Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2004 · Develop Prema for God, and your sorrow will be dispelled
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Develop Prema for God, and your sorrow will be dispelled
28 August 2004, Onam, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 526
Also in his talks
(21)
9 June 1973
The Goal of Education: Equal Vision and Humility
17 October 1988
To Attain God, the Embodiment of Prema, We Must Make Prema Itself Our Support
25 December 1989
Yearn for the Grace of God
17 February 1990
Prema itself is God
1 April 1995
Make God your true friend
19 June 1996
There Is No Good Without a Rule
14 July 1996
Divine Proximity is the Real Wealth
15 August 1996
Culture is what has been refined
16 August 1996
‘Love all, worship all’
7 September 1996
Advaita Is the Principle of the One Ātma
6 October 1997
The misuse of the senses is the root of sorrow
20 April 1998
Inquiry into the eternal and the transient is essential
29 April 1998
God Alone Is the Ground of Ānanda
22 August 2001
Vināyaka is the embodiment of all the gods
14 January 2002
Only when attachment to the body is given up does the knowledge of the Ātma dawn
2 April 2003
Leave the delusion of the body; think of God
23 August 2004
Do nāmasmaraṇa for peace of mind!
16 March 2005
Jñāna is won through purity of feeling
30 January 2007
For this birth to cross over, renounce selfishness
7 June 2007
Along with ‘Education’, ‘Educare’ is most essential
24 August 2007
I do not look at the book; I look at the head
నిద్దుర
నుండి
లేచి
మరి
నిద్దుర
పోయెడుదాక
పొట్టకై
హద్దును
పద్దు
లేక
వ్యయమందగ
జేయుచు
జీవితంబు
నీ
విద్దెల
ధారవోసి
అరవిందదళాక్షుని
విస్మరించి
ఏ
పెద్ద
సుఖంబు
నొందితివొ
ప్రీతిగ
యోచన
చేయు
మానవా!
ప్రేమస్వరూపులారా!
ఆకలిదప్పులు,
ఆనంద
విచారములు
ఇవన్నీ
కూడను
ఒకదాని
వెనుక
ఒకటి
వస్తూనే
ఉంటాయి.
మానవుడు
పుట్టినది
ఆహారము
నిమిత్తమై
అని
మీరు
భావిస్తున్నారు.
కాదు,
కాదు.
ఆనందము
నిమిత్తమై
తాను
పుట్టాడు.
ఆనందమును
విస్మరించి
ఆహారము
నిమిత్తమై
ప్రాకులాడే
మానవుడు
ఆహారముతోనే
అంత్యమవుతాడు.
పర్వదినములయొక్క
పరమార్థము
ఆనందమును
అనుభవించటమేగాని,
కేవలం
పంచభక్ష్య
పరమాన్నములను
వండుకొని
భుజించటం
కాదు.
దేహమునకు
ఆహారము
అవసరమే!
కాని,
కేవలం
ఆహారము
నిమిత్తం
మనం
పుట్టలేదు.
మనకు
ఆహారము
ముఖ్యము
కాదు,
ఆనందమే
ప్రధానము.
ఇట్టి
సత్యమును
విస్మరించి
కేవలం
ఆహార
విహారముల
నిమిత్తం
మనం
ప్రాకులాడుతున్నాము.
ప్రేమనుండి
పుట్టినది
దేహము.
కాబట్టి,
మనం
ప్రేమ
నిమిత్తమై
బ్రతకాలిగాని,
ఆహారము
నిమిత్తమై
కాదు.
కాని,
ఈ
సత్యమును
మరచి
నిద్దురనుండి
లేచి
మరి
నిద్దురపోయెడుదాక
పొట్టకై
హద్దును
పద్దు
లేక
జీవితాన్ని
వ్యయం
గావిస్తున్నాము.
దేని
నిమిత్తమై
ఈ
దేహము
వచ్చినదో
దాని
నిమిత్తమై
మనము
వినియోగించుకొనుట
లేదు.
“మలినపుకొంప,
రోగముల
మ్రగ్గెడు
సేవకగంప,
జాతసంచలనము
పొందు
దుంప...”
