Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2006 · Offering oneself is the true yajña
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Offering oneself is the true yajña
10 August 2006, Ati Rudra Mahā Yajña, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 33
Also in his talks
(15)
15 June 1973
The Bond of Prakṛti and the Paramātma
15 March 1978
The whole duty is yours
23 November 1986
Inquiry into Ātma-jñāna itself is Sanātana Dharma
2 January 1987
Sanātana Dharma is the essence of all the wisdom of the Vedas
7 April 1989
All this is Vāsudeva
17 October 1990
The strength of the Ātma alone is true strength
23 November 1990
Restore the glory of Bharat
22 November 1996
Along with Study, Saṁskāra Too Is Very Necessary
23 November 1998
Sarvaṁ Khalvidaṁ Brahma
10 September 2000
God is within you
19 January 2001
Doctors must serve the poor in a spirit of sacrifice
22 November 2003
True Prema stands only when selfishness is given up
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
12 September 2008
Complete sacrifice alone is the stairway to immortality
22 November 2008
The duty of guarding the wealth of Dharma of Mother Bhārata is yours!
ఖండ
ఖండాంతర
ఖ్యాతి
నార్జించిన
మహనీయులను
గన్న
మాతృభూమి
పాశ్చాత్య
వీరుల
పారద్రోలించియు
స్వాతంత్ర్యమును
గన్న
సమరభూమి
పాండిత్యమున
చాల
ప్రఖ్యాతి
గాంచియు
ప్రతిభ
చూపించిన
భరతభూమి
సంగీత
సాహిత్య
శాస్త్రీయ
విద్యల
ధీశక్తి
చూపిన
దివ్యభూమి
చిత్రకళలతోడ
చిత్రమై
యున్నట్టి
భరతభూమియందు
జననమంది
భరతమాత
ధర్మ
భాగ్యంబు
కాపాడ
బాధ్యతంతయు
మీదె
బాలులార!
పవిత్రాత్మ
స్వరూపులైన
ఋత్విక్కులారా!
ప్రజలారా!
బాలులారా!
భరతభూమి
చాలా
భాగ్యభూమి.
ఇది
బంగారుభూమి;
మహా
సాధ్వీమణులను,
పండితులను,
సంగీత
కళాకారులను
కన్న
పవిత్రభూమి.
ఇట్టి
భూమియందు
జన్మించికూడను
భారతీయ
సంస్కృతి
యొక్క
ఔన్నత్యమును
గ్రహించుకోలేకపోవడం
చాలా
దురదృష్టము.
ఈరోజు
ప్రొద్దున్న
ప్రధానాచార్యులు
జరుపుతూ
వచ్చిన
యజ్ఞ
కార్యక్రమములు
చిత్రమైనవి,
పవిత్రమైనవి.
వీటిని
మీరు
కంటితో
చూస్తున్నారే
గాని,
హృదయంతో
అనుభవించడం
లేదు.
మనస్స్యేకం
వచస్స్యేకం
కర్మణ్యేకం
మహాత్మనాం
మనస్యన్యత్
వచస్యన్యత్
కర్మణ్యన్యత్
దురాత్మనాం
2
▾
Meaning
Keep
ఇక్కడ
మీరు
విన్నటువంటి,
కన్నటువంటి
విషయాలను
మీ
హృదయానికి
అందించి
తద్ద్వారా
దైవత్వాన్ని
అనుభవించడానికి
ప్రయత్నించాలి.
మన
భారత
దేశమునందు
ఇటువంటి
పవిత్రమైన
ఆధ్యాత్మిక
కార్యక్రమములను
ఎన్నియో
చూస్తున్నాము,
వాటిని
గురించి
వింటున్నాము.
భారతదేశమునందున్న
భక్తి,
శ్రద్ధలు
ఏ
ఇతర
దేశములందుకూడను
కానరావు.
కనుకనే,
అనేక
దేశాల్లో,
అనేక
ప్రాంతాల్లో
అల్లకల్లోలములు
చెలరేగుతున్నాయి.
భారతీయులు
మాత్రం
ఎన్ని
కష్టములు
వచ్చినా,
ఎన్ని
నష్టములు
కలిగినా,
ఎన్ని
బాధలు
సంభవించినా
భగవన్నామ
స్మరణచేత
వాటిని
అధిగమించి
శాంతంగా
తమ
జీవితాన్ని
గడుపుతున్నారు.
ఇట్టి
పవిత్రత,
ప్రశాంతత
మరి
ఏ
ఇతర
దేశమునందుకూడను
కానరాదు.
ఇట్టి
పవిత్రమైన
దేశమునందు
జన్మించడం
గొప్ప
అదృష్టం.
