Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2002 · He Who Makes His Parents Happy Is the True Son
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
He Who Makes His Parents Happy Is the True Son
6 May 2002, Easwaramma Day, Brindavan
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
“యద్దృశ్యం
తన్నశ్యం.”
చర్మచక్షువులకు
గోచరించే
సమస్త
పదార్థములూ,
సమస్త
రూపములూ
ఏదో
ఒక
నాటికి
అంతర్థానమైపోతాయి.
కేవలం
మానవులకే
కాదు,
పశుపక్షి
మృగాదులకు,
క్రిమికీటకాదులకుకూడా
చర్మచక్షువులున్నాయి.
ఇవి
కేవలం
అనిత్యమైన,
బాహ్యమైన
దృశ్యములనే
చూస్తున్నాయికాని,
నిత్య
సత్యమైన
దివ్యత్వమును
దర్శించడం
లేదు.
అనిత్యమైన,
అసత్యమైన
చర్యలతోనే
మానవుడు
తన
జీవితాన్ని
ముగిస్తున్నాడు.
జ్ఞానమొక్కటే
నిత్య
సత్యమైనది.
అట్టి
జ్ఞానచక్షువును
కల్గినటువంటివాడే
నిజమైన
మానవుడు.
తన
దృష్టి
బహిర్ముఖంగా
ఉన్నంతవరకు
మానవునికి
ఈ
బాహ్యప్రపంచం
తప్ప
ఆత్మతత్త్వం
గోచరించదు.
ఏనాటికైనా
మానవుడు
తన
దృష్టిని
అంతర్ముఖం
గావించుకొని
ఆత్మతత్త్వాన్ని
అర్థం
చేసుకోవడం
అత్యవసరం.
అంతర్దృష్టి
గలవానికే
ఆత్మతత్త్వం
గోచరమౌతుంది.
మాతృమూర్తియే
ప్రథమ
దైవం
ప్రతి
మానవునికి
ఒక
మాతృమూర్తి
ఉన్నది.
ప్రాచీనకాలంలో
భారతీయులు
మాతృమూర్తికి
ఎంతో
గౌరవమునందిస్తూవచ్చారు.
మాతృప్రేమను
మించిన
ప్రేమ
ఈ
జగత్తులో
ఎక్కడా
కానరాదు.
తల్లియొక్క
ప్రేమచేత,
తల్లియొక్క
నడవడికచేత
జగద్వ్యాప్తమైన
కీర్తిని
సాధించిన
తనయులెందరో
ఉన్నారు.
పిల్లలయొక్క
భవిష్యత్తు,
వారి
శక్తిసామర్థ్యములు
తల్లియొక్క
నడతపైననే
ఆధారపడి
యున్నవి.
2
▾
Meaning
Keep
Also in his talks
(2)
23 November 1992
Service of the village becomes service of Rāma!
6 May 2001
The sweetness of a mother's Prema is beyond words
కౌసల్యసతి
శుక్తి
గర్భమౌటను
గదా
రాముడు
దేవుడై
రమణగాంచె
సీతామహాసాధ్వి
చెలగి
పెంచుట
గదా
కవలు
కుశలవులు
ఘనులు
అగుట
జిజియాలలామ
చెలగి
పెంచుట
గదా
వీర
శివాజియు
పేరుగాంచె...
కనుక,
ప్రతి
వ్యక్తి
మాతృమూర్తిని
గౌరవించాలి,
ప్రేమించాలి.
కాని,
ఈనాడు
మాతృమూర్తిని
గౌరవంగా,
ప్రేమగా,
ఆదరంగా,
ఆప్యాయంగా
చూసేవారు
చాలా
అరుదుగా
ఉన్నారు.
ఏ
దేశమునందైనా,
ఏ
కాలమునందైనా
మాతృమూర్తి
పవిత్రత
సాటిలేనిది.
తల్లి
నిరంతరం
తన
పిల్లల
యోగక్షేమాలనుగురించే
ఆలోచిస్తుంటుంది.
ఈ
జగత్తులో
దుర్మార్గులైన
కుమారులున్నారుగాని,
దుర్మార్గురాలైన
తల్లి
కానరాదు.
భారతీయ
సంస్కృతి
“మాతృదేవో
భవ,
పితృదేవో
భవ,
ఆచార్యదేవో
భవ,
అతిథిదేవో
భవ...”
అని
బోధిస్తున్నది;
తల్లికే
ప్రథమస్థానము
నందిస్తున్నది.
మాతృమూర్తియే
ప్రథమ
దైవము.
కాని,
ఈనాడు
ఎంతమంది
తమ
మాతృమూర్తిని
గౌరవిస్తున్నారు?
ఎంతమంది
తల్లిప్రేమకు
పాత్రు
లౌతున్నారు?
తల్లిప్రేమకు
పాత్రుడైన
బిడ్డయే
నిజమైన
బిడ్డ.
తల్లిని
బాధపెట్టి,
తల్లికి
కన్నీరు
తెప్పించే
తనయునికి
జీవితంలో
శాంతి
సంతోషములేమాత్రం
లభించవు.
ఎట్టి
పరిస్థితిలోనూ
తల్లికి
బాధ
కల్గించకూడదు.
ఎంతటి
గొప్ప
విద్యావంతుడైనా,
అధికారియైనా
తల్లికి
కుమారుడే
కదా!
కనుక,
మొట్టమొదట
తల్లిని
గౌరవించాలి,
సంతోష
పెట్టాలి.
ఆమె
ఆజ్ఞను
శిరసావహించాలి;
నిత్యజీవితంలో
సమాజానికి
ఆదర్శంగా
నిలవాలి.
ఆదర్శమాత
ఈశ్వరమ్మ
నేను
పేరుప్రతిష్ఠలకోసం
చెప్పుకోవడం
లేదు.
