Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2003 · Prema is the very essence of the Paramātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Prema is the very essence of the Paramātma
18 May 2003, Kodaikanal
1
▾
Meaning
Keep
His poems 415
Also in his talks
(1)
20 August 1996
Every Man Must Cultivate the Vision of Prema
ఎద్ది
కలదనుచుంటిమో
అద్ది
లేదు
ఎద్ది
లేదనుచుంటిమో
అద్ది
కలదు
ఉన్నదొక్కటె
దైవంబు
ఎన్నటికిని
లేనిదయ్యెను
లోకంబు
కానరయ్య
మానవుడు
అనాదికాలమునుండి
అనేకవిధములుగా
భగవదన్వేషణ
సల్పుతూ
వచ్చాడు.
ప్రాచీన
ఋషులు
కారడవులలో,
కొండగుహలలో
తపస్సు
ఆచరిస్తూ
దైవాన్ని
అన్వేషిస్తూ
వచ్చారు.
ఐతే,
కొందరు
అలసిపోయి
తమ
ప్రయత్నాన్ని
మధ్యలో
విరమించుకున్నారు.
మరికొందరు
తాము
పట్టిన
పట్టు
విడువక
దృఢమైన
దీక్షతో
తపస్సు
కొనసాగించి
దైవాన్ని
దర్శించి,
“వేదాహమేతం
పురుషం
మహాన్తం
ఆదిత్యవర్ణం
తమసః
పరస్తాత్”,
“సూర్యునివంటి
తేజస్సు
కలిగిన
భగవంతుణ్ణి
మేము
తమస్సుకు
ఆవల
దర్శించగల్గాము,”
అని
జగత్తుకు
చాటుతూ
వచ్చారు.
ప్రతి
జీవీ
దైవాంశమే!
“బీజం
మాం
సర్వభూతానాం
విద్ధి
పార్థ
సనాతనమ్”,
“పార్థా!
అన్ని
జీవులకూ
నేనే
విత్తనము
(కారణము)
అని
తెలిసికొనుము,”
ఇది
భగవంతుడైన
కృష్ణుడు
చెప్పిన
మహావాక్యము.
ఈ
విత్తనమే
విశ్వము
అనే
వృక్షముగా
రూపొంది
సర్వ
జీవులకు
పునర్జన్మను
ప్రసాదిస్తూ
వస్తోంది.
ఈ
వృక్షమునందు
అనేక
కొమ్మలు,
రెమ్మలు
అభివృద్ధిచెంది,
జీవరాశులనే
ఫలములు
ఆవిర్భవిస్తున్నాయి.
“మమైవాంశో
జీవలోకే
జీవభూత
స్సనాతనః”,
“ప్రతి
జీవీ
నా
అంశమే,”
అన్నాడు
గీతాచార్యుడు.
ఏ
వ్యక్తీ
ప్రత్యేకంగా
లేడు.
ప్రతి
ఒక్కరియందు
పరిపూర్ణమైన
దైవత్వము
బీజరూపములో
ఉన్నది.
సర్వులయందు
ఇది
ప్రకాశిస్తూనే
ఉన్నది.
2
▾
Meaning
Keep
Also in his talks
(20)
23 November 1978
Faith Is the Foundation of the Spiritual Path
8 November 1986
Through the Name we can attain the Named!
30 September 1987
Understand the Sai principle well
5 March 1992
‘Adhyātmavidyā vidyānāṁ’
14 January 1995
Prema is like a compass
24 June 1996
A Life without Character Is a Lifeless Life
17 July 1997
The principle of the Ātma and divinity
21 April 1998
The body itself is foremost for the practice of Dharma
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
2 April 2003
Leave the delusion of the body; think of God
21 October 2003
I have come only to reveal your true nature
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
23 June 2005
Recognise the fundamental principle
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
21 May 2006
Service to society is itself the right sādhana
11 August 2006
Divinity is attained only through Prema for God
28 July 2007
Every human being is God
మనం
భూమిలో
నాటిన
విత్తనము
వృక్షముగా
పెరిగి
ఫలములనందిస్తుంది.
ఒక్కొక్క
ఫలములో
ఒక్కొక్క
విత్తనము
దాగియుంటుంది.
అదేవిధంగా,
దైవత్వము
సర్వజీవులయందు
విత్తనరూపంలో
దాగియున్నది.
కాని,
ఈనాటి
మానవుడు
అసలు
దైవత్వమనేది
ఉన్నదా,
లేదా
అనే
సందేహముతో
సతమతమవుతున్నాడు.
ఇది
చాలా
వెఱ్ఱిసందేహమే!
ప్రపంచమంతా
అణుమయమేనన్న
సత్యాన్ని
గుర్తించడానికి
సైంటిస్టులు
అనేక
సంవత్సరాలు
పరిశోధనలు
చేశారు.
కాని,
బాలుడైన
ప్రహ్లాదుడు
ఎన్నో
వేల
సంవత్సరాల
క్రిందటే
ఈ
సత్యాన్ని
గుర్తించి,
‘ఇందుగలడందు
లేడని
సందేహము
వలదు,
చక్రి
సర్వోపగతుండు...’
అని
చాటిచెప్పాడు.
భగవంతుడున్నాడా,
లేడా
అనే
సందేహానికి
అసలు
అవకాశమే
లేదు.
ఒక
వ్యక్తి
నీ
కంటికి
ఎదురుగా
కనిపిస్తుంటే,
ఆ
వ్యక్తి
అక్కడ
లేడని
చెప్పడానికి
వీలౌతుందా?
అదేవిధముగనే,
ఈ
జగత్తులో
ప్రతి
వస్తువునందును,
ప్రతి
జీవియందును
దైవత్వము
ప్రకాశిస్తూ
ఉండగా,
దైవము
ఇక్కడున్నాడు,
అక్కడ
లేడు
అని
ఎవరు
చెప్పగలరు?
ఫలనా
వ్యక్తి
ఇక్కడ
లేడు,
అని
చెప్పడానికి
ముందు
ఆ
వ్యక్తి
ఎవరో
నీకు
తెలిసి
ఉండాలి
కదా!
