Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Man is the son of immortality!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Man is the son of immortality!
1 June 1989
1
▾
Meaning
Keep
భక్తి
అనగా
రాగ
తాళములతో
భజనలు
చేయటం
కాదు.
జ్ఞానమనగా
కేవలము
ముక్కు
మూసుకుని,
బట్ట
కప్పుకొని
మూలను
కూర్చోటం
కాదు.
జపమనగా
కేవలము
వేళ్లతో
మాలను
త్రిప్పుతూ
చెవులతో
అనేక
విషయములు
వింటూ
కన్నులతో
జగత్తును
చూడటం
కాదు.
మనో
వాక్కాయ
కర్మలచేత
భగవంతుని
ప్రేమించుటయే
భక్తి.
ఇట్టి
పవిత్రమైన
భక్తి
యొక్క
లక్షణాలతో
కేవలము
మన
ప్రాకృతమైన
బుద్ధులచేత
వీటిని
అపవిత్రము
గావించుకోటానికి
ప్రయత్నిస్తున్నాము.
దేహము
అశాశ్వతము.
మనస్సు
అనిశ్చలము.
బుద్ధి
కేవలము
ప్రాకృత
కర్మలననుసరించేది.
ఇలాంటి
అనిత్యము
అశాశ్వతము
అసత్యమైన
మనో
బుద్ధుల
కాయము
చేత
మనము
నిత్య
సత్యమైన
భగవత్తత్త్వాన్ని
గుర్తించటము
అసాధ్యము.
నిత్యసత్యమై
నిరుపాధికమై
దివ్యత్వము
తనయందే
వుంటున్నది.
మానవ
జన్మ
చాలా
దుర్లభమైనది.
పవిత్రమైనది.
కాని
యిట్టి
మానవజన్మ
ధరించి
కూడను
మనము
ఆత్మాన్వేషణ
వదలి
అన్నాన్వేషణ
కోసం
ప్రాకులాడుతున్నాము.
కానీ
యిట్టి
పవిత్రమైన
జీవితములో
సిరిని
మాత్రమే
తలంచుచున్నాము
కాని
హరిని
తలంచటం
లేదు.
మన
జీవితమంతా
కూడను
లక్ష్మీ
వుపాసన
సలుపుతున్నామేగాని
లక్ష్మీపతి
ఉపాసనకు
యేమాత్రం
ప్రాకులాడుటం
లేదు.
లక్ష్మియే
మనకు
ఆధారమని
ప్రధానమని
వాదిస్తున్నాముగాని
లక్ష్మీపతియైన
తత్త్వాన్ని
మనము
గుర్తించుకోటం
లేదు.
గొప్ప
విద్యావంతుడు,
జ్ఞాని,
తపస్వి,
మహాభక్తుడు
రావణుడు.
అతనికంటె
విద్య
ఎక్కువ
చదివినవారు
జగత్తులో
ఎవ్వరూ
లేరు.
64
విద్యలు
అభ్యసించినవాడు
రావణుడు.
ఎన్ని
విద్యలు
అభ్యసించి
ఏమి
ప్రయోజనము.
కాని
తన
యింద్రియములకు
తాను
దాసుడైనాడు,
విద్యలనభ్యసించినవాడు
విద్యావంతుడు
కావచ్చుగాని
జ్ఞానముగల
జ్ఞాని
కాలేడు.
జ్ఞానికి
విద్యకు
వ్యత్యాసము
వుంటున్నాది.
జ్ఞాని
అనగా
యింద్రియములు
అరికట్టుకొన్నవాడు.
ఇంద్రియములను
స్వేచ్ఛా
విహారము
సలుపుచు
అనేక
విధములైన
ప్రాకృత
విద్యలు
అభ్యసించే
వాడు
విద్యావంతుడు
కావచ్చు.
కనుక
యిలాంటి
విద్యలన్ని
పొట్టకూటి
నిమిత్తమై
పాకులాడేవి
తప్ప
నిత్యసత్యమైన
ఆత్మ
తత్త్వమును
గుర్తించేందుకు
సాధ్యము
కాదు.
పవిత్రమైన
భక్తి
ప్రపత్తులతో
నిత్యము
ఆరాధనే
సలిపే
వ్యక్తి
గొప్ప
గుణశీలుడు.
అట్టి
గుణములు
వర్ణించుటకు
ఫణిపతికిగాని,
భూపతికిగాని,
లేక
విద్యాపతికిగాని
సాధ్యము
కానివంటివాడు.
సర్వ
సుగుణములు
వర్ధిల్లుచుండిన
వాడు
ఒక
విద్యార్థి
అతనే
ప్రహ్లాదుడు.
ప్రహ్లాద.
ప్ర
అనగా
వికాసముతో
వుండినటువంటిది.
హ్లాద
అనగా
ఆనందము.
ఆహ్లాదము.
నిరంతరము
విశాలమైన
విజృంభించే
ఆహ్లాదములో
వుండేవాడు.
2
▾
Meaning
Keep
అతని
భక్తి
ప్రపత్తులు
యే
రీతివి.
నీరు
త్రాగుతూ,
అన్నము
భుజిస్తూ
నిద్రిస్తూ
నడుస్తూ
మాటాడుతూ
ఆడుతూ
పాడుతూ
నిరంతరము
హరిచింతన
లోనే
వుండేవాడు.
ఈ
వుత్తమ
మార్గము
లోపల
ప్రయాణము
చేసే
పుత్రుని
చూచి
తండ్రి
విసుగు
చెందాడు.
ఈ
విధముగా
యీ
కుమారుని
వదలిపెట్టినప్పుడు
కేవలము
పిచ్చివాడుగా
మారిపోవచ్చు
అనే
వుద్దేశ్యముతో
మంచి
కఠినమైన
గురువును
పిలిపించి
చండా
అమార్కులు
వారి
పేర్లే
చండాలురుగా
వుంటున్నారు.
చండా
అమార్కులు
అనగా
మార్పులేనివారు.
ఇలాంటి
వారిని
పిలిపించి
వారికి
అప్పచెప్పారు
ప్రహ్లాదుని.
వీరు
తమ
జీవనోపాధి
నిమిత్తమై
హిరణ్యకశిపుని
ఆశ్రయించిన
వారేగాని
జీవిత
పరమావధి
నిమిత్తమై
ఆశ్రయించిన
వారు
కాదు.
వారు
బోధించినది
యేమిటి?
దేవుడంటే
హిరణ్యకశిపుడే.
దివ్యమైన
శక్తి
అనగా
హిరణ్యకశిపుని
శక్తియే
దివ్యమైన
శక్తి.
సర్వజ్ఞుడు
ఎవరంటే
హిరణ్యకశిపుడే.
సర్వవ్యాపకుడు
ఎవరంటే
హిరణ్యకశిపుడే.
ఈ
విధమైన
హిరణ్యకశిపుని
ప్రోద్బలముచేత
అతనిని
ప్రసన్నుని
గావించుకొనే
నిమిత్తము
యీ
గురువులు
యీ
విధమైన
బోధలు
సలుపుతూ
వచ్చారు.
కానీ
చిన్న
పిల్లవానికి
హిరణ్యకశిపుడు
గురువును
పిలచి
ధర్మ
అర్థ
కామములు
యీ
మూడింటిని
మాత్రమే
నా
కుమారునికి
బోధించాలి.
వివాహమైన
వారి
జీవిత
చర్య
అంతా
కూడను
అర్థ
కామముల
చేతనే
బోధించి
యీ
పిల్లవాని
హృదయము
మార్చాలి
అన్నాడు.
ఈ
విధమైన
విరుద్ధమైన
బోధలు
సల్పటానికి
చండామార్కులు
పూనుకున్నారు.
ఆ
టీచర్సులేని
సమయాన్ని
పురస్కరించుకొని
ప్రహ్లాదుడు
తోటి
బాలురను
చేరి
ఆడుకోటానికి
పోకుండా
వారికి
నిత్యసత్యమైన
హరి
చింతనను
వారికి
బోధించేవాడు.
పిల్లలకు
బోధించేవాడు.
మన
teachers
మనకు
సరియైన
విద్య
తెల్పటం
లేదు.
లోక
సంబంధమైన
వాంఛల
చేతను,
భోగముల
చేతను
మరింత
యిందులో
మనలను
ప్రవేశ
పెడుతున్నారు.
ప్రాపంచిక
సంబంధమైన
విషయవాసనల
లోపల
పశుపక్షి
మృగాదులు
కూడను
ప్రవేశపెడుతున్నాయి.
జంతూనాం
నరజన్మ
దుర్లభమ్.
దీనిలో
వున్న
విశిష్టత
ఏమిటి?
మానవుడై
పుట్టి
పశుపక్షి
మృగాదులవలె
యీ
భోగములకై
ప్రాకులాడటం
సరియైన
ధర్మం
కాదు.
మన
జీవితమంతా
హరికి
అర్పితము
కావాలి.
దానికి
మించిన
ఫలితము
మరొకటి
లేదు.
అని
యీ
విధంగా
బోధిస్తూ
వచ్చాడు
ప్రహ్లాదుడు.
పిల్లలారా!
మనము
మానవ
మాత్రులము.
మాధవునకు
వారసులము.
ఈ
వారసత్వానికి
మనము
యేమి
ప్రయత్నము
చేస్తున్నాము.
మన
సిరి
సంపదలన్ని
అర్థము
కామము
కాదు.
భక్తియే
మన
ప్రధానమైన
గమ్యము.
ధర్మమే
మన
ప్రధానమైన
నడక.
ప్రేమనే
మన
హృదయము
యొక్క
విశాలత.
ఈ
మూడింటి
తత్త్వము
చేత
బంధింపబడిన
వారము
మానవులము.
కనుక
మనము
మనోవాక్కాయములను
పవిత్రము
గావించి
త్రికరణ
శుద్ధి
లోపల
త్రిమూర్తిని
దర్శించటమే
మనయొక్క
కర్తవ్యము.
3
▾
Meaning
Keep
Also in his talks
(9)
20 January 1987
Such forbearance we must cultivate
9 January 1988
God in the heart, work in the hands
19 March 1990
Hero becomes zero if he forgets God
16 June 1996
If the Body Is to Be Pure, Remember the Name of God
24 February 2002
God loves the inner feeling
22 July 2002
Business in the Spiritual Field Is Treason against God
2 June 2003
That is education which liberates
13 August 2006
For the young, mastery of the senses comes first
28 September 2006
No worry troubles those who think of God without ceasing
ఈ
బోధలంతా
యీ
చండామార్కులకు
మహా
బోధలుగా
కనిపించాయి.
కానీ
వీరు
అర్థకామములు
అనేక
విధములుగా
బోధిస్తూ
వచ్చారు.
