Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · Bhārat is the home of Satya and Dharma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Bhārat is the home of Satya and Dharma
20 March 1988, Bombay
1
▾
Meaning
Keep
వేదాంత
గ్రంథముల్
వెలయంగ
తాచదివి
నేర్పు
మాటలందు
నిపుణుడైన
సద్గుణంబులు
మదిని
చక్కగా
లేకున్న
వాడు
నరుడు
అగునె
వాస్తవముగ.
దివ్యాత్మస్వరూపులారా!
ప్రాచీనకాలమునుండి
భారతదేశము
అనేక
దేశములకు
ఆధ్యాత్మిక
తత్త్వమును
ప్రబోధిస్తూ
వస్తున్నది.
లోకాసమస్తాస్సుఖినో
భవంతు
అన్నదే
హైందవ
సాంప్రదాయము
యొక్క
లక్ష్యము.
ఆధ్యాత్మికమనగా
వంటరితనమనిగాని
ఏకాకి
జీవితమనిగాని
భావించరాదు.
యావత్
మానవ
కోటిని
ఏకాత్మగా
విశ్వసించి
గుర్తించటమే
ఆధ్యాత్మికము
యొక్క
తత్త్వము.
భారతదేశము
సత్యధర్మములకు
ఆలవాలమైనది.
సత్యం
వద
ధర్మం
చర
అనే
మహావాక్యములను
జగత్తునకు
వ్యాపింపజేసి,
ఆచరింపచేసి,
ఆనందించి,
పదిమందికి
పంచినది
భారతదేశము.
ఇట్టి
పవిత్రమైన
భారతీయ
సంస్కృతిని
యీనాడు
మానవుడు
విస్మరించి
లౌకికమైన,
భౌతికమైన
జీవితమును
ఆశించి
అనేక
విధములైన
అశాంతికి
గురౌతున్నాడు.
సత్యధర్మము
లేని
మానవుని
యొక్క
నేత్రములు
దేహమునకు
యేవిధముగా
నేత్రములు
లేకుండిన
అంధత్వము
అనుభవించునో
…నకు
కూడను
యీ
సత్యధర్మములు
లేకుండిన
అంధత్వము
అనుభవిస్తుంది.
భారతీయులు
తెల్లవారి
మొదలు
రాత్రి
పరుండునంత
వరకు
కూడను
యీ
పవిత్రమైన
భారతీయ
సాంప్రదాయములను,
వేదప్రమాణములను
తెలిసియో
తెలియకో
అనుసరిస్తూ,
ఆచరిస్తూ,
అనుభవిస్తూ
వస్తున్నారు.
ఇలాంటి
సంస్కృతిని
కల్గిన
భారతీయులు
యీనాడు
సంస్కారమునకు
దూరమై
సంసారమునకు
సమీపమవుతున్నారు.
మానవుడు
బ్రహ్మనుండి
వచ్చినవాడుగాని,
ప్రకృతినుండి
వచ్చినవాడు
కాదు.
ఎంతకాలము
జీవించినప్పటికిని
మనవెంట
సంసారము
రాదు.
సంస్కారమే
మన
వెంట
వచ్చేది.
2
▾
Meaning
Keep
Also in his talks
(2)
4 October 1989
Grasp the Supreme Goal of Life
7 October 1989
All Human Life Is the Very Form of Yajña
ఏమి
తాగొని
వచ్చె,
ఏమి
తాగొనిపోయె
పుట్టునప్పుడు
మరి
గిట్టునపుడు
ధనము
నెచ్చటికేగు
తానేగునెచ్చటికి
వినుడు
భారతీయ
వీరసుతుడ.
కేవలము
లౌకికమైన,
భౌతికమైన
జీవితమే
ప్రమాణము,
ప్రధానముగా
భావించి,
పవిత్రమైన,
నిత్యమైన,
సత్యమైన
మానవత్వాన్ని
వ్యర్థము
గావించుకోటం
యిది
నిరర్థకమైన
జీవితమే!
చిన్న
ఉదాహరణము.
భారతదేశమునందు
తల్లి,
తండ్రి,
గురువు,
దైవము
అను
మాటలు
వరుసగా
ప్రతివారి
నోటను
మనము
వింటూనే
వుంటాము.
ఈ
క్రమమునకు
అంతరార్థము
యేమిటి?
మానవుడు
పుట్టిన
తక్షణమే
కంటికి
కనుపించునది
తల్లి.
పాలిచ్చి
పోషించి,
లాలించి
పాలించునది
తల్లి.
అట్టి
తల్లియే
మొట్టమొదటి
దైవము.
ఆ
తల్లి
తప్ప
అన్యులు
తండ్రిని
చూపలేరు.
కనుకనే
తన
అభివృద్ధిని
ఆశించి
వున్నతస్థాయికి
గొనిపోయే
తండ్రిని
చూపించునది
తల్లి.
తన
కుమారుని
కీర్తి
గౌరవములను
జగత్వ్యాప్తి
గావింపచేసుకొనుటకై
అనేక
రకములుగా
ఆశలను
పెంచుకొని
చక్కని
గురువును
చూపించుతాడు
తండ్రి.
