Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2006 · Service to society is itself the right sādhana
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Service to society is itself the right sādhana
21 May 2006, Kerala Youth Camp, Brindavan
1
▾
Meaning
Keep
గడచిన
మూడు
దినములు
మీరెంతో
ఆనందాన్ని
అనుభవిస్తూ
వచ్చారు.
మూడు
రోజులు
మూడు
క్షణాలుగా
గడిచిపోయాయి.
భక్తి,
శ్రద్ధలతో,
ఆనందంతో
మీ
హృదయాలు
నిండి
ఉన్నాయి.
చాలా
సంతోషము.
పరమేష్ఠినుండి
ఆవిర్భవించినది
సృష్టి.
సృష్టినుండి
ఏర్పడినది
సమష్టి.
సమష్టిలో
అంతర్భాగం
వ్యక్తి.
కాబట్టి,
సమాజానికి
నిస్వార్థంగా
సేవలందించడం
ప్రతి
వ్యక్తియొక్క
కర్తవ్యం.
అటువంటి
వ్యక్తుల
సమూహమే
నిజమైన
సమాజము.
మానవునియొక్క
సమస్త
కర్మలూ
సమాజ
సేవయే
లక్ష్యంగా
కలిగి
ఉండాలి.
అందరూ
ఒకే
సమాజముయొక్క
సభ్యులే.
వ్యక్తులు
వేరువేరైనా
అందరిలో
ఉన్న
హృదయం
ఒక్కటే.
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి”,
“ఏకాత్మా
సర్వ
భూతాంతరాత్మా”.
దుస్సంగానికి
దూరంగా
ఉండండి
ఇది
ఒక
కాగితం.
ఇందులో
కూరగాయలు
పొట్లం
కడితే
ఈ
కాగితం
కూరగాయల
వాసన
వస్తుంది;
అరటి
పళ్ళు
పొట్లం
కడితే
అరటి
పళ్ళ
వాసన
వస్తుంది;
ఎండు
చేపలు
పొట్లం
కడితే
ఎండు
చేపల
వాసన
వస్తుంది.
పేపరుకు
సహజంగా
ఎటువంటి
వాసనా
లేదు.
ఇందులో
ఏ
వస్తువు
పొట్లం
కడితే
ఆ
వాసన
వెదజల్లుతుంది.
అదేవిధంగా
మనిషి
స్వభావరీత్యా
పవిత్రమైనవాడు.
కానీ,
దుస్సంగంలో
చేరడంచేత
దుర్గుణాలను
అలవర్చుకుంటున్నాడు.
‘టెల్
మీ
యువర్
కంపెనీ,
ఐ
షల్
టెల్
యు
వాట్
యు
ఆర్’.
నీ
స్నేహితు
లెవరో
చెపితే
నీవెటువంటివాడవో
చెప్పవచ్చును.
కనుకనే,
సత్సంగంలో
ప్రవేశించాలి.
సాంగత్య
ప్రభావం
వల్లనే
మీలో
మంచి,
చెడ్డలు
ఏర్పడుతున్నాయి.
కాబట్టి,
దుస్సంగానికి
దూరంగా
ఉండండి.
పవిత్రమైన
హృదయం,
నిర్మలమైన
భావాలు
గలవారితో
స్నేహం
చేయండి.
2
▾
Meaning
Keep
Also in his talks
(20)
23 November 1978
Faith Is the Foundation of the Spiritual Path
8 November 1986
Through the Name we can attain the Named!
30 September 1987
Understand the Sai principle well
5 March 1992
‘Adhyātmavidyā vidyānāṁ’
14 January 1995
Prema is like a compass
24 June 1996
A Life without Character Is a Lifeless Life
17 July 1997
The principle of the Ātma and divinity
21 April 1998
The body itself is foremost for the practice of Dharma
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
2 April 2003
Leave the delusion of the body; think of God
18 May 2003
Prema is the very essence of the Paramātma
21 October 2003
I have come only to reveal your true nature
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
23 June 2005
Recognise the fundamental principle
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
11 August 2006
Divinity is attained only through Prema for God
28 July 2007
Every human being is God
మానవుడు
సంఘంలో
సభ్యుడు.
ఈనాడు
సమాజంలో
ఉన్న
దురాచారాలన్నింటికీ
మూలం
మానవునియొక్క
దుర్గుణములు,
దురాలోచనలు,
దుశ్చింతనలే.
వీటి
ప్రభావం
ప్రతి
వ్యక్తీపై
పడుతుంది.
సృష్టి
అంతా
భగవన్మయమే.
అందరూ
పవిత్ర
హృదయులే.
