Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1966 · Which is real? This or that?
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Which is real? This or that?
October 1966, Dasara
1
▾
Meaning
Keep
From
Bhaja Govindam, verse 9
Also in his talks
(18)
24 May 1973
Satsaṅga
13 March 1978
The end of education is character
13 February 1986
The whole of man's life rests on karma
10 February 1990
Human values in business management
24 May 1990
Hold the Reins
21 November 1990
Seva that sanctifies
28 February 1995
God, master of the three
17 February 1996
Equal-mindedness is the culture of Bhārata
8 July 1996
Through Good Company Man Can Attain Divinity
22 August 1996
You Yourself Are God
29 September 1998
The Heart Itself Is the Himācala, Īśvara Himself the Lord of the Heart
10 June 2001
He who serves in a spirit of sacrifice is the true doctor
22 October 2005
Sāttvic Food and Good Company Are Essential
22 November 2005
True Education Fosters Selfless Prema
14 August 2006
Follow the Ātma within you
5 September 2006
What God expects from devotees is purity of heart
28 July 2007
Every human being is God
7 March 2008
Do the deeds that please God
నానాకోలాహల
సమయమైనటువంటి
జనసముదాయము
సంసారమనే
నావలో
సంచారముచేయటానికి
దీపగృహమే
ఆధ్యాత్మిక
జ్యోతి.
అటువంటి
దివ్యమైన
శక్తిని
పొందటానికి
ప్రయత్నించకుండా
మానవులు
నిరంతర
తాపత్రయములతో,
అంతులేని
ఆవేదనలతో,
అప్రాప్తప్రాప్తికోసరము
అల్లాడుతుంటారు.
దీనికి
దారిచూపే
చక్కని
జ్యోతి
ఆధ్యాత్మికజ్యోతియే.
అది
ఎప్పుడూ
మన
వెంట
జంట
ఉండటము
మరచిపోయినామంటే
అది
కేవలం
అవివేకమే
తప్ప,
వివేకం
కాదు.
చిక్కిన
దాన్ని
సార్థకం
చేయకుండా
వ్యర్థంచేస్తున్నాడు
మానవుడు.
ఈ
ప్రకృతి
వికృతి
స్వరూపమును
చూస్తే
నవ్వాలా,
ఏడ్వాలా
అని
తెలియదు.
అన్నీ
తెలుసనుకొనే
మానవుడు
దీన్ని
మాత్రము
తెలుసుకొనలేదు.
వ్యక్తిత్వం
అనేది
యిప్పుడు
లోకంలో
ఎట్లున్నదంటే,
సృష్టియొక్క
విశిష్టత
ఏమి
అని
తెలియకుండా,
జనన
మరణములకు
మధ్యస్థితిలో
ఉంటున్నారు.
ప్రతి
మానవుడు
శాంతిసంతోషములను
ఆశిస్తూ
దానికోసము
ప్రాకులాడుతున్నాడు.
అవి
చేతికి
చిక్కక,
దక్కక
తిరుగుతాయి.
నిర్విరామ
కృషిచేస్తూ
రింగువలె,
బొంగరమువలె
తిరిగినా
చిక్కేది
ఏమి?
దక్కేది
ఏమి?
దానిని
యోచించటం
లేదు.
ప్రపంచములో
మానవత్వమును
సార్థకం
చేయటానికి
దివ్య
ఆధ్యాత్మికమును
ముందు
ఆశించాలి.
అప్పుడే
ఆనందం,
సౌఖ్యం,
సౌభాగ్యం
పొందవచ్చును.
మన
ప్రిన్సిపాలెగారు
చెప్పినారు,
ప్రపంచములో
అన్నియూ
‘రీజన్’
వల్ల
చెడిపోతున్నదని.
‘రీజన్’
మంచిదేగాని
మేటరే
సరిలేదు.
మానవుడు
హృదయభూమిలో
సంచరించే
ఆత్మతత్త్వమును
తెలుసుకొనలేక
అవకతవకతో
చేరడం
వల్ల
చెడి,
మానవత్వములోనున్న
విశిష్టతను
తెలుసుకోకుండా
మనం
యేదాన్ని
ప్రధానముగా
తీసుకోవలయును
అనే
ఆదర్శం
లేనిదే
ఏమాత్రం
సార్థకం
కాదు.
