Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2004 · Truth itself is the form of God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Truth itself is the form of God
11 April 2004, Inauguration of the Kerala youth sādhanā camp, Brindavan
1
▾
Meaning
Keep
విశ్వమెల్లడ
వ్యాపియై
వెలయువాడు
భక్తజనులకు
ప్రాపుడై
పరగువాడు
భక్తినొసగి
రక్షించెడి
శక్తిమయుడు
పర్తివాసుడు
మీకేల
తోడుపడడు!
ప్రేమస్వరూపులారా!
సర్వత్రా
వ్యాపించిన
భగవంతునికి
ఒకరి
ప్రార్థనగాని,
ఒకరి
ఆదర్శముగాని,
ఒకరి
అండదండలుగాని
ఉండనక్కరలేదు.
సర్వమూ
తానే
స్వయముగా
చూస్తూ
అనుగ్రహిస్తూ
ఉంటాడు.
భక్తులారా!
దైవము
ఎక్కడున్నాడనే
భావము
మనయందు
ఏమాత్రము
రాకూడదు.
సర్వ
కాలములయందు,
సర్వవేళలయందు
సర్వత్రా
సాక్షాత్కరించే
దైవత్వమును
ఎక్కడ?
అని
వెతుక్కోవడం
వెఱ్ఱితనమే!
అసలు
దైవత్వమనగా
ఏమిటనేది
మొట్టమొదట
మనం
విచారణ
చేయాలి.
అణువణువునందూ,
కణకణమునందూ
దైవత్వము
గోచరిస్తూనే
ఉన్నది.
ఈ
ప్రకృతియే
దైవము.
దైవము
చేయలేని
కార్యమేదియూ
లేదు.
ప్రతి
క్షణము
కూడను
తన
దృష్టి
సర్వత్రా
ప్రసరిస్తూనే
ఉన్నది.
అట్టి
దైవశక్తిని
గుర్తించుకొనకుండా
“భగవంతుడు
మాకు
తోడ్పడటం
లేదే!
సహాయం
చేయటం
లేదే!”
అని
భావించటం
మానవునిలో
ఉన్న
బలహీనత.
శక్తినొసగే
భక్తి,
భక్తినొసగే
శక్తి
ఈ
రెండూ
అవినాభావ
సంబంధములు,
అన్యోన్యాశ్రయములు.
కాని,
మానవత్వములో
ఉన్న
మాయాతత్త్వముచేత
మీరు
దైవశక్తిని
గుర్తించుకొనలేకపోతున్నారు.
ముఖ్యంగా
దైవము
ఆచరించే
ప్రతి
కార్యము
కూడను
ప్రకృతి
యొక్క
క్షేమముకోసమే
అని
మీరు
గుర్తించాలి.
భగవంతుడు
చేసే
ఏ
చిన్న
కార్యము
కూడా
వ్యర్థము
కావటం
లేదు.
అర్థము
తెలుసుకొనలేక
మానవుడు
తబ్బిబ్బవుతున్నాడే
గాని,
దైవము
చేసే
కార్యము
ఏదికూడను
వ్యర్థము
కాదు.
ఈ
భూమండలమంతయు
గంటకు
ఇంచుమించు
వెయ్యిమైళ్ళ
వేగంతో
తన
చుట్టూ
తాను
తిరుగుతున్నది.
ఇంతియే
కాదు.
గంటకు
66
వేల
మైళ్ళ
వేగముతో
సూర్యుని
చుట్టూ
తిరుగుతున్నది.
భూమి
తన
చుట్టూ
తాను
తిరగటం
వలన
రాత్రింబవళ్ళు
ఏర్పడుతున్నవి.
2
▾
Meaning
Keep
సూర్యుని
చుట్టూ
తిరగటం
వలన
ఋతువులు
ఏర్పడుతున్నవి.
ఈ
ఋతువుల
వలన
జగత్తుకు
ఎంతో
క్షేమము
చేకూరుతున్నది.
మేఘములు
ఏర్పడటం,
వర్షములు
కురవటం,
ప్రాణులకు
తగిన
ఆహారము
సమకూరటం......
ఇవన్నీ
జరుగుతూ
వస్తున్నవి.
సూర్య
చంద్రాదుల
వలన
జగత్తుకు
ఎన్నియో
ఉపకారములు
జరుగుతున్నవి.
ఇవన్నీ
ఏ
మానవుడు
చేయగలడు?
ఏ
ప్రభుత్వము
చేయగలదు?
ఒక్క
దైవము
తప్ప
ఎవ్వరూ
చేయలేరు.
ఈ
సత్యాన్ని
గుర్తించుకొనలేక
మానవుడు
వ్యర్థజీవితమును
గడుపుతున్నాడు.
నిజంగా
విచారణ
చేస్తే,
దైవము
చేయని
కార్యము
ఒక్కటికూడను
మనకు
కానరాదు.
ప్రతి
క్షణమూ,
ప్రతి
కణమూ,
ప్రతి
యుగమూ
దైవత్వమువల్లనే
సంభవిస్తున్నవి.
ఈ
ప్రకృతియందు
కణకణమునందున్ను
దైవత్వమును
గుర్తించుకొనలేక
మనం
అనేక
అపోహలకు
గురి
అవుతున్నాము.
ప్రతి
ఒక్కటికూడను
దైవత్వమువల్లనే
జరుగుతూ
వస్తున్నది.
దైవత్వము
లేక
మానవత్వమనేది
ఉండుటకు
వీలుకాదు.
దైవత్వమును
గుర్తించినప్పుడే
మానవత్వము
సార్థకమౌతుంది.
