Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2005 · Divinity is the very nature of man
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Divinity is the very nature of man
9 April 2005, Ugādi, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 362
Also in his talks
(28)
14 January 1988
Strive to recognise the oneness within the many!
20 May 1990
The Glory of Indian Culture
6 October 1992
Only one who knows himself can know God
2 July 1996
Satya Alone Is God
1 January 1998
Happiness and sorrow cannot be parted
26 February 1998
The power of saṅkalpas
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
25 September 1998
Man's True Kin
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
26 September 2000
Education and Educare
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
14 October 2002
Satya itself is life
22 November 2002
Give Up Selfishness and Strive for the Good of Society
2 April 2003
Leave the delusion of the body; think of God
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
7 April 2006
Our Ātma itself is Rāma
11 August 2006
Divinity is attained only through Prema for God
28 September 2006
No worry troubles those who think of God without ceasing
16 February 2007
Follow Sai, walk the path of Satya!
7 June 2007
Along with ‘Education’, ‘Educare’ is most essential
28 July 2007
Every human being is God
22 August 2007
Foster faith in God and love of country!
4 September 2007
The word and the way of the Avatāras are most auspicious
22 November 2007
Only one who recognises that all are one is truly educated
18 July 2008
God alone is the true Guru
6 August 2008
‘Education’ finds its fulfilment only when it is joined with ‘Educare’
9 October 2008
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
సత్యంబునందుండి
సర్వంబు
సృష్టించె
సత్యమందణగె
సర్వసృష్టి
సత్యమహిమ
లేని
స్థలమేది
కనుగొన్న
శుద్ధసత్త్వమిదియె
చూడరయ్య!
ప్రేమస్వరూపులారా!
నేటి
ఉదయం
హైదరాబాద్
నుండి
వచ్చిన
భక్తులు
మృదుమధురంగా
పాడి
శ్రవణానందమునందించారు.
కేవలం
శ్రవణానందమే
కాకుండా
మననానందముకూడా
కలిగింది.
ఈ
జగత్తులో
ప్రేమను
మించినది
మరొకటి
లేదు.
ప్రేమ
లేని
మానవుడు,
ప్రేమ
లేని
జీవులు
జగత్తులో
కానరారు.
ప్రేమ
‘ఇట్టిది,
అట్టిది’
అని
ఎవ్వరూ
వర్ణించలేరు.
ప్రేమనుగురించి
ఎవరెన్ని
చెప్పిననూ
తక్కువే
అవుతుంది.
‘చీమలో
బ్రహ్మలో
శివ
కేశవాదులలో
ప్రేమమీర
వెలసియుండే
బిరుదు
వహించిన
రామ
నన్ను
బ్రోవరా!’
అని
గానం
చేశాడు,
త్యాగరాజు.
చీమ
రూపమెట్టిది?
బ్రహ్మ
రూపు
యెట్టిది?
బ్రహ్మము
అఖండ
జ్యోతివలె
వెలుగుతున్నది;
చీమ
అత్యంత
స్వల్పమైన
రూపాన్ని
ధరించి
తిరుగుతున్నది.
ఒకదానితో
ఒకటి
పోల్చి
చూచిన
అసలు
పోలికయే
లేదు.
అయితే,
రెండింటిలోనున్న
దివ్యత్వము
ఒక్కటే.
చిన్న
చీమనుండికూడా
మనము
నేర్చుకోవలసిన
పాఠాలు
ఎన్నియో
ఉన్నాయి.
“పరోపకారార్థ
మిదం
శరీరం”
ఒకానొక
సమయంలో
ఒక
ఎలుగుబంటు
చీమల
పుట్ట
దగ్గరకు
వచ్చి,
‘నాకు
ఆకలి
వేస్తున్నది.
మీరు
దాచి
ఉంచిన
ఆహారం
యేమైనా
వుంటే
నాకిచ్చి
నా
ఆకలి
తీర్చండి’,
అని
అడిగింది.
2
▾
Meaning
Keep
Also in his talks
(1)
14 June 1973
The Oneness of Jīva and Brahman: Life's Supreme Goal
చీమకు
నవ్వొచ్చింది.
‘నీవెక్కడ,
నేనెక్కడ!
