Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2000 · Education and Educare
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Education and Educare
26 September 2000, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 279
Also in his talks
(2)
2 July 1989
The Ātma Principle Is Everywhere
3 September 1989
Fill the Mind with Mādhava
విమల
భావంబు
కలుగుటే
విద్యయగును
సరళగుణములు
కలుగుటే
చదువులగును
మమతభావము
పెంచుటే
సమతయగును
మంచి
నడతలు
ఉండుటే
మనిషియగును
ప్రేమస్వరూపులారా!
జుమ్సాయి
(థాయిలాండ్)
తన
ప్రసంగంలో
Education
(విద్య)
మరియు
Human
Values
(మానవతావిలువలు)
గురించి
ప్రస్తావించారు.
అసలు
‘ఎడ్యుకేషన్’
అంటే
ఏమిటి?
మానవతావిలువలంటే
ఏమిటి?
పుస్తకాలలో
ఉన్న
విషయాలను
విద్యార్థులకు
బోధించటం,
విద్యార్థులు
పుస్తకాలను
చదివి
డిగ్రీలు
పొందటం...
దీనిని
‘ఎడ్యుకేషన్’
అంటారు.
దీనిని
Bookish
knowledge
(పుస్తకజ్ఞానం)
అంటారు.
దీనిని
superficial
Knowledge
(మిడిమిడిజ్ఞానం)
అని
కూడా
చెప్పవచ్చు.
ఇది
కేవలం
బాహ్యమైనది.
ఈనాటి
విద్యార్థులందరూ
ఇలాంటి
విద్యనే
అభ్యసిస్తున్నారు.
మానవతా
విలువలు
‘ఎడ్యుకేర్’
అనగా,
మన
లోపలినుండి
బయటికి
తీయటమని
అర్థం.
ప్రతి
మానవుని
యందు
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ,
అహింసలనే
మానవతావిలువలు
దాగియున్నవి.
ఇవి
బయటినుండి
లభించునవి
కావు;
లోపలినుండి
ఆవిర్భవించునవి.
తనలోనే
దాగియున్న
ఈ
పవిత్రమైన
గుణములను
మానవుడు
మరచిపోవటంచేతనే
వాటిని
బయటికి
తీయలేకపోతున్నాడు.
బయటికి
తీయటమంటే
ఏమిటి?
ఆచరణలో
పెట్టటమే.
మానవునియొక్క
జీవశక్తికి
వేదము
‘సత్యము’
అని
పేరు
పెట్టింది.
సత్యమే
లేక
మానవుడే
లేడు.
పుడమియందు
పుట్టిన
ప్రతి
మానవునికి
సత్యమే
ప్రత్యక్ష
దైవం.
ఇట్టి
సత్యశక్తిని
పరిశోధనలు
చేసి,
పరిశీలనలు
సల్పి
సాక్షాత్కరింప
చేసుకున్నారు
ఆనాటి
మహర్షులు.
సర్వమానవుల
యందున్న
సత్యము
ఒక్కటే
అని
వారు
గుర్తించారు.
దీనిని
పురస్కరించుకొనియే
“సత్యమే
దైవం”
అని
అన్నారు.
2
▾
Meaning
Keep
His poems 362
Also in his talks
(28)
14 January 1988
Strive to recognise the oneness within the many!
20 May 1990
The Glory of Indian Culture
6 October 1992
Only one who knows himself can know God
2 July 1996
Satya Alone Is God
1 January 1998
Happiness and sorrow cannot be parted
26 February 1998
The power of saṅkalpas
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
25 September 1998
Man's True Kin
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
14 October 2002
Satya itself is life
22 November 2002
Give Up Selfishness and Strive for the Good of Society
2 April 2003
Leave the delusion of the body; think of God
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
9 April 2005
Divinity is the very nature of man
7 April 2006
Our Ātma itself is Rāma
11 August 2006
Divinity is attained only through Prema for God
28 September 2006
No worry troubles those who think of God without ceasing
16 February 2007
Follow Sai, walk the path of Satya!