దైవసంకల్పమువల్లనే
భూమి
క్షణమైనా
వ్యర్థం
చేయక
తన
కర్తవ్యాన్ని
తాను
నిర్వర్తిస్తున్నది.
క్రియాశీలత
కలిగినటువంటివాడు
దైవము.
ప్రతి
క్షణమూ
దైవమే
సర్వులకూ
ఆధారము.
అండ,
పిండ,
బ్రహ్మాండమంతయు
నిండిన
దైవమునకు
ఏదీ
అసాధ్యము
కాదు.
మన
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
మొదలుకొని
అన్నీ
దేవేచ్ఛవల్లనే
జరుగుతున్నాయి.
దైవశక్తి
లేనిచో
మన
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
కూడా
జరగటానికి
వీలుకాదు.
ఇట్టి
దైవత్వమును
గుర్తించుకో
లేకపోవటం
వల్లనే
మనం
ఆనందమును
పొందలేకపోతున్నాము.
అనవసరమైన
మాటలతో
కాలమును
వ్యర్థం
గావిస్తున్నాము.
“న
మే
పార్థాస్తి
కర్తవ్యం....”
ఒక
పర్యాయం
అర్జునుడు
కృష్ణుని
ప్రశ్నించాడు
“స్వామీ!
ఈ
జగత్తంతా
మీ
అధీనమై
ఉండగా
మీరు
నిరంతరం
కర్మాచరణలో
నిమగ్నులై
ఉండవలసిన
అవసర
మేమున్నది?”
అని.
అప్పుడు
కృష్ణుడు
చెప్పాడు:
“అర్జునా!
నేనే
గనుక
కర్మలను
ఆచరించ
కుండా
ఊరకే
కూర్చుంటే
త్రిలోకములు
కూడను
స్తంభించిపోతాయి.
నా
క్రియా
శీలతను
చూసి
ప్రజలు
నన్ను
అనుసరిస్తారు.
కర్మయొక్క
గుణము
చాలా
విలువైనటువంటిది.
3
▾
Meaning
Keep
Also in his talks
(4)
9 October 1986
Man's transformation is itself the transformation of the universe
12 September 1989
The Name of God Alone Is the Boat
15 January 1992
The Sankrānti festival is the sign of the union of Prakṛti and the Paramātma
20 November 1998
The Body Is Truly the First Means to Dharma
న
మే
పార్థాస్తి
కర్తవ్యం
త్రిషు
లోకేషు
కించన
నానవాప్త
మవాప్తవ్యం
వర్త
ఏవచ
కర్మణి
ఈ
కర్మలవల్ల
నాకు
కలిగే
లాభమేమీ
లేదు.
ఏ
కర్మలను
కూడా
నా
నిమిత్తమై
నేను
ఆచరించటం
లేదు.
ప్రకృతి
శ్రేయస్సు
నిమిత్తమై
నేను
కర్మలను
ఆచరిస్తున్నాను”
మీరు
దీనిని
చక్కగా
విచారణ
చేసి
తెలుసుకోవాలి.
ప్రతి
ఒక్కటికూడాను
దైవమే
ఆచరిస్తున్నాడు;
దైవమే
నేర్పుతున్నాడు;
దైవమే
అనుసరింపజేస్తున్నాడు.
ఈ
సత్యాన్ని
గుర్తించటానికి
మీరు
ప్రయత్నం
చేయాలి.
మనస్సు
పెడితే
క్షణములో
దీనిని
గుర్తించవచ్చును.
కాని,
విశ్వాసమే
లేకుండిన
ఎంతకాలమైనను
మీరు
గుర్తించలేరు.
నేను
పెట్టిన
అడుగు
ఎప్పుడూ
వ్యర్థమైనది
కాదు.
నేను
ఒక్కొక్క
అడుగు
వేసినప్పుడు
ఒక్కొక్క
విధమైన
ధర్మము
ఆచరిస్తూనే
ఉన్నాను.
నేను
సంకల్పము
చేయనిది
ఈ
జగత్తే
పనిచేయదు.
కాని
ఈ
సంకల్పములను,
ఈ
ధర్మాచరణను
మీరు
ఏ
మాత్రము
అర్థము
చేసుకోలేకపోతున్నారు.
భగవంతుడు
కేవలం
ప్రాణుల
నిమిత్తమై
వచ్చినటువంటివాడేగాని,
తన
నిమిత్తమై
తాను
వచ్చినటువంటివాడు
కాడు.
భగవంతుడు
బింబము,
లోకము
ప్రతిబింబము.
ఇటువంటి
ప్రతిబింబమైన
ఈ
ప్రపంచము
నన్ను
అనుసరిస్తూనే
ఉంటుంది.
నీతి
కలిగిన
జాతియే
నిజమైన
మానవజాతి
మనం
చేసే
ప్రతి
కర్మ
దైవనిమిత్తంగానే
ఉండాలి.
దైవము
తాను
చేసే
ప్రతి
కర్మను
మన
నిమిత్తమై
చేస్తున్నాడు.
కాబట్టి
మనం
కూడా
ప్రతి
కర్మను
దైవనిమిత్తమై
ఆచరించాలి.
దైవ
ప్రీత్యర్థం
చేయాలి.
మనం
ముఖ్యంగా
పాపభీతి,
దైవప్రీతి,
సంఘనీతి
ఈ
మూడింటినీ
అలవర్చుకోవాలి.
నీతి
కలిగినజాతియే
మానవజాతి.
నీతియే
లేకుండిన
అది
మానవజాతియే
కాదు.
నీతిని
అనుసరించువాడే
మానవుడు.
నీతి
అనేది
పాపభీతివల్లనే
కల్గుతుంది.