కానీ,
పరిసరాల
ప్రభావంచేత
మనిషియొక్క
ప్రవర్తన
మారుతుంటుంది.
మనకు
కలిగే
అనుభవాలు
మనం
అనుసరించే
మార్గంపై
ఆధారపడి
ఉంటాయి.
కాబట్టి,
మంచివారితో
చేరి,
పవిత్రమైన
జీవితాన్ని
గడిపి,
మంచి
పేరు
తెచ్చుకోవాలి.
మీ
హృదయాన్ని
పవిత్రమైన,
దివ్యమైన
భావాలతో
నింపుకోండి.
బుద్ధుడు
బోధించాడు:
ధర్మం
శరణం
గచ్ఛామి.
సత్యం
శరణం
గచ్ఛామి.
మీరు
ఆచరించే
సమస్త
కర్మలు
సత్యధర్మాలను
ఆధారం
చేసుకొని
ఉండాలి.
చెడ్డవారు
ఎదురైనా
వారిలో
మంచినే
చూడడానికి
ప్రయత్నించాలి.
అందరిలోనూ
ఉన్నది
భగవంతుడొక్కడే.
భేదాలన్నీ
మీరు
సృష్టించుకున్నవే!
అల్లా
అనీ,
జీసస్
అనీ,
రామా
అనీ,
కృష్ణా
అనీ
వేరువేరు
పేర్లతో
పిలిచినా
దైవం
ఒక్కడే.
పేర్లు
వేరైనంతమాత్రాన
దివ్యత్వం
వేరుకాదు.
లడ్డూ,
మిఠాయి,
మైసూరుపాక్
మొదలైన
స్వీట్లు
వేరువేరుగానీ
అన్నింటిలోనూ
ఉన్న
చక్కెర
ఒక్కటే
కదా!
అదేవిధంగా,
రూప
నామములు
వేరైనప్పటికీ
అందరిలో
ఉన్న
ఆత్మతత్త్వం
ఒక్కటే.
రాముడుగానీ,
కృష్ణుడుగానీ
ఆయా
పేర్లతో
పుట్టలేదు.
ఆ
పేర్లు
వాళ్ళ
తల్లిదండ్రులు
పెట్టినవి.
భగవంతుడు
ఒక
ప్రత్యేకమైన
పేరుతో
పుట్టటంలేదు.
‘నిర్గుణం
నిరంజనం
సనాతనం
నికేతనం
నిత్య
శుద్ధ
బుద్ధ
ముక్త
నిర్మల
స్వరూపిణం’.
ఇట్టి
భగవత్తత్త్వానికి
జనులు
అనేక
రూపనామములు
కల్పించి,
విభేదాలను
పెంచి,
ఒక
రూపముకంటే
మరొక
రూపము
గొప్పదని,
ఒక
నామముకంటే
మరొక
నామము
గొప్పదని
తమలో
తాము
పోట్లాడుకుంటున్నారు.
రూపనామములను
ఆధారం
చేసుకోకండి.
రూప
రహితమైన
ఆత్మతత్త్వమును
దృష్టిలో
ఉంచుకోండి.
ఆత్మ
ఆనందస్వరూపం.
నిత్యానందం
పరమ
సుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం
గగన
సదృశం
తత్త్వమస్యాది
లక్ష్యం
ఏకం
నిత్యం
విమల
మచలం
సర్వధీ
సాక్షిభూతం
భావాతీతం
త్రిగుణ
రహితం
........
3
▾
Meaning
Keep
ఇటువంటి
ఆత్మతత్త్వమునకు
అనేక
రూపనామములు
కల్పించడంచేతనే
భేదాలు
తలెత్తుతున్నాయి.
ఈ
భేదాలన్నీ
మీరు
సృష్టించుకున్నవేగాని,
భగవంతుడు
సృష్టించినవి
కావు.
భగవంతుడు
ప్రేమస్వరూపుడు,
సత్యస్వరూపుడు.
సత్యమే
దైవం,
ప్రేమయే
దైవం.
మీ
హృదయాన్ని
ప్రేమతో
నింపుకొని
ప్రేమమయమైన
జీవితాన్ని
గడపండి.
ప్రతి
వ్యక్తినీ
ప్రేమించండి.
ఎందుకంటే
భగవంతుడు
అందరిలోనూ
ప్రేమస్వరూపుడై
ఉన్నాడు.
ప్రేమ
లేని
మానవుడు
ఈ
జగత్తులో
లేడు.
ఈ
లౌకిక
జగత్తులో
ప్రేమ
అనేక
రూపాలను
ధరిస్తున్నదిగాని,
ప్రేమ
ఒక్కటే.