7 June 2007
Along with ‘Education’, ‘Educare’ is most essential
28 July 2007
Every human being is God
22 August 2007
Foster faith in God and love of country!
4 September 2007
The word and the way of the Avatāras are most auspicious
22 November 2007
Only one who recognises that all are one is truly educated
18 July 2008
God alone is the true Guru
6 August 2008
‘Education’ finds its fulfilment only when it is joined with ‘Educare’
9 October 2008
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
సత్యంబునందుండి
సర్వంబు
సృష్టించె
సత్యంబునందణగె
సర్వసృష్టి
సత్యమహిమ
లేని
స్థలమేది
కనుగొన్న?
శుద్ధసత్త్వమిదియె
చూడరయ్య
ప్రపంచమంతా
సత్యమునుండియే
పుట్టింది.
ప్రపంచమునంతటినీ
సత్యమే
కాపాడుతున్నది,
సత్యమే
పోషిస్తున్నది,
సత్యమే
లయం
గావిస్తున్నది.
సృష్టి,
స్థితి,
లయములు
మూడింటికీ
సత్యమే
మూలకారణం.
అట్టి
సత్యమును
మీరూ
ఆధారం
చేసుకోండి.
ధర్మమును
ఆచరించండి.
అప్పుడే
మీ
యందు
శాంతి,
ప్రేమలు
ఆవిర్భవిస్తాయి.
సత్యాచరణయే
ధర్మం,
సంకల్పరాహిత్యమే
శాంతి
ప్రతిమానవునియందు
ప్రాణ,
అపాన,
వ్యాన,
ఉదాన,
సమానములనే
పంచప్రాణములున్నవి.
ఇవి
అంతర్ముఖమైన
దివ్యశక్తులు.
బహిర్ముఖంగా
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ,
అహింసలే
మానవుని
పంచప్రాణములని
చెప్పవచ్చును.
ఇట్టి
సూక్ష్మమైన
తత్త్వాన్ని
మానవుడు
గుర్తించుకోలేక
తన
మానవత్వాన్ని
వ్యర్థం
చేసుకుంటున్నాడు.
మానవుని
యందున్న
జీవశక్తికే
సత్యమని
పేరు.
సత్యమును
ఆచరణయందుంచినప్పుడు
అదే
ధర్మమౌతుంది.
సత్యాచరణయే
ధర్మము.
సత్యమును
పలకాలి,
ధర్మమును
ఆచరించాలి.
కనుకనే
వేదము
“సత్యం
వద,
ధర్మం
చర”
అని
బోధించింది.
సత్య
సంకల్పమునుండి
ఆవిర్భవించినదే
ధర్మము.
సత్యమే
లేక
ధర్మమే
లేదు.
కనుకనే
వేదము
“సత్యాన్నాస్తి
పరో
ధర్మః”
అన్నది.
సత్యమనే
పునాదియే
లేక
ధర్మమనే
భవనమును
నిర్మించటానికి
వీలుకాదు.
ధర్మమునుండి
ఏర్పడినదే
శాంతి.
శాంతి
కావాలని
మీరు
పూజలు
చేస్తున్నారు.
ప్రార్థనలు
చేస్తున్నారు,
ప్రచారాలు
చేస్తున్నారు.
కాని
వీటివల్ల
లభించేది
కాదు
శాంతి.
మీరెన్ని
యజ్ఞయాగాది
క్రతువులు
చేసినప్పటికీ,
ఏ
సాధనలు
సల్పినప్పటికీ
మీలో
కోరికలున్నంతవరకు
మీకు
శాంతి
లభించదు.
కోరికలను
నిర్మూలించుకోవాలి.
కోరికలు
సంకల్పములనుండి
ఆవిర్భవిస్తాయి.
సంకల్పమునకు
మూలాధారం
మనస్సు.
కనుక,
శాంతి
లభించాలంటే
మనస్సును
మరచిపోవాలి;
మనస్సును
అదుపులో
పెట్టుకోవాలి.
మనస్సును
అరికట్టినప్పుడు
అది
మౌనంగా
ఉంటుంది.
అట్టి
సంకల్పరహితమైన
తత్త్వమే
శాంతి.
