Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Follow the Religion of Love
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Follow the Religion of Love
10 July 1996, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 446
కంచునందు
మ్రోత
ఘనముగా
నుండును
కనకమందు
మ్రోత
కానరాదు
అల్పులందు
మెండు
ఆడంబరములు
పైన
పూతలేల
భక్తులకును.
విద్యార్థులారా!
ఈనాటి
విద్యార్థులు
కలిమి,
చెలిమి,
బలిమి
ఆశించుచున్నారుగానీ
గుణమును
ఆశించుట
లేదు.
సమత,
మమత,
సమగ్రత,
సౌభ్రాతృత్వము
ఈ
నాల్గింటిని
ముఖ్యముగా
సాధించాలి.
విద్యార్థులందు
ఎట్టి
ఆడంబరము
పనికిరాదు.
సద్గుణములు,
సదాచారములు,
సత్సంపత్తి
సత్ప్రవర్తనయే
విద్యార్థికి
ఉండవలసిన
లక్షణములు.
కానీ
దురదృష్ట
వశాత్తు
ఈనాటి
ఆధునిక
యుగమందు
వీటన్నింటికి
విరుద్ధమైన
చర్యలు
జరుగుతూ
వస్తున్నవి.
దుస్సంగము,
దురాలోచన
దుష్ప్రవర్తన,
దుశ్చింతలతో
కాలము
గడుపుతున్నాడు
ఈనాటి
విద్యార్థి.
మనకు
ఆడంబరములు
సరియైనవి
కావు.
కంచు
కనకము
రెండు
చూచునప్పుడు
ఒక్కటిగానే
ఉంటాయి.
కానీ
కంచు
శబ్దము
ఘనముగా
ఉంటుంది.
కనకము
శబ్దరహితముగా
ఉంటుంది.
ఈనాటి
విద్యార్థులు
ఆడంబరమైన
మాటలు
తగ్గించుకోవాలి.
గొప్ప
విలువ
సంపాయించనక్కరలేదు.
నీవు
ఘనముగా
గౌరవముగా
పలుకులు
పలికి
విద్యార్థి
అనే
సార్థక
నామాన్ని
నిలుపుకోవాలి.
మన
మాటలు
మధురంగా
వినయముగా
విధేయత
ప్రకటింప
చేయాలి.
భగవంతుడు
ప్రసాదించిన
ముఖ్యమైన
గుణములు
ఈనాడు
ఏవిధంగా
ఉపయోగించుకుంటున్నాం.
మతి,
స్థితి,
గతి,
సంపత్తి.
ఈ
నాలుగు
భగవంతుని
అనుగ్రహమే.
ఈనాడు
మతిని
దుర్మతిగా
ఉపయోగిస్తున్నాము.
మతి
కేవలము
ఉన్మత్తునిగా
మారుస్తున్నది.
మతియే
మదోన్మత్తునిగా
మారుస్తుంది.
మతిని
సద్వినియోగ
పరచుకోవాలి.
మతి
కలిగినవాడే
మతమును
ఆశిస్తాడు.
జగత్తునందు
సర్వమతములు
మతిని
పురస్కరించుకొనియే
ప్రవర్తించుచున్నవి.
2
▾
Meaning
Keep
His poems 66
Also in his talks
(7)
6 April 1983
Build temple in your hearts
8 January 1988
The Dharma of the Ātma is svadharma
23 July 1989
All Religions Together Teach Only the Good
27 January 1992
Increase the thought of God! Reduce worldly desires!
22 July 1994
The fullness of Prema
25 December 1996
God Dwells in Your Very Heart
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
మతములన్ని
చేరి
మంచినే
బోధించె
తెలిసి
మెలగవలెను
తెలివితోడ
మతులు
మంచివైన
మతమేది
చెడ్డది.
వినుడు
భారతీయ
వీరసుతుడ!
అన్ని
మతములు
సత్యమునే
బోధిస్తున్నాయి.
అన్ని
మతములు
ధర్మమునే
ఆచరింప
చేస్తున్నాయి.
