Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · To follow the path of Rāma: the inner meaning of the Rāmāyaṇa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
To follow the path of Rāma: the inner meaning of the Rāmāyaṇa
26 March 1988, Rāma Navamī, Brindavan
1
▾
Meaning
Keep
ప్రాచీన
కాలమునుండి
భారత
దేశము
ఆధ్యాత్మిక
తత్త్వ
ప్రచారము
ద్వారా
అన్ని
దేశాలకు
సుస్థిర
శాంతి
భద్రతలను
చేకూరుస్తూ
వస్తున్నది.
నాటికి
నేటికి
‘లోకాస్సమస్తా
సుఖినోభవంతు’
అన్నదే
హైందవ
సాంప్రదాయమై
వున్నది.
ఈ
సాంప్రదాయాన్ని
సంస్కృతిని
అభివృద్ధి
గావించటానికి
ఆనాటి
రాజులు,
ఋషులు,
మునులు,
పండితులు,
పతివ్రతామతల్లులు
తమ
జీవితాలను
త్యాగము
చేశారు.
అట్టి
పవిత్రమైన
సంస్కృతికి
ప్రతీక
రామ
చరిత్ర.
దీనినే
రామాయణము
అనే
పేరుతో
పిలుస్తూ
వచ్చారు.
ఐతే
రామాయణమనగా
కేవలము
రామ
చరిత్ర
మాత్రమే
కాదు.
‘రామ
అయనమ్
యితి
రామాయణం’.
అయనమనగా
మార్గము.
రామ
మార్గాన్ని
అనుసరించటమే
రామాయణము
అంతరార్థము.
మానవుడు
జన్మించినది
మొదలుకొని
తన
జీవిత
సాంప్రదాయాన్ని,
సంస్కృతి
నిలబెట్టుకోవటానికి
అనేక
విధాల
కృషి
సలుపుతున్నాడు.
పుట్టినప్పుడు
యెట్టి
దుర్గుణాలతో
సంబంధము
లేక
నిర్గుణ
స్వరూపుడై
వుంటాడు.
కాలము
కదలిన
కొలది,
ఆహారము
మారిన
కొలది
అభిరుచులు
అభివృద్ధియైన
కొలది
సహవాస
దోషముల
వలన
మనుష్యుల
వేషభాషలు
కూడా
మార్పు
చెందుతాయి.
రాగద్వేషాలు
చోటు
చేసుకుంటాయి.
చదువుతో
బాటు
అహంకారాభిమానాలు
ఆపాద
మస్తకము
వ్యాపించి
వీరవిహారము
చేస్తుంటాయి.
తనకంటె
గొప్పవాడు,
మంచివాడు
లేడని
భ్రమిస్తాడు.
యవ్వనము
మత్తులో
వున్మత్తుడై,
ఎదుటి
వ్యక్తిని
గడ్డిపోచకంటె
హీనముగా
చూస్తాడు.
మానవుడు
మానవుడుగా
బ్రతకాలంటే
యనేక
కష్టనష్టాలను,
అరిష్టాలను
యెదుర్కోవలసి
వుంటుంది.
ఎదురు
దెబ్బలకు
తట్టుకొని
ముందుకు
సాగిపోవలసి
వస్తుంది.
కాని
యీనాటి
మానవునికి
విషయవాసనలే
విందు
భోజనములుగా
కనుపిస్తున్నాయి.
ప్రతివాడు
గొప్ప
విద్యావంతుడు
కావాలని,
నాయకుడు
కావాలని,
పెద్ద
వ్యాపారస్తుడు
కావాలని
అనేక
రకాల
ఆశలతో
వుంటున్నాడు.
ఆశల
నీడలలోనే
జీవితాన్ని
అభివృద్ధి
పరచుకోటానికి
ప్రయత్నిస్తున్నాడు.
ఆశ
లేకుండా
ఒక్క
క్షణమైనా
వుండ
లేకపోతున్నాడు.
తనలో
దివ్యత్వమనే
ఆత్మ
తత్త్వము
వుండి
కూడా
అపవిత్రమైన
విషయ
వాసనలకు
లోబడి
మానవత్వాన్ని
విస్మరిస్తున్నాడు.
పశువులు,
పక్షులు
యివన్నీ
ఆనందాన్ని
అనుభవిస్తూనే
వున్నాయి.
అయితే
దాచుకొనే
స్వార్థముగాని,
దోచుకొనే
దుర్మార్గముగాని
వాటికి
లేదు.
మానవునిది
తిని
తృప్తి
పడే
స్వభావముకాదు.
ఒకరిని
మించి
మరొకడు
అభివృద్ధి
చెందాలని
పంచవర్ష
ప్రణాళికలు
వేసుకుంటూ
వుంటారు.
ఐదు
కరువులు
వచ్చినా,
ఐదు
తరాలు
గడచినా
తరగని
ఆస్తిని
పెంచుకోవాలని
ప్రాకులాడుతుంటారు.
ఆశలు
వుండటం
తప్పుకాదు.
కాని
మితిమీరిన
ఆశలు
వుండరాదు.