3
▾
Meaning
Keep
“ఏకాత్మదర్శనం
ప్రేమ”
మనస్సుకు
ఆధారమైన
ఆత్మస్థాయినుండి
ఆవిర్భవించేది
ప్రేమ.
అనగా,
ప్రేమ
దైవమునుండి
ఆవిర్భవిస్తుంది.
ప్రేమ
సత్యస్వరూపము.
నిర్గుణం,
నిరంజనం,
సనాతనం,
నికేతనం,
నిత్య,
శుద్ధ,
బుద్ధ,
ముక్త,
నిర్మలస్వరూపిణిం....
ఇవి
ప్రేమకు
గల
తొమ్మిది
వర్ణనలు.
ప్రేమ
సర్వులనూ
ఏకంగావిస్తుంది.
“ఏకాత్మ
దర్శనం
ప్రేమ”.
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమలయందు
అంతర్వాహినిగా
ప్రవహించేది
అహింస.
హింసతోకూడినది
సత్యము
కాదు,
ధర్మము
కాదు,
శాంతి
కాదు,
ప్రేమ
కాదు.
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ,
అహింసలే,
మానవునికి
ప్రధానమైన
గుణములు.
అవే
మానవుని
పంచప్రాణములు.
కాని,
వీటిని
విస్మరించి
మానవుడు
అనేక
కర్మల
నాచరిస్తున్నాడు.
ఈ
కర్మలద్వారా
లభించే
ఫలితమేమిటో
తనకేం
తెలియటం
లేదు.
తాను
మానవునిగా
బ్రతకాలనుకుంటే
ఈ
మానవతావిలువలను
తన
పంచప్రాణములుగా
భావించి
పోషించుకోవాలి.
ఇవే
జీవితానికి
మూలాధారమైన
శక్తులు.
‘యూనిటీ’
-
‘ప్యూరిటీ’
-
‘డివినిటీ’
త్రేతాయుగమునందు
రాముడవతరించి
సత్యధర్మములను
పోషించాడు;
పితృవాక్యపరిపాలన
నిమిత్తం
అరణ్యవాసం
చేశాడు.
ఆ
కాలంలో
ఏదో
కొద్దిమంది
రాక్షసులు
మాత్రమే
ఉండేవారు.
వారిని
నిర్మూలించి
ధర్మసంస్థాపన
గావించాడు
రాముడు.
ద్వాపర
యుగంలో
రాక్షసుల
సంఖ్య
పెరిగిపోయి
శాంతి
క్షీణించిపోయింది.
అప్పుడు
కృష్ణుడు
అవతరించి
శాంతి,
ప్రేమలను
పోషించాడు.
ఇప్పుడీ
కలియుగంలో
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ,
అహింసలను
కాపాడే
శక్తిని
భగవంతుడు
ప్రతి
మానవునికి
ప్రసాదించాడు.
ఈ
పంచప్రాణములను
సంరక్షించుకోవాలన్నది
భగవంతుని
ఆజ్ఞ.
వీటిని
నేడు
ప్రచారం
చేయటంలో
గల
అంతరార్థమిదియే.
మానవతావిలువలను
సంరక్షించడానికి
మీరు
దైవంకోసం
కాచుకోనక్కర్లేదు.
ఆ
శక్తి
మీయందే
ఉన్నది
కనుక,
మీరే
సంరక్షించుకోవాలి.
ఇవి
మీ
ప్రాపర్టీలు.
మీ
ప్రాపర్టీని
మీరే
సంరక్షించుకోవాలిగాని,
మరొకరు
వచ్చి
సంరక్షిస్తారా?
వీటిని
సంరక్షించే
బాధ్యతను
భగవంతుడు
మీకే
ఇచ్చాడు.
ఆనాడు
రాక్షసత్వం
ఏదో
కొద్దిమందికి
మాత్రమే
ఉండేది.
అప్పుడు
దైవం
అవతరించి
అలాంటి
వారిని
నిర్మూలించాడు.
కాని,
ఇప్పుడు
ప్రతి
మానవునియందు
రాక్షసత్వమున్నది.
