Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1986 · The whole of man's life rests on karma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The whole of man's life rests on karma
13 February 1986
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
‘తస్మైనమఃకర్మణే’
అని
ఉపనిషద్
వాక్యము.
ఎవరికి
నమస్కారము
చేసినా,
ఎవరికి
నమస్కారము
చేయకపోయినా,
మనము
చేసే
కర్మలకు
మాత్రము
నమస్కారము
చెయ్యాలి.
కారణమేమనగా,
మానవునియొక్క
జీవితమంతయు
కర్మపైనే
ఆధారపడి
వున్నది.
భాగవతమునందుకూడను
కర్మమున
పుట్టు
జీవుడు
కర్మముననె
వృద్ధిపొంది
కర్మమున
చనున్
కర్మమె
నరునకు
దైవము
కర్మమె
సుఖదుఃఖములకు
కారణమిలలోన్
అని
చెప్పబడింది.
కనుక,
మనము
చేయు
ప్రతికర్మకు
ప్రప్రథమముగా
నమస్కరించి
‘ఓ
కర్మా!
నా
చేత
ఉత్తమమైన
కర్మలు,
ఉపకారమైన
కర్మలు,
పవిత్రమైన
కర్మలు
చేయించమని
ప్రార్థించాలి.
ఎట్టి
కర్మల
నాచరింతుమో
అట్టి
జన్మలను
పొందుతాము
కర్మచేతనే
మనము
దైవసన్నిధిని
పొందుటకుకూడా
అవకాశమున్నది.
మానవుడు
ఉత్తమస్థితి
పొందుటకుగాని,
అధమస్థితికి
దిగజారుటకుగాని
కర్మలే
కారణము.
కర్మయే
మానవునకు
జన్మనందించుచున్నది.
ఎట్టి
కర్మల
నాచరింతుమో
అట్టి
జన్మలను
పొందుతాము.
ఎట్టి
స్థానమును
మనము
పొందుదుమో
అట్టి
ఫలితాన్నే
మనము
అనుభవిస్తాము.
కనుక
సత్సంగమునకుగాని,
దుస్సంగమునకుగాని,
సద్గుణములకుగాని,
దుర్గుణములకుగాని
మన
కర్మలే
మూలకారణము.
పామును
చూచిన
ప్రతిమానవుడుకూడను
చంపుటో
లేక
పట్టి
వేరే
దూర
ప్రదేశములకు
పంపివేయటమో
చేస్తాడు.
2
▾
Meaning
Keep
From
Bhaja Govindam, verse 9
Also in his talks
(18)
October 1966
Which is real? This or that?
24 May 1973
Satsaṅga
13 March 1978
The end of education is character
10 February 1990
Human values in business management
24 May 1990
Hold the Reins
21 November 1990
Seva that sanctifies
28 February 1995
God, master of the three
17 February 1996
Equal-mindedness is the culture of Bhārata
8 July 1996
Through Good Company Man Can Attain Divinity
22 August 1996
You Yourself Are God
29 September 1998
The Heart Itself Is the Himācala, Īśvara Himself the Lord of the Heart
10 June 2001
He who serves in a spirit of sacrifice is the true doctor
22 October 2005
Sāttvic Food and Good Company Are Essential
22 November 2005
True Education Fosters Selfless Prema
14 August 2006
Follow the Ātma within you
5 September 2006
What God expects from devotees is purity of heart
28 July 2007
Every human being is God
7 March 2008
Do the deeds that please God
పాము
అంటే
మానవుడు
భయపడతాడు.
అది
విష
పురుగు
అని
దానిని
తుచ్ఛముగా
చూస్తాడు.
కాని,
అదే
పాము
ఈశ్వరుని
ఆభరణముగా
యేర్పడినప్పుడు,
ఆ
పామునకే
మనము
నమస్కరిస్తాము.
ఎలకను
చూచినప్పుడు
మనము
పిల్లిని
పెంచి
వాటిని
పట్టించటమో,
లేక
వాటిని
చంపటానికో
ప్రయత్నిస్తాము.