‘అతి
సర్వత్ర
వర్జయేత్.
అత్యాశలు
మతిహాని
కలిగిస్తాయి.
ఇలాంటి
స్థితిలో
మానవుడు
తనలో
దివ్యత్వాన్ని
కొంత
హెచ్చరించుకోవాలి.
2
▾
Meaning
Keep
స్వలాభము
మీద
ఆసక్తి
కాని,
లోభము
మీద
విరక్తిగాని
అసలు
కలగటమే
లేదు.
కరువు
కాటకాలకు
యీ
ఆశలే
కారణము.
ఆశలను
అదుపులో
వుంచుకోవాలన్నదే
రామాయణము
ప్రధాన
సందేశము.
ఇంద్రియ
నిగ్రహము,
మానసిక
పరివర్తన,
బుద్ధి
వికాసముచేత
జీవితములో
శాంతిని
అభివృద్ధి
పరచుకోవాలి.
జీవిత
మెంతో
విలువైనది.
పవిత్రమైనది.
ఇట్టి
పవిత్రమైన
విలువైన
జీవితాన్ని
వ్యర్థము
గావించుకోటము
మానవ
కర్తవ్యము
కాదు.
రామాయణములో
ప్రతివ్యక్తి
ఆదర్శ
ప్రాయుడే.
అందరూ
ధర్మమూర్తులే.
పవిత్ర
చక్రవర్తులే.
మచ్చుకు
లక్ష్మణుని
పాత్రను
తీసుకుందాము.
లక్ష్మణుని
వాల్మీకి
చక్కగా
వర్ణిస్తాడు.
లక్ష్మణుడు
రామునికి
రెండో
హృదయ
మంటాడు.
కంబ
రామాయణము
లక్ష్మణుడు
రామునికి
రెండో
గుణము
అని
వర్ణిస్తుంది.
తులసీ
రామాయణం
లక్ష్మణుడు
రామునికి
కుడి
భుజము
వంటివాడంటుంది.
రామ
లక్ష్మణులు
బింబప్రతి
బింబాల
వలె
అవినాభావ
సంబంధము
గలవారు.
గుణ
గణాలలో,
పవిత్రతలో,
త్యాగములో
లక్ష్మణుడు
తనకు
తానే
సాటి.
తండ్రి
ఆజ్ఞ
వలన
రాముడు
అరణ్యానికి
పోవలసి
వచ్చింది.
లక్ష్మణుని
అరణ్యానికి
పొమ్మని
ఎవ్వరూ
ఆజ్ఞాపించ
లేదు.
అతడు
తనకు
తానే
సర్వస్వము
త్యాగము
చేసి
రాముని
అనుసరించాడు.
రామ
అయనమే
తన
ప్రధాన
నయనంగా
భావించాడు.
అదే
రామ
అయనం.
రామ
అయనంలో
ప్రధాన
పాత్ర
వహించినవాడు,
లక్ష్మణుడు.
తల్లిని,
రాజ్యమును,
సతిని
సర్వస్వమును
త్యాగము
చేసి
రామతత్త్వమే
గురుతత్త్వమని,
రాముడే
మిత్రుడు,
రాముడే
సోదరుడు,
రాముడే
ప్రాణమని
భావించి
రాముని
అనుసరించాడు.
లక్ష్మణుని
శీలము,
గుణము
లోకానికే
ఆదర్శప్రాయం.
సీతాన్వేషణ
సలుపుతూ
వెళ్ళుతుండగా
దారిలో
ఋష్యమూక
పర్వతముపై
సుగ్రీవ,
హనుమంతులతో
స్నేహము
కలిగింది
రామ
లక్ష్మణులకు.
అక్కడ
సుగ్రీవుడు
ఒక
నగల
మూట
రాముని
చేతికి
అందించి
ఎవరో
ఒక
స్త్రీ
ఆకాశ
మార్గములో
పయనిస్తూ
యీ
మూటను
క్రింద
జారవిడచింది
అని
చెప్పాడు.
ఆ
మూటను
విప్పి
చూచినప్పుడు
రామునికి
యీ
నగల
సంగతి
యేమీ
తెలియదు.
లక్ష్మణునికి
చెప్పాడు.
లక్ష్మణా
యిందులో
సీత
నగలేమైనా
వున్నాయేమో
చూడు
అని.
‘నాహం
జానామి
కేయూరే’
ఈ
కంకణాలు
సీతమ్మవి
అవునో
కాదో
నాకు
తెలియదు.
నాహం
జానామి
కుండలే.
ఈ
కర్ణ
కుండలాలు
కూడా
సీతమ్మవి
అవునో
కాదో
నాకు
తెలియదు.
నూపురేత్యభి
జానామి
ఈ
కాలి
అందెలు
మాత్రము
సీతమ్మవే.
నాకు
తెలుసు
యెందుకనగా
నిత్యమ్పాదాభి
వందనాత్’
ప్రతి
నిత్యము
ఆమె
పాదాలకు
నమస్కారము
చేసే
సమయములో
యీ
పాదాల
అందెలు
నేను
చూచేవాడిని.