ఇది
నానాటికీ
అధికమౌతున్నది.
దీనిని
నిర్మూలించటానికి
మొట్టమొదట
మీరు
చేయవలసిన
సాధన
‘ప్యూరిటీ’
(పవిత్రత)ని
పెంచుకోవటం.
4
▾
Meaning
Keep
అయితే
‘యూనిటీ’
(ఐకమత్యం)
లేక
‘ప్యూరిటీ’
ప్రాప్తించదు.
అనేక
వర్షపు
బిందువుల
చేరికచేత
ప్రవాహమేర్పడినట్లుగా,
‘యూనిటీ’
ఉన్నప్పుడే
‘ప్యూరిటీ’
అభివృద్ధి
అవుతుంది.
‘ప్యూరిటీ’
వల్లనే
‘డివినిటీ’
(దివ్యత్వం)
ప్రాప్తిస్తుంది.
కాని,
ఈనాడు
‘యూనిటీ’
లేదు,
‘ప్యూరిటీ’
లేదు,
‘డివినిటీ’
లేదు.
అందుచేతనే
మీ
హృదయంలో
‘ఎనిమిటీ’
(వైరము)
ప్రవేశించింది.
మీ
హృదయం
ఒక
‘సింగిల్
ఛైర్’
వంటిది.
ఇది
డబుల్
సోఫా
కాదు.
మ్యూజికల్
ఛైర్
కాదు.
కాబట్టి
ఇందులో
‘డివినిటీ’
ని
ప్రతిష్టించుకున్నప్పుడు
ఇంక
‘ఎనిమిటీ’కి
స్థానముండదు.
‘డివినిటీ’ని
ప్రతిష్టించుకోవాలంటే
మీ
జీవశక్తులైన
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ,
అహింసలను
ఆవిర్భవింపచేసుకోవాలి.
దీనినే
‘ఎడ్యుకేర్’
అన్నారు.
ఈనాడు
‘ఎడ్యుకేషన్’
తప్ప
‘ఎడ్యుకేర్’
అనేది
లేదు.
‘ఎడ్యుకేషన్’
అంటే
ఏమిటి?
అని
అడిగితే
కొందరు
జ్ఞానమును
సంపాదించుకోవటం
అని
చెబుతారు.
జ్ఞానమును
సంపాదించుకుంటే
సరిపోదు.
దానిని
ఆచరణలో
పెట్టాలి.
శీలమే
విద్యయొక్క
పరమార్థం.
ఏకాగ్రతయే
విద్యయొక్క
సారం.
దివ్యత్వమే
విద్యయొక్క
గమ్యం.
పశు
పక్షిమృగాదులు
ఎట్టి
విద్యలనూ
అభ్యసించటం
లేదు.
మరి
అవి
జీవించడం
లేదా?
కాబట్టి
విద్య
జీవిత
పరమావధికేగాని,
జీవించటానికి
కాదనే
సత్యాన్ని
మొట్టమొదట
మీరు
గుర్తించాలి.
“ఎడ్యుకేర్”
వలన
జన్మరాహిత్యం
మీలోనున్న
మానవతావిలువలను
ఆవిర్భవింపజేసుకోవటమే
‘ఎడ్యుకేర్’.
సత్యము,
ధర్మము,
శాంతి,
ప్రేమ,
సహనము,
సానుభూతి
ఇవన్నీ
కంటికి
కనిపించని
అంతర్భూతమైన
శక్తులు.
ఇవి
మానవునికి
పునర్జన్మ
లేకుండా
చేస్తాయి.
ఈనాటి
విద్యార్థులు
నేర్చే
‘ఎడ్యుకేషన్’
కోరికలను
పెంచుతుంది,
పునర్జన్మ
కలిగిస్తుంది.
‘ఎడ్యుకేర్’
అనేది
కోరికలను
అణగద్రొక్కి
జన్మరాహిత్యాన్ని
చేకూర్చుతుంది.
‘ఎడ్యుకేషన్’
వలన
Rebirth
(పునర్జన్మ)
‘ఎడ్యుకేర్’
వలన
(No-Birth)
(జన్మరాహిత్యం).
