Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · Neither swelling with joy nor sinking in sorrow: winning equanimity is the aim of Ugādi
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Neither swelling with joy nor sinking in sorrow: winning equanimity is the aim of Ugādi
4 April 1992, Ugādi, Brindavan
1
▾
Meaning
Keep
Also in his talks
(1)
21 August 1992
God is always the embodiment of Prema!
ఘృష్టం
ఘృష్టం
పునరపి
పునః
చందనం
చారుగంధం
ఛిన్నఛిన్నం
పునరపి
పునః
స్వాదు
యిక్షుకాండం
దగ్ధం
దగ్ధం
పునరపి
పునః
కాంచనం
కాంతి
వర్ణం
నప్రాణాంతే
ప్రకృతిః
వికృతిః
జాయతే
ఉత్తమానాం
ప్రేమస్వరూపులారా!
చందనపు
కఱ్ఱను
అనేక
విధములుగా
రుద్దినపుడు
యిందునుండి
పరిమళము
వెదజల్లుతుంది.
చెరకు
నమలగా
నమలగా
మధురమైన
రసమును
అందిస్తుంది.
బంగారము
నిప్పులో
వేసి
కాల్చినప్పుడు
అందులోని
మాలిన్యము
తరిగి
ప్రకాశవంతమైన
అపరంజిగా
రూపొందుతుంది.
ఉత్తముడైనవాడు
ఎన్ని
కష్టములు,
ఎన్ని
నష్టములు,
ఎన్ని
బాధలు
సంభవించినప్పటికి
తనయొక్క
నైతిక
విలువను
తాను
కోల్పోడు.
ధర్మాచరణ
నిమిత్తమై
ఏర్పడినది
మానవత్వము
జగత్తునందు
మానవత్వమనేది
ఒక
విశిష్టమైన
జీవితము.
కానీ
యిట్టి
విశిష్టతను
అందరూ
గుర్తించలేకపోతున్నారు.
ఈ
విశిష్టత
ఏమిటి?
మానవత్వము
కేవలము
ఒక
భౌతికమైన,
ప్రాకృతమైన
స్వరూపము
కాదు.
‘శరీరమాద్యం
ఖలు
ధర్మసాధనమ్’.
ధర్మాచరణ
నిమిత్తమై
ఏర్పడినది
యీ
ధర్మస్వరూపము,
మానవత్వము.
భగవంతుడు
ఆనందమయుడు,
అమృత
స్వరూపుడు.
అతనికి
కల
సహస్రనామములలో
‘సత్‌చిత్‌ఆనంద’మనే
నామము
అత్యున్నతమైనది.
సత్
అనగా
త్రికాలములకు,
అన్ని
విధములైన
పరిస్థితులకు
సమన్వయమైనటువంటిది.
దేశకాలవ్యక్తులకు
అతీతమైనది.
అదే
సత్-చిత్
అనగా
పరిపూర్ణమైన
జ్ఞానము.
2
▾
Meaning
Keep
నైతిక,
భౌతిక,
ధార్మిక,
ఆధ్యాత్మిక,
వైజ్ఞానిక
జ్ఞానములన్నింటియందుకూడను
యీ
పరిపూర్ణజ్ఞానము
అంతర్వాహినిగా
వుండేటువంటిది.
కనుక,
చిత్
అనగా
పరిపూర్ణజ్ఞానమని
అర్థము.
ఎక్కడ
యీ
సత్,
చిత్,
రెండునూ
వుండునో
అక్కడనే
ఆనందము.
కనుక,
మానవత్వమనేది
ఆనందమునందే
పుట్టి
ఆనందమునందే
పెరిగి
ఆనందమునందే
లయమగుచున్నది.
ఆనందము
మానవునియొక్క
గమ్యము.
ఆనందమే
మానవునియొక్క
జన్మము.
ఆనందమే
మానవునియొక్క
ధర్మము.
ఇదే
మానవత్వములో
వుండిన
మర్మము.
కనుక,
ఆనందనిమిత్తమై
ప్రతి
వ్యక్తి
ప్రయత్నము
సలుపుతున్నాడు.
బాల్యమునుండి
వృద్ధాప్యమువరకు
ఆనందమును
అనుభవించగోరి
తాను
చేసే
సర్వ
కార్యములు
ఆనందమునిమిత్తమై
అంకితము
గావిస్తున్నాడు.
మానవత్వము
దైవముయొక్క
అంశమే!
అయితే,
యీ
ఆనందము
తాను
వెతికే
ప్రదేశమునందు
కానరాదు.
ఆనందమే
తానై
వుండి
తన
తత్వాన్ని
బయట
వెతకటానికి
ప్రయత్నించటము
కేవలము
వెఱ్ఱితనమే!
లోకములో
తన్ను
గురించి
బయట
వెతికే
వ్యక్తులుంటారా?
తనను
తాను
వెతుకుకొనుట
యేవిధమైన
అజ్ఞానమో
ఆనందమును
బయట
ప్రపంచములో
వెదకటముకూడను
అట్టి
అజ్ఞానమే!
జలమునకు
చేపలతో
పనిలేదు.
కాని,
జలములేక
చేపలు
జీవించలేవు.
కొమ్మ,
చెట్టుయొక్క
అంశము.
బిడ్డ,
తల్లియొక్క
అంశము.
చెట్టును
వదలి
కొమ్మలు
జీవించలేవు.
తల్లిని
వదలి
బిడ్డ
బ్రతకలేదు.
అదే
రీతిగా,
మానవత్వము
దైవముయొక్క
అంశమే!
దైవమును
వదలి
మానవుడు
ఆనందముననుభవించలేడు.
కానీ,
కలి
ప్రభావముచేత
దైవముతో
పనిలేదని,
మనిషియొక్క
ప్రయత్నమే
ప్రధానమని
అనేక
విధములైన
పరిశోధనలు
సల్పి
వ్యక్తులు
యీ
సిద్ధాంతమును
కేవలము
బాహ్యముగా
నిలబెట్టుతున్నారేగానీ
అంతరంగమునందు
వారికికూడను
తృప్తిలేదు.
ఈ
మానవుడు
ఎక్కడనుంచి
వచ్చాడు?
తనయొక్క
స్థానము
ఏమిటి?
యీ
విషయమును
ఏ
వ్యక్తికూడను
తెలసుకొనుటకు
ప్రయత్నము
సల్పటం
లేదు.
విచారణ
చేయటం
లేదు.
ఏదో
వున్నాడు,
తింటున్నాడు,
తిరుగుతున్నాడు,
జీవిస్తున్నాడు.
ఎక్కడనుంచి
వచ్చాడు?
కేవలము
శారీరకమైన
ఆధారమును
పురస్కరించుకొని
‘నేను
మద్రాసునుండి
వచ్చాను,
నేను
బొంబాయినుండి
వచ్చాను,
నేను
కలకత్తానుండి
వచ్చాను.
3
▾
Meaning
Keep
నేను
బెంగుళూరునుండి
వచ్చాను,’
అని
శారీరక
సంబంధమైన
పరిస్థితిని
తాము
ఉచ్చరిస్తూ
వస్తున్నారు.
యింతటితో
పోక
‘నేను
ఒక
డాక్టరు,
నేను
ఒక
లాయరు,
నేను
ఒక
స్టూడెంటు,
నేను
ఒక
వ్యవసాయదారుడను,’
అని
తన
వృత్తిని
పురస్కరించుకొని
వృత్తి
ఆధారముచేత
తనయొక్క
రాకను
నిరూపిస్తున్నాడు.
తాను
ఒక
దేశమునకు
చెందినవాడను
అని
విచారించటములో
తనయొక్క
నిజమైన
జవాబు
తనకు
చిక్కుటలేదు.
నీ
పేరు
ఏమిటి?
‘మనుజ’,
‘మానవుడు’.
‘మను’వు
అనగా
ఏమిటి?
యిది
స్వయంభు
మనువు.
‘జ’
అనగా
పుట్టటము.
స్వయంభునుంచి
పుట్టినవాడు
మనుజుడు.
‘మను’
అనే
స్వయంభునుంచి
జన్మించినవాడు
కనుకనే
యితనికి
‘మనుజ’
అని
పేరు.
కానీ
యీ
సత్యాన్ని
మానవుడు
యే
మాత్రము
విచారించటం
లేదు.
సచ్చిదానందస్వరూపుడైన
మానవుడు
ఆనందమును
బయట
ప్రపంచములో
వెదకుచున్నాడు
తాను
సచ్చిదానంద
స్వరూపుడైకూడను
సచ్చిదానంద
నిమిత్తమై
బయట
ప్రపంచములో
ప్రాకులాడుతున్నాడు.
దీనికి
కారణమేమిటి?
తాను
యీ
జ్ఞానమనే
విషయములో
ప్రవేశించక
అజ్ఞానమనే
నిద్రలోపల
కలలు
కంటున్నాడు.
ప్రాకృతమైన
నిద్రలో
తాను
తన్మయుడై
తన
స్వస్వరూపమును
విస్మరిస్తున్నాడు.
ఆ
సమయంలో
తాను
ఒక
చక్రవర్తియనిగాని
లేక
ఒక
ప్రెసిడెంటుననిగాని,
ప్రైమినిష్టరుననిగాని
తెలియకుండా
వుంటుంది.
