Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2005 · No power is greater than Bhakti for God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
No power is greater than Bhakti for God
21 July 2005, Guru Pūrṇimā, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 544
Also in his talks
(1)
9 March 2005
Karaṇam Subbamma, a Blessed Soul
కట్టడ
యైనయట్టి
నిజ
కర్మము
చుట్టుచు
వచ్చి
యే
గతిం
బెట్టునొ
పెట్టినట్లనుభవింపక
తీరదు;
కాళ్ళు
మీదుగా
గిట్టక
వ్రేలుడంచు
దలక్రిందుగ
గట్టిరె
యెవ్వరైన
నా
చెట్టున
గబ్బిలంబులకు
జేరిన
కర్మము
గాక
మానవా!
పక్షులు
తమ
రెక్కల
సహాయంతో
ఆకాశమునందు
సంచరిస్తూ
ఉంటాయి.
అదేవిధముగా,
రెక్కలు
గల
గబ్బిలముకూడా
సంచరిస్తుంది.
చెట్టుకొమ్మ
దాని
స్వస్థానము.
అయితే,
అది
ఇతర
పక్షులవలెగాక
చెట్టుకొమ్మకు
కాళ్లు
తగిలించి
తల
క్రిందకు
పెట్టుకొని
తన
జీవితము
గడుపుతుంది.
అది
దాని
కర్మము
కాదా!
ఎవరెన్ని
చెప్పిననూ,
ఎవరు
చేసిన
కర్మను
వారు
అనుభవించక
తప్పదు.
ఇది
లోకసహజము.
మహనీయులు
చేసినది
మహనీయులకు,
పామరులు
చేసినది
పామరులకు
తప్పినది
కాదు.
మానవుడు
ఎంతకాలము
జీవించినప్పటికీ,
ఎక్కడికి
వెళ్ళినప్పటికీ
తాను
చేసిన
కర్మల
ఫలితములు
తనను
నీడవలె
వెంటాడుతుంటాయి.
అయితే,
దైవానుగ్రహముచేత
వాటినుండి
తప్పించుకొనవచ్చును.
మానవుడు
ఏమి
పలికినప్పటికీ,
ఏమి
చేసినప్పటికీ
భగవంతుడు,
‘తథాస్తు,
తథాస్తు’
అని
ఆశీర్వదిస్తుంటాడు.
కాని,
మానవుడు
ఈ
సత్యాన్ని
లక్ష్యము
చేయకుండా
సంచరిస్తున్నాడు.
మంచిచెడ్డలు
రెండూ
తనకు
తెలిసి
కూడా
చెడ్డను
తాను
వదలిపెట్టడం
లేదు;
మంచిని
ఆచరించడం
లేదు.
తాను
చేసిన
తప్పును
మూసి
పెట్టుకొని
ఏమీ
తెలియనట్లుగా
సంచరిస్తున్నాడు.
2
▾
Meaning
Keep
Also in his talks
(29)
3 July 1986
The aham-principle arose from the Ātma-principle alone
10 October 1986
A people that has morality is the true people
3 September 1988
The body itself is a temple!
15 October 1988
All Things and All Beings in the World Are Forms of the Paramātma!
7 April 1989
All this is Vāsudeva
23 July 1989
All Religions Together Teach Only the Good
13 August 1989
Good Resolves Are Everlasting
12 September 1989
The Name of God Alone Is the Boat
28 October 1989
Prema Itself Is God
14 August 1990
Role of the Avatars
16 September 1990
Discipline is like our very life-breath
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
28 February 1995
God, master of the three
20 August 1996
Every Man Must Cultivate the Vision of Prema
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
29 April 1998
God Alone Is the Ground of Ānanda
25 August 1998
The Whole World Is Filled with Viṣṇu
10 September 1998
By Sacrifice Some Have Attained Immortality
11 August 2000
Only When There Is Purity of Mind Is There Success
13 March 2002
The divine power of attraction
31 August 2002
God in Human Form
10 October 2002
Earn divine Prema
1 January 2003
Only service done with the feeling of the one Ātma is true service
16 March 2003
The principle of Prema: the divine power of attraction
19 August 2003
The heart alone is Kṛṣṇa's birthplace
15 April 2004
The principle of Prema is Divinity itself
18 April 2005
The wedding of Sītā and Rāma is the union of the Ātma and the Paramātma
11 August 2006
Divinity is attained only through Prema for God
29 September 2006
The basis of human life: ‘Educare’
కాని,
దాని
ఫలితము
మాత్రము
తనను
వదలదు.
