Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2005 · God Asks Just Two Things of You: Satya and Dharma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
God Asks Just Two Things of You: Satya and Dharma
10 October 2005, Dasara, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 423
Also in his talks
(5)
27 January 1992
Increase the thought of God! Reduce worldly desires!
14 January 1996
There is no wealth greater than Prema
30 August 1996
The Body Must Be Set on the Sacred Path!
22 November 2000
That Which Makes Oneness Known Is True Education
22 November 2001
True education brings the wealth of character
విశ్వశాంతిని
చేకూర్చు
విధము
నేర్పి
సంకుచిత
భావములెల్ల
సమయజేసి
ఐకమత్యము
సహజీవనాదికములు
సమత
నేర్పుట
కాదె
సరస
విద్య
‘విద్య’
అంటే
కేవలం
అనేక
గ్రంథములను
చదివి,
అనేక
విషయములను
తెలుసుకొని
పదిమందికి
బోధించడం
కాదు.
పుస్తకములను
చదివినంతమాత్రమున
లభించే
ఫలితమేమిటి?
నీవూ
ఒక
పుస్తకముమాదిరి
తయారవుతావు.
విశ్వశాంతిని
చేకూర్చు
విధమును
నేర్పి,
ఐకమత్యమునకు,
శాంతియుత
సహజీవనమునకు
దోహదం
చేయునదే
సరస
విద్య.
కేవలం
గ్రంథములు
పఠించడం,
పత్రికలు,
చిన్నచిన్న
పుస్తకములు
చదవడం...
ఇదంతా
లౌకిక
విద్య.
ఈనాడు
జగత్తునందు
చాలామంది
ఇట్టి
చదువే
చదువుతున్నారు.
ఇది
కేవలం
‘ఎడ్యుకేషన్’.
దీనిని
‘విద్య’
అని
చెప్పుటకు
వీలుకాదు.
హృదయమునుండి
ఆవిర్భవించునదే
నిజమైన
విద్య.
దానినే
‘ఎడ్యుకేర్’
అన్నారు.
‘ఎడ్యుకేషన్’కు,
‘ఎడ్యుకేర్’కు
చాలా
వ్యత్యాసమున్నది.
‘ఎడ్యుకేర్’
అనేది
Foundation
(పునాది).
అది
ఆధారము,
‘ఎడ్యుకేషన్’
అనేది
ఆధేయము.
ఈనాడు
మనం
చదివే
గ్రంథములన్నీ
కేవలం
‘ఎడ్యుకేషన్’కు
సంబంధించినవి.
‘ఎడ్యుకేషన్’తోపాటు
‘ఎడ్యుకేర్’నుకూడా
మనము
పొందాలి.
రామాయణ
మహాకావ్యాన్ని
రచించిన
వాల్మీకి
మహర్షి,
భాగవత
గ్రంథకర్తయైన
వ్యాసుడు
తమ
హృదయంలో
ఆవిర్భవించిన
పవిత్రమైన,
దివ్యమైన
భావములకు
అక్షరరూపం
కల్పించారు.
భగవంతునిగురించి
తాము
చేసిన
రచనలు
సరిగా
ఉన్నాయా
లేదా
అని
అన్ని
విధములుగా
గమనించి,
లోతుగా
విచారణ
సల్పి,
తరువాతనే
ప్రపంచానికి
అందించారు.
ఆనాడు
గొప్పగొప్ప
ఋషులందరూ
తాము
ఏమి
చెప్పవలెనన్నను
మొట్టమొదట
దానిని
ఆచరణలో
పెట్టి,
అనుభవించి,
ఆ
తరువాతనే
ఇతరులకు
చెప్పేవారు.
2
▾
Meaning
Keep
ఇట్టి
ప్రబోధలే
సత్యనిత్యమైనవి,
శాశ్వతమైనవి.
ఏదో
అప్పటికప్పుడు
చదివి,
అప్పటికప్పుడు
నేర్చుకొని,
ఆచరణలో
పెట్టకుండా,
అనుభవము
లేకుండా
ప్రచారం
చేసేవారు
అజ్ఞానులు.
