July 1994
The fullness of Prema
2 July 1996
Satya Alone Is God
21 October 1996
In God's Creation Everything Is Pure!
29 April 1998
God Alone Is the Ground of Ānanda
1 October 1998
Aham, Ātma, Mind, Speech
14 January 2000
Give up attachment to the body and serve the country!
20 November 2002
Education That Does Not Nourish Character Is Worthless
1 January 2003
Only service done with the feeling of the one Ātma is true service
13 May 2006
Humanness finds its fulfilment only when steadiness and oneness are both there
4 September 2007
The word and the way of the Avatāras are most auspicious
9 October 2008
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
అనగా
మూడు
స్వరూపాలుంటున్నాయి.
దేహ
స్వరూపము,
మానసిక
స్వరూపము,
ఆత్మ
స్వరూపము.
ఆత్మ
స్వరూపములో
మన
ఇద్దరు
ఒక్కటే.
దీనినే
హనుమంతుడు
శ్రీరామునికి
చెప్పాడు.
రామా!
దేహ
రీతిగా
నేను
నీ
సేవకుడను.
మానసిక
రీతిగా
నేను
నీ
దాసుడను.
నీ
అంశమును.
ఆత్మరీతిగా
నీవు
నేను
ఒక్కటే.
ఒకానొక
సమయములో
తల్లి
అనుజ్ఞ
తీసుకొని
అడవిలోకి
పోయి
ఎడారులలో
42
దినములు
తపస్సు
చేశాడు
జీసస్.
తదుపరి
తన
యొక్క
స్వస్వరూపమును
తాను
గుర్తించుకున్నాడు.
మూడు
వరములు
కోరాడు.
ఏమిటవి?
మొదటిది.
Oh
my
God.
my
father
నేను
మూడు
వరములు
కోరుతున్నాను.
నన్ను
అనుగ్రహించమన్నాడు.
మొదటిది.
నాకు
ఈ
జీవితాన్ని
అందించావు.
ఈ
జగత్తులో
ఎవరికి
ఏవిధమైన
బాధలు
కల్గించకుండా
అందరి
సేవలు
చేయాలి.
తప్పును
మాత్రం
నేను
ఒప్పుకుంటాను.
కానీ
అసత్యమునకు
నేను
ఒప్పుకోను.
సత్యమార్గములో
నేను
ప్రవేశించేటట్లు
చేయి.
ఇది
మొట్టమొదటి
కోరిక.
రెండవది
అసూయా
పరులైనవారు
నన్ను
ఎన్ని
విధములుగా
హింసించినా,
దూషించినా,
పరిహసించినా,
బాధించినా
నేను
ఓపికగా
ఉండే
హృదయాన్ని
అనుగ్రహించు.
మంచిని
చూసి
లోకులు
కొంతవరకు
అసూయ
పడుతారు.
అభివృద్ధి
పొందేవారిని
చూసి
అసూయ
పడతారు.
సుఖంగా
ఉండేవారిని
చూచి
కుళ్ళిపోతుంటారు.
ఇది
మానవుని
అల్పబుద్ధి
యొక్క
లక్షణములు.
ఇవి
నిజంగా
మానవ
హృదయాలు
కావు.
పశువులు
కూడ
ఆవిధముగా
అసూయ
పడవు.
కానీ
ఈనాటి
మానవునిలో
స్వార్థం
అధికం
కావటం
వలన
అసూయ
కూడా
దానిలో
పెరుగుతూ
వస్తుంది.
ఈ
అసూయాపరులు
నన్ను
ఎన్ని
బాధలు
పెట్టినా
శాంతముగా
ఉండే
చిత్తమును
అనుగ్రహించమన్నాడు.
ఇంక
మూడవది
ప్రేమ.
ఈ
ప్రేమ
ఎవరికి
నేను
అందించను.
నా
పరిపూర్ణమైన
ప్రేమను
నీ
పాదములకే
అంకితము
చేస్తాను.
నీ
సేవకే
నేను
అంకితము
కావాలి.
నీ
ఆనందమే
నా
ఆనందము.
నీవు
ప్రేమ
స్వరూపుడవే.
నేనూ
ప్రేమ
స్వరూపుడనే.
పూర్ణమదః
పూర్ణమిదం
పూర్ణాత్పూర్ణముదచ్యతే
పూర్ణస్య
పూర్ణమాదాయ
పూర్ణమేవావ
శిష్యతే.
నీవు
పూర్ణుడు.
నేను
పూర్ణుడు.
ఈ
పూర్ణమంతా
ఆ
పూర్ణములోనే
ఏకమై
పోవాలి.
పూర్ణమైన
వారికి
నేను
ఈ
పూర్ణత్వము
అందించను.
ఎందుకంటే
భగవంతుడు
పరిపూర్ణుడు.