మనము
చేసే
కర్మల
ఫలితములన్నీ
కూడుకొని
వస్తాయి.
దేనినీ
తీసి
ప్రక్కన
పెట్టుటకు
వీలుకాదు.
ఎట్టి
పనులు
చేస్తామో
వాటికి
తగినట్లుగా,
మంచికి
మంచి,
చెడ్డకు
చెడ్డ
ఫలితములు
వస్తూనే
ఉంటాయి.
కొందరు
చూడటానికి
చాలా
గొప్పవారుగా
కనిపిస్తారు.
వారు
మాట్లాడే
మాటలు
చాలా
ఘనంగా
ఉంటాయి.
కాని,
వారి
మాటలకు,
చేతలకు
ఏమాత్రం
పొంతన
ఉండదు.
తాము
చేసిన
దుశ్చర్యలకు
తగిన
ఫలితమును
అనుభవించవలసివచ్చినప్పుడు
మాత్రం
ఎవ్వరికీ
తమ
ముఖమును
చూపరు.
అప్పుడు
వారి
గుట్టు
బయటపడుతుంది.
మనం
ఎన్ని
ఘనకార్యములు
చేసినప్పటికీ
మనం
అనుభవించవలసిన
కర్మ
ఫలితము
ననుభవించక
తప్పదు.
ఇది
ఎప్పటికీ
మనస్సులో
పెట్టుకోవాలి.
ఇతరులెరుగకున్న
ఈశ్వరుడెరుగడా!
ప్రేమస్వరూపులారా!
ఈ
సృష్టి
చాలా
చిత్ర
విచిత్రమైనది.
భగవంతుని
చర్యలు
మానవ
మేధస్సుకు
అంతుబట్టవు.
చిత్రంబులు
త్రైలోక్య
ప
విత్రంబులు
భవలతా
లవిత్రంబులు
స
న్మిత్రంబులు
మునిజన
వన
చైత్రంబులు
విష్ణుదేవు
చారిత్రంబుల్
దివ్యత్వము
మనకు
కనిపించదుగాని,
అదే
మనచేత
అన్నీ
అనుభవింపజేస్తుంది.
మనము
చేసిన
కర్మను
ఏవిధముగాను
మూసిపెట్టుటకు
వీలుకాదు.
కొందరు
ఏమీ
తప్పులు
చేయనట్లు
కనిపిస్తారు.
అయితే,
ఇతరులకు
తెలియకున్న
ఈశ్వరునికి
తెలియకుండా
ఉంటుందా!
దైవమునుండి
దేనినీ
మూసిపెట్టుటకు
వీలుకాదు.
నేను
చెప్పే
మాటలను
ఇప్పుడు
మీరు
అర్థం
చేసుకోలేకపోవచ్చు.
కాని,
అనుభవించే
సమయంలో
మీకే
తెలుస్తుంది.
మీరు
అనేక
గ్రంథములను
చదువుతుంటారు.
ఆ
గ్రంథములలో
కావలసినంత
జ్ఞానముంటున్నది.
కాని,
చదివినవన్నింటినీ
ఆచరణలో
పెడుతున్నారా?
లేదు,
లేదు.
మీకు
అవసరమైనవి,
అనుకూలమైనవి
మాత్రమే
తీసుకుంటున్నారు;
మిగిలినవి
వదలి
పెడుతున్నారు.
