Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · Only one who knows himself can know God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Only one who knows himself can know God
6 October 1992, Dasara, Vijayadaśamī, Prasanthi Nilayam
First talk
Second talk
1
▾
Meaning
Keep
Also in his talks
(28)
14 January 1988
Strive to recognise the oneness within the many!
20 May 1990
The Glory of Indian Culture
2 July 1996
Satya Alone Is God
1 January 1998
Happiness and sorrow cannot be parted
26 February 1998
The power of saṅkalpas
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
25 September 1998
Man's True Kin
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
26 September 2000
Education and Educare
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
14 October 2002
Satya itself is life
22 November 2002
Give Up Selfishness and Strive for the Good of Society
2 April 2003
Leave the delusion of the body; think of God
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
9 April 2005
Divinity is the very nature of man
7 April 2006
Our Ātma itself is Rāma
11 August 2006
Divinity is attained only through Prema for God
28 September 2006
No worry troubles those who think of God without ceasing
16 February 2007
Follow Sai, walk the path of Satya!
7 June 2007
Along with ‘Education’, ‘Educare’ is most essential
28 July 2007
Every human being is God
22 August 2007
Foster faith in God and love of country!
4 September 2007
The word and the way of the Avatāras are most auspicious
22 November 2007
Only one who recognises that all are one is truly educated
18 July 2008
God alone is the true Guru
6 August 2008
‘Education’ finds its fulfilment only when it is joined with ‘Educare’
9 October 2008
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
సత్యంబునందుండి
సర్వంబు
సృష్టించె
సత్యంబునందణగె
సర్వ
సృష్టి
సత్యమహిమ
లేని
స్థలమేది
కనుగొన్న
శుద్ధసత్త్వమిదియె
చూడరయ్య.
మానవుండు
పుట్టె
మాధవునందుండి
మానవత్వమేల
మరుగుపడియె?
మాయ
మాయ
యిదియె
మానవ
జన్మంబు
మాయనరుడు
కాదె
మానవుండు?
ప్రేమస్వరూపులారా!
మానవత్వమన్నది
దివ్యత్వముతో
కూడినదేగానీ
ప్రత్యేకించి
ఏర్పడినది
కాదు.
‘ఏకాత్మ
సర్వభూతాంతరాత్మ.’
ఒకే
ఆత్మ
అందరియందున్నది.
అందరి
ఆత్మ
ఒక్కటిగనే
అనేకత్వములోని
ఏకత్వమును
నిరూపిస్తూ
వచ్చింది.
దేహమునకు
అనేక
అంగములున్నవి.
చేతులు,
కాళ్ళు,
ముక్కు,
నోరు,
చెవులు,
తల
యివన్నీకూడ
శరీరమునకు
సంబంధించిన
అంగములు.
ఐతే
యీ
అంగములకు,
శరీరికి
సన్నిహిత
సంబంధబాంధవ్యమున్నది.
కనుక,
జీవుడే
శరీరి.
అంగములే
శరీరము.
శరీరి,
శరీరములు
అవినాభావ
సంబంధములు.
ఈ
శరీరికి
సర్వ
అంగములు
తనవే!
కనుకనే
ఏ
అంగములను
జీవుడు
ద్వేషించడు.
ఏ
అంగము
బాధపడినను
శరీరి
ఆనందించడు.
కారణము
ఏమనగా
అన్ని
అంగములు
తనవే!
అనుభవము
తనదే!
అటులనే
విష్ణువు
విశ్వమనే
శరీరమును
ధరించాడు.
ఈ
విశ్వమనే
సర్వాంగములు
విష్ణుస్వరూపమే!
కనుకనే
ఎవ్వరుకూడను
యీ
విశ్వమును
విమర్శించరాదు,
దూషించరాదు.
2
▾
Meaning
Keep
శరీరమే
విశ్వము;
ఆత్మయే
విష్ణువు
విశ్వమందున్న
విష్ణుత్వము,
నీయందున్న
విష్ణుత్వము
ఏకత్వమే!
