Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · The principle of the Ātma in everyone is one and the same!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The principle of the Ātma in everyone is one and the same!
23 July 1988, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 472
Also in his talks
(20)
22 November 1986
The aim of education is to bring into view the Satya that stands unrefuted in all three times
4 January 1987
The Bhagavad Gītā is a book to be practised
22 November 1988
Culture Is What Shows Forth the Oneness within the Many
28 October 1989
Prema Itself Is God
27 April 1990
Give up selfishness: Cultivate unity
20 May 1990
The Glory of Indian Culture
17 October 1990
The strength of the Ātma alone is true strength
20 May 1991
The End Of Education Is Character
1 June 1991
Spiritual Discipline (sadhana)
16 February 1992
Service of the village is service of Rāma!
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
29 June 1996
Karma, Bhakti and Jñāna: The Aim of All Three Is One
12 July 1996
Namasmarana is the Greatest Sadhana in the Kali Yuga
30 August 1996
The Body Must Be Set on the Sacred Path!
16 July 1997
Love for God, fear of sin, morality in society
25 February 1998
Man is the embodiment of Saccidānanda
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
14 April 1998
God pervades all
2 April 2003
Leave the delusion of the body; think of God
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
పాపభీతి
లేని
పామరత్వము
బట్టి
దైవప్రీతి
లేని
దారి
బట్టి
మానవత్వ
మణగె
మానవులందున
విశ్వశాంతి
కిదియె
విప్లవంబు.
విద్యార్థులారా!
అనుభవజ్ఞుడైన,
అధికారియైన,
అన్ని
విధముల
దేశమునకు
ఆదర్శమును
అందిస్తూ
అనేకత్వమునందు
యేకత్వాన్ని
నిరూపణచేస్తూ
ఆధ్యాత్మిక
మార్గమునందు
తన
జీవితము
నంకితము
గావించుకున్న
చవాన్
అనేకమైన
విషయాలను
మీకు
తెలుపుతాడని
నేను
ఆశించాను.
కాని
అతను
త్వరలో
ముగించి
యీ
యొక్క
బాధ్యత
నాకందించాడు.
విద్యార్థులారా!
మానవశరీరము
ఒక
పెద్ద
యంత్రాంగము.
ఇందులో
పెద్ద
అధికారిమొదలు
చిన్న
పనివాని
వరకు
తమ
తమ
కర్తవ్యములు
తాము
నిర్వర్తించుకుంటూ
పోయినప్పుడు
యీ
యొక్క
యంత్రాంగము
సార్థకమగుటయేగాక,
పవిత్రమగుటయే
గాక,
దివ్యత్వాన్ని
ప్రకటించటం
కూడా
జరుగుతుంది.
ఈ
యంత్రాంగమునందు
ప్రధానమైన
అధికారి
బుద్ధి.
అతని
ఆదర్శాన్ని
పురస్కరించుకొనియే
రెండవ
అధికారి
మనసు
తన
కర్తవ్యాన్ని
నిర్వర్తిస్తుంది.
ఈ
మనసుకు
అధీనమునందున్న
ఉద్యోగులు,
వారే,
యింద్రియములు.
ఈ
విధమైన
పనివారలచేత
శరీరమనే
యంత్రము
తాను
నియమిత
కర్మలాచరిస్తూ
వస్తోంది.
ఈ
అన్నింటికి
రాజైన
ఆత్మ
ప్రతి
అధికారిని
ప్రకాశింప
చేస్తుంది,
వికసింప
చేస్తుంది,
ప్రకటింప
చేస్తుంది,
ప్రదర్శింప
చేస్తుంది.
రాజునకు,
ప్రజలకు
మధ్యనున్న
అధికారియే
యీ
బుద్ధి.
ప్రజాప్రతినిధిగా
నిలచి
యీ
బుద్ధి
ప్రజల
యొక్క
యోగక్షేమములను
తాను
చూచుకుంటూ
వుంటుంది.
ఐతే
బుద్ధి
విచారణా
శక్తి
చేస్తుంది.
మనసు
తలంపులను
అభివృద్ధిపరుస్తుంది.
కేవలం
మనసు
తలంపులను
అభివృద్ధిపరచినంత
మాత్రమున
జగత్కళ్యాణము
చేకూరదు.
మనస్సుకు
స్వతంత్రము
లేదు.
కేవలము
మంత్రియైన
బుద్ధిని
అనుసరించినప్పుడే
యీ
మంత్రికి
సెక్రెటరీగా
వున్న
యీ
మనసు
సరైన
పరిస్థితిని
పొందుతుంది.
కాలానుగుణ్యముగా
మధ్యమధ్య
యీ
మినిష్టరు
యొక్క
అనుమతి
తీసుకోకుండా
యీ
సెక్రెటరీ
కొంచెము
ముందుకు
వెళ్లటానికి
ప్రయత్నిస్తాడు.
స్వతంత్రాన్ని
తీసుకుంటాడు.
అప్పుడే
పాలనా
శక్తి
కుంటుపడుతుంది.
కనుక
యీ
మానవజీవిత
మీనాడు
అనేక
యిక్కట్లతో,
అశాంతులతో,
అసంతృప్తితో
కుమిలిపోవటానికి
మూలకారణము
యీ
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమనేది
సరిగా
జరగటము
లేదు.
బుద్ధికి,
మనస్సుకు,
యింద్రియములకు,
శరీరమునకు
సరియైన
నియమిత
కర్తవ్యాన్ని
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
2
▾
Meaning
Keep
ఈ
బుద్ధికి
యింత
అధికారము
రావటానికి
కారణము
యేమిటి?
ఇది
ఆత్మకు
అతిసమీపములో
వుండటంచేతనే
బుద్ధికి
యింత
అధికారము
లభించింది.
ఈ
ఆత్మ
తత్వాన్ని
బుద్ధి
ద్వారా
మనసుకు
ప్రవేశింప
చేసి,
మనసు
ద్వారా
యింద్రియములు
ప్రకటింపచేస్తుంది.
ఈ
క్రమము
యొక్క
విధానమునకే
శమము
అని
పేరు.
దీనినే
‘సంయమము’
అని
కూడను
చెప్పవచ్చును.
సంయమము
అనగా
నిగ్రహమని
అర్థము.
ఈ
నిగ్రహశక్తియే
లేకుండిన
అనుగ్రహమునందుకోలేడు
మానవుడు.
