Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · The Puṣṭi, Samiṣṭi and Pravāha Jīvas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Puṣṭi, Samiṣṭi and Pravāha Jīvas
22 April 1998, Kodaikanal
1
▾
Meaning
Keep
His poems 154
Also in his talks
(3)
25 September 1986
Our inner feelings must be right!
7 January 1988
Life is fulfilled only when every action is done to please God
14 October 1988
How Can One Not Blessed with a Mother's Prema Gain the Prema of God?
దానధర్మములేక
దయయు
సత్యములేక
మానవత్వంబున
మంచి
నీతిలేక
దుర్గుణంబులతో
చెలరేగుచున్నట్టి
హీనుడు
యిహము
చెడును
పరము
చెడును
ప్రేమస్వరూపులారా!
ఈ
విశాల
ప్రపంచమునందు
అనంతమైనట్టి
యీ
జనసమూహము
నందు
మూడు
రకములైనట్టి
మానవులు
జీవిస్తున్నారు.
మొదటి
తరగతి
మానవుడు
పుష్టిజీవి.
రెండవ
తరగతివాడు
సమిష్టిజీవి.
మూడవ
తరగతివాడు
ప్రవాహజీవి.
మొదటి
తరగతి
వారియొక్క
పరిస్థితి
చాలా
విచిత్రమైనట్టిది.
ఈ
పుష్టిజీవులు
జన్మాంతర
సుకృతముచేత
జన్మించి,
ఎట్టి
సాధనలు
చేయకపోయినప్పటికిని,
ఎట్టి
శాస్త్ర
విచారణ
తెలియనప్పటికిని,
ఏ
యితిహాస
పురాణములు
చదవనప్పటికిని,
ఏ
పెద్దలయొక్క
దర్శన,
స్పర్శన,
సంభాషణలు
కలగక
పోయినప్పటికిని
అట్టి
వారిని
భగవంతుడు
ప్రేమిస్తుంటాడు.
దీనికి
మూలకారణము
పూర్వ
జన్మముయొక్క
సుకృతము.
ఆ
సుకృతముయొక్క
ప్రభావముచేత
భగవంతునియొక్క
అనుగ్రహానికి
పాత్రులై
భగవంతునియొక్క
ఆనందమును
అనుభవిస్తూ,
భగవత్ప్రేమలో
ఓలలాడుతూ
జీవితము
ప్రశాంత
జీవితముగా
గడుపుతుంటారు.
దీనికి
ఎట్టి
సాధనలు
చేయనక్కరలేదు.
వంట
పూర్తయిన
తర్వాత
కట్టెలతో
పని
ఏముంది?
ఈ
విధముగనే
అనేక
జన్మలయందు
యీ
పవిత్రమైనట్టి
సుకృతిని
పొందినట్టి
మానవునికి
మరొక
సాధన
అక్కరలేదు.
కనుక
బాహ్య
దృష్టితో
చూచినప్పుడు
ఇతను
ఎట్టి
సాధనలు
చేయలేదు.
ఎట్టి
దానములు
చేయలేదు.
ఎట్టి
సత్సంగము
చేరలేదు.
ఇట్టి
వ్యక్తియొక్క
ప్రభావము
పూర్వజన్మ
సుకృతముయొక్క
ప్రభావమే.
అట్టి
వారి
జీవితము
నిజమైన
జీవితము.
అట్టి
వారిదే
ఆనందము.
బ్రహ్మానందము.
అదియే
నిత్యానందము.
2
▾
Meaning
Keep
అదియే
అద్వైతానందము.
అదియే
పరమానందము.
ఇట్టి
పరమానందమునకు
పాత్రుడైనట్టి
వ్యక్తి
యీ
ప్రపంచమునందు,
యీ
బాహ్యమైనట్టి
జగత్తునందు
ఎట్టి
సాధనలు
చేయనక్కరలేదు.
ఇక
రెండవ
తరగతి
వారు
తనయొక్క
జీవితములో
అనేక
శాస్త్ర,
పురాణ,
యితిహాసములు
చదువుతుంటారు.
అనేక
విషయాలు
గుర్తిస్తుంటారు.
బాహ్యమైన
జగత్తునందు
తన
పేరు
ప్రతిష్ఠలకై
అనేక
విధములైన
పాట్లు
పడుతుంటారు.
ఇతను
పాండిత్యము
పొందినట్టి
వాడుగా
ఉంటాడు.
గొప్ప
కీర్తిని
ఆర్జిస్తూ
వుంటారు.
కానీ
యిట్టి
గ్రంథ
పరిచయముచేత,
ఇతని
పండిత
ప్రాభవముచేత
దైవానుగ్రహానికి
ఏమాత్రము
గురికాకుండా
పోతున్నాడు.
దైవానుగ్రహము
లేనప్పుడు
ఎన్ని
చదువులు
చదివి
ప్రయోజనం
ఏమిటి?
జీవితమంతా
చదువుతోనే
పోతుంటే,
చదివినట్టి
దానిని
ఆచరణలో
పెట్టేదెప్పుడు?
ఇట్టి
వానియొక్క
పరిస్థితి
కేవలము
ఒక
విధమైనట్టి
కాలము
వ్యర్థము
చేయడమే.
వీరు
అనేక
గ్రంథములు
చదువుతుంటారు.
అనేకమంది
మహనీయులను
దర్శిస్తుంటారు.
అనేక
సమావేశముల్లో
పాల్గొంటూ
ఉంటారు.
కాని
ఎన్నిటియందు
పాల్గొన్నప్పటికిని,
అనుగ్రహమునకు
మాత్రము
అత్యంత
దూరములో
ఉంటారు.
కారణము
తమ
హృదయములో
భగవత్
భావము
లేదు.
గ్రంధ
పరిచయము
మాత్రమే
అధికముగా
సలుపుకుంటూ
యీ
superficial
knowledge
తో
జీవిస్తుంటారు.
ఇలాంటి
జీవితమునకు
శాంతి
అన్నది
చాలా
దూరము.