ఆ
స్వప్నస్థితియందు
యే
స్థాయిలో
తాను
అనుభూతులు
అనుభవిస్తున్నాడో
దానినే
ఆధారము
చేసుకొని
అదియే
తన
స్వస్వరూపముగా
విశ్వసిస్తున్నాడు.
ఆ
స్వప్నస్థితియందు
నేను
చక్రవర్తి
అనే
భావము
యేమాత్రము
వుండదు.
నేను
ప్రెసిడెంటును
అనే
భావము
అతనికి
యేమాత్రము
వుండదు.
జాగ్రతకు
వచ్చిన
తరువాత
మాత్రమే
‘నేను
చక్రవర్తిని,
నేను
ప్రెసిడెంటును,
ప్రైమినిష్టరును,’
అని
ఉచ్చరించుకుంటున్నాడు.
అదే
విధముగనే
అజ్ఞానమనే
నిద్రలో
వుండిన
మానవుడు
తాను
స్వస్వరూపమైన
సచ్చిదానంద
స్వరూపుడనే
సత్యాన్ని
గుర్తించుకొనలేక
యీ
జగత్
వ్యవహారమునందే,
యీ
దేహసంబంధమునందే,
వృత్తుల
సంబంధమునందే,
దేశ
సంబంధమునందే,
తనయొక్క
స్వరూపమును
నిరూపించుకుంటూ
వస్తున్నాడు.
4
▾
Meaning
Keep
ఈ
అజ్ఞానమే
మానవుని
మాయగా
కప్పివేయుచున్నది.
పొట్టుతో
కప్పబడిన
బియ్యము
యేరీతిగా
మనకు
కనుపించదో,
బియ్యము
లేక
యీ
పొట్టు
యేరీతిగా
నిలువలేదో,
పాచిపైన
నీరును
మనము
యేవిధముగా
చూడలేకపోతున్నామో,
మేఘములు
కప్పిన
సూర్యుని
మనము
యేరీతిగా
చూడలేకపోతున్నామో,
పొరలు
కప్పిన
కన్నులతో
మనము
యేరీతిగా
దృశ్యమును
చూడలేకపోతున్నామో,
అదే
విధముగనే
అజ్ఞానముచే
కప్పబడిన
మానవుడు
తన
స్వస్వరూపమును
తెలుసుకోలేకపోతున్నాడు.
ఇందువలనే,
ఉపనిషత్తులు
‘ఉత్తిష్టత,
జాగ్రత.
ప్రాప్యవరాన్నిబోధత’
అన్నాయి.
‘నాయనా!
నీవు
అజ్ఞానమనే
నిద్రయందు
వుండటంచేత
నీ
స్వస్వరూపమును
తెలుసుకోలేకపోతున్నావు.’
ధాన్యమును
యేమి
చేస్తే
బియ్యము
నీకు
లభ్యమవుతుంది?
బియ్యము
ప్రత్యేకముగా
రాలేదు.
బియ్యము
అక్కడనే
వుంది.
కానీ,
పొట్టు
దానిని
కప్పటంచేత
బియ్యము
కనుపించటంలేదు.
సూర్యుడు
ఎక్కడకూడను
రావటంలేదు,
పోవటంలేదు.
భూమి
తిరగటంచేతను,
మేఘములు
కప్పటంచేతను
సూర్యుడు
మనకు
కనుపించటంలేదు.
ఈ
మేఘములు
కదలిపోయినప్పుడు
సూర్యుడు
ప్రకాశిస్తున్నాడు.
అదే
విధముగా,
నివురు
కప్పిన
నిప్పు
మనకు
కనుపించదు.
నివురు
తీయగానే
నిప్పు
మనకు
కనుపించుతుంది.
యివన్నీకూడను
కొత్తగా
అప్పటికప్పుడు
వుట్టిపడినవికాదు.
అదివరకే
అవి
అక్కడ
వున్నవి.
అలా
వుండికూడను
యీ
అజ్ఞానమనే
పొరచే
కప్పబడటంచేత,
సత్యాన్ని
మానవులు
గుర్తించుకోలేకపోతున్నారు.
ఈ
విధంగా
కప్పబడిన
యీ
దృశ్యములన్నీకూడను,
వస్తువులన్నీకూడను
కేవలము
అనిత్యములు,
అశాశ్వతములు.
“యద్దృశ్యం
తన్నశ్యం”
అనింది,
వేదము.
అనగా
బాహ్య
ప్రపంచములో
మనకు
కనుపిస్తూ
ఉండేవన్నీ
ఒకానొక
సమయంలో
కాలగర్భములో
కలసిపోవలసినదే!
మానవునకు
జ్ఞాన
నేత్రము
కావాలి
మన
చర్మచక్షువులు
అనేక
రూపనామములను
యీ
చరాచర
ప్రపంచములో
చూస్తున్నవి.
5
▾
Meaning
Keep
కానీ,
యీ
చూచుచున్నవన్నీకూడను
కాల
ప్రవాహములో
కొట్టుకొని
పోతాయి.
ఒకానొక
కాలములో
ఆ
చూచిన
కన్నుగానీ,
చూడబడిన
వస్తువుకానీ
యీ
రెండుకూడను
ఉండవు.
ఇవి
శాశ్వతములు
కావు.
యీ
కన్నులా?
అన్నింటికి
వున్నవి;
కేవలము
మానవులకు
మాత్రమే
కాదు.
పశుపక్షిమృగాదులకు,
క్రిమికీటకాదులకుకూడను
కన్నులుంటున్నవి.
యింక
మనకు
కన్నులుండి
ప్రయోజనమేమిటి?
మానవత్వములో
వున్న
విశిష్టత
ఏమిటి?
మానవుడై
పుట్టి
తోలుకన్నులతోనే
తృప్తి
పడటమనేది
మన
దురదృష్టముగా
వుంటున్నాది.
మానవునకు
జ్ఞాననేత్రము
కావాలి.
అది
లేకుండినప్పుడు
ఈ
చదువులవలన
ఏమి
ప్రయోజనము?
మన
తెలివితేటలు
యేమిటి?
మనయొక్క
బుద్ధి
కుశలత
ఏమిటి?
మన
మేధాశక్తి
ఏమిటి?
మానవత్వములో
వుండిన
దివ్యత్వమేమిటి?
యీ
దివ్యత్వమును
గుర్తించుకోలేని
వ్యక్తి
నిరుపయోగమే
కదా?
‘జంతూనాం
నరజన్మ
దుర్లభం’
అన్నారు.
ఈ
సృష్టిలో
పుట్టిన
జీవరాసులలో
ఉత్కృష్టమైనవాడు,
ఉత్తమమైనవాడు,
మానవుడు.
కనుకనే
మానవత్వము
సౌజన్యము,
సౌశీల్యము
అనే
రెండు
ప్రధానమైన
సూత్రములపై
ఆధారపడియున్నదని
గొప్పగా
వర్ణిస్తూ
వచ్చారు.
మానవత్వములో
జ్ఞానతత్త్వాన్ని
మనం
అనుభవించాలి.
మన
చక్షువులన్నీ
కేవలము
జడములైనవి.
నీ
చక్షువులను
నీవే
చూడలేకపోతున్నావు.
యింక
యీ
జడమైన
చక్షువులు
అతి
సూక్ష్మమైన
మనస్సును
యేరీతిగా
చూడగలవు?
మనసునే
చూడలేని
యీ
నేత్రములు
ఆత్మనేరీతిగా
దర్శించగలవు?
నిన్ను
నీవు
తెలుసుకోలేని
వ్యక్తివి
యితరుల
విషయమును
యేరీతిగా
గుర్తించగలవు?
ఎవరు
మనస్సును
సాధించారో
వారే
విజయుడు
జగత్తునందు
ప్రధానమైన
జీవితము
ఆత్మ
జీవితమే!
దేహజీవితము,
బుద్ధిజీవితము,
యీ
జీవితములు
జీవితములే
కావు.
ఏదో
కాలమును
వ్యర్థము
చేసుకొని,
కాయమును
పోషించుకొని,
కట్టకడపటికి
కాయమును
అంత్యము
గావించటమే
ఈనాడు
మానవుని
ప్రధాన
లక్ష్యముగా
జరుగుతూ
వస్తున్నాది.
దేశకాల
పరిస్థితుల
ప్రభావమునకు
గురికావటంచేతనే
మానవజన్మయొక్క
సత్యస్వరూపాన్ని
గుర్తించుకోలేకపోతున్నారు.
6
▾
Meaning
Keep
మానవుడు
తెల్లవారి
మొదలు
అనేక
విషయములను
విచారణ
చేస్తున్నాడు.
అనేక
గ్రంథములు
చదువుతున్నాడు.
కానీ,
యేమి
తెలుసుకున్నాడు?
ఏమీ
తెలుసుకోటంలేదు.
తెలుసుకున్నవన్నీ
వ్యర్థమైనవే!
అప్పటికప్పుడు
తృప్తి
కలిగించినప్పటికి
మరు
నిముషములో
అది
అసంతృప్తినే
అందిస్తున్నాది.
ఇవి
ఎండమావులవంటివి.
