Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Prema Is the Form of God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Prema Is the Form of God
27 June 1989, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 277
Also in his talks
(10)
29 May 1979
Cross the Ocean of Saṁsāra in the Boat of Jñāna
21 July 1996
Expand Your Love and Experience Eternal Bliss
16 August 1996
‘Love all, worship all’
16 July 2000
Prema Is God, God Is Prema
16 July 2001
Immortality is attained through Prema alone
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
22 November 2003
True Prema stands only when selfishness is given up
21 March 2004
I am you, you are I
13 April 2005
Those who believe in difference cannot attain divinity
14 January 2006
He alone is truly educated who knows the Ātma within
ప్రేమ
రూపము
బ్రహ్మంబు
ప్రేమమయము
ప్రేమప్రేమతో
సంధింప
నీమమగును
కాన
ప్రేమను
గట్టిగా
కలిగియుండి
ప్రేమ
చేరుడు
ప్రేమ
విద్యార్థులార.
విద్యార్థులారా!
భగవంతుడు
ప్రేమస్వరూపుడు.
‘బ్రహ్మవేదం
సర్వం
విశ్వం’
సర్వమ్
విష్ణుమయం
జగత్.
జగత్తంతయు
భగవత్
స్వరూపమే.
ఏతావాతా
ప్రేమస్వరూపమే.
యీ
ప్రపంచము.
ఇట్టి
అనంతమైన
సర్వవ్యాపకమైన
ప్రేమతత్త్వాన్ని
విశాలత్వాన్ని
వ్యక్తుడైన,
సంకుచితుడైన
యీ
మనుజుడు
గుర్తించుకోలేక
పోతున్నాడు.
దేహమునకు
సంబంధించిన
ప్రేమ
అనియు,
మనస్సునకు
సంబంధించిన
ప్రేమ
అనియు,
ఆత్మకు
సంబంధించిన
ప్రేమ
అనియు
మూడు
భాగములుగా
విభజించుకొని
మానవుడు
అనుభవించుటకు
ప్రయత్నిస్తున్నాడు.
కనుకనే
యీ
ప్రేమ
తత్త్వము
తమోరజ
స్సాత్వికంగా
రూపొందుతూ
వస్తుండాది.
జగత్తునందు
కలిగే
సంయోగ
వియోగములు
కాని
సృష్టి
స్థితి
లయములుగాని
ప్రేమపైననే
ఆధారపడివుంటున్నాయి.
ప్రేమతత్త్వాన్ని
మనం
గుర్తించుకున్నప్పుడు
సంయోగ
వియోగములందుగాని,
సుఖదుఃఖములయందుగాని
మనం
సమత్వాన్ని
వహించుటకు
ఎంతైనా
అవకాశము
వుంటుంది.
శాస్త్రం
తామసికమైన
ప్రేమ
తత్త్వాన్ని
అధమప్రేమ
అని
వర్ణిస్తూ
వచ్చింది.
కేవలం
తనకు,
తనకు
సంబంధించిన
పదార్థములకు,
తనకు
సంబంధించిన
వ్యక్తులకు
మాత్రమే
యిది
పరిమితమై
వుంటుంది.
ఇది
సంకుచితమైన
స్వార్థప్రేమగా
రూపొందుతుంది.
ఇది
తమోగుణసంబంధమైన
దేహప్రేమ.
ఇంక
రెండవది
స్వార్థ
పరార్థములకు
సమన్వయమైనది.
స్వార్థమును
స్వప్రయోజనమును
దృష్టియందుంచుకొని
తమ
కార్యములను
నెరవేర్చుకునే
నిమిత్తమై
శ్రీమంతులుగాని,
అధికారులుగాని
ప్రేమించినట్టుగా
నటించి
వారిద్వారా
కార్యములను
సఫలీకృతం
చేసుకోటానికి
పూనుకుంటారు.
ఏవిధముగా
అనగా
అధికారుల
దగ్గరికి
వెళ్లి
తమ
కార్యాన్ని
పరిపూర్ణము
గావించుకునే
నిమిత్తమై
వారికి
మాలలు
వేయటము
వారి
దగ్గర
అణగి
మణగి
వుండటము,
వారికి
వినయ
భయ
విశ్వాసములు
ప్రకటించటము,
వారిని
గౌరవించటము
యీ
విధమైన
నటనల
చేత
ప్రేమను
ప్రకటిస్తూ
వస్తుంటారు.
ఇది
మన
విద్యార్థులందరికి
చక్కగా
అర్థమైన
విషయమే.
సీటు
చిక్కేంతవరకు,
యిక్కడ
చదివేంతవరకు
పిల్లలు
వారి
భక్తి
ప్రపత్తులు
ఎన్ని
విధములుగానో
ప్రకటిస్తూ
వుంటారు.
వారు
మాత్రమే
కాదు.
వారి
తల్లితండ్రులు
కూడా
అంతే.