3
▾
Meaning
Keep
దేనిని
వదలినప్పటికీ
కర్మఫలితమును
మాత్రము
వదలి
పెట్టడానికి
వీలుకాదు.
ఆ
కర్మఫలితము
దానంతట
అదే
వచ్చి
మిమ్మల్ని
పట్టుకుంటుంది.
చెడ్డ
పనులు
ఎంత
చేస్తున్నారో
దానికి
పదింతలు
దుఃఖమును
అనుభవించక
తప్పదు.
దైవానుగ్రహం
కర్మఫలాన్ని
రద్దు
చేయగలదు
విద్యార్థులారా!
‘కర్మఫలమును
తప్పించుకోవటానికి
అసలు
వీలుకాదా?’
అని
మీరు
ప్రశ్నించవచ్చు.
కర్మఫలమును
తప్పించుకోవచ్చు.
నిజమే.
అయితే,
ఎప్పుడు?
దైవానుగ్రహమునకు
మీరు
పాత్రులైనప్పుడే
అది
సాధ్యమవుతుంది.
పండితులు
చెబుతారు,
“కర్మఫలము
తప్పదు,
అది
వెంటాడుతుంది”
అని.
నిజమే.
వెంటాడుతుందిగాని,
దైవానుగ్రహానికి
పాత్రుడైన
వానిని
అది
బాధపెట్టదు.
ఎట్లనగా,
ఒక
చిన్న
ఉదాహరణ
-
ఒక
సీసాలో
మంచి
శక్తిమంతమైన
మందు
ఉంటున్నది.
ఆ
సీసాపైన
‘ఈ
మందుకు
ఈ
ఫలితము’
అని
వ్రాసి
ఉంటుంది.
దానిపైన
Expiry
date
కూడా
ఉంటుంది.
ఆ
గడువు
దాటిన
తరువాత
ఆ
మందు
తన
పటుత్వాన్ని
కోల్పోతుంది.
అప్పుడా
మందును
తీసుకున్నా
ఫలితముండదు.
అదేరీతిగా,
దైవానుగ్రహముచేత
మన
కర్మఫలితము
Expire
అయిపోతుంది.
కనుక,
మనము
దైవానుగ్రహమునకు
పాత్రులం
కావడానికి
కృషి
చేయాలి.
భగవత్సంకల్పాన్ని
మార్చగల
శక్తి
భక్తునియందున్నది
మార్కండేయునికి
ఈశ్వరుడు
16
సం॥ల
ఆయుష్షును
ప్రసాదించాడు.
కాని,
మార్కండేయునికి
ఆ
విషయం
తెలియదు.
అతనికి
పదహారు
సంవత్సరాలు
నిండుతాయనగా
ఆ
ముందు
రోజు
సాయంత్రం
అతని
తల్లిదండ్రులు
ఇంట్లో
ఒక
మూల
విచారంగా
కూర్చుని
ఉండటం
గమనించి
మార్కండేయుడు
కారణమడుగగా,
“నాయనా!
ఈశ్వరుడు
నిన్ను
మాకు
ప్రసాదించే
సమయంలో
నీవు
కేవలం
16
సం॥లు
మాత్రమే
జీవించగలవని
చెప్పాడు.
ఈనాటితో
నీకు
పదహారు
సంవత్సరాలు
నిండుతున్నాయి.
ఇక
నీకు,
మాకు
సంబంధము
తీరిపోతుంది.
రేపటినుండి
నీవెవరో,
మేమెవరో”,
అన్నారు.
ఈ
సంగతి
తనకు
అంతవరకు
తెలియజేయనందుకు
మార్కండేయుడు
బాధపడి,
“ఈవిషయం
నాకు
ముందే
తెలిసి
ఉంటే,
నా
కాలాన్ని
నేను
సద్వినియోగం
చేసుకుని
ఉండేవాడిని
కదా!”
అన్నాడు.