నీకు
సరిపోయే
ఆహారము
నా
దగ్గర
లేదే!’,
అన్నది.
ఆరు
నెలలకు
సరిపడే
ఆహారాన్ని
కూడబెట్టుకోవడం
చీమలకు
సహజం.
చీమ
లోపలికి
వెళ్ళి
తాను
కూడబెట్టిన
ఆహారాన్ని
తన
మిత్రులద్వారా
తెప్పించింది.
‘ఇంత
చిన్న
చీమ
యింత
ఆహారాన్ని
ఏవిధంగా
కూడబెట్టుకున్నది!’
అని
ఎలుగుబంటుకు
ఆశ్చర్యం
కలిగింది.
చిన్న
చీమకూడా
భగవంతుడు
అందించిన
ఆహారమును
యింత
భుజించి,
కొంత
మిత్రులకు
పెట్టి
తాను
యింకా
దాచిపెట్టుకోగలుగుతున్నది.
కాని,
అఖండమైన
తెలివితేటలు
కలిగిన
మానవుడు
తన
తిండిని
తాను
సంపాదించుకోలేకపోతున్నాడు.
‘జంతూనాం
నరజన్మ
దుర్లభం’
అన్నారు.
కాని,
మానవుడు
తన
తెలివితేటలను
సద్వినియోగపరచుకొనలేక
అల్పుడై
తిరుగుతున్నాడు.
తనలో
స్వార్థ
స్వప్రయోజనములు
మితిమీరిపోవడంచేత
అతని
తెలివితేటలు
గతి
తప్పి
హీనస్థితికి
దిగజారిపోతున్నాడు.
స్వార్థమును
దూరం
చేసుకున్నప్పుడు
మానవునియందున్న
చిన్నశక్తికూడా
గొప్పశక్తిగా
రూపొందుతుంది.
మానవునకు
కావలసినంత
శక్తి,
తెలివితేటలు
అన్నీ
ఉన్నాయి.
ఇవన్నీ
ఉండికూడను
యేవిధంగా
వాటిని
కాపాడుకోవాలి?
ఎప్పుడు
ఏవిధంగా
ఉపయోగించుకోవాలి?
అనే
విధివిధానమును
గుర్తించటానికి
తాను
ప్రయత్నించటం
లేదు.
ఈనాటి
విద్యార్థులు
ఎన్నియో
చదువులు
చదువుతున్నారు.
విద్యార్థులు
చదవని
పుస్తకములే
కనిపించటం
లేదు.
పుస్తకములనిండ
మస్తుగ
చదువుండె,
మస్తకమునిండ
మట్టి
మెండు.
ఉపయోగము
లేని
విషయములను
తలలో
చేర్చుకొని
జీవితమునకు
అవసరమైన
శక్తిని
విద్యార్థులు
దుర్వినియోగము
చేసుకుంటున్నారు.
‘చదువులన్నియు
చదివి
చావంగ
నేటికి,
చావు
లేని
చదువు
చదువవలయు’
విద్యార్థులు
ఎవరు
ఏమి
అడిగితే
దానికి
తగినరీతిగా
జవాబు
చెప్పే
బుద్ధిని
నేర్చుకున్నారుగాని,
తమ
చదువును
తగినరీతిలో
ఉపయోగపెట్టుటకు
ప్రయత్నం
చేయటం
లేదు.
3
▾
Meaning
Keep
Also in his talks
(6)
8 July 1988
All creation is nothing but an assembly of atoms!
22 June 1996
Service to Society Is the Mark of True Humanness
12 January 2004
Honour your mother and father; take their command upon your head
19 February 2004
Unity is Jñāna, multiplicity is ignorance
23 October 2004
Foster the Spirit of Sacrifice
24 February 2006
Material learning has its worth only when spirituality goes with it
ఎమ్మేలు
బియ్యేలు
ఏర్పడ
చదివియు
పేరుగాంచిన
పెద్దవారలైన
సంపదలుండియు
సద్దానపరులైన
పుడమి
కీర్తిని
గన్న
పుణ్యులైన
ఆయురారోగ్యంబు
లనవరతంబుండి
పరిపూర్ణ
బలులగువారలైన
సతతంబు
జపములు
చాలంగ
చేయుచు
వేదములను
నేర్పు
విప్రులైన
సాటిరారు
భక్తులకు
ఏనాటికైన
నిత్యజీవితంలో
పరులకు
ఉపయోగపడే
రీతిలో
మన
చదువును
వినియోగించుకోవాలి.