ప్రపంచమునందు
భక్తునిగురించి
చెప్పడం
వేరు,
భగవంతునిగురించి
చెప్పడం
వేరు.
ఆనాటి
మహర్షులు
భగవదనుగ్రహమునకు
పాత్రులై,
దివ్యత్వమును
అనుభవించి
వ్రాసినవే
రామాయణ,
భాగవతాది
పవిత్ర
గ్రంథములు.
అదే
నిజమైన
‘ఎడ్యుకేర్’.
వనవాస
సమయంలో
పధ్నాలుగేళ్ళు
అడవిలో
ఉన్నప్పుడు
శ్రీరాముడే
గురువుగా
సీతకు
అనేక
విషయాలు
బోధించాడు.
ఆమె
వాటిని
హృదయంలో
పదిలపరచుకొని
ఆచరణలో
పెడుతూ
వచ్చింది.
వనవాసం
ముగిసిన
తరువాత
సీతారామలక్ష్మణులు
అయోధ్యకు
తిరిగి
వచ్చారు.
శ్రీరామ
పట్టాభిషేకం
అత్యంత
వైభవంగా
జరిగింది.
రోజులు
ఆనందంగా
గడచిపోతున్నాయి.
ఒకనాడు
రాముడు
లక్ష్మణుని
పిలచి,
గర్భవతిగా
ఉన్న
సీతను
అడవిలో
వదలిపెట్టి
రమ్మని
ఆదేశించాడు.
రామాజ్ఞకు
ఎదురు
చెప్పలేక
లక్ష్మణుడు
సీతను
అరణ్యంలో
ఒంటరిగా
వదలిపెట్టి
అయోధ్యకు
తిరిగి
వచ్చాడు.
గంగానదిలో
స్నానమాచరించి,
తన
ఆశ్రమానికి
తిరిగి
వెళుతున్న
వాల్మీకి
సీతను
చూడడం
తటస్థించింది.
ఆమెను
ఓదార్చి,
ధైర్యం
చెప్పి,
తన
ఆశ్రమానికి
తీసికొని
వెళ్ళాడు.
సీత
నిరంతర
రామచింతనలో
కాలం
గడుపుతూ
వచ్చింది.
తొమ్మిది
నెలలు
నిండిన
తరువాత
పండంటి
కవల
పిల్లలకు
జన్మ
నిచ్చింది.
వారికి
‘లవకుశులు’
అని
నామకరణం
చేశారు.
వాల్మీకి
మహర్షి
ప్రేమపూరితమైన
శిక్షణలో
లవకుశులు
గొప్ప
వీరులుగా,
శ్రీరామునికి
తగ్గ
తనయులుగా
రూపొందినారు.
ఒకనాడు
లవకుశులు
ఇంటికి
చేరుకునేసరికి
సీత
కంటినీరు
తుడుచుకోవడం
గమనించారు.
ఇరువురూ
పరుగెత్తిపోయి
తల్లి
పాదాలపై
పడ్డారు.
‘అమ్మా!
ఎందుకు
కంటిధారలు
కారుస్తున్నావు?’
అని
అడిగారు.
‘ఏమీ
లేదు
నాయనలారా!
ఎండకు
తట్టుకోలేక
కంటనీరు
వచ్చింది’,
అన్నది
సీత.
కాని,
లవకుశులు
ఆమె
మాటలను
నమ్మలేదు.
3
▾
Meaning
Keep
కారణం
చెప్పవలసిందేనని
పట్టుపట్టారు.
అప్పుడు
సీత,
‘నాయనలారా!
ఎంతో
గొప్ప
స్థితిలో
ఉండవలసిన
నా
కుమారులు
ఈ
లేతవయస్సులో
అడవిలో
సంచరిస్తూ
కష్టాలు
పడుతున్నారే
అని
బాధగా
ఉంది’,
అన్నది.