గురువు
అంతర్
బహిర్
తత్త్వములను
బోధించి,
లౌకిక
వైజ్ఞానికములను
ఆచరింప
చేసి
అనేక
విధముల
వున్నతస్థాయికి
గొనివచ్చిన
తదుపరి
భగవంతుని
చూపువాడే
గురువు.
తల్లి
తండ్రిని
చూపటం,
తండ్రి
గురువును
చూపటము,
గురువు
దైవమును
చూపటము
యీవిధమైన
క్రమాన్ని
అనుభవించుతూ
వచ్చింది
ప్రాచీన
కాలము
నుండి
భారతదేశము.
కనుక
తల్లి
తండ్రి
గురువు
దైవము
అనే
క్రమపద్ధతి
అనుసరిస్తూ
వచ్చింది.
అదేవిధముగనే
భక్తి,
జ్ఞాన,
వైరాగ్య
తత్త్వము
యీ
నాల్గింటి
యొక్క
తత్త్వము
చేతనే
ముక్తి
మనకు
ప్రాప్తిస్తుందని
మన
యొక్క
వేద
ప్రమాణము.
భక్తి,
జ్ఞానమును
ప్రబోధిస్తుంది.
జ్ఞానము
వైరాగ్యమును
చేకూరుస్తుంది.
ఈ
వైరాగ్యము
తత్త్వజ్ఞానమును
గుర్తింపచేస్తుంది.
భక్తి,
జ్ఞాన,
వైరాగ్య,
తత్త్వమనే
యీ
నాలుగు
స్థంభములే
ముక్తి
భవనమునకు
సరైన
స్థంభములు.
ఈ
నాలుగు
సోపానముల
చేతనే
ముక్తి
స్థానమును
మానవుడు
పొందగల్గుచున్నాడు.
దీనికి
చక్కని
ఆదర్శము
భాగవతము.
ఈ
భాగవతమందు
ఐదు
అక్షరములు
వుంటున్నాయి.
భా-గ-వ-త-ము.
ఈ
భకారమనే
…సంకేతము.
ఈ
భక్తి
చేతనే
జ్ఞానము
మనకు
అలవడుతున్నది.
ఈ
భకారమనే
సంకేతము
చేతనే
గకారమనే
సంకేతము
బోధింపచేస్తుంది.
ఈ
గకారమనే
జ్ఞానము
వకారమనే
వైరాగ్యమును
చేర్చగలుగుతున్నది.
3
▾
Meaning
Keep
ఈ
వకారమనే
వైరాగ్యము
తకారమనే
తత్త్వములో
ప్రవేశింప
జేస్తుంది.
ఈ
తత్త్వజ్ఞానమే
ముక్తిలో
ప్రవేశిస్తుండాది.
కనుకనే
భకారమనే
భక్తి
గకారమనే
జ్ఞానము
ద్వారా,
వకారమనే
వైరాగ్యములో
ప్రవేశించి
తకారమనే
తత్త్వాన్ని
ప్రబోధచేసి
మకారమనే
ముక్తిలో
ప్రవేశిస్తున్నాది.
కనుకనే
భాగవతమనేది
ముక్తికి
మార్గములైన
సోపానములని
మనము
గుర్తించవలసి
వస్తుంది.
ఈ
భాగవతమునందు
ప్రహ్లాద
చరిత్ర
అతి
ప్రధానమైనది.
ఈ
ప్రహ్లాదుడు
విద్యార్థిగా
వుండే
సమయములో
తన
తోటి
విద్యార్థులతో
కూడి
దేన
శుభము
లేదు
దివ్యకీర్తియు
లేదు
జగతి
బుట్టి
పుట్టి
చచ్చి
చచ్చి
పొరలనేల
మనకు
బుట్టని
చావని
త్రోవ
వెదకికొనుట
దొడ్డబుద్ధి.
అన్నాడు.
త్రోవ
వెదకికొనుట
దొడ్డబుద్ధి
అన్నాడు.
ఏ
త్రోవను
వెతకాలి.
అదియే
మనము
వచ్చిన
త్రోవను
వెతకాలి.
వచ్చిన
త్రోవను
మరచిపోయిన
దౌర్భాగ్యులమైనామిప్పుడు.
ఎక్కడనుండి
వచ్చాము?
ఎక్కడికి
పోవటానికి
వెతుకుతున్నాము.
ఇదే
మన
మానవత్వములో
వున్న
అంధత్వము.
దీనినే
భాగవతములో
ఎచ్చట
పుట్టె
నచ్చటు
కేగుట
నైజము
ప్రాణికోటికిన్.
ఎక్కడనుండి
పుట్టెనో
అక్కడికి
పోవటం
దాని
లక్ష్యము.
మనము
బ్రహ్మనుండి
వచ్చిన
వారము.
ఆత్మనుండి
వచ్చిన
వారము.
అందుకోసం
ఆత్మవైపు
మనము
ప్రయాణము
సలపాలి.
కనుకనే
మమైవాంశో
జీవలోకే
జీవభూత
స్సనాతనః
అన్నాడు.