సీటు
యిచ్చిన
తర్వాత,
విద్య
పూర్తి
అయిన
తరువాత
యీ
విద్యార్థులు
ఎక్కడో
వారి
తల్లితండ్రులు
ఎక్కడో
ఏమాత్రము
కనుపించరు.
2
▾
Meaning
Keep
ఇది
ప్రత్యక్ష
నిదర్శనము.
ఇది
రెండో
విధమైన
రజోగుణప్రేమ.
తమ
కార్యమును
సఫలీకృతం
గావించుకునే
నిమిత్తమై
ప్రేమను
ప్రపంచమందు
ప్రకటిస్తూ
స్వార్థముననుభవిస్తూ
ప్రాప్తమైన
జగతునందు
అప్రాప్తమైన
తత్త్వమును
ప్రకటితము
చేస్తూ
వుంటారు.
యిది
రజోగుణ
సంబంధమైన
ప్రేమ.
ఇంక
మూడవది.
శుద్ధ
సాత్వికమైన
ప్రేమ.
జగత్తునందు
యిప్పటి
పరిస్థితి
లోపల
యీ
స్థాయిలో
చాలా
అరుదుగా
వుంటారు.
సర్వజీవులయందు
వుండేది
ప్రేమ
స్వరూప
పరమాత్ముడే
అనే
సత్యాన్ని
గుర్తించి
ప్రేమ
లేకుండా
జీవితము
లేదనే
సత్యాన్ని
అర్థం
గావించుకొని
తన-పర
అనే
భేదము
లేకుండా
సర్వ
భూతాంతరాత్మ
అనే
సత్యాన్ని
వారు
ప్రకటిస్తూ
వస్తుంటారు.
‘ఏకోవసి
సర్వ
భూతాంతరాత్మ’
అనగా
ప్రేమ
స్వరూపుడైన
పరమాత్ముడే
సర్వభూతములయందు
ఆత్మస్వరూపుడుగా
వున్నాడనే
సత్యాన్ని
విశ్వసించి
అందరియందు
దైవత్వాన్ని
కాంచుతూ
వుంటారు.
వారి
దృష్టి
అంతయు
ఆత్మదృష్టిగా
వుంటుంటాది.
ఆత్మదృష్టి
కలిగిన
వ్యక్తి
సింహసమానుడు
అన్నారు.
సింహమునకెట్టి
భయము
వుండదు.
ఏవిధమైన
ఒడుదుడుకులకు
అవకాశము
నందించదు.
నిర్భయముగా
సర్వజీవులను
తనకు
అధీనులుగా
మృగచక్రవర్తిగా
వుంటాది.
ముందు
వెనుక
యేమాత్రం
చూడదు.
విచారించదు.
శరీర
దృష్టి
కలిగినవారి
భావము
గొఱ్ఱెదృష్టి
వంటిది.
ఇది
నిరంతరము
అదురు
బెదురుతో
కూడి
వుంటుంటాది.
జీవితమంతా
అదురు
బెదురుతోనే
వ్యర్థము
గావించుకుంటుంది.
ఆత్మదృష్టి
కలిగినవాడు
సింహము.
మృగములన్నీ
సింహము
అధీనములో
వుంటాయి.
మనస్సు
బుద్ధి
చిత్తము
అంతఃకరణ
యింద్రియము
యివన్నీ
కూడను
ఆత్మస్వాధీనంలో
వుంటాయి.
ఒక్క
ఆత్మను
మనము
అనుసరించినట్లైతే
యివన్నీ
సులభముగా
స్వాధీనము
చేసుకోవచ్చు.
ప్రతి
ఒక
దృష్టి
పారమార్థిక
లక్ష్యము
నందుంచుకొని
వ్యావహారిక
జీవితమును
అనుభవించటములో
దోషము
లేదు.
విద్యార్థులారా!
లక్ష్యమును
ఆత్మయందుంచుకొని
దేహమనో
చిత్తములయొక్క
స్వభావములను
నీ
ధర్మానురీతిగా
అనుసరించటములో
దోషము
లేదు.
ఈ
లేత
వయస్సునందే
పవిత్రమైన
దివ్యతత్త్వాన్ని
గుర్తించుకోటం
చాలా
అవసరం.
ఒక
చిన్న
ఉదాహరణము.
మీరు
తెల్లవారే
టికెట్
తీసుకొని
సకాలమునకు
క్యాంటీను
భోజనమునకు
వెళ్లినపుడు
మీకు
తప్పనిసరిగా
భోజనము
అందిస్తారు.
అట్లు
కాకుండా
మొదలే
నీవు
టికెట్
అందుకోకుండా
సకాలంలో
నీవు
పోయి
భోజనమంటే
చిక్కవచ్చు.
లేక
చిక్కకపోవచ్చును.
సందిగ్ధావస్థలోపల
వుంటాది.
ఈ
లేత
వయస్సునందే
దివ్యతత్త్వానికి
బుక్
చేసుకోటం.
ఆ
టికెట్
తీసుకోవటం
చాలా
అవసరం.
ఐతే
మనము
యీ
విధమైన
ఆధ్యాత్మిక
తత్త్వము
ఫలం
నిమిత్తమై
ఆశించరాదు.