పత్తిలేని
వస్త్రం,
బంగారులేని
నగ,
మట్టిలేని
కుండ,
కఱ్ఱలేక
స్టూలు
లేనట్టే
బ్రహ్మలేని
ప్రకృతిలేదు.
బ్రహ్మతత్త్వమును
హృదయపీఠంపై
ప్రతిష్టింపచేసుకోవలయును.
తాత్కాలికంగా
ప్రాకులాడితే
లాభం
ఏమి?
మానవత్వమంటే
ఇంద్రియములా?
దేహమా?
మనసా?
అంతఃకరణమా?
ఏది?
ఇలాంటి
కొన్ని
విషయములలోపల
మనం
ఎక్కడనుండి
వచ్చినాము?
ఎక్కడకు
పోతున్నాము?
అని
మన
జీవితమును
ఎంతవరకు
నిర్ణయించగలము?
యోచిస్తే
నీవెవరు
నీవెవరని
చిక్కినవారినంతా
ప్రశ్నిస్తాంకాని
నేనెవరనేది
మాత్రం
లేదు.
లోకములోని
న్యూస్
అంతా
వీని
నాకర్షిస్తున్నాదిగాని
తనలోని
న్యూస్
మాత్రం
తెలియదు.
ఏది
తెలిసినా
తెలియకపోయినా
తానెవరని
తెల్సుకోలేకపోతే
తెలిసినదంతా
వ్యర్థమేగాని
సార్థకంకాదు.
ఆత్మతత్త్వమునుండి
వచ్చాము.
తిరిగి
ఆత్మతత్త్వములోనే
చేరవలయును.
సముద్రములోని
జలము
మేఘమై,
వర్షముగా
మారి
ప్రవాహమై
తిరిగి
సముద్రములోనే
లీనమౌతుంది.
అదేరీతిగా
అంతఃకరణమనేది
ఆత్మసముద్రమునుండి
బయలుదేరి
ప్రకృతి
ప్రవాహముతో
కలసి,
తిరిగి
ఆత్మతత్త్వమునే
చేరాలి.
మనకు
ఫ్రమ్
అడ్రస్
తెలియదు,
టు
ఎడ్రస్
తెలియదు.
ఉన్న
ఎడ్రస్
మాత్రము
తెలుసు.
ఇలాంటి
జీవిత
లక్ష్యమును
దీర్చుకోటానికే
పెద్దల
సంగము
కావాలన్నది.
‘సత్సంగత్వే
నిస్సంగత్వం
నిస్సంగత్వే
నిర్మోహత్వం
నిర్మోహత్వే
నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే
జీవన్ముక్తిః
అన్నట్లు
అప్పుడే
అన్నిటిలోను
వ్యాపించియున్నదాన్ని
తెలుసుకోవచ్చు.
దానికీ
కొన్ని
నియమనిష్ఠలను
పాటించాలి.
ఇప్పుడు
భారతదేశములోని
రాజకీయ,
సాంఘిక
పరిస్థితులు
ధర్మముపై
దాడిచేయటంవల్ల
మన
సనాతన
సంస్కృతిని
మరవడమైనది.
మన
లక్ష్యం
ఆధ్యాత్మిక
సంస్థపై
ఉండవలయును.
అప్పుడే
జీవితములో
ఆనందము.
నేడు
ఉండే
సంస్థ
రేపు
ఉండదు.
మతమునుకూడా
ఒక
సంస్థగానే
అనుకుంటున్నాం.
మతములోని
విశిష్టత,
సార్థకతను
విచారించటం
లేదు.
మతినుండియే
మతం
వచ్చినది.
మతియుండే
వ్యక్తికే
మతం.
మతములు
ఆత్మప్రశస్తిని
ఏకత్వమును
బోధిస్తాయి.
అనేకత్వమును
ప్రచారం
చేయటము
లేదు.