అప్పుడు
వారు
చెప్పారు,
‘అమ్మా!
మాకేమి
తక్కువ?
శ్రీరాముని
మించిన
వీర
కుమారులము
మేము.
ఇటువంటి
కుమారులు
నీకుండగా
నీవు
కంటిధారలు
పెట్టడం
ఎందుకు?’
అన్నారు.
ఈవిధంగా
తల్లీ
కుమారుల
మధ్య
జరుగుతున్న
సంభాషణను
గమనించిన
వాల్మీకి
మహర్షి,
‘అమ్మా!
నీ
కుమారులు
సామాన్యులు
కారు.
వారు
అన్ని
విద్యలలోనూ
ఆరితేరినారు.
ప్రతి
విషయాన్ని
‘ఇది
మంచిదా,
కాదా’
అని
చక్కగా
యోచించి
నిర్ణయం
తీసుకుంటారు;
చాలా
తెలివైనవారు,
వివేకము
గలవారు,
విచక్షణా
జ్ఞానసంపన్నులు.
కాబట్టి,
నీవు
వీరిగురించి
చింతించవలదు’,
అని
చెప్పాడు.
అక్కడ
అయోధ్యా
నగరంలో
శ్రీరామచంద్రుడు
అశ్వమేధ
యాగము
చేయ
సంకల్పించాడు.
వేదములలో
చెప్పబడిన
సకల
శుభ
లక్షణములు
గల
ఒక
తెల్లని
గుఱ్ఱమును
అందంగా
అలంకరించి,
‘బలవంతులు
దీనిని
పట్టుకోండి.
లేదా,
శ్రీరామునికి
పన్ను
చెల్లించండి’,
అని
వ్రాయబడినటువంటి
ఒక
సువర్ణ
పట్టమును
దాని
ముఖమునకు
కట్టి
వదలిపెట్టినారు.
శత్రుఘ్నుడు
చతురంగ
సైన్యంతో
ఆ
అశ్వము
వెంట
బయలుదేరినాడు.
ఆ
అశ్వము
వాల్మీకి
మహర్షి
ఆశ్రమ
పరిసరాలలో
సంచరించుచుండగా,
లవకుశులు
దాని
లలాటమున
కట్టిన
సువర్ణ
పట్టమును
చదివి,
దానిని
బంధించారు.
శత్రుఘ్నుడు
వచ్చి,
‘నాయనలారా!
మీరు
బాలురు.
ఎట్టి
కష్టములూ
ఎరుగనివారు.
కాబట్టి,
యుద్ధము
చేయాలనే
ఆలోచనను
విరమించుకొని
మీ
ఆశ్రమానికి
తిరిగి
వెళ్ళండి’,
అని
నచ్చజెప్పడానికి
ప్రయత్నించారు.
కాని,
లవకుశులు
యుద్ధము
చేసే
తీరాలని
పట్టు
పట్టారు.
వారు
దేనికీ
భయపడలేదు.
యుద్ధములో
శత్రుఘ్నుడు
వేసిన
అంబు
తగిలి
లవుడు
మూర్ఛపోయాడు.
వెంటనే
కుశుడు,
‘మా
జనని
జానకీదేవి
పరమ
సాధ్వియేని,
ఇతను
ఈ
అస్త్రమున
మూర్ఛనొందుగాక!’
అని
చెప్పి
ఒక
అస్త్రాన్ని
ప్రయోగించాడు.
అది
తగిలి
శత్రుఘ్నుడు
మూర్ఛిల్లాడు.
తరువాత
వచ్చిన
లక్ష్మణుడు,
భరతుడుకూడా
యుద్ధములో
మూర్ఛిల్లడంతో
చివరికి
రామచంద్రుడే
యుద్ధభూమికి
రాక
తప్పలేదు.
4
▾
Meaning
Keep
సాక్షాత్తు
శ్రీమన్నారాయణుడు,
మానవత్వము
ధరించిన
దివ్య
పురుషుడు
అయిన
శ్రీరాముడే
స్వయంగా
వస్తున్నాడని
తెలిసేటప్పటికి
ఆశ్రమంలో
ఉన్న
మిగిలిన
పిల్లలు
చాలా
భయపడిపోయారు.