అన్ని
మతములు
మాతృదేవో
భవ,
పితృదేవో
భవ,
ఆచార్యదేవో
భవ.
గురువును
గౌరవించమనే
బోధిస్తున్నాయి.
పెద్దలను
గౌరవించమని
కీర్తి
మర్యాదలను
ప్రతిష్ఠ
చేసుకోమని
అన్ని
మతములు
సువిశాలమైన
భావములనే
ప్రబోధిస్తున్నాయి.
కానీ
మన
మతులలో
నున్న
దోషము
చేత
మతములను
కూడా
దోషముగా
భావిస్తున్నాము.
to
realise
is
religion.
ఈ
పవిత్రమైన
సూక్తులనే
ప్రతి
మతము
ప్రబోధిస్తున్నాది.
మానవుడు
మానవత్వములో
జీవించుటకు
తగిన
కృషి
చేయాలి.
ఈనాడు
మానవుడు
మాధవుడు
కాకపోయినా
పరవాలేదు.
మానవుడు
మానవుడుగా
జీవించాలి.
లోకములో
వినయ
విధేయతలతో
జీవించువాడే
మానవుడని
ప్రబోధించాయి
మన
ఉపనిషత్తులు.
కవిం
పురాణ
మనుశాసితార
మణోరణీయాం
సమనుస్మరేద్యః
సర్వస్య
ధాతారమ
చింత్య
రూపమాదిత్యవర్ణం
తమసః
పరస్తాత్
॥
ఎవరు
కవి.
మానవుడా
కాదు.
కేవలము
పదములను
చేర్చువాడే
మానవుడు.
ఈ
పదములు
స్వచ్ఛముగా
ఉంటే
కదా
తాను
చేర్చగలుగుతున్నాడు.
మానవునికంటె
ముందుగనే
పుట్టినవి
పదములు.
ఈ
పదములను
అమర్చినవాడు
భగవంతుడే.
కవి
ఏరీతిగా
ఉంటుండాలి.
మూడు
కాలములు
దర్శించినవాడు
కవి.
భూత
భవిష్యద్వర్తమానములు
చూడగలిగినవాడే
కవి.
ఈ
కవి
ఎవరనగా
భగవంతుడే.
పురాణం
అనగా
ఏమిటి?
రామాయణము,
భారతము
ఇలాంటి
వంతా
పురాణములు
కాదు.
పురాణమనగా
శరీరమనే
పురమందు
నఖశిఖ
పర్యంతము
సంచరించే
ఏ
చైతన్య
శక్తి
కలదో
దానికే
పురాణమని
పేరు.
ప్రతి
మానవుడు
చైతన్య
శక్తితో
వెలుగుతున్నాడు
కనుక
అతనే
పురాణుడు.
ఇతను
సమిష్టి
స్వరూపుడు
వ్యష్టి
స్వరూపుడు
కాదు.
ఒక
వ్యక్తియందు
మాత్రమే
ఉన్నవాడు
కాదు.
అందరియందు
సమత్వంగా
ఉన్న
చైతన్యమే
దివ్యత్వము.
3
▾
Meaning
Keep
ఈశ్వర
స్సర్వ
భూతానాం.
అందరియందు
ఉండేవాడు
భగవంతుడు.
అతనినే
పురాణము
అని
చెబుతారు.
అనుశాసితం.
అనగా
లోకములో
కొన్నికొన్ని
తప్పులకు,
కొన్ని
కొన్ని
దోషములకు
పాపములకు
కొన్ని
కొన్ని
శిక్షలుంటాయి.
శాసించునది
శాస్త్రము.
ఎవరైనా
దొంగతనము
చేసినప్పుడు
అతనిని
తీసుకు
వెళ్లి
జైలులో
పెట్టి
LOCK
చేస్తారు.
శరీరమును
బంధించినారేగానీ
తన
మనస్సును
ఎవరు
బంధించుటకు
వీలుకాదు.
తన
మనస్సు
సర్వత్రా
సంచరిస్తుంది.
