Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2005 · Recognise the fundamental principle
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Recognise the fundamental principle
23 June 2005, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
వ్యష్టికి,
సమష్టికి
అతీతమైన
పరమేష్ఠి
తత్త్వాన్ని
అర్థం
చేసుకోవడం
చాలా
కష్టమని
పలుకుతూ
శ్రీవారు
ఈవిధంగా
శెలవిచ్చారు:
“మా
గోకాక్
(వి.కె.)
కూడా
మొట్టమొదట
ఇదే
స్థితిలో
ఉండినాడు.
అతను
ఎంతో
కాలము
అరవిందాశ్రమంతో
సంబంధము
పెట్టుకున్నాడు;
పెద్దపెద్ద
గ్రంథములు
చదివాడు.
కాని,
ఏది
సత్యము?
ఏది
నిత్యము?
అనేది
తాను
అర్థం
చేసుకోలేకపోయాడు;
ఆత్మ,
అనాత్మల
మధ్యగల
భేదతత్త్వమును
గుర్తించుకోలేకపోయాడు.
2
▾
Meaning
Keep
ఎక్కడ
చూసినా
ఆత్మయే
కనిపిస్తున్నది;
అనాత్మ
అనేది
కనిపించడం
లేదు.
ఈవిషయాన్ని
గోకాక్
కొంతకాలానికి
సుస్పష్టంగా
గుర్తించగలిగాడు.
ఆ
సమయంలో
నేనతనికి
అండదండగా
నిలిచాను.
నిజమైన
భక్తునికి
భగవంతుని
సహాయము
ఎల్లప్పుడు
ఉంటుంది.
ఆ
సహాయము
ఏదో
అప్పటికప్పుడు
చేసేది
కాదు.
అది
శాశ్వతమైన,
సత్యనిత్యమైన
సహాయము.
కొంతకాలము
తరువాత
గోకాక్
నాకు
శాశ్వతంగా
సమీపుడైనాడు.
సందేహాలను
వదలిపెట్టి,
నిస్సంశయుడై,
నిరాకార
సంబంధమైనటువంటి,
నిత్య,
శుద్ధ,
బుద్ధ,
ముక్త,
నిర్మలస్వరూప
మైనటువంటి
మూలాధార
తత్త్వమును
తాను
గట్టిగా
పట్టుకున్నాడు.
అట్టి
నిస్సంశయమైన
స్థితియందే
సత్యము
సాక్షాత్కరిస్తుంది;
మోక్షము
ప్రాప్తిస్తుంది.
మోక్షమంటే
ఏమిటి?
మోహక్షయమే
మోక్షము.
సత్యము
నీయందు,
నాయందు,
అందరియందు
ఏకత్వంగా
ఉంటున్నది.
కనుక,
సత్యమును
ఆధారము
చేసుకున్నటువంటివారికి
ఎన్నటికీ
మార్పు
కలుగదు.
అన్నీ
మార్పు
చెందుతాయిగాని,
సత్యమునకు
మాత్రం
ఎట్టి
మార్పూ
కలుగదు.
ప్రతి
మానవుడు
ఆత్మవిచారణద్వారా
నిత్యసత్యమును
తెలుసుకోవాలి
ఈ
సత్యము
ఎటువంటిది?
ఎవరికీ
కనిపించేది
కాదు,
వినిపించేది
కాదు.
అయితే,
కనిపించినట్లుగా,
వినిపించినట్లుగా
అనిపిస్తుంది.
కాని,
రెండింటికీ
అతీతమై
ఉంటుంది.
అట్టి
సత్యమును
గుర్తించడానికి
మనము
తగిన
కృషి
చేయాలి.
ఈ
ప్రపంచములో
మనం
ఏదో
ఆడుకుంటూ,
పాడుకుంటూ
కాలమును
గడుపుతున్నామేగాని,
ఇదంతా
నిత్యము
కాదు.
గోకాక్
ఈ
సత్యమును
చక్కగా
గుర్తించుకున్నాడు
కనుకనే,
మూలాధార
తత్త్వమును
గట్టిగా
పట్టుకున్నాడు.
తాను
అరవిందాశ్రమములో
ఉండగా
‘సావిత్రి’
అనే
గ్రంథమును
చదివినాడు.
ఆ
సావిత్రినే
ఆధారము
చేసుకున్నాడు.
సావిత్రి
అనే
పేరు
ఆడవారికి
సంబంధించినదిగా
అనిపిస్తుందిగాని,
ఇక్కడ
సావిత్రి
ఆడా
కాదు,
మగా
కాదు.