అనగా
యీ
ప్రపంచమనేది,
యీ
మానవుడు
నా
అంశమేగాని,
ప్రకృతి
అంశముగాని,
పంచభూతముల
అంశముగాని
యింకే
అంశముగాని
కాదు.
నా
యొక్క
అంశమే
అని
చక్కగా
వుద్ఘాటించాడు.
కనుకనే
మనము
ఎచ్చటనుండి
వచ్చితిమో
అచ్చటికి
పోవటంకోసం
ప్రయత్నం
చేయాలి.
అదే
దొడ్డబుద్ధి.
కాని
ఆ
స్థానమును
మనము
మరచిపోయి
యీ
ప్రకృతి
లోపల
సౌఖ్యసంతోషములతో
మునిగి
కేవలము
మత్తుడై
వున్మత్తుడై
జీవించటమే
ఒక
గొడ్డు
బుద్ధి.
దీనినే
పురందరదాసు
చెప్పాడు,
ఓ
భగవంతుడా
చిన్మయమూర్తియైన
నిన్ను
మరచటం
చేతనే
నేను
యీ
మృణ్మయ
దేహాన్ని
ధరించవలసి
వచ్చింది.
ఈ
ప్రకృతి
మృణ్మయమైనది.
ఇక్కడకు
రావటానికి
కారణము
యేమిటి?.
నిన్ను
మరచటము
చేతనే.
కనుక
మనము
యీనాడు
యీ
జగత్తునందు
ఈ
విధమైన
జీవితాన్ని
గడపటానికి
కారణం
యేమిటి!
దైవమును
మర్చటమే
మూలకారణము.
మనము
అనుభవించే
సుఖసంతోషములన్నీ
క్షణ
భంగురమైనవి.
శంకరాచార్యుడు
కూడను
చెప్పాడు.
మాకురు
ధన
జన
యవ్వనగర్వం
హరతి
నిమేషాత్
కాలస్సర్వం.
ధన
మద
జన
బలము
యొక్క
గర్వములంతా
క్షణ
భంగురములు.
4
▾
Meaning
Keep
Also in his talks
(2)
13 February 1972
Śivarātri at Brindavan
9 January 1988
God in the heart, work in the hands
జీవితము
వుండగనే
దివ్యత్వమనే
ఆత్మతత్త్వము
అనుభవించటమే
నిజమైన
మానవుని
కర్తవ్యము.
భగవంతుడు
యెక్కడో
ఏ
వైకుంఠమునందో,
ఏ
కాలమునందో
వున్నాడు
అనే
వ్యామోహమును
కొంత
వరకు
మనము
మానాలి.
ఈ
వైకుంఠము,
స్వర్గము,
కైలాసము
యివన్నీ
కేరాఫ్
ఎడ్రస్సులు.
ఈ
ప్రార్థనలు
చేరితే
చేరవచ్చునుగాని
ఆలస్యముగా
పోవచ్చును.
కరెక్ట్
ఎడ్రస్
మనం
గుర్తించుకోటానికి
ప్రయత్నించాలి.
ఈశ్వర
స్సర్వ
భూతానాం.
హృదయవాసి
భగవంతుడు.
కరెక్ట్
ఎడ్రస్
తీసుకుంటే
అతి
త్వరగా
ప్రార్థన
అతనికి
చేరిపోతుంది.
కనుకనే
భగవద్గీత
యందు
మమైవాంశో
జీవలోకే
అని
చెప్పి
తదుపరి
18వ
అధ్యాయము
లోపల
61వ
శ్లోకములో
తనయొక్క
స్వరూపాన్ని
అందిస్తూ
వచ్చాడు.
ఈశ్వర
స్సర్వభూతానాం
హృద్దేశేఽర్జున
తిష్ఠతి
భ్రామయన్
సర్వభూతాని
యన్త్రారూఢాని
మాయయా.
…యమనే
ఒరయందు
భగవంతుడు
నివాసము
చేస్తున్నాడు.
త్వమేవ
శరణం
గచ్ఛ
అన్నాడు
62వ
శ్లోకంలో
తిరిగి.
హే!
అర్జునా
నీవు
నాకు
శరణాగతి
పొందనక్కరలేదు.
నీకు
నీవు
శరణు
జొచ్చుకో.
సర్వభూతములయందు
వుండిన
భగవంతుడు
నీయందు
మాత్రము
లేడా.
కనుక
నీ
హృదయేశుడే
నీ
భగవంతుడు.
నీవే
భగవంతుడు.
కేవలము
దేహధారివై
వుండటం
చేత
మాయనుగప్పి,
మర్మమును
తెలుసుకొనక,
ధర్మమును
ఆచరించక
కర్మను
నీవు
అనుభవిస్తున్నావు.
ఈ
జన్మ
రావటానికి
కారణం
యేమిటి?
మన
కర్మలే
దీనికి
మూలకారణము.
ఈ
కర్మలు
దేనిని
ఆధారము
చేసుకుని
ఆచరించాలి.
ధర్మాన్ని
ఆధారం
చేసుకుని
ఆచరించాలి.