సీతారాముల
కళ్యాణము
జరిగిన
తరువాత
పన్నెండు
సంవత్సరాలు
అయోధ్యలో
వున్నారు.
తదుపరి
పదమూడు
సంవత్సరములు
అరణ్యవాసము
చేశారు.
ఈ
యిరవై
ఐదు
సంవత్సరములు
సీతారాములతో
వున్న
లక్ష్మణుడు
ఒక్కనాడైనా
సీత
ముఖము
చూచినవాడు
కాదు.
పన్నెండు
సంవత్సరముల
అయోధ్యావాసము,
పదునాలుగు
సంవత్సరముల
వనవాసము
మొత్తము
యిరవై
ఆరు
సంవత్సరములు
కావాలి.
ఐతే
పదినెలలు
సీత
లంకలో
చిక్కుపడిపోయింది
గదా
అందువల్ల
లక్ష్మణుడు
పదమూడేండ్లు
వనవాసమని
అంటాడు.
3
▾
Meaning
Keep
ఈ
విధమైన
ఉదాత్తగుణములు
గల
పురుషుడు
స్త్రీలను
మాతృమూర్తులుగా
చూచేవాడు
చరిత్రలో
మనకు
కనుపించడు.
రామాజ్ఞను
పురస్కరించుకొని
నిండు
గర్భవతి
సీతను
మునిపల్లెలో
విడిచి
రావటానికి
బయలు
దేరాడు.
ఆ
సమయములో
సీత
ప్రశ్నిస్తుంది.
లక్ష్మణా!
రాముడు
లోకాపవాద
భీతితో
నన్ను
అడవులకు
పంపటములో
ధర్మము
వుంది.
ప్రజా
పరిపాలనే
ప్రభువుల
ధర్మము.
ప్రజలకు
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అందించటమే
ప్రభువు
కర్తవ్యము.
స్వపర
భేదము
లేకుండా
సర్వము
త్యజించి
ప్రజల
క్షేమాన్ని
చూడటమే
ప్రభువు
నియమము.
అతని
కీర్తియే
నాకు
ఆనందము.
అతను
నన్ను
త్యజించినా
నాకు
దుఃఖము
లేదు.
రాముని
కీర్తి
చిరకాలము
వర్ధిల్లాలి.
కానీ,
నీవు
మరిదివి.
ఈ
అడవిలో
నన్ను
వదలి
యేరీతిగా
వెనుకకు
పోగలవు.
నిండు
గర్భవతినైన
నన్ను
ఒంటరిగా
వదలి
పోటానికి
నీమనసెట్లా
ఒప్పుతుంది?
కొంత
కాలము
యిక్కడ
వుండి
నాకు
ధైర్యము
చెప్పరాదా.
అన్నది.
అప్పుడు
లక్ష్మణుడు
తల్లీ!
యింతకాలము
నీమోమును
కూడా
చూడలేదు.
రామ
ప్రభువు
నీ
చెంత
లేనప్పుడు
నేను
నీ
దగ్గర
వుండటం
ఎంత
అపచారము.
నిర్గుణ
నిస్వార్థమైన
నీ
హృదయాన్ని
అజ్ఞానులు
బాధపెట్టారు.
ఈ
సమయములో
నేను
నీ
దగ్గర
వుండటం
వల్ల
నీకు
అపకీర్తి
తెచ్చినవాడనౌతాను.
నా
ప్రాణములనైనా
నీ
పాదముల
ముందు
అర్పితము
గావిస్తాను
కాని
నీకు
అపకీర్తి
మాత్రం
రానీయను.
పైగా
రామాజ్ఞ.
రాముడే
నాసర్వస్వము.
అతని
ఆజ్ఞను
మీరుతే
నా
ప్రాణమే
వుండదు.
కనుక
తల్లీ
నన్ను
క్షమించి
పంపమని
బాధపడుతూ
నమస్కారము
చేస్తాడు.
తనకు
ఎదురు
వచ్చిన
రాజ్యాన్ని
కూడా
స్వీకరించకుండా
రాజుగా
వుండటానికి
రాముడే
అర్హుడని
చాటి
రాముని
సన్నిధే
తన
పెన్నిధిగా
భావించి
క్షణకాలములో
అరణ్యానికి
బయలుదేరిన
ధీర
చిత్తుడు
లక్ష్మణుడు.
భగవత్
తత్త్వాన్ని
నిస్వార్థ
భావముతో
గ్రహించి
స్వప్రయోజనమును
త్యాగము
చేసి
సర్వస్వాన్ని
దైవార్పితము
గావించి
రాముని
అనుసరించిన
పరమ
భక్తుడు.
భరతుడు
కూడా
యీ
మార్గమునే
అనుసరించాడు.
సోదరులందరు
రామతత్త్వాన్ని
అనుసరించినవారే.
కనుకనే
రామచరిత్రకు
రామాయణమని
పేరు
సార్థకమై
నిలిచింది
“రామో
విగ్రహవాన్
ధర్మః”
రాముడు
ధర్మ
స్వరూపుడు.
