Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · Samyak Dṛṣṭi
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Samyak Dṛṣṭi
18 November 1998
1
▾
Meaning
Keep
ఉత్సాహం,
సాహసం,
ధైర్యం,
బుద్ధి,
శక్తి,
పరాక్రమమ్
షడేతే
యత్ర
తిష్ఠంతి
తత్రదేవ
సహాయకృతమ్
ప్రేమస్వరూపులైన
విద్యార్థులారా,
విద్యార్థినులారా!
ఉత్సాహం,
సాహసం,
ధైర్యం,
బుద్ధి,
శక్తి,
పరాక్రమం
అనే
ఆరు
గుణములు
ప్రకాశించుచుండిన
వ్యక్తియందు
దైవత్వము
నిండియుంటుంది
:
ఉత్సాహం,
సాహసం,
ధైర్యం,
బుద్ధి,
శక్తి,
పరాక్రమం
ఈ
ఆరు
సద్గుణములు
ఏవ్యక్తియందు
ప్రకాశించుచుండునో
ఆ
వ్యక్తి
యందే
దైవత్వము
నఖశిఖ
పర్యంతము
తాండవ
మాడుతుంటుంది.
ఆత్మజ్ఞానమును
గురించి
అనేకమంది
సాధకులు
ఎన్నియో
విధములైన
సాధనలు
సల్పుతూ
వస్తున్నారు.
ఎంతమందియో
గురువులను
ఆశ్రయిస్తున్నారు.
ఎన్ని
గ్రంథములో
పఠిస్తున్నారు
కానీ,
ఆత్మజ్ఞానము
లభ్యమగుట
లేదు.
కారణము?
ఈ
సాధనలన్నీ
కూడా
బాహ్యమైన,
ప్రాకృతమైన
జగత్తునందు
ఆచరించే
సత్కర్మలు.
ఇవి
కేవలము
ప్రవృత్తి
యొక్క
ఫలితములు.
ఇవన్నియు
నెగిటివ్స్
యొక్క
ఫలితములు.
ఇంత
మాత్రముచేత
ఆత్మజ్ఞానము
లభ్యమగుట
చాలా
కష్టము.
బుద్దుడు
ఈ
ఆత్మ
జ్ఞానమును
అనుభవించగోరి
అనేక
సాధనలు
సల్పుతూ
వచ్చాడు.
అనేకమంది
గురువులను
ఆశ్రయిస్తూ
వచ్చాడు.
అనేక
గ్రంథములు
పఠిస్తూ
వచ్చాడు.
కానీ
అతనికి
ఏమాత్రము
తృప్తి
కలుగలేదు.
కడపటికి
ఒక
నిర్ణయమును
తీసుకున్నాడు.
ఈ
సాధనలన్నీ
కేవలం
మానసిక
తృప్తి
నిమిత్తము
చేయునవే
గానీ
ఆత్మజ్ఞానమునకు
చేయునవి
కాదని
గుర్తించాడు.
మానసిక
శాంతి
తత్వ
జ్ఞానమునకు
సంబంధించినది
కాదు.
భౌతికమైన,
లౌకికమైన
యీ
ప్రకృతికి
సంబంధించినదే
యీ
మానసిక
శాంతి.
అతను
ఒక
సత్యాన్ని
గుర్తిస్తూ
వచ్చాడు.
2
▾
Meaning
Keep
మానవుని
శాంతికి
మూలకారణమైనది
సమ్యక్
దృష్టి
భగవంతుడు
ప్రసాదించిన
ఐదు
ఇంద్రియములు
తన
స్వాధీనము
నందుంచుకున్నప్పుడే
ఈ
ఆత్మజ్ఞానము
ప్రాప్తిస్తుందనే
సత్యాన్ని
తెలుసుకున్నాడు.
మొట్టమొదట
సమ్యక్
దృష్టి
అన్నాడు.
సమ్యక్
దృష్టి
లేకుండిన
మానవత్వమునకు
ఏమాత్రము
అర్థము
లేదు.
ఈ
సమ్యక్
దృష్టి
చర్మచక్షువులతో
చూచునది
మాత్రమే
కాదు.
హృదయ
దృష్టితో
ప్రపంచాన్ని
చూడాలి.
నీ
దృష్టి
హృదయము
నుండి
ఆవిర్భవించాలి.
కంటితో
చూచేవన్నీ
‘యదృశ్యం
తన్నశ్యం’.
ఒకానొక
సమయంలో
అదృశ్యమయ్యేవే.
ఏనాడు
మానవుడు
ఈ
సమ్యక్దృష్టిని
అభివృద్ధి
గావించుకొనునో
ఆనాడే
సమ్యక్భావము
ఏర్పడుతుంది.
నీ
భావము
కూడా
హృదయభావముగా
రూపొందాలి.
ఈ
హృదయభావమే
సమ్యక్
వాక్కుగా
రూపొందుతుంది.
ఈ
సమ్యక్
వాక్కుగా
మారినప్పుడే
సమ్యక్
శ్రవణం
కూడా
ఏర్పడుతుంది.
సమ్యక్
శ్రవణం
చేత
సమ్యక్
కర్మలు
ఆచరిస్తుంటాడు.కనుక
మానవుని
యొక్క
శాంతికి
మూలకారణమైనది
సమ్యక్దృష్టి.
హృదయము
మానవుని
యందున్న
ప్రశాంతమైన
tank
వంటిది.
ఈ
ట్యాంకునందు
పవిత్రమైన,
హృదయ
సంబంధమైన
వాక్కు,
శ్రవణము,
దృష్టి
యివన్ని
చేర్చుకున్నప్పుడు
అన్నింటియందు
పవిత్రమైన
భావము
మనకు
ప్రాప్తిస్తుంది.
ఇది
కేవలము
భౌతికమైనది
కాకుండా
ఆధ్యాత్మికమైన,
నివృత్తి
యొక్క
లక్షణము.
కన్నులతో
చూడటము,
చెవులతో
వినటము,
మనస్సుతో
అనుభవించటం,
నోటితో
మాట్లాడటం
యివన్నీ
కేవలం
ప్రాకృతమైనవి.
ఇవన్నీ
ప్రవృత్తి
యొక్క
ఫలితములు.
ఈ
ప్రవృత్తి
లక్షణములన్నీ
నెగిటివ్‌తో
కూడినవి.
అన్నింటియందు
హృదయ
సంబంధమైన
భావాన్ని
చేకూర్చినప్పుడే
పాజిటివ్‌గా
ఉంటుంది.
బల్బులు
చూడండి
నెగిటివ్.
కానీ
పాజిటివ్
అనే
కరెంటు
ఇందు
ప్రవేశించ
కుండిన
దీనికి
ప్రవేశమే
లేదు.
ఈనాటి
ప్రతి
సాధకుడు
కేవలం
బాహ్యమైన
కన్నులతో
చూడటం,
బాహ్యమైన
కర్ణములతో
వినటం,
బాహ్యమైన
నాలుకతో
మాట్లాడటం,
బాహ్యమైన
మనస్సుతో
చింతించటం
ఈ
విధమైన
సాధనలు
చేయటంచేతనే
ఎన్ని
సంవత్సరములైనా
ఆత్మజ్ఞానమును
తెలుసుకోలేడు,
అందుకోలేడు,
ఆనందించ
లేడు.
ఆరు
సంవత్సరములు
బుద్ధుడు
ఈ
సమ్యక్దృష్టిని
ఏర్పరచుకున్నాడు.
3
▾
Meaning
Keep
ఒక
కొండపై
కూర్చుని
రాత్రివేళలందు
ఒకే
ఒక
నక్షత్రాన్ని
చింతిస్తూ
వచ్చాడు.
ఈ
దృష్టి
చాలా
విలువైనది.
దృష్టి
చెడుపుకుంటే
జీవితమంతా
చెడిపోతుంది.
మన
దృష్టిని
పవిత్రమైన
దృష్టిగాను,
సార్ధకమైన
దృష్టిగాను,
శాశ్వతమైన
దృష్టిగాను,
నివృత్తి
యొక్క
లక్షణములతో
కూడిన
దృష్టిగాను
ఏర్పరచుకోవాలి.
కనుక
ఈ
సమ్యక్దృష్టిని
మీరు
సామాన్యంగా
భావించకూడదు.
ఏ
సాధనలు
కూడా
మీరు
చేయనక్కరలేదు.
పవిత్రమైన
దృష్టిని
మీరు
కలిగి
ఉన్నప్పుడే
జీవితము
సర్వము
పవిత్రమైన
జీవితముగా
రూపొందుతుంది.
కనుక,
ప్రతి
విద్యార్ధి
మొట్టమొదట
దృష్టిని
అదుపులో
ఉంచుకోవాలి.
భౌతికమును
ఆదర్శంగా
మీరు
తీసుకున్నప్పుడు
మనం
రోడ్డుపై
నడుస్తున్నాము.
నీ
దృష్టి
రోడ్డుపైనే
నిల్పుకోవాలి.
అప్పుడే
నీకు
ఎట్టి
ప్రమాదము
సంభవించదు.
అట్లుకాకుండా
నీ
దృష్టిని
పెడమార్గము
పట్టించి
చూడరానిది
చూచి,
వాల్‌పోస్టర్లు
చూచి,
ఎన్నో
సంకల్పములతో
నీ
దృష్టిని
మరల్చుకున్నప్పుడు
కొన్ని
ప్రమాదములకు
గురికావలసి
వస్తుంది.
ప్రాకృతమైన
దృష్టియందు
యిట్టి
ప్రమాదములు
సంభవించినప్పుడు
ఆధ్యాత్మిక
దృష్టియందు
యింకెన్ని
ప్రమాదములు
సంభవించునో
చెప్పలేము.
కనుక
ప్రారంభము
నుండే
start
early,
drive
slowly,
reach
safely.
సర్వత్ర
వ్యాపించిన
Consciousness
లోపల
మానవునియందున్న
conscience
ను
ఐక్యత
చేయటమే
నిజమైన
సమ్యక్
దృష్టి
ప్రారంభమునందే
దృష్టిని
సక్రమమైనదిగా
మరల్చుకోవాలి.