భగవంతుడు
మనకు
శరీరమును
యిచ్చినది
తిని,
తిరగటంకోసం
కాదు.
‘పరోపకారార్థమిదం
శరీరం’.
భగవంతుడు
మనకు
యిచ్చిన
సంపద,
చదువు,
తెలివితేటలు,
బుద్ధికుశలత
ఇవన్నీ
పరులకొరకు
ఉపయోగించేందుకేగాని
స్వార్థ,
స్వప్రయోజనముల
నిమిత్తం
కాదు.
ఈ
సత్యాన్ని
విస్మరించి
మానవుడు
ఏవో
క్రొత్త
విషయాలను
తెలుసుకోవాలని
శ్రమపడుతున్నాడు.
కాని,
మానవత్వమనగా
ఏమిటో
తాను
ఇంతవరకు
తెలుసుకోలేదు.
మంచి
తెలివితేటలుండినప్పటికీ
వాటిని
సద్వినియోగపరచుకొనకుండా
దానవత్వాన్ని
పెంచుకొని
దీనత్వంలోకి
దిగిపోతున్నాడు.
ఏ
భావము
తనలో
ఆవిర్భవించినప్పటికీ,
“ఏమిటిది?
ఎందుకిది
నానుండి
వచ్చినది?
ఇది
మానవత్వానికి
తగినదేనా?”
అని
విచారించాలి.
తనకు
ఏది
లభించినప్పటికీ
అది
దైవము
యిచ్చిన
ప్రసాదంగా
భావించుకోవాలి.
సమష్టి
అనేది
దైవత్వము.
వ్యష్టి
అనేది
మానవత్వము.
సమష్టియొక్క
తత్త్వాన్ని
మనం
తెలుసుకున్నప్పుడు
వ్యష్టియొక్క
తత్త్వము
సులభంగా
అర్థమౌతుంది.
సమత్వము
లేక
దివ్యత్వమును
తెలుసుకోలేము
ప్రేమస్వరూపులారా!
మీరు
చదివిన
చదువులు,
తెలుసుకొన్న
విషయాలు
ఎన్ని
ఉండినప్పటికీ
ఈనాడు
పశుపక్ష్యాదులనుండి
నేర్చుకోవలసింది
ఎంతో
ఉంది.
ఇట్టి
సత్యాన్ని
టీచర్సు
బోధించటానికి
వీలుకాదు.
ఆ
టీచర్సుకూడా
తాము
తెలుసుకోకుండా
తమలో
దైవత్వాన్ని
మర్చిపోతున్నారు.
4
▾
Meaning
Keep
మనము
నేర్చుకునే
విద్య
కేవలం
మన
పొట్ట
నింపుకోవడంకోసం
కాదు;
పదిమందికి
పంచి,
వారిని
ఆనందపరచి
తద్వారా
మన
మానవత్వాన్ని
దివ్యత్వంగా
మార్చుకోవాలి.
మొట్టమొదట
మనం
సమత్వమును
నేర్చుకోవాలి.
సమత్వము
లేనప్పుడు
దివ్యత్వమును
తెలుసుకోలేము.
ప్రతి
మానవునియందు
దైవశక్తి
నిండి
నిబిడీకృతమై
ఉన్నది.
కాని,
దానిని
అందుకోలేక
వదలిపెట్టి
మానవుడు
దుర్బలుడవుతున్నాడు.
తనలో
ఉన్న
దివ్యత్వమును
తాను
గుర్తించుకోలేక
పోవటంచేత
మానవత్వమునుకూడా
మరచిపోతున్నాడు.
మానవత్వమనగా
కేవలం
ఆకారము
మాత్రమే
కాదు.
ఆకారము
ఉండి
ఆచరణ
లేకపోతే
ప్రయోజనమేమిటి?
మానవతా
విలువలను
ఆచరణలో
పెట్టినప్పుడే
మానవత్వము
సార్థకమౌతుంది.