మీకు
కనిపించే
ప్రతి
వ్యక్తీ
ఆత్మస్వరూపుడేనని
విశ్వసించండి.
ఇతరులు
మిమ్మల్ని
ఏమన్నా,
‘ఇది
నా
మంచికే’
అనుకోండి.
ఈవిధమైన
భావాన్ని
అభివృద్ధిపరచుకున్నప్పుడు
మీకు
ప్రతి
ఒక్కటీ
మంచే
జరుగుతుంది.
ఎవరైనా
మిమ్మల్ని
విమర్శిస్తే
భయపడకండి.
ధైర్యంగా
ఎదుర్కోండి.
మీ
హృదయాన్ని
ధైర్యంతో
నింపుకోండి.
ధైర్య
సాహసాలతో
సత్యమార్గాన్ని
అనుసరించండి,
ప్రేమమార్గాన్ని
అనుసరించండి.
ప్రేమ
అత్యంత
పవిత్రమైనది.
ప్రేమయే
భగవత్స్వరూపం.
అట్టి
ప్రేమను
ద్వేషిస్తే
మీరు
భగవంతుడినే
ద్వేషించిన
వారవుతారు.
భగవంతుని
పేరే
ప్రేమ,
ఆయనకు
మరొక
పేరు
లేదు.
సమస్త
కర్మలను
ప్రేమమయం
గావించుకోవడమే
నిజమైన
భక్తి
ప్రేమస్వరూపులారా!
గడచిన
మూడు
రోజులలో
మీరు
పాడిన
పాటలు,
మీ
కార్యక్రమాలు
అందరికీ
ఆనందాన్ని
అందించాయి.
మీరు
ఎంతో
కాలంగా
ఇటువంటి
అవకాశంకోసం
నిరీక్షిస్తూ
వచ్చారు.
ఈనాడు
మీ
చిరకాల
వాంఛ
ఫలించింది.
మీ
ప్రేమతత్త్వము,
మీరు
చేసిన
సాధన
ఎప్పటికీ
వ్యర్థం
కావు.
ప్రేమ
ప్రేమగానే
ఉంటుంది,
సత్యం
సత్యంగానే
ఉంటుంది.
మీరు
ఏ
కార్యక్రమాన్ని
చేపట్టినా
ప్రేమతో
చేయండి.
ఒక
భిక్షగానికి
అన్నం
పెట్టినా
ప్రేమతో
పెట్టండి.
ఎవరిపట్లనూ
కోపాన్ని,
విసుగును,
ద్వేషాన్ని
ప్రదర్శించకండి.
మీ
సమస్త
కర్మలను
ప్రేమమయం
గావించుకోండి.
అదే
నిజమైన
భక్తి.
4
▾
Meaning
Keep
కొంతమంది
‘రామ్,
రామ్,
రామ్’
అంటూ
జపం
చేస్తుంటారు.
చేతిలో
జపమాల
తిరుగుతుంటే
వాళ్ళ
మనస్సుకూడా
మార్కెట్లో
తిరుగుతుంటుంది.
అది
జపం
కాదు.
రామనామ
జపం
మీ
హృదయాన్ని
ఆనందంతో
నింపివేయాలి.
కనులు
మూసుకొని
హృదయ
పూర్వకంగా
మీరు
రామనామాన్ని
స్మరించినప్పుడు
రాముని
దివ్యస్వరూపాన్ని
మీరు
దర్శించగల్గుతారు.
“ప్రేమ
ముదిత
మనసె
కహో
రామ
రామ
రామ్....”
భగవన్నామము
మీ
హృదయంలో
హత్తుకొని
పోవాలి.
సమాజ
సేవయే
సర్వేశ్వర
సేవగా
భావించాలి
భగవంతుడు
ప్రేమస్వరూపుడు,
గుణాతీతుడు.
భగవంతునికి
గుణాలు
కల్పించడం
మీ
ఇమేజినేషనే!
కోరిక,
కోపము,
ద్వేషము,
లోభము,
అసూయ,
గర్వము
ఇత్యాది
దుర్గుణాలన్నీ
మీకు
మీరు
కల్పించుకున్నవేగానీ,
భగవంతుడు
అందించినవి
కావు.
భగవంతుడు
ఎల్లప్పుడు
మీకు
ప్రేమనే
అందిస్తాడు.
మీరు
కనిపించిన
ప్రతి
వస్తువు
కావాలనుకుంటారు.
అది
మీలో
ఉన్న
దుర్గుణమే.