పరిపూర్ణునికే
ఈ
పరిపూర్ణ
ప్రేమను
అర్పితం
గావించాలి.
6
▾
Meaning
Keep
కనుక
ఈ
మూడు
నాకనుగ్రహించమని
కోరాడు.
ప్రతి
మానవుడు
మొట్టమొదట
కర్మ
మార్గమును
అనుసరించాలి.
అనగా
కర్మను
ఆచరించాలి.
కర్మ
ఆచరించటములో
హృదయ
పూర్వకమైన
సత్కర్మలు
ఆచరించాలి.
రెండవది
పూజించటము.
ఆధ్యాత్మిక
మార్గములో
ప్రవేశించటము.
భజించటము,
పూజించటము
జపించటము,
తపించటము.
ఇవన్నీ
ఆధ్యాత్మిక
మార్గములే.
మూడవది
జ్ఞాన
మార్గము.
కనుకనే
work,
worship
and
wisdom.
ఈ
మూడు
3
Wలుగా
వచ్చాయి.
work,
worship
wisdom
ఈ
మూడింటి
తత్త్వములో
మానవుడు
ప్రయాణించి
wisdomతో
అంత్యము
కావాలి.
ఎక్కడున్నాడు
భగవంతుడు?
కొన్ని
నిముషముల
ముందుగా
తెలుగులో
మాట్లాడిన
పిల్లవాడు
చెప్పాడు.
చాలా
అమాయకులకు
కూడ
అర్థమయ్యేరీతిగా
భగవంతుడు
సర్వాంతర్యామి
అని.
కానీ
ఈనాడు
మేధావులకు
అన్నీ
సందేహములే.
మేధావుల
కంటే
ఏ
చదువు
లేని
మూర్ఖుడే
చాలా
మేలు
ఈ
కాలంలో.
పాలను
తెచ్చాడు
ఒక
పాత్రలో.
ఎక్కడున్నాడు
దేవుడు?
‘బాబూ,
ఈ
పాలలో
వెన్న
ఎక్కడుంది?
వెన్న
ఉంది
కానీ
కనిపించటం
లేదు’
అన్నాడు.
ఒక్కొక్క
dropలో
వెన్న
ఉంది.
ఒక్కొక్క
కణములో
వెన్న
ఉంది.
అయితే
ఎప్పుడు
మనకు
ప్రత్యక్ష
మవుతుంది?
దానిని
పెరుగు
చేసి
తర్వాత
చిలికినప్పుడు
సర్వత్రా
ఉండిన
వెన్న
అంతా
పై
భాగమునకు
వస్తుంది.
హృదయం
ఒక
పాత్ర.
ప్రేమయే
ఇందులో
పాలు.
ఈ
ప్రేమను
భగవంతునికి
అర్పించటమే
మధనం.
అప్పుడే
సాక్షాత్కారమయ్యే
స్వరూపము
ప్రత్యక్షమవుతుంది.
సర్వత్రా
ఉండేది
భగవంతుడు.
పాలలో
సర్వత్రా
ఉన్నది
వెన్న.
కనిపించదు.
అయితే
ఎప్పుడు
కనిపిస్తుంది?
దానికి
తగిన
కృషి
మనం
చేసినప్పుడు
కనిపిస్తుంది.
అయితే
భగవంతుని
దృష్టి
ఎవరిపై
ఉంటుంది?
ఎక్కడ
ఉంటుంది
అని
సందేహించవచ్చు.
బల్బు
ఉన్నది.
ఈ
బల్బులో
వెలుగు
ఉంది.
ఈ
వెలుగు
ఎక్కడ
చూస్తుంది?
అన్ని
వైపులా
చూస్తుంది.
సర్వత్రా
చూస్తుంది.
అదే
రీతిగా
భగవంతుడు
ఒక
వెలుగు
వంటి
వాడు.
ఎవరిని
చూస్తున్నాడు?
అందరిని
చూస్తున్నాడు.
ఈ
సభలో
నిద్రపోయే
వారిని
చూస్తున్నాడు
ఇంకొకరు
వినకుండా
ఏదో
చింత
చేస్తున్న
వాళ్ళను
చూస్తున్నాడు.
చింతలు
వేరు
వేరుగా
ఉండవచ్చు.
కానీ
అందరికి
ఈ
వెలుగే
ఆధారము.
ఒకానొక
సమయంలో
రామకృష్ణ
పరమహంస
చక్కని
సాయంకాల
వేళ
చక్కని
బోధ
చేస్తున్నాడు.
7
▾
Meaning
Keep
ఆ
గుంపులో
రాణి
రసమణి
వచ్చి
కూర్చుంది.
ఆ
రాణి
రసమణి
templeలో
రామకృష్ణ
పరమహంస
పూజారి.
చక్కగా
చెబుతున్నాడు
భగవద్విషయములు.
రాణి
రసమణి
విన్నట్టుగానే
తల
ఊపుతున్నది.