ఇటువంటి
దేహముపై
మనం
అభిమానమును
పెంచుకొని
దీని
నిమిత్తమై
అనేక
విధములాగా
ప్రాకులాడుతున్నాము.
ప్రేమస్వరూపులారా!
మనం
తరించే
నిమిత్తమై
బ్రతకాలి.
దైవాన్ని
వరించాలి.
దైవాన్ని
ప్రేమించాలి.
2
▾
Meaning
Keep
మన
ప్రేమ
కేవలం
దైవము
నిమిత్తమై
ఏర్పడినదేగాని,
భౌతికమైన
దేహము
నిమిత్తమై
ఏర్పడినది
కాదు.
మన
ఉచ్ఛ్వాసనిశ్వాసములు,
మన
కర్మలు,
మన
మాటలు
అన్నీ
ఆత్మ
నిమిత్తమై
ఏర్పడినటువంటివే!
మానవుడు
వచ్చినటువంటిది
సత్యనిత్యమైన
ఆత్మతత్త్వము
కోసం.
కనుక,
మనం
ఆత్మాన్వేషణకోసం
ఆలోచన
చేయాలిగాని,
అన్నాన్వేషణ
కోసం
కాదు.
అయితే,
జీవించి
ఉన్నంతలో
దేహము
కొన్ని
వ్యాధులకు
గురి
కావచ్చును.
కాని,
వాటిని
మనం
లెక్కచేయకూడదు.
అవి
మధ్యలో
వచ్చిపోయేటటువంటి
మేఘముల
వంటివి.
అటువంటి
వాటిగురించి
బాధపడటం
ఎంత
వెఱ్ఱితనం!
సత్యనిత్యమైన
ఆత్మానందమును
అనుభవించే
నిమిత్తమై
మనం
వచ్చామనే
సత్యాన్ని
మరువకూడదు.
ఆత్మవిశ్వాసంతో
ఆటంకములను
ఎదుర్కోవాలి
ఈనాడు
‘ఓణం’
పండుగ
సందర్భంగా
కేరళ
ప్రజలు
ఈ
ప్రశాంతి
నిలయములో
ప్రవేశించి
ఎంతో
ఆనందమును
అనుభవిస్తున్నారు.
దీనికి
ఏ
ఆటంకమూ
చేయకూడదు.
కాని,
నా
పరిస్థితి
మీకు
ఆందోళన
కలిగించియుండవచ్చు.
మీరందరూ
ఆనందంగా
ఉన్న
సమయంలో
నాయొక్క
ఈ
ఆటంకము
(ముక్కులో
నుండి
రక్తస్రావం)
మిమ్మల్ని
ఎంతో
బాధపెట్టింది.
అయితే,
మీరు
బాధకు
ఏమాత్రము
చోటివ్వకూడదు.
మీకు
ధైర్యమివ్వాలనే
ఉద్దేశ్యంతోనే
నేను
తక్షణమే
మళ్ళీ
బయటికి
వచ్చాను.
ప్రపంచంలో
ఎన్నో
అవస్థలు
ఇదేవిధముగా
బయలుదేరుతుంటాయి.
ఇవన్నీ
కేవలం
మనలను
బెదిరించేటటువంటి
బెదిరింపులేగాని,
బాధించేటటువంటి
బాధలు
కావు.
కష్టములు
వచ్చినప్పటికీ
వాటిని
తట్టుకొని
నెట్టుకొని
ముందుకు
సాగాలి.
ఇవి
అల్పమైన
కష్టములు.
అధికమైన
ఆత్మవిశ్వాసాన్ని
వదులుకొని
ఈ
అల్పమైన
కష్టములకు
క్రుంగిపోవటం
చాలా
పొరపాటు.
ఏవో
వస్తాయి,
పోతాయి.
అవి
ఎలా
వచ్చాయో
అలానే
పోతాయి.
దేహమునకు
మధ్యమధ్య
కొన్ని
అవాంతరములు
బయలుదేరుతుంటాయి.
వాటిని
మనం
పట్టించుకోకూడదు.
ప్రకాశించే
సూర్యునికి
మధ్యమధ్య
కొన్ని
మేఘములు
అడ్డుతగులుతుంటాయి.