కూలి
నిమిత్తమై
పనిచేసేవాడు
కూలివాడౌతాడు
గాని,
యజమానుడు
కాడు.
కూలికోసం
పనిచేసేవాడు
శ్రద్ధా
భక్తులతో
చెయ్యడు.
ఆ
పని
కూడా
అంతశుద్ధంగా
చెయ్యడు.
3
▾
Meaning
Keep
ముందు
ఆపని
ఏమౌతుందో,
ఎట్లా
అవుతుందోనని
విచారము
కూడా
చెయ్యడు.
ఐదు
గంటల
వరకు
చేస్తాడు.
తన
కూలి
అందుకుంటాడు.
వెళ్లిపోతాడు.
అందువలనే
అతను
పరాయివాడుగా
భావిస్తున్నాడు.
ఇంట్లో
భార్యవుంటుంది.
పిల్లలుంటారు.
ఇంట్లో
అన్నీ
చేస్తూనే
వుంటారు.
కాని
ఏ
జీతం
నిమిత్తము
వారు
పని
చెయ్యటం
లేదు.
సాయంకాలానికి
భర్తదగ్గరకు
వచ్చి
ఏమండి!
మీకు
వంటలు
చేసి
పెట్టాము
నా
కూలి
యిస్తారా
అని
అడగదు.
కాని
పరిశుద్ధంగా
చేస్తుంది.
పవిత్రంగా
చేస్తుంది.
ఇంటో
పదార్థములన్నీ
భద్రంగా
చూచుకుంటుంది.
ఈ
విధమైన
అధికారంతో
బాటు
ఒకవిధమైన
స్వాతంత్ర్యాన్ని
అనుభవిస్తారు
యింటివారు.
కనుక
ఫలం
నిమిత్తమై
భగవంతుని
ప్రార్థించేవాడు
కూలిమనిషి.
భగవంతుడు
నావాడు
నాయందే
వుండినటువంటివాడు
అనే
అధికారంగా,
స్వాతంత్ర్యంగా
అనుభవించటానికి
ప్రయత్నించేవాడు
యజమాని.
మనము
యజమానుడుగా
మారాలికాని
సర్వెంటుగా
మారకూడదు.
ఈ
మార్గమునకు
మూడు
విధములైన
సాధనలు
యేర్పరుస్తూ
వచ్చారు.
ఒకటి
మత్స్యమార్గము,
రెండవది
మృగమార్గము,
మూడవది
కూర్మ
మార్గము.
ఈ
మూడింటియందు
వున్న
వ్యత్యాసమేమిటి?
మత్స్యము
జలమునందే
జీవించకలదు.
గట్టున
జీవించలేదు.
మృగము
గట్టున
మాత్రమే
జీవించగలదు.
నీటిలో
నివాసము
సలుపలేదు.
కూర్మము
నీటియందు
గట్టునందు
రెండింటియందు
సంచరించి
జీవితాన్ని
గడుపుతుంది.
మొదటి
సాధకుడు
తాను,
తనవారు,
తన
కుటుంబము
అనే
పరిమితియందు
మాత్రమే
తన
సాధనను
తన
నిశ్శబ్దమును,
తన
ఏకాగ్రతను
అనుభవించటానికి
ప్రయత్నిస్తూ
వుంటాడు.
రెండవవాడు
కేవలము
ఏకాకిగా
వుండి
ఏకాగ్రతను
పొందగలుగుతున్నాడు.
జనసమూహము
లోపల
ఏకాగ్రతను
పొందలేకపోతున్నాడు.
ఒక
సామాన్యమైన
వ్యక్తి
యింట్లో
ధ్యానము
చేయాలని
కూర్చున్నాడు.
తనకు
ఎక్కువ
మంది
పిల్లలుండేవారు.
పూజరూములో
పోయ్యాడు.
తలుపు
వేసుకొని
కూర్చున్నాడు.
ఒక్కొక్క
పిల్లవాడు
ఒక్కొక్క
తూరి
వచ్చి
తలుపును
కొడుతున్నాడు.
ఇతనికి
విసుగు
పుట్టింది.
ఛీ!
యీ
యింటిలో
వుండేదానికంటె
అడవిలోకి
పోయి
తపస్సు
చేయటం
మంచిదనుకున్నాడు.
అడవికి
పోయాడు.
ఒక
చెట్టుక్రింద
కూర్చుని
ధ్యానములో
నిమగ్నుడైనాడు.
ఆ
చెట్టుపైనున్న
పక్షులు
అరుస్తుంటున్నాయి.
అరవటమే
కాక
అనేక
పక్షులు
చేరటంచేత
నెత్తిపై
రెట్టలు
వేస్తున్నాయి.
అక్కడ
కూడా
విసుగు
పుట్టిందతనికి.
ఇంట్లో
పిల్లలగోల,
అడవిలో
పిట్టల
గోల.