దైవమంటే
ఎవరో
నీకు
తెలియనప్పుడు
దైవము
లేడని
చెప్పడానికి
నీకేమి
అధికారమున్నది?
దైవత్వము
లేనటువంటిది
ఈ
జగత్తులో
ఏదీ
లేదు.
ఏ
జీవిలో
చూసినప్పటికీ
దైవత్వము
ప్రకాశిస్తున్నది.
రూపనామములు
వేర్వేరు
కావచ్చు
గాని,
అందరిలో
ఉన్న
దైవము
ఒక్కడే.
ఈ
సత్యమును
గుర్తించి,
దైవత్వమును
అనుభవించడానికి
ప్రయత్నించాలి.
దైవమునకు
ఒక
ప్రత్యేకమైన
రూపము
లేదు.
ఆనందమే
దైవస్వరూపము.
నిత్యానందం
పరమసుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం
గగనసదృశం
తత్త్వమస్యాది
లక్ష్యం
ఏకం
నిత్యం
విమలమచలం
సర్వధీ
సాక్షిభూతం
భావాతీతం
త్రిగుణరహితం....
దైవము
ఉన్నాడంటే
ఉన్నాడు,
లేడంటే
లేడు
మానవుడు
మహాశక్తిసంపన్నుడు.
మానవునియందున్న
శక్తి
మరి
ఎవరియందూ
లేదు.
3
▾
Meaning
Keep
మానవుడు
చేయలేని
పని
ఏదీ
లేదు.
వైజ్ఞానిక
రంగములో
తాను
ఎంతో
అభివృద్ధిని
సాధించాడు;
చంద్రమండలమునుకూడా
చేరుకున్నాడు.
ఇన్ని
చేస్తున్నాడుగాని,
తన
హృదయాంతరాళములోకి
ప్రయాణించడం
లేదు.
తన
తత్త్వాన్ని
తాను
గుర్తించుకొనక
ఎన్ని
తెలుసుకున్నా
ప్రయోజనమేమిటి?
ఈనాడు
సైన్సు
అభివృద్ధిచెందినదిగాని,
‘సెన్సెస్’
(ఇంద్రియాలు)
అధోగతికి
చేరుకున్నాయి.
మానవునిలో
దైవత్వముపట్ల
‘డౌట్స్’
(సందేహాలు)
మితిమీరిపోయాయి.
సైన్సు
ఈనాడు
ఔనన్నది
రేపు
కాదనవచ్చు.
ఈరీతిగా,
సైన్సు
ప్రభావం
మార్పుచెందుతూ
ఉంటుంది.
సైన్సు
పదార్థపరిశోధనకు
సంబంధించినది.
ఐతే,
పదార్థ
పరిశోధనతోపాటు
ఆత్మపరిశీలనకూడా
చేయాలి.
అప్పుడే
సత్యము
గోచరిస్తుంది.
కేవలం
‘బుకిష్నాలెడ్జి’ని
సంపాదిస్తే
ప్రయోజనం
లేదు.
‘ప్రాక్టికల్
నాలెడ్జి’లోకి
మీరు
ప్రవేశించాలి.
అంతర్దృష్టితో
పరిశోధన
చేయాలి.
హృదయంలో
మాలిన్యానికి,
‘డౌట్స్’కి
ఏమాత్రము
అవకాశమివ్వకూడదు.
ఈ
కలియుగ
ప్రభావముచేత
మానవుడు
నఖశిఖపర్యంతం
‘డౌట్స్’తో
నిండియున్నాడు.
గాఢమైన
విశ్వాసం
ఎవరియందూ
కనిపించడం
లేదు.
దృఢమైన
విశ్వాసమును
పోషించుకున్నప్పుడే
దైవత్వమును
సాక్షాత్కరింపజేసుకోవడానికి
వీలౌతుంది.
దైవము
ఉన్నాడంటే
ఉన్నాడు,
లేడంటే
లేడు.
నీకు
నీవు
ఎంత
దూరమో
భగవంతుడు
కూడా
నీకు
అంతే
దూరంగా
ఉంటాడు.
నీకు
నీవు
ఎంత
దగ్గరగా
ఉన్నావో
భగవంతుడుకూడా
నీకు
అంత
దగ్గరగా
ఉన్నాడు.
అంతా
నీ
భావముపైనే
ఆధారపడి
ఉన్నది.
నీ
దృష్టిలో
మార్పువలననే
నీకు
సృష్టిలో
మార్పు
కనబడుతున్నది.
వేదములు,
ఉపనిషత్తులు
మానవుడనగా
నమ్మకము
గలవాడని
వర్ణించాయి.
కనుక,
మానవునియందు
‘డౌట్స్’
ఉండకూడదు.
సందేహాలకు
ఏమాత్రము
అవకాశమీయకుండా
నిశ్చలంగా
ఉండాలి.
మానవాకారము
కలిగిన
వారందరినీ
మానవులని
చెప్పడానికి
వీలుకాదు.
నమ్మకము
గలవాడే
మానవుడు,
ప్రేమ
గలవాడే
మానవుడు.
సత్యమును
ఆచరించేవాడే
మానవుడు.
మీ
భ్రమలే
మిమ్మల్ని
మోసగిస్తున్నాయి
ప్రేమస్వరూపులారా!
దైవత్వాన్ని
గాఢంగా
విశ్వసించండి.
ఏ
పేరుతోనైనా
పిలవండి.
ఏ
రూపాన్నైనా
స్మరించండి.
ఒకరు
‘జీసస్’
అంటారు.
ఒకరు
‘అల్లా’
అంటారు.
ఒకరు
‘రామా’
అంటారు.
4
▾
Meaning
Keep
ఈవిధంగా
భగవంతునికి
అనేకవిధములైన
రూపనామములను
కల్పిస్తున్నారు.
కాని,
ఇవన్నీ
కేవలం
బాహ్యమైన
రూపాలే!
అన్నింటికీ
మూలాధారమైన
తత్త్వము
మీయందే
ఉన్నది.