ఏ
వ్యక్తిని
నీవు
దూషించినప్పటికిని
నిన్ను
నీవు
దూషించుకున్నవాడవవుతావు.
ఏ
వ్యక్తిని
నీవు
విమర్శించినప్పటికిని
నిన్ను
నీవు
విమర్శించుకున్నవాడవవుతావు.
విశ్వమనగా
ఏదో
మనకు
కనుపించే
దృశ్యము
మాత్రమే
కాదు.
శరీరమే
విశ్వము;
ఆత్మయే
విష్ణువు.
ఈ
విష్ణువనే
జీవతత్త్వము
శరీరములో
సర్వవ్యాపకమై
ఉన్నది.
తన
కాలికి
ఏమైనా
ప్రమాదము
జరిగితే
తానెంతో
బాధపడతాడు.
తన
కాలు
బాధపడుతున్నదని
తాను
ఆనందించడు.
అటులనే
దివ్యత్వమనేది
సర్వవ్యాపకత్వమై
ఉన్నది.
యిది
మూడు
విధములైన
స్వరూపములు
ధరించినది.
స్థూలము,
సూక్ష్మము,
కారణము
అని.
స్థూలమే
యీ
విశ్వము.
సూక్ష్మమే
మనస్సు.
అతిసూక్ష్మమైన
కారణమే
నిజమైన
జీవతత్త్వము.
మానవునకు
ఐదుకోశములున్నవి.
ఈ
ఐదుకోశములు
మూడుగా
విభజిస్తూ
వచ్చారు.
అన్నమయకోశము
స్థూలమైన
దేహము.
ప్రాణమయమనోమయవిజ్ఞానమయ
మూడింటియొక్క
ఏకత్వమే
మనస్సుయొక్క
సూక్ష్మస్వరూపము.
కారణ
దేహము
ఆనందమయము.
ఇది
కూడను
పరిపూర్ణమైన
ఆనందము
కాదు.
కారణము
ఏమనగా
దీనికి
అతీతమైన
మహాకారణము
ఒకటి
ఉన్నది.
ఆ
మహాకారణతత్త్వమే
ఆత్మతత్త్వము.
కనుకనే
స్థూల
సూక్ష్మ
కారణ
స్వరూపమైన
దేహమును
ధరించటంచేతనే
‘త్రిపురసుందరి’
అని
దీనికి
పేరు.
ఈ
త్రిపురములు
ఎక్కడ
ఉంటున్నవి?
ప్రతి
మానవునియందు
త్రిపురములుంటున్నవి.
ఒక
పురము
దేహము.
రెండవది
మనస్సు.
మూడవది
హృదయము.
యీ
మూడు
త్రిపురములే!
ఆత్మతత్త్వము
యీ
త్రిపురములందు
ఏకత్వముగా
సంచరిస్తున్నది.
ప్రాకృతమైన
యీ
దేహమునందు
ప్రకృతియొక్క
తత్త్వము
అధికముగా
ఉండటంచేత
దీనికి
‘సుందరి’
అనే
స్త్రీలింగము
పేరు
పెడుతూ
వచ్చారు.
ప్రకృతి
స్త్రీతత్త్వము.
కనుకనే
త్రిపురసుందరి
అని
యీమెకు
పేరు.
నవరాత్రులందు
త్రిపురసుందరిని
ప్రార్థిస్తుంటారు,
ఆరాధిస్తూ
ఉంటారు.
3
▾
Meaning
Keep
His poems 394
సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
భగవచ్చింతనం
దురదృష్టవశాత్తు
ప్రాచీనకాలమునుండి
సత్యమును
గుర్తించుకోలేని
వ్యక్తులు
బాహ్యమైన
ఆరాధనలు,
ప్రార్థనలందే
కాలమును
వ్యర్థము
చేస్తున్నారు.