యజ్ఞయాగాది
క్రతువులు
భారత
దేశమునందు
తప్ప
మరి
యెందుకూడను
కానరావు.
యజ్ఞయాగాదులంటే
ఏవో
కొన్ని
మంత్రముల
నుచ్చరిస్తూ
అగ్నిలో
సమిధలను
ఆహుతి
చేయడమని
భావిస్తున్నారు.
మానవుడు
తనను
తాను
భగవంతునికి
అర్పితం
గావించుకోవడం,
భగవంతునికి
ప్రీతి
కలిగించడం,
భగవత్ప్రేమకు
పాత్రుడు
కావడం
...
ఇదియే
నిజమైన
యజ్ఞం.
యజ్ఞయాగాదులు
కేవలం
నీ
స్వార్థంకోసం,
స్వప్రయోజనంకోసం
చేసేవి
కావు.
పరుల
శ్రేయస్సు
కోసం,
లోకకల్యాణం
నిమిత్తమై
ఏర్పడినటువంటివే
యజ్ఞయాగాది
క్రతువులు.
ఇవి
అనాదికాలమునుండి
మన
భారతదేశములో
అభివృద్ధి
అవుతూ
వస్తున్నవి.
త్రేతాయుగమునందు
ఎన్నియో
యజ్ఞయాగాదులు
జరిగినవి.
కాని,
ఆనాడు
రాక్షసులు
వాటికి
భంగం
కలిగిస్తూ
వచ్చారు.
కారణం?
యజ్ఞయాగాదులయొక్క
విశిష్టత,
వాటినిగురించిన
సత్యము
వారికి
తెలియక
పోవడమే!
ద్వాపరయుగము
వచ్చేసరికి
కొంతవరకు
అర్థము
చేసుకోవడానికి
ప్రయత్నించారు.
ఈనాడు
అందరూ
చదువుకొన్నటువంటివారే!
కాబట్టి,
మీరు
యజ్ఞయాగాదిక్రతువుల
విశిష్టతను
సంపూర్ణంగా
అర్థం
చేసుకొని
ఆచరించాలి.
అనగా,
ఏ
కార్యమును
చేసినను
‘భగవత్ప్రీత్యర్థం
చేస్తున్నాను’
అనే
పవిత్ర
భావంతో
ఆచరించాలి.
అడుగడుగున,
అణువణువున
మనయందు
భగవత్ప్రీతి
ఆవిర్భవించాలి.
మానవుడు
పుట్టినది
భగవంతునికి
ప్రీతికరమైన
కర్మలనాచరించి
తన
జీవితాన్ని
ధన్యము
చేసుకునే
నిమిత్తమేగాని,
కేవలం
తిండి,
తీర్థాదులతో
కాలమును,
కాయమును
నిరర్థకం
గావించుకొనుటకు
కాదు.
3
▾
Meaning
Keep
భగవంతుడు
కాలస్వరూపుడు.
కనుకనే,
మనము
భగవంతుని
“కాలాయ
నమః
కాలకాలాయ
నమః
కాలదర్పదమనాయ
నమః
కాలనియమితాయ
నమః
కాలాతీతాయ
నమః”
అని
స్తుతిస్తున్నాము.
కాబట్టి,
క్షణమైనా
మనం
వ్యర్థం
చేయకూడదు.
నీ
సత్య
తత్త్వాన్ని
నీవు
గుర్తించాలి.
ఈనాటి
మానవుడు
‘నేనెవరు?’
అనేది
గుర్తించడానికి
ప్రయత్నించకుండా
‘నీవెవరు?
నీవెవరు?’
అని
ఇతరులను
ప్రశ్నిస్తూ
కాలమును
వ్యర్థం
గావిస్తున్నాడు.
మొట్టమొదట
నీవెవరివో
గుర్తించుకుంటే
పరులెవరో
తెలుసుకోవడానికి
నీకు
వీలౌతుంది.
మానవుడు
కేవలం
శారీరకసౌఖ్యములకోసమని,
మానసికతృప్తికోసమని,
ఇంద్రియానందము
కోసమని
ప్రాకులాడుతున్నాడేకాని,
ఆత్మతృప్తి
నిమిత్తమై
పాటుపడడం
లేదు.
ఈ
ఇంద్రియ
సౌఖ్యములు
ఎంతవరకు?
ఇవన్నీ
క్షణభంగురములే!
కదలిపోయేటటువంటి
మేఘములే!
హృదయమొక్కటే
శాశ్వతమైనది.
కాబట్టి,
మనం
హృదయతృప్తికోసం
పాటుపడాలి.
సత్సాంగత్యముచేతనే
అది
సాధ్యమౌతుంది.