భగవంతునికి
దీనితో
ఏమీ
సంబంధం
లేదు.
భగవంతునికి
ఎటువంటి
కోరికలూ
లేవు.
కొంతమంది
తమలో
ఉన్న
కోరికలను
భగవంతునికి
ఆపాదించి,
భగవంతుణ్నికూడా
మోసం
చేయడానికి
ప్రయత్నిస్తుంటారు.
గుణాతీతుడైన
భగవంతునికి
గుణాలను
ఆపాదించి
ఆయనను
విమర్శిస్తుంటారు.
అయినప్పటికీ
భగవంతుడు
వారిని
ప్రేమిస్తూనే
ఉంటాడు.
ప్రేమద్వారా
భగవంతుని
ప్రేమను
అందుకోవాలి.
సత్యముద్వారా
సత్యస్వరూపుని
చేరుకోవాలి.
ఈవిధమైన
మార్గంలో
జీవితాన్ని
గడపటమే
నిజమైన
సాధన.
ఏదో
అరణ్యానికి
పోయి
ఒంటరిగా
కళ్ళు
మూసుకొని
కూర్చోవడం
సాధన
కాదు.
సమాజంలో
జీవిస్తూ
నిస్వార్థంగా
సమాజాన్ని
సేవించాలి.
సమాజసేవయే
సర్వేశ్వర
సేవగా
భావించాలి.
దీనులకు,
దిక్కులేనివారికి
సేవ
చేసే
సమయంలో
భగవంతుడినే
సేవిస్తున్నామని
విశ్వసించాలి.
భగవంతుడు
లేని
స్థానమే
లేదు.
దివ్యత్వం
సర్వత్రా
వ్యాపించి
ఉంది.
ఈ
కర్చీఫ్లోనూ,
ఈ
మైకులోనూ,
నిజానికి
ఈ
జగత్తులో
సర్వత్రా
దివ్యత్వం
నిండి
ఉంది.
భౌతిక
దృష్టికి
ఇది
ఒక
వస్త్రంగా
కనిపించవచ్చు.
కానీ,
దివ్యమైన
అంతర్దృష్టిని
అలవర్చుకున్నప్పుడు
మీకు
అన్నింటియందు
దివ్యత్వం
గోచరిస్తుంది.
ఈ
వస్త్రమునకు
ఆధారం
దారము,
దారమునకు
ఆధారం
ప్రత్తి.
ప్రత్తి
లేక
దారము
లేదు,
దారము
లేక
వస్త్రము
లేదు.
5
▾
Meaning
Keep
ఏవిధంగానైతే
ప్రత్తి
వస్త్రమునకు
మూలాధారముగా
ఉన్నదో
అదేరీతిగా
భగవంతుడు
సర్వసృష్టికి
మూలాధారముగా
ఉన్నాడు.
ఈ
ప్రపంచంలో
ఎక్కడ
చూసినా
ఉన్నది
భగవంతుడే.
అందరి
ప్రార్థనలూ
చేరేది
ఒకే
భగవంతుడినే
ప్రేమస్వరూపులారా!
మీరంతా
ప్రేమస్వరూపులే.
మీరంతా
దైవస్వరూపులే.
భగవంతుణ్ని
దర్శించడానికి
మీరు
ఎక్కడికో
పోనక్కరలేదు.
కనులు
మూసుకొని
అంతర్దృష్టితో
విచారణ
సల్పినప్పుడు
మీలోనే
భగవంతుడు
గోచరిస్తాడు.
భగవంతుని
దర్శించాలని
అనేకమంది
అనేకవిధములైన
సాధనలు
చేస్తుంటారు.
అన్ని
సాధనల
గమ్యం
ఒక్కటే.
నదులన్నీ
సముద్రంతో
ఏకమైనట్లుగా
అందరి
ప్రార్థనలూ
చేరేది
ఒకే
భగవంతుడినే.
మిమ్మల్ని
మీరు
సామాన్య
మానవులుగా
భావించుకోకండి.
మీరు
ప్రేమస్వరూపులు.
మీరు
ఎవరినైనా
‘నీ
పేరేమి?’
అని
అడిగితే,
‘రామయ్య’
అనో
లేక,
‘లక్ష్మమ్మ’
అనో
చెపుతారు.
కానీ,
వారు
ఆయా
పేర్లతో
పుట్టినవారు
కాదు.
అవి
వాళ్ళ
తల్లిదండ్రులు
పెట్టిన
పేర్లు.
ఈ
పేర్లన్నీ
మార్పు
చెందుతూ
ఉంటాయి.
