Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Man's Own Conduct Is the Cause of His Joys and Sorrows
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Man's Own Conduct Is the Cause of His Joys and Sorrows
25 June 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
His poems 431
Also in his talks
(2)
13 July 1996
Hold on to Truth Under All Circumstances
31 May 1998
The Oneness of Mind, Word and Deed Is Humanness
మనసులోనున్న
భావంబు
మంచిదైన
కలిగి
తీరును
ఫలసిద్ధి
కార్యమందు
మనసులో
నున్న
భావంబు
మలినమైన
ఫలము
కూడను
ఆ
రీతి
మలినమగును.
విద్యార్థులారా!
భారతీయ
సంస్కృతి
అనుపమానమైనది.
అత్యున్నతమైనది.
మనిషి
అంటే
మనసే.
మనసంటే
సంకల్పముల
చేరికయే.
సంకల్పముల
ప్రభావమే
నడతలు.
నడతల
యొక్క
ఫలితమే
సుఖదుఃఖములు.
ఈనాటి
మానవుడు
అనుభవించే
సుఖదుఃఖములకు
మూలకారణము
అతని
యొక్క
నడవడియే.
ఈ
నడవడికి
మూల
కారణము
సంకల్పములే.
ఈ
సంకల్పముల
చేరికే
మనసు.
మనసు
నుంచి
వచ్చిన
వాడు
కనుక
ఇతనికి
మనిషి
అని
పేరు.
మనసే
లేక
మనిషి
కాడు.
మనసు
కలవాడే
మనిషి.
పశు
పక్షి
మృగాదులకు
మనస్సు
లేదు.
ఈ
మనసు
ద్వారా
వాక్కు
ఆవిర్భవిస్తున్నది.
ఈ
మనస్సు
అహం
తత్వము
నుండే
ఆవిర్భవించింది.
అహము
ఆత్మ
యొక్క
ప్రతిబింబమే.
వాక్కు,
మనస్సు,
అహం,
ఆత్మ
ఈ
నాలుగు
ఒకే
కుటుంబమునకు
చెందినవి.
ఇందులో
వాక్కు,
మనసు,
అహం
మూడు
చేరినప్పుడే
మానవత్వం
దివ్యత్వముగా
రూపొందుతుంది.
ఈ
మూడు
కూడ
అన్యోన్య
అనురాగ
బాంధవ్యముతో
కూడినప్పుడే
మానవత్వము
దివ్యత్వము
పొందుతుంది.
ఈ
మూడింటి
ఏకత్వమునకు
భిన్నము
జరిగినప్పుడు
అనేక
విధములైన
అశాంతికి
గురౌతుంది.
ఒక
ఇంట్లో
ముగ్గురు
సోదరులుంటారు.
ఈ
ముగ్గురు
ఒకరినొకరు
అనుసరించి
ప్రేమించి
ఒకరినొకరు
అన్యోన్యముగా
కలసి
ఉండినప్పుడే
ఇంటిలో
శాంతి
ఏర్పడుతుంది.
కాని
ఏ
కారణము
చేతనైనా
మనస్సునందు
అభిప్రాయ
భేదములు
ఆవిర్భవించినప్పుడు
ఒకరినొకరు
ద్వేషించి
భిన్నముగా
ప్రవర్తించినప్పుడు
ఆ
అశాంతి
ఇల్లంతా
పాకిపోతుంది.
ఐకమత్యమే
ఆనందమునకు
శాంతికి
మూల
కారణము.
ఐకమత్యము
చేరనప్పుడే
అసంతుష్టికి
అశాంతికి
ఒక
విధమైన
కారణము
ఏర్పడుతుంది.
2
▾
Meaning
Keep
His poems 427
Also in his talks
(8)
24 June 1989
Foster Prema and Share It
6 November 1989
Faith in Yourself Is Faith in God
1 March 1990
To seek out the path is the noble wisdom
1 June 1991
Spiritual Discipline (sadhana)
1 April 1995
Make God your true friend
16 August 1996
‘Love all, worship all’
1 September 1996
Human Life, Which Begins with Food, Must End in Ānanda
22 August 2001
Vināyaka is the embodiment of all the gods
ఇక్కడ
ఇల్లు
ఏది?
ముగ్గురు
అన్నదమ్ములు
ఎవరు?
దేహమనేది
ఒక
ఇల్లు.
లేక
దేవాలయము.
ఈ
గృహమనే
దేహమందు
ముగ్గురు
అన్నదమ్ములున్నారు.
Thoughts,
words,
action.
సంకల్పములు,
వాక్కు,
క్రియాశక్తి.
ఈ
ముగ్గురు
అన్యోన్యముగా
ఐకమత్యముగా
ఆనందముగా
కలసిమెలసి
ఉండినప్పుడే
ఏ
కార్యమునైనా
విజయము
సాధించవచ్చు.
కాని
సంకల్పములు
ఒకవైపున,
పలుకులు
మరొకవైపున,
పని
ఇంకొకవైపున
పోయినప్పుడు
ఒకదానికొకటి
ఐకమత్యము
చెదరినప్పుడు
ఏ
కార్యము
మనము
సాధించలేము.
ఈ
మూడింటి
ఏకత్వమునకే
త్రికరణశుద్ధి
అన్నారు.