ఈ
శరీరమునకు
తల్లియైన
ఈశ్వరమ్మ
ఎంతో
వినయంతో,
ధర్మగుణంతో,
విశాలమైన
భావంతో
అందరినీ
ఆదరించేది.
చిన్నవయస్సులో
భర్తను
కోల్పోయిన
వారిని
చేరదీసి,
వారికి
ధైర్యం
చెప్పేది;
వారు
తమ
కష్టాలను
మరచిపోయేటట్లు
చేసేది.
ఎవరైనా
చిన్నపిల్లలు
కనిపిస్తే
ఎవరు
వీళ్ళు?
ఏ
తల్లి
బిడ్డలు?
3
▾
Meaning
Keep
అనేది
యోచించకుండా
ఎంతో
ఆప్యాయంగా
వారిని
ఎత్తుకొని
లాలించేది.
కరణం
సుబ్బమ్మకు
సంతానం
లేకపోవడంచేత
ఆమె
“ఈశ్వరమ్మా!
నీ
పిల్లలను
అప్పుడప్పుడు
నా
ఇంటికి
పంపుతూ
ఉండు,”
అని
కోరేది.
స్వామిని
ఆమె
ఎంతో
ప్రేమతో
చూసుకునేది.
ఒకనాడు
నేను
కరణం
సుబ్బమ్మ
ఇంట్లో
ఉండగా
ఈశ్వరమ్మ
అక్కడికి
చాలా
కంగారుపడుతూ
వచ్చింది.
“ఎందుకింత
కంగారుపడుతున్నావు?
ఏమి
జరిగింది?”
అని
అడిగాను.
“స్వామీ!
మన
ప్రక్కింటివారి
బిడ్డకు
చాలా
జబ్బు
చేసింది.
ఆ
చిన్నబిడ్డను
తొడపై
పడుకోబెట్టుకొని
తల్లి
చాలా
బాధపడుతోంది.
ఆమె
బాధను
నేను
చూడలేకపోతున్నాను.
మన
కుగ్రామంలో
ఒక
చిన్న
ఆసుపత్రియైనా
లేదు.
మీవద్దకు
ఎంతోమంది
వస్తున్నారు.
కాని,
వచ్చేవారందరూ
భక్తులని
నమ్మవద్దు.
ఇతరుల
బాధలను
తమ
బాధలుగా
భావించి,
ఆ
బాధలను
నివారణ
గావించడానికి
ప్రయత్నించేవారే
నిజమైన
భక్తులు.
గొప్ప
విద్యలు
నేర్వవచ్చు,
ధనమును
సంపాదించవచ్చు,
పేరుప్రతిష్ఠలను
పొంద
వచ్చు.
కాని,
అవి
కాదు
మనిషికి
కావలసినవి.
బాధలలో
ఉన్నవారిని
చూసి
జాలిపడాలి;
కష్టాలలో
ఉన్నవారిని
చూసి
కన్నీరు
కార్చాలి.
అలాంటి
దయార్ద్రహృదయులు
ఈ
కలికాలంలో
చాలా
అరుదుగా
ఉన్నారు.
అందరూ
వారివారి
పిల్లలగురించే
ఆలోచిస్తున్నారుగాని,
పరాయి
పిల్లలు
పడుతున్న
బాధలనుగురించి
ఎవ్వరూ
పట్టించుకోవడం
లేదు.
స్వామీ!
మీ
దగ్గరికి
ఇన్ని
వేలమంది
వస్తున్నారు.
కాని,
ఎవ్వరూ
ఈ
పని
చేయడం
లేదు.
మీరు
మాత్రమే
దీనిని
చేయగలరు.
ఈ
కుగ్రామంలో
బీదప్రజల
కోసం
ఒక
చిన్న
ఆసుపత్రిని
కట్టించండి”,
అని
కోరింది.
అప్పుడు
నేను
“ఈ
చిన్న
విషయానికి
ఎందుకింత
బాధపడుతున్నావు?
బిడ్డ
పుట్టిన
తక్షణమే
పెరుగుతుందా?
దేనికైనా
కాలం
కలిసిరావాలి.
కనుక,
నీవు
తొందరపడకు.
ఈ
పవిత్ర
భావమును
నీ
హృదయంలో
పెట్టుకో.
కష్టాలలో
ఉన్నవారిని
చూసి
జాలిపడు.
వారి
కష్టాలను
నివారించే
ఉపాయంకొరకు
దైవాన్ని
ప్రార్థించు”,
అని
చెప్పి
అక్కడి
నుండి
వెళ్ళిపోయాను.
ఈశ్వరమ్మ
“అయ్యో,
స్వామి
నా
మాట
వినిపించుకోవడం
లేదే!”
అనుకుంది.
కాని,
ఆమె
మాటలు
నా
మనస్సులో
మెదలుతూనే
ఉన్నాయి.
“ఆమె
కోరిన
ఈ
చిన్నకోరికను
నెరవేర్చాలి.
చిన్నదిగాని,
పెద్దదిగాని,
ఇది
పరోపకార
సంబంధమైన
కార్యం
కనుక,
నేను
దీనిని
తప్పక
చేపట్టాలి,”
అని
నిర్ణయించు
కున్నాను.
రెండవదినమే
పనివారిని
పిలిపించి,
పునాదులు
త్రవ్వించాను.
4
▾
Meaning
Keep
ఒక
నెలలోనే
ఒక
చిన్న
ఆసుపత్రి
సిద్ధమైంది.
డాక్టర్లు
త్యాగమూర్తులు
కావాలి
అక్కడ
మొట్టమొదట
డాక్టర్
బ్రహ్మం
పని
చేశాడు.
అతను
చాలా
గొప్ప
భక్తుడు.
పేరుకు
తగినట్లుగా
అతను
బ్రహ్మమే!
అతని
తరువాత
బిక్కిని
సీతారామయ్య
అనే
డాక్టరు
వచ్చాడు.
అతను
కూడా
గొప్ప
భక్తుడు.
