Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1978 · The whole duty is yours
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The whole duty is yours
15 March 1978, Address to invited guests, Delhi
1
▾
Meaning
Keep
His poems 33
Also in his talks
(15)
15 June 1973
The Bond of Prakṛti and the Paramātma
23 November 1986
Inquiry into Ātma-jñāna itself is Sanātana Dharma
2 January 1987
Sanātana Dharma is the essence of all the wisdom of the Vedas
7 April 1989
All this is Vāsudeva
17 October 1990
The strength of the Ātma alone is true strength
23 November 1990
Restore the glory of Bharat
22 November 1996
Along with Study, Saṁskāra Too Is Very Necessary
23 November 1998
Sarvaṁ Khalvidaṁ Brahma
10 September 2000
God is within you
19 January 2001
Doctors must serve the poor in a spirit of sacrifice
22 November 2003
True Prema stands only when selfishness is given up
10 August 2006
Offering oneself is the true yajña
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
12 September 2008
Complete sacrifice alone is the stairway to immortality
22 November 2008
The duty of guarding the wealth of Dharma of Mother Bhārata is yours!
ఖండఖండాంతర
ఖ్యాతి
నార్జించిన
మహనీయులను
గన్న
మాతృభూమి
పాశ్చాత్య
వీరుల
పారద్రోలించియు
స్వాతంత్ర్యమును
గన్న
సమరభూమి
పాండిత్యమున
చాల
ప్రఖ్యాతి
గాంచియు
ప్రతిభ
చూపించిన
భరతభూమి
సంగీతసాహిత్య
శాస్త్రీయ
విద్యల
ధీశక్తి
చూపిన
దివ్యభూమి
చిత్రకళలతోడ
చిత్రమైయున్నట్టి
భరతభూమియందు
ప్రభవమొంది
భరతమాత
ధర్మభాగ్యంబు
కాపాడ
బాధ్యతంతయు
మీదె
సభ్యులార!
ప్రేమస్వరూపులారా!
నానాలౌకిక
కోలాహలపూరిత
నగరజీవితము
మధ్య
ఆధ్యాత్మిక
సత్యమును
గురించి,
మానవుల
జీవితములందు
నిత్యసత్యములుగా
ప్రకాశించు
ప్రాచీన
సంప్రదాయములోని
సంస్కృతిని
తెలుసుకొని
పునరుద్ధరించుట
మానవుని
కర్తవ్యము.
సృష్టి
అనాది,
జీవులు
అనంతము.
అనంతమైన
జీవుడు
ఉత్తముడు.
అట్టి
ఉత్తమోత్తముడైన
మానవుడు
పురుషోత్తముని
గ్రహించ
అనేక
ప్రయత్నములు
చేయుచున్నాడు.
కొందరు
దైవము
కలడని,
కొందరు
దైవము
లేడని
వాదోపవాదములు
చేయుచున్నారు
తప్ప
తమతమ
వాదములను
ఋజువు
పరచు
ప్రయత్నము
చేయుటలేదు.
ఎవరికైననూ
విశ్వాసము
ప్రధానము.
నమ్మకము
ముఖ్యము.
ఎవరి
నమ్మకము
వారికి
ఆనందమునిచ్చును.
ఏ
విషయమునైననూ
పూర్ణముగా
గ్రహించిన
మానవుడు
ఇట్టి
వాదోపవాదములకు
దిగడు.
వస్త్రము
పూర్తిగా
చూచినవాడు
మాత్రమే
అది
‘రుమాలు’
అని
చెప్పగలడు.
కాని,
చిన్న
భాగమును
చూచి
ఏమి
చెప్పగలడు?
నేటి
ప్రపంచములో
మానవుడు
కించిత్తు
గ్రహించి,
బావిలోని
కప్పవలె
ఉండి,
అన్నీ
తెలియునని
చెప్పుచున్నాడు.
పవిత్రమైన
దివ్యత్వము
సముద్రము
వంటిది.
