Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · The body itself is foremost for the practice of Dharma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The body itself is foremost for the practice of Dharma
21 April 1998, Kodaikanal
1
▾
Meaning
Keep
His poems 88
మంచివారి
పొందు
మహిలోన
దొరకదు
దుష్టులెందరైన
దొరుకుచుంద్రు
కలికి
రాళ్లు
భువిని
కలవెన్నియైనను
వెలనుబోలు
వజ్రమెతుకవలయు.
ప్రేమస్వరూపులారా!
అనంత
జగత్తులో
అఖిల
ప్రాణికోటిలో
మానవుడు
అత్యంత
ఉన్నత
స్థితిని
పొందినవాడు.
మానవుడు
ధనమును
కోల్పోయినా,
తిరిగి
ఎన్ని
అవస్థలైననూ
పడి
దానిని
సంపాదించగలడు.
ఒక
మిత్రుని
కోల్పోయినా
తిరిగి
మరొక
మిత్రునైనా
కూడను
తాను
సంపాదించుకోగలడు.
ఒక
భార్యను
కోల్పోయినా
రెండవ
వివాహమాడి
మరొక
భార్యను
అయినా
పొందగలడు.
ఒక
భూమినే
కోల్పోయినా
తిరిగి
అనేక
అవస్థలతో
ఆ
భూమినే
తిరిగి
సాధించగలడు
మానవుడు.
కానీ
మానవునియొక్క
దేహమును
తిరిగి
సంపాదించుకోలేడు.
మానవుని
దేహము
అత్యున్నతమైనటువంటిది.
‘జంతూనాం
నరజన్మ
దుర్లభం’.
ఇట్టి
పవిత్రమైనటువంటి
మానవత్వాన్ని
ఈనాడు
మానవుడు
అర్థం
చేసుకొనలేక
దానిని
దురుపయోగం
చేసుకుంటూ
వున్నాడు.
మానవుని
యందున్నటువంటి
దివ్యత్వాన్ని,
మానవునియందున్నటువంటి
పవిత్రతను
ఏమాత్రం
కూడను
మానవుడు
అర్థం
చేసుకొనుటకు
ప్రయత్నించటం
లేదు.
గడచిపోయిన
రాత్రి
ఎన్ని
విధములైన
గడియలు
గడిచినప్పటికిని
అది
మనకు
తిరిగిరాదు.
అనంత
సాగరములో
లీనమైనటువంటి
యమునా
నది
మనము
ఎన్ని
విధముల
ప్రయత్నము
చేసినప్పటికిని
తిరిగి
మనకు
లభించదు.
మానవుడు
చక్కగా
నమిలి
మ్రింగినటువంటి
ఫలమును
ఎన్ని
ప్రయత్నములు
చేసినప్పటికిని
తిరిగి
ఆ
ఫలముగా
తాను
పొందలేడు.
అట్టి
పరిస్థితియందు
మానవత్వమును
ఏ
రీతిగా
తాను
అర్థం
చేసుకోగలడు?
2
▾
Meaning
Keep
మతి-స్థితి-పరిస్థితి-గతి
మానవుడు
అనేక
విధములైనటువంటి
శక్తులు
కలిగినటువంటివాడు.
భగవంతుడు
అనుగ్రహించినటువంటి
శక్తులలో
మొట్టమొదటిది
మతి.
రెండవది
స్థితి.
మూడవది
పరిస్థితి.
నాల్గవది
గతి.
మతి,
స్థితి,
పరిస్థితి,
గతి,
సంపత్తి.
కాని
మానవునియొక్క
గతిని
పురస్కరించుకునియే
తనయొక్క
స్థితి
ఏర్పడుతుంది.
మానవునియొక్క
ప్రవర్తనను
పురస్కరించుకునియే
మతి
ఏర్పడుతుంది.
మతి
వల్లనే
గతి;
గతి
వల్లనే
స్థితి.
కనుకనే
మానవునకు
మొట్టమొదటిది
మతి
అతి
పవిత్రమైనటువంటిదిగా
వుండాలి.
మతిని
పురస్కరించుకునియే
తనయొక్క
స్థితి,
సంపత్తి
ఏర్పడుతూ
వుంటాది.
ఇలాంటి
సత్యాన్ని
మానవుడు
మొట్టమొదట
గుర్తించుకున్నప్పుడే
తనయొక్క
స్థితినిగానీ,
సంపత్తిని
గానీ
తాను
పొందగలడు.
కాన
ప్రతి
మానవుడు
ఒక
విధమైనటువంటి
మతియొక్క
సమ్మతిని,
సన్మతిని
చక్కగా
కాపాడుకోవాలి.
ఈ
ప్రపంచమునందు
ప్రతి
పదార్థమును
కూడను
పవిత్రమైన
మార్గంలో
ఉపయోగించాలి.
సక్రమమైనటువంటి
మార్గాన్ని
పొందాలి.
చేతిలో
ఒక
కత్తి
వుంది.
కానీ
ఈ
కత్తిద్వారా
కూరగాయలు
తరుగుకొని
చక్కగా
వంట
వండుకొని
భుజించవచ్చు,
లేక
ఫలములు
కోసుకొని
తాను
ఆరగించి
ఆకలిని
తీర్చుకోవచ్చు.
కానీ
కత్తి
చేతితో
వున్నది
కదా
అని
ఎదుటివాని
తలను,
గొంతును
కోసినప్పుడు
ఇతను
కేవలం
రాక్షసత్వాన్ని
పొందినవాడవుతాడు.
కనుక
ఎలాంటి
వస్తువును
ఏ
విధమైనటువంటి
మార్గములో
మనము
ఉపయోగించాలి
అనేటువంటి
స్థితిని
కూడా
మనం
తెలుసుకోవాలి.
మానవత్వంలో
ఎన్నియో
విధములైనటువంటి
శక్తులు
వున్నవి.
ఈ
శక్తులయొక్క
పవిత్రతను
కూడను
మనం
గుర్తించేదానికి
ప్రయత్నించాలి.
ఈయొక్క
శక్తిని
దైవానుగ్రహంచేతనే
పొందడానికి
వీలవుతుంది.
మానవునియొక్క
జీవితము
ఒక
పెద్ద
గడియారము
వంటిది.
ఇందులో
సంవత్సరములు,
నెలలు,
దినములు
అనేటువంటి
మూడు
పిన్నులు
వున్నాయి.
ఈ
మూడు
ముల్లులు
సక్రమంగా
తిరుగుతూనే
వుంటున్నాయి.
దీనిని
పురస్కరించుకుని
మానవునియొక్క
ఆయుఃప్రమాణము
కూడను
తిరుగుతూనే
వుంటుంది.
కానీ
మానవుడు
తన
ఆయుఃప్రమాణాన్ని
గుర్తించక
పూర్వమే
గంటలు
కొడుతున్నాడు
ఘన్,
ఘన్,
ఘన్
అని.
3
▾
Meaning
Keep
ఈ
గడియారమునందున్నటువంటి
మూడు
పిన్నులును
సక్రమమైన
మార్గములో
నడుస్తున్నప్పటికినీ
తనయొక్క
జీవితాన్ని
మాత్రము
సక్రమంగా
గుర్తించుకోవడానికి
ప్రయత్నించటం
లేదు.
దినములు,
ముప్పది
దినములు
జరిగినప్పుడే
ఒక
నెల
అవుతుంది.
పన్నెండు
నెలలు
జరిగినప్పుడే,
ఒక
సంవత్సరం
అవుతుంది.