పశువుగా
జీవించటానికి
ప్రయత్నించే
మానవునికి
సంయమము
అక్కర
లేదు.
పరిపూర్ణ
మానవునిగా
జీవించే
మానవునికి
సంయమము
అత్యవసరము.
మానవునకు
పశువునకు
వున్న
వ్యత్యాసము
యిదియే.
పులి
క్రూరమృగము.
ఈ
మృగమునకు
పుట్టుకతో
వచ్చిన
క్రూరత్వము
యిది.
తిరిగి
చచ్చునంతవరకు
యేమాత్రము
మారదు.
క్రూరభావముతో
పుట్టిన
యీ
మృగము
క్రూరభావముతోనే
మరణిస్తుంది.
పిల్లి,
మన
యిండ్లలో
చక్కగా
ప్రేమతో
పెంచుకుంటూ
వుంటాము.
దీనిని
యెంతో
ప్రేమతో
పాలు,
పెరుగు,
అన్నము
పెట్టి
పోషించినప్పటికి
ఎలుకను
చూచిన
తక్షణమే
ఎగిరి
దుముకుతుంది.
ఇది
పాత
అభ్యాసము.
ఇది
పుట్టుక
యొక్క
దుర్గుణము.
దీనికెన్ని
విధములైన
ఆహారము
పెట్టి
పోషించినా
ఆ
మాలిన్యము
వైపుకే
దీని
మనసు
పరుగెడుతుంది.
కాని
మానవుడట్టివాడు
కాదు.
దుష్టుడై,
దుర్మార్గుడై,
నీచుడై
పుట్టిన
మానవుడు
కూడా
సజ్జనుడు,
సదాచారుడు,
ధర్మస్వరూపుడుగా
మారటానికి
అవకాశము
వుంది.
సత్సంగము
చేతను
సద్గ్రంథ
పఠనము
చేతను,
సత్కర్మలు
వినటం
చేతను
తన
జీవితాన్ని
మార్చుకొని,
దివ్యత్వాన్ని
పెంపొందింప
చేసుకొని,
దైవత్వాన్ని
అనుభవించటానికి
అవకాశము
వుంది.
కనుక
మానవునకు
సంయమము
అనగా
నిగ్రహము
అత్యవసరము.
మృగములు
కూడా
తాత్కాలికముగా
కొన్ని
నిగ్రహాలు
చేస్తూ
వుంటాయి.
పిల్లలు
మీరు
చూచినటువంటిదే.
సర్కస్‌లో
క్రూరమృగమైన
సింహమును
తెచ్చిపెట్టి
దాని
శత్రువైన
ఏనుగును
కూడా
తెచ్చిపెట్టి
రెండింటి
సంబంధ
బాంధవ్యము
ప్రేమతో
వున్నట్లు
నిరూపణ
చేస్తారు.
అంతేకాదు.
చంచలత్వమునకు
పుట్టినిల్లు
పెట్టిన
పేరు
కోతి.
అట్టి
చంచలత్వముతో
కూడిన
కోతికి
కూడా
సైకిలు
తొక్కించటము
నేర్పిస్తారు.
సర్కస్‌లో
సైకిల్
తొక్కుతుంది.
సింహము
విరోధియైన
ఏనుగుతో
స్నేహ
బంధము
యేర్పరచుకుంటుంది.
ఇవన్నీ
అభ్యాసము
చేత
వచ్చినటువంటివి
అని
మీరు
భావించవచ్చు.
కాదు.
కాదు.
అభ్యాసముతో
వచ్చినవి
కావు.
భయముతో
యేర్పడినవి.
అనగా
రింగ్
మాష్టరు
చేతిలో
వున్న
కరెంట్
బాధకు
భయపడి
తద్వారా
మెలగుతూ
వస్తున్నవి.
అంతేకాని
తమ
క్రూరత్వాన్ని
తాము
వదలలేదు.
తమ
చంచలత్వాన్ని
తాము
విడువలేదు.
సన్నిహితమైన
ప్రేమ
భావము
వాటికి
కల్గలేదు.
ఆవిధముగా
మనము
కూడా
…తో
సర్కస్
మృగముల
వలె
మనము
జీవించటము
వ్యర్థమైన
జీవితము.
3
▾
Meaning
Keep
…గా
కేవలము
యజమాని
ముందు
మాత్రమే
చక్కగా
ప్రవర్తించటము,
సరియైన
ఆచరణలు
ఆచరించటము,
సరియైన
నడతతో
వుండటము
యిది
కేవలము
ఒక
విధమైన
మృగలక్షణముగా
మనము
భావించవచ్చును.
సర్కస్‌లో
మృగములు
యీ
రింగ్
మాన్ని
చూచి
ఏవిధముగా
భయపడుతున్నాయో
అదే
విధముగా
యీనాడు
మీరు
యీ
రింగ్
మాన్ని
చూచి
భయపడి
చేసినట్లుగా
మీరు
చేయకూడదు.
అప్పుడు
ఆ
సర్కస్
మృగములకు
యీ
మ…లకు
తేడా
వుండదు.
మానసిక
పరివర్తన
రావాలి.
ప్రవర్తన
మారాలి.
మనసే
మారకుండిన,
యింద్రియములేమాత్రము
వశము
కావు.
ఈ
మనస్సు
బుద్ధిని
అనుసరించకుండిన,
మనస్సు
యీ
యింద్రియములను
యేమాత్రం
అదుపులో
పెట్టుకోలేదు.
కనుక
మనసు
బుద్ధిననుసరించి
ఆ
బుద్ధి
యొక్క
ఆజ్ఞానుసారంగా
మనసు
ప్రవర్తించినప్పుడే
యీ
యింద్రియములు
మన
స్వాధీనమవుతాయి.
కనుక
యీనాటి
మానవత్వము
యీ
విధ…
‘బుద్ధిగ్రాహ్య
మతీంద్రియం’
యీ
యింద్రియముల
తత్వమంతా
బుద్ధికతీతమైన
మార్గములో
ప్రవేశపెడుతుంది.
ఇలాంటి
తత్వాన్ని
మానవుడు
యీనాడు
గుర్తించాలి.
మానవతా
విలువలను
చక్కగా
గుర్తించాలి.
ఎందుకనగా
మానవత్వము
నందు
దివ్యత్వమనే
ఆత్మతత్వము
సుస్థిరముగా
వుంటుంది.
దీనికి
రెండు
వుదాహరణలు.