పాపభీతి
దైవప్రీతివల్లనే
లభిస్తుంది.
దైవప్రీతిచేతనే
మానవజాతి
నిలువగల్గుతుంది.
కాని,
ఈనాటి
మానవుడు
నీతి
అంటే
ఏమిటో
తెలుసుకోవటం
లేదు.
పశుపక్షిమృగాదులు
కూడను
తమతమ
జాతినీతులను
అనుసరిస్తూ
ఉన్నాయి.
కాని
మానవుడు
మాత్రం
మానవనీతిని
అనుసరించటం
లేదు.
తన
నీతిని
తాను
అనుసరిస్తే
భగవంతుడు
తప్పక
అనుగ్రహిస్తాడు.
నీతి
అనేది
మన
సహజలక్షణమై
ఉండాలి.
దైవప్రీతిని
మనం
అభివృద్ధిపరచుకోవాలి.
అప్పుడే
మనలో
మానవత్వము
వికసిస్తుంది;
లోకమంతా
సుక్షేమంగా
అభివృద్ధి
అవుతుంది.
4
▾
Meaning
Keep
ఏ
మానవుడైనా,
ఎక్కడున్నా
తాను
నీతిపై
ఆధారపడినప్పుడే
జీవితంలో
ముందుకు
సాగగలడు.
నీతియే
మానవుని
యొక్క
నిజమైన
కీర్తి.
ఇట్టి
కీర్తిని
సంపాదించుకునే
నిమిత్తం
మీరు
పాటుపడాలి.
నీతి
నియమాలను
పాటించటమే
నిజమైన
పూజ
భగవంతునికి
పూజ
చేయటమంటే
ఏమిటి?
కేవలం
పూవులర్పించి
మంత్రాలు
వల్లిస్తే
సరిపోదు.
భగవంతుని
ఆజ్ఞను
అనుసరిస్తూ
నీతి
నియమాలను
పాటించటమే
నిజమైన
పూజ.
మనం
ఏవో
పుణ్య
కార్యాలు
ఆచరిస్తున్నాము,
సంతర్పణలు
చేస్తున్నాము,
భగవంతుని
కీర్తిస్తున్నాము.
ప్రార్థిస్తున్నాము
అని
తృప్తిపడుతున్నాము.
కాని
ఇవేవీ
భగవంతునికి
అక్కర్లేదు.
మీరు
చేసే
ప్రార్థనలన్నీ
మీ
నిమిత్తం
మీరు
చేసుకుంటున్నారు
గాని,
భగవంతుని
నిమిత్తం
కాదు.
జపము,
తపము,
యోగము,
మంత్రము,
యంత్రము,
తంత్రము......
అన్నీ
మీ
నిమిత్తమై
మీరు
ఆచరించేవే
గాని,
భగవంతునికి
ఏదీ
అక్కర్లేదు.
భగవంతుణ్ణి
మీరీవిధంగా
ప్రార్థించనక్కర్లేదు.
మీ
కర్తవ్యాన్ని
మీరు
సక్రమంగా
నిర్వర్తిస్తే
భగవంతుని
ప్రేమానుగ్రహాలు
మీకు
సహజంగానే
ప్రాప్తిస్తాయి.
కాని,
మీ
కర్తవ్యాన్ని
మీరు
సక్రమంగా
నిర్వర్తించటం
లేదు.
ఇంక
భగవత్ప్రేమ
మీకు
ఏవిధంగా
లభిస్తుంది?
భగవంతుడు
క్షణక్షణమూ
మానవుని
క్షేమమును
గురించే
యోచిస్తూ
ఉన్నాడు.
భగవంతుడు
ఎక్కడున్నాడంటే,
సర్వత్రా
ఉన్నాడు.
మనం
ఎక్కడుంటే
అక్కడ
భగవంతుడు
ఉన్నాడు.
అటువంటి
భగవంతుడు
మనకు
దూరంగా
ఎక్కడో
ఉన్నాడనుకోవటం
వెఱ్ఱితనం!
మనల్ని
కాపాడేవి
సత్య
ధర్మములే!
ముకుందన్
(కేరళరాష్ట్ర
సాయిసంస్థల
అధ్యక్షులు)
తన
ప్రసంగంలో
చెప్పినట్లుగా
సత్యమే
దైవము,
దైవమే
సత్యము.
కనుక,
మనం
సత్యాన్ని
కాపాడుతూ
రావాలి.
భారతీయసంస్కృతి
“సత్యం
బ్రూయాత్
ప్రియం
బ్రూయాత్
నబ్రూయాత్
సత్యమప్రియం...”
అని
ప్రబోధిస్తోంది.
అంతేకాదు.
“సత్యం
వద,
ధర్మం
చర”
సత్యమును
పలకాలి,
ధర్మమును
ఆచరించాలి.
సత్యధర్మములే
ఈ
జగత్తుకు
మూలాధారములుగా
నిలిచినవి.
ఎక్కడికి
వెళ్ళినప్పటికీ
సత్యధర్మములే
మన
ఇంట,
వెంట
జంట
ఉండి
మనల్ని
కాపాడుతూ
ఉంటాయి.
ఆనందముగాని,
సుఖముగాని
సత్యము
నుండియే
ఆవిర్భవిస్తున్నాయి.
5
▾
Meaning
Keep
అట్టి
సత్యాన్ని
ఆచరించకుండా
అసత్యంపై
ఆధారపడి
తిరుగుతుంటే
మనకు
ఆనందము
ఏరీతిగా
లభిస్తుంది?
ఈనాటి
మానవుడు
నోరెత్తితే
అంతా
అసత్యమే!
అడుగు
పెట్టినదంతా
అధర్మమే!