మన
గృహమందు
ఈ
మూడింటి
ఐకమత్యమునకు
తగిన
ఉత్సాహ
ప్రోత్సాహములను
పురికొల్పాలి.
నిర్భయుడై,
క్రూరుడై,
కఠినుడై
అనేక
క్రూర
కార్యములు
రత్నాకరుడు
తన
పొట్టకూటి
నిమిత్తమై,
కుటుంబపోషణ
నిమిత్తమై,
చేస్తూవచ్చాడు.
తన
సంకల్పములన్నీ
క్రూరమైన
సంకల్పములుగా
రూపొందినాయి.
నిర్దయ
స్వరూపము
ధరించింది.
కారుణ్య
శూన్యమై
కాఠిన్యము
అభివృద్ధి
అయింది.
కనుక
దారులు
కొట్టే
దొంగగా
తయారయ్యాడు
రత్నాకరుడు.
వీరు
వారు
అనే
భేదము
లేక
అందరిని
చంపటము,
వారి
ధనము
అపహరించటము.
ఈ
విధమైన
మార్గములో
ప్రవేశించాడు.
ఎంతకాలము
నుండియో
దుర్గుణములను,
దురాలోచనలను,
దుస్సంకల్పములను
అభివృద్ధి
గావించుకున్న
ఈ
రత్నాకరుడు
ఒక
తూరి
సప్త
ఋషులను
దర్శించటం
చేత
పాపనాశనమైంది.
వీరిని
అడ్డగించి
వీరిని
చంపుటకు
ప్రయత్నించాడు.
ఈ
రత్నాకరుడు.
నాయనా
చంపటము
మంచిది
కాదు.
క్రిమి
కీటకాదులు
మానవునికి
కీడు
చేస్తుంటాయి.
మేలు
చేసేవాడే
మనిషి.
మేలు
చేయటానికి
ప్రయత్నించు.
కీడు
చేయటానికి
ముందంజ
వేయకు.
ఎందుకోసం
ఈ
పని
చేస్తున్నావు:
జానెడు
పొట్ట
నింపుకొన
చిక్కుల
నొందుచు
కోటి
విద్యలన్
పూనిక
మీర
నేర్చి
పరిపూర్ణ
సుఖంబును
పొందలేక
యీ
మానవ
జాతి
దుఃఖముల
మ్రగ్గగ
నేటికిన్
శ్రీపరాత్పరున్
ధ్యానము
చేయు
భక్తులకు
దారిని
చూపక
యున్నె
మానవా!
పిచ్చివాడా!
ఈ
చిన్న
పొట్ట
నిమిత్తమై
కోటి
మందిని
బాధపెట్టి
నీ
పొట్ట
నింపుకొని
నీవు
అనుభవించే
సుఖము
ఏమిటి?
నీ
కుటుంబము
ఏ
సుఖము
అనుభవిస్తున్నాది.
ఇట్టి
పాపకృత్యములు
3
▾
Meaning
Keep
Also in his talks
(1)
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
తలంపకు.
నీవు
నేటి
నుండి
శరీరము
ధరించిన
వ్యక్తి
కనుక
కర్తవ్యము
లాచరించి
కరచరణాది
అవయవములతో
కర్మలాచరించి
భజించి
భుజించు
అని
సప్త
ఋషులు
అతనికి
బోధించగా
సందర్శనము
చేత,
సంభాషణ
చేత
అతని
సంకల్పములు
మార్పు
చెందినాయి.
కనుక
సత్సంగము
మానవునికి
ప్రధాన
లక్ష్యము.
సత్సంగము
చేతనే
ఏకాగ్రతను
పోషించుకోవచ్చు.
సత్సంగము
చేత
మనలోని
దుర్భావములను
నిర్మూలము
గావించుకోవచ్చు.
చెడ్డ
సంకల్పముల
నిర్మూలమే
మోక్షమునకు
మూలకారణము.
సత్సంకల్పే
నిస్సంకల్పత్వం
నిస్సంకల్పత్వే
నిర్మోహత్వం
నిర్మోహత్వే
నిశ్చల
తత్వం
నిశ్చల
తత్వే
జీవన్ముక్తిః.
సత్సంకల్పములు
ప్రతి
మానవుడు
ప్రయత్న
పూర్వకముగా
సాధించటానికి
ప్రయత్నించాలి.
ఆనాటి
నుండి
సప్త
ఋషుల
ప్రబోధల
చేత
ప్రోత్సాహము
చేత
ఉత్సాహము
అభివృద్ధియై
రామనామము
చింతిస్తూ
కూర్చున్నాడు.
రామనామము
చేతనే
తన
జీవితము
ధన్యమై
పోయింది.
లోకనాథుడు
భగవంతుడైనప్పుడు
శ్లోకదాత
వాల్మీకి
అయ్యాడు.
శ్లోకనాథుడు
లేక
లోకనాథుని
ప్రచార
ప్రబోధలు
జగత్తుకు
వ్యాపించి
ఉండేవి
కాదు.
వాల్మీకి
లోకమునకు
ఆదర్శము
నిరూపించాడు.
ప్రతి
మానవుడు
ఆదర్శప్రాయుడు
కావాలి.