గణిత
శాస్త్రమని
ఒకటి,
మిత్ర
శాస్త్రమని
మరొకటి
వుంది.
ఈ
గణిత
శాస్త్రములో
1+1+1+1
అనిపెడితే
4
అవుతుంది.
ఒక
అంకెకు
యితర
అంకెలు
చేర్చినప్పుడు
ఆ
అంకె
పెరుగుతుంది.
ఇది
గణిత
శాస్త్రము.
మిత్ర
శాస్త్రమనగా
యేమంటే
I+I+I+I
crores
of
I
పెట్టండి.
I
అవుతుంది
అంతే.
ఈ
I
పెరగదు
తరగదు.
ఎప్పటికీ
అమృతస్య
పుత్రః
సుస్థిరమైన
రీతిలో
వుంటుంది.
ఎన్ని
I
లు
చేరినప్పటికి
I
అవుతుంది
గాని
…
అని
అవదు.
ఈ
I
అనేది
ఎక్కడ
వుంది?
ఇప్పుడు
నేను
ఒక
పేరు
చెప్తాను.
I.J.
నాయుడు
అని
పేరు
చెప్పి
ఎవరు
మీరంటె
నేను
I
అంటాడు.
తదుపరి
వైస్
ఛాన్సలర్
షరాఫ్
ఎవరంటే
I
అంటాడు.
రిజిష్టారు
చక్రవర్తి
ఎవరంటే
నేను
I
అంటాడు.
ఈ
కంట్రోలర్
నంజుడప్ప
ఎవరంటే
I
అంటాడు
యితను.
I.J.
నాయుడు
యొక్క
రూప
నామములు
వేరు
వేరుగా
వున్నాయి.
వైస్
ఛాన్సలర్
రూప
నామములు
వేరువేరుగా
వుంటాయి.
రిజిష్ట్రార్
చక్రవర్తి
రూప
నామములు
వేరుగా
వున్నాయి.
కంట్రోలర్
నంజుడయ్య
రూప
నామములు
…
వేరుగా
వున్నాయి
కాని
నా
question
కు
నలుగురి
వద్దనుండి
I
అనే
జవాబు
ఒకటిగానే
వచ్చింది.
I
అనేది
ఎక్కడ
వున్నదంటే
I
is
everywhere.
ఈ
I
అనేది
…టికి
I
గానే
వుంటుంది.
ఇది
దేశకాల
పాత్ర
ప్రభావములకేమాత్రము
గురికాదు.
నీవు
కేవలము
యిండియాలో
వున్నప్పుడే
I
అనవు.
అమెరికాకు
పో,
రష్యాకు
పో,
చైనాకు
పో
యింక
ఎక్కడికైనా
పో,
పాకిస్తాన్
పోయి
చేరు
I
అనే
అంటావు.
అదే
ఆత్మ
తత్వము
మార్పు
చెందనిది.
తరగనిది.
పెరగనిది.
ఇదే
Human
value.
అందరియందు
వున్న
I
తత్వము
ఒక్కటియే.
4
▾
Meaning
Keep
ఐతే
యీనాడు
ఆ
I
ఏమైపోయింది?
I
కి
అహం
చేరిపోయింది.
ఈ
అహంకారముతో
కూడిన
I
గా
వుండటంచేత
యిది
eye
గా
మారిపోయింది.
ఈ
అహంకారము
లేనప్పుడు
ఏకాక్షర
I
మాత్రమే
వుంది.
అహంకారము
చేరేటప్పటికి
eye
అయింది.
మూడు
అక్షరాల
eye
అయిపోయింది.
ఈ
మూడక్షరముల
eye
దేహము.
ఏకాక్షర
I
ఆత్మ.
ఈ
ఆత్మ
తత్వమే
స్వధర్మము.
ఈ
దేహ
తత్వమే
పర
ధర్మము.
పరధర్మము
ప్రకృతికి
సంబంధించినది.
స్వధర్మమనేది
జీవ
తత్వానికి
సంబంధించినది.
స్వధర్మములో
దోషములు
రావు.
పరధర్మములో
సర్వము
దోషముల
మయమే.
కనుక
యీనాటి
మానవుడు
స్వధర్మమునకు
సంబంధించిన
మార్గములో
ప్రవేశించాలంటే
ఐదు
రకములైన
తత్వాలను
మనము
గుర్తించాలి.
ప్రకృతి
సమత్వము
ఒకటి.
రెండవది
సమాజ
సమత్వము,
మూడవది
జ్ఞాన
సమత్వము,
నాల్గవది
భక్తి
సమత్వము,
ఐదవది
కర్మసమత్వము.
ఈ
ఐదింటి
సమత్వాన్ని
మనం
గుర్తించినప్పుడే
మన
యొక్క
దివ్యత్వమనేది
మనకర్థమవుతుంది.
మొట్టమొదట
ప్రకృతి
సమత్వాన్ని
మనము
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
ఈ
ప్రకృతి
యొక్క
సమత్వములో
యేవిధముగా
వున్నదంటే
శీతోష్ణములు
మనము
అనుభవిస్తూనే
వున్నాము.
Summer
లో
చాలా
వేడిగా
వుంటుంది.
Winter
లో
చల్లగా
వుంటుంది.
చలిగా
వుంటుంది.
ఈ
ఎండకు
యీ
చలికి
విరుద్ధమే.
ఇది
ప్రకృతి
సహజము.
అయితే
ఒక
సమయములో
ఎండ
మనకు
హాయినిస్తుంది.
మరొక
సమయములో
చలి
మనకు
సంతోషమును
అందిస్తుంది.
అనగా
Summer
లో
చలి
మనకు
హాయినిస్తుంది.
Winter
లో
మనకు
వేడి
హాయినిస్తుంది.
ఏతావాతా
యీ
వేడి
చలి
రెండూ
మనకు
సుఖాన్నే
అందిస్తున్నాయి.
Time
difference.
కనుక
మనము
యీ
సమత్వాన్ని
యేరీతిగా
తీసుకోవాలి.
వేడి
మనకు
ఆనందాన్ని
యిస్తుంది.
చలీ
మనకు
ఆనందాన్ని
యిస్తోంది.
అయితే
కాలములు
వ్యత్యాసంగా
వుంటున్నాయి.
దాని
యొక్క
అంతరార్థము
రెండూ
మనకు
హాయి
నందించేవే.
మానవునికి
రెండూ
అవసరమే.