‘సహస్ర
శీర్షః
పురుషః’
అంటే
పరమాత్మునికి
వెయ్యి
తలలున్నాయని
అర్థం
కాదు.
ఇక్కడ
చేరిన
గుంపుకంతాకూడా
తలలు
వేరైనా
హృదయం
ఒక్కటే.
‘సహస్ర
శీర్షః’
అనేటప్పుడు
పరమాత్మ
సర్వులలో
నిండియున్నాడని
వర్ణించటమే
తప్ప
వేరుకాదు.
ఇప్పుడు
కరెంటు
ఉన్నాది.
అది
అలంకారానికి,
ఫ్యాన్,
లైట్
ఇంకా
మీకు
శ్రవణం
చేయటానికి
సహాయంచేస్తూ,
ఇంకా
మన
ఇంటిలోపల
ఎన్నోవిధములుగా
ఉపయోగపడుతున్నాది.
ఉపాధి
వేరుగాని
కరెంటు
ఒక్కటే.
అట్లనే
ప్రతి
వ్యక్తి
లోపలకూడా
పరమాత్మ
సమానముగా
పరిణమించియున్నాడు.
అని
అర్థం.
కాని,
ఒకే
పరమాత్మ
అందరిలో
సమానముగా
ఉంటున్నాడంటే,
ఇన్ని
కష్టములు
నష్టములు
అవస్థలు
ఎందుకు?
బాధలు
ఎందుకు?
అని
కొందరు
అర్థంలేని
వ్యర్థప్రశ్నలు
వేస్తుంటారు.
మనం
బైట
చూస్తున్నాముగాని
అంతర్ముఖంగా
చూడటంలేదు.
ఇది
ఉపాధిబేధంగాని
అంతరాత్మలో
బేధంలేదు.
కష్టసుఖములు
ఉపాధికే.
ఇప్పుడు
చూడండి.
మన
ఇంటిలో
సాయంకాలము
మంచి
ఎక్కువ
కాంతిగల
లైటు
వేసుకొన్నాము.
పండుకునేటప్పుడు
చాలా
డిమ్‌గా
వుండేది
పెట్టుకుంటాము.
ప్రకాశముగా
వుండేది
డిమ్ముగా
వుండేది
బల్బులో
వుందిగానీ
కరెంటు
తప్పేమీలేదు.
అదేరీతిగా
పరమాత్మలో
మార్పులేదు.
అది
మన
దోషమే!
దేహము
ధరించినాము.
ఇది
సత్యము,
ఇది
నిత్యము,
నిర్మలము
అనుకుంటున్నాము.
విశ్వసిస్తున్నాము.
అయితే,
ఇది
అసత్యం,
అనిత్యం,
బూటకం.
2
▾
Meaning
Keep
యోచించితే
ఈ
ప్రత్యక్షత,
ఈ
శ్రవణం,
వాక్కు,
చూపు
ఏదీ
సత్యం
కానేరదు.
‘మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’
ఇంద్రియములు
కొన్ని
దృశ్యములను
ఆధారంగా
పెట్టుకొనటమే
మనసు.
మనసు
ఎక్కడో
సంచారం
చేస్తుంటే
ఎదురుగా
వుండేదేదీ
కనబడదు.
అది
కనుల
దోషం
కాదు.
కన్నులు
బల్బు,
మనస్సు
సెల్స్,
దేహమే
టార్చి,
ఏకాగ్రత
అనేది
స్విచ్.
కాబట్టి,
ఇది
ఇంద్రియ
ప్రమాణమేగాని
ప్రత్యక్ష
ప్రమాణంకాదు.
ఇది
అసత్యం.
తీపి,
కారం,
పులుపుఅని
ఉండటం
వస్తులక్షణం.
మలేరియానో
లేక
ఏదో
జ్వరం
వచ్చిఆరోగ్యము
చెడినప్పుడు
అంతా
చేదుగా
మారిపోతుంది.
ఇంద్రియ
దోషం
వల్ల
అన్నీ
సమాన
రుచిగా
వుంటుందిగాని
అది
వస్తుదోషంకాదు.