అదే
సర్వత్రా
వ్యాపించి
ఉన్నది.
అట్టి
దైవత్వము
లేని
ఎడల
మానవత్వము
లేదు.
దీనిని
మానవుడు
దర్శించకున్న
లేదనుటకు
వీలులేదు.
నిత్యజీవితములోని
అనేక
అనుభూతుల
ద్వారా
ఈ
దివ్యశక్తిని
గ్రహించాలి.
ఈ
దివ్యశక్తియే
అన్నింటికీ
ఆధారముగా
ఉన్నది.
సృష్టి
రహస్యమంతయూ
యిమిడి
యున్నది.
వృక్షములు
విడుచు
ప్రాణవాయువు
మానవులకు
ఉపయోగపడును.
ఇది
దివ్యశక్తియొక్క
ఏర్పాటే.
సంవత్సరముల
తరబడి
మానవుడు
మాట్లాడిననూ,
రేడియోలో
కరెంటు
ఖర్చైనట్లు
మానవునిలోని
శక్తి
తరగిపోకుండుటకు
కూడ
ఈ
దివ్యశక్తియే
కారణము.
ఈ
దివ్యత్వమే
అన్నింటిలో
ఆత్మతత్త్వము.
దీనిని
పురస్కరించుకొనియే
దైవము
అణువునందు
అణువుగను,
ఘనమునందు
ఘనముగను
ఉన్నాడనుట.
కాని,
మానవుడు
అణువునుగాని,
ఘనమునుగాని
చూడలేడు.
తన
చుట్టూ
వ్యాపించియున్న
గాలిని
చూడలేని
మానవుడు
దానిలోని
అనేక
అణువులనెట్లు
చూడగలడు?
భూమి
కంటే
సూర్యుడు
చాలా
పెద్దది.
95
కోట్ల
మైళ్ళ
దూరమున
ఉన్నది.
ఒక
గంటకు
500
మైళ్ళ
వేగముతో
200
సంవత్సరములు
ప్లేనులో
ప్రయాణించిన
సూర్యుని
చేరగలము.
అట్టివి
అనేక
వేల
సూర్యమండలములు
కలవు.
అతి
దూరముగా
ఉండుటచే
చాలా
చిన్నదిగా
కనిపించునుగాని
చాలా
విశాల
స్వరూపము
కలిగియున్నది.
రెండు
నక్షత్రముల
మధ్య
దూరము
35
కోట్ల
మైళ్ళు.
ఇట్టి
పరిస్థితిలో
అనేక
కోట్ల
నక్షత్రములను,
అనేక
కోట్ల
సూర్యులను
ఒకసారి
ఎట్లు
దర్శించగలము?
అందుకే,
ఘనమైన
స్వరూపాన్ని
కూడ
దర్శించలేకున్నాము.
‘ఇందు
కలడు,
అందు
లేడని
సందేహము
వలదు,
చక్రి
సర్వోపగతుండు’
అన్నట్లు
ఈశ్వరత్వము
లేని
స్థలము
ఎక్కడా
లేదు.
అజ్ఞానాంధకారము
ఆవలనున్న
సత్యమే
దైవము.
సర్వధర్మాలకు
సత్యమే
ముఖ్యము.
రసాయనిక
శాస్త్ర
ప్రకారము
సున్నము
పసుపు
కలిపిన
ఎఱ్ఱటి
పారాణి
అగును.
సూదిముక్క
వేడిమిచే
పొడవగును.
ఒక్కొక్క
పదార్థము
ఒక్కొక్క
సత్యముగా
గోచరించును.
ఎక్కడ
చూచినా
అణువు
అందురు.
కాని,
truth
is
more
fundamental
than
atom.
పరమాత్మ
అణుస్వరూపుడై
ఉంటున్నాడు.
జగత్తంతా
అణువులతో
నిండి
ఉన్నది.