కనుక
సంవత్సరములనేటువంటివి
నెలలతో
కూడినటువంటివి.
నెలలు
దినములతో
కూడినటువంటివి.
కనుక
ప్రధానమైనటువంటిది
దినమే.
కనుక
మనము
నిత్యదినములు
ఏ
విధమైనటువంటి
మార్గములో
మనం
అనుభవించాలి
అనేటువంటియొక్క
సత్యాన్ని
గుర్తించాలి.
కానీ
ఈనాటి
మానవుడు
తనయొక్క
నిత్యజీవితముయొక్క
సత్యాన్ని
గుర్తించటానికి
ప్రయత్నించటం
లేదు.
దినములు
గడుపుతున్నాడే
కానీ
ఏ
విధంగా
గడపాలి?
ఏ
విధంగా
అనుభవించాలి?
ఏ
విధంగా
ఈ
దినమును
అర్థం
చేసుకోవాలి?
అనేటువంటి
సత్యాన్ని
గుర్తించటానికి
ప్రయత్నించటం
లేదు.
కానీ
ప్రతి
ఒక్కటి
కూడను
భగవంతునియొక్క
సంకల్పం
చేతనే
జరుగుతూ
వుంటున్నాది.
ఈ
సత్యాన్ని
కూడను
మానవుడు
గుర్తించటానికి
ప్రయత్నించటంలేదు.
కేవలం
తన
స్వార్థము,
స్వప్రయోజనమును
గుర్తించి
వర్తిస్తున్నాడు.
భగవంతునిది
సమదృష్టి
ఈ
వ్యక్తియొక్క
సంకల్పం
గుర్తించుకొని
భగవంతుడు
తనయొక్క
శక్తిని
ఉపయోగించడు.
ప్రపంచమునకు,
సమాజమునకు,
కుటుంబమునకు
ఏది
అవసరమో
దానిని
గుర్తిస్తూ
వస్తుంటాడు
భగవంతుడు.
ఒక
ఇంటిలో
కళ్యాణం
జరుగుతున్నాది.
కుంభవర్షం
కురవడానికి
ప్రయత్నమైంది.
ఓ
భగవంతుడా!
నా
ఇంటిలో
కళ్యాణం
పూర్తి
అయ్యేంతవరకు
నీవు
ఈ
వర్షమును
కురిపించకూడదు
అని
ప్రార్థిస్తాడు.
ఆ
వ్యక్తియొక్క
ప్రక్కింటి
వానియొక్క
పొలము
వర్షములేక
ఎండిపోతున్నాది.
ఓ
భగవంతుడా!
ఎండలచేత
నా
పంటలంతా
ఎండిపోతుంది.
కుంభవర్షాన్ని
కురిపించు
అని
తాను
కోరుతున్నాడు.
భగవంతుడు
వ్యక్తిగతమైనటువంటి
అభీష్టములకు
ఏమాత్రమూ
లొంగడు.
అయితే
వారి
వారి
భక్తి
ప్రపత్తులను
ఆధారం
చేసుకుని
ఆ
వ్యక్తులకు
ఆనందాన్ని
అందిస్తుంటాడు.
అయితే
ఒక్క
విషయాన్ని
మనం
చక్కగా
గుర్తించాలి.
ఈ
ప్రపంచములో
ఏ
ఔషధమునకూ
నయము
కానటువంటి
రోగము
ప్రతి
మానవునియందు
వుంటున్నది.
4
▾
Meaning
Keep
ఒకనియందు
అధికమైనటువంటి
జబ్బుగా
వుండవచ్చును.
ఒకనియందు
అది
తక్కువగా
వుండవచ్చును.
కానీ
క్వాంటిటీ
difference
గా
వున్నప్పటికినీ
ఈ
రోగముయొక్క
క్వాలిటీ
ఒక్కటిగానే
వుంటుంది.
ఇది
ప్రాకృతమైనటువంటి
ఔషధములచేత
నివారణయ్యేటువంటిది
కాదు
లేక
ప్రజ్ఞుడు
అయినటువంటి
డాక్టరు
వల్ల
నయం
అయ్యేటువంటిది
కాదు.
ఏమిటి
ఈ
రోగము?
అదియే
‘అహంకారం’
అనే
రోగము.
అహంకారమునెలా
నిర్మూలించాలి
ఈ
అహంకారమనేటువంటి
దానిని
అర్థం
చేసుకొనలేక
మానవుడు
అనుభవిస్తున్నాడు.
ఈ
అహంకారమునకు
ఎక్కడ
అవకాశం
వుంటున్నది?
అవకాశం
లేనటువంటి
అహంకారాన్ని
అనుభవించుతూ
వున్నాడంటే
ఇది
తనయొక్క
ప్రీతియే.
ఈ
రోగమును
తాను
ప్రీతితో
తీసుకున్నటువంటి
వాడు
అవుతాడు.
ఈ
విశాలమైనటువంటి
ప్రపంచాన్ని
ఒకసారి
గుర్తించడానికి
ప్రయత్నించాలి.
నా
ఈ
అహంకారమునకు
కారణము
ఏమిటి?
ఇంత
విశాలమైన
ప్రపంచములో
ఈ
ప్రపంచంయొక్క
చిత్రపటంలో
మన
భారతదేశం
చాలా
చిన్నదిగా
కనిపిస్తుంది.
ఈ
భారతదేశంలో
మద్రాసు
రాష్ట్రం
చాలా
చిన్నదిగా
వుంటుంది.
ఈ
మద్రాసు
రాష్ట్రంలో
కొడైకెనాల్
చాలా
చిన్నదిగా
వుంటుండాది.
ఇంత
పెద్ద
కొడైకెనాల్లోపల
వ్యక్తి
అనేటువంటివాడు
చాలా
చిన్నవాడిగా
వున్నాడు.
ఇంత
చిన్నవాడు
ఇంత
విశాలమైన
ప్రపంచాన్ని
చూచి
అహంకారపడటానికి
ఏమి
కారణం?
ఈ
అహంకారమునకు
అజ్ఞానమే
మూలకారణం
లేక
ఈ
ప్రపంచంలో
వున్నటువంటి
దివ్యత్వమును
నేను
ఒక్కటే
అనేటువంటి
సత్యాన్ని
గుర్తించినటువంటి
వ్యక్తిలో
ఈ
అహంకారమునకు
అవకాశమే
వుండదు.
ఇందులో
రెండు
విధములైనటువంటి
విచారణలు
చెయ్యాలి.
ఇంత
విశాలమైనటువంటి
ప్రపంచంలో
నేనెంతటివాడను?
అనేటువంటి
విచారణ
చేస్తే
అహంకారమునకు
అవకాశం
వుండదు.
‘సర్వం
విష్ణుమయం
జగత్’
అంతా
భగవంతునియొక్క
స్వరూపమే.
నేనూ
భగవంతుని
స్వరూపమే
అనేటువంటి
విశాలమైన
భావాన్ని
అర్థం
చేసుకుంటే
అక్కడకూడను
అహంకారమునకు
అవకాశం
ఉండదు.
దీనికి
కారణం
ఏమిటని
విచారణ
చేస్తే
‘సర్వం
విష్ణుమయం
జగత్’
అనేటువంటి
తత్త్వము
అతనియందు
లేదు.
5
▾
Meaning
Keep
ఇంత
విశాలమైనటువంటి
ప్రపంచంలో
నేనెంతటివాడను
అనేటువంటియొక్క
భావము
తనయందు
లేదు.
ఈ
రెండు
భావములు
లేనటువంటి
వ్యక్తియే
అజ్ఞాని.