కానీ
అదే
ఎలుక
విఘ్నేశ్వరుని
వాహనముగా
నిల్చినప్పుడు
దానిని
మనము
పూజిస్తాము,
గౌరవిస్తాము.
ఒక
రాయి
బజారులో
పడి
ఉన్నప్పుడు
దానిని
తుచ్ఛముగా
చూడటము,
ప్రక్కకు
నెట్టటము
జరుగుతూ
వుంటుంది.
కాని,
అదే
రాతిని
ఒక
శిల్పి
చక్కని
రూపముగా
తీర్చిదిద్దినప్పుడు
ఆ
రాయే
దేవాలయములో
ప్రతిష్టింపబడి
షోడశోపచారములను
అందుకుంటుంది.
ఇదియే
సత్సంగముయొక్క
ప్రభావము.
మంచివారితో
చేరినప్పుడు
ఉన్నతస్థాయినే
అందుకుంటాము.
సత్సంగమును
పొందినప్పుడు
ఉన్నతస్థాయినే
అందుకుంటాము.
పవిత్ర
ఫలితములను
అందుకుంటాము.
లోకోద్ధారమైన
అగ్నిని
హోమగుండములో
వేసినప్పుడు
దానిని
పూజించటము,
దానికి
ఆహుతి
చేయటము
చేస్తాము.
ఇదే
అగ్ని
యినుముతో
చేరినప్పుడు
సుత్తి
దెబ్బలను
తింటుంది.
వంట
చేయునది
అగ్నియే!
ప్రకాశమునందించి,
చీకటిని
దూరముచేసి
మానవునకు
సహాయము
చేయునది,
అగ్నియే!
శ్మశానమునందు
మనిషిని
కాల్చివేయునదికూడ
అగ్నియే!
స్థానమునుబట్టి
దీనియొక్క
అర్హత
మారుతుంటాది.
ఒక
కడివెడు
నీళ్లలో
విషము
వేస్తే
నీళ్లుకూడను
విషముగా
మారిపోతాయి.
ఒక
పెద్ద
పాత్రలోపల
క్షీరమునువేసి
అందులో
ఒక
చుక్క
విషము
వేస్తే
క్షీరమంతా
విషముగా
మారిపోతుంది.
ఇది
దుస్సంగముయొక్క
ప్రభావము.
దుస్సంగములో
చేరినప్పుడు
ఎంత
మంచితనము
వుండినప్పటికిని
దానిని
దుర్వినియోగపరచుకుంటాము.
ఎంతహీనస్థితిలో
వుండినప్పటికిని
మనము
సత్సంగాన్ని
చేరితే
సత్కీర్తిని
పొందుతాము.
దానిని
పురస్కరించుకొనే
సత్సంగత్వే
నిస్సంగత్వం
నిస్సంగత్వే
నిర్మోహత్వమ్
నిర్మోహత్వే
నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే
జీవన్ముక్తిః
అన్నారు.
సత్సంగము
పిల్లలకు
చాలా
అవసరము.
3
▾
Meaning
Keep
దినమునకు
ఒక్కసారైనా
భగవంతునికి
నీ
హృదయమును
అర్పించడం
అవసరము
భగవంతుడైనప్పటికిని
మీకు
ఉపకారము
చేయటానికిగాని
లేక
సహాయము
చేయటానికిగాని,
తోడ్పడటానికిగాని
లేక
రక్షించటానికిగాని
మీరు
చేసిన
కర్మలు
కొంత
దృష్టియందుంచుకుంటాడు.
ఏకించిత్తైనా
నీవు
మంచి
చేయక,
భగవంతుడు
నీకు
మంచిని
అందించలేడు.
బాల్య
స్నేహితుడైన
కుచేలుడు
పిడికెడు
అటుకులు
అర్పించినప్పుడే
కృష్ణుడు
అతనికి
భోగభాగ్యాలందించాడు.
పత్రమో,
పుష్పమో,
ఫలమో,
తోయమో
ఏదైనా
ఒక
చిన్నదానినైనా
సరే
మనము
భగవంతునికి
అర్పించినప్పుడే
దానికి
అనేక
విధములైన
ఫలితములను
అందిస్తుంటాడు.