అలాంటి
దోషమున్నప్పుడు
పవిత్రమైన
పదార్థములను
అందించినా
అరుచిగానే
వుంటుంది.
ఇప్పుడు
మనవారికి
ఉండేది
అజ్ఞానజబ్బు.
ఆ
రోగనివారణకోసం
ఆధ్యాత్మిక
పదార్థములను
అందిస్తాము.
రోగం
రావటం
సహజమే.
రోగం
రాకుండా
ఉండటానికి
ప్రయత్నం
చేయాలిగాని
వచ్చిన
తరువాత
వచ్చిందేయని
బాధపడటం
వ్యర్థం.
‘భయాంతకః
భారత’
అన్నారు.
అలాంటి
భారతదేశములో
ఈనాడు
ఏవిధముగా
వినియోగపరచుకొంటున్నామంటే
భగవంతుడు
అంటే
హాస్యాస్పదముగా
చూస్తున్నాము.
పరమతముల
సహాయమును
వర్ణిస్తాముగాని
స్వమతంపై
గౌరవములేదు.
యోచిస్తే
పరమతం
వేరు,
స్వమతం
వేరు
లేదు.
అట్లనుకోటం
అజ్ఞానమే.
మీరు
వినియుంటారు.
ఒక
ఏనుగును
ఏడుగురు
గ్రుడ్డివారు
వచ్చి
ఒకరు
తోకను
పట్టుకొని
ఏనుగు
పాము
మాదిరి
ఉందని,
ఇంకొకడు
కాలును
పట్టుకొని
ఏనుగు
స్తంభం
మాదిరిగా
ఉందని,
మరొకడు
చెవులు
తాకి
ఏనుగు
చేటమాదిరి
ఉందని
అన్నారట.
కథ
చాలా
సులభంగానే
ఉంటున్నాదిగాని
అంతరార్థం
చాలా
గాఢంగా
ఉంటున్నాది.
అంతరార్థం
చూస్తేనే
పదార్థముయొక్క
యదార్థత
తెలుస్తుంది.
ఆత్మతత్త్వమనేది
ఏకత్వమునే
బోధిస్తుంది.
అప్పుడే
ఆ
ధర్మఏనుగును
తెలుసుకోగలం.
అదిలేక
ఈ
మతధర్మమింతే,
ఈ
మతధర్మమింతే,ఈ
మతధర్మమింతే
అంటే
అన్ని
మతధర్మములు
చేరితేనే
ఏనుగు
అవుతుంది.
ఇప్పుడు
చూడండి,
ఇంగ్లీషులో
నీళ్ళను
వాటర్
అంటారు.
సంస్కృతములో
వారి
అంటారు.
తమిళములో
తన్ని
అంటారు.
తురకంలో
పానీ
అంటారు.
ఒకే
పదార్థమునకు
ఇన్ని
పేర్లు
ఉన్నాయి.
అలాంటి
అనేక
భాషలకు,
అనేక
మతములకు
నివాసమైన
మన
భారతదేశము
ఒక
రమణీయమైన
రంగం.
ఇది
ఎలా
రక్షణపెట్టగలిగి
ఉన్నాదంటే,
మూడు
ప్రక్కలా
చల్లని
నీలిరంగులు
గల
అలలతో
ఆహ్వానమిచ్చే
సముద్రము!
పెద్దశిఖరముతో
సింహద్వారమువలె
ఉత్తరములో
హిమాచలముంటున్నాది.
ఇలాంటి
భారతదేశమును
కొందరు
భక్షిస్తున్నారంటే,
మనకు
మనమే
భక్షించేస్తున్నాంగానీ
పరులు
కాదు.
మనలో
మనము
ఆయుధములేని
దండయాత్రలు
చేస్తూ
ఇతరులని
భావిస్తున్నాము.
ఈర్ష్య,
కోపం,
డంభం
వంటి
దండయాత్రలను
మొట్టమొదట
మనం
నివారణచేసుకోవాలి.