సత్యధర్మాలను
కాపాడేవారిని
భగవంతుడు
అన్నివేళలయందు
కాపాడుతుంటాడు.
ఈ
ప్రకృతియందు
ఎక్కడ
చూసినా
సత్యమే
కనిపిస్తున్నది.
సత్యమునకు
మించినటువంటిది
ఎక్కడ
కూడా
మనకు
కనిపించదు.
కాని
మనం
సత్యమును
మరుగుపరచి
అసత్యమును
అనుసరిస్తున్నాము.
అందువల్లనే
ఈనాడు
అధర్మమనేది
అభివృద్ధి
అవుతూ
వస్తున్నది.
ప్రేమస్వరూపులారా!
సత్యమే
మన
జీవితము.
ఈ
సత్యమే
మన
సర్వస్వమునూ
కాపాడుతూ
వస్తుంది.
“లవ్
ఆఫ్
గాడ్”
(దైవప్రీతి)
ఒక్కటి
ఉంటే
చాలు.
పాపభీతి,
సంఘనీతి
రెండూ
సంప్రాప్తిస్తాయి.
సత్య
ధర్మములను
ప్రమాణంగా
పెట్టుకొని,
మన
జీవితాన్ని
సక్రమమైన
మార్గంలో
పెట్టినప్పుడు
క్షణక్షణమూ
మనకు
ఆనందము
లభ్యమవుతూ
ఉంటుంది.
మీకు
ఆనందము
లభ్యము
కాకుండినట్లైతే
నా
దగ్గరకు
రండి,
తప్పక
నేను
చూపుతాను.
ధర్మమును
మనం
సరియైన
రీతిలో
ఆచరించాలి.
“త్రికాలాబాధ్యం
సత్యం”
మూడు
కాలములందునూ
మార్పు
చెందనటువంటిదే
సత్యము.
మార్పు
చెందేటటువంటిది
సత్యము
కానే
కాదు.
సత్యమును
ధర్మరీతిగా
ఆచరించినప్పుడు
దైవము
మన
వెంటనే,
జంటనే,
ఇంటనే
ఉంటుంటాడు.
మన
జీవిత
మంతయు
సత్యధర్మములపైనే
ఆధారపడి
ఉంటున్నది.
కాని
ఈనాడు
పిల్లలకు
మనం
సత్యధర్మములను
గురించి
సరిగా
బోధించటం
లేదు.
“నాయనా!
ఆడిన
మాట
తప్పకూడదు”
అని
బోధిస్తున్నామేకాని,
సత్యమే
భగవత్స్వరూపమనే
విషయాన్ని
పిల్లలకు
బోధించటం
లేదు.
సత్యమే
ప్రత్యక్ష
దైవమని,
సత్యమే
వారిని
సర్వవిధాలుగా
రక్షిస్తుందని
బోధించాలి.
సత్యమనే
పదము
యొక్క
సరియైన
అర్థమును
వారికి
వివరించకుండా
“సత్యం
పలుకు,
సత్యం
పలుకు”
అని
చెబుతుంటే
ఎట్లా
పలుకుతారు
పిల్లలు?
సత్యాన్ని
తప్పితే
అసలు
ధర్మమే
లేదు.
“సత్యాన్నాస్తి
పరో
ధర్మః”
సత్యము
వేర్ల
వంటిది.
ధర్మమనేది
కొమ్మలు,
రెమ్మలవంటిది.
మానవుడు
అనుభవించే
సుఖసంతోషాలు
దానియొక్క
ఫలములే!
కనుక
మనం
సత్యధర్మాలను
ఆధారం
చేసుకొని
జీవితాన్ని
గడుపుతూ
రావాలి.
సత్యమే
ప్రేమకు
ప్రధానమైన
మిత్రుడు.
ప్రేమ,
సత్యముల
ద్వారానే
మనం
ధర్మమును
పోషించు
కోవటానికి
వీలవుతుంది.
6
▾
Meaning
Keep
ప్రేమ,
సత్యము,
ధర్మము...
ఈ
రీతిగా
పేర్లు
వేరువేరుగా
ఉన్నప్పటికీ
వీటిన్నింటిలోనూ
అంతర్లీనంగా
ఉన్న
దివ్యత్వము
ఒక్కటే!
ఈ
సాధనలను
చూస్తే
నాకు
నవ్వొస్తుంది!
ఈనాడు
మనము
ఏమి
చూసినా,
ఏమి
చేసినా
సత్యమైనటువంటివి
చేయటం
లేదు.
చాలామంది
సాధనలు
చేస్తున్నారు.
ఈ
సాధనలను
చూస్తే
నాకు
నవ్వొస్తుంది.
ఇవన్నీ
వ్యర్థమైన
సాధనలే!
పూజలు
చేయటం,
వ్రతములు
చేయటం,
నోములు
నోచటం
.....
ఇవన్నీ
కేవలం
ఆడంబరంతో
చేస్తున్నారు.
ఇవి
సత్యనిత్యమైనటువంటివి
కావు;
ఆత్మసాక్షాత్కారమునకు
తగినటువంటి
సాధనలు
కావు.
ఇవన్నీ
ప్రాకృతమైన
ఆడంబరములే!
ప్రమాణపూర్వకము
కానటువంటి
ఇట్టి
సాధనలను
మనం
ఆచరించటం
వలన
కలిగే
ప్రయోజనమేమిటి?
సత్యమును
ఆధారం
చేసికొనక
చేసే
సాధనలన్నీ
వట్టి
బూటకములే!
సత్యమనేది
ఎప్పటికీ
మారనటువంటిది;
ఎట్టి
కాలమునకూ
ఎట్టి
ప్రదేశమునకూ,
ఎట్టి
పరిస్థితికీ
లొంగనటువంటిది.