ఈ
అజ్ఞానంచేతనే
ఈ
అహంకారం
ఆవిర్భవిస్తుంది.
కనుకనే
ఈ
అహంకారంచేతనే
మానవుడు
అనేక
విధములైనటువంటి
ఇక్కట్లకు
గురియవుతున్నాడు.
ఇది
తనయొక్క
సంకల్పబలం
చేతనే
అభివృద్ధి
పర్చుకుంటున్నాడు.
సంకల్పములచేతనే
కర్మలు
జరుగుతున్నాయి.
కర్మలచేతనే
భావములు
కలుగుతున్నాయి.
భావములచేతనే
శీలము
కుదురుతూ
వుంది.
శీలముచేతనే
నిజమైనటువంటి
ప్రాప్తి
లభిస్తుంది.
కనుక
ఈ
దివ్యమైనటువంటి
ప్రాప్తి
మనకు
లభించాలంటే
శీలమును
అభివృద్ధి
పరచుకోవాలి.
శీలమును
అభివృద్ధి
పరచుకోవాలంటే
మనలో
పవిత్రమైన
భావము
అభివృద్ధి
కావాలి.
ఈ
భావములు
అభివృద్ధి
కావాలంటే
సత్కర్మలు
మనం
చేయాలి.
ఈ
సత్కర్మలు
చేయాలంటే
మొట్టమొదట
మనలో
ఉన్నటువంటి
సంకల్పాలు
పవిత్రమైనవిగా
ఉండాలి.
కనుకనే
సంకల్పములే
అన్నిటికీ
మూలకారణం.
ప్రతి
మనస్సుయొక్క
స్వరూపమునకు
సంకల్పములే
మూలకారణము.
‘సంకల్పవికల్పాత్మకం
మనః’
అన్నారు.
ఇది
బట్ట.
ఏ
రీతిగా
తయారైంది.
పడుగు,
పేక
రెండింటియొక్క
ఏకత్వంచేతనే
బట్ట
తయారైంది.
ఇటువైపున
పోవాలి,
అటువైపున
రావాలి.
దీనినే
పడుగు,
పేక
అంటారు.
కనుక
మానవత్వం
సంకల్పవికల్పములచేతనే
కూడి
వుంటుండాది.
కానీ
సంకల్పం
ప్రథమమైనటువంటిది.
వికల్పం
దానియొక్క
వికారమైనటువంటిది.
ఈ
వికారాన్ని
మనం
అనుసరించకూడదు,
సంకల్పాన్నే
మనం
అనుసరించాలి.
‘సం’కల్పము
అనగా
హృదయ
సంబంధమైనటువంటి
కల్పన
రావాలి.
‘సం’
అనగా
సర్వేశ్వరునియొక్క
తత్త్వము.
సాలోక్యము,
సారూప్యము,
సామీప్యము,
సాయుజ్యము
అన్నీ
కూడను
సర్వేశ్వరత్వానికి
సంబంధించినటువంటివే.
అదియే
సత్,
చిత్.
సత్
అనగా
ఏమి?
శాశ్వతమైనటువంటిది.
ఎప్పటికీ
మార్పు
చెందనటువంటిది.
అలాంటి
మార్పు
చెందనటువంటి
దాని
సంకల్పం
మన
నుంచి
రావాలి.
మానవునికి
అదియే
ప్రధానమైనటువంటి
సంకల్పము.
సంకల్పములు
సక్రమమైనటువంటివిగా
వున్నప్పుడు
మనయొక్క
స్థితి
సరియైనటువంటి
రీతిగా
వుంటుంది.
మన
స్థితి,
గతి
కూడా
సరిగ్గా
వుంటుంది.
6
▾
Meaning
Keep
మన
సంపత్తి,
అనగా
ఏమిటి?
ఈ
సంపత్తి
అనగా
లౌకికమైన,
భౌతికమైన,
ప్రాకృతమైనటువంటి
సిరిసంపదలు
కాదు.
సంపత్తి
అనగా
సద్విచారము,
సత్సంకల్పము,
సద్భావము,
సత్నడకలు
ఇలాంటివన్నీ
కూడను
సత్సంపత్తిగా
వుంటుంటాయి.
శాశ్వతమైనటువంటి
సంకల్పాలు
మనలో
అభివృద్ధి
కావాలి.
అయితే
ఇలాంటి
శాశ్వతమైన
సంకల్పాలు
రావాలంటే
జన్మజన్మాల
పుణ్యముయొక్క
ఫలితంచేతనే
మానవునియందు
భగవత్
అనుగ్రహము
ప్రాప్తిస్తుంది.
పుణ్యఫలమును
ప్రోగు
చేసుకొనే
మానవుడు
పుడుతున్నాడు.
మానవుడు
పుట్టడానికి
మూలకారణము
పుణ్యఫలమే.
కానీ
పుణ్యఫలంతో
పుట్టినటువంటి
మానవుడు
పాపములెందుకు
చేయాలి?
ఈ
కర్మఫలమునకు,
పాపములు
చేయడానికి
మూలకారణము
ఏమిటి?
దీనికి
తనయొక్క
వాంఛలే.
ప్రకృతిని
చూస్తున్నాడు
కన్నులతో,
ప్రకృతిని
చూడు,
ఏవిధంగా
చూడాలి?
‘సమ్యక్దృష్టి’
పవిత్రమైన
దృష్టితో
చూడాలి.
కానీ
ఈ
పవిత్రదృష్టి
తనలో
లేకపోవటంచేత
ప్రకృతిని
వికారంగా
చూస్తున్నాడు.
ప్రకృతిని
వికృతిగా
చూస్తున్నాడు.
ఇదియే
తనలో
వున్నటువంటి
దోషము.
‘సర్వం
విష్ణుమయం
జగత్’
‘విశ్వం
విష్ణుమయం
జగత్’
ఈ
విశ్వం
కేవలం
ఒక
కార్యము;
విష్ణువు
కారణము.
కార్యకారణస్వరూపమే
ఈ
జగత్తు.
విశ్వం-విష్ణుస్వరూపం
కనుక
మనం
ఈ
జగత్తును
విశ్వస్వరూపునిగా
చూడాలి.
‘పశ్యన్నపి
చ
న
పశ్యతి
మూఢో
మూఢో
మూఢో’
బయట
దృష్టిని
మాత్రమే
చూస్తున్నాడు.
బయట
దృష్టిని
చూచేటువంటిది
పశువు.
విష్ణురూపముతో
చూచేవాడు
మానవుడు.
కనుకనే
పవిత్రమైనటువంటి
దృష్టిని
మనము
‘సమ్యక్దృష్టి’
పవిత్రమైనటువంటి
భావంతో
చూడాలి.
ఆ
దృష్టితో
మనం
చూచినపుడు
సర్వము
మనకు
బ్రహ్మమయంగానే
వుంటుంది.
ఎన్ని
విధములైనటువంటి
ఆటంకములు
సంభవించినప్పటికిని
ఈ
ఆటంకములకే
మాత్రము
అడ్డు
తగలదు.
ఉదాహరణకు
అనిల్‌కుమార్
ఉన్నాడు.
ఆయన
కన్నులకు
అడ్డంగా
కొన్ని
అద్దాలు
పెట్టుకున్నాడు.
కానీ
కన్నులకు
అడ్డంగా
గ్లాసులు
వున్నాయి
గానీ
దృష్టికి
సహాయంగాను
వుంటున్నాయి.