మూలాధారతత్త్వము
యొక్క
ప్రతిబింబములే
సర్వత్రా
గోచరిస్తున్నాయి.
ఈ
‘రిఫ్లెక్షన్’,
‘రియాక్షన్’,
‘రీసౌండ్’లను
చూసి
మీరు
‘రియాలిటీ’గా
భ్రమిస్తున్నారు.
మీ
భ్రమలే
మిమ్మల్ని
మోసం
చేస్తున్నాయి.
మిమ్మల్ని
మీరే
మోసం
చేసుకుంటున్నారు,
మీకు
మీరే
ద్రోహం
చేసుకుంటున్నారు.
మీ
భావములే
ఇన్నిరకములైన
మార్పులకు
కారణమవుతున్నాయి.
మీ
‘డౌట్సే’
మీకు
ప్రతిబింబాలుగా
కనిపిస్తున్నాయి.
ఈ
‘డౌట్స్’
ఎక్కడినుండి
వస్తున్నాయి?
ఇవి
మీకు
మీరు
కల్పించుకున్నవే!
మొట్టమొదట
మీరు
విశ్వాసాన్ని
పెంచుకోవాలి.
విశ్వాసము
లేకుండా
అన్నింటిపై
‘డౌట్స్’
పెట్టుకుంటే
మీరు
దేనినీ
సాధించలేరు.
భగవంతుడు
మీ
ఇంటనే,
వెంటనే,
జంటనే,
కంటనే
సంచరిస్తున్నాడు.
అసలు
మీరే
దైవస్వరూపులు.
సర్వ
జీవులయందు
బీజరూపములో
ఉన్న
దివ్యత్వాన్ని
మీరు
ఆధారంగా
తీసుకోవాలి.
ఒక
చెట్టుమీద
కొమ్మకొమ్మకు
అనేక
కాయలు
కాశాయి.
కాయకాయలోనూ
ఒక్కొక్క
విత్తనము
దాగియున్నది.
మీరు
నాటినది
ఒకే
విత్తనమయితే,
ఇన్ని
విత్తనములు
ఎక్కడినుండి
వచ్చాయి?
ఎన్ని
కాయలు
కాశాయో
అన్ని
విత్తనములు
ఏర్పడ్డాయి.
అదేవిధముగా,
ప్రతి
జీవిలోనూ
ఆత్మస్వరూపుడు
విత్తనముగా
ఉంటున్నాడు.
కాని,
మీరు
విత్తనమును
చూడడానికి
ప్రయత్నం
చేయడం
లేదు.
ఫలమును
భుజిస్తున్నారు.
దానిలో
ఉన్న
మధుర
రసమును
గ్రోలుతున్నారు.
విత్తనమును
మాత్రం
పారవేస్తున్నారు.
ఇదే
మీలో
ఉన్న
పెద్ద
దోషము.
అనిత్యమైన
వాటిని
స్వీకరించి,
నిత్యసత్య
మైన
ఆత్మతత్త్వమును
విస్మరిస్తున్నారు.
‘ఇది
నాకు
అవసరం
లేదు,’
అనుకుంటున్నారు.
కాని,
అన్నీ
ఆత్మతత్త్వముపైనే
ఆధారపడి
ఉన్నాయి.
విశ్వాసమే
మీ
శ్వాసగా
భావించండి
ప్రేమస్వరూపుడైన
పరమాత్మను
ప్రేమద్వారానే
గుర్తించడానికి
వీలౌతుంది.
ఇక్కడ,
అక్కడ
అని
వెతకనక్కర్లేదు.
రాత్రి,
పగలు
అనే
భేదము
లేదు.
ఎక్కడ
చూసినా
చిక్కుతాడు,
దక్కుతాడు.
5
▾
Meaning
Keep
అట్టి
సులభసాధ్యుడైన
భగవంతుణ్ణి
మీరెందుకు
వదలుకుంటున్నారు?
భగవంతునికి
ఒక
ప్రత్యేకమైన
రూపం
లేదు.
చైతన్యతత్త్వమే
భగవత్తత్త్వము.
ఈ
చైతన్యము
(కాన్షియస్నెస్)
ప్రతి
వ్యక్తియందు
ప్రకాశిస్తూనే
ఉన్నది.
మీరు
పీల్చే
గాలి
మీ
కంటికి
కనిపిస్తున్నదా?
లేదు;
చేతికి
చిక్కుతున్నదా?
లేదు.
అంతమాత్రాన
గాలి
లేదని
చెప్పడానికి
వీలుకాదు
కదా!
అదేరీతిగా,
దైవత్వము
కంటికి
కనిపించకుండా
మీయందే
ఉన్నది.
మీయందే
ఉన్న
దైవత్వము
కోసం
మీరెక్కడెక్కడో
వెతకడం
వెఱ్ఱితనము
కాదా!
మొట్టమొదట
విశ్వాసమును
పెంచుకోండి.
విశ్వాసమే
మీ
శ్వాసగా
భావించండి.
‘ఈమె
నా
తల్లి’
అనే
విశ్వాసముచేతనే
మీకు
మీ
తల్లిపై
ప్రేమ
కలుగుతున్నది.
విశ్వాసమే
లేకపోతే
మీ
తల్లిని
కూడా
మీరు
ప్రేమించరు.
“విశ్వాసము
ఎక్కడో
ప్రేమ
అక్కడ.
ప్రేమ
ఎక్కడో
సత్యమక్కడ.
సత్యమెక్కడో
శాంతి
అక్కడ.
శాంతి
ఎక్కడో
ఆనందమక్కడ.
ఆనందమెక్కడో
దైవమక్కడ.”
మానవుడు
ఆత్మవిశ్వాసమును
కోల్పోవడంచేతనే
ఆనందమును
అనుభవించ
లేకపోతున్నాడు.
మొట్టమొదట
ఆత్మవిశ్వాసమును
పెంచుకోవాలి.
తనను
తాను
నమ్మాలి.
తనను
తాను
నమ్మనివాడు
ఇంక
దైవాన్ని
ఏరీతిగా
నమ్మగలడు?