“సావిత్రి
నాకు
ఫండమెంటల్
ప్రిన్సిపుల్”
(మూలాధార
తత్త్వము)
అని
అతను
భావించాడు.
కట్టకడపటికి
తాను
ఆ
తత్త్వమును
దర్శించాడు.
3
▾
Meaning
Keep
Also in his talks
(20)
23 November 1978
Faith Is the Foundation of the Spiritual Path
8 November 1986
Through the Name we can attain the Named!
30 September 1987
Understand the Sai principle well
5 March 1992
‘Adhyātmavidyā vidyānāṁ’
14 January 1995
Prema is like a compass
24 June 1996
A Life without Character Is a Lifeless Life
17 July 1997
The principle of the Ātma and divinity
21 April 1998
The body itself is foremost for the practice of Dharma
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
2 April 2003
Leave the delusion of the body; think of God
18 May 2003
Prema is the very essence of the Paramātma
21 October 2003
I have come only to reveal your true nature
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
21 May 2006
Service to society is itself the right sādhana
11 August 2006
Divinity is attained only through Prema for God
28 July 2007
Every human being is God
గోకాక్
ప్రతి
రోజు
ప్రొద్దున్న,
సాయంకాలం
రెండు
వేళల
నాదగ్గరికి
వచ్చేవాడు.
“స్వామీ!
మీరు
చెబుతున్న
విషయాలద్వారా
నా
సందేహాలెన్నో
తీరినాయి”
అనేవాడు.
అతడు
సత్యమును
ఏవిధంగా
తెలుసుకున్నాడంటే
...
తనయందున్న
నిత్యసత్యమైన
భావములనే
విచారణ
చేశాడు.
ప్రతి
మానవునియందు
ఆ
Inner
enquiry
అనేది
ఒకటి
ఉంటుంది.
అది
అందరికీ
కనిపించదు.
అయితే,
అది
ఎప్పుడో
ఒకతూరి
జ్ఞాననేత్రమును
తెరిపిస్తుంది.
ఒక
పర్యాయము
గురుపూర్ణిమ
పండుగ
సమీపిస్తుండగా
గోకాక్
నా
దగ్గరకు
వచ్చి,
“స్వామీ!
నేను
పయనిస్తున్న
మార్గంలో
వెలుగు
నాదగ్గరకు
వచ్చినట్లుగా
కనిపిస్తున్నది”
అన్నాడు.
తిరిగి
ఆరోజు
సాయంకాలం
నాదగ్గరికి
వచ్చే
సమయంలో
ఎంతో
ఆనందంగా
కనిపించాడు.
“ఏం
గోకాక్,
చాలా
ఆనందంగా
ఉన్నావే!”
అన్నాను.
“ఈ
ఆనందము
నానుండి
వచ్చినటువంటిది
కాదు
స్వామీ!
ఇది
మీ
అనుగ్రహ
ప్రసాదమే”,
అన్నాడు.
అది
ఎటువంటి
ఆనందము?
నిత్యానందం
పరమ
సుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం
గగన
సదృశం
తత్త్వమస్యాది
లక్ష్యం
ఏకం
నిత్యం
విమలమచలం
సర్వధీ
సాక్షిభూతం
భావాతీతం
త్రిగుణరహితం....
“అయితే,
ఆ
స్థాయిలోనే
నిలువు”
అని
చెప్పాను.
మరునాడు
తెల్లవారిన
తరువాత
వచ్చాడు,
“స్వామీ!
మీ
అనుగ్రహంవల్ల
నేను
అందులోనే
నిలువగలిగాను”
అని
చెప్పాడు.
ఆ
స్థితిలో
ఇంక
అతనిని
ఎక్కువ
మాట్లాడించకూడదని,
“గోకాక్!
నీవింక
వెళ్ళు.
నీ
పని
నీవు
చూసుకో.
నీ
విషయంలో
భవిష్యత్తులో
జరుగవలసినవి
నేను
చూసుకుంటాను”
అని
అతనికి
అభయమిచ్చాను.
అంతటితో
మా
ఇద్దరిమధ్య
సంభాషణ
నిలిచిపోయింది.
అతను
వెళ్ళిపోయినాడు.
మరునాడు
బ్రహ్మముహూర్తంలో
వచ్చి
మూడు
తూర్లు
నా
గది
తలుపు
తట్టినాడు;
దానికి
సమాధానంగా
నేను
లోపలినుండి
ఆరు
తూర్లు
తలుపు
తట్టాను.