అదే
విధముగనే
మన
దృష్టికి
ప్రేమ
అనే
అద్దాలు
ధరించినపుడు
ఈ
ప్రేమ
అనేటువంటి
అద్దములు
మన
దృష్టికి
అడ్డంగా
వుంటుండాది
కానీ
బ్రహ్మము
అనేటువంటి
దృష్టికి
అడ్డము
లేదు.
7
▾
Meaning
Keep
Also in his talks
(16)
19 June 1973
Friendship: Its Real Principle
3 September 1988
The body itself is a temple!
17 October 1988
To Attain God, the Embodiment of Prema, We Must Make Prema Itself Our Support
28 June 1989
All the World Is Filled with Brahman
28 October 1989
Prema Itself Is God
20 October 1990
The day that wrought the great change
24 May 1991
Isaavaasya Upanishad - Renunciation And Pleasure
21 August 1996
The Five Elements Are the Very Forms of the Paramātma
21 October 1996
In God's Creation Everything Is Pure!
25 August 1997
Mamaivāṁśo jīvaloke...
17 April 1998
Desires are the root of unrest
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
27 September 1998
Ānanda Alone Is Man's Own Home
1 January 2000
Virtue is the adornment of man
17 October 2003
Develop a feeling of brotherhood towards all
15 April 2004
The principle of Prema is Divinity itself
కనుకనే
ప్రేమదృష్టికి
మనం
ఏవిధమైనటువంటి
అడ్డు
తగలడానికి
వీలు
కాదు.
మానవునికి
ప్రధానమైనటువంటి
ప్రాణము
ప్రేమనే.
ప్రేమనే
లేకుండిన
బిడ్డనైనా
తల్లి
ప్రేమించదు.
భార్యనైనా
భర్త
ప్రేమించడు.
మిత్రుడైనా
మరొక
మిత్రుడిని
ప్రేమించడు.
జీవుడైనా
దేవుడిని
ప్రేమించడు.
కనుకనే
ప్రేమనే
జీవుడిని
దేవునిగా
మారుస్తుంది.
కనుక
మానవత్వాన్ని
దైవత్వంగా
మార్చడానికి
ప్రేమ
ఒక్కటే
ప్రాణము.
కానీ
మానవుని
హృదయంలోపల
ప్రేమ
సంకుచితమైనటువంటి
ప్రేమగా
నిలిచిపోయింది.
కనుక
కొన్ని
సమయములోపల
ద్వేషము
అనేటువంటిది
ద్వేషము
వస్తుంది
ఈ
హృదయములో.
హృదయం
అనేటువంటిది
సింగిల్
సోఫా
లాంటిది.
అక్కడ
ప్రేమ
కూర్చుంటే
మరొకరు
కూర్చోడానికి
అవకాశం
లేదు.
ద్వేషమక్కడ
ప్రవేశించడానికి
వీలే
లేదు.
అసూయ
ప్రవేశించడానికి
అసలే
వీలు
లేదు.
This
is
not
a
musical
chair,
single
sofa,
single
sofa.
దీనిలో
భగవంతుడు
ఒక్కడు
మాత్రమే
కూర్చోవాలి.
అది
కూర్చున్నప్పుడే
ఇది
పవిత్రమైనటువంటి,
విశాలమైనటువంటి
హృదయంగా
మారుతుంది.
కనుక
ఈనాటి
మానవునకు
ఈ
విధమైనటువంటి
ప్రేమతత్వం
అర్థం
చేసుకోలేకపోవటం
చేత
హృదయంలో
ప్రవేశం
ఇవ్వలేక
పోవటం
చేత
తనయొక్క
హృదయమంతా
అనేక
విధములైనటువంటి
అశాంతికి
గురి
అవుతుండాది.
ప్రేమ
తత్వమే
శాంతికి
మూలం
కనుకనే
ఆనాటి
గోపికలందరూ
కూడను
ఏవిధంగా
ప్రార్థిస్తూ
వచ్చారు?
ప్రేమతత్త్వాన్ని
వారు
ప్రార్థిస్తూ
వచ్చారు.
ప్రేమరహిత
మరుభూములలో
ప్రేమాంకురములు
పెంపొంద
ప్రేమావేశముతో
ప్రేమసుధావర్షము
వర్షింపగ
ప్రేమనదులు
ప్రవహింపగ
మురళిగానముసేయగదే
కృష్ణా
గానము
సేయగదే
నీయొక్క
మురళిగానము
చేతనే
ఈ
ప్రేమవర్షం
కురవాలి.
ఈ
ప్రేమవర్షం
చేతనే
ప్రేమ
మొక్కలు
పండాలి.
8
▾
Meaning
Keep
His poems 370
Also in his talks
(1)
22 July 1994
The fullness of Prema
ఈ
ప్రేమ
మొక్కలు
పండినప్పుడే
విశ్వమునకు
శాంతిని
అందించగలవు.
అందరూ
ప్రేమమయులే,
అందరూ
ప్రేమమయులే.
ఇక
ద్వేషమెక్కడ
ఉంటుంది?
మదాలస
తనకు
జన్మించినటువంటి
పుత్రులందరికికూడను
పుత్రభావం
అనేటువంటిది
లేకుండా
కేవలం
జ్ఞానభావంచేత
వారిని
అన్ని
విధములా
పోషించుకుంటూ
వచ్చింది.
‘నాయనా!
నీవు
శరీరధారివి
కాదు.
నీయొక్క
నిజమైన
రూపము
ఆత్మనే’
చిన్న
బిడ్డను
తొట్టిలో
పండబెట్టి
అనేక
విధములైనటువంటి
జ్ఞానభావంచేత
వారిని
జోకొడుతూ
వచ్చేటువంటిది.
ఆ
విధంగా
వచ్చి
ఒక్కొక్క
కుమారుని
ఎనిమిదో
సంవత్సరము
వచ్చేటప్పటికే
అరణ్యమునకు
పంపుతూ
వచ్చింది.
ఈ
విధంగా
ముగ్గురు
కుమారులను
పంపించింది.
నాలుగో
కుమారుని
కూడను
అదేవిధంగా
అరణ్యానికి
పంపటానికి
నిర్ణయించింది.
కానీ
మదాలస
భర్త
వచ్చాడు.
‘మదాలసా!
నా
తర్వాత
ఈ
రాజ్యమునేలే
వారెవరు?
రాజులేని
రాజ్యము
గ్రుడ్డి
రాజ్యంగా
వుంటుంది.
కనుక
వీనిని
నీ
దగ్గర
పెట్టుకోవడానికి
వీలు
కాదు.
కనుక
వీనిని
ఏ
మాత్రమూ
నీ
దగ్గర
పెట్టను’
అని
ఆమెతో
చాలా
పోట్లాడి
ఆ
బిడ్డను
తాను
తీసుకున్నాడు.
ఈమెకూడా
రాజుకు
చెప్పింది.
‘రాజా!
నేను
పిల్లలకు
ఉపకారమే
చేస్తున్నాను
కానీ
అపకారము
చేయుట
లేదు.
పిల్లలకు
ఏ
విధమైన
బోధలు
చేస్తున్నాను?
నేను
ఏ
ప్రపంచ
సంబంధమైనటువంటి
బోధలూ
చెయ్యటంలేదు.
ఓంకారమనియేటి
ఒక
తొట్టిలోను
తత్త్వమసియనియేటి
పరుపు
తా
పరచి
ఎరుకనే
బాలుని
ఏమరక
ఉంచి
ఏడు
జగముల
వారు
ఏకమై
ఊప
జో!జో!..