భారతీయులు
తమ
అజ్ఞానాంధకారమును
పారద్రోలి,
తమ
భావములను,
చిత్తములను,
మనస్సును
అభివృద్ధి
చేసుకొని
ఈశ్వరుడు
జగత్తంతా
వ్యాపించి
ఉన్నాడను
సత్యమును
గ్రహించారు.
ఎక్కడ
గాలి,
వెలుతురు,
నిస్వార్థము
ఉండునో
అక్కడ
పవిత్రత
ఉండును.
ఎక్కడ
అజ్ఞాన,
అంధకారములుండునో
అక్కడ
పెనుభూతములు
చేరును.
ప్రాచీన
కాలమునుండియూ
ఈ
అజ్ఞానాంధకారములు
పారద్రోలు
ప్రయత్నములు
జరుగుచున్ననూ
అవి
సరియైనవిగా
లేవు.
ఉదాహరణకు
బొగ్గును
తెల్లబరచుటకు
నీటితోను,
సోపుతోను
కడిగిన
లాభము
లేదు.
దానిని
నిరంతరము
అగ్నిలో
వేసి
ఉంచిన
తెల్లబడును.
అదియే
సరియైన
మార్గము.
ఈనాడు
ప్రతి
మానవుడూ
గృహ
యజమానిగా
తయారుకావాలిగాని
పరిచారకుడుగా
కాదు.
గృహములోని
విలువైన
పదార్థములు
యజమానికి
తెలియునుగాని
పరిచారకునికి
ఎట్లు
తెలియును?
అదేవిధముగా
మన
హృదయ
మందిరములోని
సుజ్ఞాన,
ప్రజ్ఞానమను
విలువగల
రత్నములను
వెతికి
గ్రహించాలి.
కేవలము
భుజించుట,
ధన
సంపాదన,
భోగలాలస
తర్వాత
ఎప్పుడో
జీవితమును
వదలిపెట్టుట,
జీవిత
గమ్యము
కాదు.
కాలము
ప్రచండ
మారుతము
వలె
కదలిపోవుచున్నది.
ఆయువు
మంచు
వలె
కరిగిపోవుచున్నది.
మానవుడు
తన
కర్తవ్యము,
గమ్యము
గుర్తించక
కన్ను
మూయుచున్నాడు.
జీవించినంతవరకు
స్వార్థము,
ఆవేదనలచే
చాలా
దుఃఖములకు
గురియగుచున్నాడు.
అందుచే
మానవుడు
సహజములోని
ఏకత్వమును,
ఏకత్వములోని
దివ్యత్వమును
గుర్తించాలి.
విశాలత్వమును
పెంపొందించుకోవాలి.
చీమలు,
కాకులు
స్వార్థము
విడిచి
దొరికిన
పదార్థములను
పంచుకొనుచున్నవి.
కాని,
మానవుడు
స్వార్థముతో
పరార్థమును
మరచిపోవుచున్నాడు.
‘ఏకోహం
బహుస్యాం’
అను
తత్త్వమును
మానవులు
అలవరచుకొనిన
నిజమైన
ఆనందము
కలుగును.
‘నేను’
అనునది
నాతోనేకాక
అందరిలోనుకూడ
కలదని
గ్రహించాలి.
అట్టి
ఏకత్వములోని
దివ్యత్వమును
సాధన
వలన
గ్రహించవలెను.
ఆహార,
నిద్ర,
మైధునాదికములు
మానవులలోనూ,
పశువులలోనూ
సామాన్యముగాని
పశువులలో
ఒక
రీజను,
సీజను
ఉంది.
2
▾
Meaning
Keep
కాని,
‘జంతూనాం
నరజన్మ
దుర్లభం’గా
పొందిన
మానవులలో
అది
లోపించుచున్నది.
మానవునిలోని
పవిత్రశక్తి
ఎవరిలోనూ
లేదు.