జ్ఞాననేత్రంతో
చూస్తే
దైవత్వం
సర్వత్రా
గోచరిస్తుంది
దైవము
లేనిచోటు
లేదు.
మీరు
దైవాన్ని
చూస్తూనే
ఉన్నారు.
ఎక్కడ?
ఇక్కడ
కనిపించే
శిరస్సులన్నీ
దైవముయొక్క
శిరస్సులే!
“సహస్రశీర్షా
పురుషః
సహస్రాక్షః
సహస్రపాత్.”
వేలకొలదీ
ఉన్న
శిరస్సులను
చూస్తూ,
దైవాన్ని
చూడలేదనుకోవడం
ఎంత
పొరపాటు!
ఈ
బాహ్యమైన
రూపాలన్నీ
మీ
అంతర్ముఖమైన
స్వరూపము
యొక్క
ప్రతిబింబాలే.
బాహ్యమైనదంతా
అంతర్భావముయొక్క
‘రిఫ్లెక్షన్’
మాత్రమే.
కాని,
మీరు
కేవలం
‘రిఫ్లెక్షన్’పైన
దృష్టిపెట్టి
‘రియాలిటీ’ని
విస్మరిస్తున్నారు.
ఎక్కడ
చూసినా
దైవత్వమే
తప్ప
మరొకటి
లేదు.
(స్వామి
తమ
చేతిరుమాలును
చూపిస్తూ)
ఇది
ఏమిటి?
అంటే,
వస్త్రము
అంటారు.
ఇది
కేవలం
వస్త్రము
కాదు,
ఇదికూడా
దైవస్వరూపమే.
దారములే
లేక
వస్త్రమే
లేదు.
అయితే,
దారములు
ఎక్కడినుండి
వచ్చాయి?
ప్రత్తినుండి
వచ్చాయి.
ప్రత్తి
ఎక్కడి
నుండి
వచ్చింది?
6
▾
Meaning
Keep
అదే
మూలాధారతత్త్వము.
దాని
నుండియే
రూపనామములన్నీ
ఆవిర్భవిస్తున్నాయి.
ప్రతి
మానవునియందు
దైవత్వము
ప్రకాశిస్తూనే
ఉన్నది.
చూడండి,
ఇక్కడ
ఎన్నో
బల్బులు
వెలుగుతున్నాయి.
ప్రతి
బల్బులోనూ
కరెంటు
ప్రసరిస్తున్నది.
కరెంటు
లేకుండా
బల్బులు
వెలగడానికి
వీల్లేదు.
అదేవిధంగా,
ప్రతి
మానవుని
యందు
ఒకవిధమైన
తేజస్సు
ఉంటుండాది.
ఆ
తేజస్సే
దైవత్వము.
ఆ
తేజస్సును
దర్శించడానికి
మీరు
ప్రయత్నించాలి.
గ్రుడ్డివాడు
వెలుగును
చూడలేడు.
కనులు
మూసుకున్నవానికికూడా
వెలుగు
కనిపించదు.
ఐతే,
కనులు
తెరచినవానికి
మాత్రం
సర్వత్రా
వెలుగు
కనిపిస్తుంది.
అదేవిధముగా,
జ్ఞాననేత్రము
తెరుచుకున్నవానికి
ఎక్కడ
చూసినా
భగవంతుడు
గోచరిస్తాడు.
“సర్వతః
పాణి
పాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం...”
సర్వమూ
మీ
దృష్టియందే
ఉన్నది.
ప్రపంచములో
దైవత్వము
కానిది
ఏదీ
లేదు.
మీరు
తినే
తిండి,
చూసే
చూపు,
ఆడే
ఆటలు,
పాడే
పాటలు...
అన్నీ
దైవ
స్వరూపములే!
గ్రుడ్డునుండి
పిట్ట
ఏవిధంగా
పుడుతున్నది?
పూవునుండి
సుగంధము
ఏవిధంగా
వెలువడుతున్నది?
చెట్టుకు
ఫలములు
ఏవిధంగా
కాస్తున్నవి?
వీటన్నింటికీ
దైవత్వమే
ఆధారం.
ప్రతిదానియందు
దైవత్వము
వ్యాపించియున్నది.
కాని,
కొందరు
దైవత్వము
లేదని
వాదిస్తుంటారు.
అది
చాలా
పొరపాటు.
దైవత్వము
లేదనడానికి
ఏవిధమైన
ఆధారమూ
లేదు.
దేహమే
దేవాలయం,
జీవుడే
దేవుడు
మీ
కన్నులలో
చూపు
ఎక్కడినుండి
వచ్చింది?
అదే
దైవత్వము.
మీ
నాలుకకు
రుచి
చూసే
శక్తి
ఎక్కడినుండి
వచ్చింది?
అదే
దైవత్వము.
మీ
నోటినుండి
వచ్చే
పలుకులు
కూడా
దైవత్వమునుండియే
ఆవిర్భవిస్తున్నాయి.
“శబ్దబ్రహ్మమయి,
చరాచరమయి,
జ్యోతిర్మయి,
వాఙ్మయి,
నిత్యానందమయి,
పరాత్పరమయి,
మాయామయి,
శ్రీమయి.”
భగవంతుడు
అష్టైశ్వర్యస్వరూపుడు.
ఈ
అష్టైశ్వర్యములు
ప్రపంచమంతటా
కనిపిస్తూనే
ఉన్నాయి.
ఒకడు
పిచ్చివాడు
కావచ్చు,
మరొకడు
మంచివాడు
కావచ్చు.
ఒకడు
‘సైంటిస్టు’
కావచ్చు,
మరొకడు
‘సెయింట్’
కావచ్చు.
కాని,
అందరియందున్న
దివ్యత్వము
ఒక్కటే.
సైంటిస్టు,
ఎక్కడ
చూసినా
‘ఆటమ్’
ఉన్నదంటాడు.
7
▾
Meaning
Keep
వేదాంతి,
ఎక్కడ
చూసినా
‘ఆత్మ’
ఉన్నదంటాడు.