అపవిత్రమైన
వాటిపై
దృష్టిని
ప్రసరించకూడదు.
దుఃఖపూరితమైన
దానిపై
దృష్టిని
ప్రసరించకూడదు.
అసహ్యమైన
వాటిపై
దృష్టి
ప్రసరింప
చేయకూడదు.
మొట్టమొదట
దృష్టిని
భగవత్
దృష్టిగా
తీసుకోవాలి.
“విశ్వం
విష్ణుమయం
జగత్”.
విశ్వమును
భగవత్స్వరూపంగా
భావించుకోవాలి.
ఏదిచూచినా
ఇది
భగవత్స్వరూపమని
భావించాలి.
ఎందుకనగా
భగవత్స్వరూపం
ప్రతి
వ్యక్తి
యందు
ఆత్మస్వరూపంగా
ఉంటున్నాది.
ఒక్క
దేహమునందున్న
దానిని
conscience
అన్నారు.
సర్వత్రా
వ్యాపించిన
దాన్ని
consciousness
అన్నారు
సర్వత్రా
వ్యాపించిన
consciousness
లోపల
మానవుని
యందున్న
conscience
ను
ఐక్యత
చేయటమే
నిజమైన
సమ్యక్
దృష్టి.
4
▾
Meaning
Keep
ఆత్మజ్ఞానము
కావాలంటే
ప్రాకృతదృష్టిని
పరమాత్మ
దృష్టిగా
మార్చుకోవాలి
శాంతి
శాంతి
శాంతి.
శాంతి
ఎక్కడ
నుండి
వస్తుంది
మనకు?
శాంతి
గానీ,
సత్యముగానీ,
దయగానీ,
ధర్మముగానీ
బాహ్య
ప్రపంచములో
లభించునవి
కావు.
You
are
the
embodiment
of
peace,
you
are
the
embodiment
of
truth,
you
are
the
embodiment
of
God.
సర్వము
నీయందే
ఉంటున్నది.
కనుక,
ఈ
భావమును
చిన్నప్పటి
నుండి
అభివృద్ధి
పరచుకొని
సమ్యక్దృష్టిని
మీరు
చేకూర్చుకోవాలి.
సమ్యక్
దృష్టిని
అభివృద్ధిపరచుకున్నప్పుడే
సమ్యక్భావము
వ్యక్తమవుతుంది.
ఈ
భావములు
హృదయభావములుగా
మారాలి.
హృదయము
నుండి
ఆవిర్భవించాలి.
కేవలం
పెదవుల
నుంచి
రాకూడదు.
హృదయమునుండి
వచ్చినప్పుడే
సమ్యక్
శ్రవణమవుతుంది.
సమ్యక్
శ్రవణం
ద్వారా
సమ్యక్
పలుకు
మనకు
ప్రాప్తిస్తుంది.
మొట్టమొదట
సమ్యక్
దృష్టి.
కనుక
see
no
evil,
see
what
is
good.
మొట్టమొదట
ఏది
మంచి,
ఏది
చెడ్డ?
నీకు
ఎలా
తెలుస్తుంది.
ఇందులో
నీ
conscience
నీకు
సాక్షిగా
నిలుస్తుంది.
మనము
దృష్టిని
చాలా
జాగ్రత్తగా
అదుపులో
నుంచుకోవాలి.
దృష్టిని
సరైనదిగా
లేక
ఎన్ని
సాధనలు
చేసినా
నిరుపయోగమైనవే.
చిన్న
ఉదాహరణ.
సముద్రపు
ఒడ్డున
ఒక
నూతిని
తవ్వటానికి
పోయినప్పుడు
ఆ
నూతిలో
ఉప్పునీరే
వస్తుంది
గానీ
తీయని
నీరు
రాదు.
అదేవిధముగా
ఈ
ప్రాకృత
జగత్తునందు,
ప్రాకృత
సాధనలు
చేసినప్పుడు
ప్రాకృత
ఫలితములే
ప్రాప్తిస్తాయి.
మధురమైన
జలము
ఏరీతిగా
ప్రాప్తించగలదు?
అదే
విధముగా
ప్రపంచ
దృష్టితో
నీవు
జీవితాన్ని
గడుపుతున్నప్పుడు
నీకు
ఆధ్యాత్మిక
జ్ఞానతత్వము
ఏరీతిగా
లభ్యమవుతుంది.
కనుక
ఆత్మజ్ఞానము
మనకు
ప్రాప్తించవలెనంటే
మొట్టమొదట
ప్రాకృతమైన
దృష్టి
నుండి
దూరము
కావాలి.
లేక
ప్రాకృతదృష్టిని
పరమాత్మ
దృష్టిగా
మనం
మార్చుకోవాలి.
కనుక,
ఆనాటి
నుండి
బుద్ధుడు
సమ్యక్దృష్టి
అనే
దానిని
ప్రసరిస్తూ
వచ్చాడు.
సమ్యక్దృష్టిని
అలవర్చుకున్న
సమ్యక్
భావము
అలవడుతుంది.
ఈ
సమ్యక్
భావము
మనలో
అభివృద్ధి
అయినప్పుడే
సమ్యక్వాక్కు
కూడా
వస్తుంది.
సమ్యక్
శ్రవణం
వస్తుంది.
కనుక
జీవితములో
భగవంతుడిచ్చిన
ఈ
పంచభూతములు
కూడా
సక్రమమైన
మార్గములో
అనుభవించినప్పుడు
ఇది
సాక్షాత్కారమునకు
మూలకారణము.
ఈ
సత్యాన్ని
గుర్తించుకొనలేక
మానవులు
ఎన్నెన్నో
సాధనలు
చేస్తూ
వస్తుంటారు.
5
▾
Meaning
Keep
ఇవన్నీ
చేసి
ప్రయోజనం
ఏమిటి?
ఇవన్నీ
సముద్రపు
ఒడ్డున
బావి
తవ్వినట్టుగా
ఉంటుంది.
ఈవిధములైన
సాధనలు
సంవత్సరములు
కాదు
యుగములు
చేసినా
ఫలితము
దక్కదు.
మొట్టమొదట
మన
దృష్టిని
అదుపులో
ఉంచుకోవాలి.
ఈ
దృష్టి
అదుపులో
ఉంచుకోటానికి
సమ్యక్
భావము
మనలో
అభివృద్ధి
కావాలి.
సమ్యక్
భావము
మనలో
చేరినప్పుడు
సమ్యక్
వాక్కు
అభివృద్ధి
అవుతుంది.
ఉన్నది
ఐదు
ఇంద్రియములు.
వాక్కు,
శ్రవణము,
దృష్టి,
భావము
యివన్నీ
పరిశుద్ధము
గావించుకుంటే
ఇదే
సర్వసాధనల
సారము.
సర్వసాధనల
యొక్క
సారము,
సర్వగమ్యముల
యొక్క
మూలము,
సర్వశాస్త్రముల
సారము,
సమ్యక్
దృష్టియే.
ఎన్ని
గ్రంథముల
చదివి
ప్రయోజనం
ఏమిటి?
ఇవన్నీ
కేవలం
తాత్కాలికమైన
మనశ్శాంతిని
మాత్రమే
చేకూరుస్తాయి.
ఎంతమంది
పెద్దల
దగ్గరికి
పోయి
ప్రయోజనం
ఏమిటి?
విన్నంత
వరకు
తాత్కాలికంగా
తృప్తినిస్తుంది.
తదుపరి
అదికూడా
ప్రాకృతమైన
దృష్టిగానే
మారిపోతుంది.
కనుక
సమ్యక్దృష్టిని
శాశ్వతమైన
దానిగా
మార్చుకోటానికి
తగిన
కృషి
చేయాలి.
మొదట
నీ
నుండి
వచ్చే
దుర్భావములను,
దుర్గుణములను,
దుశ్చర్యలను
అదుపులో
పెట్టుకోవాలి
విద్యార్ధినీ,
విద్యార్ధులారా!
మొట్టమొదట
మనం
దృష్టిని
మంచిగా
ఉంచుకోవాలి.
ఎవరినైనా
బాధపెట్టే
దృష్టి
మనకు
ఉండకూడదు.
ఎవరినైనా
బాధపెట్టే
పలికే
పలుకులు
మనం
వినకూడదు.
ఎవరిని
హృదయము
నొప్పించే
పలుకులు
పలకకూడదు.
కనుక
దృష్టి,
శ్రవణము,
వాక్కు
ఈ
మూడింటిని
మొట్టమొదట
అదుపులో
నుంచుకున్నప్పుడు
సమ్యక్భావము
సాక్షాత్కారమునకు
తగిన
గురిగా
ఉంటుంది.
ఈవిధమైన
సాధనలచేత
బుద్ధుడు
నిర్వాణము
పొంద
గలిగాడు.
నిర్వాణము
అంటే
ఏమిటని
తన
పినతండ్రి
కుమారుడైన
ఆనంద్‌ను
ప్రశ్నించాడు.
అప్పుడు
చెప్పాడు.
ఆనందా!
మనమే
ఆనంద
స్వరూపమై
ఉన్నాము.
మనమే
శాంతిస్వరూపులమై
ఉన్నాము.
మనమే
జ్ఞానస్వరూపులమై
ఉన్నాము.
మనయందున్న
శాంతిని,
మనయందున్న
సత్యమును,
మనయందున్న
జ్ఞానమును
మనం
మర్చిపోతున్నాం.
నీకు
కావలసిన
శాంతి
బయట
ప్రపంచములో
లభిస్తుందని
ఆశిస్తున్నావు.
6
▾
Meaning
Keep
Also in his talks
(1)
9 October 1986
Man's transformation is itself the transformation of the universe
బయట
ప్రపంచములో
అనుభవించే
శాంతి
శాంతియే
కాదు.
ఈ
శాంతినిమిత్తమై
సాధనలు
చేయటం
పెద్ద
అజ్ఞానము.
భగవంతుడు
ఐదు
senses
ను
మనకు
అందించాడు.
ఈ
ఐదు
మనయందే
ఉంటున్నాయి
గానీ
బయట
లేవు.