అతని
ముగ్గురన్నదమ్ములూ
మినిష్టర్లే.
“స్వామీ!
ఈ
ఆసుపత్రిని
నడిపే
బాధ్యతను
నాకు
అప్పజెప్పండి.
నేను
చూసుకుంటాను”,
అన్నాడు.
ఆనాటి
మొదలు
తన
తుదిశ్వాస
విడిచేంతవరకు
ఆ
ఆసుపత్రిలోనే
ఉండి
సేవ
చేశాడు.
అలాంటి
అంకితభావం
కల్గిన
డాక్టర్లు
ఈనాడు
చాలా
అరుదుగా
ఉన్నారు.
ఈనాటి
డాక్టర్లు
అనేకమంది
కేవలం
ధనసంపాదనే
ధ్యేయంగా
పెట్టుకొని
పనిచేస్తున్నారు;
డబ్బుకోసం
ప్రాణాలనైనా
విడవడానికి
సిద్ధంగా
ఉన్నారు.
పరుల
బాధలను
తీర్చాలనే
ఉత్తమభావం
వారికి
కల్గడం
లేదు.
పల్లెలకు
పోయి
సేవ
చేయడానికి
వారు
ముందుకు
రావడం
లేదు.
పట్టణంలో
ఉంటే
బాగా
డబ్బు
సంపాదించవచ్చునని,
అనేక
సౌకర్యాలను
అనుభవించ
వచ్చునని
ఆశిస్తున్నారు.
“రూపాయికోసమై
లోపాయకారిగా
అడ్డమైన
గడ్డి
తింటారయా!”
డబ్బుకోసం
Grass
(గడ్డి)
తినడానికికూడా
సిద్ధపడుతున్నారు.
అలాంటివారికి
Grace
(అనుగ్రహం)
ఏరీతిగా
లభిస్తుంది?
డాక్టర్లు
త్యాగమూర్తులు
కావాలి.
నాకు
కావలసింది
మీ
భక్తి
కాదు.
మీరు
ప్రజలయొక్క
బాధలను
గుర్తించి,
వాటిని
నివారించే
మార్గాన్ని
వెతకాలి;
సమాజసంక్షేమానికై
పాటుపడాలి.
డాక్టర్లు
కావలసినంత
డబ్బు
సంపాదిస్తున్నారు.
కాని,
సంపాదనకు
తగినంత
పని
చేస్తున్నారా?
డబ్బు
మాత్రం
కావాలిగాని,
పనిచేయడానికి
సిద్ధంగా
లేరు.
సేవాభావం
కల్గిన
డాక్టర్లు
ఈనాడు
అత్యవసరం.
సేవకులు
కానివారు
నాయకులైతే
ప్రయోజనం
లేదు.
సేవకుడే
నాయకుడుగా
ఉన్నప్పుడు
సమాజానికి
ఎంతైనా
ఉపకారం
చేయగలడు.
తల్లిదండ్రులను
సంతోషపెట్టండి
విద్యార్థులారా!
మీ
తల్లిదండ్రులు
ఎంతో
కష్టపడి
సంపాదించిన
డబ్బుతో
మీకు
బట్టలు
కుట్టిస్తున్నారు,
మిమ్మల్ని
పోషిస్తున్నారు,
మీరు
సమాజంలో
గౌరవంగా
బ్రతకాలని
ఆశిస్తున్నారు.
5
▾
Meaning
Keep
మీరు
మీ
తల్లిదండ్రుల
ఆశయాలకు
తగినట్లు
నడుచుకుంటున్నారా?
తల్లిదండ్రులు
కుట్టించే
దుస్తులను
ధరిస్తున్నారుగాని,
వారెంత
కష్టపడితే
మీకీ
దుస్తులు
లభించాయనేది
మీరు
విచారణ
చేయడం
లేదు.
రేపు
మీరుకూడా
పెద్దవారౌతారు.
అప్పుడు
మీ
పిల్లలే
మీకు
బాధ
కల్గిస్తే
మీరు
సహించుకోగలరా?
మీరీనాడు
ఏది
చేస్తారో
భవిష్యత్తులో
దాని
ఫలితాన్ని
అనుభవిస్తారు.
ఈనాడు
మీరు
చేసిన
మంచిపనియే
భవిష్యత్తులో
మీకు
మంచిఫలితాన్నిస్తుంది.
చెడ్డపని
చేసి
మంచి
ఫలితాన్ని
ఆశిస్తే,
ఎలా
లభిస్తుంది?
కనుక,
మీ
తల్లిదండ్రులకు
ఏమాత్రం
బాధ
కల్గించకండి.
సాధ్యమైనంతవరకు
వారిని
సంతోష
పెట్టడానికి
కృషి
చేయండి.
అప్పుడే
మీ
జన్మ
సార్థకమౌతుంది.
మీరీ
జగత్తులో
పుట్టింది
దేనికోసం?
తిని
తిరగడానికా?
లౌకిక
సుఖాలను
అనుభవించడానికా?
మీరనుభవించినా,
అనుభవించకపోయినా
ఇవి
శాశ్వతం
కావు.
ముఖ్యంగా
మీ
తల్లిదండ్రులను
సంతోషపెట్టండి.
అప్పుడే
మీరు
నిజమైన
పుత్రులనిపించుకుంటారు.
పిల్లలను
గుణవంతులుగా
తీర్చిదిద్దడానికి
కృషి
చేసేవారే
నిజమైన
తల్లిదండ్రులు.
అలాంటి
తల్లిదండ్రులవల్లనే
పిల్లలు
ఉత్తమ
పౌరులుగా
రూపొందుతారు,
ఎంతైనా
అభివృద్ధికి
వస్తారు.
ఈనాటి
తల్లిదండ్రులు
తమకు
కుమారుడు
పుట్టిన
తక్షణమే
బంధుమిత్రులకు
మిఠాయిలు
పంచి
పండుగ
జరుపుకుంటారు.