ఈ
ధర్మము
ఎక్కడకు
గొనిపోతుంది.
బ్రహ్మను
చేరుస్తుంది.
కనుక
మానవ
జీవితమనే
భవనమునకు
కర్మ,
జన్మ,
ధర్మ,
బ్రహ్మ
అనే
నాల్గు
సోపానములు.
కర్మచేతనే
ధర్మము
లభిస్తుంది.
ఈ
కర్మ,
ధర్మనిమిత్తమే
ఆచరించాలి.
ఈ
ధర్మమే
బ్రహ్మను
చేరుస్తుంది.
భగవంతుడు
ధర్మ
స్వరూపుడు.
సత్యస్వరూపుడు.
ఇట్టి
సత్యధర్మములతో
కూడిన
భారతదేశము
ప్రపంచమునకు
హృదయము
వంటిది.
ప్రపంచమునకే
హృదయస్థాయి
అయిన
భారతదేశము
మన
హృదయమునకు
మాత్రము
హృదయస్థాయి
కాదా!
ఈనాటి
మానవుడు
యింత
అజ్ఞానములో
వుండటానికి
కారణం
యేమిటి!
మానవుడు
ఏడు
విధములైన
పాశములచే
కట్టబడ్డాడు.
దేహము
ఒక
బంధన.
కర్మ
రెండవ
బంధన,
రాగము
మూడవ
బంధన.
ద్వేషము
నాల్గవ
బంధన.
అహంకారము
ఐదవ
బంధన.
అవివేకము
ఆరవ
బంధన,
అజ్ఞానము
ఏడవ
బంధన.
5
▾
Meaning
Keep
ఈ
అజ్ఞానము
అవివేకమునందే
పుడుతున్నాది.
ఈ
అవివేకము
అహంకారమునుంచి
ఆవిర్భవిస్తున్నది.
ఈ
అహంకారము
రాగము
చేత
బయలుదేరుతున్నది.
ఈ
రాగమునుండి
ద్వేషము
ప్రారంభమవుతుంది.
ఈ
అన్నింటి
చేత
కర్మ
నాచరిస్తున్నాడు.
ఈ
కర్మల
ద్వారా
దేహమనే
జన్మను
మనం
ఎత్తుతున్నాము.
కనుక
దేహముచేత
సత్కర్మలు
ఆచరించి
రాగద్వేషాలను
త్రుంచి
అహంకారము
నిర్మూలము
గావించి
ఈ
అజ్ఞాన,
మమకారములను
దూరము
చేసినప్పుడే
ఆత్మస్వరూపుడుగా
నీవు
వెలుగుతావు.
భగవంతునితో
ఏకత్వము
వహించటము,
అనుభవించటము,
ఆనందించటమే
నిజమైన
మానవుని
కర్తవ్యము.
సముద్రమున్నది.
ఈ
సముద్రము
లోపల
తడి,
చల్లదనము,
తెల్లదనము
మూడు
గుణములుంటున్నాయి.
ఈ
సముద్రమునుండి
వెలువడిన
అలలయందు
కూడను
ఈ
గుణములే
వుంటున్నాయి.
కనుక
బ్రహ్మస్వరూపుడే
భగవంతుడనే
సముద్రము.
ఈ
సముద్రము
నందున్న
అలలు
యీ
జగత్తులోని
జీవులు.
సముద్రమునందుండే
తడి,
చల్లదనము,
తెల్లతనము
ఆ
మూడు
కూడను
యీ
యొక్క
జీవుని
యందు
కూడను
వుంటున్నవి.
ఈ
అలలయందు
కూడ
వుంటున్నాయి.
రూపనామములు
వ్యత్యాసం.
కానీ
గుణసంపర్కమైన
ఆత్మతత్త్వమొక్కటే.
కనుక
అందరియందు
వుండేది
ఆత్మతత్త్వమనే
సత్యాన్ని
మనము
గుర్తించి
వర్తించటమే
నిజమైన
ఆధ్యాత్మికము.
ఇలాంటి
ఆధ్యాత్మిక
తత్త్వాన్ని
మనమాచరించి,
ఆనందించి,
పెంచి,
పదిమందికి
పంచటమే
మనయొక్క
సేవా
తత్త్వము.
సేవ,
సేవ,
సేవ.
అయితే
యీ
సేవను
యేరీతిగా
మనము
చేయాలి?
ప్రాకృతమైన
దృష్టితో
మనము
సేవ
చేస్తే
యిది
బంధకారణము.
ఏ
విధమైన
ఫలితమును
ఆశించకుండా
చేయాలి.
సేవ
అనేది
యిచ్చుకోటమేగాని
పుచ్చుకోటం
కాదు.
కానీ
యినాటి
సేవ
యిచ్చుకోటం
పుచ్చుకోటం.
ఏ
సేవ
చేస్తే
ఏ
ఫలితము
నాకు
లభిస్తుంది
ఏ
సేవలో
పాల్గొంటే
ఏ
కీర్తి
నాకు
లభిస్తుంది.