ఒకానొక
సమయము
లోపల
హిరణ్యకశిపుడు
ప్రహ్లాదుని
తన
దగ్గరకు
తీసుకొని
రమ్మన్నాడు.
ఎంతవరకు
చదివాడు
ఏమి
మార్పు
చెందాడు
అనే
విషయమును
గుర్తించటానికి
అనేక
రకములుగా
ప్రయత్నము
చేశాడు.
చండామార్కులు
అనేక
రకములుగా
గట్టిగా
బోధించి
నీ
తండ్రి
అడిగిన
దానికి
చక్కగా
జవాబు
నివ్వాలి.
హరిని
స్మరించకూడదు.
భగవంతుని
పేరు
ఏమాత్రము
ఎత్తకూడదు.
భగవంతుడు
అంటే
హిరణ్యకశిపుడు
అని
మాత్రమే
చెప్పాలి.
ఈ
జగత్తుకు
అధిపతి
ఎవరంటే
హిరణ్యకశిపుని
చూపించాలి.
వీరు
యిలాంటి
బోధలు
చేసి
చేసి
సమీపానికి
వచ్చేంతవరకు
యీ
బోధలు
చేశారు.
కాని
సామాన్యమైనవాడు
కాదు
ప్రహ్లాదుడు.
బయటపోయిన
తక్షణమే
దుర్మార్గులు
బోధించే
బోధలు
వినేవాడు
కాదు.
చిన్నవాడైనప్పటికి
గొప్ప
హృదయము
కలిగినవాడు
ప్రహ్లాదుడు.
ఇలాంటి
దొడ్డ
బుద్ధి
కలిగినవాడు
కనుకనే
యిలాంటి
గొడ్డు
బుద్ధికి
అవకాశము
యివ్వలేదు.
హిరణ్యకశిపుడు
పిలిచాడు.
దగ్గరకు
పిలిచి
తొడపైన
కూర్చుండ
పెట్టుకొని
అనేక
రకములుగా
ప్రశ్నించాడు.
నాయనా
నీవు
చదివిన
చదువులలో
ఏదో
ఒక్క
విషయము
చెప్పమన్నాడు
చదివించిరి
నను
గురువులు
చదివితి
ధర్మార్థ
ముఖ్యశాస్త్రంబులు
నే
చదివినవి
కలవు
పెక్కులు
చదువులలో
మర్మమెల్ల
చదివితి
తండ్రీ!
మోక్షాన్ని
చెప్పలేదు.
ఎందుకంటె
యిది
సత్యమే.
గురువులు
బోధించింది
అదే
ధర్మార్థ
కామములు
మాత్రమే.
అన్ని
అనుభవించుటమే
ధర్మము
అన్నారు.
ఈ
ధర్మము
చేత
అర్థాన్ని
సాధించటము
ఈ
సాధించిన
అర్థమును
కామములో
అనుభవించటము.
ఏదో
ఒకటి
శ్లోకముగా
చెప్పమన్నాడు.
తాను
చక్కగా
కనులు
మూసుకున్నాడు
కమలాక్షు
నర్చించు
కరములు
కరములు
శ్రీనాథు
వర్ణించు
జిహ్వ
జిహ్వ
సురరక్షకుని
జూచు
చూడ్కులు
చూడ్కులు
శేషశాయికి
మ్రొక్కు
శిరము
శిరము
విష్ణు
నాకర్ణించు
వీనులు
వీనులు
మధువైరి
దవిలిన
మనము
మనము
భగవంతు
వలగొను
పదములు
పదములు
పురుషోత్తముని
మీది
బుద్ధి
బుద్ధి
దేవదేవుని
జింతించు
దినము
దినము
చక్రహస్తుని
బ్రకటించు
చదువు
చదువు
కుంభినీధవు
జెప్పెడి
గురుడు
గురుడు
తండ్రి
హరి
జేరుమనియెడి
తండ్రి
తండ్రి.
4
▾
Meaning
Keep
హరి
చేరు
నాయనా
అని
బోధించేవాడు
తండ్రిగాని,
సిరి
సంపాయించు
నాయనా
అని
చెప్పేవాడు
తండ్రి
కాదు.
ఈ
విధముగా
ఒక్క
శ్లోకము
లోపలనే
గురువులకు,
తండ్రులకు,
చదువుకు
అన్నింటికి
కూడా
ఒక
విధమైన
పెద్ద
బాంబు
వేసినట్టు
చేశాడు.
ఒరే
పిచ్చివాడా!
దేవుడు
దేవుడు
హరి
ఎక్కడ
వున్నాడురా
మండిపడ్డాడు.
హిరణ్యకశిపుడు.
వినాశకాలే
విపరీత
బుద్ధి
యింక
రాబోతున్నది.
ఎక్కడ
వున్నాడు
భగవంతుడు.
చిరునవ్వులు
నవ్వుతూ.
ఇందు
గలడందు
లేడను
సందేహము
వలదు
అన్నాడు.
ఎక్కడ
చూచినా
వున్నది
ఒక్కడే.
నీవు
నేను
కేవలము
భ్రాంతులే.
వున్నది
ఒక్కడే
యిక్కడ.
అక్కడ
ఎక్కడ
చూచినా
ఒక్కడే
వున్నాడు.
ఈ
తత్త్వాన్ని
గుర్తించుకోలేని
అంధుడై
పోయినావు
నీవు.
తండ్రి
అనే
మాత్రము
గౌరవము
లేకుండా
చక్కగా
వేదాంత
ప్రబోధ
సలుపుతూ
వచ్చాడు.
మెడబట్టి
అవతలకు
నెట్టాడు
కుమారుని.
ఈ
విధముగా
నారదుడు
బోధిస్తూ
వచ్చాడు
ధర్మరాజుకు.
ధర్మజునికి
చాలా
బాధ
కలిగింది.
పవిత్రమైన
గుణవంతుడు,
గుణశీలుడు
సర్వ
సద్గుణములతో
మహావ్యక్తిగా
వుండిన
యీ
కుమారుని
చూచి
ఆనందించక
యీ
దుర్మార్గుడు
అట్టి
కుమారుని
హింసించుటకు
పూనుకోటము
సరియైనదా!
ఇది
చాలా
అన్యాయముగా
వుంటున్నదన్నాడు.
అప్పుడు
నారదుడు
చెప్పాడు.
సుఖములకు
దుఃఖము
మంచి
చెడ్డ
యివి
రెండు
అభావములతో
కూడి
వుంటాయి.
ఇవి
కేవలము
ఒక
దానికొకటి
ప్రతిబింబములు.
ఇది
లేకుండా
అది
వుండటానికి
వీలుకాదు.
భగవంతునికి
కోపముగాని
యింకే
విధమైన
ద్వేషముగాని
లేదు.
అతనికి
అనుగ్రహము
లేదు
ఆగ్రహము
లేదు.
కేవలము
ఒక
నిలువుటద్దము
వంటివాడు
భగవంతుడు.
నీ
కర్మలే
నీకు
ఆ
reactionగా
వస్తున్నాయి.
కేవలము
ఆ
అద్దము
నుండి
వచ్చే
ప్రతిబింబాలు
అన్నీ
నీవే.
కనుక
నీ
ప్రతిబింబము
అనే
దాన్ని
దోషములంతా
నీలోనే
వుంటున్నాయి.
ఈ
రకముగా
బోధిస్తూ
వచ్చాడు.
ఇంతే
కాకుండా
నారదుడు
ప్రహ్లాదుని
యొక్క
విద్యా
ప్రపత్తులు
గురించి
చక్కగా
వినయమైన
మార్గములో
ప్రబోధిస్తూ
వచ్చాడు.
ఇలాంటి
గొప్ప
బుద్ధులు
రావటానికి
కారణము
యేమిటి?
కేవలము
తల్లితండ్రులవల్ల
కాదు.
ఇతను
లీలావతి
గర్భములో
వుండినప్పుడు
నారదుడు
అనేక
విధములైన
వేదాంతములంతా
బోధిస్తూ
వచ్చాడు.
ఆ
వేదాంతము
యొక్క
భావములంతా
కూడను,
నిండు
చూలాలుగా
వున్నప్పుడు
ఆ
భావములంతా
లోపల
ప్రవేశించాయి.
అందుకోసమే
పూర్వకాలమందు
ప్రాచీన
సాంప్రదాయము
లోపల
గర్భవతులైన
స్త్రీలకు
ఎప్పుడూ
మంచి
కథలు
చెప్పేవారు.
మార్కండేయ
చరిత్ర
ప్రహ్లాద
చరిత్ర
శ్రీరామ
చరిత్ర
యిలాంటి
పవిత్రమైన
కథలు
చెప్పేవారు.
ఇవన్నీ
పోయి
యీనాటి
సంస్కారమంతా
చేరటానికి
కారణము
ఏమిటి?
వారికి
ఎలాంటి
చెడ్డ
భావములు
రాకుండా
నిరంతరము
ఆనందములో
వుల్లాసములో
వుండే
రీతిగా
వారము
వారము
వారికి
యేదో
పండుగలు
చేసేవారు.
ఏ
దుర్భావములు
వారికి
అవకాశము
లేకుండా
వుండేటట్లుగా
నిరంతరము
వారికి
కళ్యాణకరమైన
కథలు
బోధిస్తూ
వుండేవారు.
5
▾
Meaning
Keep
రాక్షస
పత్నియైన
లీలావతికి
కూడను
యీ
నారద
బోధ
వలన
ఆ
హృదయములో
కలిగిన
మార్పు
కుమారునికి
కలిగింది.
ఈనాటి
పిల్లలు
దుర్మార్గముగా
వుండటానికి
కారణం
ఏమిటి?
ఈ
దుర్బుద్ధులలో
ప్రవేశించుటకు
కారణం
ఏమిటి?
ఈ
దురభ్యాసములు
అభివృద్ధి
పరచుకోటానికి
కారణం
ఏమిటి?
ఈ
దుస్సంగములో
చేరటానికి
వుల్లాసపడే
మూలకారణము
ఏమిటి?
అమ్మలు
గర్భములో
వున్నప్పుడు
ఒకటికి
రెండు
సినిమాలు
చూస్తారు.
ఆ
సినిమాల్లో
వున్న
భావాలు
వీళ్లలో
ప్రవేశిస్తాయి.
కనుక
బిడ్డలంతా
సినిమా
బిడ్డలే
పుడుతున్నారు.
ఈ
దుర్గుణములు,
దురాలోచనలు,
దుశ్చింతలు
యివన్నీ
సినిమాల
వలనే
వస్తున్నాయి.
కనుక
వీటికన్నింటికి
మూలకారణము
తల్లితండ్రులే.
అయ్యో
నా
కొడుకు
నా
మాట
వినటం
లేదు.