సత్యమనేది
హృదయమునుండియే
ఆవిర్భవిస్తుంది.
అట్టి
సత్యమును
మనం
ఆచరిస్తూ
రావాలి.
త్రికరణశుద్ధిగా
మనం
ప్రార్థన
చేయాలి.
ఎట్టి
కాలమునందు
గాని,
ఎట్టి
పరిస్థితియందుగాని
మనం
సత్యాన్ని
వదలకూడదు.
అప్పుడే
సత్యము
మన
వెంట,
జంట
ఉండి
కాపాడుతూ
ఉంటుంది.
అంతేకాదు,
సత్యధర్మములను
మనం
పాజిటివ్
దృక్పథంతో
ఆచరించాలి.
నెగెటివ్
దృక్పథంతో
ఎన్ని
చేసినా
అవన్నీ
గాలిమేడలవంటివే!
పాజిటివ్
దృక్పథంతో,
ప్రేమతో
మనం
ఆచరించాలి.
రూప
నామములే
మాయలో
ముంచుతున్నాయి
ప్రజలారా!
మానవుడు
చాలా
గొప్పవాడే.
కాని,
సత్యధర్మములంటే
ఏమిటో
అతనికి
తెలియకుండా
పోతున్నది.
మానవత్వమునకు
మించిన
దైవత్వము
మరొకటి
లేదు.
కాని,
ఈ
మానవత్వమునకు
మాయాతత్త్వమును
కల్పించి
ఆటలాడుతున్నారు
మానవులు.
చాలా
పొరపాటు.
మానవత్వానికి
దివ్యత్వాన్ని
చేర్చాలి.
కాని
మనము
దివ్యత్వాన్ని
అనుభవించు
కోకుండా
మానవత్వానికి
మానవత్వాన్నే
అతికిస్తూ
కాలం
గడుపుతున్నాము.
దివ్యత్వం
ఒక్కటే
మానవత్వానికి
సార్థకతను
చేకూర్చగలదు.
ఈనాడు
మనం
అనుభవించవలసింది
ఏమిటి?
7
▾
Meaning
Keep
దివ్యత్వం,
దివ్యత్వం,
దివ్యత్వం!
పాజిటివ్,
పాజిటివ్,
పాజిటివ్!
ఇది
ఏనాటికీ
మారనటువంటిది.
ఈ
‘పాజిటివ్’ను
మీరు
క్షణమైనా
వదలకూడదు.
‘నెగెటివ్’
ధోరణి
ఎప్పుడూ
‘నెగెటివ్’
ఫలితాలనే
అందిస్తుంది.
పాజిటివే
మనల్ని
నిరంతరం
కాపాడుతూ
ఉంటుంది.
అంతరాత్మయే
మానవునికి
అన్నివిధాలుగా
సన్మార్గం
బోధిస్తుంటుంది.
ఏదైనా
చేయరాని
పనికి
పూనుకుంటే
“ఓ
మానవుడా!
నీవు
పెడమార్గం
పడుతున్నావు.
ఇది
మంచిది
కాదు”
అని
హెచ్చరిస్తుంటుంది.
అట్టి
అంతరాత్మ
ప్రబోధలను
మీరు
విస్మరించినప్పుడు
దివ్యత్వమనే
‘పాజిటివ్’
మీకు
ఎట్లా
కనిపిస్తుంది?
దివ్యత్వాన్ని
మనం
ఎక్కడికో
పోయి
వెతకన్కర్లేదు.
“అడవిలోననున్న
ఆకసమున
నున్న
పట్టణముననున్న
పల్లెనున్న
గుట్టమీదనున్న
నట్టేట
బడియున్న
దిక్కులేనివానికి
దేవుడే
దిక్కు.”
ఎక్కడ
చూసినా
కనిపించేది
దైవమే!
“నాకంటికి
అతను
కనిపిస్తున్నాడే”
అని
మీరనవచ్చు.
‘అతను’
అనేవాడు
ఎక్కడినుండి
వచ్చాడు?
దైవమునుండియే
వచ్చాడు.
కాబట్టి,
అతను
కూడా
దైవస్వరూపుడే!
అంతా
దైవమే!
ఈ
ప్రపంచంలో
ఎక్కడ
చూసినా
కనిపించేది
ఒక్కడే,
ఒక్కడే,
ఒక్కడే!
సత్యం
ఒక్కటేగాని,
రెండు
కాదు.
అట్లే
సత్యస్వరూపుడైన
దైవం
ఒక్కడే!
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదంతి”.
ఒక్క
దైవాన్ని
మనం
అనేకరకాలుగా
భావించుకుంటూపోతే
తాను
ఎట్లా
కనిపిస్తాడు?
ఎన్ని
పేర్లైనా
పెట్టుకో,
ఎన్ని
రూపాలైనా
కట్టుకో.
కాని,
దైవం
ఒక్కడే
అని
గుర్తుంచుకో!
ఈ
రూపనామములే
నిన్ను
మాయలో
ముంచివేస్తున్నాయి.
ఎన్ని
రూపాలు
మారినా
దైవం
ఒక్కడే!
అల్లా
అన్నా,
జీసస్
అన్నా,
రామా
అన్నా,
కృష్ణా
అన్నా.....
రూపనామములు
వేర్వేరుగాని,
దైవం
ఒక్కడే!
ఇట్టి
ఏకత్వాన్ని
నీవు
గుర్తించి
మనస్సులో
స్థిరం
చేసుకో,
తప్పక
దైవత్వాన్ని
పొందగలవు.