వీటిని
మనము
ఎంత
అనుసరించినప్పటికిని
మన
దాహము
తీరదు.
అది
నీరు
కాదు.
నీరువలె
కనుపిస్తున్నాదిగానీ,
నీరు
కాదు.
యీ
ప్రకృతియందు
మనము
అనుభవించేటువంటి
సుఖసంతోషసౌభాగ్యములన్నీ
కేవలము
సుఖములుగా
కనుపిస్తున్నాయి,
సౌఖ్యములుగా
కనుపిస్తున్నాయి,
ఆనందముగా
అనిపిస్తున్నాయి.
కానీ
నిజమైనవి
కాదు.
నిజముగా
ఈ
సుఖము,
సౌఖ్యము
శాశ్వతమైన
ఆనందము
నిచ్చేవి
కాదు.
అప్పటికప్పుడు
మాత్రమే
సుఖమును
సౌఖ్యమును
అనుభవించినట్టుగా
మనము
భ్రమిస్తున్నాము.
మరు
నిముషములోపల
అవి
దుఃఖాన్ని
అందిస్తున్నాయి.
ఒకప్పుడు
శంకరులవారు
‘ఎవరు
యీ
జగత్తులో
విజయమును
సాధించినవారు?’
అని
తన
శిష్యులకు
ఒక
ప్రశ్న
వేశారు.
అక్కడున్న
విద్యార్థులు
ఒక్కొక్కరు
తమకు
తోచినట్టుగా
జవాబు
చెబుతూ
వచ్చారు.
ఇంతలో
ఒక
శిష్యుడు
‘మహావీరుడై
యుద్ధములో
పరులను
జయించి
విజయమును
సాధించినవాడే
వీరుడ’ని
సమాధానం
చెప్పాడు.
‘హిమాలయ
పర్వతములు
ఎక్కి
అక్కడ
పతాకము
నిలబెట్టినవాడే
వీరుడు’
అని
మరొకడు
చెప్పాడు.
‘సముద్రమును
దాటి
తన
శక్తిసామర్థ్యములు
నిరూపించుకున్నవాడు
వీరుడు’
అని
మరొకరు
చెప్పారు.
ఈ
విధంగా
ఎవరికి
తోచినట్టుగా
వారు
చెప్పుతూ
వచ్చారు.
వీటికంతా
శంకరులు
చిరునవ్వు
నవ్వి
‘శిష్యులారా!
లౌకిక
విజయములనే
మీరు
విజయాలుగా
భావించుకుంటున్నారు.
ఈ
లౌకిక
జగత్తునందు
ఎవరైనా
విజయమును
సాధించవచ్చు.
పశువు,
పశువు
పోట్లాడి
ఒక
పశువు
విజయమును
సాధిస్తుంది.
పక్షులు,
పక్షులు
పోట్లాడుకొని
అందులో
ఒకటి
విజయాన్ని
సాధిస్తుంది.
పక్షులుకూడను
సముద్రాలు
దాటుతున్నాయి.
పక్షులు
హిమాలయ
పర్వతములకంటే
యింకా
ఎత్తుకు
ఎగురుతున్నాయి.
అంతమాత్రంచేత
విజయాన్ని
సాధించినట్టా?
కాదు,
కాదు.
ఎవరు
మనస్సును
సాధించారో
వారే
విజయుడు.
మనస్సును
సాధించక
విజయమును
పొందినాను,
అని
అనుకోటం
కేవలము
భ్రాంతి,’
అని
బోధించారు.
7
▾
Meaning
Keep
ఇంద్రియములే
మానవుని
సాధిస్తున్నాయి
మనస్సు
చంద్రునివంటిది.
చంద్రుడు
అనగా
మనస్సుయొక్క
ప్రభావమే!
‘చంద్రమా
మనసో
జాతః
చక్షోసూర్యోఅజాయత’
చంద్రుడు
స్వప్రకాశకుడుకాదు.
ప్రకాశిస్తున్నాడు,
రాత్రివేళలందు.
అంటే
ఏవిధంగా
ప్రకాశిస్తున్నాడు?
ఎవరి
ఆధారముచేత
ప్రకాశిస్తున్నాడు?
సూర్యునియొక్క
ప్రకాశము
చంద్రునిపైన
పడటంచేత
చంద్రుడు
ప్రకాశిస్తున్నాడు.
కనుక,
సూర్యునియొక్క
ప్రకాశమే
చంద్రునియొక్క
ప్రకాశముగా
కనుపిస్తూ
వస్తున్నాది.
ఐతే,
యిక్కడ
మనం
చక్కగా
విచారణ
చెయ్యాలి.
సూర్యుని
ప్రకాశము
దేదీప్యమానంగా
వుంటున్నాది.
మహాతీక్షణంగా
వుంటున్నాది.
భరించుకోటానికి
వీలుండదు.
కానీ,
చంద్రునియొక్క
ప్రకాశము
హాయిగా,
చల్లగా
వుంటుంది.
యీ
చంద్రుని
యందుండిన
ప్రకాశము,
సూర్యునియందుండిన
ప్రకాశము
ఒక్కటే!
అయినప్పటికిని
సూర్యుని
ప్రకాశము
యింత
తీక్షణంగా
వుండటానికి,
చంద్రుని
ప్రకాశము
యింత
చల్లగా
వుండటానికి
కారణం
ఏమిటి?
మనస్సు
అనేది
అనేక
కోరికలతో
చేరి,
తమోగుణంగా
వుంటున్నాది.
తమోగుణములోపల
ఎప్పుడూ
చీకటిగానే
వుంటుంది.
అనగా,
తన
కోరికలు
తీరినప్పుడు
చల్లగా
వుంటుంది.
కోరికలు
తీరనప్పుడు
restless
గా
వుంటుంది.
అంతేగాని
వేడిగా
వుండదు.
యీ
మనస్సుయొక్క
స్వభావము
అట్టిది.
మనస్సు
స్వభావము
అరికట్టడానికి
ఎవరికి
సాధ్యముకాదు.
మనస్సనగా
ఏమిటి?
‘సంకల్పవికల్పకాత్మకం
మనః’
అని.
సముద్రములో
అలలు
ఏవిధంగా
నిరంతరము
నిర్విరామంగా
వుండునో
అదే
విధముగా
మనస్సులో
నిర్విరామంగా
సంకల్పములు
కొనసాగుతూ
వస్తుంటాయి.
యిట్టి
సంకల్పవికల్పములతో
కూడిన
యీ
మనస్తత్త్వాన్ని
ఎవడు
సాధించునో
వాడే
విజయుడు.
వాడే
జయమును
పొందినవాడు.
యీనాడు
మనం
ఎన్నో
సాధించాము
అనుకుంటున్నాము.
ఈనాడు
సాధించేవన్నీకూడను
దానితో
విచారమనే
నీడను
గొనివస్తున్నాయి.
కనుక,
యివన్నీ
మనము
సాధించినవికాదు.
యివన్నీ
మానవుని
శోధిస్తూ
వస్తున్నాయి.
8
▾
Meaning
Keep
కానీ
మానవుడు
సాధించినవి
కాదు.
నీవు
వాటిని
పరిశోధన
చేస్తున్నానని
అనుకుంటున్నావు.
కాదు,
కాదు,
సర్వేంద్రియములు
నిన్నే
పరిశోధన
చేస్తున్నాయి.
యింద్రియములను
నీవు
అనుభవిస్తున్నట్లుగా
భావిస్తున్నావు.
కాదు,
కాదు,
యింద్రియములే
నిన్ను
అనుభవిస్తున్నాయి.
ఈ
సత్యాన్ని
మానవుడు
చక్కగా
విచారించటం
లేదు.
యింద్రియములనే
నీవు
జయించినవాడవైన,
యింద్రియములనే
నీవు
సాధించినవాడవైన
నీలో
ఏ
విధమైన
విచారమునకు
అవకాశమే
వుండదు.
కనుక
యింద్రియములే
నిన్ను
సాధిస్తున్నాయి.
యింద్రియములే
నిన్ను
అనుభవిస్తున్నాయి.
కనుక
నీవు
బలహీనుడైపోతున్నావు.
నీవు
అశాంతికి
గురౌవుతున్నావు.
నీవు
అనేక
విధములైన
బాధలకు
గురౌతున్నావు.
సమస్త
ఇంద్రియములకు
ఆధారమైనది
ఆత్మయే!
యింద్రియములను
మనము
యేరీతిగా
సాధించటం?
‘యింద్రియములు
కేవలము
పనిముట్లు’
అని
గుర్తించాలి.
వీటినే
‘కరణములు’
అని
పిలుస్తూ
వచ్చారు.
‘కరణము’
అనగా
పనిముట్టు.
ఈ
పనిముట్టు
నీ
చేతిలో
వుండవలసిందేగాని,
నీవు
పనిముట్టు
చేతిలో
వుండకూడదు.
దురదృష్టవశాత్తు
నీవు
పనిముట్టు
చేతిలో
వుంటున్నావు.
పనిముట్టు
చేతిలో
నీవు
వుండటంచేత
యే
పని
చేయలేక
పోతున్నావు.
నీవు
చేయలేకపోవటంకాక
పనిముట్టునుకూడను
వ్యర్థము
గావిస్తున్నావు.