ఏది
నీవు
భగవంతునికి
అందిస్తావో
దానికి
అనేక
రెట్లు
అధికముగా
భగవంతుడు
నీకు
తిరిగి
అందిస్తుంటాడు.
కనుక,
ఏది
చేసినా
చేయకపోయినా
దినమునకు
ఒక్క
పర్యాయమైనా
భగవంతునకు
నీ
హృదయాన్ని,
నీ
మనస్సును,
నీ
భావములు,
నీ
ప్రేమ
తత్త్వాన్ని
అందించటానికి
ప్రయత్నించటం
అత్యవసరము.
భగవంతుడు
ఏది
చేసినప్పటికిని
కొన్ని
కారణములను
లక్ష్యమునందు
ఉంచుకునే
చేస్తాడు
ద్రౌపది
చాలా
భక్తురాలు.
కృష్ణునికి
ఆత్మీయురాలైన
సోదరి.
నిరంతరము
‘కృష్ణా!
కృష్ణా!’
అనే
నామమునే
ఆమె
నాలుకపైన
నాట్యమాడించేది.
ఇలాంటి
భక్తురాలికి
కౌరవ
సభయందు
పరాభవం
జరిగింది.
అలాంటి
సమయమునందుకూడను
ఆమె
కృష్ణుడినే
ప్రార్థించింది.
‘హే
ద్వారకావాసా!
హే
బృందావన
విహారి!’,
అని
అనేక
విధములుగా
అతనిని
ప్రార్థించింది.
కాని,
ఎన్ని
పర్యాయములు
ప్రార్థించినప్పటికి
కృష్ణుడు
అనుగ్రహించలేదు.
దర్శనమివ్వలేదు.
‘ఈ
మహాసభయందు
నాకు
పరాభవము
జరుగుతూంటే
నన్ను
కాపాడక
మిన్న
కుండడం
నీకు
న్యాయమా?
నేను
నీ
సోదరినైనప్పటికి
దుర్మార్గులైన
కౌరవులు
నన్ను
యిలాంటి
అపకీర్తి
పాలుచేయటం,
నీకు
సమ్మతమా?’
అని
అనేక
విధములుగా
ప్రశ్నించింది.
ఆమె
ప్రార్థనను
వింటున్నాడు,
కృష్ణుడు.
ఆమెకీ
సమయమునందు
అక్షయ
వలువలనందించటానికి
ఇంతకుముందు
ఆమె
ఉపకారము
ఏమైన
చేసిందా,
అని
యోచిస్తున్నాడు
కృష్ణుడు.
ఆ
సందర్భమునకు
తగిన
పని
పూర్వము
యేదైనా
చేసివుంటేనే
ఆ
సందర్భములో
కృష్ణుడుకూడా
ఆదుకుంటాడు.
యోచించాడు.
ఒక
చక్కని
అవకాశము
అతని
హృదయములో
చేరింది.
4
▾
Meaning
Keep
మన
భారతదేశములో
సంక్రాంతి
పండుగ
చేసుకోటం
యావద్భారతీయులకు
సహజమైనది.
ఈ
సంక్రాంతి
దినమునందు
చెఱుకు
నమలటం,
నువ్వులు,
బియ్యము
యిలాంటివంతా
భుజించటము,
పంచభక్ష్యపరమాన్నములతో
నూతనముగా
మన
గృహమును
చేరిన
ధాన్యమును
మనము
అనుభవించటము
జరుగుతూవుంటుంది.
అటువంటి
ఒక
సంక్రాంతి
పండుగ
రోజున
సాయంకాలమందు
రుక్మిణి,
సత్యభామ,
జాంబవతి,
గోపికలు,
ద్రౌపది
అందరూ
చేరి
కృష్ణునితో
ఆడుకుంటున్న
సమయములో
కృష్ణుడు
చెఱకు
తినటానికి
ప్రయత్నించాడు.
ఏదో
ఒక
కారణములేక
కార్యము
జరుగదు.