తన
ఇంటికి
పోతుంది.
తన
మిత్రుని
ఇంటికి
పోతుంది.
ఎక్కడ
చూచినా
సంచరిస్తుంది
మనస్సు.
శరీరమును
బంధించేవాడు
శాసనుడు.
మనస్సును
బంధించేవాడు
అనుశాసితుడు.
అనగా
అతనే
దైవము.
అతను
ఏవిధంగా
ఉంటున్నాడు.
సూర్యుని
కాంతిలో
ఉంటున్నాడు.
సర్వుల
మనస్సులందు
బుద్ధిస్వరూపుడై
ఉంటున్నాడు.
ఋషులు
ఆనాడు
తపస్సు
చేసి
జగత్తుకు
వచ్చి
భగవంతుని
మేము
కనుకున్నాము
అన్నారు.
ఎక్కడ
కనుకున్నారు?
తమస్సుకు
ఆవల
కనుకున్నారు.
అజ్ఞాన
మనే
చీకటికి
ఆవల
కనుకున్నారు.
లౌకిక
ప్రపంచమందు
కాదు.
భౌతిక
ప్రపంచమందు
కాదు.
ప్రాకృత
ప్రపంచమందు
కాదు.
స్థూల
ప్రపంచమందు
కాదు.
అంతర్భావములో
మేము
గుర్తించాము.
ప్రతి
మానవుని
యందు
అజ్ఞానము
వెనుక
తేజోవంతుడై
ప్రకాశిస్తున్నాడు.
మానవుడు
మానవుడుగా
బ్రతికినప్పుడు,
మానవునిగా
జీవించినప్పుడు
తానే
మాధవుడై
పోతాడు.
అప్పుడే
తాను
కనకమువలె
చెడని
పదార్థముగా
రూపొందుతాడు.
నీవు
విత్తనము
తీసుకొని
భూమిలో
పెడితే
కొంతకాలమునకు
మార్పు
రావచ్చును.
కానీ
కనకము
ఎంత
కాలము
మట్టిలో
ఉండినప్పటికి
మారేది
కాదు.
ఎంత
కాల్చినా
ఇది
అపరంజిగా
మారుతుందే
గానీ
మాలిన్యము
కాదు.
మానవుని
మనస్సు
ఎంత
సంస్కరించినా
మరింత
మరింత
పవిత్రమై
పోతుందే
గానీ
దాని
యొక్క
ప్రకాశము
తగ్గేది
కాదు.
సంస్కారమయ్యే
కొలది
పవిత్రము
పెరుగుతూ
వస్తుంది.
కానీ
ఇత్తడి
అట్లా
కాదు.
చూచేందుకు
రెండు
ఒక్కటిగానే
ఉంటాయి.
‘ఉప్పు
కప్పురంబు
నొక్క
రీతిగనుండు,
చూడ
చూడ
రుచుల
జాడ
వేరు’
మనము
చూపులకు
మాత్రమే
మనుష్యుల
మాదిరి
ఉండకూడదు.
శ్రుతులన్నీ
ఈ
విధమైన
సత్యాలు
ప్రబోధిస్తూ
వస్తున్నాయి.
సర్వులకు
యిదే
మార్గము.
సర్వజీవులకు
యిదే
ఆధారము.
4
▾
Meaning
Keep
సర్వసృష్టికి
యిదే
కీలకము.
ఇట్టి
మనస్తత్వమును
మానవుడు
ఈనాడు
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
మానవుడు
మానవుడుగా
బ్రతకటానికి
తగిన
కృషి
చేయాలి.
ఆకార
మానవుడుగా
కనిపిస్తున్నాడే
గానీ
ఆచార
మానవుడుగా
కనిపించుటం
లేదు.
మనం
ఆచార
మానవులుగా
జీవించాలి.
మన
యొక్క
రూపము
మన
యొక్క
భావము,
మన
యొక్క
క్రియలు
స్వచ్ఛమైనవిగా
ఉండాలి.
అమూల్యమైనవిగా
ఉండాలి.