ఈనాటి
‘ఎడ్యుకేషన్’
వలన
మానవునిలో
కోరికలు
పెరుగుతున్నాయి.
కోరికలే
పునర్జన్మకు
పునాదిగా
ఏర్పడుతున్నాయి.
ఈనాటి
మానవునికి
Attachment
(మమకారము)
పెరిగిపోవడంవల్ల
బంధన
అధికమైపోతోంది.
బంధన
అధికం
కావటంవల్ల
బాధ్యత
పెరిగిపోతోంది.
బాధ్యత
పెరిగిపోవటం
వల్ల
అశాంతి
కలుగుతోంది.
5
▾
Meaning
Keep
ఇదంతా
కోర్కెలవల్ల
కలిగే
ఫలితం.
కోరికలను
అరికట్టుకోవడానికి
Detachment
(వైరాగ్యము)ను
అభివృద్ధి
పరచుకోవాలి.
ఇది
‘ఎడ్యుకేర్’
వలననే
సాధ్యమైతుంది.
తాళంలో
తాళపు
చెవి
పెట్టి
ఎడమవైపు
త్రిప్పితే
మూసుకుంటుంది,
కుడివైపు
త్రిప్పితే
తెరుచుకుంటుంది.
అదే
తాళము,
అదే
తాళపుచెవి.
త్రిప్పటంలోనే
ఉంది
వ్యత్యాసం.
మన
హృదయాన్ని
ఒక
తాళంతోనూ,
మనస్సును
తాళపుచెవితోనూ
పోల్చవచ్చును.
మనస్సును
కోరికలవైపు
త్రిప్పితే
బంధన
కల్గుతుంది.
భగవంతునివైపు
త్రిప్పితే
మోక్షం
ప్రాప్తిస్తుంది.
మోక్షమనగా
ఏదో
ప్రత్యేకమైన
‘ఎయిర్
కండిషన్డ్’
గది
కాదు.
ఇది
కేవలం
ఒక
ప్రశాంతమైన
తత్త్వము.
దీనిని
Supreme
Peace
అనవచ్చును.
ఇట్టి
Supreme
Peace
ను
అనుభవించాలంటే
Supreme
Stage
కి
వెళ్ళాలి.
అందునిమిత్తం
‘యూనిటి’,
‘ప్యూరిటీ’,
‘డివినిటీ’లను
అభివృద్ధిపరచుకోవాలి.
కాని,
ఈనాడు
అన్నదమ్ముల
మధ్యకూడా
‘యూనిటీ’
లేదు.
అలనాటి
రామలక్ష్మణులెలాంటివారో
తెలుసునా?
ఎంతో
ఐకమత్యంగా
జీవించారు.
కష్టమునందుగాని,
సుఖమునందుగాని,
రాముడినే
అనుసరించాడు
లక్ష్మణుడు.
ఎటువంటి
పరిస్థితులందైనా
తాను
రామాజ్ఞను
మీరలేదు.
కనుకనే
అతడు
Supreme
Stage
కి
చేరుకున్నాడు.
కాని,
ఈనాటి
రామలక్ష్మణులు
ఏరీతిగా
ఉన్నారు?
వాంఛలను
పెంచుకొని,
ప్రాపర్టీకోసం
పోట్లాడుకొని
సుప్రీం
కోర్టుకు
పోతున్నారు.
కోరికలు
సుప్రీం
కోర్టుకి
తీసుకువెళతాయి.
కోరికలు
లేనప్పుడు
Supreme
Peace
ను
అనుభవిస్తాము.
అంతరాత్మ
మెచ్చుకొనే
పనులు
చేయాలి
ఈనాడు
విద్యార్థులకు
కావలసింది
ఏమిటి?
కేవలం
‘ఎడ్యుకేషన్’
మాత్రమే
కాదు;
‘ఎడ్యుకేర్’
కూడా
ఉండాలి.
‘ఎడ్యుకేషన్’
అనేది
Bookish
Knowledge
(పుస్తకజ్ఞానము)ను
మాత్రమే
అందిస్తుంది.