కాని,
వచ్చింది
పోతుంది.
అట్టి
ధైర్యముతో,
ఉత్సాహముతో,
దీక్షతో
వాటిని
ఎదుర్కొన్నప్పుడు
ఎట్టి
బాధలు
కూడను
మనలను
బాధించజాలవు.
బాధలు
లేకుండా
మనకు
ఆనందము
లభించదు
ప్రేమస్వరూపులారా!
మన
కాలమునంతటినీ
సార్థకమైన
కార్యముల
నిమిత్తమై
వినియోగించాలి.
3
▾
Meaning
Keep
ఇదే
మనం
నేర్చుకోవలసిన
ముఖ్యమైన
ఆధ్యాత్మిక
దృష్టి.
చిన్నచిన్న
ఆటంకములకు
మనము
ఏమాత్రం
వెఱువకూడదు.
ఇవన్నీ
మధ్యమార్గంలో
వచ్చిపోయే
మేఘాలు.
ఎట్టి
అవాంతరములనైనా
ధైర్యంగా
ఎదుర్కొని
సాధించినప్పుడే
అతీతమైన
ఆనంద
మును
పొందవచ్చును.
కష్టములను
ధైర్యంగా
ఎదుర్కొన్నప్పుడే
మానవత్వము
వికసిస్తుంది.
ఈ
‘ఓణం’
పండుగనాడు
మీరు
చాలా
ఉత్తమమైన
ఆదర్శవంతమైన
అనుభూతిని
అందుకోవాలి.
‘ఓణం’
అనేది
సర్వులకు
ఆనందాన్ని
అందించే
పండుగ.
మన
ఆనందమును
పదిమందితో
పంచుకోవాలి.
మనము
కూడా
దానిని
పెంచుకోవాలి.
ఎప్పుడైనా
సరే,
బాధలు
లేకుండా
ఆనందము
మనకు
లభించదు.
‘న
సుఖాత్
లభతే
సుఖం’,
సుఖమునుండి
మనము
సుఖమును
పొందలేము.
మధ్యలో
కొన్ని
కష్టములు
కలుగటంచేతనే
ఆనందమునకు
మనం
విలువ
ఇస్తున్నాము.
పెద్ద
పెద్ద
పర్వతములవంటి
బాధలు
సంభవించినప్పటికీ
వీటిని
మనం
అల్పమైనవిగా
భావించుకొని
దాటుకొని
పోవాలి.
మనస్సులో
వాటికి
చోటే
ఇవ్వకూడదు.
మనస్సు
చంచలమైనది.
కనుక,
మనస్సులో
ప్రవేశించకుండా
వాటిని
అడ్డుకోవాలేగాని,
వాటికి
స్వాగత
మివ్వకూడదు.
అసలు
మనస్సే
మనకు
అడ్డు
తగిలే
మాయవంటిది.
మనము
మనస్సుకు
ఏమాత్రము
అదిరి
బెదిరి
లోబడకూడదు.
మనస్సును
మనం
ఎదుర్కోవాలి.
దానిని
కూలగొట్టాలి.
అప్పుడే
మనం
దివ్యత్వమును
పొందగలము.
మాయతో
వచ్చిన
మనస్సుకు
బెదురుకొని
మనం
దానికి
లొంగిపోతున్నాము.
మనస్సు
నుండి
మనకు
ఎన్నో
ప్రమాదములు
సంభవిస్తున్నాయి.
కనుక,
మనస్సును
మనం
లెక్కచేయకూడదు.
దానికి
మనం
ఏమాత్రం
లొంగిపోకూడదు.
మనస్సును
సాధించి
నటువంటివాడే
నిజమైన
మనిషి.
మనస్సును
సాధించలేనివాడు
మనిషే
కాదు.
చిన్నచిన్న
బాధలకు
మనం
లొంగిపోతుంటే
మనం
మనుషుల
మెట్లవుతాము?
చిన్నచిన్న
చీమలు
కూడ
ఏవైనా
అడ్డంకులు
వస్తే
దాటుకొని
పోతుంటాయి.