రామచంద్రునివెంట
హనుమంతుడుకూడా
వచ్చాడు.
హనుమంతుని
చూసేసరికి
ఆ
పిల్లలందరూ
రామనామాన్ని
ఉచ్చరించడం
ప్రారంభించారు.
రామనామమును
వినేటప్పటికి
హనుమంతుడు
మైమరచిపోయి
తానుకూడా
‘రామ,
రామ...’
అంటూ
పిల్లలతో
స్వరము
కలిపి
వారివెంట
వాల్మీకి
ఆశ్రమంవైపు
నడిచాడు.
హనుమంతుని
చూస్తూనే
సీతకు
చెప్పలేనంత
దుఃఖము
వచ్చింది.
రామచంద్రునికి,
లవకుశులకు
మధ్య
యుద్ధం
ప్రారంభం
కానున్నదన్న
వార్త
అతనిద్వారా
తెలుసుకొని
ఆమె
నిశ్చేష్టురాలైంది.
‘నా
కుమారులకు
ఎందుకిటువంటి
కష్టపరిస్థితి
ఏర్పడింది?
రామునితో
యుద్ధానికి
పూనుకోవడం
ఎంతటి
అవివేకం!’
అని
ఆమె
కన్నులు
మూసుకొని
యోచన
చేస్తూ
వచ్చింది.
‘తెలియక
పెడమార్గం
పట్టిన
పిల్లలను
తండ్రి
సరిదిద్ది
తిరిగి
సన్మార్గంలో
ప్రవేశపెడతాడేగాని,
వారిని
ద్వేషించడు.
తన
బిడ్డలను
ప్రేమించి,
లాలించి,
వారికి
సద్బోధలు
సల్పుతాడేగాని,
వారితో
యుద్ధానికి
పూనుకోడు.
కాబట్టి,
రామచంద్రుడు
కూడా
తన
బిడ్డలను
క్షమించి
చేరదీస్తాడు’,
అనుకొని
సమాధానపడింది.
హనుమంతుని
ఉద్దేశించి,
‘నాయనా!
ఈ
పిల్లలు
నా
పిల్లలే,
శ్రీరాముని
బిడ్డలే.
కాని,
రామచంద్రుడే
తమ
తండ్రియన్న
విషయం
వారికి
తెలియదు.
శ్రీరాముడు
తన
ధర్మపత్నియైన
సీతను
అడవికి
పంపి
బాధ
పెట్టాడనే
కోపంచేత
వారు
ఆయనతో
యుద్ధం
చేయాలని
సంకల్పించుకున్నారు.
ఈరీతిగా
తాము
నేర్చిన
విద్యను
దుర్వినియోగం
చేస్తున్నారు.
శ్రీరామునితో
యుద్ధం
చేస్తే
సీతాదేవి
ఆనందిస్తుందా?
నాయనా!
ఇది
మంచిది
కాదు.
శ్రీరాముడు
శిక్షించినా,
రక్షించినా
నా
మంచికోసమే.
నా
నొసటివ్రాత
ఈరీతిగా
వున్నది.
శ్రీరాముని
చర్యలను
ప్రశ్నించే
అధికారం
మరొకరికి
లేదు.
బంగారమును
అగ్నిలో
వేసి
కాల్చినకొలదీ
అది
మరింత
కాంతిమంతమవుతుంది.
అదేరీతిగా,
ఈ
కష్టముకూడా
నా
మంచి
కోసమే
వచ్చిందని
భావిస్తున్నాను’,
అన్నది.
హనుమంతుడు
సామాన్యుడు
కాడు,
చాలా
గొప్పవాడు;
శాంతుడు,
గుణవంతుడు,
బలవంతుడు.
5
▾
Meaning
Keep
హనుమంతుడు
తలుచుకుంటే
ఎంతటి
ఘనకార్యమునైనా
సాధించగలడు.