ఏనుగు
ఏవిధముగా
తన
శక్తిని,
బలమును
తెలుసుకోలేదో
ఆవిధంగా
భారతీయులు
సర్వశక్తులూ
కలిగి
కూడా
వాటిని
గ్రహించలేకున్నారు,
నిరూపించలేకున్నారు.
మానవులు
తమ
పవిత్ర
ఆదర్శములను,
భావములను
ఏకోన్ముఖము
చేసి
తమ
దివ్యత్వాన్ని
గ్రహించు
సాధన
సలపాలి.
ఏ
పార్టీలవారైనా
భారతీయులందరూ
ఒక్కటే.
భావములు,
అభిప్రాయములు,
తలంపులువేరైనా
భారతీయులందరూ
ఒక్కటే.
దేహములో
అనేక
అంగములున్నవి.
ఒక్కొక్క
అంగమును
వేరుచేసిన
దేహమే
లేదు,
అట్లే
భారతీయులందరూ
వ్యక్తిగత,
స్వార్థభావములు
పైశాచిక
తాండవము
చేసిన
వాటిని
ప్రక్కకు
నెట్టి
దేశ
గౌరవమును,
ఐక్యతను
కాపాడాలి.
దేహము,
దేశము
బింబప్రతిబింబములు.
మన
దేశము
మన
మాత
అని
గ్రహించాలి.
పవిత్ర
భారతదేశమునకు
వేదము,
శాస్త్రము
రెండు
కన్నులు.
భరతమాత
ఈ
రెండు
కన్నులను
కాపాడుచూ,
ఆమె
ఒడిలో,
ఆమె
ప్రేమకు
అర్హులుగానుండు
ప్రయత్నము
చేయండి.
మన
ఉపనిషత్తులు,
‘అసతోమా
సద్గమయా’
అను
నిత్య
సత్య
మార్గమును
ప్రబోధించుచున్నది.
అది
తెలుసుకొనుటకు
ప్రయత్నించాలి.
ప్రతి
ఒక్కరూ
సృష్టి
విచిత్రములను
గురించి
మాట్లాడుదురు.
కాని,
సృష్టికి
కారణము,
కారణము
తెలుసుకొనుట
లేదు.
ప్రతి
విషయమునకు
పదార్థమునకు
ఆధారముంది.
మన
చేతిరుమాలు,
మన
ముందున్న
టేబులు
యిలాగే
మనకు
చిక్కలేదు.
వాటికి
ఆధారమైన
ప్రత్తి,
కఱ్ఱను
సృష్టించినవాడు
ఒకడున్నాడు.
ఈ
సృష్టి
ఎక్కడనుండో
ఉట్టిపడలేదు.
సృష్టికర్త
ఉన్నాడు.
ఇల్లు
కట్టాలన్నా,
బండి
నిర్మించాలన్నా
ఒక
మూలాధార
పదార్థము
ఉండాలి.
ఆ
మూలాధార
పదార్థమే
ఈశ్వరత్వము.
అంతేగాని
జగత్తు
శూన్యమునుండి
రాలేదు.
శూన్యత్వమనునది
లోకములో
లేదు.
ప్రతీదీ
పూర్ణత్వమునుండే
జనించును.
ఇంకో
సత్యము
మీరు
గ్రహించాలి.
చాలామంది
శ్రీసత్యసాయిబాబా
అనేక
చమత్కారములు
చేస్తారు,
దాని
సత్యము
ఏమిటని
ఆందోళన
పడతారు.
అది
మీ
దృష్టిలో
చమత్కారము.
నా
దృష్టిలో
సహజము.
చమత్కారమనగా
ఆకర్షణ.
ఈ
ఆకర్షణ
జగత్తులోని
ప్రతి
పదార్థములో
ఉంది.
ఏదైనా
క్రింద
వదలిన
భూమ్యాకర్షణ
వలన
అది
క్రింద
పడును.
ప్రకృతికే
ఒకవిధమైన
ఆకర్షణ
ఉంది.