కనుక
యిది
రెండవ
తరగతి
వారియొక్క
పరిస్థితి.
ఇంక
మూడవ
తరగతి
వారియొక్క
పరిస్థితి
ఏ
విధముగా
ఉంటుంది?
ఎప్పుడు
చూచినప్పటికిని
ప్రాకృతమైన
జగత్తుగురించి,
భౌతికమైన
జగత్తుగురించి
విచారించడము,
దేహమునకు
సంబంధించినట్టి
అనుకూలము
మాత్రమే
తను
ఆశిస్తూ
ఉంటాడు.
ఈ
విధమైనట్టి
వ్యక్తి
కలయందైనా
కూడను
దైవాన్ని
స్మరించడు.
కొంతమంది
దుష్టులుకూడా
సంకటమొస్తే
వెంకటరమణా
అని,
కష్ట
సమయమందే
భగవంతుని
స్మరిస్తారు.
కాని
యీ
ప్రవాహ
జీవులు
ఎట్టి
పరిస్థితియందు
దైవమును
ఏమాత్రము
స్మరించరు.
ఇలాంటి
పరిస్థితి
కలిగినట్టి
వారికి
గతియే
లేదు.
ఇలాంటి
మానవులు
‘పునరపి
జననం
పునరపి
మరణం’.
ఈ
ప్రవాహంలో
కొట్టుకొని
పోతుంటారు.
అయితే,
యీ
ప్రవాహజీవులలో
కూడను
కొంతమంది
గోప్యమైనట్టి
భావము
కలిగియున్నట్టి
వారున్నారు.
3
▾
Meaning
Keep
బాహ్య
ప్రపంచమునకు
భక్తులని
తెలియదు.
సత్సంగములో
ఏమాత్రము
కలవరు.
సత్యం
భాష్యం
ఏమాత్రము
సలుపరు.
సదాచారం
ఏమాత్రం
ప్రకటించరు.
ఈ
విధముగా
ఉండికూడను
హృదయములో
భగవంతుని
దాచుకునేంటివారు
కొంతమంది
ఉంటుంటారు.
ఒక
కుటుంబములో
భార్య
భర్తలు
ఉన్నారు.
భార్య
పరమ
భక్తురాలు.
నిరంతరముకూడను
భగవంతునియొక్క
నామస్మరణచేత
కాలము
సార్థకము
గావిస్తూ
వచ్చేది.
ఏ
నిముషముననైనా,
ఏ
సమయముననైనా
నా
భర్తనోట
భగవన్నామము
ఏమైనా
వస్తుందా?
అని
ఎదురు
చూస్తూ
వచ్చింది.
ఎలాంటి
పరిస్థితియందైనను,
ఎలాంటి
సంభాషణనందైనా
భగవంతుని
యొక్క
నామము
ఎప్పుడు
స్మరించేవాడు
కాడు.
కాని
యీ
యిల్లాలు
చాలా
కృంగిపోతూ
వచ్చింది.
జీవితమునకు
భగవన్నామమే
ప్రధానమైనట్టి
సూత్రము.
ఈ
సంసారసాగరము
యీదడానికి
యీ
భగవన్నామమే
నావ.
ఇలాంటి
పరిస్థితిలో
నా
భర్తయొక్క
స్థితి
ఏమవుతుందో
ఏమో!
మానవుడై
పుట్టి
మహత్తరమైనట్టి
జీవితము
ననుభవిస్తూ,
దైవాన్ని
స్మరించుకోలేనప్పుడు
యీ
జీవితమెందుకు?
ఇది
నా
దురదృష్టమా?
లేక
అతని
దురదృష్టమా?
అని
విచారిస్తూ,
ఏడ్చుకుంటూ
ఉండేది.
ఒకరోజు
భగవంతుని
గూర్చి
అమితముగా
ప్రార్థిస్తూ
వచ్చింది.
ఓ
దయానిధీ!
ఓ
కృపాసాగరా!
నా
భర్తకు
ఎందుకిలాంటి
మనసిచ్చావు?
నిన్నొక
క్షణమైనా
స్మరించడానికి
మనస్సు
లేదు.
ఎలాంటి
పరిస్థితియందుకూడను
భగవన్నామాన్ని
స్మరించడు.
ఇలాంటి
కఠిన
హృదయమెందుకు
ప్రసాదించావు?
నా
భర్త
నెందుకిలా
శిలా
హృదయంగా
నీవు
మార్చుకున్నావు?
నా
కెందుకిలాంటి
భర్తనిచ్చావు?
మా
రెండింటికినీ
ఏమాత్రము
సంబంధబాంధవ్యములు
లేదే?
ఇది
నా
ఖర్మనా?
నా
ప్రారబ్ధమా?
అని
చాలా
ఏడ్చింది.
ఆనాటి
రాత్రి
చక్కగా
నిద్రపోతున్నాడు
భర్త.
ఒకవైపు
తిరుగుతూ
రామా!
రామా!
అన్నాడు.
ఆ
పదము
భార్య
వినింది.
ఎంతటి
అదృష్టం
యీనాడు!
నా
కర్మలు
ఎంత
అదృష్టము
చేసినాయో!
నా
భర్త
యొక్క
వాక్కునుండి
రామా
అనేటంటి
పదము
నేను
యీనాడు
వినగలిగాను.
అతనికి
తెలియకుండా
మంచమునుండి
లేచింది.
తెల్లవారు
సమయమునకు
అన్నదానము
చేయాలని
అనుకుంది.
ఇల్లు
అలికింది.
ముగ్గులు
వేసింది.
మంగళవాయిద్యాలు
పిలిపించింది.
4
▾
Meaning
Keep
భర్త
లేచేటప్పటికి
యింటిముందు
మంగళవాయిద్యాలు
మ్రోగుతున్నాయి.
ద్వారమునకు
అరటిచెట్లను
కట్టుకున్నాది.
ఆనందముతో
ఎగురుతూ,
ఎగురుతూ
ఇంటినిండా
తిరుగుతున్నాది
భార్య,
భర్త
అడిగాడు.