ఈ
పేరు
ప్రతిష్టల
కోసము,
కీర్తి
మర్యాదలకోసము
మనము
సేవలో
యేమాత్రము
పాల్గొనరాదు.
నా
ప్రియమైన
భగవంతునికే
నేను
సేవ
చేస్తున్నాను
అనే
ఏకాత్మ
భావముతో
మనం
సేవ
చెయ్యాలి.
ఇది
కేవలము
ఆత్మతృప్తికై
తను
ఆచరించినట్టుగా
భావించాలి.
నేను
ఎవరికో
సేవ
చేస్తున్నాను,
నేను
సేవ
చేసేవాడిని,
చేయించుకునే
వాడు
ఆ
వ్యక్తి
అనే
అహంకారమునకు
అవకాశము
యివ్వరాదు.
ఏ
సేవలు
చేసినప్పటికి
ప్రేమ
భావముతో
చెయ్యాలి.
ఇదే
నిజమైన
ఆధ్యాత్మికము.
ఈ
విధమైన
కర్మలలో
మనం
ప్రవేశించాలి.
Work
is
worship.
duty
is
God.
ఇదే
మన
నిజమైన
కర్తవ్యము.
ఈనాడు
మన
కర్తవ్యమును
విస్మరించి
పోతున్నాము.
కర్మయొక్క
ఫలితాన్ని
ఆశిస్తున్నాము.
తద్వారా
మనము
బంధితులమవుతున్నాము.
అశాంతికి
గురౌతున్నాము.
6
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ఆధ్యాత్మిక
తత్త్వమంటే
కేవలము
దేవాలయములకు
పోవటము,
యాత్రలు
చేయటము,
దైవమును
పూజించటము,
దైవ
చింతన
చేయటము
యిత్యాది
మాత్రమే
కాదు.
ఇవి
కేవలము
సత్కర్మలు.
ఇవి
ఆచరించ
తగ్గవిగానీ
చిత్తశుద్ధితో
మనము
సేవలు
చేయాలి.
నిజముగా
యీ
సేవ
దైవసేవగా
భావించాలి.
ఈనాడు
ఎక్కడ
చూచినా
నాయకులుగా
కనుపిస్తున్నారుగాని
సేవకులుగా
ఎక్కడా
కనుపించటము
లేదు.
ఈనాడు
భారతదేశము
సేవకత్వమును
కోల్పోయింది.
నాయకత్వమునకు
అఱ్ఱులు
చాస్తున్నది.
సేవకుడు
కాక
నాయకుడు
కావటానికి
వీలు
లేదు.
సేవకుడు
కాని
నాయకుడే
ఈనాడు
జగత్తుకు
యింత
అపకారము
చేస్తుండేది.
సేవకులు
కావాలి
ముందు.
సేవలయందే
గౌరవము,
ప్రతిష్ఠ,
ఆహ్లాదము
కలుగుతుంది.
కనుక
దైవబిడ్డయైన
ప్రతి
…
చేతనైనంత
సేవ
చేయటానికి
ప్రయత్నించాలి.
ఇలాంటి
పవిత్రమైన
భావములచేత
మానవత్వమును
సార్థకము
చేసుకోటానికి
ప్రయత్నించాలి.
భజన
చేస్తున్నాము.
పూజలు
చేస్తున్నాము.
ధ్యానము
చేస్తున్నాము.
జపములు
చేస్తున్నాము.
ఇవన్నీ
సత్కర్మలే!
ఈ
కర్మల
యొక్క
ఫలితము
ఏమిటి?
కేవలము
తనలో
ప్రవేశించిన,
తనను
ఆవరించిన
మాలిన్యమును
దూరము
చేసుకోటం
కోసమే.
ఈ
కర్మల
వల్ల
మాలిన్యము
దూరమవుతుందేగాని
దైవానుగ్రహము
యేమాత్రము
లభించదు.
సత్కర్మలన్నియు
మన
మాలిన్యములు
దూరము
చేయటానికే.
తదుపరి
దైవానుగ్రహమునకు
పాటుపడాలి.
దైవము
తనయందే
వుంటున్నాడు.
దైవము
ప్రత్యేకముగా
లేడు.
దైవమును
మరచటం
చేతనే
మానవత్వమునే
గుర్తించటానికి
ప్రయత్నిస్తున్నాము.
ఒక
చక్కని
ఉదాహరణము.
ఒక
నిప్పు
వుంటుండాది.
ఆ
నిప్పును
మనము
అలక్ష్యము
చేయటము
వలన
ఆ
నిప్పునుండి
నిమురు
వచ్చి
ఆ
నిప్పును
కప్పివేస్తుంది.
నిమురు
అనగా
బూడిద.
ఆ
నిమురు
మూసివేసింది.
కనుక
మనకు
నిప్పు
కనుపించటం
లేదు.
నిప్పు
యెక్కడ
వుంది.
దాని
లోపలనే
వుంది.
ఆ
నివురును
మనము
వూదివేస్తే
నిప్పు
కనుపిస్తుంది.
అదేరీతిగనే
దైవత్వమనేది
మనలో
వుంది.