కనుక,
యింద్రియములను
మనం
స్వాధీనం
చేసుకోవాలి.
అప్పుడే
ఆ
యింద్రియములు
నీకు
యేవిధమైన
బాధను
కలిగించవు.
దృశ్యమును
ఉదాహరణకు
తీసుకోండి.
ఈ
దృశ్యమును
కన్ను
చూస్తుందని
నీవు
అనుకుంటున్నావు.
కాదు
కాదు.
కన్ను
జడమే!
చూచేవాడు
ఎవరు?
అదే
ఆత్మ.
కారులోపల
బల్బులు
వెలుగుతున్నాయి.
కేవలము
బల్బులు
వెలుగుతున్నాయని
నీవు
భావిస్తున్నావు.
కానీ
ఆ
బల్బులలో
చేరిన
కరెంటే
యీ
ప్రకాశమునందిస్తున్నాది.
అదే
విధముగనే,
చెవులు
బయటంతా
స్పీకరులుగా
వింటున్నారు.
స్పీకర్సుద్వారా
శబ్దము
నీకు
వినిపిస్తున్నది.
అందువలన
ఆ
స్పీకరు
దీనికి
ఆధారమని
భావిస్తున్నారు.
అయితే
యీ
కరెంటు
ఆగిపోతే
స్పీకర్సు
పని
చేయలేవు.
యిందులో
కూడను
కరెంటు
ప్రసరిస్తూ
వుంటున్నాది.
9
▾
Meaning
Keep
యీ
చెవులు
ఒక
స్పీకరువంటివి.
ఆత్మ
అనే
కరెంటుద్వారా
యివన్నీ
వినగలుగుతున్నాయి.
నాలుక
ఒక
మైక్.
యీ
మైకు
ముందుపెట్టుకొని
మాట్లాడుతున్నామనుకుంటే
మైకులో
కరెంటు
లేకపోతే
నేను
మాట్లాడేది
వినుపించదు.
యేమాత్రము
వుపయోగము
లేదు.
సమస్త
యింద్రియములకు
ఆధారమైనది
ఆత్మయే!
ఆత్మ
అనే
పేరు
చెప్పకుండా
వైజ్ఞానికులు
‘power’,
‘energy’
అని
అంటున్నారు.
యీ
energy
అనేది
శక్తి.
యీ
energy
వుండికూడను
matter
లేకపోతే
వ్యర్థమైపోతుంది.
Matter
లేక
energy
ఎట్లా
వ్యర్థమై
పోతున్నదో,
energy
లేక
matter
అట్లా
వ్యర్థమైపోతుంది.
భగవంతుడు
అనగా
ఏమిటి?
Matter+energy=GOD.
దివ్యశక్తికొరకు
రెండూ
చేరాలి.
మైకు,
మన
మాట
రెండూ
వుంటుండాలి.
దీనికే
యింకో
చిన్న
ఉదాహరణము:
కన్నులు
చూస్తున్నాయి.
నిజమే!
కానీ
సూర్యప్రకాశమే
లేక
కన్నులు
యేమాత్రము
చూడలేవు.
కన్నులు
సూర్యప్రకాశమునాధారము
చేసుకొనియే
ఫలాని
వ్యక్తి
యిక్కడ
వున్నాడని
చూడగలుగుతున్నాయి.
కన్నులే
దీనికి
ఆధారమని
భావిస్తూ
వుంటారు.
కన్నులు
లేక
లైటు
వుండి
ప్రయోజనమేమిటి?
లైటు
వుండి
కన్నులు
లేక
ప్రయోజనం
ఏమిటి?
ఎంతోమంది
అంధులు
వుంటున్నారు
జగత్తునందు.
ఎంతో
గొప్పగా
ప్రకాశించే
సూర్యుడు
వారికి
కనుపించటంలేదు.
అయితే
తాము
చూడలేనంతమాత్రమున
సూర్యుడు
లేడని
చెప్పటం
ఎంత
వెఱ్ఱితనము!
తాను
చూడలేడుకానీ
కన్నులున్నవారు
చూడలేరా?
ఎంత
గొప్ప
పండితుడైనప్పటికిని
తాను
నిద్రలోనున్న,
జగత్తును
చూడలేడు.
తనలో
పాండిత్యము
గొప్పగా
వుంటున్నది.
యింత
మహాజ్ఞానియైనవాడు,
పాండిత్యము
కలిగినవాడు,
నిద్రలో
జగత్తును
చూడలేడు.
ఏ
పాండిత్యము,
ఏ
జ్ఞానములేని
మూర్ఖుడైనప్పటికి
జాగ్రతలో
వుండినప్పుడు
ప్రపంచమును
చూడగలుగుతున్నాడు.
కనుక,
దీనికి
పాండిత్యముగానీ,
మేధాశక్తిగానీ
అవసరములేదు.
మానవునిలోనున్న
జ్ఞాననేత్రమనేది
తెరుచుకోవాలి.
అప్పుడే
యీ
జగత్తుయొక్క
మంచిచెడ్డలు
గుర్తించటానికి
వీలౌతుంది.
దైవత్వము
సర్వమానవులందు,
సర్వఅంగములందు
రసస్వరూపుడై
వుండటంచేత
దీనికి
‘రసోవైసః’
అన్నారు.
10
▾
Meaning
Keep
గుడ్డలు
మారితే
ప్రయోజనము
లేదు,
గుణములు
మారాలి
ఈనాడు
ఉగాది.
యుగములకు
ఆది.
ఈ
ఉగాదిలోపల
మొట్టమొదటి
ఋతువు
ఏమిటి?
వసంతఋతువు.
ఋతువులలో
మొదటి
ఋతువు
వసంతఋతువు.
నెలలలోపల
ఏది
ముఖ్యమైనది?
చైత్రమాసము.
పక్షములలోపల
శుక్లపక్షము
మొదటిది.
తిథిలోపల
పాడ్యమి
ప్రధానమైనది.
ఋతువు,
నెల,
పక్షము,
తిథి
యీ
అన్నీకూడను
ప్రధానముగా
వుండటంచేతనే
యీనాడు
ఉగాది
అయిపోయింది.
అన్నీకూడను
చేరినటువంటివి.
యిది
యుగములకు
ఆది.
తిథికి
ఆది
పాడ్యమి.
పక్షమునకు
ఆది
శుక్లపక్షము.
మాసమునకు
మొదటిది
చైత్రము.
ఋతువులకు
మొదటిది
వసంతము.
అన్నీ
మొదటివి
చేరటం
చేతనే
యిది
ఆది.
ఆది
అనటంలో
వుండిన
అంతరార్థమిదియే!
ఈ
విధంగా
ఆదియైనవి
అన్నీ
యీ
కలియుగములో
చేరిపోతున్నాయి.
వసంతఋతువు,
చైత్రమాసము,
శుక్లపక్షము,
పాడ్యమి
యివి
చేరటంచేతనే
ఆది
అని.
కలియుగమునకు
ఆది
యిది,
యుగాది.
యీ
కలికి
ఆదియైనవి
వుండటంచేతనే
దీనికి
ఉగాది
అన్నారు.
ఈ
ఉగాదియొక్క
ప్రధానమైన
సారము
ఏమిటి?
యీ
ఉగాది
దినము
భారతీయులు
తెల్లవారి
లేచి,
శిరఃస్నానము
చేసి,
నూతన
వస్త్రములు
ధరించి
పండుగగా
కొన్ని
తీపి
పదార్థములు
చేసుకొని
భుజిస్తూ
వుంటారు.
ఇలాంటి
ఉగాదులు
ఎన్నో
జరిగిపోతున్నాయి.
ఎన్నో
ఉగాదులు
ప్రజలు
చేసుకుంటున్నారు.
కానీ,
ఉగాదిలో
ఉన్న
తత్త్వములోపల
మార్పు
ఎంతవరకు
వచ్చింది?
బట్టలు
కొత్తవి
వేసుకుంటున్నారుగానీ,
బుద్ధులు
కొత్తవిగా
రావటంలేదు.
గుడ్డలు
మంచివి
వేసుకుంటున్నారుగానీ,
మంచి
గుణములు
అభివృద్ధి
కావటంలేదు.
గుడ్డలు
మారితే
ప్రయోజనము
లేదు,
గుణములు
మారాలి.
బట్టలు
మారితే
ప్రయోజనంలేదు,
బుద్ధులు
మారాలి.
బుద్ధులు
మారక
ఎన్ని
రకములైన
పర్వదినములు
చేసుకున్నప్పటికి
ప్రయోజనం
లేదు.
భారతీయులు
అవతార
జన్మదినములను
పర్వదినములుగా
భావించి
పండుగ
చేసుకుంటున్నారు.
మతస్థాపకుల
జన్మదినములుకూడను
పర్వదినములుగా
చేసుకుంటున్నారు.
దుష్టులు
మరణించిన
దినములు
పర్వదినములుగా
చేసుకుంటున్నారు.
సజ్జనులు
మరణించిన
దినములుకూడను
పర్వదినముగా
భావించి
చేసుకుంటున్నారు.