మార్పు
చెందని
పేరు
ఒక్కటే,
అదే
‘నేను’.
‘నీవెవరు?’
అని
ఎవరైనా
నిన్ను
ప్రశ్నించినప్పుడు
‘నేను
నేనే’
అని
సమాధానం
చెప్పగల్గాలి.
ఇది
తప్ప
మీకు
మరొక
నామముగానీ,
రూపముగానీ
లేదు.
ఈవిధమైన
ఏకాత్మభావాన్ని
అభివృద్ధిపరచుకోవాలి.
ఈ
దేహము
మీరు
కాదు,
దీనికి
పెట్టిన
పేరు
మీది
కాదు.
మీ
అసలైన
పేరు
‘నేను’.
ఇదే
సత్యము.
ఇదే
సదా
మీవెంట
ఉండేది.
మీరు
దేహము
ధరించి
ఉన్నంతవరకు
ప్రజలు
మిమ్మల్ని
మీ
దేహమునకు
పెట్టిన
పేరుతో
పిలువవచ్చు.
కానీ,
దేహము
పోయిన
తరువాత
ఆ
పేరు
ఏమవుతుంది?
అందుచేతనే
నేను
చెపుతుంటాను,
‘నీవు
ఒక
వ్యక్తివి
కాదు,
నీలో
ముగ్గురున్నారు.
1.
నీవనుకునే
నీవు
2.
ఇతరులనుకునే
నీవు
3.
అసలైన
నీవు.
మనమధ్య
ఉన్నది
ప్రేమసంబంధము
ప్రేమస్వరూపులారా!
మీరంతా
ప్రేమస్వరూపులు,
సత్యస్వరూపులు.
కనుక,
మీరే
దైవస్వరూపులు.
ప్రేమను
ఎన్నడూ
విస్మరించకండి.
గడచిన
మూడు
రోజులుగా
స్వామి
మీతో
మాట్లాడలేదని
బాధపడకండి.
6
▾
Meaning
Keep
నేను
మీతో
మాట్లాడటానికి
ఎప్పుడూ
సిద్ధంగానే
ఉన్నాను.
కానీ,
మీ
పెద్దలు
నాకు
అవకాశం
కల్పించలేదు.
లేకపోతే,
ప్రతి
రోజూ
ఎంతసేపైనా
మీతో
మాట్లాడటానికి
నేను
సిద్ధమే.
మీ
అందరి
ప్రేమను
అందుకొని
నేనెంతో
ఆనందిస్తున్నాను.
నా
ప్రేమను
అందుకోవడం
మీ
అదృష్టం.
మీకు,
స్వామికి
మధ్యగల
సంబంధము
ప్రేమ
సంబంధము.
అందరూ
ప్రేమలోనే
పుట్టారు,
ప్రేమచేతనే
పోషింపబడుతున్నారు,
ప్రేమలోనే
జీవిస్తున్నారు.
ఇట్టి
ప్రేమతత్త్వాన్ని
ఎన్నడూ
మరచిపోకండి.
(“ప్రేమ
ముదిత
మనసె
కహో
రామ
రామ
రామ్...”
అనే
పాట
పాడిన
తరువాత
భగవాన్
తమ
దివ్యోపన్యాసాన్ని
కొనసాగిస్తూ
ఇలా
అన్నారు)
నేను
ఈరోజు
మాట్లాడినా,
పాట
పాడినా
అందుకు
కారణం
మీయందు
నాకు
గల
ప్రేమయే.
మీ
ప్రేమ
నాయందు,
నా
ప్రేమ
మీయందు
ప్రతిబింబిస్తున్నది.
మీ
ప్రేమను
నేను
అందుకొని
నా
ప్రేమను
మీ
అందరిపై
కురిపిస్తున్నాను.
అందరికీ
ప్రేమయే
అత్యంత
ప్రధానమైనది.
మన
అందరినీ
కలిపి
ఉంచేది
ప్రేమ
శక్తియే.
ప్రేమ
లేకపోతే
తల్లీ
బిడ్డల
మధ్య
కూడా
ఎలాంటి
సంబంధమూ
ఉండదు.
మీకూ,
స్వామికి
మధ్యగల
ప్రేమ
తల్లీ
బిడ్డల
మధ్య
ఉండే
ప్రేమకంటే
ఎంతో
అధికమైనది.
మీరందరూ
సుఖంగా,
ఆనందంగా
మీ
జీవితాన్ని
గడపాలని
నేను
ఆశిస్తున్నాను.
Previous
←
Humanness finds its fulfilment only when steadiness and oneness are both there
Next
Service itself is the foremost duty of man
→