మానవత్వములో
ఉండిన
ఘనత
ఎంతో
గొప్పదిగా
ఉంటున్నది.
మానవుని
యందు
లేని
శక్తి
మరొకదాని
యందు
కనిపించదు.
సర్వశక్తులు
మానవుని
యందు
ఇమిడి
ఉంటున్నవి.
అయితే
సరైనరీతిగా
సంస్కరింప
చేసుకోవాలి.
దోషములు
నిర్మూలము
గావించి
గుణములు
పోషించుకున్నప్పుడు,
పోషించుకున్న
గుణములు
ఆచరణలో
పెట్టినప్పుడు
ఆనందమునకు
సరైన
ఆలవాలమై
పోతుంది.
ప్రతి
మానవుడు
దోషరహితుడు
కావాలి.
గుణపోషకుడు
కావాలి.
అప్పుడే
మానవుని
యందు
దుఃఖనివృత్తి
ఆనందప్రాప్తి
చేకూరుతుంది.
నిజముగా
నమ్మి
పూజించి
విశ్వసించి
పనిలో
పాల్గొన్న
వ్యక్తి
ఏనాటికి
చెడడు.
నమ్మక
చెడినవారలున్నారు
గాని
నమ్మి
చెడినవారు
ఈలోకాన
లేరు.
ఈనాటి
మానవుడు
నమ్మకమనే
నేత్రములు
కోల్పోయినాడు.
నమ్మరాని
వాటి
నన్నింటిని
నమ్ముతున్నాడు.
4
▾
Meaning
Keep
నమ్మతగినవి
నమ్మటం
లేదు.
అందరిని
నమ్ముతాడు
మానవుడు.
దైవమును
నమ్మడు.
ఈనాడు
ఏకాదశి
అంటున్నాము
క్యాలండరులో.
ఈ
క్యాలండరు
ఒక
సిద్ధాంతి
వ్రాసినది.
ఎవరో
ఒక
సిద్ధాంతి
వ్రాసిన
పంచాంగమును
ఆధారము
చేసుకొని
ఈనాడు
ఏకాదశియని
విశ్వసించి
ఏకాదశి
వ్రతము
ఆచరిస్తున్నావు.
ఈనాడు
Sunday
అంటే
దానిని
ఆధారము
చేసుకొని
సెలవు
అంటున్నావు.
Sunday
అని
ఏకాదశియని
ఎట్లా
నమ్మావు
ఒక
సిద్ధాంతి
వ్రాసిన
దానిని
నమ్ముతున్నావు.
విశ్వసిస్తున్నావు.
సాక్షాత్
వేదములే
తత్వమసి
నాయనా
నీవే
ఆత్మస్వరూపుడవు.
ప్రజ్ఞానం
బ్రహ్మ.
అయమాత్మ
బ్రహ్మ.
అహం
బ్రహ్మాస్మి.
అనే
ముఖ్యవిషయములు
ఎందుకు
నమ్మటం
లేదు.
ఇదే
మానవుని
బలహీనత.
సత్యమైన
దానిని
నమ్మలేక
పోతున్నాడు.
కనుక
మానవుడు
ఇన్ని
విధములైన
కష్టములకు
నష్టములకు
విచారములకు
గురౌతున్నాడు.
దైవ
వాక్కు
తుచ
నమ్మాలి.
దైవ
వాక్కును
మనం
నడచుకోవాలి.
అప్పుడే
సరైన
స్థితి
కలుగుతుంది.
కాని
మానవుడు
దీనిని
నమ్మలేక
పోతున్నాడు.
ఒకానొక
సమయంలో
షిర్డీలో
భక్తుడైన
నానా
తన
కుమార్తె
మీనా
ప్రసవవేదనలో
బాధపడుతుంది.
మూడు
నాలుగు
దినములై
పోయింది.
చాలా
నీరసించింది.
ఆమె
ప్రాణము
ఉంటుందో
లేదో
అనే
సందేహ
స్థితి
వచ్చింది.
నూరు
సంవత్సరముల
పూర్వము
ఎట్టి
వైద్యము,
ఎట్టి
ఆసుపత్రులు,
నర్సులు
ఉండేవారు
కాదు.
నిరంతరము
పటము
దగ్గర
బాబా
బాబా
బాబా
నా
కుమార్తెను
రక్షించు
అని
ప్రార్థించాడు.
భక్తుడు
ఎక్కడ
ఏవిధముగా
ప్రార్థించినా
భగవంతునికి
ఒక
connection
ఉంటున్నాది.
వైర్లెస్
కంటె
వేగముగా
చేరుతుంది.
భక్తునికి
భగవంతునికి
heart
to
heart
love
to
love
హృదయమునకు
హృదయ
సంబంధము.
తక్షణమే
బాబాకు
తెలిసింది.
అక్కడ
బావూ
అనేవాడు
ఉండేవాడు.
రంగ్
బావూ.
అతనిని
బాబా
బావూ
అని
పిలచేవాడు.
‘బావూ
రా!
విభూతి
తీసుకొని
జమ్నేర
గ్రామములో
నున్న
నానాకు
అందించు’
అన్నాడు.
ఆజ్ఞ
అన్నాడు.
జేబులో
చూచుకున్నాడు.
రెండు
రూపాయలున్నాయి.
