Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2005 · Develop self-confidence!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Develop self-confidence!
11 April 2005, Seva Dal Conference, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(9)
21 May 1979
Niṣkāma Karma
6 October 1986
Serve the Lord of all in the form of society!
5 July 2003
Give up attachment to the body and develop attachment to God
22 October 2005
Sāttvic Food and Good Company Are Essential
28 September 2006
No worry troubles those who think of God without ceasing
15 January 2007
Only a life that brings joy to many is a true life
27 January 2007
Love others, and the Paramātma will love you
7 March 2008
Do the deeds that please God
9 October 2008
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
కర్మమున
పుట్టు
జంతువు
కర్మముననె
వృద్ధి
పొంది
కర్మమున
చనున్
కర్మమె
నరునకు
దైవము
కర్మమె
సుఖదుఃఖములకు
కారణమిలలోన్
ప్రేమస్వరూపులారా!
‘జంతూనాం
నరజన్మ
దుర్లభం’,
మానవజన్మ
అత్యంత
దుర్లభమైనది.
ఈ
జగత్తునందు
మార్పు
కలిగించవలెనన్నను,
జగత్తును
అభివృద్ధిగావించవలెనన్నను
మానవుడే
మూలాధారమైనవాడు.
ఈ
జగత్తునందు
తాను
అనుభవించే
కష్టసుఖములు,
సుఖదుఃఖములు
అన్నింటికీ
మానవుడే
మూలకారకుడు.
కష్టసుఖములు
రెండూ
కలసి
ఉంటాయి.
సుఖమును
వదలి
కష్టముగాని,
కష్టమును
వదలి
సుఖముగాని
ఉండడానికి
వీలుకాదు.
ఈనాటి
మానవుడు
దేహాభిమానమును
పెంచుకోవడంచేత
మానవత్వమంటే
ఏమిటో
గుర్తించుకోలేకపోతున్నాడు.
తాను
కేవలం
ఆకారమును
గుర్తించి,
ఆలోచనను
గుర్తించి
వర్తించకపోవడంచేత
మానవత్వాన్ని
మరచిపోతున్నాడు.
తాను
‘మానవుడ’ని
పేరు
పెట్టుకున్నందుకు
ప్రధానముగా
మానవత్వముయొక్క
విశిష్టతను
గుర్తించాలి.
మానవజన్మ
విశిష్టత
గొప్ప
విద్యలను
నేర్చుకొని
గొప్ప
డిగ్రీలను
పొందడంలో
లేదు.
లౌకికమైన
విద్యవలన
మానవత్వం
వికసించదు.
తగు
రీతిగా
శిక్షణ
ఇస్తే
పశు,
పక్షి,
మృగాదులుకూడా
కొన్నిరకములైన
విద్యల
నభ్యసించగలవు.
జగత్తునందు
మానవత్వమునకు
ప్రత్యేకమైన
స్థాన
మున్నది.
కేవలం
గ్రంథపరిచయమును
పెంచుకొని,
ఇతరులకు
బోధించి
అంతటితో
సంతృప్తిచెందడం
మానవత్వమునకు
తగిన
లక్షణం
కాదు.
మానవత్వము
ఇతరులకు
ఆదర్శము
అందించవలసినటువంటి
జన్మము.
ముందు
మనము
స్వయంగా
మంచిని
ఆచరించి
ఇతరులకు
బోధించాలి.
2
▾
Meaning
Keep
His poems 180
Also in his talks
(10)
27 January 1990
Live in Love
1 June 1991
Spiritual Discipline (sadhana)
19 June 1996
There Is No Good Without a Rule
14 July 1996
Divine Proximity is the Real Wealth
20 April 1998
Inquiry into the eternal and the transient is essential
13 March 2002
The divine power of attraction
16 March 2005
Jñāna is won through purity of feeling
17 August 2005
Only what fosters unity is true education
18 August 2006
Cast off the delusion of the body and foster attachment to God
23 November 2006
The service of society is the service of the Lord of all
అదే
నిజమైన
మానవత్వము.
తాను
ఆచరించకుండా
ఇతరులకు
బోధించే
అధికారం
మానవునికి
లేదు.
మానవత్వమునందే
మహత్తరమైన
శక్తి
ఇమిడి
యున్నది.
మానవుడనగా
కేవలం
దేహధారి
మాత్రమే
కాదు.
విజ్ఞాన,
ప్రజ్ఞాన,
సుజ్ఞానములతో
కూడినవాడు
మానవుడు.
ఆ
విజ్ఞాన,
ప్రజ్ఞాన,
సుజ్ఞానములను
సరియైన
మార్గములో
ప్రసరింపజేయాలి.
‘జ్ఞానము’
అంటే
ఏమిటి?
గ్రంథములను
చదివి
తెలుసుకునేది
జ్ఞానమని
అనుకుంటారు,
చాలామంది.
కాదు,
కాదు.
మన
అంతర్భావమునుండి
ఆవిర్భవించునదే
నిజమైన
జ్ఞానము.