శీలవంతమైనవిగా
ఉండాలి.
సౌజన్యము,
సౌశీల్యము,
సౌభాగ్యంగా
ఉండాలి.
ఇలాంటి
మానవత్వము
పెంచుకోటానికి
చదువు
అవసరము.
విత్
అనగా
ప్రకాశము.
ఇట్టి
ప్రకాశమునందించేదే
విద్య.
కానీ
ఈనాటి
educationలో
education
ఉందిగానీ
elevation
లేదు.
elevation
చాలా
అవసరం.
ఎక్కడ
చూచినా
agitation.
ఇది
విద్యార్థి
లక్షణము
కానేరదు.
కేవలము
సోమరిపోతు
లక్షణము.
Laziness
is
dust
and
rust.
Realisation
is
best
and
rest.
Laziness
ఏమాత్రము
ప్రవేశపెట్టకూడదు.
చదవటానికి
వీలుపడనివాడే
Lazinessలో
ప్రవేశిస్తాడు.
కాలము
ఎంత
వ్యర్థము.
ధనము
ఎంత
వ్యర్థము.
ఎనర్జి
ఎంత
వ్యర్థము.
తల్లితండ్రులకు
ఎంత
anxiety.
నా
పిల్లవాడు
ఏమవుతాడో
స్ట్రైకు
చేస్తున్నారుటని
తల్లితండ్రులు
ఎంత
బాధపడతారు.
నీనుండి
తల్లితండ్రులకు
సరైన
కీర్తి
సంపాయించాలి.
నీ
blood
నీ
head,
నీ
food,
నీ
దుడ్డు
parents
gift.
కనుక
మొట్టమొదట
తల్లితండ్రులకు
ఏవిధమైన
anxiety
యివ్వకూడదు.
ఇలాంటి
విద్యార్థులుగా
తయారు
కావాలి.
వారినే
నేను
అప్పుడప్పుడు
బంగారు
బంగారు
అని
పిలుస్తాను.
అందరు
gold
కావాలి.
ఎలాంటి
gold.
Roald
gold
కాదు.
pure
gold
కావాలి.
ఏవిధంగా?
స్వచ్ఛమైన
హృదయముగా
ఉండాలి.
పవిత్రమైన
భావముగ
ఉండాలి.
నిత్యజీవితములో
ఆదర్శము
నందించాలి.
త్రికరణ
శుద్ధిగా
ఉంటుండాలి.
manలో
compassion
ఉండాలి.
దయమనలో
ఉండాలి.
అందువల్ల
mankind
అన్నారు.
ఈనాడు
పదముగా
ఉపయోగించుకుంటూ
కాలము
వ్యర్థము
చేసుకుంటున్నారు.
అర్థము
గుర్తించుటకు
ప్రయత్నించుట
లేదు.
కనుక
మన
గుణముల
చేత
భగవంతుడు
మనమే
కాగలము.
భగవంతుడు
వేరు
చోట
లేడు.
నీవే
భగవంతుడు.
నీవు
పవిత్రమైన
చిత్తము
కలిగినప్పుడు
నీకంటె
భగవంతుడు
మరొకడు
లేడు.
తన
చిత్తమందే
భగవంతుడు
అభివృద్ధి
పొందుతుంటాడు.
నీ
చిత్తమును
భగవంతుడు
పైలట్‌గా
డ్రైవ్
చేస్తుంటాడు.
భగవంతుడు
ఓనరు
కాదు.
నీవే
ఓనరు.
భగవంతుడు
పైలట్.
అందువలనే
పార్థసారథి
అన్నారు.
కృష్ణుడు
ఎవరు?
సారథి.
పార్థునకు
సారథి.
కృష్ణుడు
ఓనరు
కాదు.
పార్థుడు
ఓనరు.