‘ఏమిటీనాడు
పండుగ?
ఎందుకోసం
యింత
ఉల్లాసంగా
ఉంటున్నావు’,
అని
ప్రశ్నించేటప్పటికి
ఆమె
భరించుకోలేక
కాళ్ళపైన
పడింది.
నా
భగవంతుడు
కృపాసాగరుడు,
దయానిధి.
నా
ప్రార్థన
విన్నాడు.
ఈనాడు
నా
ప్రార్థనలో
మీ
నుంచి
జవాబు
వచ్చింది.
ఏమిటా
జవాబు?
మీరు
రాత్రి
నిద్రలో
రామా!,
రామా!
అని
రామనామము
స్మరించారు.
ఇన్ని
సంవత్సరములు
అయినప్పటికిని
మీ
నోటినుండి
రామ,
కృష్ణ,
గోవిందా
అనే
నామములు
నేను
వినలేదు.
ఇక
బలవంతంగా
నయినను
యితరుల
దగ్గర
భగవన్నామమును
చేస్తారేమోనన్నను
అది
కూడ
వినలేదు.
రాత్రి
మీరు
తెలివితో
రామా!
అని
పలికారు.
మీరు
పలికినట్టి
రామనామమే
నాకింత
ఉల్లాసాన్నందించింది.
నాకింత
ఉత్సాహాన్ని
చేకూర్చింది.
దీనిని
భరించుకోలేక
పదిమందికి
అన్నం
పెట్టి
ఆనందము
అనుభవించాలని
ఆశిస్తున్నాను.
భర్త
స్తంభించిపోయాడు.
ఏమిటో!
నానుండి
రామనామము
బయటకి
పోయిందా?
ఇంతకాలము
నేనెంతో
భద్రంగా
కాపాడుకొచ్చాను.
నా
హృదయంలోపల
ఇతనిని
బంధించుకొని
వచ్చాను.
రాత్రి
నా
హృదయమునుండి
బయట
పడిపోయినాడా
రాముడు!
అన్నాడు,
ప్రాణం
విడిచాడు.
కనుక
ప్రవాహ
భక్తులనేటంటి
వారియందు
కూడను
బాహ్యంగా,
భౌతికముగా
నామోచ్ఛరణ
చేయక
పోయినప్పటికిని
హృదయంనందు
ప్రతిష్ఠించుకుని,
ఆనందాన్ని
అనుభవించేటి
మహనీయులు
లోకములో
ఉంటారు.
సర్వదా
సర్వకాలేషు
హరిచింతనం
కాని
యువకులు
భగవన్నామాన్ని
స్మరించుకుంటూ,
నగర
సంకీర్తనలో
పాల్గొంటూ
భజనలు
చేస్తుంటే,
కొంతమంది
పెద్దలుకూడను
దీనిని
చూచి
ఆశ్చర్యపడిపోతుంటారు.
ఈ
చిన్న
వయస్సులో
యీ
భగవన్నామస్మరణ
ఎందుకు?
ఉద్యోగము
చేసి,
రిటైరు
అయిన
తర్వాత
దీనికి
కావలసినంత
సమయం
చిక్కుతుంది.
అప్పుడీవిధమైనట్టి
సాధన
చేసుకుంటూ
భగవంతుని
స్మరించుకోవచ్చును
కదా!
అని
చెప్తుంటారు.
ఈ
భగవన్నామము
చేయడానికి
ఒక
సమయము,
సందర్భమనేటిది
ఉందా?
‘సర్వదా
సర్వకాలేషు
హరిచింతనం’.
5
▾
Meaning
Keep
His poems 45
Also in his talks
(1)
6 October 1992
How Devotees Are Tested and Found Wanting
బాల్యము,
యవ్వనము,
కౌమారము,
వార్థక్యమనేటంటిది
లేదు.
భగవంతుని
స్మరించుకొనుటకు
బాల్యమనేటిది
లేదు.
దేహము
బాల్యముగా
ఉండవచ్చును
కాని,
జన్మలు
చాలా
అమితముగా
అయి
ఉండవచ్చును.
కనుక
శరీరమే
ప్రమాణముగా
మనము
గుర్తించుకోడానికి
ప్రయత్నించకూడదు.
ప్రబలి
కఫంబు
కంఠమున
బాధలు
పెట్టెడు
వేళ
బంధువుల్
గబగబ
బైటపెట్టుడిక
లాభము
లేదనువేళ
కింకరుల్
దబదబ
ప్రాణపాశములు
లాగెడువేళల
ఆలుబిడ్డలున్
లబలబ
ఏడ్చువేళ
తరమా
హరినామము
నోట
పల్కగన్!
ఈ
ప్రాప్తంకోసం
కాచుకుని
ఉండేవారి
గతి
యీ
విధముగనే
వుంటుంది.
పదపద
మంచు
కింకరులు
పాశము
లాగెడువేళ,
బంధువుల్
దబదబ
యిక
బయట
పెట్టుడు
లాభములేదని
చెప్పువేళ,
ఆలుబిడ్డలను
లబలబ
ఏడ్చువేళ,
ఆ
సమయములో
నామస్మరణ
వస్తుందా?
ఎప్పటికీ
రాదు.
జీవితకాలములో
చేసిన
స్మరణే
అంత్యకాలములో
ఆదరణ.
ఈ
జీవితకాలములో
ఆదర్శవంతమైనట్టి
భగవత్
చింతన
చేయకపోతే
ఎప్పుడు
నీవు
ఆదర్శాన్ని
చూపిస్తావు?
జీవితకాలంలోనే
భగవత్
చింతన
చేయడానికి
ఆదర్శము
అందించాలి.
ఇదియే
అంత్యకాలములో
ఆదర్శాన్ని
అందిస్తుంది.
ఆనందాన్ని
యిస్తుంది.
సార్థకతను
చేకూరుస్తుంది.
ఒక
దేవాలయంలో
అనేక
సంవత్సరములనుంచి
అర్చన
చేస్తున్నటువంటి
పూజారి
ఉండేవాడు.