దీనిని
Superficial
knowledge
(మిడిమిడిజ్ఞానం)
అని
కూడా
చెప్పవచ్చును.
దీనితో
పాటు
General
Knowledge
(సాధారణజ్ఞానం),
Discrimination
Knowledge
(విచక్షణాజ్ఞానం),
Practical
Knowledge
(అనుభవజ్ఞానం)
కూడా
అవసరం.
నేటి
మానవుడు
తన
విచక్షణనుపయోగించటంలో
కేవలం
స్వప్రయోజనాన్ని
మాత్రమే
దృష్టిలో
పెట్టుకున్నాడు.
దీనిని
Individual
Discrimination
అంటారు.
ఇది
సరియైనది
కాదు.
సమాజ
శ్రేయస్సును
దృష్టిలో
పెట్టుకోవాలి.
దానినే
Fundamental
Discrimination
అంటారు.
6
▾
Meaning
Keep
విద్యార్థులు
పుస్తకాలు
చదివి,
టీచర్లు
చెప్పింది
పరీక్షల్లో
వ్రాసి
మార్కులు
తెచ్చుకుంటారు.
అయితే
ఈ
మార్కులు
కాదు
ముఖ్యం.
మీ
హృదయంనుండి
వచ్చే
మార్కులే
నిజమైనవి.
“నీవు
చేసిన
పని
సరియైనది”
అని
మీ
Conscience
(అంతరాత్మ)
మీకు
సాక్ష్యం
ఇవ్వాలి.
దేహం
ఒక
బెలూన్
వంటిది
‘కాన్షియన్స్’,
‘కాన్షియస్’,
‘కాన్షియస్నెస్’
-
ఈ
మూడింటిని
గూర్చి
మీరు
తెలుసుకోవాలి.
‘కాన్షియస్నెస్’
అనేదే
దివ్యత్వం.
ఇదే
సర్వత్రా
వ్యాపించిన
చైతన్యం.
ఇది
దేహంలో
ప్రవేశించినప్పుడు
దీనిని
‘కాన్షియన్స్’
అంటారు.
అనగా,
మీ
దేహంలో
ఉన్న
ఆత్మతత్త్వమే
‘కాన్షియన్స్’.
ఇంక,
‘కాన్షియన్స్’
తో
చేర్చి
అభివృద్ధిపరచినప్పుడు
అది
‘కాన్షియస్నెస్’లో
చేరిపోతుంది.
పిల్లలకు
తెలుసు
-
బెలూన్లో
గాలిని
నింపేకొలదీ
అది
పెరుగుతూ
పెరుగుతూ
చిట్టచివరికి
‘ఫట్’
మని
పగిలిపోతుంది.
అప్పుడు
బెలూన్లో
ఉన్న
గాలి
సర్వత్రా
వ్యాపించిన
గాలిలో
లీనమైపోతుంది.
బెలూన్లోని
గాలిని
‘కాన్షియన్స్’
తోను,
సర్వత్రా
వ్యాపించిన
గాలిని
‘కాన్షియస్నెస్’
తోనూ
పోల్చవచ్చును.
మీరు
దేహభ్రాంతితో
జీవిస్తున్నారు.
దేహం
కేవలం
ఒక
బెలూన్వంటిది,
ఒక
నీటిబుడగవంటిది.
మనస్సు
ఒక
పిచ్చికోతివంటిది.
కాబట్టి
దేహంపై,
మనస్సుపై
ఆధారపడకూడదు.
అంతరాత్మను
అనుసరించాలి.
మీరు
దేహాభిమానమును
పెంచుకోవటంచేత
అన్ని
విధాలుగా
బలహీనులౌతున్నారు.
మీరు
ఆస్తిపైన,
అధికారంపైన
ఆధారపడుతున్నారేగాని,
ఆత్మపై
ఆధారపడం
లేదు.
విలువలేని
ఇనుపపెట్టెలో
విలువైన
నగలున్నట్లు...
ప్రేమస్వరూపులారా!
ప్రతి
ఒక్కరికీ
ఆత్మ
విశ్వాసం
అత్యవసరం.