కానీ
ఈ
విషయం
రామకృష్ణకు
తెలుసు
బాగా.
లేచాడు
కుర్చీనుండి.
ఆ
కూర్చున్న
రాణి
రసమణి
చెంపల
మీద
ఒక్కతూరి
కొట్టాడు.
అందరికి
ఆశ్చర్యము
వేసింది.
ఏమిటి
ఈ
పిచ్చివాడు.
ఆమె
దగ్గర
ఉద్యోగంలో
ఉన్నాడు.
ఆమె
యొక్క
దేవాలయములోనే
సేవ
చేస్తున్నాడు.
రాణిని
ప్రజల
మధ్యలో
ఇంత
అవమాన
పరచటమా?
ఏమి
ఇతనికి
పిచ్చా
ఏమిటని
అనేక
మంది
అనేక
రీతులుగా
విచారించారు.
ఈ
సభలో
వచ్చిన
వారంతా
దేనికోసం
వచ్చారు.
చెప్పే
విషయాలు
చక్కగా
శ్రద్ధగా
వినాలి.
విన్న
విషయాలను
ఆచరణలో
పెట్టాలి.
కానీ
నీవు
వచ్చి
ఈ
సభలో
కూర్చొని
రేపటి
కోర్టు
విషయమంతా
నీవు
విచారణ
చేసుకుంటున్నావా?
నీవు
అలా
కోర్టు
విషయాలు
విచారణ
చేసుకోవాలంటే
ఇంట్లో
కూర్చొని
విచారణ
చేసుకోవాలి.
ఇక్కడి
కెందుకు
రావాలి.
అనగా
ఈ
వాక్యము
ఎంతో
ఆదర్శవంతమైంది.
అనేకమంది
సభలలో
పాల్గొంటారు.
ఏమి
చెప్పారో
ఏమిటో
ఎవరికి
తెలియదు.
ఏవేవో
విచారణ
చేసుకుంటూ
ఉంటారు.
కాబట్టి
అలా
యోచన
చేసే
వారు
సభలలో
పాల్గొనరాదు.
సమావేశములో
పాల్గొంటే
దానిని
తు.చ.
తప్పకుండా
నడచుకునేందుకు
ప్రయత్నించాలి.
ఈ
సత్యమును
ఆనాడు
రామకృష్ణ
చక్కగా
ఆచరణ
రీతిలో
ప్రచారము
చేశాడు.
కనుక
మానవుని
ధర్మములింత
పవిత్రమైనవిగా
ఉండాలి.
ఇది
కేవలము
ఒక్క
భూలోకమునకు
మాత్రమే
కాదు.
‘భూర్భువస్సువః’.
ఈ
మూడు
లోకములకు
కూడా.
ఏమిటి
ఈ
మూడు
లోకములు?
దేహ
రీతిగా
చేసే
కర్మలందు,
మనసు
రీతిగా
తలచే
తలంపులందు,
ఆత్మ
రీతిగా
ఆనందించే
ఆనందమునందు
ఈ
మూడింటి
యందు
ధర్మము
వెలుగు
నందిస్తుంది.
అదే
Atmic
Bliss.
‘నిత్యానందం
పరమసుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం’
ఇంత
జ్ఞానమయమైనది
ఆత్మానందము.
ఈ
ఆనందమునకు,
మానసిక
ఆనందమునకు,
దేహ
ఆనందమునకు
వెలుగు
నందించేది
ధర్మము.
త్రిలోకములకు
వెలుగు
నందించేది
ధర్మము.
ఈ
మూడూ
దైవాధీనము.
నాల్గవది
మానవప్రయత్నం.
సుపుత్ర
కులదీపకః.
మంచిపుత్రుడు
కులమునకే
వెలుగు
తెస్తాడు.
8
▾
Meaning
Keep
Also in his talks
(2)
6 August 1989
Dharma Alone Is the Foundation
22 July 1994
The fullness of Prema
ఎవరీ
good
son.
Good
son
is
God
son.
మిథ్యాలోకం
జగత్తంతా
మిథ్య.
బ్రహ్మ
సత్యము.
ఆ
మిథ్య
అనేది
ఒక
జీరో.
Goodలో
ఒక
O
తీసేస్తే
God
అయింది.
కాబట్టి
God
son
is
good
son.
అనగా
నిరంతరము
దైవ
భావములు
దైవ
చింతనలు,
దైవ
కర్మలు
కలిగినవాడు
సుపుత్రుడు.
సు
-
అనగా
మంచి.
తల్లి
తండ్రుల
ఆజ్ఞను
శిరసా
వహించి,
తల్లి
తండ్రుల
ప్రేమనందుకొని,
తల్లి
తండ్రులను
ఆనంద
పరచి
వారింతకాలము
పెంచి
పెద్ద
చేసినందుకు
వారికి
కృతజ్ఞత
నందించాలి.
