Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2005 · The feeling of one Ātma is true realisation
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The feeling of one Ātma is true realisation
23 May 2005, Buddha Pūrṇimā, Brindavan
1
▾
Meaning
Keep
Also in his talks
(22)
21 November 1988
Karma Is Done Only for Purity of Citta!
10 February 1990
Human values in business management
25 May 1990
Vagaries of the Mind
3 June 1990
Vedic Wisdom
20 May 1991
The End Of Education Is Character
25 May 1991
Kenopanishad
27 January 1992
Increase the thought of God! Reduce worldly desires!
20 November 1992
We must foster the feeling that every man is a servant
21 July 1994
Where there is right education
27 February 1995
Every atom is the form of God
1 January 1996
The individual's welfare lies within the welfare of society
17 February 1996
Equal-mindedness is the culture of Bhārata
1 January 1998
Happiness and sorrow cannot be parted
15 February 1998
Tārakaṁ and mārakaṁ
14 April 1998
God pervades all
17 April 1998
Desires are the root of unrest
28 April 1998
Knowing Oneself Is What Matters
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
10 September 1998
By Sacrifice Some Have Attained Immortality
29 September 1998
The Heart Itself Is the Himācala, Īśvara Himself the Lord of the Heart
8 October 1998
Good Resolves Are Themselves the Human Values
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
ప్రేమస్వరూపులారా!
శ్రీలంకనుండి
వచ్చినటువంటి
భక్తులు
ఇంతవరకు
దైవత్వమునుగురించి
మీకు
చక్కగా
బోధిస్తూ
వచ్చారు.
నిజముగా,
దైవత్వము
సర్వత్రా
నిండినటువంటిది.
దైవత్వము
కొన్ని
ప్రదేశములందు
ఉన్నదని,
కొన్ని
ప్రదేశములందు
లేదని
వాదిస్తుంటారు,
మూర్ఖులు.
ఎవరు
ఏవిధముగా
బోధించినప్పటికీ,
దైవత్వము
సర్వులయందు
ఉన్నదనే
సత్యాన్ని
మనము
విస్మరించరాదు.
దివ్యత్వము
లేని
స్థానము,
దివ్యత్వము
లేని
రూపము
ఎక్కడకూడను
కనిపించదు.
God
is
everywhere.
దివ్యత్వము
సర్వత్రా
వ్యాపించినటువంటి
తత్త్వము.
See
God
everywhere.
భగవంతుణ్ణి
సర్వత్రా
దర్శించగలిగినప్పుడు
మీకు
అంతా
మంచియే
జరుగుతుంది.
ఇట్టి
ఏకాత్మభావము
ఒక్క
భారతీయులయందు
తప్ప
అన్యులయందు
కానరాదు.
See
no
evil,
see
what
is
good.
Hear
no
evil,
hear
what
is
good.
Talk
no
evil,
talk
what
is
good.
Be
always
with
God.
ఒకరు
బుద్ధుడని,
ఒకరు
రాముడని,
ఒకరు
కృష్ణుడని
ఈవిధంగా
దైవత్వమునకు
అనేక
పేర్లు
పెడుతూ
వచ్చారుగాని,
దైవత్వము
ఒక్కటే.
దైవత్వము
ఒక
రూపమునకు,
ఒక
నామమునకు,
ఒక
ప్రదేశమునకు
పరిమితం
కాదు.
ఇట్టి
దైవత్వాన్ని
ఎవరు
ఎంత
వర్ణించి
చెప్పినప్పటికీ
అది
చాలా
తక్కువే!
అసలు
దైవత్వమును
వర్ణించడమనేది
కేవలం
ఒకవిధమైన
మనోభ్రాంతియే
అని
చెప్పవచ్చు.
దైవత్వము
ఎక్కడున్నది?
మీరందరూ
దైవస్వరూపులే!
మీ
అందరియందు
దైవశ్వాసయే
సంచరిస్తున్నది.
ఇట్టి
పరతత్త్వమునుగురించి
ఎవరూ
పూర్తిగా
వర్ణించి
చెప్పలేరు.
నదినుండి
ఎవరి
పాత్రకు
తగినంత
నీరు
వారు
నింపుకుంటారు.
ఐతే,
పాత్రలో
ఉన్నది
మాత్రమే
నీరు
కాదు,
ఇంకా
అధికంగా
ఉంటున్నది.
2
▾
Meaning
Keep
అదేరీతిగా,
మీ
హృదయంలోని
భావాలను
పురస్కరించుకొని
మీరు
దైవత్వాన్ని
వర్ణిస్తున్నారు.
మీ
హృదయపాత్రలో
నింపుకున్నది
మాత్రమే
దైవత్వము
కాదు;
ఇంకా
అధికంగా
ఉంటున్నది.