ఇవి
పవిత్రమైనటువంటి
ఆత్మజ్ఞానానికి
సంబంధించినటువంటివి.
కానీ
నేను
బోధించేది
‘మాయమ్మ
నా
తోడ
బుట్టినది
కాదు.
తగవుకే
పోదాము
ధర్మ
చావిటికి.
జో!జో!
ఈ
విధమైనటువంటి
భౌతికమైనటువంటి
రాగాలతో
వారిని
నిద్రింప
చేయటంలేదు.
ఈవిధంగా
ప్రాపంచికమనేది
కేవలం
నెగెటివ్.
దివ్యమైన
భావాలతో
కూడినటువంటిది
పోజిటివ్.
పిల్లలను
పోషించవలసిందే,
పిల్లలను
ప్రేమించవలసిందే
వారి
ఆరోగ్యానికి
తగినటువంటి
అనుకూలాలు
అందించాల్సిందే.
కానీ
వారియొక్క
లక్ష్యాన్ని
మాత్రము
మార్చకూడదు.
9
▾
Meaning
Keep
అదియే
దైవలక్ష్యము.
ఇదియే
మానవత్వములో
దివ్యత్వం.
మానవుడుగా
పుట్టి
ఇంత
కాలమైనప్పటికినీ
ఎన్నో
సంవత్సరములైనప్పటికిని,
ఎన్నో
లక్షల
సంవత్సరములైనప్పటికినీ
కాని
మానవుని
మానవుడే
ఇంకా
గుర్తించలేదు.
తనను
తాను
గుర్తించుకోలేనటువంటి
మానవుడు
దైవాన్ని
ఏ
రీతిగా
గుర్తించగలడు?
కనుక
మొట్టమొదట
మానవత్వాన్ని
మనం
గుర్తించాలి.
అప్పుడే
దివ్యత్వం
అనేటువంటిది
సాక్షాత్కారిస్తుంది.
కనుక
మనము
మానవత్వాన్ని
మొట్టమొదట
గుర్తించడానికి
మానవులయొక్క
భావములను
అభివృద్ధి
పరచుకోవాలి.
మానవతా
గుణములు
ఏమిటి?
అదియే
సత్యం.
దీనినే
వేదం
చెప్పింది.
‘సత్యంవద,
ధర్మంచర’
సత్యమునే
పలుకు,
కానీ
దురదృష్టవశాత్తు
ఈనాడు
ఏమయిందంటే
సత్యం
వధ
-
దానిని
చంపుతున్నారు.
ఏ
వ్యక్తి
అయినా
కూడను
సత్యాన్ని
పలకడానికి
ప్రయత్నం
చేయటంలేదు.
ఇంక
‘ధర్మం
చర’
నీవు
ధర్మాన్ని
ఆచరించు
అని
చెప్పాడు.
కానీ
ఈనాటి
ధర్మాన్ని
చెరసాలలో
పెట్టేసారు.
‘ప్రేమ’
-
ప్రేమ
సంకుచితమైనటువంటిదిగా
వున్నాది.
‘శాంతి’
-
శాంతి
అనేటువంటిది
కూడా
సంకుచితమైనటువంటిదిగా
వుంటున్నాది.
సత్యధర్మశాంతిప్రేమలు
అన్నీ
కూడను
ఏకత్వంతో
కూడినప్పుడే
మనకు
ప్రకాశం
అనేటువంటిది
లభిస్తుంది.
ప్రేమస్వరూపులారా!
ఇక్కడ
ప్రకాశం
వుంది.
ఈ
ప్రకాశానికి
మూలకారణం
ఏమిటి?
బల్బు.
ఈ
బల్బుకి
మూలకారణం
ఏమిటి?
వైరు
-
వైరుకు
మూలకారణం
ఏమిటి?
కరెంటు
-
ఈ
కరెంటు
అనేటువంటిది
వైరుద్వారా
వచ్చి
బల్బులో
చేరినప్పుడు
ప్రకాశం
మనకు
వస్తుంది.
కనుక
సత్యమే
కరెంటు;
ధర్మమే
వైరు;
శాంతియే
బల్బు;
ప్రేమనే
లైటు.
కనుక
ఈ
ప్రేమ
అనేటువంటి
ప్రకాశాన్ని
మనం
పొందాలనుకున్నప్పుడు
శాంతి
అనేటువంటి
బల్బును
సక్రమమైనటువంటిదిగా
వుంచుకోవాలి.
ఈ
బల్బు
చక్కగా
వుండినప్పటికినీ
వైరు
సక్రమంగా
లేకపోతే
అందులో
కరెంటు
ప్రసరించదు.
దేహము-మనస్సు-వాక్కు
ఏకం
కావాలి
ప్రాచీన
కాలమునందు
భోజనం
చేసే
ముందు
‘అన్నం
బ్రహ్మ-రసోవై
విష్ణుః’
.
ఇంక
పదార్థమే
దీనియొక్క
సంపూర్ణమైనటువంటి
తత్త్వము.
శక్తియే
ఈశ్వరుడు.
ఈ
విధంగా
ప్రార్థించి
వారు
భుజించేటువంటివారు.
10
▾
Meaning
Keep
అనగా
దీనియొక్క
అంతరార్థమేమిటి?
‘ఓ
భగవంతుడా!
ఈ
అన్నమనేటువంటి
స్థూలమైనటువంటి
స్వరూపంతో
నా
దేహాన్ని
కాపాడుతూ
వుంది.
ఈ
దేహముయొక్క
సిరిసంపదలంతా
కూడను
అనేక
రకములైనటువంటి
శక్తితో
దీనిని
కాపాడుతూ
వుంది.
ఈ
దేహములో
సంచరించేటువంటి
రసమైనటువంటిది
నాకు
మంచి
మనసుగా
రూపొందుతుంది.’
స్థూలమైనటువంటి
ఆహారము
దేహంగా
తయారవుతుంది.
సూక్ష్మమైనటువంటి
ఆహారం
మనసుగా
మారుతుంది.
అత్యంత
సూక్ష్మమైనటువంటి
రసము
వాక్కుగా
వస్తుంది.
కనుక
దేహము,
మనస్సు,
వాక్కు,
ఈ
మూడింటియొక్క
ఏకత్వమే
మానవుడు.
The
proper
study
of
mankind
is
man
అన్నారు
అనగా
సంకల్పము,
వాక్కు,
కర్మ
మూడింటియొక్క
ఏకత్వమే.
దీనినే
త్రిపుటి
అని
వేదాంతం
చెపుతూ
వచ్చింది.
అనగా
హృదయము
అనగా
సంకల్పము;
వాక్కు,
క్రియ
ఈ
మూడింటి
ఏకత్వమే
మానవత్వము.
కానీ
ఈనాటి
మానవత్వములో
ఈ
మూడు
ఏకం
కావడం
లేదు.
‘మనస్యన్యత్,
వచస్యన్యత్,
కర్మణ్యన్యత్
దురాత్మనామ్’
ఎవడు
వాడు
దురాత్మనామ్.
‘మనస్యేకమ్,
వచస్యేకమ్,
కర్మణ్యేకమ్
మహాత్మనామ్’.
కనుక
మూడింటియొక్క
ఏకత్వమే
మహత్తరమైనటువంటి
శక్తి.
ఈ
మూడింటియొక్క
భిన్నత్వమే
కేవలం
దురాత్మతత్త్వము.
ఆత్మ
ఒక్కటే
అయినప్పటికినీ
మహాత్మ,
దురాత్మ
అనేటువంటి
రెండు
పేర్లు
వహిస్తూ
వున్నాది.