“సర్వం
విష్ణు
మయం
జగత్.”
ప్రపంచమంతా
దైవమయమని
చెబితే
సైంటిస్టు
నమ్మడు.
మరి
ప్రపంచమంతా
అణుమయమని
తానేవిధంగా
చెప్పగల్గుతున్నాడు?
సైంటిస్టుకు
పరిశోధనలు
ప్రధానం,
వేదాంతికి
అనుభూతి
ప్రధానం.
భౌతికమైన
పరిశోధనలు
కేవలం
తాత్కాలికమైన
ఫలితాలను
అందిస్తాయి.
కాని,
అంతర్ముఖమైన
ఆత్మపరిశోధన
శాశ్వతమైన
సత్యాన్ని
నిరూపిస్తుంది.
అట్టి
అంతర్ముఖమైన
పరిశోధన
చేసినవాడు
కనుకనే
ప్రహ్లాదుడు,
భగవంతుడు
సర్వత్రా
ఉన్నాడనే
సత్యాన్ని
గుర్తించాడు.
‘ఈ
స్తంభములో
ఉన్నాడా?’
అని
తండ్రి
అడిగాడు.
‘ఉన్నాడు
తండ్రీ,’
అన్నాడు
ప్రహ్లాదుడు.
హిరణ్య
కశిపుడు
ఆ
స్తంభాన్ని
ఒక్కతూరి
గదతో
కొట్టేసరికి
అందులోనుండి
నరసింహస్వామి
ఆవిర్భవించాడు.
దీని
అంతరార్థమును
మీరు
గుర్తించాలి.
దేవుడు
మన
దేహములోనే
ఉన్నాడు.
‘దేహో
దేవాలయ
ప్రోక్తో
జీవోదేవస్సనాతనః’,
దేహమే
ఒక
దేవాలయము.
ఇందులో
ఉండే
జీవుడే
దేవుడు.
దేహభ్రాంతిని
బ్రద్దలు
చేసినప్పుడే
ఇందులో
ఉన్న
దేవుడు
మీకు
సాక్షాత్కరిస్తాడు.
దేహభ్రాంతిని
దూరం
చేసుకోనంతవరకు
దైవత్వము
కానరాదు.
ప్రహ్లాదుడు,
‘ఇందుగలడందు
లేడని
సందేహము
వలదు...’
అన్నాడు.
సందేహమునకు
అవకాశమివ్వడంవల్లనే
మీకు
దైవత్వము
గోచరించడం
లేదు.
దైవత్వము
మీయందే
ఉన్నప్పటికీ
మీరు
చూడలేకపోతున్నారు.
ఒక
ఉదాహరణ:
మీరు
జేబులో
ఒక
అగ్గిపెట్టెను
పెట్టుకున్నారు.
అది
మీ
జేబును
కాల్చదు.
ఐతే,
అందులో
అగ్ని
లేదా?
ప్రతి
పుల్లలోనూ
అగ్ని
ఉంది.
అయితే,
ఆ
పుల్లను
అగ్గిపెట్టెపై
గీసినప్పుడే
అగ్ని
ఆవిర్భవిస్తుంది.
అదేరీతిగా,
ప్రతి
వ్యక్తియందు
దివ్యత్వమనే
అగ్నిఉన్నది.
హృదయమనే
అగ్గిపెట్టెపై
దైవనామమనే
అగ్గిపుల్లను
గీసినప్పుడే
దివ్యత్వము
సాక్షాత్కరిస్తుంది.
ప్రేమస్వరూపులారా!
పరమాత్ముడు
మీయందే
ప్రేమస్వరూపుడై
ఉన్నాడు.
ప్రేమయే
పరమాత్మ
తత్త్వం.
మీరు
హృదయంలో
ప్రేమను
నింపుకున్నప్పుడు
ఎక్కడ
చూసినా
మీకు
ప్రేమస్వరూపుడే
కనిపిస్తాడు.
“యద్భావం
తద్భవతి.”
అయితే,
మీలో
ప్రేమ
లేకపోలేదు.
కాని,
ఏ
ప్రేమ?
బంధుమిత్రుల
ప్రేమ.
అలాంటి
ప్రేమను
పెట్టుకొని
‘నాలో
ప్రేమ
ఉంది,’
అని
భావించడం
అజ్ఞానం.
మీ
ప్రేమను
కేవలం
బంధుమిత్రులపై
మాత్రమే
గాక
అందరిపైన
ప్రసరింప
జేయండి.
8
▾
Meaning
Keep
ఆ
ప్రేమ
నుండి
దేహాభిమానమును
దూరము
చేయండి.
అప్పుడే
మీకు
దైవత్వము
సాక్షాత్కరిస్తుంది.
దేహాభిమానమువల్లనే
మీరు
అనేకరకములైన
సందేహాలకు
అవకాశమిచ్చి
మీ
జీవితాన్ని
నాశనం
చేసుకుంటున్నారు.
వివేకానందుడుకూడా
మొట్టమొదట
రామకృష్ణ
పరమహంసయొక్క
దివ్యత్వాన్ని
పూర్తిగా
విశ్వసించలేదు.
ఒక
పర్యాయం
పరమహంస
పడుకునే
బెడ్‌షీట్
క్రింద
నాల్గు
కాసులు
వేసి
ఆయన
ఏవిధంగా
స్పందిస్తాడో
చూద్దామని
కాచుకున్నాడు.
కొద్దిసేపటికి
ఆయన
వచ్చి
బెడ్డుపైన
పడుకున్నాడు.
కాని,
ఒళ్లంతా
చీమలు
కుట్టినట్లయి
తక్షణమే
లేచాడు.
బెడ్‌షీట్‌ను
తొలగించగా
క్రింద
కాసులు
కనిపించాయి.
“వీటినిక్కడ
ఎవరు
వేశారు?”
అని
అడిగాడు.
వివేకానందుడు
తాను
చేసిన
పనికి
సిగ్గుపడి,
“మిమ్మల్ని
పరీక్షించే
నిమిత్తం
నేనే
వేశాను,”
అన్నాడు.