సుఖమూ
దుఃఖము
మానవునికి
సామాన్యమే.
ఐతే
యీ
సుఖదుఃఖములు
దేనివలన
మనకు
లభిస్తున్నాయి?
మరణముతో
మనకు
దుఃఖము
వస్తోంది.
జననము
ఆనందము
కల్గిస్తోంది.
అయితే
మన
దుఃఖానికి
మరణమా
కారణము?
కాదు
కాదు.
మరణము
దుఃఖమునకు
కారణమే
కాదు.
ఇందులోని
రహస్యము
మనం
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
ఒక
మరణమే
దుఃఖాన్ని
అందిస్తే
మరణము
అందరికి
దుఃఖమును
యివ్వాలి?
కాని
అందరికి
దుఃఖమును
అందించటం
లేదే.
ఆ
మరణించిన
దేహముపైన
వున్న
అభిమానము
మనకు
దుఃఖాన్ని
యిస్తోంది.
ఆ
మరణించిన
దేహము
మనకేమాత్రము
సంబంధము
లేదనుకుంటే
మనకు
దుఃఖమే
లేదు.
నీకు
దుఃఖము
నందించినది
మరణము
కాదు.
మరణించిన
దేహముతో
వున్న
attachment
నీకు
దుఃఖాన్ని
అందించింది.
5
▾
Meaning
Keep
ఈ
పుట్టిన
వ్యక్తి
మనకే
విధముగా
ఆనందాన్ని
అందిస్తున్నాడు.
నా
కొడుకు,
నా
బిడ్డ,
నా
మనుమడు
మనుమరాలు
అని
ఒకవిధమైన
attachment
వున్నప్పుడు
నాకు
grandson
పుట్టాడని
ఆనందాన్ని
అనుభవిస్తాడు.
అట్లు
కాకుండా
పోతే
లోకములో
యెంతమందో
దినానికి
పుడుతున్నారు,
యెంతమందో
దినానికి
చస్తున్నారు.
ఎప్పుడూ
యేడ్వటం
నవ్వటమేనా?
యిది
భావ్యము
కాదు.
ఒకే
బజారులో,
ఒకే
యింటిలో
marriage,
మరొక
యింటిలో
death
ఒకరు
ఆనందిస్తూ
వుంటారు
ఒకరు
ఏడుస్తూ
వుంటారు.
ఈ
చావే
కనుక
దుఃఖము
నందిస్తే
అందరికి
దుఃఖమునివ్వాలి
కదా.
యివ్వటంలేదు.
ఈ
విధముగా
విచారించినప్పుడు
ప్రకృతి
యొక్క
సంబంధము
యివన్నీ
కేవలము
attachment
లో
వచ్చినటువంటివి.
సంబంధ
బాంధవ్యములతో
వచ్చినవి.
అంతేకాని
యీ
జనన
మరణములు
సుఖ
దుఃఖముల
నివ్వటం
లేదనే
సత్యాన్ని
గుర్తించవచ్చును.
ఈ
ప్రాకృతమైన
సమత్వాన్ని
మనం
యీ
రకముగా
విచారణ
చేస్తే
దానికి
దీనికి
రెండింటికి
సంబంధము
వుంటోంది.
ప్రకృతి
కేవిధముగా
సుఖదుఃఖములు,
heat
and
cold,
dark
and
light
యేవిధముగా
సహజమో
మన
జీవితానికి
కూడా
యివి
రెండు
సహజము
అనే
సమత్వాన్ని
గుర్తించుకున్నప్పుడు
మనకు
విచారణ
వుండదు.
రెండవది
సామాజిక
సమత్వము.
ఈ
సమాజము
అంటే
యేమిటి?
ఈ
సొసైటీ
అనే
దానికి
ప్రత్యేకమైన
రూపము
లేదు.
ఇది
పంచ
ప్రాణములతో
కూడిన
శరీరము
కాదు.
పది
మంది
వ్యక్తులు
చేరినదే
సొసైటీ.
కనుక
వ్యక్తుల
యొక్క
సమూహమే
సొసైటీ
కాని,
ప్రత్యేకమైన
స్వరూపము
కాదు.
కనుక
వ్యక్తిత్వములో
వున్న
దివ్యత్వాన్ని
తాను
చక్కగా
గుర్తించుకుంటే
సొసైటీ
అంతా
ఆనందముగా
వుంటుంది.
ఇక్కడ
యేమవుతుందంటే
సమత్వము.
ఈ
సొసైటీలో
సమత్వము
అభివృద్ధిపరచే
నిమిత్తమై
ప్రభుత్వము
అనేక
రకాలైన
ప్లాను
వేస్తుంది.
ఈ
సమత్వము
యేరీతిగా
యేర్పడుతుంది.
ప్రభుత్వము
వేసిన
ప్లానులు
అందరికి
సమానంగా
భూమి
వుండాలి.
అందరికి
సమాన
ఆస్తిపాస్తులుండాలి.
ఒకరికి
పది
ఎకరాల
భూమి
వుంటుంది.
ఇంకొకరికి
రెండు
ఎకరముల
భూమి
వుంటుంది.
వీరిద్దరిని
సమానము
చేయాలని
వాని
నాలుగు
యకరములు
తీసి
రెండు
యకరముల
వానికి
పంచుతాడు.
అప్పుడు
ఒక్కొక్కరికి
ఆరు
ఎకరములు
సమంగా
వస్తుంది.
ఐతే
భూమిని
సమంగా
పంచగల్గటం
అయితే
ప్రభుత్వము
చేశారు
కాని
ఆశలు
సమంగా
పంచటం
యెవరితరము?
కనుక
desires
మనము
సమత్వముగా
అభివృద్ధి
చేసుకుంటే
ప్రోపరిటీ
సులభముగా
సమంగా
అయిపోతుంది.
పది
ఎకరాలు
వున్న
వాని
నాలుగు
యకరాలు
తీసి
యింకొకరికి
యిస్తే
వాడు
ఏడుస్తాడు.
రెండు
ఎకరములున్నవానికి
నాలుగు
యకరములొస్తే
వాడు
నవ్వుతాడు.
సమత్వము
ఎక్కడుంది,
ఇక్కడ?
కనుక
మానసిక
సమత్వమే
సామాజిక
సమత్వము.
ఈ
మానాభిమానాలు,
దూషణ
భూషణాలు.