లోని
శత్రువులకు
లొంగిపోయినవాడు
బయటిరిపులనెట్లు
పట్టగలడు?
లోపలనున్న
దానిని
పట్టకుండా
బయట
దాన్ని
ఏవిధంగా
సాధించగలవు?
మొట్టమొదట
నీ
నుండి
వచ్చే
దుర్భావములను,
దుర్గుణములను,
దుశ్చర్యలను
అదుపులో
పెట్టుకోవాలి.
మంచి
దృష్టి
మనం
అభివృద్ధి
పరచుకున్నప్పుడు
మంచి
భావములే
మన
హృదయములో
నిండిపోతాయి.
కనుక
విద్యార్ధులు
చూపులు
పవిత్రముగా
ఉంచుకోవాలి.
దృష్టిని
మార్చుకున్నప్పుడు,
వాక్కు
తనంత
తానే
అభివృద్ధికి
వస్తుంది.
వాక్కును
కూడా
అదుపులో
నుంచుకోవటానికి
తగిన
బలము
మనకు
లభిస్తుంది.
అమితంగా
మనం
భాషించకూడదు.
మాటలు
అధికంగా
ఉండటం
వలన
మన
హృదయములోనున్న
దయాభావము
క్షీణిస్తుంది.
హృదయము
దయతో
కూడినది.
హృదయము
దయతో
నిండినది.
దయ,
కరుణ
అనేది
వాక్కు
ద్వారా
క్షీణించిపోతుంది.
మాటలను
అదుపులో
పెట్టుకోవాలి.
ఎంత
తక్కువగా
మాట్లాడతాడో
మనిషి
అంత
long
life
గా
జీవిస్తాడు.
Long
life
మాత్రమే
కాదు.
పవిత్రమైన
కీర్తి
ఆర్జిస్తాడు.
విద్యార్ధులలో
ఒకరినొకరు
పోట్లాడుకోటంగానీ,
ఒకరిని
ఒకరు
దూషించుకోటంగానీ,
ఒకరినొకరు
హింసించుకోటం
గానీ
ఏమాత్రం
చేయకూడదు.
కారణమేమనగా
అందరియందు
భగవంతుడే
ఉన్నాడు.
నీవు
భగవంతుని
దూషించినవాడవౌతావు.
భగవంతుని
నిందించినవాడౌతావు.
భగవంతుని
బాధపెట్టిన
వాడౌతావు.
సర్వులయందున్న
యీ
conscience
అనే
దైవత్వాన్ని
అందరు
గుర్తించుకోవాలి.
మన
చుట్టూ
consciousness
కూడా
పవిత్రమైన
దివ్యత్వముగా
మనం
భావించాలి.
లోపల
పాజిటివ్
ఉంది.
బయట
నెగిటివ్
ఉంది.
ఈ
నెగిటివ్
కు
పాజిటివ్‌కు
సన్నిహిత
సంబంధము
ఏర్పరచాలి.
కానీ
ఈనాటి
మానవుడు
హృదయము
నిండుకు
నెగిటివ్
నింపుకున్నాడు.
పాజిటివ్
లేదు.
అలాంటివాడు
ఏవిధంగా
దివ్యతత్వాన్ని
అనుభవించగలడు?
7
▾
Meaning
Keep
పరోపకార
నిమిత్తమై
హృదయమును
విశాలము
గావించుకొనుటే
నిజమైన
సాధన
తమిళ
దేశములో
మాణిక్య
వాచకర్
అనే
సాధకుడుండేవాడు.
అన్నింటిని
అనుసరిస్తూ
పోయేవాడు.
ప్రశాంతమైన
హృదయమందు
దయకూడా
పెరగాలి.
తాను
దయామయుడైనప్పుడే
సర్వులను
దయామయులుగా
మార్చవచ్చును.
అప్పుడే
వానికి
హృదయమున్నది
అనే
సత్యము
గుర్తించటానికి
వీలవుతుంది.
దయలేని
హృదయము
దైవమందిరము
కాదు.
దయగల
హృదయమే
దైవమందిరం.
ఒకనాడు
మాణిక్యవాచకర్
రోడ్డుపై
ప్రయాణమై
పోతున్నాడు.
కుంభవర్షము
కురుస్తున్నది.
తాను
ఎక్కడ
తలదాచుకోవాలి
అని
సందేహిస్తూ
వచ్చాడు.
సమీపములో
ఒక
యిల్లు
కనిపించింది.
ఆ
యింటిముందు
ఎవ్వరు
లేరు.
వర్షముగా
ఉన్నాది.
కాళ్లు
చాపుకొని
నిద్రించేందుకు
ఆ
స్థలము
సరిపోయింది.
ఈ
లోపల
మరొక
వ్యక్తి
ఆ
కుంభవర్షములో
నడుస్తూ
పోతున్నాడు.
అప్పుడు
ఆ
మాణిక్యవాచకర్
పిలిచాడు,
brother
రండి
రండి,
ఇక్కడకు
వచ్చి
వర్షపు
బాధనుండి
తప్పించుకోండి
అన్నాడు.
ఇతను
వెళ్లాడు.
అతను
‘నేను
రావటం
వల్ల
నీకు
నిద్రభంగమవుతుందేమో
నీవు
పడుకోటానికి
తగిన
స్థలము
ఉంది.
కానీ
నీకు
కూడా
స్థలము
యివ్వాలంటే
మనమిద్దరము
కూర్చోవాలి.
చాలు.
పడుకోనక్కర
లేదు’
అన్నాడు.
మరికొంతసేపటికి
యింకొకడు
తడుసుకుంటూ
పోతున్నాడు.
‘సోదరా!
సోదరా!
రండి
మీరు
కూడా
యిక్కడ
కూర్చోండి
అన్నాడు.
అతను
చూచాడు.
అయ్యా!
brother,
మీరు
కూర్చోటానికి
తగినంత
స్థలము
ఉన్నాది.
నేను
వస్తే
యిబ్బంది
కలుగుతుందేమో
అన్నాడు.
అప్పుడు
మాణిక్య
వాచకర్
చెప్పాడు.
మాకేమీ
శ్రమలేదు.
నీవు
వస్తే
మన
ముగ్గురము
నిల్చుందామన్నాడు.
ఈవిధమైన
త్యాగభావము
మానవునియందు
అభివృద్ధి
కావాలి.
ఒకడే
పడుకొని
ఆనందము
అనుభవించాలనుకున్నప్పుడు
ఇద్దరు
కూర్చుని
ఆనందము
అనుభవిద్దాము.
యిద్దరు
కూర్చుని
మాట్లాడే
దానికంటే
ముగ్గురం
నిల్చుకుందాం.
దీనినే
help
ever
hurt
never.
పరోపకారనిమిత్తమే
హృదయము
విశాలముగావించుకున్నప్పుడే
నిజమైన
సాధన
అన్నారు.
ఈవిధముగా
నిత్యజీవితములో
మానవునకు
ఉపకారం
చేయాలంటే
ఎన్నో
ఉపకారములు
చేయవచ్చు.
ఇంతకంటే
గొప్ప
ఉపకారము
మరొకటి
లేదు.
8
▾
Meaning
Keep
ఒక్క
మనిషి
అనుభవించే
ఆనందమును
ముగ్గురుకి
పంచి
పెట్టాడు.
ఆనందాన్ని
పదిమందికి
పంచటానికి
ప్రయత్నించాలి.
అప్పుడు
పదిమంది
ఆనందము
నీలో
పాజిటివ్‌గా
మారిపోతుంది.
అప్పుడే
అది
consciousness
గా
తయారౌతుంది.
నీ
consciousness
బయట
నుండి
వచ్చేది
కాదు.
నీలోనిదే
reflection
of
innerbeing
ప్రతి
ఒక్క
దానిలో
consciousness
అనే
దివ్యత్వము
ఉంటున్నాది.
లోకములో
సమ్యక్
దృష్టిని
అలవర్చుకుంటే,
సమ్యక్భావము
వచ్చిందంటే,
సమ్యక్వాక్కు,
సమ్యక్
శ్రవణము
తనంతతానే
అభివృద్ధి
అవుతాయి.
సమ్యక్దృష్టి
లేక
ఎన్ని
సాధనలు
చేసినా
ప్రయోజనము
ఉండదు.
సమ్యక్దృష్టి
లేక
ఎన్ని
గ్రంథములు
చదివినా
ప్రయోజనముండదు.
ఆ
చదువంతా
కేవలం
superficial
knowledge
గా
ఉంటుంది.
ఇది
నెగిటివ్
చదువే.
మొట్టమొదట
సమ్యక్దృష్టిని
పెంచుకోవాలి.
సమ్యక్దృష్టియే
లేకపోతే
మానవత్వమే
అక్కడ
ఉండదు.
ఇంక
జ్ఞానతత్వము
మనకు
ఎట్లా
ప్రాప్తిస్తుంది?
దివ్యజ్ఞానము
మన
హృదయములో
ఉండేదే
గానీ
బయటనుండి
చేర్చుకొనేది
కాదు.
విద్యార్థులారా!
ఈనాటి
పిల్లలే
రేపు
పెద్దలు.
ఈనాటి
విద్యార్థులే
రేపటి
పౌరులు.
నీవు
భావిభారత
పౌరునిగా
తయారుకావాలనుకుంటే
చిన్న
వయస్సు
నుండి
మొట్టమొదట
దృష్టిని
అదుపులో
పెట్టుకోవాలి.
ఎప్పుడు
నీవు
మంచి
దృష్టి
అభివృద్ధి
పరచుకుంటావో
ఆ
మంచిదృష్టి
అంటే
ఏమిటి?
అదియే
దైవదృష్టి.
దేనిని
చూచినా
దైవభావముతో
నీవు
చూడు.
దేనిని
విన్నా
దైవము
యొక్క
పలుకుగా
నీవు
విను.
ఏ
పలుకు
చెప్పినా
దైవనామముగా
ఉచ్చరించు.
ఇది
సమ్యక్
వాక్కు,
సమ్యక్
శ్రవణము,
సమ్యక్
దృష్టి.