మానవత్వాన్ని
సార్థకం
గావించే
నిమిత్తమై
లోకములో
వేదములు,
శాస్త్రములు,
ఉపనిషత్తులు
మొదలైనవి
ఏర్పడ్డాయి.
ఇవన్నీకూడా
మానవునియందు
నిక్షిప్తమైయున్న
దైవత్వాన్ని
వెలికి
తీయడంకొరకే!
అందుకే
మేము
‘ఎడ్యుకేర్’
అనేది
ప్రారంభించాము.
‘ఎడ్యుకేర్’
అనగా
లోపల
దాగియున్న
దివ్యత్వాన్ని
బయటకు
తీసికొనిరావడం.
ఎడ్యుకేషన్
-
ఎడ్యుకేర్
ప్రేమస్వరూపులారా!
నేడు
మనము
ప్రధానంగా
తెలుసుకోవలసినది
దైవత్వాన్ని.
అడుగడుగునకూడా,
క్షణక్షణమూ
మనకు
దైవత్వము
కనిపిస్తూనే
ఉంది.
దానిని
తెలుసుకున్నవాడే
నిజమైన
చదువరి.
పుస్తకాలు
చదివితే
లభించేది
‘ఎడ్యుకేషన్’.
మనయందు
అంతర్గతంగా
ఉన్న
విలువలను
బయటకు
తెప్పించే
గొప్ప
శక్తి
‘ఎడ్యుకేర్’.
ఇది
గ్రంథములనుండి
అందుకొనేది
కాదు.
ఈనాటి
చదువులు
కేవలము
గ్రంథపరిచయమును
మాత్రమే
పెంచుతున్నాయి.
ఈ
‘ఇన్ఫర్మేషన్’తో
మనకు
లభించేది
యేమీ
లేదు.
‘ట్రాన్స్ఫర్మేషన్’
కావాలి.
అది
లేకుండా
‘ఇన్ఫర్మేషన్’
తీసుకుంటే
‘వేస్టు’.
కాని,
మీరు
ఈ
‘వేస్టు’
చదువుపట్ల
‘టేస్టు’ను
అభివృద్ధిపరచుకుంటున్నారు.
అది
కాదు
మీరు
చేయవలసినది;
‘ఎడ్యుకేర్’ను
అభ్యసించాలి.
మనకు
దైవము
ప్రసాదించిన
తెలివితేటలను,
బుద్ధికుశలతను
మరియు
శక్తిని
తగినరీతిగా
ఉపయోగపెట్టుకోవాలి.
5
▾
Meaning
Keep
నిజముగా
భగవంతుడు
మనకు
యిచ్చిన
శక్తి
ఎంతయో
ఉంటున్నది.
ప్రేమయే
మీ
ప్రధానమైన
ఆస్తిగా
భావించండి
పరమాత్ముడు
ప్రసాదించిన
ప్రేమతత్త్వము
ఎట్టి
కొలతలకూ
అందనిది.
ప్రేమను
మించిన
పదార్థము,
ప్రేమను
మించిన
శక్తి
మరొకటి
లేదు.
అలాంటిదానిని
మీరు
సులభంగా
వదలిపెట్టేస్తున్నారు.
ప్రేమ
అంటే
లౌకికమైనరీతిలో
ప్రేమించటమని
భావిస్తున్నారు.
అది
కాదు
ప్రేమ.
‘ప్రేమ’,
‘ప్రేమ’
అని
అందరూ
పలుకుతూనే
ఉన్నారుకాని,
ప్రేమకు
ఎట్టి
గుణమున్నది?
ప్రేమను
ఏవిధంగా
ఉపయోగించుకోవాలి?
అనేది
తెలుసుకోవడం
లేదు.
ప్రేమ
ఎల్లప్పుడు
సహాయమే
చేస్తుందిగాని
ఎవ్వరినీ
బాధించదు.
కనుక,
ప్రేమనే
మీరు
ప్రధానమైన
ఆస్తిగా
తీసుకోవాలి.
ఇంతకంటే
మించిన
‘ప్రోపర్టీ’
ఎక్కడా
కానరాదు.