కేవలం
మానవులకు
మాత్రమే
కాదు;
చీమలు,
పక్షులు
మొదలుకొని
సర్వజీవులకూ
బాధలు
కలుగుతూనే
ఉంటాయి.
చీమలో
ఏ
బాధ
ఉంటుందో
మనిషిలో
కూడా
అదే
బాధ
ఉంటుంది.
చిన్న
చీమలు
కూడను
కష్టాలను
సహించుకొని
జీవితాన్ని
గడుపుతుండగా
ఇంత
పెద్ద
మానవుడు
బాధలను
భరించుకోలేడా?
కాని,
మానవుడు
చిన్నచిన్న
కష్టాలకు
కూడా
లొంగిపోతున్నాడు.
కష్టాలను,
బాధలను
ధైర్యంగా
ఎదుర్కొని
వాటిని
క్రిందికి
నెట్టివేయాలి.
4
▾
Meaning
Keep
అప్పుడే
మనము
దైవాన్ని
పొందటానికి
వీలవుతుంది.
ప్రేమశక్తిచేత
ఎటువంటి
బాధలనైనా
జయించవచ్చు
ప్రేమస్వరూపులారా!
దైవప్రేమను
మించినటువంటిది
ఈలోకంలో
ఎక్కడకూడను
లేదు.
మీరందరూ
ప్రేమనుండి
పుట్టినటువంటివారే!
ప్రేమచేతనే
మీరు
బ్రతుకుతున్నారు.
ప్రేమచేతనే
మీ
జీవితాన్ని
సార్థకం
గావించుకోవాలి.
ప్రేమనే
ప్రధానంగా
తీసుకోవాలి.
ప్రేమను
తప్ప
మరి
దేనినీ
ఆశించకూడదు.
ప్రేమను
మించినది
లోకంలో
మరొకటి
లేనే
లేదు.
బంగారము,
వెండి,
వజ్రవైఢూర్యములు
ఇవన్నీ
మానవుణ్ణి
భ్రమలో
ముంచేటటువంటివి.
వీటినేమాత్రం
లెక్కచేయకుండా
దైవముపై
మన
దృష్టిని
నిల్పుకొని
నిత్యజీవితాన్ని
గడుపుతూ
రావాలి.
అప్పుడే
మనకు
మానవులనే
పేరు
సార్థకమవుతుంది.
మానవత్వము
సార్థకము
కావలెనన్న
మధ్యలో
కలిగే
విచారములను,
కష్టములను
దుఃఖములను
దేనినీ
లెక్కచేయకుండా
పోవాలి.
దైవానుగ్రహం
పొందే
మనం
దేనినైనా
సాధించగలము.
మనకు
వచ్చిన
అల్పమైన
బాధలను
దైవము
క్షణములో
పోగొట్టగలడు.
అటువంటి
దైవశక్తిని
మనవద్దనే
ఉంచుకొని
అల్పమైన
శక్తులకై
మనం
ఎందుకు
ఆరాటపడుతున్నాము?
నిజముగా
మన
ప్రేమయే
దైవశక్తి.
అట్టి
ప్రేమశక్తిని
మనం
అభివృద్ధి
చేసుకుంటే
దేనినైనా
సాధించవచ్చు;
పర్వతములవంటి
బాధలనైనా
ఒక్క
క్షణములో
జయించవచ్చును.
కనుక,
మనం
దేనికీ
భయపడకూడదు.
ఒక్క
పాపమునకు
మాత్రమే
భయపడాలి.
పాపభీతి,
దైవప్రీతి,
సంఘనీతి...
ఈ
మూడింటినీ
మనం
అభివృద్ధి
పరచుకోవాలి.
కాని,
ఈనాడు
మనం
పాపమునకు
లొంగిపోతున్నాము.
దైవాన్ని
ఏమాత్రం
ప్రేమించటం
లేదు.
ఇది
చాలా
పిరికితనము.
దైవమునకే
మనం
లొంగాలి.
దైవప్రీతి
అభివృద్ధి
అయినప్పుడే
పాపభీతి
కలుగుతుంది.
కాబట్టి,
దైవాన్నే
మనం
ఆశించాలి.