మనము
కేవలము
అలక్ష్యము
చేయటం
వలన,
దైవచింతన
చేయకుండా
పోవటం
చేత
అక్కడ
మాయ
అనే
ప్రకృతి,
వాంఛ
అనే
నివురు
కప్పిపోతుంది.
ఆ
మాయ
ఎక్కడ
నుండి
వచ్చింది.
అగ్నినుంచే
వచ్చింది.
ప్రత్యేకముగా
యెక్కడనుండో
రాలేదు.
అగ్నినుంచే
వచ్చి
అగ్నిని
కప్పివేసింది.
మనము
సత్కర్మల
ద్వారా
సేవల
ద్వారా
మనము
దానిని
తగిన
ప్రయత్నము
చేసి
కర్తవ్యమును
నిర్వర్తిస్తే
ఆయొక్క
ధూళి
పోతుంది.
ఎప్పుడు
ఆ
నివురు
పోయెనో
నిప్పు
సహజంగానే
కనిపిస్తుంది.
నీవు
ఆత్మస్వరూపుడే
అయినావు.
నీనుంచి
భ్రాంతియే
నిన్ను
కప్పివేస్తుంది.
7
▾
Meaning
Keep
Also in his talks
(2)
21 November 1988
Karma Is Done Only for Purity of Citta!
4 July 1996
Spiritual Sādhana in Everyday Life
దివ్యత్వము
యెక్కడో
వున్నదని
తపించి
వెతుకుతున్నాము.
అయితే
యీ
ప్రకృతి
సంబంధమైన
భావములు
కొంచెము
దూరము
చేస్తే
నీకు
నీవుగానే
కనుపిస్తావు.
నీకు
నీవు
సాక్షాత్కరిస్తావు.
ప్రేమస్వరూపులారా!
మీరు
ఆధ్యాత్మిక
మార్గములో
కాలమును
వ్యర్థము
చేయటానికి
ప్రయత్నించకండి.
భజించుచూ
సేవలు
చేయాలి.
హృదయములో
దైవత్వమును
విశ్వసించండి.
చేతితో
సత్కర్మలు
ఆచరించండి.
దీనినే
దిల్మే
రామ్.
హాత్
మే
కామ్
హృదయములో
దైవత్వమును
విశ్వసించక
చేతులతో
ఎంతగొప్ప
పనులు
చేసినప్పటికి
యివి
కేవలము
వ్యర్థమైన
పనులే.
సారము
కల్గిన
పనిగా
మనము
ప్రయత్నించాలి.
ఎవరినీ
మనము
దూషించకూడదు.
పరుల
దూషణ
చేయ
పాపఫలంబబ్బు
విడువదెన్నటికిని
విశ్వమందు
పరులు
పరులు
కారు
పరమాత్ముడగునయా
మరువబోకుడిట్టి
మంచిమాట.
పరులు,
పరులు
కారు.
పరమాత్ముడే.
ఇలాంటి
విశాలమైన
భావము,
పవిత్రమైన
హృదయము,
దివ్యమైన
భావము,
ప్రేమ
మనము
పెంచుకొనుటకే
యీ
సాధనలంతా
అవసరము.
ప్రపంచము
మెచ్చేకోసము
కాదు.
ఎవరో
నిన్ను
మెచ్చుకోనక్కర
లేదు.
నీకు
నీవు
మెచ్చుకుంటే
చాలు.
అదే
discrimination.
నీకు
నీవు
చక్కగా
విచారణ
చెయ్యాలి.
నేను
చెప్పినట్టుగా
ఆచరిస్తున్నానా
లేదా
అనేది
మొట్టమొదట
చూడాలి.
నేను
యేమి
చెప్పుతున్నానో,
ఏమి
తలుస్తున్నానో,
ఏది
నేను
చూస్తున్నానో
అది
నేను
ఆచరిస్తున్నానా?
కనుకనే
The
proper
study
…kind
is
man.
Thought,
word,
deed
యీ
మూడింటి
ఏకత్వమును
మనము
నిరూపించాలి.
ఇదే
నిజమైన
మానవ
విలువ.
ఈ
మానవ
విలువ
కోల్పోయినాము
మనము,
నేడు.
మెదడులో
తలంచేది
ఒకటి,
హృదయములో
యోచన
చేసేది
మరొకటి,
చేతులతో
కర్మనాచరించేది
మరొకటి.
Education
in
Human
Value
అని
పెట్టారు.
కాదు,
కాదు.
Three
H.V.
అనగా
ఒక
H
head.
ఒక
H
heart.
ఒక
H
hand.
ఈ
మూడింటిని
కలిపినప్పుడు
3
H.V.
అవుతుంది.
నిజముగా
మీకు
ఎంతశక్తియో,
ఎంతమీరు
చేయగలరో
అంతవరకే
మీరీ
సేవలలో
పాల్గొనండి.
అధికముగా
పోనక్కరలేదు.
భగవంతుడు,
సేవ
ఎంతసేపు
చేశావని
చూడడు.
ఏ
హృదయములో
చేశావని
యోచిస్తాడు.