ధర్మమంటే
ఏమిటి?
ఈనాడు
లౌకిక
ధర్మాలు
అనేకము
పెరుగుతున్నాయి.
ఏది
వైదిక
ధర్మమో
విచారిస్తే
మనసు
తబ్బిబ్బయిపోతుంది.
ధారయతీతి
ధర్మః
తరింప
చేసేది,
లోకాన్ని
ధరింప
చేసేది
ధర్మమని
మనం
నోటితో
వుచ్చరించవచ్చు.
ఒక్కొక్క
వస్తువుకు
ప్రాణసమానమైన
ధర్మమొక్కొక్కటి
వుంటుంది.
అగ్నికి
దహనశక్తి
సహజ
ధర్మము.
అగ్నిలో
దహన
శక్తి
లేకపోతే
అది
బొగ్గవుతుంది
కాని
అగ్ని
కాదు.
చక్కెరకు
తీపి
సహజ
ధర్మము.
చక్కెరకు
తీపి
అనే
ధర్మం
లేకపోతే
అది
యిసుకతో
సమానమవుతుంది.
చంపక
పుష్పానికి
సుగంధము
సహజ
ధర్మము.
సుగంధము
లేక
పోతే
అది
చంపకమే
కాదు.
మానవుని
హృదయ
తత్త్వమునుండి
ఆవిర్భవించే
స్వభావమే
ధర్మము.
కానీ,
యీనాటి
మానవుడు
ప్రభావానికి
లోబడి
స్వభావాన్ని
మరచిపోతున్నాడు.
విద్యావంతులైనా
విద్యాహీనులైనా
సర్వ
మానవులకు
సహజమైన
ధర్మమేమిటి?
ఇతరులు
యేవిధముగా
గౌరవిస్తే
మనకు
ఆనందమో
మనము
యితరులను
ఆవిధముగా
గౌరవించాలి.
ఇతరులు
ఎట్టి
పనులు
చేస్తే
మనకు
బాధ
కలుగుతుందో
అట్టి
పనులు
చేసి
మనము
యితరులకు
బాధ
కలిగించరాదు.
4
▾
Meaning
Keep
Also in his talks
(6)
26 June 1988
Excessive desire is the loss of reason; measured desire is great ease
21 May 1990
The Moving Temple
2 July 1996
Satya Alone Is God
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
24 November 2000
Sacrifice Itself Is the Supreme Purpose of Life
ఇతరులు
యేవిధముగా
నడచుకుంటే
సరైన
మార్గమని
భావిస్తామో
మనము
ఆవిధముగా
నడచుకోవాలి.
అదే
మనము
లౌకిక
సామాన్య
జగత్తుకు
అందించగల
సహజ
ధర్మము.
వైదిక
ధర్మాన్ని
వేదాంత
ధర్మాన్ని
అందరూ
గుర్తించలేరు.
నిత్యజీవితములో
సత్యజీవితాన్ని
అనుభవించాలనుకుంటే
యితరులు
యేవిధముగా
నడచుకోటము
మంచిదని
మనము
భావిస్తామో
దానిని
అనుసరించాలి,
ఆచరించాలి.
ధర్మము
oneway
traffic
కాదు.
ఇచ్చి
పుచ్చుకునేది.
ఇలాంటి
సహజమైన
ధర్మాన్ని
రామ
తత్త్వము
ద్వారా
జగత్తులో
వ్యాపింప
చేశాడు
వాల్మీకి.
ఒక్కొక్క
కాలానికి
ఒక్కొక్క
ధర్మము
ఒక్కొక్క
రీతిగా
వ్యాపిస్తుంది.
ఒక
మంచి
జాతి
మామిడి
చెట్టున్నది.
ఫలాలుగా
మారినప్పుడు
వాటిలో
మధురమైన
రసం
అభివృద్ధి
చెందుతుంది.
కాని
కసుగాయలుగా
వున్నప్పుడు
వగరుగా,
పుల్లగా
వుంటాయి.
జాతి
మంచిదే
అయినా
కసుగాయగా
వున్నప్పుడు
ఒక
రుచి,
పరిపక్వ
స్థితికి
వచ్చినప్పుడు
మరొక
రుచి
వుంటుంది.
అదే
రీతిగా
మానవ
జాతి
అత్యుత్తమైనప్పటికీ
చాలా
భాగము
కసుకాయలుగా
పక్వము
కాకుండానే
రాలిపోతాయి.
మరికొన్ని
పరిపక్వ
స్థితిలో
రాలిపోతుంటాయి.
ఫలించి
పక్వమైనవే
చక్కని
రుచి
నందిస్తాయి.
సర్వుల
యందున్న
ఆత్మ
తత్త్వము
ఒక్కటే
దీనికి
చక్కని
ఉదాహరణ.
సముద్రములో
అసంఖ్యాకమైన
అలలు
బయలు
దేరుతూ
వుంటాయి.
ఒక
అల
వున్నట్లు
మరొక
అల
కనుపించదు.