ఇల్లు,
గ్రామం,
జిల్లా,
రాష్ట్రం,
దేశమని
మన
హృదయంలోపల
చేసే
అంతర్
దండయాత్రలను
మాని
దాన్ని
మొట్టమొదట
చక్కచేసుకొని,
నివారణచేసే
కంకణము
కట్టుకోవాలి.
మనసులోనే
కామ,
క్రోధ,
మద,
మాత్సర్యాలనే
ఇన్ని
దండయాత్రలుంటే,
పరులను
నిలుపటం
సాధ్యమా?
రాజ్యాలు
జయించిన
వాడు
రాజుకావచ్చును.
ఇంద్రియములను
జయించినవాడు
చక్రవర్తి.
ఇంద్రియనిగ్రహమనే
సాధనకు
మనం
ప్రయత్నించాలి.
నాకు
అన్నీ
తెలుసు
అంటారు.
తెలిసినదానిని
వినియోగ
పరచినప్పుడే
సార్థకమవుతుందిగాని
లేకుంటే
వ్యర్థమే.
మనం
ఎక్కడనుంచి
వచ్చాం?
ఎక్కడకు
పోతున్నాం?
దీన్ని
సాధించ
ప్రయత్నంచేస్తే
సార్థకమౌతుంది.
జనకమహారాజు
అనేక
మహర్షులతో
కలసి
ఆత్మశోధనచేస్తూ
రాజయోగంలోపల
నిర్వికల్ప
సమాధిని
పొందుతుండేవాడు.
అలాంటి
సమయంలోపల
ఒక
సాయంకాలము
తన
రాణి,
చెలికత్తె,
ఇంకా
పరివారముతో
ఉంటుండే
సమయములో
మాట్లాడుతూ
మాట్లాడుతూ
అట్లనే
నిద్రపోయినాడు.
ఆ
నిద్రలో
స్వప్నం
వచ్చింది.
తన
రాజ్యమంతా
పోయినట్లు,
తాను
పిచ్చిపట్టి
భిక్షమెత్తుతూ
అరణ్యమంతా
తిరుగుతున్నట్లు,
అప్పుడు
కొంతమంది
పనివాళ్ళంతా
భోజనముచేసి
ఆ
పాత్రలను
కడుగుతున్నప్పుడు
తాను
ఆకలి
బాధ
తట్టుకోలేక
అక్కడికి
పరుగెత్తి
యాచించినట్లు,
అప్పుడు
వారు
ఆ
పాత్రలలో
అడుగున
మాడిపోయి
ఉన్న
అన్నమును
చేర్చి
చేతిలో
వేసినట్లు.
దాన్ని
తాను
నోట్లో
వేసుకోబోయే
సమయములో
ఒక
గ్రద్ద
దాన్ని
కొట్టినట్లు,
ఆ
అన్నమంతా
క్రింద
పడినట్లు,
అదికూడా
చిక్కలేదే
అని
తను
బాధతో
‘అయ్యో’
అని
అరచినట్లు
స్వప్నము
వచ్చినది.
‘అయ్యో’
అని
ఒకతూరి
గట్టిగా
అరిచేటప్పటికి
కలలోని
అరుపు
భ్రాంతి
ఈ
భౌతికంలోపలే
వినిపించింది.
అది
విని
రాణి
భయపడి
రాజుని
లేపించింది.
లేచి
చూచేసరికి
తాను
రాజుగానే
ఉంటున్నాడు.
జనకచక్రవర్తిగా
ఉంటున్నాడు.
ఒక
సెకండు
మునుపు
బిక్షగాడుగా
ఉన్నాడు.
ఏది
నిజం?
ఇది
నిజమా?
అది
నిజమా?
తనకు
తానే
ప్రశ్నించుకున్నాడు.
రాణివారంతా
ఎంత
అడిగిననూ
‘ఏమీ
లేదు,
ఇది
నిజమా?
అది
నిజమా?’
ఇదే
చెప్తున్నాడు.
భయపడిపోయి
మంత్రులకు
చెప్పి
పంపినారు.
అందరూ
వచ్చి
చేరారు.
గురువైన
అష్టావక్రుడుకూడా
అక్కడికి
చేరాడు.