4
▾
Meaning
Keep
వెంటనే
తాను
ఈశ్వరాలయమునకు
వెళ్ళి
శివలింగమును
కౌగిలించుకొని,
“ఓం
నమశ్శివాయ,
ఓం
నమశ్శివాయ”
అంటూ
పంచాక్షరీ
మంత్రాన్ని
జపిస్తూ
కూర్చున్నాడు.
అతని
ఆయుర్దాయం
తీరిపోయేసరికి
యముడు
వచ్చి
పాశము
విసిరాడు.
అది
శివలింగముపై
పడడంతో
ఈశ్వరుడు
ప్రత్యక్షమై
యమధర్మరాజును
మందలించాడు.
మార్కండేయుని
భక్తికి
మెచ్చి,
అతనికి
చుట్టుకున్న
పాశమును
తొలగించి,
“నాయనా!
నీవు
చిరంజీవిగా
వర్ధిల్లు”
అంటూ
అతనిని
దీవించాడు.
మొట్టమొదట
ఈశ్వరుడే
అతనికి
16
సం॥ల
ఆయుర్దాయమును
ప్రసాదించాడు.
కాని,
తరువాత
అతని
భక్తిప్రపత్తులను
చూసి
తన
సంకల్పమును
మార్చుకోవలసివచ్చింది.
దైవానుగ్రహంచేత
మానవుడు
యమపాశమునుండి
సహితం
తప్పించుకో
వచ్చును.
భక్త
మార్కండేయుని
ఉదంతమే
ఇందుకు
చక్కని
దృష్టాంతము.
కాబట్టి,
మనము
నిరంతరము
దైవచింతన
చేస్తూ
ఉండాలి.
చాలామంది
భక్తులు
తమ
అంత్యకాలములో
‘రామా,
కృష్ణా,
గోవిందా...’
అని
నామస్మరణ
చేస్తూ
వుంటారు.
మార్కండేయుని
చరిత్ర
ఋజువు
చేసినట్లుగా,
దైవసంకల్పాన్ని
మార్చగల
శక్తి
భక్తునియందున్నది.
‘సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
హరిచింతనం’
ఒక
పర్యాయము
యముడు
లోకసంచారం
సల్పుతూ
ఉండగా
అతనికి
ఎక్కడ
చూసినా
భక్తులే
కనిపించారు.
“ఎక్కడ
చూసినా
ప్రజలు
నామస్మరణ
చేస్తున్నారే!
వీరిని
నేను
ఎట్లా
తీసికొని
పోయేది?”
అని
సందిగ్ధావస్థలో
పడి
ఈశ్వరుణ్ని
ప్రార్థించాడు.
అప్పుడు
ఈశ్వరుడు
ప్రత్యక్షమై,
“నీ
పాశమును
నీవు
అందరిపైన
వేయవచ్చు.
కాని,
కర్మఫలమును
అనుభవించవలసిన
వారికి
మాత్రమే
అది
తగులుతుంది.
కర్మఫల
శేషము
లేనివారి
దగ్గరకు
కూడా
అది
పోజాలదు.
కనుకనే,
మార్కండేయుడు
నా
సొత్తు
అయినాడు.
అతనిని
నేను
అనుగ్రహించాను”
అని
చెప్పాడు.
దైవమునకు
ఏదీ
అసాధ్యము
కాదు.
తాను
వరమును
ఇవ్వవచ్చు,
కర్మఫలితమును
కేన్సిల్
చేయవచ్చు.
కాబట్టి,
మనము
కర్మఫలితము
తప్పదని
క్రుంగిపోకూడదు,
భయపడకూడదు.
దైవమును
ప్రార్థిస్తే
ఆయన
తప్పిస్తాడు.
ఈవిధంగా,
అనేకమంది
భక్తులకు
బాధలను
తొలగించి
సుఖశాంతులను
ప్రసాదిస్తూ
వచ్చాడు.