జల్గాం
వరకు
రైలులో
పోవచ్చు.
జమ్నేరు
పోవటానికి
తన
దగ్గర
డబ్బులు
లేవు.
బాబా
నా
దగ్గర
కాసులు
లేవు.
నన్ను
ఎలా
వెళ్లమంటారు
అన్నాడు.
ఒరే
పిచ్చివాడా!
నేను
చూచుకుంటాను.
పొమ్మని
ఎప్పుడు
చెప్పానో
తగిన
arrangements
నేను
చూచుకుంటాను.
సందేహమునకు
చోటివ్వకు.
ఇట్లే
రామావతారమందు
రాముడు
హనుమంతుని
ఆజ్ఞాపించాడు
హనుమా
నీవు
సీతాన్వేషణ
జరపాలి.
లంకలో
ప్రవేశించి
సీత
ఏవిధంగా
ఉంటున్నదో
ఆమె
స్థితిగతులు
కనుక్కొని
రమ్మన్నాడు.
హనుమంతుడు
సందేహించాడు.
ఇంత
పెద్ద
సముద్రము
నేను
ఏవిధంగా
దాటాలి.
నన్ను
పొమ్మని
5
▾
Meaning
Keep
చెబుతున్నారు.
అని
కొంత
సందేహించాడు.
ఆజ్ఞ
ఇచ్చినవాడే
ఈ
కార్యము
పూర్తి
చేయించుకుంటాడు.
నాలో
ఈ
కార్యము
సాధించుటకై
నాకీ
కార్యము
ఇచ్చాడు.
ఇంకెవరికి
ఇవ్వలేదే.
ఆజ్ఞాపించిన
భగవంతుడు
ఈ
కార్యములో
అన్నీ
తానే
చూచుకుంటాడని
ధైర్యముతో
వెళ్లాడు.
పరిశుద్ధమైన
విశ్వాసము.
అచంచలమైన
విశ్వాసము.
బావూ
కూడా
సందేహముతో
ప్రశ్నించాడు
బాబాను.
నాదగ్గర
రెండు
రూపాయలున్నాయి
నేను
ఇంత
దూరము
ఎట్లా
పోవాలి.
జల్గాం
నుండి
ముప్ఫై
మైళ్లు
పోవాలి.
ఆ
రోజుల్లో
టాంగాలు
మాత్రమే
ఉండేవి.
ముప్ఫై
మైళ్లు
టాంగాలో
వెళ్లాలి.
లేక
నడచి
పోవాలి.
ముప్ఫై
మైళ్లు
నడవగలనా
అని
సందేహిస్తుండగా
బాబా
ధైర్యము
నిచ్చాడు.
నామాట
విశ్వసించు
నా
ఆజ్ఞ
శిరసా
వహించు.
నీవు
వెళ్లు
అన్నాడు.
జవాబు
చెప్పకుండా
జల్గాం
వరకు
రైలులో
వెళ్లాడు.
రాత్రి
1½
గంటలకు
జల్గాం
లో
దిగాడు.
నేను
ఎక్కడికి
పోయేది
ఈ
చీకటిలో
ఏవిధంగా
కాలము
గడపాలి?
అని
అక్కడ
కూడా
కన్నులు
మూసుకొని
బాబాను
ప్రార్థించాడు.
ఒక
బిళ్ళ
జవాను
వచ్చాడు.
పాతకాలములో
తహసీల్దారు
వెంట
బిళ్ళవేసుకొని
జవాను
ఉండేవాడు.
ఆ
జవాను
ఆజానుబాహువు.
ఎవరు
బావూ
ట్రైనులో
దిగారు
షిర్డీనుండి
అని
కేకలు
వేసుకుంటూ
వచ్చాడు.
‘బాబా
పంపుతే
వచ్చాను.
నా
పేరు
బావూ’
అన్నాడు.
‘రండి
రండి
మీకోసం
టాంగా
కాచుకొని
ఉంటున్నాది’
అన్నాడు.
ఎక్కడనుంచి
వచ్చింది
అన్నాడు.
‘నానా
సాహెబ్
పంపించాడు’.
టాంగాలో
కూర్చున్నాడు.
తాను
పోతుంటే
టాంగా
నడచినట్లే
లేదు.
అంత
స్పీడుగా
పోతున్నాది.
తనలో
అనుకుంటున్నాడు
ఎంత
స్పీడుగా
పోతున్నాది
అని.
ఈ
విధంగా
తలచుకుంటుంటే
గ్రామము
వచ్చింది.
అదుగో
అదే
నానా
ఇల్లు
అని
చూపించాడు.
ఆయన
దిగాడు
నడచి
తిరిగి
టాంగా
వానితో
చెబుదామని
వెనుకకు
తిరిగాడు.
టాంగా
లేదు.
టాంగా
నడిపే
వాడు
లేడు.
సరే
ఇంటికి
వచ్చి
చేరాడు.
నానా
సాహెబ్!
ఇదుగో
బాబా
విభూతి
పంపించాడు.
ఎప్పుడు
పంపాడు.
నిన్న
సాయంకాలమే
పంపాడు
రాత్రి
1½
గంటలకు
స్టేషను
చేరాను.