ఈ
విధమైన
సమత్వములో
మానవుడు
కొంతవరకు
దీనిని
నిగ్రహించుకోవటానికి
ప్రయత్నించాలి.
6
▾
Meaning
Keep
దుఃఖము
వస్తే
కృంగిపోటం,
ఆనందము
పొంగి
వస్తే
పొంగిపోవటం
యిది
మానవునికి
సమాజములో
వుండకూడదు.
ఒకడెవడో
దూషించాడని
యీ
దూషణ
వల్ల
మనం
కృంగిపోరాదు.
ఎవరో
మనలని
పొగిడారని
మనము
పొంగిపోరాదు.
ఈ
కృంగి
పొంగని
సమత్వాన్ని
మనము
సమాజములో
సాధించినప్పుడే
నిజమైన
మానవత్వముగా
రూపొందుతుంది.
ఈ
దూషణ
భూషణాలనేవి
పదముల
యొక్క
తరంగములని
గుర్తించాలి.
ఒకరు
no
అనవచ్చును.
యింకొకరు
yes
అనవచ్చును.
ఈ
no,
yes
లు
మన
నోటికే
కాని
సమత్వానికి
సంబంధము
లేదు.
ఈ
సమత్వము
ఎక్కడుండాలి?
మనయొక్క
…ious.
దీనిని
మనము
తృప్తి
పరచినప్పుడు
సరైన
సమత్వము
వస్తుంది.
మనలో
యేవిధమైన
దోషములు
లేనప్పుడు
యెవరే
విధముగా
నిందించినా
మనము
వెరువనక్కరలేదు.
మనలో
మంచి
లేనప్పుడు
ఎవరెంత
వర్ణించినా
మనము
పొంగిపోరాదు.
నీది
నీకు
తెలుసును
బాగుగా.
నీ
సత్యాన్ని
నీవు
గుర్తించి
వర్తించుకోటమే
సమాజము
యొక్క
సమత్వము.
ఇంక
జ్ఞానము
యొక్క
సమత్వము.
జ్ఞానమనగా
యేమిటి?
అద్వైత
దర్శనం
జ్ఞానం
అన్నారు.
ఏకత్వాన్ని
నిరూపణ
చేయటమే
జ్ఞానము
అన్నారు.
అన్నింటియందూ
వున్న
ఏకత్వము
unity
in
diversity.
ఇక్కడ
భేదత్వమే
వుండదు.
ఏ
విధముగా
అంటే
అందరియందు
దైవత్వము
ఒక్కటే.
అందరూ
పీల్చుకునే
గాలి
ఒక్కటే.
అందరూ
త్రాగే
నీరు
ఒక్కటే.
అందరూ
నివసించే
భూమి
ఒక్కటే.
అందరి
తలపైనా
వున్న
ఆకాశము
ఒక్కటే.
ఇంక
భేదము
ఎక్కడ
వుంది?
మన
హృదయాలలో
వున్న
ఆత్మ
కూడా
ఒక్కటే.
భేదములంతా
కేవలం
యీ
మనో
సంకల్పములతో
యేర్పడినవే
గాని
సృష్టి
సహజమైనవి
కావు.
‘ఏకోవసి
సర్వభూతాంతరాత్మ’
అనే
సత్యాన్ని
మనము
గుర్తించుకోవాలి.
దీనికి
ప్రవర్తన
…తవరకు
చక్కగా
వుండాలి.
మనము
పది
మందితో
మాట్లాడుతూ
వుంటాము.
లేకపోతే
మన
క్లాసు
పిల్లలతో
యేమో
తర్కించుకుంటూ
వుంటాము.
మాటకు
మాట
పైన
కోపాలు
మనము
అభివృద్ధి
చేసుకోకూడదు.
చెప్పిన
విషయములకు,
చేసిన
దానికి,
వినయ
విధేయతలు
మనము
ప్రకటిస్తూ
రావాలి.
మన
యింటిలో
పెద్దలుగాని
కళాశాలలో
లెక్చరర్సుగాని
ఎవరైనా
యేదైనా
చెప్తున్నప్పుడు
Yes
జీ,
No
జీ
అని
మంచిగా
మాట్లాడుతూ
వుంటే
ఎంత
ఆనందము
యిస్తుంది.
ఈ
విధమైన
మాటలు,
వినయముతో
విధేయతతో
మనము
వుపయోగపెట్టినప్పుడు
యీ
సమత్వము
మనలో
చక్కగా
అభివృద్ధి
అవుతుంది.
ఎటువంటి
పరిస్థితులలోనైనా
మాటలు
చాలా
మృదుమధురముగా
వుపయోగ
పెట్టుకొనే
విధానాన్ని
నేర్చుకోవాలి.
ఎవరైనా
మనలను
దూషిస్తున్నారనుకోండి.
యిది
చక్కగా
మీరు
జ్ఞాపకమునందుంచుకోవాలి:
భగవంతుడే
యీ
రూపములో
వచ్చి
నన్ను
దూషిస్తున్నాడు
కనుక
యిది
ఆనందమే
అని
ఆరీతిగా
భావించుకో.
ఎవరైనా
వచ్చి
నిన్ను
వర్ణిస్తున్నారంటే
భగవంతునికెంత
దయ
యీ
రూపములో
వచ్చి
నన్ను
వర్ణిస్తున్నాడని
నీవు
ఆనందించు.
ఏ
వ్యక్తి
నిన్ను
దూషించినా
భూషించినా
భగవంతుడే
యీ
రూపములో
వచ్చి
నన్ను
యీ
విధముగా
వచ్చి
సరిచేస్తున్నాడనే
సమభావాన్ని
తీసుకుంటే
యెంతైనా
మన
మనసు
నిగ్రహములోనికి
ప్రవేశిస్తుంది.
7
▾
Meaning
Keep
ఉద్రేకముల
కేమాత్రము
అవకాశము
యివ్వరాదు.
ఈ
వుద్రేకములు
నీయొక్క
బలహీనతలే.
కనుక
నీ
బలహీనతను
నీవు
నిరూపించుకుంటున్నావు.
మనయందు
అహంకారమునకు
గాని
క్రోధమునకు
గాని
యింకే
విధమైన
దుర్భావములకు
గాని
అవకాశము
యివ్వరాదు.
కనుక
యిదంతా
సంయమంతో
మనకు
సమకూరుతుంది.
కనుక
మొట్టమొదట
మనస్తత్వాన్ని
మనం
చక్కగా
అర్థము
చేసుకోవాలి.