వారిని
సంతృప్తి
పరచేవాడు
సుపుత్రుడు.
అంతేకాదు.
సమాజములో
మంచి
పేరు
తెచ్చుకున్నవాడు
సుపుత్రుడు.
ఎప్పుడు
గొప్పవాడౌతాడు.
కులములో
ఒకండు
గుణవంతుడుండిన
కులము
వెలయు
వాని
గుణము
వెలయు
వెలయు
వనములోన
మలయజంబునట్లు.
గొప్పకారడవిలో
ఒక
మల్లె
తీగ
ఉంటే
ఆ
మల్లె
పుష్ప
సుగంధము
అడవి
అంతా
వ్యాపిస్తుంది.
అదే
రీతిగా
సుపుత్రుడున్నాడంటే
ఆ
జాతికంతా
గొప్ప
కీర్తి
నందిస్తాడు.
ఈనాడు
కుమారుడు
పుట్టిన
తక్షణమే
చక్కెరయో
తీపియో
పంచుతాము
మనము.
ఏమిటయ్యా
చక్కెర
పంచుతున్నావంటే
నాకు
కుమారుడు
పుట్టాడు
అంటాడు.
ఎలాంటి
కుమారుడో
ముందుకు
చూడు.
కొడుకు
పుట్టినంత
మాత్రమున
పుట్టాడని
చెప్పుకోకూడదు.
ఆ
పుట్టిన
కుమారుడు
ఏనాడు
సమాజంలో
మంచిపేరు
తెస్తాడో
అప్పుడు
నీవు
పుత్రోత్సవము
చేసుకోవాలి.
పుత్రోత్సాహం
తండ్రికి
పుత్రుడు
పుట్టగనే
పుట్టదు
ఎందరో
ఆ
పుత్రుని
కనుగొని
పొగడగ
పుత్రోత్సాహము
నాడు
పొందును
తండ్రి.
పదిమంది
అబ్బా!
ఈ
పిల్లవాడు
చాలా
మంచి
వాడు
చాలా
మంచి
వాడు
అన్నప్పుడు
అదే
తండ్రికి
గొప్ప
విలువ.
అదే
దైవమునకు
గొప్ప
ఆనందము.
అందరిచేత
మంచివాడనిపించుకోవాలి.
అలాంటి
సుపుత్రుడు
కులమునకే
వెలుగు
నందిస్తాడు.
వెలుగునందించేవి
మూడు
రకములుగా
ఉంటున్నాయి.
ఇంటిలో
వెలిగే
బల్బు
ఆ
రూమ్‌లోకి
మాత్రమే
వెలుగు
నందిస్తుంది.
రాత్రి
వెలిగే
చంద్రుడు
సర్వత్రా
వెలుగు
నందిస్తాడు
కానీ
డిమ్‌గా
ఉంటుంది.
కానీ
పగలు
వెలిగే
సూర్యుడు
సర్వత్రా
వెలుగు
నందిస్తాడు.
ఇంటిలో
వెలిగే
వెలుగు
స్వార్థము.
చంద్రుని
నుండి
సర్వత్రా
వచ్చే
వెలుగు
పరార్థము.
సూర్యుని
వెలుగు
యదార్థము.
9
▾
Meaning
Keep
యదార్థమంటే
Truth.
Truth
is
God.
కనుక
సర్వత్రా
వెలుగునందించే
సూర్యుడే
నిజమైన
దైవము.
కనుక
ప్రాచీన
కాలమునుండి
భారతీయులు
సూర్యోపాసన
జరుపుతూ
వచ్చారు.
సూర్య
నమస్కారములు
చేస్తూ
వచ్చారు.
సూర్యుడే
ప్రత్యక్ష
దైవమని
భావిస్తూ
వచ్చారు.
సూర్యుని
వలనే
సమస్తము
జగత్తులో
నిలువగలుగుతున్నది.
కనుక
మనకీనాడు
కావలసినది
చంద్రుని
వెలుగు
రాత్రి.
సూర్యుని
వెలుగు
పగలు.
త్రిలోకముల
వెలుగు
ధర్మము.
కులము
వెలుగు
సత్పుత్రుడు.
మనము
చదివినంత
మాత్రమున
సత్
పుత్రులము
కాము.
ప్రవర్తనలో
నడతలో
సత్ప్రవర్తన
ఉండాలి.
good
behaviour,
good
manners,
good
discipline,
good
devotion.
అది
చాలా
ప్రధానమైంది.
ఆ
devotion
ఉంటే
ఎన్నైనా
మంచివే
చేరుతూ
వస్తాయి.
ఈనాడు
లోకములో
ద్వైత,
విశిష్టాద్వైత,
అద్వైతము
అని
మూడు
స్థానములు
నిర్మించుకుంటూ
వచ్చింది.