అయ్యో
నేను
చెప్పినట్టుగా
నడుచుకోటం
లేదే.
కారణం
ఏమిటి?
అమ్మనాన్నలు
మంచిగా
వుంటుంటే
బిడ్డలు
చెడిపోటానికి
అవకాశమే
లేదు.
ఏ
విధమైన
సంస్కారము
లోపల
ప్రవేశిస్తుందో
ఆ
సంస్కారములకు
తగిన
ప్రవర్తన
ప్రారంభమవుతుంది.
కనుక
పునాది
లోపలనే
మార్పు
కలుగుతూ
రావాలి.
మొక్క
సొట్టైతే
చెట్టు
సొట్టగానే
వస్తుంది.
కనుక
ప్రారంభము
నుండి
భారతీయులయందు
యనేక
సంస్కారములు
ప్రారంభమవుతూ
వచ్చాయి.
సంస్కారమంటే
ఏమిటి!
ఏదో
ఒక
నూతనమైన
చట్టము
కాదు.
నూతనమైన
శాసనము
కాదు.
పుట్టినది
పుట్టినట్టుగా
వుండకుండా
వాటికి
సుగుణములను
చేర్చి
మనిషికి
అనుగుణమైన
మార్గములో
ప్రవేశ
పెట్టటము.
దుర్భావములు
దూరము
చేసి
సద్భావములు
పోషించటమే
సంస్కారము.
దుర్గుణములను
దూరము
చేసి
సద్గుణములను
పెంచుకోటమే
సంస్కారము.
ఒక
చిన్న
ఉదాహరణము.
పుట్టిన
ప్రతి
పదార్థము
కూడను
అట్లే
భుజించటానికిగాని
అనుభవించటానికిగాని
వీలుకాదు.
విలువలేని
వస్తువునకు
విలువ
కలిగించటానికి
వీలుగలుగుతుంది.
ఒక
చిన్న
ఉదాహరణము.
వడ్లు
మనము
పండించాము.
కానీ
పండించిన
వడ్లు
అట్లే
మనము
భుజించటానికి
ప్రయత్నించము.
ఆ
పొట్టును
పైన
తీసి,
వాటిని
చక్కగా
పచనము
చేసి
తరువాతనే
రుచికరమైన
పదార్థము
చేర్చి
భుజిస్తున్నాము.
పుట్టినది
పుట్టినట్లుగా
వుంటుంటే
తక్కువ
వెలగా
వుంటుంది.
దానిని
బియ్యముగా
మార్చినప్పుడు
వెల
అభివృద్ధి
అవుతుంది.
వడ్లు
మూట
50
రూపాయలైతే
బియ్యము
మూట
500
అవుతుంది.
దీనికి
సంస్కారము
చేర
ఎంత
విలువ
పెరిగింది
చూడండి.
ఈ
విధముగా
బంగారు
మట్టిలో
పుట్టింది.
రాతిలో
పుట్టింది.
ఇది
ఒక
కల్తీ
బంగారముగా
వుంటున్నాది.
దానిని
పూర్తి
కరగించి
అన్ని
విధముల
పరిశుద్ధము
చేసినప్పుడు
యిది
అపరంజిగా
మారిపోతుంది.
ఈ
అపరంజిగా
మారినప్పుడు
విలువ
అధికమై
పోతుంది.
అదే
విధముగా
ప్రతి
మానవత్వమునకు
పశుత్వము,
దానవత్వము,
మానవత్వము
యీ
మూడు
చేరి
వుంటున్నాయి.
మనము
యీనాడు
దానిని
పవిత్రము
గావించాలంటే
పశుత్వము
నుండి
మానవత్వానికి
రావాలి.
6
▾
Meaning
Keep
మానవత్వము
నుండి
దైవత్వానికి
రావాలి.
కానీ
యీనాటి
విద్యలన్నీ
కూడను
మానవత్వము
నుండి
పశుత్వమునకు
మార్చేస్తున్నాయి.
కనుక
దీనికి
కొన్ని
విధములైన
సంస్కారములు
అత్యవసరము.
ఆ
సంస్కారములు
లేకపోవటం
చేతనే
మానవత్వములో
ఎన్ని
విద్యలు
వుండినప్పటికిని
వారు
కేవలము
అవివేకులుగా
రూపొందుతున్నారు.
కాని
సంస్కారమనేది
పూర్వము
నుండి
పవిత్రమైనదిగా
వుండినప్పుడు
వారికి
యే
సంస్థలయందు
చేరినప్పటికి,
ఎలాంటి
సంఘములో
చేరినప్పటికి
యే
విధముగా
మార్పు
కలుగదు.
ఎలాంటి
మిత్రులతో
కూడను
తాను
మార్పు
చెందడు.
తన
భావమును
మార్చుకోడు.
ఇతర
భావమును
పట్టడు.
ఇదే
సరైన
సంస్కారము.
అలాంటి
సంస్కారము
లేకపోవటం
చేతనే
యిక్కడ
ఒక
విధముగా
అక్కడ
ఒక
విధముగా
మార్పుచెంది
కేవలము
పశువుకంటె
హీనమై
పోతున్నాడు
మానవుడు.
కేవలము
గ్రంథములు
చదివి
కంఠస్థము
చేసి
పరీక్షలలో
మనము
మార్కులు
తెచ్చుకోవచ్చును.
మార్కులవలన
డిగ్రీలు
తీసుకోవచ్చును.
ఈ
డిగ్రీలు
తీసుకున్నంత
మాత్రమున
విద్యావంతులమైపోయినామని
గర్వించరాదు.
కేవలము
అజ్ఞానులమేగాని
విజ్ఞానులము
కాము.
ఇవి
యేనాడు
మనము
సమాజములో
ప్రవేశపెట్టటానికి
అధికారము
లేదు.
కేవలము
ఆ
డిగ్రీ
తీసుకుపోయి
పొట్ట
పోసుకుంటున్నాము.
అదికాదు
మన
విద్య.
నిజమైన
విద్య
లోపలున్న
ఆత్మానందమును
మనము
అభివృద్ధి
గావించుకోవాలి.
మన
ఆనందమంతా
వస్తువులయందో
జగత్తునందో
ప్రపంచమునందో,
సమాజమునందో
లేదు.
మన
పురుషార్థమనేది
కూడను
సమాజములో
లేదు.
సర్వ
సంస్కారములు
మనయందే
వుంటున్నాయి.
మానవుడు
ఆశించే
ఆనందము
తనయందే
వుంటున్నది.
తన
యందున్న
ఆనందమును
విస్మరించి
బయట
ఆనందము
నిమిత్తమై
మనము
ప్రాకులాడుతున్నాము.
బయట
ఆనందము
ఎక్కడ
కూడను
కానరాదు.
తనయందున్న
ఆనందమునే
బయట
నిరూపించి
దానినే
తిరిగి
ఆనందముగా
అనుభవించటానికి
ప్రయత్నిస్తున్నాడు.
మనము
భుజించుచున్నాము.
దీనిలో
ఆనందము
వుంది
అనుకుంటున్నాము.
ఇది
ఎంత
వరకూ
ఆనందము
నిస్తుంది.
కడుపు
నిండేంతవరకు
ఆనందము
నిస్తోంది.
కడుపు
నిండితే
దాని
అసహ్యముగా
నెట్టి
వేస్తాము
దూరముగా.
యివంతా
తాత్కాలికమైన
ఆనందములు.
యిలాంటి
ఆనందము
ఆనందము
కాదు.
నిత్యమైన
సత్యమైన
ఆనందము
ఆత్మానందము.
దీనిని
సంపాయించుకొని
యీ
లౌకికమైన
ఆనందమునకు
ప్రాకులాడు
తప్పు
లేదు.
దానిని
అనుభవించకుండా
కేవలము
అనిత్యము
అశాశ్వతము
అయిన
ఆనందము
కోసం
ప్రాకులాడటం
యిది
అజ్ఞానము
యొక్క
లక్షణము.
ఎన్ని
డిగ్రీలు
మనము
పొందుతున్నాము.
ఈ
డిగ్రీలు
తీసుకున్నందువల్ల
ఫలితము
యేముంటున్నది.
లక్షలు
కోట్లు
సంపాయించవచ్చు.
దీనివల్ల
మనకు
వచ్చే
ఫలితము
యేమిటి?
నేను
సుఖంగా
జీవిస్తాను
అంటాడు.
ఎంతకాలము
జీవిస్తాడు.
కాని
యీ
జీవితము
శాశ్వత
సుఖమును
యిస్తుందా?
ఈ
ధనము
పెరుగుతూ
వుంటుంటే
భయము
మరొకవైపున
వెంటాడుతూ
వుంటుంది.
7
▾
Meaning
Keep
Also in his talks
(10)
6 June 1973
This World and the Next
27 October 1979
Man and Nārāyaṇa
9 January 1988
God in the heart, work in the hands
25 May 1990
Vagaries of the Mind
2 June 1990
Ascent Of Man
6 May 1992
Only one who lives in the oneness of body, mind and Ātma is a human being
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
10 February 2000
The Greatness of the Gāyatrī Mantra
25 December 2002
Cast Off Bad Qualities and Foster Prema
ఈ
భయము
ఒక
వైపున
ప్రయాణము
చేస్తుంటే
వెంట
లోభత్వము
వెంటాడుతుంది.
ఈ
లోభత్వము
చేత
బంధువులుగాని,
మిత్రులుగాని,
భార్యగాని
ఎవరిని
పూర్తి
నమ్మరు.
వీరినే
నమ్మలేనివాడు
దైవమును
యేరీతిగా
నమ్మగలడు.
కట్టకడపటికి
తన
నమ్మకమునే
కోల్పోయి
కేవలము
దుర్బలుడుగా
మారిపోతున్నాడు.
ధనం
కావలసిందే.
ధనము
వుండవలసిందే.
కాని
యేరీతిగా
మనము
సంపాయించాలి.
ఎంతవరకు
మనము
సంపాయించాలి
యీ
యొక్క
రెండు
నియమాలు
కూడా
మనము
పాటించాలి.
ఎంతవరకు
అవసరమో
అంతవరకే
మనము
వుండాలి.
ఏ
విధమైన
మార్గములో
వుపయోగ
పెట్టాలో
ఆ
రీతిగానే
వుపయోగపెట్టాలి.
ధనమెచ్చిన
మదమెచ్చును
మదమెచ్చిన
దుర్గుణములు
మానక
హెచ్చున్
ధనముడిగిన
మదముడుగును
మదముడిగిన
దుర్గుణంబులు
మానును
వేమా!
శంకరాచార్యులు
కూడను
తన
విద్యార్థులైన
పదమూడు
మందిని
తీసుకొని
కాశీకి
వెళ్లాడు.
ఈ
13
మంది
స్నానము
చేయటానికి
గంగకు
వెడుతున్నారు.