తాను
అర్థం
చేసుకున్నాడు;
నిశ్శబ్దంగా
వెళ్ళిపోయాడు.
స్వామికి,
గోకాక్కు
మధ్య
ఉండినది
ఆత్మసంబంధము
క్రమక్రమేణా
అతనిలో
ఉన్నటువంటి
దివ్యతేజస్సు
చాలా
ప్రకాశిస్తూ
వచ్చింది.
అతను
ప్రాపంచిక
లక్ష్యమును
పూర్తిగా
మరచిపోయాడు.
4
▾
Meaning
Keep
ఒకనాడు
అతనిని
కన్నులు
మూసుకొమ్మని
చెప్పి
నేను
బొటన
వ్రేలితో
అతని
భ్రూమధ్య
స్థానమును
గట్టిగా
నొక్కాను.
ఆవిధంగా
నొక్కేటప్పటికి
ఇంకా
అతనిలో
కొట్టుమిట్టాడుతున్న
సందేహాలన్నీ
తీరిపోయినాయి.
వెంటనే
గోకాక్,
“స్వామీ!
దేవుడు
ఒక్కడే!
‘నేను’
ఒక్కటే!
ప్రేమ
ఒక్కటే!
ఇంక,
నాకేదీ
అక్కర్లేదు”
అన్నాడు.
ఈవిధంగా
తాను
దివ్యత్వాన్ని
పొందగల్గాడు.
సాధన
చేస్తూ
చేస్తూ
ఉంటే
మనలో
కొన్ని
విధములైన
శక్తులు
బయలుదేరతాయి.
కాని,
వాటినిగురించి
ఏమాత్రం
యోచన
చేయకూడదు.
ఒక్క
మూలాధార
తత్త్వమును
గుర్తించుకుంటే,
అన్నీ
మనకు
లభిస్తాయి.
గోకాక్
దానినే
తన
మనస్సులో
పెట్టుకున్నాడు.
ఒకసారి
నేను
కొడైకెనాల్లో
ఉండగా
అతడు
నాకొక
పెద్ద
టెలిగ్రామ్
ఇచ్చాడు.
దానికి
సమాధానంగా,
"This
is
right.
I
know.
Don't
change
your
mind"
(ఇది
సరియైనది.
నాకు
తెలుసు.
నీ
మనస్సును
మార్చుకోకు)
అని
నేను
అతనికి
టెలిగ్రామ్
ఇచ్చాను.
అప్పటినుండి
అతనికి,
నాకు
మధ్య
కరెస్పాండెన్స్
జరుగలేదు.
అయితే,
ఒకసారి
తన
భార్య
శారదమ్మతో
అతను
ఒక
జాబు
వ్రాయించాడు.
ఆమెకూడా
మహాజ్ఞాని.
ఆమె
రెండు
పదాలు
వ్రాసినా,
అవి
ఎంతో
గొప్ప
అర్థాన్నిచ్చేవిగా
ఉండేవి.
ఆ
తరువాత
అతను
ఏ
గ్రంథమూ
ముట్టలేదు;
ఏ
ప్రశ్నలుకూడా
అడుగలేదు.
“స్వామీ!
మీరిచ్చిన
ఆన్సర్లన్నీ
నా
హృదయానికి
తట్టినాయి”
అని
చెప్పాడు.
“గోకాక్!
నీకు,
నాకు
మధ్య
సంబంధము
ఏదైతే
ఉన్నదో
అది
నీవు
చక్కగా
గుర్తించుకున్నావు.
ఇంక,
నీవు
దేనికీ
యోచన
పెట్టుకోకు”,
అని
చెప్పాను.
ఇంక
అతనికి,
నాకు
మధ్య
ప్రాపంచిక
సంబంధమనేది
దూరమైపోయింది.
మా
మధ్య
ఉండినటువంటిది
ఒకే
సంబంధము
-
అదే
ఆత్మసంబంధము.
మా
ఇద్దరిమధ్య
ఈవిధమైన
సంబంధ
బాంధవ్యము
పెరిగిపోయింది.
కడకు,
అతను
దేహాన్ని
వదిలే
ముందు
స్వామికి
రెండు
మాటలు
వ్రాశాడు:
''
I
reached
You
''
(నేను
మిమ్మల్ని
చేరుకున్నాను).
Previous
←
The feeling of one Ātma is true realisation
Next
No power is greater than Bhakti for God
→