5
▾
Meaning
Keep
Also in his talks
(10)
10 December 1986
Faith in the Ātma alone gives all strength
15 September 1988
God's descent is only to make Prema grow
17 June 1996
He Who Reaches God's Presence Is Honoured Everywhere
21 June 1996
Śraddhā and Faith Win God's Grace
23 November 1996
We Must Make Human Life a Life Full of Prema
29 March 1998
God fills every place
12 November 2003
Grow Prema for God and pity for the helpless
21 July 2005
No power is greater than Bhakti for God
7 October 2005
Surrender to God
22 August 2007
Foster faith in God and love of country!
ఇదే
రీతిగా
మీ
చిత్తము,
మీ
పవిత్రమైన
భావములు
అవే
మీ
ఓనర్షిప్.
భగవంతుడు
డ్రైవరు.
అతనిని
డ్రైవరుగా
భావించుకొని,
అతనినే
డ్రైవరుగా
ఎన్నుకొని
మీ
జీవితము
ప్రయాణము
సాగించండి.
షిర్డీలో
తొంభై
సంవత్సరముల
పూర్వము
నాందేడ్
గ్రామము
నుండి
ఒక
భక్తుడు
వచ్చాడు.
అతను
గొప్ప
శ్రీమంతుడే.
వాడియా
అతని
పేరు.
అతను
షిరిడీకి
పోవాలని
ఎంతో
ప్రయత్నం
చేస్తు
ఉండినాడు.
అతనికి
దాసగను
చాలా
స్నేహితుడు.
దాసగను
దగ్గరకు
వెళ్లి
నేను
షిరిడి
పోవాలనుకుంటున్నాను
ఏవిధంగా
పోవాలి.
షిరిడీ
పోవాలని
సంకల్పము
రావటం
ప్రథమం.
నాకు
బిడ్డలు
లేరు.
కావలసినంత
ధనముంటున్నది.
షిరిడీ
పోవటానికి
మీ
గైడెన్సు
కావాలి’
అన్నాడు.
అదే
గ్రామములో
చాలా
పవిత్రమైన
హృదయము
కలవాడు,
కష్టించి
పని
చేసేవాడు,
సాధు
హృదయుడు
ఉండేవాడు.
గ్రామములోని
వారందరు
అతనిని
సాధుస్వామి
అని
పిలిచేవారు.
అతను
కూలి
పనిచేసి
బ్రతికేవాడు.
అందరికి
మంచి
బోధ
చేసేవాడు.
ఆచరించి
బోధించేవాడు.
ఈ
కూలి
కొన్నిదినములు
పనిలేక
పోవటం
చేత
కొంత
బలహీనుడై
పోయాడు.
ఈ
కూలిస్వామి
ఒక
గట్టుక్రింద
పడుకున్నాడు.
ఎవరు
అతనిని
మాట్లాడించ
లేదు.
ఆనాడు
ఈ
వాడియా
టాంగాలో
పోతూ
చూచాడు.
అతను
చాలా
బలహీనంగా
ఉంటున్నాడు.
బిడ్డలు
లేరు
కనుక
వాడియాకు
దయాదాక్షిణ్యములున్నాయి.
ఒక
హోటలు
వానికి
చెప్పాడు.
ఇతనికి
ఏమి
కావాలో
పెట్టమన్నాడు
తిండి.
పెట్టారు.
తిని
అతను
భగవంతునికి
thanks
చెప్పాడు.
దిక్కులేని
వానికి
దేవుడే
దిక్కు.
అడవులయందున్న
ఆకసమున
నున్న
గుట్టమీద
నున్న
నట్టేట
బడియున్న
పట్టణమున
నున్న
పల్లెనున్న
ఎక్కడున్న
దిక్కులేని
వానికి
దేవుడే
దిక్కు
అనుకున్నాడు
తనలో
పాపం.
పెట్టిన
వానికి
కూడా
thanks
చెప్పాడు.
దాసగను
చెప్పిన
తరువాత
వాడియా
షిరిడి
బయలుదేరాడు.
భార్యను
తీసుకువెళ్లాడు.
బాబా
దర్శనము
చేసుకున్నాడు.
‘ఏయ్
ఐదురూపాయలు
దక్షిణ
యిమ్మన్నాడు.