దానిని
ఆచరించి,
ఆనందించి
అన్యులకు
బోధించడమే
నిజమైన
మానవత్వము.
మానవతా
గుణములు
హృదయమునుండి
ఆవిర్భవించునవేగాని,
కేవలం
గ్రంథములను
చదవడంవలన,
లేక
పెద్దలు
బోధించిన
విషయాలను
వినడంవలన
లభించేవి
కావు.
పుస్తకాలు
చదివితే
చాలదు,
మస్తకాన్ని
పరిశుద్ధం
గావించుకోవాలి
ప్రేమస్వరూపులారా!
మీరు
కేరళనుండి
ఇక్కడికి
ఎందుకోసం
వచ్చారు?
విజ్ఞాన,
సుజ్ఞాన,
ప్రజ్ఞానముల
నందుకునే
నిమిత్తం
వచ్చారు.
జ్ఞానమంటే
కేవలం
గ్రంథపరిచయం
కాదు.
మీరు
పుస్తకములు
చదివి
సంపాదించే
‘నాలెడ్జి’ని
ఆచరణలో
పెట్టకపోతే
అది
‘ఎలర్జీ’గా
మారిపోతుంది.
దానిని
ఆచరణలో
పెట్టినప్పుడే
ఆ
‘నాలెడ్జి’
‘ఎనర్జీ’గా
మారుతుంది.
ఈ
జగత్తులో
మనము
అనుభవించే
ప్రతి
విషయము
మన
అంతర్భావముయొక్క
ప్రతిబింబమే!
‘రిఫ్లెక్షన్’,
‘రియాక్షన్’,
‘రీసౌండ్’
...
ఈ
మూడూ
ఈ
జగత్తునందు
ఏకమై
ఉంటున్నాయి.
వీటిని
యోచించి,
విచారించి,
అంతరార్థమును
గుర్తించి,
ఇతరులకు
బోధించడానికి
పూనుకోవాలి.
గ్రంథ
పరిచయం
మాత్రమే
ప్రధానమని
భావించి
మీరు
కాలమును
వ్యర్థము
చేయకూడదు.
మస్తకము
పరిశుద్ధంగా
లేనప్పుడు
ఎన్ని
పుస్తకాలు
చదివితే
ఏమి
ప్రయోజనం?
మస్తకమును
పరిశుద్ధం
గావించుకోవాలి.
అప్పుడే
నిజమైన
జ్ఞానం
మన
హృదయం
నుండి
ఆవిర్భవిస్తుంది.
పుస్తకముల్
పఠించితిని
పూర్తిగ
జూచితి
సర్వశాస్త్రముల్
నిస్తులమైన
విద్యలను
నేర్చితినంచును
గర్వమేల?
నీ
హస్తయుగంబు
మోడ్చి
పరమాత్ముని
భక్తితొ
కొల్వలేని
యీ
ప్రస్తుత
విద్యలన్నియు
ధాత్రి
నిరర్థకము
గాదె
మానవా!
3
▾
Meaning
Keep
ఈ
ప్రస్తుత
యుగమునందు
మీరు
నేర్చుకునే
విద్యలు
కేవలం
అవిద్యల
క్రిందికే
చేరుతాయిగాని,
నిజమైన
విద్యలు
కానేరవు.
కనుక,
ఈ
విద్యలు
నేర్చుకున్నంత
మాత్రమున
మీరు
గొప్పవారు
కాజాలరు.
అవిద్యచేత
అవిద్యయే
అభివృద్ధి
అవుతుందిగాని,
విద్య
ఏమాత్రము
రాణించదు.
విద్యకు,
అవిద్యకు
గల
భేదమును
మీరు
గుర్తించడానికి
ప్రయత్నించాలి.
మనం
ఆలోచించి,
నిర్ణయించి
నిజమైన
తత్త్వాన్ని
తెలుసుకోవడం
విద్య.
విచారణ
చేయకుండా
నోటికి
వచ్చినట్లు
వాగడం
అవిద్య.
తన
తత్త్వాన్ని
తాను
గుర్తించి,
ఇతరులకు
బోధించి
ఆనందాన్ని
అనుభవించడమే
మానవుని
ప్రధాన
కర్తవ్యము.
మనము
మొదట
Experience
ను
పొందాలి.
ఆ
Experience
ను
ఇతరులకు
Explain
చేయాలి.
తీగయందు
కరెంటు
ప్రసరిస్తున్నట్లుగా
మానవ
దేహములో
నఖశిఖ
పర్యంతం
దివ్యశక్తి
సంచరిస్తున్నది.
మానవుని
స్వరూపమంతయు
ఆ
శక్తితోనే
నిండి
యున్నది.
ఆ
శక్తికి
ఒక
ప్రత్యేకమైన
ఆకారము
లేదు.
మనం
పనిచేయడం,
మాట్లాడడం,
నడవడం,
చదవడం,
వ్రాయడం....
ఇవన్నీ
ఆ
శక్తివలననే
జరుగుచున్నవి.