అనేక
సంవత్సరాలనుంచి
అభ్యాసము
కావడంచేత,
ఒక
చేతిలో
హారతిపళ్ళెం
పట్టుకుని,
మరొక
చేతిలో
గంట
కొట్టుకుంటూ
హారతినిస్తూ
భగవంతునియొక్క
పూజ
చేసేటంటివాడు.
కారణమేమిటి?
‘శ్రేయోహి
జ్ఞానమభ్యాసాత్’
ఎంతో
కాలమునుండి
అభ్యాసము
చేయడం
చేతనే
ఒక
చేతిలో
హారతిపళ్ళెం,
ఒక
చేతితో
గంట
కొట్టడం
జరిగిపోతున్నాది.
ఆయొక్క
పూజారి
మరణించాడు.
క్రొత్త
పూజారిని
అపాయింట్
చేసారు.
ఆ
పూజారి
హారతిస్తే
గంట
నిల్చిపోతుంది.
గంటకొడితే
హారతి
నిల్చిపోతుంది.
హారతికి
తగినట్టు
గంట
కొట్టడము
లేదు.
కారణమేమిటి?
తనకు
పూర్వ
అభ్యాసము
లేకపోవడమే
దీనికి
మూలకారణము.
బాల్యమునుండి
కూడను
భగవచ్చింతన
అనేది
అభ్యాసము
చేసుకోకుండా
వార్థక్యములో
మనకు
వాక్కునందు
ఉచ్చరించడానికి
వీలుకాదు.
6
▾
Meaning
Keep
భగవత్ప్రేమ-సమాజసేవ
అనేకమంది
యువకులు
మిలటరీలో
ప్రవేశిస్తుంటారు.
ఈ
మిలటరీలో
ప్రవేశించినపుడు
దీనికి
అనేక
విధమైనట్టి
రిక్రూటమెంట్లంతా
అందిస్తుంటారు.
కేవలము
మిలటరీలో
చేరిన
తక్షణమే
గన్
పట్టటం
వీలుకాదు.
మిలటరీలో
చేరినట్టి
వారికి
తప్పనిసరిగా
రెండు
తెలుసుకుని
ఉంటుండాలి
అనగా
తుపాకీ
కాల్చడం
తెలుసుండాలి
మరియు
మార్చింగ్
తెలుసుండాలి.
ఈ
రెండూ
తప్పనిసరిగా
తెలుసుండాలి.
వాచ్మెన్గాని,
దోబీకాని,
బార్బర్కాని,
వంటవాడుకాని
అందరికీ
ఇవి
తప్పనిసరిగా
తెలుసుండాలి.
అదే
విధముగనే
ఆధ్యాత్మిక
మార్గములో
ప్రవేశించినట్టివారికి
బాల్యము,
యవ్వనము,
కౌమారము,
వార్థక్యము
అన్నిటికున్నూ
యీ
రెండింటియొక్క
తత్త్వము
గుర్తుంచుకొని
వుండాలి.
ఏమిటీరెండు?
భగవంతుని
ప్రేమించాలి.
సమాజసేవ
చేయాలి.
ఈ
రెండింటియందే
దివ్యత్వమనేది
యిమిడి
వుండాది.
పవిత్రమైనట్టి
మానవత్వాన్ని
ధరించి,
దివ్యత్వమైన
దైవత్వాన్ని
పొందడానికి
యీ
రెండు
మూలకారణము.
ఈ
రెండింటియొక్క
తత్త్వము
మనము
జీవితములో
ప్రవేశపెట్టాలి.
చిన్న
వయసునుండే
ఇది
తర్ఫీదు
చేయాలి.
ఈ
వయస్సునందు
మనము
చేసినప్పుడే
వార్థక్యమున
మనకు
సద్గతి
ప్రాప్తిస్తుంది.
జీవితమనేది
ఎంత
కాలము
ప్రయాణమో
చెప్పలేరు.
ఎప్పుడో
ఎక్కడో
ముదిమియందో
లేక
బాల్యమందో
లేక
యువతయందో,
ఎప్పుడో
విడిచేది
ఎరుకలేదు.
మరణమే
నిశ్చయము.
బుద్ధిమంతుడైన
తెలివియుండినట్టి
వాడే
తెలుసుకోగలడు.
కనుక
ఏ
నిముషంలో
భగవంతునియొక్క
అనుగ్రహము
దక్కుతుందో,
ప్రాపంచికముయొక్క
దృష్టిలోపల
ఎవరికైన
మనము
ఫొటో
తీయాలనుకుంటే
అతనిని
చక్కగా
నిల్చుకోమని
రెడీ
అని
చెప్పినప్పుడు,
అతను
చక్కగా
ఉన్నప్పుడు
ఆ
ఫొటో
తీస్తాము.
కాని
ప్రాకృతమనేటి
ఒక
ఫొటోగ్రాఫర్‌కు
యీ
విధమైన
పద్దతి
ఉంటుంది.
కాని
పారమార్థిక
మార్గమునందు
యీ
భగవంతుడు
ఎప్పుడు
రెడీ
చెప్తాడో,
ఏమో?
అతను
మన
హృదయములోపల
పిక్చర్‌గా
పడడానికి
ఎప్పుడు
చిక్కుతాడో,
ఏమో?
ఎప్పుడూ
రెడీగా
ఉండాలి.
7
▾
Meaning
Keep
వయసుకోసం
మనము
వెదుకనక్కరలేదు.
కాలముకోసం
మనము
ప్రాకులాడనక్కరలేదు.
కర్మలను
వెదుకనక్కరలేదు.
ఎప్పుడైనా,
ఎక్కడైనా
సరియే
నిరంతరము
భగవచ్చింతనలో
మనము
సిద్ధముగా
ఉండాలి.
భగవచ్చింతనే
లేకపోతే
భగవంతుడేరీతిగా
కృపచూపుతాడు
మనకు?
రెండు
రకములైనట్టి
సాధనలుంటున్నాయి.