ఇది
చాలా
పొరపాటు.
తమ
కుమారుడు
సమాజంలో
ఏనాడు
మంచిపేరు
సంపాదిస్తాడో
ఆనాడే
పండుగ
చేసు
కోవాలి.
తమ
కుమారుడు
సన్మార్గంలో
నడుచు
కుంటున్నాడా,
సమాజాన్ని
గౌరవిస్తున్నాడా,
సమాజంనుండి
గౌరవాన్ని
అందుకుంటున్నాడా...
అనే
విషయాలను
తల్లిదండ్రులు
చక్కగా
గమనిస్తూ
ఉండాలి.
ఈవిషయంలో
ఈశ్వరమ్మ
గొప్ప
ఆదర్శాన్ని
అందించింది.
ఇంటికి
ఎవరైనా
వస్తే
“నమస్కారమండీ.
రండి,
దయచేసి
కూర్చోండి”,
అని
వారిని
ప్రేమతో
ఆహ్వానించాలని
పిల్లలకు
బోధించేది.
కాని,
అలాంటి
గౌరవమర్యాదలు
విద్యార్థుల్లో
కనిపించడంలేదు;
గొప్ప
చదువులు
చదువుతున్నారు,
బాగా
డబ్బు
సంపాదిస్తున్నారు.
కాని,
ఏమి
ప్రయోజనం?
డబ్బు
సంపాదించడం
గొప్పతనం
కాదు,
భిక్షగాడుకూడా
సంపాదిస్తున్నాడు.
ఇంటికి
వచ్చిన
అతిథులను
గౌరవించాలి,
ప్రేమతో
పలుకరించాలి.
You
cannot
always
oblige,
but
you
can
speak
always
obligingly.
6
▾
Meaning
Keep
Also in his talks
(18)
10 July 1988
To be happy here, hematāraka vidyā; to be happy hereafter, Brahma vidyā
24 June 1989
Foster Prema and Share It
3 October 1989
Honour the Vedas
20 February 1992
Man, thinking he is the body, is drifting away from Ānanda
12 July 1996
Namasmarana is the Greatest Sadhana in the Kali Yuga
19 October 1996
When the Home Is Set Right, the World Is Set Right
21 October 1996
In God's Creation Everything Is Pure!
14 January 2000
Give up attachment to the body and serve the country!
4 March 2000
The Ātma: The Five Kośas
10 September 2000
God is within you
4 July 2001
Study the learning that knows no death
9 October 2001
God in human form
22 November 2001
True education brings the wealth of character
12 March 2002
The worship of God protects the nation
1 January 2003
Only service done with the feeling of the one Ātma is true service
12 November 2003
Grow Prema for God and pity for the helpless
30 March 2004
If you remember the name of Rāma, neither attachment nor disease will cling to you
13 August 2006
For the young, mastery of the senses comes first
కాని,
ఈనాటి
చదువు
పిల్లలను
రాక్షసులుగా
తయారు
చేస్తున్నది.
వారిలో
వినయ
విధేయతలే
లేవు.
పుస్తకంలో
ఉన్నదాన్ని
మస్తకంలో
నింపుకొని,
ఎగ్జామినేషన్
పేపర్‌మీద
క్రుమ్మరించి
ఖాళీ
తలతో
ఇంటికి
వస్తారు.
ఇదా
చదువంటే?
కాదు,
కాదు.
“చదువులన్నియు
చదివి
చావంగనేటికి?
చావులేని
చదువు
చదువవలయు”
“చదువులన్ని
చదివి
చాల
వివేకియై
మదిని
తన్నెఱుగడు
మందమతుడు
ఎంత
చదువు
చదివి
ఏరీతి
నున్నను
హీను
డవగుణంబు
మానలేడు
తరచి
చదువు
చదువ
తర్కవాదమెకాని
పూర్ణజ్ఞానమెపుడు
పొందలేడు”
ఇట్టి
చదువువలన
కలిగే
ప్రయోజనమేమిటి?
తర్కవాదమువలన
వచ్చే
ఫలితమేమిటి?
నేనొక
గొప్ప
విద్యావంతుడననే
అహంకారం
ప్రారంభ
మౌతుంది.
ఈ
అహంకారమే
అధః
పతనానికి
దారితీస్తుంది.
నా
జీవితమే
నా
సందేశం
మనకు
ఇతరులు
చేసిన
ఉపకారాన్ని
మరచిపోకుండా
వారికి
తగిన
కృతజ్ఞత
చూపాలి.
కాని,
మానవుడు
తనకు
ఉపకారం
చేసినవారికికూడా
అపకారం
చేయడానికి
పూనుకుంటున్నాడు.
ఉపకారికి
ఉపకారము
విపరీతము
కాదు
సేయ
వివరింపంగన్
అపకారికి
ఉపకారము
నెపమెన్నక
సేయువాడె
నేర్పరి
సుమతీ!
నాకు
అపకారం
చేసినవారికికూడా
నేను
ఉపకారమే
చేస్తాను.
నన్ను
దూషించినవారిని,
హేళన
చేసినవారిని,
నాకు
కృతజ్ఞత
చూపించని
వారినికూడా
నేను
ప్రేమిస్తాను.
కనుకనే,
“నా
జీవితమే
నా
సందేశం”
అన్నాను.
7
▾
Meaning
Keep
నేను
చెప్పినట్లు
మీరు
నడుచుకుంటున్నారా?
నడుచుకున్నవాడు
బాగుపడతాడు,
నడుచుకోనివాడు
బాధలకు
గురి
అవుతాడు.
నా
అడుగుజాడలలో
నడవండి.
మీకు
ఎట్టి
అపకారమూ
జరగదు.
ఈనాడొక
ప్రైమరీ
స్కూల్లో
సీటు
కావాలంటే
ఇరవైవేలు,
ముప్పైవేలు
డొనేషన్
కట్టవలసివస్తోంది.