ఒక
చెట్టు
క్రింద
కూర్చున్నాడు
ఒక
మహా
విద్వాంసుడు.
అక్కడకు
వెళ్లి
చూచారు.
అతని
కన్నులు
మూసుకున్నాడు.
పాణిని
వ్యాకరణము
చదువుతున్నాడు.
విన్నాడు
శంకరుడు.
నాయనా!
ఏమిటి
నీవు
చదువుతున్నావు
అని
ప్రశ్నించాడు.
గ్రామరు
అభ్యసిస్తున్నాను
అన్నాడు.
ఈ
గ్రామరు
అభ్యసించటం
వలన
నీకు
లభించే
ఫలితము
యేమిటి
అన్నాడు.
ఈ
వ్యాకరణ
పండితుడుగా
నేను
తయారౌతాను
అన్నాడు.
ఈ
వ్యాకరణ
పండితుడైన
దాని
వలన
నీకు
యేమి
ఫలితము
అన్నాడు.
నేను
రాజాస్థానములోకి
వెళ్లి
గొప్ప
కవిగా
రూపొందుతాను
అన్నాడు.
ఈ
కవిత్వము
నేర్చుకోటం
వలన
వచ్చిన
ఫలితము
యేమిటి
అన్నాడు.
రాజు
నుండి
బహుమతులందుకొని
నా
కుటుంబముతో
సుఖముగ
జీవితము
గడుపుతానన్నాడు.
ఈ
సుఖ
జీవితము
ఎంతకాలము
గడుపుతావు
అన్నాడు.
చచ్చేంత
వరకు
యీ
సుఖ
జీవితాన్ని
గడుపుతాను
అన్నాడు.
ఆ
తరువాత
యేమి
చేస్తావన్నాడు.
తెలీదు
అన్నాడు.
పిచ్చివాడా
ధనము
వుండినంతవరకు
చెరువులో
నీరు
వుండినంతవరకు
కప్పలు
ప్రవేశిస్తాయి.
నీవు
ధనము
వుండినంత
వరకు
భార్య
బిడ్డలు
బంధువులు
అందరు
కూడను
నీ
యింట్లో
తిష్ఠ
వేసుకుంటారు.
ధనముడిగెనా
ఒక్కరు
కూడా
కన్నెత్తి
చూడరు.
ధనము
అయిపోతే
భార్యకూడా
గౌరవించదు.
పెట్టింది
తిని
నోరుమూసుకు
ఒక
గదిలో
వుండు
అంటుంది.
కొడుకులు
కూడ
మాట
వినరు.
ఈ
పాటికి
నీవు
పడి
వుండు
పని
మేము
చూసుకుంటామని
అంటారు.
గౌరవ
మర్యాదలు
కూడను
హీనము
చేస్తారు.
ఇదా
నీకు
ధనము
వలన
కలిగే
ఫలితము.
జ్ఞాన
ధనము
సంపాయించుకో
నాయనా!
అన్నాడు
అప్పుడు
ఆ
పండితుడు
చెప్పాడు
8
▾
Meaning
Keep
From
Bhaja Govindam, verse 1
Also in his talks
(10)
22 May 1973
The Deluded Mind and the Liberated Mind
6 October 1989
Do Not Give Up the Name of God
3 September 1990
Devotion and self-sacrifice
15 January 1996
Only one who masters the mind can reach Mādhava
16 June 1996
If the Body Is to Be Pure, Remember the Name of God
7 September 1996
Advaita Is the Principle of the One Ātma
28 May 1998
Not the Man in Form: the Man of Conduct Is Needed
10 September 1998
By Sacrifice Some Have Attained Immortality
15 April 2003
Ancient traditions are the steps to rising higher
25 December 2003
Give up the illusion of the body, and you yourself are God
భజ
గోవిందం
భజ
గోవిందం
గోవిందం
భజ
మూఢమతే.
సంప్రాప్తే
సన్నిహితే
కాలే
నహి
నహి
రక్షతి
డుకృఞ్
కరణే.
ఆనాడు
రక్షించదు
నిన్ను.
ఈ
యవ్వనము
క్షణకాలములో
వదలిపోతుంది.
Passing
clouds
మాదిరి
పోతుంది.
దేహము
తెల్లవారి
విచ్చిన
పూవు
సాయంకాలము
వాడిపోయినట్టుగా
వాడిపోతుంది.
నీ
సిరి
సంపదలు
మెరుపు
మించినట్లుగా
ఒక్క
తూరి
మించుతుంది.
తక్షణమే
darkness
అందిస్తుంది.
కానీ
నిత్యము
మారని
సత్యము
ఒక్కటుంది.
అదే
నిజమైన
ఆత్మానందము.
దానిపైన
లక్ష్యమునుంచుకొని
లౌకికమైన
విద్యలు
నీవు
ఎన్నైనా
నేర్చుకో.
ఇవన్నీ
ప్రాకృతమైన
విద్యలే.
ఒకటి
ప్రవృత్తి
రెండవది
నివృత్తి.
ఈ
ప్రవృత్తి
ఎప్పుడూ
పునరపి
జననం
పునరపి
మరణం.
ఈ
రెండింటిని
అందించేది
ప్రవృత్తి.
కానీ
నివృత్తి
పునర్జన్మ
నవిద్యతే
అనే
మార్గాన్ని
నిరూపిస్తుంది.
పిచ్చివాడా!
నీ
జీవితము
కేవలము
బియ్యము
పైన
husk
వంటిది.
ఈ
husk
వున్నది
ఎక్కడ
పెట్టినా
పునరపి
జననం
పునరపి
మరణం
మొక్కలుగా
పుడుతుంటాయి.
కనుక
యీ
husk
తీసివెయ్యి.
పొట్టుతీసిన
బియ్యముగా
మారుతుంది.
భుజించవచ్చు
ఆనందముగా
అనుభవించవచ్చు
సంపాయించుకోవచ్చు.
కానీ
దీనికి
పుట్టుక
లేదు.
ఇలాంటి
చావు
పుట్టుక
లేనట్టి
సత్యాన్ని
గుర్తించటానికి
నీ
చదువు.
కనుకనే
ఎప్పుడు
తిరిగి
చావటం
పుట్టటం
అయితే
యింక
నేర్చుకునేది
యేమిటి?
ఈ
జీవితమనేది
మీరు
చక్కగా
విచారిస్తే
ఒక
డైలీ
న్యూస్
పేపరు
వంటిది.
ఈనాడు
చూచిన
న్యూస్
పేపరు
రేపటి
దినము
waste
paper
కావాలి.
చదివిన
న్యూస్
పేపరునే
చదివే
మూర్ఖుడు
ఎవరైనా
వుంటారా?
ఒక్కతూరి
మనము
చదివామంటే
waste
paperగా
మారిపోతుంది.
రెండవ
దినము
చదవకూడదు.
తిరిగి
పుట్టటం
చావటం
యీ
రకంగా
వుంటే
ఏమిటిది.
ఆ
waste
paper
మేలు
కొన్ని
పొట్లాలకైనా
పనికి
వస్తుంది.
మన
జీవితము
దానికి
కూడా
పనికి
రాదు.
గుణము
లేని
మానవ
జీవితము
కేవలము
ఒక
మృగము
కంటె
పక్షికంటె
కూడను,
చిన్న
పురుగు
కంటె
హీనమైనది.
హంతకుడు
పక్షిని
కొట్టుకొని
చేతిలో
పెట్టుకొని
తీసుకుపోతుంటే
మాంసాహారి
దాని
వెల
ఎంత
అని
తీసుకుంటాడు.
చేప
చిక్కిందంటే,
కలకత్తాలో
మీకు
బాగా
తెలుసు,
ప్రతి
వారు
చేపలు
చేత్తో
పట్టుకుపోతుంటారు.
దీనికి
కూడా
విలువ
యిచ్చి
కొంటారు.
కానీ
చచ్చిన
మనిషికి
ఎవరైనా
విలువ
యిస్తున్నారా?
చచ్చిన
గోవు
చర్మానికి
విలువ
యిస్తారు.
కాని
మనిషి
చర్మానికి
ఎవరైనా
విలువ
యిస్తున్నారా?
పక్షి
యీకలకు
విలువ
యిస్తున్నారు.
యీ
బొచ్చుకు
ఎవరైనా
విలువ
యిస్తున్నారా?
ఎక్కడుంది
విలువ?
పులిగోరు
వెల
యిచ్చి
కొంటున్నారు.
నీ
గోరు
ఎవరు
కొంటున్నారు?
మృగము
చర్మముతో
చెప్పులు
కుట్టి
ధరిస్తున్నారు.
నీ
చర్మము
చెప్పులకు
కూడా
పనికి
రాదు.
యిలాంటి
మానవ
జన్మమును
యిలాంటి
హీనమైన
స్థితికి
తెప్పించుకోటం!
జీవితమును
సార్థకమైన
సేవ
లోపల
మనము
ప్రవేశపెట్టాలి.
లక్షలు
లక్షలు
సంపాయిస్తున్నాము.
9
▾
Meaning
Keep
సిరి
కోసమా
మనము
పుట్టి
వుండేది.
కాదు.
కాదు
హరి
కోసము
పుట్టాము.
ఆత్మ
భావమే
లేకుండా
అన్న
భావము
వుంటుంటే
వీడు
కేవలము
ఒక
పాపియే.
మానవులము
అన్న
సత్యాన్ని
మీరు
గుర్తించుకోటానికి
ప్రయత్నించండి.
పశువు
కాదు.
పశువువలె
తింటూ
తిరుగుతూ
ఆనందమును
అనుభవిస్తుంటే
మానవత్వానికి
పశుత్వానికి
భేదము
యేమున్నాది.
ఒక
యింటికి
పది
యిండ్లు
కట్టుకోవచ్చు.
ఒక
డ్రస్సుకు
పది
డ్రస్సులు
సంపాయించుకోవచ్చు.
ఒక
కారుకి
పది
కారులు
సంపాయించుకోవచ్చు.
చచ్చిపోయేటప్పుడు
ఒక
కారు
వస్తుందా,
ఒక
డ్రస్సు
వస్తుందా
నీవెంట
వచ్చేవి
నీ
పుణ్యపాపములు
రెండే.
ఆనాడు
ఏడ్చుకుంటూ
కూర్చుంటే
ప్రయోజనము
లేదు
కనుక
నీవు
చదివిన
చదువులన్నియు
సార్థకము
గావించుకొనే
మార్గములో
ప్రవేశపెట్టాలి.
ఈ
ప్రహ్లాదుడు
ఒకనాడు
సర్వసంగ
పరిత్యాగియై
యీ
జగత్తు
లోపల
వుండే
సత్యాన్ని
గుర్తించాలని
మంత్రులతో
ప్రయాణమైపోయాడు.