దైవత్వాన్ని
గురించి
ఎవరెంతగా
వర్ణించినా
సరిపోదు.
దైవత్వానికి
భిన్నత్వమును
ఆపాదించడం
అజ్ఞానం.
అంతేకాదు.
దైవత్వాన్ని
ఒక
రూపమునకు,
ఒక
నామమునకు,
ఒక
ప్రదేశమునకు
పరిమితం
చేయడంకూడా
చాలా
పొరపాటు.
దైవమునకు
ఒక
పరిమితి
లేదు.
దైవము
సర్వాంతర్యామి,
సర్వభూతాంతరాత్మ.
అటువంటి
దైవత్వమును
ఎవరు
ఏరీతిగా
వర్ణించగలరు!
ఆత్మవిశ్వాసం
గలవారే
నిజమైన
భక్తులు
ప్రేమస్వరూపులారా!
అందరియందున్న
ఆత్మతత్త్వం
ఒక్కటేయని
మీరు
విశ్వసించాలి.
ఏకాత్మభావమును
అలవరచుకోవాలి.
‘ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి’.
భగవంతుడు
ఒక్కడే!
అతనికి
ఎన్ని
పేర్లయినా
పెట్టుకో
వచ్చును.
ఇక్కడ
టంబ్లర్లో
నీరున్నది.
దీనిని
తమిళ్
ప్రజలు
‘తన్ని’
అంటారు;
ఇంగ్లీషువారు
‘వాటర్’
అంటారు;
హిందీవారు
‘పానీ’
అంటారు.
ఈవిధంగా,
ఒక్కొక్కరు
ఒక్కొక్క
పేరుతో
పిలుస్తున్నారుగాని,
నీరు
ఒకటే
కదా!
అదేరీతిగా,
పేర్లు
ఎన్ని
పెట్టుకున్నప్పటికీ
మానవత్వంలో
ఉన్నటువంటి
దైవత్వము
ఒక్కటే.
ఇట్టి
దైవత్వమును
మీరు
ఎన్ని
రకములుగానైనా
భావించుకోవచ్చు,
పూజించుకోవచ్చు.
ప్రతి
మానవుని
హృదయమునందు
ఒకే
ఆత్మ
ఉంటున్నది.
ఆ
ఆత్మయే
దైవశక్తి.
అట్టి
ఆత్మవిశ్వాసము
గలవారే
నిజమైన
భక్తులు.
ఆత్మవిశ్వాసమే
లేకపోయెనా,
వారు
భక్తులే
కారు.
అసలు
ఆత్మవిశ్వాసము
లేకపోతే
మనము
దేనినీ
సాధించలేము.
ఆత్మవిశ్వాసము
నుండియే
మనకు
ఆత్మసాక్షాత్కారము
కలుగుతుంది.
‘నీ
దేవుడు
వేరు,
నా
దేవుడు
వేరు’
అని
పోట్లాడుకునేవారు
మూర్ఖులు
ఈనాడు
అనేకమంది
‘మెడిటేషన్’
(ధ్యానము)
చేస్తున్నామంటున్నారు.
ఏమిటీ
‘మెడిటేషన్’?
దైవాన్ని
హృదయంలో
స్థిరంగా
ప్రతిష్ఠించుకొని,
‘దైవమే
మా
జీవితాధారము’
అనే
భావముతో
నడుచుకోవాలి.
అట్టివారే
నిజమైన
భక్తులు.
ఎక్కడికి
వెళ్ళినా,
ఎక్కడ
చూసినా
దైవత్వమే
సర్వత్రా
వ్యాపించియున్నదనే
సత్యాన్ని
గుర్తించి
వర్తించాలి.
ప్రతి
మానవుడుకూడా
దైవస్వరూపుడే!
3
▾
Meaning
Keep
His poems 89
అనేకమంది
‘మా
దేవుడు,
మీ
దేవుడు’
అనే
భేదమును
పాటిస్తుంటారు.
“వేర్
ఈజ్
యువర్
గాడ్?
వేర్
ఈజ్
మై
గాడ్?”
భగవంతుడు
ఒక్కడే.
అందరిలో
ఉన్నది
ఒకే
భగవంతుడే!
All
are
one,
be
alike
to
everyone.
భిన్నత్వాన్ని
త్యజించి
ఏకత్వాన్ని
విశ్వసించాలి.
నీయందు,
నాయందు,
అతనియందు
ఒకే
శ్వాస
(సోఽహం)
ఆడుతున్నది.
కాబట్టి,
అందరియందున్న
‘సోఽహం’
తత్త్వము
ఒక్కటే.
‘సోఽహం’
అంటే
I
am
God
(నేనే
దైవం)
అని
అర్థం.