యజమానుడు
మిద్దెపై
ఉన్నాడు.
గోడదగ్గర
పెద్ద
అల్సేషియన్
కుక్క
ఉన్నాది.
కాని
లోపలకు
పోవాలంటే,
అల్సేషియన్
కుక్కనైనా
మనము
స్వాధీనము
చేసుకోవాలి
లేదా
గట్టిగా
యజమానినైనా
మనము
పిలవాలి.
ఆ
విధముగా
చేయకపోయినప్పుడు
మాష్టర్‌తో
కలవడానికి
వీలుకాదు.
కనుక
ఈ
అల్సేషియన్
కుక్క
అంటే
ఏమిటి?
ఇదియే
మాయ.
ఈ
మాయను
మనము
వశమైనా
చేసుకోవాలి
లేక
గట్టిగా
భగవంతుని
నామస్మరణైనా
చేయాలి.
గట్టిగా
భగవన్నామస్మరణ
చేస్తే
ఉన్నత
స్థాయిలోని
భగవంతుడు
క్రిందకు
దిగి
వస్తాడు.
భగవంతునితో
కూడి
ఆ
యింట్లో
సులభంగా
ప్రవేశిస్తారు.
అప్పుడు
కుక్క
కూడ
ఏమీ
చేయదు.
మాయకూడ
ఏమీ
చేయదు.
కనుక
మనము
భగవంతుని
చేరాలంటే,
ఏమి
చేయాలంటే
నామస్మరణ
చేయాలి.
నీవు
ఎటువంటి
పరిస్థితి
అయినప్పటికిని
లోపలనందో,
బయటయందో
ఏదో
ఒక
రీతిగా
హృదయమునందు
దాచుకుని
భగవంతుని
హృదయంలో
ప్రతిష్ఠించుకోవాలి.
భగవంతునికి
హృదయమే
నిజమైన
స్థానము.
ద్రౌపది
పరాభవము
జరుగుతున్నట్టి
సమయములో
అనేక
విధములుగా
ప్రార్థించింది
కృష్ణుణ్ణి.
ఆపద్బాంధవా!
అనాధరక్షకా!
బృందావన
విహారీ!
గోకులసంచారి!,
ఏవేవో
నామాలన్ని
చెప్పింది.
కాని
కృష్ణుడు
రాలేదు.
ఆమెయొక్క
ఆపదను
సంరక్షించలేదు.
కడపటికి
అలసిపోయింది.
ఈ
దుర్యోధనుడు
చేసేటంటి
దీనికి
తను
అలసిపోయింది.
కూలిపోతూ
ఓ
హృదయవాసీ!
అన్నది
తక్షణమే
భగవంతుడు
ప్రత్యక్షమైనాడు,
తనను
సంరక్షించాడు.
ఈ
సమయమును
పురస్కరించుకొని
ఒకానొక
సమయములో
ద్రౌపది
కృష్ణుని
ప్రశ్నించింది.
కృష్ణా!
ఎన్నో
పర్యాయములు
ప్రార్థించినప్పుడు
రాలేదు.
కాని
నేను
కూలిపోయే
సమయంలో
తక్షణమే
వచ్చావు.
దానికి
కారణమేమిటి!
ఇది
భక్తుల
కందరికీ
సరియైన
జవాబు
ద్రౌపది!
నన్ను
బృందావన
విహారి
అన్నావు
దగ్గరున్నట్టి
వాణ్ణి
నేను
తిరిగి
బృందావనము
పోయి
రావాలి
నేను.
8
▾
Meaning
Keep
His poems 68
Also in his talks
(16)
7 February 1980
Be human
19 February 1987
When the jīva is joined with God, he becomes the very form of akṣara
20 March 1988
Bhārat is the home of Satya and Dharma
24 June 1989
Foster Prema and Share It
17 February 1990
Prema itself is God
21 May 1990
The Moving Temple
14 August 1990
Role of the Avatars
12 February 1991
Goodness is the principle of God
29 May 1991
Prasnopanishad - Answers To The Sixth Student
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
22 June 1996
Service to Society Is the Mark of True Humanness
11 July 1996
Lack of Values is the Cause of Violence in the World
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
8 October 1998
Good Resolves Are Themselves the Human Values
1 January 2000
Virtue is the adornment of man
లేకపోతే
నీ
మాటకు
ఏమాత్రము
సత్యము
ఉండదు.
మధురాపురీసంచారీ
అన్నావు
దగ్గరున్నట్టి
వాణ్ణి
నేను
మధురకు
పోవాలి
తిరిగి
రావాలి.
అటు
రావాలంటే
నాకేమయినా
హెలికాప్టర్
ఉంటుందా?
కనుక
అక్కడనుండి
రావడానికి
నా
కేవిధమైనట్టి
ప్లేను
లేదు.
హృదయవాసిని
నేను.
ఏ
క్షణములో
స్మరించినప్పటికినీ
నేను
సిద్ధంగా
ఉంటాను.
కనుక
నీవు
లోపలనే
స్మరించు.
మనసుతో
స్మరించు,
హృదయంలో
వరించు.
ఇదియే
నీయొక్క
ప్రార్థనకు
సరియైన
జవాబు.
కనుక
మానవుడు
ఈనాడు
భగవంతుని
పొందగోరి
ఎన్నో
విధములైనట్టి
మార్గములనుసరిస్తున్నారు.
కాని
యీ
మార్గములన్నీ
కూడను
భగవంతుని
అంత
సులభంగా
పొందడానికి
వీలుకాదు.
ఏ
మార్గము
చాల
సులభమవుతుంది?
హృదయమునందే
ఫ్రెండషిప్
చేసుకుని
హృదయవాసి,
హృదయవాసి
అనేటువంటి
పదమును
కొంత
విశ్వసించినప్పుడు,
అప్పుడు
భగవంతుడు
రక్షిస్తుంటాడు.
భగవంతుడేప్రదేశమునందో
లేడు.