కనుకనే
వారు
ఆత్మానందమునకు
అతి
దూరముగా
ఉంటున్నారు.
తమకు
తామే
యీ
ఆనందమునకు
దూరమవుతున్నారు.
‘ఎవరికోసం
జగమంత
తిరిగినావు?
అతను
నీలోనే
ఉన్నాడు,
ఎరుగుమతని!’
జగత్తంతా
తిరుగుతున్నారు,
దైవముకోసమని.
అనేక
మార్గములలో
అన్వేషణ
జరుపుతున్నారు,
భగవంతునికోసమని.
ఎక్కడ
ఉన్నాడు
భగవంతుడు?
తెలిస్తేకదా,
అన్వేషణ!
ఎక్కడ
ఉన్నాడో
తెలియనప్పుడు
అన్వేషణకు
అర్థము
లేదు.
‘అంతర్బహిశ్చ
తత్సర్వం
వ్యాప్యనారాయణస్థితః.’
హృదయమునందు
ఉంటున్నాడు
జీవుడు,
అనుకుంటున్నాము.
మన
కాలిపైన
చీమ
తిరుగుతూ
ఉంటే
మనకు
తెలుస్తున్నాది.
కనుక
నీ
కాన్షియస్
అనేది
అక్కడకూడా
ఉంటున్నాది.
నీయొక్క
ప్రజ్ఞ
అక్కడకూడా
చేరి
ఉంటున్నది.
ప్రజ్ఞ
సర్వత్ర
ఉంటున్నాది.
కనుకనే
‘ప్రజ్ఞానం
బ్రహ్మ’
అన్నారు.
యీ
ప్రజ్ఞాస్వరూపమైన
తత్త్వము
సర్వవ్యాపకత్వముగా
ఉంటున్నది.
యిలాంటి
ప్రజ్ఞాతత్త్వమును
యీ
నవరాత్రులందు
ప్రకటింపచేసే
నిమిత్తమై
యీ
ఆరాధనలన్నీ
ఆరంభమైనాయి.
అవనియంతయు
రమ్యమైన
ఆలయము
విశ్వమంతయు
పరతత్త్వ
విష్ణుమయము
ప్రకృతి
బోధించు
నవరాత్రి
పరమతత్త్వము
సాధనంబున
కలదోయి
సాయి
ప్రేమ
కనుక,
దీనిని
సాధనద్వారా
మనము
సాధించాలి.
సాధన
అనగా
ఏమిటి?
సాధన
అనగా
ప్రత్యేకించి
ఒక
ప్రదేశమునందుగానీ
ప్రత్యేకించిన
ఒక
పద్ధతియందుగానీ
భగవంతుని
ప్రార్థించటము
కాదు.
‘సర్వతఃపాణిపాదం.’
‘సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
భగవచ్చింతనం.’
యిది
సాధ్యమే!
తనకంటె
భిన్నమైనది
ఒకటి
ఉన్నది
అనే
భావము
లేకుండా
ఉండటమే
శరణాగతి
మనము
ప్రత్యేకించి
భగవంతుని
చింతన
చేయనక్కరలేదు.
ఏ
పని
చేసినా
భగవదర్పితముగా
చేసినపుడు
కార్యములన్నీ
భగవత్ప్రీత్యర్థమవుతాయి.
4
▾
Meaning
Keep
ఈ
నవరాత్రులందు
అంగార్పణ
పూజ
అని
ఉంటున్నాది.
దేహముయొక్క
అంగములన్నీకూడను
దేహి
అయిన
జీవునకు
శరణాగతితో
అర్పితము
కావటమే!
‘శరణాగతి’
అనగా
ఏమిటి?
ఏ
పని
చేసినా
దానియందు
దివ్యత్వమును
మనము
విశ్వసించటమే!
తనకంటే
భిన్నమైనది
ఒకటి
ఉన్నది
అనే
భావము
లేకుండా
ఉండటమే
శరణాగతి.