ఈ
దురాత్మతత్త్వానికి
ఏమాత్రం
ఏనాటికి
శాంతి
లభించదు.
కారణమేమనగా
సత్యం
అనే
కరెంటు
అక్కడ
లేదు.
కరెంటు
ఫెయిల్
అయింది.
ఎన్ని
జనరేటర్లు
పెట్టుకున్నా
కానీ
ఈ
కరెంటు
రావటం
లేదు.
కానీ
ఈ
జనరేటర్
కరెంటును
జనరేట్
చేయాలి.
అప్పుడే
మానవత్వం
అనేటువంటిది
చక్కగా
ప్రకాశిస్తుంది.
మానవత్వమనగా
జనరేషన్
అనగా
సర్వులుకూడను
ఏకత్వముగా
భావించేటువంటిదే
జనరేషన్.
అందరూ
ఏకమైనప్పుడు
అదియే
ఒక
జనరేటర్‌గా
అవుతుంది.
ఎక్కడ
కూడా
కరెంటు
ఫెయిల్
కాదు.
అనగా
ఏమి?
అనేకత్వములో
ఉన్నటువంటి
ఏకత్వము
ప్రకాశిస్తూ
వుంటాది.
ఒక్కొక్క
వ్యక్తిలో,
బల్బులో
వుండినటువంటి
కరెంటు
వుండినప్పటికిని
బల్బు
ఫెయిల్
అయిపోవచ్చును.
ఒక
చిన్న
ఉదాహరణము.
అన్నిటికిని
మైన్స్విచ్
ఒక్కటే.
మన
రూములోపల
ఒక్కొక్క
లైటు
ప్రత్యేకంగా
పెట్టుకుంటున్నాము.
ఒకవేళ
మెయిన్స్విచ్
ఆఫ్
చేస్తే
అన్ని
రూములు
చీకటైపోతాయి.
11
▾
Meaning
Keep
కాని
మెయిన్స్విచ్
ఆన్
చేస్తే
అన్ని
రూములలోనూ
లైటు
వస్తుంది.
కనుకనే
ఈ
మెయిన్
స్విచ్
ఏమిటది?
అదియే
హృదయము.
హృదయములో
మనం
ప్రేమను
అభివృద్ధి
పరచుకుంటే
అన్ని
హృదయములలో
కూడను
ప్రేమ
అభివృద్ధి
అవుతుంది.
అన్ని
హృదయాలు
కూడను
ప్రకాశిస్తూ
వుంటాయి.
కనుక
ఈనాడు
మనం
చేయవలసినటువంటి
సాధన
ఏమిటి?
కేవలం
తన
నిమిత్తమై,
తన
కుటుంబ
నిమిత్తమై
కాదు;
సమాజ
నిమిత్తమై
మనము
ప్రార్థన
చేయాలి.
అనగా
మన
ప్రేమను
మన
హృదయం
నిండుగా
నింపుకోవాలి.
ఈ
నింపుకున్న
ప్రేమను
ప్రతి
మానవునికి
పంచాలి.
ఏ
విధంగా
నింపుకోవాలి?
సత్యధర్మముల
చేతనే
నింపుకోవాలి.
ఈ
ట్యాంకు
అనేటువంటి
దానిలో
సత్యధర్మములుంటే
అన్ని
ట్యాప్స్‌లో
అంతా
సత్యధర్మములే
వస్తాయి.
ఏమిటి
ఈ
ట్యాప్స్?
మన
దృష్టి,
చెవులు,
వాక్కు,
చేతులు
ఇవన్నియు
ట్యాప్లే.
హృదయమనేటువంటి
దానిలో
ప్రేమమయమైనటువంటి
జలమును
నింపుకున్నప్పుడు
అన్ని
పంచభూతముల
యందు
కూడను
ప్రేమనే
ఆవిర్భవిస్తుంది.
మనం
ఏం
చేసినా
సమాజం
అంగీకరిస్తుంది.
కనుకనే
సమాజ
క్షేమాన్ని
మనము
దృష్టియందుంచుకోవాలి.
కేవలం
నా
స్వార్థమే
నాకు
ప్రధానమని
అనుకోకూడదు.
Self
is
lovelessness,
love
is
selflessness.
Love
lives
by
giving
and
forgiving;
self
lives
by
getting
and
forgetting.
ఈ
సత్యాన్ని
మనం
మొట్టమొదట
గుర్తుంచుకోవాలి.
ప్రేమతో
వుండినప్పుడు,
ప్రేమను
సాధించడానికి
ప్రయత్నం
చేసినపుడు,
ప్రేమనే
లక్ష్యంలో
వుంచుకున్నప్పుడు
ఎక్కడా
మనకు
దుఃఖము,
కష్టము,
విచారము
అనేటువంటిది
మనకు
కనిపించదు.
ఆధ్యాత్మికంలో
ప్రేమే
ప్రధానం
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
మీరు
అనేక
రకములైనటువంటి
సాధనలు
చేస్తున్నారు.
మీరు
సాధనలు
చేసినా,
చేయకపోయినా
అన్నిటికిని
మూలాధారమైనటువంటిది
ప్రేమతత్త్వము.
ప్రేమ
లేకుండా
ఏ
సాధన
చేసినప్పటికిని
అది
కృత్రిమమైనటువంటిదే.
అదంతా
ఆర్ట్యే,
ఆర్ట్యే,
ఆర్ట్యే.
ప్రేమతో
కూడినటువంటిదే
హార్ట్.
Heart
is
inside,
art
is
outside.
కాబట్టి
ఈ
ఆర్ట్
అంతా
హార్ట్
నుంచి
వచ్చినటువంటిదే.
కనుక
మైన్స్విచ్ని,
హార్ట్‌ని
మీరు
అభివృద్ధి
పరుచుకోండి.
మైన్స్విచ్ని
సరైనటువంటి
స్థితిలో
వుంచుకోండి.
ఈ
ప్రేమతో
మనం
వుంటే
ఏ
సాధనలు
చెయ్యనక్కరలేదు.
12
▾
Meaning
Keep
Also in his talks
(2)
7 July 1990
The Guru within
9 September 1992
Recognising the principle of the Ātma is itself spirituality
అనేకమంది
బోధిస్తున్నారు
ఈనాడు
లోకములోపల
కానీ
వారి
బోధనలు
వారికే
తృప్తి.
కానీ
ఆధ్యాత్మికంలో
ప్రేమతత్త్వం
ఒక్కటి
తప్ప
మరి
ఏ
బోధనలు
కూడను
ప్రయోజనం
లేదు.
భజనలు
చేయి,
జపములు
చేయి,
ధ్యానము
చేయి,
యోగము
చేయి
ఇవన్నీ
చెపుతుంటారు.
యోగమంటే
ఏమిటో
వారికే
తెలియదు.
ధ్యానమంటే
ఏమిటో
వారికే
తెలియదు.
నా
ఉద్ధేశ్యమేమిటంటే
జీవితమంతా
ఒక
ధ్యానము.
ఎందుకంటే
ఇది
way
of
life.
ఏదైనా
ఒక
పుస్తకము
చదవాలంటే
అక్కడ
meditation
చేయకుండా,
concentrate
చెయ్యకుండా
పుస్తకం
చదవలేము.
ఏదైనా
ఒక
ఉత్తరము
వ్రాయాలనుకుంటే
దానిని
వ్రాయడానికి
concentrate
చెయ్యకపోతే
ఉత్తరము
వ్రాయలేము.