ఈ
జడమైన
జగత్తునందు
చైతన్యమైన
తత్త్వము
ఎక్కడైనను
కనిపిస్తుందా
అన్నాడు.
కావేరినది
సమీపమందు
అనేక
కొండల
మధ్యలో
ప్రయాణము
చేస్తున్నాడు
నడకలో.
అక్కడ
ఒక
వ్యక్తి
సమాధి
నిష్ఠుడై
పడిపోయాడు.
రూపము
సరిగా
కనిపించటం
లేదు.
దుమ్ముతో
ధూళితో
కప్పబడి
వుంది.
కొండచిలువ
కదులుతుందేమోగాని
యీ
వ్యక్తి
కదలలేదు.
ఆ
విధముగా
స్తంభింపబడిపోయినాడు.
ప్రహ్లాదుడు
ప్రశ్నించాడు.
మహానుభావా!
ఎన్ని
సుఖములలోనో,
ఎన్ని
ఆనందములలో,
ఎన్ని
సౌఖ్యములలో
వుండే
మానవునకు
యీ
విధముగా
నిశ్చింతగా
వుండే
స్థితి
కలుగదు.
ఈ
త్యాగములోనే
నీకింత
భోగము
కలుగుతున్నాది.
నీ
పేరేమిటి!
అతనే
అజగరుడు.
అజగరుడు
చెప్పాడు.
నాయనా!
నా
పేరు
అజగరుడు.
నేను
నీవలె
గొప్ప
భోగాలు
ఆనందాలు
అనుభవించాను.
దాంట్లో
సత్యమైన
సుఖము
లేదనుకున్నాను.
ఏ
విధమైన
ఆనందము
కలిగినా
దానికి
విరుద్ధమైన
దుఃఖము
వెంటాడుతూనే
వుంటుంది.
అణుమాత్రము
ఆనందము.
ఘనమాత్రము
దుఃఖము.
అనంతమైన
దుఃఖాన్ని
అనుభవించాను.
కానీ
యీనాడు
నా
సర్వస్వము
దైవానికి
అర్పితము
గావించుకున్నాను.
ఈనాడు
నేను
అనుభవించే
ఆనందము
నేను
యేనాడు
అనుభవించలేదు.
లేదనే
బాధ
లేదు.
అహం
లేదు.
వద్దని
అయిష్టము
లేదు.
కావాలని
ఆశ
లేదు.
తన
యిష్టము
ఎట్లనో
అట్లనే
జరుగనీయి.
ఈ
విధమైన
స్థితిలో
నేను
వుండటం
వలన
నేను
నిరంతరము
ఆనందమును
అనుభవిస్తున్నాను
అన్నాడు.
అలాంటి
సత్యమును
గుర్తించటానికి
ప్రయత్నించినవాడు
ప్రహ్లాదుడు.
జగత్తులో
యీ
విధమైన
భగవదనుగ్రహము
ధనముతో
లభించేది
కాదు.
విద్యలతో
వచ్చేది
కాదు.
అధికారముతో
స్వాధీనము
చేసుకునేది
కాదు.
కనుకనే
కేవలము
సత్కర్మల
చేతనే
పొందటానికి
వీలవుతుంది.
ఎక్కడకు
పోయినప్పటికిని
నేను
మానవుడను
అనే
భావము
మరచి
పోకూడదు.
నేను
పశువు
కాదు.
నేను
మాస్టరు.
నేను
slave
కాదు.
ఇతరుల
మాటలంతా
నమ్మి
అందులో
ప్రవేశించటానికి
నేను
బానిస
కాదు.
10
▾
Meaning
Keep
నా
conscious
నేను
follow
చెయ్యాలి.
నా
సత్యాన్ని
నేను
గుర్తించాలి.
నా
ప్రతిజ్ఞను
నేను
పాటించాలి.
నా
వాక్కును
నేను
నిలబెట్టుకోవాలి.
ఈ
రకమైన
దీక్షలో
వుండినవాడే
నిజమైన
మానవుడు.
నీ
యొక్క
వాక్కు
నీ
యిష్టము
వచ్చినట్టు
మార్చుకోటము,
నీ
మనస్సును
మరింత
చంచలముగా
మార్చుకోటము
మానవత్వము
నిర్మూలము
చేసుకోటము,
పశుత్వము
పెంచుకోటము,
దైవత్వము
విస్మరించటము,
దానవత్వాన్ని
స్వీకరించటము
యిది
యీనాటి
చదువు.
ఇది
కాదు
చదువు
సంబంధము.
ఈ
సరైన
చదువు
చెప్పించే
నిమిత్తమై
నేను
యీ
విద్యాసంస్థలు
స్థాపించితిమేగాని
ఏదో
వ్యాపార
రంగమైన
దీనితో
మేము
ప్రారంభించలేదు.
సత్యసాయి
విద్యాసంస్థలు
సత్రాలుగాని,
చావళ్లుగాని
కాదు.
ఏదో
వచ్చిపోటం,
వచ్చి
నేర్చుకోటం,
నేర్చుకొని
డిగ్రీలు
తీసుకోటం
వెళ్లిపోటం
కాదు.
అందుకోసమే
పిల్లల
నుండి
నయాపైస
మేము
అందుకోటం
లేదు.
మేమే
యిచ్చి
వారికి
బోధిస్తున్నాము.
కనుక
మా
ఆశయాలకు,
మా
పవిత్రతకు
మా
యొక్క
mannersకు,
మా
యొక్క
behaviourకు,
మా
disciplineకు
మీకు
సమ్మతంగా
వుంటే
మీరు
వుండవచ్చు.
మేము
ఎవ్వరిని
బలవంతముగా
కోరటం
లేదు.
అట్లు
లేని
వారిని
క్షణము
కూడను
మేము
పెట్టుకోము.
కారణమేమంటే
మేము
యిలాంటి
పిల్లలను
తయారుచేసే
సంస్థగా
మేము
మార్చుకోకూడదు.
ఇద్దరు
పిల్లలు
చిక్కినా
మాకు
చాలు.
ఆదర్శప్రాయులుగా
వుండాలి.
ఎక్కడకు
వెళ్లినా
యీ
సంస్థ
యొక్క
పేరును
చక్కగా
నిలబెట్టేవారుగా
వుండాలి.
తనకు
గౌరవము
సంస్థకు
గౌరవము
అందించేవాడుగా
వుంటుండాలి.
ఇంత
కాదు
తల్లితండ్రులకు
తగిన
బుద్ధి
నేర్పాలి.
తల్లితండ్రులు
నీకు
విరుద్ధమైనది
బోధిస్తే
నాన్నా
యిది
సరియైనది
కాదు
దీంట్లో
యీ
సత్యము
వుంది
స్వామి
బోధించేది
మా
మంచి
కోసమేగాని
చెడ్డకు
కాదు
అని
వారికి
కూడను
నేర్పటానికి
తగిన
సిద్ధులుగా
వుండాలి.
ఒక్క
ప్రహ్లాదుడు
చిక్కితే
కూడా
మాకు
చాలు.
ఆ
విధముగా
తండ్రికి
బోధించినవాడు
ప్రహ్లాదుడు.
తండ్రీ
నీ
భావములు
చాలా
చెడ్డవి.
నీ
ఆశలు
కేవలము
కుమారుని
నాశనం
చేసేందుకు
పుట్టినవి.
నిజంగా
నీవు
తండ్రివైతే
కుమారుని
క్షేమము
కోరాలిగాని
కుమారుని
దుర్మార్గం
యేమాత్రము
అభివృద్ధి
చేర్చకూడదు.
నేను
సత్యమైన
మార్గమును,
సరియైన
మార్గమును
అనుసరిస్తున్నాను.
దీనికంటె
పవిత్రమైనది
మరొకటి
లేదు.
ఆ
విధమైన
ధైర్యముతో
వారికి
బోధించటానికి
తగిన
కృషి
చెయ్యాలి.
అట్లు
వుండినప్పుడే
దేశము
కూడా
బాగుపడుతుంది.
అట్లు
కాకుండా
అటు
యిటు
గడియారము
పెండ్యులము
మాదిరి
తిరుగుతే
నీవు
దేశానికి
తగిన
వ్యక్తివి
కానేరవు.
కనుక
మనయొక్క
వేష
భాషలయందుగాని,
మన
నడతలయందుగాని,
మన
మాటలయందుగాని,
అన్నింటి
యందు
మనము
ఆదర్శవంతమైన
విద్యార్థులుగా
తయారు
కావాలి.
కాకపోతే
యీ
విద్యలన్ని
నిరుపయోగము.
మన
భారతదేశములో
లేని
విద్యలు,
భారతదేశములో
లేని
పవిత్రతలు
యే
దేశములో
కూడా
లేవు.
కేవలము
బిడ్డలను
beggarsగా
మార్చి
వేస్తున్నారు
తల్లితండ్రులు.
11
▾
Meaning
Keep
Also in his talks
(3)
15 September 1986
The inner meaning and greatness of the festival of Onam
8 October 1986
Bhakti means perfect Prema fostered for God
2 June 1991
Vijnana and Dharma
ఇష్టము
వచ్చినట్లంతా
పోవటము,
పంపించటము
వారు
పాడైపోయి
వచ్చిన
తరువాత
కంటిధారలు
కార్చుకుంటూ
విచారించటము.
కనుక
పిల్లలు
చేసే
ప్రతి
పని
కూడను
మెచ్చుకునే
తల్లితండ్రులు
సరియైన
వారు
కాదు.
చెడ్డ
పనులను,
దుర్మార్గమును,
దుశ్చింతలను
దురాలోచనలను
పెంచేటువంటి
తల్లితండ్రులు
ఎలాంటి
తల్లితండ్రులంటే
ధృతరాష్ట్రుని
వంటివారు.
కుమారుని
అభివృద్ధికి
అడ్డు
తగిలేవారు
కేవలము
హిరణ్యకశిపుని
వంటివారు.
ఈనాడు
కలియుగము
లోపల
హిరణ్యకశిపుని
వంటి
తల్లితండ్రులు
ధృతరాష్ట్రుని
వంటివారు
తయారౌతున్నారు.
కనుక
యీనాటి
విద్యార్థులందరు
కేవలము
నిరుపయోగులుగా
మారిపోతున్నారు.
ఎక్కడకుపోయినా
కూడను
విద్యార్థుల
యొక్క
అలజడులు
ఎంత
అశాంతిని
కలిగిస్తున్నాయి.
దీనికి
మూలకారణము
తల్లితండ్రులే.
ధృతరాష్ట్రులు,
హిరణ్యకశిపులుగా
తయారైపోతున్నారు.