అలలు
భేదముగా
వున్నప్పటికీ
అలలు
వేరు
సముద్రము
వేరు
కాదు.
అలలన్నీ
సముద్రములో
చేరే
వుంటాయి.
ఆత్మ
తత్త్వమనే
బ్రహ్మానందములో
ఆవిర్భవించిన
జీవులనే
అలలే
మానవులు.
ఒక్కొక్క
మానవుని
రూప
భావ
తత్త్వాలు
ప్రత్యేకముగా
వుండవచ్చు.
కాని
యివన్నీ
బ్రహ్మానందములోని
బిందువులనే
తత్త్వాన్ని
మనం
గుర్తించాలి.
నీటియందే
పుట్టి
నీటియందే
పెరిగి
నీటి
యందే
అణగు
నీటి
బుడగ
నరుడు
బుద్బుదంబు
నారాయణుండు
నీరు..
నరుడనే
బుడగ
నారాయణుని
యందే
పుట్టింది.
నారాయణుడనే
నీటియందే
సంచరిస్తుంది.
నారాయణుడనే
నీటి
యందే
నశించి
పోతుంది.
నారాయణుడనే
నీటిని
వదలిన
నరుడనే
బుడగ
ఉండలేదు.
అందుకనే
‘మమైవాంశో
జీవలోకే
జీవభూతస్సనాతనః’
జీవులన్నీ
నా
అంశములే,
…
అంశము,
యింద్రియాల
అంశము
కాదు.
చెట్టుకు
కొమ్మ
అంశము.
చెట్టును
వదలి
కొమ్మ
ఉండలేదు.
చెట్టును
వదలితే
కొమ్మ
ఎండి
పోతుంది.
తల్లికి
బిడ్డ
అంశము.
తల్లిని
వదలి
బిడ్డ
బ్రతుక
లేదు.
నీటిని
వదలి
చేప
వుండ
లేనట్లే
దైవాన్ని
వదలి
నరుడు
వుండలేడు.
అశాంతి
అనుభవించటానికి
కారణము
ఎడబాటు.
ధన
కనక
వస్తు
వాహనాలు
యివన్నీ
ఆనందాన్ని
అందించలేవు.
మానవుడు
భార్యాపుత్రుల
నిమిత్తమై,
కుటుంబ
బంధువుల
నిమిత్తమై
యెంతకాలము
వినియోగిస్తున్నాడో
అందులో
ఒక
క్షణకాలము
భగవత్
చరణ
ధ్యానములో
వినియోగిస్తే
చాలు.
5
▾
Meaning
Keep
దివ్యత్వాన్ని
గురించి
ఒక్కక్షణము
చింతించినా
చాలు.
ఈనాడు
మనలో
త్యాగమే
లేదు.
త్యాగము
చేయని
చేయికంటె
చీకటి
కొంపలోని
నుయ్యి
మేలు.
చదువుకున్న
మొద్దుకంటె
మడిదున్నే
యెద్దు
మేలు.
త్యాగభావముతో
జీవితమును
అర్పితము
చేసినప్పుడు
నిజమైన
యోగము
లభ్యమవుతుంది.
మానవజాతికి
యిలాంటి
త్యాగాన్ని
బోధించేది,
రామాయణము.
రాముడు
తండ్రి
ఆజ్ఞను
పురస్కరించుకొని
సర్వసంగ
పరిత్యాగియై
నారవస్త్రములు
కట్టి
అరణ్యములో
ప్రవేశించాడు.
భగవదాజ్ఞ
పరిపాలన
తత్త్వాన్ని
నిరూపించిన
వాడు,
రాముడు.
ఆత్మ
అనేది
మహాశాసనము.
ఆత్మను
వుల్లంఘిస్తే
ఆనందము
దూరమవుతుంది.
పర్ణశాలలో
వంటరిగా
వున్న
సీతను
కాపాడమని
ఎలాంటి
స్థితిలోను
సీతను
వదిలి
పోకూడదని
లక్ష్మణుని
ఆజ్ఞాపించి
వెళ్లాడు
రాముడు.
కష్టాలు,
దుఃఖాలు,
నిందలు,
నిష్ఠూరాలు
ఎన్ని
వచ్చినా
సీతను
వదలి
రాకూడదని
హెచ్చరించాడు.
కాని
లక్ష్మణుడు
జీవ
స్వరూపుడు.
కనుక,
అతనిలో
కొంత
బలహీనత
బయలుదేరింది.
హా
సీతా!
హా
లక్ష్మణా!
అనే
ఆర్త
నాదము
విని
దానిని
నిజముగా
రాముని
కంఠముగా
భావించి
వెంటనే
రాముని
వద్దకు
వెళ్ళమని
సీత
లక్ష్మణుని
బలవంతము
చేసింది.
ఏది
యేమైనా
రామాజ్ఞను
కఠినముగా
పాలించదలిచాడు
లక్ష్మణుడు.
కాని
సీత
సూటిపోటు
మాటలు
హృదయానికి
గుచ్చుకొని
బాధించసాగాయి.