మూడింటిని
అభివృద్ధి
పరచుకోటం
చేతనే
నిర్వాణము
అనే
దాన్ని
అందుకో
గలిగినాడు.
నిర్వాణమనగా
ఏమిటి?
సాయుజ్యమే
నిర్వాణము.
మనయందు
దేహములో
నఖశిఖ
పర్యంతము
ఉండిన
ఈ
conscience
ను
సర్వత్రా
వ్యాపించిన
consciousness
చైతన్యములో
లీనము
కావాలి.
నీ
చేతిలో
ఒక
నీటి
బిందువు
ఉన్నాది.
ఆ
నీటిబిందు
అలానే
నీవు
ఉంచుకుంటే
బయట
వీచే
గాలివల్ల
evaporate
అయిపోతుంది.
Evaporate
అయినప్పుడు
దీనివల్ల
ఫలితము
ఏమిటి?
ఆ
ఒక్కబిందువును
సముద్రములో
చేర్చు.
ఆ
ఒక్క
బిందువే
సముద్రరూపాన్ని
పొందుతుంది.
9
▾
Meaning
Keep
బీజం
మాం
సర్వభూతానాం
అణోరణీయాన్
మహతో
మహీయాన్
అన్నారు.
ఒక
చిన్న
విత్తనం
మనం
భూమిలో
నాటినప్పుడు
దానికి
వేయవలసిన
ఎరువు,
పోయవలసిన
జలము
పోసినప్పుడు,
అది
పెద్ద
వృక్షంగా
తయారౌతుంది.
దీనినే
భగవద్గీత
యందు
బీజం
మాం
సర్వభూతానాం
అన్నారు.
ఇదే
పెద్దవృక్షంగా
రూపొందుతుంది.
వృక్షములో
అనేక
వందల
కాయలు
కాస్తాయి
కానీ
వందలకొలది
ఫలములు
ఈ
ఒక్క
seed
నుండే
ఉద్భవిస్తాయి.
అయితే,
అన్ని
ఫలములలో
ఈ
seed
ఉంటాది.
అదే
భగవద్గీత
యందు
పవిత్రమైన
ఆదర్శంగా
నిరూపిస్తూ
వచ్చారు.
భగవంతుడే
ఒక
విత్తనము.
ప్రకృతియే
ఒక
వృక్షము.
దేహములే
కొమ్మలు,
రెమ్మలు.
దేహములు
వివిధములుగా,
ఒక్కొక్క
దేశములో
ఒక్కొక్క
సంస్కృతిని
పురస్కరించుకొని
దాని
కాయలుగా
రూపొందుతాయి.
మానవత్వమే
ఈ
చెట్టులో
కాసే
ఫలములు
ప్రతిఫలమునందు
నాటిన
విత్తనము
చేరిపోయింది.
అప్పుడు
ఆ
seed
చెబుతున్నాడట
‘మమైవాంశో
జీవలోకే
జీవభూత
స్సనాతనః’.
మీరు
ఎన్నో
ఫలములుగా
భావిస్తున్నారు.
ఎన్నో
ఫలములు
కాదు.
నా
బీజము
మీ
అందరియందు
ఉన్నాది.
కాబట్టి
ఉన్నది
ఒక్కటే.
“ఏకం
సత్
విప్రా
బహుధా
వదంతి”
ఉన్నది
ఒక్కటే,
అనేకమంది
అనేకరూపములతో
పిలుస్తున్నారు.
విద్యార్థులారా!
విద్యార్థినులారా!
మొట్టమొదట
పుట్టినప్పుడే
తల్లిని
గుర్తిస్తాము
తదుపరి
పెరుగుతూ
పెరుగుతూ
తండ్రిని
కూడా
గుర్తిస్తాము.
తల్లిదండ్రులను
తెలుసుకున్న
తరువాత
స్కూలుకి
వెళ్లి
మిత్రులను
సంపాదించుకుంటాము.
మితృత్వములో
ప్రారంభమై
తదుపరి
శతృత్వము
కూడా
వస్తుంది.
శత్రువులు
మిత్రులు
అనేవారు
ప్రత్యేకంగా
ఉన్నవారు
కాదు.
మన
దృష్టి
యొక్క
మార్పే.
మిత్రులు
అంటే
మిత్రులుగా
రూపొందుతారు.
శత్రువనుకుంటే
శత్రువుగా
రూపొందుతారు.
దైవభావముతో
నీవు
జీవించినప్పుడు
సర్వము
దైవస్వరూపులుగా
ఉంటారు.
ప్రేమ
స్వరూపులైన
విద్యార్థిని,
విద్యార్థులారా!
మీరు
చిన్న
వయస్సు
నుండి
సమ్యక్దృష్టిని
అభివృద్ధి
పరచుకోండి.
చదవవలసినది
చదవండి.
తప్పులేదు.
కానీ,
ఇది
ప్రాకృతమైన
జీవితమే.
10
▾
Meaning
Keep
ఈ
ప్రాకృతమైన
జీవితములో
పరార్థమైన
జీవితాన్ని
కూడా
చేర్చుకోవాలి.
చూడండి
ఫలము
బాగా
మాగింది.
పైన
చూస్తే
చాలా
మెత్తబడిపోతుంది.
ఇంకా
కొన్ని
దినములు
అట్టనే
పెడితే
కుళ్లిపోతుంది.
నల్లని
రూపము
కల్గుతుంది.
వాసన
వస్తుంది.
కానీ
పండు
మాగింది.
రూపం
మారింది.
వాసన
మారింది.
ఇన్ని
మారినా
విత్తనం
మాత్రం
భద్రముగానే
ఉంటున్నాది.
ఈ
ప్రపంచ
భావముచేత
అన్నింటిని
సంబంధ
బాంధవ్యముగా
కల్పించుకుంటున్నావు.
నీ
ప్రేమ
యొక్క
మార్పులేగానీ
ప్రేమ
ఒక్కటే
అది
సత్యము.
ఒక
ఇంటి
యజమాని
ఉంటాడు.
కుమారుడు
తండ్రి
అని
పిలుస్తాడు.
కోడలు
father-in-law
అంటుంది.
Grand
son
పోయి
grand
father
అంటాడు.
ఈవిధంగా
ఒక్కొక్కరు
ఒక్కొక్క
నామము
భావించుకొని
అనుబంధాన్ని
అనుభవిస్తుంటారు.
కానీ
ఇంతమందికి
యిన్ని
రూపాలు
లేవు.
ఒక
వ్యక్తియే.
అనేకమంది
వ్యక్తులు
అనేక
సంబంధ
బాంధవ్యములను
పురస్కరించుకొని
ఈ
పేర్లు
పెట్టుకుంటారు.
సమ్యక్దృష్టి
ప్రాప్తించాలంటే
సమ్యక్
భావమే
రావాలి
ఈ
కలిప్రభావము
చేత
బయట
ప్రపంచమంతా
మాలిన్యమైపోతున్నాది.
ఎక్కడా
శాంతి
అనేది
లేదు.
శాంతి
నీయందే
ఉంటున్నాది
గానీ
బయట
కనిపించదు.
శాంతి
కోసం
ప్రాకులాడే
వారు
మొట్టమొదట
అంతర్దృష్టిని
అభివృద్ది
పరచుకోండి.
అదియే
సమ్యక్దృష్టి
పూర్వము
రమణ
మహర్షి
ఉండేవాడు.
అతను
సమ్యక్దృష్టిని
ప్రాప్తించుకోవాలని
కూర్చున్నాడు.
ఒక
ఫలాన్ని
చేతికి
తీసుకున్నాడు.
ఆ
ఫలములో
‘ఓం’
అని
వ్రాసాడు.
‘ఓం’
అనేదానిపై
తన
దృష్టిని
అభివృద్ధి
గావించుకుంటూ
వచ్చాడు.
కొంతకాలానికి
ఫలం
చెడిపోటం
చేత
‘ఓం’
కూడా
మారిపోయింది.
అప్పుడు
తాననుకున్నాడు
ఈ
ప్రాకృతఫలముపై
నా
భౌతిక
ఓంకారము
కూడా
ప్రాకృతంగా
మారిపోయింది.
కనుక
ఈ
ప్రాకృత
సాధనల
చేత
మన
భావములు
పరార్థమైనవిగా
రూపొందవు.
ఈ
సమ్యక్దృష్టి
మనకు
ప్రాప్తించాలంటే
సమ్యక్భావమే
రావాలి.
శాశ్వతమైన
భావములు
మనలో
అభివృద్ధి
కావాలి.
అదియే
సత్యనిత్యమైన
తత్వము.
ఈనాడు
బాహ్యమైన
దృష్టిలో
మనము
అభివృద్ధి
చెందుతున్నాము.
11
▾
Meaning
Keep
ఎవరిని
చూచినా
దైవభావముతో
చూస్తూంటే,
సర్వం
దైవమయం
అయిపోతుంది
విద్యార్థులారా!
ఒక
చిన్న
ఉదాహరణ
మీరు
తీసుకోండి.
మీదగ్గర
బంగారం
కొంత
ఉన్నాది.
ఆ
gold
చాలా
పరిశుద్ధమైనదే.
అపరంజి
చాలా
విలువైనది.
కొంతకాలమైన
తరువాత
దానిలో
కొంత
రాగిని
చేర్చావు.
ఇంకా
కొంత
కాలమైన
తర్వాత
వెండిని
కూడా
చేర్చావు.
ఇంకా
కొంత
కాలమైన
తరువాత
brass
చేర్చావు.
ఈవిధంగా
అనేక
లోహములు
చేర్చుకుంటూ
రావటం
చేత
ఆ
బంగారు
రూపమే
మారిపోయింది.
అప్పుడు
దాన్ని
గుర్తించటానికే
వీలు
లేకపోయింది.
ఇది
బంగారా,
రాగియా,
యిత్తడా,
వెండియా
ఏమని
చెప్పలేక
పోతున్నావు.
అనేక
లోహములు
చేరిపోవటం
చేత
స్వస్వరూపమైన
బంగారు
తనరూపము
చెడకొట్టుకుంది.