ఇంకా
కొంతమంది
తల్లులు
కూడను
మంధర
కైకేయి
మాదిరి
అయిపోతున్నారు.
ఇలాంటి
తల్లితండ్రులు
వుంటుంటే
వారికి
బుద్ధులు
నేర్పేవారుగా
తయారు
కావాలి.
ఆ
విధముగా
మార్చినవాడే
ప్రహ్లాదుడు.
మహా
భాగవతమందు
అంతకంటె
గొప్ప
గాథ
మరొకటి
లేదు.
సప్తమ
స్కందములో
వుండినది
ప్రహ్లాద
చరిత్ర.
ఆ
ప్రహ్లాదుని
విద్య,
ప్రహ్లాదుని
నడత,
ప్రహ్లాదుని
బోధ,
ప్రహ్లాదుని
పవిత్రత
ఎన్ని
కష్టములు
వచ్చినప్పటికిని
యేమాత్రము
దుఃఖించలేదు.
విచారించలేదు.
నాన్నగారు
యేమంటారో
యేమో
అమ్మగారు
యేమంటారో
యేమో,
నాన్నగారు
బయటకు
పంపిస్తారో
యేమో
యీ
భయములో
వుండటం
మంచిది
కాదు.
ఏమైనా
అవనీ
ప్రాణంపోనీ
మనము
సత్యానికి
ప్రాణము
యివ్వాలి.
సత్యానికి
మన
జీవితము
అంకితము
గావాలి.
అంతేగాని
ప్రాణం
పోతే
పోతుంది.
ఎప్పుడో
ఒక
తూరి
ప్రాణం
పోవలసిందే.
ప్రాణము
యేనాటికైనా
పోవలసిందే.
కాని
సత్యానికి
మనము
అర్పితము
చేద్దాము.
ప్రహ్లాదుని
ఎన్ని
కష్టాలు
పెట్టాడు
హిరణ్యకశిపుడు.
కాని
ఒక్కదానికైనా
తాను
చలించలేదు.
హరిని
తలచుకుంటూ
ఆనందముగా
కాలము
గడిపాడు.
గురువులు
వచ్చి
చెప్పారు
హిరణ్యకశిపుని
దగ్గర.
తన్ను
నిశాచరులు
పొడవ
దైత్య
కుమారుడు
మాటి
మాటికో
పన్నగశాయి!
యోదనుజభంజన!
యో
జగదీశ!
యో
మహా
పన్న
శరణ్యా!
యో
నిఖిల
పావన!
యంచు
నుతించుగాని
తా
గన్నుల
నీరు
తేడు
భయ
కంప
సమేతుడుగాడు
భూవరా!
ఒక్కొక్క
తూరి
కొడుతున్నప్పుడు
అబ్బా
అబ్బా
అని
అనలేదు.
హరి
హరి
అన్నాడు.
కంట
నీరు
తేలేదు.
ఆనందములో
చిరునవ్వుతో
వున్నాడు.
భయము
లేదు.
ఏమాత్రము
అతని
ముఖములో
ఎందుకోసం
తన
హృదయము
నిండుకు
భగవన్నామం
నిండి
వుంటున్నాది.
నామము
వున్న
చోట
భయమునకు
అవకాశము
లేదు.
భయము
ఎక్కడ
వుందో
అక్కడ
తప్పు
వుంది.
ఆ
దోషము
లేని
సమయములో
భయమునకు
అవకాశము
లేదు.
కనుక
నీవు
దోషరహితుడుగా
వుండినప్పుడు
నీలో
యేమాత్రము
భయము
రాదు.
స్వామి!
మేము
బలహీనులము
మాకు
శక్తి
నివ్వండి
అన్ని
విధములా
మంచిగా
నడిపించండి
అని
కోరుకోటం
కూడా
పెద్ద
బలహీనమే.
12
▾
Meaning
Keep
మనం
weak
అనే
భావమునకు
చోటు
యివ్వకూడదు.
మనం
కేవలం
పులి
పిల్లలము
కావాలిగాని
పిల్లి
పిల్లలుగా
మనం
భావించరాదు.
కనుక
ఆ
విధమైన
ధైర్యముతో
ముందంజ
వేయాలి
సమాజములో.
అప్పుడే
మనము
విజయమును
సాధించగలము.
దీనికి
ధైర్యము
కావాలి.
బలహీనమంటావు
మిగతావన్ని
చేస్తున్నావు
దానికి
ఆ
బలము
ఎక్కడ
నుండి
వస్తుంది.
విరుద్ధమైన
మార్గములో
ధైర్యముగా
ప్రవేశిస్తున్నావే
నీకీ
ధైర్యము
ఎక్కడ
నుండి
వస్తుంది.
కాబట్టి
ధైర్యము
వుంది
కాని
దానిని
misuse
చేస్తున్నావు.
misuse
చేయటంచేత
కొన్ని
విధములైన
దురభ్యాసములకు
గురైపోతున్నారు.
భగవంతుడు
శక్తినిచ్చి
చేయించుకోటానికి
తనకేమి
అవసరం
లేదు.
నీ
నిమిత్తమై
నీవు
చేయవలసిందేగాని
నా
నిమిత్తము
కాదు.
నీవు
మంచివాడవైతే
నీకు
గొప్ప
కీర్తి
వస్తుందిగాని
నాకోసం
కాదు.
స్వామి
యేనాడు
కూడను
తనకోసం
ఆశించడు.
మీరు
మంచి
పేరు
తెచ్చుకోవాలి.
గుణవంతులు
కావాలి.
మన
దేశమునకు
మీరు
ఆదర్శప్రాయులుగా
నిల్చాలి.
అదే
నేను
కోరేదిగాని
నాకు
యేమాత్రము
ఆశ
లేదు.
స్వామి
ఆశయాలకు
తగినట్టుగా
మిమ్మల్ని
తయారు
చెయ్యాలనేదే
నాకు
యే
ఆశలు
లేవు.
మీ
మంచియే
నా
ఆశయము.
మీ
పవిత్రమైన
మార్గమే
నా
ఆశయము.
అంతేగాని
నాకు
ప్రత్యేకమైన
ఆశయములు
ఒక్కటీ
లేవు.
నీవు
మానవుడుగా
పుట్టావు.
నీకు
స్వతంత్రము
వుంటున్నది.
నీలో
ఆత్మ
వుంటుండాది.
నీ
ఆత్మ
సంబంధమైన
మార్గాన్ని
నీవు
అనుసరించు.
అదియే
స్వధర్మము.
అదే
ఆత్మధర్మము.
స్వధర్మమంటే
బ్రాహ్మణ
ధర్మమో,
క్షత్రియ
ధర్మమో,
వైశ్య
ధర్మమో
శూద్ర
ధర్మమో
కాదు.
స్వధర్మ
అదే
ఆత్మ
ధర్మము.
పరధర్మము
అనగా
యితరులను
అనుసరించటము.
పరులను
అనుసరించటము
వద్దు.
నీ
యొక్క
కాంక్షస్సు
నీవు
అనుసరించు.
అదే
స్వధర్మము.
ఏ
ఒక్కటి
నీవు
చేయాలనుకున్నప్పటికి
నీవు
question
వేసుకో.
మంచిదా
చెడ్డదా
యీ
కార్యము
నేను
చేస్తే
స్వామి
సంతోషిస్తాడా
కోప్పడతాడా,
యీ
పని
చేయటం
స్వామికి
సంతోషమా
కాదా
యీ
విధముగా
ప్రశ్నించుకుంటే
అక్కడే
నీకు
answer
చిక్కుతుంది.
స్వామి
కోరేది
అంతా
కూడను
మంచి
పేరు
తెచ్చుకోవాలి.
మంచి
నడతతో
వుంటుండాలి.
మంచి
భావాలు
పెంచుకోవాలి.
సమాజమునకు
మంచినందించాలి.
అంతేగాని
చెడ్డ
మార్గములో
నీవు
ప్రవేశించమని,
చెడ్డ
మార్గమే
నీయొక్క
జీవిత
లక్ష్యమని
ఏనాడు
స్వామి
బోధించటం
లేదు.
ఇలాంటి
సత్యాన్ని
గుర్తించుకుంటే
చాలు.
ఒకరు
ఏకాంతముగా
కూర్చొని
స్వామి
చెప్పినది
మనకు
మంచిదా
చెడ్డదా
అని
నీకు
నీవే
ప్రశ్నించుకో.
నీ
ఆత్మనే
నీకు
సరియైన
answer
యిస్తుంది.
అది
మంచిది
అని
తెలిసినప్పుడు
యితరుల
మంచిని
నీవు
ఎందుకు
అనుసరించాలి.
ఇతరులను
అనుసరించేవాడు
slave.
నీ
consciousకు
నీవు
ద్రోహము
చేస్తున్నావు.
నీవు
దైవద్రోహివై
పోతున్నావు.
బయటవారు
ఎవరు
నీ
మిత్రులు,
జేబులో
పైసా
వున్నంతవరకే
నీకు
మిత్రులు.
నీ
క్లాసులో
కలసి
చదివేంతవరకే
మిత్రులు.
తరువాత
ఎవరికి
ఎవరు.
ఎవరు
ఎక్కడ
వుంటారు.
13
▾
Meaning
Keep
ఎవరితో
ఎవరికి
సంబంధము
లేదు.
ఏనాటికి
నీ
సంబంధము
వదలని
వాడు
దైవము
ఒక్కడే.
తల్లి
దూరముగా
వచ్చు.
తండ్రి
దూరముగావచ్చు.
పుత్రులైనా
దూరముగావచ్చు.
భార్యయైనా
దూరముగావచ్చు.
భర్త
దూరముగావచ్చు
భగవంతుడు
దూరము
కాడు.
కనుక
నిత్యసత్యమైన
దివ్యత్వాన్ని
దూరము
చేసుకొని
మిగతావారంతా
బంధుత్వమనుకుంటే
నిజమైన
బంధుత్వము
కానే
కాదు.
కనుక
నీ
సత్యాన్ని
నీవు
అనుసరించు.
భారతీయ
సంస్కృతిలో
సత్యంవద,
ధర్మంచర
రెండే
రెండు
ప్రధానమైన
నేత్రాలు.
ఏ
మతమైనా
ఏ
కులమైనా,
ఏ
తెగయైనా
విరుద్ధముగా
చెప్పటానికి
ఎవరికీ
అధికారము
లేదు.
మీరు
సంకుచితమైన
మార్గములో
ప్రయాణము
చేయకండి.
మానవ
కులమనే
దానిని
పెంచుకోండి.
ఈ
మానవతా
విలువలు
పెంచుకోండి.