మార్కెట్టులో
ఆకర్షణగానున్న
కూరగాయలను,
పండ్లనే
కొంటాము.
ఈ
చమత్కారములన్నియూ
మీ
హృదయములను
సంస్కారము
చేయుటకొరకే.
అందుచే
ఆ
చమత్కారము
సంస్కారమునకు
దారితీయుచున్నది.
సంస్కారము
వలన
పరోపకారము,
దాని
ఫలితముగా
సాక్షాత్కారము
పొందుచున్నాడు.
మానవుని
సంకుచిత
దృష్టి
కేవలము
చమత్కారమునే
చూచుచున్నదికాని
మిగిలిన
మూడు
విషయములను
చూచుటలేదు.
ఇక
నా
ప్రియమైన,
ప్రధానమైన
చమత్కారము
ప్రేమ.
ప్రేమను
విద్యవల్లగాని,
మరేవిధముగా
కాని
అర్థము
చేసుకొన
వీలులేదు.
‘సత్యస్య
సత్యం’
అన్నట్లు
ప్రేమను
ప్రేమతోనే
తెలుసుకోవాలి.
మానవునకు
మానవునకు
మధ్యనున్న
దివ్యత్వాన్ని
గుర్తించి,
ఏకత్వములోని
పవిత్రత
గుర్తించి,
ప్రేమతో
మానవులు
భ్రాతృత్వమును,
దైవపితృత్వమును
అభివృద్ధి
చేసుకోవాలి.
గాలి
ప్రతిచోటా
ఒకటే,
ఐననూ
బెలూన్‌లో
లిమిటెడ్‌గా
ఉండి
ఊదగా,
ఊదగా
బెలూన్
పగిలి
లోనిగాలి
విశ్వములోని
గాలిలో
ఎట్లు
కలసిపోవునో
అట్లే
సాధన
వలన
'you
and
i
are
one,
i
and
you
are
one'
అను
విశాల
భావమును
అభివృద్ధి
చేసుకొని,
విశాల
ప్రేమను
అలవరచుకోవాలి.
అల్పుడైన
మానవుడు
ఘనంలో
ఏకమగు
కృషి
చేయాలి.
వేదాంతములో,
‘బ్రహ్మవిత్
బ్రహ్మైవ
భవతి’
ఎట్టి
భావములో
అట్లే
అగుట
అని
ఉంది.
బ్రహ్మతత్త్వము
సర్వులలో
ఉంది.
నిత్యజీవితంలో
నిరర్థకంగా
జీవించక
సర్వులలోని
బ్రహ్మతత్త్వమును
గ్రహించి,
దైవత్వములో
నివసించాలి.
కొమ్మ
చెట్టునకు,
బిడ్డ
తల్లికి
ఏవిధముగా
అంగమో
మానవుడు
దైవమునకు
ఆవిధమైన
అంగము.
చెట్టును
వదలి
కొమ్మ,
తల్లిని
వదలి
బిడ్డ
ఏవిధముగా
ఉండలేరో
అదేవిధముగా
దైవాన్ని
వదలి
మానవుడు
బ్రతకలేడు.
దైవము
అని
చెప్పకపోయినా
పవిత్ర
ప్రేమ
హృదయముతో
సమాజ
సేవ
చేయాలి.
దైవసాగరంలో
తన
సేవ
అను
శరీరాన్ని
చేర్చాలి.
అట్టి
సేవ
ద్వారా
work
is
worship,
duty
is
god
అనునది
ఋజువుపరచాలి.
‘అహం’
మానవునిలోని
దుర్గుణములకు
కిరీటము
వంటిది.
ఈ
అహం
ఉన్నంతవరకు
బాధలు
తప్పవు.
ఫుట్‌బాల్‌లో
గాలి
ఉన్నంతవరకు
తన్నులు
తప్పవుకదా!
గాలిపోయిన
ఎవరూ
కొట్టరు.