11
▾
Meaning
Keep
కానీ
యీ
ఉగాది
అనేది
యే
అవతారతత్త్వమునకుగానీ,
ఏ
మహానీయుని
జన్మదినముగానీ,
ఏ
దుష్టులయొక్క
మరణమునకు,
ఏ
సజ్జనుల
మరణ
దినమునకుగానీ
సంబంధించినది
కాదు.
ఇది
ప్రకృతికి
సంబంధించినది.
ఇది
అందరికి
చాలా
అత్యవసరమైనటువంటిది.
ప్రకృతియొక్క
తత్త్వమును
గుర్తించటానికి
యిది
చక్కని
ఆదర్శము.
ప్రకృతియే
మనకు
భగవంతుడు.
యిదియే
ప్రత్యక్ష
దైవము.
ఒక్క
గంటకు
యీ
భూమి
తన
చుట్టూ
తాను
ఎన్నో
వేల
మైళ్లు
చుడుతూవున్నది.
ఈ
విధంగా
తిరగటంచేత
యేమి
ఏర్పడుతున్నాది?
రాత్రింబవళ్లు
యేర్పడుతున్నాయి.
ఈ
రాత్రింబవళ్లు
యేర్పడటంచేత
మానవుడు
విశ్రాంతి
తీసుకోగలుగుతున్నాడు.
యింతటితో
కాదు,
యీ
భూమి
సూర్యునిచుట్టూకూడా
ఎన్నో
వేల
మైళ్లు
తిరుగుతున్నాది.
ఈ
విధంగా
సూర్యుని
చుట్టూ
తిరగటంచేత
ఋతువులు
ఏర్పడుతున్నాయి.
ఋతువులు
మార్పు
రావటంచేత
వర్షములు
పడి,
పంటలు
పండి,
మానవులకు
ఆహారము
లభిస్తూ
వున్నాది.
ఈవిధంగా
యే
ఫలితములు
ఆశించక,
ప్రకృతి
మానవోద్ధారము
సలుపుతూ
వస్తున్నాది.
మానవుడు
ముందుగా
తన
గమ్యమేమిటో
తెలుసుకోవాలి
సంవత్సరములు
60.
ప్రభవ
మొదలుకొని
అక్షయవరకు
60
సంవత్సరములు.
అంగీరస
అనే
సంవత్సరము
ఆరవదిగా
వస్తున్నాది.
అరిషడ్వర్గములయొక్క
ప్రధాన
తత్వాన్ని
అందిస్తూ
వస్తున్నాది,
అంగీరస.
ఈ
శరీరములో
వుండిన
సర్వఅంగములందు
అరిషడ్వర్గములే
వుంటున్నాయి.
కామక్రోధలోభమోహమదమాత్సర్యములు.
అరిషడ్వర్గములకు
అత్యంత
ఆధారమునందించేవాటికి
సమత్వముగా
వుంటున్నాది,
యీ
సంవత్సరము.
యిందులో
నవనాయకులు-గ్రహములు
వుంటున్నారు.
అవియే
సూత్రములు.
ఈ
నవనాయకులలోపల
ఆరుమంది
శుభమును
కలిగిస్తున్నారు.
ముగ్గురు
మాత్రమే
దీనికి
విరుద్ధముగా
వుంటున్నారు.
జగత్తులో
యీ
సంవత్సరము
చాలావరకు
శుభములే
జరుగుతాయి.
యింతేకాక,
పాడి
పంటలకు
యీ
సంవత్సరము
కొదువలేదు.
వర్షములు
సక్రమముగా
కురుస్తాయి.
కానీ
వెలలు
మాత్రము
పెరిగిపోతాయి.
యిది
ప్రజలయొక్క,
ప్రభుత్వముయొక్క
శక్తిసామర్థ్యముల
బలహీనతయే!
12
▾
Meaning
Keep
ఐతే
పాలక
సంబంధమైన
విషయములో
ప్రశాంతముగా
సౌమ్యముగా,
సుఖంగా
జరుగుతుంది.
రాజకీయ
కల్లోలములు
అంతగా
వుండవు.
వ్యక్తిగతమైన
భేదములు,
కల్లోలములు
వుండవచ్చును.
కానీ,
ప్రాకృత
సంబంధమైన
కల్లోలములు,
అశాంతులు
అంత
అధికంగా
వుండవు.
కారణమేమనగా
రాజు,
సైన్యాధిపతి,
అందరూ
మంచివారు.
స్నేహముగా
వుంటున్నారు.
రాజుకు
సైన్యాధిపతి
విరుద్ధంగా
వుంటే
రాజ్యము
సరైన
రక్షణలో
వుండదు.
ఈ
సంవత్సరము
రాజు,
సైన్యాధిపతి
చాలా
స్నేహితులుగా
వుంటున్నారు.
ఈ
విధమైన
మిత్రులుగా
వుండటంచేత
ప్రకృతికి
యెంతైనా
మంచి
ఏర్పడుతుంది.
ఈ
అన్నింటికి
మూలకారణము,
అంగీరస.
యీ
నామములోనే
వుంటున్నాది
సమస్త
సారము.
‘అంగీరసాయ
నమః’,
అని
భగవంతునికి
పేరు.
భగవంతుడు
రసస్వరూపుడే!
సర్వుల
దేహములందుకూడను
సంచరిస్తూ
వున్నాడు.
కనుక
యీ
సంవత్సరము
దైవ
సంబంధమైన
సంవత్సరముగా
రూపొందవచ్చు.
భక్తి
ప్రపత్తులుకూడను
కొంత
అధికమవుతాయి.
యీ
భక్తి
ప్రపత్తులు
అధికమవుతాయిగానీ
కొన్ని
నిముషములకు
ముందు
అనిల్‌కుమార్
చెప్పాడు.
ప్రచార,
ప్రబోధసంబంధమైన
భక్తి
ప్రపత్తులు
వుంటున్నాయిగాని,
ఆచార
సంబంధమైన
భక్తి
ప్రపత్తులు
అంతగా
లేవు.
ఆచారవిచారములకు
సంబంధించిన
భక్తి
ప్రపత్తులుండాలి.
లోకములో
99మంది
భగవత్
భక్తిని
గురించి
చెప్పవచ్చుగానీ
భగవత్
గుణములు
కించిత్తైనా
వారియందు
వుండవు.
యివన్నీ
కేవలము
ప్రచారప్రబోధల
నిమిత్తమై
తనయొక్క
స్వార్థస్వప్రయోజన
నిమిత్తమై
ఉపయోగపెట్టుకుంటున్నారేగానీ
తన
ధన్యతకోసమనిగానీ
తన
లక్ష్యముకోసమనిగానీ
తాను
నిజంగా
ప్రాకులాడటం
లేదు.
ఒక
లక్ష్యమును
మాత్రం
మనం
గట్టిగా
పట్టుకోవాలి.
లక్ష్యము
లేకుండా
యీనాడు
ప్రయాణం
చేస్తున్నాడు,
మానవుడు.
మానవుడు
తన
గమ్యమేమిటో
మొట్టమొదట
తెలుసుకోవాలి.
ఈ
గమ్యమనేది
ఆత్మ.
యిదే
సత్‌చిత్
ఆనందము.
సత్‌చిత్
ఆనందము
మనయందే
వున్నదిగానీ
బయటలేదు.
‘చిల్లరరాళ్లకు
మ్రొక్కుతూ
వుంటే
చిత్తము
చెడురా
ఒరె
ఒరె’
అన్నారు.
మనము
ఎప్పుడూ
జడమైనవాటినే
పూజిస్తూ,
ప్రార్థనచేస్తూ
కాలము
వ్యర్థము
చేస్తున్నామేగానీ
అదే
జడస్వరూపమైన
దివ్యత్వము
చైతన్యములో
వచ్చినప్పుడు
దానిని
అలక్ష్యము
చేస్తున్నాము.
13
▾
Meaning
Keep
‘చెలగి
ప్రేమతోడ
చేయునట్టి’
పనులకు
ఎంతైనా
ఉపకారము
వుంటున్నాది.
పశువులు,
ప్రజలను
విశ్వసించి,
వారికి
ఎంతో
సహాయము
చేసి
భూమిదున్ని,
దుక్కుచేసి,
పంటలు
పండించి,
అనేక
శ్రమలు
చేస్తున్నాయి.
అట్టి
పశువులను
పట్టి,
మానవులు
క్రూరంగా
కొడుతూవుంటారు.
తనకు
ఉపకారము
చేసిన
పశువునే
అపకారముగా
హింసిస్తున్నాడు.
కానీ,
‘రాతి
బొమ్మను
చూచి
రమ్యముగా
పూజించు’.
అదే
రాతినందిని
చూస్తే
ఎంతగా
పూజిస్తాడో.
యిదే
మానవునిలో
వుండిన
మూర్ఖత్వము.
సర్వత్రా
వుంటున్నాడు
భగవంతుడు.
కానీ
చైతన్య
స్వరూపములో
వుంటున్న
భగవంతుని
చూడాలి.
అటువంటి
దివ్యమైన
భావములు
మనలో
ఆవిర్భవించాలి.