నీవు
ఎట్టివారితో
చేరుదువో
నీ
గుణములు
అట్టివిగానే
మార్పుచెందుతాయి.
కాబట్టి,
నీవు
పెద్దలతోను,
విద్యావంతులతోను,
ఆధ్యాత్మిక
చింతన
గలవారితోను
చేరాలి.
ఈనాడు
ఇక్కడ
చేరినటువంటి
సత్సంగము
చాలా
గొప్పది.
ఇటువంటి
సత్సంగములో
చేరినప్పుడు
మన
హృదయము
పవిత్రంగా
మారి,
సత్సంకల్పాలు
మనలో
ఆవిర్భవించి,
సత్కర్మల
నాచరించి,
సత్ఫలితాలను
అందుకోగల్గుతాము.
ఎట్టి
మంటయో
అట్టి
పొగ.
ఎట్టి
పొగయో
అట్టి
మేఘము.
ఎట్టి
మేఘమో
అట్టి
వర్షము.
ఈనాడు
కురిసే
వర్షము
సరియైన
వర్షము
కాకుండా
పోతున్నది.
నీరే
మనిషికి
ప్రాణాధారం.
మనిషికి
వచ్చే
అనేక
రోగములకు
మూలకారణం
కలుషితమైన
నీరే!
అంతేగాకుండా,
చుట్టూ
ఉన్న
వాతావరణంకూడా
దానికి
కారణమవుతున్నది.
కాబట్టి,
మన
పరిసరాలను
పరిశుభ్రంగా
పెట్టుకోవాలి.
త్రాగే
నీరుకూడను
పరిశుద్ధంగా
ఉండాలి.
అప్పుడే
మనము
ఆరోగ్యాన్ని,
ఆనందాన్ని
అనుభవించగలము.
ఆరోగ్యమునకు
ఆనందమే
ప్రధానము.
విద్యార్థులారా!
విద్యార్థినులారా!
ముఖ్యంగా
ఈ
వయస్సులో
మీరు
మీ
చుట్టూ
ఉన్న
వాతావరణము
పవిత్రంగా
ఉండేటట్లు
చూసుకోవాలి.
4
▾
Meaning
Keep
Also in his talks
(1)
22 November 1998
The Education of Bhārata Is What Develops the Divine Human Principle
మంచి
మాటలు,
మంచి
పాటలు,
మంచి
ఆటలకు
దోహదము
కల్పించే
స్థానములో
మీరు
ప్రవేశించాలి.
మీరు
చేసే
పనులు
మానవోద్ధరణ
గావించేవిగా
ఉంటుండాలి.
మీరు
ఎవరితో
మాట్లాడినప్పటికీ
శాంతంగా,
ప్రేమతో,
కరుణతో
మాట్లాడాలి.
కఠినోక్తులు
హృదయాన్ని
గాయపరుస్తాయి.
మంచి
మాటలచేత
మనం
ఎదుటి
వ్యక్తి
హృదయాన్ని
కరిగించాలి.
ఎవరైనా
పెద్దలు
మన
ఇంటికి
వచ్చినప్పుడు
‘దయచేయండి.
కూర్చోండి’
అని
ప్రేమతో
వారిని
ఆహ్వానించాలి.
‘హెల్ప్
ఎవర్,
హర్ట్
నెవర్’.
అందరికీ
మనం
సహాయంగా
ఉండాలి.
అందరితోను
మనం
స్నేహంగా
ఉండాలి.
ఇవియే
వేదం
మొట్టమొదట
బోధించిన
సువాక్యములు:
సహనా
వవతు
సహనౌ
భునక్తు
సహవీర్యం
కరవావహై
తేజస్వినావధీతమస్తు
మా
విద్వి
షావహై
కలసి
మెలసి
పెరుగుదాం
కలసి
మెలసి
తిరుగుదాం
కలసి
మెలసి
తెలుసుకున్న
తెలివిని
పోషించుదాం
కలసి
మెలసి
కలత
లేక
చెలిమితో
జీవించుదాం
నాలుక
చాలా
మృదువైనది.
అట్టి
నాలుకనుండి
మధురమైన
మాటలే
రావాలిగాని,
కఠినమైన
మాటలు
ఏమాత్రము
రాకూడదు.
కఠినమైన
మాటలతో
ఎదుటి
వ్యక్తిని
బాధిస్తే
దాని
ఫలితంగా
భవిష్యత్తులో
మనము
కూడా
బాధపడవలసి
వస్తుంది.
భగవంతుడు
మీకు
నాలుక
నిచ్చినందుకు
పవిత్రమైన
పలుకులు
పలికి
దానిని
మీరు
సద్వినియోగం
గావించుకోవాలి.