రెండవది
ఉన్నది
అనుకున్నప్పుడు
అది
శరణాగతే
కాదు.
యిది
ద్వైతభావముతో
కూడి
ఉంటున్నది.
ఈ
ద్వైతము
ఏకత్వము
కానేరదు.
‘నేను’,
‘అతను’
అనే
భావమే
రాకూడదు.
‘ఏకో
వసి
సర్వభూతాంతరాత్మ.’
‘ఏకోహం
బహుస్యాం’
యిలాంటి
మంత్రములన్నీ
అనేకత్వములో
ఉన్న
ఏకత్వాన్ని
నిరూపించే
తత్త్వములే!
మనము
పూజలు
యేవిధముగా
చేస్తున్నాము?
మానవుడు
చేసే
పూజలన్నీ
భగవంతునికూడా
మోసగించే
పద్ధతిలో
ఉంటున్నాయి.
పుష్పము
తీసుకుంటున్నాము.
‘నేత్రం
సమర్పయామి’
అని
భగవంతునికి
సమర్పిస్తున్నాము.
అదే
‘పుష్పం
సమర్పయామి’
అని
చెబుతే
ఎంతో
బాగుంటుంది.
‘నేత్రం
సమర్పయామి,’
అని
చెబుతూ
నేత్రమును
ఉంచుకుంటున్నాడు;
పుష్పమును
మాత్రం
సమర్పిస్తున్నాడు.
యిది
భగవత్
ద్రోహము
కాదా?
‘హస్తం
సమర్పయామి’
అంటున్నాడు.
హస్తమునకు
పూవుతాకించి
ఆ
పుష్పమును
భగవంతునికి
సమర్పిస్తున్నాడు.
‘హస్తం
సమర్పయామి’
అనగా
యీ
హస్తముతో
చేసేటువంటి
సర్వకర్మలు
భగవత్
కర్మలుగా
ఉంటుండాలి.
‘నేత్రం
సమర్పయామి’
అనగా
దేనిని
చూచినా
భగవత్
స్వరూపకంగా
చూడాలి.
అప్పుడే
యీ
‘సమర్పయామి’
అనే
దానికి
అర్థము
ఉంటుండాది.
చెప్పేది
ఒకటి,
చేసేది
మరొకటి!
కనుకనే
యిది
భగవత్
ద్రోహముగా
మారుతున్నది.
ఈ
విధమైన
ఆరాధనలు
ఎన్ని
యుగములు
చేసినప్పటికిని,
ఎన్ని
జన్మములు
చేసినప్పటికి,
దైవత్వమును
గుర్తింపచేయలేవు.
స్వార్థమును
త్యాగము
చేసినప్పుడే
పరిపూర్ణ
ప్రేమ
రూపొందుతుంది
స్వార్థముతో
జీవించే
మానవుడు
ఎవ్వరిని
పరిపూర్ణముగా
ప్రేమించలేడు.
స్వార్థమును
యేనాడు
త్యాగము
చేయునో
అప్పుడే
యీ
పరిపూర్ణ
ప్రేమ
రూపొందుతుంది.
స్వార్థము
కలిగిన
మానవుడు
మరొకరిని
ఏ
రీతిగా
ప్రేమించగలడు?
కనుక
భార్యను
భర్తైనా,
తల్లిని
బిడ్డ
అయినా
బిడ్డ
తల్లినైనా
స్వార్థముతోనే
ప్రేమిస్తున్నారు.
తల్లినే
స్వార్థంగా
ప్రేమించేవాడు
భగవంతుని
నిస్వార్థంగా
ఎట్లా
ప్రేమించగలడు?
5
▾
Meaning
Keep
తన
బిడ్డనే
తాను
స్వార్థంగా
ప్రేమించేవాడు
భగవంతుని
నిస్వార్థంగా
ఎట్లా
ప్రేమించగలడు?