అటువంటప్పుడు
దైవత్వము
నీకంటే
ప్రత్యేకంగా
ఉన్నదని
భావించడం
ఎంత
వెఱ్ఱితనం!
నీవే
దైవము.
పుట్టిన
తక్షణమే
నీవు
‘కోఽహం?
కోఽహం?’
(నేనెవరు?
నేనెవరు?
)
అని
ఏడుస్తున్నావు.
మరణించేముందు
నీవు
‘సోఽహం’
(నేనే
దైవం)
అని
తెలుసుకోవాలి.
ఏడుస్తూ
పుట్టి,
ఏడుస్తూనే
మరణిస్తే
మానవ
జన్మ
ఎత్తి
ప్రయోజన
మేమిటి!
‘నేనే
దైవం’
అనే
సత్యాన్ని
గుర్తించకుండా,
పిచ్చి
భ్రాంతులు
పెట్టుకొని
అనేకమంది
అనేకరీతులుగా
ధ్యానం
చేస్తుంటారు.
రాముడు
వేరు,
కృష్ణుడు
వేరు,
జీసస్
వేరు,
అల్లా
వేరు...
ఈరీతిగా
దివ్యత్వాన్ని
విభజించుకోకూడదు.
దేవుడు
ఒకడే.
కాని,
ఇలాంటి
ఏకత్వాన్ని
హృదయానికి
హత్తుకునే
రీతిలో
బోధించేవారు
ఈనాడు
కరువైపోయారు.
హిందువులకు
ఒక
దేవుడు,
క్రైస్తవులకు
ఒక
దేవుడు,
మహమ్మదీయులకు
ఒక
దేవుడు
ఉన్నాడని
భావించడం
చాలా
పొరపాటు.
అల్లాయంచు
మహమ్మదీయులు
జహోవాయంచు
సత్క్రైస్తవుల్
ఫుల్లాబ్జాక్షుడటంచు
వైష్ణవులు
శంభుండంచు
శైవుల్
సదా
ఉల్లాసంబున
గొల్వ
నెల్లరను
నాయుర్భోగ
భాగ్యాది
సం
పల్లాభంబు
లొసంగి
ప్రోచు
పరమాత్ముండొక్కడే
చూడుడీ!
4
▾
Meaning
Keep
ఏ
పేరుతోనైనా
పిలువు,
ఏ
రూపాన్నైనా
ఆరాధించు.
కాని,
భగవంతుడొక్కడే
అనే
సత్యాన్ని
విశ్వసించు.
ఇట్టి
ఏకాత్మభావమే
నిజమైన
సాక్షాత్కారము.
ఈవిధమైన
ఏకాత్మభావము
అందరియందు
రావాలి.
“ఈశ్వరః
సర్వ
భూతానాం”.
నీయందు,
నాయందు,
వీరియందు,
వారియందు
ఉన్నది
ఒకే
ఆత్మ.
‘నా
దేవుడు
వేరు,
నీ
దేవుడు
వేరు’
అని
పోట్లాడుకునేవారు
ఏమీ
తెలియని
మూర్ఖులనే
చెప్పవచ్చు.
ఎవరు
ఏమి
చెప్పినప్పటికీ
దైవము
ఒక్కడే
అనే
సత్యాన్ని
దృఢంగా
విశ్వసించండి.
ఒకానొక
సమయంలో
జీసస్
దగ్గరకు
ఒక
ముసలమ్మ
వచ్చింది.
ఆమె
అంతకు
పూర్వం
జీసస్‌ను
చూసి
ఎరుగదు.
“జీసస్
అంటే
మీరేనా?”
అని
అడిగింది.
జీసస్
చెప్పాడు,
“అమ్మా!
జీసస్
అనేది
ఈ
దేహానికి
పెట్టిన
పేరు.
నాకంటూ
ఒక
ప్రత్యేకమైన
పేరు
లేదు.
అన్ని
పేర్లూ
నావే!
నీవు
ఏ
పేరుతో
పిలిచినా
నేను
పలుకుతాను.”
దేహానికి
పెట్టిన
పేర్లు
మార్పు
చెందుతుంటాయి.
పుట్టిన
తక్షణమే
నిన్ను
‘ఛైల్డ్’
అన్నారు.
మరికొంత
కాలమునకు
‘బాయ్’
అన్నారు.
తరువాత
‘మేన్’
అన్నారు.
చివరికి
‘గ్రాండ్
ఫాదర్’
అంటారు.
ఈ
‘ఛైల్డ్’,
‘బాయ్’,
‘మేన్’,
‘గ్రాండ్
ఫాదర్’
అంతా
ఒక్కడే
కదా!
అదేవిధముగా,
రూపనామములు
వేరువేరైనప్పటికీ
అందరిలోనున్న
దివ్యత్వము
ఒక్కటే!