చలించని
మనస్సును,
భ్రమించని
దృష్టిని
పెంచుకోవాలి
ఈనాటి
మానవులు
ఏకత్వమును
అనేకత్వముగా
పోల్చే
మేధావులుగా
తయారౌతున్నారుగానీ
అనేకత్వమును
ఏకత్వముగా
విశ్వసించే
మానవత్వము
క్షీణించిపోతున్నాది.
అనేకత్వములో
వుండిన
ఏకత్వమును
మనం
తీసుకోవాలి.
అదే
నిజమైన
‘రసోవైసః’.
అదే
Unity
in
Diversity.
అలాంటి
మార్గములోనే
ఆధునిక
యుగములో
మనము
ప్రవేశించాలి.
విశ్వాసమును
గాఢము
గావించుకోవాలి.
పెంచుకున్న
విశ్వాసమును
చలించకుండా
చూచుకోవాలి.
చలించని
మనస్సును,
భ్రమించని
దృష్టిని
మనం
పెంచుకోవాలి.
అప్పుడే
మానవత్వము
స్థిరత్వముగా
నిల్చిపోతుంది.
ఈ
స్థిరత్వమే
మనము
సాధించవలసిన
గొప్ప
విజయము.
అనిల్‌కుమార్
చెప్పాడు.
కోరిక
తీరినవేళ
నిన్ను
గొప్పగ
పొగడెదరోయి
కోరిక
తీరకపోతే
వూరక
తెగడుదురోయీ
ఏ
కోరికలు
ప్రధానమైనవో
మీకు
తెలుస్తే
కదా,
ఆ
కోరికలు
నెరవేరలేదని
అనుకోటం!
ఏదో
అజ్ఞానంచేత
అల్పమైన
కోరికలు
కోరి,
అవి
నెరవేరలేదని
అసంతృప్తిగా
పారిపోతున్నారు.
అంతకంటె
యెంతమంచి
విలువైనది
అందించటానికి
సిద్ధంగా
వుంటున్నాడో
భగవంతుడు!
అది
మీకేం
తెలుసు?
భగవంతుని
ఖజానాలో
ఎంత
విలువైనవి
వుంటున్నాయో
మీకేం
తెలుసు?
14
▾
Meaning
Keep
ఆ
విలువను
తెలుసుకోకుండా,
ఆయన
ఖజానాలోపల
ఎలాంటి
పదార్థములు
వుంటున్నాయో
గుర్తించుకోకుండా
చిల్లర
వస్తువులను
నీవు
కోరుతున్నావు.
కేవలము
మసిబొగ్గులను
కోరుతున్నావు.
ఆ
మసిబొగ్గు
నీకు
లభించకపోవటంవలన
అసంతృప్తికి
గురౌతున్నావు.
భగవంతుడు
నీకు
మాణిక్యమును
అందించటానికి
సిద్ధంగా
వుంటున్నాడు.
అంతవరకు
నీవు
ఓపిక
పట్టుకో!
కానీ,
ఆ
ఓపిక
మనయందు
లేదు.
బజారులో
బస్సు
ఎక్కాలంటే
క్యూలో
గంటలు,
గంటలు
ఓపికగా
నిల్చుకుంటారు.
సినిమాకు
వెళ్ళాలని
క్యూలో
గంటలు,
గంటలు
నిల్చుకుంటారు.
కానీ
భగవంతుని
దగ్గర
ఒక్క
5
నిముషములు
నిల్చుకోటానికి
సాధ్యం
కాదు.
వీరి
కోరికలు
నెరవేరకపోతే
అనేక
అశాంతులకు
గురౌతారు.
యివే
అల్ప
బుద్ధులు.
యివే
అల్పమైన
కోరికలు.
కోరికలు
తీరినంతమాత్రమున
గొప్ప
అని
గానీ,
కోరికలు
తీరనంత
మాత్రమున
అధమమని
గానీ
భావించరాదు.
‘ఏది
జరిగినా
నా
మంచికోసమే’
అని
మీరు
విశ్వసించాలి.
‘భగవంతుడు
దీనియందు
కొంతవరకు
అపజయముగావించాడు.
కానీ,
నాకు
ఏ
విజయాన్ని
అందిస్తాడో.’
అని
ఆశతో
నీవు
ఉండాలి.
ఆశనిరాశలు
రెండు
మానవునకు
ఉపకారములే
గానీ,
అపకారము
కాదు.
రెండింటియందు
చక్కగా
స్థిరముగా
వుంటుండాలి.
ఆశావాది
ఏరోప్లేను
కనిపెడుతున్నాడు.
భూమి,
నీటిపై
కాకుండా
ఆకాశములో
సంచరించటానికి
ప్రయత్నిస్తున్నాడు.
కానీ
నిరాశావాది
భయంచేత
పేరాచూట్
కనిపెట్టాడు.
నిరాశావాది
కనిపెట్టింది
ఉపకారమే
అయింది.
ఆశావాది
కనిపెట్టింది
ఉపకారమే
అయింది.
ఆశనిరాశలు
రెండును
మంచివే
మానవునికి.
ఆశాపరుడు
యీ
టంబ్లరులోపల
సగం
నీరు
వుంటున్నదని
అంటాడు,
తృప్తిపడతాడు.
నిరాశపరుడు
అర్ధము
ఖాళీగా
వుందే
అనుకుంటాడు.
యివి
రెండూ
సత్యమే!
అర్ధము
ఖాళీగా
వుందన్నది
సత్యమే,
అర్ధము
నీరుంది
అనేది
సత్యమే!
రెండూ
సత్యమే!
ఆ
సత్యమును
మనం
గుర్తించాలి.
సత్యంనాస్తి
పరోధర్మః.
కాని,
నీవు
ఒకే
కోణములో
పోతున్నావు.
కనుక
ఆశానిరాశలకు
గురియైపోతున్నావు.
ఆశావాది
కేవలము
గులాబిపుష్పాన్ని
చూస్తాడు.
నిరాశావాది
దానిక్రిందవున్న
ముండ్లను
చూస్తాడు.
ముళ్లులేక
గులాబి
లేదు.
రెండూ
వుంటున్నాయి.
ముళ్లు
లేకుండా
గులాబి
కోస్తే
అది
నీ
బుద్ధి
కుశలత.
ఆశావాది
ఆకాశమును
చూచుకుంటూ
చంద్రుని
కాంతిలోపల
ఆనందమును
అనుభవిస్తున్నాడు.
15
▾
Meaning
Keep
నిరాశావాది
భూమిని
చూచుకుంటూ
చీకటిగా
వుందని
అశాంతికి
గురైపోతున్నాడు.
ఉన్నత
భావాలు
లేకపోవటంచేతనే
మానవుడు
నిరాశానిస్పృహలకు
గురయిపోతున్నాడు
కనుక,
క్రింద
చూడవద్దు.
గొప్ప
భావాలు
అభివృద్ధి
పరచుకో.
ఉన్నత
భావాలు
యీనాడు
లేకపోవటంచేతనే
నిరాశ,
నిస్పృహలకు
గురైపోతున్నాడు.
ఈ
నిరాశకు
కారణం
ఏమిటి?
Disappointment.
యీ
point
ను
మనం
సరిగా
అర్థం
చేసుకోవాలి.
ఎప్పుడు
disappointment
వస్తుంది?
ఎప్పుడు
నీవు
appointment
తీసుకుంటే
అప్పుడు
ప్రక్కనే
disappointment
ఉంటుంది.
కనుక,
ముందు
appointment
చేసుకోకు.
నీ
కర్మను
నీవు
ఆచరించు.
Do
your
duty.
నీవు
appointment
ను
దృష్టిలో
పెట్టుకొని
disappointment
కు
గురౌతున్నావు.
కనుక
దానిపైన
దృష్టి
పెట్టుకోవద్దు.
నా
కర్తవ్యమును
నేను
చెయ్యాలి.
Duty
is
God,
work
is
worship,
అని
తెలుసుకో!
ఈ
ఫలితములనేవి
రెండూ
వస్తుంటాయి.
రెండింటికి
కారణము
ఏమిటి?
మనో
బలహీనత,
మనోదౌర్బల్యము.
మనోధైర్యము
వున్నవాడు
సాధిస్తాడు.
మనోదౌర్బల్యుడు
అన్నింటియందు
అపజయమును
పొందుతాడు.
దీనివలనే
‘మనయేవ
మనుష్యానాం
కారణం
బంధమోక్షయోః’
అన్నారు.
మనసే
దీనికి
మూలకారణము.
నీవు
మనస్సును
దైవమువైపు
మరల్చు,
బంధవిమోచనము
కలుగుతుంది.
ప్రకృతిపైన
దృష్టి
పెట్టుకొని
చేయటంచేతనే
బంధన
యేర్పడుతున్నది.
ఒక
ద్వారమునకు
తాళము
వేశావు.
ఆ
తాళములోపల
key
ని
పెట్టావు.
Turn
left
side,
it
will
open.
Turn
right
side,
it
locks.
Same
lock,
same
key.
కానీ,
turning
is
difference.
అదే
రీతిగా,
నీ
హృదయమనేది
ఒక
lock,
mind
అనేది
key.
లోపల
పెట్టి
దైవమువైపున
మరల్చునది
detachment.
అది
liberation.
ప్రకృతివైపు
మరల్చు,
యిదే
bondage.