అప్పుడు
రామకృష్ణ
పరమహంస,
“నాయనా!
నన్ను
ఈరకంగా
నీవు
పరీక్షించ
నవసరం
లేదు.
నేను
అందరినీ
ప్రేమిస్తున్నాను.
నీవు
కూడా
అందరికీ
నీ
ప్రేమను
పంచు.
అదే
నేను
కోరేది,”
అన్నాడు.
జీసస్
శిష్యులలో
థామస్
అనేవాడు
జీసస్
దైవమా,
కాదా,
అని
సందేహిస్తూ
వచ్చాడు.
ఈవిధముగా
అన్ని
అవతారములందూ
‘డౌటింగ్
థామస్’లు
వస్తూనే
ఉన్నారు.
వాళ్ళ
కర్మ
వాళ్ళది.
‘డౌట్స్’
ఉన్నంతవరకు
మానవుడు
సత్యస్వరూపాన్ని
గుర్తించలేడు.
ఈనాడు
అనేకమంది
దైవాన్వేషణ
సల్పుతున్నారు.
ఐతే,
దైవము
ఎప్పుడు
కనిపిస్తాడు?
ప్రేమనుపెంచుకున్నప్పుడే
కనిపిస్తాడు.
ప్రేమ
లేకుండా
దైవము
ఎక్కడ,
ఎక్కడ
అని
ఎంత
వెతికినా
కనిపించడు.
ముఖ్యంగా,
దైవత్వము
సర్వత్రా
ఉన్నదనే
నమ్మకమును
మీరు
దృఢంగా
పెట్టుకోవాలి.
ఏ
కించిత్తు
సందేహము
ఏర్పడినా
మీకు
దైవత్వము
కనిపించదు.
మన
కన్ను
చూస్తే
ఒక
ఇంచి
అయినా
లేదు.
కాని,
ప్రపంచాన్నంతా
చూస్తున్నది;
అనంతమైన
ఆకాశంలో
ఉన్న
నక్షత్రాలను
సహితం
చూస్తున్నది.
ఆ
దివ్యశక్తి
నేత్రమునందు
ఉన్నది
కాబట్టే
ఇది
సాధ్యమౌతున్నది.
నేత్రమే
మనకు
శాస్త్రము.
అయితే,
కంటిని
‘క్యాటరాక్టు’
పొర
కప్పినప్పుడు
ఏదీ
మీకు
కనిపించదు;
మీ
ప్రక్కనే
ఉన్న
భార్యాబిడ్డలుకూడా
మీకు
కనిపించరు.
అదేవిధముగనే,
మీ
మనోనేత్రమును
సందేహమనే
‘క్యాటరాక్టు’
కప్పినప్పుడు
మీరు
దైవత్వాన్ని
దర్శించలేరు.
‘క్యాటరాక్టు’ను
తొలగించుకున్నప్పుడే
మీకు
దైవ
సాక్షాత్కారప్రాప్తి
కల్గుతుంది.
9
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ప్రతి
మానవునియందు
ప్రేమ
ఉన్నది.
కాని,
దానిని
బంధుమిత్రులపైన,
భార్యాబిడ్డలపైన
ప్రసరింపజేస్తున్నాడు.
ప్రేమను
లౌకికమైన
విషయాలపై
మళ్ళించకుండా
దైవముపై
కేంద్రీకరించినప్పుడు
ఎక్కడ
చూసినా
దైవము
కనిపిస్తాడు.
ఇది
మీకు
నమ్మశక్యం
కాకపోవచ్చు.
కాని,
నా
మాటను
నమ్మండి.
మీరందరూ
దైవస్వరూపులే!
ఈ
సత్యాన్ని
మీరు
గుర్తించుకోకుండా
దైవముకోసం
ఎక్కడెక్కడో
వెతికితే
మీకు
ఎట్లా
కనిపిస్తాడు?
అసలు
దైవాన్ని
వెతకడానికి
ప్రయత్నించడం
ఎంత
వెఱ్ఱితనం!
నిన్ను
నీవు
వెతకడానికి
ప్రయత్నం
చేస్తావా?
దైవమంటే
నీవే!
దైవత్వము
లేని
వస్తువులు
లేవు.
దైవత్వము
లేని
వ్యక్తులు
లేరు.
మీయందుకూడా
దైవత్వమున్నది
కాబట్టే
ఈ
దైవస్వరూపముచేత
మీరు
ఆకర్షింపబడుతున్నారు.
ఇది
వేరు,
అది
వేరు
కాదు.
“సర్వతః
పాణి
పాదం...”
ఎక్కడ
చూసినా
ఉన్నది
ఒక్కటే.
కాబట్టి,
జాతి,
మత,
కుల
భేదములను
దూరము
చేసుకొని
మీ
ప్రేమతత్త్వాన్ని
అందరిపై
సమానంగా
పెట్టుకోండి.
అందరూ
దైవస్వరూపులే
అని
విశ్వసించండి.
అప్పుడే
మీయందు
ప్రేమ
అభివృద్ధి
అవుతుంది.
దైవాన్ని
చూడడానికి
మీరు
ఎక్కడికో
ప్రయాణం
చేయనక్కర్లేదు.
అనేకమంది
హిమాలయ
పర్వతాలకు
వెళుతుంటారు,
ఎన్నెన్నో
పుణ్యక్షేత్రాలను
సందర్శిస్తుంటారు.
కాని,
దైవము
ఎక్కడున్నాడు?
మీయందే
ఉన్నాడు.
మీయందే
ఉన్నవానిని
ఎక్కడెక్కడో
వెతికితే
ఎలా
చిక్కుతాడు?
చిక్కడు,
చిక్కనే
చిక్కడు.
కనుకనే
వేదాంతము,
‘నిన్ను
నీవు
తెలుసుకో,’
అని
బోధిస్తోంది.
మీ
కాలిక్రింద
భూమిలో
ఎంతో
ధనమున్నది.
కాని,
మీకు
కనిపించడం
లేదు.