దేవుడనగ
వేరు
దేశమందున
లేడు
దేవుడుండు
తనదు
దేహమందె
పాపమనగ
వేరు
పరదేశమున
లేదు
తానుచేయు
పనుల
తగిలియుండు
కనుక
ఏ
మందిరమునందో,
ఏ
మసీదునందో
దేనియందో
లేడు,
భగవంతుడు.
దేవుడనేవాడు
ఏ
చర్చియందో,
ఏ
భావమునందో
లేడు.
రధము
ఏది?
అదే
భక్తులయొక్క
హృదయరథం.
కనుక
భక్తుని
హృదయములోపల
పరమాత్మగా
ఉంచుకున్నట్టి
వానికి
ఎట్టి
యిబ్బందులును
కలుగవు.
కాని
యీనాటి
మానవుడు
‘పశ్యన్నపి
చ
నపశ్యతి
మూఢో’.
కేవలము
బయటపెట్టినటువంటి
భగవంతుణ్ణే
పిలుస్తున్నాడు.
బయటనున్నటువంటి
భగవంతుడు
రిఫ్లెక్సన్,
రియాక్షన్,
రీసౌండ్.
ఈ
రియాల్టీ
లోపల
ఉంటుండాలి.
Reflection
of
the
inner
being.
కాబట్టి
నీ
హృదయములోపల
నున్నటువంటి
భగవంతుని
సంపూర్ణముగా
విశ్వసించు.
9
▾
Meaning
Keep
పదే
పదే
సర్వత్రా
ఉంటున్నాడనుకునే
భావాన్ని
నీ
మదిలో
స్థిరం
చేసుకో.
భగవంతుడు
సర్వత్రా
ఉన్నాడు
కనుక
భగవద్గీత
‘సర్వతః
పాణిపాదం,
తత్సర్వతోక్షి
శిరోముఖం,
సర్వతః
శ్రుతిమల్లోకే,
సర్వమావృత్య
తిష్ఠతి’
అన్నది.
యద్భావం
తద్భవతి.
భగవంతుడా!
ఎందుకు
నా
వెంటనే,
జంటనే,
యింటనే,
కంటనే
ఉండి
నన్ను
రక్షించకూడదు.
అలాంటప్పుడు
భగవంతుడు
ఒకానొక
సమయంలో
జవాబు
చెప్పాడు.
భక్తుడా!
నేనెప్పుడూ
నీ
వెంటనే
ఉన్నాను.
నీ
వెనుకనే
ఉన్నాను.
నీలోనే
ఉంటున్నాను.
కనుక
నన్ను
ఎక్కడో
బయట
ప్రదేశంలో
వెదకడానికి
ప్రయత్నం
చేయొద్దు.
‘భగవంతుడా!
నిజముగా
నా
వెనుకనే
ఉన్నావా?’
‘తప్పక,
నా
నీడనే
నీ
దేహము’
అని
చెప్పాడు.
ఇది
నిజమా!
నా
వెనుకనే
ఉన్నావా?
కనుక
వెనక్కి
తిరిగి
చూచాడు,
కనిపించలేదు.
భగవంతుడా!
నీవు
అసత్యమాడడమా!
నా
వెనుకనే
ఉన్నావని
చెప్పావు.
కానీ
నేను
తిరిగితే
నా
వెనుక
లేవే?
పిచ్చివాడా!
నీవు
తిరిగినపుడు
నీ
వీపుకూడ
తిరిగింది
కదా!
నీ
వీపు
వెనుకనే
నేను
కూడ
తిరగవలసివచ్చింది.
కనుక
యీ
సత్యాన్ని
నీవు
గుర్తించుకొనలేక
నా
వెనుకంటే
ఏదో
కుర్చీ
ఉన్నాదని,
దానిని
చూస్తున్నావు.
నీ
విట్లా
వంగినపుడు
నీ
వెనుక
కుర్చీ
వుంది.
నీ
ప్రక్క
నున్నప్పుడు
నీ
కుర్చీ
ప్రక్కనే
వస్తుంది.
కనుకనే
‘సర్వతః
పాణి
పాదం’
ఎవరెవరి
భావము
ఏఏ
రీతిగా
ప్రార్థిస్తుంటారో
ఆ
భావాలకు
తగినట్టుగా
భగవంతుడుంటాడు.
‘భగవంతుడా!
నా
ప్రార్థన
వినడానికి
నీకు
చెవులు
లేవా?
ఎందుకు
నా
ప్రార్థనను
వినడంలేదు.
నీ
చెవిలో
ఎందుకు
నా
ప్రార్థన
పడడంలేదు?’
అని
ప్రార్థించినట్టివారికి,
‘సర్వతః
పాణి
పాదం,
తత్సర్వతోక్షి
శిరోముఖం’
అట్టి
వాని
దగ్గర
కేవలము
చెవులు
మాత్రమే
ఉండి
వింటుంటాయట.
‘స్వామి!
నా
బాధలు
నీ
కంటికి
కనబడలేదా?
ఎందుకు
నా
బాధలన్ని
నీవు
చూడలేకపోతున్నావు?’
అని
ప్రార్థించేటట్టి
వారికి
కన్నులు
మాత్రమే
ఉంటుంటాయి
దగ్గర.
‘ఎందుకు
నా
వెంటనే,
జంటనే,
యింటనే,
కంటనే
ఉండకూడదు?’
అని
ప్రార్థించే
వారికి
భగవంతుడు
ఎప్పుడు
కూడను
తన
వెనకతలే
ఉంటుంటాడు.
అయితే,
ఎప్పుడు
యీ
పాదశబ్దము
మనకు
వినిపిస్తుంది.
10
▾
Meaning
Keep
ఈ
యొక్క
ప్రపంచ
శబ్దములో
నీవు
నా
శబ్దాలను
గుర్తించుకొనలేక
పోతున్నావు.
కనుక
నీవు
నిశ్శబ్దమైన
స్థితిలో
నా
పాదముయొక్క
శబ్దము
నీకు
వినిపిస్తుంది.