‘సంకల్ప
వికల్పాత్మకం
మనః’
అన్నారు.
‘మననాత్మకం
మనః’
అన్నారు.
కనుక
మనయొక్క
thoughts
మనకు
వుద్రేకాన్ని
గాని,
వుల్లాసాన్ని
గాని
అందిస్తున్నాయి.
కనుక
మనలో
మొట్టమొదట
మంచి
తలంపులు
పెంపొందింప
చేసుకునేందుకు
ప్రయత్నించాలి.
ఈ
విధముగా
అందరియందు
వున్న
దైవత్వము
ఒక్కటే
అనే
సత్యాన్ని
గుర్తించుకుంటే
వుద్రేకాలకు
అవకాశము
లేదు.
ఇదే
జ్ఞాన
సమత్వము.
ఇక
భక్తి
సమత్వము.
భగవంతుడు
ఒక్కడే.
అనేక
రూప
నామములు
వుండవచ్చు.
‘ఏకం
సత్
విప్రాబహుధా
వదంతి’
వున్నది
ఒక్కటే
అయినా
అనేకమంది
అనేక
పేర్లు
పెడుతున్నారు.
‘ఏకమేవ
అద్వితీయం’.
ఒక్కటే!
ఒక్కటిగాని
రెండు
లేవు.
Not
two
…
one.
ఇలాంటి
భావము
చేత
భగవత్
తత్వము
ప్రేమతో
పొందటానికి
ప్రయత్నించాలి.
ప్రేమస్వరూపము
ఒక్కటే
ఒక్కటి.
నాకు
వున్న
ప్రేమ,
నీకు
వున్న
ప్రేమ,
యింకొకరికి
వున్న
ప్రేమ
ఒక్కటే.
దాని
యొక్క
స్వభావము
ఒక్కటే.
చక్కెర
నా
చేతిలో
పెట్టుకున్నా,
నీ
చేతిలో
పెట్టుకున్నా,
యింకో
servant
చేతిలో
పెట్టుకున్నా
దాని
తీపిగుణము
తీపి
గుణమే.
చేతులు
మారినంత
మాత్రమున
తీపి
మారదు.
ఒక
చంపక
పుష్పము
మన
చేతిలో
పెట్టుకొని
వాసన
చూస్తున్నాము.
Right
hand
లో
పెట్టుకొని
చూచినా
దాని
సుగంధము
సుగంధమే.
మన
ఎడమ
చేతిలో
పెట్టుకున్నా
దాని
సుగంధము
సుగంధమే.
పుష్పము
నన్ను
యెడమ
చేతిలో
పెట్టుకున్నాడని
దాని
సుగంధము
తీసుకోదు.
…గంధము
అంత
మాత్రమే
కాదు.
ఆ
సుగంధాన్ని
మనకందించటమే
కాకుండా
మన
పరిసరములలో
వున్నవారికి
కూడా
ఆ
సుగంధాన్ని
అందిస్తుంది.
భక్తులకు
కష్టములు,
దుఃఖములు,
బాధలు
సంభవిస్తుంటాయి.
ఆ
దుఃఖములలో
కూడా
మనము
ఆనందము
నందించాలి.
మనదేహము
క్షీణించి
పోతున్నా
మనము
ఆనందము
నందించాలి.
దీనిని
వూదా…తో
పోల్చవచ్చును.
అది
ఎలా
అంటే
అది
కాలిపోతూ
కాలిపోతూ
సుగంధాన్ని
అందరికి
యిచ్చి
కాలిపోతుంది.
ఇంతే
కాదు.
మరొకటి
గంధపు
చక్క.
ఆ
గంధపు
చెక్కను
పట్టి
నూరి
నూరి
దానినెంత
హింసించినా
దాని
సుగంధమును
అభివృద్ధి
గావిస్తుంది.
కనుక
యీనాడు
మానవుడే
రీతిగా
తయారౌతున్నాడు.
ఒక
చీమకంటె,
ఒక
కాకికంటె
మానవత్వములో
వుండవలసిన
గుణంకంటె
మరింత
దిగజారిపోతున్నాడు.
మీరు
చూసి
వుంటారు.
ఎక్కడైనా
తీపి
ముక్క
బెల్లమో,
చక్కెరో
పడి
వుంటే
ఒక
చీమ
చూస్తుంది.
భలే
నాకు
బెల్లం
చిక్కింది
అని
ఆ
చీమ
స్వార్థముగా
ఆరగిస్తూ
కూర్చోదు.
8
▾
Meaning
Keep
తన
చీమల
పుట్టకు
పోతుందది.
అక్కడ
బెల్లము
వుంది
అందరము
పోదాము
రండి
అని
చెప్పి
ఆ
బెల్లమును
అందరు
సమంగా
భుజిస్తారు.
ఎక్కడైనా
అన్నం
మెతుకులు
చల్లి
test
చేయండి.
మొదట
ఒక
కాకి
వస్తుంది,
చూస్తుంది.
అది
తినదు.
పోయి
కావు
కావు
మని
అందరినీ
ఏకంగా
పిల్చుకుని
వచ్చి
అన్నీ
ఏకంగా
భుజిస్తాయి.
నిజముగా
యీ
విధమైన
సమత్వం
మానవుని
యందు
వుండి
వుంటే
ఎంత
ఉద్ధారమై
వుండేది!
ఇతనికేదైనా
చిక్కిందంటే
ఎవరైనా
చూస్తారేమోనని
మెత్తగా
తీసుకొని
లోపల
పెట్టుకుంటాడు.
పది
మందికి
యిందులో
అధికారము
వుంది,
పది
మంది
తిన్నప్పుడే
నేనూ
తిన్నట్లు
అనే
సమత్వాన్ని
యీ
భక్తి
భావములో
అభివృద్ధి
పరచుకోవాలి.
అందువల్లనే
ప్రాచీన
సంప్రదాయము
నందు
లోకాస్సమస్తా
సుఖినోభవంతు
అని
విశాలమైన
భావముతో
యీ
భక్తి
ప్రపత్తులను
ప్రసరింప
చేసింది.
మన
భావాలంతా
చాలా
అపవిత్రముగా
మారిపోతున్నాయి.
మీకందరికి
తెలుసు.
ఇనిస్టిట్యూట్లోగాని,
హాస్టలులోగాని
టైట్‌గా
మీకు
పనులు
పెడుతున్నారు.