ఈ
గోలలు
వినేదానికంటె
ఆత్మహత్య
చేసుకుంటే
మంచిదనుకున్నాడు.
ఇతడు
యింట్లోగాని,
బయటుగాని,
ఎక్కడగాని
శబ్దములు
వినలేకపోతున్నాడు.
సర్వము
భగవంతుని
స్వరూపమనే
సత్యమును
గుర్తించుకోలేకపోతున్నాడు.
ఇది
రజోగుణము
లక్షణము.
ఇంక
సాత్వికము.
ఎక్కడ
కూర్చున్న
సరియు
అతనికి
ఏకాగ్రత.
జనం
మధ్యలో
కూర్చున్నప్పటికిని
ఏకాంతంగా
కూర్చున్నప్పటికిని
అతను
అన్ని
విధాలా
ఏకత్వం
అనుభవిస్తున్నాడు.
4
▾
Meaning
Keep
ఎవరైనా
తన
ఏకాగ్రతకు
భంగం
కలిగించుతే
భగవంతుడే
నాకు
భంగం
కలిగిస్తున్నాడు
అని
అదికూడను
భగవంతుని
అనుగ్రహంగా
స్వీకరించే
భావము.
వేదాంత
విషయాన్ని
చక్కగా
అర్థము
చేసుకొని
వర్తించటము
అవసరం.
ఈనాడు
మన
ప్రోమిసలు
కాని,
మన
వాగ్దానాలుగాని,
మన
వేదాంత
విషయములుగాని
అర్థము
చేసుకున్నట్టుగా
మనం
వర్తిస్తున్నామేగాని
సమయ
సందర్భానుసారము
పురస్కరించుకొని
అవి
అంతర్థానమౌతున్నాయి.
నేను
ఈ
విధమైన
డిసిప్లిన్
నడుచుకోవాలి
అని
ప్రతిజ్ఞ
చేసుకుంటాడు.
తాను
యింక
యేమాత్రం
మారకూడదని
నిర్ణయం
చేసుకుంటాడు.
కాని
సమయము
వచ్చేటప్పటికి
పూర్తి
మార్పు
చెందుతుంటాడు.
ఒకనాడు
జింకలన్నీ
అడవిలో
చేరి
ఒక
కాన్ఫరెన్సు
పెట్టుకున్నాయిట.
మీటింగ్
ఎజండా
ఏమిటి?
మనకున్న
శక్తి
కుక్కలకేమైనా
వుందా?
మనం
ఒక్కతూరి
కాలితో
కొట్టామంటే
కడుపులో
పేగులన్నీ
కుప్పవలె
రాల్తాయి.
మన
చిన్న
కాలిలో
అంత
శక్తి
వుంది.
ఇంతటి
శక్తి
కుక్కలకేమైనా
వుందా?
మనం
పరుగెత్తే
వేగం
కుక్కలు
పరుగెత్తలేవు.
వేగంలో
మనం
కుక్కలకంటె
తక్కువ
వారమా?
అవసరమొస్తే
మనం
ఎగురుతుంటాము.
కుక్కలు
ఎగరలేవు.
కుక్కల
క్వాలిఫికేషను,
మన
క్వాలిఫికేషన్
తీసుకుంటే
మనము
చాలా
గొప్పవారుగా
వున్నాము.
అలాంటి
మనం
కుక్కలకు
ఎందుకు
బెదరాలి?
కనుక
నేటినుండి
కుక్కలకు
ఏమాత్రం
వెరువరాదు.
ధైర్యంతో
వాటిని
ఎదుర్కొని
పోరాడాలి
అని
నిర్ణయం
చేసుకొన్నాయి.
ఈ
నిర్ణయం
తీసుకున్న
తరువాత
అన్ని
జింకలు
లేచి
నిజము
నిజము
అని
చాలా
క్లాప్స్
వేశాయి.
వీటి
శబ్దము
విన్నదో
లేదో
ఎక్కడో
ఒక
కుక్క
గట్టిగా
అరిచింది.
కుక్క
శబ్దం
విన్నదోలేదో
ఈ
సమావేశంలో
ఒక్క
జింక
లేదు.
పరుగెత్తి
పోయాయి.
మీటింగులో
నిర్ణయం
చేసుకున్నది
ఏమిటి?
అనుభవంలోకి
వచ్చేటప్పటికి
ఏమి
చేయలేక
పోయినవి
పాపం.
ఇట్లే
వుంటుండాది
యీనాటి
వేదాంతము
యీనాటి
నడతలు.
విన్న
విషయాన్ని,
విన్న
భావాన్ని
అనుభూతిలో
తెప్పించుకోటానికి
తగిన
ప్రయత్నం
చెయ్యాలి.
ఈనాడు
అనేక
ప్రాంతములందు,
అనేక
స్థలములందు
వేదాంత
ప్రబోధలు
జరుగుతూనే
వుంటున్నాయి.
ఇంక
గీతా
ప్రచారములనేవి
చెప్పనక్కరలేదు.
ప్రతివ్యక్తి
గీతాప్రచారం
చేయటమే.