దైవమునకు
అర్పితం
కావటానికి
మనం
ఎల్లవేళల
సిద్ధంగా
ఉండాలి.
త్యాగరాజు
కూడా
చెప్పాడు
“స్వామీ!
నేను
పాపమునకు
భయపడుతున్నానుగాని,
నీ
ప్రేమకు
లొంగటం
లేదు.
నీ
ప్రేమకు
నేను
లొంగాలి’
అని.
ఇంతకాలము
మనం
పుట్టి,
పెరిగి
సాధించిన
దేమిటి?
దైవాన్ని
చింతించేవాడు
పాపమును
ప్రక్కకు
నెట్టాలి.
దైవప్రీతి
అనే
భాగ్యాన్ని
మనం
సాధించాలి.
అంతకంటే
మించిన
భాగ్యము
మరెక్కడా
లభించదు.
ఎన్ని
బాధలు
వచ్చినా
ఏమాత్రం
లెక్కచేయకూడదు.
వాటిని
ప్రక్కకు
త్రోసి
దైవముకోసం
పాటుపడాలి.
5
▾
Meaning
Keep
నిజమైన
వ్యక్తిత్వము
ప్రేమస్వరూపులారా!
మీరందరూ
దైవప్రీతికోసం
వచ్చినవారేగాని,
పాపప్రీతికోసం
వచ్చినవారు
కాదు.
పాపమునకు
భయపడాలి.
కష్టములకు
మనం
లొంగకూడదు.
దుఃఖమునకు
మనం
లోబడకూడదు.
నదీప్రవాహములో
మనం
దిగినప్పుడు
అలలు
ఎంతగానో
అడ్డువస్తుంటాయి.
అడ్డువచ్చిన
అలలను
ప్రక్కకు
పెట్టినప్పుడే
మనము
ముందుకు
కొనసాగటానికి
వీలవుతుంది.
అదేవిధముగా,
మనం
జీవితములో
ముందుకు
సాగవలెనను
కుంటే
మనకు
అడ్డు
వచ్చే
కష్టములను,
దుఃఖమును
ప్రక్కకు
నెట్టివేయాలి.
చిన్న
బిడ్డ
మొదలుకొని
పెద్దమనిషి
వరకు
ప్రతి
ఒక్కరూ
ప్రేమను
పెంచుకోవాలి.
దానినే
‘పర్సనాలిటీ’
అంటారు.
సాధారణంగా
జనులు
దేహముయొక్క
ఒడ్డు,
పొడవు,
లావు...వీటిని
దృష్టిలో
పెట్టుకొని
‘పర్సనాలిటీ’
అనే
పదాన్ని
ఉపయోగిస్తారు.
ఇది
చాలా
పొరపాటు.
కష్టనష్టములకు
లొంగకుండా
ధైర్యసాహసములతో
ఆనందముకోసం
పాటుపడటమే
నిజమైన
‘పర్సనాలిటి’.
ఇటువంటి
‘పర్సనాలిటీ’ని
దైవము
అందరికీ
అనుగ్రహించాడు.
కాని,
దానిని
మనం
మరచి
పోతున్నాము.
దివ్యత్వముతోకూడిన
మహత్తరమైన
శక్తినే
‘పర్సోనా’
అన్నారు
మన
పూర్వీకులు.
ఈ
‘పర్సోనా’
అనేది
ప్రతి
మానవునికి
భగవంతుడు
అనుగ్రహించిన
వరప్రసాదము.
కాని,
దానిని
మనం
కాపాడుకోలేకపోతున్నాము.
చిక్కులు,
బాధలు,
కష్టములు
ఇవన్నీ
కదలిపోయే
మేఘాలవలె
వస్తాయి,
పోతాయి.
నిత్యసత్యమైన
దైవత్వమును
మనలోనే
పెట్టుకొని
ఈ
‘కదలిపోయే
మేఘాలను’
చూసి
ఎందుకు
భయపడాలి?
పిరికితనమునకు
మనం
ఏమాత్రం
చోటివ్వకూడదు.
ధైర్యముగా
వాటిని
సాధించాలి.
ప్రేమస్వరూపులారా!