అందరినీ
దైవస్వరూపులుగా
భావించటమే
నిజమైన
భక్తి
దైవానికి
అసలైన
పేరు
‘సత్యం’.
మనం
దైవాన్ని
పిలవాలంటే,
సత్యస్వరూపాయనమః
అంటే
చాలు.
మిగిలిన
పేర్లన్నీ
కల్పితములు.
సత్యమే
దైవము.
సత్యము
నీ
హృదయమునందే
ఉంటున్నది.
దానిని
నీవు
గుర్తించుకుంటే
అంతకంటే
ఘనత
మరొకటి
లేదు.
అది
చాలా
సులభం.
ఒక్క
క్షణంలో
నీవు
సత్యాన్ని
గుర్తించటానికి
వీలౌతుంది.
తల్లియందు,
తండ్రి
యందు,
బిడ్డయందు.....
అందరియందు
కూడా
ఉన్న
సత్యము
ఒక్కటే!
ఇటువంటి
దైవాన్ని
మీరెందుకు
గుర్తించలేకపోతున్నారు?
దైవము
ఒక
ప్రత్యేకమైన
ఆకారముతో
కనిపిస్తాడని
మీరనుకుంటున్నారు.
8
▾
Meaning
Keep
కాని,
దైవానికి
ఒక
ప్రత్యేకమైన
ఆకారము
లేదు.
మీరు
ఎక్కడ
చూస్తే
అక్కడ
ఉన్నాడు.
మీకు
కనిపించేవారందరూ
దైవస్వరూపులే!
ఆవిధమైన
విశ్వాసముతో
మీరు
మెలగండి.
అదే
నిజమైన
భక్తి.
బాలుడు
మొదలుకొని
వృద్ధుని
వరకూ
మీకంటికి
కనిపించే
ప్రతి
వ్యక్తినీ
దైవస్వరూపునిగా
భావించండి.
అప్పుడు
మీ
భక్తి
ఏమాత్రము
చంచలత్వము
లేక
స్థిరముగా
ఉంటుంది.
అంతేగాని,
దేహాభిమానము
పెట్టుకొని
క్షణక్షణమూ
మార్పు
చెందుతుంటే
మీకు
అంతా
అయోమయంగా
ఉంటుంది.
కాబట్టి
దేహాభిమానమును
దూరం
చేసి
దైవాభిమానమును
దగ్గరకు
చేర్చుకోండి.
మీరు
లోకభ్రాంతులను
త్యజించాలి.
దైవప్రేమను
వరించాలి.
అప్పుడే
మీలో
దేహాభిమానము
క్రమక్రమేణ
క్షీణించి
నిజమైన,
స్థిరమైన
భక్తి
కుదురుతుంది.
ఏకత్వాన్ని
మనస్సులో
గట్టిగా
నిల్పుకొని
దైవత్వాన్ని
ప్రార్థించాలి
ఈనాడు
మీలో
భక్తి
స్థిరంగా
ఉండకపోవడానికి
కారణమేమిటి?
మీరు
ఒక్క
రూపముపై,
ఒక్క
నామముపై
దృష్టిని
కేంద్రీకరించటం
లేదు.
ఒక్క
రూపమును,
ఒక్క
నామమును
మీ
హృదయంలో
పెట్టుకోవాలి.
మీరు
లక్షార్చన
చేసే
సమయంలో
“కేశవాయ
నమః
మాధవాయ
నమః
నారాయణాయ
నమః....”
అని
ఎన్ని
పేర్లు
చెప్పినా
పూజించేది
ఒక్కరినే
కదా!
ఇట్టి
ఏకత్వాన్ని
గుర్తించి,
మనస్సులో
స్థిరంగా
నిల్పుకొని
దైవత్వాన్ని
ప్రార్థించాలి.
ఎక్కడ
చూసినా
ఉన్నది
దైవమే!
“ఇందుగలడందు
లేడని
సందేహము
వలదు.....”
కాబట్టి
మనం
ఒకే
దైవాన్ని
మనస్సులో
గట్టిగా
నిల్పుకున్నప్పుడు,
తాను
ఎందెందు
చూస్తే
అందందె
కనిపిస్తాడు.
ఇట్టి
ఏకత్వాన్ని
గుర్తించండి.
ఏకత్వాన్నే
దర్శించటానికి
ప్రయత్నం
చేయండి.
ఏకత్వంలో
లీనం
కావటానికి
ప్రయత్నం
చేయండి.
దైవత్వాన్ని
గుర్తించాలంటే
ఒక్క
సత్యమే
మనకు
చాలు.
ఆ
సత్యానికే
ఒక
పేరున్నది.
ఆ
పేరుకు
ఒక
రూపమున్నది.
దానిని
మీరు
ఆధారం
చేసుకోండి,
అనుసరించండి.
అప్పుడే
అది
మీకు
సాక్షాత్కరిస్తుంది.
రూప
నామములపై
భ్రమలు
పెట్టుకోకండి.
ఈనాటి
యువకులు
చంచలమనస్కులు
కావటానికి
కారణం
ఇటువంటి
భ్రమలే!
దైవత్వం
ఒక్కటేనని
విశ్వసించండి.
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదంతి.”
సత్యం
ఒక్కటే
ఒక్కటి.
ఆ
ఒక్కదానినే
మీరు
ఆధారం
చేసుకోండి.
మీరు
ఎక్కడికి
వెళ్ళినా,
ఎక్కడ
చూసినా
అదే
మీకు
సాక్షాత్కరిస్తుంది.
9
▾
Meaning
Keep
భగవంతుడు
ఏదో
ఒక్కచోటికి
మాత్రమే
పరిమితమైనవాడు
కాడు.