ఇలాంటి
పరిస్థితుల్లో
ఫస్టు
క్లాసు
మొదలు
పిహెచ్.డి.
వరకు
ఉచిత
విద్య
నందిస్తున్నాను.
ఈశ్వరమ్మ
తనవద్దకు
వచ్చేవారితో,
“చూడండి,
మా
స్వామి
ఎంత
పని
చేస్తున్నాడు!
బీదలకెంత
సహాయం
చేస్తున్నాడు!
కాని,
కొందరు
తాము
పొందిన
ఉపకారాన్ని
మరచిపోయి
అపకారం
చేయడానికి
ప్రయత్నిస్తున్నారు.
అది
వారికి
మంచిది
కాదు”,
అని
ఎంతో
మృదువుగా
చెప్పేది.
ముఖ్యంగా
మానవునికి
ఉండవలసింది
కృతజ్ఞత.
కృతఘ్నుడు
క్రూరమృగంతో
సమానం.
మనకు
ఉపకారం
చేసినవారికి
మన
చేతనైనంతవరకు
ప్రత్యుపకారం
చేయాలి.
అట్లుగాకుండా,
ఉపకారికే
అపకారం
చేస్తే
కళ్ళు
పోతాయి.
యథార్థం
చెబుతున్నాను.
ఈనాడు
కాకపోయినా
ఏనాటికైనా
ఇది
తప్పదు.
దీనిని
పురస్కరించుకొనియే
మనం
సూర్యనమస్కారాలను
ఆచరించేటప్పుడు
“కృతఘ్నఘ్నాయ
నమః”
అంటాము.
దీని
అర్థమేమిటి?
మన
కన్నుల్లో
ఉన్న
సూర్య
తేజస్సువల్లనే
మనం
చూడగల్గుతున్నాము.
కాని,
మనం
ఉపకారం
చేసినవారిపట్ల
కృతజ్ఞత
లేకుండా
ప్రవర్తిస్తే
ఆ
తేజస్సు
మన
కన్నులను
వదలిపోతుంది.
“ఆ...
ఇవన్నీ
కట్టుకథలు”
అంటారు
కొందరు.
ఇది
కథ
కాదు,
కృతజ్ఞత
లేనివారు
అనుభవించే
వ్యథ.
ఈరోజు
కాకపోయినా
రేపైనా
ఇది
జరిగి
తీరుతుంది.
కనుక,
మనం
కృతజ్ఞతను
కల్గియుండాలి.
చేతనైనంతవరకు
అందరికీ
ఉపకారం
చేయాలి.
పెద్దలకు,
వృద్ధులకు
తోడ్పాటు
నందించాలి.
సుమారు
ఇరవై
సంవత్సరాలకు
పూర్వం
ఇక్కడ
క్రొత్త
మందిరాన్ని
కడుతున్నప్పుడు
జామ్‌నగర్
రాజమాత
“స్వామీ!
ఈ
మందిర
నిర్మాణం
పూర్తయ్యేంతవరకు
మీరు
మా
ఇంట్లో
ఉండండి”
అని
కోరింది.
ఆమె
ప్రార్థనను
మన్నించి
నేను
ఆమె
ఇంట్లో
ఉన్నాను.
రాజమాతవద్ద
ఒక
డ్రైవరుండేవాడు.
ఆమె
లేనప్పుడు
నేనే
అతనిని
పోషిస్తూవచ్చాను.
8
▾
Meaning
Keep
ఒకనాటి
రాత్రి
చలి
విపరీతంగా
ఉండడం
చేత
అతను
చాలా
బాధపడుతున్నాడు.
అతనివద్ద
ఒక
కోటు
లేదు,
కనీసం
రగ్గుకూడా
లేదు.
మా
డ్రైవరు
వచ్చి
ఈవిషయాన్ని
నాకు
చెప్పాడు.
నేను
వెంటనే
ఒక
రగ్గు
ఇచ్చి
“దీనిని
తీసుకువెళ్ళి
అతనికివ్వు”
అని
చెప్పాను.
అది
ఇచ్చేసరికి
అతడు
గట్టిగా
ఏడ్చాడు
పాపం!
“నా
తల్లిదండ్రులుకూడా
నన్నీవిధంగా
చూసుకోలేదు”
అన్నాడు.
అతనికి
కావలసినవన్నీ
ఇచ్చాను.
ఆ
తరువాత
అతను
చాలాకాలం
బ్రతికాడు.
రాజమాతకూడా
తన
పనివారిని
ఎంతో
ప్రేమతో
చూసుకునేది.
వీడు
మనవాడా,
పరాయివాడా
అనే
భేదం
చూపకూడదు.
కష్టాల్లో
ఉన్నవారు
కంటికి
కనిపిస్తేతక్షణమే
వారికి
సహాయం
చేయాలి;
అదే
చదువుయొక్క
సారము.
ఇతరులకు
సహాయపడని
చదువెందుకు?!
విద్యార్థులారా!
నేడు
సమాజంలో
అనేకమంది
దుర్భరమైనస్థితిలో
జీవితాన్ని
గడుపుతున్నారు.
అలాంటివారికి
చేతనైనంత
సహాయంచేసి
వారి
అభివృద్ధికి
పాటుపడండి.
“పరోపకారః
పుణ్యాయ
పాపాయ
పరపీడనం.”
పరోపకారమును
మించిన
పుణ్యం
లేదు.
సాధ్యమైనంత
వరకు
మంచిపనులు
చేయాలి;
చిన్నపిల్లలకు
ఆదర్శవంతమైన
ప్రవర్తన
నేర్పి
వారిని
అభివృద్ధికి
తీసికొని
రావాలి.
ఇదే
విద్యార్థుల
ప్రధాన
కర్తవ్యం.
కాని,
ఈనాడు
చూస్తున్నాము
కదా,
విద్యార్థులు
తమ
చదువు
పూర్తి
అవుతూనే
విదేశాలకు
బయల్దేరుతున్నారు.