ఈ
దేహము
నిమిత్తమై
మీరు
చాలా
బాధపడుతున్నారు.
దేహము
ఒక
నీటిబుడగ
వంటిది.
మనసు
ఒక
పిచ్చికోతివంటిది.
ఈ
‘పిచ్చికోతి’ని
మనమేమాత్రం
లెక్కచేయకూడదు.
ఈ
‘కదలిపోయే
మేఘాల’కు
ఏమాత్రం
భయపడకూడదు.
అన్నీ
వస్తుంటాయి.
పోతుంటాయి.
దివ్యమైన
ఆత్మతత్త్వాన్ని
మనం
దృఢంగా
నమ్మాలి.
దివ్యత్వమును
నమ్మనివారికే
ఈ
భయాలన్నీ
కలుగుతుంటాయి.
కనుక,
మీరు
దివ్యత్వాన్ని
సంపూర్ణంగా
నమ్మండి.
మిమ్మల్ని
సర్వవిధముల
రక్షించేది
అదియే!
దైవ
సంకల్పమునకు
సాధ్యము
కానిది
లేదు.
అటువంటి
దైవము
మీ
ఇంట,
వెంట,
జంట
ఉండగా
మీరు
ఎందుకు
భయపడాలి?
6
▾
Meaning
Keep
ధైర్యముతో
ముందంజ
వేయాలి.
దైవ
విశ్వాసముకంటే
గొప్ప
బలవత్తరమైన
శక్తి
ఈ
జగత్తులో
ఎక్కడా
కానరాదు.
మళ్ళీ
చిన్నపిల్లలుగా
తయారుకండి!
ఈ
బాలబాలికలందరూ
ఇక్కడకు
చేరి
ఎంతో
పవిత్రంగా
కాలమును
గడుపుతున్నారు.
నిజంగా
ఈ
పిల్లల
భాగ్యమే
భాగ్యము.
ఈ
భాగ్యము
కేవలం
వారి
తల్లిదండ్రులు
చేసుకున్న
పుణ్యమే!
(ఒక
బాలికను
చూపిస్తూ)
ఆ
చిన్నబిడ్డ
డ్యాన్సు
చేసేటప్పుడు
తన
తోటిపిల్లలు
ఎలా
చేస్తున్నారో
అని
తన
దృష్టిని
వాళ్ళ
కాళ్ళపై
పెట్టుకొంది.
ఆ
డ్యాన్సులో
తన
అడుగు
సరిగా
పడుతున్నదా
లేదా,
అందరూ
ఆడుతున్నట్లు
తాను
ఆడుతున్నానా
లేదా
అని
చక్కగా
గమనించింది.
(స్వామి
ఆ
బాలికను
దగ్గరికి
పిలిచి
ఒక
సువర్ణహారమును
సృష్టించి
ప్రసాదించారు)
ప్రేమస్వరూపులారా!
మీరందరూ
మళ్ళీ
చిన్న
పిల్లలుగా
తయారైతే
నాకెంతో
ఆనందము.
పిల్లలలో
కోపతాపములు,
అసూయ,
డంబము,
అహంకారము
వంటి
దుర్గుణాలు
ఉండవు.
ఒక
పర్యాయం
ఏసుక్రీస్తు
తన
చుట్టూ
చేరిన
గుంపులో
ఒక
తల్లివద్ద
చంటిబిడ్డను
చూశాడు.
ఆ
బిడ్డను
ఎత్తుకొని
“ఈ
చంటి
బిడ్డ
అంటే
నాకెంతో
ప్రీతి.
ఎందుకంటే
ఈ
బిడ్డ
యొక్క
భావములన్నీ
భగవంతుని
భావములవలె
నిర్మలమైనవి,
నిశ్చలమైనవి,
నిస్వార్థమైనవి
అన్నాడు.
పెరిగేకొలదీ
పిల్లలలో
ఆశాపాశములు,
కోప
తాపములు
ప్రారంభమవుతుంటాయి.
వాటితోపాటు
విచారములు
కూడా
పెరుగుతుంటాయి.
కనుకనే,
వయస్సు
పెరిగేకొలదీ
మనం
కోరికలను
తగ్గించుకుంటూ
రావాలి.