ఇదియే
మన
ప్రపంచ
సంబంధమైన
సంబంధాలు.
పుట్టినప్పుడు
మానవుడు
పరిశుద్ధమైన
వాడుగా
ఉన్నాడు.
సమ్యక్దృష్టి
వాని
యందుంటున్నాది.
ఒక
తల్లి
తప్ప
అతను
ఎవరిని
గుర్తించలేడు.
క్రమక్రమేణా
పెరిగేటప్పటికి
తండ్రి,
తరువాత
సోదర
సోదరీమణులు
అభివృద్ధి
అయిపోయినారు.
స్నేహితులు
అభివృద్ది
అయిపోయినారు.
ఈవిధంగా
అందరితో
చేరటం
చేతనే
మానవుని
యొక్క
సరైన
స్వరూపమే
మారిపోయింది.
తన
సత్య
స్వరూపమే
మారిపోయింది.
మానవుడా,
దైవమా,
రాక్షసుడా
అని
చెప్పటానికి
సాధ్యం
కాదు.
కనుకనే
ఇన్ని
జన్మలు
ఎత్తవలసి
వస్తున్నాది.
సుఖము,
దుఃఖము,
పాపము,
పుణ్యము
అన్నీ
రూపొందుతున్నాయి.
ఈనాటి
మానవుడు
ఇన్ని
దుఃఖములకు,
ఇన్ని
విచారములకు,
ఇన్ని
కష్టములకు
గురికావటం
దేనివల్ల?
ఏదీకాదు.
తనయొక్క
మార్పులే.
బంగారు
ఎప్పుడు
బంగారుగానే
ఉంటున్నాది.
కానీ
దానిలో
చేర్చిన
లోహములచేత
బంగారు
స్వరూపం
మారిపోయింది.
నీవు
మానవుడై
పుట్టినప్పుడు
మానవుడుగా
బ్రతకాలంటే
ఇంకో
సంబంధాన్ని
చేర్చుకోకూడదు.
ఈ
సంబంధ
బాంధవ్యముల
చేత
పునరపి
మరణం,
పునరపి
జననం,
పునరపి
దుఃఖం,
పునరపి
సుఖం
అన్నీ
మన
చేతులారా
చేసుకున్నవే.
పవిత్రమైన
రూపాన్ని
పవిత్రంగా
ఉంచుకోవాలి.
మనదృష్టి
దైవదృష్టిగా
మార్చుకోవాలి.
లోకదృష్టిగా
మనం
చూచుకోకూడదు.
లోకసంబంధముగా
తీసుకోకూడదు.
మొట్టమొదట
సమ్యక్దృష్టి
సమ్యక్దృష్టి.
దేనిని
చూచినా
దైవాన్ని
చూచినట్టు
భావించు.
12
▾
Meaning
Keep
తల్లిని
చూస్తున్నావు
తల్లిగా
నీవు
విశ్వసించవద్దు.
మాతృదేవి.
తల్లిని
దైవంగా
భావించు.
నీవు
తండ్రిని
చూస్తున్నావు.
ఈ
దేహానికి
ఆదేహము
అని
భావించు
తండ్రి
అని
అర్థము
తీసుకోవద్దు.
Narrow
mindతో
భావించవద్దు.
ఇతను
నా
పితృదేవుడు
అని
భావించు.
మాతృదేవోభవ,
పితృదేవోభవ
అని
ఎందువల్ల
చెప్పారు?
తండ్రిని
తండ్రిగా
భావించవద్దు.
తండ్రిని
దైవంగా
భావించు.
తల్లిని
తల్లిగా
విశ్వసించవద్దు.
తల్లిని
కూడా
దైవముగా
విశ్వసించు.
ఈవిధంగా
ఎవరిని
చూచినా
దైవభావముతో
చూస్తూ
పోతే,
సర్వం
దైవమయం
జగత్
అయిపోతుంది.
దీనిని
పురస్కరించుకొనియే
శంకరులవారు
‘సర్వంఖల్విదం
బ్రహ్మ’
అన్నారు.
పవిత్రమైన
బంగారు
అన్నింటిని
చేర్చుకోటం
చేత
ఎంత
విలువ
తగ్గిపోయింది.
ఎంత
ప్రకాశము
తగ్గిపోయింది.
రూపాన్ని
కూడా
కోల్పోతున్నాది.
తన
స్వరూపాన్నే
తాను
మరచిపోతున్నాది.
ఈనాటి
మానవుడు
కూడా
ఇదే
స్థితిలో
ఉంటున్నాడు.
తన
స్వస్వరూపాన్ని
మరచిపోయి
అజ్ఞానములో
పడి
అంధకారంలో
అలమటిస్తున్నాడు.
ఎందుకు
ఈ
దుఃఖము?
అందరిని
దైవంగా
భావించండి.
ఎంత
సులభం.
కాబట్టి
ఇందులో
ఎంతైనా
ఆనందము
ఉంటాది.
కేవలం
సంకుచితమైన
దేహమునకు
మాత్రమే
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
పెట్టుకున్నప్పుడు
ఇది
సంకుచితంగానే
ఉంటుంది.
అదియే
ఆనంద
సోదరుని
చూచి
బుద్ధుడు
last
లో
ఒక
పదము
చెప్పాడు.
బుద్ధుడు
పుట్టిన
తరువాత
తల్లి
చనిపోయింది.
పినతల్లి
గౌతమి
అతన్ని
సాకుతూ
వచ్చింది.
కానీ
ప్రాణ
సమానంగా
సాకింది
పాపం.
కనుక
తండ్రి
గౌతముడు
అని
పేరు
పెట్టాడు.
గౌతమి
అనే
ఆమె
పోషించింది
కాబట్టి
గౌతముడని
పేరు.
కొంతకాలమునకు
గౌతమికి
ఒక
కుమారుడు
పుట్టాడు.
వానికి
ఆనందుడని
పేరు
పెట్టారు.
ఈ
ఆనందుడు,
గౌతముడు
ఒక్క
ప్రాణముగా
పెరుగుతూ
వచ్చారు.
సొంత
brothers
కూడా
ఆవిధంగా
ఉండరు.
దినదినమునకు
సంబంధ
బాంధవ్యము
ఆరీతిగా
పెరిగిపోయింది.
తాను
నిర్వాణము
చెందే
కొన్ని
నిముషములకు
పూర్వము
ఆనంద్
వైపుకు
చూచాడు
బుద్ధుడు.
ఆనంద్
కంటి
ధారలు
కారుస్తున్నాడు.
ఆనందా!
నీ
పేరు
ఆనందుడు.
ఎందుకు
నీవు
శోకిస్తున్నావు?
నీ
పేరుకు
తగిన
ఫలితముండాలి.
దుఃఖానికి
అవకాశము
అందించకూడదు.
నీ
పేరు
దుఃఖము
కాదు.
నీపేరు
ఆనందుడు.
కాబట్టి
నీవు
ఆనందంగానే
ఉండాలి.
13
▾
Meaning
Keep
ఎందుకు
నీవు
కంటిధారలు
కారుస్తున్నావు?
లేక
నేను
నిర్వాణము
పొందటము
నీకిష్టము
లేదా?
నేను
పవిత్రమైన
పరమాత్ముని
చేరటం
ఇష్టము
లేదా!
ఈవిధంగా
ప్రశ్న
వేస్తూ
వచ్చాడు.
అప్పుడు
ఆనందుడు
కంటిధారలు
తుడుచుకొని
“అన్నా!
నీవు
నిర్వాణం
పొందటం
నాకెంతో
ఆనందమే.
కానీ
యిరువురము
రెండు
దేహములు
ఒక్క
ప్రాణముగా
జీవిస్తూ
వచ్చాము.
నా
నిర్వాణము
కోసం
నేను
బాధపడుతున్నాను.
నిన్ను
వదలి
నేనుండలేను.
కాబట్టి
నాకు
కూడా
నిర్వాణము
నందించమన్నాడు”.
అప్పుడు
చెప్పాడు
బుద్ధుడు
నిర్వాణము
ఒకరందించే
పదార్థము
కాదు.
సాయుజ్యము
ఒకరందించే
వస్తువు
కాదు.
సాక్షాత్కారము
ఒకరు
ప్రసాదించే
ప్రసాదము
కాదు.
అడిగితే
వచ్చేది
కాదు.
అనుగ్రహముతో
అందించేది
కాదు.
మన
యొక్క
understanding
తో
మనం
చేసుకోవాలి.
అన్నింటికి
కారణం
ఒక
దైవత్వమే.
అన్నింటికి
మూలం
దైవత్వమే.
కనుక
నీ
దృష్టిని
నీవు
మరల్చుకో.
నేను
సోదరుడు,
నీవు
నా
సోదరుడు
అని
భావించవద్దు.
సమ్యక్దృష్టిని
అలవరచుకో
అని
బోధించాడు.
ఆ
సమ్యక్దృష్టిని
చింతిస్తూ
ఆనందుడు
ఆనందములో
మునిగాడు.
తాను
ఆనందములో
మునిగినప్పుడు
నిర్వాణమును
పొందుతున్నాడు
గౌతముడు.
ఆ
నిర్వాణము
పొందినాడనే
జ్ఞాపకం
ఆనందునికి
లేదు.
కారణం
బ్రహ్మవిత్
బ్రహ్మైవభవతి.
ఆదృష్టిని
మార్చుకుంటే
ఎంత
గొప్ప
ఫలితము!
ఈనాడు
భగవంతుని
చూచి
కూడా
ప్రకృతిగా
భావిస్తున్నారు.
ప్రకృతిని
కూడా
భగవంతునిగా
భావించమన్నారు.
అందరిని
దైవంగా
విశ్వసించి,
ప్రేమించి
సేవలు
చేయి
ఆనాటి
సాధకులు
తమను
తాము
తెలుసుకోటానికి
ప్రయత్నం
చేశారు.
తనను
తాను
తెలుసుకొనక
ప్రపంచాన్ని
తెలుసుకొని
ప్రయోజనం
ఏమిటి?