భగవంతుడు
ఏది
చేసినప్పటికిని
కొన్ని
కారణములను
లక్ష్యమునందుంచుకొనే
చేస్తుంటాడు.
భగవంతునికి
యేవిధమైన
అలక్ష్యంకూడను
లేదు.
చాలా
జాగ్రత్తగా
వుంటాడు.
అయినా
తాను
చెఱకు
తినే
సమయంలో
ఆ
చెఱకు
ముక్క
ఒకటి
చిటికిన
వేలుకు
కోసుకొని
రక్తం
కారటం
ప్రారంభించింది.
ఇది
కృష్ణునియొక్క
అలక్ష్యంకాదు.
ఏదో
ఒక
కారణాన్ని
మనసునందుంచుకొని
యీ
విధమైన
కర్మను
ఆచరించాడు.
కృష్ణుని
రక్తము
చుక్కలు
చుక్కలు
క్రిందికి
రాలిపోతోంది.
రుక్మిణి
చెలికత్తెను
పంపించింది
తన
యింటికి,
ఏవైనా
వస్త్రాలు
తీసుకురమ్మని.
సత్యభామ
యింకేదైనా
తెప్పించటానికని
చెలికత్తెలవెంట
తిరుగుతూ
వుంది.
గోపికలు
ఒకరినొకరు
చూచుకొని
యేమి
చెయ్యాలో
తోచక
స్తంభించిపోయారు.
అది
సంక్రాంతి
పర్వదినము.
ద్రౌపదికూడను
నూతన
వస్త్రాలు
ధరించినది.
ఆమె
వెంటనే
తన
చీరను
చించి
కొంచెము
ముక్క
తీసి
కృష్ణుని
చిటికిన
వేలికి
చుట్టింది.
రుక్మిణికి
యిలాంటి
యోచన
యేమాత్రము
తట్టలేదు.
గోపికలకుకూడను
యీ
విధమైన
ఆలోచన
తట్టలేదు.
కృష్ణుడే
ప్రాణసమానముగా
భావించినది,
ద్రౌపది.
కనుక
తనయొక్క
నూతనవస్త్రాన్ని
చించి
కృష్ణుని
వేలికి
చుట్టింది.
ఈ
త్యాగమే
కృష్ణుని
హృదయాన్ని
కదిలించింది.
ఆనాడు
కృష్ణుని
వేలికి
చుట్టిన
చీరముక్కనే
ఒక్కతూరి
‘అక్షయము’
అన్నాడు.
అది
లెక్కలేనన్ని
చీరలుగా
వచ్చేసింది
ద్రౌపదికి.
అదియే
ఆమెను
ఆ
మహాసభలో
రక్షించింది.
కనుకనే
ద్రౌపదికి
జరిగిన
యీ
పరాభవమునుండి
ఆమెను
కాపాడడానికి
సరైన
ఆధారము,
ఆమె
అంతకు
పూర్వము
భగవంతునికొరకు
చేసిన
త్యాగమే!
ఆ
త్యాగమే
చేయకుండిన
కృష్ణుడు
యీనాడు
యీ
విధమైన
పరాభవమునుండి
రక్షించియే
వుండడు.
5
▾
Meaning
Keep
భగవంతుడు
కష్టములలో,
దుఃఖములో
ఆదుకోవాలంటే
గతంలో
మనం
చిన్న
ఉపకారమైనా,
పవిత్రకార్యములైనా
చేసి
ఉండాలి
అదే
విధముగనే
ఏ
మానవునికైనా
కష్టములందు,
దుఃఖములందు,
విచారములందు
భగవంతుడు
తోడ్పడవలెనన్న
దానికి
తగిన
చిన్న
వుపకారములైనా,
చిన్న
పవిత్రకార్యములైనా
మనము
చేసియే
వుండాలి.
‘మానవుడు
భగవంతుని
సత్కర్మలచేత,
సదాచారములచేత
సేవించాలి’,
అని
ఒక
సాధనను
భారతీయులు
అందిస్తూ
వచ్చారు.
ఈనాడు
సత్కర్మలే
చేయకుండిన
మనను
సరైన
సమయములో
భగవంతుడు
ఆదుకొనలేడు.