కోరికపై
మనం
అదుపు
సాధించాలి.
అప్పుడే
మనలో
దైవశక్తి
ఆవిర్భవిస్తుంది.
వయస్సు
పెరిగేకొలదీ
మనలోని
ఆశలే
మనలను
క్రుంగదీస్తున్నాయి.
కాబట్టి,
ఆ
మాయను
మనం
పూర్తిగా
తొలగించుకోవాలి.
చిన్నబిడ్డలకు
ఎంత
నిర్మలమైన
భావము!
ఎంత
నిశ్చలమైన
తత్త్వము!
ఎంత
నిస్వార్థమైన
సంకల్పము!
అదియే
దైవత్వమునకు
చిహ్నము.
మనము
అట్టి
నిర్మలమైన,
నిశ్చలమైన,
నిస్వార్థమైన
భావములతో
జీవించాలి.
ప్రేమస్వరూపులారా!
దినమునకు
కనీసం
ఒక్క
నిమిషమైనా
మీరు
చిన్నపిల్లలుగా
తయారుకండి.
కోరికలు
తలెత్తితే
‘ఛీ
ఇవి
నాకు
తగినవి
కావు’
అని
వాటిని
ప్రక్కకు
నెట్టండి.
ఆవిధంగా
కోరికలను
ఛీకొట్టినప్పుడే
మనం
ధైర్యంగా
నిలువగలము.
7
▾
Meaning
Keep
కోరికలపై
అదుపు
సాధించండి!
కొద్దినిమిషాల
క్రిందట
ఈ
ముక్కులోనుండి
రక్తము
ధారగా
కారుతూ
వచ్చింది.
కాని,
దానికి
లొంగితే
అది
ఇంకా
ఎక్కువైపోయేది.
ఛీ,
దీనికా
నేను
లొంగేది?
దీనికి
ఏమాత్రం
లొంగకూడదని
నేను
ధైర్యంతో
లేచి
వెళ్ళి
తుడుచుకొని
తక్షణమే
వచ్చాను.
ఈ
రక్తము
తినే
ఆహారముతో
పెరిగినదే
కదా!
మనము
పెంచుకున్న
రక్తాన్ని
చూసి
మనమే
భయపడిపోతే
ప్రయోజనమేమి?
ఎక్కడున్నా
సరే,
మనం
కోరికలపై
అదుపును
సాధించాలి.
అప్పుడే
మనం
నిజమైన
మానవులమవుతాము.
మాధవత్వానికి
దగ్గరవుతాము.
మీరు
కోరికలపై
ఎంత
అదుపు
సాధిస్తారో
దైవానికి
అంత
దగ్గరైపోతారు.
ప్రేమకు
మించిన
దైవము
లేదు.
ప్రేమయే
దైవము.
ప్రేమలో
జీవించండి.
ఇదే
ఈనాడు
మీరునేర్చుకోవలసినది.
నీ
దేహమును
కోస్తే
రక్తము,
మరో
దేహమును
కోస్తే
పాలో,
ఇంకో
దేహమును
కోస్తే
నీరో
రావటం
జరగదు.
అందరియందు
ప్రవహిస్తున్నది
రక్తమే!
అట్లే,
సర్వ
జీవాత్మ
ప్రేమ
ఒక్కటే.
కాబట్టి,
అందరినీ
ప్రేమించండి.
కోపతాపాలను
ఏమాత్రం
దగ్గరకు
చేర్చుకోకండి.
ప్రేమయే
దైవము,
ప్రేమయే
ధైర్యము
ప్రేమస్వరూపులారా!
ప్రేమలో
ఎట్టి
భేదములూ
రావు.
ప్రేమయే
మీ
ప్రాణంగా
భావించండి.
ఎట్టి
పరిస్థితిలోనైనా
ప్రేమను
దూరం
చేసుకోకండి.
మనకు
పుట్టిన
బిడ్డను
మనం
ఎంతగా
ప్రేమిస్తామో
పరుల
బిడ్డలను
కూడా
మనం
అంతగా
ప్రేమించాలి.