ఇతను
శ్రీమంతుడే
వెనుకంజ
వేయలేదు.
జేబులోంచి
కాసులు
తీసాడు.
‘వాడియా!
ఈ
ఐదు
కాసులు
అక్కరలేదు.
ఒక
రూపాయి
రెండణాలు
యియ్యమని
అడిగాడు.
మూడు
రూపాయలు
పదునాలుగణాలు
ముందే
ఇచ్చావు
నాకు’
అన్నాడు.
ఇతనికి
ఏమి
అర్థము
కాలేదు.
బాబా
ఇలా
చెబుతున్నాడు
పిచ్చివాడా!
ఇదే
నేను
ప్రథమముగా
షిర్డీ
రావటం.
నేను
చూడటమే
మొట్టమొదట
అలాంటి
సమయములో
మూడు
రూపాయల
పదునాలుగణాలు
ముందుగానే
యిచ్చాను
అంటున్నాడే.
6
▾
Meaning
Keep
His poems 363
ఇది
ఏలా
సాధ్యము.
పిచ్చిగా
ఉందనుకున్నాడు.
పాపం.
సరే
పోనీలే
దక్కించుకున్నాను
అని
ఒక
రూపాయి
రెండణాలు
ఇచ్చాడు.
తిరిగి
నాందేడ్
వెళ్లాడు.
రెండవ
దినము
దాసగను
వచ్చాడు.
షిరిడీ
పోయినప్పుడు
ఏమి
జరిగింది
అడిగాడు.
వాడియా
అంత
తృప్తిగా
లేడు.
‘దాసగను
నాకు
అతను
మహానీయుని
వలె
కనిపించటం
లేదు.
ఏదో
పిచ్చివాని
వలె
ఉన్నాడు.
ఆ
పిచ్చి
మనిషిలో
కూడా
ఒక
విధమైన
భగవత్
శక్తి
ఉండవచ్చు.
కానీ
నేను
అతనిని
ఎక్కువగా
గౌరవించలేదు’
అన్నాడు.
ఏమి
జరిగిందో
చెప్పమన్నాడు.
‘నేను
వెళ్లిన
తక్షణమే
ఐదు
రూపాయలు
దక్షిణ
ఇమ్మన్నాడు.
ఇస్తుండగనే
మూడు
రూపాయలు
పదునాలుగణాలు
ముందుగనే
ఇచ్చావు
ఇప్పుడు
ఒక
రూపాయి
రెండణాలు
ఇమ్మన్నాడు
ఎప్పుడు
నేను
బాబాను
చూడలేదు.
ఎందుకీవిధంగా
అన్నాడు’.
దాసుగను
మహాభక్తుడు.
బాబా
ఎప్పుడు
లేనివి
పలుకడు.
సర్వత్రా
ఉండేవాడు
బాబా.
సర్వులయందు
ఉండేవాడు
బాబా.
నీవు
పొరపడుతున్నావు.
నీదే
దోషముగానీ
బాబాలో
ఏదోషము
లేదు.
అని
ఈమధ్య
నీవు
ఎవరికైనా
దానధర్మము
చేశావా
అని
అడిగాడు
దాసుగను.
షిరిడికి
పోయే
మూడు
దినములకు
ముందుగా
నేను
టాంగాలో
వస్తుంటే
కూలిస్వామికి
అన్నం
పెట్టించాను.
అంత
తప్ప
నేను
ఎవరికి
దానధర్మము
చేయలేదు.’
‘అయితే
దానికి
ఎంతైంది’
అడిగాడు.
వెంటనే
జవానుని
పిలిపించి
అడిగాడు.
మూడు
రూపాయల
పదునాలుగు
అణాలయింది
అన్నాడు.
‘చూశావా!
ఆ
మూడు
రూపాయల
పదునాలుగణాలు
నీవు
బాబాకు
ఇచ్చినట్లు.
బాబా
సంకల్పము
లేక
ఏమి
జరగదు.