అహంకారమనే
గాలిని
నింపిన
నిందలు,
కష్టములు
తప్పవు.
తప్పించుకోలేనన్ని
దెబ్బలు
తగులును.
కామమును
భూతమని,
క్రోధమును
ప్రేతమని,
అహంకారమును
పిశాచమని
అన్నారు.
మానవుడు
నిజమైన
దివ్యత్వమైన
ఆ
తత్త్వమును
గ్రహించి,
అమృతత్త్వమును
ధరించి
పవిత్ర
కార్యములు
ఆచరించాలి.
అప్పుడే
ఈ
భూత,
ప్రేత,
పిశాచములైన
కామ,
క్రోధ,
అహంకారములు
దూరమగును.
మానవుడు
మాయచే
కప్పబడి
ఉన్నాడు.
అందుచే
శాశ్వతముగా
ఉండాలని
భ్రమిస్తున్నాడు.
ఎట్టి
మనిషికైనా
మరణమంటే
భయమే!
ధనకనకవస్తువాహనములు
శాశ్వతము
కావు.
నీతినిజాయతీలు,
మంచిపేరే
శాశ్వతమని
గుర్తించాలి.
money
comes
and
goes
but
morality
comes
and
grows.
త్యాగము,
శీలము,
సత్యము
ఇవి
జీవనజ్యోతులు.
దేహమును,
దేశమును,
సమాజమును
రక్షించునవి
ఇవే.
కులమును,
అనుభూతులను
క్షణక్షణము
వెనుకకు
నెట్టి,
మంచి
ఆదర్శములు,
ఆశయములతో
గమ్యము
చేరాలి.
దేశ
ముఖ్యపట్టణమైన
ఈ
ఢిల్లీ
నగరములో
నివసించువారు
మరింత
ఆదర్శవంతముగా
నివసించుటకు
ప్రయత్నించాలి.
విద్యార్థులలోను,
అధ్యాపకులలోను
అనేక
మార్పులు
తెప్పించాలి.
వారి
మధ్య
సన్నిహిత
సంబంధముండాలి.
టేప్‌రికార్డ్
ఎడ్యుకేషన్‌గా
ఉన్న
నేటి
విద్యారంగములో
సాధ్యమైనంతవరకు
మార్పులు
తేవాలి.
నూటికి
30
మార్కులు
తెచ్చుకున్న
విద్యార్థి-
అంటే
నూటికి
70
తప్పులు
చేసినవాడు
-
ఆపీసరు,
నాయకుడు
ఐనవారు
ఇతరులకు
చూపు
ఆదర్శమేమిటి?
దేశము
అప్పుడు
ఏవిధముగా
బాగుపడును?
అట్టివారు
విశ్వకల్యాణము,
శాంతికి
ఏవిధముగా
సహాయపడగలరు?
విదేశవ్యవహారాల
మంత్రి
వాజ్‌పేయి
ఒకటి
అడుగుతున్నారు.
మన
భారతదేశము
భగవద్గీత,
భారతము,
వేదముల
గురించి
ఏమీ
తెలియనివారు
విదేశములలో
మన
దేశమునకు
అగౌరవము
తెచ్చుచున్నారు.
న్యూయార్క్‌లో
ఆదిశంకరులు
ఎవరని
ప్రశ్నించిన
అతను
ఒక
బెగ్గరని
సమాధానము
చెప్పుట
సిగ్గుచేటు.
అందుచే
భారతదేశము
నుండి
పోవువారికి
కనీసం
మూడు
మాసములైనా
మన
సంస్కృతిని
గురించి
తగిన
శిక్షణనిచ్చి
భారతదేశముయొక్క
సంస్కృతి,
పవిత్రత,
గౌరవములను
నివేదించి,
యినుమడింపజేయునట్లు
చేయాలి.
జనగణమన......
Previous
←
The end of education is character
Next
Tender saplings
→