రాజును
చూచిన
తక్షణమే
విషయమేమని
తెలుసుకొని
అష్టావక్రుడు,
‘రాజా!
ఇదీ
నిజముకాదు,
అదీ
నిజముకాదు.
ఈ
రెండూ
చేరి
నీవొక్కడవు
ఉంటున్నావే
అదే
నిజం’
అన్నాడు.
ఇపుడు
మనము
ఎట్లు
ఉన్నామంటే
పగలెల్ల
ఇంటిలో
గడిపి
సాయంకాలము
ఇక్కడ
సమావేశమై
స్వామి
మాటలు
విని
ఆనందిస్తారు.
ఇది
ఎంతవరకు
నిజమంటే,
తిరిగి
ఇంటికిపోయి
భోజనముచేసి
పరుపుపైన
పండుకొని
నిద్రించేవరకు
నిజం.
అంటే
ఈ
జాగ్రత
స్వప్నం
వరకు
నిజం.
3
▾
Meaning
Keep
స్వప్నమా
జాగ్రత
వరకు
నిజం.
ఇది
నిజమా?
అది
నిజమా?
రెండూ
రెండు
నిద్రలే.
దీనికి
ఇంత
శ్రమపడటమా?
ఎందుకు?
ఎన్నిచేసినా
ఎన్ని
చూచినా
ఈ
ఆటలు
పాటలు
మాటలెంతవున్నా
జీవితపుబండి
ఆఖరికి
పోయేది
శ్మశానంవరకేకదా!
వేసే
ప్రతి
అడుగూ
కూడా
దాన్ని
సమీపించేదే.
కాని,
దానికి
దూరమయ్యేది
కాదు.
ఇదే
సత్యం
నిత్యమని
ఆహ్లాదపడటమా!
కొన్నికొన్ని
విషయములు
మహనీయులు
చెప్పటము
వినియుంటారు.
రెండు
విషయములు
తీసుకోండి.
రెండు
వదలండి
అని.
అప్పుడే
మనస్సు
సరైనటువంటి
మార్గమునకు
వస్తుంది.
ఇతరులు
మనకు
చేసిన
అపకారం,
మనము
చేసిన
ఉపకారం
మరవాలి.
దానికి
బదులు
మనం
తలక్రిందులుగా
జ్ఞాపకం
పెట్టుకుంటున్నాం.
ప్రతిదానికీ
లాభం
లాభం
అని
చూస్తే
యెంతవరకున్నా
మనకేవిధమగు
లాభమూ
లేదు.
కావలిసిన
ధనమంతా
సంపాదిస్తాం.
బ్యాంకులో
పెట్టుకొంటున్నాం.
భవనాలు
కట్టుకొంటున్నాం.
విద్యలు
నేర్చుకొంటున్నాం.
ఇవంతా
శ్వాస
ఉన్నవరకే
నిజంగాని
లక్షలు
పోసి
కట్టిన
ఇంటిలోపల
పోయిన
తరువాత
ఒక
నిముషమైనా
ఉంచరు.
ఏ
వరండాలోనో
వేస్తారు.
సత్యమును
యోచించాలి.
ఒక
విషయం
మీరే
యోచించండి.
‘నేను
అంటే
-
నీవు
దేహమా?
నా
కడుపు,
నా
తల,
నా
కాలు
అంటున్నావే!
నీవెవరు?
అంగములు
వేరు,
నీవు
వేరు.
నా
కడుపు
అంటున్నావుగాని
నేనే
కడుపు
అనటంలేదే’
యోచించితే
ఒక
సెకండులో
సత్యము
తెలిసిపోతుంది.
శ్వాస
ఈ
దేహములో
ఉన్నంతవరకు
అది
శివం.
వదిలిందా,
శవం.
శివానికి
శ్వాసమే
స్వరూపం.
దాన్ని
ఎప్పుడు
విశ్వసిస్తామో
అప్పుడే
ధన్యం.
అన్నివిధాలా
మనం
రోజూ
ముచ్చటలాడుతుంటాం.
అయితే
చూడండి!