ఈ
ప్రపంచములో
వచ్చే
ఫలితము
ఏమిటి?
సర్వము
దుఃఖమయం,
దుఃఖమయం.
సర్వము
చిన్మయం
కాదు.
సర్వము
విషయమయమన్నాడు.
ఇది
కాదు
మనకు
ముఖ్యము.
అందరినీ
దైవముగా
మనం
భావించాలి.
ఎవరు
తల్లిదండ్రులను
వదలనక్కర
లేదు.
అందరిని
దైవంగా
విశ్వసించి
ప్రేమించు.
వారిని
ప్రేమించు
వారికి
సేవలు
చేయి.
తప్పులేదు.
ఎవరికి
చేసినా
దైవానికి
చేస్తున్నాను
అనుకో.
ఇలాంటి
ఏకాత్మభావము
మనం
పెంచుకొన్నప్పుడే
మనకు
దివ్యమైన,
భవ్యమైన,
నవ్యమైన
జీవితాన్ని
పొందగలుగుతాం.
రామకృష్ణ
పరమహంస
అన్నాడు.
14
▾
Meaning
Keep
Also in his talks
(5)
1 June 1973
God's Grace Can Turn a Fool into a Jñāni
26 June 1989
Bhakti Is Never Parted from God
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
4 September 1998
Remembering the Name of God Removes All Sorrow
ఆయన
దగ్గరకు
వెళ్లి
వివేకానంద
ప్రశ్నిస్తాడు.
‘స్వామీ!
మీరు
దైవాన్ని
చూచారా?’
‘ఆ
చూచాను’
అన్నాడు
‘మరి
నాకెందుకు
కనిపించటం
లేదు’
అప్పుడు
రామకృష్ణ
చెప్పాడు!
ఓ
విద్యార్థీ
ఈనాటి
లోకములో
భార్యలకోసం
ఏడుస్తున్నారు,
బిడ్డలకోసం
ఏడుస్తున్నారు,
ధనము
కోసం
ఏడుస్తున్నారు.
కానీ
భగవంతుని
కోసం
ఏడుస్తున్నారా?
ఎప్పుడు
సర్వము
వదలి
భగవంతుని
కోసం
ఏడుస్తారో
అప్పుడు
భగవంతుడు
కనిపిస్తాడు.
ఈ
ప్రాకృతమైన,
అనిత్యమైన,
అశాశ్వతమైన
ఈ
జగత్తు
కోసం
మనం
ఎంత
బాధపడుతున్నాం.
దీనిలో
వెయ్యింట
ఒక
భాగమైనా
మనం
దైవము
కొరకు
బాధ
పడుతున్నామా?
ఏదో
దినానికి
పూజయింటికి
పోయి
ప్రార్థించుకుని
పోతున్నాము.
యాచింతా
భువి
పుత్ర
మిత్ర
భరణౌ
వ్యాపార
సంభాషణే
యాచింతా
ధనధాన్య
భోగ
యశసే
లాభే
సదాజాయతే
సాచింతా
భువినంద
నందన
పదద్వందార్థ
విందేక్షణే
కాచింతా
యమరాజ
భీమసదన
ద్వారప్రయాణే
విభో!
ఈ
ధన
ధాన్యయశస్
లాభముల
కోసం
ఎంత
బాధపడుతున్నాం.
బంధు
మిత్రాదుల
కోసం
మనం
ఎంత
బాధపడుతున్నాం.
ఈబాధలలో
ఒక్క
క్షణమైనా
భగవంతుని
కోసం
బాధపడుతున్నామా?
లేదు.
గంటలు,
దినములు,
సంవత్సరములు
మనం
ప్రపంచం
కోసం
బాధపడుతున్నాము.
ఒక్కసారి
ఒక్కక్షణం
భగవంతుని
హృదయపూర్వకంగా
చింతిస్తే
తప్పక
అప్పుడే
ప్రత్యక్షమౌతాడు.
భగవంతునికి
దినములు,
వారములు,
సంవత్సరములు
అవసరం
కాదు.
నిశ్చల
భావము
ఒక్కటే
చాలు.
ఆ
దృష్టిని
నీవు
సంపాదించుకో.
అదియే
సమ్యక్దృష్టి
అన్నాడు.
ఆ
సమ్యక్దృష్టిలోనే
వివేకానంద
కూడా
లీనమైపోయాడు.
ఇది
ఒకరు
యిచ్చేది
కాదు
తనను
తాను
తెలుసుకొని
అర్పితము
కావటమే.
సర్వత్రా
ఉంటున్నాది.
పిల్లలకు
చాలామందికి
తెలుసు.
సర్వత్రా
ఉంటున్నాది
గాలి.
ఆ
పిల్లలు
ఆడుకునేటందుకు
బెలూన్లు
తీసుకొని
గాలి
ఊదుతారు.
బెలూను
అంతా
గాలిమయం.
బయటనున్న
గాలికి
బెలూన్
గాలికి
సంబంధము
ఉండదు.
సర్వత్రనున్న
గాలిలో
ఈ
బెలూన్
గాలి
చేరాలంటే
ఏమి
చేయాలి?
తెలివైనవాడు
చెబుతాడు
నీ
బెలూన్గాలి
సర్వత్రానున్న
గాలిలో
పోయి
చేరాలంటే
గాలి
‘ఊదు
ఊదు’
అన్నాడు.
15
▾
Meaning
Keep
Also in his talks
(14)
25 December 1986
Prema is God, God is Prema
7 July 1990
The Guru within
10 May 1992
Without a base substance no object takes on form and name
18 January 1996
The Ātmatattva alone is freedom
16 August 1996
‘Love all, worship all’
27 August 1996
When the Anātma Is Removed, the Ātma Is Seen Everywhere
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
20 July 1997
Human values alone are true kin
6 May 1998
God's Līlās Are Wondrous; They Hallow the Three Worlds
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
18 September 2004
Parents Are the Visible Embodiments of God
17 October 2004
Develop the Feeling of the One Ātma
28 September 2006
No worry troubles those who think of God without ceasing
6 May 2008
Honour your parents, love them, serve them!
గాలి
బెలూన్‌లో
ఎక్కువైపోయి
పగిలిపోయింది.
ఈ
బెలూన్‌లో
ఉండినప్పుడు
conscience
అన్నారు.
ఈ
పగిలిపోయిన
తరువాత
అది
consciousness
లోపల
చేరిపోయింది.
Conscience,
consciousness
లో
లీనమైపోయింది.
అదియే
నిర్వాణము.
అదియే
సాయుజ్యము.
అదియే
సాక్షాత్కారము.
ఈ
అల్పమైన
గాలి
అనంతమైన
గాలిలో
లీనమైపోయింది.
ఏనాటికైనా
లీనము
కావటం
తప్పదు.
కనుకనే
అట్టి
లీనము
కావాలంటే
ఈ
విధమైన
జీవితములో
అన్ని
బాధ్యతలు
కొంతవరకు
సమ్యక్దృష్టిలోకి
చేర్చుకోవాలి.
దృష్టి
పవిత్రమైనప్పుడు
సృష్టి
పవిత్రమవుతుంది
విద్యార్ధులారా!
మీరు
ఎంతో
ఆశతో
స్వామి
దగ్గరకు
వచ్చారు.
ఆ
భావము
మీ
హృదయములో
ఉండాలి.
ఏమైనా
చదవండి,
ఏమైనా
పనిచేయండి.
భగవత్కార్యము
అనే
భావంతో
చేయండి.
అంతా
భగవత్కార్యం
తప్ప
మరొకటి
కానే
కాదు.
మీరు
చూస్తున్నారు
(రుమాలు)
cloth
కాదు.
Bundle
of
threads,
this
is
cotton.
Cotton,
thread
and
cloth
are
same.
ఒకటి
కాదా!
మీరు
చూచినది
cloth
అనుకుంటున్నారు.
కాదు
ఆ
cloth
నుండి
threads
అంతా
వచ్చేస్తున్నాయి.
చక్కగా
విచారణ
చేస్తే
The
one
you
think
you
are
is
cotton.
The
one
others
think
you
are
is
thread
and
the
one
you
really
are,
that
is
cloth.
అన్నింటి
ఏకత్వము
చేతనే
ఇది
cloth
గా
తయారైంది.
ఈ
cloth
లోపలే
దారము,
పత్తి
లీనమై
ఉన్నాయి.
అదేవిధంగా
త్వమేవ
మాతాచ
పితా
త్వమేవ
త్వమేవ
బంధుశ్చ
సఖా
త్వమేవ
త్వమేవ
విద్యా
ద్రవిణం
త్వమేవ
త్వమేవ
సర్వం
మమ
దేవ
దేవ
అంతా
దైవమే.
తల్లి
దైవమే,
తండ్రి
దైవమే.
గురువు
దైవమే.
విద్య
దైవమే.
సర్వం
దైవమే.
ఆ
భావంతో
నీవు
పోతున్నప్పుడు
నీవు
కూడా
దైవంగా
మారిపోతావు.
కనుక
దృష్టి
పవిత్రమైనపుడు
సృష్టి
పవిత్రమైపోతుంది.
మనము
శాస్త్రాలు
చదువుకోనక్కరలేదు.
నేత్రములు
లేక
శాస్త్రము
ఏమి
పనిచేస్తుంది?
ఈ
క్షేత్రము
శాస్త్రము.
దృష్టియే
సృష్టి.
నీ
పలుకే
వేదము.
16
▾
Meaning
Keep
From
the Mīnākṣī Stotram, verse 8
కనుక
శబ్ద
బ్రహ్మమయీ
చరాచరమయి
జ్యోతిర్మయీ
వాఙ్మయీ
నిత్యానందమయీ
పరాత్పరమయీ
మాయామయీ
శ్రీమయీ
సర్వము
కూడా
ఒక
దృష్టితోనే
వస్తున్నాయి.
చిన్నపిల్లలు
తెలుసుకోవచ్చు.
ఇంతసేపు
హార్మోనియం
వాయించారు.
ఒకే
గాలిని
మీరు
fill
చేస్తున్నారు.