మీకు
ఎట్లా
తెలిసిందో
ఏమిటో
మీరు
టాంగా
పంపటంచేత
శీఘ్రముగా
ఇల్లు
చేరగలిగాను.
నానాకు
ఆశ్చర్యం
వేసింది.
నా
దగ్గర
టాంగా
లేదే?
నేను
ఎవరిని
పంపలేదే?
నీవు
వచ్చేది
నాకు
తెలియదే.
ఎందుకు
ఈ
విధంగా
చెబుతున్నావు.
ఆ
టాంగా
ఎక్కడుంది
చెప్పమన్నాడు.
‘అయ్యా
దిగిన
వెంటనే
టాంగా
కనిపించలేదు.
అతను
చెప్పటం
మీరు
పంపినట్లు
చెప్పాడు’
అన్నాడు.
మాటలకు
సమయము
కాదు
మొట్టమొదట
పేషెంటుకు
ఇవ్వాలని
లోపలకు
వెళ్లి
ప్రసాదము
ఇచ్చాడు.
బాబా
పటము
దగ్గరకు
వెళ్లి
ప్రార్థన
చేశాడు.
బాబా
బాబా
బాబా
అని
అరిచాడు
అరుపులోపలనే
బిడ్డ
అరుపులు
వినిపించాయి.
కుమారుడు
పుట్టాడు.
ఆనందముతో
తిరిగి
బావూ
దగ్గరకు
వచ్చి
బావూ
ఏమేమి
జరిగిందో
చెప్పు
బాబా
6
▾
Meaning
Keep
His poems 27
ఏమి
చెప్పారు.
ఏ
విధంగా
వచ్చావు?
అని
అడిగేటప్పటికి
రెండు
రూపాయలతో
నేను
వచ్చాను.
బాబాయే
అన్ని
సదుపాయములు
చేశాడు.
నమ్మిన
వారిని
వదలడు.
నమ్మకమే
ప్రధానమైనది.
‘నమ్మకమను
రెండు
నయనమ్ములే
లేని
అంధులైరి
నేడు
అవని
యందు’.
నమ్మకమనే
నయనములు
కోల్పోయినాము
మనము
ఈనాడు.
నమ్మి
పని
చేస్తే
దేనిలోనైనా
విజయము
చేకూర్చుకోవచ్చు.
ఈ
నమ్మకము
చేతనే
నేను
అంత
ఆనందము
పొందగలిగాను.
మూడవ
దినము
నానా,
బావూ
షిరిడీ
వెళ్లారు.
బాబా!
ఏమి
నీయొక్క
నాటకము
ఏమి
నీ
సందేశము!
ఏమి
నీ
లీలలు!
ఇవి
వర్ణనాతీతమైనవి.
ఇదే
రీతిగా
ద్వాపర
యుగములో
గోపికలు
రామావతారంలో
వానరులు
భగవంతుని
ఈ
రీతిగా
వర్ణిస్తూ
వచ్చారు.
నానాకు
చక్కని
కంఠము.
చక్కగా
పాటలు
పాడేవాడు.
అక్కడకు
వెళ్లి
ప్రార్థన
చేశాడు.
నిను
కనుగొనగలమా
బాబా
నిను
కనుగొనగలమా!
అణువు
కంటె
అతి
సూక్ష్మరూపుడవు
ఘనము
కంటె
అతి
ఘననీయుడవు
ఎనుబది
లక్షల
జీవరాసుల
అనయంబును
ఎడబాయకుందువట
అణువు
రేణువు
తృణకాష్టము
మొదలుగ
అఖండ
రూపుడవై
వెలయుదువట!
ఘనమగు
దొంగలలో
గజదొంగవు
నీవు.
॥
నిను
॥
బాబా!
అన్నీ
నీకు
తెలుసు.
కాని
తెలియని
వాని
వలె
నటిస్తావు.
నీవు
బడా
చిత్తచోరుడవు.
ఇందులో
రహస్యము
గుర్తించాలి.
ఎవరైనా
వచ్చి
గజదొంగవురా
అంటే
మనకు
కోపం
వస్తుంది.
ఏమి
దొంగతనం
చేశాను
ఎందుకు
గజదొంగ
అంటున్నావు
అని
వానిపై
పోట్లాడుతావు.
అదే
పదములలో
పాటగా
పాడితే
‘బడా
చిత్తచోర
బృందావన
సంచార
గోపాల
గోపాల
హేమురళీ
గోపాల’
అంటే
అందరు
తాళం
వేసి
పాడతారు.
గానములో
నున్న
మాధుర్యము
ఇంత
ఆనందముగా
ఉంటుంది.
ప్రేమరసమును
త్రాగిన
ఉన్మత్తుడై
పోతాడు.
పాటలయందు
మాటలయందు
ఉన్న
మాధుర్యము
ఇట్టిది
అట్టిదియని
ఎవరు
వర్ణించలేరు.
ఒక
ఉదాహరణము.
పిల్లలు
చక్కగా
తెలుసుకోవాలి.
భగవంతుని
గాన
ప్రియుడని
పిలుస్తాము.
భగవంతుని
మాటల
రీతిగా
పిలుస్తే
ఒకరీతిగా
ఉంటుంది.
పద్యము
రీతిగా
పిలుస్తే
ఒక
రీతిగా
ఉంటుంది.