ఈ
భావాన్ని
పురస్కరించుకొని
ప్రాచీనకాలమునుండి
ఏకాంతమైనట్టి
స్థలములోపల
ఎట్టి
శబ్దము
లేకుండా
దైవాన్ని
ఆరాధన
చేస్తూ
వచ్చేటంటివారు.
మన
నుండియే
వస్తున్నాదీ
శబ్దము.
అదియే
ప్రణవ
శబ్దము.
ఒక
చిన్న
ఉదాహరణము
మీరు
తీసుకొండి.
మీరు
చెవి
తెరచుకున్నప్పుడు
ఎన్నో
శబ్దాలు
మీకు
వినిపిస్తుంటాయి.
నీవు
గట్టిగా
మూసుకో.
కాని
లోపలనుండి
‘ఓం’
అనే
శబ్దము
వస్తుంటాది.
ఈ
విధమైనట్టి
మార్గములు
అనేక
రకములుగా
అనేక
విధమైనట్టి
మార్గములో
ప్రబోధిస్తూ
వస్తున్నారు.
కాని
భగవంతుడు
చెప్పినటువంటి
మాటలు
సరైన
రీతిలో
అర్థము
చేసుకోలేనివారు,
ఈ
అవస్థలకు
గురవుతున్నారు.
సూరదాసుకు
కన్నులు
లేవు.
కాని
యిది
తనకు
తాను
చేసుకున్నట్టి
పనియే.
ఏదో
ఒక
స్త్రీని
చూచి,
ఆమె
వెంటపడిపోతున్నప్పుడు,
ఆమె
భర్త
‘నీ
కన్నుల
నిచ్చిందెందుకు
భగవంతుడు?
పరస్త్రీని
చూచి
వెంటబడడానికా
నీ
కా
కన్నులిచ్చాడు?
ఛీ!
దుర్మార్గుడా!
బయటకు
పొమ్మని
మందలించాడు
ఆ
బాధను
భరించుకోలేక,
ఆ
వ్యక్తియొక్క
కాంపౌడ్నుంచి
ఒక
నిమ్మచెట్టు
ఆ
నిమ్మ
ముల్లు
తీసుకుని
కన్నులు
పొడుచుకున్నాడు.
కన్నుల
నిచ్చిందెందుకో
తెలుసా!
సందులు
గొందులు
తిరుగుటకా!
ఇలాంటి
కన్నులు
నా
కక్కరలేదు.
ఇతనితో
నేను
మందలించబడడానికా
యీ
కన్నులు
యిచ్చావు?
అప్పటినుంచి
తాను
అనేక
విధములైనట్టి
ఒక
కృష్ణ
నామాన్ని
స్మరించుకుంటూ
ద్వారకకు
చేరాడు
సూరదాసు.
ఒకానొక
సమయములోపల
కన్నులు
తెలియనట్టి
పరిస్థితిలోపల
సూరదాసు
ద్వారకకు
పోతూ,
ఒక
పాడుబడ్డ
బావిలో
పడేవంటి
పరిస్థితి
వచ్చింది.
ఈ
కృష్ణ
నామాన్ని
స్మరించుకుంటూ
పోతుంటే,
కృష్ణుడు
ఓ
గొల్లపిల్లవాని
మాదిరిగా
వెంటవచ్చాడు.
చెయ్యి
పట్టుకున్నాడు.
‘ఎక్కడికి
మీరు
వెళ్ళాలి
దాసుగారూ!’
నాయనా!
నేను
ద్వారక
పోవాలి’
అన్నాడు.
‘నేను
దారి
చూపిస్తాను
రమ్మని
చెప్పాడు.
‘ఆ!
సంతోషమన్నాడు
చాల
ఆనందించాడు.
రాత్రి
అయిపోయింది.
‘నీవు
సత్రంలో
ఉండు.
రేపటిదినం
నేనొచ్చి
నిన్ను
పిలుచుకొని
పోతా’నన్నాడీ
గొల్లపిల్లవాడు.
11
▾
Meaning
Keep
‘అయ్యో!
నీవు
వెళ్ళిపోయిన
తర్వాత
తిరిగి
వస్తావో,
రావో,
కాబట్టి
నీవు
పోకూడదు
అని
గట్టిగా
ప్రార్థించాడు.
అప్పుడతని
ప్రార్థనకోసమని
ఆ
గొల్లపిల్లవాడు
నిల్చాడు.
ఇక్కడనే
పండుకో,
ఎప్పుడు
నేను
లేచి
పోతానో
నాకు
తెలియదు.
కనుక
నీ
చేతిని
నాపైన
వేసుకో.
నా
చేయి
నీపైన
వేసుకుంటాను.
కదలినప్పుడుల్లా
తెలుస్తుంది.
కనుక
నీవు
కదలడానికి
వీలులేదన్నాడు.
ఆ
చెయ్యిపైన
వేసుకొని
పండుకున్నాడు.
ఆ
స్పర్శయొక్క
ప్రభావముచేత
అతనికొక
జ్ఞానము
ఆవిర్భవించింది.
‘సంభాషణం
సంకటనాశనం,
స్పర్శనం
పాపనాశనం’.
తెల్లవారి
లేచి
సూరదాసూ!
నేనే
కృష్ణుణ్ణి.
నేను
నీకు
దారి
చూపించే
నిమిత్తమై
నీ
అజ్ఞానం
దూరం
కావించే
నిమిత్తమై,
నేను
యీ
విధమైనట్టి
నాటకాలు
ఆడుతూ
వస్తున్నాను.
నీ
కన్నుల
నిచ్చేదా?
అని
ఒక్కసారి
కన్నులు
తాకాడు.
తాకిన
తక్షణమే
కన్నులు
వచ్చాయి.
కృష్ణుని
చూచాడు.
కృష్ణా!
యింక
నాకీ
కన్నులక్కరలేదు.
నిన్ను
చూచిన
కన్నులతో
యింకొకరిని
చూడలేను.
ఈ
కన్నులు
తీసుకుని
పో
ప్రపంచములో
సంచరించు’
ఎందుకోసమీ
కన్నులు
నాకు?