గీతను
సరిగా
అర్థం
చేసుకొని
ప్రచారం
చేస్తున్నారా?
గీతయొక్క
రహస్యమేమిటి?
అని
ఎవ్వరు
కూడను
గుర్తించిన
వ్యక్తి
కనుపించటం
లేదు.
గీతలో
బోధించిన
ప్రధానమైన
ప్రాణసమానమైన
స్థానమేమిటి?
ఏ
పండితుడు
గుర్తించటానికి
ప్రయత్నించటం
లేదు.
గీతా
ప్రచారం
చేసే
ఒక
గొప్ప
పండితుడు
లోకంలో
గొప్ప
పేరు
పొందాడు.
వారిమెప్పు
వీరిమెప్పు
పొందటంకంటె
మహారాజు
మెప్పును
పొందటం
గొప్పతనంగా
వుంటుంటాది.
గొప్ప
బహుమానం
వుంటుంటాది.
నాయింటి
పరిస్థితి
హీనంగా
వుంటుండాది.
5
▾
Meaning
Keep
రాజును
పట్టాలనుకున్నాడు.
వెంటపడి
కుంటి
నక్కను
కొట్టే
దానికంటె
గురి
తప్పినా
పులిని
కొట్టటం
మంచిదిరా
అనుకున్నాడు.
చిన్నచిన్న
వారినంతా
అడుక్కునే
బదులు
పులివంటి
మహారాజును
పట్టుకోటం
చాలా
మంచిదనుకున్నాడు.
మహారాజు
దగ్గరకు
వెళ్లాడు.
ఆ
మహారాజు
సామాన్యుడు
కాదు.
అతను
భగవద్గీతను
పూర్తిగా
అనుభవించినవాడు,
చదివినవాడు,
కంఠస్థం
చేసినవాడు.
కొంతవరకు
అనుభూతిలో
తెచ్చుకొన్నవాడు.
నిండుకుండ
తొణకదు
అన్నట్టుగా
ఆ
మహారాజు
భగవద్గీతను
గురించి
ఎక్కడ
కూడ
ఎవరితో
చెప్పలేదు.
మంత్రులకు
కూడ
మహారాజుకు
భగవద్గీత
తెలుసునని
తెలియదు.
అలాంటి
పరిస్థితిలో
యీ
పండితుడు
శాలువా
కప్పుకొని
దర్బారుహాల్లోకి
వెళ్లినాడు.
మంత్రి
వచ్చి
పండితుడు
తమకోసం
కాచుకున్నాడని
వర్తమానం
అందించాడు.
రాజు
మొట్టమొదట
మంత్రినే
పంపించాడు.
పరిస్థితి
ఏమిటో;
ఏ
నిమిత్తమై
వచ్చాడో
కనుక్కొని
రమ్మన్నాడు.
భగవద్గీత
పారాయణ
చేసే
నిమిత్తమై
ప్రవేశించానన్నాడు
పండితుడు.
భగవద్గీత
ప్రచార
ప్రబోధల
చేతనే
నాజీవితమంతా
జరుపుకుంటున్నాను.
మాకుటుంబమంతా
దీనిపైనే
ఆధారపడి
వుండాది.
వేరే
వుద్యోగము
గాని
వేరే
ఆదాయముగాని
లేదు.
భగవద్గీతను
ప్రచారం
చేయటం
దానినుండి
లభించిన
ధనము
చేత
నాజీవితము
సులభముగా
సుఖంగా
ఆనందముగా
గడుపుకుంటున్నాను,
రాజు
మంత్రితో
చెప్పిపంపించాడు.
ఆ
పండితుడు
యింకా
భగవద్గీతను
పూర్తి
తెలుసుకోలేదు.
తెలుసుకున్న
తర్వాత
రమ్మని
చెప్పమన్నాడు.
చూచాడు
మరి.
పది
పదిహేను
సంవత్సరముల
నుండి
భగవద్గీతను
బోధిస్తున్నానే
నాకు
తెలియదని
చెప్పాడు
మహారాజు!
ఈ
మహారాజుకేమీ
తెలియదనుకున్నాడు.
మరి
ఒక
పదిదినములైన
తరువాత
తిరిగి
వెళ్లాడు
పండితుడు.
రాజు
తిరిగి
యిదే
జవాబిచ్చాడు.
ఇంకా
పూర్తి
తెలుసుకోలేదు
తెలుసుకొని
రమ్మన్నాడు.
ఈ
విధంగా
నాలుగైదు
పర్యాయములు
వెనక్కు
పంపించాడు.
పండితునకు
చాలా
కోపమొచ్చింది.
చాలా
నిరాశైపోయింది.
నిస్పృహకు
గురైపోయాడు.
ఈ
లోపల
విసుగు
పుట్టిపోయింది.
ఇంటికి
పోయాడు.
ఆ
బుక్కు
అక్కడ
పారవేశాడు.
చాలా
నిరాశతో
పండుకున్నాడు.
భార్యవచ్చింది.
ఏమిటండీ!