కదలదు
నీదు
సంకల్పము
లేక
గడ్డిపోచయును
అదినిదియు
అనగనేల
పిపీలకాది
బ్రహ్మపర్యంతము
నీవే
అది
ఎరుంగరు
మది
గలంగరు
ముదము
చెందరు
భువినికొందరు
వివేకమున
వర్తింతుమని
విఱ్ఱవీగుదురుగానీ
చివరికేవేళ
ఏది
సంభవించునో
తెలియజాలరెంతవారైన
॥
అది
ఇది
అని
ఎట్లా
చెప్పటానికవుతుంది.
అందరియందు
భగవంతుడున్నాడు.
నీవు
ఏది
చేసినా
భగవంతునికి
చేసినట్లే.
ఇదే
భారతీయ
సంస్కృతి
యొక్క
ప్రధాన
సూత్రము.
అన్ని
మతములు
దీనిని
అంగీకరిస్తూ
వచ్చాయి.
అతనికి
మూడు
రూపాయల
పదునాలుగణాలు
ఇచ్చావు.
అవి
బాబాకు
చేరినాయి.
అతను
అడిగిన
ఐదు
రూపాయలలో
మిగిలిన
రూపాయి
రెండణాలు
తీసుకున్నాడు.
7
▾
Meaning
Keep
భగవంతుని
చరిత్రలు
ఈవిధంగా
ఉంటాయి.
నీవు
బాబాను
యింకొక
రీతిగా
భావించవద్దు.’
అన్నాడు.
వాడియాకు
గొప్ప
ఆశ్చర్యము
వేసింది.
నా
బుద్ధి
లేకుండ
ఈవిధంగా
అయిపోయింది.
రెండవ
దినము
తిరిగి
భార్యతో
వెళ్లాడు.
దాసుగను
ముందర
వెళ్లాడు.
భార్యతో
పోవటం
కదా
వాడియాకు
ఆలస్యమైంది.
ఒంటరిగా
ఉంటే
సరాసరి
పోవచ్చు.
ఆడవారున్నప్పుడు
బంధనే.
నిదానముగా
ఉండి
ప్రయాణము.
‘ఏయ్
దాసుగను!
ఏమి
చెప్పాడు
వాడియా!
కూలిస్వామికి
ఎంత
ఇచ్చాడని
ఇవన్నీ
అడిగాడు.
వాడియా
విన్నాడు.
దాసుగను
తన
వెంటనే
వచ్చాడు.
ముందు
పోయి
ఏమి
చెప్పలేదు.
బాబా
నన్ను
క్షమించు
అని
పాదములపై
పడ్డాడు.
వాడియా
పెద్ద
బుట్టెడు
పండ్లు
పట్టుకు
వెళ్లాడు.
అందులో
నాలుగు
పండ్లు
తీసి
వాడియా
భార్యను
పిలిచి
ఆమెకు
ఇచ్చాడు.
ఆనాడు
స్త్రీలు
చేతులతో
తీసుకునే
వారు
కాదు.
ఒడిని
పట్టేవారు.
చెరకొంగులో
నాలుగు
పండ్లు
వేశాడు.
ఈ
నాలుగు
నీవే
తినాలి.
ఇంకెవ్వరికి
ఇవ్వకూడదు.
నీకు
నలుగురు
పుత్రులు
పుడతారు’
అన్నాడు.
అంతకు
పూర్వం
వాడియా
జ్యోతిష్కుల
దగ్గరకు
పోయి
డబ్బులు
ఖర్చు
చేశాడు.
ఎవరి
మాటలు
అవలేదు.
బాబా
చెప్పిన
రెండవ
సంవత్సరమే
అతనికి
పండువంటి
కుమారుడు
పుట్టాడు.
ఆ
కుమారుని
తీసుకు
వెళ్లి
బాబా
పాదములపై
పెట్టి
ఆనాడు
వచ్చే
భక్తులకు
ఏమి
వసతులు
లేవు.
అందువల్ల
వాడియా
ఇల్లు
కట్టాడు.