పాటల
రీతిగా
పిలుస్తే
ఒకరీతిగా
ఉంటుంది.
హే!
రామ
ఎంత
దయామయుడవయ్యా
నీవు
అంటే
మనసు
కరగదు.
‘ఓ
రామా!
నన్ను
కాపాడు’
అని
పద్యములో
చెబుతే
అదికూడా
అంత
గొప్పగా
ఉండదు.
7
▾
Meaning
Keep
‘రామా!
నన్ను
కాపాడు’.
పాటతో
వస్తే
హృదయాన్ని
లాగేస్తుంది.
గానలోలుడు,
గానప్రియుడు
భగవంతుడు
అక్కడ
నానా
గానము
చేస్తున్నాడు.
బాబా
కూడా
ఉన్మత్తుడయ్యాడు.
మత్తుతో
తల
ఊపుతున్నాడు.
ఆ
పాట
తాను
కూడా
కోరస్
పాడుతున్నాడు.
ఈ
విధముగా
గానము
పాడే
వానిని
తన్మయము
గావిస్తుంది.
దైవాన్ని
కూడా
తాండవమాడిస్తుంది.
కనుక
దైవమును
ప్రార్థించే
సమయములో
భజనకు
ఇంత
విలువ
ఇవ్వటానికి
కారణమిదియే.
భజన
హృదయపూర్వకముగా
చేయాలి.
వాల్మీకి
రామ
చరిత్రము
రాముని
జీవిత
కాలము
లోనే
రచించినాడు.
కుశలవుల
చేత
సభలో
రామ
చరిత్రను
పాడించాడు
వాల్మీకి.
నిరంతరము
దయారహితుడై,
క్రూరుడై
హీనుడై
హింసిస్తున్న
వాల్మీకి
రాళ్లను
కూడా
కరగించే
గానము
చేత
దివ్యమైన
రామ
చరిత్రను
ప్రపంచమునకందించాడు.
కఠినమైన
రాయిని
కూడా
కరగించి,
పెరిగించి
ఫలము
నిచ్చేదిగా
మారుస్తుంటాది
దివ్యమైన
నామము.
చిన్న
ఉదాహరణము.
కఠినమైన
గుండు
ఉంది.
ఆ
గుండుపైన
విత్తనాలు
పెడితే
ఎండిపోతాయి.
లేక
పక్షులు
ఎత్తుకొని
పోతాయి.
ఆ
కఠినమైన
రాయిపై
మొక్కలు
రావు.
క్రమక్రమేణా
ఎండకు
ఎండి
వానకు
నాని
రాయి
కరగి
కరగి
మట్టిగా
మారిపోతుంది.
మట్టిలో
విత్తనము
పెట్టినప్పుడు
విత్తనము
మొక్కగా
వస్తుంది.
మొక్క
వృక్షముగా
మారిపోతుంది.
వృక్షములోనే
ఫలములు
వస్తాయి.
ఫలములు
మానవుడు
భుజిస్తాడు.
ఫలముల
యొక్క
ప్రసాదమే
మానవరూపము
ధరిస్తుంది.
కఠినమైన
రాయి
కరగి
మానవునిగా
రూపొందింప
చేసింది
ఏది
ఆ
రాయే.
అదే
విధముగా
కఠినమైన
రత్నాకరుని
హృదయము
మారిపోయింది.
అదే
తపస్సుగా
రూపొందింది.
అదే
వాల్మీకము
అనే
పుట్టగా
రూపొందింది.
ఆ
వాల్మీకము
పెరిగి
వర్షములో
తిరిగి
కరిగి
పోయేటప్పటికి
అందులో
నుంచి
ఆవిర్భవించాడు
రత్నాకరుడు.
వాల్మీకము
నుండి
పుట్టిన
వాడు
కనుక
ఇతనికి
వాల్మీకి
అని
పేరు
వచ్చింది.
పూర్వము
రత్నాకరుడు.
కఠిన
హృదయుడు
పాము
పుట్టకు
వాల్మీకమని
పేరు.
ఇది
కరగి
పోయి
ఇతను
బయటపడ్డాడు.
కనుకనే
ఇతని
పేరు
వాల్మీకి.
విద్యార్థులు
కఠినమైన
భావములు
క్రూరమైన
సంకల్పములు
హృదయములో
చేరకుండా
చూచుకోవాలి.
సద్భావములు,
సచ్చింతనలు,
సదాలోచనలు
మనం
పెంచుకోవాలి.
కఠినమైన
హృదయాలు
మృదుమధురంగా
మారతాయి.
ఆ
హృదయమే
భగవంతుని
నివాసంగా
మారుతుంది.
హృదయమనే
పెద్ద
పీఠము
ఎవరిది?
ఎవరిదో
కాదు
భగవంతునిదే.
ఆ
భగవంతుని
పీఠముపైన
మరొకరు
కూర్చొనుటకు
వీలుకాదు.
నీ
మనసులో
ఎవరినైనా
కూర్చోపెట్టుకో.
ఎంత
మందికైనా
చోటు
ఉంటుంది.
కాని
హృదయము
ఒక్కటే
single
sofa
not
double
sofa,
not
musical
chair.