ద్వైతము
మధ్వాచార్యులు,
విశిష్టాద్వైతము
రామానుజాచార్యులు,
అద్వైతము
శంకరాచార్యులు
ప్రతిపాదించారు.
ద్వైతము
-
ఇది
దేనికదే
ఉంటుంది.
ఒకదానికొకటి
సంబంధము
లేదు.
అయితే
విశిష్టాద్వైతమునకు,
అద్వైతమునకు
ఎక్కువ
భేదము
లేదు.
ఏ
కులమైనా
కానీ,
ఏ
గోత్రమైనా
కానీ,
ఏ
దేశమైనా
కాని,
ఏ
మతమైనా
కానీ,
ఏ
సాంప్రదాయమైనా
కానీ
సత్యం
ఒక్కటిగానే
కనిపిస్తుంది.
sugar
cane
ఎన్నెన్నో
వంపులుగా
ఉంటుంది.
sugar
caneకి
bend
ఉంటుంది.
కానీ
లోపలనున్న
రసమునకుగానీ,
రుచికి
గానీ
వంపు
లేదు.
కనుక
అన్ని
sugar
caneల
నుండి
జ్యూస్
తీయటం
కలపటం
ఇది
అద్వైతము
అన్నారు.
sugar
cane
జ్యూసంతా
అద్వైతమన్నారు.
ఈ
sugar
caneలో
ఎక్కడైనా
తీపే
వస్తుంది.
రెండవ
రుచి
మరొకటి
లేదు.
తరువాత
రామానుజులవారు
చక్కగా
విచారణ
చేశారు.
sugar
cane
juice
ఎంతకాలం
పెట్టుకోటానికి
వీలవుతుంది?
ఇది
ఎంతో
కాలం
ఉండటానికి
వీలుకాదని
sugar
cane
juiceను
sugarగా
మార్చాడు.
sugarగా
మార్చేటప్పటికి
ఎప్పుడైనా,
ఎక్కడైనా
దేనిలోనైనా
వేసుకోవచ్చు.
కాబట్టి
sugar
juice
అనేది
అద్వైతము.
sugar
అనేది
విశిష్టాద్వైతము.
విశిష్టమైన
అద్వైతము.
ఎప్పటికీ
ఉంటుంది.
దేనిలోనైనా
ఉపయోగించుకోవచ్చును.
మధ్వాచార్యులు
చెప్పారు
‘భగవంతుడా!
నేను
sugarగా
కాను.
నాకు
sugar
juice
అక్కరలేదు
నేను
sugarను,
sugar
juiceను
తినే
చీమగా
పుట్టాలి.
sugarకి
sugar
taste
తెలియదు.
కానీ
చక్కెర
తినేవారికి
చక్కెర
రుచి
తెలుస్తుంది.
నీవు
ప్రేమ
స్వరూపుడుగా
ఉన్నావు.
కనుక
నేను
కూడా
ప్రేమగా
ఉండకూడదు.
10
▾
Meaning
Keep
నీ
ప్రేమను
అనుభవించే
వానిగా
ఉండాలి.
నీవు
దైవము.
నేను
జీవుడు.
ఈ
రెండు
వేరుగానే
ఉండాలి.
జీవుడు
వేరుగా
ఉన్నప్పుడే
దైవత్వమును
అనుభవించుటకు
వీలవుతుంది.
నేను
sugar
తినే
వానిగా
ఉండాలి.
sugarగా
ఉండకూడదు’
అన్నాడు.
ఇది
ద్వైతము
అనగా
రెండు.
జీవుడు,
దేవుడు.
ఈ
జీవుడు,
దేవుడు
అనే
దానిలో
sugar
అంతా
తిని
బాగా
జీర్ణము
చేసుకొని
తానే
sugar
అయిపోతాడు.
బ్రహ్మవిత్
బ్రహ్మైవ
భవతి.
ఈ
ద్వైత,
అద్వైత,
విశిష్టాద్వైతములను
ఆధారము
చేసుకొని
భారతీయులు
లేనిపోని
కాలమును
వ్యర్థము
చేస్తున్నారు.
ఈ
మూడు
కట్టకడపటికి
చేరి
ఒక్కటే.
sugar
cane
juice
-
అద్వైతము.
sugar
-
విశిష్టాద్వైతము.
sugar
తినేవాడు
ద్వైతము.
అద్వైతము,
ద్వైతము
విశిష్టాద్వైతము
ఈ
మూడు
sugar
పైనే
ఆధారపడి
ఉన్నాయి.
ఆ
sugar
ఒక్కటే.
మైసూరుపాక్.
గులాబిజాం.
మిఠాయి.
పాలకోవా,
బిస్కట్లు.
అన్నీ
పెట్టినప్పటికి
అన్నింటిలో
నున్న
చక్కెర
ఒక్కటే.
ఈ
రూపనామములు
వేరువేరుగా
ఉన్నాయి.