భగవంతుడు
అందించిన
ప్రేమ
అనే
‘ప్రోపర్టీ’ని
ఎంత
ఉపయోగపెట్టుకున్నా
అది
తరగదు.
కాని,
మీరు
ఇంద్రియములయొక్క
దుర్వినియోగంద్వారా
ప్రేమను
పాడు
చేసుకుంటున్నారు;
దానికి
తగిన
పవిత్రతను
అందించటం
లేదు.
భగవంతుడిచ్చిన
ప్రేమను
సద్వినియోగం
చేసుకోవాలి.
Help
ever,
hurt
never.
దీనికి
మించిన
ధర్మము
లేదు.
ప్రేమ
ప్రతి
ఒక్కరికీ
శాశ్వతంగా
నిల్చేటటువంటిది.
ప్రేమ
ప్రతి
ప్రాణికీ
ప్రాణసమానమైనది.
అయితే,
మీరు
ప్రేమకు
దూరంగా
ఉంటే
ప్రేమతత్త్వం
మీకు
ఏమాత్రం
అర్థం
కాదు.
ప్రేమతత్త్వాన్ని
అర్థం
చేసుకోవాలంటే
ప్రేమలోనే
మునగాలి.
ప్రాపంచికమైన
ప్రేమను
మనం
చవిచూచి
వదలిపెట్టవచ్చుకాని,
దైవప్రేమను
ఒక్కసారి
చవిచూస్తే
వదలిపెట్టము.
‘ప్రేమమయుండు
శ్రీధరుడు’
ప్రేమయే
అతని
ప్రోపర్టీ.
ప్రేమయే
దైవము.
ప్రేమలో
జీవించండి.
అప్పుడే
దాని
తత్త్వమును
మీరు
పూర్తిగా
గుర్తించిన
వారవుతారు.
ప్రేమతత్త్వము
పలుకుట
చాలా
సులభము.
కానీ,
అర్థము
చేసుకొనుట
చాలా
కష్టము.
కనుక,
మీరు
ప్రేమను
గుర్తించుకోటానికి
ప్రయత్నం
చేయండి.
నీ
ప్రేమను
నీవు
అర్థం
చేసుకుంటే
యితరులయొక్క
ప్రేమను
అర్థం
చేసుకుంటావు.
ప్రేమను
మీరెంతగా
అర్థం
చేసుకుంటే
అంత
గొప్ప
వారౌతారు.
మీ
చుట్టూ,
మీ
ప్రక్కన,
ఎక్కడ
చూచినా
ఉన్నది
ప్రేమయే.
ఈ
ప్రేమను
తెలుసుకుంటే
మీరే
ప్రేమస్వరూపులైపోతారు.
6
▾
Meaning
Keep
రామాయణంలో
ఆదర్శమూర్తులు
రామ,
లక్ష్మణ,
భరత,
శతృఘ్నులు
మరియు
వారి
ధర్మపత్నులు
ప్రేమతత్త్వాన్ని
ఆచరించి,
అనుభవించి,
ప్రపంచానికి
గొప్ప
ఆదర్శమును
అందించారు.
రామాయణంలో
రాముడు
మాత్రమే
గొప్పవాడని
మీరు
భావిస్తున్నారు.
కాదు,
కాదు.
వీరిలో
ప్రతి
వ్యక్తీ
రామునివలె
గొప్పవారే.
లక్ష్మణ,
శతృఘ్నుల
తల్లియైన
సుమిత్రగురించి
మీరు
వినే
వుంటారు.
ఆమె
మహా
గుణవంతురాలు.
‘సు
-
మిత్ర’
అని
తన
పేరుకు
తగినట్లుగా
ఆమె
అందరికీ
మంచి
స్నేహితురాలు.
కైకకు
ఒకే
కొడుకు.
కౌసల్యకు
ఒకే
కుమారుడు.
కాని,
సుమిత్రకు
ఇద్దరు
బిడ్డలు.
ఈమెకు
ఇద్దరు
పిల్లలు
పుట్టడంలోగల
అంతరార్థమేమిటి?
దశరథ
మహారాజు
పుత్రకామేష్టి
యాగమును
ఆచరించినప్పుడు
యజ్ఞపురుషుడు
తనకు
ప్రసాదించిన
పాయసమును
తన
ముగ్గురు
భార్యలకు
సమానంగా
పంచాడు.