వారి
వేషభాషలు
చూస్తే
చాలా
గొప్పగా
ఉంటున్నాయికాని,
నడత
చూస్తే
పరమ
నీచంగా
ఉంటోంది.
నడత
సక్రమంగా
లేనప్పుడు
వేషభాషలు
ఎంత
గొప్పగా
ఉన్నా
లాభమేమిటి?
నడత
మంచిగా
ఉండాలి.
వినయవిధేయతలను,
దైవవిశ్వాసాన్ని
పోషించు
కోవాలి.
ఎటువంటి
కష్టాన్నైనా
ధైర్యంగా
ఎదుర్కోవాలి.
దేనికీ
భయపడ
కూడదు.
మనలో
దోషం
లేనప్పుడు
మనకు
భయమెందుకు?
ఏనాడూ
ఎవరి
దగ్గరా
మీరు
చేయిజాచకూడదు.
స్వామిని
ఆదర్శంగా
తీసుకోండి.
స్వామి
నడుచుకుంటున్నట్లుగా
నడుచుకుంటే
తప్పక
మీరుకూడా
స్వామివలె
తయారవుతారు.
మీరు
సద్గుణాలను
పోషించుకొని
సమాజంలో
ఉన్న
కష్టజీవులకు
తగిన
సహాయం
చేస్తూరావాలి.
కొంతమంది
విదేశీయులు
ఇక్కడ
బీదవారికి
సహాయం
చేయాలనే
ఉద్దేశ్యంతో
వారికి
డబ్బును
పంచి
పెడుతున్నారు.
9
▾
Meaning
Keep
దీనివలన
కొన్ని
పొరపాట్లు
జరుగుతున్నాయి.
ఇచ్చేవాడిని
చూస్తే
చచ్చేవాడుకూడా
లేచివస్తాడట!
ఎవరైనా
ఏమైనా
ఇస్తున్నారంటే,
అందరూ
అక్కడికి
పరుగెత్తుకొని
పోతుంటారు.
తినడానికి
అన్నం
లేదంటే
అన్నం
పెట్టండి,
గుడ్డలు
లేవంటే
గుడ్డ
లివ్వండి.
అంతేగాని,
డబ్బు
ఇవ్వవద్దు.
కాని,
విదేశీయులు
డబ్బిచ్చి
బీదలను
పాడుచేస్తున్నారు.
డబ్బుకోసం
చేయిజాచే
స్థితికి
మానవుడు
దిగజారకూడదు.
గౌరవంగా
జీవించాలి.
మొన్న
ఒక
భక్తుడు
స్వామికివ్వాలని
ఒక
కారును
తీసికొని
వచ్చాడు.
“స్వామిదగ్గరున్న
కార్లు
చాలా
పాతబడిపోయాయి.
నేనీ
కారును
ప్రేమకొద్దీ
ఇస్తున్నాను.
తప్పక
తీసుకోవాలి”,
అని
ప్రార్థిస్తున్నాడు.
అతను
వచ్చి
మూడు
దినములైంది.
కాని,
నేనతనిని
చూడలేదు.
కారణమేమిటి?
నాకున్న
కార్లు
చాలు.
పెద్దపెద్ద
కార్లలో
పోవడం
నాకిష్టం
లేదు.
కాని,
విదేశాలనుండి
పంపించారు.
పంపిన
తరువాత
ఇంకేమీ
చేయడానికి
వీలుకాదు.
“కావాలంటే
నా
కారే
నీవు
తీసుకో
నాయనా!”
అని
చెప్పాను.
నేను
ఎప్పుడూ
ఎవరిదీ
అలా
ముట్టేవాడిని
కాను.
మా
శ్రీనివాస్
నా
దగ్గరకు
వచ్చి
చాలా
ప్రాధేయపడ్డాడు.
“స్వామీ!
అతను
చాలా
బాధపడుతున్నాడు.
దయచేసి
దానిని
అంగీకరించండి”,
అని
కోరాడు.
“నోరు
మూసుకో.
ఇలాంటి
విషయాల్లో
జోక్యం
చేసుకోవద్దు.
అతను
తెచ్చింది
అతనే
తీసుకోనీ.
కావాలంటే
నా
కార్లే
నేనిస్తాను.
నీవొకటి
తీసుకో,
అతనికొకటి
ఇవ్వు.
నాకు
అక్కర్లేదు”,
అని
గట్టిగా
చెప్పాను.
మనిషిని
ప్రేమించండి.
కాని,
నమ్మవద్దు
ప్రతి
ఒక్కరికీ
త్యాగభావం
అత్యవసరం.
నా
ఆదర్శాన్ని
మీరు
అనుసరిస్తే
మీరు
ఎంతో
ధన్యాత్ములవుతారు,
పుణ్యాత్ములవుతారు,
మోక్షసిద్ధిని
పొందుతారు.
మీకు
మోక్షం
కావాలి.
మోక్షమంటే
ఏమిటి?
మోహక్షయమే
మోక్షం.
అందరినీ
ప్రేమించండి.
Love
all,
Serve
all
(అందరినీ
ప్రేమించండి,
అందరినీ
సేవించండి).
కాని,
మనిషిని
మాత్రం
నమ్మకండి.
మనిషిని
నమ్మినవాడు
పూర్తి
చెడిపోతాడు.
మనిషిని
ప్రేమించండి.
కాని,
నమ్మవద్దు.
మీ
అంతరాత్మను
మీరు
నమ్మండి.
ఆత్మవిశ్వాసాన్ని
పెంచుకోండి.
లోకసంబంధమైన
భావాలను
త్రెంచుకోండి.
10
▾
Meaning
Keep
ఇదే
మానవధర్మం.
ఈనాటి
మానవునిలో
పవిత్రమైన
భావాలు
లోపించాయి.
పైకి
మాత్రం
తాను
భక్తునివలె
నటిస్తున్నాడు.