అదే
రీతిగా
ఈ
జగత్తునందు
సర్వదేశములు,
సర్వనామములు,
సర్వరూపములు
భిన్న
భిన్నముగా
కనిపిస్తున్నాయి.
కానీ
అందరి
యందు,
అన్నింటి
యందు
ఉన్న
దైవత్వం
ఒక్కటే.
ఏకాత్మ
సర్వభూతాంతరాత్మ.
చూడండి
బల్బులన్నీ
ఎన్నో
ఉంటున్నాయి.
కానీ
కరెంటు
ఒక్కటే.
అదే
దివ్యశక్తి.
ఆ
దివ్యశక్తి
నీయందు,
నాయందు,
అందరియందు
ఉంటుంది.
అయితే
ఈ
భేదము
ఎక్కడుంది?
ఒకటి
redగా
ఉంది.
ఒకటి
blueగా
ఉంది.
ఒకటి
తెల్లగా
ఉంది.
ఒకటి
డిమ్‌గా
ఒకటి
brightగా
మరొకటి
very
brightగా
ఉంటున్నది.
కరెంటు
దోషము
కాదు.
బల్బుల
తేడా.
అందరియందు
దైవము
ఒక్కడుగానే
ఉన్నాడు.
నీ
హృదయము
కెపాసిటీ
డిమ్‌గా
ఉంది.
ఇంకొకటి
brightగా
ఉంది.
నిరంతరము
సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
హరి
చింతనం
చేస్తే
వోల్టేజి
కావలసినంత
వస్తుంది.
బల్బులు
మార్చుకో.
వోల్టేజి
మార్చుకో.
కరెంటును
మార్చవద్దు.
పెద్ద
హృదయముగా
పెంచుకో.
ప్రేమను
పెంచుకో.
ఈ
ప్రేమ
పెరిగే
కొలది
light
brightగా
ఉంటుంది.
ఇది
ఒక
కఱ్ఱ.
దీనిని
నిప్పులో
వేస్తే
ఏమవుతుంది.
కఱ్ఱ
అదృశ్యమైపోతుంది.
బొగ్గగా
తయారౌతుంది.
కఱ్ఱ
ముట్టుకుంటే
మాలిన్యము
కావటం
లేదు.
బొగ్గ
ముట్టుకుంటే
మాలిన్యమవుతున్నాది.
ఈ
బొగ్గను
తిరిగి
తెల్లగా
చేయాలంటే
ఎలా
చేయాలి.
అమాయకులు
అజ్ఞానులు
అనేకమంది
ఈ
బొగ్గను
తెల్లగా
చేయటానికి
soap
వేసి
కడుగుతారు.
soap
నల్లగా
అవుతుంది
గానీ
కోల్
తెల్లగా
కాదు.
కోల్
తీసుకు
వెళ్ళి
పాలలో
కడుగు.
11
▾
Meaning
Keep
పాలు
నల్లగా
అవుతాయిగానీ
coal
తెల్లగా
కాదు.
మనం
తెలుసుకోవలసింది
ఏమిటి?
coal
ఏ
విధంగా
అయింది?
అగ్ని
సంస్కారము
చేత
అయింది.
తిరిగి
అగ్నిలో
వేయి.
ఈ
అగ్నిలో
కాలికాలి
కట్టకడపటికి
బొగ్గకూడా
whiteగా
తయారౌతుంది.
సగం
కాలటం
చేత
బొగ్గ
అయింది.
పూర్తి
కాలుస్తే
light
అయిపోయింది.
కనుక
part
time
devotion
ఉంటే
బొగ్గగా
ఉంటుంది.
Full
time
అయినప్పుడు
lightగా
ఉంటుంది.
అగ్నిలో
వేయి.
ప్రేమలో
పడవేయి
కాలికాలి
ధూళి
మాదిరి
అయి
ఉఫ్
అంటే
ఎగిరిపోతుంది.
కఱ్ఱ
ఉంది.
విడచిపెడితే
క్రింద
పడిపోతుంది.
అదే
కాల్చి
భస్మము
మాదిరి
చేస్తే
ఉఫ్
అంటే
పైకి
పోతుంది.
ఎంత
light
అయితే
అంత
heightకి
పోతుంది.
ఎంత
బరువైతే
అంత
లోతుకు
దిగిపోతుంది.
నీవు
ఉన్నతస్థాయి
పోవాలనుకుంటే
less
luggage
more
comfort.
లగేజి
తగ్గించుకుంటూ
పోవాలి.
మనకున్న
కోరికలు
క్రమక్రమేణా
తగ్గించుకోవాలి.
కోరికలు
తగ్గించినంత
మాత్రమున
చాలదు.
రాగద్వేషములు,
అసూయ
మొదలగు
దుర్గుణములు
ముఖ్యముగా
తగ్గాలి.