మీ
మంచి,
చెడ్డలు
మీరు
మాట్లాడే
మాటలపైనే
ఆధారపడి
ఉంటాయి.
మంచిమాటలు
మాట్లాడితే
సమాజంలో
మీకు
మంచిస్థానమే
లభిస్తుంది.
మీకు
జవాబు
చెప్పేవారుకూడను
మంచిగా
చెబుతారు.
పిల్లల్లారా!
మీరు
గొప్ప
చదువులు
చదువుతున్నామని
గర్వించకండి.
విద్యార్థి
దశలో
మీలో
గర్వం
ప్రవేశించిందంటే
అది
జీవితాంతం
మిమ్మల్ని
వదలి
పెట్టదు.
మొట్టమొదట
మీ
హృదయాన్ని
పవిత్రంగా,
మృదుమధురంగా
మార్చుకోండి.
మీ
హృదయం
మృదుమధురంగా
ఉన్నప్పుడు
మీలో
ఆవిర్భవించే
సంకల్పములు
కూడా
మధురంగానే
ఉంటాయి.
సాటి
మనిషిపట్ల
ప్రేమతో,
జాలితో,
కరుణతో
మీ
జీవితాన్ని
గడపండి.
మీ
జీవితమంతా
ప్రేమమయంగా
మారాలి.
5
▾
Meaning
Keep
ప్రేమయందున్న
మాధుర్యం
మరి
దేనియందూ
లేదు.
విద్యార్థులారా!
ప్రతి
రోజు
పండితులు
మీకు
అనేక
మంచి
విషయాలను
చెబుతారు.
వాటిని
మీరు
క్రోడీకరించుకొని
మీ
హృదయములోకి
చేర్చుకోవాలి.
కేవలం
క్లాసులో
టీచర్లు
బోధించే
పాఠ్యాంశాలకు
మాత్రమే
మీ
చదువు
పరిమితం
కాకూడదు.
అది
‘ఆర్టిఫిషియల్’
విద్య.
మీరు
‘హార్టిఫిషియల్’
విద్యను
నేర్చుకోవాలి.
మనకు
‘హార్ట్’
(హృదయం)
చాలా
ప్రధానమైనది.
ఈ
పది
దినములలో
పండితులు
చేసే
ప్రసంగాలవల్ల
మీకెంతో
జ్ఞానము,
పవిత్రత
చేకూరుతాయి.
నవవిధ
భక్తిమార్గములలో
శ్రవణము
మొదటిది.
కాబట్టి,
మనము
మంచిమాటలను
శ్రవణం
చేయాలి.
ఎవరైనా
మీకు
అయిష్టమైన
పలుకులు
పలుకుతుంటే
తక్షణమే
ఆ
స్థానమును
వదలిపెట్టండి.
చెడ్డమాటలను
మీరు
గాలికి
వదలాలి.
మంచి
విషయాలను
మాత్రమే
మీరు
స్వీకరించాలి.
అవే
మీలో
శాశ్వతంగా
నిలిచిపోతాయి.
మంచి
విషయాలనగా
భగవత్
విషయములే!
అవే
సత్యమైనవి,
నిత్యమైనవి,
పవిత్రమైనవి.
అట్టి
సత్య
నిత్యమైన
వాక్కులను
మీరు
అందుకొని,
మీ
జీవితమును
ఆదర్శవంతంగా
తీర్చిదిద్దుకోండి.
భగవంతుడు
చెప్పే
మాటలు
ఎంతో
మధురమైనవి,
అమృతమయమైనవి.
అట్టి
భగవద్వాక్యములను
మీరు
ఏమాత్రము
వదలిపెట్టకూడదు.
దేహమునైనను
వదలవచ్చునుగాని,
భగవంతుని
మాటలను
వదలకూడదు.
‘పాంచ
భౌతికము
దుర్బలమైన
కాయంబు,
ఎప్పుడో
విడిచేది
ఎరుకలేదు.’
దేహమును
ఏనాటికైనా
వదలిపెట్టవలసిందే!
కాబట్టి,
దేహమును
ప్రధానంగా
పెట్టుకోకూడదు.
కేవలం
ఉదర
పోషణకై
మనము
జీవించరాదు.
మానసిక
శాంతికోసము,
ఆత్మానందము
నిమిత్తం
మనము
ఇలాంటి
సత్సంగములో
చేరాలి.
చేరడం
మాత్రమే
కాదు;
పెద్దలు
బోధించే
మంచి
విషయాలను
హృదయములోకి
చేర్చుకోవాలి.
Previous
←
The Ati Rudra, supremely powerful
Next
Divinity is attained only through Prema for God
→