మహారాజు
ఏంచెప్పారు?
ఇంతనిరాశకు
కారణం
ఏమిటి
అని
అనేక
ప్రశ్నలు
వేస్తూ
వచ్చింది.
ఆ
కోపం
చేత
ఆమెను
కూడా
కొంచెం
అరిచాడు.
ఆమె
మరింత
పీడిస్తూ
వచ్చింది.
ఏం
చెప్పాడు
మహారాజు
అని
అడుగుతూ
వచ్చింది.
చెప్పటానికి
నామనసు
సరిలేదు
షటప్
అన్నాడు.
భర్త
పరిస్థితి
గుర్తించుకుంది.
లోపల
పోయింది.
కొంచెం
వుప్మా
చేసుకుంది.
కాఫీ
తీసుకుంది.
తట్టలో
పెట్టుకొని
వచ్చింది.
కోపంగా
వున్నప్పుడు
మగవారిని
ఏవిధంగా
శాంతి
చెయ్యాలో
ఆడవారికే
తెలుసును
తప్ప
అన్యులకు
తెలియదు
పాపం.
దగ్గరకు
వెళ్లింది.
లేచాడు.
కాఫీ
త్రాగాడు.
కొంచెం
శాంతి
కలిగింది.
అప్పుడు
యీమె
కూర్చుని
విసనికఱ్ఱ
తీసుకొని
విసురుతూ
ఏం
చెప్పారండీ
మహారాజు
అని
అడిగింది.
6
▾
Meaning
Keep
Also in his talks
(2)
25 December 1996
God Dwells in Your Very Heart
10 September 2002
The Inner Meaning of Vināyaka Worship
ఇన్ని
సంవత్సరములనుండి
నేను
భగవద్గీత
చెప్తున్నాను.
నా
భగవద్గీత
విన్నవారందరు
ఆహా
ఇంతటి
గొప్ప
వ్యాఖ్యానకర్త
మాకు
చిక్కలేదని
నన్ను
ఎంతో
వర్ణిస్తూ
వచ్చారు.
కట్టకడపటికి
ఆ
మహారాజు
మంత్రితో
నాకు
భగవద్గీత
యింకా
తెలియదని
చెప్పి
పంపించాడు
నాకు
ఎంత
అవమానం
అన్నాడు.
మన
భారతదేశ
ప్రభుత్వం
నాకు
పద్మశ్రీ
అనే
బిరుదు
యిచ్చింది.
వేదాంతరత్న
అనే
బిరుదు
యిచ్చింది.
భగవద్గీతా
సామ్రాట్
అని
యిచ్చింది.
ఇన్ని
బిరుదులు
నాకిచ్చినప్పుడు
ఈ
మహారాజు
నన్ను
అవమానం
చేయవచ్చునా?
అదే
సామాన్యమైన
మానవుడైతే
జుట్టుపట్టి
కొట్టి
వుందును.
అని
అనేకరకములుగా
అతని
ప్రభావాన్ని
ప్రతాపాన్ని
భార్యదగ్గర
నిరూపిస్తూ
వచ్చాడు.
అప్పుడు
భార్య
నెమ్మదిగా
చెప్పింది.
నిజమేనండి
మహారాజు
చెప్పింది
చాలా
సత్యము
అనింది.
నీవు
బుద్ధివుండి
మాట్లాడుతున్నావా
బుద్ధి
లేక
మాట్లాడుతున్నావా?
మహారాజు
చెప్పింది
ఎట్లు
సత్యమౌతుంది.
నాకేమీ
భగవద్గీత
తెలియదా
అని
ఆమెను
కూడను
కోపంగా
మాట్లాడుతూ
వచ్చాడు.
అయ్యా!
మీరేమైనా
కోపించండి.
మీరేమైనా
తిట్టండి.
నేను
మహారాజువలె
సత్యాన్నే
చెబుతానన్నది.
మీ
భగవద్గీత
పారాయణం
15
ఏండ్ల
నుంచి
నేను
చూస్తున్నాను.
మీ
ఉపన్యాసములంతా
ఎంతో
కర్ణానందంగా
నేను
వింటున్నాను.
భగవద్గీతలోపల
పరమాత్ముడేమి
చెప్పాడో
మీరు
చూచుకున్నారా?
విచారం
చేశారా?
యే
జనాః
పర్యుపాసతే
తేషాం
నిత్యాభియుక్తానాం
యోగక్షేమం
వహామ్యహం.
ఎవరు
ఏవిధంగా
నన్ను
కోరుకుంటారో
అలాంటి
వారి
యోగక్షేమం
నేనే
చూచుకుంటానని
భగవద్గీతలో
చెప్పాడు
అంతేకాదు
తానే
మోక్షాన్ని
అందిస్తానని
చెప్పాడు.
సర్వధర్మాన్
పరిత్యజ్య
మామేకం
శరణం
వ్రజ
అహంత్వా
సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి
మాశుచః
అన్నాడు.