సీత
పరుషవాక్కులు
వినలేక
రామాజ్ఞను
మీరి
సీతను
వదలి
అక్కడ
నుండి
కదిలాడు.
తదుపరి
సీతను
రావణుడు
తీసుకుపోవటం
తెలిసి
చాలా
బాధపడ్డాడు.
తాను
దైవాజ్ఞను
మీరటమువల్లనే
కదా
సీతకు
యిన్ని
కష్టాలు
వచ్చాయి
అని
జీవితాంతము
దుఃఖించాడు.
తన
జీవితములో
రామాజ్ఞను
మీరిన
సంఘటనలలో
యిది
మొదటిది.
రాముడు
సీతతో
తన
స్వస్థానానికి
పోయేముందు
కాలయముడు
వచ్చాడు.
అతనితో
సంభాషిస్తూ
రాముడు,
లక్ష్మణా
ఎవరిని
విడువకు.
ఏ
ఒకరిని
లోపలకు
వదలినా
శిరచ్ఛేదనము,
జాగ్రత!
అంటూ
ఆజ్ఞాపించాడు.
లక్ష్మణునికి
రాముడంటే
దృఢమైన
విశ్వాసము.
సరిగా
ఆ
సమయములో
దూర్వాసుడు
వచ్చి
తాను
లోపలికి
వెళ్లి
రామునితో
సంభాషించాలన్నాడు.
లక్ష్మణుడు
లోపలికి
పోవటానికి
వీల్లేదని
ఖచ్చితంగా
చెప్పాడు.
దూర్వాసుడు
వుగ్రుడై
పోయాడు
నీ
అయోధ్యను
నీవంశమును
సర్వనాశనము
చేస్తాను
జాగ్రత్త
అని
గర్జించాడు.
లక్ష్మణుడు
ధర్మసంకటములో
పడ్డాడు.
వదలితే
తనకు
శిరచ్ఛేదము.
వదలక
పోతే
రఘువంశంతో
పాటు
అయోధ్యకూడా
నాశనం
అయిపోతుంది.
ఆలోచించి
ఒక
దృఢ
నిశ్చయానికి
వచ్చాడు.
రాముని
ఆజ్ఞ
మీరటం
వలన
నాశిరస్సు
పోతుంది.
అయినా
ఫరవాలేదు.
అయోధ్యావాసులు
క్షేమంగా
వుండాలి.
రాముని
చేతులలో
చావటం
యెంత
అదృష్టము.
దూర్వాసుని
ఆజ్ఞ
మీరితే
వంశమే
నాశనమవుతుంది
అనుకొని
దూర్వాసుని
లోపలకు
వదిలాడు.
ఇట్టి
ఆదర్శ
ఘట్టాలతో
నిండిఉన్నది,
రామాయణము.
కాని
యీనాడు
ఎవరిగుణములకు
తగినట్లు
వారు
అన్వయించుకుంటూ
రామాయణాన్ని
వ్యాఖ్యానిస్తున్నారు
అన్నదమ్ములు
యేరీతిగా
వుండాలి?
తల్లితండ్రుల
ప్రేమ
యే
రీతిగా
వుండాలి?
భార్యా
భర్తల
ఆదర్శము
యేరీతిగా
వుండాలి?
6
▾
Meaning
Keep
Also in his talks
(18)
26 June 1988
Excessive desire is the loss of reason; measured desire is great ease
29 May 1989
Victory is only where Kṛṣṇa is
18 June 1989
Divinity alone is the basis of everything
22 June 1989
Win the Grace of God
6 July 1989
Master Your Mind
24 August 1989
Those Who Recognised the Paramātma Are the Gopīs
3 November 1989
Ānanda Itself Is the Goal
10 February 1990
Human values in business management
20 May 1990
The Glory of Indian Culture
14 August 1990
Role of the Avatars
12 September 1990
The body is a temple
29 April 1992
So long as rāga, fear and anger remain, divinity is not understood
6 May 1992
Only one who lives in the oneness of body, mind and Ātma is a human being
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
20 November 1998
The Body Is Truly the First Means to Dharma
14 January 2000
Bhakti and Śaraṇāgati
22 August 2000
The Flowers Dear to God
18 July 2008
God alone is the true Guru
ఈ
విధముగా
ప్రతి
కుటుంబానికి
ఆదర్శము
బోధించింది
రామాయణము.
లక్ష్మణుడు,
భరతుడు,
శతృఘ్నుడు
అందరు
రామ
అయనంలో
రామ
మార్గంలోనే
జీవితాలను
అంకితము
చేశారు.
అన్న
ఆజ్ఞను
జవదాటకుండ
జీవించారు.
ఈనాడు
ప్రతి
కుటుంబానికి
రామాయణ
ఆదర్శాలు
యెంతైనా
అవసరము.
సీత
సర్వసుఖములను
త్యాగము
చేసి
భర్తను
అనుసరించింది.
భోగభాగ్యాలను
యెంతమాత్రము
ఆశించ
లేదు
తన
జీవితాన్ని
రామాంకితము
గావించిందామె.