ఎందుకంటే
కామ
క్రోధ
లోభములు
శత్రువులు.
కోరికలు
భక్తిని
నాశనము
చేస్తుంది.
క్రోధము
జ్ఞానమును
నాశనము
చేస్తుంది.
లోభము
మన
కర్మనే
నాశనము
చేస్తుంది.
కర్మ,
ఉపాసన,
జ్ఞానములను
నాశనము
చేస్తాయి
ఈ
మూడు.
కోపము
వచ్చినప్పుడు
విచక్షణా
జ్ఞానమే
ఉండదు.
శత్రుత్వము
పెంచుతుంది.
ఎక్కడ
ఎప్పుడు
ఎలా
మాట్లాడాలి
అనే
విచారణా
జ్ఞానము
కోల్పోతుంది.
కనుక
ఈ
కోపము
మనకు
రాకూడదు
లోభము
అసలే
ఉండకూడదు.
Cancer
జబ్బు
అయినా
నయం
అవుతుందిగానీ
ఈ
మూడు
జబ్బులు
నయము
కావు.
ఎప్పుడు
నయమవుతాయి.
దైవప్రేమాగ్నిలో
వేసినప్పుడు
భస్మమైపోతాయి.
మంచి
కఠినమైన
ఇనుము
కూడ
అగ్నిలో
వేస్తే
కరిగి
ద్రవమైపోతుంది.
చూశారా?
ఇనుమే
ఆవిధంగా
కరిగిపోతుంది.
మన
యొక్క
ఈ
గుణములు
కరగవా?
మనం
దుర్గుణములను
మొట్టమొదట
నాశనం
చేసుకోవాలి.
వీనిని
నాశనం
చేసుకోటానికి
ధ్యానమో
ఏదో
చేయనక్కరలేదు.
మెడిటేషన్
చేస్తున్నారు
చాలా
మంది.
ఏమి
మెడిటేషన్
అది.
అలంకార
మెడిటేషన్.
కూర్చుంటారు.
ఫోటో
తీసుకుంటూ
ఉంటే
నేను
మెడిటేషన్
చేసుకుంటున్నాను
అంటారు.
అలా
కూర్చోవటం
కాదు.
దేహములో
చేసే
ప్రతి
కర్మ
నిత్యములే
గానీ
సత్యములు
కావు.
మనస్సులో
చేయి
అవన్నీ
సత్యమవుతాయి.
12
▾
Meaning
Keep
నీవు
ప్రతి
విషయాన్ని
అభ్యాసం
చేసుకోవాలి.
ప్రతి
ఒక్కటి
ప్రాక్టీసు
చేయి.
walking,
talking
reading,
writing
అన్నీ
ప్రాక్టీసు
చేయి.
ఈ
ప్రాక్టీసు
మన
నిత్యజీవితములో
జరుగవలసినది.
అయితే
ఆ
ప్రాక్టీసు
సక్రమమైన
రీతిలో,
సత్యమైన
రీతిలో
చేయి.
కానీ
చెడ్డ
ప్రాక్టీసు
చేయకూడదు.
చెడ్డదానికి
ప్రాక్టీసే
అవసరం
లేదు.
కొండపైనున్న
గుండును
కాలితో
నెడితే
క్రిందకి
వచ్చి
పడిపోతుంది.
క్రిందనున్న
రాయిని
పైకి
తీసుకు
వెళ్ళి
పెట్టాలంటే
చాలా
కష్టమవుతుంది.
దుర్గుణములకు
నీవు
ప్రయత్నం
చేయనక్కరలేదు.
నెట్టితే
చాలు
క్రింద
పడిపోతుంది.
మీకందరికి
తెలుసు,
పెద్ద
లోడ్తోనున్న
లారీ
మిట్ట
ఎక్కాలంటే
ఇంత
పెద్ద
లారీ
కూడా
గీగీగీ
అని
ఏడుస్తుంది
పాపం.
పైకి
ఎక్కాలంటే
చాలా
బాధ
కలుగుతుంది.
క్రిందకు
రావాలంటే
తేలికగా
అయిపోతుంది.
కాబట్టి
తేలిక
దానికి
మనం
ప్రయత్నం
చేయకూడదు.
కష్టమైన
పనే
తలపెట్టు.
Look
up.
Low
aim
is
crime.
ఉన్నత
దృష్టిని
మనం
పెంచుకోవాలి.
అదే
నిజమైన
సాధన.
ఇతను
దేవుడా
కాదా?
దేవుడంటే
ఎలా
ఉంటాడు?
ఎక్కడుంటాడు?
ఈ
సందేహాలకు
ఏమాత్రము
అవకాశము
ఇవ్వకూడదు.
ఈ
సందేహాలన్నీ
పరమ
మూర్ఖులకు
మాత్రమే
వస్తాయి.
భగవంతుడు
సర్వత్రా
ఉంటున్నాడు.