ఈనాడు
భగవంతుని
ప్రేమించటంకూడను
స్వార్థముకొరకే!
ఈ
స్వార్థము
ఉండినంతవరకు
పరార్థము
అర్థము
కాదు.
యీ
నవరాత్రులయొక్క
తత్త్వమంతా
నవరంధ్రములతో
కూడిన
యీ
నవపురియొక్క
తత్త్వము
ప్రకటించు
నిమిత్తమై
ఏర్పడినది.
దేహము
పాంచభౌతికము.
ఈ
పాంచభౌతికమైన
దేహమే
ప్రపంచము.
యిదే
విశ్వము.
ఈ
విశ్వమునందు
ఏ
భూతములున్నవో
దేహమునందు
అవే
భూతములు
ఉంటున్నవి.
కనుకనే
దీనిని
చిన్న
విశ్వమని
చెప్పవచ్చును.
ఈ
దేహము
అలాంటిదిగా
భావించినప్పుడే
మనము
సరియైన
ఆరాధనలు
చేసినవారమవుతాము.
ఈనాడు
ఆధ్యాత్మికమనగా
పూజలు
చేయటము,
వ్రతములు
ఆచరించటము,
ఉపవాసములు
చేయటము
అనుకుంటున్నారు.
యివన్నీ
కేవలము
స్వార్థముతోకూడిన
కర్మలు.
ఏనాడు
స్వార్థరహితమైన
కర్మలు
చేయగలవో
అప్పుడే
నీవు
ఆధ్యాత్మికమార్గములో
ప్రవేశించిన
వ్యక్తి
కాగలవు.
యాత్రలు
చేయటము
ఆధ్యాత్మికమని
భావిస్తున్నారు.
అదికాదు,
ఆధ్యాత్మికము.
మానవత్వములో
ఉన్న
పశుత్వమును
నిర్మూలము
చేయాలి.
ఆ
తరువాత
మానవత్వాన్ని
పోషించాలి.
దివ్యత్వముగా
మార్చుకోవాలి.
యిదియే
నిజమైన
ఆధ్యాత్మికము.
ఎన్ని
పూజలు
చేసినప్పటికిని
మనలో
పశుత్వము
దినదినమునకు
పెరుగుతున్నదేగానీ
తరగటం
లేదు.
మన
వ్రతములన్నీకూడను,
పూజలన్నీ
కూడను
మనలో
పశుత్వమును
పెంచుతున్నాయి.
ఈ
విధంగా
పశుత్వమును
పెంచునది
రాక్షసత్వమేగానీ
ఆధ్యాత్మికముకాదు.
క్రమక్రమేణా
మనలోని
పశుత్వము
రాక్షసత్వముగా
మారిపోతున్నది.
నరకాసురుడు
అనగా
‘నర’
అనే
అసురుడు.
అనగా
నరునియందున్న
అసురుడు.
ఈ
నరుడు
అసురుడుగా
మారి
నరకమునకు
కొనిపోతున్నాడు.
అటువంటిదానిని
సంహరించే
నిమిత్తమే
యీ
దేహారాధన.
మానవుడు
తనయందున్న
విశ్వమును
గుర్తించుకోటానికి
తాను
ప్రయత్నించాలి.
భగవత్
తత్త్వమనేది
తానే;
తనకంటే
వేరుగా
లేదు.
తనను
తాను
తెలుసుకున్నవాడే
దైవాన్ని
తెలుసుకోగలడు.
నిన్ను
నీవు
తెలుసుకోలేనివాడవు
భగవంతుని
యే
రీతిగా
తెలుసుకోగలవు?
మొట్టమొదట
నిన్ను
నీవు
గుర్తించుకో!
‘నేను
మానవత్వములో
జీవిస్తున్నానా?
లేక
అసురత్వములో
పెరుగుతున్నానా?