రామాయణ,
భాగవత,
భారతాలు
కామ,
క్రోధ,
లోభాలకు
మూలాధారముగా
నిలిచిన
చరిత్రలు.
రామాయణంలో
రావణుడు
అంటేనే
కామం.
కాముకుడైన
రావణుని
వల్లనే
రామాయణమంతా
జరిగింది.
కామ
నాశం
కోసమే
రాముడవతరించాడు.
భాగవతములో
హిరణ్యకశిపుడు
క్రోధము.
అతను
హరిద్వేషి.
ఎక్కడున్నాడు
హరి,
వాడెక్కడా
లేడు
అనేవాడు.
ఈ
క్రోధాన్ని
పరిహరించటానికే
హరి
నరసింహుడుగా
అవతరించి
హిరణ్యకశిపుని
సంహరించాడు.
క్రోధాన్ని
యీ
విధముగా
పరిమార్చాడు.
భారతములో
దుర్యోధనుడు
లోభమునకు
మచ్చుతునక.
రావణ,
హిరణ్య
కశిప,
దుర్యోధనులంటే
కామ,
క్రోధ,
లోభములే.
ఈ
మూడింటిని
అంత
మొందించటానికే
మూడు
చరిత్రలు
లోకములో
వెలిశాయి.
మూడింటిలోను
ధర్మాన్ని
ప్రబోధించటానికే
ప్రయత్నం
జరిగింది.
లోభియైన
దుర్యోధనుడు
తల్లిగాంధారికి
నమస్కరించటానికి
వచ్చాడు.
ఆమె
తన
కుమారుడనే
మమకారానికి
లోనుగాక
‘యతో
ధర్మస్తతో
జయః’
అని
ఆశీర్వదించింది.
ఎక్కడ
ధర్మమో
అక్కడ
జయమన్నది
కానీ
నీకు
జయమనలేదు.
గురువైన
ద్రోణాచార్యునికి
నమస్కరించటానికి
వెళ్లాడు
దుర్యోధనుడు.
“యతో
ధర్మస్తతో
కృష్ణః,
యతో
కృష్ణః
తతో
జయః’
అన్నాడు
ద్రోణాచార్యుడు.
ఎక్కడ
ధర్మమున్నదో
అక్కడ
కృష్ణుడు
వుంటాడు.
ఎక్కడ
కృష్ణుడు
ఉంటాడో
అక్కడ
జయం
కలుగుతుంది
అని
ఆశీర్వదించాడు
ఆయన.
యత్రయోగేశ్వరః
కృష్ణో
యత్ర
పార్థో
ధనుర్ధరః
తత్ర
శ్రీ
విజయోర్భూతిర్ధ్రువా
నీతిర్మతిర్మమ
ఎక్కడ
ధర్మము
వుంటుందో
అక్కడే
విజయము
వుంటుంది
అంటుంది
గీత.
రాముడు
అరణ్యానికి
వెళ్లేముందు
తల్లి
కౌసల్యాదేవికి
నమస్కరించాడు.
నాయనా!
నీ
ధర్మమే
నిన్ను
అరణ్యములో
కూడా
రక్షిస్తుంది
అని
ఆశీర్వదించింది
మాతృమూర్తి.
లక్ష్మణుడు
వచ్చి
తన
మాతృదేవి
సుమిత్రకు
నమస్కరించాడు.
ఆమె
పేరే
సుమిత్ర.
మైత్రి
ఆమె
సహజ
గుణము.
తన
కుమారుడనే
అభిమాన
మమకారాలకు
తావీయక
రాముడు
లేని
అయోధ్య
అరణ్యము,
రాముడున్న
అరణ్యమే
అయోధ్య.
వెళ్ళిరా
నాయనా!
రాముడు
లేని
అయోధ్య
అనే
అరణ్యమే
మాకు
గతి.
రామసన్నిధినే
అయోధ్యగా
భావించి
జీవితాన్ని
ధన్యము
చేసుకో
నాయనా!
అని
తనయునికి
బోధించింది
ఆ
తల్లి.
ఇలాంటి
తల్లులు,
తండ్రులు,
గురువులు
వుండటం
చేతనే
ఆనాడు
మాతృదేవో
భవ,
పితృదేవో
భవ,
అతిథి
దేవో
భవ,
ఆచార్య
దేవో
భవ
అనే
వేదవాక్కులతో
దిక్కులు
మారుమ్రోగాయి.
7
▾
Meaning
Keep
ఇలాంటి
ధర్మ
ప్రబోధము
చేసిన
పవిత్ర
గాథలు
రామకృష్ణుల
చరిత్రలు.
రామనవమి
అనగా
రాముడు
పుట్టిన
దినమని
భావించరాదు.
రామ
తత్త్వాన్ని
రామభావాన్ని
ఏనాడు
మన
హృదయములో
ఆవిష్కరింప
జేసుకుంటామో
ఆనాడే
పర్వదినము.
పాయసము,
పరమాన్నములతో
సుష్టుగా
భోజనం
చేయటం
పర్వదినము
కాదు.
ఆదర్శమైన
జీవితాన్ని
అన్వయింప
చేసుకోవాలి.