5
▾
Meaning
Keep
అయితే,
కొంతమంది
అహంకారులు,
‘ఈ
పనిని
భగవంతుడు
ఎట్లా
చేస్తాడో
చూస్తామ’ని
భగవంతుణ్ణి
‘టెస్ట్’
చేయడానికి
ప్రయత్నిస్తారు.
భగవంతుడు
‘టెస్టు’కు
చిక్కేవాడు
కాడు.
ఆ
‘టెస్టు’
‘వేస్టు’
అయిపోతుంది.
అహంకారము,
అసూయ,
ద్వేషము
ఇత్యాది
దుర్గుణాలు
మానవుణ్ణి
అధోగతి
పాలుచేస్తాయి.
దైవానుగ్రహమునకు
పాత్రులైనవారిని
ఈ
దుర్గుణాలు
ఏమీ
చేయలేవు.
కాబట్టి,
మనము
దైవానుగ్రహమునకు
పాత్రులం
కావాలి.
‘సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
హరిచింతనం’
చేయాలి.
అందుకోసమే
స్వామి
అనేక
విధములైన
సాధనలు
బోధిస్తున్నాడు.
అందులో
నామసంకీర్తన
ఒకటి.
ఎవరు
ఎప్పుడు
దేహాన్ని
విడిచిపెట్టవలసివస్తుందో
ఎవరికీ
తెలియదు.
యమధర్మరాజు
ఏ
క్షణంలోనైనా
వచ్చి
తన
పాశమును
విసరవచ్చు.
ఆ
సమయంలో
ఆ
వ్యక్తి
మంచి
పని
చేస్తున్నాడా,
చెడ్డ
పని
చేస్తున్నాడా
అనేది
తాను
పట్టించుకోడు.
నామసంకీర్తన
చేసే
సమయంలోనే
ఒకరు
పడిపోవచ్చు.
కాబట్టి,
నిరంతరం
దైవచింతన
చేస్తూ
మానవుడు
సంసిద్ధుడై
ఉండాలి.
తాను
దైవానుగ్రహమును
సాధించి,
కర్మఫలమునుండి
తప్పించుకోవడానికి
తగిన
సాధనలు
చేయాలి.
“అయ్యో,
ఇది
తప్పునది
కాదు”
అని
భయపడనక్కర్లేదు.
దైవానుగ్రహముచేత
అన్నీ
తప్పించుకో
వచ్చును.
ప్రార్థన
ఎటువంటి
బాధలనైనా
తప్పిస్తుంది
ప్రేమస్వరూపులారా!
మీరు
ఎన్ని
రకములైన
సాధనలు
చేసినప్పటికీ
దైవచింతనను
మాత్రము
నిమిషమైనా
వదలకూడదు.
అప్పుడే
భగవంతుడు
మిమ్మల్ని
రక్షించటానికి
వీలవుతుంది.
దైవానుగ్రహానికి
దూరం
గావించే
పనులను
చేయకండి.
ప్రార్థనద్వారా
మీరు
దేనినైనా
సాధించవచ్చును.
అయితే,
మీరు
గట్టిగా
ప్రార్థన
చేయనక్కరలేదు;
మనసులో
చేసినా
చాలు.
“గట్టిగా
ప్రార్థన
చేయకపోతే
భగవంతుడు
మమ్మల్ని
రక్షిస్తాడో
లేదో”
అని
కొంతమంది
భయపడుతుంటారు.
భగవంతుడు
మీ
హృదయనివాసి.
కాబట్టి,
మీ
ప్రార్థనలను
తాను
వింటూనే
ఉంటాడు.
దైవానుగ్రహమునకు
మీరు
పాత్రులు
కావాలంటే
మీ
మనస్సునందు,
హృదయమునందు
నిరంతరము
దైవచింతన
చేస్తూ
వుండాలి.
దేహము
ముఖ్యము
కాదు.