ఇప్పుడు
కూడా
ఉంటున్నాది.
చాలా
పాతబడి
పోయింది.
ఆవిధంగా
భగవంతుని
విషయములు
ఎలాంటివి
ఎప్పుడు
ఎక్కడ
ఏవిధంగా
జరుగుతాయి
తెలుసుకోటానికే
సాధ్యము
కాదు.
మానవుడనుకొన్నందుకు
మానవుడుగా
జీవిస్తే
మనలను
భగవంతుడు
కనిపెడతాడు.
నీ
మనస్సు
మంచి
పరిశుద్ధమైన
అద్దము
వలె
ఉంటుండాలి.
కంచు
మ్రోగునట్లు
కనకము
మ్రోగదు.
నీవు
కేవలము
ఆడంబరములకు
పోవద్దు.
నిజమైన
ఆనందము
నాశించు.
నీవు
కేవలం
artificial
మనిషిగా
ఉండవద్దు.
heartful
మనిషిగా
ఉండు.
అప్పుడే
నీకు
సమస్తము
సమకూడుతాయి.
విద్యార్థులారా!
ఈ
వయస్సు
అలాంటిది.
కొన్ని
విధములైన
పొరపాట్లు
అప్పుడప్పుడు
జరుగుతుంటాయి.
ఆ
పొరపాట్లు
తాము
సరిదిద్దుకొని
తిరిగి
తాము
మరొక
పర్యాయము
రాకుండా
చూచుకోవాలి.
చేసిన
పొరపాట్లే
జీవితమంతా
చేస్తూ
పోకూడదు.
తెలియక
పొరపాట్లు
చేయవచ్చు.
తిరిగి
తెలుసుకున్న
తరువాత
పొరపాటు
చేయకూడదు.
తెలిసి
మెలగాలి.
చూచి
తొక్కు.
తెలిసి
మొక్కు.
తెలిసి
తొక్కు.
ఇది
రాయా,
ముల్లా,
పేడా.
తెలిసికోకుండా
పొరపాటున
ప్రవేశించవద్దు.
8
▾
Meaning
Keep
త్యాగరాజు
భగవంతుని
నామాన్ని
తెలిసి
పలకమన్నాడు.
నీవు
అర్థము
చేసుకొని
భగవన్నామాన్ని
స్మరించమని
చెప్పాడు.
కేవలం
టేపురికార్డు
మాదిరి
పాడ
వద్దు.
గ్రామఫోను
ప్లేటు
వలె
పాడ
వద్దు.
తెలిసి
స్మరించు.
హృదయ
పూర్వకముగా
స్మరించు.
హృదయముతో
ఉండాలి.
ఇదే
పరిశుద్ధమైన
గోల్డు
వంటిది.
పలికినట్లుగా
నడుచుకో.
తలచినట్లుగా
పలుకు.
ఇదే
పరిశుద్ధతకు
మూల
సూత్రము.
ఈ
వయస్సులో
అభివృద్ధి
పరచుకుంటే
భవిష్యత్తులో
మంచి
రాజబాటగా
పూలబాటగా
రూపొందుతుంది.
విద్యార్థులారా!
కుల
మత
భేదములకు
అవకాశము
ఇవ్వకండి.
అందరు
నావారే
నా
బ్రదర్సు.
brotherhood
of
man
fatherhood
of
god.
ఈ
రెండింటిని
తీసుకొని
help
ever
hurt
never.
ఇదే
భారతీయ
సంస్కృతి
యొక్క
ప్రమాణము.
ఈవిధంగా
జీవిస్తే
భారతదేశమునకే
కాదు
ఇతర
దేశములకు
కూడా
మంచి
ఆదర్శ
విద్యార్థులుగా
రూపొందుతారు.
ఆవిధంగా
బ్రతకాలని
కంచువలె
కాక
కనకము
వలె
తయారు
కావాలని
నేను
ఆశిస్తున్నాను.
Previous
←
Equal-Mindedness is the Hallmark of a Human Being
Next
Lack of Values is the Cause of Violence in the World
→