సుమిత్ర
శిరస్నానమాచరించి,
పాయసపు
గిన్నెను
తీసికొని
మేడపైకి
వెళ్ళి,
ఎండలో
కురులార్పుకుంటూ
ఉండగా
ఒక
గరుడపక్షి
వచ్చి
ఆ
కప్పును
తన్నుకొని
పోయింది.
సుమిత్ర
వెంటనే
క్రిందికి
వచ్చి
కౌసల్య,
కైకేయిలకు
జరిగిన
సంగతి
చెప్పింది.
వారిరువురూ
చాలా
పవిత్ర
హృదయులు.
“అక్కా!
నీవు
బాధపడనక్కర్లేదు.
మనం
ముగ్గురం
ఒక్కటే.
కనుక,
మిగిలిన
పాయసమును
ముగ్గురం
పంచుకుందాం”
అని
పలికి
కైకేయి
ఒక
కప్పు
తెచ్చి
తన
పాయసంలో
కొంతభాగమును
అందులో
పోసి
సుమిత్రకిచ్చింది.
కౌసల్య
కూడా
తన
పాయసంలో
కొంతభాగమును
సుమిత్ర
కప్పులో
పోసింది.
ముగ్గురూ
యజ్ఞదేవతకు
నమస్కారం
చేసి
ఆ
పాయసమును
సేవించారు.
నవమాసములు
నిండిన
తరువాత
కౌసల్యకు
రాముడు,
కైకకు
భరతుడు,
సుమిత్రకు
లక్ష్మణ,
శతృఘ్నులు
పుట్టారు.
ఐతే,
సుమిత్రకు
ఒక
సమస్య
ఏర్పడింది.
లక్ష్మణ,
శతృఘ్నులు
ఎప్పుడు
చూసినా
ఏడుస్తూ
ఉండేవారు;
పాలు
త్రాగరు,
నిద్రపోరు.
ఆమె
వారిరువురినీ
వసిష్ఠులవారి
దగ్గరకు
తీసుకుపోయి,
“గురుదేవా!
నన్ను
అనుగ్రహించి
వీరి
ఏడ్పుకు
కారణమేమిటో
తెలియజేయండి”
అని
ప్రార్థించింది.
ఆయన
యోగదృష్టితో
పరికించి,
“అమ్మా!
ఆ
రోజున
నీ
పాయసపుగిన్నెను
గ్రద్ద
తన్నుకొనిపోయినప్పుడు
కౌసల్య,
కైకేయిలు
తమ
పాయసమునుండి
కొంతభాగమును
తీసి
నీకిచ్చారు
కదా!
7
▾
Meaning
Keep
కౌసల్య
పాయసమునుండి
పుట్టినవాడు
లక్ష్మణుడు.
అతడు
రాముని
అంశము.
కైకేయి
పాయసమునుండి
పుట్టినవాడు
శతృఘ్నుడు.
అతడు
భరతుని
అంశము.
కాబట్టి,
నీవు
లక్ష్మణుణ్ణి
రాముని
దగ్గర,
శతృఘ్నుణ్ణి
భరతునిదగ్గర
పరుండబెట్టు.
నిశ్చింతగా
నిద్రపోతారు”
అని
చెప్పారు.
సుమిత్ర
ఆవిధంగా
పడుకోబెట్టగానే
వారు
ఏడ్పుమాని
హాయిగా
నిద్రించారు.
తరువాత
ఇద్దరూ
ఆడుకుంటూ
లేచారు.
ఆ
దృశ్యమును
చూసి
సుమిత్ర
ఎంతో
ఆనందించింది.
లక్ష్మణుణ్ణి
రాముని
సేవకోసం,
శతృఘ్నుణ్ణి
భరతుని
సేవకోసం
అర్పితం
చేసింది.
‘వీరిరువురికీ
సేవలు
చేయడానికే
ఈ
పిల్లలు
నా
గర్భంలో
పుట్టారు.
ఇలాంటి
సేవాతత్పరులను
లోకానికి
అందించడం
నా
అదృష్టం’
అని
భావించింది.