ఒకరిని
ఒక
పర్యాయము
ఇంకొకరిని
ఒక
పర్యాయము
ఈవిధంగా
8
▾
Meaning
Keep
మార్చుకో
కూడదు.
ఒక్క
దైవమునకు
మాత్రమే
చోటు
ఇవ్వాలి.
అదే
ఈనాడు
మనం
చేయవలసినది.
ఎన్నో
మనము
జగత్తులో
చూస్తున్నాము.
ఎన్నో
అనుభవిస్తున్నాము.
ఎంతమంది
అనుభూతులో
మనకు
వినిపిస్తున్నాయి.
కాని
మంచి
చెడ్డలు
మన
ప్రవర్తన
నుండి
వస్తున్నాయి
గాని
పరులనుండి
వచ్చేవి
కాదు.
మొట్టమొదట
మన
సంకల్పములను
పవిత్రమైన
సంకల్పములుగా
రూపొందించుకోవాలి.
మనలో
ఏదైనా
సంకల్పము
వస్తే
is
it
good
or
bad
టైము
తీసుకో
ఇది
నీకు
మంచిది
కాదనుకుంటే
తక్షణమే
వదలిపెట్టు.
కాని
ఈనాటి
మానవునకు
అంత
ఓపిక
లేదు.
ఏదైనా
సంకల్పము
వస్తే
తక్షణమే
పని
చేయటానికి
ప్రయత్నిస్తాడు.
రాముని
అస్త్రము
తగిలి
రావణుడు
క్రింద
కూలాడు.
కొన్ని
నిముషము
లోపల
ప్రాణం
వదలేముందు
అనేకమంది
మహర్షులు
వచ్చారు.
ఇంత
గొప్ప
మహనీయుడు
గొప్పతపస్వి
అన్ని
శక్తులు
కలిగిన
వాడు
ఇతని
దివ్యలక్ష్యమేమిటో
తెలుసుకోవాలని
అందరు
చేరారు.
రావణా!
నీ
జీవితములో
సంకల్పించింది
ఏమిటి
సాధించింది
ఏమిటి?
అని
ప్రశ్నించారు.
రామ
బాణము
తగిలింది
కనుక
పాపపరిహారమైంది.
ఉన్నత
భావములావిర్భవించాయి.
చేతులు
ఎత్తలేక
ఎత్తలేక
నమస్కారము
చేశాడు.
ఓ
మహనీయులారా!
నేను
ఏమి
చెప్పుదును.
నా
సంకల్పము
లెన్నో
ఉన్నాయి.
కాని
అవి
కాలేక
పోయాయి
ఒక్కటి
మాత్రం
గుర్తించాలి.
జీవితములో
మంచి
చేయాలని
మంచి
సంకల్పమే
వస్తే
ఆలస్యం
చేయకూడదు.
తక్షణమే
పనిలో
చేరాలి.
మంచి
పని
వాయిదా
వేయకూడదు.
మంచి
పనులకు
ఏమాత్రము
టైము
తీసుకోవద్దు.
సంకల్పము,
పని
రెండు
ఒక్కతూరి
జరగాలి.
చెడ్డ
భావములే
వస్తే
వాటి
జోలికి
పోవద్దు.
కావలసినంత
టైము
తీసుకో.
నేను
సంకల్పించుకున్నాను.
లంక
చుట్టూ
ఉన్న
సముద్రములోని
నీరు
తీయగా
మార్చాలని
సంకల్పించుకొన్నాను.
తరువాత
తరువాతయని
వాయిదా
వేసాను.
కట్టకడపటికి
ఆ
మంచిపని
నేను
చేయలేక
పోయాను.
నరకములో
బాధపడే
వారిని
స్వర్గమునకు
పంపించాలని
వారిని
సుఖరూపులుగా
తయారు
చేయాలని
సంకల్పించుకున్నాను.
కాని
తరువాత
తరువాత
అని
వాయిదా
వేసుకుంటూ
వచ్చాను.
మంచి
కార్యము
వాయిదా
వేశాను.
నేను
మరణిస్తున్నాను.
ఈ
మంచి
కార్యములు
నేను
చేయలేక
పోతున్నాను.
మీరైనా
సత్సంకల్పములు
వచ్చిన
తక్షణమే
క్రియారూపములో
పెట్టండి.
కాలము
వ్యర్థము
చేయకండి.
చెడ్డ
భావములు,
చెడ్డ
తలంపులకు
అవకాశము
ఇవ్వకండి.
అదియే
ఈనాటి
యువకులు
చేయవలసిన
గొప్ప
ఘనకార్యము.
ఈనాటి
యువకులు
భావి
భారతోద్ధారకులు.
మీరు
సద్భావములను
అభివృద్ధి
పరచుకొని
ఆదర్శ
పౌరులనే
పేరు
తెచ్చుకోవాలి.
ఆదర్శ
పౌరుడుగా
ఉన్నప్పుడు
ఎంతైనా
ఆదర్శమును
అనుభవించవచ్చు.
ఎంతమందినైనా
మార్చవచ్చు
కనుక
మనము
9
▾
Meaning
Keep
Also in his talks
(3)
17 January 1986
Learning that wins gold, for happiness here; the learning of Brahman, for happiness hereafter
14 January 1989
The man of virtue alone is strong
7 April 1989
All this is Vāsudeva
సద్భావములు
పోషించుకోవాలి.