నిజంగా
ఆ
చెప్పిన
భగవంతునిపైనే
నీకు
నమ్మకముంటే
నీవు
మహారాజు
దగ్గరకెందుకు
పోవాలి?
ఆ
యోగక్షేమం
భగవంతుడు
చూచుకోలేడా?
ధనంకావలెనని
మహారాజు
దగ్గరకు
పోయినావు.
నీకేం
భగవద్గీత
తెలిసింది?
నీవు
భగవద్గీతను
బోధిస్తున్నావు
కాని
భగవంతుని
వాక్యాలపైన
నీకు
విశ్వాసం
లేదు.
నీకు
భగవద్గీత
పూర్తి
తెలియదు
అని
ఆమె
నిర్ణయించింది.
దాంతో
ఆయనకు
చాలా
బాధ
కలిగింది.
ఇది
నిజమే.
భగవంతుడు
యిట్లా
చెప్పాడు
అట్లా
చెప్పాడు
అని
వర్ణిస్తున్నారే
గాని
ఈనాడు
భగవద్గీత
యొక్క
ప్రచార
ప్రబోధలందు
భగవంతుని
వాక్యాన్ని
ఎవరు
ఆచరిస్తున్నారు.
ఇట్టి
వేదాంత
ప్రబోధలు
అధికం
కావటంచేతనే
ఆధ్యాత్మిక
మనేది
దినదినమునకు
దిగజారిపోతోంది.
హృదయమునుంచి
వచ్చే
భావములు,
మాటలనుండి
వచ్చే
పలుకులు
చేతలలో
ఆచరించాలి.
7
▾
Meaning
Keep
Also in his talks
(1)
26 June 1989
Bhakti Is Never Parted from God
ఈ
మూడింటి
ఏకత్వము
జరిగిన
తరువాత
నిజమైన
తత్త్వం
యేర్పడుతుంది.
విద్యార్థులారా!
గడ్డిని
పెంచుటకు
మనం
ఎక్కువ
ప్రయత్నం
చేయనక్కరలేదు.
పంటను
పెంచాలంటే
అతిశ్రమ
పడాలి.
అదే
విధముగనే
నిష్ప్రయోజనమైన
ప్రాకృతమైన
విషయవాసనలు
మనం
అనుభవించటం
గొప్పతనము
కాదు.
ఇది
గడ్డితో
సమానము.
దివ్యమైన,
భవ్యమైన,
నవ్యమైన
భగవత్ప్రేమ
తత్త్వమనే
పంటను
పండించుకోవాలంటే
దానికే
మనం
శ్రమ
పడాలి.
దానికి
ఎవ్వరూ
ఏవిధమైన
శ్రమను
పడేది
కనుపించటంలేదు.
భక్తులవలె
మనకు
కనుపిస్తారు.
మట్టిలో
తిరిగే
కుమ్మరి
పురుగుకు
మట్టి
అంటిందంటే
అది
కుమ్మరి
పురుగు
కాదు.
కమ్మరి
పురుగు.
నిజముగా
యీ
దివ్యతత్త్వాన్ని
గుర్తించుకున్న
వారికి
యీ
విషయవాసనలపైన
అంత
ఒడిదుడుకులుండవు.
ఏదో
కాలహరణనిమిత్తమై
దీన్ని
అనుభవించటానికి
ప్రయత్నం
చేస్తున్నామేగాని
నిత్యసత్యమైన
నిలయానికి
యిది
సరియైన
రాజబాట
అనే
సత్యాన్ని
మనం
గుర్తించటం
లేదు.
ప్రాకృతమైన
జీవితానికి
యిది
వుండవలసిందే.
కానీ
నిత్యమైన
జీవిత
పరమావధికి
మనం
యోచించాలి.
లైఫ్
అనేది
కేవలం
లివింగ్
కాకుండా
లైఫ్
అనేది
శాశ్వతమైన
way
of
life
గా
చూచుకోవాలి.
మీరందరు
ఏ
కొంచెం
తెలిసినప్పటికి
ఒకటిరెండైనా
ఆచరణలో
పెట్టి
అదియే
మన
నిత్యజీవితమునకు
ఈ
సత్యమార్గమని
భావించి
ప్రతిదినము
ఒకటి
రెండు
నిముషాలైనా
దీనిని
స్మరించటం
అత్యవసరం.
దినమునకు
ఎన్నిగంటలో
మనం
స్వార్థము,
స్వప్రయోజనం
నిమిత్తమై
వ్యర్థము
చేస్తున్నాము.
దినమునకు
5
నిముషాలు
భగవత్తత్త్వమునకు
ఉపయోగపెట్టటం
లేదే.
ఇది
ఏమికర్మ.
ఎందుకోసం
యిటువంటి
దుర్బుద్ధులు
పుట్టటం!
ఈ
విధమైన
దుర్బుద్ధులు
మానవుని
ఉన్నతికి
తీసుకొనిపోవు.
అంధుడగువాడు
ఎవ్వడీ
యవనియందు
చదువు
కలిగియు
చెడుక్రియల్
సలుపువాడు.