మన
ప్రేమను
అందరికీ
పంచుకునే
నిమిత్తమై
ఓణం
పండుగ
వచ్చింది.
ప్రేమను
పెంచుకునే
నిమిత్తమై
మనం
పుట్టాము.
ప్రేమను
పెంచుకొనకపోతే
మన
జీవితమంతా
వ్యర్థమైపోతుంది.
ప్రేమయే
దైవము,
ప్రేమయే
ధైర్యము.
కాబట్టి,
ప్రేమతో
జీవించండి.
ప్రేమను
నిలుపుకోండి.
(‘ప్రేమ
ముదిత
మనసె
కహో
రామ
రామ
రామ్....’
అనే
భజన
గీతము
పాడిన
తరువాత
శ్రీవారు
తమ
దివ్యోపన్యాసమును
కొనసాగిస్తూ
ఇలా
అన్నారు)
నాకు
డాక్టర్సు
చెప్పారు
“స్వామీ!
ఈసమయంలో
మీరు
బయటికి
పోయి
ఉపన్యాసం
ఇవ్వటానికి
పూనుకోకూడదు”
అని.
“దేనికోసం?”
అన్నాను.
“మీరు
మాట్లాడుతుంటే
మళ్ళీ
రక్తం
రావచ్చు”
అన్నారు.
“ఎట్లా
వస్తుందో
చూస్తాను”అన్నాను.
కష్టాన్ని
ధైర్యంగా
ఎదుర్కొంటే
అది
కూడా
మనకు
భయపడిపోతుంది.
కనుక
ఏదైనా
కష్టము
వచ్చినప్పుడు
మనం
దుఃఖపడకూడదు.
8
▾
Meaning
Keep
దానిని
ఎదుర్కొని
ధైర్యంగా
సాధించటానికి
పూనుకోవాలి.
ఒక్కొక్కసారి
దుఃఖము
వస్తుంది.
మిమ్మల్ని
పెంచి
పెద్దచేసిన
తల్లిదండ్రులు
పోతే
మీకు
ఎంతో
బాధ
కల్గుతుంది.
కాని,
ఆ
బాధకు
లొంగిపోకూడదు.
తల్లిదండ్రులపట్ల
కృతజ్ఞతను
మీ
హృదయంలో
నిల్పుకొని
ధైర్యంతో
ఆ
దుఃఖాన్ని
ఎదుర్కోవాలి.
ప్రేమస్వరూపులారా!
అధికంగా
మాట్లాడి
మీకు
మరింత
శ్రమ
కలిగిస్తున్నానేమో!
అయితే,
మీకు
ధైర్యం
కలిగించాలనే
నేను
అధికంగా
మాట్లాడుతున్నాను.
(స్వామి
ముక్కునుండి
రక్తము
కారుతున్నప్పుడు)
మా
పిల్లలు
ఆ
రూములో
చేరి
బిక్కమొహం
వేసుకొని
కూర్చున్నారు.
“మీరేమీ
భయపడకండి
నేనిప్పుడు
బయటికి
పోతాను.
దీనికి
తగిన
ఔషధమునందిస్తాను.
ఈ
ధైర్యమే
నాకు
నిజమైన
బలము.
అదే
మీకు
ఈ
దుఃఖాన్ని
మరపింపజేస్తుంది.
రండి,
పోదాం”
అన్నాను.
రక్తముతో
తడిసిన
గుడ్డలను
చూసి
వాళ్ళు
చాలా
బాధపడ్డారు.
“ఏమిటీ
పిచ్చి?
చాకలికి
వేస్తే
అన్నీ
శుభ్రమైపోతాయి”
అని
చెప్పాను.
అయితే,
మన
దుఃఖమనే
రక్తాన్ని
ఏ
చాకలీ
శుభ్రం
చేయలేడు.
దైవము
యొక్క
ప్రేమయే
దానిని
శుభ్రం
చేస్తుంది.
కాబట్టి,
దైవప్రేమను
పెంచుకోండి
మీ
దుఃఖము
నివారణ
అవుతుంది.
Previous
←
Do nāmasmaraṇa for peace of mind!
Next
God Delights in Song, the Lover of Song
→