దీనినే
వ్యక్తిగత
శీలమన్నారు.
వ్యక్తిగత
శీలము
కలిగినప్పుడే
లీడరుగా
తయారు
కావచ్చు.
వ్యక్తిగత
గుణములు
మనం
పోషించుకోవాలి.
వ్యక్తిగత
శీలము,
సామాజిక
శీలము
జాతీయ
తత్వము
మనం
అభివృద్ధి
పరచుకోవాలి.
జాతీయ
భావమే
పోయింది.
నేను
నా
కుటుంబము
అంతవరకే
ప్రయాణము
చేస్తున్నారు.
ఇది
నా
మాతృదేశము
ఇది
నా
ప్రియ
మాతృభాష
ఇది
నా
మతమంచు
ఎదగొట్టి
నుడవనేరని
బ్రతికిన
పీనుగు
ఒక్కండు
వసుధ
గలడా.
దేశాభిమానము
లేక
నీవు
బ్రతికిన
పీనుగుగా
తయారౌతావు.
దేశాభిమానము
పెంచుకోవాలి.
దేహాభిమానము
ఎంత
ప్రధానమో
దేశాభిమానము
అంత
ప్రధానము.
దేశము
దేహము
యొక్క
ప్రతిబింబమే.
దేశము,
దేహము
రెండు
బింబప్రతిబింబములే.
ఈనాటి
విద్యార్థులు
తమ
పవిత్ర
శీలము
చేత
గుణముల
అభివృద్ధి
చేత
సంకల్పములను
చక్కగా
మార్చుకోవాలి.
చెడ్డ
సంకల్పములకు
అవకాశము
ఇవ్వకూడదు.
కొంచెము
చోటిస్తే
అది
పెంచుకుంటుంది.
ఏమాత్రము
చెడ్డ
సంకల్పములు
ప్రవేశపెట్టకూడదు.
అవి
వచ్చినా
మనము
వెనుకకు
నెట్టాలి.
ఎట్లా?
మన
హృదయ
కవాటము
మూసి
వేయాలి.
మనము
ఒక
ఇల్లు
కట్టాము.
ఇంటికి
కిటికీలు
ద్వారాలు
పెట్టాము.
ద్వారములు
ఎందుకోసం?
మనం
లోపలకు
బయటకు
పోవటము
రావటము
కోసం
పెట్టాము.
మన
బంధువులు,
మిత్రులు
లోపలకు
రావటానికి
పోవటానికి
పెట్టాము.
తలుపులు
పెట్టుకున్నామని
కుక్కలను,
పందులను,
గాడిదలను
వదులుతామా.
మనకు
పది
ద్వారములుంటున్నాయి.
ద్వారము
లోపల
బయట
చెత్త
చేర్చుకోకూడదు.
చెడ్డవాటిని
బయటకు
తరమాలి.
దుర్గుణములు
దూరమునుంచే
దూరము
చేయాలి.
లోపల
ప్రవేశించేంతవరకు
మనం
కాచుకోకూడదు.
రత్నాకరుడు
వాల్మీకిగా
మారిపోయాడు.
ఇటువంటి
దుర్మార్గుడే
ఇట్టి
సాత్వికుడుగా
మారినప్పుడు
మానవుడై
పుట్టి
విద్యావంతుడై
పోయి,
విజ్ఞాన
వంతుడై
సుగుణములంతా
ఉంటుండి
ఈ
మానవుడు
మాధవత్వము
పొందలేక
పోతున్నాడంటే
ఎంత
అవమానము
చెప్పండి.
విజ్ఞాన
ప్రజ్ఞానములతో
కూడిన
దివ్యత్వముగా
రూపొందాలి.
ఆ
దివ్యభావము
చేత
10
▾
Meaning
Keep
మానవత్వము
చక్కగా
తీర్చిదిద్దుకొని
దైవత్వంగా
రూపొందాలి.
శివునికి
ముందుగా
నంది
ఉన్నది.
నంది
అంటే
పశువు.
పశువు
ఎక్కడ
చూస్తున్నాది.
ఎట్లా
చూస్తున్నాది.
భగవంతునే
చూస్తున్నాది.
ప్రకృతిని
చూడటం
లేదు.
తన
దృష్టిని
భగవంతునిపైనే
concentration
చేస్తూ
వస్తుంది.
కనుక
నందిని
మనం
పూజిస్తున్నాము.
ఈ
పూజ్యత
ఎట్లా
కల్గింది.
తన
దృష్టిని
దైవము
వైపే
మరల్చింది.
కనుక
పశువైనప్పటికి
పూజార్హత
గలిగింది.
మన
దృష్టి
మంచి
దృష్టి
కావాలి.
పవిత్ర
దృష్టి
కావాలి.
అదే
సుదర్శనము.
మంచి
దృష్టి.
అలాంటి
దృష్టి
రావటానికి
దైవమును
చింతిస్తూ
దైవమును
ఆరాధిస్తూ
మనుష్య
భావము
మార్చుకొని
దైవ
భావములో
మనం
చేరాలి.
Previous
←
A Life without Character Is a Lifeless Life
Next
Forbearance Is a Safe Armour for Man
→