సీత
చెప్పేవన్నీ
వింటూ
అతను
ఎంతో
ఆనందించాడు.
‘సీతమ్మవారు
గొప్ప
గుణవంతురాలు.
గుణములో
ఆమెకు
మరెవ్వరూ
సాటిరారు’,
అని
తనలో
తాను
అనుకున్నాడు.
సీత
ఇక
ఆలస్యం
చేయకుండా
యుద్ధభూమికి
పరుగెత్తుకొని
వెళ్ళింది.
యుద్ధమును
విరమించుకొని
శ్రీరాముని
పాదాలపై
పడి
శరణు
వేడవలసిందిగా
తన
కుమారులకు
హితవు
బోధిస్తూ
ఇలా
అన్నది,
“నాయనలారా!
ఇది
మీకు
మంచిది
కాదు.
తండ్రితో
యుద్ధము
చేయడం
మహాపాపం.
తండ్రిని
పూజించి,
ప్రార్థించి,
ఆయన
ప్రేమకు
పాత్రులు
కావలసిందిపోయి
తండ్రితో
యుద్ధం
చేసి
ఆయనను
ఓడించాలనుకోవడం
కేవలం
అవివేకం.
మీరు
ఎలాంటి
పరిస్థితియందు
ఉండినప్పటికీ
తండ్రి
యేనాటికైనా
తండ్రియే.
‘మాతృదేవో
భవ,
పితృదేవో
భవ,
ఆచార్యదేవో
భవ’,
అన్నట్లు,
మాతాపితరులను
ప్రత్యక్ష
దైవాలుగా
భావించి
పూజించాలి.
తండ్రి
ఆజ్ఞను
శిరసావహించాలి.
అంతేగాని,
ఆయనపై
ద్వేషం
పూనకూడదు.
మీరు
విలువిద్యలో
గొప్ప
ప్రావీణ్యం
గడించామని,
ఎవరినైనా
జయించగలమని
గర్విస్తున్నారు.
ఇది
కేవలం
అజ్ఞానంవలన
కలిగిన
అహంకారం
తప్ప
మరొకటి
కాదు.
శ్రీరాముడు
సాక్షాత్తు
పరమాత్మ.
నా
మాటలను
లెక్కచేయకుండా
మీరు
యుద్ధానికి
సిద్ధమైతే,
నేనిక
ఈ
భూమిపై
ఉండను.
మీరు
నా
కుమారులని
చెప్పుకోవడానికే
నాకు
చాలా
అవమానంగా
ఉంటుంది”.
శ్రీరామచంద్రుడే
తమ
తండ్రి
అని
తెలుసుకొని
లవకుశులు
తాము
చేసిన
పనికి
పశ్చాత్తాపపడ్డారు.
రాముడు
అల్లంత
దూరంలో
ఉండగానే
పరుగెత్తుకొని
వెళ్ళి
ఆయన
పాదాలపై
పడి
క్షమాపణ
వేడుకున్నారు.
లవకుశులు
తన
కుమారులే
అని
తెలుసుకొని
రాముడు
ఎంతో
ఆనందించాడు.
ఈరీతిగా,
వాల్మీకి
మహర్షి
రామాయణంలో
ఉన్నది
ఉన్నట్లుగా
వ్రాశాడు.
ఆనాటి
కవులు
కల్పితాలు
చేసేవారు
కారు.
సత్యాన్నే
పలికేవారు.
తమ
రచనలో
ఏ
చిన్న
అసత్యమునకు
కూడా
తావిచ్చేవారు
కాదు.
రామాయణమంతా
సత్యధర్మములపైననే
ఆధారపడి
యున్నది.
6
▾
Meaning
Keep
అనాది
కాలమునుండి
మన
భారత
దేశములో
రామాయణమును
పారాయణం
చేయడం
ఆనవాయితీగా
వస్తున్నది.