అన్నారు.
అంటరాని
దెయ్యది?
అన్నారు.
అంటగా
రానిది
అప్పుబాధ.
ఇలాంటి
బాధలు
మనము
నిత్యము
అనుభవిస్తున్నాము.
ఇంకొకరికి
ఏవిధముగాను
మనము
పరాధీనము
కాకూడదు.
తన
కాళ్లపై
తాను
నిల్చుకునే
శక్తిని
సంపాదించాలి.
దానిని
మనము
భగవత్ప్రేమతోనే
సాధించాలి.
భగవత్ప్రేమనే
లేకపోతే
ప్రకృతి
మనకు
ఏమాత్రం
వశంకాదు.
మొన్న
చెప్పాను.
రావణుడు
భూజాతయైన
సీతను
మాత్రమే
ఆశించి
రాముని
విస్మరించాడు.
ప్రకృతి
మాత్రం
కావాలని
పరమాత్మను
విస్మరిస్తే
యీ
ప్రకృతి
ఎవరిసొత్తు?
నీసొత్తా?
కాదు.
పరమాత్ముని
సొత్తు.
పరమాత్ముని
ప్రసన్నం
గావించుకుంటే
ప్రకృతి
మీకు
వశమౌతుంది.
ఈ
అంతరార్థము,
యీ
రహస్యము
ఏ
మానవుడు
కూడను
గుర్తించటంలేదు.
నా
శక్తితో,
నాబలముతో,
నా
విద్యతో
నేను
దీనిని
సాధించానని
గర్వపడుతూ
వుంటారు
మానవుడు.
8
▾
Meaning
Keep
ఇది
నీశక్తి
కాదు.
కేవలము
భగవత్
శక్తినే
అంతర్వాణిగా
వుంటుండి
అంతశ్శక్తిగా
వుంటుండి
నిన్నీవిధంగా
ఆడిస్తున్నది.
ఒకానొక
సమయంలోపల
గాండీవాన్ని
సాధించిన
అర్జునుడు
యిది
అంతా
నాశక్తితోనే
సాధించానని,
నాశక్తితోనే
యుద్ధములో
విజయము
గాంచినానని
అనేకరకములుగా
గర్వించాడు.
కృష్ణుడు
తన
దేహమును
వదలిన
తరువాత
ద్వారకనుంచి
అంతఃపురకాంతల
నందరిని
తీసుకొని
హస్తినాపురం
వస్తుండే
సమయము
లోపల
అర్జునుని
అడవిగొల్లలు
అడ్డగించారు.
అతనికి
గాండీవం
బిగించటానికి
కూడను
చేతకాలేదు.
అప్పుడు
తన
సత్యాన్ని
గుర్తించుకున్నాడు.
ఛీ!
నేనెంత
అవివేకుడను.
నేను
యింతకాలం
యీ
విధంగా
వుండటం
కృష్ణుని
వరప్రసాదమే.
నేను
నిమిత్త
మాత్రునిగా
వుండినాను.
‘నిమిత్త
మాత్రం
భవ
సవ్యసాచి’
అని
తానే
చెప్పాడు.
యుద్ధములోపల
నిన్ను
నిమిత్తముగా
పెట్టుకున్నానన్నాడు.
కనుక
ప్రతి
మానవుడు
నిమిత్తమాత్రుడే.
ఐతే
తన
కర్తవ్యాన్ని
నిర్వర్తించుకుంటూ
భగవంతునిపైన
భారం
వెయ్యాలి.
‘యత్నప్రయత్నము
మానవధర్మము.
జయాపజయములు
దైవాధీనము’
అని
కూడ
నేను
నేను
చేస్తున్నాను
అనుకోకూడదు.
నాయందున్న
భగవంతుడు
ఆత్మస్వరూపుడు
నన్నీవిధంగా
ఆడిస్తున్నాడు,
చేయిస్తున్నాడు
అని
మాత్రమే
విశ్వసించాలి.
ఎక్కడ
విశ్వాసమో
అక్కడే
ప్రేమ.
ఎక్కడ
ప్రేమనో
అక్కడే
శాంతి.
ఎక్కడ
శాంతియో
అక్కడే
సత్యము.
ఎక్కడ
సత్యమో
అక్కడే
దైవము.
ఎక్కడ
దైవమో
అక్కడే
ఆనందము.
కట్టకడపటిది
ఆనందము.
మొదటిది
విశ్వాసము.
విశ్వాసము
వుండినవారికే
ఆనందము
లభ్యమౌతుంది
కాని
విశ్వాసము
లేనివారికి
ఆనందము
లభ్యము
కాదు.
కనుక
భగవంతుని
యొక్క
నామస్మరణము
చేస్తూ
ఆత్మ
విశ్వాసాన్ని
నిరంతరము
అభివృద్ధి
గావించుకొని
ప్రేమతత్త్వాన్ని
మీ
హృదయంలోపల
పెంచుకోండి.
Previous
←
Bhakti Is Never Parted from God
Next
All the World Is Filled with Brahman
→