6
▾
Meaning
Keep
Also in his talks
(10)
10 December 1986
Faith in the Ātma alone gives all strength
15 September 1988
God's descent is only to make Prema grow
17 June 1996
He Who Reaches God's Presence Is Honoured Everywhere
21 June 1996
Śraddhā and Faith Win God's Grace
10 July 1996
Follow the Religion of Love
23 November 1996
We Must Make Human Life a Life Full of Prema
29 March 1998
God fills every place
12 November 2003
Grow Prema for God and pity for the helpless
7 October 2005
Surrender to God
22 August 2007
Foster faith in God and love of country!
ప్రాకృతమైన
కష్టాలు
ఈపొద్దు
రావచ్చు,
రేపు
పోవచ్చు.
వాటిని
చూసి
మనము
క్రుంగిపోకూడదు.
అయితే,
ప్రార్థన
ఎటువంటి
బాధలనైనా
తప్పిస్తుంది.
‘భజన
బినా
సుఖ
శాంతి
నహీ’
ప్రేమస్వరూపులారా!
మీరు
నిరంతరము
భగవన్నామస్మరణ
చేయండి.
అప్పుడే
మీకు
రక్షణ
కలుగుతుంది.
గాలి
ఏవిధంగానైతే
అంతటా
నిండియున్నదో
అదేరీతిగా
భగవంతుడు
మీలోపల,
వెలుపల,
సర్వత్రా
వ్యాపించి
ఉన్నాడు.
అట్టి
భగవంతునితో
సంబంధమును
మనము
యేనాటికీ
వదలిపెట్టకూడదు.
మీరు
మొట్టమొదట
‘డివినిటీ’ని
విశ్వసించండి.
మీలో
సహజంగా
‘యూనిటీ’
ఆవిర్భవిస్తుంది.
అప్పుడింక,
‘ఎనిమిటీ’కి
ఏమాత్రం
అవకాశముండదు.
దైవానుగ్రహానికి
పాత్రులు
కావాలంటే
మీరు
చేయవలసినవి
పూజలు,
వ్రతములు
...
యిలాంటివి
కావు.
నిరంతరము
నామస్మరణ
చేయాలి.
హృదయపూర్వకంగా
‘రామా,
రామా’
అని
స్మరిస్తే
ఆ
నామమే
ఎలాంటి
కష్టనష్టములనూ
మీ
దగ్గరకు
రానివ్వకుండా
చూచుకుంటుంది.
“భజన
బినా
సుఖ
శాంతి
నహీ”.
భజన
చేస్తూ
వుంటే
అది
మిమ్మల్ని
సర్వవిధములా
రక్షిస్తుంది.
మీరు
ఏ
పేరుతో
పిలిచినా
నేను
పలుకుతాను
ప్రేమస్వరూపులారా!
మీరెంతో
అదృష్టవంతులు
కాబట్టే
ఈనాడు
ఇక్కడికి
రాగలిగారు.
ఇక్కడ
మీకు
గొప్ప
ఫలితము
చిక్కుతున్నది.
ఇది
అందరికీ
చిక్కాలంటే
సాధ్యము
కాదు.
దీనిని
మీరు
దక్కించుకోండి.
ఎక్కడకు
వెళ్ళినా
భగవంతుడు
మీ
వెంటనే,
జంటనే
ఉన్నాడన్న
సత్యాన్ని
మరువకండి.
“అడవులయందున్న
ఆకసముననున్న
పట్టణముననున్న
పల్లెనున్న
గుట్టమీదనున్న
నట్టేట
పడియున్న
దిక్కు
లేనివారికి
దిక్కు
దేవుడేను”
కాబట్టి,
మీరు
నిరంతరము
భగవంతుని
నామస్మరణ
చేయండి.
7
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులైన
విద్యార్థులారా!
మీరు
నిరంతరం
స్వామి
చింతన
చేస్తూనే
వున్నారని
నాకు
తెలుసు.
మీరు
గట్టిగా
చేస్తున్నారా,
నెమ్మదిగా
చేస్తున్నారా
అనేది
నేను
చూడను.