మన
ఆశ్రమంలో
కూడా
వేదపురుష
సప్తాహ
జ్ఞాన
యజ్ఞములో
భాగంగా
దుర్గాసప్తశతి,
రామాయణ,
భాగవతాదులను
పారాయణం
చేయడం
జరుగుతున్నది.
దైవముపైన
ప్రధానంగా
నమ్మకమును
పెంచుకోవాలి.
ఏమాత్రం
సందేహాలకు
చోటిచ్చినా
ఉన్న
నమ్మకం
పోతుంది.
అసలు
మానవుడు
అంటే
అర్థమేమిటి?
‘నమ్మకము
కలిగినవాడు’
అని
అర్థము.
కాని,
ఈనాడు
మానవుడు
ఆ
నమ్మకమునే
కోల్పోతున్నాడు.
దైవత్వమును
ఆధారము
చేసుకొన్నప్పుడే
మానవత్వము
ముందుకు
సాగగలదు.
ఎల్లప్పుడు
సత్యాన్ని
పలకాలి.
ధర్మము
ప్రకారం
నడుచుకోవాలి.
భగవంతుడు
మీనుండి
కోరేవి
ఈ
రెండే.
‘సత్యం
వద,
ధర్మం
చర’.
మన
భారత,
భాగవత,
రామాయణాది
పవిత్ర
గ్రంథాలలో
ముఖ్యంగా
ఈ
రెండే
వాక్యములు
వ్రాయబడి
ఉన్నాయి.
కాని,
ఈనాటి
మానవులు
ఇందుకు
పూర్తి
విరుద్ధంగా
నడుచుకుంటున్నారు.
‘సత్యం
వధ,
ధర్మం
చెఱ’.
సత్యమును
వధిస్తున్నారు,
ధర్మమును
చెఱసాలలో
పెడుతున్నారు.
సత్యధర్మములను
ఆచరణలో
పెట్టి
సరియైన
మార్గాన్ని
అనుసరించినప్పుడే
దేశం
బాగుపడుతుంది.
Truth
is
God;
speak
truth.
సత్యమే
రక్షిస్తుంది.
ప్రేమస్వరూపులారా!
భగవంతుడు
ఎప్పుడూ
అందరినీ
రక్షించే
వాడేగాని,
ఎవ్వరినీ
శిక్షించేవాడు
కాడు.
కాని,
ఈ
సత్యాన్ని
గుర్తించుకోలేక
మానవులు,
‘భగవంతుడు
అమాయకులను
బాధిస్తున్నాడే’,
అని
అనుకుంటారు.
భగవంతుడు
ఎవ్వరినీ
ద్వేషించేవాడు
కాడు.
ద్వేషము,
క్రోధము,
హింస
ఇవన్నీ
ఆయనకు
తెలియని
పదములు.
ఇటువంటి
దేవుణ్ణి
కొందరు
అనేకరకములుగా
విమర్శిస్తున్నారు.
ఈనాడు
రామాయణమును
గురించి
అనేక
గ్రంథములు
వచ్చినాయి.
కాని,
రామాయణం
అందించే
ఆదర్శాలను
మాత్రం
మానవుడు
అనుసరించడం
లేదు.
రామునికి
ద్వేషమంటే
తెలియదు.
‘నేను,
నీవు
ఒకటే’
అనే
సత్యాన్ని
పలికి,
ఏకత్వాన్ని
అనుభవించినవాడు
రాముడు.
సత్య,
ధర్మములనే
ఆధారం
చేసుకుని
దేశాన్ని
పరిపాలన
చేస్తూ
వచ్చాడు.
రామాయణమును
రష్యన్లుకూడా
వారి
భాషలో
వ్రాసుకున్నారు.
పూర్వం
రష్యాలో
అంతర్భాగంగా
ఉండిన
కజకిస్థాన్
దేశాధ్యక్షుని
సతీమణి
కొంతమందితో
కలిసి
నిన్నటి
దినం
ఇక్కడికి
వచ్చింది.