భగవంతుడు
ఎప్పుడూ
కూడను
quality
కోరతాడు
గాని
quantity
కోరడు.
ఒక
tea
spoon
of
cow
milk
useful
గా
వుంటుంది.
Why
barrels
of
donkey's
milk.
కనుక
ఆడంబరమైనదానితో,
అహంకారపరమైన
దానితో,
ప్రేమ
రహితమైన
హృదయములో
మనము
ఎన్ని
సేవలు
చేసినా
యిది
ప్రయోజనము
లేనిది.
8
▾
Meaning
Keep
ఈ
సేవనే
భగవంతుని
దగ్గరకు
తీసుకుపోయేది.
ఈ
సేవనే
భగవంతుని
సాక్షాత్కరింపచేసేది.
ఈ
సేవనే
నిన్ను
నీవు
గుర్తించుకోటానికి
సహాయము
చేసేది.
దేవుడెక్కడ,
దేవుడెక్కడ
అని
దేవులాడటానికి
ప్రయత్నించనక్కరలేదు.
నిన్ను
నీవు
తెలుసుకుంటే
దేవుని
తెలుసుకున్నట్లే.
నిన్ను
నీవు
తెలుసుకొనకుండా
దేవుడెక్కడ
నీకు
కనిపిస్తాడు.
కనుక
దేవుని
తెలుసుకోటానికి
ప్రయత్నించేవారు
మొట్టమొదట
నిన్ను
నీవు
తెలుసుకో.
Who
am
I?
నేనెవరు?
ఈ
తత్త్వాన్నే
ప్రాచీన
మహర్షులందరు
విచారణ
సలుపుతూ
వచ్చారు.
ఒకనాడు
వృద్ధుడైన
సోక్రటీసు
ఒక
బీచ్
ప్రక్కలోపల
walking
చేస్తున్నాడు.
తన
తత్త్వాన్ని
తాను
విచారించుకుంటూ
నేనెవరు
నేనెవరు
అనుకుంటూ
పోతున్నాడు.
మహా
తత్త్వజ్ఞాని.
ఇంకొక
రిటైర్డు
వ్యక్తి
అదే
బీచ్
లోపల
walk
చేసుకుంటూ
వస్తున్నాడు.
అతను
యేదో
యోచన
చేసుకుంటూ
వస్తున్నాడు.
ఈ
సోక్రటీసు
కూడను
యోచన
చేసుకుంటూ
వస్తున్నాడు.
ఒకరిని
ఒకరు
చూచుకోలేదు.
వచ్చి
ఒక్కతూరి
యిద్దరు
కొట్టుకున్నారు.
ఆ
ఎదురు
వ్యక్తి
who
are
you
అన్నాడు.
అదే
నేను
కోరుతున్నాను
నేనెవరో
చెప్పండి
అన్నాడు.
మహనీయులయొక్క
తలంపులు
యీ
విధముగా
వుంటాయి.
మనము
నేను
ఎవరు
అంటే
so
and
so
యింకా
డిగ్రీలు
పెట్టుకుంటూ
పోతుంటాము.
ఈ
డిగ్రీలతో
మనకు
యేమాత్రము
ప్రయోజనము
లేదు.
ఏదో
కొన్ని
కొన్ని
బిరుదులంతా
తీసుకొని
దానిని
ఒక
డిగ్రీలుగా
పెట్టుకుంటాము.
కొన్ని
డిప్లమోలు
తీసుకుని
దాన్నికూడ
డిగ్రీలుగా
పెట్టుకుంటాము.
దీని
వలన
ఏదో
పదవులు
లభిస్తాయని
మనము
భ్రాంతి
పడుతున్నాము.
కాని
నిజమైన
డిగ్రీ
నీ
చిత్తశుద్ధియే.
పవిత్రమైనది.
ఒక
చిన్న
కథ.
ఒక
వ్యక్తి
ఉద్యోగనిమిత్తమై
అనేక
ప్రయత్నములు
చేశాడు.
అతను
పెద్దకుటుంబీకుడు,
కాని
పేదవాడు.
అలాంటి
పరిస్థితిలో
బిడ్డలను
భార్యను
పోషించవలసి
వచ్చింది.
తన
కర్తవ్యాన్ని
తాను
నిర్వర్తించవలసి
వచ్చింది.
తన
కర్తవ్యము
తాను
నిర్వర్తించవలసి
వచ్చింది.
అలాంటి
సమయములో
తనకు
ఎక్కడా
వుద్యోగము
లభించలేదు.
ఏదో
అంతో
యింతో
వున్న
డబ్బును
తీసుకొని
ఒక
చిన్న
బోర్డు
లోపల
పేరు
వ్రాయించి
కొన్ని
డిగ్రీలు
వ్రాసి
పెట్టాడు
యింటి
ముందు.
ఆ
బోర్డుపైన
తన
పేరు
వ్రాసాడు.
దానికి
ప్రక్క
F.F.S,
F.T.D.
ఆ
మార్గము
లోపల
చాలామంది
students
అంతా
వెడుతున్నారు.