భగవంతుడు
ఏ
కారణముచేత
ఏ
కార్యముకోసం
ఎక్కడ
ఎప్పుడు
ఏమి
జరిపిస్తాడనేది
ఎవ్వరికీ
తెలియదు.
క్రమక్రమేణా
పెరుగుతూ
రాముణ్ని
లక్ష్మణుడు,
భరతుణ్ని
శతృఘ్నుడు
నీడవలె
అనుసరిస్తూ
వచ్చారు.
లక్ష్మణ,
శతృఘ్నులు
మహాశక్తిమంతులు.
వీరు
లేకుండా
రామాయణమే
లేదు.
‘వారికి
పుట్టారు,
వీరికి
పుట్టారు’,
అని
మనం
అనుకుంటున్నామేగాని,
అది
సరియైనది
కాదు.
ఈ
నలుగురూ
ఒకే
పదార్థముయొక్క
విభాగములేగాని,
వేరు
కాదు.
కౌసల్య,
సుమిత్ర,
కైకేయిలకు
ఇట్టి
పవిత్రమైన
ప్రాప్తి
లభించింది.
ఒక
పర్యాయము
భరతుడు
పరుగెత్తుకొని
వచ్చి
కౌసల్య
ఒడిలో
కూర్చుని
ఏడుస్తున్నాడు.
“భరతా!
ఎందుకు
దుఃఖిస్తున్నావు?”
అని
ప్రశ్నించింది,
కౌసల్య.
భరతుడు,
“అమ్మా!
బంతి
ఆటలో
నేను
గెలవాలని
అన్న
ఉద్దేశ
పూర్వకంగా
ఓడిపోతున్నాడు.
అదే
నా
దుఃఖానికి
కారణము”
అన్నాడు.
ఎంతటి
అన్యోన్యత!
చూడండి!
ఈవిధంగా
నలుగురు
సోదరులూ
ఒకరిపట్ల
ఒకరు
ఎంతో
అనురాగంగా
ఉంటూ
ఆనందాన్ని
అనుభవిస్తూ
వచ్చారు.
రాముడెక్కడికి
పోయినా
లక్ష్మణుడు
ప్రక్కన
ఉండాలి.
భరతుడెక్కడికి
పోయినా
శతృఘ్నుడు
జతగా
ఉండాలి.
రాముని
తత్త్వము
ఒక్క
లక్ష్మణునికి
తప్ప
మరొకరికి
తెలియదు.
అట్లే,
ఒక్క
శతృఘ్నుడు
మాత్రమే
భరతుని
తత్త్వాన్ని
అర్థము
చేసుకోగలిగాడు.
శతృఘ్నుడనగా
ఎవరు?
శత్రువులను
నాశనం
చేసేవాడు
శతృఘ్నుడు.
ఈ
నల్గురు
సోదరుల
ఆదర్శాలను
అనుసరించక
కేవలం
వారి
గుణగణాలను
వర్ణిస్తూ
కూర్చుంటే
ప్రయోజనం
లేదు.
8
▾
Meaning
Keep
వాళ్ళు
ప్రదర్శించిన
అన్యోన్యతను
మనము
అనుభవించి,
ఆనందించి,
అన్యులకు
అందించాలి.
రామాయణమంటే
కేవలం
ఒక
కథ
కాదు.
అది
ఆత్మతత్త్వముయొక్క
అంతరార్థమును
వివరిస్తుంది.
దానిని
మనం
చక్కగా
గుర్తించి
వర్తించాలి.
రామాయణమును
ఇతర
గ్రంథాలతో
పోల్చడానికి
వీలుకాదు.
దాని
ప్రభావం
‘ఇట్టిది,
అట్టిది’
అని
వర్ణించడానికి
వీలుకాదు.
అయితే,
ఒక్కొక్కరు
ఒక్కొక్క
విధంగా
వర్ణిస్తూ,
పాడుతూ
రావడంచేతనే
లోకములో
రామాయణము
ఇన్ని
విధాలుగా
అభివృద్ధి
గాంచుతూ
వచ్చింది.
లక్ష్మణుని
భార్య
ఊర్మిళ
గొప్ప
పెయింటర్.