భూమిని
త్రవ్వి
చూడండి,
ఆ
ధనమంతా
కనిపిస్తుంది.
అదేరీతిగా,
మీయందే
అగోచరముగా
ఉన్న
దివ్యత్వమును
సాధనద్వారా
మీరు
సాక్షాత్కరింపజేసుకోవాలి.
ప్రేమస్వరూపులారా!
మీరు
ముఖ్యంగా
గుర్తించవలసిందేమిటంటే,
దైవము
కోసం
మీరు
అన్వేషించనక్కర్లేదు.
ప్రతి
అణువునందు,
ప్రతి
కణమునందు
దైవత్వము
ఉంటున్నది.
‘అణోరణీయాన్
మహతో
మహీయాన్.’
భగవంతుడు
అణువుకంటె
అతి
సూక్ష్మరూపుడు,
ఘనముకంటె
అతి
గణనీయుడు.
చిన్నదీ
భగవంతుడే,
పెద్దదీ
భగవంతుడే.
ఒక
చిన్న
ఉదాహరణ
చూడండి.
10
▾
Meaning
Keep
మార్కెట్లో
చక్కెరతో
తయారు
చేసిన
జంతువుల,
పక్షుల
బొమ్మలు
అమ్ముతుంటారు.
ఒక
బొమ్మను
కొని
దాని
తోకను
త్రుంచి
నోట్లో
వేసుకోండి,
తీయగా
ఉంటుంది;
చెవిని
త్రుంచి
నోట్లో
వేసుకోండి,
అదికూడా
తీయగానే
ఉంటుంది.
చెవులు,
తోక,
తొండము
వేర్వేరుగా
ఉంటాయిగాని,
అన్నింటియందుఉండేది
చక్కెర
ఒక్కటే!
అదేవిధముగనే,
ఈ
జగత్తునందు
రూపనామములు
వేర్వేరుగా
ఉన్నాయిగాని,
అన్నింటి
యందున్నది
దైవత్వము
ఒక్కటే.
అదియే
సత్యస్వరూపము.
ఈ
సత్యాన్ని
మీరు
విస్మరించి,
దైవముకోసం
ఎక్కడెక్కడో
వెతుకుతూపోతే
కేవలం
కాలమును
వ్యర్థం
చేసినవారౌతారు.
కాలము
భగవత్స్వరూపం.
కర్మకూడా
భగవత్స్వరూపమే.
కనుకనే,
కర్మను
ఆచరించడానికి
పూర్వం
మొట్టమొదట
దానికి
నమస్కరించాలి.
కర్మనుండి
మనం
తప్పించుకోవడానికి
వీలుకాదు.
మన
‘షాడో’(నీడ)వలె
కర్మ
మన
వెంట
వస్తూనే
ఉంటుంది.
అయితే,
మనం
దైవత్వాన్ని
పరిపూర్ణంగా
గుర్తించి
అనుభవించినప్పుడు
‘షాడో’
పోతుంది;
‘రియాలిటీ’
మిగులుతుంది.
కనుక,
మొట్టమొదట
నమ్మకాన్ని
పెంచుకోవాలి.
అప్పుడే
దైవత్వాన్ని
గుర్తించడానికి
వీలౌతుంది.
మనస్సును
ఎక్కడో
పెట్టుకుని,
దైవం
ఎక్కడో
ఉన్నాడని
భ్రమించి
వాళ్ళవెంట,
వీళ్ళవెంట
తిరిగేవాళ్ళు
పిచ్చివాళ్ళు.
మీరు
ఎక్కడికీ
తిరుగనక్కర్లేదు.
మీ
దృష్టిని
అంతర్ముఖం
గావించుకోండి,
దైవము
తప్పక
మీయందే
కనిపిస్తాడు.
జీవుడే
దేవుడు.
జీవుడు
వ్యష్టిస్వరూపుడు,
దేవుడు
సమష్టి
స్వరూపుడు.
అనేక
వృక్షములు
చేరితే
అది
వనమవుతుంది.
అనేక
ఇళ్ళు
చేరితే
అది
గ్రామమవుతుంది.
అనేకమంది
వ్యక్తులు
చేరితే
అది
సమాజమవుతుంది.
ఈరీతిగా,
రూప
నామములు
మార్పు
చెందినప్పటికీ
మూలాధారతత్త్వము
మార్పు
చెందదు.
మానవత్వము
సర్వత్రా
లేదుకాని,
దివ్యత్వము
సర్వత్రా
ఉన్నది.
మానవత్వము
నందు
కూడా
దివ్యత్వమున్నది.
“దేవుడెక్కడున్నాడయ్యా?”
అని
ప్రశ్నిస్తే
కొందరు,
“మాలో
ఉన్నాడు,”
అని
చెబుతారు.
ఇది
సరియైన
జవాబు
కాదు.
ఈ
కర్చీఫ్
ఎక్కడున్నది?
నా
చేతిలో
ఉన్నది.
కాబట్టి,
నా
చేయి
పెద్దది,
కర్చీఫ్
చిన్నది.
అదేవిధముగా,
దైవము
నీలో
ఉన్నాడంటే
నీవు
దేవునికంటే
పెద్దవాడవవుతావు
కదా!
కాబట్టి,
“దైవము
నాలో
ఉన్నాడు,”
అని
చెప్పకూడదు.
నీవే
దైవములో
ఉన్నావు.
అందరూ
దైవములోనే
ఉన్నారు.
11
▾
Meaning
Keep
ఇదే
మౌలికమైన
సత్యము.
‘రిఫ్లెక్షన్,
రియాక్షన్,
రీసౌండ్’
ప్రేమస్వరూపులారా!
అందరినీ
ప్రేమించండి.
మీరు
బజారులో
వెళుతుంటే
ఒక
తల్లిచంకలో
చంటిబిడ్డ
కనిపించిందనుకోండి.
ఆ
చంటిబిడ్డను
చూసి
మీరు
నవ్వితే,
ఆ
బిడ్డకూడా
మిమ్మల్ని
చూసి
నవ్వుతుంది.