సర్వత్రా
ఉన్నది
తానే!
ప్రవృత్తిమార్గమును
అనుసరించిన
కంసునికి
ఏ
గతి
పట్టింది?
అతను
‘కృష్ణా!’
అన్నప్పుడల్లా
అతనికి
కృష్ణుడు
కనిపించాడు.
కాని,
తాను
చూసింది
మాయా
కృష్ణుడై
ఉండవచ్చునని
భావించాడు.
దేహాభిమానము
గలవాడు
కంసుడు.
కనుకనే,
కృష్ణుని
దివ్యత్వాన్ని
తాను
గుర్తించలేకపోయాడు.
మీరు
ఆత్మాభిమానమును
అభివృద్ధిపరచుకోవాలి.
అప్పుడే
మీకు
దైవము
సాక్షాత్కరిస్తాడు.
ఆత్మ,
ఆత్మ,
ఆత్మ....
ఆత్మనే
మీరు
దృష్టియందు
ఉంచుకోవాలి.
ఆత్మ
ఒక్కటేగాని,
అనేకం
కాదు.
దేహాత్మ,
జీవాత్మ,
పరమాత్మ....
ఈ
అన్ని
పదాలలోనూ
ఉన్న
ఆత్మ
ఒక్కటే
కదా!
ఆత్మతత్త్వమే
దైవత్వము.
అట్టి
ఆత్మతత్త్వాన్ని
దృఢంగా
విశ్వసించండి.
ఆత్మ
మీ
ఇంటనే,
వెంటనే,
జంటనే
ఉన్నది.
అది
తప్ప
రెండవది
ఈ
ప్రపంచంలో
ఎక్కడ
చూసినా
కానరాదు.
ప్రేమస్వరూపులారా!
మీరందరూ
కాలాన్ని
ఎంత
వ్యర్థం
చేస్తున్నారో!
కాలముతోపాటు
పవిత్రమైన
మీ
కాయమును
కూడా
వ్యర్థం
చేస్తున్నారు.
పిచ్చి
పిచ్చి
భ్రాంతులతో
మునిగి
సాధనలు
చేస్తున్నారు.
మీ
కంటికి
కనిపించేదంతా
దైవస్వరూపంగానే
భావించండి.
దోమ
కూడా
దైవమే
అనుకోండి.
చీమకూడా
దైవమే
అనుకోండి.
త్యాగరాజు
చెప్పాడు
“చీమలో
బ్రహ్మలో
శివకేశవాదులలో
ప్రేమ
మీర
వెలసియుండే
బిరుదు
వహించిన
రామా,
నన్ను
బ్రోవరా!”
చీమ
నుండి
బ్రహ్మ
వరకు
అంతా
దైవమే!
చీమకూడా
బ్రహ్మమే!
చీమ
చిన్నదేగాని,
అది
కుడితే
ఎంత
బాధ
కల్గుతుంది!
“చీమలు
కట్టిన
పుట్టలు
పాముల
కిరువైనయట్లు...”
చిన్న
చిన్న
చీమలే
పెద్ద
పెద్ద
పుట్టలు
కట్టుకుంటాయి.
ఆ
చీమలో
బ్రహ్మమే
లేకపోతే
దానికంతటి
శక్తి
ఎక్కడి
నుండి
వచ్చింది?
అణువులో
ఘనమున్నది,
ఘనములో
అణువున్నది.
అంతా
దైవత్వమే!
దైవత్వము
లేని
ప్రాణిగాని,
ప్రదేశముగాని
మనకు
ఎక్కడా
కనిపించవు.
ఈనాటి
యువతకు
దైవత్వమంటే
ఏమిటో
అర్థం
కావటం
లేదు.
ఎందుకంటే,
యౌవనంలో
ఉడుకురక్తం
ఉరకలేస్తుంటుంది;
మనస్సు
స్థిరంగా
ఉండదు.
అస్థిరమైన
మనస్సుతో
దైవత్వాన్ని
ఏరీతిగా
గుర్తించగలరు?
అస్థిరత్వాన్ని
దూరం
చేసుకొని
స్థిరత్వాన్ని
పోషించుకోవాలి.
అప్పుడే
మీరు
దైవత్వాన్ని
కాంచగలరు.
10
▾
Meaning
Keep
“దర్శనం
పాపనాశనం....”
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
కేరళ
నుండి
మూడు
వేలమంది
యువజనులు
ఇక్కడికి
వచ్చారు.
మీరందరూ
ఎంత
ప్రేమతో
ఇక్కడికి
వచ్చారో
అట్టి
ప్రేమను
దినదినాభివృద్ధి
గావించుకోండి.
ఆ
ప్రేమనే
దైవంగా
భావించండి.
ఆ
ప్రేమనే
మీకు
అన్నివిధాలుగా
చేయూతనిస్తుంది.
అంధుడైన
సూరదాసు
కారడవులలో
ప్రయాణమై
వెళుతూ
కృష్ణునికోసం
పరితపిస్తున్నాడు.
అప్పుడు
కృష్ణుడే
ఒక
చిన్నపిల్లవాని
రూపంలో
వచ్చి
“సూరదాసూ!
నేను
బృందావనం
వెళుతున్నాను.
నా
చేయి
పట్టుకో.
నిన్ను
కూడా
నావెంట
తీసుకు
వెళతాను”
అన్నాడు.
బృందావనం
పేరు
వినేటప్పటికి
సూరదాసుకు
ప్రాణం
లేచివచ్చింది.
ఆ
పిల్లవాడు
‘నా
చేయి
పట్టుకో’
అన్నాడు.
కాని
సూరదాసుకు
ఇంకా
మాయ
పూర్తిగా
తొలగలేదు.