ఈనాడు
నీవు
చేసిన
కర్మలే
భవిష్యత్తుకు
ఆధారముగా
నిలుస్తుంటాయి.
కనుక,
భవిష్యత్తులో
మంచి
ఫలములు
మనము
అందుకోవలెనన్న
వర్తమానములో
మనం
మంచి
విత్తులను
నాటుకోవాలి.
మీరు
చేసిన
మంచి
కర్మలో
లేక
చెడ్డ
కర్మలో
మీకు
భవిష్యత్తులో
చెడ్డఫలితంగానో,
మంచి
ఫలితముగానో
అందుతూ
వుంటాయి.
దీనిని
ఆధారము
చేసుకొనియే
ఉపనిషత్తులు
‘తస్మై
నమః
కర్మణే’
అని
కర్మకు
నమస్కరించుమని
హెచ్చరించాయి.
మనము
ఎలాంటి
సమయములోగాని
మంచిపదములు
వుపయోగపెట్టాలి.
ఎవరినీ
బాధించే
పదములు
మనము
వుపయోగించరాదు.
ఒకరికి
ఏమైనా
గాయము
తగిలితే
డాక్టరు
దానికి
bandage
కట్టి,
మెడిసిన్
వేసి
నయము
చేస్తాడు.
కాని,
మాటలతో
గాయపడిన
హృదయాన్ని
యెవ్వరుకూడను
మాన్పలేరు.
కనుక,
యితరుల
హృదయాలను
బాధించే
పదములు
మనము
యేమాత్రంకూడను
వుపయోగించరాదు.
ఇతరులయొక్క
మాటలు
నిన్ను
బాధించినప్పటికి
నీవు
దానిని
సహించుకొనుటకు
తగిన
ప్రయత్నం
చేయాలికాని
ఆ
బాధకు
నీవుకూడా
వారిని
బాధించేటట్లు
మాట్లాడితే
నీవు
మంచివాడెట్లా
అవుతావు?
నీవు
అతనితోపాటు
సమానమవుతావు.
కనుకనే
భీష్ముడు
చెప్పాడు
‘ధర్మజా!
సూటియైన
కత్తితో
నరికివేసిన
మొక్క
అయినా
లేక
చెట్టైనా
తిరిగి
చిగురిస్తుంది.
కాని
మాటలతో
విరిగిన
మనసు
యిక
తిరిగి
చిగురించలేదు’
అని.
మాటలతో
విరిగిన
మనసువల్ల
తిరిగి
యేకార్యము
నీవు
సాధించలేవు.
6
▾
Meaning
Keep
కనుక,
మాటను
మంచిగా
వుపయోగించుకో!
నీవు
యోచించి
పదములను
వుపయోగించు.
ఎందుకంటే,
ఏ
పదమును
నీవు
వుపయోగిస్తావో
ఏనాడైనా
ఆ
పదము
నీకు
తిరిగి
చేరుతుంది.
అదే
విధముగనే
ఏ
పని
మనం
చేసినప్పటికి
బాగా
యోచించి
Is
it
good
or
bad
మంచిదా
కాదా?
ఉపయోగకరమైనదా
లేక
నిరుపయోగకరమైనదా?
ఇతరులకు
అపకారము
చేస్తుందా
లేక
వుపకారము
చేస్తుందా
అనేటువంటిది
యోచించి
నీవు
ఆ
కర్మలో
ప్రవేశించు.
విద్యార్థులు
మొదటగా
మాటలకు,
కర్మకు
తగిన
పొంతన
ఉండేటట్లు
ప్రయత్నంచేయాలి.
సత్యసాయి
విద్యాసంస్థలోని
విద్యార్థులందరూ
చక్కని
ప్రేమతత్త్వమును
అలవర్చుకోవాలి
ఏ
ఆటలలోనైనా
నీవు
ప్రైజులు
సాధించనూవచ్చు,
సాధించకపోవనూవచ్చు.
అనేక
విధములైన
ఆటలుంటాయి.