7
▾
Meaning
Keep
Also in his talks
(14)
4 January 1987
The Bhagavad Gītā is a book to be practised
29 September 1987
The Veda is what shows the oneness in the many
14 January 1990
Sports and Spirituality
24 November 1990
Share in Bhagavan's love
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
15 January 1996
Only one who masters the mind can reach Mādhava
17 February 1996
Equal-mindedness is the culture of Bhārata
22 June 1996
Service to Society Is the Mark of True Humanness
25 August 1996
‘Always, at All Times, Everywhere, I Alone’
20 October 1996
When the Heart Is Turned to Prema, the World Turns to Brahman
1 January 1998
Happiness and sorrow cannot be parted
22 November 1998
The Education of Bhārata Is What Develops the Divine Human Principle
17 August 2005
Only what fosters unity is true education
వాళ్ళుకూడా
రామాయణాన్ని
గురించి
ఎంతో
ఆనందంగా
విన్నారు.
వాళ్ళు
తమ
ప్యాలెస్లో
పూజలు
చేస్తున్నారు.
కఠిన
హృదయులైన
కమ్యూనిస్టులుకూడా
భక్తులుగా
మారిపోతున్నారు
గాని,
మన
భారతీయులకే
ఇంకా
భక్తి
కుదరటం
లేదు.
అనేక
సంవత్సరాలు
బ్రిటీషువారితో
చేరడంచేత
దైవదూషణ
చేసుకుంటూ
వచ్చారు.
అయితే,
భగవంతుడు
అందరిలో
హృదయ
పరివర్తన
తీసుకు
వస్తున్నాడు.
మీరు
నిరంతరం
ప్రార్థన
చేస్తూ
వుంటే
మీ
మనస్సులో
కూడా
మార్పు
తీసికొని
వస్తాడు.
ఒక్క
విషయం
మీరు
గుర్తించాలి
-
కొంతకాలము
లోపల...
ఎక్కువ
కాలము
లేదింక...
చాలా
తక్కువ
కాలము
లోపల
ప్రపంచమంతా
ఒక్క
భావము
చేరిపోతుంది.
‘కలసి
మెలసి
తిరుగుదాం
కలసి
మెలసి
పెరుగుదాం
కలసి
మెలసి
తెలుసుకున్న
తెలివిని
పోషించుదాం
కలసి
మెలసి
కలత
లేక
చెలిమితొ
జీవించుదాం’.
అందరూ
ఇలాంటి
మార్గానికి
వస్తారు.
ఇది
అతి
శీఘ్రకాలములోనే
సిద్ధిస్తుంది.
వ్యక్తిగతమైన
భేదములు,
ద్వేషములు
భారతదేశములో
ఇక
ఉండవు.
ఇప్పుడు
ఉండినట్లు
కనిపిస్తున్నాయిగాని,
మున్ముందు
ఇలాంటి
భావములే
ఉండవు.
ప్రేమస్వరూపులారా!
భగవంతుని
ప్రేమ
ఇట్టిది,
అట్టిది
అని
ఎవ్వరూ
వర్ణించలేరు.
అట్టి
దైవప్రేమను
ద్వేషించడం,
విమర్శించడం
మహాపాపం.
కాబట్టి,
మీరందరూ
దైవాన్ని
ప్రేమించండి.
మీలోని
దుర్గుణాలన్నింటినీ
పవిత్రమైన
యజ్ఞాగ్నిలో
భస్మం
చేయండి.
పవిత్రమైన
రామచరిత్రను
మీరు
వింటూ,
పలుకుతూ,
అనుసరిస్తూ
ఉంటే
ప్రపంచము
ఎంతగానో
మారిపోతుంది.
ఎట్టి
పరిస్థితి
యందైనను,
ఎట్టి
కష్టములందైనను
రామనామాన్ని
మాత్రం
మరువకండి.
సదా
రామనామాన్ని
స్మరిస్తూ
ఉండండి.
Previous
←
The Ātma Is the One Bond Among All
Next
The Paramātma in All Is One
→