ఏమిటి
యీ
డిగ్రీలు
ఇంజనీరింగా,
డాక్టరా,
యింకే
విధమైన
డిప్లమోనా
అని
యోచిస్తూ
వచ్చారు.
ఒక్కొక్కరు
ఒక్కొక్క
విధముగా
అర్థము
చెప్పుకుంటూ
వచ్చారు.
ఒక
విద్యార్థి
ధైర్యము
చేసి
లోపలకు
వెళ్లి
ఈ
డిగ్రీలన్ని
వుంటున్నాయి
వీటి
అర్థమేమిటి
అన్నాడు.
9
▾
Meaning
Keep
His poems 68
Also in his talks
(16)
7 February 1980
Be human
19 February 1987
When the jīva is joined with God, he becomes the very form of akṣara
24 June 1989
Foster Prema and Share It
17 February 1990
Prema itself is God
21 May 1990
The Moving Temple
14 August 1990
Role of the Avatars
12 February 1991
Goodness is the principle of God
29 May 1991
Prasnopanishad - Answers To The Sixth Student
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
22 June 1996
Service to Society Is the Mark of True Humanness
11 July 1996
Lack of Values is the Cause of Violence in the World
22 April 1998
The Puṣṭi, Samiṣṭi and Pravāha Jīvas
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
8 October 1998
Good Resolves Are Themselves the Human Values
1 January 2000
Virtue is the adornment of man
F.F.S.
Father
of
five
sons:
F.T.D.
Father
of
Ten
Daughters
అన్నాడు.
ఇవి
మన
బిరుదులు.
ఇదా
మనము
ఈనాడు
సంపాదించవలసినది.
ఈ
బంధనలనా
మనము
ఆశించవలసినది.
ఈ
బంధనలంతా
మనకు
దుఃఖ
…
హేతువేకాని
మరొకటి
కాదు.
‘పరవశం
దుఃఖం
ఆత్మవశం
సుఖమ్’
నీవు
ఆత్మను
విశ్వసించు.
ఆత్మపై
నీవు
ఆధారపడు.
అంతేకానీ
అన్యులపైన
ఆధారపడకు.
అన్నింటికిని
దైవమే
ఆధారము.
ఈనాడు
మనము
సరైన
సేవలలో
మనము
పాల్గొనాలి.
త్యాగములో
…
ప్రవేశించాలి.
అందుకోసమే
వేదాంతము
చెప్పింది
త్యాగము
చేయని
చేతికంటె
కాయలు
కాచిన
కొమ్మ
మేలు
అనింది.
అనగా
చెట్టే
మేలు
మానవుని
కంటె.
చదువుకున్న
మొద్దుకంటె
భూమిని
దున్నే
ఎద్దు
మేలన్నారు.
అదైనా
భూమిని
దున్ని,
పంటలు
పండించి,
దేశానికి
వుపకారము
చేస్తుండాది.
ఈ
చదువుకున్న
మొద్దు
మనిషి
ఏమి
చేస్తున్నాడు?
సంపాదనకు
ప్రయత్నం
చేస్తున్నాడు.
కనుక
త్యాగము
చేయని
చేతులు
కేవలము
చెట్టుకొమ్మవంటివే.
హృదయము
కరగని
మనిషి
కఠినమైన
శిలా
హృదయుడే.
మన
హృదయాన్ని
కరిగించాలి.
మనసును
కదిలించాలి.
సేవలో
ప్రవేశించాలి.
ప్రేమతత్త్వాన్ని
మనము
పెంచుకోవాలి.
ఇదే
పవిత్రమైన
భక్తి
తత్త్వము.
ఇదే
ఆధ్యాత్మిక
చిత్తము.
ఇది
అనేకత్వములోని
ఏకత్వము.
దివ్యత్వములోని
ఆత్మతత్త్వము.
ఇదే
మన
పవిత్రము.
ఈ
పవిత్రతను
మనము
సాధించాలి.
ఎక్కడో
పోయి
మనము
శోధించనక్కర
లేదు.
నీ
హృదయమునందే
నీవు
శోధించుకో.
దేవుడనగ
వేరు
దేశమందున
లేడు
దేవుడనగ
తనదు
దేహమందె
పాపమనగ
వేరు
పరదేశమున
లేదు
తాను
చేయు
పనులయందె
తగిలియుండు.
ప్రేమస్వరూపులారా!
ఇలాంటి
పవిత్రమైన
భావములు
చిత్తమందు
అభివృద్ధి
పరచుకొని
యింక
మున్ముందు
సరైన
సేవలు
చేసి
భారతదేశము
యొక్క
పవిత్రతను
తిరిగి
మీరు
అభివృద్ధిపరచి
యావత్ప్రపంచమునకు
ఆదర్శమును
అందించగలరని
నేను
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ,
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
ప్రేమను
లక్ష్యములో
పెట్టుకోండి.
ప్రేమనే
…
చేర్చుతుంది.
సర్వమును
అనుభవింపచేస్తుంది.
Previous
←
No Learning Greater than Prema
Next
To follow the path of Rāma: the inner meaning of the Rāmāyaṇa
→