నీలో
ఉంటున్నాయి
ఆ
దుర్గుణములు
అంతా.
నీలో
దుర్గుణములు
పెట్టుకోటం
చేత
అన్నీ
దుర్గుణములుగానే
కనిపిస్తాయి.
ఏ
రంగు
గ్లాసెస్
పెట్టుకుంటే
అలాంటి
దృశ్యమే
నీకు
కనిపిస్తుంది.
దైవము
సర్వత్రా
ఉంటున్నాడు.
నీవే
దైవము.
కానీ
నీలో
ఉన్నది
నీకు
కనిపించటం
లేదు.
కారణం
ఏమిటి?
స్వార్థములో
మునిగావు.
వీటికన్నింటికి
కొంచెము
ఆహార
విహారములు
కూడా
అత్యవసరము.
సుపుత్రుడు
ఎలా
ఉండాలి?
మంచి
మనిషిగా
ఉండాలి.
పెద్దలను
గౌరవించాలి.
వినయ
విధేయతలు
అందించాలి.
గురువులను
గౌరవించాలి.
తల్లి
తండ్రులను
పూజించాలి.
వారి
ఆజ్ఞను
శిరసా
వహించాలి.
రాముడు
దేవుడు
కావటానికి
కారణము
ఏమిటి?
తల్లి
తండ్రుల
ఆజ్ఞను
శిరసా
వహించాడు.
అంతేకాదు
మంచి
మిత్రుడుగా
ఉండాలి.
అందరితో
మైత్రి
కలిగి
ఉండాలి.
సోదరప్రేమ
చాలా
గొప్పది.
కనుకనే
ప్రజలందరు
ప్రశాంత
వాతావరణములో
మెలిగారు.
ప్రజాక్షేమమే
తన
క్షేమంగా
భావించాడు.
మనం
ప్రార్థనలు
చేస్తున్నాము.
‘లోకస్సమస్తా
సుఖినో
భవంతు’.
కానీ
మిగిలిన
వారు
ఎలా
పోతే
నాకేమి,
నేను
బాగుండాలి
అంటున్నాడు.
ఇది
కాదు
లోకస్సమస్తా
సుఖినో
భవంతు.
సర్వులు
కూడ
బాగుండాలని
హృదయ
పూర్వకముగా
ప్రార్థించాలి.
ఎందుకోసం?
ఈ
సర్వులలో
మీరుకూడా
ఒకరు.
సమాజము
బాగుంటేనే
కదా
నీవు
బాగుండేది.
13
▾
Meaning
Keep
కనుకనే
మీరందరు
బాగుండాలి.
నేనూ
బాగుండాలి.
ఎవరైనా,
ఎట్లైనా
పోనీ
నేను
మాత్రం
బాగుండాలంటే
అది
వీలు
కాదు.
ఇది
స్వార్థము.
ఈ
స్వార్థము
మహాపాపము.
ఉండాలి
స్వార్థము
కొంతవరకు.
కానీ
మితి
మీరిన
స్వార్థం
ఉండకూడదు.
దైవము
పైన
ప్రేమ
పెంచుకోవాలి.
దైవప్రేమను
మించిన
సాధన
మరొకటి
లేదు.
ఈ
జగత్తులో
దేనిని
చేసినా
చేయకపోయినా
దైవాన్ని
మనసారా,
హృదయ
పూర్వకంగా
ప్రేమిస్తే
అంతకంటె
గొప్ప
సాధన
మరొకటి
లేదు.
మీరాను
భర్త
వదలి
వెళ్ళిపొమ్మన్నాడు.
మీరా
చెప్పింది
‘అయ్యో!
నా
కృష్ణుని
వదలి
నేను
ఎలా
పోయేది?’
తక్షణమే
మనసు
మార్చుకుంది.
ఇది
మానవుడు
నిర్మించిన
మందిరము.
ఈ
మందిరము
శాశ్వతము
కాదు.
కానీ
దైవము
నిర్మించిన
మందిరం
నా
హృదయము.
చెప్పింది
‘ఛలోరె
మన్,
ఛలోరె
మన్
గంగా
యమునా
తీర్.’
గంగా
యమునా
తీరమంటే
భ్రూమధ్యస్థానము.
అక్కడకు
వెళ్ళు
మనసా!
ఎక్కడికి
పోయినా
శాంతి
లేదు.
గంగ-యమున.
గంగ-సత్కర్మ,
యమున
సత్ప్రవర్తన.
ఈ
రెండు
చేరేది
భ్రూమధ్యస్థానము.
అదే
సుషుమ్ననాడి.
ఈ
రెండు
ఎలా
ఉన్నాయి?
ఒక
వైపున
గంగ
ఒకవైపు
యమున.
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు.
సో...హం.
Previous
←
He Who Reaches God's Presence Is Honoured Everywhere
Next
There Is No Good Without a Rule
→