ప్రపంచము
రెండు
దినాల
సంత,
జీవితము
రెండు
ఘడియల
ఆట,
దేహము
రెండు
క్షణముల
నీటిబుడగ.
ఈ
వస్తువాహనములంతయూ
స్వప్న
దృశ్యముల
వంటివే.
భక్తిమార్గములో
పోయేటప్పుడు
అనేక
ఆటంకములు
రావచ్చు.
భక్తులకు
అది
ఉపకారమేగాని
అపకారముకాదు.
ఈ
నిందనిష్ఠూరాలంతా
చక్కని
తీగను
కత్తిరిస్తే
యెంత
శోభితంగా
ఉంటుందో,
అట్లనే
మన
జీవితమునకు
శోభగానీ
క్షీణం
కాదు.
వాటినంతా
మూటకట్టి
సముద్రములో
పడవేయాలి.
అప్పుడే
శాంతిసంతోషాలు
లభిస్తాయి.
ఎగుడుదిగుడు
ప్రయాణము
తప్పేదికాదు.
మనకిది
ఉపకారమేగనుక
మన
జీవితమును
సార్థకం
చేసుకోటానికి
ఎన్ని
కష్టములు
వచ్చినా,
ఎన్ని
నష్టములకు
గురియైనా
లక్ష్యాన్ని
వదలకూడదు.
ఏవిధమైన
కష్టనష్టనిందనిష్ఠూరాలైనా
భగవదనుగ్రహముతో
అది
ఉపకారముగానే
మారును.
ఇవంతా
మనసును
కృశింపజేసే
మాయ.
‘మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’
అన్నారు.
దీని
తత్త్వం
ఏమిటి?
అంటే
మనస్సు
వట్టి
భ్రాంతి.
దానికి
రూపమా?
శక్తియా?
ఏమీ
లేదు.
దానికి
చైతన్యశక్తి
లేదు.
మనమే
దానికి
శక్తిసామర్థ్యాలనిచ్చి
తలపై
కూర్చోబెట్టుకొని
అవస్థపడుతున్నాం.
అదేమిటి?
ఇది
వస్త్రం
అంటారు.
వస్త్రం
కాదని
నేను
వాదిస్తాను.
కొన్ని
దారముల
సమ్మేళనమే
వస్త్రం
అంటాము.
ఆ
దారములను
తీసివేస్తే
వస్త్రం
ఉండదు.
ఆరీతిగానే
కొన్ని
కోరికల
సమ్మేళనమే
మనసుగా
ఉంటున్నాది.
ఆశల
సమ్మేళనమే
మనస్సు.
దాన్ని
తీసేస్తే
మనసే
లేదు.
ఆశలే
దాని
స్వరూపం.
ఆశలను
పెంచుకోటం,
తరువాత
యిక్కట్లు
పడటం.
భగవద్
విశ్వాసమనేది
మనకు
తప్పక
ఉండాలి.
అది
లేకపోతే
పశుపక్షిమృగాదులవలె
ఉండిపోతారు.
వివేకం,
విజ్ఞానం,
విచక్షణ
అనే
మూడు
మణులను
ప్రత్యేకంగా
ధరించినవాడు
మానవుడు.
వాటివల్ల
విచారణచేసేదే
ముఖ్యంగాని
తిండినిద్రలతో
కాలం
గడచిపోతే
సాధించినటువంటిది
ఏమీలేదు.
భగవద్విశ్వాసం
కావాలి.
దాన్ని
కోల్పోవటం
ఎట్ల
ఉందంటే,
ఒక
చిన్న
పక్షి
చెట్టుకొమ్మపై
వాలినప్పుడు
ఆ
కొమ్మ
ఊగినా
భయపడదు.
ఎందుకంటే
అది
తన
రెక్కలపై
ఆధారపడి
ఉందిగానీ
కొమ్మపై
కాదు.
మీరు
చూస్తామా
అంటే
ఆత్మవిశ్వాసమనే
రెక్కలు
మరచి
సంసారమనే
లేతకొమ్మ
పట్టుకొని
అది
అటుయిటూ
ఊగేటప్పుడల్లా,
భయభ్రాంతులకంతా
నిరంతరము
గురియౌతున్నారు.