ఒకవేళ
మిమ్మల్ని
ద్వేషించే
వ్యక్తి
మీకు
ఎదురయ్యాడనుకోండి.
వానిని
చూస్తూనే
మీరు
తిట్టడం
ప్రారంభిస్తే
వాడు
మాత్రం
ఊరకుంటాడా?
రోడ్డుమీదే
మీతో
యుద్ధానికి
దిగుతాడు.
చూశారా!
ఈవిధంగా,
ఈ
జగత్తులో
మీరు
అనుభవించేదంతా
‘రిఫ్లెక్షన్,
రియాక్షన్,
రీసౌండ్’లే!
ఈ
మూడూ
లేనిది
జగత్తే
కాదు.
కాబట్టి,
ప్రేమను
బాగా
పెంచుకోండి.
ఎవ్వరినీ
ద్వేషించకండి.
ద్వేషిస్తే
ఆ
ద్వేషము
తిరిగి
వచ్చి
మిమ్మల్నే
బాధిస్తుంది.
మీకు
ఎదురైనవాడు
మీ
విరోధి
అయినా
సరే,
“హలో
మై
ఫ్రెండ్,
హౌ
ఆర్
యు?”
అని
ప్రేమతో
పలుకరించండి.
అతడు
కూడా
ప్రేమతో
మిమ్మల్ని
పలుకరిస్తాడు.
ఎటువంటి
దుర్మార్గుడినైనా
ప్రేమచేత
వశము
గావించుకోవచ్చు.
ఒకానొక
సమయంలో
బుద్ధుడు
ఎక్కడికో
ప్రయాణమై
వెళుతుంటే
ఒక
రాక్షసి
ఎదురై
కళ్ళెర్ర
చేసి,
“ఏయ్,
ఎవరు
నీవు?”
అని
గద్దించింది.
బుద్ధుడు
చిరునవ్వులు
చిందిస్తూ,
“నేను
నీ
ఫ్రెండ్‌ని,”
అన్నాడు.
ప్రేమపూర్వకమైన
బుద్ధుని
మాట
విన్నంతనే
రాక్షసిలో
పరివర్తన
కలిగింది.
“నేను
కూడా
నీ
ఫ్రెండ్‌నే,”
అని
పలికి
శాంతికి
చిహ్నమైన
పావురంగా
మారి
ఎగిరిపోయింది.
దీని
అంతరార్థ
మేమిటి?
ప్రేమనుండియే
శాంతి
ఆవిర్భవిస్తుంది.
కనుక,
మీరుకూడా
బుద్ధునివలె
అందరినీ
ప్రేమిస్తూరండి.
మిమ్మల్ని
ద్వేషించేవారిని
కూడా
ప్రేమించండి.
తప్పక
శాంతిని
పొందగలరు.
ఈనాడు
ప్రపంచంలో
అందరూ
శాంతి
కావాలని
ఆశిస్తున్నారు;
శాంతికై
వెతుకుతున్నారు.
కాని,
ప్రపంచంలో
ఎక్కడికి
పోయినా
Pieces
తప్ప
Peace
కనిపించడం
లేదు.
శాంతి
మీయందే
ఉన్నది.
మీరే
శాంతిస్వరూపులు;
మీరే
సత్యస్వరూపులు;
మీరే
ప్రేమస్వరూపులు;
మీరే
దైవస్వరూపులు.
బుద్ధుడే
కాదు,
మహనీయులందరూ
ప్రేమనే
ప్రధానసూత్రంగా
ప్రబోధించారు.
ప్రేమ
లేక
ప్రాణమే
లేదు.
ప్రేమ
లేనివాడు
మనిషే
కాడు.
కాబట్టి,
ప్రేమను
పెంచుకోండి.
అప్పుడే
మీకు
నిజమైన
ఆనందము
లభ్యమౌతుంది.
12
▾
Meaning
Keep
బుద్ధుడు
నిర్వాణం
చెందుతున్న
సమయంలో
అతని
పినతల్లి
కుమారుడైన
ఆనందుడు
దుఃఖించసాగాడు.
అప్పుడు
బుద్ధుడు,
“ఆనందా!
నేను
నిర్వాణం
పొందడం
నీకిష్టం
లేదా?
ఎందుకు
నీవు
కంటిధారలు
కారుస్తున్నావు?
నీవు
కూడా
నావలె
ప్రేమను
పెంచుకొని
నిర్వాణం
పొందడానికి
ప్రయత్నించు,”
అని
బోధించాడు.
ఆనందుడు
బుద్ధుని
బోధనలను
ఆచరణలో
పెట్టి
నిజమైన
ఆనందమును
అనుభవించాడు.
ప్రేమస్వరూపులారా!
అందరితోను
స్నేహంగా
మెలగండి.
అయితే,
భగవంతుడే
మీ
నిజమైన
స్నేహితుడనే
సత్యాన్ని
మరువకండి.
స్నేహము
తరువాతనే
ఆత్మనివేదనము
సాధ్యమౌతుంది.
కాబట్టి,
మొట్టమొదట
భగవంతునితో
స్నేహం
చేయండి.
స్నేహం
కావాలంటే
ప్రేమను
పెంచుకోండి.
బ్యాంకులో
క్యాషియర్
దగ్గర
డబ్బు
దండిగా
ఉంటుంది.
కాని,
మీరు
డిపాజిట్
చేయకుండా
డబ్బు
అడిగితే
ఇస్తాడా?
ఇవ్వడు.
మీరు
పూర్వమేదైనా
కొంత
డిపాజిట్
కట్టి
ఉండాలి,
తరువాత
చెక్కు
రాసివ్వాలి.
అదేవిధంగా,
మీరు
భగవంతునిదగ్గర
మొట్టమొదట
విశ్వాసమనే
డిపాజిట్
కట్టుకోవాలి.
పవిత్రమైన
ప్రేమ
అనే
చెక్కు
అందించాలి.
అప్పుడే
మీరు
అనుగ్రహమనే
ధనమును
అందుకోగలరు.
Previous
←
Women Symbolize Sacrifice
Next
Only a son worthy of his mother's love can win God's grace
→