‘కన్నులుండి
గ్రుడ్డులై
కళ్యాణకరమైన
నీ
మూర్తి
దర్శింప
నేరరైరి’.
ఎంత
మందికి
కన్నులు
లేవు?
వాళ్ళందరూ
నీ
మూర్తిని
చూస్తున్నారా?
నేను
నీ
మూర్తిని
చూచాను
నా
కింతే
చాలు.
చెవులుండి
చవటలై
అతి
మనోహరమైన
నీ
గానమాలింపనేరరైరి.
కనుక
ఈ
కన్నులు,
యీ
చెవులూ
నాకక్కరలేదు.
నాకు
జ్ఞాన
చక్షువు
నిచ్చేయి’
అని
చెప్పేటప్పటికి,
కృష్ణుడు
అతని
తలపై
చేయి
పెట్టాడు.
అతనియొక్క
ప్రాణము
కృష్ణునిలో
ఏకమై
పోయింది.
కనుక
ఏ
సమయములో,
ఎక్కడ
ఏ
పరిస్థితిలో,
ఏ
మార్గములోపల
భగవంతుడు
అనుగ్రహిస్తాడో
ఎవ్వరూ
చెప్పలేరు.
కనుక
నీవు
నామస్మరణ
చేస్తూ
ఎల్లప్పుడూ
సిద్ధముగా
ఉంటుండు.
ఏమి
జరిగినా
కూడ
ఇది
భగవంతుని
లీలగా
అనుభవించు.
అంతా
మన
మంచికే
ఇందాకో
అబ్బాయి
చెప్పాడు.
రాజుకు
వేలు
తెగింది.
దీనినంతా
మంత్రి
చూచాడు.
మహారాజా!
‘ఇది
అంతా
మంచికే’
అన్నాడు.
ఆ!
ఈనాడు
వేలు
పోతే
నాకు
మంచిదంటున్నావు.
12
▾
Meaning
Keep
రేపు
నా
తలపోతే
కూడ
నీవు
మంచిదంటావు.
ఇలాంటి
మంత్రి
నాకు
ఉండకూడదు.
ఇతనిని
జైలులో
పెట్టండన్నాడు.
ఆ
మంత్రి
నవ్వుతూ
ప్రభువుకు
నమస్కారము
చేసుకొని
‘ఇది
అంతా
మంచికే’
అన్నాడు.
కనుక
భగవంతుడు
ఏమి
చేసినప్పటికిని,
మంచిదే
కాని,
చెడ్డదిగా
ఉండదు.
భగవంతుడు
పవిత్రుడు,
నిర్మలుడు,
నిస్వార్థుడు
అలాంటి
నిస్వార్థుడైన
భగవంతుడు
ఏమి
చేసినా
యితరులకు
మంచికేగాని
తనకోసం
కాదు
కదా?
ఆ
కష్టాన్ని
విశ్వసించి,
ఏమి
చేసినా
నా
మంచికోసమే
అనేటువంటి
నమ్మకాన్ని
మనము
బలపరచుకోవాలి.
కనుక
భగవంతుని
విషయములో
ఇది,
అది
అనేటువంటిది
లెక్క
చేయనక్కరలేదు.
ఈ
స్థానము,
ఆ
స్థానము
అని
వెదుకనక్కరలేదు.
ఎందుకు
వెతుకుతున్నావు
నీవు?
‘కోరిన
ఫలమిచ్చు
కల్పవృక్షముండ,
పెరటి
వృక్షముపై
ప్రీతి
యేల?’
కనుక
యింకొక
విషయాన్ని
మనము
కోరనక్కరలేదు.
కల్పవృక్షమే
మన
దగ్గర
ఉన్నాది.
మంచి
ప్రేమచేత
భగవంతుని
ఏకాత్మతో
మనము
విశ్వసించి
ప్రేమభావాన్ని
అతనిపైన
నిమగ్నం
చేయాలి.
అప్పుడే
భగవంతుని
ప్రేమకూడ
మనకు
లభిస్తుంది.
నేను
మాత్రము
భగవంతుని
ప్రేమిస్తున్నాను
కాని
భగవంతుడు
ప్రేమిస్తున్నాడో,
లేదో?
అనేటువంటి
సందేహములో
మీరు
మునగనక్కరలేదు.
నీవు
నిజంగా
రిజిష్టర్
లెటర్
కనుక
నీ
ఫ్రెండుకు
వ్రాస్తే,
అతనికి
చేరిందా
లేదా
అనే
గుర్తు
నీకెట్లా
తెలుస్తుంది?
ఎక్నాలెడ్జ్మెంటు
వాపసు
వస్తుంది.
కావున
ఎక్నాలెడ్జ్మెంటు
ఎప్పుడు
రాలేదో,
అంటే
ఆ
కవరు
చేరలేదు.
కనుక
భగవంతుడు
నీపైన
ప్రేమించినప్పుడే
నీ
ప్రేమ
భగవంతునికి
చేరింది.
నీ
ప్రేమ
ఎట్టిదో,
అట్టిదో,
యిట్టిదో
తెలీదు.
కాని
మంచి
ప్రేమగా
ఉన్నప్పుడు
తక్షణమే
అతని
ప్రేమ
నీపైన
ప్రసరిస్తుంది.
కనుకనే
భగవంతుని
ప్రేమ
మనపైన
కలిగిందా
లేదా
అనేటువంటి
సందేహం
వుంటే
మనము
వేచి
ఉండాలి
కాని,
నీ
ప్రేమ
నాకు
దండిగా
ఉన్నదని
యిలా
అపోహ
పడితే
ప్రయోజనము
లేదు.
కనుక
అన్ని
వేళలయందు
దైవాన్ని
స్మరించండి.
నామస్మరణచేత
నామి
అనే
రూపము
మనకు
ప్రాప్తిస్తుంది.
Previous
←
The body itself is foremost for the practice of Dharma
Next
Human Life Is Most Precious
→