కనుక,
బంధమోక్షములు
మన
మానసిక
సంబంధమైన
దృష్టిలో
యిమిడి
వుంటున్నాయి.
Bondage
ఎక్కడనుండో
రాలేదు.
Liberation
అనేది
షాపునుండి
కొనలేదు.
ఏ
స్నేహితుడూ
గిఫ్ట్‌గా
యిచ్చేది
కాదు.
ఏ
కంపెనీ
సప్లై
చేయలేదు.
అన్నీ
మీ
మనస్సునందే
యిమిడి
వుంటున్నాయి.
కనుక
మనస్సును
నీవు
చక్కగా
పెట్టుకో!
16
▾
Meaning
Keep
His poems 328
Also in his talks
(3)
18 March 1988
True happiness comes only when man's vision turns towards the Paramātma
20 July 1988
All learning without practice is useless
26 May 1990
Buddhi the Charioteer
మనసు
నిర్మలంబు
మంచికి
మార్గంబు
మనసు
నిర్మలంబు
మహితశక్తి
నిర్మలంబు
మనసె
నీరధి
ముత్యము
మరువబోకుడిట్టి
మంచి
మాట.
సంసారమనే
సముద్రములో
గొప్ప
ముత్యమువంటిది
అది.
ప్రేమరసము
ఉండెనా
పరమాత్ముడు
హస్తగతమవుతాడు
ఈ
ముత్యమనేదానిని
కొంతవరకు
విచారణ
చేయాలి.
ఎక్కడనుండి
వచ్చింది?
చెట్టున
కాస్తుందా?
భూమిలోనుండి
పుడుతుందా?
కాదు,
కాదు.
యిది
సముద్రమునుండి
పుడుతుంది.
సముద్రము
ఏమిటి?
మన
సంసారమే
సముద్రము.
సంసారమునందే
ముత్యము
అనేది
మనకు
లభిస్తుంది.
దేహమనేది
ఒక
చిప్ప.
యీ
చిప్పలోనే
వుంటున్నాది
ముత్యమనే
ఆత్మ.
యీ
ముత్యము
ఎట్లా
వుంటున్నాది.
తెల్లగా
మెరుస్తూ
వుంటున్నాది.
అదే
ఆత్మ.
‘నిర్గుణం,
నిరంజనం,
సనాతనం,
నికేతనం,
నిత్య,
శుద్ధ,
బుద్ధ,
ముక్త,
నిర్మల
స్వరూపిణం’.
అదే
నిర్మలమైనది.
దానంత
ప్రకాశము,
దానంత
పవిత్రము,
దానంత
పరిశుద్ధము
మరొకదానికి
లేదు.
కాళ్లు
లేవుకాని
ఆత్మకు,
అది
పోయినంత
వేగము
మరి
దేనికి
లేదు.
దానికి
చేతులు
లేవుగాని,
అన్నింటిని
పట్టేస్తుంది.
కన్నులు
లేవుగానీ,
తాను
చూడనిది
యీ
జగత్తులో
లేనే
లేదు.
అట్టి
ఆత్మను
మనం
దక్కించుకోవాలి,
చిక్కించుకోవాలి.
అంటే
ఒక్క
ప్రేమతత్త్వముతప్ప
అన్యమార్గములో
లభ్యము
కాదు.
ఆ
ప్రేమయే
రసస్వరూపము.
నవరసములు
అంటుంటారు,
కవులు.
కానీ
నవరసములు
కాదు
ఉండేది,
రెండే
రెండు
రసములు.
ఒకటి
కరుణారసము,
ఒకటి
శోకరసము.
మిగిలిన
రసములు
అన్నీ
యీ
రెండింటిలోనే
చేరి
పోతున్నాయి.
కనుక,
యీ
కరుణారసమే
ప్రేమ
రసము.
ఈ
ప్రేమ
రసము
వుండెనా
పరమాత్ముడు
హస్తగతమవుతాడు.
కనుకనే
Love
is
GOD,
Live
in
LOVE
అన్నారు.
మనము
ప్రేమతో
జీవించాలి.
ఏ
సంవత్సరములైనా
కదలిపోనీ,
యే
ఋతువులైనా
రానీ,
ఏ
యుద్ధములైనా
సంభవించనీ,
కానీ
ఆ
భగవంతుని
కరుణాకటాక్షములు
ఒక
బిందువుగా
వుంటే
అన్నింటిని
సాధించవచ్చు.
అట్టి
దివ్యమైన
అనుగ్రహమునకు
పాత్రులు
కావాలంటే
కొంతవరకు
మనము
ప్రేమను
పెంచుకోవాలి.
17
▾
Meaning
Keep
His poems 287
Also in his talks
(21)
15 June 1973
The Bond of Prakṛti and the Paramātma
24 August 1989
Those Who Recognised the Paramātma Are the Gopīs
25 December 1989
Yearn for the Grace of God
15 January 1996
Only one who masters the mind can reach Mādhava
2 July 1996
Satya Alone Is God
29 August 1996
To Go Back to Where It Was Born Is the Nature of Every Living Being
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
22 September 1997
God delights in the feeling, not in outward show
26 February 1998
The power of saṅkalpas
18 April 1998
The universe is the form of Viṣṇu
4 September 1998
Remembering the Name of God Removes All Sorrow
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
13 March 2002
The divine power of attraction
10 September 2002
The Inner Meaning of Vināyaka Worship
25 October 2004
When You Give Up Delusion, You Yourself Are Brahman
8 October 2005
Remembering the Name is the way across
5 December 2006
Teachers alone are the real leaders
11 February 2007
Prema for God is the divine medicine for every worry
28 June 2008
Thinking of Rāma removes every worry
దృష్టి
ప్రేమమయమైనప్పుడు
సృష్టి
అంతా
బ్రహ్మమయమైపోతుంది
మనము
జీవితమంతా
బహిర్దృష్టితోనే
కాలము
గడుపుతున్నాము.
టార్చిలైటు
మన
దగ్గర
వుంటున్నాది.
ఆ
టార్చిలైటు
బయటవేసినంతకాలము
బయట
పదార్థములే
కనుపిస్తాయి.
లోపలకు
తిప్పు,
అన్నీ
కనుపిస్తాయి.
కనుక
దృష్టే
సృష్టి,
నేత్రమే
శాస్త్రము.
ఈ
శాస్త్రమంతా
ఎక్కడనుంచి
వచ్చిందంటే
మన
దృష్టినుండే
వచ్చింది.
ఈ
సృష్టి,
దృష్టినుండే
వచ్చింది.
కనుక,
ప్రేమస్వరూపులారా!
దృష్టిని
ప్రేమదృష్టిగా
మార్చుకోండి!
‘జగత్తంతా
మిథ్య
అంటారు.
బ్రహ్మసత్యమంటారు.
కాదు,
కాదు.
జగత్తుకూడా
సత్యమే.
నీ
దృష్టి
ప్రేమమయమైనప్పుడు
సృష్టి
అంతా
బ్రహ్మమయమైపోతుంది.
నీవు
దృష్టిని
ద్వేషమయముగా
పెట్టుకొన్న
ప్రపంచమంతయు
చింతమయముగా
మారిపోతుంది.
ప్రపంచములో
ఎన్ని
చింతలుంటున్నాయి!
ప్రపంచమనే
చెట్టు
క్రింద
మనము
జీవిస్తున్నాము.
పన్నెండు
చింతలుంటున్నాయి.
పుట్టుటయొక
చింత
భూమినుండుట
చింత
సంసారమొక
చింత
చావు
చింత
బాల్యమంతయు
చింత
వార్థక్యమొక
చింత
జీవించుటొక
చింత
చెడుపు
చింత
కర్మలన్నియు
చింత
కష్టంబులొక
చింత
సంతసమొక
చింత
వింత
చింత
సర్వ
చింతలు
బాపెడు
సాయి
భక్తి
గొనుడు
యికనైన
జనులార
కోర్కె
మీర
ఇంతకన్నను
వేరెద్ది
ఎరుకపరతు
సాధుసద్గుణ
గణ్యులౌ
సభ్యులార!
దివ్యాత్మస్వరూపులారా!
ఎన్ని
ప్రసంగాలలో
మీరు
ప్రవేశించి
వుంటారు!
ఎన్ని
ప్రసంగాలో
మీరు
వింటూ
వుంటున్నారు.
గొప్ప
గొప్ప
ప్రసంగాలంతా
వుంటాయి.
చెప్పే
ప్రసంగాలు,
వినే
ప్రసంగాలు
అన్నీ
మనవికాదు.
18
▾
Meaning
Keep
ఏయొక్క
విషయమును
మనం
నిల్పుకున్నామో
అదే
మనది.
Reserve
Bank,
State
Bank,
World
Bank
లంతా
వుంటున్నాయి.
దానికంటూ
చైర్మేన్
వుంటుంటాడు.
కానీ
అందులో
ఒక్కటైనా
దమ్మిడీ
లేదు,
తన
దగ్గర.
బ్యాంకులో
వుండినది
అంతా
క్యాషియర్
చేతిలో
వుంటున్నాది.
కానీ,
అదంతా
బ్యాంకు
డబ్బు,
అతనిది
కాదు.