ఆత్మవిశ్వాసమనే
పునాదిపై
ఆత్మసంతృప్తి
అనే
గోడలుకట్టాలి.
ఆత్మసంతృప్తి
అనే
గోడలపై
స్వార్థత్యాగమనే
‘రూఫ్’
(పైకప్పు)
వేయాలి.
అప్పుడే
మీ
‘లైఫ్’
(జీవితం)
శాంతిని
పొందుతుంది.
అదే
ఆత్మసాక్షాత్కారం.
కనుక
ఆత్మసాక్షాత్కారానికి
ఆత్మవిశ్వాసం
అత్యంత
ప్రధానమైనది.
కాని
మీలో
ఆత్మవిశ్వాసం
అంత
స్థిరంగా
ఉండటం
లేదు.
కారణమేమిటి?
మీ
మనస్సు
ప్రాకృతమైన
వాంఛలతో
నిండిపోయింది.
ప్రాపంచికమైన
వాంఛలన్నీ
వ్యర్థమైనవి.
అట్టి
వాంఛలను
నెరవేర్చుకునే
నిమిత్తమై
మీరు
అనేక
చదువులు
చదువుతున్నారు.
ఈ
చదువులతోపాటు
మానవతా
విలువలను
పోషించే
చదువులుకూడా
అవసరం.
7
▾
Meaning
Keep
మానవతావిలువలను
మీరు
క్రొత్తగా
సంపాదించుకోనక్కర్లేదు.
అవి
మీతోపాటే
పుట్టాయి,
మీయందే
ఉన్నాయి.
వాటిని
మీలోనే
దాచుకున్నారు.
విలువలేని
ఇనుపపెట్టెలో
విలువైన
నగలను
దాచుకున్నట్లుగా
అనిత్యమైన
దేహంలో
నిత్యసత్యమైన
మానవతావిలువలను
దాచుకున్నారు.
ప్రేమ
అనే
తాళపుచెవితో
మీ
హృదయకవాటాన్ని
తెరచినప్పుడే
అందులో
ఉన్న
విలువైన
గుణములు
ఆవిర్భవిస్తాయి.
విద్యార్థులారా!
విద్యాధికారులారా!
విద్యాభిమానులారా!
విద్యాపోషకులారా!
మీరు
ముఖ్యంగా
చేయవలసిందేమిటంటే,
మీ
హృదయకవాటాన్ని
తెరిచే
‘కీ’
ని
సంపాదించాలి.
అదియే
పవిత్రమైన
ప్రేమ.
ప్రేమతత్త్వాన్ని
పెంచుకుంటే
సర్వశక్తులూ
ఆవిర్భవిస్తాయి.
సత్సంగంవలననే
సద్భావాలు
కల్గుతాయి
ప్రేమస్వరూపులారా!
నిన్న
జుమ్సాయి
చెప్పినట్లుగా,
మానవతావిలువలు
మార్కెట్టులో
చిక్కేవి
కావు;
లేక
పెద్దపెద్ద
భవనాలలోనూ,
ఫైవ్
స్టార్
హోటళ్ళలోనూ
లభించేవి
కావు.
ఇలాంటి
దివ్యమైన
క్షేత్రమునందే
పవిత్రమైన
భావాలు
వస్తాయి.
ఇక్కడి
వాతావరణం
దివ్యమైనది,
నవ్యమైనది,
పవిత్రమైనది,
ప్రశాంతమైనది.
ఇలాంటి
ప్రదేశమునందే
మానవతావిలువలు
అభివృద్ధి
అవుతాయి.
పెద్దపెద్ద
భవనాలు,
హోటళ్ళు
పాంచభౌతికమైన
దేహానికి
అనుకూలంగా
ఉండవచ్చునుగాని,
మనస్సులో
దివ్యమైన
భావాలను
కలిగించవు.
మీ
దేహం
మంచి
ఎయిర్
కండిషన్డ్
గదిలో
ఉన్నప్పటికీ
మీ
మనస్సు
వేడెక్కిపోతుంటుంది.
మీలో
పవిత్రమైన
భావాలు
కలగాలంటే
మీరు
పవిత్రమైన
ప్రదేశంలో
ప్రవేశించాలి.