దైవాన్ని
నమ్ముకున్నంతవరకు
మీకు
భయం
లేదు
ప్రేమస్వరూపులారా!
మీరు
ఇంతమంది
శ్రీలంకనుండి
ఇక్కడికి
రావడానికి
కారణమేమిటి?
మీకు
నాపైనున్న
ప్రేమయే!
స్వామిపై
మీకు
ఎంతటి
ప్రేమ
వున్నదో
అంతకు
నూరు
రెట్లు
అధికంగా
మీపై
నాకు
ప్రేమ
ఉన్నది.
కొంతకాలమునుండి
శ్రీలంకలో
అనేక
విధములైన
భేదభావములు
బయలుదేరుతున్నాయి.
లంకకు
ఎన్నో
ఆపదలు
సంభవించాయి.
ఈనాటి
నుండే
కాదు,
రావణుని
కాలమునుండికూడా
విపత్తులు
సంభవిస్తూ
వచ్చాయి.
కాని,
శ్రీలంక
నిరంతరము
సుక్షేమంగానే
ఉంటుంది.
లంకకు
ఎవరూ
హాని
తలపెట్టలేరు.
దైవమే
మీ
దేశమునకు
లీడరు.
కనుక,
దైవత్వాన్ని
మీరు
నమ్ముకున్నంతవరకు
మీకు
ఎట్టి
భయమూ
లేదు.
మీరందరూ
సుక్షేమంగా
జీవించండి.
మీరు
ఎక్కడున్నప్పటికీ,
ఏమి
చేసినప్పటికీ
దైవము
నిరంతరము
మీ
ఇంటనే,
జంటనే,
వెంటనే
ఉన్నాడని
విశ్వసించండి.
5
▾
Meaning
Keep
ఇందుకు
విరుద్ధంగా
ఎవరు
ఏమి
చెప్పినప్పటికీ
మీరు
లెక్కచేయకండి.
నిరంతరము
మీ
హృదయమునందే
దైవము
నివసిస్తున్నాడు.
మీకు
ఎట్టి
ఆపదలూ
లేవు,
రావు.
కనుక,
ధైర్యంగా
ఉండండి.
భగవద్విశ్వాసాన్ని
పెంచుకోండి.
దైవము
మీకు
తప్పక
విజయాన్ని
ప్రసాదిస్తాడు.
ప్రేమస్వరూపులారా!
లంక
ప్రజలు
నిరంతరం
సుక్షేమంగా
ఉంటారు.
ఏవో
కొన్నికొన్ని
ఇబ్బందులు
వస్తుంటాయి,
పోతుంటాయి.
ఇవన్నీ
కదలిపోయే
మేఘాలవంటివి.
కనుక,
మీరేమీ
భయపడకండి.
ధైర్యంగా
నిలిచి
కష్టాలను
ఎదుర్కోండి.
మీరందరూ
ప్రేమస్వరూపులే!
ఆ
పేరుకు
తగినట్లు
ప్రవర్తించండి.
ప్రేమ
ఉన్నచోట
ఎలాంటి
ఆపదలూ
సంభవించవు.
ప్రేమయే
దైవము,
దైవమే
ప్రేమ.
కనుక,
మీ
ప్రేమను
చలించకుండా
చూసుకోండి.
ప్రేమస్వరూపులారా!
నేను
త్వరలోనే
లంకను
సందర్శిస్తాను.
మీకు
శాశ్వతమైన
ఆనందాన్ని
అందిస్తాను.
ప్రస్తుతం
ఈ
దేహానికి
లేవడానికిగాని,
నడవడానికిగాని
కష్టం
కావచ్చు.
ఐతే,
అది
దేహానికి
సహజము.
ఇలాంటివి
వస్తుంటాయి,
పోతుంటాయి.
దీనిని
ఎవరూ
అడ్డుకోవడానికి
వీలుకాదు.
ఇవన్నీ
లెక్కచేయకుండా
మీ
ప్రేమను
పొందడానికి,
మీ
చిరకాల
ప్రార్థనను
నెరవేర్చడానికి
నేను
త్వరలోనే
తప్పక
వస్తున్నాను.
లంకలో
బాలురు
మొదలుకొని
వృద్ధులవరకు
స్వామిని
స్మరిస్తూనే
వున్నారు.
ఆ
సంకల్ప
ఫలమును
నేను
త్వరలోనే
అందిస్తాను.
అది
మీరు
మనస్సులో
పెట్టుకోండి.
క్రమక్రమేణ
కాలము
మారుతూ
వస్తున్నది.
అయితే,
కాలము
మారినప్పటికీ
మనమధ్య
వున్న
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
ఏనాటికీ
మారదు.
Previous
←
The wedding of Sītā and Rāma is the union of the Ātma and the Paramātma
Next
Recognise the fundamental principle
→