తన
పేరుతో
ఎంత
డిపాజిట్టు
ఉందో
అదే
తనది.
అదే
రీతిగా
ఎంత
గొప్ప
విషయాలను
విన్నప్పటికిని,
ఆచరణలో
పెట్టినది
మాత్రమే
మన
స్వంతముది.
ఆలకించినదంతా
స్వంతము
కాదు.
కనుక,
ఆలకించినదానిని
ఆచరించినప్పుడే
ఆనందము.
అన్నీ
మనము
ఆచరించకపోయినా
ఏ
ఒకటి
రెండైనా
మనము
ఆచరించి
జీవితమును
ధన్యము
గావించుకోటం
మానవునియొక్క
లక్ష్యము.
ఎంతో
ధనమును
సంపాయించుకుంటున్నాం.
ఎన్నో
విద్యలు
నేర్చుకుంటున్నాం.
విద్యలలో
దోషములేదు.
ధనములో
దోషము
లేదు.
కానీ,
వ్యక్తిలో
వుంటున్నాయి,
సర్వదోషములు.
దోషరహితమైన
మనసును
మనము
అభివృద్ధిపరచుకున్నప్పుడు
యివన్నీ
సద్వినియోగములైపోతాయి.
ఎట్లా?
ధనము
చాలా
చెడ్డపని
చేస్తున్నాదనుకుంటాము.
విద్య
హాని
కలిగిస్తున్నాదనుకుంటున్నాం.
కాదు,
కాదు,
దానిలో
ఎట్టి
దోషములేదు.
జలము
పరిశుద్ధముగానే
వుంటున్నాది.
చక్కగా
మాధుర్యముగానే
వుంటున్నాది.
కానీ,
ఎఱ్ఱని
సీసాలో
పోస్తే
ఆ
జలము
ఎఱ్ఱగా
కనుపిస్తుంది.
నల్లటి
సీసాలో
పోస్తే
నల్లగా
కనుపిస్తుంది.
యీ
రంగు
ఎక్కడనుండి
వచ్చింది?
వ్యక్తి
అనే
సీసాలో
పడినప్పుడు
చెడ్డగా
మారిపోతున్నాది
అదికూడా.
మనము
రజోగుణములో
వుంటుంటే
మన
ధనము,
విద్య,
రజోగుణముగానే
వ్యర్థమైపోతుంది.
సాత్త్వికముగా
వుంటున్నప్పుడు
మన
ధనముగానీ,
విద్యగానీ,
సర్వకర్మలుకూడను
సన్మార్గములో
ప్రవేశిస్తాయి.
కనుక,
మన
హృదయమనే
సీసా
పరిశుద్ధమైనదిగా
వుండాలి.
దీనిని
పురస్కరించుకొనియే
చిత్తశుద్ధిలేని
శివపూజ
ఏటికి
ఆత్మశుద్ధిలేని
ఆచారమదియేల?
పాత్రశుద్ధిలేని
పాకమదియేల?
ఉన్నమాట
తెలుపుచున్న
మాట.
19
▾
Meaning
Keep
అన్నారు.
పాత్ర
మాలిన్యముగా
పెట్టుకొని
పరిశుద్ధముగా
వంటను
యేరీతిగా
వండగలవు?
కనుక
పాత్ర,
పాత్ర,
పాత్ర.
దీనినే
ఘటం
అంటారు.
దీనినే
ప్రకృతి
అంటారు.
పంచభూతముల
తత్త్వమును
గురించి
చెప్పేదే
పంచాంగము
కన్నడ
దేశములో
దేహమునుగురించి
చెపుతూ
‘నాకు
ప్రకృతి
సరిలేదు’
అంటారు.
ప్రకృతి
అంటే
దేహమే!
ప్రకృతిలోపల
పంచభూతములుంటున్నాయి.
అదే
పంచభూతములు
యీ
దేహములో
వుంటున్నాయి.
యీ
పంచభూతముల
మంచిచెడ్డలయొక్క
తత్త్వాన్ని
ప్రబోధించేదే
‘పంచాంగమ’ని
పేరు.
ఉగాదినాడు
సాయంకాల
సమయములో
పల్లెలందుగానీ,
పట్టణములందుగానీ
పంచాంగశ్రవణమని
ఒక
కార్యక్రమం
ఏర్పాటు
చేసుకుంటారు.
పంచభూతముల
మంచిచెడ్డలను
చెప్పేదే
పంచాంగము.
ఈ
ఉగాది
పండుగరోజున
తెల్లవారి
లేచిన
తక్షణమే
ఉగాది
పచ్చడి
తింటారు.
ఏమిటది?
వేపపువ్వు,
మామిడి
పిందెల
రసము,
తేనె,
చక్కెర,
వగరు
కలిపి
చేస్తారు.
దీని
అంతరార్థమేమిటి?
జీవితమనే
దానిలో
మంచి
చెడ్డ,
పాపము
పుణ్యము,
కష్టము
సుఖము,
సమంగా
తీసుకోవాలని
సమత్వమును
బోధించేదే
యీ
పచ్చడియొక్క
అర్థము.
అన్నింటిని
సమంగా
తీసుకోవాలి.
ఈ
సంవత్సరము
ప్రారంభములోపలే
‘నేను
ఏది
వచ్చినా
సమంగా
వుంటాను’
అనే
ఆ
ప్రసాదమును
తీసుకోవాలి.
ఆ
ప్రసాదమును
సంతృప్తిగా
తీసుకోవాలి.
ఆ
ప్రసాదము
తీసుకొనే
సమయంలో
‘యిది
చేదుగా
వుంటున్నాది.
సంవత్సరాదిరోజు
యిలాంటి
ప్రసాదము
తినేది’
అని
చింతిస్తూ
తింటే
నీకు
కష్టాలే
ప్రాప్తిస్తాయి.
దేనికైనా
స్వాగతమియ్యి.
అన్నీ
నీ
మంచికోసమే!
ఆ
విధంగా
సమత్వాన్ని
చూచుకునే
ప్రయత్నమే
దీనియొక్క
ప్రధాన
లక్ష్యము.
దుఃఖానికి
కృంగక,
సుఖమునకు
పొంగక
సమత్వమును
సాధించేదే
ఉగాది
లక్ష్యము.
ఏది
చేసినా
భగవత్
ప్రసాదముగా
భావించాలి.
రెండూ
జరుగుతూనే
వుంటాయి,
జగత్తులో.
దీని
పేరే
జగత్తు.
ఏదీ
శాశ్వతమైనది
కాదు.
జ-గత్,
రావటం,
పోవటం.
యిది
రెండుతో
చేరినది.
సుఖదుఃఖములు
లేకుండా
జీవితము
వుండటానికి
వీలులేదు.
దుఃఖమే
మానవునకు
సుఖాన్ని
అందిస్తున్నాది.
20
▾
Meaning
Keep
His poems 384
Also in his talks
(19)
25 March 1980
The four brothers
9 January 1988
God in the heart, work in the hands
3 September 1988
The body itself is a temple!
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
10 May 1992
Without a base substance no object takes on form and name
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
27 December 1992
If we can raise the value of man, the value of things comes down
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
14 September 1997
The ideal of Bali Cakravarti
1 January 1998
Happiness and sorrow cannot be parted
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
25 December 1998
Those Who Spread God's Prema Are the True Messengers of God
19 November 2000
Noble Sons Are Born Only When There Are Noble Resolves
18 November 2001
Man is the embodiment of Caitanya
11 April 2003
The ideal figures of the Rāmāyaṇa
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
21 March 2004
I am you, you are I
23 August 2004
Do nāmasmaraṇa for peace of mind!
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
ఏది
సుఖము,
ఏది
దుఃఖము?
కష్టసుఖములు
రెండును
కలసియుండు
వాని
విడదీయనెవరికి
వశముగాదు
సుఖము
ప్రత్యేకముగనెందు
చూడబోము
కష్టము
ఫలించెనేని
సుఖంబటండ్రు.
బిడ్డ
పుట్టినప్పుడు
ఆనందము
అంటాము.
పోయినప్పుడు
విచారిస్తున్నాము.
దుఃఖమునకు,
ఆనందమునకు
కారణము
బిడ్డ
ఒక్కడే!
సూర్యోదయము
అయితే
పగలంటున్నాము.
సూర్యాస్తమయము
అయితే
రాత్రి
అంటున్నాము.
రాత్రికి
ఒక
సూర్యుడు,
పగలు
ఒక
సూర్యుడు
లేడు.
ఉన్నది,
ఒకడే!
నీ
మనస్సుయొక్క
తత్త్వమే
సుఖదుఃఖములకు
కారణము.
మైండు
ఒక్కటే.
రెండింటిని
స్వాగతము
చేసి
ఏకత్వాన్ని
అభివృద్ధి
పరచుకోవాలి.
ఈ
విధమైన
సమత్వముచేత
దైవత్వాన్ని
విశ్వసించి,
దైవమును
ప్రేమించి,
హృదయమును
పరిశుద్ధము
గావించుకొని,
కర్తవ్యకర్మలను
ఆచరించటమే
మానవునియొక్క
ప్రధాన
కర్మ.
Previous
←
The Head and The Heart
Next
Only one who lives in the oneness of body, mind and Ātma is a human being
→