బయటివారికి
వినిపించాలంటే
కొంచెం
శబ్దము
ఎక్కువగా
ఉండాలిగాని,
నాకది
అవసరం
లేదు.
భగవంతునికి,
భక్తునికి
మధ్య
ఏదీ
అడ్డు
రావడానికి
వీలుకాదు.
ప్రాచీన
కాలంలో
ఋషులు
భగవంతుని
ధ్యానించడానికి
హిమాలయాలకు
వెళ్ళేవారు.
అయితే,
ఎక్కడున్నప్పటికీ
భగవంతుడు
మీ
ప్రార్థనలను
వింటూనే
ఉంటాడు.
కొంతమంది
భక్తులు,
‘స్వామీ!
నన్ను
గుర్తు
పెట్టుకోండి’
అంటారు.
మీరు
మంచిగా
ఉండండి.
స్వామి
మీ
ప్రార్థనలను
వింటాడు.
అన్నింటికీ
ధైర్యంగా
ఉండండి.
అధైర్యమునకు
అవకాశము
ఇవ్వకూడదు.
ఆవిధంగా
మీరు
ఉన్నప్పుడు
మీలో
సాయిశక్తి
ఆవిర్భవిస్తుంది.
ఈశ్వరనామముగాని,
కృష్ణనామము
గాని,
రామనామముగాని
ఏదైనా
ఒక్కటే.
కనుక,
మీరు
ఏ
పేరు
పెట్టినా
స్వామికి
అభ్యంతరం
లేదు.
అసలు
భగవంతునికి
‘ఈ
పేరు,
ఆ
పేరు’
అని
ఎవరూ
నిర్ణయించలేరు.
మీరు
ఏ
పేరుతో
పిలిచినా
నేను
పలుకుతాను.
మీరు
బాగుంటే
నాకదే
చాలు
నిన్న
ఒక
చిత్రము
జరిగింది.
లార్సెన్
అండ్
టుబ్రో
సంస్థకు
చెందిన
సుబ్రహ్మణ్యం,
ఛీఫ్
ఇంజనీర్
కొండలరావులను
వాటర్
ప్రాజెక్టు
పనులమీద
ఈస్ట్
గోదావరి,
వెస్ట్
గోదావరి
జిల్లాలకు
పంపించాను.
వీళ్ళు
అక్కడ
ఒక
అటవీ
ప్రాంతంలో
సర్వే
చేస్తున్న
సమయంలో
నక్సలైట్లు
వచ్చారు.
“ఎవరు
మీరు?
ఎవరు
మిమ్మల్ని
పంపించారు?
ఈ
అడవిలోకి
మా
పర్మిషన్
లేకుండా
ఎందుకు
వచ్చారు?”
అని
ప్రశ్నించారు.
“మీ
మంచిని,
మీ
క్షేమాన్ని
కోరే
మేము
వచ్చాము.
భగవాన్
శ్రీ
సత్యసాయిబాబావారు
మమ్మల్ని
ఇక్కడికి
పంపించారు,
మీకు
నీరందించడానికి”,
అని
వీరు
చెప్పేసరికి
ఆ
నక్సలైట్లు
ఆశ్చర్యానందాలతో
ఉబ్బితబ్బిబ్బైపోయారు.
“స్వామి
ఇటువంటి
గొప్ప
కార్యాలు
చేస్తున్నారని
విన్నాముకాని,
మేము
అడవుల్లో
నివసించడం
చేత
మాకీ
విషయాలు
తెలియడం
లేదు”
అని
వాళ్ళు
అన్నారు.
తరువాత,
వాళ్ళు
ఈ
ఇంజనీర్లవెంట
ఉండి
ఎక్కడెక్కడ
పైపులు
వేయాలో,
ఎక్కడ
ట్యాప్సు
బిగించాలో
సూచించారు.
వెస్ట్
గోదావరి,
ఈస్ట్
గోదావరి
జిల్లాలలో
వాటర్
ప్రాజెక్టు
పనులు
పూర్తి
కావచ్చినాయి.