ఈ
అన్నింటియందుకూడను
ఫస్టుప్రైజు
రావచ్చును
లేక
యింకా
దానికి
అధికమైనటువంటిదికూడను
పొందవచ్చును.
కాని,
యిందులో
నీవు
గెల్చినా,
గెల్చకపోయినా
పెద్ద
జరిగే
లోపమేమీలేదు.
నీకు
ఒరిగిపోయేదేమీలేదు.
ఏదో
కప్పు
రావచ్చును
లేక
ఒక
పెన్ను
దొరకవచ్చును.
అవన్నీకూడను
శాశ్వతము
కావు.
కొంతకాలానికి
చెడిపోవచ్చును.
ఒక్క
గేమ్‌లో
మాత్రము
మీరు
మంచి
ప్రైజు
సాధించవలసివస్తుంది.
అదే
Game
of
Love.
ఈ
గేమ్‌లో
మీరు
వుత్తీర్ణులైన,
మీ
జీవితమంతా
ఉత్తమంగా
ఉంటుంది.
అది
ఏ
మాత్రము
మార్పుచెందనటువంటిది.
అదే
దైవముయొక్క
ప్రేమ.
దీనిని
మీరు
సాధించాలి.
మీరు
చేసే
ప్రతి
పనికూడను
దైవ
ప్రేమను
పొందగలిగేదా,
కాదా
అని
విచారించి
ఆ
పనిలో
మీరు
ప్రవేశించాలి.
Sathya
Sai
Institute
లో
చదివే
పిల్లలందరు
చక్కని
ప్రేమతత్త్వాన్ని
గుర్తించాలి.
ఎవ్వరిని
మనము
ద్వేషించరాదు.
ఎలాంటి
టైములోకూడను
మీరు
ఇతరులు
కష్టపడేటువంటి
పదములు
వుపయోగపెట్టరాదు.
“నా
జీవితములో
నేను
పరులను
బాధించక,
పరులను
హింసించక,
పరులను
నొప్పించక
నేనుకూడను
నొప్పిపడక
దైవానుగ్రహాన్ని
పొందటానికి,
దైవప్రేమను
పొందటానికి
తగిన
కర్మలు
నా
చేత
చేయించమ”ని
ఒక్కతూరి
కర్మకు
నమస్కారము
చేస్తూ
కర్మాధికారియైన
దైవానికి
నమస్కారము
చేసి
మీరు
యీ
కర్మలలో
ప్రవేశించాలి.
7
▾
Meaning
Keep
చెడును
తలంచకు,
చూడకు,
వినకు-ఇదే
దైవత్వమును
పొందుటకు
చక్కని
మార్గము
కర్మ
చేయుటకే
నీకు
అధికారమున్నదిగాని,
ఫలితము
నీదికాదు.
అది
భగవంతుని
యిష్టము.
ఫలము
తప్పక
వస్తుంది.
మనము
యేమి
చేస్తున్నామో
దానికి
ఫలితము
యీనాడు
కాకపోయినా
రేపైనా
మనము
అందుకోటానికి
సిద్ధముగా
వుండాలి.
కనుకనే
భగవద్గీతయందుకూడను
‘కర్మణ్యేవాధికారస్తే’
నీకు
కర్మచేయటానికి
మాత్రమే
అధికారము
వుంటుండాది.
ఫలితము
నీ
చేతిలో
లేదు,
అని
బోధించడం
జరిగింది.
ఆ
కర్మలుకూడను
ఉత్తమమైన
కర్మలుగా,
పవిత్రమైన
కర్మలుగా,
పరులకు
ఉపకారమైన
కర్మలుగా
ఆచరించాలి.
పిల్లలందరుకూడను
ముఖ్యముగా
హృదయములోనుంచుకోవలిసినది,
ప్రతిదానికికూడను
Reaction,
Reflection,
Resound
వుంది
అనే
విశ్వాసాన్ని
దృఢము
చేసుకోవాలి.
తాత్కాలికంగా
నీకు
దాని
ఫలితము
కనిపించకుండా
పోవచ్చును.
కానీ,
భవిష్యత్తులో
కర్మఫలితమును
తప్పక
అనుభవించవలసివస్తుంది.