Walking,
reading,
talking,
eating,
writing
everything
is
meditation.
మీరు
ఇక్కడనుంచి
బయటకు
పోవాలంటే
‘ఏది
దారి?’
అనేటువంటిది
లక్ష్యము
లేకపోతే
మీరు
ఎక్కడకు
పోతారు?
కాబట్టి
దారి
ఎక్కడ
ఉంది?
అని
తెలుసుకుని
దారిద్వారా
పోవడమే
ధ్యానం.
అనగా
మనకు
అభ్యంతరములు
కలగనటువంటి
మార్గమును
అవలంబించటమే
ధ్యానం.
ఇంకా
కొంతమంది
సుఖధ్యానం
అంటారు.
ఏమిటి
సుఖము?
శారీరక
సుఖమా?
మానసిక
సుఖమా?
ఇంద్రియ
సుఖమా?
బుద్ధి
సుఖమా?
కాదు
కాదు.
హృదయం
సుఖముగానే
ఉంటుంది.
ఈ
దేహమునకు
సుఖమనేది
లేదు.
ఎంత
స్టడీగా
కూర్చున్నప్పటికిని
ఏదో
ఒక
విధమైనటువంటి
చలనం
జరుగుతూనే
వుంటుంది.
Slow
and
steady
wins
the
race.
What
is
race?
Life
is
race.
What
is
slow?
Haste
makes
waste,
waste
makes
worry,
so
do
not
be
in
a
hurry.
తొందరపాటు
నీవు
పడవొద్దు.
ఏదో
చిక్కినవన్నీ
నువ్వు
సాధనలూ
చేయవద్దు.
ఏది
చేసినా
దైవసాధనే.
అంతా
దైవ
స్వరూపమే.
ఎవరితో
నేను
మాట్లాడినా
దైవముతో
మాట్లాడినట్లే.
కాబట్టి
ఎక్కడ
నేను
వెళ్ళినప్పటికిని
దైవ
ప్రదక్షిణయే.
ఏ
మాట
చెప్పినా
దైవ
మంత్రమే.
ఈ
విధమైనటువంటి
సర్వం
విష్ణుమయం
జగత్
అనేటువంటి
ధర్మంగా
పెట్టుకున్నప్పుడు
ఏ
విధమైనటువంటి
సాధనలూ
అక్కరలేదు.
అయితే
అట్టి
పవిత్రమైన
ప్రేమ
మనలో
అభివృద్ధి
అయ్యేంతవరకు
కొన్ని
సాధనలు
మనం
చేయాలి.
క్రమక్రమేణా
‘శ్రేయోహి
జ్ఞానమభ్యాసాత్,
జ్ఞానాత్
ధ్యానం
విశిష్యతే,
ధ్యానాత్
కర్మ
ఫలత్యాగః,
త్యాగాత్శాంతి
రనంతరమ్’
13
▾
Meaning
Keep
‘శ్రేయోహి
జ్ఞానమభ్యాసాత్’
-
సాధన
మనం
అభ్యాసంలో
పెట్టుకోవాలి.
ఈ
సాధనద్వారా
ధ్యానం
అభివృద్ధి
పరచుకోవాలి.
ఎంతవరకు
ఈ
ధ్యానము?
ధ్యానమనేటువంటిది
జ్ఞానం
కలిగేంతవరకు
ధ్యానం
చేయాలి.
జ్ఞానం
వచ్చిన
తర్వాత
ధ్యానం
అక్కరలేదు.
ఈ
జ్ఞానమే
శాంతికి
మూలకారణము.
కనుక
మనము
ఈ
సరియైనటువంటి
స్థితిని
మనం
పొందాలనుకున్నప్పుడు
అన్నిటికిని
ప్రేమనే
మూలకారణం.
ఈనాటి
మానవుడు
క్షణమైనా
స్థిరమైనటువంటి
మనసుతో
లేడు.
యోగమంటే
ఏమిటి?
‘చిత్తవృత్తి
నిరోధకః’
ఇదే
పతంజలి
యోగము.
చిత్తవృత్తిని
ఎట్లు
నిరోధిస్తావు?
ఇది
వీలుకాదు.
ఎందుకంటే
చిత్తమునకు
అది
సహజము.
కొండపైన
నీరు
పోసినా
కానీ
క్రిందికి
దిగుతాయి.
గుంతలో
నిప్పు
పెట్టినా
పైకే
వస్తుంది.
కాబట్టి
నిప్పుయొక్క
లక్షణము
పైకి
ఉన్నత
స్థాయికి
పోవటమే.
నీటియొక్క
లక్షణము
క్రింద
భాగమునకు
దిగటమే.
కాబట్టి
మన
ప్రాపంచిక
కోరికలంతా
నీరు
వంటివే.
ఎక్కడ
పెట్టినా
అది
క్రిందికే
దిగుతూ
ఉంది.
కానీ
అది
నెగెటివ్.
పోజిటివ్
అనేటువంటిది
జ్ఞానము.
అది
గుంతలో
పెట్టినా
కానీ
పైకి
వస్తుంటాది.
ఈ
విధమైనటువంటి
తత్త్వాన్ని
మనం
చక్కగా
అర్థం
చేసుకుంటే
పిచ్చి
మార్గంలో
పోయి
కాలమును
వ్యర్థము
చేసుకోనక్కరలేదు.
అయితే
ఏది
పోయినా
మనం
సంపాయించుకోవచ్చునని
చెప్పాను.
ధనము
పోతే
సంపాయించుకోవచ్చును.
భూమి
పోతే
సంపాయించుకోవచ్చును.
మిత్రుడు
పోతే
సంపాయించుకోవచ్చును.
భార్య
పోతే
సంపాయించుకోవచ్చును.
కానీ
దేహం
పోతే
తిరిగి
సంపాయించుకోలేము.
కానీ
ఈ
దేహము
దేని
కోసమని?
దైవమును
చేరే
నిమిత్తమై
ఈ
దేహము
కావాలి.
కనుక
దానిని
చేరేంతవరకు
దీనిని
కాపాడుకోవాలి.
నిద్రాహారములు
మాని
ఏదో
కొన్ని
సాధనలు
సాధనలని
చేసుకుంటే
దేహం
క్షీణించిపోతుంది.
‘భిక్షాన్నం
దేహరక్షార్థం’,
‘వస్త్రం
శీతనివారణం’.
కాలమునకు
తగినట్లుగా
ఆహారము
స్వీకరించాలి.
వాతావరణమునకు
తగినట్లుగా
వస్త్రం
ధరించాలి.
ఇవి
రెండూ
దేని
కోసము?
దేహాన్ని
సంరక్షించుకునేందుకే,
దైవత్వాన్ని
అనుభవించేందుకే.
14
▾
Meaning
Keep
కనుక
దైవత్వాన్ని
అనుభవించే
నిమిత్తమై
దేహాన్ని
మొట్టమొదట
మనం
కాపాడుకోవాలి.
సర్వకర్మ
భగవత్ప్రీత్యర్థం
‘శరీర
మాద్యం
ఖలు
ధర్మ
సాధకం’
ఈ
సాధన
ఏమిటి?
దైవాన్ని
పొందటానికి
చేసే
సేవయే.
అదే
భజన,
ధ్యానము,
యోగము,
కర్మలు,
తపస్సు.
ఈ
తపస్సు
అంటే
ఏమిటి?
ప్రేమతో
సర్వ
కర్మలు
ఆచరించటము,
మనోవాక్కాయకర్మలు
మూడింటియొక్క
ఏకత్వమే
తపస్సు.