ఎందుకీ
నటన?
సినిమాలు
వచ్చిన
తరువాత
ఈ
నటన
మరింత
ఎక్కువైపోయింది.
వీడియోలు,
టీవీలు
పిల్లలను
మరింత
పాడుచేస్తున్నాయి.
వీడియోలకు,
టీవీలకు
లోకులు
చాలా
విలువ
నిస్తున్నారు.
కాని,
నేను
వీటికి
ఏమాత్రం
విలువనివ్వను.
అవి
మనిషినేమైనా
ఉద్ధరిస్తున్నాయా?
లేదు.
మనిషి
మనిషిగా
బ్రతకడానికి
అవి
ఏమాత్రం
ఉపయోగపడటం
లేదు.
విద్యార్థులారా!
మీరెన్నో
సంవత్సరములనుండి
స్వామికాలేజీలో
చదువుతున్నారు.
కాని,
మీ
ప్రవర్తనలో
కించిత్తైనా
మార్పు
లేకపోతే
ప్రయోజనమేమిటి?
అందరినీ
ప్రేమించండి.
ఎవ్వరినీ
ద్వేషించవద్దు.
మిమ్మల్ని
ద్వేషించేవారినికూడా
ప్రేమించండి.
ఇదే
సాయియొక్క
ప్రధానమైన
తత్త్వం.
నన్ను
దూషించేవారినికూడా
నేను
ప్రేమిస్తాను.
వాళ్ళు
గట్టిగా
దూషిస్తే
ఆ
దూషణ
గాలిలో
కలిసిపోతుంది.
వాళ్ళలో
వాళ్ళు
దూషిస్తే
వాళ్ళకే
చెందుతుంది.
అది
నావరకు
రానే
రాదు.
ఈవిధమైన
భావనతో
మీరుకూడా
దూషణ
భూషణ
తిరస్కార
పురస్కారములకు
ఏమాత్రం
లొంగకూడదు.
ఎలాంటి
పరిస్థితిలోనూ
ప్రేమతత్త్వాన్ని
వదలకూడదు.
మంచివారు
అనాయాసమరణం
పొందుతారు
గృహం
అమ్మాయి
(ఈశ్వరమ్మ)
బృందావనంలో
ఈ
మందిరంలోనే
ప్రాణం
విడిచింది.
అప్పుడు
(మే,
1972)
సమ్మర్
క్లాసులు
జరుగుతున్నాయి.
ప్రతి
రోజు
ఆమెకూడా
వచ్చి
క్లాసులో
కూర్చునేది.
నేను
నవ్వుతూ
“ఏమి
వింటున్నావు?
నీవు
చదువుకోలేదు
కదా!
ఏమైనా
అర్థమౌతోందా?”
అని
అడిగితే,
“స్వామీ!
చదువుకున్న
వానికంటే
చాకలివాడు
మేలు.
ఈ
చదువులు
నాకక్కర్లేదు.
స్వామి
చెప్పే
మాటలను
ఈ
పిల్లలు
ఏవిధమైన
భావంతో
వింటున్నారు?
ఏవిధంగా
ప్రవర్తిస్తున్నారు?
అనేది
గమనించడానికి
నేను
వస్తున్నాను”
అని
సమాధానం
చెప్పింది.
ఇక్కడ
కళ్యాణపురంలో
గోగినేనివారుండేవారు.
వాళ్ళు
ఒక
పెద్ద
బంగాళా
కట్టుకున్నారు.
ఒక
రోజున
ఈశ్వరమ్మ
అక్కడికి
కాలినడకన
వెళ్ళివచ్చింది.
ఉదయం
కాఫీ
త్రాగి
కూర్చుంది.
“స్వామీ!
ఈనాడింకా
క్లాసులు
ప్రారంభం
కాలేదే!”
అన్నది.
11
▾
Meaning
Keep
“జరుగుతాయి.
టైమ్
ప్రకారం
బెల్లు
కొడతారు.
నీవేమీ
యోచన
పెట్టుకోవద్దు”
అని
చెప్పాను.
అప్పుడామె
నా
చేయి
పట్టుకొని,
“స్వామీ!
మీరు
ఈ
ప్రపంచానికి
ఎంతైనా
మేలు
చేయగలరు.
పెద్దలకంటే
ముఖ్యంగా
పిల్లల్లోనే
మీరు
పరివర్తన
తీసికొనిరావాలి.
విద్యార్థులను
గొప్పవారిగా
చేయనక్కర్లేదు,
వారిని
గుణవంతులుగా
తీర్చిదిద్దితే
చాలు”
అన్నది.
కొద్దిసేపటికి
ఈశ్వరమ్మ
“స్వామీ!
స్వామీ!
స్వామీ!”
అని
మూడుతూర్లు
పిలిచింది.
నేను
“వస్తున్నాను,
వస్తున్నాను,
వస్తున్నాను”
అని
మూడుతూర్లు
చెప్పాను.
అనాయాసంగా
ప్రాణం
విడిచింది.
‘పునరపి
జననం
పునరపి
మరణం
పునరపి
జననీ
జఠరే
శయనం’.
దేహం
వస్తుంది,
పోతుంది.
దానిగురించి
మనం
విచారించనక్కర్లేదు.
డ్రైవరును
పిలిచి
ఒక
వ్యానులో
ఆమె
దేహాన్ని
ప్రశాంతి
నిలయానికి
తీసుకువెళ్ళమని
చెప్పాను.
రామబ్రహ్మంనుకూడా
పంపించాను.
అతను
చాలా
మంచివాడు.
స్వామి
ఏ
పని
చెప్పినా
ఎంతో
శ్రద్ధగా
చేసేవాడు.
తరువాత
గోకాక్,
భగవంతం
నావద్దకు
వచ్చి
ఆనాటి
క్లాసులను
రద్దు
చేశామన్నారు.
ఎందుకని
అడిగితే
“తల్లిగారు
మరణించారు
కదా!”