ఆధ్యాత్మిక
తత్త్వమును
సాధించు
అవకాశము,
విశ్వాసము
లేకుండాపోతే
మానవత్వంలో
యేముంది
చెప్పండి.
అలాంటి
దానిలో
కొన్ని
విషయాలుంటున్నాయి.
సత్యం,
ధర్మం,
న్యాయం,
ప్రేమ
అంటే
ఏమిటి
అని
తెలియనివారు
కూడా
ఉంటున్నారు.
ఒకటి
ముఖ్యముగా
తెలుసుకోవాలి.
అది
తెలిస్తే
మిగతావన్నీ
తెలిసినట్టే.
దీనికి
ఒక
కథ
ఉంటున్నాది.
ఒక
సమయంలో
ఒక
వ్యక్తి
గంగను
దాటవలసి
వచ్చింది.
పడవలో
ఎక్కి
కొంచెం
దూరంపోయిన
తరువాత
ఆ
పడవను
నడిపే
మనిషిని
‘గంట
ఎంత?’
అని
అడిగాడు.
వాడు,
‘నా
దగ్గర
వాచీ
లేదు’
అని
చెప్పాడు.
అప్పుడా
వ్యక్తి,
‘అయ్యో!
ఈ
కాలములో
వాచీలేకుండా
ఎవరైనా
ఉంటారా?
టైము
చూడటానికి
తెలియకపోయినా
చేతికి
వాచీ
ఉంటేనే
ఫ్యాషన్.
కాబట్టి,
నీ
జీవితం
ఒక
వంతు
గంగపాలు’
అన్నాడు.
కొంతదూరం
పోయిన
తరువాత,
‘నీ
దగ్గర
రేడియో
ఉందా?’
అని
అడిగాడు.
ఆ
పడవతను
లేదన్నాడు.
‘అయ్యో!
ఈ
కాలములో
రేడియో
లేకుండాపోవడమేమిటి?
ప్రతి
ఒక్కరును
చేతిలో
మంగలిపెట్టి
మాదిరి
ట్రాన్సిస్టర్
పెట్టుకొని
ఉంటారు.
నీ
జీవితం
రెండు
వంతులు
గంగపాలు’
అన్నాడు.
కొంచెంసేపైన
తరువాత,
‘ఈ
వేళ
పేపర్లో
న్యూస్
ఏమిటి?’
అని
అడిగాడు.
దానికి
ఆ
మనిషి
తెలియదన్నాడు.
‘చదవటానికి
తెలియకపోయినా
చేతిలో
పేపరు
ఉండాలి.
కాబట్టి,
నీ
జీవితం
మూడువంతులంతా
గంగపాలు’
అన్నాడు.
అప్పుడు
పెనుగాలి
రేగింది.
పడవ
అటుయిటూ
ఆడుతూ
వుంది.
అప్పుడు
పడవను
నడిపే
వ్యక్తి
ఆ
మనిషిని
చూచి,
‘అయ్యా!
నీవేమో
అన్నీ
తెలిసినవానివలె
ఉన్నావు.
నీకు
ఈతగీత
ఏమైనా
వచ్చునా?’
అడిగాడు.
అప్పుడా
మనిషి
భయభ్రాంతుడై,
‘తెలియదే!’
అన్నాడు.
4
▾
Meaning
Keep
‘అప్పుడు
నీ
జీవితం
పూర్తి
గంగపాలేను’
అన్నాడు
పడవనడిపేవాడు.
అట్ల
ఏ
జలముపైన
ప్రయాణము
చేస్తున్నామో
దాన్ని
దాటే
ప్రయత్నముచేయాలి.
అదే
సహాయం
చేస్తుందిగాని
తక్కినవన్నీ
తోడురావు.
సంసారమనే
సాగరములో
ఈదుతున్నాము.
దాన్ని
ఏరీతిగా
దాటటం
అని
తెలుసుకున్నామంటే
చాలు.
Previous
←
The supreme physician
Next
Achieve nil balance
→