వారి
ఆశయాలను
ఆదేశాలను
తల
దాల్చాలి.
వారి
అడుగుజాడలను
అనుకరించాలి.
అప్పుడు
జన్మ
సార్థక
మవుతుంది.
ఒకానొకప్పుడు
ముగ్గురు
వ్యక్తులు
స్వర్గద్వారాన్ని
సమీపించారు.
ఒకాయన
ముందుకు
వెళ్లి
నేను
సర్వ
శాస్త్ర
పారంగతుణ్ణి.
నన్ను
స్వర్గంలోకి
ప్రవేశపెట్టు
అన్నాడు.
అప్పుడు
ద్వారపాలకుడు
‘అయ్యా!
నీకు
గ్రంథపరిచయమే
తప్ప
అనుభవజ్ఞానము
లేదు
వెళ్లిరా’
అన్నాడు.
ఇంకొకాయన
ముందుకు
వచ్చి
నేను
యజ్ఞ
యాగాదులు
ఆచరించిన
సోమయాజిని.
ద్వారము
తెరువు
అన్నాడు.
కేవలము
స్వార్థ
బుద్ధితోటే
యజ్ఞ
యాగాదులు
ఆచరించావు.
నీకు
స్వర్గ
ప్రవేశాధికారము
లేదు,
వెళ్లు
అన్నాడు
ద్వారపాలకుడు.
మూడవవాడు
ఒకరైతు
‘అయ్యా!
నాకున్న
రెండు
ఎకరాలలో
చిన్న
గుడిసె
వేసుకొని
వచ్చి
పోయే
బాటసారులకు
వసతి
కల్పిస్తూ
వున్నదాంట్లో
వారికి
పెట్టి
నేను
తింటూ
కాలము
గడిపాను
అన్నాడు.
ఉన్న
దానిలో
కొంత
త్యాగము
చేసి
జీవితం
గడపిన
నీకు
స్వర్గవాసము
ఖాయము.
లోపలకు
వెళ్లు’
అంటూ
ద్వారము
తెరిచారు
ద్వారపాలకులు.
ఈనాడు
మనము
యేమి
చదివాము
ఎంతవరకు
మారాము
అని
ప్రశ్నించుకుంటే
సరైన
సమాధానము
రావటం
లేదు.
వింటున్నంత
సేపు
బాగానే
వుంటుంది.
కొన్ని
క్షణాలోన్నే
బుద్ధి
యథాస్థానానికి
వెళ్లిపోతుంది.
ఈ
మనస్తత్త్వాన్ని
కొంత
మార్చుకోవాలి.
మనసు
మారక
మనిషి
మారినా
ప్రయోజనము
లేదు.
మారవలసింది
మనసు
కాని
మనిషి
కాదు.
రామాయణం
ఎంతో
వున్నతమైన
ఆదర్శాన్ని
అందించింది.
దయ,
కరుణ,
సానుభూతి
యిత్యాది
సద్గుణ
సంపత్తిని
స్వరూపముగా
ధరించినట్టిది
రామాయణము.
ఈనాటి
మానవుడు
ఏడు
రకాల
పగ్గాలతో-
తాళ్లతో
కట్టబడి
వున్నాడు.
1.
శరీరము
2.
కర్మ
3.
రాగము
4.
ద్వేషము
5
అహంకారము
6.
అధికారం
7.
అజ్ఞానము.
అజ్ఞానము
అవివేకమునుండి
పుట్టింది.
అవివేకము
అహంకారమునుండి
పుట్టింది.
అహంకారము
ద్వేషము
నుండి
పుట్టింది.
ద్వేషము
రాగము
నుండి
పుట్టింది.
రాగము
కర్మనుండి
పుట్టింది.
కర్మనుండి
పుట్టినదే
దేహము
కాబట్టి
దేహానికి
కర్మయే
ఆధారము.
కర్మకు
రాగము
కారణము.
రాగానికి
ద్వేషము
ఆధారము.
ద్వేషానికి
అహంకారము
మూలము.
అహంకారానికి
అవివేకము
మూలము.
అవివేకానికి
అజ్ఞానము
ఆధారము.
మొదట
అజ్ఞానము
నాశనము
కావాలి.
చీకటి
పోవాలి.
ఎంత
పోరాడినా
చీకటి
పోదు.
చిన్న
దీపము
ముట్టిస్తే
చీకటి
పోతుంది.
ఆ
దీపమే
దైవ
నామము.
తమస్సు
పోవాలంటే
జ్ఞానజ్యోతి
వెలిగించుకోవాలి.
జ్ఞానాన్ని
అభివృద్ధి
పరచుకోవటానికి
నామమనే
నావను
ఆశ్రయించాలి.
అత్యంత
ప్రధానమైనవి
రెండే
రెండు.
దానము,
నామము.
అన్నదానము,
హరినామము.
ఈ
రెండు
రెక్కలతో
మనము
స్వర్గానికి
ఎగరగలము.
Previous
←
Bhārat is the home of Satya and Dharma
Next
Seek Ye First
→