అంతేగాని
మన
హాస్టలులో,
మన
కాలేజీలో
వుండినంత
వరకు
ఒక
రీతిగా
నాటకం
ఆడటం,
బయటకు
పోతూనే
యింకొక
రీతిగా
పోవటము
యీ
విధమైనది
మీకే
చెడ్డ
అవుతుందిగాని
నాకేమాత్రము
చెడ్డ
కాదు.
ఇంత
కాలము
యిక్కడ
వుండి
స్వామి
కాలమును
స్వామి
ప్రేమను,
స్వామి
దయను
యింత
అనుభవించి
మీరు
కేవలము
చెడ్డ
పేరును
తెచ్చుకోటానికి
ప్రయత్నిస్తున్నారే
అనేదే
నా
బాధ.
చెడ్డ
పేరును
తెచ్చుకోకండి.
చెడ్డ
ప్రవర్తన
మీరు
చేయకండి.
చెడ్డ
సంఘాన్ని
మీరు
చేరకండి.
ఈ
విధమైన
మార్గములో
వుంటే
మీరు
గొప్ప
కీర్తి
సంపాయించుకున్న
వారౌతారు.
అదే
నిజమైన
చదువు.
text
books
చదువుకోటం
గొప్ప
కాదు.
డబ్బు
లేకపోయినా
మంచిదే
యింటి
యింటికిపోయి
భిక్షము
ఎత్తైనా
జీవించవచ్చునుగాని
అందులో
గౌరవము
వుంటున్నాది.
నీవు
ఎంత
గొప్ప
అధికారియైనప్పటికిని
యేదో
నీ
అధికారము
గురించి
వచ్చి
నమస్కారము
అనవచ్చు.
బయట
తట్టుపోయి
యిట్లాంటివారు
అట్లాంటివారు
అని
చెప్పుతుంటారు.
నీకు
యిచ్చే
నమస్కారము
దుడ్డు
కోసము
యిస్తున్నారుగాని
మానవత్వం
కోసం
యివ్వటం
లేదు.
మానవతా
విలువలు
లేకుండా
ఎన్ని
చదువులు
చదివి
యేమి
ప్రయోజనము.
ఈ
మానవతా
విలువలు
లేనివాడు
మనిషి
కాదు.
గొప్ప
కోటీశ్వరుడు
కావచ్చు.
ప్రైమినిష్టరు
కావచ్చు
పెద్ద
ప్రెసిడెంటుగావచ్చు.
ఒక్కతూరి
foot
ball
పైకి
ఎగిరి
క్రింద
పడినట్టుగా
పడి
పోతుంది.
సమాజములో
మనము
గౌరవము
సంపాయించుకోవాలి.
సమాజములో
మంచి
పేరు
తెచ్చుకోవాలి.
ఎంత
పీడించి
పీడించి
డబ్బు
సంపాయించుకొని
గొప్పవాడమనుకున్నామంటే
అది
గొప్పతనమే
కాదు
హీనస్థితి.
దాంట్లో
యేమాత్రము
అర్థం
లేదు.
మంచి
పేరు
తెచ్చుకోండి.
ఎక్కడ
పోయినా
చదువు
మానినా
చదువుకుంటూ
వుండినా
బయటకు
పోతూనే
యిష్టము
వచ్చినట్లుగా
ప్రవర్తించకూడదు.
దురభ్యాసాల్లో
ప్రవేశించకూడదు.
పోతూనే
త్రాగటాలు
సిగరెట్లు
బీడీలు
ఎన్ని
విధములుగానో
వుంటుంది
బయట
students.
వీరు
స్టూడెంట్సు.
కాదు.
కాదు
స్టుపిడ్సు.
అలాంటి
stupids
యిక్కడ
వుండటానికి
వీలు
లేదు.
ఎవరైనాసరే
టీచర్సు
అయినాసరే
వార్డెను
అయినాసరే
యింకెవరైనా
సరే
క్లాసు
లోపల
సరియైన
క్రమశిక్షణతో
మెలగకుండాపోతే
తక్షణమే
వాని
సామానుతో
బాటు
బయటకు
పంపించాలి.
14
▾
Meaning
Keep
ప్రార్థనా
సమయానికి
సకాలంలో
అందరూ
వచ్చి
చేరాలి.
భోజన
సమయం
లోపల
అందరూ
ఒక్కతూరి
కూడాలి.
సమిష్టి
భజన,
సమిష్టి
పూజ
అందుకోసమనే
బుద్ధుడు
చెప్పాడు
సమ్యక్
దృష్టి,
సమ్యక్
వాక్కు,
సమ్యక్
శ్రవణం,
సమ్యక్
కర్మ
అదే
సహజమైన
మార్గమన్నారు.
అంతేగాని
ఒక్కొక్కరు
ఒక్కొక్కతూరి
పోకూడదు.
స్కూలుకు
అందరూ
ఒక్కతూరి
పోవాలి.
అందరూ
ఒక్కతూరి
భోజనశాలలో
ప్రవేశించాలి.
విద్యాలయమని
ఒక్కటి
మాత్రమే
కాదు.
నాలుగు
ఆలయాలు
వుంటున్నాయి.
ఒకటి
విద్యాలయము,
రెండవది
వైద్యాలయము,
మూడవది
భోజనాలయము
నాల్గవది
ఏమిటి
తెలుసునా
దేవాలయము.
దేవాలయము
బయట
కాదు
వుండేది.
తనలో
వుంటున్నది.
ఆ
దేవాలయమును
మాత్రము
వదలకుండా
యీ
ఆలయము
లోపల
మాత్రము
సకాలములో
సక్రమమైన
రీతిలో
discipline
అనుసరించి
నడుచుకోవాలి.
discipline
లేక
యేమి
ప్రయోజనం.
తండ్రి
అంటే
గౌరవము
లేదు.
తండ్రి
కొడుకు
ప్రెండ్సు
మాదిరి
వుంటుంటారు.
ఆ
తండ్రికి
సిగ్గు
లేదు
కొడుక్కి
సిగ్గు
లేదు.
ఈనాడు
ఆధునిక
విద్యలోపల
పెద్ద
freedom
అని
అనుకుంటున్నారు.
freedom
కాదు
deaf
and
dumb.
మూర్ఖత్వము.
కొడుకు
తండ్రిని
చూస్తే
గౌరవముగా
అన్ని
విధములా
అణగి
మణగి
వుండాలి.
అలాంటిది
లేని
కొడుకును
shoot
చేసినా
తప్పు
లేదు.
అలాంటి
కొడుకులు
వుండకూడదు.
అలాంటి
కొడుకులుగా
తయారు
చేయకూడదు
తండ్రులు.
అప్పుడే
నిజమైన
భారతదేశము
నిజమైన
భారతదేశముగా
నిలుస్తుంది.
ప్రాచీన
సాంప్రదాయమునకు
తగినట్లుగా
నిలుస్తుంది.
ఆ
నీతి,
నిజాయితీలు
రెండు
లేకపోతే
యేమి
ప్రయోజనము.
ఛీ!
ఛీ!
అది
యేమాత్రము
పనికిరాదు.
మన
Institute
పిల్లలంతా
గౌరవాన్ని
నిలుపుకోవాలి.
ఇంటికి
పోతూనే
తల్లితండ్రులకు
వినయ
విధేయతలు
చూపించాలి.
చూపించటమే
కాదు
మెలగాలి
ఆ
రీతిగా.
ఈనాడు
నీ
తల్లితండ్రులకు
తగిన
గౌరవమిస్తే
రేపు
నీ
బిడ్డలు
నీకు
గౌరవమిస్తారు.
కన్న
తల్లితండ్రులకే
గౌరవమివ్వలేని
బిడ్డలు
వీరు
ఎందుకు
పుట్టారు.
కనుక
వీరు
బిడ్డలుగారు.
బిడ్డలను
యెట్లా
పెంచాలని
తెలుసుకొని
బిడ్డలను
కనండి.
లేకపోతే
ఎందుకు.
పందికూడా
పది
పందులు
పుడుతున్నాయి.
ఒక్కతూరి.
ఏమి
ప్రయోజనం.
అవే
యింకా
మేలు
తల్లిని
అనుసరించి
పోతుంటాయి.
ఈనాటి
మానవుడు
తల్లిని
అనుసరించడు
తండ్రిని
అనుసరించడు.
పందికంటె
హీనమై
పోతున్నారు.
అలాంటి
చెడ్డనేమాత్రము
తెచ్చుకోకండి.
సత్యసాయి
యినస్టిట్యూట్
చదివే
పిల్లలందరు
కూడను
సరైన
నీతి
నిజాయితీలతో
మెలగాలి.
మన
behaviour
సరిగా
వుంటుండాలి.
మన
manners
సరిగా
వుంటుండాలి.
discipline
సరిగా
వుంటుండాలి.
యీ
మూడు
లేక
man
కాదు.
The
Proper
Study
of
mankind
is
man.
ఎంత
వుంటే
అంత
చాలు
మనకు.
గౌరవంగా
బ్రతకాలి.
మన
గౌరవము
ధనముతో
వచ్చేది
కాదు.
గుణముతో
వచ్చేది.
గుణపోషణ
చెయ్యాలి.
కాని
ధనపోషణ
కాదు.
15
▾
Meaning
Keep
గుణమును
పెంచుకోటానికి
తగిన
ప్రయత్నము
చెయ్యాలని
నేను
ఆశిస్తున్నాను.
దీనికి
తగిన
ప్రోత్సాహ
వుత్సాహములు
గురువులు
కూడను
వారు
ఆచరించి
వారు
కూడ
తగిన
ప్రబోధలు
చేయటానికి
కంకణము
కట్టుకోవాలి.
నిజముగా
మీరు
గ్రంథములో
వున్న
పాఠములు
చెప్పటము
కాదు
గొప్పతనము.
తెల్లవారి
మొదలు
రాత్రి
వరకు
వీరి
నడత
ఎట్లా
వుంది,
వీరి
వేషాలు
ఎట్లా
వున్నాయి,
వీరు
యే
విధమైన
study
చేస్తున్నారు
దానిపైనే
మీరు
చక్కని
concentration
చేస్తే
అదే
నిజమైన
teaching.
ఏ
విధంగా
మాటాడుతున్నారు.
ఏ
విధంగా
నడుస్తున్నారు.
ఏ
విధంగా
చదువుతున్నారు,
ఏ
విధంగా
తింటున్నారు
యివన్నీ
కూడను
teachers
watch
చెయ్యాలి.
daily
హాల్లో
పిల్లలు
భోజనము
చేస్తుంటే
కుక్కపిల్లలు
తింటునట్లు
తింటున్నారు.
ఆ
తినేది
కూడను
విద్యనే.
అది
కూడను
చక్కగా
నేర్పించాలి.
క్రింద
పడకుండా
అన్నం
వేస్టు
కాకుండా
చక్కగా
నమిలి
తినాలని
వీరికి
బోధించాలి.