ప్రతివారం
ఏదో
ఒక
test
అనో,
క్విజ్
అనో
అనేక
రకాలుగా
మీకు
వత్తిడి
పెడుతున్నారు.
ఇది
కొంచెం
ముగించుకొని
అక్కడకు
పోతూనే
sports,
games
కి
పోవాలి.
అక్కడనుండి
పోతూనే
వీరికి
స్నానం
చేసే
టైమ్
కూడా
వుండదు.
అక్కడ
kitchen
లో
పని
చేయాలి.
ఈ
విధముగా
మీరు
అనుకుంటారు.
అబ్బా
స్వామి
హాస్టలులో
మాకు
టైమే
లేదు,
చాలా
టైట్
వర్కు
యిస్తున్నారు.
study
కూడా
చాలా
కష్టంగా
వుందని
మీరు
భావిస్తారు.
This
is
good
for
you.
ఎలానంటే
ఒక
చిన్న
వుదాహరణము:
బ్రహ్మచారి
శతమర్కటః
అన్నారు.
ఈ
యువకుల
లోపల
వేలకొలది
కోతులుంటాయట.
అలాంటి
భావాలున్నప్పుడు
అరికట్టుకోటం
చాలా
కష్టము.
మరొక
చిన్న
కథ
చెప్పి
ముగిస్తాను.
ఒక
పల్లెలో
నివసించే
యువకుడు
దేశాభిమానం
చేత,
యుద్ధం
…పడింది
మన
భారత
దేశములో
అని,
నేను
సైన్యంలో
ప్రవేశించాలని
వుత్సాహముతో
ప్రవేశించాడు.
రెండు
మూడు
దినములు
అక్కడ
టైట్‌గా
పని
పెట్టారు.
కాని
దురదృష్టవశాత్తూ
పోయిన
ఐదవ
రోజునే
యుద్ధం
నిల్చిపోయింది.
ఏదో
యింటిలో
బాధవల్లనో,
దేశాభిమానము
వల్లనో
యింకే
విధమైన
కారణము
వల్లనో
యుద్ధములో
ప్రవేశించాలని
తల్లితండ్రులను,
యింకా
అక్క
చెల్లెండ్రను
అందరిని
త్యజించి
తాను
యుద్ధములో
ప్రవేశించాడు.
యుద్ధము
అయిపోయింది.
సిపాయిలకు
రెస్ట్
చిక్కింది.
వీడు
చెట్టుక్రింద
కూర్చున్నాడు.
ఈ
వచ్చిన
మూడు
దినముల
నుండి
యేమీ
యోచనకు
టైమ్
లేదు
వానికి,
పని
పని.
ఇక్కడ
డ్రిల్
చేయటం.
అక్కడ
నుండి
shooting
కి
పోవటం
అన్నీ
పనులే.
24
గంటలూ
పని
పెట్టారు.
ఈ
పని
నిలచి
పోయేటప్పటికి
చెట్టుక్రింద
కూర్చున్నాడు.
నా
గురించి
నా
తల్లి
తండ్రులెంత
బాధపడుతున్నారో,
నా
చెల్లెళ్లు
యెంత
బాధపడుతున్నారో,
నా
తమ్ముడు
యేవిధముగా
వున్నాడో
అని
యింటిని
గురించి
చింత
అభివృద్ధి
అయింది.
9
▾
Meaning
Keep
ఈ
చింతలకంతా
కారణం
పని
లేకపోవటం.
దాని…
మెదడుకు
పని
పెట్టారు.
ఆ
tent
లో
కూర్చున్న
officer
చూశాడు.
వాడు
తలచుకుంటున్నాడు,
కన్నీరు
కారుస్తున్నాడు.
అధికారి
పిలిచాడు.
బాబూ
యిలారా
అన్నాడు.
ఒక
దగ్గర
చూపించి
నాలుగు
అడుగులు
యిట్లా,
నాలుగు
అడుగులు
అట్లా
ఒక
గుంత
తవ్వమన్నాడు.
మంచి
గట్టి
ప్రదేశములో
గుంట
తవ్వమని
చెప్పాడు.
అది
మూడు
దినములు
పట్టింది.
తవ్వటం,
తవ్వటం,
యీ
విధముగా
పాపం
శ్రమ
పడ్డాడు.
మూడు
దినములయ్యాక
officer
దగ్గర
కొచ్చి
సార్,
నాపని
పూర్తయిందని
చెప్పాడు.
ఈ
గుంట
తవ్వేటప్పుడు
నీవు
ఎన్ని
పర్యాయములు
యింటిని
చింతించావని
ప్రశ్నించాడు.
నాకు
టైమ్
ఎక్కడుంది
సార్
దీనితో
సరిపోయింది.
ఇంటి
సమాచారమే
నాకు
జ్ఞాపకం
రాలేదన్నాడు.
అధికారి
చెప్పాడు
‘ఈనాటి
పిల్లలకు
పని
లేకుండా
పోవటం
చేతనే
మనస్సంతా
పిచ్చిభ్రాంతులతో
నిండి
పోయింది.’
కనుక
పిల్లలకు
ఎక్కువగా
పని
పెట్టాలి.
ఈ
పని
యేమి
చేస్తుందంటే,
యీ
పనివల్ల
నీవు
అలసిపోయినా
పరవాలేదు
గాని
చెడు
భావాలు
నీలో
చేరకుండా
వుంటాయి.
బయటి
కళాశాలలలో
పనులు
లేకుండా
పోవటం
చేతనే
అనవసరంగా
ప్రపంచ
విషయాలలో
మునిగిపోయి
యింక
బజారు
వరకు
ప్రవేశిస్తున్నారు.
ఇక్కడ
work
is
worship.
కర్మసమత్వము.
Work,
work
నాకు
work
కావాలి
అనే
ఆవేదన
రావాలి
లోపలనుండి.
కృష్ణుడు
చెప్పింది.
ఒరే
పిచ్చివాడా!
కర్మ
చాలా
మనకు
పవిత్రమైన
వ్యూహాలను
పెంపొందింప
చేస్తుంది.
నాకు
కర్మ
చేయవలసిన
అవసరము
లేదు.
నాకీ
ప్రపంచములో
కావలసినది
యేమీ
లేదు.
పోయేదేమీ
లేదు.
కానీ
నేనే
యీ
కర్మ
ఆచరిస్తున్నాను.
దేనికోసం?
లోకోద్ధరణా
నిమిత్తమై.