అతని
దగ్గరున్న
కర్రను
పట్టుకున్నాడు.
అప్పుడా
పిల్లవాడు
క్రమక్రమేణా
ఆ
కర్రను
చిన్నదిగా
చేస్తూ
వచ్చాడు.
ఇంక
సూరదాసు
చేయికి
ఆ
పిల్లవాని
చేయి
తగులుతుంది.
అప్పుడా
పిల్లవాడు
తానే
కృష్ణుడనన్న
సత్యాన్ని
తెలియపరచాడు.
“సూరదాసూ!
అడవులందున్న
ఆకసముననున్న
పట్టణముననున్న
పల్లెనున్న
గుట్టమీదనున్న
నట్టేటపడియున్న
దిక్కులేనివానికి
దేవుడే
దిక్కు.
నీవు
దిక్కులేని
వాడనని
చింతించకు.
నీకు
నేనున్నాను”
అన్నాడు.
సూరదాసుకి
కృష్ణుని
చేయి
తగిలింది.
ఆ
దివ్యస్పర్శ
చేతనే
అతనికి
దైవత్వం
ప్రాప్తించింది.
అంతవరకు
కృష్ణుని
మాటలను
శ్రవణం
చేశాడు,
మననం
చేశాడు.
కాని,
కృష్ణుని
స్పర్శన
భాగ్యం
కల్గలేదు.
కృష్ణుని
చేయి
తగిలిన
తక్షణమే
సూరదాసు
ఆనందపారవశ్యంతో
“కృష్ణా!
కృష్ణా!”
అని
అరిచాడు.
అంతకుముందు
‘ఏయ్
అబ్బాయ్!
ఏయ్
అబ్బాయ్!’
అని
సంబోధిస్తూ
వచ్చిన
సూరదాసు
చేయి
తగిలిన
తక్షణమే,
‘కృష్ణా!’
అని
పిలిచాడు.
“దర్శనం
పాపనాశనం,
స్పర్శనం
కర్మ
విమోచనం,
సంభాషణం
సంకటనాశనం”
అన్నారు.
ఈ
మూడింటినీ
అనుగ్రహించటానికే
భగవంతుడు
వస్తుంటాడు.
కృష్ణుడు
సూరదాసుకు
దారి
చూపే
నిమిత్తం
వచ్చాడు.
తరువాత
అతనితో
సంభాషణ
సల్పాడు.
చివరికి
తన
స్పర్శనంతో
కర్మవిమోచనం
కలిగించాడు.
కాబట్టి
దైవము
యొక్క
స్పర్శనమూ
కావాలి,
సంభాషణమూ
జరగాలి
దర్శనమూ
కావాలి.
కేవలం
దర్శనమైనంత
మాత్రాన
చిక్కినదానిని
దక్కించుకోవటం
చాలా
కష్టం.
11
▾
Meaning
Keep
Also in his talks
(27)
5 September 1987
Today satsaṅga is what man needs most urgently
5 October 1992
What man must seek is real, eternal happiness
23 November 1997
The God who fills everything is ‘I’
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
14 April 1998
God pervades all
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
21 November 1999
No sādhana greater than service
26 March 2001
The principle that is the root and base
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
25 December 2001
Though faiths differ, Mādhava is one
16 March 2003
The principle of Prema: the divine power of attraction
21 March 2004
I am you, you are I
15 April 2004
The principle of Prema is Divinity itself
17 October 2004
Develop the Feeling of the One Ātma
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
25 December 2004
Pray for the Sake of God's Prema
8 March 2005
Śivatva is the very consciousness in all beings
23 November 2005
All Are Embodiments of God
26 February 2006
All is full of Brahman
30 March 2006
See only good, do only good, be good
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
2 May 2006
The body itself is the temple; you yourself are God
11 August 2006
Divinity is attained only through Prema for God
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
24 May 2008
Remembering the Name is the way across
దర్శన,
స్పర్శన,
సంభాషణల
కోసమై
మీరు
ప్రాకులాడుతూ
ఉండాలి.
సర్వతః
పాణి
పాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శ్రుతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి
అందరిలో
ఉన్నది
తానే!
అన్ని
శిరస్సులూ,
అన్ని
హస్తములూ,
అన్ని
పాదములూ
తనవే!
ఒకే
దైవము
అనేక
రూపనామములను
ధరించి
ఉన్నాడు.
ప్రతి
వ్యక్తీ
దైవస్వరూపుడే!
మీరిక్కడ
ఇన్నివేలమంది
దైవాలను
దర్శించగల్గుతున్నారంటే,
ఎంత
అదృష్టము!
దైవమే
తన
యందుండగా
మానవుడెట్లు
అల్పుడవుతాడు?
మీరు
మానవులు
కారు,
నిజంగా
దైవస్వరూపులే!
దైవమే
మానవాకారము
ధరిస్తూ,
మానవునిగా
నటిస్తూ
ఈ
జగత్తులో
సంచరిస్తున్నాడు.
కనుక
మానవులందరూ
దైవస్వరూపులేనని
విశ్వసించండి.
“దైవం
మానుషరూపేణ”.
మానవరూపంలో
ఉన్న
దైవత్వాన్ని
గాఢంగా
విశ్వసించినప్పుడే
మీయందున్న
జీవభావం
పోయి
మీకు
దైవత్వం
ప్రాప్తిస్తుంది.
ఏకత్వాన్ని
గుర్తించినప్పుడు
జీవత్వమే
దైవత్వంగా
మారిపోతుంది.
Previous
←
If you remember the name of Rāma, neither attachment nor disease will cling to you
Next
The principle of Prema is Divinity itself
→