కానీ
reeds
వత్తినప్పుడు
స,
రి,
గ,
మ,
ప,
ద,
ని
శబ్దములు
వస్తున్నాయి.
ఈ
సౌండ్లకు
ఒక్క
సౌండే
ఆధారము.
ఈ
original
sound
change
చేయటానికి
వీలులేదు.
అదియే
నీ
సమ్యక్దృష్టి.
అది
reeds
మాదిరి
దేహాల
సంబంధముగా
తీసుకున్నప్పుడు
వివిధ
రూపనామములతో
సంబంధ
బాంధవ్యము
ఏర్పడుతుంది.
కనుకనే
బుద్ధునికి
జీవితముపై
ఒక
విధమైన
విరక్తి
కలిగింది.
ఏ
గురువు
సరైన
మార్గములో
పెట్టగలడు?
ఏ
గ్రంథములు
సరైన
మార్గము
చూపగలవు?
ఏ
సాధన
మనలను
గమ్యాన్ని
చేర్చగలదు?
ఏ
గురువు
ఆనందాన్ని
అందించగలడు?
గురువు
దగ్గరే
ఆనందము
లేదు.
కాబట్టి,
దైవమునే
గురువుగా
భావించుకుంటూ
వచ్చారు.
దైవమే
గురువు,
దైవమే
తల్లి,
దైవమే
తండ్రి,
దైవమే
సర్వము.
ఏదో
నీకు
దేహము
పుట్టిన
తరువాత
ఆయన
తండ్రి
నీవు
పుత్రుడు
అనుకుంటున్నారు.
ఈ
దేహము
పుట్టక
పూర్వము
నీవు
ఎవరు?
అతనెవరు?
ఇదే
ప్రశ్న
వచ్చింది
శుకునికి,
వ్యాసునికి.
కుమారుడు
వదలిపెట్టి
పోతున్నాడు.
“కుమారా,
కుమారా,
నిలు,
నిలు”
అంటున్నాడు.
తాను
నిల్చాడు.
తండ్రి
దగ్గరకొచ్చి
నిల్చాడు.
“కుమారా
కుమారా
అంటున్నావు,
తండ్రి
తండ్రి
అంటున్నావు.
నేను
నీకు
కుమారుడు
కాదు,
నీవు
నా
తండ్రివి
కాదు.
నీవూ
బ్రహ్మమే
నేనూ
బ్రహ్మమే.
యిరువురు
బ్రహ్మమే.
కానీ
శరీర
సంబంధము
పెంచుకోటం
చేత
తండ్రి
కుమారుడు
అంటున్నాము”.
అప్పుడు
తండ్రికి
జ్ఞానోదయం
కల్గింది.
‘సర్వం
ఖల్విదం
బ్రహ్మ’
అన్నాడు.
ఈ
చిన్న
పిల్లవాడు
తెలుసుకున్న
జ్ఞానం
నాకు
లేకపోయిందే.
దేహానికి
చిన్నవయస్సు,
పెద్దవయస్సుగానీ
జ్ఞానానికి
ఏ
వయస్సు
లేదు.
‘అనంతోవై
వేదః’
అన్నారు.
అనంతమైనది
వేదము.
విద్యార్థులారా!
నిజముగా
ఈనాడు
మీరు
చేసిన
దృశ్యములంతా
ఎంతో
ఆనందకరమైన
విషయాలు.
17
▾
Meaning
Keep
ఈ
ఆనందము
ఎక్కడ
నుండి
వచ్చింది?
మీ
నుండే
ఆవిర్భవించింది.
అనేక
దేశముల
వారంతా
చేరి
ఆయా
దేశముల
యొక్క
పరిస్థితుల
ప్రభావాన్ని
చక్కగా
ప్రదర్శించారు.
ఈ
culture
గురించి
ఎంతో
చెప్పారు.
మన
culture
is
love.
ఆ
love
ని
పెంచుకోండి.
ఎవ్వరినీ
ద్వేషించకండి.
ఎవరిని
పెడమార్గములో
చూడకండి.
అందరు
మంచివారే.
అందుకనే
రామకృష్ణుడు
వివేకానందకు
చెప్పాడు
‘నా
తల్లి
గతి
ఏమవుతుంది,
ఏమేమి
అవుతాయి
అని
అన్ని
విధాలా
ప్రశ్నించాడు.
22వ
తేదీ
మీరు
చూడగలరు
ఆ
డ్రామాను.
ఒక్కసారి
శిరస్సుపై
చెయ్యి
ఉంచాడు
రామకృష్ణుడు.
తన్మయత్వము
పొందాడు.
అక్కడ
దేవీభావంలో
లీనమైపోయాడు.
ఆ
దైవత్వాన్ని
అనుభవిస్తూ
వచ్చాడు.
కొంతసేపయ్యేటప్పటికి
తన్మయత్వం
పోయింది.
అడుగుతున్నాడు
‘ఏమి
చేశారు
మీరు
నాకు’?
అని
అప్పుడు
చెప్పాడు
రామకృష్ణుడు.
‘నాయనా
నేను
చేసింది
కాదు
నీ
ఆనందమే
నీతో
అట్లా
reaction
గా,
resound
గా
వచ్చింది.
దైవత్వాన్ని
చింతిస్తున్నావు.
అదే
ఈ
మార్పులు
తెప్పించింది
గానీ
యింకొరు
తెప్పించేది
కాదు.
‘అప్పుడు
తాను
అడిగాడు
నేనెవరు?
అప్పుడు
చక్కగా
ఆనందంగా
చెబుతున్నాడు
రామకృష్ణుడు.
నరేంద్రా!
నరేంద్రా!
You
are
you
అన్నాడు.
You
are
not
నరేంద్ర.
అది
ఈ
దేహమునకు
తల్లిదండ్రులు
పెట్టిన
పేరు.
తల్లిదండ్రులిచ్చిన
రూపము.
కానీ
నీ
స్వస్వరూపము
ఇది
కాదు.
You
are
you.
నీవు
నీవే.
ఈనాడు
తెలుసుకోవలసినది
తన
తత్వాన్ని
తెలుసుకోవాలి.
Knowledge
ని
skill
చేస్తే
balance
కుదురుతుంది;
అదే
సమ్యక్
దృష్టి
ఈనాడు
నీవెవరు
నీవెవరు,
అని
ప్రశ్నకే
పోనక్కరలేదు.
అతని
గురించి
నేనెందుకు?
ఈనాడు
తెల్లవారి
లేచి
పేపరు
చూస్తే
వివిధ
దేశాల
పరిస్థితి
తలలో
చేర్చుకుంటున్నారు.
ఇతర
దేశముల
వారి
పరిస్థితి
విచారణ
చేస్తున్నావు
గానీ
తన
దేహము
పరిస్థితి
ఏమిటి?
కాదు.
తన
దేహము
యొక్క
పరిస్థితి
తెలుసుకోటానికి
ప్రయత్నించాలి.
Who
am
I.
తెలుసుకో.
అప్పుడు
నీ
దృష్టి
అంతర్భావానికి
పోతుంది.
నేను
గొప్ప
తెలివితేటలు
గలవాడనని
మీరు
అనుకుంటున్నారు.
నీ
తెలివితేటలు
ఎట్లా
అభివృద్ది
అవుతాయి?
నేను
గోకాక్తో
మాట్లాడుతున్నప్పుడు
మొట్టమొదట
ప్రశ్నలు
వేసుకుంటూ
వచ్చాము.
గోకాక్తో
చెప్పాను
‘గోకాక్
అందరియందు
జ్ఞానముంటున్నాది.
జ్ఞానహీనుడు
జగత్తులోనే
లేడు.
18
▾
Meaning
Keep
మొట్టమొదట
knowledge.
ఈ
knowledge
అందరికి
ఉంటున్నాది.
గుర్తించవచ్చు.
గుర్తించకుండా
పోవచ్చు.
కానీ,
ఆ
knowledge
ని
skill
చేయి.
Skill
చేస్తే
అంతర్ముఖము
ప్రారంభమవుతుంది.
కానీ
నీవు
skill
చేయటం
లేదు.
Kill
చేస్తున్నావు.
Knowledge
ని
kill
చేయటం
వల్ల
అంతర్దృష్టి
పోతున్నాది.
బహిర్
దృష్టి
వస్తున్నాది’.
మొట్టమొదట
మన
knowledge
ని
skill
చేయాలి.
అది
జరిగిన
తరువాత
balance
చక్కగా
కుదురుతుంది.
ఈనాటి
మానవునకు
balance
లేదు.
సైకిలుపై
పోవాలంటే
balance
ఉండాలి.
కాలినడకకీ
balance
ఉండాలి.
అన్నింటికి
balance
పైనే
ఆధారపడి
ఉన్నాది.
ఈ
balance
పోయింది.
కనుక
వీరి
పరిస్థితి
అయోమయంగా
ఉంది.
దృష్టి
బహిర్ముఖమై
పోతున్నాది.
మొట్టమొదట
life
ని
balance
చేసుకోవాలి.
ఇంతవరకు
dance
చేశారు.
Dance
లో
కూడా
balance
లేకపోతే
అడుగు
వేయడానికి
వీలు
లేదు.
Life
అంతా
balance
పైనే
ఆధారపడి
ఉంది.
Balance
రావాలంటే
knowledge
ని
skill
చేయాలి.
దానినే
సమ్యక్దృష్టి
అని
పేరు
పెట్టారు.
ఒక్కొక్క
యుగమునందు
ఒక్కొక్క
పేరుతో
ఈ
knowledge
ని
అభివృద్ది
గావించు
కుంటూ
వచ్చారు.
ఈనాటి
సైంటిస్టులు
కూడా
విజ్ఞాన
శాస్త్రములో
పరిస్థితివల్ల
అనేక,
నూతన
మార్గములు
ప్రవేశపెడుతున్నారు.
నూతనమైన
విషయాలు
కనిపెట్టామని
అహంకారపడుతున్నారే
గానీ
నూతనమైనది
కాదు
కేవలం
బాహ్యమైనదే,
భౌతికమైనదే,
ప్రవృత్తికి
సంబందించినదే.