నేను
ఆచరించినప్పుడే
లోకము
ఆచరిస్తుంది.
కర్మలోనే
మనకు
అధికారము
వుంటుంది.
కొంతమంది
యీనాడు
లోకములో
యేమనుకుంటారు?
పని
లేకుండా
హాయిగా
కూర్చొని
నిద్రపోతుంటే
అబ్బా
వాడెంత
అదృష్టవంతుడురా
ఏ
పనీ
లేదు,
చక్కగా
భోజనము
చేసి
నిద్రపోతూ
వుంటాడు.
ఇలాంటి
అదృష్టము
వుండాలి
అంటారు.
ఇది
అదృష్టము
కాదు.
దురదృష్టము.
సోంబేరితనము.
పని
చేయాలి
రెక్కాడితే
డొక్కలాడుతాయి.
నీవు
పని
చేసినప్పుడే
నీవు
తిన్నది
జీర్ణమవుతుంది.
అలా
పని
చేయకపోతే
మీకు
తెలుసు,
Iron
machines
వుంటాయి.
అది
పని
చేయకుండా
అలా
పెడితే
తుప్పు
పడుతుంది.
ఈ
rust
పట్టినప్పుడు
ఆ
machine
యింక
పని
చేయదు.
మొట్టమొదట
dust
మాదిరి
చేరుతుంది.
ఈ
dust
లో
గాలి
చేరటం
వలన
rust
అయిపోతుంది.
ఈ
rust
పట్టటం
వలన
తన
పని
burst
అయిపోతుంది.
ఈ
burst
అయినప్పుడు
rest
లో
ప్రక్కగా
పెట్టేస్తాము.
కనుక
పని
చేయని
వ్యక్తి
ఎలాంటి
వాడంటే
rust
పట్టిన
machine
వంటివాడు.
కనుక
మనము
పని
చేయాలి.
బాగా
పని
చేస్తూ
వుంటే
మనకు
రోగములేమాత్రము
ప్రవేశించవు.
10
▾
Meaning
Keep
కనుక
దీనివలన
మానవత్వములో
బుద్ధికుశలత
నందిస్తుంది.
అంతేకాదు,
దేహానికి
ఆరోగ్యము
చేకూరుస్తుంది.
చాలా
clever
గా
వుంటాడు.
memory
power
పెరుగుతుంది.
దేహము
పుష్టివంతమవుతుంది.
చెడ్డ
భావాలను
లోపలకు
రాకుండా
చూసుకుంటుంది.
ఈ
thoughts
లోపల
చేరే
కొద్ది
young
age
లోనే
old
age
ప్రారంభమవుతుంది.
కనుక
మన
oldage
కి
కారణము
thoughts.
చాలా
మంది
పిల్లలను
చూడండి.
ఈ
పిల్లలెలా
వుండాలి?
ఈ
పిల్లలను
తీసుకువెళ్ళి
గుండుకేసి
కొడితే
గుండు
పగిలి
పోవాలి.
అలా
వుండాలి
వారిశక్తి.
కానీ
అలా
లేరు.
చిన్న
పిల్లలు
14
సంవత్సరములు,
16
సంవత్సరములు
పిల్లలెలా
అయిపోయారో.
ఎంత
పుష్టిగా
సంతుష్టిగా
వుండాలి.
ఇదే
నిజమైన
శరీర
పటుత్వము.
కనుక
healthy
గా
wealthy
గా
తయారవాలంటే
మీరు
పని
చేయాలి.
ఈ
పని
లోపల
యింద్రియ
నిగ్రహము
గావించుకోవాలి.
అదియే
మన
యోగము.
‘యోగః
చిత్తవృత్తి
నిరోధకః’
ఇంద్రియాలను
నిగ్రహించటమే
యోగమన్నారు.
ఇంద్రియముల
నిష్టము
వచ్చినట్లు
ప్రవేశపెట్టటం
భోగము
అన్నారు.
ఈ
భోగము
వల్ల
మనకు
రోగము
వస్తుంది.
ఆ
రోగము
రాకుండా
చూసుకుందాం.
మనం
కొంత
కాలము
చదవాలి,
కొంతకాలం
ఆడాలి,
కొంతకాలం
పాడాలి.
యీవిధముగా
కొన్ని
సేవలు
చెయ్యాలి.
ఈ
విధముగా
యువకులు
మంచిగా
అభివృద్ధియై
పోయినప్పుడు
మనము
యే
మిలట్రీలోను
చేరనక్కరలేదు.
ఇక్కడి
నుండి
యుద్ధములో
ప్రవేశించి
యుద్ధము
చేయవచ్చును.
…
ఈ
మిలట్రీ
ట్రయినింగులో
ప్రతి
ఒక్కరు
నేర్చుకోవలసినవి
రెండు
వున్నాయి.
ఒకటి
పెరేడ్.
రెండవది
గన్
షూటింగు.
యివి
రెండూ
ధోభీకి,
బార్బర్‌కు
వాచ్మనకు
ప్రతీ
ఒక్కరికి
తెలిసి
వుండాలి.
ఒకడు
barber
మాదిరి
వస్తే
వానికి
కూడా
తెలిసి
వుండాలి.
వాడు
కూడా
పెరేడ్లో
ప్రవేశించాలి.
అదేవిధముగా
యీ
జగత్తులో
యీ
గుణములతో
మనము
యుద్ధము
చేయటానికి
రెండు
తెలిసి
వుండాలి.
అవే
దైవప్రీతి,
పాపభీతి.
ఈ
రెండూ
వుంటే
నీవెక్కడైనా
రాణిస్తావు.
ఇవి
రెండూ
Human
values.
పాపభయము
వున్నప్పుడే
నీవు
పాపములో
ప్రవేశించవు.
దైవప్రీతి
వున్నప్పుడే
నీవు
దుఃఖానికి
గురికావు.
ఎందుకంటే
దైవప్రేమ
నీకు
నిండుగా
దండిగా
వుంది.
విద్యార్థులారా!
మీ
చదువులతోబాటు,
మీ
ప్రవర్తనతోబాటు,
మీ
ఆలోచనలతోబాటు
యీ
దైవప్రీతి,
పాపభీతిని
పెంచుకొని
దేశానికి
ఆదర్శవంతమైన
మూర్తులుగా
మీరు
తయారౌతారని
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నాప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
All learning without practice is useless
Next
Creation is nothing but the expression of Īśvara's will!
→