“సత్సంగత్వే
నిస్సంగత్వం
నిస్సంగత్వే
నిర్మోహత్వం
నిర్మోహత్వే
నిశ్చలతత్వం
నిశ్చలతత్త్వే
జీవన్ముక్తిః”.
సత్సంగంలో
ప్రవేశించినప్పుడే
మీకు
శాంతి
లభిస్తుంది.
మీలోని
మాలిన్యం
తొలగి
హృదయం
పవిత్రమౌతుంది.
ఆ
పవిత్రతయే
దివ్యత్వం.
ఎక్కడ
దివ్యత్వముందో
అక్కడే
పరమశాంతి
చేకూరుతుంది.
నిన్ను
నీవు
తెలుసుకో
-
ఇదే
వేదాంత
ప్రబోధ
మీకు
శాంతి
కావాలి.
శాంతి
ఎక్కడుంది?
మీరే
శాంతిస్వరూపులు.
శాంతికోసం
మీరు
బయట
వెతుకనక్కర్లేదు.
మీలోనే
వెతకాలి.
ఇదే
వేదాంత
ప్రబోధ.
“నిన్ను
నీవు
తెలుసుకో”
అని
బోధించింది
వేదాంతం.
నిన్ను
నీవు
తెలుసుకుంటే
సర్వమునూ
తెలుసుకున్నవాడవౌతావు.
8
▾
Meaning
Keep
నిన్ను
నీవు
తెలుసుకోకుండా
ఎవరెవరినో
తెలుసుకుంటే
ఏమి
ప్రయోజనం?
ఇతరులను
“నీవెవరు?”
అని
ప్రశ్నిస్తున్నావుకాని
“నేనెవరిని?”
అని
నిన్ను
నీవు
ప్రశ్నించుకోవటం
లేదు.
“ఇది
నా
కర్చీఫ్”
అన్నప్పుడు
కర్చీఫ్
నాకంటే
వేరుగా
ఉన్నది
కదా!
అదేరీతిగా
‘నా
దేహము,
నా
మనస్సు,
నా
బుద్ధి’
అని
నీవంటున్నప్పుడు
ఇవన్నీ
నీకంటే
వేరుగా
ఉన్నట్లే
కదా!
మరి
నీవెవరు?
నీవు
సత్యస్వరూపుడవు,
శాంతిస్వరూపుడవు,
ప్రేమస్వరూపుడవు,
ధర్మస్వరూపుడవు.
అంతా
నీవే.
అన్నీ
నీ
యందే
ఉన్నాయి.
ప్రేమస్వరూపులారా!
ప్రేమను
పెంచుకోండి.
ద్వేషాన్ని
దూరం
చేసుకోండి.
వాంఛలను
తగ్గించుకోండి.
త్యాగమునకు
పూనుకోండి.
త్యాగములో
ఉన్న
ఆనందము
మరి
దేనియందూ
లేదు.
ఒక
వైపునుండి
భుజించిన
ఆహారాన్ని
మరొకవైపునుండి
విసర్జించకపోతే
కడుపు
పాడైపోతుంది.
పీల్చుకున్న
గాలిని
తిరిగి
వదలిపెట్టకపోతే
ఊపిరితిత్తులు
పాడైపోతాయి.
అదేరీతిగా
మీరు
సంపాదించిన
ధనాన్ని
పరోపకార
నిమిత్తం
త్యాగం
చేయాలి.
ఈనాటి
విద్యావిధానం
కలిమిని,
చెలిమిని,
బలిమిని
పెంచుతున్నదిగాని,
గుణమును
పెంచటం
లేదు.
గుణము
లేకుండా
కలిమి,
చెలిమి,
బలిమి,
ఎంత
ఉన్నా
ఏమి
ప్రయోజనం?
ఇవన్నీ
కదలిపోయే
మేఘాలమాదిరి
వస్తాయి,
పోతాయి.
గుణమును
పెంచుకోవాలి
Previous
←
Only What Roots Out Impurity Is True Education
Next
Self-Confidence: Human Values
→