నెగిటివ్
సంబంధమైనది.
ఈ
నెగిటివ్‌తో
పాజిటివ్
చేర్చాలి.
అప్పుడు
ఈ
నెగిటివ్‌కి
విలువ
వస్తుంది.
దీనినే
సంస్కారము
అన్నారు.
సంస్కారమనగా
ఏమిటి?
సంస్కరింప
చేయటమే
సంస్కారము.
సంస్కరించటం
అంటే
ఏమిటి?
వడ్లు
ఉన్నాయి.
ఒక
మూట
వడ్లకు
నూరు
రూపాయలిచ్చావు.
కానీ
వాటిని
సంస్కరించి
బియ్యముగా
మార్చుకో
అదే
మూటకు
వేయి
రూపాయలవుతుంది.
ఎలా
పెరిగింది.
పరిశుద్ధము
ఏర్పడింది.
మా
జీవితమును
పరిశుద్ధపర్చుకోటానికి
ప్రయత్నం
చేయాలి.
మంచిపేరు
తెచ్చుకోటానికి
ప్రయత్నం
చేయాలి.
ఫలాని
boy,
ఫలాని
girl
చాలా
మంచి
బిడ్డలు
అని
పేరు
తెప్పించాలి.
కానీ,
మనం
చెడిపోవటం
వల్ల
మన
పేరుతోనే
పోదు,
అది
తల్లిదండ్రుల
పేరు
కూడా
చెడిపోతుంది.
సమాజము
పేరు
చెడిపోతుంది.
నీకే
అవమానమవుతుంది.
కనుక
tell
me
your
company,
I
shall
tell
you
what
you
are.
19
▾
Meaning
Keep
చెడ్డవారితో
చేరితే
చెడ్డవాడవైపోయినావు.
మంచివాడితో
చేరితే
మంచివాడవవుతావు.
కాబట్టి
నీవు
good
company
తో
చేరాలి.
సమ్యక్
దృష్టి,
సమ్యక్
భావము,
సమ్యక్
శ్రవణం,
సమ్యక్
వాక్కు,
సమ్యక్
కర్మ
-
ఈ
ఐదింటిలో
ఉంటున్నాది
జగత్తంతా
బుద్ధుడు
5
సంబంధాలు
చెప్పాడు.
సమ్యక్
దృష్టి,
సమ్యక్
భావము,
సమ్యక్
శ్రవణం,
సమ్యక్
వాక్కు,
సమ్యక్
కర్మ
ఈ
ఐదింటిలో
ఉంటున్నాది
జగత్తంతా.
ఈ
ఐదింటిని
నీవు
ప్రయత్నం
చేసుకో,
ఏ
గురువూ
అక్కరలేదు.
ఏ
సాధన
చేయనక్కరలేదు.
ఆ
ఐదు
భగవంతుడిచ్చినవే.
కాబట్టి
ఎవరిచ్చారో
అతనినే
ప్రేమించు.
అతని
ప్రేమ
చేత
నీ
సర్వబాధలు
తీరిపోతాయి.
మాట్లాడాడు
అర్జంటైనా
అతను.
వాచ్
stop
అయిపోయింది,
తిరిగి
ఆడింది.
స్వామి
చేసింది
కాదు.
తన
విశ్వాసము
బలపడే
నిమిత్తమై
ఆ
స్వామి
ఆవిధంగా
నాటకమాడుతూ
వచ్చాడు.
ప్రతివానికి
faith
కావాలి.
ఆ
సన్మానము
బాగా
కుదిరినప్పుడే
సర్వము
కుదిరిపోతుంది.
ఆ
నమ్మకము
అస్తవ్యస్తముగా
ఉండినప్పుడు
ఫలితము
కూడా
ఆవిధంగానే
ఉంటుంది.
కనుక
‘యద్భావం
తద్భవతి’
అన్నారు.
మొట్టమొదట
శంకరులవారు
ఆరు
గుణములు
చెబుతూ
వచ్చారు.
సమ్యక్దృష్టి
-
అందులో
పవిత్రమైన
భావములు
చేర్చుకున్నప్పుడు
జీవితము
పవిత్రమైపోతుంది.
ఉత్సాహం.
మీరు
ఉత్సాహంతో
ఉండాలి.
ఏడుపుముఖం
పెట్టుకోకూడదు.
Castor
oil
face
వేయకూడదు.
నవ్వుతూ
నవ్వుతూ
ఆనందంగా
ఉండాలి.
సాహసం,
ఎంతైనా
సాధించాలనే
సాహసం
మనలో
బయలు
దేరుతుంది.
ధైర్యం.
అప్పుడు
ధైర్యం
కూడా
మనలో
వస్తుంది.
బుద్ధి
అభివృద్ధి
అయిపోతుంది.
శక్తి
గొప్పగా
లభిస్తుంది.
పరాక్రమం
సాధించగలననే
ధైర్యం
వస్తుంది.
ఈ
ఆరు
గుణములు
ఉండినప్పుడు
తప్పక
దాన్ని
సిద్ధించుకుంటారు.
దైవత్వము
అతనియందే
ఉంటుంది.
కన్నులు
మూసుకుంటే
చాలు
దైవత్వాన్ని
చూడవచ్చు.
అంత
సమీపంలో
ఉంటుంటాడు
దైవత్వము.
ఎక్కడ
ఈ
ఆరు
గుణములుంటాయో
అక్కడ
దైవము
ఉంటాడు.
ఆ
ఆరుగుణములు
మనం
ఈనాడు
దూరం
చేసుకుంటున్నాం.
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
మద
మాత్సర్యములనే
ఆరు
దుర్గుణాలు
అభివృద్ధి
పరచుకుంటున్నాం.
20
▾
Meaning
Keep
యివికాదు
divine
powers
రావాలి
మనకు.
ఈ
విష
భావములు
రాకూడదు.
అప్పుడే
నీవు
సమ్యక్
రూపం
పొందుతావు.
ప్రేమ
ఉండినప్పుడు
సర్వము
మనకు
నెరవేరుతుంది
విద్యార్ధులారా!
మీరు
దినదినాభివృద్ధి
పొంది
మీమీ
దేశముల
లోపల
ఆదర్శవ్యక్తులుగా
రూపొందాలి.
ఈ
పిల్లవాడు
ఎంత
మంచి
గొప్పవాడై
పోయాడు.
ఎంత
మంచి
అభ్యాసములు
చేశాడు
అనే
మంచి
పేరు
తెచ్చుకోవాలి.
అప్పుడు
తల్లిదండ్రులు
కూడా
ఆనందిస్తారు.
మీ
స్నేహితులు
ఆనందిస్తారు.
సమాజము
మిమ్మల్ని
చేరటానికి
ప్రయత్నిస్తారు.
పదిమందిలో
మంచి
పేరు
తెచ్చుకోవాలి
మంచివారుగా
ఉండి.
ఆ
good
name
God
name
అన్నారు.
Goodness
is
godness
అన్నారు.
మీరు
మంచిపేరు
తెచ్చుకోండి.
మంచి
నడతలు
నడచుకోండి.
మంచి
దృష్టిని
పెంచుకోండి.
మంచి
వాక్కును
పెంచుకోండి.
మంచి
శ్రవణము
మీరు
అభివృద్ధి
పరచుకోండి.
అప్పుడే
మీరు
మంచివారై
పోతారు.
మంచిమాటలు
మనలో
లేనప్పుడు
ఎవరు
నిన్ను
దగ్గరకు
రానివ్వరు.
పై
తట్టు
నీవు
నాటకమాడినప్పటికి
నిన్ను
చేర్చుకోరు.
మంచి
మాట
హృదయము
నుంచి
రావాలి.
ఒక
ట్యాంకు
నుంచి
రావాలి.
ఆ
ట్యాంకుతో
కనెక్షను
పెట్టుకోకపోతే
ప్రయోజనం
లేదు.
ఒక
చిన్న
ఉదాహరణ.
ఒక
పల్లెలోపల
water
tank
కట్టారు.
పల్లెవారికి
water
supply
చేయాలి.
ట్యాంకు
నుండి
పైప్సు
పెట్టారు.
Public
taps
పెట్టారు.
ఒక
మినిష్టరును
invite
చేశారు.
మినిష్టరు
వస్తున్నాడని
బంగారు
tap
పెట్టారు.
ఆయన
వెళ్లిపోగానే
బంగారు
తీసుకోవచ్చని
అంతా
చేశారు.
మినిష్టరు
వచ్చారు.
బ్యాండు
మేళం
వాయించారు.
ఆయన
వచ్చి
tap
తిప్పాడు.
ఒక్క
drop
కూడా
water
రాలేదు.
ఏమిట్రా
యిదని
ఆశ్చర్యపడుతున్నారు.
ట్యాంకులో
నీరుంది.
Tank
కు
tap
కు
కనెక్షన్
చేయలేదు.
దానివల్ల
నీరు
రాలేదు.
మన
హృదయమనే
tank
కరుణ,
దయ
అనే
నీరుతో
నిండి
ఉంది.
మన
హృదయము
దయామయమైనదే.
కానీ
హృదయములో
నున్నదానికి
action
లోకి
రావాలంటే
దానికి
connection
పెట్టాలి.
సమ్యక్
దృష్టిని
tank
కు
tap
కు
connection
చేయాలి.
ఆ
good
looks,
love
అదే
connection.
ఆ
love
లేకపోతే
యిదంతా
వ్యర్ధమైపోతుంది.
Tank
లో
నీరుండి
ప్రయోజనం
ఏమిటి?
దయ
హృదయములోనే
ఉంది.
కానీ
నీవు
ఉపయోగపెట్టటం
లేదే.
21
▾
Meaning
Keep
ప్రయోజనం
ఏమిటి?
మొట్టమొదట,
tank
కు
taps,
love
అనే
connection
పెట్టుకోవాలి.
ఈ
ప్రేమ
ఉండినప్పుడు
సర్వము
మనకు
నెరవేరుతుంది.
ప్రేమతో
మీరు
జీవించండి.
Previous
←
Prema Alone Is the Root of the Tree Called Life
Next
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
→