దానిని
అభివృద్ధిపరచుకున్నప్పుడు
అజ్ఞాని
కూడా
గొప్ప
జ్ఞానిగా
రూపొందుతాడు.
సేవలు
మీకొరకై
మీరు
చేసుకుంటున్నారు
‘మేము
మా
విద్యాభ్యాసమును
ముగించినాము.
ఇప్పుడు
సేవా
కార్యక్రమాలలో
పాల్గొంటున్నాము’,
అని
మీరు
భావించకండి.
మీరు
నిరంతరం
విద్యార్థులుగానే
ఉండాలి.
అంతేకాదు,
మీరు
పరులకొరకు
సేవలలో
పాల్గొంటున్నామనుకోవడం
చాలా
పొరపాటు;
మీకొరకై
మీరు
చేసుకుంటున్నారు.
ఈ
సంస్థలో
సభ్యులుగా
చేరడంవలన
ఇతరులు
మీకు
‘హెల్ప్’
(సహాయం)
చేస్తారేమోనని
ఆశించకండి.
4
▾
Meaning
Keep
ఇతరుల
‘హెల్ప్’
మనకు
అక్కర్లేదు.
మీ
‘సెల్ఫ్’
(ఆత్మ)
యొక్క
శక్తియే
మీకు
అన్నివిధాలుగా
సహాయం
చేస్తుంది.
మీరు
చేసే
సేవలే
మిమ్మల్ని
పోషిస్తూ
వస్తాయి.
మీ
‘సెల్ఫే’
మిమ్మల్ని
రక్షిస్తుంది.
కాబట్టి,
‘సెల్ఫ్
కాన్ఫిడెన్సు’
(ఆత్మవిశ్వాసము)ను
అభివృద్ధి
చేసుకోండి.
‘సెల్ఫ్
కాన్ఫిడెన్సు’
అనే
పునాదిపైననే
‘సెల్ఫ్
సేటిస్ఫేక్షన్’
(ఆత్మసంతృప్తి)
అనే
గోడలను
నిర్మించుకోవచ్చు.
‘సెల్ఫ్
సేటిస్ఫేక్షన్’
అనే
గోడలపైననే
‘సెల్ఫ్
సేక్రిఫైజ్’
(స్వార్థత్యాగం)
అనే
‘రూఫ్’
(పైకప్పు)
వేసుకోవచ్చును.
అప్పుడే
‘సెల్ఫ్
రియలైజేషన్’
(ఆత్మ
సాక్షాత్కారము)
అనే
‘లైఫ్’ను
అనుభవించవచ్చును.
అంతా
‘సెల్ఫ్’నుండే
వస్తుంది.
సేవాదళ్
సభ్యులారా!
మీరు
సేవ
చేసే
నిమిత్తమై
వచ్చామని
భావిస్తున్నారు.
మీకు
మీరు
చేసుకోవడంకోసమే
వస్తున్నారుగాని,
మరొకరికి
చేసేందుకు
కాదు.
మీరు
భుజించే
ఆహారము
మీ
కడుపు
నింపుకోవడంకోసమేగాని,
పరులకు
సహాయం
చేసే
నిమిత్తం
కాదు
కదా!
అదేవిధముగా,
ప్రతి
ఒక్కటీ
మీ
నిమిత్తమై
మీరు
చేసుకుంటున్నారు.
మీరింకా
నేర్చుకోవలసినవి
ఎన్నియో
ఉన్నవి.
అవన్నీ
మున్ముందు
చెప్పగలము.
మీరందరూ
సేవాదళములో
సభ్యులుగా
ఉన్నారు.
ఈ
దళములో
అనేక
రకములైన
కళలున్నాయి.
అనేక
దళములతో
కూడినదే
ఒక
పుష్పము.
మనము
ఒక
విత్తనమును
నాటినామంటే,
ఆ
విత్తనము
క్రమక్రమేణ
చెట్టుగా
పెరిగి
దానినుండి
అందమైన
పుష్పములు
లభిస్తాయి.
విత్తనముగా
ఉన్నప్పుడు
అది
ఏమాత్రము
అందంగా
ఉండదు,
మనకు
ఆనందాన్ని
అందించదు.
క్రమక్రమేణ
అది
పుష్పముగా
రూపొందినప్పుడు
దాని
అందము,
దానినుండి
వచ్చే
సుగంధము
అన్నివిధాలుగా
మనకు
ఉత్తేజాన్ని
కలిగిస్తుంది.
అయితే,
దళములన్నీ
కలిసి
ఉన్నంతవరకే
అది
పుష్పముగా
కనిపిస్తుంది.
దళములు
రాలిపోయెనా,
అది
పుష్పమే
కాదు.
కనుక,
మీరందరూ
కలసి
మొట్టమొదట
ఒక
పుష్పముగా
రూపొందండి.
ఆ
పుష్పముయొక్క
అందచందములను
చూసి,
దానినుండి
వెలువడే
సుగంధముననుభవించి
అందరూ
ఆనందించగలరు.
Previous
←
Divinity is the very nature of man
Next
Those who believe in difference cannot attain divinity
→