మనస్సు
ఒక
వైపున,
వాక్కు
మరొక
వైపున,
కర్మ
ఇంకొక
వైపున
పోయినప్పుడు
అది
తమస్సు
అవుతుంది.
తపస్సుకు,
తమస్సుకు
వుండిన
భేదాన్ని
మొట్టమొదట
గుర్తించాలి.
ప్రేమతో
నీవు
హృదయాన్ని
నింపుకుని
నీవు
ఏ
పనైనా
చేయి.
అదే
సాధన.
కనుకనే
వేదము
‘సర్వ
కర్మ
భగవత్
ప్రీత్యర్థం’
అని
చెప్పింది.
ఏ
పనైనా
చేయి
అదంతా
భగవత్ప్రీత్యర్థం
చేస్తున్నానుకో.
అంతకంటే
గొప్ప
ధ్యానం
ఎక్కడుంది?
అంతకంటే
గొప్ప
భజన
ఎక్కడుంది?
అంతకంటే
గొప్ప
పూజ
ఎక్కడుంది?
ఎక్కడా
లేదు.
ఒక
పూజ
గదికి
పోయి
ఒక
పటమును
పెట్టి
లేదా
ఒక
విగ్రహాన్ని
పెట్టి
దానికి
పూజ
చేసినంత
మాత్రమున
దైవానికి
అందదు.
దైవము
విశ్వస్వరూపుడు.
కాబట్టి
ఇట్టి
విశ్వస్వరూపుడైనటువంటి
పరమాత్మునికి
నీ
పూజ
ఎంత
మాత్రము?
అప్పుడు
నీవు
భగవంతుని
కూడను
సంకుచిత
పరచినటువంటి
వాడవవుతావు.
కాబట్టి
అనంత
స్వరూపుడైనటువంటి
భగవంతునికి
అనంతమైన
ప్రేమనే
మనం
యివ్వాలి.
అనంతమైన
ప్రేమను
పెంచుకోవటం
చాలా
సులభం.
ఎందుకంటే
దేహాభిమానం
వున్నంత
వరకు
సంకుచితమైన
ప్రేమ
వుంటాది.
అన్ని
దేహములు
దైవ
స్వరూపములే.
‘సహస్రశీర్షాపురుషః
సహస్రాక్ష
సహస్రపాత్’.
అందరిని
ప్లస్,
ప్లస్,
ప్లస్
చేసుకుంటూ
పో.
ఈ
విధంగా
చేసుకుంటూ
పోతే
అందరూ
మనం
ఒక్కటే.
నేను,
నా
కుటుంబం
అనుకుంటే
I
plus
you=we
అవుతుంది,
we+we
అంతా
ఒక్కటే
we
అయిపోతారు.
కాబట్టి
మనం
అందరం
ఒక్కటే.
అందరూ
దైవ
బిడ్డలే.
Brotherhood
of
man
and
fatherhood
of
God.
అందరూ
ఒక్క
తండ్రి
బిడ్డలే
,
ఒక్క
అంశమే.
దీనినే
భగవద్గీత
‘మమైవాంశో
జీవలోకే
జీవ
భూత
స్సనాతనః’
మీరందరూ
సనాతనులే.
నూతనులు
కాదు,
ప్రాచీనులు
కాదు,
సనాతనులే.
ఈ
సనాతనులైనటువంటి
మీరు
దైవాంశ
స్వరూపులే.
15
▾
Meaning
Keep
Also in his talks
(20)
23 November 1978
Faith Is the Foundation of the Spiritual Path
8 November 1986
Through the Name we can attain the Named!
30 September 1987
Understand the Sai principle well
5 March 1992
‘Adhyātmavidyā vidyānāṁ’
14 January 1995
Prema is like a compass
24 June 1996
A Life without Character Is a Lifeless Life
17 July 1997
The principle of the Ātma and divinity
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
2 April 2003
Leave the delusion of the body; think of God
18 May 2003
Prema is the very essence of the Paramātma
21 October 2003
I have come only to reveal your true nature
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
23 June 2005
Recognise the fundamental principle
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
21 May 2006
Service to society is itself the right sādhana
11 August 2006
Divinity is attained only through Prema for God
28 July 2007
Every human being is God
అందరూ
దైవ
స్వరూపులే.
ఆకారములు
వేరువేరుగా
ఉన్నాయి
కానీ
ఆత్మ
ఒక్కటిగానే
వుంటుంది.
ఇక్కడొక
బల్బు
వుంది.
అక్కడొక
బల్బు
వుంది,
ఇంకా
అక్కడంతా
బల్బులు
వున్నాయి.
బల్బులు
వేరు
వేరుగా
కనిపిస్తున్నాయి.
కానీ
కరెంటు
ఒక్కటే
అన్నిట్లోను.
ఆ
సత్యాన్ని
మనం
చక్కగా
గుర్తించాలి.
అప్పుడెట్టి
భేదములు
మనకు
ఆవిర్భవించవు.
కనుక
ఏకత్వాన్ని
పొందటానికి
తగినటువంటి
ప్రేమతత్త్వాన్ని
పెంచుకోవాలని
నేను
ఆశిస్తున్నాను.
భగవంతుడు
ప్రేమస్వరూపుడు.
ప్రేమ
తప్ప
మరొకటి
అక్కరలేదు.
ఇంక
ఏదైనా
వేర్వేరు
ఒక్కటిగా
వుంటే
అవంతా
గుణములుగా
ఏర్పడతాయి.
భగవంతుడు
గుణరహితుడు.
నిత్యానందం
పరమసుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం
గగనసదృశం
తత్వమస్యాదిలక్ష్యమ్
ఏకం
నిత్యం
విమలమచలం
సర్వధీసాక్షిభూతం
భావాతీతం
త్రిగుణరహితం
సద్గురుం
తం
నమామి.
గుణములు
లేనటువంటి
వానికి
ఇంక
వేరే
ఎందుకు
అవీ
ఇవీ
అని
మనం
పెట్టుకోవాలి?
ప్రేమ
గుణము
కాదు
అది
స్వభావము.
‘స్వ’
భావము
-
ఆత్మయొక్క
భావమే
ప్రేమ.
కనుక
ఇవన్నీ
గుణముల
క్రింద
తీసుకుని
సత్యవంతుడు,
ధర్మవంతుడు,
శాంతివంతుడు;
ఇవన్నీ
గుణములు.
ఈ
అన్నింటికిని
ప్రేమయే
ప్రధానము.
ప్రేమతో
నీవు
మాట్లాడు.
అదే
సత్యమవుతుంది.
ప్రేమతో
నీవు
పనులు
చేయి
అదే
ధర్మమవుతుంది.
ప్రేమచే
నీవు
హృదయాన్ని
చింతించు
అదే
శాంతి
అవుతుంది.
ప్రేమచేత
ప్రేమనే
ప్రకాశించుకో
అంతా
ప్రేమనే
అయిపోతుంది.
కాబట్టి
అన్నిటియందు
వుండినటువంటిది
కరెంటు
వలె
ప్రేమనే.
కనుక
ఇట్టి
ప్రేమను
ప్రతి
మానవుడు
దినదినాభివృద్ధి
పరచుకున్నప్పుడీ
జగత్తులో
ద్వేషములు,
ఏ
విధమైన
క్రోధములు,
అలజడులు
ఏ
మాత్రమూ
వుండవు.
Previous
←
Inquiry into the eternal and the transient is essential
Next
The Puṣṭi, Samiṣṭi and Pravāha Jīvas
→