ఆమె
తన
గదిలో
కూర్చుని
శ్రీరామ
పట్టాభిషేక
ఘట్టమును
రంగులతో
చక్కగా
చిత్రిస్తున్నది.
రాముని
పట్టాభిషేకము
రద్దయిందనీ,
సీతారామలక్ష్మణులు
వనవాసమునకు
వెళుతున్నారనీ
అప్పటికింకా
ఆమెకి
తెలియదు.
ఇంతలో
లక్ష్మణుడు
హడావుడిగా
వచ్చి,
‘ఊర్మిళా!’
అని
కాస్త
గట్టిగా
పిలిచాడు.
ఆమె
ఉలిక్కిపడి
లేచింది.
పొరపాటున
ఆమె
ప్రక్కనున్న
రంగంతా
ఆమె
గీసిన
చిత్రముపై
ఒలికిపోయింది.
“అయ్యో,
ఈ
చిత్రమును
నేను
చెడగొట్టుకున్నానే”
అని
బాధపడింది.
అప్పుడు
లక్ష్మణుడు,
“ఊర్మిళా!
విచారించకు.
శ్రీరామ
పట్టాభిషేకమును
కైకేయి
చెడగొట్టింది.
నీవు
గీసిన
పట్టాభిషేక
చిత్రమును
నీ
భర్త
చెడగొట్టాడు”
అన్నాడు.
జరిగిన
సంగతి
ఆమెకు
వివరించి
తాను
రామసేవ
నిమిత్తం
అరణ్యానికి
వెళుతున్నట్లు
చెప్పాడు.
ఆమె
ఏమాత్రం
విచారించలేదు;
ఆనందంగా
తన
పతిని
సాగనంపింది.
రాముడరణ్యంలో
ఉన్న
పధ్నాలుగేళ్ళు
అతని
సోదరులు,
వారి
పత్నులు
నిరంతరము
రామ
చింతనే
చేస్తూ
వచ్చారు.
యుద్ధంలో
లక్ష్మణుడు
మూర్ఛిల్లిన
వార్త
తెలిసినప్పుడుకూడా
సుమిత్ర
విచారించలేదు.
“రాముని
సేవలో
ఉన్నాడు
కాబట్టి
అతనికెట్టి
ఆపదలూ
సంభవించవ”ని
ధైర్యంగా
ఉన్నది.
ప్రేమస్వరూపులారా!
ఇక
కొన్ని
సంవత్సరాలలోనే,
ఎక్కువ
కాలము
కూడా
కాదు,
అత్యంత
స్వల్పకాలమునందే
యావత్ప్రపంచము
రామాయణ
కథగా
మారుతుంది.
ఈనాడు
ఇన్ని
కులములు,
ఇన్ని
మతములు,
ఇన్ని
జాతులు
ఉన్నాయని
మనము
అనుకుంటున్నాముగాని,
కొంతకాలములోనే
ఒక్కటే
జాతి,
ఒక్కటే
మతము
ఏర్పడగలవు.
9
▾
Meaning
Keep
మానవత్వాన్ని
ఏకత్వముగా
భావించుకోవడమే
రామాయణము
చాటే
గొప్ప
బోధ.
ఈ
ఏకత్వము
వచ్చినప్పుడే
పవిత్రత
ఏర్పడుతుంది.
పవిత్రత
వచ్చినప్పుడే
అన్యోన్యత
కలుగుతుంది.
అన్యోన్యత
కల్గినప్పుడే
ప్రపంచమంతా
ఆనందము
ననుభవిస్తుంది.
అందరికీ
ఆనందమునిచ్చేది
రామాయణమొక్కటే.
కాబట్టి,
ప్రతి
మానవుడుకూడను
‘రామా,
రామా,
రామా’
అని
స్మరిస్తూ
రావాలి.
రామాయణమునుగురించి
ఎంత
చెప్పినా
తనివి
తీరదు.
రామాయణమును
మనము
ఈనాటికీ,
ఏనాటికికూడా
చదువుతూనే
ఉండాలి.
శ్రీరామచంద్రుని
ఆదర్శమును
అందరూ
అనుసరించాలి.
Previous
←
Jñāna is won through purity of feeling
Next
Develop self-confidence!
→