మనుష్యులు
భుజించినట్లు
భుజించాలి.
కుక్క
భుజించినట్లు
భుజించకూడదు.
పరిశుద్ధముగా
వుంటుండాలి.
మనము
భోజనము
చేసిన
చోటుకూడా
పరిశుద్ధముగా
వుండాలి.
మన
bath
rooms
కూడను
చక్కగా
పరిశుద్ధముగా
వుండాలి.
మనము
బహిర్ముఖముగా
ఎంత
శుభ్రముగా
వుంటామో
లోపల
కూడ
అంత
శుభ్రముగా
వుండాలి.
మన
లోపల
సరియైన
శుద్ధము
లేకపోవటం
వల్లనే
బయట
కూడా
అశుద్ధిగా
వుంటున్నది.
Reflection
of
inner
being.
పైతట్టు
బాగా
చక్కగా
డ్రస్సులు
వేస్తాం.
లోపల
స్నానాలు
కూడా
చేయం.
చాలా
తప్పు
దీనివల్ల
dirty
thoughts
అంతా
develop
అవుతాయి.
ఎందుకంటే
లోపల
dirtyగా
వుంటున్నది.
ఆరోగ్యమైన
దేహములో
ఆరోగ్యమైన
గుణములు
పుడుతూ
వుంటాయి.
మనము
పండ్లు
తోముకోటం
కూడా
పరిశుద్ధముగా
వుంటుండాలి.
చక్కగా
పరిశుద్ధముగా
వుంటే
యింకా
పది
తూర్లు
వానితో
మాట్లాడ
బుద్ధి
అవుతుంది.
కాని
వారు
బ్రష్
చేయకుండా
పోతే
వాడు
యిట్లా
వస్తే
మనము
యిట్లా
పోవాలి.
శుభ్రత
ఆరోగ్యమునకు
గుర్తు.
కనుకనే
ప్రతి
ఒక్క
విషయములో
పరిశుద్ధముగా
వుంటుండాలి.
అప్పుడే
చిత్తశుద్ధి
కలుగుతుంది.
ఎక్కడ
చూచినా
గలీజుగా
వుంటుంటే
చిత్తము
యేమాత్రము
గలీజు
కాకుండా
వుంటుందా.
తలకు
కూడా
తగిన
సంస్కారము
చేసుకోవాలి.
oil
పెట్టాలి.
student
గా
వున్నాం
ఆ
ageలో
ఎట్లా
వుండాలో
ఆ
విధంగా
గౌరవంగా
వుండాలి.
అంతేగాని
అంతా
యిమిటేషన్
వారితో
వీరితో
చూచుకొని
పోతుంటే
మనము
కుక్కల
మాదిరి
తయారైపోతాము.
మనము
dogs
కాకూడదు.
Gods
కావాలి.
చక్కగా
చదవండి.
మంచి
మార్కులు
తెచ్చుకోండి.
ప్రాపంచికమైన
విద్యలు
వుండవలసిందే.
ఐతే
లక్ష్యము
మాత్రము
పారమార్థిక
లక్ష్యములో
ప్రాపంచిక
విద్యలు
చదవాలి.
అప్పుడే
నిజమైన
విద్యార్థులమవుతాము.
విద్యకు
వినయము
ప్రధానమైనది.
ఈ
వినయమే
లేకపోతే
యిది
విద్యకు
సంబంధించినది
కాదు.
మనము
ఎవరైనా
పెద్దలతో
మాట్లాడేటప్పుడు
చాలా
వినయముగా
మాట్లాడాలి.
పెద్దలు
ఎవరైనా
వుంటే
వారి
ముందు
నడచేటప్పుడు
చాలా
వినయంగా
నడచాలి.
16
▾
Meaning
Keep
పూర్వము
గురుకులములో
యే
విధంగా
తయారయ్యేవారు.
ఆ
గురుకుల
పద్ధతి
రావాలనే
వుద్దేశ్యముతోనే
నేను
యిక్కడ
విద్యాసంస్థలు
ప్రారంభించాము.
ఆనాడు
భిక్షమెత్తి
అనుభవించేవారు.
ఇక్కడ
యేమీ
లేదు.
కావలసినన్ని
సుఖములు
కావలసినన్ని
అనుకూలములు
అన్నీ
వుంటున్నాయి.
పిల్లలు
మంచివారే.
కాని
నా
వుద్దేశ్యములో
యేమంటే
యింటి
దగ్గర
తల్లితండ్రులు
పాడుచేసి
పెడుతున్నారు.
warden
కాని
teachers
గాని
ఎల్లవేళల
వాని
యొక్క
behaviour
వానియొక్క
మార్కులుగాని
నడతలుగాని
యివన్నీ
తల్లితండ్రులకు
ఎప్పటికప్పుడు
తెలుపుతూ
వుండండి.
వారు
యేమైనా
సరిలేకపోతే
తల్లితండ్రులకు
కూడా
వ్రాయవలసిందే
మనము.
మీకు
బుద్ధిరాదా.
పిల్లల్ని
చంపుకుంటున్నారు.
ఇది
సరియైనది
కాదు.
మీరు
సరియైన
మార్గములో
పెట్టాలని
వారికి
కూడా
బోధించాలి.
ప్రేమ
ప్రేమ
అంటే
ధృతరాష్ట్రుని
ప్రేమ
కాదు
మీకు
వుండవలసినది.
దశరథుని
ప్రేమ
కావాలి.
కుమారుని
విడచి
ప్రాణమే
విడచినాడు
పాపం.
అలాంటి
ఆదర్శవంతమైన
పిల్లలుగా
వుండాలి.
అంతే
నేను
కోరేది.
ప్రతి
విషయమునందు
సరైన
నడత,
మాట,
ప్రవర్తన
వుండాలి.
ముందు
వేరు
వెనుక
వేరుగా
వుండకండి.
ఇక్కడ
వుండినా
యింటి
దగ్గర
వుండినా
ఒకే
నడతగా
వుంటుండాలి.
అటు
ఒకరకంగా
యిటు
ఒకరకంగా
వుంటుంటే
యిది
డ్రామా
డాన్సు
మాదిరి
అయిపోతుంది.
స్టేజి
మీద
ఒకటి
యాక్టు
చేయవలసి
వచ్చినప్పుడు
ఒక
వేషం
వేయవలసి
వస్తుంది.
స్టేజి
వెనుకకు
పోతూనే
యింకొక
యాక్టు
చేయవలసి
వస్తుంది.
కాబట్టి
యాక్టరుగా
వుండకు.
జీవితమే
ఒక
యాక్టింగ్.
కాని
మానవ
actగానే
మనము
వుండాలి.
మానవుడుగా
మనము
ప్రవర్తించాలి.
ఏ
వేషాలు
నీవు
నేర్చుకోకు.
ఈ
విధంగా
వుంటుండి
సరైన
కీర్తి
సంపాయించుకొని
Instituteకి
కూడా
కీర్తి
సంపాయించండి.
విద్యార్థులారా!
మీరు
ముఖ్యముగా
నేర్చుకోవలసినది.
ఏ
బ్రహ్మహత్యాపాతకమునకైనా
దోషపరిహారము
వుంటుండాది.
గోహత్యా
పాతకమునకైనా
పరిహారము
వుంటున్నాది.
స్త్రీ
హత్యాపాతకమునకైనా
పరిహారము
వుంటున్నాది.
వేదరహితమైన
కర్మలకు
కూడా
పరిహారము
వుంటున్నాది.
కాని
కృతజ్ఞత
లేకుండా
కృతఘ్నుడైపోతే
దీనికి
పరిహారము
లేదు.
gratitude
లేకపోయినా
పరవాలేదు.
కాని
కృతఘ్నుడు
కాకూడదు.
అది
మాత్రం
వుండకూడదు.
కృతఘ్నుడుగా
వుంటుంటే
నీవు
చచ్చేంతవరకు
యీ
పాపం
తప్పింది
కాదు.
ఇది
మహా
పాతకం.
నిజమైన
కృతజ్ఞతను
మనం
పెంచుకోవాలి.
ఇంతకాలము
స్వామి
ఒక
నయాపైసా
తీసుకోకుండా
free
education.
ఎక్కడైనా
ప్రపంచములో
వుంటున్నదా.
లైబ్రరీ
ఫీజు,
లేబొరేటరీ
ఫీజు,
మెడికల్
ఫీజు,
ట్యూషన్
ఫీజు
లేదే.
ఎందుకోసము
మిమ్మల్ని
చదివిస్తున్నాము.
కొంతమందైనా
మంచి
పిల్లలు
తయారౌతారు
దేశము
బాగుపడుతుందని.
ఈనాడు
బయట
ప్రదేశమునకు
పోతే
LKGలో
చేరటానికి
ఐదువేల
రూపాయలు
కట్టాలి.
అక్కడ
డబ్బు
తీసుకుని
చెప్పే
దానిలోనే
మీరు
చక్కగా
వుంటున్నారు.
నేను
యింత
freeగా
మా
బిడ్డలుగా
చూసుకొని
చెబితే
కూడను
gratitude
లేకుండా
పోతున్నారు.
17
▾
Meaning
Keep
అది
లేనివాడు
మనిషే
కాదు.
రాక్షసులకంటె
హీనమై
పోతాడు.
అలాంటి
రాక్షసులుగా
తయారు
కాకండి.
మంచి
మానవులుగా
తయారుకండి.
ఆదర్శ
మానవులుగా
తయారుకండి.
అదే
మేము
కోరేటువంటిది.
దీని
మాత్రము
మనస్సులో
నిరంతరము
స్మరిస్తూ
రావాలి.
నేను
కృతజ్ఞుడుగా
వున్నానా
లేదా
అని
క్షణక్షణము
యోచించుకుంటూ
రావాలి.
విద్యావంతులనే
అహంకారమునకు
మీరు
చోటు
యివ్వ
వద్దండి.
'O'
grade
వచ్చిందని
యేమాత్రం
అహంకారమునకు
అవకాశం
యివ్వకండి.
ఈ
'O'
grade
'A'
grade
నేను
చూడటం
లేదు.
రానీ
రాకపోనీ
నీ
మనస్సు
పరిశుద్ధముగా
వుంటే
అదే
పెద్ద
grade.
ఆ
గ్రేడు
లేక
యీ
గ్రేడు
వచ్చి
యేమి
లాభము.
గ్రేడు
నేను
ఎప్పుడూ
ఆశించను.
మంచి
గుణవంతుడు
కావాలి.
అమృతపుత్రుడు
అని
పేరు
తెచ్చుకోవాలి.
ఆ
పేరు
తెచ్చుకోటానికి
తగిన
ప్రయత్నం
చేయండి.
Previous
←
Victory is only where Kṛṣṇa is
Next
Safeguard human values
→