లేక
పశుత్వములో
దిగజారుతున్నానా’
అని
తనకు
తానే
నిర్ణయము
చేసుకోవాలి.
6
▾
Meaning
Keep
మనము
బుద్ధిపూర్వకముగా
ఏనాడు
అహంకారమును
నిర్మూలించెదమో
ఆనాడే
నరకాసురవధ
ఈ
నవరాత్రులందు
దేవి
చాముండేశ్వరిగా
రూపొంది
నరకాసురుని
సంహరించింది
అని
ఈ
దశమిరోజును
విజయదశమిగా
భావించి
చాముండేశ్వరిని
ఆరాధిస్తారు.
పూర్వము
నరకుడనేవాడు
సర్వరాక్షసులకు
నాయకుడుగా
ఉండేవాడు.
అనగా
సర్వ
దుర్గుణములకు,
సర్వదురాలోచనలకు,
సర్వదుర్బుద్ధులకు
నాయకుడు.
వీటన్నిటికి
అహంకారే
నాయకుడు!
కనుక
ఈ
రోజున
అహంకారమనే
నరకుని
సంహరించాలి.
చా-ముండి
అనే
పేరులో
ముండి
అనగా
తల.
‘ముండే
ముండే
మతిర్భిన్నః’
అన్నారు.
అనగా
ఒక్కొక్కరి
తల
ఒక్కొక్క
రీతిగా
ఉంటున్నది.
అనగా
వివిధ
వ్యక్తుల
తలలలో
వివిధమైన
దురాలోచనలు
బయలుదేరుతాయి.
బుద్ధిద్వారా
యీ
దుర్గుణములనే
అహంకారమును
హతమార్చాలి.
మనము
బుద్ధి
పూర్వకముగా
అహంకారమును
యేనాడు
నిర్మూలము
గావింతుమో
ఆనాడే
నరకాసురవధ.
యివన్నీ
బాహ్యమైన
రీతిగా
మనము
చూచుకుంటూ
చాముండేశ్వరి
విగ్రహమును
పెట్టుకొని
మనము
పూజిస్తున్నాము.
ఆ
చాముండి
మన
ముండిలోనే
ఉంటున్నాది.
అనగా
మన
తలయందే
ఉంటున్నాది.
తనయందే
ఉండిన
చాముండిని
బయట
ఎక్కడనుండి
తెచ్చి
ప్రార్థించగలము?
ఒకవేళ
ఆవిధంగా
ఆరాధన
చేసినప్పటికిని
reflection
of
the
inner
being
అనగా
లోపల
ఉన్నదానినే
బయట
చేస్తున్నానని
భావించాలి.
ఈ
విధమైన
అంతరార్థములను
ప్రత్యేకించి
ప్రబోధించినవే
యీ
నవరాత్రులు.
జ్ఞానము
ఒకరు
అందించే
పదార్థముకాదు;
లేక
పెద్దలనుండి
పొందేటటువంటిది
కాదు.
స్వప్రయత్నముద్వారానే
దానిని
పొందాలి.
ఏ
విధంగా?
ప్రతి
ఒక్కటి
మనస్సుకు
బోధించాలి.
మనిషికి
బోధించి
ప్రయోజనము
ఏమిటి?
మనిషి
వింటున్నాడు,
మరచిపోతున్నాడు.
మనస్సుకు
బోధించాలి.
మనస్సుకు
బోధించినప్పుడే
మనిషి
మారగలడు.
ఈనాడు
మనిషి
మారుతున్నాడుగానీ,
మనసు
మారటం
లేదు.
యీనాడు
చేసే
బోధనలన్నీ,
శ్రవణము
చేసే
విషయములన్నీ
మనిషికి
మాత్రమే
చేర్చుకుంటున్నామేగానీ
మనసువరకు
చేరటం
లేదు.
Previous
←
How Devotees Are Tested and Found Wanting
Next
To root out the Ahaṅkāra within humanness, offer pure Prema to God
→