కనుక,
వర్తమానములోనే
మనము
అతి
జాగ్రత్తగా
కర్మలు
ఆచరించాలి.
ఎప్పుడో
ఒక
సంక్రాంతి
దినమునాడు
కృష్ణునికి
అందించిన
చీరముక్కయొక్క
ఫలితము
దుర్యోధన
దుశ్శాసనాదులు
నిండుసభలో
వలువలూడదీసి
పరాభవము
చేయడానికి
ప్రయత్నించిన
సమయములో
ద్రౌపదికి
రావటానికి
ఏమిటి
కారణము?
దానికి,
దీనికి
యేమిటి
సంబంధము
వుంది?
కృష్ణునియొక్క
హృదయములో
ద్రౌపది
చేసిన
ఆ
చిన్న
సత్కర్మ
పాతుకొని
పోయినది.
కనుక,
ప్రతిఒక్క
సత్కర్మ
భగవంతుని
హృదయములో,
మీకు
కనిపించినా
కనుపించకపోయినా,
హత్తుకొనిపోయి
ఉంటుంది.
ఉదాహరణము,
ఎండాకాలములో
నదీ
గర్భములో
యే
మొక్కలు
మనకు
కనుపించవు.
పచ్చటి
ప్రదేశమే
మనకు
కన్పించదు.
ఎక్కడచూచినా
ఎడారిగా
వుంటుంది.
కాని,
ఒక
దినము
వర్షము
కురిసిన,
మూడవదినము
పచ్చని
గడ్డి
మొలకెత్తుతుంది.
ఇంతకు
పూర్వములేని
పచ్చగడ్డి
యీనాడు
ఎట్లా
వచ్చిందనుకుంటే
యీనాటి
ప్రతిమొలకయొక్క
విత్తనము
భూమిలో
వుంటున్నాది.
వర్షము
వచ్చినంతనే
మొక్క
రూపంలో
బయటికి
వచ్చింది.
అదే
విధముగా
నీ
నిత్యజీవితములో
ఏ
కష్టములు,
ఏ
బాధలు
లేకుండా
వుండినట్లుగా
కన్పించవచ్చును.
8
▾
Meaning
Keep
కానీ
గతంలో
నీవు
చేసినవన్నీ
మంచి,
చెడు
కర్మల
ఫలితాలన్ని
బీజరూపములో
లోపల
వుంటుండాయి.
ఏనాడు
సరైన
సమయం
ఏర్పడుతుందో
ఆ
సమయసందర్భాలను
పురస్కరించుకొని,
కాల,
కర్మ,
కారణ,
కర్తవ్యాలను
పురస్కరించుకొని,
అవి
బయటకి
వస్తుంటాయి.
కనుక
విద్యార్థులంతాకూడను
జాగ్రత్తగా
ఆదర్శమూర్తులుగా
తయారుకావాలి.
ముఖ్యముగా
మీరు
దైవాన్ని
పొందాలనుకుంటే
See
no
evil
Think
no
evil
Hear
no
evil
Do
no
evil
See
What
is
good
Think
what
is
good
Hear
what
is
good
Do
what
is
good
This
is
the
way
to
reach
GOD
చెడ్డను
తలచకుండా,
చెడ్డను
చూడకుండా,
చెడ్డను
ఏమాత్రం
మీరు
వినకుండా
వుండండి.
అదే
దైవత్వాన్ని
పొందటానికి
చక్కని
మార్గము.
ఈ
విధమైన
గుణములను
మీరు
పెంచుకొని
పవిత్రమైన,
సున్నితమైన,
నిశ్చలమైన,
నిస్వార్థమైన
మీ
భావాలను
చక్కని
ఆదర్శవంతమైన
భావాలుగా
యితరులకు
అందించి
మీరును
అనుభవించి,
సత్కీర్తిని
పొందుతారని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
యీ
గేమ్‌లో
మాత్రం
మీరు
first
prize
ను
అందుకోవాలని
ఆశిస్తున్నాను.
Previous
←
Education for transformation
Next
“That is learning which liberates”
→