8
▾
Meaning
Keep
ఇక,
కృష్ణా
జిల్లాలోకూడా
వాటర్
సప్లై
పనులకి
ప్లాన్లు
సిద్ధంగా
ఉన్నాయి.
ఎవరూ
అడుగనప్పటికీ
ఈ
పనులను
నా
అంతట
నేనే
చేపట్టి
పూర్తి
చేస్తున్నాను.
తూర్పు
గోదావరి,
పశ్చిమ
గోదావరి,
కృష్ణా
జిల్లాలకు
మూడింటికీ
నీరిస్తున్నాము.
ఆ
మూడు
జిల్లాలవారు
చాలా
ఆనందిస్తున్నారు.
మీ
పూజలు,
పునస్కారములు
నాకక్కర్లేదు.
మానవ
జీవితానికి
నీరు
చాలా
ప్రధానమైనది.
అది
ప్రాణసమానము.
అట్టి
ప్రాణాధారమైన
జలమును
అందించడంకంటే
గొప్ప
ఉపకారమేమున్నది!
నేను
చేసే
పని
అంతా
అదే!
మీరు
కోరనక్కర్లేదు.
కోరకముందే
నేనే
స్వయంగా
మీకు
అన్నీ
అందిస్తున్నాను.
కృష్ణాజిల్లాలోని
కొన్ని
ప్రాంతాలకు
ఇంతవరకు
ఏ
గవర్నమెంటుకూడా
నీరందించలేదు.
ఏ
గవర్నమెంటూ
ఇవ్వకపోయినా
సాయి
ఒక్కడే
అందరికీ
నీరందిస్తున్నాడు.
నేను
ఎప్పుడూ
పరోపకార
సంబంధమైన
విషయాలలో
పాల్గొంటానుగాని,
మిగిలిన
విషయాలలో
పాల్గొనను.
ముఖ్యంగా
మానవునికి
జలము
ప్రధానము.
కాబట్టి,
ఎవరికైనా
జలమునందించడానికి
నేను
సిద్ధంగా
ఉన్నాను.
భక్తులందరూ
అదే
కోరాలి.
అందరూ
చల్లగా
ఉండాలని,
సర్వులకూ
క్షేమం
కలగాలని
ప్రార్థన
చేయాలి.
అదే
ఈనాడు
కావలసింది.
“స్వామికి
కాలు
సరిగా
లేదే!
ఎట్లా?”
అని
మీరు
బాధపడుతున్నారు.
కాని,
నాకు,
ఈ
దేహానికి
సంబంధము
లేదు.
నేను
ఎప్పుడూ
ఆరోగ్యంగా,
ఆనందంగా
ఉన్నాను.
మీ
కోరికల
నిమిత్తం
మీరు
ప్రార్థించకండి.
అందరికీ
మంచి
చేయాలని
కోరుకోండి.
నేను
క్రింద
పడినప్పుడు
చాలామంది
తూర్పు,
పశ్చిమ
గోదావరి
జిల్లాల
భక్తులు
వచ్చి,
“స్వామికి
బాగైతే
చాలు,
మాకు
నీరు
వద్దు”,
అని
చెప్పారు.
“మీరు
బాగుంటే
నాకదే
చాలు”,
అని
నేనన్నాను.
తూర్పు
గోదావరి,
పశ్చిమ
గోదావరి
జిల్లాలకు
రావలసిందిగా
ప్రార్థిస్తూ
వారు
నాకోసం
హెలికాప్టర్
తెస్తున్నారు.
త్వరలోనే
నేను
అక్కడికి
వెళ్లి
వస్తాను.
ఈ
ఆనందానుభూతుల్ని
మీరు
నిరంతరం
స్మరిస్తూ
ఉండండి.
నామస్మరణ
చేయండి.
Previous
←
Recognise the fundamental principle
Next
Only what fosters unity is true education
→