అన్నారు.
“ఆమె
మరణిస్తే
మరణించింది.
పిల్లలంతా
మరణించారా?
ఈ
పొద్దు
క్లాసులు
జరగవలసిందే”
అన్నాను.
వాళ్ళు
ఆశ్చర్యపోయారు.
వెంటనే
ఆరోజు
యథాప్రకారం
క్లాసులు
జరుగుతాయని
ప్రకటించారు.
ప్రతి
దినమూ
నేను
క్లాసుకు
వెళ్ళేవాడిని.
కాని,
ఆరోజు
పిల్లలందరూ
స్వామి
వస్తాడో
రాడో,
అనుకున్నారు.
నేను
క్లాసులో
ప్రవేశించేసరికి
అందరూ
కన్నీరు
కార్చారు.
“ఈ
ప్రపంచంలో
జననమరణాలు
అందరికీ
సహజమే.
పుట్టినవాడు
చావక
తప్పదు”
అని
చెప్పి
వారిని
సమాధానపరచాను.
ఈవిధంగా,
నేను
దృఢదీక్షతో
అవరోధాలను
తట్టుకొని
నెట్టుకొని
ముందుకు
సాగడంచేతనే
నా
కీర్తిగౌరవాలు
పెరుగుతూవచ్చాయి.
రామబ్రహ్మం
“స్వామీ!
తమరుకూడా
వస్తే
బాగుంటుంది
కదా!”
అన్నాడు.
“ఇది
ప్రాపంచికమైనది.
దీనితో
నాకు
సంబంధం
లేదు.
నేను
ఇక్కడే
చూశాను,
ఆశీర్వదించాను.
మీరు
అక్కడికి
తీసుకువెళ్ళి
పూడ్చండి”
అని
చెప్పాను.
చెప్పినట్లు
చేశాడు
రామబ్రహ్మం.
12
▾
Meaning
Keep
ఆమె
గోగినేనివారి
ఇంటినుండి
వచ్చింది,
టిఫిన్
తీసుకుంది.
ఆమెకు
తాంబూలం
వేసుకోవడం
అలవాటు.
నాకుకూడా
మొట్టమొదట
తాంబూలమంటే
ఇష్టమే.
ఒక
చిన్న
పొత్రముతో
వక్కను
కొట్టి
నోట్లో
వేసుకొని
నములుతూ
కూర్చుంది.
అనాయాసంగా
ప్రాణం
విడిచింది.
ఇంతకంటే
ఏమి
కావాలి?
గృహం
అబ్బాయికూడా
అంతే.
గృహం
అబ్బాయి
అనగా
ఈ
దేహానికి
తండ్రి.
ప్రశాంతినిలయంలో
ఆ
రోజున
నేను
భక్తులను
ఇంటర్వ్యూకోసం
సెలెక్ట్
చేసి
కూర్చోబెట్టాను.
ఆయన
వచ్చాడు.
ఎందుకు
వచ్చావని
అడిగాను.
“స్వామీ!
మీతో
రెండు
మాటలు
చెప్పాలి,”
అన్నాడు.
“వీరిని
పంపించిన
తరువాత
చూస్తాను,”
అని
చెప్పాను.
‘నా,
పర’
అనే
భేదము
నాకు
లేదు.
వారందరినీ
లోపలికి
తీసుకువెళ్ళి
మాట్లాడి
వారికి
ప్రసాదం
ఇచ్చి
పంపించాను.
తరువాత
ఆయనను
పిలిచాను.
ఆయన
తన
పంచెకు
కట్టుకున్న
కొంత
డబ్బును
తీసి
నా
చేతికిస్తూ
“స్వామీ!
నా
దగ్గర
ఇంతకంటే
లేదు.
నాకు
వచ్చే
ఆదాయం
మీకు
తెలుసు.
నేను
పోయిన
తరువాత
ఈ
డబ్బుతో
పదవ
దినము
సమారాధన
చక్కగా
జరపాలి,”
అన్నాడు.
“నీవు
బాగానే
ఉన్నావు
కదా!”
అన్నాను.
ఆయన
ఇంటికి
తిరిగి
వెళ్ళాడు.
నాల్గు
మూటల
బియ్యం,
బెల్లం
మొదలైనవి
ప్రక్కకు
తీసిపెట్టాడు.
తన
మనుమణ్ణి
ఆడిస్తూ
ప్రశాంతంగా
ప్రాణంవిడిచాడు.
మంచివారికి
ఇలాంటి
మరణం
ప్రాప్తిస్తుంది.
ఇరువురూ
అనాయాసంగా
పోయారు.
ఎందుకంటే,
ఈ
దేహానికి
వారు
తల్లిదండ్రులు,
ఈ
పవిత్రత
వారియందు
కూడా
ఉంది.
వారిని
నా
తల్లిదండ్రులుగా
నేనే
సెలెక్ట్
చేసుకున్నాను.
నేను
సెలెక్ట్
చేసుకున్నది
ఎప్పుడూ
కరెక్ట్‌గానే
ఉంటుంది.
ప్రతి
మానవుడు
తన
తల్లిదండ్రులకు
సేవ
చేయాలి.
ఆ
సేవలోనే
ఉన్నది
ముక్తి.
తపస్సు,
ధ్యానము,
యజ్ఞయాగాదులు
మొదలైనవి
చేయనక్కర్లేదు.
నామస్మరణ
చేస్తే
చాలు.
అలా
చేసినవారు
అనాయాసమరణం
పొందుతారు.
మంచి
భావాలతో
బ్రతకాలి.
పరోపకారం
చేయాలి.
మీరు
కేవలం
భజనలు
చేస్తే
సరిపోదు.
మీ
ప్రవర్తనను
సక్రమమైనరీతిగా
తీర్చిదిద్దుకోవాలి.
Previous
←
The Name of Rāma is best; the thought of Rāma is enough
Next
The Ideals Of Education In Ancient India
→